PTI
-
ఇమ్రాన్‌ఖాన్ మద్దతుదారులపై షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్
పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ)అధినేత ఇమ్రాన్‌ఖాన్ మద్దతుదారుల ఆందోళనతో పాకిస్థాన్ అట్టుడుకుతోంది. ఇమ్రాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ మద్దతుదారులు ఆదివారం చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ, ఖైబర్ పఖ్తుంఖా ముఖ్యమంత్రి అలీ అమీన్ నేతృత్వం వహించిన ఈ కవాతు సోమవారం సాయంత్రం నాటికి ఇస్లామాబాద్ చేరుకుంది.సోమవారం రాత్రి లక్షలాది తరలి వచ్చిన ఆందోళనకారులను కట్టడి చేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు. నిరసన కారులు రాజధాని ఇస్లామాబాద్‌కు వెళ్తుండగా.. పోలీసులు అడ్డుకున్నారు. రహదారులను మూసివేశారు. ఇస్లామాబాద్ చుట్టూ బారీకేడ్లు ఏర్పాటుచేశారు. తొలగించుకుంటూ నిరసనకారులు ముందుకు రాగా టియర్ గ్యాస్ ప్రయోగించి కట్టడి చేశారు. దీంతో ఆందోళన కారులు పోలీసులపై దాడికి పాల్పడటంతో అయిదుగురు భద్రతా సిబ్బంది మరణించినట్లు, అనేకమంది గాయపడినట్లు పోలీసులు పేర్కొన్నారు.పంజాబ్ ప్రావిన్స్‌లో నిరసనకారులు చేసిన దాడిలో ఒక పోలీసు అధికారి మరణించగా, 119మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు పేర్కొన్నారు. 22 పోలీసు వాహనాలకు నిప్పంటించారని తెలిపారు. ఆందోళనకారుల్లోనూ నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. ఈ నిరసనలు మంగళవారం కూడా కొనసాగుతుండటంతో పాక్ వ్యాప్తంగా హైటెన్షన్ నెలకొంది. -
రాష్ట్ర హోదా త్వరగా రావాలి
శ్రీనగర్: కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్‌కు తొలి సీఎంగా బుధవారం బాధ్య తలు స్వీకరించిన కొద్దిసేపటికే పీటీఐ వీడియోస్‌తో ఒమర్ అబ్దుల్లా ముఖాముఖి మాట్లాడారు. జమ్మూకశ్మీర్‌కు త్వరలోనే రాష్ట్ర హోదా వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ‘‘ కాంగ్రెస్ పార్టీతో కలిసి రాష్ట్ర హోదా సాధనకు కృషిచేస్తాం. త్వరలోనే రాష్ట్ర హోదా దక్కొచ్చని భావిస్తున్నాం. ఖాళీగా ఉన్న మంత్రిపదవుల భర్తీ కోసం కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతున్నాం. కాంగ్రెస్‌తో బేధాభి ప్రాయా లు అబద్ధం. నిజంగానే సఖ్యత చెడితే ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక వంటి అగ్రనేతలు మా ప్రమాణ స్వీకార కార్య క్రమానికి రారుకదా. ప్రభు త్వంలో చేరాలా వద్దా అనేది వాళ్ల ఇష్టం. శాసనమండలి కూడా లేని జమ్మూ కశ్మీర్లో తక్కువ మంది మంత్రులతో ప్రభు త్వాన్ని నడపాలని భావిస్తున్నాం. గతంలోలాగా 40, 45 మంది మంత్రులుండే కాలం పోయింది. 2018 నుంచి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కశ్మీర్లో లేదు. తమ సమస్యల్ని పట్టించుకున్న నాథుడే లేడని ప్రజలు నిరాశలో కుంగిపోయారు. అందుకే కొత్తగా ఏర్పడిన మా ప్రభుత్వ తక్షణ కర్తవ్యం వారి సమస్యలను పరిష్కరించడమే. కేంద్రపాలిత ప్రాంతంగా కశ్మీర్‌ను పాలించడం కొత్త రకం సవాల్. అందివచ్చిన తొలి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవడం పెద్ద నేరంతో సమానం. గత తప్పిదాలు చేయబోను. కేజ్రీవాల్‌సహా దేశంలో పరిపా లనా అనుభవం ఉన్న కీలక వ్యక్తులు అందరి నుంచి పాఠాలు నేర్చుకుంటా’’ అని ఒమర్ వ్యాఖ్యానించారు. -
President Droupadi Murmu: ఆవేదనతో చలించిపోయా..
న్యూఢిల్లీ: పశి్చమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ఆ భయానక సంఘటన గురించి తెలుసుకొని చలించిపోయానని చెప్పారు. ఇలాంటి దారుణాలు ఇకపై జరగడానికి వీల్లేదని స్పష్టంచేశారు. మహిళలపై నేరాల పట్ల మనమంతా ఆత్మపరిశీలన చేసుకోవాలని బుధవారం పీటీఐ వార్తా సంస్థకు రాసిన ప్రత్యేక ఆరి్టకల్‌లో రాష్ట్రపతి సూచించారు. జూనియర్ డాక్టర్ హత్యపై రాష్ట్రపతి స్పందించడం ఇదే మొదటిసారి. తల్లులు, అక్కచెల్లెమ్మలపై జరుగుతున్న అరాచకాలపై దేశం మేల్కోవాల్సిన సమయం వచ్చిందని ఆమె ఉద్ఘాటించారు. మహిళల పట్ల నీచమైన అభిప్రాయాలు ఉంటే వారిని ఒక వస్తువుగా చూసే అలవాటు పెరుగుతుందని తెలిపారు. స్త్రీలను బలహీనులుగా, తెలివిలేనివారుగా పరిగణించే ఆలోచనా ధోరణిని అందరూ మార్చుకోవాలని హితవు పలికారు. మహిళల పట్ల ప్రజల దృష్టికోణం మారితే సమాజంలో వారిపై నేరాలు జరగబోవని అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి ముర్ము ఇంకా ఏం చెప్పారంటే... మనం పాఠాలు నేర్చుకున్నామా? దేశంలో సోదరీమణులపై ఎన్నో నేరాలు జరుగుతున్నాయి. ఆగస్టు 9న కోల్‌కతాలో వైద్యురాలపై జరిగిన అఘాయిత్యం నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. నాగరిక సమాజంలో ఆడబిడ్డలు ఇలాంటి అరాచకాల బారిన పడడానికి వీల్లేదు. జూనియర్ డాక్టర్ హత్య పట్ల దేశమంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అందులో నేను కూడా ఉన్నాను. కోల్‌కతాలో విద్యార్థులు, వైద్యులు, పౌరులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తుండగానే, మరోచోట నేరగాళ్లు చెలరేగిపోయారు. మహారాష్ట్రలో ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడ్డారు. 12 ఏళ్ల క్రితం జరిగిన నిర్భయ ఘటన తర్వాత మహిళలపై నేరాలు జరగకుండా వ్యూహాలు రూపొందించుకున్నాం. ప్రణాళిక అమల్లోకి తీసుకొచ్చాం. అయినా నేరాలు ఆగడం లేదు. గత 12 ఏళ్లలో లెక్కలేనన్ని దారుణాలు జరిగాయి. కొన్ని మాత్రమే అందరి దృష్టికి వచ్చాయి. మనం నిజంగా పాఠాలు నేర్చుకున్నామా? ఆందోళనలు ముగిసిపోగానే ఘోరాలు మరుగునపడిపోతున్నాయి. వాటిని మనం మర్చిపోతున్నాం. మరో ఘోరం జరిగాక పాత ఘోరాలను గుర్తుచేసుకుంటున్నాం. ఇది సరైన విధానం కాదు. మహిళలపై వక్రబుద్ధిని మొదట్లోనే అడ్డుకోవాలి మహిళలు తమ హక్కుల గురించి తెలుసుకోవాలి. వాటిని పోరాడి సాధించుకోవాలి. మహిళలకు మరిన్ని హక్కులు దక్కకుండా, హక్కుల విస్తరణ జరగకుండా కొన్ని సామాజిక అచారాలు, సంప్రదాయాలు అడ్డుపడుతున్నాయి. మహిళలను ప్రాణంలేని వస్తువుగా చూసే ధోరణి వారిపై నేరాలకు పురిగొల్పుతోంది. ఈ పరిస్థితిలో కచి్చతంగా మార్పురావాలి. వారి హక్కులను అందరూ గౌరవించాలి. స్త్రీల పట్ల జనంలో ఉన్న దురభిప్రాయాన్ని మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు, సమాజంపై ఉంది. చరిత్రను ఎదిరించే సమయం వచ్చింది. స్త్రీలపై నేరాల పట్ల నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. వారిపై అత్యాచారాలు, హత్యలు జరగకుండా మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. జరిగిన తప్పులను సరిదిద్దుకోకపోతే సమాజంలోని సగం జనాభా మిగతా సగం జనాభాలాగా నిర్భయంగా జీవించలేదు. మీడియా ధైర్యంగా పనిచేయాలి ప్రసార మాధ్యమాలు ధైర్యంగా పని చేయాలని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము సూచించారు. ఒత్తిళ్లకు లొంగకుండా, ఎవరికీ భయపడకుండా ప్రజలకు నిజాలు తెలియజేయాలని అన్నారు. దేశాన్ని, సమాజాన్ని సక్రమంగా తీర్చిదిద్దడంలో ఫోర్త్ ఎస్టేట్ పాత్ర అత్యంత కీలకమని వివరించారు. మీడియా ఎప్పటికీ సత్యానికే అండగా ఉండాలని చెప్పారు. సత్య మార్గం నుంచి పక్కకు మళ్లొద్దని కోరారు. ‘మనసు ఎక్కడ నిర్భయంగా ఉంటుందో’ అని రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన పద్యాన్ని రాష్ట్రపతి గుర్తు చేసుకున్నారు. పీటీఐ 77వ వార్షికోత్సవం సందర్భంగా వార్తాసంస్థల ఎడిటర్లు బుధవారం రాష్ట్రపతిని కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన దేశంలో మహిళలను దేవతలుగా పూజిస్తుంటామని, మరోవైపు మన రోజువారీ ప్రవర్తనలో ఆ భావన కనిపించకపోవడం తనను అప్పుడప్పుడు ఆవేదనకు గురి చేస్తోందని ముర్ము వ్యాఖ్యానించారు. -
ఇమ్రాన్ ఖాన్ పార్టీపై నిషేధం విధిస్తాం: పాక్ మంత్రి ప్రకటన
ఇస్లామాబాద్: మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీపై పాకిస్తాన్ ప్రభుత్వం నిషేధం విధించనున్నట్లు పాక్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు సోమవారం పాక్ సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తరార్ ప్రకటించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ)పై నిషేధం విధించాలని నిర్ణయం తీసుకున్నాం. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ విషయంలో పాక్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించనుందని పాక్ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. నమ్మదగిన ఆధారాలు లభిస్తే ఇమ్రాన్ పార్టీపై నిషేధం విధిస్తామని అత్తావుల్లా తరార్ తెలిపారు. ‘విదేశీ ఫండ్స్ కేసు, మే 9న జరిగిన అల్లర్లు, చిపర్ ఎపిసోడ్ వంటి కేసులతో పాటు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు నమ్మదగిన ఆధారాలు లభిస్తే.. ఇమ్రాన్ ఖాన్ పార్టీపై బాన్ విధిస్తాం’ అని మంతి అత్తావుల్లా తరార్ తెలిపారు. -
ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతుగా సుప్రీం కోర్టు తీర్పు
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు సుప్రీంకోర్టు నుంచి భారీ ఉపశమనం లభించింది. ఆయన సొంత పార్టీ విషయంలో పాకిస్తాన్ సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) 109 సీట్లతో దేశంలో అతిపెద్ద పార్టీగా నిలిచింది. మహిళలు, మైనారిటీలకు రిజర్వు చేసిన సీట్లను కేటాయించేందుకు ఆ పార్టీకి అర్హత ఉందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.పీటీఐకి న్యాయపరమైన విజయం అందించడంలో పాక్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఖాజీ ఫైజ్ ఇసా నేతృత్వంలోని 13 మంది సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ మద్దతు పలికింది. ఈ ఉదంతంలో సుప్రీంకోర్టు.. పెషావర్ హైకోర్టు తీర్పును పక్కన పెట్టింది. నేషనల్ అసెంబ్లీ, ప్రావిన్షియల్ అసెంబ్లీలలో రిజర్వ్ చేసిన సీట్లలో పార్టీకి వాటాను నిరాకరించిన పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ చర్యను పెషావర్ హైకోర్టు తిప్పికొట్టింది. ఎన్నికల కమిషన్ నిర్ణయం చెల్లదని బెంచ్ ప్రకటించింది. ఈ చర్య పాకిస్తాన్ రాజ్యాంగానికి విరుద్ధమని పేర్కొంది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం పాక్ సుప్రీం కోర్టు తీర్పుతో పీటీఐ జాతీయ అసెంబ్లీలో 23 రిజర్వ్డ్ స్థానాలను దక్కించుకుంది. దీంతో పార్టీ సీట్లు 86 నుండి 109కి పెరిగాయి. దీంతో పీటీఐ దేశంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అలాగే జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్ష కూటమి సీట్ల సంఖ్య కూడా 120కి పెరిగింది. ప్రస్తుతం పీటీఐతో సహా ఉమ్మడి ప్రతిపక్షంలో 97 మంది సభ్యులున్నారు. -
సైన్యం పడగ నీడన... పాక్‌లో ఎన్నికలకు వేళాయె
అది 2018. పాకిస్తాన్లో సాధారణ ఎన్నికల సమయం. సైన్యం ఆగ్రహానికి గురై అవినీతి కేసుల్లో దోషిగా తేలడంతో నవాజ్ షరీఫ్ అప్పటికి ఏడాది క్రితమే ప్రధాని పదవి పోగొట్టుకున్నారు. జైల్లో మగ్గుతున్నందున ఎన్నికల్లో పోటీకీ దూరమయ్యారు. క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్‌ఖాన్ సైన్యం ఆశీస్సులతో ఎన్నికల్లో నెగ్గి ఏకంగా ప్రధాని పీఠమెక్కారు. ఆరేళ్లు గడిచి పాక్ మళ్లీ సాధారణ ఎన్నికల ముంగిట నిలిచేనాటికి ఈ ఇద్దరు మాజీ ప్రధానుల విషయంలో ఓడలు బళ్లు, బళ్లు ఓడలూ అయ్యాయి. సైన్యం కన్నెర్రతో ఇమ్రాన్ పదవి పోగొట్టుకోవడమే గాక అవినీతి కేసుల్లో జైలుపాలయ్యారు. శిక్షల మీద శిక్షలు అనుభవిస్తూ ఎన్నికలకు దూరమయ్యారు. పార్టీకి కనీసం ఎన్నికల గుర్తు కూడా దక్కని దుస్థితి నెలకొంది! చికిత్స పేరుతో ఆరేళ్ల కింద లండన్ చేరి బతుకు జీవుడా అంటూ ప్రవాసంలో కాలం వెళ్లదీసిన నవాజ్ మళ్లీ సైన్యం దన్నుతో దర్జాగా స్వదేశాగమనం చేశారు. సైన్యం స్క్రిప్టులో భాగంగా అవినీతి కేసులన్నీ కొట్టుకుపోయి నాలుగోసారి ప్రధాని అయ్యేందుకు ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. ఇలా దశాబ్దాలుగా పాక్‌లో నేతల భాగ్యరేఖలను ఇష్టానికి నిర్దేశిస్తూ వస్తున్న సైన్యం కనుసన్నల్లో ఎప్పట్లాగే మరో ఎన్నికల తంతుకు సర్వం సిద్ధమవుతోంది... ఏ పౌర ప్రభుత్వమూ పూర్తి పదవీకాలం మనుగడ సాగించని చరిత్ర పాక్ సొంతం. చాలాకాలం పాటు ప్రత్యక్షంగా, మిగతా సమయంలో పరోక్షంగా సైనిక నియంతృత్వపు పడగ నీడలోనే ఆ దేశంలో పాలన సాగుతూ వస్తోంది. అలాంటి దేశంలో సైనిక పాలన ఊసు లేకుండా వరుసగా మూడోసారి సాధారణ ఎన్నికలు జరగబోతుండటం విశేషం! ఇలా జరగడం ఆ దేశ చరిత్రలో ఇదే తొలిసారి. 342 మంది సభ్యుల జాతీయ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న పోలింగ్‌కు సర్వం సిద్ధమవుతోంది. ఎప్పటి మాదిరే ఈసారి కూడా ఏయే పార్టీలు పోటీ చేయాలో, వాటి తరఫున ఎక్కణ్నుంచి ఎవరు బరిలో ఉండాలో కూడా సైన్యమే నిర్దేశిస్తూ వస్తోంది. దేశ ఆర్థికంగా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలి, నిత్యావసరాలతో పాటు అన్ని ధరలూ ఆకాశాన్నంటుతూ ప్రజల బతుకే దుర్భరంగా మారిన వేళ జరుగుతున్న ఎన్నికలివి. అక్కడ ఏ ఎన్నికలూ వివాదరహితంగా జరగలేదు. కానీ ఈసారి మాత్రం అవి పరాకాష్టకు చేరాయి. నిజానికి గత నవంబర్‌లోపే ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సింది. జనగణనను కారణంగా చూపి ఫిబ్రవరి దాకా వాయిదా వేశారు. నవాజ్ స్వీయ ప్రవాసం నుంచి తిరిగొచ్చి కాలూచేయీ కూడదీసుకుని బరిలో దిగేందుకు వీలుగానే ఇలా చేశారన్న ఆరోపణలున్నాయి. ఏదెలా ఉన్నా కనీసం ఈసారన్న కాస్త సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నది సగటు పాక్ పౌరుల ఆశ. అమెరికాతో పాటు అంతర్జాతీయ సంస్థల నుంచి అవసరమైన ఆర్థిక సాయం రాబట్టి అవ్యవస్థను చక్కదిద్దడంతో పాటు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్న భారత్‌తో సంబంధాలను మెరుగు పరుచుకోవాలన్నది వారి ఆకాంక్ష. కానీ సర్వం సైన్యం కనుసన్నల్లో సాగుతున్న తీరును బట్టి చూస్తే ఈసారీ అది అత్యాశే అయ్యేలా కనిపిస్తోంది. నవాజ్ షరీఫ్ పాక్ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానిగా పని చేసిన రికార్డు 74 ఏళ్ల నవాజ్ సొంతం. భారత్‌తో సత్సంబంధాలకు ప్రాధాన్యమిచ్చే నేతగానూ పేరుంది. దేశంలోకెల్లా అత్యంత ధనవంతుడని కూడా చెబుతారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్) సారథిగా మూడోసారి ప్రధానిగా ఉండగా 2017లో పనామా పేపర్స్, లండన్ అపార్ట్మెంట్స్ వంటి నానారకాల కేసుల్లో ఇరుక్కున్నారు. పదవి పోగొట్టుకుని జైలుపాలై ప్రాణ భయంతో లండన్ పారిపోయారు. అనంతరం పగ్గాలు చేపట్టిన ఇమ్రాన్‌కూ నాలుగేళ్లలోపే అదే గతి పట్టింది. 2022లో నవాజ్ సోదరుడు షహబాజ్ షరీఫ్ సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటవడంతో నవాజ్‌కు మంచి రోజులు తిరిగొచ్చాయి. గత అక్టోబర్‌లో ఆయన తిరిగొచ్చి పీఎంఎల్ (ఎన్) పగ్గాలు చేపట్టడం, సైన్యంతో పాటు న్యాయ వ్యవస్థ దన్నూ తోడై ఆయనపై అవినీతి కేసులు, శిక్షలూ ఒక్కొక్కటిగా రద్దవడం చకచకా జరిగిపోయాయి. అడ్డంకులన్నీ తొలిగి ఎన్నికల బరిలో నిలిచిన నవాజ్ నాలుగోసారి ప్రధాని కావడం ఖాయమేనంటున్నారు. ఇమ్రాన్‌ఖాన్ అనితరసాధ్యమైన క్రికెట్ నైపుణ్యంతో పాక్ ప్రజలను ఉర్రూతలూగించి నేషనల్ హీరోగా వెలుగు వెలిగిన 71 ఇమ్రాన్ రాజకీయ పిచ్‌పై మాత్రం నిలదొక్కుకోలేక చతికిలపడ్డారు. అవినీతిని రూపుమాపి, కుటుంబ రాజకీయాలకు చెక్ పెట్టి సర్వం చక్కదిద్దుతానంటూ మార్పు నినాదంతో 2018లో ప్రధాని అయ్యారాయన. కానీ ఇమ్రాన్ హయాంలో ఆర్థికంగానే గాక అన్ని రంగాల్లోనూ దేశం కుప్పకూలింది. హింసతో, అశాంతితో పాక్ అట్టుడికిపోయింది. ఆయనకు ఆదరణా అడుగంటింది. నిజానికి సైన్యం చేతిలో పావుగానే ఇమ్రాన్ రాజకీయ ప్రవేశం జరిగిందంటారు. అలాంటి సైన్యానికే ఎదురు తిరగడంతో ఇమ్రాన్ పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడింది. ఎంత ప్రయతి్నంచినా పదవిని కాపాడుకోలేకపోయారు. పైగా జైలు శిక్ష వల్ల తాను పోటీ చేసే అవకాశం లేదు. ఆయన పార్టీ తరఫున కొందరు ధైర్యం చేసి ఇండిపెండెంట్లుగా బరిలో దిగుతున్నా చాలామంది జైలుపాలయ్యారు. పలువురు ఫిరాయించగా మిగిలిన వారు అజ్ఞతంలోకి వెళ్లిపోయారు. ఈ సమస్యలు చాలవన్నట్టు పీటీఐ ఎన్నికల గుర్తు బ్యాట్‌పైనా ఎన్నికల సంఘం వేటు వేసింది. దాంతో లక్షలాది మంది నిరక్షరాస్య ఓటర్లు బ్యాలెట్ పత్రాలపై ఇమ్రాన్ పార్టీని గుర్తించను కూడా లేరంటున్నారు. బిలావల్ భుట్టో 35 ఏళ్ల బిలావల్ భుట్టో జర్దారీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్. దారుణ హత్యకు గురైన మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో, పాక్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కుమారుడు. షహబాజ్ షరీఫ్ సర్కారులో విదేశాంగ మంత్రిగా తన పనితీరుతో స్వదేశంలో విమర్శలపాలు, భారత్‌లో నవ్వులపాలయ్యారు. గత ఎన్నికల్లో పీపీపీ మూడో స్థానంలో నిలిచింది. ఈసారి అన్నీ కలిసొస్తే బహుశా కింగ్‌మేకర్ అవ్వొచ్చంటున్నారు. పాక్ జాతీయ అసెంబ్లీలో 342 మంది సభ్యులుంటారు. 266 మందిని నేరుగా ఉన్నుకుంటారు. 70 సీట్లను మహిళలు, మతపరమైన మైనారిటీలకు; ఆరింటిని గిరిజన ప్రాంతాల వారికి రిజర్వు చేశారు. ఈ స్థానాలను పార్టీలకు గెలుచుకున్న స్థానాలను బట్టి నైష్పత్తిక ప్రాతిపదికన కేటాయిస్తారు. సాక్షి, నేషనల్ డెస్క్ -
పీటీఐ చైర్మన్‌గా శాంత్ కుమార్
న్యూఢిల్లీ: ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(పీటీఐ)చైర్మన్‌గా ది ప్రింటర్స్(మైసూర్)కు చెందిన కేఎన్ శాంత్ కుమార్(62) ఎన్నికయ్యారు. పీటీఐ వైస్ చైర్మన్‌గా హిందుస్తాన్ టైమ్స్ సీఈవో ప్రవీణ్ సోమేశ్వర్ ఎన్నికయ్యారు. అవీక్ సర్కార్ స్థానంలో శాంత్ కుమార్ బాధ్యతలు చేపడతారు. శుక్రవారం ఢిల్లీలోని పీటీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన పీటీఐ బోర్డు సభ్యుల వార్షిక సమావేశం కార్యవర్గాన్ని ఎన్నుకుంది. ఈ కార్యవర్గం ఏడాదిపాటు కొనసాగుతుంది. శాంత్ కుమార్ 1983 నుంచి ది ప్రింటర్స్ (మైసూర్) ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్య బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. -
భారత మూలాలు... నాకెంతో గర్వకారణం...!
న్యూఢిల్లీ: ఆయన రిషి సునాక్. బ్రిటన్ ప్రధాని. ఆ పీఠమెక్కిన తొలి భారత మూలాలున్న నేత. అత్తామామలు ఇన్ఫోసిస్ వంటి దిగ్గజం ఐటీ కంపెనీ వ్యవస్థాపకులు. అంతా కలిస్తే భోజనాల బల్ల దగ్గర వాళ్ల మధ్య ఏ అంశాలు చర్చకు వస్తాయి? రాజకీయాలా? అస్సలు కాదట. కేవలం క్రికెట్ గురించి మాత్రమే మాట్లాడుకుంటారట. చివరికి రిషి ఇద్దరు కూతుళ్లు కూడా క్రికెట్ అంటే ప్రాణం పెడతారట. ఎంతగా అంటే, సర్వ కాల సర్వావస్థల్లోనూ భారత జట్టునే సమరి్థంచేటంతగా. అయితే, ఫుట్‌బాల్‌లో మాత్రం ఇంగ్లాండ్ జట్టును సమరి్థంచాలన్నదే వారికి ఆయన విధించే ఏకైక షరతు! సునాక్ తల్లిదండ్రులు ఇద్దరూ భారత మూకాలున్న వారే. తూర్పు ఆఫ్రికా నుంచి ఇంగ్లాండ్ వెళ్లారు. ఇక ఆయన భార్య అక్షతా మూర్తి నారాయణ మూర్తి, సుధా మూర్తి దంపతుల ఏకైక సంతానం. జీ 20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు భారత్ వస్తున్న నేపథ్యంలో బుధవారం పీటీఐ వార్తా సంస్థకు ఇచి్చన ఇ– మెయిల్ ఇంటర్వ్యూలో రిషి పలు అంశాలు పంచుకున్నారు. సరదా సంగతుల నుంచి భారత్, ఇంగ్లాండ్ ద్వైపాక్షిక బంధం దాకా అన్ని అంశాలనూ స్పృశించారు. భారత మూలాలు తనకెంతో గర్వకారణమని పునరుద్ఘాటించారు రిషి. బ్రిటన్ ప్రధానిగా తాను బాధ్యతలు చేపట్టినప్పుడు భారతీయుల నుంచి వ్యక్తమైన హర్షాతిరేకాలు చెప్పలేని అనుభూతి ఇచ్చాయని గుర్తు చేసుకున్నారు. అత్తామామలతో ముచ్చటించేటప్పుడు భారత రాజకీయాలు, టెక్నాలజీ, ప్రధానిగా బ్రిటన్ను నడిపించడంలో ఆయన ఎదుర్కొంటున్న సమస్యల వంటివి ఎంతమాత్రమూ ప్రస్తావనకు రావని ఒక ప్రశ్నకు బదులుగా రిషి చెప్పారు. ‘ రాజకీయాలను, కుటుంబాన్ని విడిగా ఉంచడం ముఖ్యమని అభిప్రాయపడ్డారు. మోదీతో భేటీ కోసం ఎదురు చూస్తున్నా... ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్టు రిషి చెప్పారు. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్, ఇంగ్లాండ్ ద్వైపాక్షిక కృషి పాత్రపై లోతుగా చర్చిస్తామన్నారు. గత ఏడాది కాలంలో భారత్‌లో పర్యటించిన తన మంత్రివర్గ సహచరులు రెట్టించిన ఉత్సాహంతో తిరిగొచ్చారని చెప్పారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారత్–ఇంగ్లాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరేందుకు మరి కాస్త సమయం పడుతుందని రిషి అభిప్రాయపడ్డారు. కానీ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 కల్లా రెట్టింపు చేయడమే లక్ష్యంగా అధునాతన ఒప్పందం కుదురుతుందని విశ్వాసం వెలిబుచ్చారు. ‘బ్రిటన్ వాణిజ్య మార్కెట్లో 4.8 కోట్లకు పైగా భారతీయ చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలున్నాయి. భారత ఎగుమతిదారులకు వాటితో యాక్సెస్ కల్పించేలా ఒప్పందం ఉండాలి. వార్షిక ద్వైపాక్షిక వర్తకం ఇప్పటికే రూ.3.5 లక్షల కోట్లు దాటేసింది‘ అని అన్నారు. ఇంగ్లాండ్‌లో 16 లక్షలకు పైగా భారతీయులున్నారు. భారత్ కు జీ 20 సారథ్యం... జీ 20 సారథ్యానికి భారత్ సరైన దేశమని రిషి అన్నారు. అపార వైవిధ్యానికి నెలవు భారత్. కొన్నేళ్లుగా అన్ని రంగాల్లోనూ అసాధారణ విజయాలు సాధిస్తూ ప్రపంచ దేశాలన్నింటికీ ఆదర్శంగా నిలుస్తోంది. అలాంటి దేశం జీ 20 సదస్సుకు సారథ్యం వహిస్తుండటం సరైన సమయంలో జరుగుతున్న చక్కని ఘటన‘ అని అభిప్రాయపడ్డారు. మోదీ నాయకత్వ సామర్థ్యానికి నిజంగా సెల్యూట్ చేస్తున్నా. ప్రపంచ సారథిగా భారత్ పోషిస్తున్న కీలక పాత్ర నిజంగా శ్లాఘనీయం‘ అన్నారు. ► బ్రిటన్ ప్రధాని కాగానే నేను చేసిన మొదటి పని అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్‌లో దీపావళి విందు ఇవ్వడమే. భవనమంతా విద్యుద్దీపాలు, పూలతో మెరిసిపోతుంటే చూసి చెప్పలేనంత భావోద్వేగానికి లోనయ్యా. ఒక భారతీయునిగా నాకెంతో గర్వకారణమైన విషయమది. ► నా గాథ నిజానికి లోతైన భారత మూలాలున్న ఎంతోమంది బ్రిటన్ వాసుల కథే. ఈ భిన్నత్వంలో ఏకత్వం బ్రిటన్ బలం. ► నేను పాటించే విలువలకు నా భార్య, ఇద్దరు కూతుళ్లు, తల్లిదండ్రులు, అత్తామామలు దారి చూపే దీపాలుగా నిలుస్తారు. ముఖ్యంగా అత్తామామల ఘనతలు చూసి నేనెంతో గరి్వస్తాను. ఏమీ లేని స్థితి నుంచి మొదలై ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఐటీ దిగ్గజ కంపెనీని స్థాపించే దాకా వాళ్ల ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకం. భారత్, ఇంగ్లాండ్‌ల్లో వేలాది మందికి అది ఉపాధి కలి్పస్తోంది. ప్రతి పౌరుడూ అలాంటి విజయాన్ని సాధించేందుకు వీలు కలి్పంచేలా బ్రిటన్ను తీర్చిదిద్దాలన్నది నా సంకల్పం. ► జీ 20 సదస్సు కోసం భార్య అక్షతతో కలిసి భారత్ లో పర్యటించనుండటం పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నా. బిజీ బిజీగా గడిపేలా ఇప్పటికే మొత్తం ప్లానింగ్ చేసుకున్నాం. భారత్‌లో మేం గతంలో వెళ్లాలని అనుకున్న పలు ప్రాంతాలకు వెళ్తాం. -
టమాటా వ్యాపారికి బౌన్సర్లంటూ తప్పుడు వార్తా కథనం.. పీటీఐ క్షమాపణలు
వారణాసి: టమాటా ధరలు పెరిగిన నేపథ్యంలో షాపు ముందు ఓ వ్యాపారి ఇద్దరు బౌన్సర్లను నియమించాడనే వార్త పీటీఐకి చిక్కులు తెచ్చిపెట్టింది. ఎట్టకేలకు ఆ వార్త అవాస్తవమైనదని పీటీఐ తెలిపింది. ఇలాంటి సమాచారాన్ని ప్రసారం చేసినందుకు క్షమాపణలు చెప్పింది. నిజనిర్ధారణ చేయడంలో విఫలమయ్యామని వెల్లడించింది. ఆ షాపు ఓనర్‌ను సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తగా గుర్తించామని పీటీఐ తెలిపింది. టమాటా ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రశ్నించే ఉద్దేశంతోనే ఆ సమాచారాన్ని తమకు అందించినట్లు పీటీఐ భావించింది. వార్తల ఉన్నత ప్రమాణాలను చేరడంలో ఈ సారికి తప్పు జరిగిందని స్పష్టం చేసింది. ఆ ట్వీట్‌ను వెంటనే తొలగించినట్లు పేర్కొంది. ఉన్నత విలువలతో కూడిన నిష్పాక్షిమైన వార్తలను అందించడానికి కట్టుబడి ఉన్నామని హామీ ఇస్తున్నట్లు ట్వీట్ చేసింది. Earlier today, PTI tweeted a story about a vegetable vendor in Varanasi hiring bouncers in light of high price of tomatoes. It has since come to our notice that the vendor is a worker of the Samajwadi Party, and his motive for giving us the information was questionable. We have,… — Press Trust of India (@PTI_News) July 9, 2023 దేశంలో టమాటా ధరలు ఆకాశన్నంటుతున్నాయి. కేజీ ధర రూ.160 పైనే ఉంది. దీంతో ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే యూపీలోని వారణాసిలో ఓ షాపు యజమాని తన టమాటా షాపు ముందు వినియోగదారులను అదుపు చేయడానికి ఇద్దరు బౌన్సర్లను పెట్టుకున్నట్లు పీటీఐ వార్తను ప్రసారం చేసింది. దొంగలు షాపు నుంచి టమాటాను ఎత్తుకుపోతున్నట్లు ఆ యజమాని పేర్కొన్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ అంశం తప్పు అని చెబుతూ ప్రసారం చేసినందుకు క్షమాపణలు చెప్పింది. ఇదీ చదవండి: టమాటాలు తెచ్చిన తంటాలు.. బౌన్సర్లను పెట్టుకున్న వ్యాపారి.. -
చైనా ఇది తగునా.. భారత్ విషయంలో మరో చెత్త నిర్ణయం!
బీజింగ్: డ్రాగన్ దేశం చైనా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. చైనాలో ఉన్న ఏకైక భారతీయ జర్నలిస్టు తమ దేశం నుంచి వెళ్లిపోవాలని తాజాగా చైనా ఆదేశాలు జారీ చేసింది. దీని కోసం ఈ నెల చివరి వరకు గడువు ఇచ్చినట్లు సమాచారం. దీంతో చైనాలో ఇప్పటివరకు ఉన్న ఒకే ఒక్క భారత మీడియా ప్రతినిధి కూడా అక్కడ నుంచి రావాల్సి ఉంటుంది. వివరాల ప్రకారం.. ప్రస్తుతం పీటీఐ రిపోర్టర్ ఒకరు చైనాలో ఉన్నారు. అయితే, భారత జర్నలిస్టుల వీసా రెన్యూవల్ చేసేందుకు చైనా ప్రభుత్వం నిరాకరించింది. చైనాలో ఈ ఏడాది మొదటివరకు పలు భారత మీడియా సంస్థల నుంచి నలుగురు జర్నలిస్టులు విధులు నిర్వహించారు. హిందుస్థాన్ టైమ్స్‌కు చెందిన ఓ రిపోర్టర్ గత ఆదివారమే చైనా వదిలి వచ్చేశారు. దూరదర్శన్, ద హిందూకు చెందిన రిపోర్టర్లను ఏప్రిల్‌లోనే పంపించేశారు. ఇక, మిగిలిన పీటీఐ రిపోర్టర్‌ను కూడా చైనా ఇంటికి పంపించనుంది. కాగా, దీనిపై ఇరుదేశాల విదేశాంగ శాఖల నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. మరోవైపు.. విదేశీ మీడియా ప్రతినిధులకు సంబంధించి చైనా కండీషన్స్ పెడుతోంది. అయితే, జర్నలిస్టుల వీసాకు సంబంధించి భారత ప్రభుత్వం గత నెలలో ఓ ప్రకటన చేసింది. భారత్‌లో పనిచేసే చైనా జర్నలిస్టులకు ఎటువంటి ఆటంకాలు లేనప్పటికీ.. చైనాలో భారత జర్నలిస్టులకు మాత్రం ఇలాంటి వెసులుబాటు లేదని పేర్కొంది. ఇక, లడాఖ్, సిక్కిం వద్ద జరిగిన ఘర్షణలతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. సరిహద్దు విషయంలో కొంతకాలంగా ప్రతిష్టంభన కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జర్నలిస్టులకు వీసా రెన్యువల్ చేయలేదని వాదనలు వినిపిస్తున్నాయి. ఇది కూడా చదవండి: విషాదం: మాజీ ప్రధాని కన్నుమూత -
రాజా రామ్మోహన్ రాయ్ జాతీయ అవార్డుకు ఎంపికైన డాక్టర్ ఏబీకే ప్రసాద్
జర్నలిజం రంగంలో అత్యుత్తమమైన సేవలు అందించినందుకు ప్రతిష్టాత్మకమైన రాజా రామ్మోహన్ రాయ్ అవార్డుకు డాక్టర్ ఏబీకే ప్రసాద్‌ను ఎంపిక చేసినట్లు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఏబీకేగా ప్రసిద్ధి చెందిన డాక్టర్ అన్నే భవానీ కోటేశ్వర ప్రసాద్ పాత్రికేయ రంగంలో 75 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి ఉన్నారు. ఆధ్ర ప్రదేశ్ నుంచి వెలువడిన ప్రధాన పత్రికలకు సంపాదకులుగా పనిచేసిన అరుదైన గౌరవం వీరికి దక్కింది. 2004-2009 వరకు ఆంధ్ర ప్రడేశ్ రాష్ట్ర అధికార భాష సంఘం అధ్యక్షులుగా కూడా ఆయన పనిచేశారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్ పర్సన్ జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని కమిటి ఈ అవార్డును ప్రకటించింది. ఫిబ్రవరి 28 న డిప్యూటీ స్పీకర్ హాల్, కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా, రఫీ మార్గ్, న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్దు ప్రదానోత్సవం జరుగుతుంది. -
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ సెక్స్ కాల్ దుమారం
పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ అధినేత, పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చిక్కుల్లో పడ్డారు. ఓ మహిళతో అత్యంత సన్నిహితంగా మాట్లాడినట్లుగా ఆడియో క్లిప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందర ఈ పరిణామం చోటు చేసుకోవడంతో.. పాక్‌లో రాజకీయ దుమారం చెలరేగింది. పాకిస్థానీ జర్నలిస్ట్ సయ్యద్ అలీ హైదర్ యూట్యూబ్‌లో ఆ ఆడియో క్లిపులను షేర్ చేశారు. దీంతో పాక్‌లో ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. అందులో ఉంది ఇమ్రాన్ ఖాన్ వాయిస్ అనేది ఆరోపణ. విశేషం ఏంటంటే.. ఈ ఆడియో క్లిప్స్ తాజావేనని అందులోని సంభాషణల ఆధారంగా తెలుస్తోంది. అయితే.. ఇది ప్రధాని కార్యాలయం నుంచే వెలువడ్డాయని ఖాన్ అనుకూల మీడియా ఛానెల్స్ కథనాలు వెలువరిస్తున్నాయి. మరోవైపు.. పీటీఐ మాత్రం ఈ కాల్ సంభాషణలను కొట్టిపారేస్తోంది. అదంతా ప్రభుత్వం కుట్రేనని, తమ అధినేతను బద్నాం చేసే కుట్రలో భాగంగా ఫేక్ క్లిప్స్‌తో ప్రచారం చేస్తోందని ఆరోపిస్తోంది. వాళ్లు ఇంతకంటే ఏం చేయలేరని పీటీఐ అధికార ప్రతినిధి అర్సలన్ ఖలీద్ పేర్కొన్నారు. ఇక ఆ ఆడియో క్లిప్‌లో సదరు మగ గొంతు తనను కలవాలంటూ అవతలి మహిళను బలవంతం పెట్టగా.. ఆమె కుదరదని చెప్పడం వినొచ్చు. అంతేకాదు.. తన భార్యాబిడ్డలు రాకుండా ప్రయత్నిస్తానని కూడా ఆమెతో చెప్పాడు ఆ వ్యక్తి. ఇదిలా ఉంటే.. ఇమ్రాన్ ఖాన్ కాస్త ఇమ్రాన్ హష్మీ(బాలీవుడ్ నటుడు)గా మారిపోయాడంటూ సౌత్ ఏషియా కరస్పాండెంట్, జర్నలిస్ట్ నలియా ఇనాయత్ ఎద్దేవా చేశారు. -
ఇమ్రాన్ ఖాన్‌కు ఊహించని షాక్..!
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌కు ఊహించని షాక్ తగిలింది. పాకిస్థాన్ తెహ్రిక్ ఈ ఇన్సాఫ్ పార్టీ (పీటీఐ) చీఫ్ పదవి నుంచి తొలగించే ప్రక్రియను ప్రారంభించింది ఆ దేశ ఎన్నికల సంఘం. తోషాఖానా(ఖజానా) కేసుకు సంబంధించి ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు తెలుపుతూ ఇమ్రాన్‌కు నోటీసులు సైతం జారీ చేసిందని డౌన్ న్యూస్‌పేపర్ పేర్కొంది. ఈ కేసులో తదుపరి విచారణ డిసెంబర్ 13న చేపట్టనున్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇమ్రాన్ ప్రధానిగా ఉన్న సమయంలో వచ్చిన విలువైన బహుమతులను దేశ ఖజానా తోషాఖానా నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి.. వాటిని ఎక్కువ ధరకు విక్రయించారనే అభియోగాలు ఉన్నాయి. ఈ క్రమంలో తప్పుడు సమాచారం, తప్పుడు వాంగ్మూలం ఇచ్చారన్న ఆరోపణలతో ఆర్టికల్ 63(i) ప్రకారం ఆయనను అనర్హుడిగా గుర్తించింది ఎన్నికల సంఘం. ఈసీ రికార్డ్స్ ప్రకారం.. తోషాఖానా నుంచి బహుమతులను రూ.21.5 మిలియన్లకు కొనుగోలు చేసి రూ.108 మిలియన్లకు విక్రయించినట్లు తేలింది. తోషాఖానా బహుమతుల విక్రయంపై వార్తలు వచ్చిన క్రమంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. పాకిస్థాన్ చట్టాల ప్రకారం విదేశాల్లో బహుమతిగా లభించిన వాటిని తోషాఖానా(ఖజానా) విభాగంలో వాటి విలువను లెక్కించాలి. ఆ తర్వాతే వాటిని 50 శాతం డిస్కౌంట్‌తో తీసుకునేందుకు వీలుంటుంది. ఇదీ చదవండి: భారీ వర్షాలతో బస్సును కమ్మేసిన బురద.. 34 మంది సజీవ సమాధి -
పీటీఐ డైరెక్టర్‌గా ఆదిమూలం
న్యూఢిల్లీ: దినమలర్ పత్రిక పబ్లిషర్ ఎల్.ఆదిమూలం పీటీఐ వార్తా సంస్థ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. గురువారం జరిగిన పీటీఐ బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పీటీఐ వైస్ చైర్మన్ కె.ఎన్.శాంత్‌కుమార్ మరోసారి ఆ పదవికి ఎన్నికైనట్టు ప్రకటించింది. ఆదిమూలం ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ అధ్యక్షునిగా, ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ (ఏబీసీ) ప్రత్యేక ఆహ్వానితునిగా కూడా చేశారు. శాంత్‌కుమార్ గతంలో ఏబీసీ చైర్మన్‌గా పనిచేశారు. చదవండి: (పెరిగిన గుండెపోటు కేసులు.. నాలుగేళ్లలో అక్కడ 80 వేలకుపైగా మృతి) -
పాక్ పీఠం షాబాజ్‌కు! ఇమ్రాన్ ఖాన్ ఏమంటున్నారు?
ఇస్లామాబాద్: పాకిస్తాన్ రాజకీయాలు మరిన్ని మలుపులు తిరుగుతున్నాయి. ప్రధానిగా పీఎంఎల్ (ఎన్) అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్ (70) ఎన్నికకు రంగం సిద్ధమైంది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఆయన, తాజా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ తరఫున షా మహ్మద్ ఖురేషీ ఆదివారం నామినేషన్లు వేశారు. అయితే పలు కేసులున్న షాబాజ్ నామినేషన్‌ను తిరస్కరించాలన్న పీటీఐ డిమాండ్‌ను సభాపతి తోసిపుచ్చారు. దాంతో సోమవారం తమ ఎంపీలంతా రాజీనామా చేస్తారని పీటీఐ సీనియర్ నేత బాబర్ అవాన్ ప్రకటించారు. ఇమ్రాన్ నివాసంలో జరిగిన పీటీఐ కోర్ కమిటీ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు మీడియాకు చెప్పారు. ప్రధానిగా షాబాజ్‌ను అంగీకరించేది లేదని ఇమ్రాన్ తేల్చి చెప్పారు. కొత్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటానికి తెర తీస్తామన్నారు. దేశం కోసం మరో స్వాతంత్య్ర పోరాటం నేటి నుంచి మొదలవుతుందంటూ ట్వీట్ చేశారు. ‘‘కొత్తగా కొలువుదీరేది విదేశీ ప్రభుత్వమే. ఈ పరిణామాన్ని వ్యతిరేకిస్తూ వీధుల్లోకొచ్చి నిరసన తెలపండి’’ అని పీటీఐ కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధానిని ఎన్నుకునేందుకు జాతీయ అసెంబ్లీ సోమవారం మధ్యాహ్నం ప్రత్యేకంగా సమావేశం కానుంది. 342 మంది సభ్యులున్న సభలో ప్రధానిగా ఎన్నికవాలంటే 172 మంది మద్దతు అవసరం. ప్రస్తుత సభ కాల పరిమితి 2023 ఆగస్టుతో ముగియనుంది. షాబాజ్‌కు సవాలే పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడైన షాబాజ్ మూడుసార్లు పంజాబ్ ప్రావిన్స్ సీఎంగా కూడా పని చేశారు. మనీ లాండరింగ్ కేసుల్లో షాబాజ్, ఆయన కుమారుడు హంజా 2019లో అరెస్టయ్యారు. పీఠమెక్కాక కలగూర గంపలాంటి విపక్షాలను ఏడాదికి పైగా ఒక్కతాటిపై నడపడం ఆయనకు సవాలేనంటున్నారు. ఇమ్రాన్‌ను అరెస్టు చేస్తారన్న వార్తల నేపథ్యంలో, ‘‘ప్రతీకార రాజకీయాలుండబోవు. అయితే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది’’ అంటూ షాబాజ్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్, మాజీ మంత్రులు తదితరులు దేశం విడిచి పోకుండా ఆదేశించాలంటూ ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఉన్నతాధికారులెవరూ దేశం వదలొద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. -
పీటీఐ చైర్మన్‌గా అవీక్ సర్కార్
న్యూఢిల్లీ: ఆనంద్ బజార్ గ్రూప్ పబ్లికేషన్స్ ఎడిటర్ ఎమిరిటస్, వైస్ చైర్మన్ అవీక్ సర్కార్(75) ప్రెస్ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని పీటీఐ బోర్డు శనివారం ధ్రువీకరించింది. ఇప్పటివరకు ఈ పదవిలో పంజాబ్ కేసరి గ్రూప్ చీఫ్ ఎడిటర్ విజయ్‌కుమార్ చోప్రా ఉన్నారు. సర్కార్.. టెలిగ్రాఫ్, ఆనంద్ బజార్ పత్రిక డైలీలకు ఎడిటర్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ గ్రూప్ కింద ఆరు టీవీ చానళ్లు, అనేక మేగజీన్లు ఉన్నాయి. పెంగ్విన్ ఇండియాకు ఫౌండింగ్ ఎండీగా, బిజినెస్‌స్టాండర్డ్‌కు ఫౌండింగ్ ఎడిటర్‌గానూ వ్యవహరించారు. చదవండి: ప్రశాంత్ భూషణ్‌కు రూపాయి జరిమానా! -
డీ గ్యాంగ్ బాస్‌కు కరోనా?
కరాచీ: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం కరోనా వైరస్ బారిన పడ్డాడా? అవునని కొందరు కాదని కొందరు చెబుతున్నారు. పాకిస్తాన్ నుంచి ముంబై నేర సామ్రాజ్యాన్ని నడుపుతున్న ఈ కరడుగట్టిన తీవ్రవాది దావూద్ భార్య మెహజబీన్కు కరోనా పాజిటివ్‌గా తేలిందని, దీంతో దావూద్ వ్యక్తిగత సిబ్బందితోపాటు రక్షణ వ్యవహారాలను చూసే వారందరినీ క్వారంటైన్లో ఉంచినట్లు కొన్ని వార్తా సంస్థలు కథనాలు ప్రచురించగా.. అలాంటిదేమీ లేదని ‘భాయ్’ఆరోగ్యంగానే ఉన్నాడని అతడి తమ్ముడు అనీస్ ఇబ్రహీం తమతో చెప్పినట్లు ఐఏఎన్ఎస్ వార్తా సంస్థ ఇంకో కథనాన్ని ప్రచురించింది. ముంబైలోని డోంగ్రీ ప్రాంతంలో జన్మించిన దావూద్ 1993 నాటి ముంబై పేలుళ్లకు కుట్ర పన్నిన విషయం తెలిసిందే. 1994 నుంచి పాకిస్తాన్‌లోని కరాచీలో ఐఎస్ఐ ఆశ్రయంలో ఉంటున్న దావూద్ ప్రస్తుతం కరోనా బారిన పడి కరాచీ మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అతడి భార్య మెహజబీన్కూ వ్యాధి సోకిందని పీటీఐ తదితర వార్తా సంస్థలు తెలిపాయి. మరోవైపు.. ఐఏఎన్ఎస్ వార్తా సంస్థ దావూద్ ఇబ్రహీం తమ్ముడు అనీస్ ఇబ్రహీంతో తాము ఫోన్లో మాట్లాడామని దావూద్ కుటుంబంలో ఎవరికీ కరోనా సోకలేదని అనీస్ చెప్పినట్లు పేర్కొంది. పాక్‌తోపాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి మాఫియా కూడా కార్యకలాపాలను నడుపుతున్నట్లు అనీస్ అంగీకరించినట్లు వెల్లడించింది. ‘‘భాయ్ బాగున్నాడు. షకీల్ కూడా. మా ఇంట్లో ఎవరికీ కరోనా సోకలేదు. ఎవరూ ఆసుపత్రిలో చేరలేదు’’అని అనీస్ చెప్పినట్లు తెలిపింది. -
క్షణమొక యుగంలా..
పాలక్కడ్: దేవభూమిగా, ప్రకృతి సోయగాలకు పుట్టినిల్లుగా పేరుపడ్డ కేరళలో ఇప్పుడంతా జల విలయమే. మలయాళ సీమ మరుభూమిని తలపిస్తోంది. చిరుజల్లులతో దేశ, విదేశీ పర్యాటకులకు ఎల్లప్పుడూ ఆహ్లాదాన్ని పంచే ఆ రాష్ట్రం కుంభవృష్టితో చిగురుటాకులా వణికిపోతుంది. ఎప్పుడూ ఏ వైపు వరద ప్రవాహం ముంచుకొస్తుందోనని జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సహాయక బృందాలు ఎప్పుడొస్తాయా? అని ఎదురుచూస్తూ క్షణమొక యుగంగా గడుపుతున్నారు. సాయం కోసం ఎదురుచూస్తున్న అక్కడి ప్రజల దుస్థితిని స్వయంగా చూడడమే కాకుండా.. వరద ఉగ్రరూపం నుంచి తృటిలో తప్పించుకున్న పీటీఐ జర్నలిస్టు మనోజ్ రామ్మోహన్ ప్రత్యక్ష అనుభవం ఇది. కేరళలోని వేలాది మంది ప్రజలు ఇలా ప్రాణాలు అరచేత పట్టుకుని సాయం కోసం ఎదురుచూస్తుంటే.. మరికొందరు వరద ప్రవాహం తగ్గుముఖం పట్టాలని ప్రార్థిస్తూ బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఆ కష్టాలు ఆయన మాటల్లోనే.. క్షణాల్లో చుట్టుముట్టిన వరద ‘ఆగస్టు 9న మా తల్లిదండ్రులు నివసిస్తున్న పాలక్కడ్ పట్టణాన్ని ఒక్కసారిగా వరద చుట్టుముట్టింది. విషయం తెలియగానే నేను ఢిల్లీ నుంచి ఇంటికి ఫోన్ చేశారు. కింది అంతస్తు నీటితో నిండిపోయిందని, పై అంతస్తులో తలదాచుకున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంట్లో సామాగ్రి, వంట సామాన్లు, బట్టలు కొట్టుకుపోయాయి. వంటగది మొత్తం చిందరవందరైంది. అన్ని గదుల్లో నీరే. అదృష్టవశాత్తూ మొదటి అంతస్తులో ఆహారపదార్థాలు ఉండడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు. అప్పటికప్పుడు నేను ఢిల్లీ నుంచి బయల్దేరి ఎలాగోలా కొయంబత్తూరు చేరుకున్నా. అక్కడి నుంచి గంటసేపు ప్రయాణించి ఎలాగోలా పాలక్కడ్ చేరుకున్నా. ఆ రోజు ఆకాశం కొద్దిగా తెరిపినిచ్చింది. అయితే మళ్లీ ఆకాశానికి చిల్లుపడ్డట్లు భారీ వర్షం. దీంతో సమీపంలోని కాలువ ఉప్పొంగి అనేక ఇళ్లను ముంచెత్తింది. దీంతో మాలో ఆందోళన మొదలైంది. తరువాతి రోజు కూడా నింగినేలా ఏకమైనట్లు ఒకటే వాన. మా ఇంటి ముందు భాగం మొత్తం మునిగిపోయింది. కేవలం రెండు కొబ్బరి చెట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. కరెంటు లేదు.. ఫోన్లు మూగబోయాయి. కేవలం చుట్టుపక్కల జనం ఇచ్చే సమాచారంపైనే ఆధారపడ్డాం. ఒకవైపు పాములు, విష పురుగుల భయం, మరోవైపు ఆగకుండా కురుస్తున్న వర్షం ఇక ఆలస్యం చేస్తే ప్రాణాలకు ముప్పు తప్పదని గ్రహించి నా స్నేహితుడికి ఫోన్ చేసి విషయం చెప్పాను. మమ్మల్ని రక్షించేందుకు కొందరు యువకులు ముందుకొచ్చారు. వరద నీటిలో మా తల్లిదండ్రుల్ని ఆ యువకులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. వారిద్దరిని సురక్షిత ప్రాంతంలోని బంధువుల ఇంట్లో ఉంచి నేను ఢిల్లీ బయల్దేరాను. అయితే కొందరు స్థానికులు మాత్రం ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయడానికి ఇష్టపడలేదు. వరద తగ్గుముఖం పడుతుందని వారు ఎదురుచూస్తున్నారు. అయితే సమీపంలోని మలంపుజా డ్యాంలో నీటి ప్రవాహం పెరిగితే ముప్పు తప్పదని స్థానిక ప్రజలు ఆందోళనతో ఉన్నారు’ గర్భిణిని కాపాడారిలా.. ఇళ్ల పైకప్పులు, కొండ ప్రాంతాలు, ఇతర మారుమూల ప్రాంతాల్లో వరద నీటిలో చిక్కుకున్న వారిని ఎన్డీఆర్ఎఫ్, సైనిక బృందాలు కాపాడుతున్నాయి. పడవలు వెళ్లే వీలులేని ప్రాంతాల నుంచి ప్రజలను హెలికాప్లర్ల ద్వారా బయటికి తీసుకొస్తున్నారు. పురుటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళకు తాడు కట్టి నేవీ హెలికాప్టర్ ద్వారా ఇంటి నుంచి బయటికి లాగిన దృశ్యాలు టీవీ చానెళ్లు ప్రసారం చేశాయి. గాల్లో చాలాసేపు ప్రమాదకరంగా వేలాడటంతో ఆమె ఉమ్మనీటి సంచి పగిలింది. వెంటనే ఆ మహిళను నేవీ ఆసుపత్రికి తరలించగా మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఆలువాలో కోళ్లను సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తున్న యువకులు -
ప్రమాణ స్వీకారంపై స్పందించిన ఇమ్రాన్
పెషావర్ : పాకిస్తాన్ ప్రధానమంత్రిగా పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్(పీటీఐ) అధినేత ఇమ్రాన్‌ఖాన్ ఆగస్టు 11న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నెల 25న జరిగిన పాక్ జాతీయ ఎన్నికల్లో 116 సీట్లతో నేషనల్ అసెంబ్లీలో పీటీఐ అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు 172 సీట్లు అవసరం కాగా, మరో 56 మంది ప్రజాప్రతినిధుల మద్దతు కూడగట్టేందుకు ఇమ్రాన్ సిద్ధంగా ఉన్నారు. కొన్ని చిన్న పార్టీల నేతలతో ప్రభుత్వ ఏర్పాటు విషయమై చర్చించినట్లు ఇమ్రాన్ వెల్లడించారు. కైబర్ ఫంఖ్తువా ముఖ్యమంత్రి ఎవరన్నది మరో 48 గంటల్లో ప్రకటిస్తానని తెలిపారు. ప్రజా ప్రయోజనాలతో పాటు పాక్‌లో మార్పు కోసం తాను ప్రధాని బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఇమ్రాన్ వివరించారు. మరోవైపు పాక్‌లో ఇతర ప్రధాన పార్టీలైన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ), పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్)ల నేతలు సంయుక్తంగా పీటీఐకి అధికారం రాకుండా అడ్డుకోవాలని యత్నిస్తున్నారు. అంతకుముందు పీటీఐ అధికార ప్రతినిధి నయీముల్ హక్ మీడియాతో మాట్లాడుతూ.. ఇమ్రాన్ ఆగస్ట్ 14లోపే ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తాడని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా అవసరమైన సీట్ల కోసం చిన్న పార్టీలైన ముత్తహిద కౌమి మూవ్మెంట్ పాకిస్తాన్ (ఎంక్యూఎం-పీ), ద గ్రాండ్ డెమొక్రటిక్ అలియన్స్ (జీడీఏ), పీఎంఎల్-కాయిద్ (పీఎంఎల్- క్యూ), బలొచిస్తాన్ అవామీ పార్టీ (బీఏపీ)తో పాటు ఇటీవలి ఎన్నికల్లో నెగ్గిన స్వతంత్ర అభ్యర్థులతో ఇమ్రాన్, పీటీఐ కీలక నేతలు చర్చలు జరపనున్నారు. -
పాక్ ఎన్నికలపై స్పందించిన భారత్
న్యూఢిల్లీ: పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత భారత్ తొలిసారి స్పందించింది. ఇమ్రాన్ నేతృత్వంలో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వం ఉగ్రవాద రహిత దక్షిణాసియా కోసం నిర్మాణాత్మక కృషి చేస్తుందని భావిస్తున్నట్లు పేర్కొంది. ఈ విషయమై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ మాట్లాడారు. ‘సుస్థిరమైన, ఎలాంటి ఉగ్రవాదం, హింస లేని దక్షిణాసియా కోసం పాక్ కొత్త ప్రభుత్వం కృషి చేస్తుందని ఆశిస్తున్నాం. ప్రగతిశీల పాక్‌ను భారత్ కోరుకుంటోంది. సార్వత్రిక ఎన్నికల ద్వారా పాకిస్తాన్ ప్రజలు ప్రజాస్వామ్యంపై తమ విశ్వాసాన్ని వ్యక్తం చేయడాన్ని భారత్ స్వాగతిస్తోంది’ అని తెలిపారు. మరోవైపు, కశ్మీర్లో రక్తపాతాన్ని ఆపడానికి ఇరు దేశాలు ముందుకు రావాలన్న పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్‌కు స్నేహ హస్తం అందించాలని ప్రధాని మోదీని కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా కోరారు. ‘ఇమ్రాన్ స్నేహహస్తమిచ్చిన నేపథ్యంలో ఈ అవకాశాన్ని మోదీ సద్వినియోగం చేసుకోవాలి’ అన్నారు. -
సర్కారు ఏర్పాట్లలో ఇమ్రాన్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధాని పీఠాన్ని అధిరోహించేందుకు పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. మెజారిటీ కోసం అవసరమైన సీట్లను సంపాదించేందుకు స్వతంత్రులుసహా చిన్న పార్టీలతో చర్చలు ప్రారంభించారు. పార్టీలో తన విశ్వాస పాత్రులకు పార్టీల, ప్రావిన్సుల బాధ్యతను అప్పజెప్పారు. పీటీఐ నేతలతో భవిష్యత్ కార్యాచరణపై సమావేశమైన ఇమ్రాన్.. స్వతంత్రులు, ఇతర పార్టీల నేతలతో స్వయంగా మాట్లాడారు. పాక్ నిబంధనల ప్రకారం ఫలితాలొచ్చాక ప్రభుత్వ ఏర్పాటుకు 21రోజుల గడువిస్తారు. ఆలోపే మిగిలిన పార్టీల మద్దతు సంపాదిస్తామని ఇమ్రాన్ చెప్పారు. ఎన్నికల ఫలితాల పూర్తి అధికారిక వివరాలు శనివారం వెల్లడయ్యాయి. మొత్తం 270 పార్లమెంటు స్థానాల్లో ఎన్నికలు జరగగా ఇమ్రాన్ నేతృత్వంలోని పీటీఐ 116 స్థానాల్లో గెలిచింది. ఇమ్రాన్‌కు పాక్ ఆర్మీ అండగా నిలిచిందంటూ విమర్శలొస్తున్న నేపథ్యంలోనూ ఇమ్రాన్ సంపూర్ణమైన మెజారిటీ సాధించలేదు. అటు, పీఎంఎల్–ఎన్ 64 స్థానాల్లో, పీపీపీ 43 చోట్ల విజయం సాధించాయి. స్వతంత్ర అభ్యర్థులు 13 సీట్లు సాధించారు. ఈ స్వతంత్రులే ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానున్నారు. మిగిలిన 34 సీట్లను చిన్నా, చితకా పార్టీలు గెలుచుకున్నాయి. మొత్తం 272 పార్లమెంటు స్థానాలకు గానూ 270 చోట్ల ఎన్నికలు జరిగాయి. పంజాబ్, ఖైబర్ల్లోనూ పీటీఐ పీటీఐ నేతలతో సమావేశమైన ఇమ్రాన్ కేబినెట్ ఏర్పాటుపై నిర్ణయించేందుకు సమావేశమయ్యారు. పంజాబ్ ప్రావిన్సులోనూ ప్రభుత్వ ఏర్పాటుకు పీటీఐ సిద్ధమవుతోంది. పీఎంఎల్ఎన్ అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ.. ఇతర పక్షాలతో కలిసి పీటీఐ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది. ఈ అంశలపైనా పార్టీ నేతల సమావేశంలో ఇమ్రాన్ చర్చించారు. ఇమ్రాన్ విశ్వాసపాత్రుడైన జహంగీర్ ఖాన్‌కు విపక్ష ఎమ్మెల్యేలతో చర్చించే బాధ్యతను అప్పగించారు. ఖైబర్–ఫక్తున్ఖ్వా ప్రావిన్సులో పీటీఐ మెజారిటీని సాధించింది. ఇక్కడ ఇమ్రాన్ బాల్యస్నేహితుడైన పర్వేజ్ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. సింధ్‌లో పీపీపీ మూడింట రెండొంతుల మెజారిటీని సాధించగా.. బెలూచిస్తాన్‌లో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనేదానిపై స్పష్టత రాలేదు. ఆందోళనలకు సిద్ధమైన విపక్షాలు ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయి. ఎన్నికలు, కౌంటింగ్ పారదర్శకంగా జరగలేదంటూ శుక్రవారం రాత్రి రౌండ్‌టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించిన పార్టీలు.. మళ్లీ దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశాయి. పీఎంఎల్–ఎన్ చీఫ్, మాజీ ప్రధాని షెహబాజ్, ఎంఎంఏ చీఫ్ మౌలానా ఫజ్లుర్ నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. ఫలితాలను విపక్షాలు అంగీకరించబోవడం లేదని స్పష్టం చేశాయి. అటు అమెరికా కూడా పాకిస్తాన్ ఎన్నికలు స్వేచ్ఛాయుత, పారదర్శక వాతావరణంలో జరగలేదని పేర్కొంది. పాకిస్తాన్ పరిశీలకులతోపాటు, దక్షిణాసియా రాజకీయ విశ్లేషకులు, పాకిస్తాన్లో రాజకీయ నిపుణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హీతర్ నారెట్ పేర్కొన్నారు. పాకిస్తాన్ ఆర్మీ ఈ ఎన్నికలను పూర్తిగా ప్రభావితం చేసిందని ఆమె తెలిపారు. ఉగ్రవాదులకు ఘోర పరాభవం పాక్ ఎన్నికల్లో ఉగ్రవాద సంస్థలకు చెందిన గ్రూపులకు ప్రజలనుంచి పూర్తిస్థాయి వ్యతిరేకత ఎదురైంది. ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ మద్దతు తెలిపిన ‘అల్లాహు అక్బర్ తెహ్రీక్’ పార్టీని ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. ఈ సంస్థకు కనీసం ఒక్క సీటుకూడా రాలేదు. కనీస పోటీ కూడా కనబరచలేదు. దేశవ్యాప్తంగా ఈ పార్టీ సంపాదించిన ఓట్లు లక్షా 71వేలు మాత్రమే. మరో ఉగ్రవాద సంస్థ పెట్టుకున్న పార్టీ తెహ్రీకే లబాయిక్ పాకిస్తాన్ పార్టీ సింధ్ ప్రావిన్స్‌లో రెండు అసెంబ్లీ స్థానాలు మినహా దేశవ్యాప్తంగా పేలవమైన ప్రదర్శన కనబరిచింది. తాలిబాన్ గాడ్‌ఫాదర్‌గా సుపరిచితుడైన మౌలానా సమీయుల్ హక్ పార్టీ జమియాత్ ఉలేమాయే ఇస్లాం పార్టీ కనీసం ఒక్కసీటు గెలవలేదు. మత, ఉగ్రవాద రాజకీయ పార్టీలపై ప్రజలు ఏ విధమైన అభిప్రాయం కలిగి ఉన్నారో స్పష్టమవుతోందని.. పాక్ రాజకీయ నిపుణులంటున్నారు. -
కూటమి తప్పదా?
కరాచీ/ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొందిన పార్టీగా నిలిచిన పీటీఐ మేజిక్ ఫిగర్‌కు కొద్ది దూరంలో నిలిచింది. శుక్రవారం రాత్రి వరకు అధికారికంగా వెల్లడైన 265 స్థానాల ఫలితాల్లో పీటీఐ 118 చోట్ల విజయం సాధించగా.. మరో రెండుచోట్ల ఆధిక్యంలో ఉంది. పీఎంఎల్ ఎన్ 62 స్థానాల్లో, పీపీపీ 43 చోట్ల గెలిచాయి. స్వతంత్ర అభ్యర్థులు 12 చోట్ల గెలిచారని ఎన్నికల సంఘం వెల్లడించింది. మతతత్వ పార్టీల కూటమి అయిన ఎంఎంఏపీ 11 స్థానాల్లో గెలవగా.. ఎంక్యూఎం 4 చోట్ల గెలిచింది. గెలిచిన ఎంపీ సీట్ల ఆధారంగా మహిళలు, మైనారిటీ సభ్యుల కోటాలో పీటీఐ ఖాతాలోకి మరో 34–35 స్థానాలు దక్కనున్నాయి. మొత్తంగా కలుపుకుంటే పార్లమెంటులో పీటీఐ ఎంపీ సీట్ల సంఖ్య 160 వరకు ఉంటుందని అంచనా. ప్రధాని పీఠాన్ని అధిరోహించేందుకు మొత్తం 172 స్థానాలు అవసరం. దీంతో ఇమ్రాన్ ఖాన్‌కు స్వతంత్రులు, చిన్న పార్టీల మద్దతు తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం పీటీఐ ముఖ్యనేతలతో ఇస్లామా బాద్‌లోని తన నివాసంలో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు, కేబినెట్ విస్తరణ తదితర అంశాలపై వీరితో చర్చించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు దక్కుతుందని, ఆందోళన అవసరం లేదని ఆయన పార్టీ నేతలతో దీమా వ్యక్తం చేశారు. కాగా, ఇమ్రాన్‌కు వీవీఐపీ ప్రొటోకాల్‌ను అమల్లోకి తెచ్చారు.మరోవైపు, పాక్‌లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించాయి. పారదర్శకత లేని ఈ ఎన్నికల ఫలితాలు ప్రజాతీర్పును ప్రతిబింబించడం లేదని అందువల్ల ఈ ఎన్నికల ఫలితాలను తాము అంగీకరించబోమని ముక్తకంఠంతో స్పష్టం చేశాయి. పంజాబ్ ప్రావిన్స్‌లో పీటీఐ నవాజ్ షరీఫ్ కంచుకోట అయిన పంజాబ్ ప్రావిన్సులో తొలిసారిగా పీటీఐ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతోంది. 297 అసెంబ్లీ స్థానాల్లో పీఎంఎల్ఎన్ 127 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ.. 117 స్థానాలు గెలిచిన పీటీఐ.. స్వతంత్రుల (27 సీట్లు)తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. అటు 140 సీట్లున్న సింధ్ ప్రావిన్స్‌లో 72 చోట్ల గెలిచిన పీపీపీ స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది. ఇక్కడ పీటీఐ 20 చోట్ల గెలిచింది. అటు, 99 స్థానాలున్న ఖైబర్–ఫక్తున్ఖ్వా అసెంబ్లీలో పీటీఐ 66 చోట్ల గెలిచి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. బెలూచిస్తాన్ అసెంబ్లీలో 51 స్థానాలుండగా.. కొత్తగా ఏర్పాటైన బెలూచిస్తాన్ అవామీ 13 సీట్లతో పెద్ద పార్టీగా నిలిచింది. రాజకీయ అస్థిరతపై ఆందోళన పాకిస్తాన్లో ఎన్నికలు జరిగిన తీరు ఫలితాలపై అనుమానాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆ దేశ తదుపరి ముఖచిత్రంలో అస్థిరత తప్పదని పాక్ రాజకీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిగ్గింగ్ జరిగిందనే ఆరోపణలు, ముఖ్యనేతలంతా వారి కంచుకోటల్లో ఓడిపోవడం వంటి కారణాలతో.. కొత్త ప్రభుత్వం ఏర్పడకముందే అసంతృప్తి చాపకింద నీరులా విస్తరిస్తోందంటున్నారు. ప్రజల్లో పీటీఐ పట్ల సానుభూతి లేనప్పటికీ ఈ ఫలితాలు రావడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ‘పాకిస్తాన్ రాజకీయాల్లో వచ్చే కొద్ది రోజులు అత్యంత కీలకం. ఈ ఎన్నికల్లో ఓడిన పార్టీలన్నీ ఏకమై దేశవ్యాప్త ఆందోళనలు ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నాయి’ అని పాక్ రాజకీయ నిపుణుడు ఒమైర్ అలావీ పేర్కొన్నారు. కుట్ర జరిగింది: విపక్షాలు పార్లమెంటులో 68 స్థానాలు గెలవడం, పంజాబ్ ప్రావిన్స్ అసెంబ్లీలో 122 స్థానాల్లో గెలవడం తమ పార్టీపై జరిగిన కుట్రేనని పీఎంఎల్–ఎన్ ఆరోపిస్తోంది. అటు పీపీపీ కూడా తమ పార్టీ బలంగా ఉన్న చోట్ల కూడా ఓడిపోయామని.. ఏకంగా పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో కంచుకోట అయిన కరాచీలో ఓడిపోవడంపై అనుమానం వ్యక్తం చేస్తోంది. ఎన్నికలను హైజాక్ చేశారని.. ఫలితాలు అనుమానాస్పదంగా ఉన్నాయని మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. ఇమ్రాన్ గెలవలేదని.. ఆయన్ను కొందరు (ఆర్మీ, ఎన్నికల సంఘం పేర్లను పరోక్షంగా ప్రస్తావిస్తూ) గెలిపించారన్నారు. తొలి హిందూ ఎంపీ పాకిస్తాన్లో తొలిసారిగా ఓ హిందువు ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నాడు. పీపీపీ తరపున సింధ్ ప్రావిన్స్‌లోని థార్పార్కర్–2 స్థానం నుంచి పోటీ చేసిన మహేశ్ కుమార్ మలానీ 20వేల ఓట్లతో విజయం సాధించాడు. పాకిస్తాన్లో ముస్లిమేతరులకు పార్లమెంటుకు పోటీ చేసే, ఓటు వేసే హక్కు కల్పించిన 16 ఏళ్ల తర్వాత ఓ హిందువు పోటీచేసి గెలవడం ఇదే తొలిసారి. హిందు రాజస్తానీ పుష్కర్న బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మహేశ్.. 2003–08లో పీపీపీ తరపున పార్లమెంటుకు నామినేటెడ్ ఎంపీగా ఉన్నారు. -
పాకిస్తాన్ పీఠంపై ఇమ్రాన్!
ఇస్లామాబాద్: తీవ్రమైన ఆరోపణలు, వాగ్వాదాలు, భారీ హామీల అనంతరం బుధవారం పాకిస్తాన్ పార్లమెంటు ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం 6 గంటలకు ఎన్నికలు ముగియగానే.. ఏడు గంటలకు కౌంటింగ్ మొదలైంది. ఫలితాలు హోరాహోరీగా ఉంటాయని.. పీఎంఎల్–ఎన్, పీటీఐ మధ్య నువ్వా–నేనా అన్నట్లుగా పోటీ ఉండొచ్చని ప్రీపోల్ సర్వేలు వెల్లడించాయి. అయితే.. తాజా ఫలితాల ప్రకారం పాకిస్తాన్ ప్రధాని పీఠం.. మాజీ క్రికెటర్, పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్‌ఖాన్‌కే దక్కే అవకాశాలు కనబడుతున్నాయి. పాకిస్తాన్ పార్లమెంటులోని 272 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో పీటీఐ పార్టీ కడపటి వార్తలందేసరికి 107 స్థానాల్లో ముందంజలో ఉంది. మెజార్టీకి అవసరమైన 137 సీట్ల దిశగా దూసుకెళ్తోంది. పీఎంఎల్–ఎన్ 70 సీట్లలో, పీపీపీ 39 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ముత్తహిదా క్వామీ మూమెంట్ (ఎంక్యూఎం) 11 చోట్ల దూసుకుపోతోంది. 55కి పైగా స్థానాల్లో చిన్న పార్టీలు, ఇండిపెండెంట్లు ముందంజలో ఉన్నారు. ఒకవేళ హంగ్ వచ్చే పరిస్థితులుంటే పీపీపీ కింగ్‌మేకర్ కానుందని పాకిస్తాన్ విశ్లేషకులంటున్నారు. ఇండిపెండెంట్లు, ఇతర చిన్న పార్టీల సాయంతో ఇమ్రాన్ పీఠాన్ని అధిరోహించడం ఖాయంగా కనబడుతోంది. షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్ఎన్ను గద్దెదించేందుకు పీటీఐ చేసిన ప్రయత్నానికి ఐఎస్ఐతోపాటు పాక్ ఆర్మీ లోపాయకారిగా సహాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజా ఫలితాలతో పీటీఐ కార్యకర్తల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కౌంటింగ్ జరుగుతుండగానే ఇమ్రాన్ అనుచరులు సంబరాలు ప్రారంభించారు. ఉగ్రదాడుల్లో అభ్యర్థులు చనిపోవడంతో రెండుచోట్ల ఎన్నిక వాయిదా పడింది. ఈ ఎన్నికల్లో 2017 పాకిస్తాన్ జనగణన ఆధారంగా నియోజకవర్గాలను విభజించి ఎన్నికలు నిర్వహించారు. దీని ప్రకారం ఇస్లామాబాద్ నగరంలోనే మూడు ఎంపీ సీట్లున్నాయి. ఇవి కాకుండా పంజాబ్‌లో 141, సింధ్‌లో 61, ఖైబర్–ఫక్తున్ఖ్వాలో 39, బెలూచిస్తాన్‌లో 16, గిరిజన ప్రాంతాల్లో 12 సీట్లున్నాయి. విపక్షాల రిగ్గింగ్ ఆరోపణలు రిగ్గింగ్ కారణంగానే పీటీఐ మెజారిటీ గెలిచిందంటూ విపక్ష పీఎంఎల్–ఎన్, పీపీపీలు ఆరోపిస్తున్నాయి. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఈ ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందని పీఎంఎల్ఎన్ ఆరోపించింది. చాలాచోట్ల తమ పార్టీ ఏజెంట్లను పోలింగ్ బూత్లనుంచి బయటకు గెంటేశారని ఆరోపించింది. పీపీపీ కూడా ఎన్నికలు సవ్యంగా జరగలేదని చాలాచోట్ల రిగ్గింగ్ జరిగిందని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కరాచీలోని పలు పోలింగ్ కేంద్రాల్లో తమ ఏజెంట్లను బెదిరించి బయటకు పంపించారని పేర్కొంది. దీనిపై ఈసీ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రావిన్సుల్లో.. పంజాబ్ ప్రావిన్సులో పీఎంఎల్–ఎన్ మెజారిటీకి చేరువలో ఉన్నట్లు సమాచారం. కీలకమైన పంజాబ్ ప్రావిన్సు అసెంబ్లీ ఎన్నికల్లో 297 సీట్లలో ఇప్పటివరకు విడుదలైన ఫలితాల్లో పీఎంఎల్–ఎన్ 131 సీట్లలో పీటీఐ 70 స్థానాలను గెలుచుకున్నాయి. సింధ్ అసెంబ్లీ ప్రావిన్సులో తన కంచుకోటను పీపీపీ కాపాడుకుంటోంది.. ఈ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. మొత్తం 131 సీట్లలో ఫలితాలు వెల్లడైన 92 సీట్లలో పీపీపీ 60 చోట్ల ముందంజలో ఉంది. ఖైబర్ ఫక్తూన్ఖ్వా ప్రావిన్సులో పీటీఐ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఓటింగ్ కొనసాగిందిలా! ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 85వేల పోలింగ్ కేంద్రాల్లో జరిగింది. ఎన్నికల ప్రక్రియ సాయంత్రం ఆరుగంటలకు ముగిసింది. సాయంత్రం నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. ఈసారి ఎన్నికల్లో 30 వేర్వేరు పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. టెన్షన్ వాతావరణంలోనూ పాకిస్తాన్ ఓటర్లు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు. 10.6 కోట్ల మంది ఓటర్లలో 53 శాతం మంది ఓటింగ్ వినియోగించుకున్నారు. ఇమ్రాన్, షాబాజ్లపై ఈసీపీ సీరియస్ ఎన్నికల సందర్భంగా నిబంధనలను ఉల్లంఘించిన పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్, పీఎంఎల్–ఎన్ అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్, మాజీ విదేశాంగ మంత్రి ఖ్వాజా ఆసిఫ్‌లపై ఈసీపీ తీవ్రంగా మండిపడింది. ఇస్లామాబాద్ నుంచి ఎంపీగా బరిలో ఉన్న ఇమ్రాన్‌ఖాన్ తన ఓటును రహస్యంగా ఉంచకుండా మీడియాకు చూపిస్తూ ఓటేశారు. దీంతో ఆయన ఓటును రద్దు చేసిన ఎన్నికల సంఘం.. సోమవారం తమ ముందు విచారణకు రావాలని ఆదేశించింది. నిబంధనల ప్రకారం ఆరేళ్ల జైలు శిక్షతోపాటు రూ.1000 జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. షాబాజ్, ఆసిఫ్‌లు కూడా మీడియాతో మాట్లాడినందున వీరిపై చర్చలు తీసుకుంటారని సమాచారం. ఎన్నికలు హింసాత్మకం ఆత్మాహుతి దాడిలో 35 మంది మృతి ఇస్లామాబాద్: పాకిస్తాన్ పార్లమెంటు, 4 ప్రావిన్సుల (పంజాబ్, సింధ్, ఖైబర్–ఫక్తున్ఖ్వా, బెలూచిస్తాన్) అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల సందర్భంగా దేశంలో పలుచోట్ల హింస ప్రజ్వరిల్లింది. వేర్వేరు చోట్ల జరిగిన ఘటనల్లో 35 మంది మృతిచెందగా.. 67 మందికి పైగా గాయాలయ్యాయి. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. పాక్ నైరుతి ప్రాంతమైన క్వెట్టాలో పోలింగ్‌బూత్ బయట ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది జరిపిన ఆత్మాహుతి దాడిలోనే 31 మంది చనిపోయారు. 60 మంది గాయపడ్డారు. ఎన్నికల సందర్భంగా పలుచోట్ల రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకారం కారణంగా మరో నలుగురు హత్యకు గురయ్యారు. బెలూచిస్తాన్ రాజధాని అయిన క్వెట్టాలోని అతిసున్నిత ప్రాంతమైన ఎన్ఏ–360 నియోజకవర్గంలో అనుమానాస్పద వ్యక్తిని పోలింగ్ బూత్ వద్ద పోలీసులు ఆపేశారు. భారీ బందోబస్తు కారణంగా లోపలకు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో వెంటనే ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. గెలుపును లెక్కించేదెలా? ఎన్నికలు జరిగిన 272 సీట్లలో మెజారిటీ స్థానాల్లో ముందుగా గెలవాలి. ఆ తర్వాత మిగిలిన 70 సీట్ల (60మంది మహిళలు, 10 మంది భాషా ప్రాతిపదికన మైనారిటీ ప్రతినిధులు) ను ఆయా పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం ఆధారంగా పంచుతారు. ఆ తర్వాత మొత్తం 172 పొందిన పార్టీయే అధికారంలోకి వస్తుంది. అయితే.. దాదాపుగా 137 సీట్లు పొందిన పార్టీ లేదా కూటమి మిగిలిన స్థానాలను పొందటం పెద్ద కష్టమేంకాదు. అప్పుడు కెప్టెన్..ఇప్పుడు పీఎం? పాకిస్తాన్ ప్రధాని రేసులో ఉన్న ఇమ్రాన్‌ఖాన్ 1996లో పీటీఐ పార్టీని స్థాపించారు. అంతకుముందు, క్రికెట్ క్రీడాకారుడిగా చిరపరిచితులే. 1992లో ప్రపంచకప్ గెలిచిన పాకిస్తాన్ జట్టుకు నాయకత్వం వహించారు. ఆ తరువాత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి సామాజిక సేవకు అంకితమయ్యారు. తన తల్లి జ్ఞాపకార్థం 1994లో లాహోర్‌లో, 2015లో పెషావర్‌లో రెండు కేన్సర్ ఆసుపత్రులను నెలకొల్పారు. 2002లో తొలిసారి మియాన్వాలి స్థానం నుంచి జాతీయ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2013 ఎన్నికల్లో గెలుపొంది రెండోసారి పార్లమెంట్‌లోకి అడుగుపెట్టారు. 2005–14 మధ్య బ్రాడ్ఫోర్డ్ యూనివర్సిటీ(ఇంగ్లండ్)కి చాన్స్‌లర్‌గా వ్యవహరించారు. 1952లో లాహోర్‌లో జన్మించిన ఇమ్రాన్‌ఖాన్ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఇప్పటికే ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చిన ఆయన ఈ ఏడాది బుష్రా మానికా అనే మహిళను మూడో వివాహం చేసుకున్నారు. తన అనుచరులు ఇప్పటికీ ఇమ్రాన్‌ను కప్తాన్, కెప్టెన్ అని పిలుచుకుంటారు. ఇమ్రాన్‌తో భారత్‌కు ముప్పే! ఇస్లామాబాద్: పాకిస్తాన్లో బుధవారం సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఫలితాల సరళిని పరిశీలిస్తే ఇమ్రాన్‌ఖాన్ పార్టీ పీటీఐ ముందంజలో ఉంది. దాయాది దేశమైన పాకిస్తాన్లో సంభవించే రాజకీయ పరిణామాలు భారత్‌పై కూడా గణనీయమైన ప్రభావం చూపుతాయన్నది కాదనలేని వాస్తవం. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ గెలిస్తే భారత్–పాక్ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇమ్రాన్ ఖాన్ చాలా కాలంగా భారత వ్యతిరేక ధోరణే ప్రదర్శిస్తున్నారు. భారత్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ నవాజ్ షరీఫ్‌పై నిప్పులు కక్కుతున్నారు. భారత ప్రధాని మోదీ భాషలోనే నవాజ్ మాట్లాడుతున్నారని గతంలో ఇమ్రాన్ విమర్శలు చేశారు. నవాజ్‌ను ఆధునిక మీర్ జాఫర్‌తో పోల్చారు. పాక్‌లో చాలా కాలం పాటు అధికారం చెలాయించిన సైన్యానికి అనుకూలుడిగా ఉండటమే కాక దేశాన్ని సైన్యమే పాలించాలన్న అభిప్రాయంలో కూడా ఆయన ఉన్నారు. అంతే కాకుండా ఇస్లామిక్ సంప్రదాయాల కొనసాగింపునకు ఇమ్రాన్ సానుకూలమన్నది ఆయన ప్రకటనల్లోనే నిరూపితమవుతోంది. దేశ ప్రధాని కావాలన్న ప్రగాఢ వాంఛ ఇమ్రాన్‌కు ఉంది. పార్టీ పెట్టిన కొత్తలో ఇస్లామిక్ తీవ్రవాదానికి, అవినీతికి వ్యతిరేకంగా గొంతు విప్పారు. అయితే, 2013 ఎన్నికల్లో ఘోరంగా ఓడి పోవడంతో తన వైఖరి మార్చుకున్నారు. మత ఛాందసవాదిగా మారడంతో పాటు సైన్యానికి దగ్గరయ్యా రు. పాక్‌లోని ఉగ్ర సంస్థ హర్కతుల్ మొజాహిదీన్ అధినేత మౌలానా ఫజులుర్ రెహమాన్ వంటి వారు ఇమ్రాన్ పార్టీకి మద్దతు ప్రకటించారు. ఇమ్రాన్‌కు పాక్ సైన్యం, ఐఎస్ఐ, తాలిబాన్, ఇతర ఉగ్ర సంస్థల మద్దతు కూడా ఉందన్నది కాదనలేని వాస్తవం. సైన్యం జోక్యం పెరుగుతుంది ఒకవేళ ఇమ్రాన్ పార్టీయే అధికారంలోకి వస్తే పాలనలో మళ్లీ సైన్యం జోక్యం ప్రబలడం ఖాయమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సైన్యం పెత్తనం చేపడితే భారత్‌కు సమస్యలు తప్పవని వారి భావన. ఇమ్రాన్ అధికారంలోకొస్తే పాక్‌లోని భారత వ్యతిరేక ఉగ్రసంస్థలకు మరింత బలం చేకూరుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సైన్యంతో కలిసి పని చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఇమ్రాన్ బలంగా సంకేతాలు పంపుతున్నారని ‘ఉడ్రో విల్సన్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ స్కాలర్స్ థింక్ ట్యాంక్’ డిప్యూటీ డైరెక్టర్ మైఖేల్ కుగెల్మాన్ ఇటీవల అల్జజీరాకు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. ‘ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాకూడదనీ, హంగ్ రావాలని సైన్యం ఆశిస్తోంది. ఎవరికీ మెజారిటీ రాకపోతే తాను చక్రం తిప్పవచ్చన్నది సైన్యం ఆలోచన. ఆ పరిణామం భారత్‌కు మంచిది కాదు. పాక్‌కు కూడా ప్రయోజనకరం కాదు’ అని పేర్కొన్నారు. క్వెట్టాలో ఆత్మాహతి దాడిలో గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం లాహోర్‌లో ఓటు హక్కువినియోగించుకుంటున్న హఫీజ్ సయీద్ -
‘ఇమ్రాన్‌ఖాన్‌కు నీతి, నిజాయితీ లేదు’
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్‌పై ఆయన మాజీ భార్య రెహమ్ ఖాన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇమ్రాన్‌కు అసలు నీతి, నిజాయితీ లేదంటూ మండిపడ్డారు. తనను రెండో వివాహం చేసుకున్నసంగతిని దాచిపెట్టిన ఇమ్రాన్‌ఖాన్.. ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జర్నలిస్టు రెహంఖాన్ను 2015లో పెళ్లిచేసుకున్నఇమ్రాన్.. పదినెలలకే ఆమెతో విడిపోయి మరో పెళ్లి చేసుకున్నా ఆ కాపురం రెండు నెలలే సాగింది. ఎన్నికలకు ముందే ఇమ్రాన్ వ్యవహారంపై పుస్తకం తెచ్చేపనిలో ఉన్నారు రెహమ్ ఖాన్. అయితే రెహమ్ ఖాన్ ఆటో బయోగ్రఫీని అడ్డుకునేందుకు ఇమ్రాన్ ఖాన్ మద్దతు దారులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. కాగా, ఏది ఏమైనా ఆ పుస్తకాన్ని బయటకు తెస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నారు రెహమ్ ఖాన్. 1995లో బ్రిటన్ బిలియనీర్ కుమార్తె జెమీమా గోల్డ్‌స్మిత్‌ను వివాహమాడిన ఇమ్రాన్.. తొమ్మిదేళ్ల తర్వాత ఆమెతో విడిపోయారు. 2015లో బీబీసీ జర్నలిస్ట్ రెహమ్ ఖాన్‌ను రెండో పెళ్లి చేసుకున్నా తొమ్మిది నెలలకే ఆ బంధమూ తెగిపోయింది. ఇక మూడోదిగా మతగురువైన బుష్రా మనేకాను ఇమ్రాన్ 2018 ఫిబ్రవరిలో పెళ్లాడారు. సరిగ్గా మూడు నెలలు కూడా తిరక్కముందే బుష్రా.. ఇమ్రాన్‌తో విడిపోయారు. -
‘మూడో పెళ్లి’ లొల్లిపై స్పందన
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ క్రికెటర్, ‘పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్’ (పీటీఐ) పార్టీ అధ్యక్షడు ఇమ్రాన్ ఖాన్‌కు కోపం వచ్చింది. ముచ్చటపడి చేసుకున్న మూడో పెళ్లి పెటాకులైందంటూ మీడియాలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఆయన తరపున పార్టీ పీటీఐ స్పందించింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది. ఎలాంటి నిర్ధారణ లేకుండా ప్రచురించిన కథనాలపై పీటీఐ వర్గాలు మండిపడుతున్నాయి. తక్షణమే క్షమాపణలు చెప్పాలంటూ ఉర్దూ పత్రిక ‘రోజ్నామా ఉమ్మత్’ ఎడిటర్‌కు, మరికొన్ని వెబ్సైట్లకు లేఖలు రాసింది. కాగా, ఇమ్రాన్ తన ఆధ్యాత్మిక సలహాదారు అయిన బుష్రా మనేకాను మూడు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. అయితే గత కొంత కాలంగా ఆమె బానిగలా(ఇమ్రాన్ నివాసం)లో కనిపించటం లేదు. దీంతో ఆమె ఇళ్లు విడిచివెళ్లిపోయిందంటూ పుకార్లు మొదలయ్యాయి. మనేకా పిల్లల(అంతకు ముందు భర్త వల్ల కలిగిన సంతానం) వ్యవహారమే దీనంతటికి కారణమంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలో అసహనానికి లోనైన ఇమ్రాన్‌కు బుష్రాతో విభేదాలు తలెత్తాయని.. ఆ పరిస్థితి ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయేలా పురిగొల్పిందని రోజ్నామా ఉమ్మత్ అనే ఒక ఉర్దూ పత్రిక ప్రచురించింది. అనంతరం ఈ వార్తలు సోషల్ మీడియాలో, ఇతర పబ్లికేషన్లలో చక్కర్లు కొట్టడంతో ఇమ్రాన్‌కు కష్టాలు మొదలయ్యాయి. ‘పీటీఐ’ ఈ వ్యవహారంలో మౌనం వహిస్తూ వచ్చింది. అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యే సరికి ఇప్పుడు స్పందించింది. మరోవైపు పెంపుడు కుక్కల వ్యవహారం మనేకాకు చికాకు తెప్పించిందన్న మరో కథనం కూడా చక్కర్లు కొట్టింది. -
మూడో పెళ్లి కూడా మూన్నాళ్ల ముచ్చటే!
-
మూడో పెళ్లీ పెటాకులు.. కష్టాల్లో ఇమ్రాన్!
-
మూడో పెళ్లీ పెటాకులు.. కష్టాల్లో ఇమ్రాన్!
ఇస్లామాబాద్: ముచ్చటపడి చేసుకున్న మూడో పెళ్లి కూడా పెటాకులు కావడంతో ఇమ్రాన్ ఖాన్ కష్టాలు ఎదుర్కొంటున్నారని పాకిస్తాన్ మీడియా పేర్కొంది. పెంపుడు కుక్కలు, పిల్లల వ్యవహారాల్లో దంపతుల మధ్య విబేధాలు తలెత్తాయని, గొడవపడిన తర్వాత మూడో భార్య బుష్రా తన పుట్టింటికి వెళ్లిపోయారని వార్తలు వచ్చాయి. మరికొద్ది రోజుల్లో జాతీయ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ వ్యవహారం రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది. పిల్లలు.. పెంపుడు కుక్కలు: పాకిస్తాన్ మీడియా కథనాల ప్రకారం.. ఇమ్రాన్ పెంపుడు కుక్కల వల్ల కొత్త భార్య బుష్రా ఇబ్బందులు పడ్డారు. మతపరమైన కార్యకలాపాలకు కుక్కలు ఆటంకం మారడంతో వాటిని ఇంట్లో నుంచి పంపేయాలని భార్య కోరగా, అందుకు ఇమ్రాన్ నిరాకరించారు. బుష్రాకు మొదటి భర్త ద్వారా కలిగిన పిల్లలు ఇప్పుడు ఇమ్రాన్తోనే కలిసి ఉండటం కూడా గొడవలకు మరో కారణమని తెలిసింది. పెల్లల్ని వేరుగా ఉంచాలని పెళ్లికి ముందే ఇమ్రాన్-బుష్రాల మధ్య ఒప్పందం జరిగిందని, కానీ పరిస్థితులు అందుకు విరుద్ధంగా తయారయ్యాయని, అలా మొదలైన గొడవలు క్రమంగా పెద్దవై దంపతులు విడిపోయేదాకా వెళ్లిందని టైమ్స ఆఫ్ ఇస్లామాబాద్ పత్రిక పేర్కొంది. కాగా, ఇమ్రాన్ పెళ్లి పెటాకుల వార్తలు సోషల్ మీడియాలోనూ చర్చ జరుగుతోంది. మూడు నెలలు తిరక్కుండానే: 1995లో బ్రిటన్ బిలియనీర్ కుమార్తె జెమీమా గోల్డ్‌స్మిత్‌ను వివాహమాడిన ఇమ్రాన్.. తొమ్మిదేళ్ల తర్వాత ఆమెతో విడిపోయారు. 2015లో బీబీసీ జర్నలిస్ట్ రేహమ్ ఖాన్‌ను రెండో పెళ్లి చేసుకున్నా 9 నెలలకే ఆ బంధమూ తెగిపోయింది. ఇక మూడోదిగా మతగురువైన బుష్రా మనేకాను ఇమ్రాన్ 2018 ఫిబ్రవరిలో పెళ్లాడారు. సరిగ్గా మూడు నెలలు కూడా తిరక్కముందే ఇలా జరగడంపై కుటుంబీకులు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. -
ఇమ్రాన్ ఖాన్‌పై దాడి
లాహోర్ : ఇటీవలే మూడోపెళ్లిచేసుకుని, రెండో భార్య ఆరోపణలతో ఇబ్బందులపాలైన మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌కు మరో చేదుఅనుభవం ఎదురైంది. పాకిస్తాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్(పీటీఐ) మంగళవారం గుజరాత్(పంజాబ్ ఫ్రావిన్స్)లో నిర్వహించిన సభలో ఆయనపై చెప్పులతో దాడి జరిగింది. వాహనం టాప్‌పైన నిలబడి ప్రసంగిస్తున్న సమయంలో ఇమ్రాన్పైకి ఓ యువకుడు బూటువిసిరాడు. అయితే అదికాస్తా గురితప్పి పక్కనున్న నాయకుడికి తగిలింది. వెంటనే అప్రమత్తమైన పీటీఐ కార్యకర్తలు.. షూ విరిసిన వ్యక్తిని పట్టుకుని చితకబాదాదిన తర్వాత పోలీసులకు అప్పగించారు. బూటుదాడి జరగడంతో ఇమ్రాన్ తన ప్రసంగాన్ని కాస్త ముందుగానే పూర్తిచేసి వెళ్లిపోయారు. వరుస దాడులతో నేతల బెంబేలు : పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న తరుణాన అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే ముఖ్యనేతలంతా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇదే అదనుగా వారివారి వ్యతిరేకులు ఆందోళనలు, దాడులకు పాల్పడుతున్నారు. నిన్నటికి నిన్న పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై బూటు దాడి జరింది. అంతకు కొద్ది రోజుల ముందే విదేశాంగ శాఖ మంత్రి ఖవాజాపై ఓ యువకుడు చెప్పులు విసిరాడు. ఇక ఇమ్రాన్పైనేతే.. గతవారం కూడా ఓ బూటుదాడి జరిగింది. -
సీనియర్ జర్నలిస్టు కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ సీనియర్ జర్నలిస్టు రంజన్ రాయ్ (57) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన శనివారం చనిపోయారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం ఉదయం ముగిశాయి. పెద్ద సంఖ్యలో ఆయన బంధువులు, స్నేహితులు హాజరై చివరిసారిగా వీడ్కోలు పలికారు. రంజన్ రాయ్ పాత్రికేయ వృత్తిలోకి 1982లో అడుగుపెట్టారు. ఢిల్లీలోని ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ), కౌలాలంపూర్, న్యూయార్క్ లోని అసోసియేటెడ్ ప్రెస్‌లలో పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. 2014 టైమ్స్ న్యూస్ నెట్ వర్క్‌లో చేరారు. టైమ్స్ న్యూస్ నెట్ వర్క్ అధికారిగా, జాతీయ పత్రికా ఎడిటోరియల్ బోర్డులో సభ్యుడిగా పనిచేశారు. ఢిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ, యూఎస్‌లోని ప్రిన్స్టన్ యూనివర్సిటీ విద్యాభ్యాసం పూర్తి చేశారు. కాగా, రంజన్ చనిపోయిన సందర్భంగా ఆయన సేవలను టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రత్యేక సంస్మరణ కార్యక్రమంలో గుర్తుచేసుకుంది. 1980-90ల్లో రంజన్‌తో కలిసి పనిచేసిన పీటీఐ ఎడిటర్ ఇన్-చీఫ్ విజయ్ జోషి ఆయన మృతికి సంతాపం తెలుపుతూ రంజన్ మంచి జర్నలిస్టు మాత్రమే కాకుండా ఓ నిరసనకారుడు కూడా అన్నారు. ఆయన రిపోర్టర్‌గా ఇంకా సంతృప్తి పొందలేదని చెప్తుండేవారని, చదువుకునే రోజుల్లో ఆయన చాలా తెలివిగా ఉండేవారని, బలమైన దృక్పథాల్ని కలిగి ఉండేవారని కొనియాడారు. -
స్నేహితురాలితో రహస్యంగా మూడో పెళ్లి..?
లాహోర్ : మాజీ క్రికెటర్, పాకిస్తాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్(65) రహస్యంగా మూడోపెళ్లి చేసుకున్నారన్న వార్త పొరుగుదేశంలో చర్చనీయాంశమైంది. ఖాన్‌కు ఆథ్యాత్మిక సలహాదారుగానేకాక, స్నేహితురాలిగానూ కొనసాగుతోన్న మహిళను జనవరి 1న పెళ్లాడినట్లు పలు వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఖాన్ ఆంతరంగికులు కొందరు మాత్రమే వివాహతంతులో పాల్గొన్నట్లు తెలిపాయి. 1992లో పాక్ జట్టుకు క్రికెట్ ప్రపంచ కప్ సాధించిపెట్టిన తర్వాత విపరీతమైన క్రేజ్‌ను పొందిన ఇమ్రాన్.. తొలుత బ్రిటిష్ జర్నలిస్టు జెమీమాను పెళ్లాడారు. తొమ్మిదేళ్ల తర్వాత ఆమెతో విడిపోయిన ఖాన్.. జర్నలిస్టే అయిన రేహమ్‌ను(2015లో) రెండోపెళ్లి చేసుకున్నారు. పట్టుమని 10 నెలలైనా గడవకముందే ఆ బంధం కూడా తెగిపోయింది. కొంతకాలంగా ఆయన ఒంటరిగా ఉంటున్నారు. అవన్నీ అవాస్తవాలు : కాగా, ఇమ్రాన్ మూడోపెళ్లి విషయంలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని పీటీఐ ప్రతినిధులు అన్నారు. ‘‘కొందరు పనిగట్టుకొని ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారు. ప్రస్తుతం ఆయన(ఇమ్రాన్) దృష్టంతా 2018 ఎన్నికలపైనే ఉంది. ఒకవేళ మూడో పెళ్లంటూ చేసుకుంటే ఎన్నికల తర్వాతే చేసుకుంటారు’’ అని ఖాన్ సన్నిహితులు స్పష్టతనిచ్చారు. -
నా పేరు ఖాన్.. నేను ఉగ్రవాదిని కాదు!
ఇస్లామాబాద్: ఒకప్పటి క్రికెటర్, పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ బాలీవుడ్‌ను స్ఫూర్తిగా తీసుకొని చెప్పిన డైలాగ్ ఇది. 2014లో పాకిస్థాన్ టెలివిజన్ (పీ టీవీ) ప్రధాన కార్యాలయంపై దాడుల కేసులో ఇమ్రాన్‌ఖాన్ మంగళవారం బెయిల్ వచ్చింది. ఈ సందర్భంగా బాలీవుడ్ సినిమా ’మై నేమ్ ఈజ్ ఖాన్’ సినిమాలోని ప్రముఖ డైలాగ్ ’మై నేమ్ ఈజ్ ఖాన్.. ఐ యామ్ నాట్ టెర్రరిస్ట్ (నా పేరు ఖాన్.. నేను ఉగ్రవాదిని కాదు)ను ఇమ్రాన్ ఖాన్ ఉటంకించారు. ‘నాపేరు ఖాన్, నేను ఉగ్రవాదిని కాదు. నేను సత్యవాదిని, మంచి వ్యక్తిని అని సుప్రీంకోర్టు పేర్కొంది’ అని ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ అభ్యర్థనను ఇస్లామాబాద్‌లోని ఉగ్రవాద నిరోధక కోర్టు (ఏటీసీ) ఆమోదించింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఇమ్రాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాను ఎదుర్కొన్న కోర్టు విచారణలో షరీఫ్ సగం కూడా ఎదుర్కోలేదని, తన జీవితంలో ఎవరి సొమ్మును దోచుకోలేదని ఇమ్రాన్ అన్నారు. -
మహిళ నేతకు ఇమ్రాన్ అశ్లీల మెసేజ్‌లు!
వేధిస్తున్నారంటూ పార్టీ చీఫ్‌కు మహిళా నేత ఝలక్ ఇస్లామాబాద్: పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ.. ఆ పార్టీ మహిళ నేత ఎంఎన్ఏ ఆయేషా గులాలై రాజీనామా చేశారు. మాజీ క్రికెటర్ అయిన ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యక్తిత్వం లేదని, ఆయన తనకు, పార్టీలోని ఇతర మహిళా నేతలకు అశ్లీల, అసభ్య సందేశాలు పంపేవారని ఆమె మండిపడ్డారు. పాక్ నూతన ప్రధానిగా అబ్బాస్సీ ప్రమాణం చేసిన సమయంలోనే ఆమె ఈ విధంగా పీటీఐకు గుడ్‌బై చెప్పారు. వ్యక్తిత్వం, గౌరవమర్యాదలే తనకు ముఖ్యమని, ఆ విషయంలో రాజీపడలేకే పీటీఐకి రాజీనామా చేస్తున్నానని ఆమె స్పష్టం చేశారు. 'పీటీఐలో మహిళా శ్రేణులకు గౌరవం లేదు. గౌరవప్రదమైన మహిళలెవరూ పార్టీలో పనిచేయలేరు' అని ఆమె అన్నారు. అయితే, ఆమె ఆరోపణలను పీటీఐ మహిళా నేత, చీఫ్ విప్ షిరీన్ మజారీ తోసిపుచ్చారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆయేషాకు టికెట్ నిరాకరించడంతోనే ఆమె ఈ ఆరోపణలు చేశారని, పార్టీలోని మహిళలందరినీ ఇమ్రాన్‌ఖాన్ గౌరవిస్తారని ఆమె చెప్పారు. -
మోదీ కృషి అద్భుతం: అమెరికా
వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చింది మొదలు ఇప్పటివరకు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఎంతో కృషిచేస్తున్నారని అయితే బ్యూరోక్రాట్ల తీరే సరిగా లేదని, వారి రెడ్టేపిజమే పెట్టుబడులు రావడానికి అవరోధంగా మారిందని అమెరికా అధ్యక్ష కార్యాలయం పేర్కొంది. భారత్‌లో ఒకవైపు పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం, మరోవైపు రెడ్టేపిజం సమాంతరంగా నడుస్తున్నాయని అమెరికా అధ్యక్షుడి ప్రత్యేక సహాయకుడు, జాతీయ భద్రతా మండలిలో దక్షిణాసియా వ్యవహారాల డెరైక్టర్ పీటర్ లెవోయ్ అన్నారు. కీలకాంశాల్లో గతంలో భారత్‌లో ఏ ప్రభుత్వం కూడా తీసుకోనంతగా ఇప్పుడు మోదీ సర్కారు సత్వర నిర్ణయాలు తీసుకుంటోందని పీటీఐకి తెలిపారు. -
స్టాక్ మార్కెట్లో ఎల్ఐసీకి లాభాల పంట...
ముంబై : స్టాక్ మార్కెట్లో పెట్టుబడులపై ఎల్ఐసీ గత ఆర్థిక సంవత్సరంలో భారీ లాభాలను కళ్లజూసింది. దేశీయ అతి పెద్ద సంస్థాగత ఇన్వెస్టర్ అయిన ఎల్ఐసీ గత ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై రూ.24,373 కోట్ల లాభాలార్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం వచ్చిన లాభాల(రూ.21,257 కోట్ల)తో పోల్చితే 15 శాతం వృద్ధి సాధించింది. 2013-14 ఆర్థిక సంవత్సరం కంటే గత ఆర్థిక సంవత్సరంలో రూ.7,328 కోట్లు తక్కువగా పెట్టుబడులు పెట్టినప్పటికీ, లాభాలు 15 శాతం వృద్ధి సాధించడం విశేషం. 2013-14లో ఎల్ఐసీ స్టాక్ మార్కెట్లో రూ.54,330 కోట్లు ఇన్వెస్ట్ చేయగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.47,002 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఈ వివరాలను ఎల్ఐసీ చైర్మన్ ఎస్. కె. రాయ్ ఇటీవల పీటీఐకి వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్ 25 శాతానికి పైగా వృద్ధి సాధించడంతో ఈ స్థాయి రాబడులు వచ్చాయని నిపుణులంటున్నారు. దాదాపు రూ.2 లక్షల కోట్ల హోల్డింగ్స్‌తో ఎల్ఐసీ భారత స్టాక్ మార్కెట్లో అతి పెద్ద ఇన్వెస్టర్‌గా అవతరించింది. పలు బ్లూచిప్ షేర్లలో చెప్పుకోదగ్గ వాటా ఎల్ఐసీకి ఉంది. 30 కోట్ల మంది పాలసీదారులతో 17.7 లక్షల కోట్ల ఆస్తులతో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. -
కంపెనీల చట్టంపై వచ్చేవారం నిపుణుల కమిటీ
న్యూఢిల్లీ: ఎటువంటి ఇబ్బందులు లేకుండా వ్యాపారం నిర్వహించడానికి సంబంధించి కంపెనీల చట్టంలో సవరణలను ప్రతిపాదించడానికి వచ్చేవారం ఒక నిపుణుల కమిటీని నియమించనున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడించారు. 2013 కంపెనీల చట్టంలో దాదాపు 50 ప్రొవిజన్లు అసమంజసంగా ఉన్నాయని, ఇవి కంపెనీల కార్యకలాపాల్లో కొంత ఇబ్బందికరంగా ఉన్నాయని ఆర్థికమంత్రి పిటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆయా నియమ నిబంధనలన్నింటినీ పరిశీలించి తగిన సిఫారసులను చేయడానికి నిపుణుల కమిటీని నియమిస్తున్నట్లు జైట్లీ పేర్కొన్నారు. ఈ సిఫారసుల ప్రాతిపదికన మరోదఫా సవరణలకు కేంద్రం శ్రీకారం చుడుతుందని అన్నారు. 2013 కంపెనీల చట్టంలో దాదాపు 450కి పైగా క్లాజ్లు ఉన్నాయి. సరళతరమైన రీతిలో ఇన్‌కమ్‌ట్యాక్స్ రిటర్న్ ఫామ్స్ (ఐటీఆర్)ను రూపొందిస్తామన్నారు. -
మీ హక్కులపై పోరాడండి:ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్: మాజీ క్రికెటర్, పాకిస్థాన్ తెహరిక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ మరోసారి పాకిస్థాన్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. పాకిస్థాన్ లో పాలనే లేదని.. ప్రజలు అక్కడి ప్రభుత్వాన్ని ఎప్పుడో తిరస్కరించారని ఇమ్రాన్ అభిప్రాయపడ్డాడు. పీటీఐ ఆధ్వర్యంలో ఈనెల 30 వ తేదీన జరప తలపెట్టిన భారీ ర్యాలీకి జన సమీకరణలో భాగంగా ప్రజల ముందుకొచ్చిన ఇమ్రాన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. 'పాకిస్థాన్ ప్రజలు వారి హక్కులపై నిలబడాలి. ప్రజల హక్కులను విస్మరిస్తున్న ప్రభుత్వంపై ప్రజలు పోరాడాలి' అని ఆయన విజ్ఞప్తి చేశారు. దేశానికి దిశా నిర్దేశం చేసేది మహిళలు, యువతేనని ఇమ్రాన్ ఈ సందర్భంగా స్పష్టం చేశాడు. పాకిస్తాన్ ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని.. తాను చేపట్టబోయే ర్యాలీని సక్సెస్ చేసి సరికొత్త కొత్త పాకిస్థాన్ కు నాంది పలకాలన్నాడు. -
రేటు కోత ఉండకపోవచ్చు: ఎస్బీఐ చీఫ్
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిసెంబర్ 2 తన పరపతి విధాన సమీక్ష సందర్భంగా పాలసీ రేటును తగ్గించకపోవచ్చన్న అభిప్రాయాన్ని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చీఫ్ అరుంధతీ భట్టాచార్య గురువారం పేర్కొన్నారు. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికల్లా ఆర్బీఐ తన కఠిన పరపతి విధానాన్ని విడనాడే అవకాశం ఉందని కూడా అంచనావేశారు. ద్రవ్యోల్బణానికి సంబంధించి ఆర్బీఐ విధానంపై ‘బేస్ ఎఫెక్ట్’ అంశం ప్రభావితం చూపే అవకాశం ఉంటుందని అన్నారు. డీఅండ్‌బీ అంచనా ఇదీ... నవంబర్‌లో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం రేటు 1.8 శాతం నుంచి 2 శాతం శ్రేణిలో నమోదయ్యే అవకాశం ఉందని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ (డీఅండ్‌బీ)ఇండియా ఒక నివేదికలో పేర్కొంది. తగిన పరిశీలన చేశాకే ఎంవోయూ కుదుర్చుకున్నాం అదానీ గ్రూప్ రుణంపై వివరణ అదానీ గ్రూప్‌నకు రుణమిచ్చేందుకు కేవలం అవగాహనా ఒప్పందాన్ని(ఎంవో యూ) మాత్రమే కుదుర్చుకున్నామని, తగిన పరిశీలన చేశాకే నిధులను విడుదల చేస్తామని ఎస్బీఐ ప్రకటన ఒకటి తెలిపింది. ఆస్ట్రేలియాలోని కార్మైఖేల్ బొగ్గు మైనింగ్ ప్రాజెక్ట్‌కు సంబంధించి అదానీ గ్రూప్‌నకు ఎస్బీఐ 100 కోట్ల డాలర్ల(సుమారు రూ. 6,200 కోట్లు) రుణంఇచేందుకు ఇటీవలే ఎంవోయూ కుదుర్చుకుంది. ప్రధాని మోదీ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా జరిగిన ఈ అంశంపై ఇప్పటికే పలు విమర్శలు చెలరేగిన నేపథ్యంలో ఎస్బీఐ వివర ణకు ప్రాధాన్యత ఏర్పడింది. చైర్పర్సన్ అరుంధతీ కూడా ఇదే విధమైన వివరణ ఇచ్చారు. -
బంగారు నాణాలు, కడ్డీలు విక్రయించవద్దు: జీజేఎఫ్
ముంబై: బంగారు నాణాలు, కడ్డీల విక్రయాలను నిలిపేయాలని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యూవెలరీ ట్రేడ్ ఫెడరేషన్(జీజేఎఫ్) తన సభ్యులను కోరుతోంది. బంగారం దిగుమతులపై ఆంక్షలు ప్రభుత్వం విధించకుండా ఉండటానికి ఈ విక్రయాలను ఆపేయాలని ఈ సంస్థ ప్రతిపాదిస్తోంది. గత నెలలో బంగారం దిగుమతులు బాగా పెరిగిన నేపథ్యంలో పుత్తడి దిగుమతులపై ఆంక్షలను విధించడమే కాకుండా కొన్ని ప్రైవేట్ ట్రేడింగ్ కంపెనీలపైనా ఆంక్షలను విధించాలని ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం. కాగా ఈ ఏడాది బంగారం దిగుమతులు 850 టన్నులుగా ఉంటాయని, వీటిల్లో నాణాలు, కడ్డీల వాటా 200-250 టన్నుల రేంజ్లో ఉండొచ్చని జీజేఎఫ్ డెరైక్టర్ బచ్చరాజ్ బమల్వ అంచనా వేస్తున్నారు. వాణిజ్య లోటు భారీగా పెరిగిపోవడంతో బంగారంపై దిగుమతి సుంకాన్ని 10 శాతానికి గత ఏడాది ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. అయితే, దీనిని 2 శాతానికి తగ్గించాలని బంగారం వర్తకులు కోరుతున్నారు. -
దమ్ముంటే అరెస్ట్ చేసి చూడండి: ఇమ్రాన్
ఇస్లామాబాద్: దమ్ముంటే అరెస్ట్ చేసి చూడాలని పాకిస్థాన్ ప్రభుత్వానికి మాజీ క్రికెటర్, పాకిస్థాన తెహరిక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ సవాల్ విసిరారు. పాకిస్థాన్ పార్లమెంట్, పీటీవీ భవనంపై దాడి కేసులో యాంటీ టెర్రిరిజం కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ తీసుకోవడానికి ఇమ్రాన్ నిరాకరించారు. నా అరెస్ట్ వారెంట్ గురించి ఓ శుభవార్త విన్నాను. దాడి జరిగిన రోజున నేను కంటైనర్ లో నిద్ర పోతున్నాను. ఆ ఘటనతో నాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నాను అని పాక్ ఆన్ లైన్ న్యూస్ పేపర్ కిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. నవంబర్ 30న ఇస్లామాబాద్ లో బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి పీటీఐ చేస్తున్న ఏర్పాట్లు చూసి 'మియా సాబ్' (పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్) భయపడినట్టున్నాడు. అందుకే ప్రభుత్వం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది అని అన్నారు. తనకు జైలులో ఉండటం అంత కష్టమైన పని కాదని, మూడు నెలలు కంటైనర్ లో ఉన్నానని, ఒకవేళ తనను అరెస్ట్ చేస్తే నవాజ్ భారీ మూల్యం చెల్లించుకుంటాడని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించారు. -
ఇమ్రాన్, మియాందాద్ లు ఒక్కటయ్యారు!
ఇస్లామాబాద్: పాకిస్థాన్ తెహరీక్ ఏ ఇన్పాఫ్ (పీటీఐ) అధినేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ కు తన సహచర ఆటగాడు జావేద్ మియాందాద్ బాసటగా నిలిచారు. పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్న ఇమ్రాన్ ఖాన్ కు మియాందాద్ మద్దతు తెలిపారు. దేశ రాజకీయాలు సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో ఇమ్రాన్ కు మియాందాద్ తోడుగా నిలవడం మీడియాలో కథనాల్ని ప్రముఖంగా ప్రచురించారు. ఇమ్రాన్ జాతీయ సమైకత్య కోసం పాటుపడే గొప్ప నాయకుడు అని జావెద్ అన్నారు. దేశం భవిష్యత్ కోసం ఆయన చూసిన తపన, నిజాయితీని ఎవరూ శంకించలేరు అని జావెద్ తెలిపారు. పాకిస్థాన్ లో మార్పుకు, ప్రజలను చైతన్య పరిచే శక్తి ఇమ్రాన్ లో ఉందని.. అందుకే ఆయనకు మద్దతు తెలుపుతున్నానని ఆయన ప్రకటించారు. గతంలో పాక్ క్రికెట్ జట్టులో వీరిద్దరి మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే. 1986 లో షార్జాలో జరిగిన ఓ టోర్ని ఫైనల్ మ్యాచ్ లో జావెద్ మియాందాద్ సిక్స్ కొట్టి సంచలన విజయాన్ని పాకిస్థాన్ కు అందించారు. -
నూతన పాకిస్తాన్ లోనే నా పెళ్లి!
ఇస్లామాబాద్: ‘నూతన పాకిస్తాన్’ అనే తన స్వప్నం నెరవేరిన తరువాతే వివాహం చేసుకుంటానని పాకిస్తాన్ మాజీ క్రికెటర్, పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ రాత్రి స్పష్టం చేశారు. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ రాజీనామా చేయాలంటూ వేలాది మద్దతుదారులతో ఇమ్రాన్‌ఖాన్ ఇస్లామాబాద్‌లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ‘ఒక నూతన పాకిస్తాన్‌ను రూపొందించాలనుకుంటోంది కేవలం మీ కోసమే కాదు. నా కోసం కూడా. ఆ స్వప్నం నెరవేరగానే నేను పెళ్లి చేసుకుంటాను’ అని పార్లమెంటు భవనం ఎదుట మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ 62 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలతో ఆ ప్రాంగణమంతా హర్షధ్వానాలతో దద్దరిల్లింది. 1995లో బ్రిటన్ కు చెందిన జెమీమా గోల్డ్‌స్మిత్‌ను వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు కలిగాక, 2004లో పరస్పర అంగీకారంతో వారిద్దరూ విడిపోయారు. -
షరీఫ్ గద్దె దిగిపో: ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను వెంటనే గద్దె దిగిపోవాలని పాకిస్థాన్ తెహరీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో రిగ్గింగ్ కేసు విచారణ జరుగుతున్నందున్న పదవి నుంచి తప్పుకోవాలని ఇమ్రాన్ సూచించారు. షరీఫ్ రాజీనామాపై ప్రభుత్వంతో ఇమ్రాన్ ఖాన్ పార్టీ మూడో దఫా జరిపిన చర్చలు కొలిక్కి రాకపోవడంతో ప్రతిష్టంభన నెలకొందని ఓ ప్రతిక కథనాన్ని వెల్లడించింది. ఇస్లామాబాద్ లో నిర్వహించిన ఓ సభలో ఇమ్రాన్ మాట్లాడుతూ.. షరీఫ్ రాజీనామా సమర్పించి.. కొత్తగా ఎన్నికలు నిర్వహించాలి అని అన్నారు. -
త్వరలో యూటీఐ మ్యూచువల్ ఫండ్ ఐపీవో!
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత ప్రాచీనమైన మ్యూచువల్ ఫండ్ హౌస్ యూటీఐ త్వరలో పబ్లిక్ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు వీలుగా మరోసారి ఐపీవో ప్రణాళికలను పునరుద్ధరించే ప్రయత్నాల్లో యూటీఐ ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై ఆర్థిక శాఖ నుంచి త్వరలో ఆమోదముద్ర లభించనున్నట్లు సమాచారం. యూటీఐ మ్యూచువల్ ఫండ్ నుంచి వచ్చిన ఐపీవో ప్రతిపాదనను ఆర్థిక శాఖ పరిశీలిస్తున్నదని తెలుస్తోంది. పరిశీలన పూర్తయ్యాక ఆర్థిక శాఖ నుంచి ముందస్తు అనుమతి లభించే అవకాశమున్నదని ఆ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వానికి 74% వాటా వివిధ బ్యాంకులు, బీమా సంస్థల ద్వారా యూటీఐ మ్యూచువల్ ఫండ్‌లో ప్రభుత్వం 74% వాటాను కలిగి ఉంది. ప్రభుత్వం తరఫున స్టేట్‌బ్యాంక్(ఎస్బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎల్ఐసీ సంయుక్తంగా యూటీఐలో ఈ వాటాను కలిగి ఉన్నాయి. మిగిలిన 26% వాటా యూఎస్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ టీ రోవ్ ప్రైస్ చేతిలో ఉంది. నిజానికి 2008లో యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ సంస్థ మార్కెట్ పరిస్థితులు అనుకూలించక ఐపీవో ప్రతిపాదనను వాయిదా వేసుకుంది. అప్పట్లో 4.8 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించాలని ప్రతిపాదించింది. ఆపై 2009లో నాలుగు స్పాన్సర్ సంస్థల నుంచి 6.5% వాటా చొప్పున మొత్తం 26% వాటాను టీ రోవ్ కొనుగోలు చేసింది. లిస్టింగ్ చేయడం ద్వారా పబ్లిక్కు కనీసం 25% వాటా నిబంధనను అమలు చేసేందుకు వీలు చిక్కుతుందని వివరించాయి. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం(2014-15) క్యూ1(ఏప్రిల్-జూన్) చివరికల్లా యూటీఐ ఎంఎఫ్ నిర్వహణలోని ఆస్తుల విలువ(ఏయూఎం) రూ. 79,441 కోట్లుగా నమోదైంది. -
సైనిక పాలనకు వ్యతిరేకం: ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో సైనిక పాలనకు తాను వ్యతిరేకమని పాకిస్థాన్ తెహ్రరిక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ అన్నారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు సైనిక పాలన పరిష్కారం కాదని ఆయన అన్నారు. సైనిక పాలనకు ఇమ్రాన్ మొగ్గు చూపుతున్నారని వస్తున్న వార్తలను ఇమ్రాన్ ఖండించారు. హింసాత్మక సంఘటల్ని తాము కోరుకోవడం లేదని ఇస్లామాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. ప్రజల ఆందోళనలు, నిరసనల్ని అడ్డుకోలేక విఫలమైన పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ సైనిక పాలన వైపుకు అడుగులేస్తున్నారని ఇమ్రాన్ ఆరోపించారు. ప్రజల హక్కులను సైనిక పాలన ద్వారా అణిచివేయాలని చూస్తే ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. -
రుణాల రీషెడ్యూల్కు అవకాశం లేదా?
హైదరాబాద్: సగటు పంట దిగుబడి 50 శాతం కన్నా తక్కువగా ఉంటేనే వ్యవసాయ రుణాల రీషెడ్యూల్కు అర్హత ఉంటుందని ఆర్బిఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీపాలి పంత్ జోషి ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. రుణాల రీషెడ్యూల్ కోసం ఏపీ సర్కారు చెబుతున్న కారణాలు అంగీకారయోగ్యంగా లేవని రిజర్వ్‌బ్యాంక్ పేర్కొన్నట్లు పిటీఐ తెలిపింది. ఏపీ సర్కార్‌కు ఇది పెద్ద షాక్ అని పీటీఐ తన కథనం వివరించింది. జులై 26న ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవిఆర్ కృష్ణారావు ఆర్బిఐకి లేఖ రాశారు. ఆ లేఖకు ఆర్బిఐ స్పందించింది. రైతుల బ్యాంకు ఖాతాలు పరిశీలించామని ఆ లేఖలో దీపాలి పంత్ జోషి తెలిపారు. ఆర్బిఐ మార్గదర్శకాల ప్రకారం 2013 ఖరీఫ్ దిగుబడులను పరిగణలోకి తీసుకున్నట్లు ఆర్బిఐ పేర్కొంది. గడచిన నాలుగేళ్ల సగటుతో పోలిస్తే దిగుబడులు ఎక్కువగానే ఉన్నాట్లు తెలిపింది. దీంతో రుణాల రీషెడ్యూల్పైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయ, డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామన్న చంద్రబాబు నాయుడు ఎన్నికల వాగ్ధానాలు నమ్మి రైతులు, మహిళలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత రుణాల రద్దు మాటను పక్కనపెట్టి, రీషెడ్యూల్ అని చంద్రబాబు చెప్పడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఆ రీషెడ్యూల్ కూడా రద్దుపై కూడా అనుమానాలు వ్యక్తం కావడంతో రైతులు ఏమీ తోచని స్థితిలో అయోమయంలో పడ్డారు. -
రుణ మాఫీలతో మాపై మరింత ఒత్తిడి
ముంబై: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతిపాదిత వ్యవసాయ రుణ మాఫీలపై ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య మరోసారి తీవ్రంగా స్పందించారు. ఇలాంటి వాటి వల్ల బ్యాంకులపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న తమ వ్యవసాయ రుణాల పోర్ట్‌ఫోలియోపై.. రుణ మాఫీ అంశం కారణంగా తొలి త్రైమాసికంలో మరింత ప్రతికూల ప్రభావం పడగలదని వ్యాఖ్యానించారు. ‘క్యూ1లో వ్యవసాయ రుణాల పోర్ట్‌ఫోలియోపై ఒత్తిడి పెరిగితే దానికి కచ్చితంగా రుణ మాఫీ(ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో) అంశమే తప్ప వర్షాభావ పరిస్థితులు కారణం కాబోవు. ఎందుకంటే, వర్షాభావ ప్రభావం అంత త్వరగా కనిపించదు’ అని అరుంధతి భట్టాచార్య పేర్కొన్నారు. గురువారం ఎస్బీఐ 59వ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాలొన్న సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలపై ఆమె ఈ విధంగా స్పందించారు. రుణ మాఫీ అంశం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సమస్యలు సృష్టిస్తోందని, ఇప్పటికే రైతులు బకాయిలు కట్టడం ఆపేశారని అరుంధతి తెలిపారు. మరోవైపు, స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్న నేపథ్యంలో నిరర్ధక ఆస్తుల సమస్య కొంత తగ్గుముఖం పట్టగలదని అరుంధతి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది(2014-15) రుణాల మంజూరీలో 15-16% మేర వృద్ధి నమోదు చేయాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నామన్నారు. ప్రస్తుతానికైతే బ్యాంకు వద్ద తగినంత మూలధనం ఉందని చెప్పారు. -
ఇమ్రాన్ ఖాన్ యూటర్న్
ఇస్లామాబాద్: క్రికెటర్, రాజకీయవేత్త ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహరిక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) మాటమార్చింది. ఉత్తర వజీరుస్తాన్ లోని పాకిస్థాన్ కు చెందిన తాలిబాన్ మిలిటెంట్లపై మిలటరీ ఆపరేషన్ కు మద్దతు తెలుపాలని నిర్ణయించుకుంది. పార్టీ కోర్ కమిటీ సమావేశంలో భేటి తర్వాత, సీనియర్ల లీడర్ల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఉత్తర వజీరుస్థాన్ లో మిలటరీ ఆపరేషన్ ను ఇమ్రాన్ వ్యతిరేకించింది. మిలటరీ ఆపరేషన్ నిర్వహిస్తే అదొక ఆత్మహత్యా సదృశ్యం అని ఇమ్రాన్ గతవారం వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంతంలో గత పదేళ్లలో జరిగిన హింసాత్మక సంఘటనల్లో 50 వేల మంది ప్రజలు మృత్యువాత పడినట్టు పాకిస్థాన్ రక్షణ శాఖ వెల్లడించింది. కరాచీ ఎయిర్ పోర్ట్ పై దాడి ఘటనలో 37 మంది మృతి చెందడానికి కారణమైన పాకిస్థానీ తాలిబాన్ గ్రూప్ పై ఆదివారం నుంచి పాక్ ప్రభుత్వం పెద్ద ఎత్తున మిలటరీ ఆపరేశన్ నిర్వహించింది -
ఫండ్స్‌లో నేతల పెట్టుబడుల జోరు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ పథకాలవైపు సామాన్య ప్రజల్ని ఆకర్షించేందుకు, వారిచేత పెట్టుబడులు చేయించేందుకు ప్రభుత్వం, సెబీ వంటి నియంత్రణ సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలిస్తున్నాయో లేదో కానీ పెద్ద సంఖ్యలో రాజకీయ నాయకులు మాత్రం మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టినట్లు ఎన్నికల అఫిడవిట్లు వెల్లడిస్తున్నాయి. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ లాంటి కాంగ్రెస్ దిగ్గజాలతో సహా అరుణ్‌జైట్లీ, వరుణ్‌గాంధీ తదితర బీజేపీ నేతలు కూడా భారీగానే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌చేశారు. ఫండ్స్‌లో లక్షలు కుమ్మరించినవారిలో కాంగ్రెస్, బీజేపీతో పాటు అన్ని పార్టీల నేతలూ ఉన్నారు. అమర్‌సింగ్, జ్యోతిరాదిత్య సింధియా, అంబికాసోనీ, శశిథరూర్ లతో పాటు కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసిన మాజీ బ్యాంకర్ మీరా సన్యాల్, ఇన్ఫోసిస్ మాజీ ఎగ్జిక్యూటివ్ వీబాలకృష్ణన్, భారత సాకర్జట్టు మాజీ కెప్టెన్ భైచుంగ్ భుటియా , బీజేపీ అభ్యర్ధి డ్రీమ్‌గర్ల్ హేమమాలిని కూడా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీపడుతున్న అభ్యర్థుల అఫిడవిట్లు పరిశీలిస్తే లక్షల్లోనే కాదు, కొందరు అభ్యర్థులు కోట్ల రూపాయల్లో వివిధ మ్యూచువల్ ఫండ్ స్కీముల్లో ఇన్వెస్ట్ చేసినట్లు తేలింది. మోడీ దూరం... అయితే బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్ధి నరేంద్రమోడీ, ఆమ్ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్,బీజీపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, సమాజ్‌వాదీ పార్టీ సుప్రిమో ములాయంసింగ్‌యాదవ్,బీజేపీ ఫైర్‌బ్రాండ్ ఉమాభారతి మ్యూచువల్ ఫండ్స్‌కు దూరంగానే ఉన్నారు. కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్‌గాంధీ అఫిడవిట్ ప్రకారం ఆయన రూ.81 లక్షలు ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌చేస్తే ఆయన త ల్లి, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ రూ.82 లక్షలు వివిధ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌చేశారు. 2009 ఎన్నికల్లో వీరిద్దరు దాఖలు చేసిన అఫిడవిట్ల ప్రకారం అప్పుడు వీరికి ఫండ్స్‌లో ఎలాంటి పెట్టుబడులు లేవు. సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత, ఫతేపూర్ సిక్రీ నుంచి రాష్ట్రీయ లోక్‌దళ్ నేత అభ్యర్థిగా బరిలో దిగిన 58 ఏళ్ల అమర్‌సింగ్ తనకు రూ.100 కోట్ల అస్తులున్నట్లు ప్రకటించారు. అందులో రూ.41 కోట్లు చరాస్తులు కాగా, రూ.6.27 కోట్లు మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులున్నాయి. మరో బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ తాను రూ.2 కోట్లు ఫండ్స్ స్కీముల్లో పెట్టుబడులు చేసినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ పేరుమీద ఫండ్స్‌లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ లేకున్నా ఆయన సతీమణి పేర రూ.2 లక్షలున్నట్లు అఫిడవిట్లో తెలిపారు. మక్కువ చూపుతున్న కొత్త తరం... ఇప్పటికీ, బ్యాంకు డిపాజిట్లు, బంగారంలో మాత్రమే ఇష్టంగా పెట్టుబడులు చేసే పాతతరంతో పోలిస్తే కొత్త తరం ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌చేసేందుకు ఎక్కువ మక్కువ చూపుతున్నారని ఇదే ట్రెండ్ రాజకీయ నేతలకు కూడా వర్తిస్తుందని మ్యూచువల్ఫండ్ హౌసెస్ టాప్ ఎగ్జిక్యూటివ్స్ వెల్లడించారు. గ్వాలియర్ మహారాజాల వంశస్తుడు, విద్యుత్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఆయన కుటుంబీకుల మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ రూ.67 లక్షలు దాటలేదు. నాగాలాండ్ ముఖ్యమంత్రి, నైఫూరియో పవర్ సెక్టార్‌కు చెందిన వివిధ ఫండ్ స్కీముల్లో దాదాపు రూ.17 లక్షల దాకా ఇన్వెస్ట్ చేశారు. డార్జిలింగ్ నుంచి బరిలో ఉన్న ఫుట్‌బాల్ ఛాంపియన్ భుటియా మ్యూచువల్ ఫండ్స్‌లో 4లక్షలు ఇన్వెస్ట్చేశాడు. బ్యాంకింగ్ రంగంనుంచి రాజకీయాల్లోకి వచ్చిన ముంబై సౌత్ ఆమ్ఆద్మీపార్టీ అభ్యర్థి మీరా సన్యాల్ షార్ట్‌టెర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌గా లిక్విడ్ ఫండ్స్‌లో రూ.20 లక్షలు, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లలో రూ.51 లక్షలు ఇన్వెస్ట్‌చేశారు. మరో ఆమ్ఆద్మీపార్టీ అభ్యర్థి, మాజీ ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వి.బాలకృష్ణన్ అలియాస్ బాలా గోల్డ్ ఈటీఎఫ్‌లలో, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతి (సిప్ ద్వారా) కోటి రూపాయలు ఇన్వెస్ట్‌చేశారు. అయితే డ్రీమ్‌గర్ల్ హేమమాలిని ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ రూ.37వేలు మాత్రమే. మాజీ సమాచార, ప్రసార శాఖ మంత్రి అంబికా సోనీ బాండ్లు,షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.4.58 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఒడిశాలోని కేంద్రపారాలోక్సభ నుంచి పోటీచేస్తున్న బీజేడీ అభ్యర్థి బైజయంత్ పాండా గత ఐదేళ్లలో తన ఆస్తులు భారీగా పెరిగినట్లు పేర్కొన్నారు. ఫండ్స్‌లో పెట్టుబడులకు ప్రోత్సాహం సామాన్య ఇన్వెస్టర్లతో సహా బ్యాంకర్లు, కార్పొరేట్లనుంచి సేకరించిన పెట్టుబడులను వివిధ రకాల షేర్లు, బాండ్లలో ఫండ్హౌస్లు ఇన్వెస్ట్‌చేస్తాయి. సెక్యూరిటీల పనితీరు ఆధారంగా వారి వారి పెట్టుబడుల మేరకు ఇన్వెస్టర్లకు ప్రతిఫలం అందుతుంది. దేశంలో ప్రస్తుతం 45 ఫండ్ హౌస్‌లు దాదాపు 9 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల ఆస్తుల్ని మేనేజ్ చేస్తున్నాయి.అయితే మ్యూచువల్ ఫండ్స్ స్కీములు పట్టణ ఇన్వెస్టర్ల వరకే పరిమితమయ్యయి. దాంతో వీటిని సామాన్యుడి పెట్టుబడి సాధనంగా మలిచేందుకు ప్రభుత్వం, సెబీ భారీగా కసరత్తు చేస్తున్నాయి. వచ్చే ఐదేళ్లలో మ్యూచువల్ ఫండ్స్ ఆస్తులు 20లక్షల కోట్లకు పెరిగేలా దీర్ఘకాల మ్యూచువల్ ఫండ్ పాలసీని సెబీ అమల్లోకి తేనుంది. అప్పుడు ఫండ్స్‌లో చేసే ఇన్వెస్టర్లు పెట్టుబడులకు భారీ పన్ను రాయితీలు లభిస్తాయి. -
ఏప్రిల్ 1 నుంచే కొత్త గ్యాస్ రేట్ల వర్తింపు..
న్యూఢిల్లీ: తాత్కాలికంగా పాత గ్యాస్ రేట్ల విధానం ప్రకారమే కేజీ-డీ6 గ్యాస్‌ను విక్రయించేందుకు ఎరువుల ప్లాంట్లతో అంగీకారానికి వచ్చిన రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ఇప్పుడు కొత్త మెలికపెడుతోంది. ఐదేళ్ల కాంట్రాక్టు గడువు ముగిసిపోయిన తమ కస్టమర్లందరికీ ఈ నెల 1 నుంచి ప్రభుత్వం నిర్ధేశించిన ఫార్ములా ప్రకారం కొత్త గ్యాస్ రేట్లనే వర్తింపజేస్తామని స్పష్టం చేసింది. కేజీ-డీ6 క్షేత్రాల నుంచి ఆర్ఐఎల్ ఉత్పత్తి చేస్తున్న గ్యాస్‌కు ఒక్కో యూనిట్‌కు(ఎంబీటీయూ) 4.2 డాలర్ల చొప్పున గడచిన ఐదేళ్లపాటు రేటు కొనసాగగా... రంగరాజన్ కమిటీ ఫార్ములా ఆధారంగా దీన్ని రెట్టింపు స్థాయిలో 8.3 డాలర్లకు పెంచేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త రేట్లు అమల్లోకిరావాల్సి ఉంది. అయితే, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రేటు పెంపు అమలును ఎన్నికలు పూర్తయ్యేదాకా వాయిదా వేయాలని ఈసీ ఆదేశించడం తెలిసిందే. కొత్త కాంట్రాక్టులకు సంబంధించి కీలక నిబంధనలపై ఎరువుల ప్లాంట్లు, ఆర్ఐఎల్ మధ్య సయోధ్య కుదరకపోవడంతో... తాత్కాలికంగా పాత రేటు ప్రకారమే గ్యాస్ సరఫరా చేసేందుకు ఆర్ఐఎల్ అంగీకరించింది. అయితే పాత, కొత్త రేట్ల మధ్య వ్యత్యాసానికి సంబంధించిన మొత్తానికి చెల్లింపు గ్యారంటీలను సమర్పించాలన్న షరతుపెట్టింది. ఈ మేరకు ఎరువుల సంస్థలకు తాజాగా లేఖ రాసింది. కేజీ-డీ6పై ఆరోపణలు అవాస్తవం: కేంద్రం కేజీ-డీ6 చమురు, గ్యాస్ క్షేత్రాలను రిలయన్స్‌కు ఇవ్వడంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని, కుమ్మక్కు జరిగిందన్న ఆరోపణలు నిరాధారమైనవంటూ కేంద్ర ప్రభుత్వం ఖండించింది. సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లపై బుధవారం విచారణ సందర్భంగా కేంద్రం తన వాదనలను పూర్తిచేస్తూ ఈ అంశాన్ని పేర్కొంది. సీపీఐ ఎంపీ గురుదాస్ దాస్‌గుప్తా, స్వచ్ఛంద సంస్థ కామన్ కాజ్ ఈ పిటిషన్(పిల్)లను దాఖలు చేశారు. కాగా, జస్టిస్ బీఎస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. కేజీ-డీ6లో అవకతవకలపై కాగ్‌తో లోతైన ఆడిటింగ్ జరిపించాలని కూడా పిటిషనర్లు సుప్రీంను కోరారు. ఇంకా, ఇక్కడి గ్యాస్ ధరను యూనిట్‌కు ఇప్పుడున్న 4.2 డాలర్ల నుంచి 8.3 డాలర్లకు పెం చుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిలిపేయాలని కూడా కామన్ కాజ్ సుప్రీంకు విన్నవించింది. -
యూటీగా హైదరాబాద్: పీటీఐ కథనం