పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు సుప్రీంకోర్టు నుంచి భారీ ఉపశమనం లభించింది. ఆయన సొంత పార్టీ విషయంలో పాకిస్తాన్ సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) 109 సీట్లతో దేశంలో అతిపెద్ద పార్టీగా నిలిచింది. మహిళలు, మైనారిటీలకు రిజర్వు చేసిన సీట్లను కేటాయించేందుకు ఆ పార్టీకి అర్హత ఉందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
పీటీఐకి న్యాయపరమైన విజయం అందించడంలో పాక్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఖాజీ ఫైజ్ ఇసా నేతృత్వంలోని 13 మంది సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ మద్దతు పలికింది. ఈ ఉదంతంలో సుప్రీంకోర్టు.. పెషావర్ హైకోర్టు తీర్పును పక్కన పెట్టింది. నేషనల్ అసెంబ్లీ, ప్రావిన్షియల్ అసెంబ్లీలలో రిజర్వ్ చేసిన సీట్లలో పార్టీకి వాటాను నిరాకరించిన పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ చర్యను పెషావర్ హైకోర్టు తిప్పికొట్టింది. ఎన్నికల కమిషన్ నిర్ణయం చెల్లదని బెంచ్ ప్రకటించింది. ఈ చర్య పాకిస్తాన్ రాజ్యాంగానికి విరుద్ధమని పేర్కొంది.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం పాక్ సుప్రీం కోర్టు తీర్పుతో పీటీఐ జాతీయ అసెంబ్లీలో 23 రిజర్వ్‌డ్ స్థానాలను దక్కించుకుంది. దీంతో పార్టీ సీట్లు 86 నుండి 109కి పెరిగాయి. దీంతో పీటీఐ దేశంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అలాగే జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్ష కూటమి సీట్ల సంఖ్య కూడా 120కి పెరిగింది. ప్రస్తుతం పీటీఐతో సహా ఉమ్మడి ప్రతిపక్షంలో 97 మంది సభ్యులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment