ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ ‘పాకిస్తాన్ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్’(పీటీఐ) చేపట్టిన ర్యాలీపై కాల్పులు జరిగాయి. ఈ ర్యాలీకి ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. కాల్పుల అనంతరం తొక్కిసలాట జరిగింది.
ఈ పరిస్థితుల నేపధ్యంలో అధికారులు ఇస్లామాబాద్‌కి వెళ్లే అన్ని మార్గాలను మూసివేశారు. ఈ సందర్భంగా పీటీఐ నేత ఫవాద్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ పోలీసులు జరిపిన కాల్పుల్లో పలువురు మృతిచెందారని తెలిపారు. పాకిస్థాన్‌లో మార్షల్ లా తరహా పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.
కాగా ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు జరిపిన రాళ్ల దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు. ఇమ్రాన్ ఖాన్‌ను జైలు నుండి విడుదల చేయాలని కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆ పార్టీ ఇస్లామాబాద్‌లో ర్యాలీ చేపట్టింది. కాగా ఇమ్రాన్ ఖాన్ గత 400 రోజులుగా జైలులో ఉన్నారు. తోషాఖానా కేసులో దోషిగా తేలడంతో 2023 ఆగస్టు 5న ఆయన అరెస్టయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment