
సాక్షి బెంగళూరు: జలక్షామం, వర్షాభావాన్ని నివారించేందుకు ఉడుపి జిల్లా నాగరిక సమితి ట్రస్టు, పంచరత్న సేవా ట్రస్టు ఆధ్వర్యంలో కప్పలకు వైభవంగా పెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉడుపి కిదియూర్ హోటల్ ఆవరణలో శనివారం ఈ కప్పల పెళ్లి వైభవంగా నిర్వహించారు. ఉదయం 11 గంటలకు నగరంలోని మారుతి విధికా నుంచి ఊరేగింపుగా పెండ్లిబృందం బయలుదేరి పాత డయాన సర్కిల్ గుండా కవి ముద్దణ మార్గంలో ఉడుపి కిదియూర్ హోటల్ వద్దకు చేరుకుని, అనంతరం కప్పలకు వివాహం చేశారు.