Stabbed to Death
-
దారుణం: తల్లి, ముగ్గురు పిల్లల్ని హత్య చేసిన దుండగులు
బెంగళూరు: కర్ణాటకాలోని ఉడిపి జిల్లాలో దారుణం జరిగింది. ఓ తల్లి ఆమె ముగ్గురు కుమారులను దుండగులు హత్య చేశారు. మృతురాలి అత్త కూడా కత్తిపోట్లకు గురైంది. కాపాడటానికి ప్రయత్నించిన ఇరుగుపొరుగువారిని కూడా దుండగులు కత్తితో బెదిరించారు. శనివారం ఉదయం బాధితురాలి ఇంట్లో దుండగులు చొరబడ్డారు. తల్లి హసీనాను ఆమె ముగ్గురు కుమారులను కత్తులతో హత్య చేశారు. అనంతరం ఆమె అత్తను కూడా కత్తితో దాడి చేశారు. మృతుల అరుపులు విని బయటకు వచ్చిన పొరుగింటివారిని దుండగులు కత్తులతో బెదిరించారు. అనంతరం ఘటనాస్థలం నుంచి పారిపోయారని పోలీసులు తెలిపారు. మొదట తల్లి ఇద్దరు పిల్లల్ని హత్య చేసిన దుండగులు.. ముగ్గురిలో చిన్నపిల్లాడు(12) బయట నుంచి వచ్చిన తర్వాత హత్య చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబానికి శత్రువులెవరైనా ఉన్నారా? అనే కోణంలో దుండగుల కోసం గాలింపు చేపట్టారు. ఇంట్లో విలువైన వస్తువులేవీ దొంగిలించకుండా హత్యకు పాల్పడటంతో తెలిసిన శత్రువులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదీ చదవండి: బాణాసంచా మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం -
పటాన్చెరు: భార్యాభర్తల మధ్య గొడవ.. ఆపేందుకు వెళ్లిన వదినపై..
సాక్షి, హైదరాబాద్: భార్యాభర్తల మధ్య వివాదం కత్తిపోట్లకు దారి తీసింది. దాడిలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన అమీన్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బొల్లారం సీఐ సురేందర్ రెడ్డి, అమీన్పూర్ ఎస్ఐ కిష్టారెడ్డి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడురు మండలం జయ్యారం గ్రామానికి చెందిన శ్రీనివాస్ బతుకుదెరువు కోసం వచ్చి బాల్నగర్ చింతల్లో ఉంటున్నారు. కూలి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా శ్రీనివాస్ అతడి భార్య సునీత కొన్ని రోజులుగా గొడవపడుతున్నారు. సునీత అమీన్పూర్ శ్రీవాణి నగర్లో ఉంటున్న తన అక్క సుజాత(46) వద్దకు నెల క్రితం వచ్చింది. అక్కడే ఉంటూ బాచుపల్లి సమీపంలోని అరవిందో పరిశ్రమలో కూలి పనిచేస్తోంది. ఈ క్రమంలో శనివారం ఉదయం 5.30 గంటలకు సునీత డ్యూటీకి వెళ్లింది. వెనుక అక్క సుజాత, ఆమె కుమారుడు సాయికిరణ్ బైక్‌పై వచ్చారు. పరిశ్రమ సమీపంలో సునీత ఆమె భర్త శ్రీనివాస్ గొడవపడుతున్నారు. వారిని ఆపే ప్రయతనం చేసేందుకు వెళ్లిన సుజాత, సాయికిరణ్‌తో పాటు సునీతపై శ్రీనివాస్ కత్తితో దాడి చేశాడు. దాడిలో సుజాత అక్కడికక్కడే మృతిచెందగా, సునీత, సాయికిరణ్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే స్థానిక మమత ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పటాన్చెరు డీఎస్పీ భీంరెడ్డి, సీఐ వేణుగోపాల్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. చదవండి: (భర్త ఇంట్లో ఒంటరిగా ఉండగా.. ప్రియుడిని రప్పించి చాకచక్యంగా..) -
దారుణం: సోదరిపై వేధింపులను ప్రశ్నించాడని కత్తులతో పొడిచి చంపేశారు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో దారుణ ఘటన వెలుగు చూసింది. తన సోదరిపై వేధింపులకు పాల్పడటాన్ని ప్రశ్నించినందుకు ఓ 17 ఏళ్ల బాలుడిని దారుణంగా పొడించి చంపేశారు ఇద్దరు మైనర్లు. శుక్రవారం జరిగిన ఈ దారుణ ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాలో నమోదైంది. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బాధితుడు పటేల్ నగర్‌కు చెందిన బాలుడిగా గుర్తించారు. వీడియో ప్రకారం.. ఓ గల్లీలో ముగ్గురు మైనర్లు గొడవ పడుతున్నారు. అందులో ఒకడు బాధితుడిని కత్తితో పలు మార్లు పొడిచాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. శరీరంలో దిగిన కత్తితో బాధితుడు పడిపోతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రాణాలు కోల్పోయే ముందు తన ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసేందుకు ప్రయత్నించినట్ల తెలుస్తోంది. కంప్యూటర్ క్లాస్‌కు వెళ్లి తిరిగి వచ్చిన క్రమంలో ఇంటివద్దే దాడి చేసి చంపేసినట్లు పోలీసులు తెలిపారు. ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు వెల్లడించారని చెప్పారు. కేసు నమోదు చేసుకుని నిందితులైన ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. #Video: #Delhi Teen Stabbed To #Death After He Protested Sister's #Harassment. @DelhiPolice #PatelNagar #viral #murder #CCTV #news #UnMuteIndia #crime Subscribe to our YouTube page: https://t.co/EKkVQVGoS5 pic.twitter.com/sz4Q5XU8jD — UnMuteINDIA (@LetsUnMuteIndia) October 29, 2022 ఇదీ చదవండి: ఎంత ఘాటు ప్రేమయో.. ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు స్టూడెంట్స్.. చివరకు.. -
రూ.40 వేలు అప్పుతీసుకున్న ట్రాన్స్‌జెండర్.. చెల్లించకపోవడంతో ఇంటికి వెళ్లి!
న్యూఢిల్లీ: పాత పరిచయం ఓ ట్రాన్స్‌జెండర్ (35)ను ఆస్పత్రిపాల్జేయగా, ఆమె సహచరుడి ప్రాణాలు తీసింది. రూ.40 వేల కోసం జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీయడంతో ఓ వ్యక్తి టాన్స్‌జెండర్, ఆమె సహచరుడిపై కత్తితో దాడిచేశాడు. సెంట్రల్ ఢిల్లీలోని పహర్‌గంజ్ ప్రాంతం, ముల్తానీ దాంద్రాలో శుక్రవారం జరిగిన ఈ ఘటనలో ట్రాన్స్‌జెండర్ పార్ట్నర్ మృతి చెందాడు. సెంట్రల్ ఢిల్లీ డీసీపీ స్వేతా చౌహాన్ తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫరుఖాబాద్కు చెందిన అనిల్‌కు ట్రాన్స్‌జెండర్‌కు 2020లో పరిచయం ఏర్పడింది. (చదవండి: డాక్టర్ సతీమణి అత్యుత్సాహం.. భర్త లేకపోవడంతో తానే వైద్యం, రోగి మృతి.. ఇద్దరూ పరార్!) వారిద్దరూ కలిసి బతుకుదాం అనుకున్నారు. ఆ సమయంలో ట్రాన్స్‌జెండర్‌కు రూ.40 వేలు అనిల్ అప్పుగా ఇచ్చాడు. అయితే, ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ.. టాన్స్‌జెండర్ అనిల్ వద్ద నుంచి వెళ్లి పోయి ప్రస్తుత పార్ట్నర్తో కలిసి ఉంటోంది. ఈ విషయమై పలుమార్లు అనిల్ వారిద్దరినీ హెచ్చరించాడు. తనను మోసం చేసినవారి అంతుచూస్తాననని బెదిరించాడు. ఈక్రమంలో ఘటన జరిగిన రోజు రాత్రి నిందితుడు టాన్స్‌జెండర్ ఉంటున్న ఇంటికి వెళ్లాడు. తన వద్ద తీసుకున్న రూ.40 వేలు చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఆ సమయంలో ఇంట్లో ఆమె పార్ట్నర్ కూడా ఉన్నాడు. వారిమధ్య మాటామాటా పెరడంతో ఘర్షణ చెలరేగింది. అనిల్ కత్తితో వారిద్దరిపై దాడి చేశాడు. అనంతరం అక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. స్థానికులు అప్రమత్తపై అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తీవ్ర గాయాలపాలైన బాధితులను ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ట్రాన్స్‌జెండర్ పార్ట్నర్ ప్రాణాలు కోల్పోయాడు. అనిల్‌పై పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని డీసీపీ తెలిపారు. (చదవండి: ‘ఇది జైలు కాదు.. కోవిడ్ ఐసోలేషన్ వార్డ్’.. హర్ష గోయెంకా ట్వీట్) -
అమానుషం.. కత్తులతో పొడిచి చంపుతుంటే వేడుక చూశారు!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరం నడిబొడ్డున దారుణ ఘటన వెలుగు చూసింది. శనివారం సాయంత్రం సుందర్ నగరి ప్రాంతంలో ఓ యువకుడిని ముగ్గురు దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. సాయంత్రం 7.40 గంటల సమయంలో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. కత్తి పోట్లతో తీవ్ర రక్తస్రావమై మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ దారుణానికి పాల్పడుతున్న సమయంలో ఆ పక్కనే పలువురు వ్యక్తులు ఉన్నా.. చీమకుట్టినట్లు కూడా స్పందించకపోవటం గమనార్హం. బాధితుడు సుందర్ నగరికి చెందిన మనీశ్‌గా గుర్తించారు. పాత పగలతోనే యువకుడిని హత్య చేసి ఉంటారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో భారీగా బలగాలను మోహరించారు. ముగ్గురు రాక్షసులు కత్తులతో దారుణంగా పొడుస్తున్న దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. ముందు బాధితుడితో పాటు నిందితులు మాట్లాడుతూ వచ్చారు. ఆ కొద్ది సేపటికే అతడిపై దాడి చేసేందుకు యత్నించగా పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ, ముగ్గురు ఉండటంతో వారి నుంచి తప్పించుకోలేకపోయాడు. పథకం ప్రకారం కత్తులతో వచ్చిన దుండగులు.. విచక్షణారహితంగా ఇష్టం వచ్చినట్లు పొడిచారు. కింద పడిపోయిన తర్వాత కూడా.. వెనక్కి తిరిగి వచ్చి మరీ పొడుస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆ పక్కనే కొంత మంది కూర్చుని ఉన్నారు. ఒక వ్యాక్తిని దారుణంగా హత్య చేస్తున్నా.. వారిలో కొంచెం కూడా చలనం కలగలేదు. అలాగే.. చూస్తూ ఉండిపోయారు. ఈ పరిస్థితిని చూసిన పలువురు నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. మనిషన్నవాడు కనుమరుగవుతున్నాడని వాపోతున్నారు. ఈ కేసులో ముగ్గురు నిందితులు అలామ్, బిలాల్, ఫైజాన్‌లు సుందర్ నగరికి చెందినవారిగా గుర్తించామని, అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. A youth named Manish was stabbed to death in Sunder Nagri area of Delhi, 3 accused (Aalam, Bilal and Faizan) arrested by Delhi Police. pic.twitter.com/b6OS7v1s0k — Nikhil Choudhary (@NikhilCh_) October 1, 2022 ఇదీ చదవండి: ఫుట్‌బాల్ మైదానంలో తొక్కిసలాట.. 127 మంది దుర్మరణం -
షాకింగ్ ఘటన.. టెన్త్ విద్యార్థిని కత్తితో పొడిచి చంపిన క్లాస్మేట్స్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పదో తరగతి చదువుతోన్న 17 ఏళ్ల బాలుడిని ఐదుగురు తోటి విద్యార్థులు దారుణంగా పొడిచి హత్య చేశారు. క్లాస్మేట్స్ దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడిని.. ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాధిత విద్యార్థి దీపాన్షుగా గుర్తించారు. విద్యార్థి హత్యపై వివరాలు వెల్లడించారు డిప్యూటీ కమిషనర్(వాయవ్య) ఉషా రంగ్నాని. పోలీసుల వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 29న ఆదర్శ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు విద్యార్థిని కొంత మంది విద్యార్థులు కత్తులతో పొడిచినట్లు ఫోన్ వచ్చింది. ఆ వెంటనే సిబ్బంది అక్కడికి చేరుకుని ఐపీసీ సెక్షన్ 302, 307, 34 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఐదుగురు నిందితులతో బాధితుడు గొడవ పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఆ పగతో దీపాన్షును బటన్ నైఫ్‌తో పొడిచి హత్య చేశారు. ఆ ఆయుధాన్ని ఆన్లైన్లో కొనుగోలు చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ కెమెరాలను పరిశీలించినట్లు పోలీసులు తెలిపారు. లాల్ బాఘ్, ఆజాద్‌పుర్ ప్రాంతాలకు చెందిన ఐదుగురు జువైనల్‌లను ఘటన జరిగిన రెండు గంటల్లోనే అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఇదీ చదవండి: 42 కార్లతో పంజాబ్ సీఎం కాన్వాయ్.. ‘వీఐపీ కల్చర్’ అంటూ విమర్శలు! -
‘థ్యాంక్ యూ’ చెప్పలేదని పొడిచి చంపాడు..!
వాషింగ్టన్: చిన్న చిన్న గొడవలకే కొందరు సహనం కోల్పోతున్నారు. ఎదుటివారిపై దాడి చేసి వారి ప్రాణాలు పోయేందుకు కారణమవుతున్నారు. అలాంటి సంఘటనే అమెరికాలోని బ్రూక్లిన్‌లో వెలుగు చూసింది. ‘థ్యాంక్ యూ’ చెప్పలేదని మొదలైన వాగ్వాదం.. చిలికి చిలికి గాలివానగా మారి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయేందుకు దారి తీసింది. 37 ఏళ్ల వ్యక్తిని మరో వ్యక్తి కత్తితో పొడవటంతో తీవ్ర గాయాలై మృతి చెందాడు. పార్క్ స్లోప్‌లోని 4వ అవెన్యూ భవనం స్మోకింగ్ దుకాణం వద్ద ఈ గొడవ జరిగింది. ఈ సంఘటన స్థానిక సీసీటీవీ కెమెరాలో నమోదైంది. తెల్ల రంగు టీషర్ట్ ధరించిన బాధితుడు లోపలికి రాగా.. మరో వ్యక్తి డోర్ తెరిచాడు. అయితే, డోర్ తెరిచినందుకు కృతజ్ఞతలు తెలపకపోవటంపై లోపలి వ్యక్తి ప్రశ్నించాడు. దాంతో తాను తెరవాలని కోరలేదని, థ్యాంక్ యూ చెప్పనని స్పష్టం చేశాడు. దీంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి కొట్టుకునే వరకు వెళ్లింది. బయటకు వెళ్లిన నిందితుడు తన సైకిల్ పై ఉన్న కత్తిని తీసుకొచ్చి బెదిరించాడు. బాధితుడు వెనక్కి తగ్గకుండా రెచ్చగొట్టగా.. పొట్ట, మెడ భాగంలో కత్తితో దాడి చేశాడు నిందితుడు. తీవ్రంగా రక్తస్రావమైంది. న్యూయార్క్ ప్రెస్బిటేరియన్ బ్రూక్లిన్ మెథొడిస్ట్ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఇదీ చదవండి: టిక్‌టాక్ ప్రేమ.. భర్తకు ప్రియురాలితో పెళ్లి చేసిన భార్య -
Live Video: మున్సిపల్ ఆఫీస్ ముందే యువకుడి దారుణ హత్య
భోపాల్: పాత పగలతో హక్కుల పోరాట విభాగం కర్ణీ సేనాకు చెందిన 28 ఏళ్ల యువకుడిని కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. అంతా చూస్తుండగానే కత్తులతో పలుమార్లు పొడిచారు. ఈ సంఘటన గత శుక్రవారం రాత్రి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగింది. ఇటార్సిలోని కర్ణీ సేనా టౌన్ సెక్రెటరీ రోహిత్ సింగ్ రాజ్‌పుత్‌ను.. స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం ముందే ముగ్గురు దారుణంగా పొడిచారు. రోహిత్‌ను కాపాడేందుకు యత్నించిన ఆయన స్నేహితుడు సచిన్ పటేల్‌పైనా కత్తులతో దాడి చేశారు. రక్తపు మడుగులో పడివున్న ఇరువురిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోనే రాజ్‌పుత్ ప్రాణాలు కోల్పోగా.. పటేల్ పరిస్థతి విషమంగా ఉంది. పాత పగలతోనే రోహిత్ సింగ్ రాజ్‌పుత్‌ను హత్య చేసినట్లు ఇటార్సి పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ ఆర్ఎస్ చౌహాన్ తెలిపారు. ప్రధాన నిందితుడు 27 ఏళ్ల రాను అలియాస్ రాహుల్‌గా చెప్పారు. ‘బాధితుడు, అతడి స్నేహితుడు మార్కెట్లోని ఓ టీ షాప్ ముందు నిలుచుని ఉన్నారు. బైక్‌లపై ముగ్గురు వ్యక్తులు అక్కడికి వచ్చారు. వారితో గొడవకు దిగారు. ఈ క్రమంలోనే అందులోని ఓ వ్యక్తి కత్తి తీసి రాజ్‌పుత్‌పై దాడి చేశాడు. ముగ్గురు నిందితులు రాహుల్ రాజ్‌పుత్, అంకిత్ భట్, ఐషు మాలవియాలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచాం.’ అని తెలిపారు ఎస్సై. కర్ణీ సేన సభ్యుడి హత్య నేపథ్యంలో నిందితుల్లో ఒకడైన అంకిత్ భట్ నివాసాన్ని అధికారులు కూల్చేసినట్లు స్థానికులు తెలిపారు. మిగిలిన ఇద్దరి ఇళ్లను సైతం కూల్చేందుకు అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలిసింది. అదే ప్రాంతంలో ఐదు రోజుల క్రితం ఓ బ్యాంకు ఉద్యోగిపై ఐదుగురు దుండగులు దాడి చేశారు. దీనిపై మాజీ స్పీకర్, బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ సితాశరన్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. A 28-year-old member Karni Sena was publicly stabbed to death on Friday night in Itarsi allegedly over an old dispute. His friend, Sachin Patel, was also stabbed when he tried to save him. @ndtv @ndtvindia pic.twitter.com/MR0PYkI5ss — Anurag Dwary (@Anurag_Dwary) September 4, 2022 ఇదీ చదవండి: ఎంత పని చేశావు తల్లీ! తన కొడుకుకంటే ఎక్కువ మార్కులు వచ్చాయని.. -
అయ్యో పాపం.. రోటీ ఇవ్వలేదని కత్తితో పొడిచి చంపేశాడు
న్యూఢిల్లీ: తినేందుకు రోటీ ఇవ్వలేదనే కోపంతో ఓ వ్యక్తిని కత్తితో పొడిచి చంపిన సంఘటన ఢిల్లీలో కలకలం సృష్టించింది. కరోల్ బాఘ్ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. ‘రిక్షాలో ఇద్దరు వ్యక్తులు భోజనం చేస్తున్నారు. ఫూటుగా మద్యం తాగిన మరో వ్యక్తి అక్కడికి వచ్చాడు. తనకు భోజనం పెట్టాలని అడిగాడు. 40 ఏళ్ల మున్నా అనే వ్యక్తి రోటీ ఇచ్చాడు. మరో రోటీ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అందుకు మున్నా నిరాకరించాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో తన వద్ద ఉన్న కత్తిని తీసి మున్నాను పొడిచాడు.’ అని డిప్యూటీ కమిషనర్ శ్వేతా చౌహాన్ తెలిపారు. తీవ్రంగా గాయపడిన బాధితుడు మున్నాను ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తరలించారు. అయితే.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. నిందితుడు ఆగ్రాకు చెందిన 26 ఏళ్ల ఫెరోజ్ ఖాన్‌గా గుర్తించారు. కరోల్ బాఘ్‌లోని ఓ పార్క్‌లో నిద్రిస్తున్న ఖాన్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: ‘గూగుల్’లో జాబ్ కొట్టటమే లక్ష్యం.. 40వ యత్నంలో సఫలం! -
హారన్ కొడితే తప్పుకోలేదని.. బధిరుడిని కత్తితో పొడిచి చంపిన బాలిక
రాయ్‌పూర్: పదేపదే హారన్ కొట్టినా తన స్కూటీకి దారివ్వలేదని ఆగ్రహించిన ఓ బాలిక సైకిల్‌పై వెళ్తున్న బధిరుడిని కత్తితో పొడిచి చంపేసింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పూర్‌లోని కంకాలిపార ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకుంది. బాలికను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ బాలిక(15) తన తల్లిని తీసుకుని స్కూటీపై వెళుతోంది. సైకిల్ తొక్కుకుంటూ ముందు వెళ్తున్న సదామా లదేర్(40) అడ్డురావడంతో హారన్ కొట్టింది. బధిరుడైన సుదామ హారన్ వినిపించక పక్కకు తప్పుకోలేదు. హారన్ ఎన్నిసార్లు మోగించినా నిర్లక్ష్యంగా వెళ్తున్నాడనే కోపంతో బాలిక స్కూటీని ఆపి, అతడిపై కేకలు వేసింది. ఆపైన తన వద్ద ఉన్న చాకుతో అతడి మెడపై పొడిచింది. అనంతరం తల్లిని అక్కడే వదిలేసి స్కూటీతో పరారైంది. తీవ్ర రక్తస్రావమైన సుదామ ఆస్పత్రికి వెళ్లేలోగానేతీసుకెళ్తుండగానే చనిపోయాడు. ఇదీ చదవండి: జ్యూస్‌లో మత్తు మందు కలిపి అత్యాచారం -
ముస్లిం యువతిని ప్రేమించడమే ఆ యువకుడికి శాపమైందా?
బెంగళూరు: వేరే మతానికి చెందిన అమ్మాయిని ప్రేమించడమే ఆ యువకుడి పాపమైంది. ప్రేమించిన అమ్మాయితో జీవితాంతం సంతోషంగా ఉండాలనుకున్న అతని ఆశాలు అడియాశాలయ్యాయి. ఎంతో అందంగా ఊహించుకున్న భవిష్యత్తును మధ్యలోనే సమాధి చేశారు. ఎదిగి వచ్చిన కొడుకును దూరం చేసి కన్నతల్లికి కడుపుకోత మిగిల్చారు. ముస్లిం యువతితో సన్నిహితంగా ఉంటున్నాడని దళిత యువకుడిని హత్య చేశారు. ఈ అమానుష ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. కాలబురాగి(గుల్బర్గా) వాడిటౌన్‌లోని భీమా నగర్లో లేఅవుట్లో నివిస్తున్న 25 ఏళ్ల విజయ్ కాంబ్లే, ముస్లిం యువతిని ప్రాణంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ ప్రేమ విషయం యువతి కుటుంబ సభ్యులకు నచ్చలేదు. తన సోదరితో దూరంగా ఉండాలని యువతి సోదరులు విజయ్ను పలుమార్లు హెచ్చరించారు. అయినా యువకుడి ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో ఎలాగైనా విజయ్ను అంతమొందించాలని ముస్లిం యువతి కుటుంబ సభ్యులు పథకం పన్నారు. ఈ క్రమంలో శుక్రవారం విజయ్ను అడ్డగించి కత్తితో పొడిచి చంపి అక్కడి నుంచి పరారయ్యారు. చదవండి: Hyderabad: ప్రియురాలిపై మాజీ ప్రియుడి ఘాతుకం.. నడిరోడ్డుపై తన కుమారుడిని ముస్లిం యువతి సోదరులే హత్య చేశారని మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులు షాహుద్దీన్, నవాజ్ అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరితోపాటు ఇరు కుటుంబ సభ్యులను కూడా విచారిస్తున్నారు. అయితే యువతి సోదరులు తమ కొడుకును పలుమార్లు బెదిరించారని మృతుడి తల్లి పేర్కొంది. తన చెల్లెలితో రిలేషన్‌షిప్‌ను వదులుకోవాలని లేకుంటే చంపేస్తామని బెదిరించినట్లు తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ‘విజయ్‌కు ఫోన్ కాల్ రావడంతో ఇంటినుంచి బయటకు వెళ్లిపోయాడు. తను ఎవరితో మాట్లాడాడో కూడా నాకు తెలీదు. తరువాత విజయ్ను ఎవరో కొట్టారని మాకు కాల్ వచ్చింది. వెంటనే తన వద్దకు పరిగెత్తాము. అప్పటికే మా అబ్బాయి మెడపై కత్తితో పొడిచి చంపారు. ఈ సంఘటనకు ముందు ఎలాంటి గొడవలు జరగలేదు. యువతి సోదరుడు మాత్రం ఒకసారి ఇంటికొచ్చి.. ‘నీ కొడుక్కి మంచి బుద్ధులు నేర్పించు. లేకపోతే తన తల నరికి నీకు అప్పగిస్తాం’ అని బెదిరించి వెళ్లాడు’ అని విజయ్ తల్లి చెబుతూ కన్నీటి పర్యంతమైంది. చదవండి: లైంగిక ఆరోపణలు.. మనస్తాపంతో మాజీ మంత్రి ఆత్మహత్య -
నిజామాబాద్‌లో దారుణం.. మద్యం తాగాక ఫోన్.. రూ.వెయ్యి తక్కువ ఇచ్చాడని..
నిజామాబాద్ అర్బన్: నగరంలోని దుబ్బ ప్రాంతంలో గత రెండు రోజుల కిందట జరిగిన హత్య వివరాలను ఏసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. నగరంలోని తన ఛాంబర్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేవలం వెయ్యిరూపాయల కోసం జరిగిన గొడవలో యువకుడు హత్యకు గురైనట్లు తెలిపారు. బాన్సువాడ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన మహ్మద్ వసీమోద్దీన్, షేక్‌సమీయోద్దీన్ ఇద్దరూ అన్నదమ్ముళ్ల పిల్లలు. వీరు నిజామాబాద్‌లోని ముస్తాఫా ఫ్లవర్ మర్చంట్‌లో పనికోసం చేరారు. ముస్తఫా వద్ద వసీయోద్దీన్ రెండు సంవత్సరాల క్రితం సమీయోద్దీన్ సమక్షంలో రూ.45వేలు అప్పుగా తీసుకున్నారు. వసీయోద్దీన్ పనిమానివేయడంతో తన డబ్బులు తిరిగి ఇవ్వాలని ముస్తఫా డిమాండ్ చేశారు. దీంతో ఈనెల 24న వజీయోద్దీన్ ఒక్కడే ముస్తాఫా వద్దకు వెళ్లి రూ.44వేలు కట్టాడు. అనంతరం వసీయోద్దీన్, సమీయోద్దిన్ కాలూరు చౌరస్తాకు వెళ్లి అక్కడ మద్యం కొనుగోలు చేసి తాగారు. (చదవండి: ‘నుడా’ మాస్టర్ ప్లాన్‌కు ప్రభుత్వం ఆమోదం.. ప్లాన్‌లోకి వచ్చిన గ్రామాల జాబితా ఇదే!) అంతలోనే మజాస్ అనే వ్యక్తి సమీయోద్దీన్‌కు ఫోన్‌చేసి రూ.45వేలకుగాను రూ.44వేలు మాత్రమే చెల్లించాడని, రూ.వెయ్యి తక్కువగా ఇచ్చాడని తెలిపాడు. దీంతో డబ్బులు ఎందుకు తక్కువ ఇచ్చావంటూ వసీయోద్దీన్, సమీయోద్దీన్‌ల మధ్య గొడవ జరిగింది. ఈక్రమంలో వసీయోద్దీన్ తన వద్ద ఉన్న కత్తితో సమీయోద్దీన్‌ను ఇష్టంవచ్చినట్లు పోడిచాడు. గొడవను అలీం ఆపేందుకు ప్రయత్నంచేయగా అతన్ని కూడా చంపుతానని బెదిరించాడు. వెంటనే అలీం పారిపోయాడు. సమీయోద్దీన్ అక్కడికక్కడే మరణించాడు. వసీయోద్దీన్ పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న వసీయోద్దీన్‌ను నిజాంసాగర్ బస్టాండ్‌లో పట్టుకొని విచారించారు. హత్యచేసినట్లు అతడు ఒప్పుకోవడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో సీఐ కృష్ణ, ఎస్సై భాస్కరచారి, తదితరులు పాల్గొన్నారు. (చదవండి: మెను ఏదైనా నోరు ఊరాల్సిందే.. అట్లుంటది టేస్ట్ మరి!) -
మాజీ కార్పొరేటర్ దారుణ హత్య.. ఖండించిన సీఎం
సాక్షి, బెంగళూరు: ఉద్యాననగరిలో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. చలవాదిపాళ్య వార్డు(138) బీజేపీకి చెందిన మాజీ మహిళా కార్పొరేటర్ రేఖాకదిరేశ్(40)పై గురువారం దుండగులు మరణాయుధాలతో దాడిచేసి హత్యకు పాల్పడ్డారు. రేఖాకదిరేశ్ ప్లవర్‌గార్డెన్‌లో నివాసం ఉంటుంది. పార్టీ ఆధ్వర్యంలో అన్నదానం ఉండటంతో గురువారం ఉదయం 9.30 సమయంలో చలవాదిపాళ్యలో ఉన్న బీజేపీ కార్యాయానికి వెళ్లారు. 10.30 సమయంలో ముగ్గురు దుండగులు వచ్చి బయటకు పిలిచి ఒక్కసారిగా ఆమెపై మారణాయుధాలతో దాడి చేసి ఉడాయించారు. చిక్కపేట ఏసీపీ, కాటన్‌పేట పోలీసులు వచ్చి బాధితురాలిని కెంపేగౌడ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలికి కుమారడు, కుమార్తె ఉన్నారు. కాగా టెండర్ వివాదంలో 2018లో రేఖా భర్త కదిరేశ్ హత్యకు గురయ్యారు. ఆ కేసుకు సంబంధించి శోభన్ అతడి అనుచరులు కోర్టులో లొంగిపోయారు. ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యారు. ఇదిలా ఉండగా రేఖాకదిరేశ్ హత్యకు సంబంధించి పీటర్ అనే వ్యక్తితోపాటు ఒక మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. టెండర్లు, పాతకక్షలే హత్యకు కారణమని చెబుతున్నారు. హంతకులు తమను గుర్తు పట్టకుండా రేఖాకదిరేష్ ఇంటి వద్ద సీసీకెమెరాలను పైకి తిప్పారు. అదనపు పోలీస్‌కమిషనర్ మురగన్‌తో కలిసి పశి్చమవిభాగ డీసీపీ సంజీవ్‌పాటిల్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హంతకుల ఆచూకీకోసం మూడు ప్రత్యేకబృందాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేస్తాం: సీఎం రేఖాకదిరేశ్ హంతకులను 24 గంటల్లోగా అరెస్ట్ చేస్తామని ముఖ్యమంత్రి బీఎస్.యడియూరప్ప తెలిపారు. కంటోన్మెంట్ రైల్వేస్టేషన్ నుంచి గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రేఖాకదిరేశ్ హత్యకేసుకు సంబందించి ఇప్పటికే నగరపోలీస్‌కమిషనర్‌తో మాట్లాడినట్లు తెలిపారు. నిందితులు ఎక్కడ దాక్కున్నా గుర్తించి అరెస్ట్ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. చదవండి: అమానుషం: వీధి శునకం పెంపుడు కుక్కపై దాడి చేసిందని.. -
ఘోరం: తండ్రి బర్త్‌డే కేక్ కోసం బయటకొచ్చిన యువకుడిని..
న్యూఢిల్లీ: తండ్రి పుట్టినరోజును ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేయాలనుకున్నాడు ఓ యువకుడు. కేక్ తీసుకొచ్చేందుకు బయటకు వచ్చాడు. అయితే అంతలోని కొందరు దుండగులు అతనిపై దాడి చేసి కత్తితో పొడిచి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘోర ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలన్నీ సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. దక్షిణ ఢిల్లీలోని అంబేద్కర్ నగర్లో తన తండ్రి బర్త్‌డే కోసం కేక్ కొనేందుకు 19 ఏళ్ల కునాల్ అనే యువకుడు రోడ్డు మీదకు వచ్చాడు. ఇంతలోనే ఓ నలుగురు వ్యక్తులు అతనిని చుట్టుముట్టి దాడికి తెగబడ్డారు. బాధితుడి ఛాతీ, వీపు, పొత్తి కడుపులో పొడిచి హతమార్చారు. అనంతర అక్కడి నుంచి పరారయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడిని ఆసుపత్రికి తరలించగా.. అంతలోనే మరణించినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఈ ఘటనపై కుటుంబ సభ్యలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసుల నమోదు చేసి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. కాగా ఓ యువతి విషయంలో వీరి మద్య తరుచూ గొడవలు జరుగుతున్నాయని పోలీసులు తమ విచారణలో తేలిందన్నారు. నిందితుడు గౌరవ్, బాధితుడు కునాల్ ఇద్దరూ ఒకే అమ్మాయిని లవ్ చేస్తున్నారని, దీంతో ఇద్దరి మధ్య శత్రుత్వం ఏర్పడిందన్నారు. అనంతరం నిందితులు కునాల్‌పై కోపంతో దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. హత్యకు ఉపయోగించిన రెండు కత్తులను ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఆన్లైన్లో కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. నలుగురు నిందితులపై హత్యకేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: సీఎంపై అసభ్యకర పోస్టులు పెట్టిన ఇద్దరు అరెస్టు Cyber Crime: పిన్ని స్నానం చేస్తుండగా వీడియో తీసిన బాలుడు.. ఆపై -
ప్రియురాలిని బీరు సీసాతో పొడిచి చంపిన ప్రేమోన్మాది
సాక్షి, నల్గొండ: ఓ ప్రేమోన్మాది మద్యం మత్తులో చెలరేగిపోయాడు. పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలిని అతి దారుణంగా హతమర్చాడు. ఈఘటన నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ శివం హోటల్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ప్రియురాలు చందనను శంకర్ బీరు సీసాతో పొడిచి చంపినట్టు తెలుస్తోంది. చందన పెళ్లికి నిరాకరించడంతోనే శంకర్ ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. నిందితుడు శంకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు మొదలుపెట్టారు. -
‘రోజూ నరకం చూపేవాడు.. కసితీరా పొడిచి చంపేశా’
గాంధీనగర్: నిండా పదిహేనేళ్లు కూడా లేవు.. లోకం పోకడ గురించి తెలియదు. చదువుకుంటూ.. స్నేహితులతో కలిసి.. సంతోషంగా గడపాల్సిన ఆ కుర్రాడు హంతకుడిగా మారాడు. క్షణికావేశంలో తల్లి చేసిన తప్పు ఆ కుర్రాడి జీవితాన్ని గందరగోళం చేసింది. ఆ వివరాలు.. గుజరాత్ అహ్మదాబాద్‌కు చెందిన నిందితుడి తల్లి.. చాలా ఏళ్ల క్రితమే ప్రియుడితో కలిసి పారిపోయింది. కొద్ది రోజులు తర్వాత ప్రియుడి నిజ స్వరూపం బయటపడింది. చీటికి మాటికి ఆమెతో గొడవపడుతూ.. చికతబాదేవాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆమె మైనర్ కుర్రాడిని కూడా కొట్టేవాడు. ప్రతి రోజు చిత్ర హింసలకు గురి చేసేవాడు. ఈ బాధ భరించలేకపోయిన నిందితుడు.. తల్లి ప్రియుడ్ని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో మే 17న అతడిని తీసుకుని బైక్ మీద నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లాడు. ఆ తర్వాత కత్తితో అతడిపై దాడి చేశాడు. ఆ తర్వాత అతడు మరణించేవరకు కత్తితో పొడుస్తూనే ఉన్నాడు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక.. అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేశారు. ఇక దర్యాప్తులో మైనర్ బాలుడి పేరు వెలుగులోకి రావడంతో.. కుర్రాడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో నిందితుడు.. చనిపోయిన వ్యక్తి ప్రతి రోజు తనను, తల్లిని చిత్ర హింసలకు గురి చేసేవాడని.. నరకం చూపేవాడని.. అందుకే అతడిని హత్య చేశానని అంగీకరించాడు. చదవండి: ‘అతని వల్లే నా భర్త వదిలేశాడు.. ప్రియుడు పెళ్లి చేసుకోవాలి’ -
ఫ్యాన్సీ స్టోర్‌లో చొరబడి.. కత్తులతో పొడిచి మహిళ హత్య
కోలారు: ఫ్యాన్సీస్టోర్ నిర్వాహకురాలిని దుండగులు పట్టపగలే కత్తులతో పొడిచి హత్య చేసి ఉడాయించారు. ఈఘటన కోలారు నగరంలోని మహాలక్ష్మీ లేఅవుట్లో బుధవారం చోటు చేసుకుంది. కోలారు తాలూకాలోని నాగనాయకనహళ్లి గ్రామానికి చెందిన నీలవేణి (29) మహిలక్ష్మీ లే అవుట్లో నివాసం ఉంటోంది. అక్కడే ఫ్యాన్సీ స్టోర్ నిర్వహిస్తోంది. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉదయం ఫ్యాన్సీస్టోర్‌లోకి వచ్చిన నీలవేణి.. సామగ్రిని సర్దుకుంటుండగా దుండగులు ఒక్కసారిగా లోపలకు చొరబడ్డారు. కత్తులతో మహిళ మెడపైనా ఇతర భాగాల్లో పొడిచి ఉడాయించారు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. నగర పోలీసులు వేలిముద్ర నిపుణులు, డాగ్‌స్క్వాడ్‌తో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. సమీపంలోని సీసీకెమెరాలను పరిశీలించగా ముగ్గురు దుండగులు ఫ్యాన్సీస్టోర్‌లోకి చొరబడిన దృశ్యాలు కనిపించాయి. అనంతరం మృతదేహాన్ని కోలారు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి హంతకుల కోసం వేట ప్రారంభించారు. చదవండి: 26 కత్తి పోట్లు: ‘దగ్గరకు వచ్చారో మీకు ఇదే గతి’ -
26 కత్తి పోట్లు: ‘దగ్గరకు వచ్చారో మీకు ఇదే గతి’
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పట్టపగలు దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ వ్యక్తి భార్యపై అమానుషంగా కత్తితో దాడి చేసి చంపేశాడు. కాపాడ్డానికి ప్రయత్నించిన వారిని దగ్గరకు రావద్దు.. వస్తే మీకు ఇదే గతి పడుతుంది అంటూ హెచ్చరించాడు. దాంతో జనాలు చూస్తూ నిలబడి పోయారు. ఆ వివరాలు. ఢిల్లీకి చెందిన హరీశ్, భార్యతో కలిసి బుధ్ విహార్ ప్రాంతంలో మ్యారేజీ బ్యూరో నిర్వహిస్తూ ఉండేవాడు. అయితే గత కొద్ది రోజులుగా అతడు భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఆమెకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని అనుమానించసాగాడు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం భార్యభర్తల మధ్య దీనికి సంబంధించి వివాదం రాజుకుంది. అది కాస్త ముదరడంతో ఆగ్రహంతో ఊగిపోయిన హరీశ్.. భార్యపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. భర్త నుంచి తప్పించుకోవడం కోసం ఆమె ఇంటి నుంచి బయటకు పరిగెత్తింది. ఆమెను వెంబడించిన హరీశ్.. నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే.. ఆమెపై కత్తితో దాడి చేశాడు. సుమారు 26 సార్లు భార్యను కత్తితో పొడిచాడు. ఇది గమనించిన చుట్టుపక్కల వారు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. దాంతో హరీశ్ ‘‘దగ్గరకు రావద్దు.. వస్తే మీకు ఇదే గతి పడుతుందని’’ హెచ్చరిస్తూ.. తన దుశ్చర్యను కొనసాగించాడు. భార్య మరణించిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హరీశ్‌పై కేసు నమోదు చేశారు. చదవండి: దారుణం: భార్యను పొడిచి, ఆపై కారుతో... -
‘ఇంట్లో రాక్షసులు: చంపి గుండెని కోసి కూర వండాడు’
వాషింగ్టన్: కొన్ని రకాల నేరాలు.. వాటికి పాల్పడిన వ్యక్తుల్ని చూస్తే.. మనుషుల్లో ఇంత రాక్షసత్వం దాగి ఉంటుందా.. ఇంత క్రూరంగా.. దారుణంగా ఓ మనిషిని చంపగలరా అనే అనుమానం, భయం కలుగుతాయి. వారిని తిట్టడానికి.. వారి చేష్ట గురించి వివరించడానికి ఏ భాష సరిపోదు. తాజాగా ఇలాంటి భయానక ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి అత్యంత పాశవీకంగా ఒకరిని చంపి.. గుండెని పెకిలించి.. దాన్ని కూర వండిన పైశాచిక చర్య వెలుగు చూసింది. నేరస్తుడు చెప్పిన విషయాలు విన్న పోలీసులకే వెన్నులో ఒణుకు వచ్చింది. ఓక్లహోమాలో చోటు చేసుకున్న ఈ భయానక దారుణం వివరాలు.. లారెన్స్ పౌల్ ఆండర్సన్ వ్యక్తి డ్రగ్స్ కేసులో దాదాపు 20 ఏళ్ల పాటు జైలులో గడిపి కొన్ని వారాల కిందటే విడుదలయ్యాడు. ఈ క్రమంలో రెండు వారాల క్రితం అతడు తన ఇంటి పక్క వ్యక్తిని కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత మరణించిన వ్యక్తి గుండెని బయటకు తీసి.. దాన్ని తన అంకుల్ వాళ్ల ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ గుండెని కోసి.. ఆలుగడ్డలతో కలిపి కూర వండాడు. ఆ తర్వాత అంకుల్ కుటుంబ సభ్యుల చేత దాన్ని తినిపించాలని భావించాడు. ఇతడి వికృత చేష్టలు చూసిన పౌల్ అంకుల్, అతడి కుటుంబ సభ్యులు భయపడి ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దాంతో పౌల్ అతడి అంకుల్ని, వారి నాలుగేళ్ల కుమార్తెని చంపేశాడు. అంకుల్ భార్యని చిత్రహింసలకు గురి చేశాడు. ఆమె ఎలానో తప్పించుకుని.. బయటపడగలిగింది. స్థానికులు ఆమెని ఆస్పత్రిలో చేర్చారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఓక్లహోమా పోలీసులు పౌల్‌ని అరెస్ట్ చేశారు. విచారణలో అతడు విస్తుపోయే అంశాలు వెల్లడించాడు. తన అంకుల్ ఇంట్లో రాక్షసులు ఉన్నారని.. వారిని తరమడం కోసం.. గుండెని వండి వారితో తినిపించాలని భావించాను అన్నాడు. కానీ వారు అంగీకరించకపోవడంతో చంపేయాల్సి వచ్చిందని తెలిపాడు. లేదంటే ఆ రాక్షసులు అంకుల్ కుటుంబాన్ని పీడించి.. వారిని ఆవహించి.. జనాలను చంపేసేవారు అన్నాడు పౌల్. చదవండి: కిడ్నాప్ డ్రామా ఆడి అడ్డంగా బుక్కయ్యాడు టిక్‌టాక్‌లో.. కాస్ట్లీ మిస్టేక్! -
వరుడి హత్య.. పరారీలో ఐదుగురు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. పెళ్లై 24 గంటలు కూడా గడవకముందే వరుడు దారుణ హత్యకు గురయ్యాడు. సరిపడా మద్యం పొయ్యలేదనే కారణంతో స్నేహితులే వరుడిని పొడిచి చంపేశారు. వివరాలు.. ఉత్తరప్రదేశ్ పాలిముకిమ్ పూర్ గ్రామానికి చెందిన బబ్లూ(28) అనే వ్యక్తికి సోమవారం వివాహం జరిగింది. స్నేహితుల కోసం ప్రత్యేకంగా విందు ఏర్పాడు చేశాడు. వివాహం పూర్తయిన తర్వాత రాత్రి తన స్నేహితులను కలుద్దామని వెళ్లాడు బబ్లూ. అప్పటికే ఫుల్లుగా తాగి ఉన్న అతడి స్నేహితులు తమకు మరింత మద్యం కావాలని బబ్లూని అడిగారు. అందుకు అతడు అంగీకరించకపోవడంతో వారి మధ్య గొడవ ప్రారంభం అయ్యింది. మాట మాట పెరిగింది. (వధువును పట్టుకులాగిన వరుడి ఫ్రెండ్స్: పెళ్లి క్యాన్సిల్) అప్పటికే ఫుల్లుగా తాగి ఉన్న బబ్లూ స్నేహితులు విచక్షణ కోల్పోయి కత్తితో అతడిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ బబ్లూని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ఈలోపే అతడు మరణించాడు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఇక ఈ ఘటనలో ప్రధాన నిందితుడు రామ్‌ఖిలాడ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. -
భార్యను హతమార్చి.. పక్కనే వీడియో గేమ్ ఆడుతూ!
జోధ్‌పూర్: కట్టుకున్న భార్యను కత్తెరతో పాశవికంగా పొడిచి హతమార్చాడు ఓ ప్రబుద్ధుడు. భార్యను అతి కిరాతకంగా చంపడమే కాకుండా మృతదేహాన్ని పక్కనే పెట్టుకొని మొబైల్లో వీడియో గేమ్ ఆడటం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ దారుణ ఘటన రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. విక్రమ్ సింగ్(35) అనే వ్యక్తి, భార్య శివ కన్వర్ (30)తో కలసి బీజేస్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. విక్రమ్‌కు ఏ ఉద్యోగం లేకపోవడంతో భార్యతో తరుచుగా గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి భార్యభర్తల మధ్య చిన్న గొడవ మొదలై అది కాస్తా తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. దీంతో కోపం పట్టలేని విక్రమ్ సింగ్ ఇంట్లోని కత్తెరతో భార్యను పదే పదే పొడుస్తూ హత మార్చాడు. అనంతరం పోలీసులు, అత్త మామలకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకునే సరికి భార్య రక్తపు మడుగుల్లో పడి ఉండగా.. మృతదేహం పక్కనే నిందితుడు వీడియో గేమ్ అడుతూ కనిపించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ దంపతులకు ఇద్దరూ పిల్లలు ఉన్నట్లు, సంఘటన జరిగిన సమయంలో వారు ఇంట్లో లేరని సీనియర్ పోలీస్ అధికారి కైలస్దాన్ వెల్లడించారు. -
టీవీ రిపోర్టర్ దారుణ హత్య
చెన్నై: అక్రమాలను ప్రశ్నించినందుకు ఓ యువ జర్నలిస్టును కొందరు దుండగులు దారుణంగా హతమార్చారు. తమిళనాడులోని కాంచీపురం జిల్లాలోని కుండ్రత్తూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ పోరంబోకు భూమిని అక్రమంగా అమ్ముతున్న కొందరికి వ్యతిరేకంగా మోజెస్ (26) కొంతకాలంగా వార్తలు రాస్తుండటమే ఈ హత్యకు కారణంగా తెలిసింది. ప్రభుత్వ భూమిని అమ్మి సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు గతంలో పలుమార్లు మోజెస్‌ను బెదిరించారు. తమ దారికి అడ్డు రావొద్దన్ని హెచ్చరించారు. ఈక్రమంలోనే ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో మోజెస్‌ను ఇంటి నుంచి రప్పించిన దుండగులు అతన్ని కత్తులతో నరికి చంపేశారు. అతని శరీరంపై 18 కత్తి పోట్లు ఉన్నాయని వైద్యులు తెలిపారు. జర్నలిస్టు హత్య కేసులో ఇప్పటివరకు నలుగురిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. మోజెస్ స్థానికంగా ఓ తమిళ టీవీలో రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడు. అతని తండ్రి కూడా జర్నలిస్టు కావడం విశేషం. -
అమెరికాలో హైదరాబాదీ దారుణ హత్య
వాషింగ్టన్ : అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన 37ఏళ్ల వ్యక్తి గుర్తు తెలియని దుండగుల చేతిలో హత్యకు గురయ్యాడు. వివరాలు.. పాతబస్తీ చంచల్ గూడాకు చెందిన మహ్మద్ ఆరిఫ్ మోహియుద్దీన్ అనే వ్యక్తి గత పది సంవత్సరాలుగా జర్జియాలో నివాసముంటున్నాడు. అక్కడ స్థానికంగా కిరణా దుకాణం ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఇంటి వద్ద ఉన్న ఆరిఫ్పై కొంతమంది దుండగులు దాడి చేసి అనంతరం కత్తితో విచక్షణ రహితంగా పొడిచి హత్య చేశారు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న అరిఫ్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ దృశ్యాలన్ని సీసీ టీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. చదవండి: కుటుంబంలో చిచ్చు రేపిన కలహాలు ఈ విషయాన్ని హైదరాబాద్‌లోని ఆరిఫ్ కుటుంబ సభ్యులకు జార్జియా పోలీస్ అధికారులు సమాచారం అందించారు. దీంతో తను, తన తండ్రి అత్యవసర వీసాపై అమెరికా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని భారత ప్రభుత్వాన్ని ఆరిఫ్ భార్య మెహ్నాజ్ ఫాతిమా వేడుకున్నారు. యూఎస్‌లో తమకు ఎలాంటి బంధువులు లేరని, భర్త అంత్యక్రియలు నిర్వహించడానికి అక్కడకు వెళ్లేందుకు ప్రభుత్వం సాయం చేయాలని కోరారు.అదే విధంగా ఆదివారం ఉదయం 9 గంటలకు తన భర్తతో మాట్లాడినట్లు, అతను అరగంటలో తిరిగి కాల్ చేస్తానని చెప్పినట్లు ఫాతిమా తెలిపారు. చదవండి: విషాదం: నీ వెంటే మేమూ! కానీ అతని నుంచి ఎలాంటి ఫోన్ రాలేదని కొంత సమయానికి తన భర్తను ఎవరో పొడిచి చంపినట్లు బావ ద్వారా తెలిసిందన్నారు. జార్జియాలోని ఆసుపత్రిలో ఉన్న భర్త మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు అక్కడ కుటుంబ సభ్యులు ఎవరూ లేరని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా తెలంగాణకు చెందిన పార్టీ మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఏంబీటీ) ప్రతినిధి ఉల్లా ఖాన్ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తోపాటు అమెరికాలోని భారత రాయబార కార్యాలయానికి ఫాతిమాను యూఎస్ పంపించాలని కోరుతూ కుటుంబం తరపున లేఖ రాశారు. . -
మర్డర్ కేసు.. మాజీ ఎమ్మెల్యే కుమారుడి అరెస్టు
-
మర్డర్ కేసు.. మాజీ ఎమ్మెల్యే కుమారుడి అరెస్టు
లక్నో: గోమతి నగర్లో బీటెక్ విద్యార్థిని దారుణంగా హతమార్చిన ఘటనలో బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే షంషేర్ బహదూర్ కుమారుడి ప్రమేయం ఉన్నట్టు తెలిసింది. గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకోగా.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. మాజీ ఎమ్మెల్యే కుమారుడు అమన్ బహదూర్ సహా మిగతా నిందితుల్ని అరెస్టు చేశారు. వివరాలు.. స్నేహితుడిని కలవడానికి ప్రశాంత్ సింగ్ (23) అనే ఇంజనీరింగ్ విద్యార్థి కారులో గురువారం సాయంత్రం గోమతి నగర్‌కు వెళ్లాడు. అక్కడ అలకనంద అపార్ట్మెంట్ వద్దకు చేరుకోగానే మాటు వేసిన 20- 25 మంది దుండగులు తొలుత కారు అద్దాలను ధ్వసం చేశారు. అనంతరం ప్రశాంత్ ఛాతీలో పలుమార్లు కత్తితో పొడిచి పరార్ అయ్యారు. (చదవండి : బీటెక్ విద్యార్థి దారుణ హత్య) ఈ క్రమంలో కారు దిగిన బాధితుడు అక్కడినుంచి స్నేహితుడి అపార్టుమెంటులోకి పరుగెత్తుకు వెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు సదరు అపార్టుమెంటు వద్దకు వెళ్లి పరిశీలించగా... ప్రశాంత్ సింగ్ రక్తపు మడుగులో కనిపించాడు. హుటాహుటిన అతన్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. హత్యోందంతం దృశ్యాలు అపార్ట్మెంట్ సీసీ కెమెరాలో నమోదవడంతో వాటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. శుక్రవారం ఉదయం నిందితుల్ని అరెస్టు చేశారు. ఇక బుధవారం రాత్రి జరిగిన గొడవ కారణంగానే ఈ హత్య చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఓ బర్త్‌డే పార్టీకి హాజరైన ప్రశాంత్.. అక్కడ తన జూనియర్‌తో గొడవ పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. -
ఘోరం: బీటెక్ విద్యార్థి గుండెల్లో కత్తి దింపి..
లక్నో: స్నేహితుడిని కలవడానికి వెళ్లిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. మాటు వేసిన దుండగులు ఛాతిలో కత్తి దింపి అతడి ప్రాణాలు బలిగొన్నారు. ఈ పాశవిక ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వివరాలు... వారణాసికి చెందిన ప్రశాంత్ సింగ్(23) అనే విద్యార్థి లక్నోలోని ఓ ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్నాడు. ఈ క్రమంలో తన స్నేహితుడిని కలిసేందుకు ఇన్నోవాలో గోమతినగర్ వెళ్లాడు. ఇంతలో దాదాపు పది మంది వ్యక్తులు అతడి కారును అటకాయించి.. కత్తితో దాడి చేశారు. ఛాతిలో కత్తి దింపి.. విచక్షణారహితంగా పొడిచారు. ఈ క్రమంలో కారు దిగిన ప్రశాంత్ అక్కడినుంచి స్నేహితుడి అపార్టుమెంటులోకి పరిగెత్తుకు వెళ్లాడు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. సదరు అపార్టుమెంటుకు వెళ్లి పరిశీలించగా... ప్రశాంత్ రక్తపు మడుగులో కనిపించాడు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అతడు మరణించాడు. ఈ క్రమంలో అపార్టుమెంటు వద్ద లభించిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల ఓ బర్త్‌డే పార్టీకి హాజరైన ప్రశాంత్.. అక్కడ తన జూనియర్‌తో గొడవ పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఈ కారణంగానే అతడి హత్య జరిగినట్లు అనుమానిన్నామని తెలిపారు. ప్రశాంత్ స్నేహితులను విచారిస్తున్నామని.. త్వరలోనే కేసును ఛేదిస్తామని వెల్లడించారు. చదవండి: వీడియోతో అడ్డంగా బుక్కైన ప్రిన్సిపల్! -
మైనర్‌పై అత్యాచారం.. నిందితుడిని చంపిన అన్న
హుబ్బలి: నిర్భయ, దిశ, పోక్సో ఇలా ఎన్ని చట్టాలు తెస్తున్నా మహిళలపై జరుగుతున్న దురాగతాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాం. చివరకు ఎన్కౌంటర్లు కూడా ఆ మృగాలను భయపెట్టలేక పోతున్నాయి. దీంతో ప్రజలే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారు. పోలీసులు, కోర్టులు న్యాయం చేయలేవని భావించిన ఆమె సోదరుడు నిందితుడిని పొడిచి చంపిన ఘటన కర్ణాటకలోని ధార్వాడ్‌లో చోటుచేసుకుంది. బసవేశ్వర్ నగర్ పట్టణానికి చెందిన పక్రుద్దీన్ నదాఫ్(53) శనివారం 11 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చదవండి: వారిది నా రక్తం.. పవన్ రక్తం కాదు: రేణూదేశాయ్ ఇంట్లో బాలిక ఒంటరిగా ఉండడాన్ని గమనించిన నదాఫ్ మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం మైనర్ బాలికను ఆమె ఇంటికి తీసుకొస్తుండగా కుటుంబ సభ్యులు గమనించి చితగ్గొట్టారు. ఆదివారం సాయంత్రం అతడిని నవాల్గండ్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. పోలీసులు నిందితున్ని హుబ్బలిళోని కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే నదాఫ్‌పై ఆగ్రహం చల్లారని బాలిక సోదరుడు ఆదివారం మధ్యాహ్నం ఆస్పత్రికి వచ్చి నిందితుడిని కత్తితో పొడిచి చంపాడు. ఈ సంఘటనతో కంగుతిన్న పోలీసులు బాలిక సోదరుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. -
కొడుకు చేతిలో హత్యకు గురైన నటుడి భార్య
కాలిఫోర్నియా : ‘టార్జాన్’ నటుడు రాన్ ఏలీ భార్య వాలెరీ లుండిన్ ఎలీ కొడుకు చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం కాలిఫోర్నియాలోని తమ నివాసంలో చోటుచేసుకుంది. వివరాలు.. మంగళవారం సాయంత్రం రాన్ ఎలీ కుటుంబంలో గొడవ మొదలైంది. ఇది గమనించిన స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు సంఘటన ప్రాంతాన్ని పరిశీలించగా అప్పటికే ఆరవై ఏళ్ల లుండిన్ మరణించినట్లు తెలిపారు. అయితే తన శరీరంపై కత్తితో దాడి చేసినట్లు గాట్లు ఉన్నాయని, ఆమెను హతమార్చింది సొంత కుమారుడు కామెరాన్ ఎలీ(30)గా పోలీసులు గుర్తించారు. కామెరాన్ ఆచూకీ కోసం గాలించగా.. ఇంటి వెలుపల అతడు కనిపించాడని, పారిపోయేందుకు ప్రయత్నించగా కాల్పులు జరిపి చంపేశామని పోలీసు అధికారులు పేర్కొన్నారు. కాగా, ఇక్కడ జరిగిన ప్రమాదంలో రాన్ ఏలీకి ఏమైనా గాయాలు అయ్యాయా అనేది మాత్రం తెలియలేదు. అంతకముంతే అతన్ని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతి చెందిన ఇద్దరి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నామని, కుటుంబం మధ్య జరిగిన వివాదాల కారణంగానే ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. 1960లో వచ్చిన టెలివిజన్ కార్యక్రమం టార్జాన్‌తో రాన్ ఎలీ ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే. రాన్ ఏలీ దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో ఇద్దరి కుమార్తెలు(కిర్‌స్టెన్, కైట్‌ల్యాండ్) కాగా ఒక్కడే కుమారుడు. అంతేగాక హత్యకు గురైన వాలెరీ లుండిన్ ఒకప్పటి మిస్ ఫ్లోరిడా. -
క్షణికావేశంలో వ్యక్తిని దారుణంగా హత్య
సాక్షి, వికారాబాద్: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రామయ్యగూడలో బుధవారం సాయంత్రం ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. పోలీసులు వివరాల ప్రకారం.. వికారాబాద్‌లోని రామయ్యగూడకు చెందిన బసిరెడ్డిపల్లి సత్యనారాయణ (49) షాద్‌నగర్ సమీపంలోని బాల్నగర్లో సంఘం లక్ష్మీబాయి గురుకుల పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తుండేవాడు. పోలీసులు వివరాల ప్రకారం.. వికారాబాద్‌లోని రామయ్యగూడకు చెందిన బసిరెడ్డిపల్లి సత్యనారాయణ (49) షాద్‌నగర్ సమీపంలోని బాల్నగర్లో సంఘం లక్ష్మీబాయి గురుకుల పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తుండేవాడు. ఆయన వికారాబాద్‌లో భార్య అమృతమ్మతో పాటు, ఇద్దరు కూతుళ్లు, రెండు నెలల బాబుతో కలిసి నివసిస్తున్నాడు. అనారోగ్యంగా ఉండడంతో సత్యనారాయణ వైద్యం చేయించుకునేందుకు బుధవారం సాయంత్రం 7:15 గంటల సమయంలో రామయ్యగూడ నుంచి వికారాబాద్‌లోకి వస్తున్నాడు. అయితే రామయ్యగూడ ప్రధాన రోడ్డు వద్ద ఆటో ఎక్కుతున్న సమయంలో కొందరు వ్యక్తులతో గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు. గొడవ జరుగుతుండగానే ఆటో ఎక్కి వస్తున్న సత్యనారాయణను శివరాంనగర్ కాలనీ సమీపంలో మరోసారి వ్యక్తి అడ్డగించాడు. క్షణాకావేశంలో అతడి తలను బలంగా రోడ్డుకు బాదేసి కొట్టడంతో సత్యనారాయణ స్పృహ కోల్పోయాడు. అనంతరం దుండగుడు పదునైన కత్తితో కడుపులో పొడిచాడు. దీంతో సత్యనారాయణ అక్కడిక్కడే మృత చెందాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ, సీఐ, హత్యకు గురైన సత్యనారాయణ స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయగా దుండగుడు కత్తితో అందరినీ బెదిరించాడు. సత్యనారాయణ మృతిచెందాడని నిర్ధారించుకుని దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. హత్య విషయం అప్పటికప్పుడు వికారాబాద్‌లో దావానంలా వ్యాపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని వికారాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ సీతారామ్ సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఐ శ్రీనివాస్, ఎస్ఐ లక్ష్మయ్య ఆధ్వర్యంలో హత్యకు సంబంధించిన ఆధారాలను క్లూస్ టీం సహకారంతో సేకరించారు. కలకలం రేపుతున్న వరుస హత్యలు వరుస హత్యలతో పట్టణావుసులు ఉలిక్కిపడుతున్నారు. ఇటీవల జరిగిన తల్లీఇద్దరు పిల్లల దారుణహత్య మరువక ముందే తాజాగా నడిరోడ్డులో వ్యక్తి దారుహత్యకు గురికావడం వికారాబాద్‌వాసులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. -
కుటుంబ సభ్యులనే హతమార్చిన డాక్టర్
గుర్గావ్: కుటుంబ భారాన్ని మోయడం కష్టమౌతోందని ఓ డాక్టర్ తన భార్య, ఇద్దరు పిల్లలను హతమార్చి, తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన గురుగ్రామ్‌లో చోటుచేసుకొంది. స్థానికులు సోమవారం ఉదయం నుంచి కుటుంబ సభ్యులను బయట గుర్తించకపోవడంతో పోలీసులకు సమాచారమివ్వగా, ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగిందని వారు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వారణాసికు చెందిన ప్రకాష్ సింగ్ (55) తన భార్య సోను సింగ్ (50), కుమార్తె అదితి (22), కుమారుడు ఆదిత్య (13) నిద్రిస్తున్నప్పుడు పదునైన ఆయుధంతో దాడి చేసి హతమార్చాడు. ఆ తర్వాత తాను సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రకాష్ మినహా మిగతా కుటుంబ సభ్యులందరి గొంతును కత్తితో కోసిన గాయాలున్నాయి. పోలీసులు స్వాధీనం చేసుకొన్న సూసైడ్ నోట్లో కుటుంబ నిర్వహణ కష్టమైన కారణంగానే ప్రకాష్ ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు ఉంది. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపిన అనంతరం, సూసైడ్ నోట్‌ను ‘అతనే రాశాడా? లేక మరెవరైన రాశారా?’ అని కోణంలో విచారణ చేపడుతున్నామని ఓ పోలీసు అధికారి తెలిపారు. కాగా, హైదరాబాద్‌లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసిన ప్రకాష్ గత ఎనిమిదేళ్లుగా గుర్గావ్‌లోనివాసం ఉంటున్నాడు. అతని భార్య గుర్గావ్లో సొంత స్కూల్‌ను నడుపుతోంది. -
నా చెల్లెలినే ప్రేమిస్తావా?!
చెన్నై : తన చెల్లిని ప్రేమించాడని తోటి విద్యార్థిని హత్యచేసిన విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన తురైపాక్కం సమీపంలో బుధవారం జరిగింది. వివరాలు.. చెన్నై సమీపం తురైపాక్కం ప్రాంతంలో ప్రైవేట్ వంట శిక్షణ కళాశాల ఉంది. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం ఆనందపూర్‌కు చెందిన శ్రవణ్ కుమార్ (20) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇతనితో పాటు అదేగ్రామానికి చెందిన హరిహర షణ్ముగం (20) అక్కడే చదువుతున్నాడు. ఇద్దరూ కళాశాల హాస్టల్లో ఉంటూ చదువుతున్నారు. కాగా హరిహర షణ్ముగం చెల్లెలి వరుసైన అమ్మాయిని శ్రవణ్ కుమార్ ప్రేమిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న హరిహర షణ్ముగం, తన చెల్లిని ప్రేమించకూడదని శ్రవణ్‌కుమార్‌ని పలుసార్లు హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో ఇద్దరికి తరచు గొడవలు జరిగాయి. ఈ క్రమంలో బుధవారం కళాశాలకి వచ్చిన శ్రవణ్‌కుమార్‌ని హరిహర షణ్ముగం ప్రవేశద్వారం వద్ద నిలిపి తన చెల్లితో ప్రేమని మరిచిపోవాలని హెచ్చరించాడు. అప్పుడు ఇద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడింది. ఆగ్రహంతో హరిహర షణ్ముగం తన వద్ద ఉన్న కత్తితో శ్రవణ్ కుమార్‌ని పొడిచాడు. తీవ్రగాయాలైన శ్రవణ్‌కుమార్ సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. సమాచారంతో పోలీసులు అక్కడికి వచ్చి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి హరిహర షణ్ముగంని అరెస్టు చేశారు. -
20 రోజుల్లో పెళ్లి;సాఫ్ట్వేర్ ఇంజనీర్ హత్య
సాక్షి, వైఎస్సార్ జిల్లా : రైల్వే కోడూరులో దారుణం చోటుచేసుకుంది. కొన్ని రోజుల్లో వివాహ బంధంలో అడుగుపెట్టనున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను గుర్తు తెలియని దుండగులు నరికి చంపారు. వివరాలు.. రైల్వే కోడూరులోని రంగనాయకుల పేటకు చెందిన షేక్ అబ్దుల్ ఖాదర్(26) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి ఇటీవలే వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో ఈనెల 23న తన మేనమామ కూతురితో పెళ్లి జరగాల్సి ఉంది. అయితే బుధవారం రంజాన్ పండుగ సందర్భంగా రైల్వే కోడూరుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో తెల్లవారు జామున శ్రీకృష్ణ సినిమా హాల్ దగ్గరికి రాగానే గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతామని పేర్కొన్నారు. కాగా చేతికి అందివచ్చిన కొడుకు హత్యకు గురికావడంతో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కొన్నిరోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండటంతో ఇరు కుటుంబాల్లోనూ విషాదం నెలకొంది. -
కూతురిపై కామెంట్.. తండ్రి హత్య
న్యూఢిల్లీ : కూతురి గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేశాడో పోకిరి వెధవ. ఇదేంటని అడగటానికి వెళ్లిన తండ్రి మీద కత్తితో దాడి చేసి చంపేశారు. విషాదకరమైన ఈ సంఘటన న్యూఢిల్లీలోని మోతీ నగర్లో చోటు చేసుకుంది. వివరాలు.. ఓ వ్యాపారవేత్త తన కూతురితో కలిసి ఆస్పత్రి నుంచి బైక్ మీద ఇంటికి వెళ్తున్నాడు. ఆ సమయంలో ఓ యువకుడు వ్యాపారవేత్త కూతుర్ని ఉద్దేశిస్తూ.. అసభ్యకరం వ్యాఖ్యలు చేశాడు. దాంతో ఆ బిజినెస్‌మ్యాన్ ముందు కూతుర్ని ఇంటి దగ్గర వదిలి.. కామెంట్ చేసిన వ్యక్తి గురించి అతని తల్లిదండ్రులతో చెప్పడానికి వెళ్లాడు. జరిగిన విషయం కూతురు ఇంట్లో చెప్పడంతో.. బిజినెస్‌మ్యాన్ కుమారుడు కూడా నిందితుల ఇంటికి వెళ్లాడు. బిజినెస్‌మ్యాన్ కొడుకు అక్కడికి చేరుకునేసరికి తన తండ్రి.. నిందితులకు మధ్య గొడవ జరుగుతుండటం గమనించాడు. తండ్రికి మద్దతుగా బిజినెస్‌మ్యాన్ కొడుకు కూడా నిందితులతో గొడవకు దిగాడు. మాటలతో ప్రారంభమైన ఈ వివాదం చివరకు దాడికి దారి తీసింది. దాంతో నిందుతుడు అతని తండ్రితో పాటు మరో ఇద్దరు సోదరులు కలిసి బిజినెస్‌మ్యాన్, అతని కొడుకు మీద కత్తితో దాడి చేశారు. నిందితుల ఇంటికి వెళ్లిన వారు ఇంకా రాకపోవడంతో అనుమానం వచ్చిన బిజినెస్‌మ్యాన్ భార్య సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ కత్తిపోట్లకు గురైన భర్త, కొడుకు ఆమెకు కనిపించారు. వెంటనే స్థానికుల సాయంతో వారిని ఆస్పత్రికి చేర్చారు. అయితే ఈ దాడిలో తీవ్రంగా గాయపడిని బిజినెస్‌మ్యాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. సోమవారం ఉదయం మరణించాడు. కొడుకు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు నిందితుడు, అతని తండ్రిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటనలో నిందితునికి సహకరించిన అతని సోదరులు చిన్నవారు కావడంతో వారిని జువైనల్ హోంకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
భార్య కళ్ల ముందే భర్త దారుణ హత్య
న్యూఢిల్లీ : సొంత ఇంటిలో, భార్య కళ్ల ముందే ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఢిల్లీలోని నంగ్లోయిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దీపక్ అనే వ్యక్తి హరిద్వార్ నుంచి రెండు రోజుల క్రితం ఇంటికి తిరిగి వచ్చాడు. స్నేహితులకు పార్టీ ఇచ్చేందుకు ఇంటికి పిలిచాడు. ఈ క్రమంలో పూర్తిగా మద్యం మత్తులో మునిగిన తర్వాత వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఓ వ్యక్తి కత్తితో దీపక్‌పై దాడి చేసి అతడిని పొడిచాడు. ఆ సమయంలో వారిని డిన్నర్‌కు పిలిచేందుకు దీపక్ భార్య అక్కడికి రావడంతో.. నిందితుడు పారిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లే సమయానికి దీపక్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో దీపక్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును లోతుగా విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. -
బిగ్‌బాస్ అయ్యాక కాల్ చేస్తానంది.. అంతలోనే
న్యూఢిల్లీ : అప్పటికి గంట నుంచి నా సోదరి నాతో ఫోన్లో మాట్లాడుతుంది. నా కూతురితో మాట్లాడమన్నాను.. బిగ్‌బాస్ అయిపోయాక కాల్ చేస్తానని చెప్పింది. ఇంతలోనే ఈ ఘోరం జరిగింది అంటూ విలపిస్తున్న ఆ మహిళను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ఢిల్లీకి చెందిన ఫ్యాషన్ డిజైనర్ మాలా లఖానిని అత్యంత దారుణంగా చంపారు దుండగులు. వివరాలు.. మాలా లఖాని అనే మహిళ ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేస్తోంది. రాహుల్ అన్వర్(24) అనే యువకుడు మాలా దగ్గర మాస్టర్ టైలర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కొన్నాళ్ల క్రితం ఓ మైనర్ బాలికను వేధించిన కేసులో రాహుల్ జైలు కెళ్లాడు. మాలానే డబ్బు కట్టి రాహుల్‌కి బెయిల్ ఇప్పించింది. బయటకు వచ్చిన రాహుల్ తిరిగి మాల దగ్గర పనికి చేరాడు. తాను డిజైన్ చేసిన ప్రతి డ్రెస్ మీద ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాల్సిందిగా మాలాను డిమాండ్ చేసేవాడు. అందుకు మాలా ఒప్పుకోలేదు. దాంతో కక్ష్య పెంచుకున్న రాహుల్ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి మాలాను కత్తితో గొంతు కోసి దారుణంగా హతమార్చాడు. ఈ దాడిలో అడ్డువచ్చిన పని మనిషిని కూడా హత్య చేశారు. ఈ దారుణం బుధవారం రాత్రి 10 - 11.30 గంటల మధ్య జరిగి ఉంటుందని పోలీసులు తెలిపారు. నా సోదరి రాహుల్‌ని తన కొడుకుగా భావించేది. కానీ డబ్బు కోసం అతను ఇంత దారుణానికి తెగించాడని వాపోయింది మాలా సోదరి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మాలా సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, రాహులతో పాటు అతని స్నేహితులను అరెస్ట్ చేశారు. -
పాతబస్తీలో ఘర్షణ..ఒకరి మృతి
హైదరాబాద్: హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్ పరిధిలోని తారీఖత్ మంజిల్ ఫంక్షన్ హాల్లో ఘర్షణ చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులు ఓ విషయంలో గొడవ పడ్డారు. కోపంలో ఓ వ్యక్తి , అన్వర్ అనే మరో వ్యక్తిని కత్తితో పొడిచాడు. అడ్డుకోబోయిన సోహైల్ అనే వ్యక్తికి కూడా గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన అన్వర్ ఆసుపత్రికి తరలించగా..మార్గమధ్యంలో ప్రాణాలొదిలాడు. ఈ ఘటనపై హస్సేనీ ఆలం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
భార్యను చంపిన భర్త
మణుగూరుటౌన్: కట్టుకున్న భార్యకు తోడు నీడగా ఉండాల్సిన భర్తే ఆమెపాలిట కాలయముడయ్యాడు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని భార్యను కత్తితో పొడిచి చంపాడు. ఇది సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మణుగూరు మండలం రామానుజవరం గ్రామానికి చెందిన నోముల లింగయ్య, మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని తన భార్య నాగమణి(50)ని సోమవారం రాత్రి అడిగాడు. ఆమె నిరాకరించడంతో బీరువాలో ఉన్న నగదును తీసుకునేందుకు అతడు ప్రయత్నించాడు. ఆమె అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. కోపోద్రిక్తుడైన లింగయ్య, పక్కనే ఉన్న కత్తితో ఆమెను పొడిచాడు. చుట్టుపక్కల వారు గమనించి ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలోఆమె మృతిచెందింది. నాగమణిని ఆమె భర్త నోముల లింగయ్య, కోడలు నోముల అరుణ కలిసి హత్య చేశారంటూ మృతురాలి అక్క కొండ వెంకటమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో మణుగూరు సీఐ మొగిలి, కేసు నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు జరుపుతున్నారు. -
లైబ్రరీలో మహిళ దారుణ హత్య
బోస్టన్ : ఓ మహిళని విచక్షణా రహితంగా వేటకొడవలితో హత్య చేసి చంపిన ఘటన శనివారం ఉదయం 10:30 గంటల సమయంలో బోస్టన్ సమీపంలో చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. లైబ్రరీ గదిలో చదువుకుంటున్న ఓ మహిళపై మాసాచుసెట్స్‌కు చెందిన 23 ఏళ్ల జెఫ్పరీ యావో వేట కొడవలితో తల, రొమ్ము భాగంలో విచక్షణా రహితంగా దాడి చేశాడు. రక్తమోడుతున్న మహిళ లైబ్రరీ తలుపుల వైపుగా పరిగెత్తింది. అతడు అంతటితో ఆగకుండా ఆమె వైపుగా పరిగెత్తాడు. అడ్డువచ్చిన లైబ్రరీ సిబ్బందిపై కూడా దాడికి పాల్పడి పరారయ్యాడు. సిబ్బంది ఆమెను అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించినా ఫలితం లేక పోయింది. తీవ్ర గాయాలపాలైన మహిళ కొద్ది సేపటి తర్వాత చికిత్స పొందుతూ మరణించింది. ఆ మహిళ ఎవరు.? అతడు ఎందుకు ఆమెపై దాడి చేశాడు.? అన్న వివరాలు ఇంకా తెలియ రాలేదు. జెఫ్పరీ యావో నివసిస్తున్న ఇంటి చుట్టు పక్కల వారిని బోస్టన్ హెరాల్డ్ ఇంటర్వ్యూ చేయగా అతని గురించి కొన్ని షాకింగ్ విషయాలు తెలిశాయి. గత కొద్ది సంవత్సరాలుగా యావో ప్రవర్తన క్రూరంగా తయారైందని, మాలో ఎవరిని చంపుతాడో అని భయపడుతుండేవాళ్లమని చెప్పారు. అతని మిత్రులు యావో గత కొద్ది సంవత్సరాలుగా పూర్తిగా మారిపోయాడన్న విషయాన్ని దృవీకరించారు. పోలీసులు యావోపై హత్యా, హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆమ్లెట్ వివాదం: కత్తిపోట్లతో వ్యక్తి మృతి
ముంబయి: ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వద్ద బ్రెడ్ ఆమ్లెట్ విషయంపై చోటుచేసుకున్న వివాదంలో కత్తిపోట్లకు గురైన వ్యక్తి మృతిచెందడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన ముంబయి సమీపంలోని నాలా సోపారాలో గత శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రవి భగవత్ అనే నలభై ఏళ్ల వ్యక్తి నాలా సోపారాలో నివాసం ఉండేవాడు. శనివారం అర్ధరాత్రి దగ్గర్లోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌కు స్నేహితుడితో కలిసి వెళ్లాడు. బ్రెడ్ ఆమ్లెట్ కావాలని ఆర్డరిచ్చాడు భగవత్. ఏం జరిగిందో తెలియదు కానీ నాలుగు రూపాయల కోడిగుడ్డు విషయంలో భగవత్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వ్యక్తికి మధ్య వాగ్వివాదం జరిగినట్లు తెలుస్తోంది. కొద్దిసేపటికే పెద్ద గొడవగా మారగ.. ఆవేశంతో అరుస్తున్న కస్టమర్ భగవత్‌ను ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పనిచేసే ఓ యువకుడు కత్తితో పలుమార్లు పొడిచాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో భగవత్ మృతిచెందాడు. సమాచారం అందుకున్న తులిని స్టేషన్ పోలీసులు ఘటనాస్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి ముగ్గురు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భగవత్‌ను కత్తితో పొడిచిన ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా, మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తొలుత హత్యకేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించిన ముగ్గురు పోలీసులను పాల్ఘార్ ఎస్పీ సస్పెండ్ చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
అమెరికాలో తెలుగు వైద్యుడు హత్య
-
బాయ్‌ఫ్రెండ్‌ను పిలిచి చంపించింది?
ముంబై: ముంబైలో 21 ఏళ్ల యువతి పథకం ప్రకారం తన బాయ్‌ఫ్రెండ్ (22)ను పిలిచి చంపించినట్టు ఆరోపణలు వచ్చాయి. సోమవారం రాత్రి బాంద్రాలోని కార్టర్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి. నిందితురాలు తన బాయ్‌ఫ్రెండ్ రిజ్వాన్ ఖాన్‌కు ఫోన్ చేసి కార్టర్ రోడ్డుకు రావాల్సిందిగా కోరింది. ఆ సమయంలో రిజ్వాన్ తన స్నేహితులతో కలసి పబ్‌లో ఉన్నాడు. రిజ్వాన్ స్నేహితుడు సైఫ్ మీర్జా ఈ ఘటన గురించి వివరిస్తూ.. 'సోమవారం రాత్రి మేం పబ్‌లో ఉన్నాం. రాత్రి 11 గంటల ప్రాంతంలో రిజ్వాన్‌కు గర్ల్‌ఫ్రెండ్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. రిజ్వాన్, నేను కార్టర్ రోడ్డుకు వెళ్లాం. అక్కడ రిజ్వాన్ తన స్నేహితురాలిని కలిశాడు. వారిద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. కాసేపటి తర్వాత ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. ఇద్దరూ నా నుంచి దూరంగా వెళ్లిపోయారు. అక్కడ కొందరు వ్యక్తులు ఉన్నా నేను సందేహించలేదు. రిజ్వాన్ కనిపించకపోయే సరికి నేను పరిగెత్తివెళ్లి చూడగా రక్తంమడుగులో అతను అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. రిజ్వాన్ ను కత్తితో పొడిచారు. అనుమానాస్పద వ్యక్తులు అక్కడి నుంచి బైకులపై వెళ్లిపోయారు. రిజ్వాన్‌ను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్టు వైద్యులు చెప్పారు' అని చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రిజ్వాన్‌ను చంపడానికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్య వెనుక రిజ్వాన్ స్నేహితురాలి పాత్ర ఉందని భావిస్తున్నామని, హత్యకు ఆమె కారణమని ఖర్ సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ చెప్పారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు.