దారుణం: తల్లి, ముగ్గురు పిల్లల్ని హత్య చేసిన దుండగులు | Woman And 3 Sons Stabbed To Death At Own Home In Karnataka Udupi - Sakshi
Sakshi News home page

Karnataka Udupi Crime: దారుణం: తల్లి, ముగ్గురు పిల్లల్ని హత్య చేసిన దుండగులు

Nov 12 2023 9:15 PM | Updated on Nov 13 2023 11:01 AM

Woman 3 Sons Stabbed To Death At Home In Karnataka Udupi - Sakshi

బెంగళూరు: కర్ణాటకాలోని ఉడిపి జిల్లాలో దారుణం జరిగింది. ఓ తల్లి ఆమె ముగ్గురు కుమారులను దుండగులు హత్య చేశారు. మృతురాలి అత్త కూడా కత్తిపోట్లకు గురైంది. కాపాడటానికి ప్రయత్నించిన ఇరుగుపొరుగువారిని కూడా దుండగులు కత్తితో బెదిరించారు. 

శనివారం ఉదయం బాధితురాలి ఇంట్లో దుండగులు చొరబడ్డారు. తల్లి హసీనాను ఆమె ముగ్గురు కుమారులను కత్తులతో హత్య చేశారు. అనంతరం ఆమె అత్తను కూడా కత్తితో దాడి చేశారు. మృతుల అరుపులు విని బయటకు వచ్చిన పొరుగింటివారిని దుండగులు కత్తులతో బెదిరించారు. అనంతరం ఘటనాస్థలం నుంచి పారిపోయారని పోలీసులు తెలిపారు. మొదట తల్లి ఇద్దరు పిల్లల్ని హత్య చేసిన దుండగులు.. ముగ్గురిలో చిన్నపిల్లాడు(12) బయట నుంచి వచ్చిన తర్వాత  హత్య చేశారని పోలీసులు తెలిపారు.  

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబానికి శత్రువులెవరైనా ఉన్నారా? అనే కోణంలో దుండగుల కోసం గాలింపు చేపట్టారు. ఇంట్లో విలువైన వస్తువులేవీ దొంగిలించకుండా హత్యకు పాల్పడటంతో తెలిసిన శత్రువులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.   

ఇదీ చదవండి: బాణాసంచా మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement