
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని అధికార షాబాజ్ షరీఫ్ ప్రభుత్వ తీరుకు నిరసనగా మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) నేతలు, కార్యకర్తలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపధంయలో ఈ నిరసనలను అణచి వేసేందుకు ప్రభుత్వం కనిపిస్తే కాల్చివేతకు ఆదేశాలు జారీ చేసింది. దీనికి తోడు నిరసన ప్రదర్శనలు హింసాత్మక ఘటనలకు దారితీయడంతో పీటీఐ పార్టీ ఆందోళనలకు స్వస్త పలుకుతున్నట్లు ప్రకటించింది.
పీటీఐ నిసరనల నేపధ్యంలో రాజధాని ఇస్లామాబాద్‌లోని డీ చౌక్‌తో ఆ పరిసర ప్రాంతాలలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేధ్యంలో పాక్ భద్రతా సిబ్బంది కఠిన చర్యలు చేపట్టారు. దీంతో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మద్దతుదారులు నిరసనలు విరమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే తదుపరి వ్యూహం ఏమిటనేది పార్టీ ఇంకా వెల్లడించలేదు. భద్రతా సిబ్బంది చేపట్టిన చర్యలను పీటీఐ ‘ఫాసిస్ట్ మిలిటరీ పాలన’ చేపట్టిన జాతి నిర్మూలన ప్రయత్నంగా అభివర్ణించింది.
ఈ నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న 450 మంది ఆందోళనకారులను అరెస్టు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పీటీఐ నేతలు మీడియాతో మాట్లాడుతూ వీలైనంత ఎక్కువ మందిని చంపాలనే ఉద్దేశ్యంతోనే భద్రతా దళాలు నిరసనకారులపై కాల్పులు జరిపాయని ఆరోపించారు. పీటీఐ మద్దతుదారులు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. కాగా షాబాజ్-జర్దారీ-అసిమ్ కూటమి నేతృత్వంలో భద్రతా దళాలు మారణహోమం కోసం ప్రయత్నించాయని పీటీఐ ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌లో పేర్కొంది. గత ఏడాది ఆగస్టు నుంచి జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాణ్ నవంబర్ 24న దేశవ్యాప్త నిరసనలకు చివరి పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: తానా ఆధ్వర్యంలో వైభవంగా 'మన భాష–మన యాస’ 'మాండలిక భాషా అస్తిత్వం'