
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్: హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్ పరిధిలోని తారీఖత్ మంజిల్ ఫంక్షన్ హాల్‌లో ఘర్షణ చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులు ఓ విషయంలో గొడవ పడ్డారు. కోపంలో ఓ వ్యక్తి , అన్వర్ అనే మరో వ్యక్తిని కత్తితో పొడిచాడు. అడ్డుకోబోయిన సోహైల్ అనే వ్యక్తికి కూడా గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన అన్వర్ ఆసుపత్రికి తరలించగా..మార్గమధ్యంలో ప్రాణాలొదిలాడు. ఈ ఘటనపై హస్సేనీ ఆలం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment