శంషాబాద్: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ రాళ్లగూడ ఔటర్‌రింగ్‌రోడ్డుపై బుధవారం ఉదయం చోటుచేసుకుంది. శంషాబాద్ నుంచి కారులో గచ్చిబౌలికి వెళ్తుండగా, అతివేగంగా కారు నడపటం వల్ల ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న హైవే పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వారు మహబూబ్‌నగర్ జిల్లా వాసులుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.