బంగారు నాణాలు, కడ్డీలు విక్రయించవద్దు: జీజేఎఫ్ | GJF urges govt not to impose further curbs on gold imports | Sakshi
Sakshi News home page

బంగారు నాణాలు, కడ్డీలు విక్రయించవద్దు: జీజేఎఫ్

Published Thu, Nov 20 2014 12:48 AM | Last Updated on Tue, Oct 2 2018 4:19 PM

బంగారు నాణాలు, కడ్డీలు విక్రయించవద్దు: జీజేఎఫ్ - Sakshi

బంగారు నాణాలు, కడ్డీలు విక్రయించవద్దు: జీజేఎఫ్

ముంబై: బంగారు నాణాలు, కడ్డీల విక్రయాలను నిలిపేయాలని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యూవెలరీ ట్రేడ్ ఫెడరేషన్(జీజేఎఫ్) తన సభ్యులను కోరుతోంది. బంగారం దిగుమతులపై ఆంక్షలు ప్రభుత్వం విధించకుండా ఉండటానికి ఈ విక్రయాలను ఆపేయాలని ఈ సంస్థ ప్రతిపాదిస్తోంది. గత నెలలో బంగారం దిగుమతులు బాగా పెరిగిన నేపథ్యంలో పుత్తడి దిగుమతులపై ఆంక్షలను విధించడమే కాకుండా కొన్ని ప్రైవేట్ ట్రేడింగ్ కంపెనీలపైనా ఆంక్షలను విధించాలని ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం.

కాగా ఈ ఏడాది బంగారం దిగుమతులు 850 టన్నులుగా ఉంటాయని, వీటిల్లో నాణాలు, కడ్డీల వాటా 200-250 టన్నుల రేంజ్‌లో ఉండొచ్చని జీజేఎఫ్ డెరైక్టర్ బచ్చరాజ్ బమల్వ అంచనా వేస్తున్నారు. వాణిజ్య లోటు భారీగా పెరిగిపోవడంతో బంగారంపై దిగుమతి సుంకాన్ని 10 శాతానికి గత ఏడాది ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. అయితే, దీనిని 2 శాతానికి తగ్గించాలని బంగారం వర్తకులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement