ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు షాబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి తలనొప్పిగా తయారయ్యారు. ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ‘పాకిస్థాన్ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్’ (పీటీఐ) కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభించారు.
దేశం నలుమూలలకు చెందిన పీటీఐ కార్యకర్తలు నిరసనలు చేపడుతూ రాజధాని ఇస్లామాబాద్‌కు చేరుకుంటున్నారు. దీంతో అక్కడ పరిస్థితి అదుపు తప్పుతోంది. చాలా చోట్ల హింసాత్మక ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇమ్రాన్ ఖాన్ ఆదేశాలతో అతని పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ ‘డూ ఆర్ డై’ నిరసనను నిర్వహించడానికి రాజధానికి తరలి వెళుతున్నారు.
ఇప్పటికే పలువురు పీటీఐ నేతలు, కార్యకర్తలు ఇస్లామాబాద్ నగరంలోనికి ప్రవేశించారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వం ఇస్లామాబాద్‌ను రెడ్ జోన్‌గా ప్రకటించింది. ఇక్కడ పాక్ సైన్యాన్ని భారీ ఎత్తున మోహరించారు. ఈ రెడ్ జోన్ లోపల ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధానమంత్రి నివాసం, పార్లమెంట్, రాయబార కార్యాలయం ఉన్నాయి. ఈ రెడ్‌జోన్‌లో ఎవరైనా నిరసనకారులు కనిపిస్తే, వెంటనే వారిని కాల్చివేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఇస్లామాబాద్‌లోకి ప్రవేశించడంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు పాకిస్తాన్ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ నేతలు అడియాలా జైలులో ఇమ్రాన్ ఖాన్‌ను కలుసుకున్నారు. ఖాన్ గత సంవత్సరం నుండి రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్నారు. అతనిపై 200కు పైగా కేసులు నమోదయ్యాయి. వాటిలో కొన్నింటిలో ఖాన్‌కు బెయిల్ లభించగా, కొన్నింటిలో ఆయన దోషిగా తేలాడు. మరికొన్నింటిపై విచారణ జరుగుతోంది.
ఇది కూడా చదవండి: మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్‌నాథ్ షిండే రాజీనామా
Comments
Please login to add a commentAdd a comment