car slipped
-
శంషాబాద్ లో కారు బీభత్సం
మూడు బైక్‌లను ఢీకొట్టిన కారు హైదరాబాద్: శంషాబాద్ సమీపంలో శనివారం రాత్రి ఒక కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన కారు ముందు వెళ్తున్న మూడు బైక్‌లను ఢీకొట్టి, ఆపై బోల్తా పడింది. ఈ ఘటనలో ఒక బైక్‌పై ఉన్న దంపతులతో పాటు చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడిని వెంటనే రెయిన్బో ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. మిగతా వాహనదారులకు గాయాలయ్యాయి. కారు డ్రైవర్ పరారయ్యాడు. కారును పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఔటర్‌పై కారు బోల్తా.. ఒకరి మృతి
శంషాబాద్: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ రాళ్లగూడ ఔటర్‌రింగ్‌రోడ్డుపై బుధవారం ఉదయం చోటుచేసుకుంది. శంషాబాద్ నుంచి కారులో గచ్చిబౌలికి వెళ్తుండగా, అతివేగంగా కారు నడపటం వల్ల ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న హైవే పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వారు మహబూబ్‌నగర్ జిల్లా వాసులుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
డివైడర్‌ను ఢీకొట్టిన కారు: ముగ్గురి మృతి
కనగానిపల్లె: అతివేగంతో వెళ్తోన్న ఓ కారు టైర్ పంక్చర్ అవడంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతిచెందారు. ఈ ఘటన అనంతపురం జిల్లా కనగానిపల్లె మండలం మామిళ్లపల్లి వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఓ కుటుంబం వెళ్తోంది. అయితే, ప్రమాదవశాత్తూ కారు అదుపుతప్పింది. రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టి కారు బోల్తాపడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతిచెందగా, మరో ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. మృతులలో ఇద్దరు మహిళలు, ఓ డ్రైవర్ ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. -
కారు బోల్తా: ఐదుగురికి గాయాలు
వి.కోట(చిత్తూరు జిల్లా): వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి బోల్తాపడటంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మంగళవారం చిత్తూరు జిల్లా వి. కోట మండలం ఓగు గ్రామం సమీపంలో జరిగింది. వివరాలు.. తమిళనాడుకు చెందిన కొంత మంది కారులో చిత్తూరు వెళ్తున్నారు. కాగా, మార్గమధ్యలో వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఐదుగురు గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం తమిళనాడులోని వెలూరులో ఉన్న సీఎమ్సీ మెడికల్ కాలేజీకి తరలించారు. -
కారు బోల్తా-ఒకరి మృతి
తొండంగి (తూర్పుగోదావరి): జాతీయ రహదారి-16 పై వేగంగా వెళ్తున్న కారు టైరు పంచర్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండల పరిధిలో జరిగింది. వివరాలు.. వైజాగ్ నుంచి ఏలూరు వెళ్తున్న కారు అన్నవరం సమీపంలో టైరు పంచర్ కావడంతో బోల్తాపడింది. ఈ ఘటనలో రిటైర్డు ఉద్యోగి ఎల్. చందర్రావు(65) మృతిచెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కారు బోల్తా... ముగ్గురు మృతి
చేగుంట: మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి వద్ద ఆదివారం ఉదయం ఓ కారు బోల్తాపడిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. హైదరాబాద్‌లోని మియాపూర్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం కారులో బాసరకు వెళుతుండగా... రెడ్డిపల్లి వద్దకు వచ్చేసరికి కారు అదుపుతప్పి బోల్తాపడింది. వంగ పుష్పావతి, చిన్నారి సూర్యతేజతోపాటు రత్నారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీకాంత్‌రెడ్డితోపాటు మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. -
కారు బోల్తా... వ్యక్తి మృతి
మనుబోలు: ప్రమాదవశాత్తూ కారు బోల్తాపడటంతో అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో మనుబోలు-గూడురు మధ్య 16వ నంబర్ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. మునుబోలు - గూడురు మార్గంలో ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తూ బోల్తాపడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మృతిచెందాడు. కాగా, మృతుడిని గూడురుకు చెందిన చేరెడ్డి సాయి ప్రతాప్‌రెడ్డి (40)గా గుర్తించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. -
జాతీయ రహదారిపై కారు బోల్తా.. ఇద్దరు మృతి
అనంతపురం: కారు బోల్తాపడటంతో ఇద్దరు మృతిచెందగా మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి... గొరెంట్ల మండల పాలసముద్రం సమీపంలో 44వ జాతీయ రహదారి వద్ద కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కర్ణాటకకు చెందిన మునుస్వామి, హేమలత మృతిచెందగా, మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం వెంటనే కర్ణాటకలోని చిక్బల్లాపూర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తివివరాలు ఇంకా తెలియరాలేదు.