కావేరి ట్రావెల్స్ యాజమాన్యం, ప్రభుత్వం పట్టించుకోలేదని బంధువుల ఆవేదన
పెందుర్తి: రాజమండ్రిలో బుధవారం జరిగిన కావేరి ట్రావెల్స్ బస్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఈల్లా దీక్షిత(22) చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. సుజాతనగర్‌కు చెందిన దీక్షిత, మర్రిపాలెనికి చెందిన ఆమె బంధువు కల్యాణి ఇంటర్వ్యూ నిమి త్తం విశాఖ నుంచి హైదరాబాద్‌కు కావేరి ట్రావెల్స్ బస్‌లో ఈ నెల 22న బయలుదేరారు. రాజమండ్రి వద్దకు వెళ్లేసరికి బస్ బోల్తా పడడంతో కల్యాణి అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే.
ఆ ప్రమాదంలో గాయపడిన దీక్షితను నగరంలోని ఓ ప్రైవే ట్ ఆస్పత్రికి చికిత్స నిమి త్తం తీసుకువచ్చారు. నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన దీక్షిత కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. మరోవైపు ప్రమాదం జరిగి నాలుగు రోజులైనా కావేరి ట్రావెల్స్ యాజమాన్యం గానీ, ప్రభుత్వం గానీ కనీసం స్పందించకపోవడం పట్ల బంధువులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment