ఇస్లామాబాద్: మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీపై పాకిస్తాన్ ప్రభుత్వం నిషేధం విధించనున్నట్లు పాక్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు సోమవారం పాక్ సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తరార్ ప్రకటించారు. ఆయన మీడియాతో మాట్లాడారు.
‘జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ)పై నిషేధం విధించాలని నిర్ణయం తీసుకున్నాం. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ విషయంలో పాక్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించనుందని పాక్ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
నమ్మదగిన ఆధారాలు లభిస్తే ఇమ్రాన్ పార్టీపై నిషేధం విధిస్తామని అత్తావుల్లా తరార్ తెలిపారు. ‘విదేశీ ఫండ్స్ కేసు, మే 9న జరిగిన అల్లర్లు, చిపర్ ఎపిసోడ్ వంటి కేసులతో పాటు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు నమ్మదగిన ఆధారాలు లభిస్తే.. ఇమ్రాన్ ఖాన్ పార్టీపై బాన్ విధిస్తాం’ అని మంతి అత్తావుల్లా తరార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment