ఆదాయపన్ను ఊరట అంతంత మాత్రమే!! | income tax exumption hiked by 50 thousand only | Sakshi
Sakshi News home page

ఆదాయపన్ను ఊరట అంతంత మాత్రమే!!

Published Thu, Jul 10 2014 12:54 PM | Last Updated on Fri, Mar 29 2019 9:04 PM

income tax exumption hiked by 50 thousand only

ఆదాయపన్ను విషయంలో భారీ రాయితీలు ఇస్తారని భావించిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. ఉద్యోగవర్గాలను కొంత నిరాశకు గురిచేశారు. వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితిని ఇప్పుడున్న 2 లక్షల రూపాయల నుంచి 2.5 లక్షల రూపాయలకు పెంచారు. అదే సీనియర్ సిటిజన్ల విషయంలో అయితే ఈ పరిమితిని 2.5 లక్షల నుంచి 3 లక్షలకు పెంచారు.
 
అయితే, పొదుపును పెంచే ఉద్దేశంలో భాగంగా.. సెక్షన్ 80 సి కింద ఆదాయ పన్ను మినహాయింపు వచ్చే పొదుపు మొత్తాన్ని లక్ష రూపాయల నుంచి లక్షన్నరకు పెంచుతూ ఆర్థికమంత్రి ప్రకటించారు. ఇది కొంతవరకు ఊరట కల్పించే అంశమే అవుతుంది. అలాగే, గృహరుణాల వడ్డీ మీద పన్ను మినహాయింపును కూడా 1.5 లక్షల నుంచి 2 లక్షలకు పెంచారు. ఈ లెక్కన గృహరుణాలు తీసుకుని, 80 సి లో కూడా పొదుపును పాటించే ఉద్యోగులకు సుమారు లక్షన్నర రూపాయల వరకు ఊరట లభించినట్లు అవుతుంది.

పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు ఉండబోవని, ఎడ్యుకేషన్ సెస్ లాంటివన్నీ ఇప్పుడున్న స్థాయిలోనే ఉంటాయని ఆర్థిక మంత్రి ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement