Finance Minister
-
జీడీపీ మందగమనం వ్యవస్థీకృతం కాదు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి తగ్గుముఖం పట్టడం అన్నది.. వ్యవస్థీకృతం కాదని (ఆర్థిక వ్యవస్థ అంతటా) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి మెరుగైన మూలధన వ్యయాల మద్దతుతోతగ్గిన మేర డిసెంబర్ త్రైమాసికంలో (క్యూ3) భర్తీ అయ్యి మోస్తరు స్థాయికి వృద్ధి చేరుకుంటున్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 5.4 శాతానికి పడిపోవడం తెలిసిందే. ఇది ఏడు త్రైమాసికాల కనిష్ట రేటు కావడం గమనార్హం. జూన్ త్రైమాసికంలో వృద్ధి రేటు 6.7 శాతంగా ఉంది. ‘‘ఇది వ్యవస్థ అంతటా మందగమనం కాదు. ప్రభుత్వం వైపు నుంచి వ్యయాలు, మూలధన వ్యయాలు లోపించడం వల్లే. క్యూ3లో ఇవన్నీ సర్దుకుంటాయి. భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా వచ్చే ఏడాది, తర్వాత కూడా కొనసాగుతుంది’’అని ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా ఆర్థిక మంత్రి చెప్పారు. అంతర్జాతీయ డిమాండ్ స్తబ్దుగా ఉండడం ఎగుమతుల వృద్ధిపై ప్రభావం చూపించినట్టు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం వైపు నుంచి పెద్ద ఎత్తున మూలధన వ్యయాలు చేయకపోవడం, కొన్ని రంగాల్లో తగ్గిన కార్యకలాపాలు వృద్ధిపై ప్రభావం చూపించడం తెలిసిందే. 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.11.11 లక్షల కోట్ల మూలధన వ్యయాలను కేంద్రం లక్ష్యంగా నిర్ధేశించుకోగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో 37.3 శాతమే ఖర్చు చేసింది. చర్యలు తీసుకుంటున్నాం.. ‘‘దేశ ప్రజల కొనుగోలు శక్తి మెరుగుపడుతోంది. అదే సమయంలో వేతనాల్లోనూ మందగమనం ఆందోళనలు నెలకొన్నాయి. ఈ అంశాల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇవి దేశ వినియోగంపై ప్రభావం చూపించగలవు. ప్రతి సవాలు నుంచి అవకాశాలను చూసే ప్రధాన మంత్రి మనకు ఉన్నారు. కరోనా సమయంలో ఎదురైన సవాళ్లను అవకాశాలుగా మలుచుకుని సంస్కరణలు తీసుకొచ్చాం. ఆ సమయంలో ఐదు మినీ బడ్జెట్లను ప్రవేశపెట్టాం. విడిగా ప్రతి ఒక్కటీ తనవంతు మద్దతునిచి్చంది’’అని మంత్రి సీతారామన్ వివరించారు. -
నేటి నుంచే బడ్జెట్ ముందస్తు సంప్రదింపులు
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సరం (2025–26) బడ్జెట్‌కు సంబంధించి వివిధ భాగస్వాములతో సంప్రదింపులు నిర్వహించనున్నారు. ఇవి శుక్రవారం ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ప్రముఖ ఆర్థికవేత్తలతో ఆమె భేటీ కానున్నారు. దేశ జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెపె్టంబర్ క్వార్టర్‌కు ఏడు త్రైమాసికాల కనిష్ట స్థాయికి పడిపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే బడ్జెట్‌కు సంబంధించి ప్రముఖ ఆర్థిక వేత్తల అభిప్రాయాలను ఆమె తెలుసుకోనున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత రైతు సంఘాలు, వ్యవసాయ ఆర్థికవేత్తలు, ఎంఎస్ఎంఈ రంగ ప్రతినిధులతో ఈ నెల 7న ఆర్థిక మంత్రి భేటీ కానున్నారు. 2025–26 బడ్జెట్‌ను ఫిబ్ర వరి 1న పార్లమెంట్‌కు సమరి్పంచే అవకాశం ఉంది. -
‘సామాన్యుడిపై భారం తగ్గించండి’
బడ్జెట్ రూపకల్పనకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. ఫిబ్రవరి 2025లో ప్రకటించే కేంద్ర బడ్జెట్లో మార్పులు చేయాలంటూ కొన్ని ఆర్థిక సంస్థలు, ప్రజల నుంచి కేంద్రానికి వినతులు వస్తున్నాయి. అందులో భాగంగా ఇటీవల కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ ఎక్స్ పేజ్‌ను ట్యాగ్ చేస్తూ ఓ వ్యక్తి ప్రభుత్వానికి తన అభ్యర్థనను తెలిపారు.ఎక్స్ వేదికగా తుషార్ శర్మ అనే వ్యక్తి సామాన్యుడిపై పన్ను భారం తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వేడుకున్నాడు. ‘@nsitharaman దేశాభివృద్ధికి మీరు చేస్తున్న సహకారం, ప్రయత్నాలను ఎంతో అభినందిస్తున్నాను. ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలకు కొంత ఉపశమనం కలిగించే విషయాన్ని పరిశీలించాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. మీరు ఎదుర్కొంటున్న సవాళ్లను కూడా నేను అర్థం చేసుకున్నాను. కానీ ఇది నా హృదయపూర్వక అభ్యర్థన మాత్రమే’ అని తుషార్ శర్మ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ ఈ పోస్ట్‌కు స్పందిస్తూ ‘మీ మాటలు, అవగాహనకు ధన్యవాదాలు. నేను మీ అభ్యర్థనను అభినందిస్తున్నాను. నరేంద్రమోదీ ప్రభుత్వం సమస్యలపై స్పందించి చర్య తీసుకునే ప్రభుత్వం. ప్రజల అభిప్రాయాలను వింటోంది. వాటికి తగినట్లు ప్రతిస్పందిస్తోంది. మీ అభ్యర్థన చాలా విలువైంది’ అని రిప్లై ఇచ్చారు. కేంద్ర బడ్జెట్ 2025 ద్వారా మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని జులైలో ఆర్థిక మంత్రి తెలిపారు.Thank you for your kind words and your understanding. I recognise and appreciate your concern.PM @narendramodi ‘s government is a responsive government. Listens and attends to people’s voices. Thanks once again for your understanding. Your input is valuable. https://t.co/0C2wzaQtYx— Nirmala Sitharaman (@nsitharaman) November 17, 2024ఇదీ చదవండి: మెటాపై రూ.6,972 కోట్ల జరిమానా!గతంలో మంత్రి స్పందిస్తూ ‘నేను మధ్యతరగతి వారికి విభిన్న రూపాల్లో మేలు చేయాలని ప్రయత్నిస్తున్నాను. కానీ నాకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. నేను పన్ను రేటును తగ్గించి వారికి ఉపశమనం ఇవ్వాలనుకుంటున్నాను. అందుకే స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000 నుంచి రూ.75,000కి పెంచాం. అదనంగా అధిక ఆదాయ వర్గాలకు పన్ను రేటు పెంచాం. సామాన్యులపై పన్ను రేట్లను తగ్గించాలనే ఉద్దేశంతోనే కొత్త పన్ను విధానం ప్రవేశపెట్టాం’ అని చెప్పారు. -
త్వరలోనే రెట్టింపు ఆదాయం
సమీప భవిష్యత్తులో దేశ ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా పెరగబోతున్నాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మాలాసీతారామన్ తెలిపారు. ప్రజల తలసరి ఆదాయం కొన్ని సంవత్సరాల్లోనే రెట్టింపు అవుతుందని అంచనా వేశారు. శుక్రవారం ఢిల్లీలో ప్రారంభమైన ‘కౌటిల్య ఆర్థిక సదస్సు’ మూడో ఎడిషన్‌లో మంత్రి పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘సమీప భవిష్యత్తులో సామాన్య మానవుల జీవన ప్రమాణాలు భారీగా పెరగబోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ‘గిని ఇండెక్స్’(ఆర్థిక సమానత్వాన్ని కొలిచే సూచిక. ఇది 0-1 మధ్య ఉంటుంది. 0-పూర్తి ఆర్థిక సమానత్వం, 1-అధికంగా ఉన్న ఆర్థిక అసమానత్వం) 0.283 నుంచి 0.266కు క్షీణించింది. పట్టణ ప్రాంతాల్లో ఇది 0.363 నుంచి 0.314కి చేరింది. కొవిడ్ పరిణామాల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంది. 140 కోట్ల జనాభా తలసరి ఆదాయాన్ని కొన్ని సంవత్సరాల్లోనే రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. గడిచిన ఐదేళ్ల వ్యవధిలో ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో పదో స్థానం నుంచి ఐదో స్థానానికి చేరుకున్నాం. ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం 2730 డాలర్ల (రూ.2.2 లక్షలు) తలసరి ఆదాయాన్ని చేరుకోవడానికి 75 ఏళ్లు పట్టింది. మరో 2,000 డాలర్లు(రూ.1.6 లక్షలు) అదనంగా సంపాదించేందుకు మాత్రం ఐదు ఏళ్లు సరిపోతుంది’ అన్నారు.ఇదీ చదవండి: భారత్‌లో యాపిల్ నాలుగు స్టోర్లు..? ఎక్కడంటే.. -
నిర్మలకు ఊరట దర్యాప్తుపై హైకోర్టు స్టే
బెంగళూరు: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఊరట లభించింది. ఈడీని అడ్డం పెట్టుకొని వ్యాపారవేత్తలను బెదిరించి ఎలక్టోరల్ బాండ్ల పేరిట కోట్లాది రూపాయలు వసూలు చేశారనే కేసులో నిర్మల, ఇతరులపై సాగుతున్న దర్యాప్తుపై కర్నాటక హైకోర్టు సోమవారం స్టే విధించింది. నిందితుల్లో ఒకరైన బీజేపీ నేత నళిన్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ ఎం.నాగప్రసన్న దర్యాప్తుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. తదుపరి విచారణను అక్టోబరు 22కు వాయిదా వేశారు. ఆదర్శ్ ఆర్ అయ్యర్ చేసిన ఫిర్యాదు మేరకు.. స్పెషల్ కోర్టు ఆదేశాలతో నిర్మలా సీతారామన్, బీజేపీ జాతీయ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఈడీ అధికారులపై శనివారం ఎఫ్ఐఆర్ నమోదైంది. భారతీయ న్యాయసంహిత సెక్షన్ 384 (బెదిరించి డబ్బు గుంజడం), 120బి (నేరపూరిత కుట్ర), సెక్షన్ 34 కింద వీరిపై కేసు నమోదైంది. -
NPS-Vatsalya: వారసులపై వాత్సల్యం
ఉద్యోగంలో చేరిన వెంటనే ప్రతి ఒక్కరూ ముందుగా చేయాల్సిన పని, విశ్రాంత జీవనానికి మెరుగైన ప్రణాళిక రూపొందించుకోవడం. ప్రభుత్వరంగ ఉద్యోగులకు పింఛను భరోసా ఉంటుంది. కానీ, ప్రైవేటు రంగ ఉద్యోగులు, స్వయం ఉపాధిలో ఉన్న వారు తామే స్వయంగా ఇందుకు ఏర్పాట్లు చేసుకోవాలి. ఉద్యోగం వచి్చన కొత్తలో రిటైర్మెంట్ గురించి తర్వాత చూద్దాంలే.. అని వాయిదా వేసే వారే ఎక్కువ. వివాహం, తర్వాత సంతానంతో విశ్రాంత జీవనం ప్రాధాన్యలేమిగా మారిపోతుంది. పిల్లలను గొప్పగా చదివించడమే అన్నింటికంటే ముఖ్య లక్ష్యంగా సాగిపోతుంటారు. దీనివల్ల అంతిమంగా విశ్రాంత జీవనంలో ఆరి్థక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ తరహా నిర్లక్ష్యం రేపు తమ పిల్లలు చేయకూడదని భావించే తల్లిదండ్రులు.. వారి పేరుతో ఇప్పుడే ఓ పింఛను ఖాతా తెరిచేస్తే సరి. అందుకు వీలు కలి్పంచేదే ఎన్పీఎస్ వాత్సల్య. బడ్జెట్లో ప్రకటించిన ఈ కొత్త పథకాన్ని తాజాగా కేంద్ర ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించిన నేపథ్యంలో దీనిపై అవగాహన కలి్పంచే కథనమిది... తల్లిదండ్రులు ఎవరైనా సరే తమ పిల్లల భవిష్యత్ మెరుగ్గా ఉండాలని కోరుకుంటారు. ఎప్పుడూ వారి గురించే ఆలోచిస్తుంటారు. కానీ, భవిష్యత్‌లో వారు ఎలా స్థిరపడతారో ముందుగా ఊహించడం కష్టం. అందుకని వారి పేరుతో ఎన్పీఎస్ వాత్సల్య ఖాతా తెరవడం ఒక మంచి ఆలోచనే అవుతుంది. ఇది పొదుపు, పెట్టుబడుల ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది. ఆరి్థక క్రమశిక్షణను నేర్పుతుంది. 18 ఏళ్లు వచ్చే వరకు తల్లిదండ్రులు చేసిన పెట్టుబడితో ఏర్పడిన నిధిని చూసిన తర్వాత, రిటైర్మెంట్ లక్ష్యాన్ని పిల్లలు సులభంగా అర్థం చేసుకుంటారు. వారు ఉద్యోగంలో చేరిన తర్వాత ఈ ఖాతాను కొనసాగించుకున్నట్టు అయితే, రిటైర్మెంట్ నాటికి భారీ సంపదను పోగు చేసుకోవచ్చు. 50–60 ఏళ్ల కాలం పాటు పెట్టుబడులకు ఉంటుంది కనుక కాంపౌండింగ్ ప్రయోజనంతో ఊహించనంత పెద్ద నిధి సమకూరుతుంది. వాత్సల్య ఎవరికి? 2024–25 బడ్జెట్లో పిల్లల కోసం పింఛను పథకం ‘ఎన్పీఎస్ వాత్సల్య’ను ఆరి్థక మంత్రి సీతారామన్ ప్రకటించారు. దీన్ని సెపె్టంబర్ 18 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. తమ పిల్లల పేరిట పింఛను ఖాతా తెరిచి, ఇన్వెస్ట్ చేసుకునేందుకు ఎన్పీఎస్ వాత్సల్య వీలు కలి్పస్తుంది. తాము ఎంతగానో ప్రేమించే తమ పిల్లల భవిష్యత్‌కు బలమైన బాట వేసేందుకు దీన్ని ఉపయోగించుకోవచ్చు. పిల్లలకు తల్లిదండ్రులు సహజ సంరక్షకులు (గార్డియన్). వారు లేనప్పుడు చట్టబద్ధ సంరక్షకులు పిల్లల పేరిట ఖాతా ప్రారంభించొచ్చు. పిల్లలకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఎన్పీఎస్ టైర్–1 (అందరు పౌరులు)గా ఇది మారిపోతుంది. సాధారణ ఎన్పీఎస్ ఖాతాలోని అన్ని ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి. మేజర్ అయిన తర్వాత మూడు నెలల్లోపు తిరిగి కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. పన్ను ప్రయోజనాలు పన్ను ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా పేర్కొనలేదు. కానీ, ఎన్పీఎస్కు ప్రస్తుతం ఉన్న పలు రకాల పన్ను ప్రయోజనాలను వాటి గరిష్ట పరిమితికి మించకుండా తమ పేరు, తమ పిల్లల పేరుపై పెట్టుబడులకు ఉపయోగించుకోవచ్చు.సంరక్షకుల హక్కుఖాతాదారు (మైనర్) మరణించిన సందర్భంలో అప్పటి వరకు సమకూరిన నిధిని తిరిగి తల్లిదండ్రి లేదా సంరక్షకులకు ఇచ్చేస్తారు. తల్లిదండ్రుల్లో ఒకరు మరణించిన సందర్భంలో మరొకరు కేవైసీ పూర్తి చేసి పెట్టుబడి కొనసాగించొచ్చు. తల్లిదండ్రులు ఇద్దరూ మరణించిన సందర్భంలో మైనర్‌కు 18 ఏళ్లు నిండేంత వరకు చట్టబద్ధమైన సంరక్షకులు ఎలాంటి చందా చెల్లించకుండానే ఖాతాని కొనసాగించొచ్చు.ఉపసంహరణ వాత్సల్యకు మూడేళ్ల లాకిన్ పీరియడ్ అమలవుతుంది. అంటే ప్రారంభించిన మూడేళ్లలోపు పెట్టుబడులు ఉపసంహరించుకోవడానికి అనుమతించరు. ఆ తర్వాత నుంచి సమకూరిన నిధిలో 25 శాతాన్ని విద్య, అనారోగ్యం తదితర నిర్ధేశిత అవసరాలకు వెనక్కి తీసుకోవచ్చు. ఎక్కడ ప్రారంభించాలి? ఎన్పీఎస్ వాత్సల్య ఖాతాను నేరుగా ఈ–ఎన్పీఎస్ పోర్టల్ ద్వారా ప్రారంభించుకోవచ్చు. లేదా పోస్టాఫీస్, ప్రముఖ బ్యాంక్ శాఖలకు వెళ్లి తెరవొచ్చు. ప్రభుత్వరంగంలోని కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పీఎన్బీ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతోపాటు ప్రైవేటు రంంలోని ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు ఎన్పీఎస్ వాత్సల్యను ఆఫర్ చేస్తున్నాయి. అలాగే ఆన్లైన్లో ప్రొటీన్ ఈ–గవ్ టెక్నాలజీస్, కేఫిన్‌టెక్, క్యామ్స్ ఎన్పీఎస్ ప్లాట్‌ఫామ్‌ల సాయంతోనూ ప్రారంభించొచ్చు. వైదొలగడం పిల్లలకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఈ పథకం కొనసాగించుకోవచ్చు. లేదా వైదొలిగే అవకాశం కూడా ఉంది. ఒకవేళ తప్పుకోవాలని భావించేట్టు అయితే ఇక్కడ రెండు రకాల ఆప్షన్లు ఉన్నాయి. అప్పటి వరకు సమకూరిన నిధి రూ.2.5 లక్షలకు మించకపోతే, మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. రూ.2.5 లక్షలకు మించి ఉంటే అందులో 20 శాతమే వెనక్కి తీసుకోగలరు. మిగిలిన 80 శాతంతో యాన్యుటీ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. డాక్యుమెంట్లు ఎన్పీఎస్ వాత్సల్య ప్రారంభానికి వీలుగా పిల్లలకు సంబంధించి పుట్టిన తేదీ ధ్రువపత్రం అది లేకపోతే స్కూల్ లీవింగ్ సరి్టఫికెట్/ఎస్ఎస్సీ/పాన్ వీటిల్లో ఏదో ఒకటి ఇవ్వాలి. ప్రారంభించే పేరెంట్ (తల్లి లేదా తండ్రి) లేదా గార్డియన్‌కు సంబంధించి ఆధార్, పాన్ కాపీ, బ్యాంక్ ఖాతా వివరాలు అవసరం అవుతాయి. ఎన్ఆర్ఐ/ఓసీఐ అయితే ఖాతా తెరిచే పిల్లల పేరిట ఎన్ఆర్ఈ లేదా ఎన్ఆర్వో ఖాతా కలిగి ఉండాలి. ఎన్ఆర్ఐ పాస్‌పోర్ట్ కాపీ, ఓసీఐ విదేశీ చిరునామా కాపీలను సమర్పించాలి. అర్హతలు 18 ఏళ్లలోపు పిల్లల పేరిట భారత పౌరులు లేదా నాన్ రెసిడెంట్ ఇండియన్ (ఎన్ఆర్ఐ), ఓవర్సీస్ సిటిజన్íÙప్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) ఈ ఖాతా తెరిచేందుకు అర్హులు. ఏటా కనీసం రూ.1,000 ఇన్వెస్ట్ చేయాలి. గరిష్ట పరిమితి లేదు. సంరక్షకులు ఇన్వెస్ట్ చేసినప్పటికీ ఈ ఖాతా లబ్దిదారు మైనరే అవుతారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) నియంత్రణలో ఈ పథకం కొనసాగుతుంది. మైనర్ పేరిట పెన్షన్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్ (పీఆర్ఏఎన్/ప్రాన్)ను పీఎఫ్ఆర్డీఏ కేటాయిస్తుంది. పెట్టుబడుల ఆప్షన్లు యాక్టివ్ చాయిస్: ఈ విధానంలో 50 ఏళ్ల వయసు వరకు ఈక్విటీలకు గరిష్టంగా 75 శాతం కేటాయింపులు చేసుకోవచ్చు. కార్పొరేట్ డెట్‌కు 100 శాతం, ప్రభుత్వ సెక్యూరిటీలకు 100 శాతం, ఆల్టర్నేట్ అసెట్ క్లాస్‌కు 5 శాతం వరకు కేటాయింపులు చేసుకోవచ్చు. 75 శాతాన్ని ఈక్విటీలకు కేటాయించుకుంటే.. 50 ఏళ్ల వయసు దాటిన క్రమంగా 60 ఏళ్ల నాటికి ఈక్విటీ కేటాయింపులు 50 శాతానికి తగ్గి, డెట్ కేటాయింపులు 50 శాతంగా మారుతాయి. ఆటో చాయిస్: ఏ విభాగానికి ఎంత మేర కేటాయింపులు చేసుకోవాలన్న అవగాహన లేకపోతే ఆటో చాయిస్ ఎంపిక చేసుకోవచ్చు. ఈ విధానంలో లైఫ్ సైకిల్ ఫండ్ (ఎల్సీ)–75, ఎల్సీ–50, ఎల్సీ–25 అని మూడు ఆప్షన్లు ఉన్నాయి. ఎల్సీ–75లో 35 ఏళ్ల వయసు వరకే 75 శాతం ఈక్విటీలకు కేటాయింపులు వెళతాయి. ఆ తర్వాత నుంచి ఏటా ఈక్విటీలకు తగ్గుతూ, డెట్‌కు పెరుగుతాయి. ఎల్సీ–50 కింద ఈక్విటీలకు 35 ఏళ్ల వయసు వచ్చే వరకే 50 శాతం కేటాయింపులు చేసుకోగలరు. ఆ తర్వాత క్రమంగా ఈక్విటీలకు కేటాయింపులు తగ్గుతూ వెళతాయి. ఎల్సీ–25లో 35 ఏళ్ల వరకే ఈక్విటీలకు 25 శాతం కేటాయింపులు వెళతాయి. ఆ తర్వాత నుంచి క్రమంగా డెట్‌కు కేటాయింపులు పెరుగుతాయి. డిఫాల్ట్ చాయిస్: పైన చెప్పుకున్న ఎల్సీ–50 ప్రకారం ఈ విధానంలో పెట్టుబడుల కేటాయింపులు చేస్తారు.చిన్న మొత్తమే అయినా.. పెట్టుబడులకు ఎంత ఎక్కువ కాల వ్యవధి ఉంటే, అంత గొప్పగా కాంపౌండింగ్ అవుతుంది. వడ్డీపై, వడ్డీ (చక్రవడ్డీ) తోడవుతుంది. ఒక ఉదాహరణ ప్రకారం.. శిశువు జన్మించిన వెంటనే ఖాతా తెరిచి ఏటా రూ.10,000 చొప్పున 18 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేశారనుకుందాం. మొత్తం పెట్టుబడి రూ.1.8 లక్షలు అవుతుంది. 10 శాతం రాబడుల రేటు ఆధారంగా 18 ఏళ్లు పూర్తయ్యే నాటికి ఈ మొత్తం రూ.5లక్షలుగా మారుతుంది. ఇదే నిధి ఏటా 10 శాతం చొప్పున కాంపౌండ్ అవుతూ వెళితే 60 ఏళ్లు ముగిసే నాటికి రూ.2.75 కోట్లు సమకూరుతుంది. ఒకవేళ రాబడుల రేటు 11.59 శాతం మేర ఉంటే రూ.5.97 కోట్లు, 12.86 శాతం రాబడులు వస్తే రూ.11.05 కోట్లు సమకూరుతుంది. కేవలం రూ.10వేల వార్షిక పొదుపు రూ.కోట్లుగా మారుతుంది. ఈ ఉదాహరణను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, చండీగఢ్ జారీ చేసింది. మరొక ఉదాహరణ చూద్దాం. ప్రతి నెలా రూ.5,000 చొప్పున శిశువు జని్మంచిన నాటి నుంచి ఇన్వెస్ట్ చేస్తూ.. వారు ఉద్యోగంలో చేరేంత వరకు.. ఆ తర్వాత పిల్లలు కూడా అంతే మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తూ వెళితే 10 శాతం రాబడి అంచనా ప్రకారం 60ఏళ్లకు (రిటైర్మెంట్ నాటికి) సుమారు రూ.19 కోట్లు సమకూరుతుంది. ఇదే రూ.5,000 పెట్టుబడిని మొదటి నుంచి ఏటా 10 శాతం చొప్పున పెంచుతూ వెళితే 60 ఏళ్లకు రూ.100 కోట్ల నిధి ఏర్పడుతుంది. ఇది కాంపౌండింగ్ మహిమ. ఈ తరహా దీర్ఘకాలిక పెట్టుబడుల పథకాన్ని, పిల్లలకు ఫించను బహుమానాన్ని ఇవ్వడం మంచి నిర్ణయమే అవుతుంది. ‘‘ఎన్‌పీఎస్‌లో ఈక్విటీ విభాగం 14 శాతం, కార్పొరేట్ డెట్ విభాగం 9.1 శాతం, జీ–సెక్ విభాగం 8.8 శాతం చొప్పున వార్షిక రాబడులు అందించింది. ఎన్పీఎస్ వాత్సల్య దీర్ఘకాల పెట్టుబడి. కనుక క్రమశిక్షణతో కూడిన విధానాన్ని అనుసరించాలి. మీ పిల్లల భవిష్యత్ ఆరి్థక భద్రతపై దృష్టి సారించాలి’’అని స్వయానా ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రకటించారు. దీర్ఘకాలంలో ఈక్విటీలకు గరిష్ట కేటాయింపులతో కూడిన ఆప్షన్లో రాబడి 10 శాతం ఉంటుందని ఆశించొచ్చు. ఆన్లైన్లో ఎలా ప్రారంభించుకోవచ్చు? → ఈఎన్పీఎస్ పోర్టల్‌కు వెళ్లాలి. హోమ్‌పేజీ పైన మెనూలో కనిపించే ఆప్షన్లలో ‘ఎన్పీఎస్ వాత్సల్య (మైనర్స్) రిజిస్ట్రేషన్’ను ఎంపిక చేసుకోవాలి. → ఇక్కడ మైనర్, గార్డియన్ వివరాలు అన్నింటినీ నమోదు చేయాలి. కావాల్సిన డాక్యుమెంట్ కాపీలను అప్లోడ్ చేసి ‘కన్ఫర్మ్’ చేయాలి. → మొదట గార్డియన్ పుట్టిన తేదీ వివరాలు, పాన్ నంబర్, మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడీ వివరాలు ఇచ్చి ‘బిగిన్ రిజి్రస్టేషన్’ను క్లిక్ చేయాలి. → మొబైల్, ఈమెయిల్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేసి సబ్మిట్ చేయాలి. అక్నాలెడ్జ్మెంట్ నంబర్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. అప్పుడు ‘కంటిన్యూ’ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. → ఆన్లైన్లో ఖాతా తెరిచే వారు (తల్లి/తండ్రి/సంరక్షకులు) తెల్ల పేపర్‌పై సంతకం చేసి దాన్ని స్కాన్ చేసి పెట్టుకోవాలి. దీన్ని ఇతర డాక్యుమెంట్లతోపాటు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. → ఆరంభ చందా రూ.1,000 చెల్లించాలి. దీంతో ప్రాన్ జారీ అవుతుంది. మైనర్ పేరిట ఎన్పీఎస్ వాత్సల్య ఖాతా ప్రారంభం అవుతుంది. –సాక్షి, బిజినెస్‌డెస్క్ -
కర్ణాటకలో నిర్మలపై కేసు
సాక్షి, బెంగళూరు: అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఎన్నికల బాండ్ల పేరిట రూ. కోట్లు దోచుకున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై బెంగళూరులో కేసు నమోదైంది. నిర్మల తదితరులు పారిశ్రామికవేత్తలను బెదిరించి ఎన్నికల బాండ్ల పేరిట రూ.8,000 కోట్లకుపైగా లూటీ చేశారని జనాధికార సంఘర్ష సంఘటన (జేఎస్పీ) నేత ఆదర్శ ఆర్.అయ్యర్ ఫిర్యాదు చేశారు. దాంతో నిర్మల తదితరులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యే క కోర్టు శనివారం ఆదేశించింది. ఆ మేర కు తిలక్ నగర్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏ1గా నిర్మల, ఏ2 గా ఈడీ అధికారులు, ఏ3గా బీజేపీ కేంద్ర పదాధికారులు, ఏ4గా కర్నాటక బీజేపీ మాజీ చీఫ్ నళిన్ కుమార్ కటీల్, ఏ5గా ప్రస్తుత చీఫ్ బి.వై.విజయేంద్ర, ఏ6గా రాష్ట్ర బీజేపీ పదాధికారులను చేర్చారు.నిర్మల రాజీనామా చేయరా: సిద్ధుకేసు నేపథ్యంలో నిర్మలను కూడా బీజేపీ రాజీనామా కోరుతుందా అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రశ్నించారు. ‘ముడా’ కేసులో ఆయన రాజీనామా చేయాల్సిందేనని బీజేపీ కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తుండటం తెలిసిందే. -
ఎల్ఐసీ, ఐవోసీ భారీ డివిడెండ్లు
కేంద్రానికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) భారీ డివిడెండ్లను అందించాయి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఎల్ఐసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ ఎండీ సిద్ధార్థ మొహంతి రూ.3,662.17 కోట్ల డివిడెండ్ చెక్కును అందించారు. కార్యక్రమంలో ఆర్థికశాఖ అదనపు కార్యదర్శి ఎంపీ తంగిరాల కూడా పాల్గొన్నారు. ఈ ఏడాది మార్చి 1వ తేదీన ఎల్ఐసీ రూ.2,441.45 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను అందించింది. తాజాగా అందజేసిన డివిడెండ్‌తో కలిసి 2023–24లో సంస్థ మొత్తం రూ.6,103.62 కోట్ల డివిడెండ్‌ను అందించినట్లైంది. ఇక ఐవోసీ రూ.5,091 కోట్ల డివిడెండ్‌ను కేంద్రానికి సమరి్పంచింది. 2024–25లో ఇప్పటి వరకూ కేంద్రానికి రూ.10,604.74 కోట్ల డివిడెండ్ అందింది. 2023–24లో డివిడెండ్లు రూ.50,000 కోట్లుకాగా, 2024–25లో ఈ విలువ అంచనాలు రూ.56,260 కోట్లు. -
ఏంజెల్ ట్యాక్స్ రద్దుతో స్టార్టప్‌లకు బూస్ట్
వాషింగ్టన్: ఏంజెల్ ట్యాక్స్ రద్దు చేస్తూ భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనను సిలికాన్ వ్యాలీకి చెందిన పారిశ్రామికవేత్తలు స్వాగతించారు. దీన్నొక చరిత్రాత్మక నిర్ణయంగా అభివరి్ణంచారు. స్టార్టప్‌ల ఎకోసిస్టమ్‌కు ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుందని టీఐఈ సిలికాన్ వ్యాలీ ప్రెసిడెంట్ అనిత మన్వానీ అన్నారు. దేశ వృద్ధికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా వ్యాపార నిర్వహణ పట్ల ఆసక్తి పెరుగుతుండడాన్ని చూడొచ్చు. కేవలం టెక్నాలజీలోనే కాకుండా, సేవలరంగం, తయారీలో మరింత మంది యువ పారిశ్రామికవేత్తలు అడుగు పెడుతున్నారు. ముఖ్యంగా భారత్‌లో పెరుగుతున్న యువ జనాభా నేపథ్యంలో ఏంజెల్ ఇన్వెస్టర్లను పన్ను నుంచి మినహాయించే ఇలాంటి చట్టాలే అవసరం. ఇది భారాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల పారిశ్రామికవేత్తలు నిబంధనల అమలుకు బదులు తమ వ్యాపారంపై దృష్టి పెట్టేందుకు వీలు కలుగుతుంది. అంతిమంగా ఈ నిర్ణ యం భారత్–యూఎస్ కారిడార్‌లో ఏంజెల్ పెట్టు బడులను పెంచుతుంది’’అని మన్వానీ వివరించారు. పలువురు ఇతర పారిశ్రామికవేత్తలు సైతం ఈ నిర్ణయాన్ని అభినందించారు. సిలికాన్ వ్యాలీ కేంద్రంగా పనిచేసే పారిశ్రామికవేత్తలు ఎప్పటి నుంచో ఏంజెల్ ట్యాక్స్ రద్దు కోసం డిమాండ్ చేస్తుండడం గమనార్హం. స్టార్టప్‌కు నిధులు పెరుగుతాయి.. భారత ప్రభుత్వ నిర్ణయంతో స్టార్టప్‌లకు స్థానికంగానే కాకుండా, విదేశాల నుంచి పెట్టుబడుల సా యం పెరుగుతుందని యూఎస్ ఇండియా వ్యూహా త్మక భాగస్వామ్య సంస్థ పేర్కొంది. ఏంజెల్ ట్యాక్స్ రద్దు ద్వైపాక్షిక సాంకేతిక సహకారం, ఆవిష్కరణల విషయంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తుందని యూ ఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ తెలిపింది. ‘‘భారత్‌లో స్టార్టప్‌ల వ్యవస్థకు ఇదొక చరిత్రాత్మక నిర్ణయం. స్టార్టప్ ఎకోసిస్టమ్ రాణించేందుకు, ఆవిష్కరణలు, ఉపాధి కల్పన, పోటీతత్వాన్ని పెంచేందుకు సాయపడుతుంది’’ అని యూఎస్ఏ ఇండియా చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ కరుణ్ రిషి పేర్కొన్నారు. రిపాట్రియేషన్లోనూ సంస్కరణలు అవసరం స్వదేశానికి నిధుల తరలింపులో(రిపాట్రియేషన్ )నూ సంస్కరణలు అవసరమని మన్వానీ అభిప్రాయపడ్డారు. ‘‘రిపాట్రియేషన్ అన్నది అధిక శాతం ఎన్ఆర్ఐలు, ఇన్వెస్టర్లకు ప్రాముఖ్యంగా ఉంటుంది. ఈ విషయంలోనూ నిబంధనలను సడలించాలి. నేడు ఎవరైనా యూఎస్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. రిపా్రటియేషన్కు సంబంధించి ఇదే విధమైన నిబంధనలు, నియంత్రణలను భారత్ కూడా పాటించొచ్చు’’అని మన్వానీ తెలిపారు. -
Nirmala Sitharaman: భారత్ ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర
న్యూఢిల్లీ: భారత్ ప్రతిష్టను దెబ్బతీసి.. మనదేశం పెట్టుబడులకు సురక్షితం కాదనే సందేశాన్ని విదేశీ ఇన్వెస్టర్లకు పంపే కుట్ర జరిగిందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. 2024–25 బడ్జెట్‌పై చర్చకు లోక్‌సభలో ఆమె సమాధానమిస్తూ విపక్షాలపై మండిపడ్డారు. ‘భారత సామాజిక విలువలపై, పార్లమెంటరీ సాంప్రదాయాలపై, సాయుధ బలగాలపై, ఆర్థిక వ్యవస్థపై తీవ్రదాడి జరిగింది. దేశంలో అస్థిరత, అరాచకత్వం ఉంటే.. వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమవుతుంది. ఇదో పెద్ద సవాల్’ అని నిర్మల అన్నారు. భిన్నత్వం కలిగిన సమాజాన్ని తరతరాల కృషితో భారత్ ఏకతాటి పైకి తెచి్చందని, కానీ ఈ రోజు కుట్రపూరితంగా ఒకరికిపై మరొకరికి అపనమ్మకాన్ని కలిగిస్తున్నారని ధ్వజమెత్తారు. అబద్ధాలు, కుయుక్తులతో ప్రజల మధ్యన విభజన తెస్తున్నారని ఆరోపించారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను కలి్పంచే ప్రయత్నం జరుగుతోందని, చిన్నపాటి నిప్పురవ్వ (గొడవ) కూడా తీవ్ర సంఘర్షణలకు దారితీయాలని కోరుకుంటున్నారని అన్నారు. ఏదో ఒక వంకతో సాయుధ బలగాలపై దాడులను ముమ్మరం చేస్తున్నారని ఆక్షేపించారు. అగి్నవీర్లపై వివాదం ఈ కుట్రలో భాగమన్నారు. సమాజమే కాకుండా ఆర్థిక వ్యవస్థ, పార్లమెంటు, సైన్యంపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. పారిశ్రామికవేత్తలను విలన్లుగా చూపుతున్నారని, ఇది సిగ్గుచేటని పేర్కొన్నారు. ‘పారిశ్రామిక సంస్కృతిని ముగించాలనే కుట్ర జరుగుతోంది. భారత్ వెన్నుముకపై దాడి జరుగుతోంది. వ్యాపారులపై ప్రతికూలతను వ్యాప్తి చేస్తున్నారు. సంపదను సృష్టించే వారిపై, వ్యాపారాలపై ద్వేషం ప్రబలుతోంది. పెట్టుబడులకు భారత్ సురక్షితం కాదనే సందేశాన్ని ప్రపంచానికి పంపే కుట్ర జరుగుతోంది. ఇది మంచిది కాదు’ అని నిర్మల అన్నారు.2009 బడ్జెట్లో ఏకంగా 26 రాష్ట్రాల ప్రస్తావన లేదు బడ్జెల్లో ఏదేని రాష్ట్రం ప్రస్తావన రాకపోతే సదరు రాష్ట్రానికి అసలే నిధుల కేటాయింపు జరగనట్లు కాదని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బీజేపీ మిత్రపక్షాలైన జేడీయూ, టీడీపీలను సంతృప్తిపర్చడానికే బడ్జెలో ప్రాధాన్యమిచ్చారనే విపక్షాల ఆరోపణలను తోసిపుచ్చారు. యూపీఏ హయాంలో 2009–10 బడ్జెట్లో ఏకంగా 26 రాష్ట్రాల ఊసు లేదని, 2004–05 బడ్జెట్లో 17 రాష్ట్రాల ప్రస్తావనే లేదని.. అంటే ఆ రాష్ట్రాలకు నిధులు వెళ్లలేదా? అప్పుడు ప్రస్తావన లేని రాష్ట్రాలకు నిధులు ఆపి ఉంటే.. ఇప్పుడిలా కనీస ప్రస్తావన లేదనే అంశాన్ని లేవనెత్తవచ్చు’ అని నిర్మల అన్నారు. తమ ప్రభుత్వం ఏ ఒక్క రాష్ట్రానికి నిధులను నిరాకరించలేదన్నారు. -
పాత పన్ను విధానం రద్దు? ఆర్థిక మంత్రి చెప్పిందిదే..
Union Budget 2024: పన్ను చెల్లింపుదారులు ఆసక్తిగా ఎదురుచూసిన 2024-25 కేంద్ర బడ్జెట్‌ను ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయకుండా కొత్త పన్ను విధానాన్ని ప్రోత్సహించేలా కొన్ని చర్యలను ఈ బడ్జెట్లో ఎన్డీఏ సర్కారు ప్రకటించింది.ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది నుంచి పాత పన్ను విధానాన్ని ప్రభుత్వం రద్దు చేస్తుందా అనుమానం సర్వత్రా నెలకొంది. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. పాత పన్ను విధానాన్ని ఎప్పుడు రద్దు చేయాలనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆర్థిక మంత్రి తెలిపారు."పాత పన్ను విధానాన్ని ఏం చేయాలన్నదానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పన్ను విధానాన్ని సరళీకృతం చేయాలన్నదే మా ఉద్దేశం అని మాత్రమే చెప్పగలం. పాత పన్ను విధానం ఉంటుందో లేదో చెప్పలేను" అన్నారామె.కొత్త పన్ను విధానాన్ని ప్రోత్సహిస్తూ తాజా బడ్జెట్లో పలు ప్రయోజనాలను ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇందులో స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50,000 నుంచి రూ. 75,000కి పెంచడం, స్లాబ్‌లను విస్తరించడం వంటివి ఉన్నాయి. దీంతో జీతం పొందే పన్ను చెల్లింపుదారులు సంవత్సరానికి రూ.17,500 వరకు ఆదా చేసుకోవచ్చని ఆమె చెప్పారు.కొత్త పన్ను విధానాన్ని 2020లో ప్రవేశపెట్టారు. గత సంవత్సరం బడ్జెట్లో దీన్ని డిఫాల్ట్ చేశారు. పాత పన్ను విధానం ఇంటి అద్దె, సెలవు ప్రయాణ భత్యాలు, అలాగే సెక్షన్లు 80C, 80D, 80CCD(1b), 80CCD(2) కింద తగ్గింపులతో సహా అనేక తగ్గింపులు, మినహాయింపులను అందిస్తుంది. కొత్త పన్ను విధానంలో ఈ మినహాయింపులు, తగ్గింపులు లేవు. -
బడ్జెట్ 2024-25 వరుసగా మూడోసారి
-
చేనేత పట్టుచీరలో ‘బహి -ఖాతా’తో నిర్మలా సీతారామన్ రికార్డు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో 2024-25 సంవత్సరానికిగాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం వరుసగా ఏడవ బడ్జెట్‌ను సమర్పిస్తున్నారు. తద్వారా మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును అధిగమించి చరిత్ర సృష్టించారు. గతంలో 68 ఏళ్ల క్రితం సీడీ దేశ్‌ముఖ్ మాత్రమే ఈ ఘనత సాధించారు. అంతేకాదు గత ఏడాది లాగానే బ్రీఫ్ కేసుకు బదులుగా టాబ్లెట్తోనే బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు.మరో విశేషం ఏమిటంటే పీఎం నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత మంగళవారం తొలి బడ్జెట్‌ను సమర్పించేందుకు సీతారామన్ ఈసారి కూడా చేనేత చీరనే ఎంచుకున్నారు. తనకోసం ప్రత్యేకంగా రూపొందించిన అధికారం, శక్తికి ప్రతీకతోపాటు, భారతీయ హస్తకళాకారులపట్ల గౌరవంతో కాంట్రాస్టింగ్ పర్పుల్, పింక్ కలర్ బ్లౌజ్‌తో కూడిన తెల్లని గీతల హ్యాండ్లూమ్ చీరను ఎంచుకోవడం విశేషం.. ముఖ్యంగా సామరస్యం, భారతీయ సంస్కృతిలో కొత్త ప్రారంబానికి, స్వచ్ఛతకు సూచికగా వైట్ ఎంచుకున్నట్టు సమాచారం. అలాగే ఈ చీరకు పర్పుల్ కలర్, చేనేత చీర లుక్‌ను మరింత ఎలివేట్ చేసింది. పూర్తికాలపు తొలి మహిళా ఆర్థిక మంత్రి సీతారామన్ జూలై 5, 2019న తొలి బడ్జెట్‌ను సమర్పించారు. ఆ తరువాత కరోనా మహమ్మారి కాలంలో 2021లో నిర్మలా సీతారామన్ డిజిటల్ బడ్జెట్‌ను పరిచయం చేశారు. 'మేడ్ ఇన్ ఇండియా'టాబ్లెట్‌ని ఉపయోగించి, పేపర్‌లెస్ ఫార్మాట్లో బడ్జెట్‌ను సమర్పించారు. ఇక 2024-25 బ్రీఫ్‌కేస్‌కు బదులుగా రెడ్ క్లాత్ ఫోల్డర్‌ను ఉపయోగించారు. బడ్జెట్ సమర్పణకు ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఆమె భేటీ అయ్యారు. మంత్రి వర్గం ఆమోదం తరువాత రాష్ట్రపతిని కలవడానికి ముందు, నిర్మలా సీతారామన్ తన కార్యాలయం వెలుపల తన అధికారుల బృందంతో సంప్రదాయ ‘బ్రీఫ్‌కేస్’ ఫోటోకు పోజులిచ్చారు. ఈసారి బడ్జెట్‌కు బహి-ఖాతా అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. -
నేడు పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్
ఢిల్లీ: కేంద్ర బడ్జెట్ 2024-25 నేడే పార్లమెంట్ ముందుకు రానుంది. ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల ముగిసిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు సమర్పిస్తున్నారు.మోదీ ప్రభుత్వంలో వరుసగా ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు నిర్మలా సీతారామన్. ఎన్నికల నేపథ్యంలో గత ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టింది. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ రూపకల్పన చేశారు.నేడు ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌పై దేశంలోని వివిధ వర్గాలు అనేక ఆశలు, అంచనాలు పెట్టుకున్నారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల నేపథ్యంలో పన్ను ఉపశమనాలపై సామాన్యులు ఆశలు పెట్టుకున్నారు. ఉద్యోగులు పన్ను తగ్గింపును ఆశిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతూకంతో బడ్జెట్ ఉండాలని నిపుణులు కోరుకుంటున్నారు. -
Union Budget 2024-25: ఉపాధికి ఊతం.. ధరలకు కళ్లెం!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25)లో వృద్ధి రేటు అంచనాలను ప్రభుత్వం అచితూచి నిర్ధేశించింది. స్థూలదేశీయోత్తత్తి (జీడీపీ) వృద్ధి 6.5–7 శాతం స్థాయిలో ఉండొచ్చని ఆర్థిక సర్వేలో లెక్కగట్టింది. ఉపాధి కల్పనను పెంచాల్సిన అవసరం ఉందని కూడా నొక్కిచెప్పింది. ధరాభారంతో అల్లాడుతున్న పేదలు, అల్పాదాయ వర్గాలకు ప్రత్యక్ష నగదు బదిలీ లేదా కూపన్ల రూపంలో నిర్ధిష్టంగా ఆర్థిక తోడ్పాటు కల్పించాల్సిఇన అవసరం ఉందని కూడా సర్వే సూచించింది. దేశంలో తయారీ రంగానికి తోడ్పాటు అందించడంతో పాటు ఎగుమతులను పెంచాలంటే చైనా నుంచి ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెంచాల్సిందేనని స్పష్టం చేసింది. కాగా, గతేడాది (2023–24) 8.2 శాతం వృద్ధి రేటుతో పోలిస్తే, ఈ ఏడాది వృద్ధి రేటు అంచనాలు చాలా తక్కువగా ఉండటం విశేషం. ఆర్బీఐ నిర్దేశించిన 7.2 శాతం వృద్ధి రేటు అంచనాలతో పోలి్చనా సర్వేలో వృద్ధి అంచనా తగ్గింది. అనిశి్చత వర్షపాతం, ప్రైవేటు రంగంలో పెట్టుబడుల మందగమనం వంటివి వృద్ధి అంచనాల తగ్గుదలకు ప్రధాన కారణంగా సర్వే పేర్కొంది. ‘భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన వృద్ధి బాటలో పయనిస్తోంది. ప్రపంచ భౌగోళిక, రాజకీయ సవాళ్లన్నింటినీ దీటుగా ఎదుర్కొంటోంది’ అని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ సర్వే ముందుమాటలో పేర్కొన్నారు. కాగా, నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేయడం ద్వారా మధ్యకాలం పాటు నిలకడగా 7% వృద్ధి రేటు కొనసాగవచ్చని సర్వే తేల్చిచెప్పింది.కార్మిక సంస్కరణలు వేగవంతం... కేంద్రంలో వరుసగా మూడోసారి కొలువుదీరిన మోదీ సర్కారు 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా 2024–25 పూర్తి స్థాయి బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వ ప్రాధాన్యతలను ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రైవేటు పెట్టుబడులను పెంచడం, చిన్న–మధ్య తరహా వ్యాపారాలకు చేయూతనందించడం, సాగును లాభసాటిగా మార్చేలా వ్యవసాయ సంస్కరణలు, వాతావరణ మార్పుల సమస్యను ఎదుర్కొనేందుకు వనరుల సమీకరణ, ఆర్థిక అసమానాతలను తగ్గించడం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. విద్య, ఉపాధి మధ్య అంతరాన్ని పూడ్చాలని కూడా సర్వే నొక్కిచెప్పింది. దేశంలో ఉద్యోగ కల్పనకు మరింత సానుకూల వాతావరణాన్ని సృష్టించాలంటే కార్మిక సంస్కరణల అమలును వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని కూడా పేర్కొంది. ‘దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అనుగుణంగా 2030 నాటికి వ్యవసాయేతర రంగంలో ఏటా సగటున 78.5 లక్షల ఉద్యోగాలను కలి్పంచాల్సి ఉంటుంది’ అని సర్వే తెలిపింది. చైనా పెట్టుబడులు పెరగాలి... భారత్ ఎగుమతులు, దేశీ తయారీ రంగం మరింత పుంజుకోవాలంటే, చైనా నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెరగాలని, లేదంటే చైనా సరఫరా వ్యవస్థతో భారత్ అనుసంధానం కావాల్సి ఉంటుందని సర్వే అభిప్రాయపడింది. మరోపక్క, చైనా నుంచి దేశంలోకి దిగుమతులు తగ్గాలని కూడా పేర్కొంది. ‘అమెరికా తదితర కీలక మార్కెట్లకు భారత్ ఎగుమతులు భారీగా పెరగాలంటే చైనా పెట్టుబడులపై మనం మరింత దృష్టి సారించాలి. తూర్పు ఆసియా దేశాలు గతంలో ఇదే విధంగా లబ్ధి పొందాయి’ అని సర్వే తెలిపింది. 2020లో గాల్వాన్‌లో చోటు చేసుకున్న సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా భారత్ టిక్‌టాక్, యూసీ బ్రౌజర్‌తో సహా 200 చైనా మొబైల్ యాప్‌లను నిషేధించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా చైనా ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం బీవైడీ భారీ పెట్టుబడి ప్రతిపాదనలను కూడా తిరస్కరించింది. 2000–2024 మధ్య భారత్ అందుకున్న మొత్తం ఎఫ్‌డీఐలలో చైనా కేవలం 0.37% (2.5 బిలియన్ డాలర్లు) వాటాతో 22 స్థానంలో ఉంది. కాగా, కీలక ఖనిజాల విషయంలో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని సర్వే స్పష్టం చేసింది.పేదలకు కూపన్లు లేదా ప్రత్యక్ష నగదు బదిలీవడ్డీరేట్ల నిర్ణయంలో ఆహార ధరలను పక్కనబెట్టండి... ఆర్బీఐకి సర్వే సూచన వడ్డీ రేట్లను నిర్ణయించడంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆహార ద్రవ్యోల్బణాన్ని చూడటం మానేయాలని ఆర్థిక సర్వే సూచించింది. అధిక ఆహార ధరలను ఎదుర్కోవటానికి పేదలకు కూపన్లు లేదా ప్రత్యక్ష నగదు బదిలీని ప్రభుత్వం అన్వేíÙంచాలని సర్వే పేర్కొంది. ‘‘భారతదేశ ద్రవ్యోల్బణ లక్ష్య ఫ్రేమ్‌వర్క్.. ఫుడ్ ఆరి్టకల్స్‌ను పక్కనబెట్టాలి. అధిక ఆహార ధరలు చాలా సందర్భాల్లో సరఫరాలకు సంబంధించిన సమస్యే తప్ప, డిమాండ్ ప్రేరితం కాదు’’ అని ఆర్థిక సర్వే పేర్కొంది. మధ్య, దీర్ఘకాలిక ద్రవ్యోల్బణం అవుట్‌లుక్ ధరల యంత్రాంగం పటిష్టత, మార్కెట్ అంశాలు, నిత్యావసారాల దేశీయ ఉత్పత్తి, దిగుమతులు వంటి అంశాలపై ఆధారపడుతుందని వివరించింది. అననుకూల వాతావరణం, తక్కువ రిజర్వాయర్ స్థాయిలు, పంట నష్టం వ్యవసాయ ఉత్పత్తిని ప్రభావితం చేసి, గత రెండేళ్లలో ఆహార ధరలను పెంచడానికి దారితీసిందని కూడా సర్వే పేర్కొంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు–రెపో (ప్రస్తుతం 6.5 శాతం) నిర్ణయానికి ఆర్బీఐ వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణంపై ఆధారపడే సంగతి తెలిసిందే. ప్లస్ 2 లేదా మైనస్ 2తో ఇది 4 శాతంగా ఉండాలే చూడాలని ఆర్బీఐకి కేంద్రం నిర్ధేశిస్తోంది. ఈ సూచీలో ఫుడ్ ఆరి్టకల్స్ ఒక భాగం. రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతం లక్ష్యాన్ని సాధించడంలో ఆహార ధరలు ఒడిదుడుకులు తీవ్ర అడ్డంకిగా మారుతున్నాయి. ఇదే అంశంపై ఆందోళన వ్యక్తంచేస్తూ ఆర్బీఐ 2023 ఫిబ్రవరి నుంచి యథాతథ వడ్డీరేట్ల వ్యవస్థను కొనసాగిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. దీనిని పక్కనపెట్టి... రుణ రేట్లను తగ్గిస్తే ఆ నిర్ణయం వృద్ధికి దోహదపడుతుందన్నది సర్వే అభిప్రాయం. ప్రయివేట్ రంగ పెట్టుబడులు కీలకం ప్రయివేట్ రంగ ఫైనాన్సింగ్, కొత్త వర్గాల నుంచి వనరుల సమీకరణ దేశీయంగా నాణ్యమైన మౌలిక సదుపాయాల(ఇన్ఫ్రా) నిర్మాణానికి కీలకమని ఆర్థిక సర్వే పేర్కొంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి పాలసీలు, సంస్థాగత మద్దతుతోపాటు.. రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు సైతం ప్రధాన పాత్ర పోషించవలసి ఉంటుంది. మౌలిక రంగంలోని వివిధ విభాగాలకు పెట్టుబడులు సమకూర్చడంలో గణాంకాలు, మార్గదర్శకాలు తదితర నివేదికలు అత్యవసరం. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కున్న డిమాండ్‌ను అంచనా వేయడం, ఉపవిభాగాల కల్పనలో సౌకర్యాల వినియోగం వంటి అంశాలకు ప్రస్తుత డేటాబేస్ సామర్థ్యం సరిపోదు. ఆర్థికపరమైన ఒత్తిడి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏకీకృత ప్రణాళికల నేపథ్యంలో ఆచరణసాధ్యమైన ప్రాజెక్టులను చేపట్టి పూర్తిచేయవలసి ఉంటుంది. ఇందుకు ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యం కీలకమవుతుంది.రైల్వేల సామర్థ్యం పెరగాలి.. సామర్థ్యాలను వేగంగా పెంచుకోవడం, కార్యకలాపాలను ఆధునీకరించుకోవడం, ఇంధన ఆదా తదితర అంశాలపై రైల్వేస్ ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఎకనమిక్ సర్వే సూచించింది. ఇందుకు అనుగుణంగా సరకు రవాణా కోసం ప్రత్యేక కారిడార్లు, హై స్పీడ్ రైళ్లు, వందే భారత్.. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ .. ఆస్థా స్పెషల్ ట్రెయిన్స్ వంటి ఆధునిక ప్యాసింజర్ సరీ్వస్ రైళ్లు, అధిక సామర్థ్యం ఉండే రైల్వే కోచ్‌లు, లాస్ట్–మైల్ రైల్ లింకేజీలు మొదలైన వాటిపై ఇన్వెస్ట్ చేయాలని పేర్కొంది. లాజిస్టిక్స్ వ్యయాలను, కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు రైల్వేస్ 3 ప్రధాన కారిడార్ల రూపకల్పనలో ఉందని వివరించింది. ట్రాఫిక్ సాంద్రత అధికంగా ఉండే కారిడార్లు, ఇంధన.. ఖనిజ.. సిమెంట్ కారిడార్లు, రైల్ సాగర్ (పోర్టు కనెక్టివిటీ) కారిడార్లు వీటిలో ఉన్నాయని పేర్కొంది.పర్యాటక రంగంలో అవకాశాలు అపారం..పర్యాటక రంగం కలి్పస్తున్న అవకాశాలను సొంతం చేసుకోవాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే సూచించింది. కరోనా విపత్తు తర్వాత పర్యాటక రంగం వేగంగా కోలుకోవడాన్ని ప్రస్తావించింది. ‘2023లో 92 లక్షల మంది విదేశీ పర్యాటకులు భారత్‌ను సందర్శించారు. క్రితం ఏడాదితో పోల్చి చూస్తే 43.5 శాతం ఎక్కువ. భారత పర్యాటక రంగం వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచంలో 39వ ర్యాంక్ సొంతం చేసుకుంది. పర్యాటకం ద్వారా రూ. 2.3 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం లభించింది. ఇది క్రితం ఏడాదితో పోలి్చతే 65.7% అధికం’అని సర్వే తెలిపింది. కృత్రిమ మేథ (ఏఐ) భారత సేవల ఎగుమతులపై ప్రభావం చూపిస్తుందన్న ‘క్యాపిటల్ ఎకనమిక్స్’ నివేదికను ప్రస్తావిస్తూ.. ఉపాధి కల్పన విషయంలో తక్కువ నైపుణ్యాలపై ఆధారపడిన పర్యాటకం ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తోందని పేర్కొంది. వృద్ధిలో క్యాపిటల్ మార్కెట్లు కీలకందేశీ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో క్యాపిటల్ మార్కెట్లు కీలకంగా మారుతున్నట్లు ఆర్థిక సర్వే పేర్కొంది. టెక్నాలజీ, ఇన్నొవేషన్, డిజిటైజేషన్ దన్నుతో మూలధన నిర్మాణం, పెట్టుబడుల విస్తరణలో క్యాపిటల్ మార్కెట్ల వాటా బలపడుతోంది. అంతేకాకుండా దేశీ స్టాక్ మార్కెట్లు ప్రపంచ భౌగోళిక, రాజకీయ, ఆర్థిక విపత్కర పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాయి. పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ రిసు్కలు, వడ్డీ రేట్లుసహా కమోడిటీ ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలోనూ దేశీ క్యాపిటల్ మార్కెట్లు గతేడాది(2023–24) ఉత్తమ పనితీరు చూపిన వర్ధమాన మార్కెట్లలో ఒకటిగా నిలిచాయి. ఈ కాలంలో బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ ఇన్వెస్టర్లకు భారీ(25%కిపైగా) రిటర్నులు అందించాయి. ఇందుకు స్థూల ఆర్థిక పరిస్థితుల స్థిరత్వం, దేశీ ఇన్వెస్టర్ల బలిమి తోడ్పాటునిచి్చనట్లు సీతారామన్ పేర్కొన్నారు. 2024 మే నెలలో ఈక్విటీ మార్కెట్ల విలువ 5 ట్రిలియన్ డాలర్ల(రూ. 415 లక్షల కోట్లు)కు చేరింది. ప్రస్తుతం 9.5 కోట్లమంది రిటైల్ ఇన్వెస్టర్లు ప్రత్యక్షంగా 2,500 లిస్టెడ్ కంపెనీలలో 10% వాటాను కలిగి ఉన్నారు. గతేడాది ప్రైమరీ మార్కెట్ల ద్వారా రూ. 10.9 లక్షల కోట్ల మూలధన ఏర్పాటుకు సహకారమందింది.వ్యవసాయంలో సత్వర సంస్కరణలు వ్యవసాయ రంగంలో సంస్కరణలను వెంటనే చేపట్టాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే నొక్కి చెప్పింది. లేదంటే ఈ రంగంలో నెలకొన్న వ్యవస్థీకృత సమస్యలు దేశ వృద్ధికి అడ్డుపడతాయని విధానకర్తలను హెచ్చరించింది. తూర్పు ఆసియా దేశాలు, అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలతో పోలి్చతే.. దేశ వ్యవసాయరంగం సామర్థ్యాలను ఇంకా పూర్తి స్థాయిలో వెలుగులోకి తేవాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పనకు వ్యవసాయరంగ సామర్థ్యాలను ఉపయోగించుకోవాలని సూచించింది. ఈ రంగంపై దేశవ్యాప్తంగా చర్చలు అవసరమని నాగేశ్వరన్ పిలుపునిచ్చారు. ‘‘దేశ వ్యవసాయ రంగం ప్రస్తుతం ఎలాంటి సంక్షోభంలో లేదు. కాకపోతే నిర్మాణాత్మక మార్పు అవసరం. ఎందుకంటే వాతావరణ మార్పులు, నీటి సమస్య రానున్న రోజుల్లో పెద్దవి కానున్నాయి’’అని సర్వే స్పష్టం చేసింది. ప్రస్తుతం రైతులకు ఎరువులు, విద్యుత్, ఆదాయపన్ను, మద్దతు ధరల పరంగా సబ్సిడీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్నప్పటికీ ప్రస్తుత విధానాలను తిరిగి సమీక్షించా లని అభిప్రాయపడింది. టెక్నాలజీ ఆధునికీకరణ, మార్కెటింగ్ మార్గాలను మెరుగుపరచడం, సాగులో ఆవిష్కరణలు, వ్యవసాయం–పరిశ్రమల మధ్య అనుసంధానత పెంపు దిశగా సంస్కరణలను సూచించింది. ఆర్థిక సర్వే హైలైట్స్..→ అసాధారణరీతిలో వరుసగా మూడోసారి ప్రజలు మోదీ 3.0 సర్కారుకు పట్టం కట్టడం దేశంలో రాజకీయపరమైన, విధానపరమైన స్థిరత్వాతనికి అద్దం పడుతోంది. → అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ దేశీయ వృద్ధి చోదకాలు 2023–24లో ఆర్థిక పురోగతికి దన్నుగా నిలిచాయి. → భౌగోళిక, రాజకీయ సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటూ భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన, స్థిరమైన ప్రగతిని సాధిస్తోంది. → కరోనా మహమ్మారి తదనంతరం దేశీయ వ్యాపార, వాణిజ్య రంగం రికవరీ కోసం ప్రభుత్వం అనేక కీలక చర్యలు తీసుకుంది. → వాణిజ్యం, పెట్టుబడులు, వాతావారణ మార్పుల వంటి ప్రపంచ సమస్యల విషయంలో వివిధ దేశాలతో ఒప్పందాలు క్లిష్టతరంగా మారాయి. → స్వల్పకాలానికి ద్రవ్యోల్బణం అంచనాలు తగ్గుముఖ ధరోణిలోనే ఉన్నప్పటికీ, పప్పుధాన్యాల కొరత , ధరల ఒత్తిడి నిలకడగా కొనసాగుతోంది. → సాధారణ వర్షపాతం, దిగుమతులకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ధరలు శాంతించడంతో ఆర్బీఐ సానుకూల ద్రవ్యోల్బణం అంచనాలకు దన్నుగా నిలుస్తోంది. → అధిక ఆహార ధరలతో అల్లాడుతున్న పేదలు, అల్పాదాయ వర్గాలకు ప్రత్యక్ష నగదు బదిలీలు, నిర్దిష్ట కొనుగోళ్లకు కూపన్ల రూపంలో కొంతకాలం పాటు ప్రయోజనాలను అందించాలి. → భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ఆర్బీఐ ద్రవ్యపరపతి విధానంపై ప్రభావం చూపొచ్చు. → భారతదేశ ఆర్థిక సేవల రంగం పటిష్టమైన అవకాశాలున్నాయి. ఈ రంగంలో కీలకమైన మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా, దేశీయంగా తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలి. → కార్పొరేట్ కంపెనీలు, బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లు పటిష్టంగా ఉండటంతో ప్రైవేటు పెట్టుబడులు మరింత పుంజుకోనున్నాయి. → పన్ను నిబంధలనను సరళతరం చేయడం, వ్యయ నియంత్రణ, డిజిటైజేషన్ వంటివి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను సాధించేందుకు దోహదం చేస్తున్నాయి. → భారత వృద్ధి పథానికి క్యాపిటల్ మార్కెట్లు కీలకంగా నిలుస్తున్నాయి. ప్రపంచ రాజకీయ, ఆర్థిక షాక్‌లకు మన మార్కెట్లు ఎదురొడ్డి నిలుస్తున్నాయి. → చైనా నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) జోరందుకోవడం వల్ల ప్రపంచ సరఫరా వ్యవస్థలు మెరుగుపరచడంలో, ఎగుమతులను పెంచుకోవడంలో భారత్‌కు దన్నుగా నిలుస్తుంది. → 2024లో దేశంలోకి వచి్చన రెమిటెన్సులు (ప్రవాసులు స్వదేశానికి పంపిన నిధులు) 3.4 శాతం వృద్ధితో 124 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ ఏడాది ఈ మొత్తం 129 బిలియన్ డాలర్లను తాకనుంది.గ్రీన్ ఎనర్జీ @ రూ. 30 లక్షల కోట్ల పెట్టుబడులు దేశీయంగా 2024–2030 మధ్య కాలంలో పునరుత్పాదక ఇంధన (ఆర్ఈ) రంగంలో రూ. 30.5 లక్షల కోట్ల పెట్టుబడులు రాగలవని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఇందుకోసం స్థల సమీకరణ సమస్యలను పరిష్కరించుకోవడం, సానుకూల నిబంధనలతో నిధులను సమీకరించుకోవడం కీలకమని పేర్కొంది. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ లక్ష్యాలను సాధించే క్రమంలో వివిధ విభాగాలకు ఆర్థికంగా లబ్ధి చేకూరగలదని వివరించింది. మరోవైపు, ఉద్గారాల విషయంలో 2070 నాటికి తటస్థ స్థాయికి చేరుకోవాలంటే భారత్‌కు ఏటా సగటున 28 బిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయని సర్వే తెలిపింది. నిధులను సమకూర్చుకోవడమనేది ఒక అసాధారణ సవాలు కాగలదని వివరించింది.14 శాతం ఐఫోన్ల తయారీ ఇక్కడే ఎల్రక్టానిక్స్ తయారీలో అంతర్జాతీయంగా భారత్ తన వాటాను పెంచుకుంటున్నట్టు ఆర్థిక సర్వే తెలిపింది. 2023–24లో స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ యాపిల్ 14% ఐఫోన్లను భారత్‌లోనే అసెంబుల్ చేసినట్టు వెల్లడించింది. దేశ ఎలక్ట్రానిక్స్ తయారీ 2014 తర్వాత నుంచి గణనీయమైన వృద్ధిని చూస్తోందంటూ, 2021–22లో అంతర్జాతీయంగా మన వాటా 3.7%. దేశ జీడీపీలో 4% వాటాను ఆక్రమించింది. ఎల్రక్టానిక్స్ ఎగుమతుల్లో మొబైల్ ఫోన్ల విభాగం అధిక వృద్ధిని చూస్తోందని, అమెరికాకు మొబైల్ ఫోన్ల ఎగుమతులు 2022–23లో 2.2 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2023–24లో 5.7 బిలియన్ డాలర్లకు దూసుకుపోయినట్టు వివరించింది. 2022–23లో దేశీయంగా ఎల్రక్టానిక్స్ తయారీ రూ.8.22 లక్షల కోట్లకు చేరితే, ఎగుమతులు రూ.1.9 లక్షల కోట్లకు పెరిగినట్టు తెలిపింది.ఏటా 78 లక్షల కొలువులు సృష్టించాలి.. కార్మిక శక్తి పెరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయేతర రంగాల్లో 2030 నాటికి ఏటా దాదాపు 78.5 లక్షల ఉద్యోగాలను కలి్పంచాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఈ విషయంలో ప్రైవేట్ రంగం కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని పేర్కొంది. ఆర్థిక వృద్ధి అనేది ఉద్యోగాల కల్పన కన్నా జీవనోపాధి కల్పించడంపై ఆధారపడి ఉంటుందని సర్వే వివరించింది. వ్యవసాయ రంగంలో కార్మిక శక్తి 2023లో 45.8 శాతం స్థాయి నుంచి 2047 నాటికి 25 శాతానికి తగ్గుతుందని తెలిపింది. ఇదంతా వ్యవసాయేతర రంగాల వైపు మళ్లు తుంది కాబట్టి ఆ మేరకు ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఏర్పడుతుందని సర్వే పేర్కొంది. పీఎల్ఐ స్కీములు, మిత్రా టెక్స్టైల్ స్కీము మొదలైనవి ఇందుకు కొంత తోడ్పడగలవని తెలిపింది. స్టాఫింగ్ కంపెనీల ద్వారా తాత్కాలిక సిబ్బంది నియామకాలు పెరుగుతున్నందున అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు దీన్నొక మాధ్యమంగా ఉపయోగించుకోవచ్చని వివరించింది. తయారీ రంగ శ్రేయస్సు, ఆర్థిక వృద్ధి సాధన దిశగా మెరుగైన ఫలితాలు సాధించేందుకు వ్యాపారసంస్థలకు ఇచ్చే ప్రోత్సాహకాలను పునఃసమీక్షించాలని సూచించింది. వర్కర్ల తొలగింపునకు కాకుండా ఉద్యోగాల కల్పనకు కృత్రిమ మేథ(ఏఐ)రెని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై కార్పొరేట్లు మరింతగా దృష్టి పెట్టాలని ముందుమాటలో ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. వికసిత భారత్ వైపు పయనంవికసిత భారత్‌ను నిర్మించే దిశగా ముందుకు సాగుతున్నందున ప్రస్తుత పటిష్టతలతోపాటు మరింత పురోగతికి అవకాశాలు ఉన్న మార్గాలను సర్వే గుర్తించింది. ఆర్థిక సర్వే మన ఆర్థిక వ్యవస్థ ప్రబలమైన పటిష్టతలతను హైలైట్ చేస్తోంది. మా ప్రభుత్వం తీసుకువచి్చన వివిధ సంస్కరణల ఫలితాలను కూడా సుస్పష్టం చేస్తోంది. – ఎక్స్ పోస్ట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అంచనాలు సుసాధ్యం7 శాతం వృద్ధి రేటు సాధన భారత్‌కు తేలికే. మేము నిరాశావాదులం కాదు. రుతుపవనాల పురోగతి సవాళ్లను కూడా మేము పరిగణనలోకి తీసుకుంటున్నాము. ఫైనాన్షియల్ రంగం అవుట్‌లుక్ పటిష్టంగా కనబడుతోందని, పొదుపులను ఫైనాన్షియల్ మార్కెట్లవైపునకు మళ్లించడాన్ని చూస్తే.. భారత్ కుటుంబాలు కష్టాల్లో లేవన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. – వి. అనంత నాగేశ్వరన్, సీఈఏ పార్లమెంట్లో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన నేపథ్యంలో బడ్జెట్ బృందంతో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, సహాయమంత్రి పంకజ్ చౌదరి -
ఆర్థిక సర్వే, బడ్జెట్ మధ్య తేడా ఏమిటంటే..
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం కేంద్ర ఆర్థిక సామాజిక సర్వే 2024-25ను విడుదల చేయనున్నారు. జులై 23న కేంద్ర బడ్జెట్‌ను ప్రకటిస్తారు. అసలు ఆర్థిక సర్వే అంటే ఏమిటి.. ఆర్థిక సర్వేకు, బడ్జెట్‌కు మధ్య తేడా ఏంటీ.. అనే కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం.ఆర్థిక సర్వే అంటే..దేశ ఆర్థిక వ్యవస్థకు దిశా నిర్దేశం చేసేదిగా ఆర్థిక సర్వేను పేర్కొంటారు. ఏటా దీని ఆధారంగానే కేంద్ర బడ్జెట్ రూపకల్పన జరుగుతుంది. సాధారణంగా కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు ఆధ్వర్యంలో ఈ నివేదికను రూపొందిస్తారు. ప్రస్తుత కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారుగా వి.అనంత నాగేశ్వరన్ వ్యవహరిస్తున్నారు.ఆర్థిక సర్వే, బడ్జెట్ మధ్య తేడాఆర్థిక సర్వేలో ప్రస్తుత ఏడాది దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరును విశ్లేషిస్తారు. ఆర్థిక బలోపేతానికి రానున్న కాలంలో చేయాల్సిన చర్యలను పేర్కొంటారు. కేంద్ర బడ్జెట్లో వివిధ రంగాల్లో రాబడి, ఖర్చుల కేటాయింపులను తెలియజేస్తారు.సర్వేలో ఉండే అంశాలుదేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉందనే విషయాన్ని ఆర్థిక సర్వే స్పష్టంగా తెలియజేస్తుంది. ముఖ్యంగా ప్రధాన రంగాలైన వ్యవసాయం, పారిశ్రామికోత్పత్తి, మౌలిక సదుపాయాలు, ఎగుమతి - దిగుమతులు, విదేశీ మారకనిల్వలు, నగదు చలామణి, ఉద్యోగాలు, ధరల పెరుగుదల లాంటి అంశాలను వివరిస్తుంది. ప్రభుత్వ విధాన నిర్ణయాలు, వాటివల్ల వస్తోన్న ఫలితాలను విశ్లేషిస్తుంది.ఇదీ చదవండి: మహిళలు ఏం కోరుతున్నారంటే..పరిణామ క్రమంబడ్జెట్ కంటే ముందు ఆర్థిక సర్వేను పార్లమెంట్లో ప్రవేశపెట్టడం ఎన్నో ఏళ్ల నుంచి ఆనవాయితీగా వస్తోంది. దీన్ని మొదటిసారి 1950-51లో పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. 1964 నుంచి దీన్ని బడ్జెట్‌కి ముందు ప్రత్యేకంగా ప్రవేశపెడుతున్నారు. కేంద్ర బడ్జెట్లో కేటాయింపుల ప్రతిపాదనలను తేలిగ్గా అర్థం చేసుకోవడానికి దీన్ని ప్రత్యేకంగా ప్రకటిస్తున్నారు. -
Budget 2024: బడ్జెట్, క్యూ1 ఫలితాలపై దృష్టి
ముంబై: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు సమగ్ర బడ్జెట్– 2024కు అనుగుణంగానే ఈ వారం స్టాక్ మార్కెట్ కదలాడవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అలాగే కార్పొరేట్ కంపెనీల క్యూ1 ఆర్థిక ఫలితాలపైనా మార్కెట్ వర్గాలు దృష్టి సారించవచ్చు. జూలై డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు (గురువారం), ఆయా దేశాల స్థూల ఆర్థిక గణాంకాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయవచ్చంటున్నారు. వీటితో పాటు ప్రపంచ మార్కెట్ల గమనం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు, రూపాయి ట్రేడింగ్, క్రూడ్ కదలికలు తదితర సాధారణ అంశాలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. మార్కెట్‌పై బడ్జెట్ ప్రభావమెంత..? ఎన్డీఏ 3.0 ప్రభుత్వం ఈ జూలై 23న (మంగళవారం) ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్ కోసం మార్కెట్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఆర్థిక లోటు, మూలధన వ్యయాలు, సామాజిక వ్యయాల కేటాయింపుల మధ్య సమతుల్యత చేకూర్చే దిశగా ప్రభుత్వం ప్రయతి్నస్తుండటంతో ఈసారి ‘పారిశ్రామిక అనుకూల బడ్జెట్’ను నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉద్యోగ కల్పన, మేక్ ఇన్ ఇండియా, గ్రీన్ ఎనర్జీ, పట్టణ, గ్రామీణాభివృద్ధి అంశాలపై దృష్టి సారించే వీలుంది. అలాగే ‘దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను’పై ప్రకటన కోసం దేశీయ విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘‘బడ్జెట్ అంచనాలను అందుకుంటే, మార్కెట్‌కు మరింత స్థిరత్వం లభిస్తుంది. రక్షణ, రైల్వే, మౌలిక రంగ షేర్లలో కదలికలు అధికంగా ఉండొచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌పై దృష్టి మార్కెట్ ముందుగా గత వారాంతాన వెల్లడైన రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, యస్ బ్యాంక్ క్యూ1 ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక ఈ వారంలో బీఎస్ఈ ఎక్సే్చంజీలో లిస్టయిన 298 కంపెనీలు జూన్ క్వార్టర్ ఫలితాలను వెల్లడించనున్నాయి. బజాజ్ ఫైనాన్స్, హెచ్‌యూఎల్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, ఎల్అండ్టీ, ఎస్బీఐ ఇన్సూరెన్స్, నెస్లే, సిప్లా, ఇండస్ఇండ్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, ఐసీఐసీఐ బ్యాంకులున్నాయి. వీటితో పాటు ఇండిగో, ఐసీఐసీఐ ప్రుడెన్సియల్ లైఫ్ ఇన్సూరెన్స్, అలైడ్ బ్లెండర్స్, ఐడీబీఐ బ్యాంక్, సుజ్లాన్ ఎనర్జీ, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఎంఅండ్ఎం ఫైనాన్స్ సరీ్వసెస్, టొరెంట్ ఫార్మా, యూనిటెడ్ స్పిర్పిట్స్ కంపెనీలు తమ తొలి త్రైమాసిక ఫలితాలు వెల్లడించనున్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. ఆయా దేశాల స్థూల ఆర్థిక గణాంకాలు యూరోజోన్ జూలై వినియోగదారుల విశ్వాస గణాంకాలు, అమెరికా జూన్ గృహ అమ్మకాలు మంగళవారం విడుదల కానున్నాయి. అమెరికా, జపాన్ యూరోజోన్లు బుధవారం జూలై నెలకు సంబంధించి తయారీ, సేవారంగ గణాంకాలను ప్రకటించనున్నాయి. అదే రోజున దేశీయ జూలై హెచ్ఎస్బీసీ తయారీ, సేవారంగ పీఎంఐ గణాంకాలు విడుదల కానున్నాయి. అమెరికా క్యూ2 జీడీపీ డేటా, కోర్ పీసీఈ ధరల గణాంకాలు, వాస్తవ వినియోగదారుల వ్యయ డేటా గురువారం వెల్ల డి కానుంది. ఇక వారాంతపు రోజైన శుక్రవారం ఆర్బీఐ జూలై 19తో ముగిసిన వారపు ఫారెక్స్ నిల్వ లు ప్రకటించనుంది. ఆయా దేశాలకు సంబంధించిన కీలక స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది.గురువారం డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపుఈ గురువారం(జూలై 25న) నిఫ్టీకి చెందిన జూలై సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘‘సాంకేతికంగా నిఫ్టీ 24,700 వద్ద కీలక నిరోదాన్ని కలిగి ఉంది. ఈ స్థాయిని చేధించగలిగితే 25,000 స్థాయిని శ్రేణిని పరీక్షిస్తుంది. దిగువ స్థాయిలో 24,000 వద్ద తొలి మద్దతు, 23,500 వద్ద మరో కీలక మద్దతు స్థాయిలు ఉన్నాయి’’ అని ఆప్షన్ డేటా సూచిస్తోంది. -
Budget 2024 : బడ్జెట్ ‘హల్వా’ మెప్పిస్తుందా?
ఒక పక్క ధరాభారం... మరోపక్క పన్నుల మోత! దేశంలో వేతన జీవుల నుండి సామాన్యుల వరకు ఈ సెగ గట్టిగానే తగులుతోంది. వికసిత భారతదేశమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్న మోదీ 3.0 సర్కారుకు ఉపాధికల్పన ఇప్పుడు చాలా కీలకంగా మారింది. పారిశ్రామికంగా దేశాన్ని పరుగులు పెట్టిస్తూనే.. ప్రజలకు ఆర్థిక ఉపశమనం కలి్పంచాల్సిన అవసరం కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో రికార్డు స్థాయిలో వరుసగా ఏడో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వైపు అన్ని వర్గాలూ ఆశగా ఎదురుచూస్తున్నాయి. మరి సీతమ్మ బడ్జెట్ ‘హల్వా’ అందరినీ మెప్పిస్తుందా? వివిధ రంగాలు, పరిశ్రమ వర్గాల అంచనాలు సాకారమవుతాయా? మధ్యతరగతి ఆశలు నెరవేరుతాయా? అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా అవతరించాలి’.. కేంద్రంలోని మోదీ సర్కారు దీర్ఘకాలిక లక్ష్యం ఇది. అమెరికా, యూరప్, చైనా ఆర్థికవ్యవస్థలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్న తరుణంలోనూ భారత్ ప్రపంచంలోనే వేగవంతమైన వృద్ధి (7% పైనే)తో సాగిపోతోంది. ప్రస్తుతం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న దేశం అమెరికా, చైనా తర్వాత మూడో స్థానానికి చేరుకుంటుందని అంచనా. ఈ స్వప్నం సాకారం కావాలంటే ఉపాధి అవకాశాల కల్పన, పరిశ్రమల ఏర్పాటు, మౌలిక వసతులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం అవసరం. పన్నుల ఉపశమనం కలి్పంచాలన్న డిమాండ్లు ఉండనే ఉన్నాయి. రానున్న బడ్జెట్లో చరిత్రాత్మక, ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు ఉంటాయంటూ పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇప్పటికే సంకేతం పంపారు. దీంతో ఈ నెల 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమరి్పంచే 2023–24 పూర్తి స్థాయి బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.పన్నుల భారం తగ్గించరూ.. ప్రస్తుత పరిస్థితి: ఆదాయపన్ను, జీఎస్టీ తదితరాల రూపంలో ప్రజలపై ప్రత్యక్ష, పరోక్ష పన్నుల బాదుడు గడిచిన పదేళ్లలో గణనీయంగా పెరిగిపోయింది. ఇది ఏ స్థాయిలో అంటే.. 2023–24లో కేంద్ర సర్కారు రూ.34.6 లక్షల కోట్ల భారీ మొత్తాన్ని ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రూపంలో సమకూర్చుకుంది. ఒక వస్తువు చేతులు మారుతున్న ప్రతి దశలోనూ పన్ను పరిధిలోకి వెళుతోంది. ఉదాహరణకు డీజిల్, పెట్రోల్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్, వ్యాట్ ట్యాక్స్ విధిస్తుంటాయి. వాహనం వాడే ప్రతి ఒక్కరూ ఇంధనం కొనుగోలుపై పన్ను చెల్లిస్తున్నట్టే. వస్తు రవాణాకు వినియోగించే లారీలు, ట్రక్కులు, రైల్వే డీజిల్, విద్యుత్‌ను ఇంధనంగా వినియోగిస్తుంటాయి. ఆ దశలో అవి డీజిల్, విద్యుత్‌పై పన్ను చెల్లిస్తుంటాయి. ఆ చార్జీల భారం వస్తువులపై పడి, చివరికి వినియోగదారుడు తన వంతు కూడా చెల్లించాల్సి వస్తోంది. ఒక కంపెనీ తన లాభం నుంచి 25 శాతం పన్ను చెల్లించాలి. ఆ తర్వాతే డివిడెండ్ పంపిణీ చేస్తుంది. ఈ డివిడెండ్ అందుకున్న వారు దానిపై తమ ఆదాయ స్థాయికి అనుగుణంగా పన్ను చెల్లించాలి. అంటే రెండు దశల్లో డివిడెండ్‌పై పన్ను పడినట్టు అవుతోంది. ఇలా ప్రత్యక్షం కంటే, పరోక్ష పన్నుల భారం ప్రజలపై బాగా పెరిగిపోయింది. వ్యవసాయం– గ్రామీణంప్రస్తుత పరిస్థితి: రైతుల ఆదాయాన్ని, వారి ఆర్థిక స్థితిగతులు పెంచేందుకు కృషి చేస్తామంటున్న మోదీ సర్కారు.. ఈ రంగానికి ఆశించిన స్థాయిలో కేటాయింపులు చేయడం లేదు. 2023–24 బడ్జెట్లో సాగు రంగానికి రూ.1.25 లక్షల కోట్లు కేటాయించారు. దీంతో పోలి్చతే కేవలం 0.6 శాతం పెంచి 2024–25 మధ్యంతర బడ్జెట్లో రూ.1.27 లక్షల కోట్లు కేటాయించారు. గ్రామీణాభివృద్ధి కేటాయింపులు మాత్రం 4.2 శాతం పెంచి 1.80 లక్షల కోట్లు చూపించారు. అంచనాలు: పంట నష్టాన్ని తగ్గించి, మెరుగైన రేటు వచ్చే దిశగా బడ్జెట్లో చర్యలు ప్రకటిస్తారన్న ఆశలు రైతన్నల్లో నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా రైతులు అందరికీ నానో డీఏపీ ఎరువులను అందుబాటులోకి తీసుకురావడం, పంట ఉత్పత్తి అనంతరం నిల్వ, సరఫరా వ్యవస్థ, ప్రాసెసింగ్, మార్కెటింగ్‌లో ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సాహిస్తామని మధ్యంతర బడ్జెట్లో చేసిన ప్రకటనలు ఈ రంగానికి బలాన్నిచ్చేవే. ఇవి కాకుండా పూర్తి స్థాయి బడ్జెట్లో అదనపు చర్యలు ఏమి ప్రకటిస్తారో చూడాలి. ముఖ్యంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు పెంచాలన్న డిమాండ్‌ను పరిశీలించవచ్చు. అంచనాలు: పాత పన్ను విధానం నుంచి ప్రజలను క్రమంగా కొత్త విధానంలోకి తీసుకురావాలన్నది కేంద్రం ఆశయం. పాత విధానంలో పీపీఎఫ్, ఫిక్స్డ్ డిపాజిట్, చిన్న మొత్తాల పొదుపు పథకాలు, పిల్లల స్కూల్ ట్యూషన్ ఫీజులు, ఈఎల్ఎస్ఎస్, జీవిత బీమా, ఆరోగ్య బీమా ప్రీమియం, గృహ రుణం చెల్లింపులపై గణనీయమైన పన్ను ప్రయోజనాలున్నాయి. అందరూ వీటిని వినియోగించుకోలేరు. కనుక అందరికీ ఉపయోగపడే విధంగా, పారదర్శకంగా ఉండేందుకు మినహాయింపుల్లేని కొత్త పన్ను విధానాన్నే అంతిమంగా అమలు చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. అందుకని నూతన పన్ను విధానంలోకి మళ్లే దిశగా పన్ను చెల్లింపుదారులను ప్రోత్సహించేందుకు ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు చేయవచ్చని అంచనాలున్నాయి. పరిశ్రమ భాగస్వాములు కూడా ఆర్థిక మంత్రిని ఇదే కోరాయి. స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.50వేల నుంచి రూ. లక్షకు పెంచొచ్చన్న అంచనాలున్నాయి. పాత పన్ను విధానంలో రూ.2.5 లక్షల ప్రాథమిక పన్ను మినహాయింపు పదేళ్ల నుంచి అదే స్థాయిలో కొనసాగుతోంది. దీన్ని పెంచాలన్న డిమాండ్లు ఉన్నాయి. కానీ, పాత పన్ను విధానాన్ని నిరుత్సాహపరిచేందుకు అందులో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చని భావిస్తున్నారు. పన్ను మినహాయింపులను పెంచడం వల్ల ప్రజల చేతుల్లో ఖర్చు చేసే ఆదాయం పెరిగి, అది వినియోగంలోకి వస్తుందని.. అంతిమంగా దేశ వృద్ధికి దోహదం చేస్తుందని నిపుణులు అంటున్నారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో సాధించిన 8.2 శాతం వృద్ధి రేటు ఇక మీదటా గరిష్టాల్లో నిలదొక్కుకునేందుకు ఈ తరహా చర్యలు అవసరమన్న వాదన వినిపిస్తోంది. బీమాపై డిమాండ్లు ఇవీ.. ఇక జీవిత బీమా, ఆరోగ్య బీమాపై జీఎస్టీ భారం తగ్గించాలన్న బలమైన డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. వీటిపై 18 శాతం జీఎస్టీ అమలవుతోంది. దేశంలో ప్రతి ఒక్కరికీ బీమాను చేరువ చేసేందుకు పన్ను రేటును 5 శాతానికి తగ్గించాలని పరిశ్రమ కోరుతోంది. ఆరోగ్యం, వైద్యం కోసం చేసే ఖర్చులు గణనీయంగా పెరిగిపోయినప్పటికీ సెక్షన్ 80డీ కింద హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలకు కలి్పస్తున్న వెసులుబాటులో (60ఏళ్లలోపు ఉంటే రూ.25 వేలు, 60 ఏళ్లు నిండిన వారికి రూ.50 వేలు) గత తొమ్మిదేళ్లుగా ఎలాంటి మార్పులు లేకపోవడాన్ని ఆర్థిక మంత్రి దృష్టికి పరిశ్రమ తీసుకెళ్లింది. ద్రవ్యోల్బణానికి ముడిపెట్టి, ఈ సెక్షన్ కింద హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై పన్ను మినహాయింపు ఏటా ఆటోమేటిక్‌గా పెరిగే విధంగా ఉంటే బావుంటుందని తెలిపింది. ఇంటి అద్దెలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ) మినహాయింపును పెంచాలన్న డిమాండ్ ఉంది. భారీ పన్ను వసూళ్లు అంచనాల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకునేందుకు బడ్జెట్‌కు వెసులుబాటు ఉంటుందన్నది విశ్లేషణ.దీర్ఘకాల మూలధన ఆస్తుల నిర్వచనం మారుతుందా? దీర్ఘకాల మూలధన ఆస్తుల నిర్వచనం మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈక్విటీ పెట్టుబడులు ఏడాదిలోపు విక్రయించినట్టయితే స్వల్పకాల, ఏడాది ముగిసిన తర్వాత విక్రయించినట్టయితే దీర్ఘకాల మూలధన ఆస్తులుగా ఆదాయపన్ను చట్టం పరిగణిస్తోంది. స్వల్పకాల మూలధన లాభాలపై 15 శాతం పన్ను, దీర్ఘకాల మూలధన లాభం రూ.మొదటి లక్ష తర్వాత మొత్తంపై 10 శాతం పన్ను అమలవుతోంది. అదే రియల్ ఎస్టేట్‌ను 24 నెలలు నిండినప్పుడే దీర్ఘకాల మూలధన ఆస్తిగా చూస్తున్నారు. వివిధ సాధనాల మధ్య గందరగోళం లేకుండా ఏకరూపత తీసుకురావచ్చన్న అంచనాలున్నాయి. అంటే ఈక్విటీల్లో దీర్ఘకాల మూలధన ఆస్తుల కాలాన్ని రెండేళ్లకు పెంచడం లేదంటే రియల్ ఎస్టేట్ సాధనానికి రెండేళ్లకు బదులు ఏడాది కాలాన్ని దీర్ఘకాల ఆస్తిగా నిర్ణయించొచ్చని భావిస్తున్నారు. రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు ఏడాదికే దీర్ఘకాల మూలధన లాభాల పన్ను ప్రయోజనాలు కలి్పస్తే మార్కెట్లోకి ఎక్కువ ప్రాపరీ్టలు విక్రయానికి వచ్చి, రేట్ల పెరుగుదల ఒత్తిడి తగ్గుతుందనే అంచనాలు సైతం ఉన్నాయి. ఒకవేళ ఈక్విటీ పెట్టుబడులకు రెండేళ్లకు పెంచితే అది కొంత నిరుత్సాహపరిచే అవకాశం లేకపోలేదు. ఈక్విటీల్లో దీర్ఘకాల మూలధన లాభం మొదటి రూ.లక్షకు పన్ను ఉపశమనం ఉండగా, దీన్ని రూ.2 లక్షలు చేయాలని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ఆర్థిక మంత్రిని కోరింది.ఉపాధి ప్రస్తుత పరిస్థితి: తలసరి ఆదాయాన్ని పెంచడం ముందున్న ప్రధాన సవాళ్లలో ఒకటి. ప్రపంచంలో టాప్–10 ఆర్థిక వ్యవస్థల్లో జీడీపీ పరిమాణం పరంగా 3,942 బిలియన్ డాలర్లతో (2024 జూలై 1 నాటికి ఐఎంఎఫ్ డేటా) భారత్ ఐదో స్థానంలో ఉంది. కానీ, తలసరి ఆదాయం 2730 డాలర్లతో (రూ.2.27 లక్షలు) టాప్–10లో చివరి స్థానంలో ఉంది. 2014 నుంచి చూస్తే తలసరి ఆదాయం రెట్టింపైనప్పటికీ.. అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే ఇది గణనీయంగా మెరుగుపడాల్సి ఉంది. దీనికి ప్రభుత్వం వద్దనున్న ఏకైక అస్త్రం ఉపాధి కల్పన. సేవల రంగంపై ఆధారపడిన ఎకానమీని తయారీ వైపు మళ్లించడం ద్వారా ఉపాధి కల్పనను సాధించాలన్నది లక్ష్యం.అంచనాలు: ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద వివిధ రంగాల్లో కొత్తగా తయారీ కేంద్రాల ఏర్పాటు, అదనపు ఉత్పాదకతపై ప్రోత్సాహకాలు అందిస్తోంది. దిగుమతులను తగ్గించి, దేశీయంగా ఆయా ఉత్పత్తుల స్వావలంబన సాధించేందుకు (ఆత్మనిర్భర్ భారత్), ప్రపంచానికి తయారీ కేంద్రంగా చేయాలన్న (మేక్ ఇన్ ఇండియా) లక్ష్యాలు ఇందులో అంతర్లీనంగా ఉన్నాయి. దీంతో దేశీ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లో పోటీపడగలవని కేంద్రం భావిస్తోంది. ఆయా దిశల్లో తాజా బడ్జెట్ నిర్ణయాలు ఉంటాయని భావిస్తున్నారు.మౌలికంప్రస్తుత పరిస్థితి: దేశం పారిశ్రామికంగా మరింత పురోగతి చెందాలంటే, అందుకు మెరుగైన వసతులు అవసరం. అప్పుడే పెట్టుబడిదారులు ముందుకు వస్తారు. కేంద్రంలోని మోదీ సర్కారు రహదారులు, రైల్వే, జలమార్గాలకు ప్రాధాన్యాన్ని పెంచింది. రైల్వే వసతుల ఆధునికీకరణపై పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది.అంచనాలు: 2023–24లో రైల్వేలకు రూ.2.41 లక్షల కోట్లు చేయగా, ఈ విడత రూ.2.9–3 లక్షల కోట్లకు పెంచొచ్చని భావిస్తున్నారు. అంతేకాదు రహదారుల నిర్మాణానికీ కేటా యింపులు పెరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2014 నాటికి జాతీయ రహదారుల నిడివి 91,287 కిలోమీటర్లు ఉండగా, 2023 డిసెంబర్ నాటికి 1,46,145 కిలోమీటర్లకు పెరిగింది. ఏటా 4,000 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం ఉండగా, దాన్ని, 12వేల కిలోమీటర్లకు విస్తరించారు. జీడీపీలో మూలధన కేటాయింపులను 3.5 శాతానికి పెంచొచ్చని ప్రముఖ బ్రోకరేజీ సంస్థ నోమురా అంచనా వేస్తోంది. ఎకానమీ పురోగతికి మౌలిక రంగం కీలకమని భావిస్తున్న కేంద్రం ఈ విషయంలో ప్రైవేటు భాగస్వా మ్యాన్ని ప్రోత్సహించడానికి అన్ని చర్యలు తీసుకుంటోంది. బడ్జెట్లోనూ ఈ మేరకు నిర్ణయాలు ఉండవచ్చని అంచనా.హెల్త్కేర్ప్రస్తుత పరిస్థితి: దేశ ఉత్పాదకత పెరిగేందుకు ఆరోగ్యకర సమాజం ఎంతో అవసరం. 2023–24 బడ్జెట్లో ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖకు చేసిన కేటాయింపులు రూ.80,517 కోట్లు. మొత్తం బడ్జెట్లో 2 శాతంలోపే. 2024–25 మధ్యంతర బడ్జెట్లో 13 శాతం పెంచి రూ.90,658 కోట్లు చూపించారు. ఈ నిధులు మరింత పెరగాల్సిన అవసరం ఉంది. నూతన ఔషధాల ఆవిష్కరణపై చేసే ఖర్చుకు, డయాగ్నోస్టిక్స్పైన జీఎస్టీ మినహాయించాలని, పీఎల్ఐ కింద ఈ రంగానికి ప్రోత్సాహకాలు పెంచాలని పరిశ్రమ కోరుతోంది. 9–14 ఏళ్ల బాలికలకు గర్భాశయ ముఖ ద్వారా కేన్సర్ నుంచి నివారణకు టీకా ఇవ్వడాన్ని సార్వత్రిక టీకా కార్యక్రమం పరిధిలోకి తేవాలన్న డిమాండ్ ఉంది.అంచనాలు: కేన్సర్, జీవనశైలి వ్యాధుల నివారణకు వీలుగా ప్రజారోగ్యంపై మరింత పెట్టుబడులు అవసరమన్న సూచనలను బడ్జెట్ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకాన్ని మరింత మందికి చేరువ చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న అంచనాలు బలంగా ఉన్నాయి. వైద్య ఉపకరణాల దిగుమతులపై ప్రపంచంలోనే అత్యధికంగా కస్టమ్స్ డ్యూటీలు మన దేశంలోఉన్నాయని, వీటిని తగ్గించాలన్న పరిశ్రమ డిమాండ్‌ను పరిశీలించవచ్చు.విద్యారంగంవిద్యారంగానికి 2023–24 బడ్జెట్‌తో పోలిస్తే 7% తక్కువగా రూ.1.2 లక్షల కోట్లనే 2024–25 మధ్యంతర బడ్జెట్లో ఆర్థిక మంత్రి కేటాయించారు. పూర్తిస్థాయి బడ్జెట్లో అయినా దీన్ని సరిదిద్దుతారేమో చూడాలి. విద్యా సేవలు, టెస్ట్ ప్రిపరేషన్, నైపుణ్య కోర్సులపై 18% జీఎస్టీ చాలా ఎక్కువన్న అభ్యంతరం ఉంది. నాణ్యమైన విద్యను అందుబాటు వ్యయాలకే అందించే దిశగా తగినన్ని పెట్టుబడులతోపాటు స్కాలర్íÙప్లు, ఆర్థిక సాయం, సులభంగా విద్యా రుణాలు లభించేలా చర్యలు తీసుకోవాలని విద్యా సంస్థలు, ఎడ్టెక్ కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యా రుణాలు సులభం కావాలన్నది డిమాండ్.ఎంఎస్ఎంఈలు దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కలి్పస్తున్న ఈ పరిశ్రమ కేంద్రం నుంచి మరింత సాయాన్ని ఆశిస్తోంది. తక్కువ వడ్డీపై రుణ సాయానికి తోడు, సులభతర రుణాలు, ఆవిష్కరణలకు ప్రోత్సాహం, మౌలిక వసతుల కల్పన, సానుకూల పన్ను విధానం, వ్యాపార సులభతర నిర్వహణకు వీలుగా నిబంధనల అమల్లో వెసులుబాటు తదితర రూపాల్లో సహకారాన్ని కోరుతోంది. ప్రతి జిల్లా స్థాయిలో ఆర్థిక కేంద్రాలు ఏర్పాటు చేసి, వసతులు కలి్పంచడం, నైపుణ్యాభివృద్ధి కల్పనతో మరింత మందికి ఉపాధి లభిస్తుందని చెబుతున్నాయి. ఎస్ఎంఈలకు 45 రోజుల్లోగా చెల్లింపులు జరిగేలా చట్టంలో మార్పులు తీసుకురావాలని పరిశ్రమ కోరుతోంది. హౌసింగ్ అందుబాటు ధరల ఇళ్లు, పర్యావరణ అనుకూల ఇళ్ల ప్రాజెక్టులు చేపట్టేందుకు వీలుగా డెవలపర్లకు ప్రోత్సాహకాలు కలి్పంచాలని రియల్టీ కోరుతోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం విజయవంతమైన నేపథ్యంలో.. మరింత మందికి లబ్ధి చేకూరేందుకు ఈ పథకాన్ని 2.0 రూపంలో తీసుకురావాలని డిమాండ్ చేస్తోంది. అందరికీ ఇళ్ల లక్ష్యం సాకారం దిశగా బడ్జెట్లో చర్యలు ఉంటాయన్న అంచనాలు పెరిగాయి. గృహ రుణాలపై రూ. 5 లక్షల వరకు వడ్డీ చెల్లింపులకు పన్ను మినహాయింపు కల్పించాలని పరిశ్రమ ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రిని కోరింది. ఈ రంగానికి పరిశ్రమ హోదా కలి్పంచాలన్న డిమాండూ ఉంది.పర్యావరణ ఇంధనాలు శిలాజ ఇంధనాలైన బొగ్గు, పెట్రోలియం ఉత్పత్తులపైనే ఎక్కువగా ఆధారపడగా, సోలార్, విండ్, గ్రీన్ హైడ్రోజన్ తదితర పర్యావరణ అనుకూల ఇంధనాలను కేంద్రం ప్రోత్సహిస్తోంది. 2070 నాటికి సున్నా కర్బన ఉద్గారాల విడుదల లక్ష్యాన్ని చేరుకోవాలంటే పునరుత్పాదక ఇంధన వనరులపై పెట్టుబడులకు ప్రోత్సాహం ఉండాలని, శుద్ధ ఇంధన వనరులకు మళ్లేందుకు, ఈ దిశగా పరిశోధన, అభివృద్ధికి తగినంత ప్రోత్సాహం అందించాలన్న డిమాండ్లు ఉన్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతున్న దశలో ఫేమ్ పథకం ద్వారా సబ్సిడీలు తొలగించడం సరికాదని పరిశ్రమ భావిస్తోంది.బ్యాంకింగ్ బ్యాంకింగ్ ఎకానమీ పురోగతిలో కీలకమని కేంద్రం భావిస్తోంది. ఈ రంగంలో సంస్కరణలకు వీలుగా బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949, ఇతర చట్టాలకు సవరణలను బడ్జెట్లో ప్రతిపాదించొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. ప్రభుత్వరంగ బ్యాంక్‌లను ప్రైవేటీకరించాలంటే బ్యాంకింగ్ కంపెనీల చట్టం 1970, బ్యాంకింగ్ కంపెనీల చట్టం 1980లకు సవరణలు తప్పనిసరి. ఈ రెండు చట్టాలు బ్యాంకుల జాతీయకరణ సమయంలో తెచ్చినవి. వీటిల్లో సవరణలతో ప్రభుత్వరంగ బ్యాంక్‌ల ప్రైవేటీకరణకు, ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా 51 శాతం లోపునకు తగ్గించుకునేందకు వీలు లభిస్తుంది.మోదీ సర్కారు రహదారులు, రైల్వేలు, జల్‌శక్తి, కమ్యూనికేషన్లకు పెద్ద పీట వేస్తున్నట్టు గత నాలుగు బడ్జెట్ కేటాయింపులు పరిశీలిస్తే తెలుస్తోంది. విద్య, వైద్యానికీ కేటాయింపులు పెంచినప్పటికీ రహదారులు, రైల్వేల స్థాయిలో లేకపోవడాన్ని గమనించొచ్చు. ముఖ్యంగా దేశ రక్షణ కోసమే పెద్ద మొత్తంలో కేటాయింపులు చేస్తున్నట్టు ఈ పట్టికను పరిశీలిస్తే తెలుస్తుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
పెన్షన్ ఫండ్స్‌కు పన్ను ప్రయోజనాలు
పెన్షన్ సదుపాయంతో కూడిన మ్యూచువల్ ఫండ్స్ పథకాలు, డెట్ ఫండ్స్ విషయంలో పన్ను ప్రయోజనాలు కలి్పంచాలంటూ మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) కేంద్ర ఆర్థిక మంత్రిని కోరింది. బడ్జెట్‌కు ముందు తమ డిమాండ్లను ఆర్థిక మంత్రికి దృష్టికి తీసుకెళ్లింది. జాతీయ పింఛను పథకం(ఎన్పీఎస్)లో పెట్టుబడులకు సెక్షన్ 80సీసీడీ కింద కలి్పస్తున్న పన్ను మినహాయింపును పెన్షన్ ప్రయోజనంతో కూడిన మ్యూచువల్ ఫండ్స్ (మ్యూచువల్ ఫండ్స్ లింక్డ్ రిటైర్మెంట్ స్కీమ్స్)కు సైతం అమలు చేయాలని కోరింది. అలాగే, డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో మూడేళ్లు, అంతకుమించిన పెట్టుబడులను ఉపసంహరించుకున్నప్పుడు.. వచి్చన లాభంపై డిబెంచర్లకు మాదిరే ఫ్లాట్ 10% పన్నును, ద్రవ్యోల్బణం మినహాయింపు ప్రయోజనం లేకుండా అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈక్విటీల్లో 35% వరకు పెట్టుబడులు పెట్టే డెట్ ఫండ్స్‌కు గతేడాది విధించిన స్వల్పకాల మూలధన లాభాల పన్నును తిరిగి పరిశీలించాలని కోరింది. బాండ్లలో పెట్టుబడులకు ప్రోత్సాహం డెట్ ఫండ్స్ ద్వారా బాండ్లలో పెట్టుబడులకు రిటైల్ ఇన్వెస్టర్లను ప్రోత్సహించాలని కూడా ఆర్థిక మంత్రిని యాంఫి కోరింది. డిబెంచర్లు, ప్రభుత్వ సెక్యూరిటీలకు మాదిరే పన్ను రేట్లు అమలు చేయాలని, ఇందుకు ఫైనాన్స్ యాక్ట్, 2023లోని సెక్షన్ 50ఏఏను సవరించాలని వినతిపత్రంలో పేర్కొంది. స్టార్టప్‌లపై ఏంజెల్ ట్యాక్స్ ఎత్తేయాలి.. స్టార్టప్‌లపై ఏంజెల్ ట్యాక్స్ ఎత్తివేయాలంటూ పరిశ్రమలు, వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కేంద్ర ఆర్థిక శాఖకు సూచించింది. స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో లిస్ట్ కాని స్టార్టప్‌లు జారీ చేసే షేర్ల విలువ మదింపునకు గాను డీపీఐఐటీ గతేడాది సెప్టెంబర్‌లో కొత్త నిబంధనలు తీసుకొచి్చంది. పారదర్శక మార్కెట్ విలువ కంటే అధిక ధరపై షేర్లు జారీ చేసే స్టార్టప్‌లు ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని తొలగిస్తే స్టార్టప్‌లను ప్రోత్సహించినట్టు అవుతుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
యూకే తొలి మహిళా ఆర్థిక మంత్రిగా రాచెల్ రీవ్స్ ..బడ్జెట్ బాధ్యత ఆమెదే..!
గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కైర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ మెజారిటీ ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో యూకే తొలి మహిళా ఆర్థిక మంత్రిగా 45 ఏళ్ల రాచెల్ రీవ్స్ నియమితులయ్యారు. ఆమె ఇప్పుడు బడ్జెట్‌కు బాధ్యత వహిస్తున్నారు. ఆమె ఈ అత్యన్నత పదవిని దక్కించుకుని..తన కెరీర్లోనూ,యూకే చరిత్రలోనూ ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. యూకే కొత్త ప్రధాని కైర్ స్టార్మర్ ద్వారా ఈ అత్యున్నత పదవీలో నిమితులయ్యారు రీవ్స్. ఈ మేరకు రీవ్స్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా..ఖజానకు ఛాన్సలర్‌గా నియమించడబడటం తన జీవితంలోని గొప్ప గౌరవంగా భావిస్తున్నా అన్నారు. ఎవరీ రాచెల్ రీవ్స్..?లండన్ బోరో లెవిషామ్‌లోని విద్యావేత్తలకు ఫిబ్రవరి 13, 1979న జన్మించిన రీవ్స్ ఎల్లప్పుడూ సమగ్ర విద్యను నేర్చుకోవడం పట్ల అత్యంత ఆసక్తి కనబర్చేది. ఆమె న్యూ కాలేజీ ఆక్స్‌ఫర్డ్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పూర్తి చేసింది. ఆ తర్వాత ప్రతిష్టాత్మక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఎకనామిక్స్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పూర్తి చేసింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనంతరం రీవ్స్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌లో దాదాపు ఒక దశాబ్దం పాటు ఆర్థికవేత్తగా పనిచేశారు. ఆ తర్వాత ఆమె ప్రైవేట్ రంగానికి మారారు. రీవ్స్ 2021లో లేబర్ ఫైనాన్స్ పాలసీ చీఫ్‌గా పనిచేశారు. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న స్టార్మర్ వద్ద షాడో ఛాన్సలర్ ఆఫ్ ది ఎక్స్‌చెకర్‌గా పని చేశారు. అంతేగాదు ఆమె అనేక చెస్ ఛాంపియన్షిప్ టైటిళ్లను కూడా గెలుచుకుంది. తన తండ్రి ప్రభావంతో రాజకీయాలవైపు మొగ్గు చూపారు రీవ్స్. అలా 2010లో లిబరల్ డెమోక్రాట్లతో సంకీర్ణంలో కన్జర్వేటివ్‌లు అధికారంలోకి వచ్చినప్పుడు, రీవ్స్ ఉత్తర ఇంగ్లాండ్‌లోని లీడ్స్ వెస్ట్‌కు లేబర్ ఎంపీగా ఎన్నికయ్యారు. దాదాపు పదకొండేళ్ల తర్వాత స్టార్మర్ ఆమెను లేబర్ ఆర్థిక ప్రతినిధిగా నియమించారు. అలాగే ఆమె సోదరి ఎల్లీ రీవ్స్ కూడా లేబర్ పార్టీ ఎంపీ.ప్రస్తుతం రీవ్స్ యూకే తొలి మహిళా ఛాన్సలర్ ఆఫ్ ది ఎక్స్‌చెకర్‌గా మందగమన వృద్ధి, అధిక రుణాలు, అత్యధిక పన్ను భారం వంటి ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనాల్సి ఉంది. ఆమె వీటన్నింటిని అధిగమించేలా ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు తెలిపారు. బాధ్యతాయుతమైన ఆర్థిక విధానాల పట్ల నిబద్ధత వ్యవహరించి ఆర్థిక పాలనా ప్రపంచంలో మంచి విజయం సాధించాలనే సంకల్పంతో ఉంది రాచెల్ రీవ్స్.(చదవండి: సింప్లిసిటీకి కేరాఫ్ సుధామూర్తి'..30 ఏళ్ల క్రితం చేసిన ఆ పర్యటనే..) -
తెలంగాణకు ఆర్థిక వెసులుబాటు కల్పించాలి: భట్టి విక్రమార్క
సాక్షి,ఢిల్లీ: కేంద్ర ప్రాయోజిత పథకాలలో తెలంగాణకు కొంత వెసులుబాటు కల్పించాలని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కోరామని రాష్ట్ర ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. శనివారం(జూన్22) జీఎస్టీ కౌన్సిల్ భేటీ ముగిసిన తర్వాత భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. ‘స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు బడ్జెట్ కేటాయించాలి. సమాజంలో అసమానతలు తగ్గించేందుకు సమ్మిళిత అభివృద్ధి చేయాలి. సెస్, సర్ ఛార్జ్ పన్నులు పది శాతం మించకుండా చేయాలి. రాష్ట్రాల నికర రుణపరిమితి సీలింగ్ ముందుగానే చెపితే దానికి అనుగుణంగా బడ్జెట్ పెట్టుకుంటాం.జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు ఉండాలి. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద గత ఏడాది తెలంగాణకు 1.4 శాతమే నిధులు వచ్చాయి. ఉపాధి హామీ నిధులు ఆస్తుల సృష్టి పనులకి వినియోగించేలా అనుమతులు ఇవ్వాలి’అని కోరినట్లు భట్టి తెలిపారు. -
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 22 నుంచి!
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 22 నుంచి ఆగస్టు 9వ తేదీ దాకా జరుగుతాయని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశాల్లో తొలిరోజే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2024–25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతారని తెలిపాయి. బడ్జెట్‌కు ముందు వివిధ శాఖలతో జరిపే సంప్రదింపులను ఆర్థిక శాఖ ఈనెల 17 నుంచి ప్రారంభించనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీన నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. గడిచిన పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన ఆర్థిక విజయాలను, ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ ఎదిగిన క్రమాన్ని ఆమె ఆనాడు వివరించారు. కాగా 18వ లోక్‌సభ తొలి సమావేశాలు జూన్ 24 నుంచి జూలై 3 దాకా జరగనున్నాయి. 24, 25 తేదీల్లో నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం, జూన్ 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక ఉంటాయి. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు దీన్ని ధృవీకరించారు. -
ఏడు నెలల తర్వాత జరుగబోతున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ 53వ సమావేశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జూన్ 22న దిల్లీలో నిర్వహించనున్నట్లు ఎక్స్‌ఖాతాలో పోస్ట్ చేశారు.కౌన్సిల్ అక్టోబర్ 2023లో చివరిసారిగా సమావేశం నిర్వహించింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తిరిగి సమావేశాన్ని ఏర్పాటు చేయలేదు. ఇటీవల ఎన్నికల పలితాలు వెలువడి మంత్రిత్వశాఖలు కేటాయించడంతో జూన్ 22న తిరిగి సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పింది. ఎన్నికల తరుణంలో ఫిబ్రవరిలో కేంద్రం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈసారి పూర్తికాల బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. జులైలో బడ్జెట్ సమావేశాలు జరుగనున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో జూన్ 22న జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కీలకంగా మారనుంది. ఏయే వస్తువులపై ఏమేరకు ట్యాక్స్‌లో మార్పులుంటాయో ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.ఇదీ చదవండి: తెలుగు వెబ్‌సిరీస్ తొలగించాలని కోర్టులో పిటిషన్కౌన్సిల్ సమావేశపు ఎజెండా ఇంకా వెలువడలేదు. ఈసమావేశానికి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ అధ్యక్షత వహించనున్నారు. ఇందులో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, సెక్రటరీలు హాజరవుతారు. ఇదిలాఉండగా, గత పదేళ్లుగా చేపట్టిన సంస్కరణలు ఇకపైనా కొనసాగుతాయని కేంద్ర ఆర్థికమంత్రిగా బుధవారం బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. వికసిత్ భారత్ లక్ష్యసాధనను వేగవంతం చేసే దిశగా చర్యలు ఉంటాయని ఆమె పేర్కొన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు, జీవనాన్ని సులభతరం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో జీఎస్టీ కౌన్సిల్లో కీలక నిర్ణయాలు వెలువడుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
సంస్కరణలు కొనసాగుతాయ్: సీతారామన్
న్యూఢిల్లీ: గత పదేళ్లుగా చేపట్టిన సంస్కరణలు ఇకపైనా కొనసాగుతాయని మరోసారి కేంద్ర ఆర్థిక మంత్రిగా బుధవారం బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. వికసిత్ భారత్ లక్ష్యసాధనను వేగవంతం చేసే దిశగా చర్యలు ఉంటాయని ఆమె పేర్కొన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు, జీవనాన్ని సులభతరం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు. ఇందుకోసం తగిన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అంతర్జాతీయంగా సవాళ్లతో కూడుకున్న పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ ప్రశంసించతగ్గ స్థాయిలో వృద్ధి సాధించగలిగిందన్నారు. నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ఫైనాన్స్ సెక్రటరీ టీవీ సోమనాథన్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ వచ్చే నెల ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనితో ఆరు పూర్తి స్థాయి బడ్జెట్లను, వరుసగా ఏడో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత ఆమెకు దక్కనుంది. -
మెట్రో ట్రైన్లో నిర్మలా సీతారామన్ .. సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా
140 కోట్ల భారతీయులున్న దేశానికి ఆర్థిక మంత్రి. 3937 బిలియన్ డాలర్ల మూలధన లెక్కలను చూసే నాయకురాలు ఢిల్లీ మెట్రో ఎక్కి ప్రయాణం చేస్తే ఆశ్చర్యపోరా మరి.!అవును కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సాధాసీదా ప్రయాణికురాలిగా ఢిల్లీ మెట్రో రైలులో లక్ష్మీ నగర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా తోటి ప్రయాణికులతో ముచ్చటించారు. ఆ ఫోటోల్ని, వీడియోల్ని ఎక్స్ వేదికగా షేర్ చేశారు.అయితే నిర్మలా సీతారామన్ మెట్రో ట్రైన్లో ప్రయాణించడంపై మెట్రోలో ప్రయాణించడంపై నెటిజన్లు ప్రశంసిస్తుండగా.. మరికొందరు మాత్రం 2024 లోక్ సభ ఎన్నికల స్టంట్ అంటూ విమర్శిస్తున్నారు. ఢిల్లీ మెట్రోలో నిర్మలా సీతారామన్ ప్రయాణిస్తున్న వీడియోపై నెటిజన్లు ఇలా స్పందించారు ‘పన్ను సంబంధిత ప్రశ్న అడగాలి’ అని ఒక యూజర్ అంటుంటే.. కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ ప్రజా రవాణాను ఎంచుకుని, తోటి ప్రయాణికులతో మమేకమవడం సంతోషంగా ఉంది. సహచరులకు ఆదర్శంగా నిలుస్తారని కొనియాడారు. మరో యూజర్ మాత్రం.. నిర్మలా సీతారామన్ మెట్రో ప్రయాణం ఎన్నికల స్టంట్. ఎందుకంటే.. అధికారంలో ఉన్న 10ఏళ్లలో ఒక్కసారైనా మెట్రోలో ప్రయాణించారా? సాధారణ ప్రయాణికులతో ఎప్పుడైనా ముచ్చటించారా అని వ్యాఖ్యానించారు. Smt @nsitharaman travels in Delhi Metro to Laxmi Nagar and interacts with fellow commuters. pic.twitter.com/HYSq3oUiAo— Nirmala Sitharaman Office (@nsitharamanoffc) May 17, 2024