One died
-
మణిపూర్‌లో మళ్లీ హింస, ఒకరు మృతి.. రంగంలోకి అమిత్ షా
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మరోసారి రగులుతోంది. భద్రతా బలగాల పహారాలో కొంతకాలం దాడులు ఆగినా.. తాజాగా మళ్లీ హింస చెలరేగింది. కుకీలు, మైతీ తెగల మధ్య వైరంతో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మణిపూర్‌లోని లోయ ప్రాంతాల్లో ఆదివారం జరిగిన నిరసనలు,. హింసాత్మక ఘటనల్లో ఒకరు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. ఆందోళన కారులను చెదరగొట్టే క్రమంలో జిరిబామ్ జిల్లాలో భద్రతాదళాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 20యేళ్ల అతౌబా మృతిచెందాడు. బాబుపరా వద్ద రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. బాబుపరా ప్రాంతంలో పలు పార్టీలకు చెందిన కార్యాలయాలపై ఆందోళనకారులు దాడులు చేశారు. జిరిబామ్ పోలీస్ స్టేషన్‌కు 500 మీటర్ల దూరంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ కార్యాలయాల్లోకి చొరబడిన ఆందోళనకారులు.. ఫర్నీచర్‌ను ఎత్తుకెళ్లి, ఆఫీసులను తగలబెట్టారు. దీంతో శాంతి భద్రతలకోసం భద్రతా దళాలు మోహరించడంతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గాయపడిన వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి చికిత్స కొనసాగుతోంది.చదవండి: బీజేపీలో చేరనున్న ఢిల్లీ మాజీ మంత్రి కైలాష్ గహ్లోత్మరోవైపు మణిపూర్‌లో పరిస్థితిపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు(సోమవారం) అధికారులతో సమావేశం కానున్నారు. హోం మంత్రిత్వ శాఖలోని ఈశాన్య విభాగానికి చెందిన సీనియర్ అధికారులు, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్), అస్సాం రైఫిల్స్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.ఇదిలా ఉండగా కుకీ మిలిటెంట్లు ఇటీవల జిరిబామ్ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో 11 మంది కుకీలు మృత్యువాతపడ్డారు. అనంతరం ఆరుగురు మైతీ వర్గానికి చెందిన వారిని మిలిటంట్లు బందీలుగా చేసి తీసుకెళ్లారు. వారి మృతదేహాలు లభ్యం కావడంతో జిరిబామ్ జిల్లాలో హింస చెలరేగింది. దీంతో దాదాపు 7 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసి కర్ఫ్యూ విధించారు అధికారులు. -
దూసుకొచ్చిన మృత్యువు
మేడ్చల్ రూరల్: కారులో ప్రయాణిస్తున్న వారికి ప్రయాణం పడకపోవడంతో వాంతులు రాగా రోడ్డుకు ఎడమ వైపు కారు ఆపి..వాంతి చేసుకుంటుండగా డీసీఎం రూపంలో మృత్యువు దూసుకొచి్చంది. ఓ బాలుడి ప్రాణాలు బలిగొంది. ఈ సంఘటన మేడ్చల్ ఓఆర్ఆర్పై చోటు చేసుకుంది.ఎస్ఐ లావణ్య తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని కూకట్‌పల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి విద్యాసాగర్ శనివారం ఉదయం తన భార్య రమాదేవి, కుమారుడు రామ్, తల్లి రమమ్మ, వరంగల్‌కు చెందిన అక్క దీప్తి, అల్లుడు పూజిత్ రామ్(13), కోడలు వేదశ్రీలతో కలిసి బీబీనగర్ వెళ్లేందుకు శనివారం ఉదయం తమ కారులో బయలుదేరి ఓఆర్ఆర్ గుండా వెళ్తున్నారు. మార్గమధ్యలో మేడ్చల్ సమీపంలోకి చేరుకోగానే కారులో ఉన్న అల్లుడు పూజిత్‌రామ్, భార్య రమాదేవి, వేదశ్రీలకు వాంతులు కావడంతో కారును ఎడమవైపు ఆపారు. రమాదేవి, వేదశ్రీలు కారు దిగి పక్కకు వెళ్లగా..పూజిత్‌రామ్ తిరిగి కారు ఎక్కే సమయంలో అదే మార్గంలో వెనుకనుండి వేగంగా వచి్చన డీసీఎం వాహనం వీరి కారును ఢీకొట్టింది. దీంతో పూజిత్‌రామ్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించగా కారులో ఉన్న విద్యాసాగర్, కుమారుడు రామ్‌లకు గాయాలయ్యాయి. ప్రమాదం విషయం తెలుసుకున్న మేడ్చల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పూజిత్‌రామ్ మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
Hyderabad: ప్రమాద భయం వెంటాడింది.. ప్రాణాలను బలిగొంది
హైదరాబాద్: రోడ్డు ప్రమాదానికి కారణమయ్యానని భయాందోళనకు గురైన ఓ వ్యక్తి ఆస్పత్రి భవనం నాలుగో అంతస్తుపై నుంచి దూకి ఆత్యహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం ఎల్బీనగర్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. వనస్థలిపురం ఎఫ్‌సీఐ కాలనీకి చెందిన గుమ్మడి రితీష్ రెడ్డి (30) వృత్తిరీత్యా వ్యాపారి. నగరంలో ఓ పని నిమిత్తం కారులో వెళ్లాడు. మంగళవారం మధ్యాహ్నం 12.10 గంటల సమయంలో దిల్సుఖ్ నగర్ నుంచి ఎన్టీఆర్ నగర్ లోని ఆద్య ఆస్పత్రికి వచ్చి కారును పార్కింగ్ చేశాడు. భయాందోళనతో ఉన్న అతను ఆస్పత్రి నాలుగో అంతస్తుకు వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా..నగరంలో పని నిమిత్తం వెళ్లిన అతను మూసారాంబాగ్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదానికి కారణమైనట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలైనట్లు తెలిసింది. ఈ క్రమంలో రితీష్రెడ్డిని బైకుపై ఇద్దరు వ్యక్తులు వెంబడించడంతో భయాందోళనకు గురయ్యాడు. రోడ్డు ప్రమాదానికి కారణమైన తనపై కేసు పెడితే జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో అతను ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా.. రితీష్ రెడ్డి కారును ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వెంబడించారు. అతను కారు ప్రమాదం చేసి వచ్చాడని అక్కడివారికి చెబుతున్న క్రమంలోనే.. రితీష్‌రెడ్డి భవనంపై నుంచి దూకడంతో సదరు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. రితీష్ రెడ్డికి 8 నెలల క్రితమే వివాహమైందని, ఇంతలోనే ఘోరం జరిగిందని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రితీష్ రెడ్డిని వెంబడించినవారి కోసం స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. -
కుప్పకూలిన నేవీ హెలికాప్టర్: ఒకరు మృతి
కొచ్చి: భారత నావికా దళానికి చెందిన చేతక్ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. నేవల్ బేస్‌లోని నేవల్ ఎయిర్ స్టేషన్ ఐఎన్ఎస్ గరుడ వద్ద శనివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.. కేరళలోని నేవల్ ఎయిర్ స్టేషన్లో ట్రయల్ రన్ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం పైలట్‌తో సహా ఇద్దరు గాయ పడగా, చాపర్ రోటర్ బ్లేడ్లు తగలడంతో రన్‌వేపై ఉన్న నౌకాదళ అధికారి మృతి చెందినట్లు తెలుస్తోంది. INS చేతక్ హెలికాప్టర్ నౌకాదళంలో అత్యంత పురాతనమైన హెలికాప్టర్. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది. -
కూతురిని కాలేజీకి పంపించేందుకు వెళ్తూ..
వరంగల్: కన్నబిడ్డను కాలేజీకి పంపుదామని బయలుదేరిన ఆ తండ్రిని విధి కబలించింది. కళ్లముందే తండ్రి ప్రాణాలు కోల్పోవడంతో కుమార్తె గుండెలవిసేలా రోదించింది. తనను సాగనంపడానికి వచ్చి కానరానిలోకాలకు పోతివా.. అంటూ కన్నీరుమున్నీరుగా విలపించింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రొయ్యూర్ సమీపంలోని 163 జాతీయ రహదారిపై మంగళవారం కంటైనర్ లారీ కారును ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న రైతు మృతి చెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. వెంకటాపురం(కె) చెందిన పోలిన శ్రీనివాసరావు (58) తన కుమార్తె పోలిన శృతిని హైదరాబాద్‌లోని కాలేజీకి పంపించేందుకు తన కారులో ఇంటి నుంచి బయలుదేరారు. ఇదే క్రమంలో 163 జాతీయ రహదారిపై ఇసార్ పెట్రోల్ బంక్ సమీపంలో ఎదురుగా ఛత్తీస్‌గఢ్‌కు వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి కారును ఢీకొట్టింది. దీంతో శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందాడు. కుమార్తె శృతికి తీవ్రగాయాలయ్యాయి. అదే సమయంలో ములుగు వెళ్తున్న వెంకటాపురం జెడ్పీటీసీ పాయం రమణ ప్రమాద స్థలానికి చేరుకుని గాయపడిన శృతిని ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తన వాహనంలో తీసుకువచ్చి చికిత్స అందించారు. సంఘటన స్థలాన్ని ఎస్సై ఇందయ్య పరిశీలించి కారులో ఇరుక్కుపోయి శ్రీనివాసరావు మృతదేహాన్ని బయటకు తీసి ఏటూరునాగారం ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాసరావుకు భార్య, ఇద్దరు కు మారులు, కుమార్తె హైదరాబాద్‌లో బీటెక్ చదువుతోంది. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులను పలువురు పరామర్శించారు. -
సత్యవతితో సహజీవనం.. గుర్తు తెలియని వ్యక్తులు తీవ్రంగా కొట్టడంతో..
నరసన్నపేట: స్థానిక బజారువీధిలో నివాసముంటున్న పాయకరావుపేటకు చెందిన దక్కుబల్లి శివ (35) అనుమానాస్పదంగా మృతి చెందాడు. గుర్తు తెలియని వ్యక్తులు తీవ్రంగా కొట్టడం వలన శివ మృతి చెందాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాయకరావుపేట నుంచి నరసన్నపేటకు 15 ఏళ్ల క్రితం వలస వచ్చిన శివ తునికి చెందిన బంగారి సత్యవతితో సహజీవనం చేస్తూ బజారు వీధిలో నివాసముంటున్నారు. మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 12న తీవ్ర గాయాలతో ఇంటికి రాగా సత్యవతి స్థానికుల సహాయంతో నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించింది. పరిస్థితి విషమించడంతో ఈ నెల 13న శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందా డు. కాగా, శివ స్నేహితులు మాత్రం ఇది హత్యేనని, కేసు దర్యాప్తు చేసి నిందితులను గుర్తించాలని కోరుతున్నారు. శివ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చినా రాకపోవడంతో సత్యవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామ ని ఎస్ఐ సింహాచలం తెలిపారు. -
సికింద్రాబాద్‌లో పేలిన గ్యాస్ సిలిండర్.. ఒకరు మృతి, 9 మందికి గాయాలు
సాక్షి, సికింద్రాబాద్: చిలకలగూడ పరిధిలోని దూద్ బావి బస్తీలో బుధవారం గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. గ్యాస్ సిలిండర్ పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసం అయ్యింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో మరణించిన వ్యక్తిని ఇంటి యజమాని నారాయణరావుగా గుర్తించారు. ఆయన భార్య, పిల్లలు సైతం గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. పేలుడు ప్రభావానికి స్థానికంగా ఎనిమిది ఇళ్ల వరకు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సంఘటన స్థలంలో క్లూస్ టీం, బాంబ్ స్కాడ్ తనిఖీలు చేపట్టింది. గ్యాస్ లీక్ కారణంగానే సిలిండర్ పేలినట్టుగా అనుమానిస్తున్నారు. చదవండి: Banjara Hills: డీఏవీ స్కూల్ గుర్తింపు రద్దుపై గందరగోళం.. నిర్ణయమెటో? -
ప్రేమ జంటను విడదీసిన విధిరాత
తూర్పు గోదావరి (పిఠాపురం): డిగ్రీ పూర్తి చేసుకున్న యువకుడు, ఇంటర్ చదివిన యువతి ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమను పెద్దలు అంగీకరిస్తారో లేదో అన్న అనుమానంతో తామే పెళ్లి చేసుకుని ఒక్కటవ్వాలని బయలుదేరారు. కానీ రోడ్డు ప్రమాద రూపంలో విధి వారిని విడదీసింది. పిఠాపురం సమీపంలో రాపర్తి సెంటర్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రేమ జంట తీవ్ర గాయాల పాలవ్వగా ప్రియుడు మృతి చెందాడు. ప్రియురాలు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది. పిఠాపురం పట్టణ ఎస్సై శంఖరరావు తెలిపిన వివరాల ప్రకారం కాకినాడ జగన్నాథపురానికి చెందిన పాలెపు గణేష్ అదే ప్రాంతానికి చెందిన దీప్తి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. గురువారం రాత్రి తాము అన్నవరం వెళ్లి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా రు. మోటారుసైకిల్‌పై గురువారం అర్ధరాత్రి బయలు దేరారు. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో పిఠాపురం రాపర్తి సెంటర్‌కు వచ్చే సరికి 216 జాతీయ రహదారి పక్కన ఉన్న రెయిలింగ్‌ను వీరి వాహనం బలంగా ఢీకొంది. దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. పెట్రోలింగ్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి 108లో తరలించారు. గణేష్ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. దీప్తి చికిత్స పొందుతోంది. కాగా తమ కుమారుడిని ఎవరో వ్యక్తులు చంపేశారని మృతుడి తల్లి లక్ష్మి పిఠాపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
బిడ్డకు కొత్త బట్టలు కొనాలని వెళ్లాడు.. అంతలోనే
సాక్షి, తిరుమల: కుమారుడు చైతన్య పుట్టిన రోజున కొత్త బట్టలు కొనేందుకు.. ఫొటోల వ్యాపారం చేసి డబ్బు తెస్తానని చెప్పి.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయా డని తిరుమల అగ్ని ప్రమాదంలో సజీవ దహనమైన తుమ్మల మల్లిరెడ్డి(45) భార్య శోభ కన్నీరుమున్నీరయ్యారు. తిరుచానూరుకు చెందిన మల్లిరెడ్డి ఇక లేడని తెలుసుకున్న కుటుంబ సభ్యుల ఆర్తనాథాలు మిన్నంటాయి. ఆమె మాట్లాడుతూ.. ‘‘నా భర్త సోమవారం రాత్రి తిరుమలకు వెళ్లాడు. బయలుదేరే మందు బాబు పుట్టినరోజుకు బట్టలు కొనడానికి డబ్బులు లేవన్నాడు. వ్యాపారం చేసి.. వచ్చిన డబ్బుతో బాబు పుట్టినరోజు ఘనంగా చేద్దామన్నాడు. కొండ మీద జనం లేరు కదా..? ఎందుకులే అని చెప్పినా వినలేదు. తిరుమలకు ప్రయాణమయ్యాడు. తిరిగి రాత్రి 9.30 గంటలకు ఫోన్ చేశాడు. ఇక మంగళవారం ఉదయం ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు. పక్క షాప్ అతనికి ఫోన్ చేసి..ఒక్కసారి చూడన్నా అని∙అడిగాను.. ఆ తర్వాత కొద్దిసేపటికే మా ఆయన అగ్నికి ఆహుతయ్యాడని తెలిసింది’’ అంటూ రోదించారు. ఇలాంటి ఘటన బాధాకరం: భూమన తిరుమలలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 20 దుకాణాలు పైగా కాలిపోవడం, అందులో 12 షాపులు పూర్తిగా దగ్ధం కావడంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తిరుచానూరుకు చెంది న మల్లిరెడ్డి మంటల్లో ఆహుతైపోవడం కలిచి వేసిందన్నారు. వారి కుటుంబానికి ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూస్తామన్నారు. దగ్ధమైన షాపుల నిర్వాహకులు దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారని.. టీటీడీ చైర్మన్‌తో సంప్రదించి వీరికి పరిహారం ఇచ్చే విధంగా చూస్తామన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రాథ మికంగా నిర్ధారించామన్నారు. కో–ఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ చిన్నముని ఎమ్మెల్యే వెంట ఉన్నారు. చదవండి: అక్క ఆత్మహత్య.. తట్టుకోలేక హార్పిక్ తాగిన చెల్లెలు -
హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని హైటెక్ సిటీ వద్ద సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నోవాటెల్ వద్ద కారు- బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా.. మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. మాదాపూర్ సమీపంలో అతివేగంగా దూసుకువస్తున్న బీఎండబ్ల్యూ కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బుల్లెట్ బైక్‌ను ఢీకొంది.. ఈ ఘటనలో అభిషేక్ ఆనంద్(26) అక్కడికక్కడే మృతి చెందగా మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళను వైద్యం కోసం ఆసుపత్రికి తరలించి.. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కె. అశ్విన్ గా గుర్తించిన పోలీసులు డ్రైవర్ మద్యం సేవించి, తప్పు మార్గంలో నడపుతుండటం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. ప్రమాదంలో రెండు వాహనాలు సైతం పూర్తిగా దెబ్బతిన్నాయి. -
డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
-
రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి
బీబీనగర్ (భువనగిరి) : బంధువుల జన్మదిన వేడుకలకు వెళ్తున్న ఓ విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.ఈ ఘటన శుక్రవారం మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఎస్ఐ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. అదిలాబాద్ జిల్లాకు చెందిన మునెసూల అరుణ(21) హైదరాబాద్ నాంపల్లిలోని ఓహస్టల్‌లో ఉంటూ ఎస్ఎన్ వనిత మహావిద్యాలయ్ డిగ్రీ కళాశాలలో బీఎస్ఈ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కాగా యాదాద్రి(గుట్ట)లోని తమ అక్క కూతురి జన్మదినం కావడంతో అరుణ తన బంధువు ముషీరాబాద్‌కు చెందిన శ్రీకాంత్‌తో కలిసి స్కూటీపై హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చారు. బీబీనగర్‌లోని చెరువు కట్ట సమీంపలోకి రాగానే వెనుక నుంచి వస్తున్న బ్రీజా కారు స్కూటీని ఢీకొట్టి వెళ్లిపొయింది. దీంతో రోడ్డుపై ఎగిరి పడ్డ అరుణపై నుంచి అదే సమయంలో వెనుక నుంచి మరోకారు దూసుకుపోయింది. ఈసంఘటనలో అరుణ అక్కడికక్కడే మృతి చెందగా రోడ్డు పక్కన పడ్డ శ్రీకాంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మొదట ప్రమాదానికి కారణమైన బ్రీజా కారు అక్కడి నుంచి తప్పించుకు పోగా అరుణ మృతికి కారణమైన హైదరాబాద్‌కు చెందిన కారును, డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా అరుణతో కలిసి వచ్చిన శ్రీకాంత్ అరుణ తన స్నేహితురాలు అంటూ స్థానికులతో చెప్పుకొచ్చాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
గరివిడి: చీపురుపల్లి నుంచి రాజాం వెðళ్లే ప్రధాన రహదారిలో బీజే పాలెం దాటిన తర్వాత ఎఫ్‌సీ గోడౌన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందగా... మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసులు, మృతుడి బంధువులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం ముషిడివలస పంచాయతీ మధుర గ్రామమైన కొప్పలపేటకు చెందిన కొప్పల అప్పలస్వామి (32), రాగోలు సత్యం ద్విచక్ర వాహనంపై చీపురుపల్లి నుంచి రాజాం వైపు వెళ్తున్నారు. అదే మార్గంలో రాజాం వైపు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో బైక్ బోల్తా పడడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు క్షతగాత్రులను చీపురుపల్లి సీహెచ్‌సీకి తరలించగా.. అప్పలస్వామి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన రాగోలు సత్యంనకు ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం రాజాం కేర్ ఆస్పత్రికి తరలించారు. అప్పలస్వామి భవానీ మాల ధరించి విజయవాడ మొక్కు చెల్లించుకుని శనివారం రాత్రి ఇంటికి చేరుకున్నాడు. ప్రసాదాలు పంపిణీ చేసేందుకు గాను దుమ్మెద గ్రామానికి వచ్చి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడికి భార్య రూపావతి, కుమార్తె రేణుక, కుమారుడు మణి ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సిద్ధిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి
-
ఫ్యూజు వేయబోయి...
యాడికి : వీరారెడ్డిపల్లెకు చెందిన పేరం శిరీష్‌రెడ్డి (25) పాలిటెక్నిక్ చదివాడు. తండ్రి అనారోగ్యంతో మృతి చెందాక తల్లి రాజేశ్వరికి చేదోడువాదోడుగా నిలిచాడు. తమకున్న పది ఎకరాల పొలంలో పత్తి, వేరుశనగ, మిరప, జొన్న సాగు చేసుకుంటూ జీవనం సాగించేవారు. శనివారం ఉదయం పత్తికి నీరు కట్టాలని తోటకు వెళ్లాడు. చుట్టుపక్కల మోటార్లు ఆడుతున్నా తమ పొలంలో ఆడకపోవడంతో ట్రాన్స్ఫార్మర్ వద్దకెళ్లి చూడగా ఫ్యూజు పోయినట్లు గుర్తించాడు. ఫ్యూజు వేసేక్రమంలో విద్యుదాఘాతానికి గురవడంతో అపస్మారకస్థితిలోకి చేరుకున్నాడు. పక్కతోటలోని రైతులు గమనించి శిరీష్‌రెడ్డి చిన్నాన్న కమలపాడు తాజా మాజీ సర్పంచ్ భీమేశ్వరరెడ్డికి సమాచారమందించారు. అనంతరం ఆటోలో యాడికి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే శిరీష్‌రెడ్డి మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు, నాయకులు ప్రభుత్వాస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి పంపించారు. అక్కడ వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పైలా నరసింహయ్య, రమేష్‌రెడ్డి, విద్యార్థి విభాగం పట్టణ అద్యక్షుడు మనోజ్ తదితరులు వచ్చి శిరీష్‌రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు. సాయంత్రం శిరీష్‌రెడ్డి మృతదేహం వీరారెడ్డిపల్లెకు తీసుకొచ్చారు. అంత్యక్రియల్లో వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ వెంకటరామిరెడ్డి, నాయకులు యాడికి మాజీ ఉపసర్పంచు కాసా చంద్రమోహన్, మండల ప్రధాన కార్యదర్శి కోట చౌదరి, సేవాదళ్ కన్వీనర్ అవుకు నాగరాజు, సేవాదళ్ ఉపాధ్యక్షుడు రామ్మోహన్, బీసీసెల్ కన్వీనర్ మధురాజు, కోటి వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు. -
స్నేహితురాలితో బైక్‌పై వెళుతుండగా..
రాజమహేంద్రవరం క్రైం: లారీ ఢీ కొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా శ్రీనివాసనగర్, రామగిరి ప్రాంతానికి చెందిన ఉత్తమ రాజు నిఖిల్ కుమార్(35) హైదరాబాద్‌లో ఓ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తుంటాడు. అతడి స్నేహితురాలు హైదరాబాద్, శారదా నగర్ రోడ్డు, సరూర్ నగర్‌కు చెందిన నివేదితతో కలసి హైదరాబాద్ నుంచి పల్సర్ బైక్‌పై విశాఖపట్నం వెళుతుండగా దివాన్ చెరువు జీరో పాయింట్ వద్ద రోడ్డుపై గుంత ఉండడంతో సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనుక నుంచి వస్తున్న లారీ వేగంగా వచ్చి బైక్‌ను ఢీ కొట్టి, నిఖిల్కుమార్పై నుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటనలో నిఖిల్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ వెనుక కూర్చున్న నివేదితకు కుడి కాలు, కుడి చేయి విరిగాయి. గాయాలు పాలైన ఇద్దరినీ రోడ్డు సేఫ్టీ కానిస్టేబుళ్లు ఎన్. లక్ష్మణరావు, నర్సయ్యలు హుటాహుటిన చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నివేదిత ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మృతుడు నిఖిల్ కుమార్, నివేదితకు వేరు వేరుగా వివాహాలైనట్టు పోలీసులు తెలిపారు. కొంత కాలంగా వారు స్నేహంగా ఉంటున్నారన్నారు. సోమవారం హైదరాబాద్‌లో బయల్దేరి ఉంటారని, మార్గం మధ్యలో పశ్చిమ గోదావరి జిల్లా గౌరీపట్నంలో చర్చిని సందర్శించుకొని రోడ్డు మార్గంలో గామన్ ఇండియా బ్రిడ్జి మీదుగా వైజాగ్ వెళుతుండగా వారు రోడ్డు ప్రమాదానికి గురయ్యారన్నారు. నిఖిల్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రిలోని మార్చరీకి తరలించారు. బొమ్మూరు సీఐ నాగమోహన్ రెడ్డి, ఎస్సైలు సంఘటన స్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహేతర జంట ఆత్మహత్యాయత్నం
సాలూరు విజయనగరం : పట్టణంలోని బంగారమ్మకాలనీకి చెందిన మరిపి కృష్ణ (50), అతని సహజీవని సుజాత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానికులతో పాటు కృష్ణ కుమారుడు శివ తెలియజేసిన వివరాల మేరకు... రెండేళ్ల కిందటి వరకు స్థానిక బెల్లం వ్యాపారి వద్ద గుమస్తాగా పనిచేసిన కృష్ణ తొలి భార్య మరణించడంతో సుజాతకు ఆశ్రయమిచ్చి సహజీవనం చేస్తున్నాడు. అప్పటికే కృష్ణకు ఇద్దరు కుమారులుండగా, పెద్ద కుమారుడు కొన్నాళ్ల కిందట మృతి చెందాడు. ఇదిలా ఉంటే కంటిచూపు కోల్పోయిన కృష్ణ ఇంటికే పరిమితం కావడంతో కృష్ణ, సుజాతల మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి కూడా ఇరువురి మధ్య గొడవ జరగడంతో, గురువారం వేకువజామున సుజాత ఇంటిలో ఉన్న చీమల మందు తాగింది. వెంటనే శివ గమనించి ఆమెను పట్టణ ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు సుజాత ఏమి తాగిందో ఆ సీసాను తీసుకురావాలని కోరడంతో.. శివ హుటాహుటిన ఇంటికి చేరుకున్నాడు. ఇంతలో ఇంటి దూలానికి వేలాడుతున్న కృష్ణను చూసి అవాక్కయ్యాడు. కొన ఊపిరితో ఉన్న తండ్రిని దించి ఆస్పత్రికి తీసుకొచ్చేలోగా ప్రాణాలొదిలాడు. సుజాత ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పట్టణ పోలీసులు కేసున మోదుచేసి విచారణ చేపడుతున్నారు. -
బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
మదనపల్లె క్రైం: మదనపల్లె మండలంలో శనివారం ఉదయం ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. రూరల్ పోలీసుల కథనం మేరకు.. మదనపల్లె పట్టణం అమ్మచెరువుమిట్టలో నివాసముంటున్న బండ కార్మికుడు తిరుమలకొండ వెంకటరమణ పెద్ద కుమారుడు పెద్దరామాంజులు (ఆంజి) (31) బండపని చేసి భార్య వెంకటలక్ష్మి, పిల్లలు నాగేశ్వరి, అజయ్, తల్లిదండ్రులను పోషించుకుంటున్నాడు. నీరుగట్టువారిపల్లె బాబుకాలనీ సమీపంలో సూరి ఇటుకల బట్టీలో ఇటుకలు వేస్తున్న పీటీఎం మండలం బురుజుపల్లెకు చెందిన జరిపిటి రామచంద్రయ్య కుమారుడు రామకృష్ణ (28)తో కలిసి సొంత పనిమీద ఆంజి ద్విచక్రవాహనంలో సీటీఎం బయలుదేరారు. ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ మలుపు వద్ద తిరుపతి నుంచి మదనపల్లెకు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన ఏఎంసీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పెద్దరామాంజులు మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన రామకృష్ణను ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ డైరెక్టర్ వెస్లి ఆదేశాల మేరకు ఏఎంసీ అంబులెన్స్‌లో మదనపల్లె జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రామకృష్ణ ప్రాణాపాయం నుంచి బయటపడి కోలుకుంటున్నాడు. ఆంజి కుటుంబ సభ్యులు ప్రభుత్వాస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐలు సునీల్‌కుమార్, కేవీహెచ్.నాయుడు తెలిపారు. -
ప్రాణం తీసిన కుటుంబ కలహాలు
కుటుంబ కలహాల నేపథ్యంలో గురజాల మండలం మాడుగుల గ్రామంలో సోమవారం రాత్రి హత్య జరిగింది. తన తమ్ముడు గనిపల్లి అమ్మోసు, అతని భార్య ఏసమ్మ గొడవపడుతుండగా గనిపల్లి శ్యామేలు (35) సర్దిచెప్పేందుకు ప్రయత్నించాడు. ఏసమ్మ కుటుంబ సభ్యులు కర్రతో మోదడంతో శ్యామేలు తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. గుంటూరు జిల్లా /గురజాల : కుటుంబంలో చేలరేగిన కలహాలు వ్యక్తి హత్యకు దారి తీశాయి. ఈ ఘటన గురజాల మండలంలో సోమవారం రాత్రి జరిగింది. వివరాల ప్రకారం.. మాడుగుల గ్రామంలోని ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న గనిపల్లి శ్యాయ్మేలు (35)హత్యకు గురయ్యాడు. తమ్ముడు గనిపల్లి అమ్మోసు అతని భార్య ఏసమ్మలు సోమవారం రాత్రి భోజనం సమయంలో గొడవపడ్డారు. ఈ క్రమంలో అమ్మోసు ఇంటి పక్కనే నివాసం ఉంటున్న అన్న శ్యాయ్మేలు తమ్ముడు, మరదల గొడవను చూసి సర్థిచెప్పే ప్రయత్నం చేశాడు. అయినా ఏసమ్మ భర్తతో పెద్దగా అరుస్తూ వాగ్వాదానికి దిగుతోంది. ఇంతలో ఆమె కుటుంబ సభ్యులు టి.బాబు, రమేష్, యోహాన్, ఏసోబు, రాజేష్, సీతారావమ్మ, సీతమ్మ, ఆదాంలు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు వచ్చారు. ఈ క్రమంలోనే భార్యభర్తలకు సర్థి చెబుతున్న శ్యాయ్మేలును వస్తూ వస్తూనే తలపై కర్రతో గట్టిగా కొట్టారు. తీవ్ర గాయం కావడంతో క్షతగాత్రుడిని స్థానికులు ఆటోలో గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలిస్తుండగా మార్గం మధ్యలో శ్యాయ్మేలు మృతి చెందాడు. మృతుడు కుమారుడు చిన్నరాజు ఫిర్యాదు మేరకు సీఐ వై.రామారావు ఏసమ్మతో పాటు ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎప్పుడూ గొడవలే.. మృతుడు శ్యామేలు తమ్ముడు అమ్మోసు అదే గ్రామానికి చెందిన ఏసమ్మను తొమ్మిదేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. తమ్ముడు కుటుంబంలో ఎప్పుడూ గొడవలు వస్తుండేవి. మృతుడు శ్యాయ్మేలు సర్థి చెప్పేవాడు. గతంలో కూడా అమ్మోసుపై భార్య ఏసమ్మ రెండు సార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గర్భిణిగా ఉన్నప్పుడు పుట్టింటికి వెళ్లి బిడ్డకు జన్మనిచ్చిన కొన్నాళ్లకు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నన్ను చంపేందుకు భర్త అమ్మోసు ప్రయత్నించాడని కేసు పెట్టింది. పెద్దలు రాజీ కుదర్చడంతో విషయం చల్లారింది. తర్వాత మరికొద్ది రోజులకు ఏసమ్మ కుటుంబ సభ్యులు బంగారు అభరణాలు దొంగతనం కేసును కూడా అమ్మోసుపై పెట్టారు. తన భార్య రెండు నెలల కిందటే పుట్టింటి నుంచి ఇక్కడికి వచ్చిందని మృతుడు తమ్ముడు అమ్మోసు తెలిపారు. పలువురి పరామర్శ.. శ్యాయ్యేలు మృతదేహన్ని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ నాయకుడు ఎనుముల మురళీధర్‌రెడ్డి, మండల కన్వీనర్ సిద్ధాడపు గాంధీ, పట్టణ కన్వీనర్ కె.అన్నారావులు సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి.. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
హాజీపూర్(మంచిర్యాలరూరల్) : హాజీపూర్ మండలం దొనబండ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మందమర్రికి చెందిన ఓ యువకుడు మృతిచెందగా మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. హాజీపూర్ ఎస్సై ముత్తన్న తెలిపిన వివరాల ప్రకారం.. మందమర్రి రాజీవ్‌నగర్‌కు చెందిన శెట్పల్లి నిఖిల్‌సాయి, రాజ్‌కుమార్, సాయిపవన్, వెంకటరమణ, సిద్దులు కారులో మందమర్రి నుంచి లక్సెట్టిపేట వైపు వెళ్తుండగా ఎదురుగా వేగంగా వస్తున్న ట్రాక్టర్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న శెట్పల్లి నిఖిల్‌సాయి(19) తలకు తీవ్ర గాయాలయ్యాయి. రాజ్‌కుమార్, సాయిపవన్, వెంకటరమనణ, సిద్ధులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హాజీపూర్ పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో నిఖిల్‌సాయి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మిగతా నలుగురు యువకులు పట్టణలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతన్నారు. కాగా మృతుడు నిఖిల్‌సాయికి తండ్రి రాజేశం, తల్లి విజయ ఉన్నారు. తండ్రి క్యాబ్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. నిఖిల్‌సాయి బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
రంగారెడ్డి జిల్లాలో విషాదం
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ మండలం నాన్‌దార్‌ఖన్‌పేట్‌లో గురువారం విషాదం చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం టీ పెడుతుండగా ఓ ఇంట్లో సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో లక్ష్మీనారాయణ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో మహిళ, ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. ఇంటి నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. గాయపడిన క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. -
ఆఫ్జల్‌గంజ్‌లో విషాదం
-
పెళ్లి బృందం డీసీఎం బోల్తా
మరికొన్ని గంటల్లో ‘నిఖా’ (వివాహ వేడుక).. ఎంతో సంతోషంగా బంధుమిత్రులు తీసుకుని ఇంటి నుంచి బయలుదేరారు. ఎంతో సందడిగా వెళ్తున్న ఆ పెళ్లి బృందం క్షణాల్లోనే క్షతగాత్రులుగా మారారు. అనుకోని విధంగా జరిగిన ప్రమాదంతో అప్పటి వరకు పెళ్లి వేడుకల సంబురంలో ఉన్న వారంతా ఆహాకారాలు.. రోదనలతో మృత్యు భయంతో వణికిపోయారు. మహబూబాబాద్ రూరల్: ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి బోల్తా కొట్టిన పెళ్లిబృందం డీసీఎంను అటుగా వెళ్తున్న మరో గూడ్స్‌వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరి మృతి చెందగా, నలుగురికి తీవ్రంగా, మరో ఎనిమిది మందికి స్వల్ప గాయాలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని భవానీనగర్ తండా సమీపంలో సోమవారం జరిగిన ఘటన వివరాలు బాధితులు, స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... మహబూబాబాద్ మండలంలోని ఈదులపూసపల్లి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు ఎండీ. హుస్సేన్‌షరీఫ్–నూర్జహాన్ కుమారుడు ఆరీఫ్‌షరీఫ్ వివాహం నెల్లికుదురు మండంలోని బ్రాహ్మణకొత్తపల్లి గ్రామానికి చెందిన అక్బర్–రజీయా కుమార్తె రిజ్వానాతో జరిపేందుకు నిశ్చయించారు. ఈ పెళ్లి బృందం మొత్తం ఒక డీసీఎం వాహనంలో జిల్లా కేంద్రంలోని భవానీనగర్ తండా మీదుగా మధ్యాహ్నం సమయంలో వెళ్తోంది. అదే సమయంలో కురవి మండలం గుండ్రాతిమడుగు గ్రామ శివారు పెద్దతండాకు చెందిన కొర్ర వీరన్న తన ద్విచక్ర వాహనంపై ఏ క్యాబిన్ రైల్వేగేట్ నుంచి ఎదురుగా వేగంగా వచ్చాడు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన బైక్‌ను డీసీఎం వాహన డ్రైవర్ తప్పించే ప్రయత్నం చేయగా ఒక్కసారిగా అదుపుతప్పి పక్కన ఉన్న కంకర కుప్ప పైకి వెళ్లి పల్టీకొట్టింది. అదే సమయంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లికి చెందిన చాక్‌పీస్‌ల వ్యాపారి కూర పాటి బాబురావు, డ్రైవర్ గోసిక రాఘవేంద్ర గూడ్స్‌వ్యాన్‌లో అటువైపుగా వస్తున్నారు. ఒక్కసారిగా ముందు పడిన పెళ్లిబృందం డీసీఎంను వారు బలంగా ఢీకొట్టారు. క్షతగాత్రులు వీరే.. ఈ ప్రమాదంలో పెళ్లి కొడుకు ఆరీఫ్ షరీఫ్ తండ్రి హుస్సేన్‌షరీఫ్ తలకు, గూడ్స్‌వ్యాన్ డ్రైవర్ గోసిక రాఘవేంద్ర తలకు తీవ్ర గాయాలయ్యాయి. డీసీఎంలో ఉన్న ఎస్కే.సమీర్, ఎండీ.అజీమ్‌కు చేతులు విరిగాయి. పసునూరి కరుణాకర్, ఉమేష్, పెండ్లి కొడుకు అన్న ఆసీఫ్, సాయి, శ్రావణ్, ఇమామ్ పాషా, యాకుబ్ పాషాకు స్వల్ప గాయలయ్యాయి. వీరిని వెంటనే చికిత్స నిమిత్తం మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇక డీసీఎం డ్రైవర్ తప్పించిన ద్విచక్రవాహనదారుడు కొర్ర వీరన్న వ్యాన్ వెనుకవైపు ఢీకొట్టి తీవ్రంగా గాయపడ్డాడు. కాగా, చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో మృతి చెందాడు. హాహాకారాలు..రోదనలు... పెళ్లి బృందం డీసీఎం వ్యాన్ బోల్తా పడిన ఘటన స్థలంలో ఆహాకారాలు.. రోదనలు మిన్నంటాయి. ప్రమాదం జరుగగానే రోడ్డు అడ్డంగా వాహనం పడిపోవడంతో ట్రాఫిక్ జాం ఏర్పడింది. పెళ్లి బృందం వారికి ప్రమాదం జరిగిందని వార్త తెలియగానే ఘటన స్థలానికి జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరుగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గూడ్స్‌వ్యాన్ డ్రైవర్ రాఘవేంద్ర అందులోనే ఇరుక్కుపోగా పోలీసులు, స్థానికులు అతడిని అతి కష్టం మీద బయటకి లాగి ఆస్పత్రికి తరలించారు. డీసీఎం వ్యాన్ ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది. సమయ స్ఫూర్తితో డ్రైవర్ అందులో నుంచి బయటకు వచ్చాడు. టౌన్ ఎస్సై అరుణ్‌కుమార్, ట్రాఫిక్ ఎస్సై సిరిసిల్ల అశోక్, సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని రోడ్డుకు అడ్డంగా ఉన్న వాహనాలను తీయించి ట్రాఫిక్ క్లియర్ చేయించారు. మండల మైనార్టీ సెల్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఫక్రూద్దీన్, సర్పంచ్ షఫీయుద్దీన్, టీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సుధగాని మురళీ క్షతగాత్రులను పరామర్శించారు. -
ప్రాణం తీసిన అతివేగం
-
లాడ్జిపై షీ టీమ్స్ దాడులు, మహిళ మృతి
కర్నూలు : షీ టీమ్స్ నుంచి తప్పించుకునే క్రమంలో ఓ మహిళ కిందపడి మృతి చెందిన ఘటన ఆదివారం నగరంలోని కొత్తబస్టాండ్ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. ఆత్మకూరు పట్టణానికి చెందిన లక్ష్మి(40) భర్త చనిపోవడంతో లక్ష్మీనారాయణ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కుమార్తె ఉంది. లక్ష్మి రోజూ కర్నూలుకు వచ్చి మహిళలను ఆర్టీసీ కొత్త బస్టాండు సమీపంలోని లాడ్జికి తరలించి పడుపు వృత్తి చేయించేది. ఇందులో భాగంగా హసీనా అనే మహిళతో పాటు మరో మహిళను లాడ్జీలోకి పంపించి బయటే వేచి ఉంది. సమాచారం అందుకున్న షీటీమ్స్ ఆటోలో అక్కడికి చేరుకున్నారు. మహిళా పోలీసులను చూసిన లక్ష్మి పారిపోయేందుకు యత్నించింది. ఈ క్రమంలో కిందపడడంతో ముక్కు నుంచి రక్తస్రావమైంది. వెంటనే పోలీసులు ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సీఐ మురళీధర్‌రెడ్డి, ఎస్ఐ మహేశ్వరరెడ్డి, ఏఎస్ఐ ప్రకాష్ ఆసుపత్రికి చేరుకొని వివరాలు సేకరించారు.