నూతన పాకిస్తాన్ లోనే నా పెళ్లి! | Imran khan wants to marry in 'Naya Pakistan' | Sakshi
Sakshi News home page

నూతన పాకిస్తాన్ లోనే నా పెళ్లి!

Published Sun, Aug 24 2014 7:44 PM | Last Updated on Sat, Sep 2 2017 12:23 PM

నూతన పాకిస్తాన్ లోనే నా పెళ్లి!

నూతన పాకిస్తాన్ లోనే నా పెళ్లి!

ఇస్లామాబాద్: ‘నూతన పాకిస్తాన్’ అనే తన స్వప్నం నెరవేరిన తరువాతే వివాహం చేసుకుంటానని పాకిస్తాన్ మాజీ క్రికెటర్, పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ రాత్రి స్పష్టం చేశారు. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ రాజీనామా చేయాలంటూ వేలాది మద్దతుదారులతో ఇమ్రాన్‌ఖాన్ ఇస్లామాబాద్‌లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ‘ఒక నూతన పాకిస్తాన్‌ను రూపొందించాలనుకుంటోంది కేవలం మీ కోసమే కాదు. నా కోసం కూడా. ఆ స్వప్నం నెరవేరగానే నేను పెళ్లి చేసుకుంటాను’ అని పార్లమెంటు భవనం ఎదుట మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ 62 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలతో ఆ ప్రాంగణమంతా హర్షధ్వానాలతో దద్దరిల్లింది.

 

1995లో బ్రిటన్ కు చెందిన జెమీమా గోల్డ్‌స్మిత్‌ను వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు కలిగాక, 2004లో పరస్పర అంగీకారంతో వారిద్దరూ విడిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement