బెంగళూరులో నిర్మలా సీతారామన్‌ కుమార్తె వివాహం | Nirmala Sitharaman daughter gets married | Sakshi
Sakshi News home page

బెంగళూరులో నిర్మలా సీతారామన్‌ కుమార్తె వివాహం

Published Fri, Jun 9 2023 5:54 AM | Last Updated on Fri, Jun 9 2023 5:54 AM

Nirmala Sitharaman daughter gets married - Sakshi

దొడ్డబళ్లాపురం: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ కుమార్తె వాఙ్మయి వివాహం బెంగళూరులో గురువారం నిరాడంబరంగా జరిగింది. ఉడుపి అదమారు మఠం బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం వాఙ్మయి– ప్రతీక్‌ల వివాహం బెంగళూరులోని టమరిండ్‌ ట్రీ అనే ఓ హోటల్లో జరిగింది.

ఉడుపి మఠానికి చెందిన పలువురు స్వామీజీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు ఇరు కుటుంబాల నుంచి అతి కొద్దిమంది బంధువులు మాత్రమే హాజరయ్యారు. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్న వాఙ్మయి ఒక ప్రముఖ పత్రికలో సీనియర్‌ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement