రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
నల్లగొండ: నల్లగొండ పట్టణం సమీపంలోని పానగల్ బైపాస్ రోడ్డులో సోమవారం తెల్లవారుజామున ప్రమాదం చోటు చేసుకుంది. అద్దంకి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎయిర్‌లాక్ అయి నిలిచిపోగా దాన్ని కల్యాణ్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.