కంపెనీల చట్టంపై వచ్చేవారం నిపుణుల కమిటీ | FM Arun Jaitley asks regulators to speed up work on single DMAT account, uniform KYC norms | Sakshi
Sakshi News home page

కంపెనీల చట్టంపై వచ్చేవారం నిపుణుల కమిటీ

Published Sun, May 17 2015 2:03 AM | Last Updated on Tue, Oct 2 2018 4:19 PM

కంపెనీల చట్టంపై వచ్చేవారం నిపుణుల కమిటీ - Sakshi

కంపెనీల చట్టంపై వచ్చేవారం నిపుణుల కమిటీ

న్యూఢిల్లీ:  ఎటువంటి ఇబ్బందులు లేకుండా వ్యాపారం నిర్వహించడానికి సంబంధించి కంపెనీల చట్టంలో సవరణలను ప్రతిపాదించడానికి వచ్చేవారం ఒక నిపుణుల కమిటీని నియమించనున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడించారు.  2013 కంపెనీల చట్టంలో దాదాపు 50 ప్రొవిజన్లు అసమంజసంగా ఉన్నాయని, ఇవి కంపెనీల కార్యకలాపాల్లో కొంత ఇబ్బందికరంగా ఉన్నాయని ఆర్థికమంత్రి పిటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆయా నియమ నిబంధనలన్నింటినీ పరిశీలించి తగిన సిఫారసులను చేయడానికి నిపుణుల కమిటీని నియమిస్తున్నట్లు జైట్లీ పేర్కొన్నారు.

ఈ సిఫారసుల ప్రాతిపదికన మరోదఫా సవరణలకు కేంద్రం శ్రీకారం చుడుతుందని అన్నారు. 2013 కంపెనీల చట్టంలో దాదాపు 450కి పైగా క్లాజ్‌లు ఉన్నాయి. సరళతరమైన రీతిలో ఇన్‌కమ్‌ట్యాక్స్ రిటర్న్ ఫామ్స్ (ఐటీఆర్)ను రూపొందిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement