రూ.40 వేలు అప్పుతీసుకున్న ట్రాన్స్‌జెండర్‌.. చెల్లించకపోవడంతో ఇంటికి వెళ్లి! | Man Stabbed To Death Transgender Partner Delhi Fight Over Rs 40K | Sakshi
Sakshi News home page

కలిసి బతుకుదామని చెప్పి మరో వ్యక్తితో వెళ్లిపోయిన ట్రాన్స్‌జెండర్‌.. రూ.40 వేల కోసం ఇంటికెళితే

Published Sun, Oct 16 2022 7:30 PM | Last Updated on Sun, Oct 16 2022 7:56 PM

Man Stabbed To Death Transgender Partner Delhi Fight Over Rs 40K - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: పాత పరిచయం ఓ ట్రాన్స్‌జెండర్‌ (35)ను ఆస్పత్రిపాల్జేయగా, ఆమె సహచరుడి ప్రాణాలు తీసింది. రూ.40 వేల కోసం జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీయడంతో ఓ వ్యక్తి టాన్స్‌జెండర్‌, ఆమె సహచరుడిపై కత్తితో దాడిచేశాడు. సెంట్రల్‌ ఢిల్లీలోని పహర్‌గంజ్‌ ప్రాంతం, ముల్తానీ దాంద్రాలో శుక్రవారం జరిగిన ఈ ఘటనలో ట్రాన్స్‌జెండర్‌ పార్ట్‌నర్‌ మృతి చెందాడు. సెంట్రల్‌ ఢిల్లీ డీసీపీ స్వేతా చౌహాన్‌ తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫరుఖాబాద్‌కు చెందిన అనిల్‌కు ట్రాన్స్‌జెండర్‌కు 2020లో పరిచయం ఏర్పడింది.
(చదవండి: డాక్టర్‌ సతీమణి అత్యుత్సాహం.. భర్త లేకపోవడంతో తానే వైద్యం, రోగి మృతి.. ఇద్దరూ పరార్‌!)

వారిద్దరూ కలిసి బతుకుదాం అనుకున్నారు. ఆ సమయంలో ట్రాన్స్‌జెండర్‌కు రూ.40 వేలు అనిల్‌ అప్పుగా ఇచ్చాడు. అయితే, ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ.. టాన్స్‌జెండర్‌ అనిల్‌ వద్ద నుంచి వెళ్లి పోయి ప్రస్తుత పార్ట్‌నర్‌తో కలిసి ఉంటోంది. ఈ విషయమై పలుమార్లు అనిల్‌ వారిద్దరినీ హెచ్చరించాడు. తనను మోసం చేసినవారి అంతుచూస్తాననని బెదిరించాడు. ఈక్రమంలో ఘటన జరిగిన రోజు రాత్రి నిందితుడు టాన్స్‌జెండర్‌ ఉంటున్న ఇంటికి వెళ్లాడు.

తన వద్ద తీసుకున్న రూ.40 వేలు చెల్లించాలని డిమాండ్‌ చేశాడు. ఆ సమయంలో ఇంట్లో ఆమె పార్ట్‌నర్‌ కూడా ఉన్నాడు. వారిమధ్య మాటామాటా పెరడంతో ఘర్షణ చెలరేగింది. అనిల్‌ కత్తితో వారిద్దరిపై దాడి చేశాడు. అనంతరం అక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. స్థానికులు అప్రమత్తపై అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తీవ్ర గాయాలపాలైన బాధితులను ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ట్రాన్స్‌జెండర్‌ పార్ట్‌నర్‌ ప్రాణాలు కోల్పోయాడు. అనిల్‌పై పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని డీసీపీ తెలిపారు.
(చదవండి: ‘ఇది జైలు కాదు.. కోవిడ్‌ ఐసోలేషన్‌ వార్డ్‌’.. హర్ష గోయెంకా ట్వీట్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement