బీబీనగర్: నల్గొండ జిల్లా బీబీనగర్ సమీపంలో ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈసీఐఎల్ నాగార్జునహిల్స్ ప్రాంతానికి చెందిన ఆకాశ్ (35) భువనగిరి నుంచి హైదరాబాద్‌కు బైక్పై బయలుదేరాడు. బీబీనగర్ సమీపంలో వెనుక నుంచి వచ్చిన ఓ వాహనం అతని బైక్‌ను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆకాశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించనున్నారు.