
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. నార్కట్‌పల్లి-అద్దంకి హైవేపై ఓ ప్రైవేటు బస్సు..ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ పప్రమాదంలో ఒక మహిళ మృతిచెందగా.. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి వివరాల ప్రకారం.. మిర్యాలగూడ సమీపంలో నార్కట్‌పల్లి-అద్దంకి హైవేపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ట్రాక్టర్‌ను ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌పై ప్రయాణిస్తున్న మహిళ మృతిచెందింది. ఇదే సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 12 మంది గాయాలయ్యాయి. దీంతో, వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, వీరంతా హైదరాబాద్‌లో ఓ వివాహ వేడుకకు హాజరై నెల్లూరుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది, ఇక, ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 36 మంది ఉన్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment