
కారు బోల్తా-ఒకరి మృతి
తొండంగి (తూర్పుగోదావరి): జాతీయ రహదారి-16 పై వేగంగా వెళ్తున్న కారు టైరు పంచర్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండల పరిధిలో జరిగింది. వివరాలు.. వైజాగ్ నుంచి ఏలూరు వెళ్తున్న కారు అన్నవరం సమీపంలో టైరు పంచర్ కావడంతో బోల్తాపడింది. ఈ ఘటనలో రిటైర్డు ఉద్యోగి ఎల్. చందర్‌రావు(65) మృతిచెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.