
ప్రతీకాత్మక చిత్రం
హుబ్బలి: నిర్భయ, దిశ, పోక్సో ఇలా ఎన్ని చట్టాలు తెస్తున్నా మహిళలపై జరుగుతున్న దురాగతాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాం. చివరకు ఎన్‌కౌంటర్లు కూడా ఆ మృగాలను భయపెట్టలేక పోతున్నాయి. దీంతో ప్రజలే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారు. పోలీసులు, కోర్టులు న్యాయం చేయలేవని భావించిన ఆమె సోదరుడు నిందితుడిని పొడిచి చంపిన ఘటన కర్ణాటకలోని ధార్వాడ్‌లో చోటుచేసుకుంది. బసవేశ్వర్ నగర్ పట్టణానికి చెందిన పక్రుద్దీన్ నదాఫ్(53) శనివారం 11 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
చదవండి: వారిది నా రక్తం.. పవన్ రక్తం కాదు: రేణూదేశాయ్
ఇంట్లో బాలిక ఒంటరిగా ఉండడాన్ని గమనించిన నదాఫ్ మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం మైనర్ బాలికను ఆమె ఇంటికి తీసుకొస్తుండగా కుటుంబ సభ్యులు గమనించి చితగ్గొట్టారు. ఆదివారం సాయంత్రం అతడిని నవాల్గండ్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. పోలీసులు నిందితున్ని హుబ్బలిళోని కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే నదాఫ్‌పై ఆగ్రహం చల్లారని బాలిక సోదరుడు ఆదివారం మధ్యాహ్నం ఆస్పత్రికి వచ్చి నిందితుడిని కత్తితో పొడిచి చంపాడు. ఈ సంఘటనతో కంగుతిన్న పోలీసులు బాలిక సోదరుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.
Comments
Please login to add a commentAdd a comment