కారు బోల్తా... ముగ్గురు మృతి | 3 persons died in car slipped incident | Sakshi
Sakshi News home page

కారు బోల్తా... ముగ్గురు మృతి

Published Sun, Mar 29 2015 8:31 AM | Last Updated on Sat, Sep 2 2017 11:33 PM

3 persons died in car slipped incident

చేగుంట: మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి వద్ద ఆదివారం ఉదయం ఓ కారు బోల్తాపడిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. హైదరాబాద్‌లోని మియాపూర్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం కారులో బాసరకు వెళుతుండగా... రెడ్డిపల్లి వద్దకు వచ్చేసరికి కారు అదుపుతప్పి బోల్తాపడింది. వంగ పుష్పావతి, చిన్నారి సూర్యతేజతోపాటు రత్నారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీకాంత్‌రెడ్డితోపాటు మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement