పీటీఐ చైర్మన్‌గా అవీక్‌ సర్కార్‌ | Aveek Sarkar is New PTI Chairman | Sakshi
Sakshi News home page

పీటీఐ చైర్మన్‌గా అవీక్‌ సర్కార్‌

Published Tue, Sep 1 2020 9:10 AM | Last Updated on Tue, Sep 1 2020 9:14 AM

Aveek Sarkar is New PTI Chairman - Sakshi

న్యూఢిల్లీ: ఆనంద్‌ బజార్‌ గ్రూప్‌ పబ్లికేషన్స్‌ ఎడిటర్‌ ఎమిరిటస్, వైస్‌ చైర్మన్‌ అవీక్‌ సర్కార్‌(75) ప్రెస్‌ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియాకు చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని పీటీఐ బోర్డు శనివారం ధ్రువీకరించింది. ఇప్పటివరకు ఈ పదవిలో పంజాబ్‌ కేసరి గ్రూప్‌ చీఫ్‌ ఎడిటర్‌ విజయ్‌కుమార్‌ చోప్రా ఉన్నారు.  సర్కార్‌.. టెలిగ్రాఫ్, ఆనంద్‌ బజార్‌ పత్రిక డైలీలకు ఎడిటర్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ గ్రూప్‌ కింద ఆరు టీవీ చానళ్లు, అనేక మేగజీన్లు ఉన్నాయి. పెంగ్విన్‌ ఇండియాకు ఫౌండింగ్‌ ఎండీగా, బిజినెస్‌స్టాండర్డ్‌కు ఫౌండింగ్‌ ఎడిటర్‌గానూ వ్యవహరించారు.  

చదవండి: ప్రశాంత్‌ భూషణ్‌కు రూపాయి జరిమానా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement