Udupi
-
కర్ణాటక తీరం.. ప్రీవెడ్డింగ్ షూట్ గమ్యం! (ఫొటోలు)
-
అమ్మ కోరిక నెరవేర్చిన ఎన్టీఆర్..
-
ఉడుపిలో ఎన్టీఆర్ ఫ్యామిలీ.. ఈ ట్రిప్ చాలా స్పెషల్ (ఫొటోలు)
-
రోడ్డుపై లాంగ్ జంప్ చేసిన యముడు, చిత్రగుప్తుడు..!
-
రెండవ రోజు వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు
కర్నాటకలోని ఉడుపిలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నిన్న ప్రారంభమైన వేడుకలు ఈరోజు (మంగళవారం) కూడా కొనసాగుతున్నాయి. యూపీలోని మధురలో నిన్న(సోమవారం) రాత్రి అత్యంత వేడుకగా శ్రీకృష్ణునికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించారు. Shri Krishna Matha, Udupi 🙏#KrishnaJanmashtami pic.twitter.com/IBmWwwCudS— Visit Udupi (@VisitUdupi) August 26, 2024ఉడిపి శ్రీకృష్ణుని ఆలయంలో నేడు శ్రీకృష్ణ లీలోత్సవం అత్యంత వేడుకగా జరగనుంది. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు శ్రీ కృష్ణ భక్తులు ఇప్పటికే ఉడుపికి తరలివచ్చారు. ఉత్సవాల్లో తొలి రోజున పలువురు చిన్నారులు బాలకృష్ణుని వేషధారణలో ఆలయంలో కనువిందు చేశారు. అలాగే రోజంతా స్వామివారి సమక్షంలో వివిధ పూజాది కార్యక్రమాలు నిర్వహించారు.#WATCH | Mathura, Uttar Pradesh: Aarti begins at Shri Krishna Janmasthan temple at the time of Shri Krishna Janma as the clock hits midnight pic.twitter.com/i80lWyaGb3— ANI (@ANI) August 26, 2024నేడు జరిగే శ్రీకృష్ణుని లీలోత్సవంలో బంగారు రథంలో శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఊరేగిస్తారు. ఈ కార్యక్రమం ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభం కానుంది. అలాగే మఠంలో భక్తులకు సంప్రదాయాలకు చిహ్నంగా నిలిచే వివిధ పోటీలను నిర్వహించనున్నారు.#WATCH | Manipur | Shri Krishn Janmashtami being celebrated at Shree Shree Govindajee Temple, in Imphal pic.twitter.com/nQXk2aGK3b— ANI (@ANI) August 26, 2024ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో కూడా శ్రీకృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడి గోవిందరాజ ఆలయంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాల మధ్య జన్మాష్టమి వేడులను నిర్వహిస్తున్నారు. -
ఉడుపిలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
నేడు(సోమవారం) దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుతున్నాయి. దక్షిణాది మధురగా పేరొందిన కర్నాటకలోని ఉడుపిలో జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. దేశం నలుమూలల నుంచి భక్తులు శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి చూసేందుకు ఉడుపికి తరలివస్తున్నారు.ఆలయంలో ఈ రోజున తెల్లవారుజాము నుంచే స్వామివారికి పూజలు ప్రారంభమయ్యాయి. ఇవి రోజంతా కొనసాగనున్నాయి. కర్నాటకలోని అత్యంత పురాతన దేవాలయాలతో ఉడుపి ఒకటి. ఈ ఆలయంలోని శ్రీకృష్ణుని విగ్రహం ఎంతో విశిష్టమైనదని చెబుతారు. జన్మాష్టమి సందర్భంగా ఆలయాన్ని సాంప్రదాయక కళారీతిలో అలంకరించారు. ఉడిపిలోని వీధులు, వివిధ దేవాలయాలను ప్రత్యేకంగా అలంకరించారు.ఆలయం చుట్టూ ఉన్న వీధుల్లో అందమైన ముగ్గులు వేసి, వాటిని పూలతో అందంగా తీర్చిదిద్దారు. ఈరోజు ఉడుపిలో జరుగుతున్న శ్రీకృష్ణాష్టమి వేడుకలకు సంబంధించిన వీడియోను ట్విట్టర్(ఎక్స్)యూజర్ అను సతీష్ తన అకౌంట్ నుంచి షేర్ చేశారు. ఈ వీడియోలో శ్రీకృష్ణునికి పూలతో చేసిన అందమైన అలంకరణను, ఆలయశోభను చూడవచ్చు. Krishna Janmashtami TodayDivine Darshan of Udupi Shri Krishna to bless our day.. Janmashtami wishesShri Krishna's blessings to all 🙏✨️ pic.twitter.com/k43CJIQMFe— Anu Satheesh 🇮🇳🚩 (@AnuSatheesh5) August 26, 2024 -
ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
నిజానికి ఉడిపి కాదు, ఉడుపి అని వ్రాయాలి. ఉడుపి అంటే అర్థం నక్షత్రాలకు అధిపతి అయిన చంద్రుని భూమి అని అర్థం. ఇక ఉడుపి వంట లేక భోజనం- దీని మూలం ఉడుపిలో ఉన్న కృష్ణ దేవాలయంలో, అష్ట మఠాలలో ఉంది. ఉడుపి శ్రీ మధ్వాచార్యులు జన్మించిన ఊరు. ఇది ద్వైత సాంప్రదాయ ముఖ్య కేంద్రం. అన్నదాన సేవలో భాగంగా ఉడిపిలోని శ్రీకృష్ణ దేవాలయంలో శిక్షణ పొందిన వంటవారు ఉడిపి హోటళ్లను తెరవడానికి దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలివెళ్లారు. మరీ ఉడుపి భోజనానికే ఎందుకంటే పేరుగాంచిందంటే..కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్న సైన్యానికి..ఇంట్లో మనం నలుగురికి లేదా ఐదుగురికి వంట చేయగలం.అంతకంటే ఎక్కువ మందికి చేయటం కొంచెము కష్టమైన పని.మరి 50 లక్షల మందికి వంట చేయడం అంటే మామూలు విషయం కాదు. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధ సమయంలో50 లక్షల మంది పాల్గొన్నారు. వారికి వంట వండినవారు ఎవరంటే..? మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన కొందరు పాండవుల పక్షాన కొందరు ఇలా అందరూ కలిసి దాదాపు 50లక్షలకు పైగా కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు. కానీ ఇంత జరుగుతున్నా ఇద్దరు రాజులు పాల్గొన లేదు.అందులో ఒకరు విదర్భ రాజైన రుక్మి. రెండవది బలరాముడు. ఆ ఇద్దరు తప్ప అన్ని రాజ్యాలు పాల్గొన్నాయి. దక్షిణ భారతంలోని ఉడిపి రాజ్యం కురుక్షేత్ర యుద్ధానికి వచ్చింది. ఉడిపిరాజైన నరేషుడు సైన్యాన్ని తీసుకొని యుద్ధ ప్రాంతానికి వెళ్లినప్పుడు కౌరవులు తమ వైపు నిలబడాలని మరో వైపు పాండవులు తమవైపు నిలబడాలని కోరుతారు. అప్పుడు ఉడిపి రాజు తన తెలివితో ఎటూ వెళ్ళకుండా సలహా కోసం శ్రీకృష్ణ దగ్గరికి వెళ్తాడు. అందరూ యుద్ధం గురించే ఆలోచిస్తున్నారు మరి ఇన్ని లక్షల మందికి భోజనాలు గురించి ఏమైనా ఆలోచించారా?ఎవరు వండి పెడతారు? అని శ్రీకృష్ణుడిని అడుగుతాడు. మీరన్నది నిజమే మరి మీ దగ్గర ఏదైనా ఆలోచన ఉందా అని నరేషుడుని శ్రీకృష్ణుడు అడుగుతాడు. అప్పుడు నరేషుడు ఇప్పుడు జరుగుతున్న ఈ మహాయుద్ధం అన్నదమ్ముల మధ్య నడుస్తున్నది, నాకు ఈ యుద్ధంలో పాల్గొనడం ఇష్టం లేదు. అందువల్ల నేను,నా సైన్యం ఇరువర్గాల యుద్ధంలో పాల్గొనము. వారందరికి భోజనం చేసి పెడతాము అని ఉడిపిరాజు చెపుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు రాజా మీ ఆలోచన చాలా అద్భుతమైనది. 50 లక్షల మందికి భోజనం వండటం అంటే మామూలు మాటలు కాదు. ఇది మీ వల్లే సాధ్యమవుతుందంటూ..అందరికీ భోజనాలు తయారుచేయమని చెబుతాడు శ్రీకృష్ణుడు.నిజానికి 50 లక్షల మందికి భోజనాలు వండాలంటే భీముడు, అతని సైన్యానికి మాత్రమే వీలవుతుంది కానీ ఈ సమయంలో పోరాడటం భీముడికి ముఖ్యం. అందువల్ల భీముని యుద్ధక్షేత్రం వదిలి రాలేడు. అందువల్ల నువ్వొక్కడివే ఇంతమంది సైన్యానికి వంట చేయగల సమర్ధుడు అని వంట వండమని కోరతాడు శ్రీ కృష్ణుడు. నరేషుడు తన సైన్యంతో కలిసి అక్కడ ఉన్న సైన్యాలకు భోజనం తయారు చేస్తాడు నరేషుడు.ఎలా వండేవాడంటే.. సాయంత్రం వరకు తాను వండిన భోజనం ఒక్క మెతుకు కూడా మిగలకుండా, వృధాకాకుండా వండేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ సైన్యం కూడా తగ్గిపోయ్యేది. అయినా సరే వంట మాత్రం అందరికీ సరిపోయేలా వండేవాడు నరేశుడు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయోవారు. ఇది ఎలా సాధ్యం?అంత మంది చనిపోతున్నా చివరికి మిగిలిన వారికి మాత్రమే సరిపోయేలా ఎలా వంట చేస్తున్నారు?..అది కూడా ఒక్క మెతుకు కూడా మిగలకుండా ఎలా వండుతున్నారు? అని అందరూ ఆశ్చర్యానికి గురయ్యేవారు. అసలు నరేషునికి ఎలా తెలుస్తుంది? ఈ రోజు ఇంతమంది మాత్రమే చనిపోతారని, మిగిలిన వారికి మాత్రమే భోజనం వండాలి అని?..ఇలా18 రోజులు గడిచిపోయాయి. పాండవులు గెలిచారు. పట్టాభిషేకం జరుగుతుంది. అప్పుడు ధర్మరాజు ఉడిపి నరేషుడుని అడుగుతాడు.. మమ్మల్ని అందరూ తక్కువ సైన్యం ఉన్నా గెలిచామని పొగుడుతున్నారు. కానీ నేను మాత్రం నిన్ను మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నాను అని అంటాడు. ఎందుకంటే 50 లక్షల మందికి సైన్యమునకు వంట చేయడం అంటే మాటలు కాదు అది కూడా ఒక్క మెతుకు కూడా మిగలకుండా వృధాకాకుండా వండడం అంటే మాటలు కాదు. ఇది మహా అద్భుతం ఇలా ఎలా చేశావు? అని అంటాడు.అప్పుడు నరేషుడు నవ్వుతూ మీరు గెలిచారు కదా దాని గొప్పతనం అంతా ఎవరికి ఇస్తారు అని అడిగాడు?. అప్పుడు యుధిష్టరుడు శ్రీకృష్ణుడే దీనికి మూలమని చెబుతాడు. అప్పుడు నరేషుడు మీరు గెలవడానికే కాదు, నేను ఇంతమందికి సరిపడా వంట వండడానికి కూడా శ్రీకృష్ణుడే కారణం. కాబట్టి ఈ గొప్పతనమంతా శ్రీకృష్ణునికే చెందుతుంది అని చెప్తాడు. ఇది విని సభలో ఉన్నవారంతా ఆశ్చర్యానికి గురి అవుతారు. ఇది ఎలా సాధ్యం? శ్రీకృష్ణుడు ఎలా కారణం అని నరేషుడుని అడుగుతాడు యుధిష్టరుడు. అప్పుడు నరేషుడు అసలు రహస్యాన్ని అందరి ముందు ఇలా చెప్తాడు... శ్రీకృష్ణుడు ప్రతి రోజు రాత్రి పెసరకాయలు తినేవాడు. నేను లెక్క పెట్టి పెట్టే వాడిని. శ్రీకృష్ణుడు తిన్న తర్వాత మళ్లీ పెసరకాయలను లెక్కపెట్టే వాడిని.. శ్రీ కృష్ణుడు ఎన్ని కాయలు అయితే తింటాడో దానికి వెయ్యిరెట్లు సైన్యం చనిపోయేవారు.. ఆంటే శ్రీకృష్ణుడు 50 పెసరకాయలు తింటే దానికి వెయ్యి రెట్లు అంటే 50 వేల మంది సైనికులు మరుసటి రోజు యుద్ధంలో చనిపోయేవారు. దీనిని బట్టి నేను మిగతా వారికి భోజనం వండే వాడిని అని చెప్పాడు. ఈ కారణం వల్ల ఏ రోజు కూడా భోజనం వృధా కాకుండా వండే వాడిని అని చెప్పాడు. ఇది విని ఆ సభలోని వారందరూ కృష్ణలీలకు ముగ్ధులు అవుతారు. ఈ కథ మహాభారత కథలలో ఒక అరుదైన కథ. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని కృష్ణ మందిరంలో ఈ కథ ఇప్పటికీ వినిపిస్తూ ఉంటారు. ఇదంతా 13వ శతాబ్దంలో కర్ణాటకలోని చిన్న తీర పట్టణమైన ఉడుపిలో ప్రారంభమైంది. ఇక్కడ, ఒక ప్రసిద్ధ శ్రీ కృష్ణ దేవాలయంలో భక్తులకు ఉచిత భోజనం లేదా అన్నదానం చేసే పద్ధతిని ప్రారంభించింది. మెనూలో ఆహారం ఎప్పుడు వడ్డించాలనే సమయాలు రెండూ నిర్ణయించబడ్డాయి. ఈ దేవాలయాలలో శిక్షణ పొందిన వంటవారు చివరికి బెంగళూరు, చెన్నై, ముంబై వంటి దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లి ఈ ప్రాంతాల్లో ఉడుపి హోటళ్లను ఏర్పాటు చేసినట్లు చరిత్ర గ్రంథాలు చెబుతున్నాయి. ఇక్కడ భోజనానికి విశేష స్థానం ఉంది. సాత్విక పద్ధతిలో చెయ్యాలి. శాకాహారం భోజనం మాత్రమే చెయ్యాలి. ఉల్లిపాయలు, వెల్లుల్లి కూడా ఉపయోగం చేయకూడదు. కృష్ణ మఠంకు చాలా చాలా మంది భక్తులు వస్తారు. వాళ్ళు అందరికి ప్రసాదం రూపంలో భోజనం ప్రతి దినం ఇస్తారు. అంత మందికి భోజనం ఇవ్వాలి, అందుకే చాలా మంది వంటచేసే బ్రాహ్మణులు ఉండేవారు. ఉడుపిలో చాలమంది బ్రాహ్మణులకు వంట చేసే విషయంలో ప్రావీణ్యత దొరికింది. హోటల్ ఉద్యమం ప్రారంభించడానికి ఈ పాకశాస్త్ర జ్ఞానాన్ని ఉపయోగించారు. 1942లో ఉడిపి నుండి ముంబైకి వలస వచ్చిన ఒక యువకుడు మొదటి ఉడిపి శ్రీకృష్ణ హోటల్ని స్థాపించాడు. 1950వ దశకంలో, ఇద్దరు సోదరులు మావల్లి టిఫిన్ రూమ్ (ఎంటీఆర్), ఉడిపి తరహాలో మరొక హోటల్ని ఏర్పాటు చేశారు. 80 సంవత్సరాల వ్యాపారం తర్వాత, ఎంటీఆర్ ఇప్పుడు ఒక పెద్ద నమ్మకమైన సంస్థగా పరిగణించబడుతుంది.ఇదంతా గత వైభోగం కాని నేడు.. దేశ వ్యాప్తంగా ఉడుపి హోటల్స్ విలుప్త అంచున ఉన్నాయి...మన ఆహార సంస్కృతి తీవ్ర ప్రమాదంలో ఉంది, అమెరికన్ ఎమ్ఎన్సీలు ఫుడ్ జెయింట్స్‌ను స్వాధీనం చేసుకోవడం ఉడిపి రెస్టారెంట్లను తొలగిస్తోంది. దీని పర్యవసానంగా చాలా ఉడుపి ఫుడ్ జాయింట్లు వేగంగా మూసుకుపోతున్నాయి. పదేళ్ళ క్రితం వరకు దేశంలో ఏ మూలకు వెళ్ళినా కుగ్రామంలో కుడా ఉడుపి హోటల్ ఉండి తీరాల్సిందే. ఉడుపి హోటల్ పేరు ఎత్తితే చాలు ఆ రవ్వ దోశలు, మసాలా దోశలు, వడ సంబారు, ఘుమఘ్జుమ లాడే కొబ్బరి చట్నీలు..... కానీ నేడు వాటి స్థానంలో నూడుల్స్ సెంటర్లు, పాణి పూరీలు, అమెరికన్ ఎమ్ఎన్సీలు పుణ్యమా..! అని దేశీయ చాట్ సెంటర్లు కుడా కనుమరుగైపోయాయి మన పిల్లలు జంక్ ప్లాస్టిక్ ఫుడ్స్‌కు అలవాటు పడి చిన్నతనం నుంచే తీవ్ర ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. ఈ జంక్ ఫుడ్స్‌తో స్థూలకాయం, కిడ్నీ, ఊపిరితిత్తుల వ్యాధులు విపరీతంగా పెరుగుతున్నాయి.అమెరికన్ ఫుడ్ దిగ్గజా లక్ష్యం మన చిన్నారులు, యువతే. ముఖ్యంగా పిల్లల మనస్సును మరల్చగలగడమే వారి థ్యేయం. ఎందుకంటే..?మధ్య వయస్కులు, వృద్ధులు ఈ జంక్ ఫాస్ట్ ఫుడ్‌ను ఎన్నటికీ అంగీకరించరని వారికి బాగా తెలుసు. ఈలోగా చిన్నారులు యుక్తవయస్సు వచ్చే నాటికి ఈ జంక్ ఫుడ్స్‌కు బాగా బానిస అయ్యిపోతారు. నిజానికి ఇది మన ఆరోగ్యానికి మాత్రమే కాదు, అందులో ఉపయోగించే పదార్థాలు మన రూపు రేఖల్ని అందవిహీనంగా మార్చేసి మనకి ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తాయి. (చదవండి: పెళ్లి రోజున ఇలాంటి గిఫ్ట్‌లు కూడా ఇస్తారా!..ఊహకే రాని బహుమతి!) -
15 నిమిషాల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య!
కర్ణాటక: అందమైన బీచ్‌లు, దేవస్థానాలతో ప్రశాంతంగా ఉండే ఉడుపి నగరంలో ఘోరం చోటుచేసుకుంది, ఆదివారం ఉదయం ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హత్యకు గురయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి, ఇంటి యజమాని నూర్ మహమ్మద్ దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అతని భార్య హసీనా (45), కూతుళ్లు అఫ్నాన్ (23), ఆజ్నాన్ (21), కొడుకు అసీమ్ (14) ఉడుపిలో తృప్తినగరలో నివాసం ఉంటున్నారు. వీరి పెద్ద కొడుకు అసాద్ బెంగళూరులో ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో, అలాగే అఫ్నాన్ బెంగళూరులో ఎయిర్‌హోస్టెస్‌గా ఉద్యోగం చేస్తున్నారు. పండుగ సెలవులు రావడంతో అఫ్నాన్ రెండు రోజుల కిందట ఉడుపిలోని ఇంటికి వచ్చింది. ఆదివారం ఉదయం 8:20 గంటల సమయంలో 45 ఏళ్ల మధ్యవయస్కుడు మూతికి మాస్క్ ధరించి సంతెకట్టెకు వచ్చాడు, అక్కడి నుంచి ఆటో ఎక్కి తనను తృప్తినగరకు తీసుకెళ్లాలని ఆటోడ్రైవర్ శ్యామ్‌కు సూచించాడు. ఆ మేరకు అతన్ని తృప్తినగరలో దించాడు. హత్యకు గురైన తల్లి హసీనా, ఆమె పిల్లలు (ఫైల్) నలుగురిని వెంటాడి పొడిచి దుండగుడు వెంట తెచ్చుకున్న చాకుతో ఇంటిలోకి చొరబడి మారణహోమం సృష్టించాడు. ఎక్కడ ఉన్నవారిని అక్కడే పొడిచి, గొంతుకోసి హతమార్చాడు. వంట గది, బెడ్రూం, బాతురూం, హాల్లో ఒక్కొక్కరి శవాలు ఉండడమే దీనికి నిదర్శనం. హసీనా అత్తను వెంటాడగా ఆమె భయంతో బాతురూంలోకి వెళ్లి లాక్ చేసుకోవడంతో బతికి పోయింది. అసీమ్ సైకిల్ తొక్కుతూ ఇంటిలోకి వచ్చి దుండగున్ని చూసి కేకలు వేశాడు. దుండగుడు బాలున్ని హాల్లో పొడిచి చంపి పరారయ్యాడు. 15 నిమిషాల్లో దారుణం కాగా హంతకుడు 15 నిముషాలలో పని ముగించుకొని మళ్లీ ఎవరో బైకులో వెళ్తుంటే సంతెకట్టకు డ్రాప్ తీసుకున్నాడు. సంతెకట్ట నుంచి ఎక్కడకు వెళ్లాడో జాడ లేదు. ఈ హత్యోదంతం క్షణాల్లోనే ఉడుపి అంతటా పాకిపోయింది. వందలాదిగా అక్కడికి చేరుకున్నారు. పోలీసులు వచ్చి జాగిలాలు, వేలిముద్రల నిపుణులు ఆధారాల కోసం గాలించారు. బెంగళూరు యాసలో మాట్లాడాడు ► ఐదు పోలీసు బృందాలు మంగళూరు, శివమొగ్గ, కారవారకు వెళ్లాయి, రెండు బృందాలు ఉడుపిలో గాలిస్తున్నాయి. ► 45 ఏళ్ల వయసున్న హంతకుని సీసీ కెమెరా ఫొటోలు, వీడియోలను విడుదల చేశారు. నిందితుడు బెంగళూరు యాసలో కన్నడ మాట్లాడినట్లు ఆటో డ్రైవర్ శ్యామ్ చెప్పాడు. ► ఎయిర్ హోస్టెస్‌గా పని చేస్తున్న యువతిపై ద్వేషంతోనే హత్యాకాండకు పాల్పడి ఉండొచ్చని, లేదా పెద్ద కొడుకు పాత్ర ఉండవచ్చని అనుమానాలు ఉన్నాయి. ► పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ, ఎమ్మెల్యే తదితరులు ఘటనాస్థలిని పరిశీలించారు. ► దుబైలో ఉన్న మొహమ్మద్, బెంగళూరులో పెద్దకొడుకు అసాద్ చేరుకోగా సోమవారం సాయంత్రం కోడిబెంగ్రె జామియా మసీదులో అంత్యక్రియలను జరిపారు. -
దారుణం: తల్లి, ముగ్గురు పిల్లల్ని హత్య చేసిన దుండగులు
బెంగళూరు: కర్ణాటకాలోని ఉడిపి జిల్లాలో దారుణం జరిగింది. ఓ తల్లి ఆమె ముగ్గురు కుమారులను దుండగులు హత్య చేశారు. మృతురాలి అత్త కూడా కత్తిపోట్లకు గురైంది. కాపాడటానికి ప్రయత్నించిన ఇరుగుపొరుగువారిని కూడా దుండగులు కత్తితో బెదిరించారు. శనివారం ఉదయం బాధితురాలి ఇంట్లో దుండగులు చొరబడ్డారు. తల్లి హసీనాను ఆమె ముగ్గురు కుమారులను కత్తులతో హత్య చేశారు. అనంతరం ఆమె అత్తను కూడా కత్తితో దాడి చేశారు. మృతుల అరుపులు విని బయటకు వచ్చిన పొరుగింటివారిని దుండగులు కత్తులతో బెదిరించారు. అనంతరం ఘటనాస్థలం నుంచి పారిపోయారని పోలీసులు తెలిపారు. మొదట తల్లి ఇద్దరు పిల్లల్ని హత్య చేసిన దుండగులు.. ముగ్గురిలో చిన్నపిల్లాడు(12) బయట నుంచి వచ్చిన తర్వాత హత్య చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబానికి శత్రువులెవరైనా ఉన్నారా? అనే కోణంలో దుండగుల కోసం గాలింపు చేపట్టారు. ఇంట్లో విలువైన వస్తువులేవీ దొంగిలించకుండా హత్యకు పాల్పడటంతో తెలిసిన శత్రువులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదీ చదవండి: బాణాసంచా మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం -
ఉడుపి వీడియోలు తమాషా కావచ్చు
కర్ణాటక: ఉడుపి కాలేజీలో వీడియోల చిత్రీకరణపై పోలీసులు సుమోటోగా కేసును నమోదు చేశారు, డీఎస్పీ స్థాయి అధికారి విచారణ చేపట్టారు, కేసును సిట్‌కి అప్పగించే ప్రశ్నే లేదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. మంగళవారం మంగళూరులో మీడియాతో ఆయన మాట్లాడారు. కేంద్ర మహిళా కమిషన్ సభ్యులు వచ్చి కాలేజీలోని మరుగుదొడ్డిలో కెమెరా అమర్చలేదని చెప్పారన్నారు. హోమ్ మంత్రి ఈ కేసును పిల్లలాట అనడంపై స్పందిస్తూ, పిల్లలాట కాకపోతే కేసు నమోదు అయ్యేదన్నారు. కాలేజీ విద్యార్థులు తమాషా చేసి ఉండవచ్చని అని ఉండవచ్చని సీఎం అన్నారు. కేసు కోర్టులో ఉన్నందున ఎక్కువ మాట్లాడనన్నారు. ఏడాదిన్నర కిందటే టీటీడీకి నెయ్యి బంద్ కాంగ్రెస్ సర్కారు విధానం వల్లే తిరుమలకు నందిని నెయ్యి సరఫరా స్తంభించిందని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు నళిన్‌కుమార్ కటీల్ ట్వీట్ చేశారు. దీనిపై సీఎం స్పందిస్తూ తిరుమలకు నందిని నెయ్యి నిలిచిపోయింది నిన్న మొన్న కాదు, గత ఒకటిన్నర సంవత్సరం క్రితమే బీజేపీ ప్రభుత్వ హయాంలో నెయ్యి సరఫరా నిలిచిపోయింది, దీనికి కటీల్ దీనికి సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. తాము అడిగిన ధర ఇవ్వడానికి టీటీడీ వారు అంగీకరిస్తే నెయ్యి సరఫరా చేస్తామని తెలిపారు. తీరప్రాంతంలో భూ పరిరక్షణ ఉడుపి జిల్లా కాపు తాలూకా పడుబిద్రి వద్ద సముద్ర తీరాన్ని సీఎం పరిశీలించారు. తీరప్రాంతలో భూమి కోతకు గురి కాకుండా శాశ్వతమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ పథకానికి ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేయాలన్నారు. ఉడుపి జిల్లాలో అతివృష్టి వల్ల రూ.35 కోట్లు నష్టం జరిగిందని, సహాయక చర్యలకు నిధులు ఇస్తామని చెప్పారు. -
ఉడిపి వాష్‌రూమ్ కేసులో సీఎంపై అనుచిత ట్వీట్.. బీజేపీ కార్యకర్త అరెస్ట్
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య, తన కుటుంబంపై అనుచిత ట్వీట్ చేసినందుకు బీజేపీ మహిళా కార్యకర్తను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఉడిపి కాలేజీలోని వాష్‌రూమ్‌లో విద్యార్థినులను రహస్యంగా వీడియో తీసిన కేసులో సీఎం కుటుంబ సభ్యులను తీసుకొస్తూ వ్యక్తిగత విమర్శలు చేసిన నేపథ్యంలో శంకుతల అనే కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఉడిపిలోని ఓ ప్రైవేట్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ కళాశాలలో మైనార్టీ వర్గానికి చెందిన ముగ్గురు విద్యార్థినులు మహిళల టాయ్లెట్లో మొబైల్‌తో వీడియోలు చిత్రీకరించినట్టు గతవారం వెలుగు చూడటం కలకలం రేపిన విషయం తెలిసిందే. టాయ్లెట్లో మొబైల్ ఫోన్ ఉండటాన్ని ఓ విద్యార్థిని గుర్తించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మొబైల్లో అభ్యంతరకర వీడియోలు ఉన్నట్టు విచారణలో తేలింది. దీంతో ముగ్గురు విద్యార్థినులను కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఇక ఈ కేసులో మతపరమైన కోణం లేదని పోలీసులు స్పష్టం చేశారు. చదవండి: రాజ్యాంగం నుంచి ‘ఇండియా’ పేరు తొలగించాలి.. బీజేపీ ఎంపీ సంచలన డిమాండ్ ಮುಸ್ಲಿಂ ಯುವತಿಯರು ಟಾಯ್ಲೆಟ್ ನಲ್ಲಿ ಕ್ಯಾಮೆರಾ ಇಟ್ಟು ಹಿಂದೂ ಹೆಣ್ಣುಮಕ್ಕಳ ವಿಡಿಯೋ ಮಾಡಿದ್ದು ಕಾಂಗ್ರೆಸ್ನವರ ಪ್ರಕಾರ ಮಕ್ಕಳಾಟವಂತೆ..@siddaramaiah ನವರ ಸೊಸೆ or ಹೆಂಡ್ತಿ ಅವ್ರ ವಿಡಿಯೋವನ್ನು ಇದೆ ತರ ಮಾಡಿದ್ರೆ ಅದನ್ನು ಮಕ್ಕಳಾಟ ಅಂತ ಒಪ್ಕೋತೀರಾ? pic.twitter.com/jP0QTKvL5R — ಶಕುಂತಲ🪷Shakunthala (@ShakunthalaHS) July 25, 2023 ఈ ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ప్రతిపక్ష బీజేపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ఉడిపి టాయ్‌లెట్ వీడియో స్కాండల్‌కు సంబంధించి సీఎం సిద్ధరామయ్యపై సోషల్ మీడియాలో శంకుతల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. ఉడిపి కేసు స్నేహితుల మధ్య జరిగిన చిన్న విషయమని, దీనిని బీజేపీ రాజకీయ ఆయుధంగా వాడుకుంటోందని కాంగ్రెస్ చేసిన ట్వీట్‌ను ఆమె షేర్ చేశారు. ‘సిద్ధరామయ్య కోడలికో లేదా భార్యకో ఇలానే జరిగితే మీరు ఇలానే స్పందిస్తారా?’ అంటూ ఆ పోస్ట్‌పై కామెంట్ చేశారు. దీనిని ఫేస్బుక్, ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సిద్ధరామయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో ఆమెపై కేసు నమోదైంది. శుక్రవారం పోలీసులు ఆమెను అరెస్ట్ చేయగా అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. చదవండి: వైరల్‌గా సోనియా, రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ ఫోటోలు ಉಡುಪಿಯ ಕಾಲೇಜಿನಲ್ಲಿ “ವಿದ್ಯಾರ್ಥಿನಿಯರ ವಿಡಿಯೋ ಚಿತ್ರೀಕರಣ“ ಎಂದು ನಕಲಿ ಸುದ್ದಿ ಸೃಷ್ಟಿಸಿ ಕೋಮು ಪ್ರಚೋದನೆಗೆ ಮುಂದಾಗಿರುವ ಬಿಜೆಪಿ ತೀರ್ಥಹಳ್ಳಿಯಲ್ಲಿ ಹಿಂದೂ ವಿದ್ಯಾರ್ಥಿನಿಯರ ಅಶ್ಲೀಲ ವಿಡಿಯೋ ಚಿತ್ರೀಕರಿಸಿದ ABVP ಅಧ್ಯಕ್ಷನ ಅಸಲಿ ಸುದ್ದಿಯ ಬಗ್ಗೆ ಮೌನ ಮುರಿಯುವುದು ಯಾವಾಗ? ವಿದ್ಯಾರ್ಥಿನಿಯರ ಮಕ್ಕಳಾಟವನ್ನು ರಾಜಕೀಯದ ಕಳ್ಳಾಟಕ್ಕೆ… — Karnataka Congress (@INCKarnataka) July 25, 2023 -
బాత్రూంలో తోటి విద్యార్థినుల వీడియోల చిత్రీకరణ.. ముగ్గురు అమ్మాయిలపై కేసు
యశవంతపుర: ఉడుపి పట్టణంలోని మహిళా నర్సింగ్ కాలేజీ బాత్రూమ్లో ఓ వర్గానికి చెందిన విద్యార్థినుల ప్రైవేటు వీడియోలు తీశారంటూ వారం రోజులుగా కలకలం రేగుతున్న సంగతి తెలిసిందే. ముంబైలో నివాసం ఉంటున్న ఉడుపి వాసి, సమాజ సేవకురాలు రశ్మి సమంత్ ట్వీట్ చేసి మరో వర్గానికి చెందిన ముగ్గురు యువతులు వీడియో తీశారంటూ పెట్టిన పోస్టు సంచలనం కలిగించింది. దీంతో ముగ్గురు విద్యార్థులను కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి ఉడుపి ఎస్పీ అక్షయ్ మశ్చింద్రను వివరణ కోరగా సోషల్ మీడియాలో మరో రకమైన వీడియో చూపించారని, అందులో వాయిస్ ఎడిట్ చేసి వైరల్ చేసినట్లు తెలిపారు. సుమోటా కేసుగా నమోదు చేసినట్లు చెప్పారు. చర్యలు తీసుకుంటున్నాం: బాత్రూమ్లో వీడియో తీసిన మాట నిజమేనని నేత్రాజ్యోతి నర్సింగ్ కళాశాల డైరెక్టర్ రశ్మీ తెలిపారు. మంగళవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కారకులపై చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించినట్లు ఆమె తెలిపారు. చదవండి: మచిలీపట్నంలో ప్రముఖ వైద్యుడి భార్య దారుణ హత్య -
బెంగళూరులో నిర్మలా సీతారామన్ కుమార్తె వివాహం
దొడ్డబళ్లాపురం: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ కుమార్తె వాఙ్మయి వివాహం బెంగళూరులో గురువారం నిరాడంబరంగా జరిగింది. ఉడుపి అదమారు మఠం బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం వాఙ్మయి– ప్రతీక్ల వివాహం బెంగళూరులోని టమరిండ్ ట్రీ అనే ఓ హోటల్లో జరిగింది. ఉడుపి మఠానికి చెందిన పలువురు స్వామీజీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు ఇరు కుటుంబాల నుంచి అతి కొద్దిమంది బంధువులు మాత్రమే హాజరయ్యారు. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్న వాఙ్మయి ఒక ప్రముఖ పత్రికలో సీనియర్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. -
Karnataka Assembly elections 2023: బీజేపీ కోటలో కాంగ్రెస్ పాగా వేసేనా?
సాక్షి బెంగళూరు: ఎంతో వైవిధ్యం, సాంస్కృతిక, సామాజిక, వారసత్వ సంపద కలిగిన ప్రాంతం కరావళి కర్ణాటక. సుదీర్ఘ తీరప్రాంతం, అటవీ భూభాగం కలిగిన ఈ ప్రాంతాన్ని బీజేపీ తన అడ్డాగా మార్చుకుంది. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతంలో బీజేపీ ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. కరావళి కర్ణాటక పరిధిలోకి వచ్చే దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో గత ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని పార్టీగా అవతరించింది. గతంలో ఉత్తర కన్నడ జిల్లా కరావళి కర్ణాటక పరిధిలో ఉన్నప్పటికీ ఆ తర్వాత దాన్ని కిత్తూరు కర్ణాటకలో కలిపేశారు. అలాగే కొడుగు జిల్లా దక్షిణ కర్ణాటక ప్రాంతంలో కలిసిపోయింది. ప్రస్తుతం ఉడుపి, దక్షిణ కన్నడ జిల్లాలను కరావళి కర్ణాటకగా పిలుస్తున్నారు. ఈ ప్రాంతంలో నియోజకవర్గాల అభివృద్ధి కంటే వ్యక్తిగత కీర్తి, కుల ఆధారిత రాజకీయాలు కీలకంగా ఉన్నాయి. ఈ రెండు జిల్లాల్లో మొత్తం 13 నియోజకవర్గాలు ఉన్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 13 స్థానాల్లో బీజేపీ 12 చోట్ల గెలుపొందింది. బీజేపీకి కంచుకోటలో పాగా వేయా లని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. జేడీఎస్ ఈ ప్రాంతంలో ఖాతా కూడా తెరవలేకపోయింది. హిజాబ్ ప్రభావం చూపిస్తుందా? కుల, మత ప్రాతిపదికన అంశాలు ఇక్కడ రాజకీయాలను శాసిస్తున్నాయి. హిజాబ్, హలాల్ వివాదాలు ఈ ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే కరావళి కర్ణాటకలో అత్యధికంగా ఆరుగురు సీనియర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి బీజేపీ టికెట్ ఇవ్వలేదు. కోస్తా కర్ణాటకలో పార్టీ బలాన్ని చూసుకుని టికెట్ల పంపిణీలో సాహసోపేత నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాంతంలో సరస్వత్ బ్రాహ్మిణ్‌లు, మత్స్యకార సామాజికవర్గం మొగవీరలు ఎక్కువగా ఉన్నారు. వీరంతా ప్రస్తుతం బీజేపీకే మద్దతుగా నిలుస్తున్నారు. ఈ ప్రాంతంలోని ఉడుపి జిల్లా కార్కళ నియోజకవర్గం నుంచి శ్రీరామ సేన అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ ఈ సారి ప్రత్యక్ష ఎన్నికల్లో నిలవడం గమనార్హం. దీంతో కార్కళలో హిందూ సామాజికవర్గ ఓట్లు బీజేపీకి, ముతాలిక్ మధ్య చీలిక తెచ్చే అవకాశం ఉంది. విద్యా సంస్థల్లో హిజాబ్ నిషేధం, హలాల్ మాంసం నిషేధించి జట్కా మాంసంపై బీజేపీ ప్రచారం చేస్తుండడంతో ముస్లింలలో ఆగ్రహం పెరిగిపోతోంది. ఈ ప్రాంతంలో బలంగా ఉన్న పీఎఫ్ఐ సంస్థను నిషేధించడంతో ఆ ప్రతినిధులు బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు. మరోవైపు పోటాపోటీ హత్యలు, హింసాత్మక ప్రేరేపణలు, దాడుల నేపథ్యంలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఇవన్నీ తనకు అనుకూలంగా మార్చుకోవడానికి కాంగ్రెస్ పన్నుతున్న వ్యూహాలు ఫలిస్తాయో లేదో వేచి చూడాలి. -
ఒక్కొక్కరికి రూ.15 లక్షలు ఇస్తామని మోదీలా అబద్దాలు చెప్పం: రాహుల్
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూసుకుపోతోంది. అధికార బీజేపీపై విమర్శల జోరు పెంచింది. ఈ క్రమంలోనే ఉడుపిలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని మోదీలా తాము అబద్దపు వాగ్ధానాలు చేయబోమని ధ్వజమెత్తారు. 'ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు వేస్తాం. నల్లధనంపై పారాటం కోసమే పాత నోట్లు రద్దు చేస్తున్నాం. ఇలా మోదీలా మేము అబద్దాలు చెప్పం' అని రాహుల్ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ఎప్పుడైనా చేసేదే చెప్తుందని, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తుందని రాహుల్ అన్నారు. హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్‌లో ఇలానే చేశామన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 13న ఒకే విడతలో జరగనున్నాయి. 13న కౌంటింగ్, ఫలితాలు ప్రకటిస్తారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ చెబుతుండగా.. 150 స్థానాలకు పైగా కైవసం చేసుకుని కమలం పార్టీని ఓడిస్తామని కాంగ్రెస్ చెబుతోంది. చదవండి: ఆయన కచ్చితంగా గెలుస్తారు.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. రక్తంతో లేఖ రాసిన కార్యకర్త.. -
బ్రెయిన్‌డెడ్ మహిళ అవయవాలతో ప్రాణదానం..
బెంగళూరు: బ్రెయిన్‌డెడ్ అయిన మహిళ అవయవాలతో ఇద్దరి ప్రాణాలను కాపాడారు వైద్యులు. ఒకరికి లివర్, మరొకరికి కిడ్నీ సకాలంలో అందించి వారికి పునర్జన్మనిచ్చారు. కర్ణాటక ఉడుపి జిల్లా మణిపాల్‌లో ఈ ఘటన జిరిగింది. జిల్లాలోని ఉప్పండాకు చెందిన 44 ఏళ్ల శిల్పా మాధవ్ ఫిబ్రవరి 25న రోడ్డుప్రమాదానికి గురైంది. తీవ్రగాయాలపాలైన ఆమెను కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స అందించిన వెద్యులు ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు ప్రకటించారు. దీంతో ఆమె బతికే అవకాశాలు లేకపోవడంతో అవయవదానం చేసేందుకు కుటుంబసభ్యులు అనుమతి ఇచ్చారు. అనంతరం కస్తుర్బా ఆస్పత్రి వైద్యులు శిల్పా మాధవ్ లివర్‌ను బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోని రోగికి అందించి అతని ప్రాణాలు కాపాడారు. అలాగే కిడ్నీని మంగళూరులోని ఆస్పత్రిలో ఓ రోగికి అమర్చారు. మరో కిడ్నీతో పాటు శిల్పా కళ్ల కార్నియాలు, చర్మాన్ని కసుర్బా ఆస్పత్రిలో భద్రపరిచారు వైద్యులు. వీటిని కూడా అవసరమైన వారికి అందిస్తామని చెప్పారు. చదవండి: బ్యాంకు ఉద్యోగి నిర్వాకం.. ఖాతాదారుల సొమ్ముతో ఆన్లైన్లో రమ్మీ ఆట -
పాలిచ్చే తల్లులకు శ్రేష్ఠం.. సొప్పు పాల్య, మోహన్ లడ్డు
అదేమిటో కానీ, మన ఇంటి వంట కంటే పక్కింటి పోపుకే ఘుమఘుమలు ఎక్కువ. మన పొరుగున ఉన్న కర్నాటక రాష్ట్రం ఉడిపి వాళ్ల ఆరోగ్యవంటలకు మన వంటింట్లో పోపు వేద్దాం. పాలిచ్చే తల్లి ఏమి తినాలో ఉడిపి వాళ్ల మెనూ చూద్దాం. సొప్పు పాల్య కావలసినవి: ►పాలకూర – 2 కట్టలు ►ఉల్లిపాయ– 1 (తరగాలి) ►ఉప్పు – అర టీ స్పూన్ ►మిరియాల పొడి– టీ స్పూన్. ►పోపు కోసం: నెయ్యి– 2 టీ స్పూన్లు ►జీలకర్ర – అర టీ స్పూన్ ►కరివేపాకు– 2 రెమ్మలు. తయారీ: ►పాలకూరను శుభ్రం చేసి తరగాలి. ►బాణలిలో నెయ్యి వేడి చేసి జీలకర్ర వేయాలి. ►అవి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ►ఆ తర్వాత కరివేపాకు వేయాలి. ►ఇప్పుడు పాలకూర, ఉప్పు, మిరియాల పొడి వేసి కలిపి మూత పెట్టి సన్న మంట మీద పది నిమిషాల సేపు మగ్గనివ్వాలి (ఆకులోని నీటితోనే మగ్గుతుంది). ►దీనిని పాలిచ్చే తల్లికి రెండు రోజులకొకసారి పెడతారు. మోహన్ లడ్డు కావలసినవి: ►గోధుమ పిండి– కప్పు ►బియ్యప్పిండి– టేబుల్ స్పూన్ ►నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు ►చక్కెర– కప్పు ►నీరు – అర కప్పు ►యాలకుల పొడి– అర టీ స్పూన్ ►జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్లు ►కిస్మిస్ – టేబుల్ స్పూన్ ►నూనె – పూరీలు కాలడానికి తగినంత. తయారీ: ►వెడల్పు పాత్రలో గోధుమపిండి, బియ్యప్పిండి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, నీటిని పోస్తూ ముద్దగా కలపాలి. ►బాణలిలో నూనె వేడి చేసి ఈ పిండినంతటినీ పూరీలు చేసుకోవాలి. ►మోహన్ లడ్డు కోసం చేసే ఈ పూరీలు మెత్తగా ఉండకూడదు, కరకరలాడాలి. ►చల్లారిన తరవాత వీటిని తుంచి చిన్న ముక్కలు చేయాలి. ►బాణలిలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, కిస్మిస్ వేయించి పూరీ ముక్కల్లో కలపాలి. ►ఒక పాత్రలో చక్కెర వేసి, నీరు పోయాలి. చక్కెర కరిగిన తరవాత, యాలకుల పొడి వేసి మీడియం మంట మీద సిరప్ తయారయ్యే వరకు మరిగించాలి. ►ఈ చక్కెర పాకాన్ని పూరీ ముక్కల మీద పోస్తూ లడ్డు చేయాలి. ఇది ఉడిపి స్పెషల్. చదవండి: Menopause: టాబ్లెట్ల ద్వారా హార్మోన్స్‌ను రీప్లేస్ చేయొచ్చా? వారికైతే సురక్షితం కాదు.. Facial Brush: మృత కణాలు, దుమ్ము, ధూళి మాయం.. ఈ డివైజ్ ధర ఎంతంటే! -
శిక్ష పడుతుందన్న భయంతో.. విచారణ ఖైదీ ఆత్మహత్య
సాక్షి, యశవంతపుర: జైల్లో విచారణ ఖైదీ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉడుపిలో జరిగింది. ఉడుపి ఒత్తినెణె సమీపంలోని హేనబేరు రోడ్డులో జులై 12న కార్కళకు చెందిన ఆనంద దేవాడిగ అనే వ్యక్తిని సదానంద, తన స్నేహితురాలు శిల్ప సాయంతో కారులో పిలుచుకుని వచ్చి ఆయనకు నిద్ర మాత్రలు ఇచ్చి కారుతో సహా నిప్పు పెట్టారు. ఈ ఘటనలో సదానంద ఉడుపి జైలులో ఉన్నాడు. 20 మంది ఖైదీలతో ఓ బ్యారెక్‌లో ఉన్న సదానంద ఆదివారం తెల్లవారుజామున పంచెతో ఉరి వేసుకున్నాడు. దీన్ని గమనించి సహచర ఖైదీలు జైలు సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా సదానంద మార్గం మధ్యలో మృతి చెందాడు. కోర్టులో శిక్ష ఎక్కువగా పడుతుందనే భయంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. (చదవండి: విహారయాత్రలో విషాదం..బస్సు బోల్తా ఇద్దరు మృతి) -
యాచకురాలి దాతృత్వం.. అన్నదానానికి భారీగా విరాళం
యశవంతపుర(కర్ణాటక): కట్టుకున్న భర్త, కన్న కొడుకులు కాలం చేశారు. కడుపు నింపుకోవడానికి భిక్షాటనపై ఆధారపడింది. గుడులు, కూడళ్లలో భిక్షగా వచ్చిన నగదు కూడబెట్టింది. మంగళూరులోని ముల్కి దుర్గా పరమేశ్వరి ఆలయంలో అన్నదానానికి లక్ష రూపాయల విరాళం ఇచ్చింది. తన దాతృత్వాన్ని చాటుకుంది. ఆమె మరెవరో కాదు కర్ణాటక రాష్ట్రం ఉడుపికి చెందిన వృద్ధురాలు అశ్వర్థమ్మ (80). ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యాచన ద్వారా రోజు వచ్చే డబ్బులను పిగ్మీ పొదుపు ఖాతాలో కడతానని, లక్ష రూపాయలు కాగానే ఏదో ఒక ఆలయానికి ఇస్తానని చెప్పింది. కరోనా సమయంలో అయ్యప్ప మాల ధరించి శబరిమల వెళ్లి రూ.1.5 లక్షలు అందజేశానని తెలిపింది. ( లక్షల జీతం వచ్చే ఐటీ ఉద్యోగాలు వదిలేసి.. భార్యాభర్తలిద్దరూ..) -
ఊ అంటే ఉద్రిక్తత
మత సమైక్యత, సుహృద్భావానికి తూట్లు పడేలా కొందరి చర్యలు సమాజంలో కల్లోలానికి కారణమవుతున్నాయి. వట్టి వదంతులతోనే అల్లర్లకు దిగడం, ఆస్తి నష్టానికి పాల్పడడం, ఆపై రావణకాష్టంలా అది కొనసాగడం కొన్ని జిల్లాలకు సమస్యగా మారింది. మల్నాడు, కోస్తా, పలు ఉత్తర కర్ణాటక జిల్లాల్లో కలహాల బెడద ఎక్కువగా ఉంటోంది. బనశంకరి: రౌడీయిజంలో ఉడుపి, కోలారు, అగ్రస్థానంలో నిలిచాయి. ఈ జిల్లాల్లో అత్యధికంగా రౌడీయిజం ఆధారిత కేసులు నమోదు కాబడ్డాయి. ఉడుపి జిల్లాలో గత ఐదేళ్లలో 431 కేసులు నమోదు కాగా, కోలారు జిల్లాలో 165, ఆ తరువాత దక్షిణ కన్నడ జిల్లాలో 152 కేసులు, బెంగళూరు నగర 60, కలబురిగి 97, శివమొగ్గ 156 నేరాలు జరిగాయి. అత్యధికంగా శివమొగ్గ జిల్లాలో.. గత ఐదేళ్లలో రాష్ట్రంలో మత ఘర్షణలు కేసులు 242 నమోదయ్యాయి. వీటిలో శివమొగ్గ జిల్లాలో 57 కేసులు, దక్షిణ కన్నడ జిల్లాలో 46 నేరాలు జరిగాయి. బాగల్కోటెలో 26, దావణగెరెలో 18, హావేరి 18 ఘటనలు సంభవించాయి. గత మూడేళ్లలో నాలుగు మత ఘర్షణలతో కూడిన హత్యలు జరిగాయి. మంగళూరులో 1, దక్షిణ కన్నడ జిల్లాలో 1, గదగ (నరగుంద)లో 1, శివమొగ్గలో 1 హత్య జరిగాయి. మత ఘర్షణల ఆస్తినష్టం కేసులు శివమొగ్గలో 31 నమోదయ్యాయి. ఇదే అత్యధికం. సోషల్ మీడియా ఎఫెక్టు .. ఇందులో సోషల్ మీడియా ప్రభావం అధికంగా ఉంది. ఎక్కడో జరిగిన సంఘటనలను ఇక్కడే జరిగాయని కొందరు మసిపూసి పోస్ట్ చేయడం, అవి వైరల్‌గా మారి కల్లోలం చెలరేగడం పరిపాటిగా మారింది. అవి ఫేక్ వీడియోలు అని చెప్పినప్పటికీ ఆవేశంలో యువత నమ్మడం లేదు. మరో వర్గానికి చెందినవారిని దారి కాచి దాడి చేయడం ఆస్తులను ధ్వంసం చేయడంతో ఉద్రిక్తతలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించే ప్రమాదముంది. గొడవల్లో 380 మంది పోలీసులకు గాయాలు గొడవలు, మత ఘర్షణలను నియంత్రణ చేయడం పోలీసులకు సవాల్‌తో కూడుకున్నది. ఈ ఘర్షణలను అడ్డుకునే క్రమంలో 380 మంది పోలీసులు గాయపడ్డారు. ఇందులో సీఐ, ఆపై అధికారులు 107 మంది, ఎస్ఐలు 49 మంది, హెడ్‌కానిస్టేబుల్స్ 96, కానిస్టేబుళ్లు 128 మంది ఉన్నారు. ఘర్షణల కేసుల్లో విచారణ జరిపి 3,489 మందిపై చట్టపరంగా చర్యలు తీసుకున్నారు. వీరిలో ఉత్తర కన్నడ జిల్లాలో 802, దావణగెరెలో 465, మంగళూరులో 501, బెంగళూరునగర 493 మందిపై చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లుచెబుతున్నప్పటికీ మత ఘర్షణలకు బ్రేక్ పడటం లేదు. (చదవండి: పేసీఎం పోస్టర్‌పై ఫోటో.. కాంగ్రెసకు వార్నింగ్ ఇచ్చిన నటుడు) -
అత్తింటివారి దాష్టీకం!...బాలింత అయిన కోడలిని ఇంట్లోకి రానివ్వకుండా...
యశవంతపుర: భర్త మృతి చెందిన దుఃఖంలో ఉన్న కోడలికి అండగా ఉండాల్సిన అత్తింటివారు నిర్దయగా వ్యవహరించి ఆమెను ఇంట్లోకి అడుగు పెట్టనివ్వలేదు. 30 రోజుల బాలింత అయిన ఆమె తన చిన్నారితో కలిసి ఓ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతోంది. ఈ ఘటన ఉడిపిలో జరిగింది. బాదామికి చెందిన అయ్యప్ప(28) ఉడిపిలో మెకానిక్ పని చేసేవాడు. రెండేళ్ల క్రితం గంగావతికి చెందిన యువతిని ప్రేమించాడు. వీరి వివాహానికి ఇరువైపులా పెద్దలు అంగీకరించలేదు. దీంతో అయ్యప్ప పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్నాడు. నెల రోజుల క్రితం ఈ దంపతులకు ఆడబిడ్డ పుట్టింది. అయితే ఆ కుటుంబంపై విధి కన్నెర్ర చేసింది. 20 రోజుల క్రితం అయ్యప్ప కింద పడగా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే కుమారుడి మృతదేహాన్ని తీసుకెళ్లిన తల్లిదండ్రులు కోడలిని మాత్రం ఇంట్లోకి అడుగు పెట్టనివ్వలేదు. దిక్కుతోచని స్థితిలో ఆమె తన చిన్నారితో కలిసి ఉడిపి సమాజ సేవక విశుశెట్టి అంబలపాడి నిట్టూరు సఖి ఆశ్రయంలో తాత్కాలికంగా ఆశ్రయం పొందుతోంది. (చదవండి: చైన్‌స్నాచింగ్ చేయకపోతే నిద్రపట్టదు) -
కారులో పెట్రోల్ పోసుకుని ప్రేమికుల సజీవ దహనం
బనశంకరి: కారులో పెట్రోల్ పోసుకుని నిప్పటించుకుని ప్రేమజంట సజీవ దహనమైన ఘటన కర్ణాటకలో ఉడుపి జిల్లా బ్రహ్మవర పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. బెంగళూరు సుల్తాన్పాళ్యవాసి యశవంత్‌యాదవ్ (23), మనోరాయనపాళ్యవాసి జ్యోతి (23) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. జ్యోతి బీకాం చదివింది. యశవంత్ కంప్యూటర్ కోర్సు చేశాడు. ఈ నెల 18న మధ్యాహ్నం 12 గంటలకు యశవంత్ కంప్యూటర్ క్లాస్‌కు వెళ్తానని ఇంట్లో చెప్పి బైక్‌పై బయటకు వెళ్లాడు. జ్యోతి కూడా పని ఉందని బయటకు వెళ్లింది. రెండురోజులైనా కనిపించకపోవడంతో ఇద్దరి తల్లిదండ్రులూ హెబ్బాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రేమ జంట మంగళూరుకు వెళ్లి తమకు ఉద్యోగం వచ్చిందని చెప్పి ఒక అద్దె ఇంటిని తీసుకున్నారు. అక్కడే హుసేనఖ అనే వ్యక్తి నుంచి స్విఫ్ట్ కారును బాడుగకు తీసుకుని ఉడుపికి వెళ్లారు. ఉడుపిలో వివిధ దేవస్థానాలను సందర్శించి ఆదివారం వేకువజామున 3 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించారు. యశవంత్ తన సోదరునికి మెసేజ్ పంపాడు. తరువాత ప్రేమికులు కారులోనే కూర్చుని పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. మంటలు చెలరేగి కారులో గ్యాస్ సిలండర్ పేలిపోవడంతో యశవంత్ శరీరం బయటకు ఎగిరిపడింది. జ్యోతి కారులోనే కాలిపోయింది. స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. బ్రహ్మవర పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. పెళ్లికి పెద్దలు ఒప్పుకోరనే భయంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. -
హిజాబ్... తప్పనిసరి మతాచారం కాదు
బెంగళూరు: హిజాబ్ ధరించడం అనేది ఇస్లాంలో తప్పనిసరి మతాచారం కాదని కర్ణాటక హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడాన్ని నిలిపివేస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ 25ను ఉల్లంఘించినట్లు ఎంతమాత్రం కాదని తేల్చిచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ ప్రభులింగ్ నావడ్గీ వాదించారు. చట్ట ప్రకారమే ప్రభుత్వం ఫిబ్రవరి 5న హిజాబ్‌పై ఉత్తర్వు ఇచ్చిందని, ఇందులో అభ్యంతరకరమైన అంశమేదీ లేదని స్పష్టం చేశారు. ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. హిజాబ్‌కు అనుమతివ్వాల్సిందే.. కర్ణాటకలో శుక్రవారం సైతం పలు ప్రాంతాల్లో ఓ వర్గం విద్యార్థినులు హిజాబ్ ధరించి కళాశాలలకు వచ్చారు. తమను తరగతుల్లోకి అనుమతించాలని పట్టుబట్టారు. హిజాబ్ ధరించడానికి ప్రిన్సిపాల్ అనుమతి ఇవ్వడం లేదన్న ఆవేదనతో తుమకూరు జైన్ పీయూ కాలేజీ అధ్యాపకురాలు చాందిని తన ఉద్యోగానికి శుక్రవారం రాజీనామా చేశారు. కర్ణాటకలో హిజాబ్ వివాదం కారణంగా దేశవ్యాప్తంగా వార్తల్లోకెక్కిన ఉడుపి మహాత్మాగాంధీ మెమోరియల్(ఎంపీఎం) కాలేజీ 10 రోజుల తర్వాత శుక్రవారం పునఃప్రారంభమైంది. తరగతులు యథాతథంగా జరిగాయి. హిజాబ్‌కు సంబంధించిన కేసు విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని నిలిపివేయాలని సీనియర్ అడ్వొకేట్ ప్రొఫెసర్ రవివర్మ కుమార్ విజ్ఞప్తి చేయగా, కర్ణాటక హైకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. -
హిజాబ్ వ్యవహారం: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, బెంగళూరు: హిజాబ్ ఆందోళనల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఉడిపి జిల్లాలో 144 సెక్షన్ విధించినట్లు పేర్కొంది. రేపు(సోమవారం) నుంచి ఈ నెల 19 వరకు ఉడిపిలో 144 సెక్షన్ అమలు కానుంది. ఇప్పటికే ప్రభుత్వం విద్యాసంస్థల సెలవులను ఈ నెల16 వరకు పొడగించిన విషయం తెలిసిందే. ఉడిపి డిప్యూటీ కమిషనర్ కూర్మారావు మాట్లాడుతూ.. ఫిబ్రవరి 14వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఫిబ్రవరి 19 సాయంత్రం 6 గంటల వరకు జిల్లాలోని ఉన్నత పాఠశాలల వద్ద 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ ప్రకారం నిషేధాజ్ఞలు కొనసాగుతాయని తెలిపారు. -
Karnataka Hijab Row: హిజాబ్ వివాదంపై హైకోర్టు ఏమన్నదంటే..
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో హిజాబ్ వివాదం చినికి చినికి గాలి వానలా మారింది. రాష్ట్రంలోని ఉడిపిలో మొదలైన ఈ వివాదం మెల్లమెల్లగా దేశ వ్యాప్తంగా వ్యాపిస్తోంది. ఇక హిజాబ్ వివాదం కర్నాటకలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడంతో మూడురోజుల పాటు విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు రెండో రోజు (బుధవారం) విచారణ జరిపింది. ఈ సందర్భంగా హిజాబ్ అంశంపై లోతుగా అధ్యయనం చేపట్టాలని నిర్ణయించి.. విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ దీక్షిత్ పేర్కొన్నారు. విద్యార్థినులు తరగతి గదుల్లో హిజాబ్‌ను ధరించేందుకు అనుమతి ఇవ్వడానికి తాత్కాలిక ఆదేశాలను జారీ చేయడంపై కూడా విస్తృత ధర్మాసనమే నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. చదవండి: మేఘాలయలో కాంగ్రెస్ కల్లాస్.. 21 మంది ఎమ్మెల్యేల నుంచి జీరోకు.. సింగిల్ బెంచ్ తీర్పుతో తుది తీర్పు వచ్చే వరకు తాత్కాలిక ఆదేశాలు జారీ చేయాలన్న పిటిషనర్లకు ఉపశమనం లభించలేదు. తరగతి గదుల్లో విద్యార్థినులు హిజాబ్ ధరించేందుకు అనుమతి ఇవ్వలేదు. మరోవైపు బెంగళూరులో పాఠశాలలు, కళాశాలల వద్ద నిరసనలు, ప్రదర్శనలను రెండు వారాల పాటు నిషేధిస్తూ కర్ణాటక పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలు, ప్రీ యూనివర్సిటీ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు లేదా ఇటువంటి విద్యా సంస్థల గేట్ల నుంచి 200 మీటర్ల పరిధిలో ఆందోళనలు, నిరసనలు, ప్రదర్శనలు నిర్వహించరాదని, ఈ నిషేధం రెండువారాలపాటు అమలవుతుందని తెలిపారు. చదవండి: హిజాబ్ వివాదంపై కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు గత నెల ఉడుపిలోని ఓ ప్రభుత్వ కాలేజీ హిజాబ్ ధరించి వచ్చిన ఆరుగురు విద్యార్థినులను యాజమాన్యం అడ్డుకోవడంతో ఈ వివాదం మొదలయ్యింది. దీనికి పోటీగా పలువురు కాషాయ కండువాలను మెడలో వేసుకుని పాఠశాలలకు రావడంతో రెండు వర్గాలుగా విద్యార్థులు విడిపోయారు. శివమొగ్గలో పరిస్థితి అదుపుతప్పడంతో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు జారీ చేశారు. -
ఆ నిషేధం చదువును దూరం చేస్తుంది!
కర్ణాటకలో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి విద్యాలయాలకు రావడంపై అభ్యంతరం వ్యక్తం చేయడం దేశంలో పెద్ద చర్చను లేవనెత్తింది. మంగళవారం ఈ వివాదంపై కర్ణాటక హైకోర్టులో ఒక పక్క విచారణ జరుగుతుండగానే... స్టూడెంట్స్ రెండు వర్గాలుగా విడిపోయి దాడులు చేసుకునే పరిస్థితులూ తలెత్తాయి. దీంతో ప్రభుత్వం పోలీసులను అప్రమత్తం చేసి రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాలయాలకూ 3 రోజులు సెలవులు ప్రకటించింది. కోర్టు విచారణ బుధవారం కూడా కొనసాగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు వర్గాలుగా ఏర్పడి వీధుల్లోకి వచ్చి దాడులు చేసుకోవడం పట్ల హైకోర్టు తన బాధ, అసహనాలను వ్యక్తం చేసింది. ఇటీవల కర్ణాటకలోని ఉడిపి జిల్లా కుందాపుర పట్టణ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు హిజాబ్ ధరించి వచ్చిన విద్యార్థినులను లోనికి అనుమతించకుండా ప్రధాన ద్వారాన్ని మూసివేశారు. దీంతో విద్యార్థినులకు, ప్రిన్సిపల్, ఇతర అధ్యాపకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు హిజాబ్ ధరించి కళాశాలకు వస్తే అనుమతించే ప్రసక్తే లేదని ప్రిన్సిపల్ స్పష్టం చేశారు. ప్రవేశాల సమయంలో ఈ విషయాన్ని స్పష్టం చేయకుండా ఇప్పుడు చెబితే ఎలా? అని విద్యార్థినులు ప్రశ్నించారు. వార్షిక పరీక్షలు మరో రెండు నెలల్లో ఉండగా, ఇప్పుడిలా ఆంక్షలు పెడితే ఎలాగని విమర్శించారు. విద్యార్థినులు కళాశాల మైదానం వెలుపలే కొద్దిసేపు గడిపి వెనుదిరిగారు. ఇది ఒక కళాశాలకో లేక ఒక రాష్ట్రానికో పరిమితమై ఉండొచ్చు... రేపు దేశమంతటికీ పాకితే ముస్లిం అమ్మాయిల చదువుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. ప్రభుత్వ నిబంధనలను అందరూ తప్పని సరిగా పాటించాల్సిందే అని జిల్లా మంత్రి అంగార చెబుతున్నారు. మత సంప్రదాయాలు పాటించేందుకు విద్యాసంస్థలు వేదిక కాదని హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర అన్నారు. మంత్రులే ఇలా బాహాటంగా స్కూల్ యాజమాన్యం చర్యను సమర్థించడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. (చదవండి: ప్రత్యామ్నాయ వ్యూహం ఫలించేనా?) విద్యార్థినులను కళాశాలలోకి అనుమతించక పోవడాన్ని జమ్మూ – కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ ఖండించారు. బాలికలకు విద్య అందించాలంటూ ఇస్తున్న నినాదం వట్టిదేనని అర్థమవుతోందని ముఫ్తీ అన్నారు. హిజాబ్ ధరించినందుకు ముస్లిం బాలికలకు కాలేజీల్లో ప్రవేశం నిరాకరించడం రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమేనని కర్ణాటకలో ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య అన్నారు. ఇది రాజకీయ ప్రేరేపితమైనదిగా అభివర్ణించారు. హిజాబ్‌ను వివాదాస్పదం చేయడం ద్వారా అధికార పార్టీవారు రెండు లక్ష్యాలు సాధించాలని అనుకుంటున్నట్టు స్పష్టమవుతోంది. మరో ఏడాదిలో కర్ణాటకలో ఎన్నికలు ఉన్నాయి. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతాయి. అభివృద్ధిపై చెప్పుకోవడానికి ఏమీలేదు కాబట్టి మళ్లీ ఏదో ఒక కారణంతో ప్రజల మధ్య వివాదాలు సృష్టించి... మెజారిటీ వర్గాన్ని ఏకం చేయాలనే ఆలోచన కనిపిస్తోంది. అంతేకాకుండా ముస్లిం అమ్మాయిలను చదువుకు దూరం చేసే కుట్ర సైతం కనిపిస్తోంది. ఈ కుట్రను లౌకికవాదులు, ప్రజలు ఏకమై భగ్నం చేయవలసిన సమయం ఇది. (చదవండి: రాజకీయాలు మారేదెన్నడు?) - ఫిరోజ్ ఖాన్ సీనియర్ జర్నలిస్ట్ -
కర్ణాటకలో ‘హిజాబ్’పై అదే రగడ
బెంగళూరు: కర్ణాటకలో హిజాబ్(బురఖా) గొడవ మరింత ముదురుతోంది. విద్యాసంస్థల్లో నిర్దేశిత ఏకరూప దుస్తులు(యూనిఫామ్) ధరించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొందరు విద్యార్థులు ధిక్కరించారు. ఉడుపి జిల్లాలోని కుందాపూర్‌లో ఓ కాలేజీలో విద్యార్థినులు సోమవారం హిజాబ్ ధరించి తరగతులకు హాజరయ్యారు. వారితో ప్రిన్సిపాల్ మాట్లాడారు. ప్రభుత్వ ఉత్తర్వు గురించి వివరించారు. హిజాబ్ తొలగించేందుకు విద్యార్థినులు నిరాకరించారు. దీంతో వారికోసం కేటాయించిన ప్రత్యేక గదిలోకి వెళ్లాలని ప్రిన్సిపాల్ సూచించారు. ఇందుకు నిరసనగా వారు కాలేజీ బయట రోడ్డుపై బైఠాయించారు. హిజాబ్ రగడపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై స్పందించారు. రాష్ట్రంలో శాంతిని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యూనిఫామ్ నిబంధనలు పాటించాలని విద్యాసంస్థలను కోరారు. హిజాబ్‌పై హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విద్యాశాఖ మంత్రి బి.సి.నగేష్ మాట్లాడుతూ.. హిజాబ్ ధరించిన వారిని ప్రభుత్వ విద్యా సంస్థల్లోకి అనుమతించబోమని తేల్చిచెప్పారు. రోడ్లపై నిరసనకు దిగితే పాఠాలు కోల్పోవడం తప్ప ఒరిగేదేమీ ఉండదన్నారు. రోడ్లపై బైఠాయించడం భారతీయ సంస్కృతి కాదన్నారు. హిజాబ్ ధరించినవారి కోసం ప్రత్యేకంగా తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. అలాంటి వారిని సాధారణ తరగతుల్లోకి అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తూ చిక్కబళ్లాపూర్, బాగల్కోట్, బెళగావి, హసన్, మండ్య తదితర ప్రాంతాల్లో కొందరు విద్యార్థులు కాషాయం కండువాలు ధరించి, కాలేజీలకు రాగా పోలీసులు అడ్డుకున్నారు. తమకు న్యాయం కావాలంటూ బెళగావి, మండ్యాలో విద్యార్థినులు నిరసన ర్యాలీ చేపట్టారు. హిజాబ్‌కు అనుమతి ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. చిక్కమగళూరులో కొందరు విద్యార్థులు నీలి రంగు కండువాలు ధరించి, కాలేజీకి చేరుకున్నారు. జైభీమ్ అంటూ నినదించారు. హిజాబ్ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది. -
శ్రీ వినాయక టెంపుల్లో కేజీఎఫ్ మూవీ టీం ప్రత్యేక పూజలు, వీడియో వైరల్
కేజీఎఫ్ సినిమా గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి అంచాలు లేకుండా విడుదలై.. ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు సృష్టించిన సినిమా ఇది. ఈ ఒక్క సినిమాతోనే కన్నడ హీరో యశ్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2. ఈ సినిమా విడుదలకు ముందే భారీ క్రేజ్‌ను సంపాదించుకుంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం అన్ని భాషల ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చదవండి: మెసేజ్‌లు చేస్తూ డబ్బులు అడుగుతున్న అనుపమ!, హీరోయిన్ క్లారిటీ ఈ నేపథ్యంలో ఏప్రిల్14న ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవల చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంగళవారం హీరో యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో పాటు తదితరులు కర్ణాటకలోని కొల్లూర్ శ్రీ మూకాంబికా టెంపుల్, ఉడిపిలోని అనెగుడ్డే వినాయక ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఈ మూవీని సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ నిర్మిస్తోంది. చదవండి: వైరల్‌గా ప్రభాస్ ‘ఆది పురుష్’ న్యూ లుక్! శ్రీరాముడిగా ‘డార్లింగ్’ను చూశారా? Yash and KGF team in anegudde temple#KGFChapter2 #KGF2 #KGF2onApr14 #Yash @TheNameIsYash pic.twitter.com/HJigcajUpi — K.G.F ANALYST🕵🏼♂️ (@KGFAnalyst) February 1, 2022 -
అందుకే అర్ధగంట ట్రాఫిక్ ఆపేశారు!
మీరు రోడ్డు దాటాలంటే జీబ్రా క్రాసింగ్ అవసరమేమో.. కానీ నేను ఈ పక్క నుంచి ఆ పక్కకు వెళ్లాలంటే ట్రాఫిక్ మొత్తం ఎక్కడిక్కడ నిలిచిపోవాల్సిందే. ఎవరైనా సరే నాకు దారి ఇవ్వాల్సిందే. అదీ నా లెవల్... అన్నట్లుగా ఉంది కదా దర్జాగా రోడ్డు మీద వెళ్తున్న ఈ పామును చూస్తుంటే! అవును.. నిజంగానే ఈ ప్రత్యేక అతిథి రోడ్డు దాటేందుకు సుమారు 30 నిమిషాల పాటు ఎక్కడి వాహనాలు అక్కడ నిలిపేశారు. కర్ణాటకలోని ఉడిపిలో గల కల్సాంకా జంక్షన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. వాహనాల రద్దీ ఉన్న సమయంలో 10 అడుగులకు పైగా పొడవున్న పాము అకస్మాత్తుగా రోడ్డు మీదకు వచ్చింది. దీంతో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ పోలీసు వెంటనే బండ్లను ఆపేశారు. పాము రోడ్డుకు ఆవలి వైపు వెళ్లేంతవరకు వేచి చూశారు. అనంతరం దానిని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలిపారు. గురువారం నాటి ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. వన్యప్రాణి పట్ల ట్రాఫిక్ పోలీసు వ్యవహరించిన తీరును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. చదవండి: వైరల్: ఇదేం చేప.. చంపినా బతికేస్తోంది! చదవండి: వాలెంటైన్స్ డే: ఏనుగులపై ఊరేగుతూ పెళ్లిళ్లు.. -
కంబళ.. మామూలుగా పరిగెత్తలేదుగా!
సాక్షి, బెంగళూరు: కర్ణాటక తీరప్రాంత జిల్లాల్లో బురదనీటిలో సాగే దున్నపోతుల పరుగు పందేలు కంబళలో ఒలింపిక్స్ పరుగు రికార్డులు బద్ధలవుతున్నాయి. బురదమడిలో వంద మీటర్ల దూరాన్ని కేవలం 9.15 సెకన్లలో దక్షిణ కన్నడ జిల్లా బైందూరుకు చెందిన విశ్వనాథ్ పూర్తి చేసి కొత్త రికార్డును నెలకొల్పాడు. గత శనివారం నిర్వహించిన పోటీల్లో విజేతగా నిలిచి అంతర్జాతీయ స్థాయిలో అందరి దృష్టి ఆకర్షించాడు. మొత్తం 125 మీటర్ల దూరాన్ని 11.44 సెకన్లలో పూర్తి చేశాడు. గతేడాది శ్రీనివాసగౌడ 9.55 సెకన్లలో, అదేవిధంగా నిశాంత్ శెట్టి 9.51 సెకన్లలో 100 మీటర్ల పరుగు సాధించి అప్పటికి సరికొత్త రికార్డును సృష్టించారు. విశ్వనాథ్ వీటిని అధిగమించాడు. ఉసేన్ బోల్ట్ కటే వేగంగా.. ప్రపంచ పరుగు పందెం విజేత ఉసేన్ బోల్ట్ రికార్డును మంగళూరుకు చెందిన శ్రీనివాసగౌడ అనే యువకుడు కొత్త చరిత్ర సృష్టించగా నిశాంత్ శెట్టి కూడా బోల్ట్ బద్దలు కొట్టాడు. ఈసారి బైందూరుకు చెందిన మరో యువకుడు విశ్వనాథ్ కూడా పాత రికార్డులన్నీ సవరించాడు. ఎన్నో ఏళ్ల కఠోర సాధన చేసినా ఈ స్థాయిలో రికార్డు సృష్టించడానికి పరుగు పందేలా క్రీడాకారులు ఆపసోపాలు పడుతుంటే కంబళ పోటీల్లో ఇంత అవలీలగా ఎలా సాధించేశారనే కుతూహలం అందరిలోనూ మొదలైంది. కరావళి సంప్రదాయమే.. కర్ణాటకలోని కరావళి ప్రాంతంగా పిలిచే ఉత్తరకన్నడ, దక్షిణ కన్నడ జిల్లాల్లో శతాబ్దాలుగా నిర్వహిస్తున్న క్రీడ పేరు కంబళ. కరావళి ప్రాంత సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీకగా కంబళ క్రీడను భావించే ప్రజలు దాన్ని కాపాడుకోవడానికి పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటారు. నవంబర్‌లో మొదలయ్యే కంబళ సీజన్ మార్చి వరకు కొనసాగుతుంది. కంబళ సమితుల ఆధ్వర్యంలో పోటీలు నిర్వహిస్తారు. 100 మీటర్లు అంత కంటే ఎక్కువ దూరం ఉండే ట్రాక్‌లు సిద్ధం చేసి వాటిలో కొద్దిమేర బురదనీటిని నింపుతారు. అనంతరం వాటిలో దున్నపోతులను పరుగెత్తించే పోటీలు నిర్వహిస్తారు. దున్నపోతులను అదుపు చేస్తూనే వేగంగా పరుగెత్తించి వాటితో పాటు అంతే వేగంతో పరుగెత్తి ఎవరైతే ముందుగా లక్ష్యాన్ని చేరుకుంటారో వారినే విజేతలుగా ప్రకటిస్తారు. క్రీడ ఒక్కటే.. ఎన్నెన్నో పోటీలు.. కంబళ పోటీల్లో ఏడు రకాల పోటీలు ఉన్నాయి. బారే కంబళ, కోరి కంబళ, అరసు కంబళ, దెవెరే కంబళ, బాలె కంబళ, కెరె కంబళ, కాద్రి కంబళగా విభజించారు. అయితే కంబళ క్రీడలో అన్ని కంబళలు పోటీ కంబళలు కావు. అందులో కొన్ని కంబళలు పోటీ కంబళలు.. కాగా మరికొన్ని పోటీ లేని సాధారణ కంబళలు. అయితే రెండు రకాల కంబళలను బురదనీటిలో నిర్వహిస్తారు. అన్ని రకాల కంబళలు మూడు శతాబ్దాలకు పైగానే చరిత్ర కలిగినవే. వీటిలో ఎక్కువశాతం దక్షిణ కన్నడ జిల్లాలోనే నిర్వహిస్తుండగా కొన్ని కంబళలు సమీపంలోని ఉడుపి జిల్లాలో నిర్వహిస్తారు. చరిత్ర ఏం చెబుతుందంటే.. కంబళ చరిత్ర గురించి తెలుసుకుంటే పరమ శివుడికి భక్తులైన నాథుల ప్రేరణతో కంబళ మొదలైనట్లు చెబుతారు. కంబళ క్రీడలు ప్రారంభమయ్యే ముందురోజు రాత్రి కొరగ తెగకు చెందిన పురుషులు కొరగ సాంస్కృతిక నృత్యాలు ప్రదర్శిస్తారు. అందులో భాగంగా పంచకర్మగా భావించే మద్య, మాంస, మత్స్య, ముద్ర, మిథున (రతి) పాటిస్తారు. దీంతో పాటు పానిక్కులుని అనే సాంస్కృతిక వేడుకను సైతం నిర్వహిస్తారు. పోటీలు.. విభాగాలు.. కంబళ పోటీల్లో కొన్ని రకాల పోటీలను ప్రత్యేక విభాగాలుగా విభజిస్తారు. వాటిలో నెగిలు, హగ్గ, అడ్డా హాలేజ్, కేన్ హాలేజ్ ప్రధానమైనవి. ఒక్కో రకమైన కంబళకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. వాటి గురించి తెలుసుకుందాం. ► నెగిలు: చెక్క లేదా ఇనుముతో తయారు చేసిన ఓ రకమైన భారీ నాగలితో నిర్వహించే పోటీని నెగిలుగా గుర్తిస్తారు. ఈ భారీ నాగలి ని దున్నలకు కట్టి బురదనీటిలో పరుగెత్తి స్తారు. ఇందులో కేవలం ఎంట్రీ స్థాయి, జూనియర్, సీనియర్ రౌండ్లు మాత్రమే ఉంటాయి. ► హగ్గ: ఈ విభాగంలో పాల్గొనే దున్నలకు అనుభవం ఎక్కువగా ఉంటుంది. బలమైన తాడును దున్నలకు కట్టి బురదనీటిలో పరుగెత్తిస్తారు. ఇందులో ఓ వ్యక్తి చేతిలో తాడుతో దున్నలను నియంత్రిస్తూ వాటితో పాటు బురద నీటిలో పరుగెత్తుతాడు. ఇందులోనూ సీనియర్, జూనియర్ రౌండ్లు ఉంటాయి. ► అడ్డా హాలేజ్: ఈ విభాగం కఠినంగానే ఉంటుంది. వంపు తిరిగిన చెక్కను దున్నలకు కట్టి బురదనీటిలో పరుగెత్తిస్తారు. ఈ సమయంలో చెక్కపలకపై వ్యక్తి నిలబడి ఉంటాడు. దీంతో పోటీలో పాల్గొనే దున్నలు చెక్కతో పాటు వ్యక్తిని సైతం బురదనీటిలో వేగంగా లాక్కెళ్తాయి. ఇందులో సీనియర్ రౌండ్ మాత్రమే ఉంటుంది. ►కేన్ హాలేజ్: ఈ రకం పోటీలు ఎంతో రసవత్తరంగా, ఉత్కంఠగా ఉంటాయి. ప్రత్యేకంగా తయారు చేసిన గుండ్రటి చెక్కను దున్నలకు కడతారు. చెక్కకు మధ్యలో రెండు ప్రత్యేకమైన రంధ్రాలు ఏర్పాటు చేస్తారు. దున్నలు పరిగెత్తే సమయంలో ఈ రెండు రంధ్రాల నుంచి చిమ్మే నీటి ఎత్తు, వేగంతో విజేతను ఎన్నుకుంటారు. ఇందులో సూపర్ సీనియర్ రౌండ్ మాత్రమే ఉంటుంది. చదవండి: మిస్ ఇండియా రన్నరప్‌గా ఆటో డ్రైవర్ కూతురు ఆమె కోసం ఇల్లమ్మి.. ఆటోలోనే తిండి, నిద్ర -
ఆ విమానంలో వచ్చిన 20 మందికి పాజిటివ్
మంగళూరు : కరోనా వల్ల ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను విదేశాల నుంచి వెనక్కు తీసుకొస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులను సైతం స్వస్థలాలకు పంపించేస్తున్నారు. ఈ క్రమంలో వెనక్కు వస్తున్న వారివల్ల కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా దుబాయ్ నుంచి మంగళూరుకు చేరుకున్న విమానంలో 20 మంది కరోనా సోకినట్లు తేలిందని కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది. 179 మంది ప్రయాణికులతో కూడిన విమానం మంగళవారం దుబాయ్ నుంచి మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. (కర్ణాటకలో కరోనా కలకలం.. అతడి కోసం గాలింపు) వీరిలో 38 మంది గర్భిణీ మహిళలు కూడా ఉన్నారు. వారందరికీ పరీక్షలు నిర్వహించగా 20 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ప్రభుత్వం మిగతా ప్రయాణీకులను క్వారంటైన్లో ఉండాల్సిందిగా ఆదేశించింది. బాధితుల్లో 15 మంది దక్షిణ కన్నడ జిల్లాకు చెందినవారు కాగా ఆ జిల్లాలో కేసుల సంఖ్య 43కు చేరింది. కరోనా సోకిన మిగతా ఐదుగురు ఉడిపివాసులు కాగా వీరి సంఖ్యను కలుపుకుని ఆ జిల్లాలో కరోనా కేసుల మొత్తం 8కు చేరింది. కాగా శుక్రవారం ఉదయం నాటికి జిల్లాలో 1032 కేసులు నమోదవగా 476 మంది కోలుకున్నారు. 35 మంది మరణించారు.(ప్రాణాల మీదకు తెచ్చిన టిక్‌టాక్) -
రోహిత్ నిజంగా మృత్యుంజయుడే...
సాక్షి, బెంగళూరు: బోరుబావిలో పడిన ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడిన సంఘటన ఉడుపి జిల్లాలో చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ సుమారు 15 అడుగుల లోతులో పడిపోయిన అతడు ఆరు గంటల పాటు బోరుబావిలోనే ఉండిపోయాడు. అయితే సహాయక చర్యల చేపట్టి ఆ వ్యక్తిని సురక్షితంగా బయటకు తీశారు. వివరాల్లోకి వెళితే.. ఉడుపి జిల్లా బైందూరు తాలూకా మరవంతెకు చెందిన రోహిత్ ఆదివారం ఉదయం బోరుబావి పక్కన మట్టి పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో మట్టి కుంచించుకుపోగా అతడు బోరుబావిలో చిక్కుకున్నాడు. సుమారు పదిహేను అడుగుల లోతుకు పడిపోయాడు. వెంటనే అగ్నిమాపక, ఆరోగ్య సిబ్బంది వచ్చి జేసీబీ యంత్రాల సాయంతో బోరుబావికి సమాంతరంగా తవ్వి బాధితుడిని క్షేమంగా బయటకు తీసి, వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. -
పెజావర స్వామీజీ అస్తమయం
సాక్షి, బెంగళూరు: దక్షిణాది ఆధ్యాత్మిక ప్రముఖుల్లో ఒకరైన ఉడుపి పెజావర మఠాధిపతి శ్రీ విశ్వేశతీర్థ స్వామీజీ(88) ఆదివారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో 9 రోజులుగా మణిపాల్ లోని కేఎంసీ ఆస్పత్రిలో స్వామీజీ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం స్వామీజీ ఆరోగ్యం మరింత విషమించడంతో మఠానికి తీసుకుని వెళ్లారు. అనంతరం, ఉదయం 9.20 గంటల సమయంలో స్వామీజీ తుదిశ్వాస విడిచారు. స్వామీజీ మృతికి ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. స్వామీజీ భౌతిక కాయంపై కర్ణాటక సీఎం యెడియూరప్ప జాతీయ జెండా కప్పి నివాళులర్పించారు. పలువురు మంత్రులు, బీజేపీ, ఆరెస్సెస్ నేతలు స్వామీజీకి నివాళులర్పించారు. ప్రభుత్వ లాంఛనాల మధ్య బెంగళూరులోని విద్యాపీఠ ఆవరణలో అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వం 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. స్వామీజీ కోరిక మేరకు.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఈ నెల 20న స్వామీజీని మణిపాల్‌లోని కేఎంసీ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. శనివారం రాత్రి ఆయన శరీరంలోని కీలక అవయవాలు స్పందించడం ఆగిపోయింది. తుది శ్వాస మఠంలోనే విడవాలన్న స్వామీజీ కోరిక మేరకు ఆదివారం ఉదయం పెజావర మఠానికి తరలించారు. ప్రధాని సంతాపం స్వామీజీ మరణం పట్ల ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ‘లక్షలాది ప్రజల హృదయాల్లో స్వామీజీ ధ్రువతారగా నిలిచి ఉంటారు. ఆధ్యాత్మిక, సేవా రంగాల్లో ఎంతో కృషి చేశారు. ఓం శాంతి’ అని ట్వీట్ చేశారు. ఉడుపి నుంచి బెంగళూరుకు స్వామీజీ మరణవార్త విన్న అశేష భక్తులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి ఉదయమే మఠానికి చేరుకున్నారు. భక్తుల సందర్శనార్థం భౌతిక కాయాన్ని ఉడుపిలోని అజ్జనగూడు మహాత్మాగాంధీ మైదానంలో ఉంచారు. తర్వాత హెలికాప్టర్లో బెంగళూరుకు తరలించారు. బసవనగుడిలోని నేషనల్ కాలేజీ మైదానంలో భక్తుల దర్శనార్థం ఉంచారు. తర్వాత సంప్రదాయాల ప్రకారం పూర్ణ ప్రజ్ఞ విద్యాపీఠంలో అంతిమ సంస్కారాలను పూర్తి చేశారు. మధ్వాచార్యుడు స్థాపించిన మఠం 800 ఏళ్ల క్రితం శ్రీ మధ్వాచార్యుడు స్థాపించిన ఉడుపి అష్ట మఠాల్లో పెజావర మఠం ఒకటి. ప్రసిద్ధ ఉడుపి శ్రీకృష్ణ ఆలయ బాధ్యతలను ఈ మఠాలు విడతల వారీగా పర్యవేక్షిస్తుంటాయి. పెజావర మఠ పెద్దల్లో విశ్వేశ స్వామీజీ 33వ వారు. 1931 ఏప్రిల్ 27న రామ కుంజలోని బ్రాహ్మణ కుటుంబంలో ఆయన జన్మించారు. 1938లో సన్యాసం స్వీకరించారు. హిందూజాతికి తీరని లోటు – స్వరూపానందేంద్ర సరస్వతి పెజావర మఠాధిపతి విశ్వేశతీర్థ పరమపదించడం పట్ల విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విశ్వేశతీర్థ మరణం హిందూజాతికి తీరని లోటన్నారు. హిందూ సమాజం గర్వించదగ్గ మత గురువుల్లో ఆయన ఒకరన్నారు. హిందూధర్మ పరిరక్షణకు విశ్వేశతీర్థ విశేష కృషి చేశారన్నారు. బెంగళూరులో పూర్ణప్రజ్ఞ విద్యా పీఠాన్ని ఏర్పాటు చేసి 63 ఏళ్లుగా వేదాంతంలో ఎంతోమందిని నిష్ణాతులను చేశారన్నారు. స్వామీజీ సేవలు చిరస్మరణీయం – ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాక్షి, అమరావతి: ఉడుపి పెజావర మఠాధిపతి శ్రీ విశ్వేశతీర్థ స్వామీజీ మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలతో స్వామీజీ విశేష సేవలు అందించారని ఆయన పేర్కొన్నారు. సమాజ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి స్వామీజీ చేసిన నిరుపమాన సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయన్నారు. -
ఉడిపి స్వామీజీ శివైక్యం
-
పెజావర స్వామీజీ కన్నుమూత
సాక్షి, బెంగళూరు: పెజావర మఠాధిపతి విశ్వేశతీర్థ స్వామి (88) కన్నుమూశారు.మణిపాల్ కస్తూర్భా హాస్పిటల్లో చికిత్స పొందిన స్వామీజీ అపస్మారక స్థితికి చేరడంతో డాక్టర్లు తెల్లవారుజామున మఠానికి తరలించారు. అక్కడే చివరివరకు చికిత్సను అందజేశారు. అశేష భక్తులను దుఃఖసాగరంలో ముంచుతూ శివైక్యం చెందారు స్వామి విశ్వేశతీర్థ. స్వామీజీ తుదిశ్వాస విడిచినట్టు ఉడిపి ఎమ్మెల్యే కె.రఘుపతి భట్ ప్రకటించారు. కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి ఉదయమే శ్రీకృష్ణమఠానికి చేరుకున్నారు. ఉడిపి అష్ట మఠాల్లో పెజావర మఠం ఒకటి. కాగా శ్వాస పీల్చుకోవడం ఇబ్బందులు తలెత్తడంతో ఈ నెల 20న విశ్వేశ తీర్ధ స్వామీజీని ఆసుపత్రికి తరలించారు. తొలుత న్యుమోనియా సమస్యలకు చికిత్స అందించినట్టు వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యం మరింత విషమంగా మారిందని, బ్రెయిన్ డిస్ఫంక్షన్ అని పరీక్షలో తేలిందని, ఇంకా స్పృహలోకి రాలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో స్వామీజీ అభిమతం మేరకు లైఫ్ సపోర్ట్‌తోనే ఉదయం మఠానికి తరలించారు. పెజావర మఠాథిపతి విశ్వేశ తీర్ధ స్వామీజీ మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.ప్రధాని నరేంద్ర మోదీ, కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప స్వామీజీ మృతిపై తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఈ విషాదం నుంచి స్వామీజీ అశేషభక్తులు కోలుకునేలా మానసిక స్థైర్యం కలిగించాలని ఆ కృష్ణ భగవానుని కోరుకుంటున్నానని అన్నారు. విశ్వేశ తీర్థ పరమపదించడం హిందూ జాతికి తీరని లోటు ఉడిపిలో పెజావర్ మఠాధిపతి విశ్వేశ తీర్థ పరమపదించడం పట్ల విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర విచారం వ్యక్తం చేశారు. విశ్వేశ తీర్థ మరణం హిందూ జాతికి తీరని లోటన్నారు. హిందూ సమాజం గర్వించదగ్గ మత గురువుల్లో ఆయన ఒకరని గుర్తు చేసారు. శ్రీమద్వాచార్యుని ప్రధాన శిష్యులు అధోక్షజ తీర్థ నుంచి వేదాంతంపై సంపాయించిన పట్టుతో హిందూ ధర్మ పరిరక్షణకు విశ్వేశ తీర్థ పాటుపడ్డారని కొనియాడారు. బెంగుళూరులో పూర్ణప్రజ్ఞ విద్యాపీఠాన్ని ఏర్పాటు చేసి 63 సంవత్సరాలుగా వేదాంతంలో ఎంతోమంది స్కాలర్స్ ను తయారు చేసారని, శ్రీ మద్వాచార్యులు స్థాపించిన ద్వైత పాఠశాలతోనూ విశ్వేశ తీర్థకు అనుబంధముందని గుర్తు చేసుకున్నారు. -
పెజావర స్వామీజీ ఆరోగ్యం విషమం
సాక్షి, బెంగళూరు: పెజావర మఠాధిపతి విశ్వేశతీర్థ స్వామి ఆరోగ్యం క్షీణిస్తోంది. మణిపాల్ కేఎంసీ ఆస్పత్రిలో ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్సనందిస్తున్నారు. కోలుకునే అవకాశాలు లేవని వైద్యులు తేల్చడంతో ఆదివారం ఆయనను మఠానికి తరలించనున్నారు. మఠంలోనే తుది శ్వాస వదలాలని స్వామీజీ చెబుతుండేవారు. మరోవైపు స్వామీజీ త్వరగా కోలుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా పూజలు, హోమాలు చేస్తున్నారు. ఈ తరుణంలో సీఎం యొడియూరప్ప శనివారం హుటాహుటినా ఉడుపికి బయలుదేరారు. సాయంత్రం 5.30 గంటలకు ఆస్పత్రికి చేరుకుని వైద్యులతో స్వామిజీ ఆరోగ్యంపై చర్చించారు. సీఎం ఆదివారం శివమొగ్గ జిల్లా పర్యటనను రద్దు చేసుకుని ఉడుపిలోనే ఉండనున్నారు. మఠానికి తరలింపు ఆదివారం పేజావర స్వామీజీని ఉడుపి మఠానికి తరలించినట్లు సీనియర్ స్వామిజీ విశ్వప్రసన్న తీర్థ తెలిపారు. స్వామీజీ కోసం మఠంలోనే ప్రత్యేకంగా వెంటిలేటర్లను ఏర్పా టు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులెవ్వరూ మఠానికి వచ్చి ఇబ్బందులు పెట్టవద్దని, శీఘ్రంగా కోలుకోవాలని ప్రార్థించాలని కోరారు. మరోవైపు కేంద్ర మాజీమంత్రి ఉమాభారతి ఉడుపి చేరుకున్నారు. పెజావర స్వామిని చూసేందుకు ఆమె ఇవాళ ఉదయం మఠానికి వచ్చారు. -
ప్రతీ గురువారం బస్సులో రావాల్సిందే!
సాక్షి, బెంగళూరు : పర్యావరణ సంరక్షణలో భాగస్వాములవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెబుతారు కర్ణాటకలోని ఉడిపి జిల్లా కలెక్టర్ హెబ్సిబా రాణి. పరిసరాల సంరక్షణపై శ్రద్ధ చూపించే ఆమె.. కాలుష్య నివారణకై తన వంతుగా నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా వాయు కాలుష్యాన్ని తగ్గించడానికై ప్రభుత్వ ఉద్యోగులు అందరూ.. ఇకపై ప్రతి గురువారం బస్సుల్లో కార్యాలయాలకు రావాలని ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు తాను కూడా అందరు ఉద్యోగుల్లాగే బస్సులో కలెక్టరేట్‌కు వస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కిటకిటలాడుతున్న బస్టాండ్లు! నగరాల్లో వాయు కాలుష్యం, వాహనాల నుంచి వెలువడే పొగ కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్న సంగతి తెలిసిందే. కాబట్టి పరిసరాల పరిరక్షణపై అత్యంత శ్రద్ధను చూపే కలెక్టర్ హెబ్సిబా రాణి తన వంతుగా ఈ ప్రయత్నానికి అడుగులు వేశారు. ఉద్యోగులతో పాటు జిల్లా ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ఉడిపి జిల్లా కేంద్రంలోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కచ్చితంగా గురువారం సొంత వాహనాలను వీడి బస్సుల్లోనే వారి వారి కార్యాలయాలకు చేరుకోవాలని ఆదేశించారు. దీంతో మొదటి గురువారం బస్టాండ్లు ప్రభుత్వ ఉద్యోగులతో కిటకిటలాడాయి. మొదట తమ డిసి కార్యాలయం నుంచే మొదలు పెట్టి ప్రస్తుతం ఉడిపి నగరంలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు ఆందరూ ప్రస్తుతం మొదటి గురువారం విధులకు బస్సుల్లో బయలుదేరారు. దీంతో నగరంలోని ప్రముఖ సర్కిళ్లు, బస్టాండ్లు వద్ద ఉద్యోగులు బస్సుల కోసం ఎదురు చూస్తుండటం కనిపించింది. ఈ విషయం గురించి ఉడిపి కలెక్టర్ హెబ్సిబా మాట్లాడుతూ... ‘ప్రస్తుతం నగరంలో ఎక్కడ చూసినా వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగి వాయు కాలుష్యం, ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. ఇటువంటి సమస్యకు కొంతవరకైనా పరిష్కారం తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ప్రతి గురువారం ప్రభుత్వ ఉద్యోగులు బస్సుల్లో విధులకు రావాలని ఆదేశాలు జారీ చేశాను’ అని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం కలెక్టర్ హెబ్సిబా రాణి ప్రతి గురువారం వార్త శాఖకు చెందిన బస్సులో ఉద్యోగులతో కలిసి విధులకు వస్తున్నారు. పర్యావరణ హితం కోసం పాటుపడుతున్న కలెక్టర్ చర్యలపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. -
వానల కోసం కప్పల పెళ్లి
సాక్షి బెంగళూరు: జలక్షామం, వర్షాభావాన్ని నివారించేందుకు ఉడుపి జిల్లా నాగరిక సమితి ట్రస్టు, పంచరత్న సేవా ట్రస్టు ఆధ్వర్యంలో కప్పలకు వైభవంగా పెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉడుపి కిదియూర్ హోటల్ ఆవరణలో శనివారం ఈ కప్పల పెళ్లి వైభవంగా నిర్వహించారు. ఉదయం 11 గంటలకు నగరంలోని మారుతి విధికా నుంచి ఊరేగింపుగా పెండ్లిబృందం బయలుదేరి పాత డయాన సర్కిల్ గుండా కవి ముద్దణ మార్గంలో ఉడుపి కిదియూర్ హోటల్ వద్దకు చేరుకుని, అనంతరం కప్పలకు వివాహం చేశారు. -
బెంగళూరులో కప్పల పెళ్లి
-
ఉడిపిలో రంగుల పాము ప్రత్యక్షం
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో అరుదైన పాము ఉడిపి జిల్లా మల్పెలో కనిపించాయి. గత కొద్దిరోజులుగా అడవుల్లో ఉండే పాములు నగరంలోకి రావడం ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే ఉడిపికి సమీపంలోని మల్పెలో ఓ హోటల్లో అనుకోకుండా రంగురంగుల పాము దర్శనమిచ్చింది. హోటల్ యజమాని తెచ్చిన కూరగాయల బుట్టలో ఇది ప్రత్యక్షం అయింది. ఆ పాము శరీరంపై ఎరుపు, నలుపు, తెలుపు మచ్చలున్నాయి. కాగా ఒటికన్నర మీటరు పొడవున్న ఈ పాము విషపూరితం కాదని, వీటిని స్థానికులు గోల్డెన్ ట్రీ స్నేక్ (కైసోపెలియా ఆర్నెట్)గా పిలుస్తారని, పాముల పరిశోధకుడు గురురాజ్ తెలిపారు. ఈ పాములు చెట్ల తొర్రల్లో జీవిస్తుంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ పామును చూసేందుకు స్థానికులు తరలి వచ్చారు. అనంతరం దాన్ని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. -
ఎప్పటికీ మోడరన్ కేఫ్
పొట్ట చేత బట్టుకుని కర్ణాటకలోని ఉడిపి నుంచి విజయవాడ వచ్చారు. ఉడిపిలో ప్రసాదాలు తయారుచేసిన అనుభవంతో ఇక్కడ అల్పాహారం తయారు చేయడం ప్రారంభించారు. ఎంతో మంది పేద విద్యార్థులకు ఉచితంగా భోజనం పెట్టారు. మరెందరో నిరుద్యోగులకు ఉచిత ఆవాసం కల్పించారు. తాను పస్తుండి, ఇతరుల ఆకలిని తీర్చారు. ఎంతోమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారు. ఆయనే విజయవాడ మోడరన్ కేఫ్ వ్యవస్థాపకులు హెచ్. టి. వాసుదేవరావు. త్వరలో వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న ఈ కేఫ్‌లో శాకాహారం మాత్రమే దొరుకుతుంది. ఈ వంశంలో మూడవతరానికి చెందిన హెచ్. టి. ఉదయశంకర్ ఈ కేఫ్‌ను పూర్వీకుల సంప్రదాయంలో నడుపుతున్నారు. ఈ వారం ఫుడ్ ప్రింట్స్ కోసం సాక్షి ఆయనతో ముచ్చటించింది... మా తాతగారు హెచ్ టి వాసుదేవరావు ఉడిపి శ్రీకృష్ణ దేవాలయంలో ప్రసాదాలు, వంటలు తయారు చేసేవారు. అలా ఆయనకు వంట చేయడంలో నైపుణ్యం వచ్చిందే కాని, వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు ఏమాత్రం సరిపోయేది కాదు. దాంతో అక్కడ పనికి స్వస్తి పలికి, మా తాతగారు, ఆయన బావగారితో కలిసి 1927లో మచిలీపట్టణం చేరుకున్నారు. అక్కడ మూడు సంవత్సరాల పాటు చిన్న క్యాంటీన్ నడిపారు. కాని పెద్దగా జరుగుబాటు లేకపోవడంతో, విజయవాడ జంక్షన్ కాబట్టి అక్కడైతే వ్యాపారం బాగా నడుస్తుందన్న ఆలోచనతో 1930లో విజయవాడ చేరి, రైల్వే స్టేషన్ దగ్గర గాంధీనగర్‌లో ‘కోమల విలాస్’ అని చిన్న హోటల్ ప్రారంభించారు. హోటల్ నిర్వహణలో బాగా ఇబ్బందులు పడ్డారు. ఆరు సంవత్సరాలపాటు వ్యాపారం సాధారణంగా జరిగింది. ఒంటి చేత్తో చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా ఎన్నో రోజులు గడిపారు తాతగారు. మధ్యలో అప్పులపాలయ్యారు. మళ్లీ వెనక్కి వెళ్లిపోయి దేవాలయంలోనే వంటలు చేసుకుందామనుకున్నారు. ఆ సమయంలో కొన్నాళ్లు ఆయన వండుతూ, ఆయనే వడ్డిస్తూ, ఆయనే గిన్నెలు శుభ్రం చేసుకుంటూ, బిల్లులు వసూలు చేసుకుంటూ... ఒంటి చేతి మీదే నడిపారు. 1936లో పెళ్లి చేసుకున్నారు. నానమ్మ కూడా తాతయ్యకు పనిలో సహాయపడేది. పేరు మార్చాక వ్యాపారం పుంజుకుంది తాతగారికి ఏమనిపించిందో, ఎందుకనిపించిందో ఏమోగాని 1936లో మోడరన్ కేఫ్ అని పేరు మార్చారు. అప్పటి నుంచి ఆయన దశ మారింది. వ్యాపారం పుంజుకోసాగింది. వచ్చిన లాభాలతో 1940లో విజయవాడలోని వన్ టౌన్ సామారంగం చౌక్‌లోను, బీసెంట్ రోడ్డులోను రెండు కేఫ్‌లు ప్రారంభించారు. కొంతకాలానికి మా తాతగారి బావగారు విడిగా వ్యాపారం ప్రారంభించారు. మా తాతగారు విజయవంతంగా వ్యాపారం కొనసాగించారు. బీసెంట్ రోడ్డులోని కేఫ్‌లో మాత్రమే లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ ఉన్నాయి. మిగిలిన రెండు శాఖలలోను కేవలం రెస్టారెంట్లు మాత్రమే. అవి రెండు అద్దెకు తీసుకున్నవే. 1954లో బీసెంటు రోడ్డులోది సొంతంగా కొనుగోలు చేశారు. తాతగారి తరవాత ముగ్గురు కొడుకులకి మూడు హోటల్స్ ఆస్తి పంపకంలో వచ్చాయి. మా నాన్నగారు హెచ్‌టి మురళీధరరావుకి బీసెంటు రోడ్డులో ఉన్న మోడరన్ కేఫ్ వచ్చింది. ఆ తరవాతి తరంలో నేను చూస్తున్నాను. చెక్కుచెదర లేదు... 1988లో విజయవాడలో జరిగిన అల్లర్ల సమయంలో బీసెంటురోడ్డులోని మోడరన్ కేఫ్‌కి అటు పక్క ఇటు పక్క ఉన్న అన్ని దుకాణాలు తగులబడిపోయాయి. కాని మోడరన్ కేఫ్ మాత్రం చెక్కుచెదరకుండా ఉంది. ఇదంతా తాతగారు చేసిన అన్నదానం ఫలితమే అనుకుంటాం. కొద్దిపాటి మొత్తంతో ప్రారంభమైన ఈ కేఫ్ ఎంతో ఉన్నతస్థాయికి ఎదిగింది. ఎప్పటికీ ఇది మోడరన్గానే ఉంటుంది. ఇవి మా ప్రత్యేకం... నాన్నగారి కాలం నుంచి ఇడ్లీ సాంబారు, మసాలా దోసె మా కేఫ్ ప్రత్యేకం. ఇటీవలే ఉత్తరాది వంటకాలు కూడా తయారుచేస్తున్నాం. బీసెంట్ రోడ్లో ఉండే మా కేఫ్‌లో నాన్నగారు పేద విద్యార్థులకు ఉచిత భోజనం, వసతి కల్పించేవారు. ఆ సంప్రదాయాన్ని నేను కొనసాగించాను. ఆ రోడ్డులోని రామాలయంలో జరిగే సీతాకల్యాణం సమయంలో మూడు రోజుల పాటు ఉచిత అన్నదానం నాన్నగారి కాలం నుంచి జరుగుతోంది. – హెచ్. టి. మురళీధరరావు, చైర్మన్, మోడరన్ కేఫ్, విజయవాడ సంప్రదాయం కొనసాగిస్తున్నాను కృష్ణ, రామానాయుడు, శోభన్‌బాబు వంటి వారు ఇక్కడకు వచ్చేవారు. విజయవాడ నగరం సినిమా, రాజకీయాల హబ్. మా అమ్మవాళ్ల నాన్నగారు విఠలాచారిగారు. అందువల్ల మా కేఫ్‌కి సినీ నటుడు కాంతారావు కూడా వస్తుండేవారు. చాలా సంవత్సరాలుగా మా కేఫ్‌కి వస్తున్నవారు 20 –30 మంది ఇప్పటికీ ఉన్నారు. విజయవాడ వచ్చినప్పుడు మా లాడ్జిలోనే దిగేవారు ఇప్పటికీ ఉన్నారు. 1995 నుంచి నేను చూసుకుంటున్నాను. మా ఇడ్లీ సాంబారు ఇష్టపడేవారు కూడా కొన్ని దశాబ్దాలుగా ఇక్కడకు వస్తూనే ఉన్నారు. ఏళ్లతరబడి మా హోటల్‌తో అనుబంధం పెంచుకున్న కొందరు వృద్ధులు అప్పుడప్పుడు, ‘వ్యాపారం ఎలా జరుగుతోంది’ అని అడిగి వెళ్తుంటారు. రామాలయంలో నవరాత్రులు తొమ్మిది రోజులూ పులిహోర + స్వీట్ ఇస్తూ ఉంటాం. రెండురోజులు ఉచిత భోజనం పెడతాం. మూడో తరంలో నేను కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాను. – హెచ్. టి. ఉదయశంకర్, మోడరన్ కేఫ్ మేనేజింగ్ డైరెక్టర్, విజయవాడ – సంభాషణ: డా. వైజయంతి పురాణపండ -
జన్మాష్టమి రోజు వచ్చే ‘రాక్షసుడి’ కథ!!
కట్పడి రవి ... ఓ దినసరి కూలి.. అయితేనేం సాయం చేయాలనే గుణం మాత్రం మెండు.. అందుకే ఏడాదికోసారి భిన్న రూపాల్లో దర్శనమిస్తూ ఉంటాడు. అలా 15 లక్షల రూపాయలు సంపాదించాడు. మెక్సికన్ డ్రామా ‘పాన్స్ లేబిరింత్’ సినిమాలో.. తన వాళ్ల కష్టాలను తీర్చడానికి వనదేవత ప్రత్యక్షమవుతుంది. దుష్టపాలనను అంతం చేసి.. బానిస బతుకులకు విముక్తి కలిగిస్తుంది. అలాగే ‘ద అమేజింగ్ స్పైడర్’ సినిమాలో ఓ పెద్దబల్లి... అమెరికన్ కామెడీ హర్రర్ ‘క్రాంపస్’ సినిమాలోని మేక ముఖం గల ఓ వింత రాక్షసి ఆకారం... ఇవన్నీ బాగా పాపులర్ అయిన సినిమా పాత్రలు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకని పెదవి విరవకండి. ఎందుకంటే ఇటువంటి వింత ఆకారాలే ఎంతో మంది చిన్నారులకు ప్రాణం పోశాయి... పోస్తున్నాయి. అదెలా అనుకుంటున్నారా.. అయితే మీరు రవి కట్పడి కథ తెలుసుకోవాల్సిందే.. దినసరి కూలీ ఏం చేయగలడు!? కర్ణాటకలోని ఉడిపి జిల్లాకు చెందిన 35 ఏళ్ల దినసర కూలీ రవి కట్పడి. రోజంతా శ్రమిస్తే అతడికి దక్కే వేతనం 450 నుంచి 550 రూపాయలు. అయితే చికిత్సకు డబ్బులు అందక మరణించే చిన్నారుల గురించి వింటే అతడి మనస్సు చలించిపోయేది. వారికి సాయం చేయాలని ఎంతగానో ఆరాటపడేవాడు. కానీ ఓ దిసనరి కూలీగా అతడేం చేయగలడు? ఎంతమందిని కాపాడగలడనే ప్రశ్నలతో సతమతమయ్యేవాడు. అప్పుడే అతడికి ఓ ఆలోచన తట్టింది. చిన్నారులను కాపాడటం కోసం.. హాలీవుడ్ సినిమాల్లోని ఆర్ట్‌వర్క్‌ను ఉపాధి మార్గంగా ఎంచుకున్నాడు. సోషియో ఫాంటసీ సినిమాల్లో ఉండే విభిన్న పాత్రలు ధరించడం అలవాటుగా మార్చుకున్నాడు. ప్రతీ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున.. సరికొత్త రూపంలో దర్శనమిస్తూ... ఉడిపిలోని ఇంటింటికీ తిరుగుతూ.. తన ఆహార్యాన్ని ప్రదర్శించి డబ్బు యాచించేవాడు. అలా 2013 నుంచి సుమారు 15 లక్షల రూపాయలు సంపాదించాడు. ఈ విధంగా వినూత్న వేషధారణతో ముందుకు సాగుతున్న రవి... చిన్నారుల క్యాన్సర్ ట్రీట్మెంట్కు, హృద్రోగులకు, చర్మ సంబంధ వ్యాధులతో బాధపడేవారి చికిత్స కోసం.. ఈ డబ్బునంతా ఖర్చు చేసి పెద్ద మనసు చాటుకున్నాడు. తనలా ఆలోచించే మరికొందరి సాయంతో.. రవి చదివింది కేవలం తొమ్మిదో తరగతి వరకే. పైగా చేసేది భవన నిర్మాణ కూలీగా.. మోటు పని. మరి ఇలాంటి వ్యక్తి అచ్చంగా హాలీవుడ్ క్యారెక్టర్లను పోలి ఉండేలా వేషం వేయడం, అందరినీ ఆకర్షించడం అంత తేలికైన పని కాదు. అందుకే తనలాంటి ఆలోచనలు గల మరికొంత మంది సాయం కోరాడు. వారి సాయంతో ఆర్ట్‌వర్క్ టీమ్‌ను తయారు చేసుకుని... 2013 నుంచి సుమారు 15 లక్షల రూపాయలు సంపాదించాడు. మరిన్ని నిధులు కావాలి.. ‘ గతేడాది వరకు రవి కేవలం ఉడిపి వరకే పరిమితమయ్యాడు. కానీ తన ఆశయాన్ని నెరవేర్చుకోవడం కోసం ఈసారి జిల్లా వ్యాప్తంగా పర్యటించాలనుకున్నాడు. ప్రస్తుతం తలసేమియా బాధితుల కోసం 27 లక్షల రూపాయల అవసరం ఉంది. అందుకే సోషల్ మీడియాను వినియోగించుకోవాలనుకుంటున్నాం. రవి ఉదారత గురించి వివరిస్తున్నాం. తద్వారా మరికొంత మంది దాతలు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో చిన్నారుల కష్టాలు కాస్తైనా తగ్గుతాయి’ అని రవి ఆర్ట్ టీం మెంబర్ సుచిత్ వ్యాఖ్యానించాడు. -
మూటలో విదేశీ మద్యం, కండోమ్స్
యశవంతపుర(కర్ణాటక): ఉడిపి శిరూరు మఠాధిపతి లక్ష్మీవరతీర్థ స్వామి అనుమానాస్పద మృతి కేసు విచారిస్తున్న పోలీసులకు మఠం పక్కలోని స్వర్ణనదిలో డీవీఆర్ (వీడియో రికార్డర్) బాక్స్ దొరికింది. స్వామి ధరించిన అనేక బంగారు ఆభరణాలు మాయమైనట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో నిత్యం స్వామి వేసుకున్న చేతి కడియాలు, మెడలో వేసుకునే ఖరీదైన బంగారు గొలుసు, చేతి ఉంగరం, బంగారు తుళసి మాల కనిపించటం లేదు. స్వామికి చెందిన మూడు బంగారు కడియాలలో ఒక కడియాన్ని అప్పుడప్పుడు ఆయన భక్తురాలుగా చెప్పుకునే రమ్యాశెట్టి ధరించేవారని తెలిసింది. ఆమె నగలు ధరించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనితో మిగిలిన బంగారును కూడా రమ్యాశెట్టినే దాచి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. బంగారంపై రమ్యాశెట్టి మక్కువ భక్తులు దానం చేసిన బంగారంపై రమ్యాశెట్టికి వ్యామోహం పెరగటంతో శుభ కార్యాలకు స్వామి ధరించే బంగారాన్ని ఆమె ధరించేవారని తెలిసింది. స్వామి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన తరువాత మఠంలోని బంగారు అభరణాలు గల్లంతయినట్లు ప్రచారం జరుగుతోంది. మణిపాల్ ఆస్పత్రిలో చేరినప్పుడు అయన చేతికి మూడు ఉంగరాలు ఉండగా, మిగిలిన నగలను మఠంలోని తన గదిలో భద్రపరిచిన్నట్లు తెలిసింది. దీనితో మఠంలో పని చేస్తున్న అనుమానితులను పోలీసులు పిలిచి విచారిస్తున్నారు. స్వామి తన వద్ద మూడు కేజీల బంగారం ఉన్నట్లు సమాచారం. ఆయన నిత్యం ఒక కేజీ బంగారు నగలను ధరించేవారు. అవి చాలా పురాతన కాలం నాటివని భక్తులు అంటున్నారు. రమ్యాశెట్టి మాత్రమే స్వామి గదికి వెళ్లేవారని రెండు రోజుల నుండి ఆమెను విచారిస్తున్న పోలీసులు చెబుతున్నారు. అజ్ఞాతంలో రమ్యా విచారణ మంగళవారం సాయంత్రం నుండి రమ్యాశెట్టిని పోలీసులు అజ్ణాత ప్రదేశానికి తీసుకెళ్లి విచారణ చేస్తున్నారు. ఆమె ఐదు మంది సహచరులు పోలీసుల అదుపులో ఉన్నారు. వారు వాడిన ముబైల్ నంబర్ల ఆధారంగా ముంబైకి లింక్‌లు ఉన్నట్లు నిర్థారించారు. బంధుమిత్రుల శుభ కార్యక్రమాలలో పాల్గొన్న ఆమె పోటోలను పోలీసులు సేకరిస్తున్నారు. గత రెండేళ్ల నుండి అమె స్వామిని మోసపుచ్చి లూటీ చేసిదంటూ సామాజిక మాధ్యమాలలో ఆరోపణలు వస్తున్నాయి. రమ్యాశెట్టి సుళ్యకు చెందిన మహిళ కాగా, ఆమె ముంబైలో కూడా కొంతకాలం నివాసం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మఠానికి అప్పుడప్పుడు ముంబైకి చెందిన బంగారం వ్యాపారులను పిలిపించి స్వామికి పరిచయం చేసినట్లు తెలిసింది. నాలుగు నెల క్రితం ఒక యాంటిక్ ఆభరణాన్ని ఆమె ధరించినట్లు పోలీసులు ఒక ఫోటోను సేకరించారు. దానిని స్వామి కూడా కొన్నిసార్లు ధరించినట్లు గుర్తించారు. నిత్య పూజలు ప్రారంభం బుధవారం నుండి శిరూరు మఠంలో నిత్యపూజలు, నైవేద్యలను ప్రారంభించారు. మూల మఠంలో ముఖ్యప్రాణ, మూల దేవుడుకి నైవేద్యం పెట్టి పూజలు చేశారు. లక్ష్మీ వరతీర్థస్వామి రోజు నాలుగుసార్లు బియ్యంతో నైవేద్యం, మూడుసార్లు పూజలు చేసేవారని భక్తులు తెలిపారు. మఠంలోనికి అర్చకులు, సిబ్బంది తప్ప భక్తులను అనుమతించటం లేదు. పోలీసుల విచారణ ముగిసిన తరువాత తదుపరి పీఠాధపతిని నియమించే అవకాశం ఉంది. నదిలో డీవీఆర్ స్వాధీనం మఠం పరిధిలోని బావిలో డీవీఆర్ దొరికిందని అందరూ ఊహించారు. కానీ దొరికిన మూటలో విదేశీ మద్యం, కండోమ్స్ లభించాయి. స్వామి నిద్రించే గదిలో కొన్ని ఔషధాలు కనిపించాయి. రమ్యాశెట్టితో సన్నిహితంగా ఉన్న అటోడ్రైవర్ జగదీశ్‌ను కూడా విచారిస్తున్నారు. డీవీఆర్‌ను హిరియడ్క మఠం పక్కలోని స్వర్ణ నదిలో పడేసిన్నట్లు చెప్పడంతో అక్కడ బుధవారం ఉదయం ఐదు గంటల సమయంలో గజ ఈతగాళ్ల సాయంతో దీనిని బయటకు తీశారు. రికార్డయిన సమాచారం ఉందో లేదో పోలీసులకు అర్థం కావటంలేదు. నదిలో వేసింది ఎవరనేది పోలీసులు విచారిస్తున్నారు. -
ఉడుపి భూలోక వైకుంఠం
సరిగ్గా బ్రాహ్మీముహూర్తం రాగానే శంఖనాదాలు, దుందుభులు, నగారాలతో ప్రతిధ్వనిస్తుంది ఉడుపి మఠం. ఆలయ పూజార.ులతో సహా మuý.ంలో పని చేసేవార.ందర.ూ ఆ దివ్యనాదాలతో మేల్కొని, తమ దైనందిన చర్యలు ప్రారంభిస్తారు. కర్ణాటకలోని పేరెన్నికగన్న పుణ్యక్షేత్రాల్లో ప్రసిద్ధి పొందినది ఉడుపి. ధనిక– పేద; అగ్ర– నిమ్న కులాలనే భేదభావాలు మనుషులకే తప్ప, పర.మాత్ము్మడికి లేవనేందుకు సాక్షాత్తూ ఆ కృష్ణభగవానుడే నిదర.్శనం చూపించిన పుణ్యస్థలి ఉడుపి. కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాకు పశ్చిమంగా, మంగుళూర.ుకు 60 కి.మీ దూర.ంలో ఉంది. ఉడుపి పుణ్యక్షేత్రం. నిత్యం ఉత్సవాలతో, లక్షలాది మంది యాత్రికులతో కళకళలాడుతూ ఉంటుంది ఈ పవిత్ర యాత్రాస్థలం. ‘ఉడుప’(చంద్రుడు)’ అనే పదాన్ని అనుసరించి ఈ క్షేత్రానికి ఉడుపి అనే పేర.ు వచ్చింది. పేర.ుకు తగ్గట్టే ఈ పవిత్ర క్షేత్రం స్వచ్ఛంగా, వెన్నెలలో ప్రకాశించే చంద్రుడిలా అద్వితీయమైన, అగోచర.మైన దివ్యచైతన్యంతో అక్కడక్కడ పెద్ద పెద్ద మామిడి, పనస తోటలు, సువిశాలమైన పొలాలగుండా ప్రయాణించే యాత్రికులకు కొబ్బరి, పోక చెట్లు తమ తలలూపుతూ స్వాగతం పలుకుతాయి. విశిష్టాద్వైత మత స్థాపకులు మధ్వాచార్యుల పవిత్ర హస్తాల మీదుగా స్థాపితమైన మఠం ఉడుపి. కనకదాసు అనే పర.మభక్తుడిని నిమ్న కులస్థుడనే కార.ణంతో పూజార.ులు కృష్ణ దర.్శనానికి నిరాకరించగా స్వయంగా తానే తన ప్రియభక్తునికి ప్రత్యక్ష దర.్శనమిచ్చిన కర.ుణామూర్తి ఉడుపి చిన్నికృష్ణుడు. ఉడుపి పూర్వపు పేరు శివళ్ళీ. ఇది పరశురామక్షేత్రాలలో ప్రథమస్థానం కలిగి ఉంది. ప్రతి సంవత్సరం, లక్షలాది భక్తులు కృష్ణుని దర్శనం చేసుకోవటానికి ఉడుపిని సందర్శిస్తారు. స్వామి దర్శనం నవరంధ్రాలున్న కిటికీ ద్వారా చేసుకోవలసి ఉండటం ఈ దేవాలయ ప్రత్యేకత. ఉడుపి రథవీధిలో శ్రీ కృష్ణమందిరం ఉంది. ఉత్తర ద్వారం గుండా గుడిలోకి ప్రవేశించినప్పుడు కుడివైపు దేవాలయ కార్యాలయం, ఇంకొద్దిగా ముందుకు వెళ్ళితే మధ్వ సరోవరం కనిపిస్తుంది. ప్రధాన ఆలయానికి ద్వారం ఎడమవైపు ఉంటుంది. కొద్దిగా ముందుకు వెళితే చెన్నకేశవ ద్వారం వస్తుంది. దీని ద్వారా గర్భగుడిలో ప్రవేశం పీఠాధిపతులకు తప్పితే అన్యులకు ఉండదు. చెన్నకేశవ స్వామి ద్వారం నుండి ముందు వెళ్ళితే ప్రదక్షిణం చేసిన తరువాత శ్రీకృష్ణ దర్శనం వెండితో తాపడం పెట్టిన నవరంధ్రాల గవాక్షం గుండా చేసుకోవచ్చు. గర్భగుడికి కుడివైపు ముఖ్యప్రాణ దేవత (హనుమంతుడు), వామభాగాన గరుడ దేవర ఉన్నారు. స్వామి దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళి దక్షిణ మార్గం వైపు వెళితే, ఎడమభాగాన మధ్వాచ్యారులు మంటపం కనిపిస్తుంది. ఉడుపి శ్రీకృష్ణ మఠానికి అనుసంధానంగా అష్టమఠాలు కృష్ణ మఠాలు ఉన్నాయి. ఈ ఎనిమిది మఠాలు ఉడుపి రథవీధిలో, శ్రీ కృష్ణ దేవాలయానికి చుట్టూ ఉంటాయి. అవి: పుత్తగె, పేజావర, పలిమారు, అదమారు, సోదె, శీరూరు, కాణియూరు, కృష్ణాపుర. మధ్వాచార్యులవారు ఒకసారి సముద్రంలో తుఫానులో చిక్కుకున్న ఓడను, అందులోని ప్రయాణికులను తన తపశ్శక్తితో రక్షించాడు. అప్పుడు ఓడలోని నావికుడు ఆయనకు గోపీచందనం మూటను కానుకగా సమర్పించాడు. మధ్వాచార్యులు ఆ మూటను విప్పి చూడగా, ఆ చందనపు కణికల మధ్య చిన్నికృష్ణుడి విగ్రహం కనిపించింది. అది శ్రీకృష్ణుడి లీలగా భావించిన మధ్వాచార్యులవారు ఆ కృష్ణుడి విగ్రహాన్ని ఉడుపిలో ప్రతిష్ఠించారు. అదే మనం చూస్తున్న విగ్రహం. కనకదాసుకు కృష్ణపరమాత్మ పశ్చిమాభిముఖుడై దర్శనమిచ్చిన చోటనే ఒక మంటపం కట్టించారు. ఆ మంటపానికే కనకదాసు మంటపమని పేరు. ఉడుపిలో జరిపే పండుగలు, పర.్వదినాలు: మకర. సంక్రాంతి, మధ్వ నవమి, హనుమాన్ జయంతి, శ్రీ కృష్ణ జన్మాష్టమి, నవరాత్రి మహోత్సవం, మధ్వ జయంతి (విజయ దశమి), నర.క చతుర.్దశి, దీపావళి, గీతాజయంతి వంటి పండుగలను పర్యాయ మఠంలో అంగర.ంగవైభవంగా జర.ుపుతార.ు. దగ్గరలో ఉన్న మరికొన్ని ముఖ్య ప్రదేశాలు: కొల్లూరు ముకాంబికా దేవాలయం, మరవంతె బీచ్, మల్పే రేవు, కాపు దీపస్తంభం (కాపు లైటు హౌసు), కార్కళ లోని గోమటేశ్వరుడు, వేణూరు లోని గోమటేశ్వరుడు, అత్తూరులో సెయింట్ లారెన్స్ ఇగర్జి, సెయింట్ మేరీస్ ద్వీపం, మూడబిదరెలో సావిరకంబద బసది మణిపాల్, బైందూరు కోసళ్ళి జలపాతం, జామియా మసీదు, 200 సంవత్సరాల జామియా మసీదులో సరికొత్తగా 18, 000 మంది ప్రార్థనలు చేసే విధంగా ప్రార్థనాశాలలున్నాయి. ఇక్కడ 3000 మంది భక్తులు బసచేయవచ్చు. పాజక: ఉడిపి నుండి 12 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ మాధవాచార్యుడు ద్వైతసిద్ధాంత ప్రసంగం చేశాడు. కొల్లూరు (ఉడిపి): ఉడిపి నుండి 74 కి.మీ దూరంలో ఉంది. మూకాంబికాదేవి నివాసిత ప్రదేశమని భక్తుల విశ్వాసం. కర్కల: ఉడిపి నుండి 37 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ జైన బసదీలు (ఆలయాలు) గోమటేశ్వర శిల్పం బృహద్రూపం ) ప్రత్యేక ఆకర్షణ. అనెగుడ్డె: ఉడిపి నుండి 30 కి.మీ.లు. ఇక్కడ ప్రముఖ గణేశాలయం ఉంది. ఆత్తుర్ చర్చి: ఉడిపి నుండి 25 కి.మీ.లు. ఇక్కడ ఏటా నిర్వహించే సంతకు కులమతభేద రహితంగా ప్రజలు వస్తారు. బర్కూర్: ఉడిపి నుండి 15కి.మీల దూరం. జైన బసదీలు ఉన్న బర్కూరు తులునాడు రాజులకు రాజధాని. సాలిగ్రామ: ఉడిపి నుండి 27కి.మీల దూరం. ఇక్కడా గురునరసింహస్వామి ఆలయం ఉంది. పరంపల్లి: ఇక్కడ ఎనిమిది వందల ఏళ్ల నాటి పురాతనమైన విష్ణుమూర్తి ఆలయం ఉంది. పెర్నకిల: ఇక్కడ ఒక పురాతన గణేశుని ఆలయం ఉంది. పెర్దోర్: ఉడిపి నుండి 22 కి.మీ దూరంలో ఉంది. అగుంబే – షిమోగా రాష్టీయ్ర రహదారి సమీపంలో అనంతపద్మనాభస్వామి ఆలయం ఉంది. హరియాద్క: ఉడిపి నుండి 16 కి.మీలు. పురాతనమైన వీరభద్రాలయం ఉంది. శంకరనారాయణ: ఉడిపి నుండి 40 కి.మీలు. శకరనారాయణాలయం ఒక సరోవరం మధ్యన ఉండడం విశేష ఆకర్షణ. మారనకట్టె: ఉడిపి నుండి 45 కి.మీలు. ఈప్రాంతం ప్రకృతి ఆరాధకులకు స్వర్గభూమివంటిది. మందర్హి: ఉడిపి నుండి 20 కి.మీలు. ఇక్కడ అమ్మనవారు (దుర్గాపరమేశ్వరి) ఆలయం ఉంది. ఇక్కడ ప్రసాదంగా ఇచ్చే ‘దోశ‘ సంతానప్రాప్తి కలిగిస్తుందని ప్రజలు విశ్వాసం. ముదుహోలె కర్కడ: ఇక్కడ పురాతన దుర్గాపరమేశ్వరి ఆలయం ఉంది. సోమేశ్వర వన్యప్రాణి అభయారణ్యం: ఇది ఉడిపి నుండి 40 కి.మీలు. ఇక్కడ అరుదైన జంతువులు, పక్షులు, ఔషధ మొక్కలు ఉన్నాయి. మూకాంబికా వన్యప్రాణి అభయారణ్యం: ఇది ఉడిపి నుండి 50 కి.మీలు. కుందపూర్– కొల్లూర్ రోడ్డు పక్కన విస్తరించి ఉంది. కుర్ధు తీర్ధ జలపాతాలు: ఉడిపి నుండి 42 కి.మీలు. పశ్చిమ కనుమలలోని దట్టమైన అరణ్యాల మధ్య, 300 అడుగులున్న ఒక అందమైన జలపాతం. ఋషుల తపస్సుతో ఈ మడుగు ఎంతో పవిత్రతను, ప్రాధాన్యతను సంతరించుకుంది. మంగ తీర్ధ: కుర్ధు తీర్ధకు ఎగువన మంగ తీర్ధ ఉంది. ఇది దట్టమైన అరణ్యాల మధ్య నిటారుగా ఉన్న పర్వతాలలో ఉంది కనుక ఇక్కడకు కోతులు తప్ప మానవమాత్రులు చేరలేరు కనుక దీనిని కోతుల తీర్థం అని కూడా అంటారు. బర్కన జలపాతం: ఉడిపి నుండి 54 కి.మీ దూరంలో ఉంది. ఇది పశ్చిమ కనుమలలో ఉడిపి, చికమగళూరు, శివమొగ్గ కూడలి ప్రాంతంలో ఉంది; బెల్కల్ తీర్థ జలపాతం, అరసిన గుండి, కుద్లు తీర్థ, కొసల్లి జలపాతం, సౌపర్ణిక, స్వర్ణ, చక్ర, సీత, వర్హి, కుబ్జ నదులున్నాయి. ఈ నదులలో అందమైన నదీ ద్వీపాలు ఉన్నాయి. వీటిని కుర్దూలు అంటారు. వీటిలో కొన్ని ద్వీపాలలో జనావాసాలు ఉన్నాయి. విశేషాల ఉడిపి శ్రీ కృష్ణుని రథానికి బ్రహ్మరథమని పేరు. ఇది బంగారంతో రూపొందింది. శ్రీ కృష్ణుని ఉత్సవ విగ్రహాన్ని రత్నఖచితమైన సింహాసనంపై ఉంచుతారు. అలనాడు శ్రీ కృష్ణుడు కనకదాసుకు దర్శనమిచ్చిన గవాక్షం(కిటికీ)లోనుంచే ఈ నాటికీ భక్తులు స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. ఎలా వెళ్లాలి? దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుంచి మంగుళూరుకు రైళ్లు, బస్సులు ఉన్నాయి. అక్కడినుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉడుపికి బస్సులు, ప్రైవేటు వాహనాలలో చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి ఉడుపికి నేరుగా బస్సులున్నాయి. హైదరాబాద్ డెక్కన్ నుంచి వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్ ఉంది. – డి.వి.ఆర్.భాస్కర్ -
వదనం మధురం...
ఉడిపి ఉత్సవాలు ఉడిపి శ్రీకృష్ణ ఆలయంలో రోజూ వేకువజామున జరిగే పూజలు నయనానందకరంగా సాగుతాయి. అలాగే స్వామివారికి ఏటా జరిపే శ్రీకృష్ణాష్టమి ఉత్సవాలు కూడా అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. మకరసంక్రాంతి, రథసప్తమి, మాధవి నవమి, హనుమజయంతి, నవరాత్రి మహోత్సవాలు, నరకచతుర్దశి, దీపావళి, గీతాజయంతి.. మొదలైన ఉత్సవాలు ఇక్కడ వేడుకగా జరుపుతారు. లోకానికి ఇది మంచి, ఇది చెడు అని హద్దులు గీసి మరీ నిర్ణయించి చూపిన గీతాచార్యుడు ఆయన. మనిషి జన్మ మాయ చుట్టూ పరిభ్రమిస్తుందని విశ్వాన్ని కళ్లకు కట్టిన జగన్మోహనుడు ఆయన. ధర్మసంస్థాపన కోసం ధరించిన అవతారాలలో ఆయనది పరిపూర్ణ అవతారం. ఆయనే జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ. ఉడిపి దివ్యక్షే త్రంలో కొలువుదీరి భక్తుల కొంగుబంగారమై అలరారుతున్నాడు కృష్ణభగవానుడు. దేశంలో విరాజిల్లుతున్న అతి సుందర దివ్యమందిరాలలో ఉడిపి కృష్ణ మందిరం ఒకటి. మధుర, బృందావనం, ద్వారక... ఆపైన ఉడిపి ఈ మందిరాలన్నీ అతి సుందరం. బెంగుళూరుకు సుమారు 500 కి.మీ దూరంలో ఉడిపి క్షేత్రం ఉంది. ఎత్తై కొండలు, ఆకాశంతో ఊసులాడుతున్నట్టు ఎత్తై పచ్చని చెట్లు, మెల్లగా, సన్నగా సవ్వడి చేస్తూ నురుగలతో ఎగిసిపడే సముద్రం... ఉడిపికి వెళ్లేదారిలోనే మనసు పులకించిపోతుంది. స్వాగత ద్వారం ఈ పచ్చని సుందర దృశ్యాలను తిలకిస్తూ ఈ దారి గుండా వెళుతుంటే మొదటగా రమణీయమైన స్వాగత ద్వారం ఎదురవుతుంది. ఇక్కడి నుంచి కృష్ణ నామం వినిపిస్తూ మనసంతా ఆనందంతో పరవశించిపోతుంది. పేరు వింటేనే ఇంత ఆనందపరవశులయితే ఇక ఆయన దివ్యమంగళ రూపం చూస్తే.. ఎంత ఆకర్షణకు లోనవుతామో..! అసలు కృష్ణ అంటేనే ఆకర్షణ అని అర్థం. ఆయన రూపానికి తగిన విధంగానే ఆలయమూ మన మనసులను దోచుకుంటుంది. ప్రధాన ద్వారం కంటికింపైన రంగులతో దేవతామూర్తులతో భక్తుల చూపులను కట్టిపడేస్తుంది ప్రధాన ద్వారం. ముందుగా లక్ష్మీదేవి, ఆ పైన ఆదిశేషుడు తలపై కిరీటంలా భాసిల్లుతుండగా కృష్ణపరమాత్ముడు అభయముద్రలో కనిపిస్తాడు. ఇరువైపులా హనుమంతుడు, గరుత్మంతుడు జోతలు అర్పిస్తూ కనిపిస్తారు. ఇది వైష్ణవాలయం అయినప్పటికీ శైవ చిత్రాలూ ఉండి శివకేశవ భేదం లేదనిపిస్తుంది. ఈ రాజద్వారం దాటి లోపలికి వె ళ్లిన భక్తులకు అద్భుతమైన ఆనందపరవశం కలుగుతుంది. ఇదే గర్భమందిరమేమో అనిపిస్తుంది. ఈ ముఖద్వార అద్భుతాలను వీక్షిస్తూ లోపలికి విచ్చేస్తారు భక్తజనం. కిటికీ గుండా దర్శనం ప్రధాన ఆలయానికి ద్వారం ఎడమవైపు ఉంటుంది. కొద్దిగా ముందుకు వెళితే చెన్నకేశవద్వారం వస్తుంది. పీఠాధిపతులకు తప్పితే దీని ద్వారా గర్భగుడిలో అన్యులకు ప్రవేశం ఉండదు. చెన్నకేశవస్వామి ద్వారం నుండి ముందుకు వెళితే శ్రీకృష్ణ దర్శనానికి వెండితో తాపడం చేసిన నవరంధ్రాల కిటికీని చేరుకోవచ్చు. నేరుగా కాకుండా కిటికీ గుండానే స్వామిని దర్శించే మహత్తర క్షేత్రం లోకంలో ఉడిపి మాత్రమే. మనిషి శరీరంలోని నవరంధ్రాలకు ఈ కిటికీ ప్రతీక అని చెబుతారు. ఈ కిటికీ గుండా చూపులను లోపలికి సారిస్తే గుండె డోలాయమానం అవుతుంది. బాలకృష్ణుడి దివ్యమంగళరూపం... చూడ్డానికి రెండు కళ్లూ సరిపోవు. అలనాటి యశోద ముంగిట ముద్దుగారే ముత్యంలా.. ఒక చేత తాడు, మరో చేత కవ్వము ధరించిన శ్రీకృష్ణ జగన్మోహనాకార రూపం క్షణకాలం ఆనందలోకాలకు తీసుకెళుతుంది. శ్రీకృష్ణుని దివ్యమంగళరూపాన్ని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరూ తహతహలాడతారు. అందులో వృద్ధులైన తల్లిదండ్రులు, బామ్మలు, తాతయ్యలు ఉంటారు. వారిని వెంట తీసుకెళ్లి, ఆ మంగళస్వరూపుని దర్శనభాగం కల్పిస్తే పెద్దల ఆశీస్సులు తద్వారా ఆ భగవానుని కృప మన వెన్నంటే ఉంటుంది. సందర్శనీయ స్థలాలు ఉడిపిని సందర్శించడానికి అక్టోబర్ నుంచి మార్చ్ వరకు తగిన సమయం. కృష్ణమందిరం, మణిపాల్, చంద్రమౌళీశ్వర మందిరం, మల్పే బీచ్, దరియా బహదుర్గాద్ కోట, సెయింట్ మేరీస్ ఐల్యాండ్... మొదలైనవి ఈ చుట్టుపక్కల దర్శనీయ స్థలాలు. ఇలా చేరుకోవచ్చు బెంగుళూరు నుంచి ఉడిపి 500 కిలోమీటర్ల దూరం. మంగళూరు నుంచి 80 కిలోమీటర్ల దూరం. హైదరాబాద్ నుంచి రోడ్డు ద్వారా అయితే సుమారు 913 కి.మీ. దూరం. రైలు ద్వారా అయితే 1500 కి.మీ దూరం. విమానం ద్వారా అయితే మంగళూరుకు చేరుకొని అక్కడ నుంచి ఉడిపికి చేరుకోవచ్చు. బస్సు: హైదరాబాద్ నుంచి ఉడిపికి దాదాపు 13-15 గంటల లోపు చేరుకోవచ్చు. సుమారు రూ.1000 నుంచి 1300 వరకు ప్రైవేట్ బస్సుల టికెట్ల ధరలు ఉన్నాయి. రైలు: హైదరాబాద్ (కాచిగూడ) స్టేషన్ నుంచి మంగళూరు ఎక్స్‌ప్రెస్ ఉంది. విమానాశ్రయం: ‘బాజ్పె ఎయిర్పోర్ట్’ మంగళూర్లో ఉంది. ఇది ఉడిపికి 60 కి.మీ దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి నాన్‌స్టాప్ కాకుండా కనెక్టింగ్ ఫ్లయిట్స్ ఉన్నాయి. చెల్లించే డబ్బుని బట్టి ఒన్ స్టాప్ టూ స్టాప్స్ ఫ్లయిట్స్ ఉన్నాయి. - ఎన్.ఆర్ 800 ఏళ్ల క్రితం ప్రతిష్ఠాపన ఈ మందిరంలో సుందరమైన శ్రీకృష్ణభగవానుడి విగ్రహాన్ని సుమారు 800 ఏళ్ల క్రితం ద్వైతమత స్థాపకులు శ్రీ మధ్వాచార్యులు ప్రతిష్టించాడని చరిత్ర చెబుతోంది. మధ్వాచార్యులు ఎనిమిది మంది బ్రహ్మచారి శిష్యులకు సన్యాస దీక్షనందించి, వారి ద్వారా శ్రీకృష్ణుడికి పూజాదికాలు నిర్వహించే ఏర్పాటు చేశారు. వారు ఏర్పాటు చేసిన మఠాల నుంచి ఎంపికైన వారే రెండేళ్ల కొకసారి దేవాలయంలో అర్చనాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. భక్తుడికి అనుగ్రహం... వాదిరాజు పాలనలో కనకదాస అనే భక్తుడు ఉడిపి కృష్ణుణ్ణి దర్శించుకోవాలని తహతహలాడుతుండేవాడు. కాని, అతను కడజాతి వాడు అని పూజారులు గుడిలోకి అనుమతించలేదు. అప్పుడు అనుగ్రహించిన కృష్ణుడు తన విగ్రహం వెనుకవైపున గోడకు కన్నం ఏర్పాటు చేసి వెనుకకు తిరిగి భక్తుడైన కనకదాసకు దర్శనమిచ్చి కరుణించాడు. అప్పటి నుంచి ఈ కిటికీకి ’కనకనకిండి’ అనే పేరు వచ్చింది. స్వామి దర్శనం చేసుకొని ముందుకు వెళ్లి దక్షిణ మార్గంవైపు వెళితే ఎడమభాగాన మధ్వాచార్యుల మంటపం కనిపిస్తుంది. నలుపురంగు, సాలిగ్రామ శిలతో తయారుచేసిన ఇక్కడి కృష్ణ విగ్రహం నయనమనోహరంగా ఉంటుంది. ఆలయం కుడివైపు భాగంలో దేవస్థానం సత్రాలు బిర్లా, శృంగేరీ, కృష్ణ, గీతాసత్రాలలోని గదుల్లో విడిది చేయవచ్చు. ఉడిపి దేవస్థానంలో భక్తులకు రెండుపూటలా అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఉడిపిలో అత్యాధునిక వసతిసదుపాయాలు గల హోటళ్లు, లాడ్జీలు ఉన్నాయి. కిందటేడాది అక్టోబర్‌లో వృద్ధుల అత్యవసర సాయం కోసం కర్ణాటక ప్రభుత్వం 1090 హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. దీని ప్రధాన కేంద్రం బెంగళూరు -
కర్ణాటకలో అసోం యువకుడి హత్య
మంగళూరు: కూలీ పనుల నిమిత్తం కర్ణాలకకు వలస వచ్చిన ఓ అసోమీ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పనులకు ఎంత కూలీ తీసుకోవాలనే విషయంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన విబేధాలే హత్యకు దారితీశాయని పోలీసులు చెప్పారు. అసోంకు చెందిన మహేంద్రరాజ్ బొన్సి (22) తన బంధువులతో కలిసి ఉడిపి జిల్లాలోని శిరూరు, ముద్దుమనే గ్రామాల్లో నిర్మాణం పనుల్లో కూలీగా పనిచేస్తున్నాడు. కాగా, వలస కూలీలు తక్కువ కూలీకే పనులు చేస్తుండటంతో తమకు ఉపాధి లేకుండా పోతోందని స్థానిక కూలీలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. సోమవారం ఓ చోట కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలనుకున్నారు ఇరువర్గాలు. అయితే ఆ ప్రయత్నం కూడా విఫలం కావడంతో ఆగ్రహానికి గురైన ప్రత్యర్ధులు.. అస్సామీ కూలీల ప్రతినిధులపై కర్రరతో దాడిచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా, తీవ్రగాయాలపాలైన మహేంద్రరాజ్ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నీలమేఘశ్యాముని నాల్గు నగరాలు
శ్రీకృష్ణుని లీలలు ఎన్ని చెప్పిన తరగవు. కన్నయ్య నడయాడిన ప్రదేశాల గురించి ఎంత చెప్పినా తరగదు. గోపబాలుడుగా జన్మించిన మధుర... గానామృతాలు పంచిన బృందావనం... రాజసంగా కొలువుదీరిన ద్వారక...సర్వవ్యాప్తుడైన ఆయన సంచరించిన ప్రదేశాలెన్నో! కృష్ణాష్టమి సందర్భంగా ఆ మురారికి ప్రీతిపాత్రమైనపట్టణాల గురించి, ఆలయవైభవాలగురించి తెలుసుకోవాలంటే అక్కడికి వెళ్లితీరాల్సిందే! ద్వారక, మధుర ఉత్తరభారతదేశంలో ఉన్నాయి. గురువాయూర్, ఉడిపి దక్షిణభారతదేశంలో ఉన్నాయి. ద్వారకాధీశుడు శ్రీకృష్ణుని దివ్య క్షేత్రాలలో అతి విశిష్టమైనది ద్వారక. గుజరాత్‌లోని జామ్‌నగర్ జిల్లాలో సముద్రమట్టానికి సమానంగా ఉంటుంది. ద్వార్ అంటే సంస్కృతంలో వాకిలి, ద్వారం వంటి అర్థాలు ఉన్నాయి. హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ధామ్లలో ద్వారకాపురి ఒకటి. జరాసంధుని బారి నుండి తప్పించుకునేందుకు కృష్ణుడు ఈ నగరాన్ని నిర్మించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ ద్వారకాధీశుని మందిరం అతి పురాతమైంది. శ్రీకృష్ణుని మునిమనమడు వజ్రనాభుడు క్రీస్తు పూర్వం 2వేల సంవత్సరాల క్రితం ఈ మందిరాన్ని నిర్మించినట్టు పురాణాలలో ప్రస్థావన ఉంది. ఆ తర్వాత క్రీస్తు శకం 16వ శతాబ్దంలో ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం మొత్తం 5 అంతస్తులతో, 72 స్తంభాలతో అలరారుతుంటుంది. ఇక్కడ ప్రత్యేక దర్శనాలు, రుసుములు లేవు. ఎక్కువ మెట్లు లేవు. అందువల్ల వయోవృద్ధులు కూడా దర్శనం చేసుకోవచ్చు. పక్కనే గోమతి నది పరవళ్లు తొక్కుతుంటుంది. గోమతి నది సముద్రంలో కలసే చోటే ద్వారక ఉంది. ఈ ఆలయం నుంచే ఆ సంగమ ప్రదేశాన్ని చూడవచ్చు. బేట్ ద్వారక: శ్రీకృష్ణుడు తన రాణులను కలిసిన చోటు గా ఈ ప్రాంతానికి పేరుంది. ఇది రేవు పట్టణం. శ్రీకృష్ణుడు అవతారం చాలించి వైకుంఠానికి వెళ్లిన తర్వాత సముద్ర గర్భంలో కలిసిపోయిందని చెబుతుంటారు. ద్వారక నుంచి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి వెళ్లేదారిలో రుక్మిణీదేవి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని బోటులో ప్రయాణించి చేరుకోవాలి. ద్వారకాపురిలో ఇంకా వసుదేవ, దేవకి, బలరామ, రేవతి, సుభద్ర, జాంబవతి, సత్యభామ ఆలయాలు కూడా ఉన్నాయి. చూడలవసినవి: గాయత్రి మందిరం, గీతా మందిరం. 20 కి.మీ దూరంలో గల నాగనాథ్ (జ్యోతిర్లింగం), ద్వారక నుండి 250 కి.మీ. దూరంలో గల సోమనాథ దేవాలయం (జ్యోతిర్లింగం), అక్కడి నుంచి 10 కి.మీ దూరంలో శ్రీకృష్ణుని నిర్యాణ స్థలం. రైలు మార్గం: హైదరాబాద్ నుంచి రామేశ్వరం-ఓఖా ఎక్స్‌ప్రెస్ బయల్దేరుతుంది. ప్రయాణ సమయం 36 గంటలు. ద్వారకలో భోజన, వసతి సదుపాయాలు ఉన్నాయి. ఉడిపి చిన్నికన్నయ్య కర్ణాటక రాష్ట్రంలో మంగళూరుకు 58 కి.మీ దూరంలో ఉంది ఉడిపి. ప్రపంచంలోని అత్యంత సుందరమైన శ్రీకృష్ణ ఆలయంగా దీనికి పేరుంది. స్వామి దర్శనం నవరంధ్రా లున్న కిటికీగుండా చేసుకోవడం ఇక్కడి ప్రత్యేకత. ఈ ఆలయంలోని కృష్ణుని విగ్రహం చిన్ని బాలుడి రూపంలో ఉంటుంది. 12వ శతాబ్దంలో మధ్వాచార్యులు శ్రీకృష్ణుని విగ్రహ ప్రతిష్ఠ జరిపి, ఎనిమిదిమంది బ్రహ్మచారి శిష్యులతో పూజలు జరిపించారట. ఇక్కడి తీర్థం మధ్యభాగంలో మనోహరమైన మండపమొకటి ఉంది. ఇందులోనే శ్రీ మధ్వాచార్యుల దివ్యప్రతిమ ఉంది. ఉత్సవాలు, పండగలపుడు ఈ తీర్థంలోనే స్వామివారికి తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇక్కడి నుంచి త్రిశూర్ 150 కి.మీ. ఉంటుంది. ఉడిపిలో కృష్ణమందిరం దర్శంచుకొని త్రిశూర్‌కు రైలులో చేరుకోవచ్చు. అక్కడ నుంచి గురువాయూర్ చేరుకోవాలి. రోడ్డు మార్గం: ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి దేశంలోని అన్ని ప్రధాన కేంద్రాల నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి మంగళూరుకు నేరుగా వెళ్లి, అక్కడ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉడిపికి బస్సు ద్వారా చేరుకోవచ్చు. ఉడిపిలో అన్ని వసతులు ఉన్నాయి. దక్షణాది నవభోజనాలు ఆలయానికి దగ్గరలోనే లభిస్తాయి. గురువాయూర్ బాలగోపాలుడు కేరళ రాష్ట్రంలో త్రిశూర్ పట్టణానికి 30 కి.మీ. దూరంలో గురువాయూర్ ఉంది. కేరళ సంప్రదాయ పద్ధతిలో ఈ ఆలయాన్ని నిర్మించారు. పాతాళ జలశిలతో కృష్ణుని విగ్రహం మలచినట్టుగా, శంకరాచార్యులవారు దీన్ని ప్రతిష్ఠాపన చేసినట్టుగా చెబుతారు. నాలుగు చేతులలో పాంచజన్యం, శంఖం, చక్రం, కౌమోదకం పద్మాలను ధరించి ముగ్ధమనోహర రూపంలో అలరించే బాలగోపాలుడు గురువాయూర్. అతి ప్రాచీనమైన ఈ ఆలయానికి దేశం నలుమూలల నుండి భక్తులు దర్శనార్ధం చేరుకుంటుంటారు. అయ్యప్పకు వెళ్లే భక్తజనావళి గురువాయూర్ను దర్శించుకొని వెళతారు. ఇక్కడ స్వామిని ఉన్నికృష్ణన్, కన్నన్ అని పిలుస్తారు. శ్రీకృష్ణుడు తన అవతార పరిసమాప్తి కాలంలో సహచరుడైన ఉద్దీపునికి కృష్ణవిగ్రహం ఇచ్చాడట. లోక కళ్యాణార్థం జలప్రళయ అనంతరం విగ్రహాన్ని వాయువు కాపాడి దేవగురువు బృహస్పతికి ఇచ్చాడట. గురువు వాయువుతో కలిసి ఈ విగ్రహం ప్రతిష్ఠించారు కాబట్టి గురువాయూర్ అని పేరొచ్చిందని పెద్దలు చెబుతుంటారు. రైలుమార్గం: హైదరాబాద్ నుంచి శబరి ఎక్స్‌ప్రెస్‌లో త్రిశూర్ చేరుకొని, అక్కడ నుంచి బస్సుమార్గం ద్వారా గురువాయూర్ చేరుకోవచ్చు. మధుర హృదయవల్లభుడు మానవ హృదయంతో మధురను పోల్చుతారు. ప్రేమకు, భక్తి భావనకు, ఆనందాతిశయాలకు నెలవుగా ఈ ప్రాంతాన్ని కొనియాడుతారు. ఆగ్రా నుండి ఢిల్లీ వెళ్లే తోవలో 50 కి.మీ. దూరంలో ఉంది మధుర. యమునానదికి ఆనుకొని ఉంటుంది. ఢిల్లీ సందర్శనకు వెళ్లినప్పుడు మధుర చూసి రావచ్చు. కృష్ణుని జన్మస్థానమైన ఈ నగరం అతి ప్రాచీనమైనది. ఇక్కడ కృష్ణుని ఆలయాన్ని నాలుగు పర్యాయాలు నిర్మించినట్టు కథనాలు ఉన్నాయి. 1965లో ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని నిర్మించారు. ఆలయభాగమే శ్రీకృష్ణుని జన్మస్థానం. చూడలవసినవి: కృష్ణమందిరం, దేవకీ వసుదేవుల జైలు, కంసరాఖిల్లా, బలిదేవ్, కంసవిఖండన మందిరాలు ఉన్నాయి. ఇంకా గోకులం, మహావనం, బృందావనం చూడదగినవి. ఇక్కడ కృష్ణాష్టమి, దీపావళి, ఆషాఢపౌర్ణమి, శ్రావణ, భాద్రపద, కార్తీక మాసాలలో ఇక్కడ పెద్ద ఎత్తున వేడుకలు జరుగుతాయి. మధురలో అన్ని ప్రాంతాలను దర్శించాలనుకునేవారు గైడ్ సాయం తీసుకోవడం మంచిది. - ఎస్.వి. సత్యభగవానులు, విశ్రాంత డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఒంగోలు -
ఉడిపిలో స్వైన్ ఫ్లూతో ఏడుగురి మృతి
కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. ఇప్పటివరకు ఈ ఏడాది 40 కేసులు నమోదు కాగా, వారిలో ఏడుగురు మరణించారు. ఈ విషయాన్ని ఉడిపి జిల్లా వైద్యాధికారి తెలిపారు. ఒక్క ఉడిపి తాలూకాలోనే 22 కేసులు నమోదయ్యాయని, వారిలో నలుగురుమరణించారని జిల్లా వైద్య, కుటుంబ సంక్షేమాధికారి డాక్టర్ రామచంద్ర బైరి తెలిపారు. అలాగే కరకల లో మూడు కేసులు నమోదై ఒకరు మరణించారని, కుందాపూర్‌లో 15 కేసులు నమోదై ఇద్దరు మరణించారని చెప్పారు. హెచ్1ఎన్1 వైరస్‌తో పోరాడేందుకు జిల్లాలో తగినన్ని మందులు ఉన్నాయని, అలాగే ఎక్కడైనా ప్రైవేటు ఆస్పత్రులలో ఈ వైరస్ కనపడితే వెంటనే తమకు తెలియజేయాల్సిందిగా కోరామని అన్నారు. ఇప్పుడు వర్షాల కారణంగా మలేరియా కూడా ప్రబలుతోందని, అందువల్ల ప్రజలంతా పరిశుభ్రత పాటించాలని డాక్టర్ రామచంద్ర బైరి కోరారు. ఆస్పత్రులలో వెంటిలేటర్లు, ఇతర సదుపాయాలు తగినన్ని ఉండేలా చూసుకోవాలన్నారు.