person died
-
దుబాయిలో విలాసాగర్‌వాసి మృతి
బోయినపల్లి(చొప్పదండి): బతుకుదెరువు కోసం పన్నెండేళ్ల క్రితం దుబాయి వెళ్లాడు.. కూతుళ్ల పెళ్లికీ రాలేదు.. రెండు రోజుల క్రితం గుండెపోటు రావడంతో మృతిచెందాడు. విషయం తెలిసిన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బోయినపల్లి మండలంలోని విలాసాగర్‌కు చెందిన చల్ల శ్రీనివాస్(58) గ్రామంలో హమాలీ పని చేసేవాడు. స్థానికంగా ఉపాధి అవకాశాలు లేకపోవడంతో దుబాయి వెళ్లాడు. వెళ్లినప్పటి నుంచి స్వగ్రామానికి తిరిగి రాలేదు. కోవిడ్, వీసా సమస్యల వల్ల తన ఇద్దరు కూతుళ్లు రవళి, రమ్య వివాహానికి సైతం రాలేకపోయాడు. మృతుడికి భార్య పద్మ ఉంది. ఆమె అప్పులు చేసి, కూతుళ్ల వివాహం జరిపించినట్లు గ్రా మస్తులు తెలిపారు. శ్రీనివాస్ గుండెపోటుతో మృతి చెందాడన్న విషయం దుబాయిలో ఉండే అతని బంధువు ద్వారా తెలిసిందని పేర్కొన్నారు. విప్‌ను కలిసిన మృతుడి కుటుంబసభ్యులు శ్రీనివాస్ మృతితో తాము దిక్కులేనివారమయ్యామని బాధిత కుటుంబసభ్యులు కంటతడి పెట్టారు. తమకు ప్రభుత్వ పరంగా ఆర్థికసాయం అందించి, ఆదుకోవాలని బుధవారం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ను కలిసి విన్నవించారు. శ్రీనివాస్ మృతదేహాన్ని త్వరగా స్వగ్రామం రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. -
మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి మృతి
కడప అర్బన్: వైఎస్సార్ కడపలో అనంతపురం జిల్లావాసి మ్యాన్‌హోల్‌లో పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా కదిరికి చెందిన బుక్కే శీనునాయక్ (45), బుక్కే నీలమ్మ దంపతులు. వీరికి ఇంటర్ చదివే కుమార్తె ఉంది. ఉపాధి కోసం వీరు కొన్నేళ్ల కిందట కడపకు వలస వెళ్లారు. శీనునాయక్ కోటిరెడ్డి సర్కిల్ సమీపంలోని బార్ అండ్ రెస్టారెంట్లో సప్లయర్‌గా పని చేస్తుండేవాడు. అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసేందుకు భార్య నీలమ్మ నెలన్నర కిందట కదిరికి వెళ్లింది. కుమార్తె మదనపల్లెలో ఇంటర్ చదువుతోంది. శీనునాయక్ 20 రోజులుగా పనికి కూడా వెళ్లడం లేదు. రెండువారాల కిందట ఇంటి కరెంట్ బిల్లు తీసుకుని బయటకు వచ్చాడు. తిరిగి ఇంటికి వెళ్లలేదు. బీపీ షుగర్‌తో పాటు ఒక వైపు కన్ను కనిపించని శీనునాయక్ శుక్రవారం సూర్య ఆస్పత్రి సమీపాన మ్యాన్‌హోల్‌లో విగతజీవిగా కనిపించాడు. ప్రమాదవశాత్తు మ్యాన్‌హోల్‌లో పడి మృతి చెంది ఉండవచ్చని బంధువులు భావిస్తున్నారు. వన్‌టౌన్ సీఐ సత్యనారాయణ, ఎస్ఐ సుధాకర్, ఏఎస్ఐ వలి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
చేపలు దొంగతనం చేశాడని ప్రాణం తీశారు
గురుగ్రామ్: హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. చేపలు దొంగలించాడన్న కారణంతో ఆరుగురు యువకులు కలిసి ఒక వ్యక్తిని దారుణంగా చితకబాదారు. దీంతో తీవ్ర గాయాలపాలైన అతను ఆదివారం కన్నుమూశాడు. వివరాలు.. హర్యానాలోని చందోల్ గ్రామానికి చెందిన అనిల్ తన స్నేహితుడు కాలే, బంధువు పవన్‌తో కలిసి శనివారం అర్థరాత్రి దాటాకా చాపర్ గ్రామానికి చేపలు పట్టేందుకు వెళ్లాడు. అయితే అదే సమయంలో ఆ గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు వచ్చి ఈ సమయంలో చేపలు పట్టడం ఏంటని.. ఊరి అనుమతి లేకుండా ఎలా పట్టుకుంటారంటూ వారిని బెదిరించారు. దీంతో అనిల్‌తో అతని స్నేహితులు అక్కడినుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించగా.. ఆ యువకులు వారిని అడ్డగించారు. అనిల్‌తో పాటు ఉన్న కాలే, పవన్‌లు అక్కడినుంచి తప్పించుకోగా.. అనిల్ మాత్రం దొరికిపోయాడు. ఈ నేపథ్యంలో అనిల్‌పై ఆ యువకులు కర్రలతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత పక్కనే డంప్‌యార్డ్‌లో పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా మరుసటిరోజు ఉదయం ఆ ఊరి గ్రామస్తులు డంప్‌యార్డ్ దగ్గర అనిల్ పడి ఉండడం చూసి అతని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు అనిల్‌ను దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు అతన్ని పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకొని అనిల్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో అనిల్‌పై దాడి చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసి వారికోసం గాలిస్తున్నారు. -
ఎంజీఎంలో విషాదం: నిర్లక్ష్యానికి ‘ఊపిరి ఆగింది’!
సాక్షి,వరంగల్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఓ కరోనా రోగి మృతి చెందాడు. కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో వెంటిలేటర్‌పై ఉన్న రోగి ఊపిరాడక మృత్యువాత పడ్డాడు. ఇది ముమ్మాటికీ వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాలు.. కరోనా బాధితుడు గాంధీ.. గత నెలాఖరులో ఎంజీఎం ఆస్పత్రిలో చేరాడు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో డాక్టర్లు వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందిస్తున్నారు. అయితే, శనివారం ఆస్పత్రిలో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీంతో వెంటిలేటర్ పనిచేయకపోవడంతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై అతను ప్రాణాలు కోల్పోయాడు. కాగా, వెంటిలేటర్ తీసేసి సాధారణ బెడ్‌పై వేయడంతో గాంధీ ప్రాణాలు కోల్పోయాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఎంజీఎం సూపరింటెండెంట్ నాగార్జునరెడ్డి వివరణ ఇస్తూ... ఆస్పత్రిలో అందుబాటులో జనరేటర్లు ఉన్నాయని, మరో వెంటిలేటర్ మార్చే క్రమంలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగానే కరోనా బాధితుడు ప్రాణాలు కోల్పోయాడని స్పష్టం చేశారు. -
పులి దాడిలో యువకుడి మృతి
సాక్షి, మంచిర్యాల : పులి దాడిలో ఓ గిరిజన యువకుడు మృతిచెందా డు. కుమురంభీం జిల్లా దహెగాం మండలం దిగిడలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. దిగిడకు చెందిన గిరిజన యువకుడు సిడాం విఘ్నేష్ (22).. శ్రీకాంత్, నవీన్‌తో కలసి పత్తి చేను వద్దకు వెళ్లారు. అక్కడ పొదలమాటున ఉన్న పులి ఒక్కసారిగా విఘ్నేష్‌పై దాడి చేసింది. అతన్ని నోటకరుచుకుని అడవిలోకి లాక్కెళ్లింది. విఘ్నేష్‌తో వెళ్లిన ఇద్దరు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు, స్థానికులకు సమాచారం ఇచ్చారు. అంతా ఆ ప్రాంతంలో వెతకగా మృతదేహం లభ్యమైంది. తల, ఇతర శరీర భాగాలపై పులి విఘ్నేష్‌ను తీవ్రం గా గాయపర్చింది. జిల్లా అటవీ అధికారుల, పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా తడోబా–అందేరి అభయారణ్యంలోని పులులు తరచూ సమీప గ్రామాల్లోకి వచ్చి మనుషులపై దాడి చేస్తున్నాయి. ఈ దాడుల్లో ఈ ఏడాదిలో అక్కడ 20 మంది ప్రాణాలు కోల్పోగా.. అనేకమంది గాయపడ్డారు. దీంతో అక్కడి అటవీ అధికారులు 50 పులులను వేరే ప్రాంతానికి తరలించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం తడోబాలో 160 పులులు ఉన్నాయి. వీటి ఆవాసా లు ఇరుకుగా మారడంతో ప్రాణహిత దాటి తెలంగాణలో అడుగుపెడుతున్నాయి. అలా ఆవాసాలు వెతుక్కునే క్రమంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యా ల జిల్లాల అటవీ ప్రాంతంలోని పశువుల కాపర్లకు, బాటసారులకు అనేకసార్లు పులులు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. -
పెళ్లికి ముందు..పెళ్లి రోజు
సాక్షి, ఇల్లందకుంట(హుజురాబాద్): కూతురికి అంగరంగవైభవంగా పెళ్లి జరిపించిన తండ్రి..వధువును అత్తాంటికి సాగనంపుతుండగా జరిగిన బరాత్‌లో ఆనందంతో నృత్యం చేస్తున్నాడు. గుండెపోటురావడంతో అక్కడే కూప్పకూలిన సంఘటన ఇల్లందకుంట మండలం మల్యాలలో చోటుచేసుకుంది. అలాగే జమ్మికుంట పట్టణం హౌసింగ్‌బోర్డులో కుమారుడి పెళ్లి ఏర్పాట్ల బిజీగా ఉన్న తండ్రి గుండెపోటురావడంతో మృతిచెందాడు. ఇరుకుటుంబాల్లో విషాదం అలుముకుంది. వివరాలు ఇలా..ఇల్లందకుంట మండలం మల్యాల గ్రామానికి చెందిన మేకల వీరస్వామి దాసు(50),శాంత దంపతులు. వీరికి ముగ్గురు కుమార్తెలు వీణ, వాణి, వినీ ఉన్నారు.. నిరుపేద కుటుంబానికి చెందిన దాసు 15 ఏళ్లక్రితం కుటుంబ పోషణ నిమిత్తం జమ్మికుంట వచ్చాడు. దాసు ఆర్టీఏ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. పెద్దకూతురు వీణ వివాహం హుజురాబాద్ మండలం రాజపల్లి గ్రామానికి చెందిన యువకుడు విజయ్‌తో శుక్రవారం పట్టణంలోని ఫంక్షన్ హాల్లో బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిపించాడు. సాయంత్రం ఇంటి వద్ద కూతురు అప్పగింతల కార్యక్రమం ముగిసిన తరువాత బరాత్ ఏర్పాటు చేశారు. మిత్రులు, బంధువులు డ్యాన్స్‌లు చేస్తుండగా వీరస్వామి దాసు కూడా ఆనందంతో నృత్యం చేస్తుండగా ఒక్కసారి కుప్పకూలిపోయాడు. హుటాహుటిన బంధువులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో మృతిచెందాడు. కూతురిని అత్తారింటికి పంపే సమయంలో తండ్రి మృతిచెందడంతో వారి రోదనలు కంటతడి పెట్టించాయి. జెడ్పీచైర్‌పర్సన్ పరామర్శ విషయం తెలుసుకున్న జెడ్పీచైర్‌పర్సన్ కనుమల్ల విజయ కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వపరంగా కుటుంబాన్ని ఆదుకుంటామని హామీఇచ్చారు. పెళ్లికి ముందే తండ్రి.. జమ్మికుంట : పట్టణంలోని హౌసింగ్ బోర్డుకాలనీలో కుమారుడి పెళ్లి వేడుకల ఏర్పాట్లలో గౌసొద్దీన్ (65) బిజీగా ఉన్నారు. శుక్రవారం ఉదయం గౌసొద్దీన్‌కు గుండెపోటురావడంతో పడిపోగా ఆస్పత్రికి తరలించారు. అయినా ప్రాణాలు దక్కలేదు. దీంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. గౌసొద్దీన్‌కు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
విషాదం : ఉంగరంతో తన భర్తను గుర్తుపట్టింది
లండన్ : హిందూ మహాసముద్రంలోని ఓ దీవికి విహారయాత్రకని వెళ్లిన దంపతులకు విషాదమే మిగిలింది. ఈతకు వెళ్లిన వ్యక్తిని ఏకంగా ఒక సొరచాప మింగేసింది. వివరాల్లోకి వెళితే.. ఎడిన్‌బర్గ్‌కు చెందిన రిచర్డ్ మార్టిన్ టర్నర్ అనే వ్యక్తి ఉన్నతాధికారిగా పనిచేస్తున్నారు. తన భార్య 40వ పుట్టిన రోజును వినూత్నంగా జరుపుకోవాలని నవంబర్ 2న హిందూ మహాసముద్రంలోని రీ యూనియన్ దీవికి వచ్చారు.అయితే అక్కడి నుంచి లాగూన్ బీచ్ ప్రాంతానికి వెళ్లిన రిచర్డ్ 6 అడుగుల లోతు ఉన్న సముద్రంలోకి ఈతకు వెళ్లి తిరిగి రాలేదు. ఈ విషయం తెలుసుకున్న అతని భార్య అప్రమత్తమై భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేసింది. దీంతో అధికారులు పడవలు, హెలికాప్టర్, గజ ఈతగాళ్లను రప్పించి దీవి మొత్తం వెతికించినా ఎలాంటి ఫలితం రాలేదు. అయితే లాగూన్ బీచ్‌లో షార్క్ చేపలు తిరుగుతున్నాయని తెలుసుకున్న అధికారులు గజ ఈతగాళ్లను అక్కడికి పంపించి నాలుగు షార్క్ చేపలను బంధించారు. వాటిని చంపి షార్క్ అవశేషాలను పరిశీలించగా ఒక షార్క్ కడుపులో చేయితో పాటు ఉంగరం కూడా దొరికింది. ఆ ఉంగరాన్ని పరిశీలించిన రిచర్డ్ భార్య అది తన భర్తదేనని తెలిపారు. అలాగే అధికారులు చేయిని, ఇతర అవశేషాలను డీఎన్ఏ టెస్ట్‌కు పంపిచంగా అది రిచర్డ్‌దేనని స్పష్టం చేశారు. అయితే రిచర్డ్‌ను మింగిన షార్క్ 13 అడుగుల పొడవు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. -
ఖమ్మంలో కారు బోల్తా; ఒకరి మృతి
సాక్షి, ఖమ్మం : ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మంచుకొండ వద్ద మంగళవారం కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. కాగా కారులో నిషేదిత గంజాయిని తరలిస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ బానోత్ సురేందర్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని నాలుగు క్వింటాళ్ల గంజాయిని స్వాదీనం చేసుకున్నారు. కేసును నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమ్మిత్తం మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
విషాదం : కాలిపోతున్నా ఎవరూ పట్టించుకోలేదు
రాజస్తాన్ : మానవత్వం మంట కలిసింది. ఎదురుగా కారులో మంటల్లో కాలిపోతున్న వ్యక్తిని కాపాడాల్సింది పోయి ఫోన్లతో వీడియోలు తీసిన ఘటన రాజస్తాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజస్తాన్‌కి చెందిన ప్రేమ్‌చంద్ జైన్ (53) అనే వ్యాపారవేత్త బుధవారం ఉదయం అనంతపురలో ఉన్న ఫ్యాక్టరీకి తన కారులో బయలుదేరాడు. ఈ నేపథ్యంలో కోట- ఉదయ్‌పూర్ జాతీయ రహదారిపై ఉన్న దక్కడ్కేడీ గ్రామం వద్దకు రాగానే అతని కారు ఆగిపోయింది. ఒక్కసారిగా కారులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ప్రేమ్‌చంద్ బయటికి రావడానికి ప్రయత్నించాడు. కానీ కారు సెంట్రల్ లాక్ సిస్టమ్ పనిచేయకపోవడంతో మంటల్లో చిక్కుకున్న ప్రేమ్ తనను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశాడు. అటుగా వెళ్తున్న వాహనాదారులు మంటల్లో చిక్కుకున్న అతన్ని కాపాడాల్సింది పోయి ఫోన్లతో వీడియోలు చిత్రీకరించారు. ఈ హృదయ విధారక ఘటనలో ప్రేమ్ చంద్ శరీరం మొత్తం కాలిపోయి కేవలం అతని అస్తిపంజరం మాత్రమే మిగిలింది. 'ప్రేమ్‌చంద్ కారు మంటల్లో చిక్కుకున్న సమాచారం మాకు 10.25 గంటల సమయంలో తెలిసింది. వెంటనే ఘటనాస్థలికి చేరుకొని బాడీనీ బయటికి తీసినట్లు' అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ దేవేంద్ర గౌతమ్ వెల్లడించారు. కారు మంటల్లో చిక్కుకొని ప్రేమ్ ఆర్తనాదాలు చేస్తుంటే ఫోన్లలో వీడియోలు తీస్తున్నారే తప్ప ఒక్కరు కూడా స్పందించలేదని పేర్కొన్నారు. సరైన సమయంలో స్పందించి కిటికీ అద్దాలు పగులగొట్టి బయటికి తీసుంటే ప్రేమ్‌చంద్ బతికేవాడని ఆయన వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసినట్లు దేవేంద్ర వెల్లడించారు. -
నిజామాబాద్‌లో ఉన్మాది ఆత్మహత్య
సాక్షి, దోమకొండ : సొంత బిడ్డతో సహా ముగ్గురిని కిరాతకంగా హతమార్చి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్మాది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దారుణానికి ఒడిగట్టిన అనంతరం తాను కూడా గొంతు కోసుకుని చెరువులో దూకాడు. దోమ కొండ మండల కేంద్రంలోని మల్లన్న ఆలయం సమీపంలో కుటుంబ సభ్యులు ముగ్గురిని దారుణంగా హత్య చేసిన ఉన్మాది బందెల రవి (38) ఆదివారం స్థానిక చెరువులో శవమై తేలాడు. భిక్కనూరు సీఐ రాజశేఖర్ కథనం ప్రకారం.. భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన రవి తన సొంత కూతురు చందన(8)తో పాటు సోదరుడు బాలయ్య(45), అతని చిన్న కూతురు లత (18)లను శుక్రవారం హతమార్చిన సంగతి తెలిసిందే. బాలయ్య పెద్ద కూతురు ఇటీవల ప్రేమ వివాహం చేసుకోవడంతో తమ కుటుంబం పరువు పోయిందని సైకోగా మారిన రవి.. అన్న కుటుంబంతో పాటు తన కుటుంబాన్ని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. శుక్రవారం బాలయ్యతో పాటు ఆయన చిన్న కూతురు లతతో పాటు తన సొంత కూతురు చందనను దోమకొండ శివారులోని మల్లన్న ఆలయ సమీపంలోకి తీసుకెళ్లాడు. అక్కడ కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపి వారికి తాగించాడు. అనంతరం బ్లేడ్‌తో వారి గొంతు కోసి కిరాతకంగా హతమార్చాడు. ఆ తర్వాత అక్కడి నుంచి గూండ్ల చెరువు వద్దకు వెళ్లి గొంతు కోసుకుని, చెరువులో దూకాడు. అతడి మృతదేహం ఆదివారం ఉదయం బయట పడడంతో పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం కోసం తరలించారు. సైకోగా మారిన రవి కారణంగా రెండు కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. గ్రామానికి చెందిన నలుగురు మృత్యువాత పడడంతో భిక్కనూరులో విషాద ఛాయలు నెలకొన్నాయి. -
విమానంలోనే తుది శ్వాస విడిచిన ప్రయాణికుడు
న్యూఢిల్లీ : విమానంలో ఓ ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురై తుది శ్వాస విడవడం విషాదాన్ని నింపింది. చెన్నై నుంచి కోల్‌కతా వెళ్లడానికి స్పైస్ జెట్ విమానంలో ప్రయాణిస్తుండగా అశోక్ కుమార్ అనే వ్యక్తి మృత్యువాత పడ్డాడు. 48 ఏళ్ల అశోక్ కుమార్ కోల్‌కతా వెళుతుండగా శ్వాస కోస బారిన పడి మరణించాడు. వివరాల్లోకి వెళితే... అశోక్ కుమార్ శర్మ అనే వ్యక్తి కోల్‌కతా వెళ్లడానికి చెన్నైలో స్పైస్ జెట్ ఫ్లైట్ ఎస్జీ -623 బోయింగ్ విమానంలో బయలుదేరాడు. కాగా చెన్నై నుంచి బయలుదేరిన కాసేపటికే శ్వాస సమస్యతో బాధపడుతున్నట్లు శర్మ తెలపడంతో వెంటనే మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించి విమానాన్ని భువనేశ్వరకు మళ్లించినట్లు అధికారులు తెలిపారు. భువనేశ్వర్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన వెంటనే మెడికల్ రూమ్‌కు తీసుకెళ్లినట్లు విమానాశ్రయం డైరెక్టర్ ఎస్ సి హోటా పేర్కొన్నారు. అనంతరం పైలట్ సూచనతో అప్పటికే సిద్ధంగా ఉన్న అంబులెన్స్‌లో అక్కడి నుంచి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లామని తెలిపారు. వైద్యులు అశోక్‌శర్మను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. కాగా, పోస్టుమార్టం నిర్వహించేందుకు అశోక్ మృతదేహాన్ని క్యాపిటల్ ఆసుపత్రికి తరలించారు. -
ఉసురు తీసిన ‘హైటెన్షన్’
సాక్షి, ఒంగోలు : హైటెన్షన్ విద్యుత్ వైర్లు ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. ఈ సంఘటన స్థానిక అంజయ్యరోడ్డులో బుధవారం సాయంత్రం 6గంటల సమయంలో చోటు చేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం అద్దంకి భవానీ సెంటర్ దామావారిపాలెంకు చెందిన షేక్ అఫ్రిది(21) స్థానిక మధు ఫ్లెక్సీ సంస్థలో మూడేళ్లుగా పనిచేస్తున్నాడు. బుధవారం స్థానిక అంజయ్యరోడ్డులోని విజయభారతి కోచింగ్ సెంటర్‌కు చెందిన ఫ్లెక్సీ కట్టేందుకు ఆఫ్రిదితో పాటు స్థానిక కరణం బలరాం కాలనీకి చెందిన షేక్ ఆసిఫ్ కూడా డాబా పైకి ఎక్కారు. అయితే హైటెన్షన్ వైర్లు కేవలం కొద్దిపాటి ఎత్తులోనే ఉండడం, ఫ్లెక్సీకి ఐరన్ ఫ్రేమ్ ఉండడంతో విద్యుత్ ఫ్లెక్సీ ఫ్రేమ్‌కు సోకింది. దీంతో హై టెన్షన్ విద్యుత్ కావడంతో దానిని బలంగా పట్టుకున్న ఆఫ్రిది దానిని పట్టుకున్నట్లుగానే కుప్పకూలిపోయి మృతి చెందగా , రెండో వ్యక్తి ఆసిఫ్ మాత్రం స్వల్పగాయాలతో బతికి బయటపడ్డాడు. పెద్ద ఎత్తున చేరుకున్న స్థానికులు సంఘటన జరగగానే ఆఫ్రిది, ఆసిఫ్ ఇరువురు నుంచి వెలువడిన గావుకేకలతో స్థానికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందారు. సమీపంలోని వారు హైటెన్షన్ విద్యుత్ ప్రసారం అవుతుంది పైకి ఎవరు వెళ్లవద్దంటూ కేకలు వేయడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. సమాచారం అందడంతోనే పోలీసులు, అగ్నిమాపక శాఖ, విద్యుత్‌శాఖ అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. గాయపడ్డ ఆసిఫ్‌ను కిందకు దించి వైద్యం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. విద్యుత్ ప్రసారాన్ని పూర్తిగా నిలుపుదల చేయించి ఆఫ్రిది మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. ఈ క్రమంలో అంజయ్యరోడ్డులో పెద్ద ఎత్తున జనం గుమికూడారు. ఆ అనుమతులు ఏమైనట్లు ? వాస్తవానికి ఈ హైటెన్షన్ వైర్లను నగరంలో నుంచి తొలగించాలంటూ పెద్ద ఎత్తున గతంలో ఆందోళనలు జరిగాయి. అనేక మంది అమాయకులు వీటి కారణంగా బలయ్యారు. బుధవారం జరిగిన సంఘటన ఈ ఏడాదిలో మూడోది కావడం గమనార్హం. ట్రాన్స్‌కో అధికారులు హైటెన్షన్ వైర్ల నుంచి ప్రమాదం జరగకుండా ప్రత్యామ్నాయ చర్యలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు రూ.54.32కోట్లతో అంచనాలు రూపొందించారు. ఈ మేరకు ట్రాన్స్‌కో చీఫ్ ఇంజనీర్ ప్రస్తుతం ఉన్న హైటెన్షన్ వైర్లను తొలగించి వాటి స్థానంలో 132 కేవీ డీసీ ఎక్స్ఎల్పీఈ అండర్ గ్రౌండ్ కేబుల్ వైర్లను ఏర్పాటు చేయాలని భావించారు. ఇందుకు న్యూఢిల్లీలోని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్/ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్/ ఇతర నిధులను అందించే సంస్థల నుంచి రుణం తీసుకోవాలని నిర్ణయించారు. దీనికి ఏపీ ట్రాన్స్‌కో నుంచి పరిపాలనా పరమైన అనుమతి కూడా మంజూరైనట్లు ట్రాన్స్‌కో పరిపాలన విభాగం పేర్కొంటూ రూ.54కోట్ల 32 లక్షల 15వేలుకు ఆమోదం తెలిపింది. హైటెన్షన్ కారణంగా ప్రమాదం జరిగిందని తెలియడంతోనే విద్యుత్ ప్రసారాన్ని నిలుపుదల చేయించి హుటాహుటిన చేరుకున్నాం. విజయభారతి కోచింగ్ సెంటర్ ఉన్నం చంద్రరావు నిర్వహిస్తున్నారని, ఆ సంస్థకు చెందిన ఫ్లెక్సీని కడుతున్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుందన్నారు. అయితే ఈ ఫ్లెక్సీని ప్రమాదకరమైన ప్రాంతంలో కట్టమని ఎవరు ప్రోత్సహించారనే దానిపై విచారించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ముందస్తు చర్యలు తీసుకుని అన్ని డిపార్టుమెంట్లను సమన్వయం చేసుకున్నట్లు తెలిపారు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
దొంగతనానికి వచ్చాడు.. మరణించాడు
సాక్షి, బంజారాహిల్స్ : ఫిలింనగర్లో సోమవారం తెల్లవారుజామున అనుమానాస్పదంగా మృతి చెందిన వేముల ప్రేమ్‌సాగర్(20) మిస్టరీ వీడింది. తన స్నేహితుడు సత్యానంద్‌తో కలిసి ఓ అపార్ట్మెంట్లోకి దొంగతనానికి వెళుతూ ప్రమాదవశాత్తు కింద పడటంతో తీవ్రంగా గాయాలై మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. వివరాల్లోకి వెళితే.. ఫిలింనగర్‌లోని దుర్గాభవానీనగర్‌కు చెందిన ప్రేమ్‌సాగర్ గత ఏడాది జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సెల్‌ఫోన్ చోరీ కేసులో అరెస్టై రిమాండ్‌కు వెళ్లాడు. అంతకుముందే అతడిపై మాదాపూర్ పీఎస్‌లోలోనూ సెల్‌ఫోన్ చోరీ కేసులు ఉన్నాయి. దీన్‌దయాల్‌నగర్ బస్తీకి చెందిన సత్యానంద్ బైక్ చోరీ కేసులో అరెస్టై జువైనల్ హోమ్‌కు వెళ్లి వచ్చాడు. వీరిద్దరికీ ఓ దొంగతనం కేసులోనే పరిచయం ఏర్పడి స్నేహితులయ్యారు. ఆదివారం రాత్రి ప్రేమ్‌సాగర్ తన స్నేహితుడు సత్తిని సికింద్రాబాద్‌లో రైలెక్కించి వస్తానని తల్లికి చెప్పి స్కూటీ తీసుకొని బయటికి వచ్చాడు. అపోలో చౌరస్తాలో మరో ఇద్దరు స్నేహితులు గణేష్, నాగరాజులతో కలిసి మద్యం తాగారు. అనంతరం హైటెక్ సిటీ వైపు వెళ్లారు. అక్కడ ప్రేమ్‌సాగర్, సత్యానంద్ నిద్రమాత్రలు వేసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ నలుగురు కలిసి మద్యం తాగడమేగాక గంజాయి తీసుకున్నారు. రాత్రి ఒంటిగంట ప్రాంతంలో అంతా కలిసి ఫిలింనగర్‌కు రాగా గణేష్, నాగరాజు తమ ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రేమ్‌సాగర్, సత్యానంద్ స్కూటీని అపోలో ముందు పార్క్ చేసి నడుచుకుంటూ అపోలో ఆస్పత్రి మెడికల్ కాలేజీ వెనుక గేటు నుంచి ఓ అపార్ట్మెంట్ వైపు వెళ్లారు. అపార్ట్మెంట్ ప్రహరీ ఎక్కిన వీరు మద్యం మత్తులో చూసుకోకుండా కిందకు దూకడంతో సెల్లార్లో పడ్డారు. ముందు ప్రేమ్‌సాగర్ పడగా అతడి ముక్కు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. సత్యానంద్ నేరుగా అతడిపై పడటంతో గాయాలు కాలేదు. తెల్లవారుజామున వారిని గుర్తించిన అపార్ట్మెంట్ వాచ్మెన్ ఓ ప్లాటు యజమానితో కలిసి వారిద్దరినీ రోడ్డుపైకి తీసుకొచ్చారు. వారి సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది అప్పటికే ప్రేమ్‌సాగర్ మృతి చెందినట్లు నిర్దారించారు. అపార్ట్మెంట్లో చోరీ యత్నం జరిగినట్లు తెలిస్తే తన ఉద్యోగం పోతుందన్న భయంతోనే వారిని రోడ్డుపైకి తీసుకొచ్చినట్లు వాచ్మెన్ మధు తెలిపాడు. మూడు రోజుల క్రితం అదే అపార్ట్మెంట్లో చోరీకి యత్నించిన వీరు ఓ ప్లాటు ముందు ఉన్న ఖరీదైన షూస్ ఎత్తుకెళ్లినట్లు సత్యానంద్ అంగీకరించాడు. ఇదిలా ఉండగా రెండు రోజులైనా సత్యానంద్ మద్యం మత్తు దిగకపోవడంతో కేసు విచారణలో జాప్యం జరుగుతోంది. సీసీ ఫుటేజీలే ఈ ఘటనను వెలుగులోకి తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. -
కూలి పనులకు వచ్చి కానరాని లోకాలకు..
సాక్షి, మదనపల్లె(చిత్తూరు) : ఓ భవన నిర్మాణ కార్మికుడు ప్రమాదవశాత్తు సారవపై నుంచి కింద పడడంతో దుర్మరణం చెందాడు. ఈ సంఘటన బుధవారం మదనపల్లెలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..భవన నిర్మాణ కార్మికునిగా పనిచేస్తున్న అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన రాజన్న(50)కు తలిదండ్రులతో పాటు భార్య నాగరత్నమ్మ, కుమార్తె లక్ష్మి, ఏడవ తరగతి చదువుతున్న పవన్‌కుమార్ ఉన్నారు. ఏడాదిక్రితం బతుకుదెరువు కోసం మదనపల్లెకు వలస వచ్చాడు. నీరుగట్టువారిపల్లెలోని మాయా బజారులో ఓ అద్దె ఇంట ఉంటూ స్థానికంగా భవన నిర్మాణ పనులకు వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో నీరుగట్టువారిపల్లె సమీపంలోని కొత్త బైపాసు రోడ్డులో మోహన్ ఇంటి నిర్మాణ పనులు చేయడానికి సహచర కూలీలతో వెళ్లాడు. అక్కడ సారవపైకి ఎక్కి ఇంటికి ప్లాస్టింగ్ పనులు చేస్తుండగా సారవకొయ్య పక్కకు జరిగి, అది కూలడంతో రెండవ అంతస్తు నుంచి సరాసరి రాజన్న గేటుపై పడ్డాడు. దీంతో పక్కటెముకలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సాయంతో సహచరులు అతడిని స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే రాజన్న చనిపోయాడని నిర్థారించారు. సమాచారం అందుకున్న టూటౌన్ సీఐ రాజేంద్రయాదవ్, ఎస్ఐ సునీల్‌కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇక మాకు దిక్కెవరయ్యా?ఇక మాకు దిక్కెవరయ్యా..? అంటూ మృతుడు రాజన్న భార్య తన పిల్లలతో గుండెలవిసేలా రోదించడం చూపరులను కలచివేసింది. తాడిపత్రి నుంచి ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఒంటరి చేసి పోతివా? అంటూ కన్నీమున్నీరయ్యారు. -
16 ఏండ్లకు శవమై వస్తుండు..
సాక్షి, నిర్మల్: ‘చేసేతందుకు ఇడ ఏం పనుందే. దేశం పోతే తిండికితిండి..నెలకిన్ని పైసలస్తయ్. ఊళ్లే మస్తుమంది పోయిండ్రు. ఇడ ఉండి కూడ ఏంజేయాల..’ అనుకుంటూ 16ఏళ్ల కిందట ఎడారి దేశం వెళ్లాడు. అప్పటినుంచి కనీసం ఒక్కటంటే ఒక్కసారి కూడా మళ్లీ స్వదేశానికి రాలేదు. ఎప్పుడో యాదికొచ్చినప్పుడు కుటుంబసభ్యులకు ఫోన్ చేసేవాడు. అది కూడా రెండుమూడు మాటలే మాట్లాడేవాడు. ‘ఇంటికాడ అంత మంచిదేనా..? అందరు మంచిగున్నరా..? నేను ఇడ మంచిగనే ఉన్న..’ ఎప్పుడు ఫోన్ చేసినా ఈ ముచ్చట్లే చెప్పేవాడు. ఇప్పుడు ఆ ముచ్చట కూడా చెప్పేందుకు ఆయన లేడు ఉన్న ఊరిని, కన్నవారిని కాదనుకుని దేశం కాని దేశంలో ఏళ్లుగా ఉంటున్న ఆయన అక్కడ ఓ అనామకుడిగా తనువు చాలించాడు. ‘గాలి మోటార్ల ఎగురుకుంటపోయినోడు ఎప్పటికైనా ఇంటికి రాకుంటే యాడికిపోతడు. వాడే అస్తడు..’ అని అనుకుంటున్న ఆ కుటుంబానికి ఇన్నేళ్లకు శవపేటికలో భద్రమై.. విగతజీవిలా వస్తున్నాడు. 16ఏళ్లుగా ఇంటికి రాకుండా ఎడారిదేశంలోనే ఉండి, చివరకు అక్కడే తుదిశ్వాస విడిచాడు.. నిర్మల్ జిల్లా సోన్మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన కొత్తగంటి రాజేశ్వర్(47). ఏళ్లుగా అక్కడే ఉండటంతో చివరకు ఆయన స్వస్థలం, కుటుంబం వివరాలు తెలుసుకోవడం కూడా కష్టమైంది. బతుకు దెరువు కోసం.. ఊళ్లో తెలిసిన వాళ్లందరూ వెళ్తుంటే రాజేశ్వర్ కూడా బతుకుదెరువు కోసం యుఏఈలోని అబుదా బికి వెళ్లాడు. అలా 16 ఏళ్ల క్రితం గల్ఫ్‌కు వెళ్లిన రాజేశ్వర్‌కు తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఉన్నా.. ప్రస్తుతం తనకంటూ భార్యాపిల్లలు ఎవరూ లేరు. దీంతో ఇప్పటివరకు స్వగ్రామానికి రాలేదు. 2003 లో అబుదాబిలోని అల్జాబర్ అనే కంపెనీలో భవన నిర్మాణ కార్మికుడిగా ఉద్యోగంలో చేరాడు. కొంతకాలం తర్వాత కంపెనీలో వేతన సమస్య తలెత్తడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయి ’ఖల్లివెల్లి’ (అక్రమనివాసి)గా జీవనం సాగించాడు. యూఏఈలో 2013, 2018 లలో ప్రకటించిన క్షమాభిక్ష(ఆమ్నెస్టీ) పథకాలలోనూ రాజేశ్వర్ స్వదేశానికి రావడానికి ఇష్టపడలేదు. అక్కడే దొరికిన పనిచేసుకుంటూ జీవనం సాగించాడు. అక్కడే అనారోగ్యంతో.. కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న రాజేశ్వర్ ఇటీవల గల్ఫ్‌లోనే తుదిశ్వాస వదిలాడు. ఎప్పుడో ఇల్లు వదిలి వెళ్లిన ఆయన వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేవు. తన జేబులో ‘రాజేశ్వర్ కొత్తగాని, కొత్తగాని లింగన్న’ మాదాపూర్ అని ఇంగ్లిష్, అరబిక్ బాషలలో ఉన్న ఒక జిరాక్స్ పేపర్ మాత్రమే అక్కడి వారికి లభించింది. అక్కడి ఆసుపత్రి మార్చురీ (శవాగారం) విభాగం వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులకు ఎంతకూ ఆయన వివరాలేవి తెలియకపోవడంతో ఈ విషయాన్ని దుబాయిలోని ఒక భారతీయ సామాజిక సేవకుడికి తెలిపారు. ఆయన రాజేశ్వర్ చిరునామా తెలుసుకోవడం కోసం హైదరాబాద్‌లోని ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షుడు మంద భీంరెడ్డి సహాయం కోరారు. ఇక అప్పటినుంచి స్వదేశంలో రాజేశ్వర్ చిరునామా తెలుసుకునే ప్రయత్నం ప్రారంభించారు. మాదాపూర్లెన్నో ఉన్నయ్.. గల్ఫ్‌లో చనిపోయిన కొత్తగంటి రాజేశ్వర్ జేబులో దొరికిన లెటర్లో కేవలం ‘మాదాపూర్’ అని మాత్రమే ఉండటం జఠిలంగా మారింది. ఎందుకంటే.. ఉత్తర తెలంగాణ జిల్లాలలో మాదాపూర్ పేరుతో చాలా ఊళ్లు ఉన్నాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో, నిజామాబాద్ జిల్లా మాక్లూర్, జక్రాన్‌పల్లి మండలాల్లో, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ, తలమడుగు, నేరేడిగొండ మండలాల్లో, నిర్మల్ జిల్లా సోన్ మండలంలో ఇదే పేరుతో గ్రామాలున్నాయి. ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం సమన్వయకర్తలు మాదాపూర్ పేరు గల ఈ ఏడు గ్రామాలలో ఆరా తీయడం మొదలు పెట్టారు. చివరకు నిర్మల్ జిల్లా సోన్ మండలం మాదాపూర్‌కు చెందినవాడిగా గుర్తించారు. ఇదే విషయాన్ని ఎంబసీకి తెలిపారు. ఇక్కడి వరకు చేసిన ప్రయత్నానికి మరో అడ్డంకి ఎదురైంది. రాజేశ్వర్‌కు సంబంధించి పాస్‌పోర్ట్ తదితర గుర్తింపు పత్రాలు లేనందున శవాన్ని స్వగ్రామానికి తరలించే ప్రక్రియ ముందుకు సాగలేదు. ఆధారాలు లేక ఆలస్యం.. అబుదాబిలో చనిపోయిన రాజేశ్వర్ ఊరుపేరు తెలిసినా.. ఆయన ‘భారతీయుడు’ అనేందుకు ఆధారాలు సేకరించి పంపడం పెద్దసవాలుగా మారింది. ఆయన 16ఏళ్లుగా స్వదేశంలో లేనందున రేషన్ కార్డు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు వంటి ఎలాంటి గుర్తింపు కార్డులు లేవు. రాజేశ్వర్‌కు గతంలో రెండు పెళ్లిళ్లు అయినప్పటికీ పిల్లలు కలుగలేదు. దీంతో భార్యలు విడాకులు తీసుకున్నారు. రాజేశ్వర్‌తో పాటు నలుగురు అన్నదమ్ములున్నారు. సోదరుల్లో ఒకరైన గంగన్న ఓ కేసులో ఓమన్ దేశంలోని మస్కట్ జైల్లో మగ్గుతుండగా,, మరొక సోదరుడు తక్కన్న కువైట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. మరో సోదరుడు శ్రీనివాస్ మాదాపూర్‌లో తల్లిదండ్రులను చూసుకుంటున్నారు. తల్లిదండ్రులు లక్ష్మి, లింగన్నల పాతరేషన్ కార్డు ఆధారంగా ఇండియన్ ఎంబసీ రాజేశ్వర్‌ను ’భారతీయుడి’ గా గుర్తించింది. ‘ఎమర్జెన్సీ సర్టిఫికెట్–ఇసి’(ఔట్ పాస్ అనే తెల్లరంగు తాత్కాలిక పాస్‌పోర్ట్) జారీ చేసింది. దీంతో రాజేశ్వర్ మృతదేహం కలిగిన శవపేటిక శనివారం స్వగ్రామానికి చేరుకోనుంది. ఈ మొత్తం ప్రక్రియలో గల్ఫ్ బాధితులకు ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షుడు మంద భీంరెడ్డి చాలా చొరవ తీసుకున్నారు. పోయిన్నుంచి రాలే.. ఉపాధి కోసమని పోయిన అన్న పదహారేండ్లయినా ఇంటికి రాలేదు. ఎప్పుడన్న ఒక్కసారి ఫోన్ చేస్తుండే. రెండుమూడు మాటలు మాట్లాడి పెట్టేస్తుండే. ఈ మధ్య ఆరోగ్యం బాగాలేదని చెప్పిండు. ఎప్పుడు ఇంటికి రమ్మని అడిగినా.. ఇడ బాగానే ఉన్న అంటుండే. – శ్రీనివాస్, రాజేశ్వర్ సోదరుడు, మాదాపూర్ -
నిర్లక్ష్యం ఖరీదు నిండుప్రాణం
సాక్షి, కాజీపేట: ట్రాక్టర్ డ్రైవర్ మద్యం తాగిన మైకంలో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో ఓ నిండు ప్రాణం బలయింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాజీపేట మండలం సోమిడికి చెందిన దువ్వ విజయ్‌కుమార్ (32) ద్విచక్రవాహనంపై బాపూజీనగర్ వైపు వస్తున్నాడు. అదే సమయంలో గృహ నిర్మాణ సామగ్రితో వెనకే వస్తున్న ట్రాక్టర్ బాపూజీ నగర్ చౌరస్తాలో అతివేగంగా వచ్చి ద్విచక్రవానాన్ని ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ డ్రైవర్ తికమకపడి వాహనాన్ని మరింతగా ముందుకు నడిపించడంతో ట్రాక్టర్ ద్విచక్రవాహనంపైకి పూర్తిగా ఎక్కింది. దీంతో ద్విచక్రవాహన చోదకుడు విజయ్‌కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మరో ద్విచక్రవాహనంపై వెళ్తున్న మరో వ్యక్తి యాదగిరికి స్వల్పగాయాలయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో విజయ్‌కుమార్‌ను హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మెరుగైనా వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ విజయ్‌కుమార్ మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కాజీపేట సీఐ అజయ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విజయ్‌కుమార్‌కు భార్యతోపాటు రెండున్నర ఏళ్ల వయస్సున్న పాప ఉంది. -
పెళ్లి ఏడాది తరువాత చేస్తామని చెప్పడంతో..
సాక్షి, సదాశివనగర్(ఎల్లారెడ్డి): వివాహం చేయడం లేదని మనస్తాపంతో ఓ యువకుడు వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ నరేశ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని మోడెగాం గ్రామానికి చెందిన కడతల సంతోష్‌రెడ్డి(27) అనే యువకుడు విదేశాలకు వెళ్లి సెలవుపై మూడు నెలల క్రితం ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో తనకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులను అడిగాడు. ఏడాది తర్వాత చేస్తామని తల్లిదండ్రులు చెప్పడంతో మనస్తాపంతో రెండు రోజుల క్రితం కామారెడ్డిలోని బంధువుల ఇంటికి వెళ్లి వస్తానని బైకుపై ఇంటి నుంచి బయలు దేరాడు. ఇంటికి వస్తున్నాను అని శనివారం ఉదయం 8గంటలకు ఫోన్ చేసి చెప్పాడు. మళ్లీ 10 గంటలకు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ అని వచ్చింది. ఆదివారం ఉదయం 6గంటలకు గ్రామ శివారులోని బురుజురాళ్ల దగ్గర ఉన్న వ్యవసాయ బావి వద్ద పశువుల రేకుల కొట్టంలోని సిమెంట్ ఫోల్‌కు నైలాన్ తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు కుటుంబీకులకు సమాచారం అందించారు. దీంతో కుటుంబీకులు గుండెలు బాదుకున్నారు. మృతుడి తల్లిదండ్రులు వెంకట్‌రెడ్డి, సుజాత బోరున విలపించడంతో కంటతడి పెట్టించాయి. మృతుడికి సోదరుడు కృష్ణారెడ్డి ఉన్నారు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
బహిర్భూమికని వెళ్లి పరలోకాలకు..
సాక్షి, చీపురుపల్లి(విజయనగరం) : బహిర్భూమికని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పట్టణంలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం సమీపంలోని తోటపల్లి కాలువలో మొండేటి లక్ష్మణ (30) అనే వ్యక్తి ప్రమాదవశాత్తూ జారిపడి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు ఆయన భార్య దేవి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఏఎస్ఐ రాజు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని లావేరు రోడ్‌కు చెందిన మొండేటి లక్ష్మణ బండిపై గాజులు విక్రయించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఏడాదిన్నర క్రితమే అదే ప్రాంతానికి చెందిన దేవితో వివాహం జరిగింది. సోమవారం సాయంత్రం బహిర్భూమికి వెళ్తానని చెప్పిన లక్ష్మణ చాలా సేపటి వరకు తిరిగి రాలేదు. అదే వీధికి చెందిన మరో వ్యక్తి వచ్చి తోటపల్లి కాలువ వద్ద పడి ఉన్నాడని చెప్పడంతో కుటుంబ సభ్యులు అంతా పరుగులు తీశారు. ప్రమాదవశాత్తూ జారి కాలువలో పడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, స్థానికులు చెబుతున్నారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్ఐ రాజు తెలిపారు. -
డివైడర్‌ను ఢీ కొట్టిన కారు.. విద్యార్థి దుర్మరణం
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 22ఏళ్ల విద్యార్థి మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలివి.. సంకరపల్లి మండలం మొకీల గ్రామంలో సుభిస్ విడ్సర్ విల్లాలో అనంత్ రెడ్డి కుటుంబం నివాసం ఉంటుంది. అతని కుమారుడు రాహుల్(TS07fx3699)బెంజ్‌కారులో ఫిల్మ్‌నగర్ నుంచి మణికొండ వైపు వెళ్తున్నాడు. వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టి మూడు పాల్టీలు కొట్టింది. దీంతో రాహుల్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతని హుటాహుటిన దగ్గరల్లో ఉన్న ఆస్పత్రికి తరలించగా అప్పటికే రాహుల్ మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరొకరికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
వోల్వో బస్సు- ఆటో ఢీ.. ఒకరు మృతి
సాక్షి, విజయనగరం : జిల్లాలోని దత్తిరాజేరు మండలం మరడాం సమీపంలో గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలివి.. వేగంగా ప్రయాణిస్తున్న వోల్వో బస్సు, ఆటో ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతిచెందిన వ్యక్తి మరడాం గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్లాగా(19) స్థానికులు గుర్తించారు. క్షతగ్రాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పెళ్లింట విషాదం
మహానంది : వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం ఇడమడక సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. మరో 40 మంది గాయపడ్డారు. బాధితుల వివరాల మేరకు.. ఎం.తిమ్మాపురం గ్రామానికి చెందిన దూదేకుల చిట్టెమ్మ కుమార్తె లక్ష్మీదేవికి మైదుకూరు మండలం మిట్టమానుపల్లెకు చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. ఈ మేరకు ప్రొద్దుటూరులోని షాదీఖానాలో ఆదివారం వివాహం ఉండటంతో తిమ్మాపురం నుంచి రాత్రి బంధుమిత్రులంతా సుమారు 65 మంది లారీలో బయలుదేరారు. అయితే దువ్వూరు మండలం ఇడమడకకు చేరుకునే సరికి వారి ముందు వెళుతున్న మరో లారీడ్రైవర్ సడన్‌గా బ్రేక్ వేయడంతో మద్యం మత్తులో ఉన్న పెళ్లి బృందం లారీ డ్రైవర్ అదుపుతప్పి మందున్న లారీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో లారీ ముందు, వెనుక భాగంలో ఉన్న వారంతా రోడ్డుపై ఎగిరిపడ్డారు. వధువు మేనమామ దూదేకుల ఉదయ్‌శంకర్ ఆలియాస్ కరెంట్ శంకర్(42)కు తీవ్రగాయాల పాలై ఆస్పత్రిలో మృతి చెందాడు. అమీర్, ఫక్కీరమ్మ, బీబీ, గూటుపల్లెకు చెందిన హుసేనమ్మ, బండిఆత్మకూరు దస్తగిరమ్మ, గుర్రెడ్డిపాలెం మీరమ్మ, ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన షేక్ కోటి, సునీర్, తిరుపాడుకు చెందిన రోషన్న, తిమ్మాపురం లక్ష్మీపతి, గంగవరం మదార్సా, ఫక్కీరమ్మలకు కాళ్లు, తిమ్మాపురం గ్రామానికి చెందిన హుసేనమ్మ , ఫకీరమ్మ, ఏడేళ్ల చిన్నారి నరసింహ, శంకర్, అమీర్, లారీ యజమాని నారాయణ కుమారుడు కళ్యాణ్‌తో పాటు షరీఫ్, ఖాదర్‌తోపాటు మరో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కళ్యాణ్, షరీఫ్, ఖాదర్ పరిస్థితి విషమించడంతో కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ విద్యాసాగర్ సంఘటనా స్థలంతో పాటు నంద్యాల ప్రభుత్వాస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. బంధువులు వధువును ప్రత్యేక కారులో తీసుకెళ్లి నిఖా జరిపించారు. క్షతగాత్రులకు నరకయాతన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని దువ్వూరు పోలీసులు చాగలమర్రి, ఆళ్లగడ్డ ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. అయితే అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో పాటు వసతులు సక్రమంగా లేక క్షతగాత్రులు నరకయాతన అనుభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు సరస్వతీ, చంద్రమోహన్, శివ తెలిపారు. కాళ్లు, చేతులు విరిగి నరకం చూస్తున్నా పడుకోవడానికి కనీసం బెడ్లు లేవన్నారు. మృత్యువుతో పోరాడి ఓడిన శంకర్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కొనఊపిరితో ఉన్న శంకర్‌ను బతికించుకునేందుకు భార్యాపిల్లలతో పాటు బంధుమిత్రులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. మొదట చాగలమర్రి ఆస్పత్రికి ఆ తర్వాత ఆళ్లగడ్డ ఆస్పత్రికి తరలించారు. అయితే చాగలమర్రి, ఆళ్లగడ్డ ఆస్పత్రులలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో అతడిని నంద్యాల ఆస్పత్రికి తీసుకొచ్చేసరికి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి భార్య హసీనాబేగం, కుమార్తె మానస ఉన్నారు. -
ఒక్కసారిగా కూలిన భవనం.. జనం పరుగులు
ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా ఓ భవనం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. శిథిలాల కింద మరి కొంతమంది చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. గాయపడిన వారిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో అక్కడి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో ఆ ప్రాంతంలో గందరగోళ పరిస్థితి నెలకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పేకాట శిబిరంపై దాడి.. నదిలో దూకి వ్యక్తి మృతి
సాక్షి, కృష్ణా: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కృష్ణా నదిలోకి దూకిన ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన మోపిదేవి మండలం పెదకళ్లేపల్లిలో జరిగింది. వివరాలివి.. కొంతమంది వ్యక్తులు కృష్ణా నది సమీపంలో పేకాట అడుతున్నారు. సమాచారం అందుకున్న చల్లపల్లి పోలీసులు పేకాట శిబిరంపై దాడి చేశారు. పోలీసులను గమనించిన పేకాటరాయుళ్లు తప్పించుకునే ప్రయత్నాం చేశారు. వారిలో ముగ్గురు పక్కానే ఉన్న కృష్ణా నదిలో దూకారు. ఈ ఘటనలో రామాంజీనేయులు అనే వ్యక్తి నదిలో మునిగి చనిపోయాడు. అతని మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
‘నన్ను అన్యాయం చేసి పోయావా’
ఏడడుగుల బంధంతో ఏడాది క్రితం ఒక్కటయ్యారు. ఉన్నంతలో ఉన్నతంగా బతుకుదామనుకున్నారు.. మరికొన్ని రోజుల్లో ఇద్దరు కాస్తా ముగ్గురు కాబోతున్నారు.. ఆనందంగా గడిచిపోతున్న ఆ ఇంట్లో రోడ్డు ప్రమాదం విషాదం నింపింది. నిండు గర్భిణి అయిన తన భార్యను చూడడానికి బైక్‌పై అత్తారింటికి బయల్దేరాడో భర్త.. దారెంట తన భార్యకు ఊసులెన్నో చెప్పాలని ఆలోచించుకున్నాడు. ఇంకో ఎనిమిది కిలోమీటర్లు చేరితే అత్తారిల్లు వస్తుందనగా బైక్ అదుపు తప్పి ఆ యువకుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ‘నన్ను అన్యాయం చేసి పోయావా’ అని ఆ ఇంటి దీపం ఏడుస్తుంటే అక్కడున్న వారి మనసులు కలిచివేశాయి. సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మర్రిసంజు(31) మృతి చెందాడు. ఈఘటన ముథోల్ మండలంలోని విఠోలి, విఠోలి తండా గ్రామాల మధ్య మూలమలుపు వద్ద చోటుచేసుకుంది. సంజు కుంటాల మండలం కల్లూరు నుంచి ఆష్టా గ్రామానికి తన బైక్‌పై అత్తరింటికి బయల్దేరాడు. మార్గమధ్యంలోని విఠోలి గ్రామ శివారులో రోడ్డు పక్కన ఉన్న తుమ్మచెట్టును బైక్‌తో ఢీకొట్టాడు. దీంతో పక్కనే ఉన్న వ్యవసాయ పొలంలో పడి మృతి చెందాడు. శనివారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమచారాన్ని అందజేశారు. ఘటనా స్థలాన్ని ముథోల్ సీఐ రఘుపతి, ఎస్సై రాజు పరిశీలించారు. మృతుడి భార్య ఎనిమిది నెలల గర్భవతి అని కుటుంబీకులు తెలిపారు. ఘటనాస్థలం వద్ద కుటుంబీకులు, మృతుడి భార్య రోదనలు మిన్నంటాయి. -
కారులో కునుకు తీశాడు.. అంతలోనే
సాక్షి, భువనేశ్వర్: రాష్ట్రంలో మంగళవారం ఉదయం విషాద సంఘటన చోటు చేసుకుంది. సుందర్‌గడ్ జిల్లాలో ప్రమాదవశాత్తూ ఒక కారు బావిలోకి దూసుకుపోయింది. ఈ సంఘటనలో ఓ యువకుడు దీపక్(26) తుది శ్వాస విడిచాడు. లఠికోట పోలీసు స్టేషను పరిధి కులాముర్డా గ్రామంలో ఈ విషాద సంఘటన సంభవించింది. గ్రామంలో నిర్వహిస్తున్న అష్ట ప్రహరి యజ్ఞం సందర్శించేందుకు విచ్చేసి అనంత లోకాలకు వెళ్లడం విచారకరం. రాత్రి అంతా కారులో కునుకు తీసి ఉదయం 7 గంటల ప్రాంతంలో మేలుకొన్నాడు. సర్దుకునేంతలో కారు అకస్మాత్తుగా స్టార్టు అయి నుయ్యి వైపు దూసుకుపోయినట్టు ప్రత్యక్ష సాక్షుల కథనం. గ్రామస్తులు హుటాహుటీన నూతిలోకి దిగి బాధితుని రక్షించేందుకు విఫలయత్నం చేశారు. నూతిలో పడిన యువకుడిని గ్రామస్తులు బయటకు తీసి అంబులెన్సులో రుర్కెలా ఉక్కు కార్ఖానా జనరల్ ఆస్పత్రికి తరలించారు. యువకుడు మరణించినట్టు వైద్యులు ప్రకటించడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
బేటా ఉఠో.. బేటా గుర్మిత్..!
‘బేటా ఉఠో.. బేటా గుర్మిత్! జర ఆంఖే ఖోలోకర్ దేఖో.. యా గురునానక్.. జర రహెం కరో.. మేరే బేటేకో బచావో’ అంటూ కన్నతల్లి హృదయం తల్లడిల్లిపోయింది. కళ్లముందే రైలు కింద పడి తీవ్రంగా గాయపడిన కుమారుడు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుంటే కన్న పేగు వేదనకు అంతు లేకుండా పోయింది. బిడ్డను ప్రాణాలతో చూడాలనుకుని పరితపించింది. కనిపించని దేవుళ్లను ప్రార్థించింది. ఉఠోరే గుర్మిత్ అంటూ గుండెలవిసేలా రోదించింది. చివరకు తన ఒడిలోనే ప్రాణాలు కోల్పోయిన కుమారుడిని హత్తుకుని బోరున విలపించింది. సాక్షి, అనంతపురం: తల్లిని రైలు ఎక్కించే క్రమంలో తనయుడు కాలుజారి రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య ఇరుక్కుపోయి దుర్మరణం చెందాడు. కళ్లెదుటే కన్న కొడుకు ప్రాణాలు కోల్పోవడం చూసి ఆ తల్లి తట్టుకోలేకపోయింది. వివరాల్లోకెళితే.. పంజాబ్‌లోని ఫసిల్‌కా జిల్లా బలేల్‌కాకమల్ గ్రామానికి చెందిన గుర్మిత్‌సింగ్ (30) కేకే ఎక్స్‌ప్రెస్‌లో తన తల్లి బీబీకి ఆపరేషన్ చేయించేందుకు ఢిల్లీ నుంచి పుట్టపర్తికి బయలుదేరాడు. శనివారం ఉదయం 9 గంటల సమయంలో కేకే ఎక్స్‌ప్రెస్ అనంతపురం వచ్చింది. దాహంగా ఉండటంతో తల్లీకొడుకులు స్టేషన్లో దిగారు. కాసేపటికే రైలు కదిలింది. దీంతో గుర్మిత్‌సింగ్ అతని తల్లి బీబీ పరుగులు తీశారు. ఈ క్రమంలో తల్లిని రైలెక్కించే క్రమంలో గుర్మిత్‌సింగ్ రైల్వే ట్రాక్, రైలు మధ్యలో ఇరుక్కుపోయాడు. కాలు రైలు కింద పడడంతో తీవ్రంగా దెబ్బతింది. శరీరంపై రైలు ఒత్తిడి ఎక్కువ పడడంతో గుర్మిత్ సింగ్ అక్కడికక్కడే చనిపోయాడు. ఉలిక్కిపడ్డ ప్రయాణికులు రైల్వే ట్రాక్‌కు, రైలుకు మధ్య చిక్కుకుని గుర్మిత్‌సింగ్ మృతి చెందడంతో రైల్వే స్టేషన్‌లోని ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రమాదం జరిగిన తర్వాత కేకే ఎక్స్‌ప్రెస్‌ను పది నిమిషాలపాటు ఆపేశారు. గుర్మిత్‌సింగ్ తల్లి బీబీ తలకు తీవ్రగాయమై బాధపడుతున్నా రైల్వే అధికారులు కానీ, సిబ్బంది కానీ ఎవరూ పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీసింది. రైల్వే అధికారుల నిర్లక్ష్యంపై మండిపాటు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందితే రైల్వే అధికారులు, సిబ్బంది కనీసం తొంగిచూడకపోవడంపై డీవైఎఫ్ఐ నాయకులు బాలకృష్ణ మండిపడ్డారు. మృతుడి తల్లికి తీవ్రగాయమైనా ఆస్పత్రికి తరలించేందుకు కూడా ముందుకు రాకపోవడం ఏమిటని ప్రశ్నించారు. వైద్యులు కూడా అందుబాటులో లేకపోతే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జీపు, బైక్ ఢీ: ఒకరు మృతి
సాక్షి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాజన్న గుడి చెరువు కట్ట కింది బస్టాండ్ సమీపంలో తుఫాన్ జీపు, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడిని లక్క సుజిత్ రెడ్డి(30)గా గుర్తించారు. వాసవి నగర్‌కు చెందిన ఇతని స్వగ్రామం పొత్కపల్లి కాగా వేములవాడలో డీసీఎం వ్యాన్ డ్రైవర్‌గా ఉపాధి పొందుతూ పదేళ్లుగా ఇక్కడే నివసిస్తున్నాడు. -
జల్లికట్టులో యువకుడు మృతి
పలమేడు: తమిళనాడులో సంక్రాంతి సందర్భంగా నిర్వహించే జల్లికట్టు సంబరాల్లో అపశృతి చోటుచేసుకుంది. మధురై జిల్లా పలమేడులో నిర్వహిస్తున్న జల్లికట్టు వినోదం చూసేందుకు వచ్చిన ఓ యువకుడిని బుల్ కలెక్షన్ పాయింట్ వద్ద ఎద్దు పొడిచింది. దాంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడిని దిండిగల్ జిల్లాకు చెందిన కాలిముత్తు(19)గా గుర్తించారు. -
ప్రాణం తీసిన ప్రహరీ వివాదం
సాక్షి, హైదరాబాద్: ప్రహరీ విషయంలో జరిగిన గొడవ ఓ వృద్ధుడి ప్రాణాన్ని బలిగొంది. ఈ సంఘటన ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ఎన్‌ఆర్‌ఎస్‌హెచ్ హాస్టల్ సమీపంలో జరిగింది. ఓయూ రిటైర్డ్ ఉద్యోగి హుమయూన్ కబీర్‌పై ఓయూ ఎన్‌ఆర్‌ఎస్‌హెచ్ హాస్టల్ సమీపంలో శనివారం రాత్రి దాడి జరిగింది. ముగ్గురు వ్యక్తులు కలిసి కట్టెలతో కొట్టి ఆయన్ను తీవ్రంగా గాయపరిచారు. అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. కబీర్ ఇంటి పక్కనే ఉండే భార్యాభర్తలు, మరొకరు కలిసి ఇతనిపై దాడి చేసినట్లు, ప్రహరీ విషయంలో గొడవ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు ముగ్గురిని ఓయూ పోలీసులు అరెస్టు చేశారు. -
కెమికల్ డబ్బా పేలి ఒకరి మృతి
నిజామాబాద్: మృత్యువు ఏ రూపంలోనైనా ముంచుకు రావచ్చనడానికి ఈ సంఘటనే ఉదాహరణ. నిజామాబాద్ నగరంలోని ఖిల్లా ఫిల్టర్‌బెడ్ వద్ద పేలుడు సంభవించి ఓ వ్యక్తి మృతిచెందాడు. కాలం చెల్లిన కెమికల్ డబ్బాను భూమిలో పాతిపెడుతుండగా అది పేలింది. ఈ సంఘటనలో ఔట్ సోర్సింగ్ కార్మికుడు భూమేష్ మృతిచెందాడు. తిరుపతి రెడ్డి అనే మరో కార్మికుడికి గాయాలయ్యాయి. భూమేష్ మృతదేహం తునాతునకలు అయింది. -
స్కూల్లో చెట్టు తొలగింపు.. రోడ్డున వెళ్లే వ్యక్తి మృతి
సాక్షి, పాలకొల్లు: ఎక్కడున్నా మృత్యువు కబళిస్తుందంటారు.. ఎవరో చెట్టు తొలగిస్తుంటే రోడ్డున వెళ్తున్న వ్యక్తిపై అది పడి మృతిచెందాడు. ఎవరూ ఊహించని విధంగా జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని శివదేవుని చిక్కాల గ్రామంలో జెడ్పీ హైస్కూల్ ఉంది. దాని ఆవరణలో ఉన్న ఓ భారీ చెట్టుపై కొందరి కళ్లుపడ్డాయి. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో దాన్ని అనధికారికంగా తొలగించే కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో స్కూలు ముందునుంచి జాతీయ రహదారిపై వెళ్తున్న రావూరి రాము(24) అనే చిరు వ్యాపారిపై చెట్టు పడింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. వీరవాసరం గ్రామానికి చెందిన రాము పూలపల్లి బైపాస్ రోడ్డులో కూరగాయల వ్యాపారం ముగించుకుని ఇంటికి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. -
ఛార్జింగ్ పెడుతూ వ్యక్తి మృతి
చిన్నశంకరంపేట(మెదక్): సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన బుధవారం జరిగింది. జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం కాజాపూర్ తండాకు చెందిన గోవింద్ అనే వ్యక్తి ఇంట్లో సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా.. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. -
యువకుడు మృతి
సిద్ధిపేట: జిల్లా కేంద్రమైన సిద్ధిపేటని బీడీ కాలనీలోని వ్యవసాయ బావిలో ఈత కొడుతుండగా మూర్ఛ రావడంతో ఒక యువకుడు నీళ్లలో మునిగి మృతిచెందాడు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్న జరిగింది. వడ్డెర కాలనీకి చెందిన పల్లెపు శేఖర్(22) కూలిపనులు చేసుకుని జీవించేవాడు. వ్యవసాయ బావిలో ఈతకొడుతుండగా అకస్మాత్తుగా మూర్ఛ వచ్చింది. దీంతో నీటిలో మునిగి మృతిచెందాడు. గమనించిన స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోవడంతో మృతి చెందాడు. -
ఈతకు వెళ్లి విద్యార్థి మృతి
శంషాబాద్ (రంగారెడ్డి జిల్లా): కొత్వాల్‌గుడలోని క్రషర్ గుంతలో ఈత కొడుతున్న నలుగురు విద్యార్థులలో మహ్మద్ ఇంతియాజ్(15) అనే బాలుడు నీటిలో మునిగి మృతిచెందాడు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. లంగర్‌హౌస్‌కు చెందిన నలుగురు పదవతరగతి విద్యార్థులు ఉదయం ఈతకోసం క్రషర్ గుంతకు వెళ్ళారు. గుంతలోకి దిగిన వారు ఈతకొడుతుండగా లోతుకు వెళ్ళిన మహ్మద్ ఇంతియాజ్ మునిగిపోయాడు. తోటి స్నేహితులు అతనిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మహ్మద్ ఇంతియాజ్ మృతదేహాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఆరిలోవ(విశాఖ తూర్పు): జాతీయ రహదారిపై వెంకోజీపాలెం వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరిలోవకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. రెండో వార్డు గాంధీనగర్‌కు చెందిన వైఎస్సార్సీపీ నగర కార్యదర్శి రాగతి అచు్యతరావు రెండో అన్నయ్య రాగతి నడిపి అచు్యతరావు(43) శనివారం సాయంత్రం నగరంలోకి సొంత పని మీద ద్విచక్ర వాహనంపై వెళ్లారు. తిరిగి రాత్రి 10.45 గంటల సమయంలో ఇంటికి వస్తుండగా వెంకోజీపాలెం ఆంజనేయస్వామి గుడి వద్ద మలుపు తిరుగుతుండగా వెనక నుంచి వస్తున్న విశాఖ డెయిరీ పాల ట్యాంకర్ ఢీకొట్టింది. అచు్యతరావు హెల్మెట్ ధరించినా తలపైకి ట్యాంకర్ చక్రం ఎక్కేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ æసభ్యులు అక్కడికి చేరుకుని కన్నీటిపర్యంతమయా్యరు. మూడో పట్టణ పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమాదానికి కారణవైున పాల ట్యాంకరును డ్రైవర్ పోలీసులకు చిక్కకుండా వేగంగా తరలించేశాడు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత ట్యాంకర్‌ను విజయనగరం జిల్లా భోగాపురం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. మృతుడు అచు్యతరావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈయన శుభకార్యాలకు సప్లయర్స్, ఫ్లవర్ డెకరేషన్ కాంట్రాక్ట్ చేస్తుండేవాడు. వైఎస్సార్సీపీ తూర్పు కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్, వార్డు అధ్యక్షుడు గొలగాని శ్రీనివాస్.. రాగతి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. నగరంలో పని చూసుకొని సినిమాకు వెళ్లారని, సినిమా మధ్యలోనే వస్తూ ఈ ప్రమాదానికి గురయా్యరని మృతుడి కుటుంబ సభ్యులు రోదించారు. సినిమా పూర్తయినంత వరకు ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
యువకుడు మృతి
కర్నూలు: కోడుమూరు మండలం పలకుర్తిలో బైక్ బోల్తా పడి యువకుడు మృతి చెందాడు. అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కోనసాగాస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కొత్తూరు : మండలంలోని పారాపురం గ్రామానికి చెందిన అల్లు గోవిందరావు(28) శ్రీకాకుళం రూరల్ మండలం ఆర్టీసీ క్రాంతినగర్ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో పారాపురంలో విషాదం అలముకొంది. మోటారు సైకిల్ ప్రమాదంలో మృతి చెందిన గోవిందరావుకు ఏడాదిన్నర కిందట వివాహమైంది. ఈయనకు భార్య రోహిణి, ఆరు నెలల కుమారుడు ఉన్నారు. మృతుడు కొత్తూరులో ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తూ కుటుంబ పోషణ చేసుకుంటున్నాడు. గోవిందరావు మృతితో కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. -
ఆటో, బస్సు ఢీ: ఒకరి మృతి
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు ప్రత్తిపాడు: ఆర్టీసీ బస్సును ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు తీవ్ర గాయాలపాలవ్వగా వారిలో ఒకరు మృతిచెందిన ఘటన ప్రత్తిపాడులో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం పది మంది ప్రయాణికులతో పెదనందిపాడు మండలం రావిపాడు నుంచి ప్రత్తిపాడుకు వస్తున్న ఆటో ప్రత్తిపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో ఎదురుగా వెళుతున్న ఓ ప్రైవేట్ కళాశాల బస్సును క్రాస్ చేయబోయి వెనుక నుంచి బస్సును ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన ఆటో అదే సమయంలో ప్రత్తిపాడు వైపు నుంచి పెదనందిపాడు వైపు వెళుతున్న ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రావిపాడుకు చెందిన పల్లపాటి శిలవయ్య, కందుల నాగేశ్వరరావు, శిఖా సునీల్‌కుమార్, కొండబోలు పద్మావతి గాయాలపాలయ్యారు. వీరిలో పల్లపాటి శిలవయ్యకు తీవ్ర గాయాలవడంతో అతనిని 108లో గుంటూరు జీజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. గాయాలపాలైన నాగేశ్వరరావు, సునీల్‌కుమార్‌కు ప్రత్తిపాడు సామాజిక ఆరోగ్యకేంద్రంలో ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం నిమిత్తం జీజీహెచ్‌కు పంపారు. ఘటనా స్థలానికి చేరుకున్న ట్రైనీ ఎస్ఐ ఖాదర్ బాషా ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. క్షతగాత్రులతో మాట్లాడి వివరాలను సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటో డ్రైవర్ పరారీలో ఉన్నాడు. బస్సు డ్రైవర్ అప్రమత్తమవడంతో పెనుప్రమాదం తప్పింది. -
ప్రమాదం మిగిల్చిన దుఃఖం
కారు, బైక్ ఢీ మహిళ మృతి.. భర్త, కుమార్తెకు తీవ్ర గాయాలు నరసరావుపేట టౌన్: కుటుంబ సభ్యులతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వారిని ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళ మృతి చెందగా ఆమె భర్త, కుమార్తెకు తీవ్రగాయాలయ్యాయి. గుంటూరు శ్యామలానగర్‌కు చెందిన మన్నవ అనూష (21).. భర్త నాగమల్లేశ్వరరావు, వారి రెండున్నరేళ్ల కుమార్తె మోక్షితతో కలిసి వినుకొండలో ఉన్న పుట్టింటికి వచ్చారు. పుష్కరాల సందర్భంగా పుట్టింటి వాళ్లు పెట్టే చీర తెచ్చుకునేందుకు వచ్చి తిరిగి ద్విచక్ర వాహనంపై ముగ్గురూ గుంటూరు వెళ్ళేందుకు మంగళవారం సాయంత్రం పయనమయ్యారు. మార్గమధ్యంలోని నరసరావుపేట పట్టణ శివారు ఎస్ఆర్కేటీ కాలనీ సమీపంలోకి రాగానే గుంటూరు నుంచి మార్కాపురం వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అనూష మృతి చెందింది. మోక్షిత కాలు, చెయ్యి విరిగిందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకొన్న ఇరు కుటుంబాల సభ్యులు వైద్యశాల వద్దకు చేరుకొని బోరున విలపించారు. -
పుష్కర స్నానానికి వెళ్లి తిరిగొస్తూ..
ప్రమాదానికి గురైన ప్రయాణికుల కారు ఒకరు మృతి .. ముగ్గురికి తీవ్ర గాయాలు పెదనందిపాడు (వరగాని) : కారు చెట్టును ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా చినగంజాంకు చెందిన మోటుమర్రి రామసుబ్బారావు.. అతని భార్య రాజ్యలక్ష్మి, కుమార్తె బబిత, స్నేహితుడు శంకరమంచి మధుబాబు కారులో విజయవాడ పుష్కర స్నానానికి వెళ్ళారు. తిరుగు ప్రయాణంలో పెదనందిపాడు మీదుగా చినగంజాం వెళ్తున్నారు. మండలంలోని వరగాని వద్ద కాటన్ మిల్ సమీపంలోకి రాగానే కారు ఎదురుగా ఉన్న చెట్టును వేగంగా ఢీకొట్టి పక్కనే ఉన్న మేకలవాగులోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో డ్రై వరు ఎం. సుబ్బారెడ్డి (45) అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న శంకరమంచి మధుబాబు, రామ సుబ్బారావులకు తల, కాళ్ళకు తీవ్ర గాయాలయ్యాయి. రాజ్యలక్ష్మి కుడి కాలుకు, చేతికి గాయాలయ్యాయి. ప్రమాదం చూసిన స్థానికులు కాల్వలోకి దూకి క్షత్రగాత్రులను ఒడ్డుకు తీసుకొచ్చారు. స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ అలీ ప్రమాద స్థలికి చేరుకుని క్షత్రగాత్రులకు ప్రథమ చికిత్స చేశారు. అనంతరం 108 వాహనంలో గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. డ్రై వరు నిద్రమత్తు వల్లనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సుబ్బారెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాపట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కలెక్టర్ సాయం చేసినా.. ప్రాణాలు నిలువలేదు!
రామాయంపేట(మెదక్): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఒక యువకుడిని సమయానికి ఎవరూ ఆదుకోలేదు. అటుగా వచ్చిన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ యోగితారాణా క్షతగాత్రుడిని తన కారులో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మార్గం మధ్యలోనే ఆ యువకుడు ప్రాణాలొదిలాడు. ఈ సంఘటన బుధవారం రాత్రి మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ శివారులో చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోని మెడ్లీ ఫార్మసీలో ఏరియా మేనేజర్లుగా పనిచేస్తున్న రామకృష్ణ భరద్వాజ్, గంగల్ల నరేశ్‌కుమార్ లు బైక్‌పై కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు. రామాయంపేట పట్టణ శివారులో వీరు వెళ్తున్న బైక్ ముందు వెళ్తున్న ఆటో వెనుక భాగాన్ని తాకి అదుపుత్పి పడిపోయింది. బైక్‌పై ఉన్న ఇద్దరూ కింద పడిపోయారు. వీరిలో రామకృష్ణ భరద్వాజ్ (30)కు తీవ్ర గాయాలయ్యాయి. సకాలంలో 108 రాకపోవడంతో నరేశ్‌కుమార్ రోడ్డుకు అడ్డంగా నిలబడి చాలా మందిని సాయం కోరాడు. కానీ, ఎవరూ స్పందించడం లేదు. ఆ సమయంలో అదే దారిలో కారులో హైదరాబాద్ వెళ్తున్న నిజామాబాద్ జిల్లా కలెక్టర్ యోగితారాణా తన కారులో క్షతగాత్రుడిని ఎక్కించుకుని నార్సింగిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతడు చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. -
తగ్గుతున్న ఉష్ణోగ్రతలు.. వ్యక్తి మృతి
జన్నారం(ఆదిలాబాద్) : చలి పులి పంజా విసురుతోంది. గత మూడు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రత 4.5 డిగ్రీలకు పడిపోతోంది. జన్నారం మండల వాసులు చలికి బెంబెలెత్తుతున్నారు. చలి తీవ్రతకు తట్టుకోలేక మండలంలోని పొన్కల్‌కు చెందిన గోలి దుబ్బయ్య(59) మృతిచెందాడు. దుబ్బయ్య భార్య లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. తన భర్త దుబ్బయ్య వృత్తి రీత్యా బట్టలు ఉతుకుతూ.. ఇస్త్రీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం వేకువజామున 3గంటలకు చలికి తట్టుకోలేకపోయూడు. దుప్పటి కప్పమని భార్యకు సూచించాడు. భార్య అతడికి దుప్పటి కప్పి నిద్రపోయింది. తెల్లవారినా భర్త లేవకపోవడంతో వెళ్లి చూసింది. చలి తీవ్రతకు తట్టుకోలేక భర్త దుబ్బయ్య చనిపోయాడని గుర్తించింది. మృతుడు దుబ్బయ్యకు ఇద్దరు కూతుళ్లున్నారు. ఉన్నారు. -
దుర్గామాత నిమజ్జనంలో అపశ్రుతి
దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు తీసుకెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఒక వ్యక్తి విద్యుత్ షాక్‌తో చనిపోయాడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వెలిమినేడు గ్రామంలో శుక్రవారం అర్థరాత్రి ఈ అపశ్రుతి చోటుచేసుకుంది. దసరా సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించేందుకు ట్రాక్టర్‌ను సిద్ధం చేశారు. వెలుతురు కోసం అందులో ఉంచిన జనరేటర్‌కు ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రసారమైంది. ఈ విషయం తెలియని ఐతారం పెంటయ్య(30) అనే వ్యక్తి జనరేటర్‌ను తాకటంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే చనిపోయాడు. -
పిడుగు పాటుకు ముగ్గురి మృతి
ఆంధ్ర ప్రదేశ్ లో గురువారం కురిసిన భారీ వర్షంలో పిడుగు పాటుకు గురై ముగ్గురు మరణించారు. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్ణం జిల్లాసీలేరు ప్రాంతంలోని బచ్చుపల్లి గ్రామానికి చెందిన కన్నయ్య(45) పొలంలో పనిచేసుకుంటుండగా.. అతనిపై పిడుగు పడింది. కన్నయ్య అక్కడి క్కడే మరణించాడు. ఇంకో ఘటనలో శ్రీకాకుళం జిల్లా బామిని సమీపంలో ఆరికి ఇలియాస్ (16) అనే ఇంటర్ విద్యార్థి మరణించాడు. కాలేజీ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో భారీ వర్షం కురవటంతో అతను చెట్టు కిందకు పరిగెత్తాడు. అదే సమయంలో చెట్టుపై పిడుగు పడి.. ఇలియాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఘటనలో గుంటూరు జిల్లా అమరావతిలో పల్లెకొండ అనే పశువుల కాపరి మరణించాడు. కృష్ణానది ఒడ్డున పశువులు కాస్తుండగా.. ఆయనపై పిడుగు పడింది. ఇక గుంటూరు జిల్లా రామాంజనేయ పురంలో పిడుగుపాటుకు 40 మేకలు మృతి చెందాయి. ఇదే ఘటనలో అక్కయ్య(38) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పిడుగు, వ్యక్తి మృతి, విశాఖపట్టణం, గుంటూరు, అమరావతి, పశువులు, సీలేరు, భారీ వర్షం, విద్యార్ధి, శ్రీకాకుళంThunder, person died, Visakhapatnam , sileru, heavy rain , Guntur , Amaravati , cattle, Student , Srikakulam -
నిమజ్జనంలో అపశ్రుతి
నేకరికల్లు(గుంటూరు): గణేష్ విగ్రహం నిమజ్జనానికి వెళ్లిన ఓ వ్యక్తి హఠాన్మరణం చెందాడు. గుంటూరు జిల్లా నేకరికల్లు మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండలంలోని గుండ్లపల్లిలో గురువారం వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించారు. నిమజ్జనం చేయటానికి సమీపంలోని చెరువు వద్దకు శుక్రవారం మధ్యాహ్నం గ్రామస్తులంతా వెళ్లారు. కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తుడు కె.సాంబిరెడ్డి(50) విగ్రహ నిమజ్జనం అనంతరం చెరువులో ఈతకొట్టి, ఒడ్డున కూర్చున్నాడు. కొద్దిసేపటికే అక్కడికక్కడే పడిపోయి మృతి చెందాడు. తీవ్ర గుండెపోటుతోనే మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. -
విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి
మర్రిగూడ: విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం ఇందుర్తి గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ముత్యాలు (50) అనే వ్యక్తి ఇంటి పక్కనే ఉన్న ట్రాన్స్ఫారం దగ్గర ముళ్ల చెట్లు పెరిగిపోవడంతో వాటిని తొలగించేందుకు వెళ్లాడు. వైర్లు పక్కనే ఉండడంతో ట్రాన్స్ఫారం ఆఫ్ చేసి చెట్లను కొడదామనుకున్నాడు. ఈ క్రమంలో ట్రాన్స్‌ఫారంను ఆఫ్ చేయబోగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
గుంటూరు నిమ్స్ కాలేజ్ మెస్‌లో యువకుడు మృతి
-
లారీ ఢీకొని వ్యక్తి మృతి
నెల్లూరు(చిల్లకూరు): చిల్లకూరు మండలం తిక్కవరం సమీపంలోని గిరిజన కాలనీ వద్ద తుపాకుల చిన సుబ్రహ్మణ్యం(40) అనే వ్యక్తిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించాడు. గురువారం ఉదయం బహిర్భూమికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
యాసిడ్ తాగి ఆత్మహత్య
అడ్డగుట్ట: చేసుకున్న సంఘటన తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...అడ్డగుట్ట బీ సెక్షన్‌కు చెందిన రుద్రమోహన్(34) వృత్తిరిత్యా ఆటోడ్రైవర్. భార్య పిల్లలతో నివాసముంటున్నాడు. అయితే గురువారం మధ్యాహ్నం తుకారాంగేట్ పహాడీ హనుమాన్ దేవాలయం సమీపంలోకి యాసిడ్ బాటిల్ తీసుకొని వెళ్లాడు. ఉన్నట్టుండి తన వద్దనున్న యాసిడ్ బాటిల్ తెరచి యాసిడ్ సేవించాడు. అనంతరం, తన అన్నకు ఫోన్ చేసి తాను యాసిడ్ తాగానని చెప్పి ఫోన్ కట్ చేశాడు. దీంతో వెంటనే మోహన్ అన్న సంఘటనా స్థలానికి చేరుకొని అతన్ని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. యాసిడ్ అతిగా సేవించడం వల్ల కడుపులోని అవయవాలు పూర్తిగా కాలీపోవడంతో చికిత్స మధ్యలోనే మోహ న్ మృతి చెందాడు. కుటుంభసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా మతుడి జేబులో ఓ సూసైడ్ నోట్ లభ్యమైందని అందులో ‘‘ నా చావుకు ఎవరు బాధ్యులు కారు. జీవితంపై విరక్తి చెంది నన్ను నేను చంపుకుంటున్నాను. నన్ను క్షమించండి. అమ్మ ముందు’’ అని రాసి ఉందని పోలీసులు తెలిపారు. -
ఆర్టీసీ బస్- మోపెడ్ ఢీ: ఒకరి మృతి
తిమ్మాపూర్: టవీఎస్ మోపెడ్ వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ముల్కనూర్ గ్రామానికి చెందిన ముక్కెర వెంకటయ్యను సోమవారం మద్యాహ్నం కొత్తపల్లి సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. డివైడర్ వద్ద మలుపు తిరుగుతుండగా కరీంనగర్ వైపునకు వేగంగా వెళుతోన్న బస్సు ఢీకొట్టిందని, గాయపడిన వెంటయ్యను ఆసుపత్రికి చేర్చేలోగా మృతిచెందాడని పోలీసులు చెప్పారు. వెంకటయ్య మరణంతో ఆయన స్వగ్రామం ముల్కనూర్ లో విషాదం నెలకొంది. -
డ్రైవర్ ఇంటి ఎదుట మృతదేహంతో ధర్నా
నల్లగొండ(క్రైం): నల్లగొండ జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తిని శనివారం కారు ఢీకొట్టింది. అనంతరం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. అయితే మృతుడి బంధువులు ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ ఇంటి ఎదుట మృతదేహంతో పట్టణంలోని శాంతి నగర్లో ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించేవరకు కదిలేది లేదని కారు డ్రైవర్ ఇంటి ఎదుట బైఠాయించారు. -
వ్యక్తి మృతి.. బంధువుల ఆందోళన
అనంతపురం : తమ కుటుంబ సభ్యుడి మృతికి వైద్యులే కారణమంటూ బంధువులు ఆస్పత్రి ఎదుటు ఆందోళనకు దిగారు. ఈ ఘటన అనంతపురం జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. జిల్లాలోని కళ్యాణదుర్గం మండలం వర్ని గ్రామానికి చెందిన ధనంజయకు కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు అనంతపురంలోని ఎస్పీ ఆస్పత్రిలో చేర్చారు. అయితే వైద్యులు శస్త్ర చికిత్స చేసి ఈ రోజు డిశ్చార్జి చేశారు. అయితే ధనంజయను కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలోనే అతను మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతోనే ధనంజయ మృతి చెందాడని ఆస్పత్రి ఎదుట బంధువులు ధర్నాకు దిగారు. -
వాహనం ఢీకొని వ్యక్తి మృతి
ఖమ్మం(ములకలపల్లి): రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా ములకలపల్లిలో గురువారం వేకువ జామున చోటుచేసుకుంది. మండలంలోని జగన్నాథపురం బస్టాండ్ సెంటర్లో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అదే గ్రామానికి చెందిన శేఖర్(45) అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, దమ్మపేట మండలానికి చెందిన మరో వ్యక్తి బానోతు లాలు తీవ్రంగా గాయపడి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
రైలు కిందపడి వ్యక్తి మృతి
ఘట్కేసర్(రంగారెడ్డి) : రైలు కిందపడి ఓ వ్యక్తి మృతి బలవన్మరణం చెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఘట్కేసరి రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం వెలుగుచూసింది. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. రైల్వే స్టేషన్ సమీపంలోని ట్రాక్ పై ఓ వ్యక్తి మృతదేహన్ని గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసి ప్రమాదవశాత్తు మరణించాడా? లేదా ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. -
చనిపోయిన వ్యక్తికి ట్రీట్మెంట్.
-
కారు బోల్తా-ఒకరి మృతి
తొండంగి (తూర్పుగోదావరి): జాతీయ రహదారి-16 పై వేగంగా వెళ్తున్న కారు టైరు పంచర్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండల పరిధిలో జరిగింది. వివరాలు.. వైజాగ్ నుంచి ఏలూరు వెళ్తున్న కారు అన్నవరం సమీపంలో టైరు పంచర్ కావడంతో బోల్తాపడింది. ఈ ఘటనలో రిటైర్డు ఉద్యోగి ఎల్. చందర్రావు(65) మృతిచెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంట్లో పేలుడు.. వ్యక్తి మృతి, ముగ్గురికి గాయాలు
ఇంట్లో నిల్వ ఉంచిన జిలిటిన్ స్టిక్స్, డిటోనేటర్లు పేలడంతో ఒక వ్యక్తి మృతి చెందగా అతని కుటుంబ సభ్యులు ముగ్గురికి గాయాలయ్యాయి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం మామిళ్లవాడ గ్రామంలో బుధవారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన ఎండీ. మతీన్ అనే వ్యక్తి తన ఇంటిలో పేలుడు పదార్ధాలైన జిలిటిన్ స్టిక్స్, డిటోనేటర్లను నిల్వ చేశాడు. ప్రమాదవశాత్తు పేలడంతో మతీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న రసూల్, నీలిమ, మరొక చిన్నారి గాయపడినట్లు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. అయితే భారీ పేలుడు పదార్థాలు ఇంట్లో ఎందుకున్నాయి? వీటిని అక్రమంగా నిలిపి ఉంచారా? అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
డిటోనేటర్ పేలి వ్యక్తి మృతి
జిల్లాలోని నాగర్‌కర్నూల్ అటవీప్రాంతంలో డిటోనేటర్ పేలి ఓ వ్యక్తి మరణించాడు. దేవరకద్రకు చెందిన ఇందిరమ్మ(40), లింగయ్య(45) అనే దంపతులు అడవి పందుల వేట కోసం శనివారం నాగూర్ కర్నూల్‌కు వెళ్లారు. అటవీ ప్రాంతంలో డిటోనేటర్లు ఉపయోగించి పందులును వేటాడేందుకు వెళుతుండగా ప్రమాదవశాత్తు ఓ డిటోనేటర్ పేలి లింగయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, తీవ్రంగా గాయాలైన ఇందిరమ్మను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇందిరమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
కారులో మృతదేహం గుర్తింపు
-
కారులో మృతదేహం గుర్తింపు
-
కారులో మృతదేహం గుర్తింపు
కడప(వెఎస్సార్‌జిల్లా): కడప నగరంలో కలకలం రేపిన చిన్న చౌక్ కారులో మృతదేహం వివరాలు బయటపడ్డాయి. మృతదేహం పులివెందులకు చెందిన సతీష్ కుమార్‌దిగా పోలీసులు గుర్తించారు. పులివెందులకు చెందిన సతీష్ కుమార్(36) స్థానిక పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నాడు. 5 రోజుల కిందట ఇంటి నుంచి బయటకు వచ్చిన అతను తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో అతని కుటుంబ సభ్యులు పులివెందుల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా శుక్రవారం సాయంత్రం చిన్న చౌక్ ప్రాంతంలో గుర్తుతెలియని మృతదేహం ఉందన్న విషయం తెలుసుకున్న సతీష్ బంధువులు దాన్ని సతీష్‌దిగా ధ్రువీకరించారు. గుర్తుతెలియని దుండగులు వేరే ప్రాంతంలో హత్య చేసి మృతదేహాన్ని కారులో పడేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. -
బావిలో క్రేన్ పడి ఒకరి దుర్మరణం
♦ మరో వుుగ్గురికి తీవ్ర గాయాలు నర్సంపేట : మట్టి తోడుతున్న క్రేన్ బావిలోపడడంతో ఓ వ్యక్తి మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన వుండలంలోని భాంజీపేట శివారులోని బోజ్యానాయుక్‌తండాలో శనివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.... బోజ్యానాయుక్‌తండాకు చెందిన నూనావత్ స్వామికి చెందిన వ్యవసాయు బావిలో పూడిక తీత పనులు చేయుడానికి అజ్మీరా చందు(37)తోపాటు వురో 8వుంది కూలీలుఉదయంపనికి వెళ్లారు. వుధ్యాహ్న సవుయుంలో అన్నం తినడానికి బావిలో నుంచి పైకి ఎక్కా రు. భోజనం చేసిన అనంతరం సదరు కూలీలంతా వుళ్లీ బావిలోకి దిగారు. బావిలోపనులు చేస్తూ పెద్దపెద్ద రాళ్లను క్రేన్ డబ్బాలో వేశారు. క్రేన్‌తో డబ్బాను బావి నుంచి పైకి లాగుతుండగా ఒక్కసారిగా క్రేన్ మొత్తం ఊడిపోరుు బావిలో పడిపోరుుంది. బావిలో పని చేస్తున్న చందు అక్కడికక్కడే మృతిచెందగా అందులో ఉన్న కూలీలు నూనావత్ రావుులు,బానోతులింగ,అజ్మీర రాజుకు తీవ్ర గాయూలయ్యూరుు. బావిపై ఉన్న వారు, చుట్టుపక్కల వారు 108కు సమాచారమిచ్చి వారిని నర్సంపేటలోని ఏరియూ ఆస్పత్రికి తరలించారు. చందు మృతితో కుటుంబ సభ్యులు రోదించిన తీరు ప్రజలను కన్నీరు పెట్టించింది. ఈ ఘటనతో తండాలో విషాద ఛాయులు అలువుుకున్నారుు. మృతుడికి భార్య కవుల, ఇద్దరు కువూరులు ఉన్నారు. -
సెల్‌ఫోన్ చార్జింగ్‌పెడుతూ.. వ్యక్తి మృతి
వరంగల్ (కురివి): సెల్‌ఫోన్ చార్జింగ్‌పెడుతూ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా కురివి మండలం సూదరపల్లి గ్రామ పరిధిలోని బోడబూకయతండాలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. తండాకు చెందిన బూక్యారాందాస్ (30) ఉదయం సెల్‌ఫోన్ కు చార్జింగ్ పెడుతుండగా షార్ట్ సర్కూటై షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. -
సెల్ఫొన్ కు ఛార్జింగ్ పెడుతూ వ్యక్తి మృతి
మహబూబ్‌నగర్ : సెల్ఫొన్ కు ఛార్జింగ్ పెడుతూ విద్యుత్ షాక్ కు గురై ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా తిమ్మాజీపేట మండలం పోతిరెడ్డిపల్లిలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. పోతిరెడ్డిపల్లికి చెందిన బంగారయ్య అనే వ్యక్తి సెల్ఫొన్ కు ఛార్జింగ్ పెట్టడానికి ప్రయత్నించగా ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దాంతో బంగారయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. -
ప్రమాదవశాత్తూ గాయపడ్డ వ్యక్తి మృతి
భూదాన్ పోచంపల్లి (నల్లగొండ): మామిడి కాయల కోసం చెట్టెక్కిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడి గాయాలపాలై మృతి చెందాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలంలో గురువారం చోటుచేసుకుంది. భూదాన్ పోచంపల్లి సీతావానిగూడెం గ్రామానికి చెందిన చెర్కు మల్లేష్ గౌడ్(42) బుధవారం తన వ్యవసాయ బావి వద్ద ఉన్న మామిడి చెట్టు ఎక్కాడు. కాయలు తెంపబోతూ కొమ్మ విరిగి కిందపడ్డాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలపాలై కోమాలోకి వెళ్లాడు. కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం అతడిని హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మల్లేష్ మృతి చెందాడు. మల్లేష్‌కు భార్య, పదో తరగతి చదువుతున్న కుమారుడు, ఎనిమిదో తరగతి చదివే కుమార్తె ఉన్నారు. మల్లేష్ మరణంతో అతడి కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. -
గుండెపోటుతో వ్యక్తి మృతి
హైదరాబాద్ క్రైం : ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తికి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో వాహనం పైనుంచి కిందపడి మృతిచెందాడు. ఈ సంఘటన నగరంలోని అల్వాల్ మెయిన్ రోడ్డులో గురువారం ఉదయం చోటుచేసుకుంది. సుభాష్‌నగర్‌కు చెందిన రాజు (35) బైక్‌పై వెళ్తుండగా హార్ట్ఎటాక్ రావడంతో బైక్ పై నుంచి కిందపడ్డాడు. గుండెపోటుతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. పూర్తి వివరాలు తెలియరాలేదు. -
ట్యాంకర్ ఢీకొని వ్యక్తి మృతి
హైదరాబాద్ (జీడిమెట్ల): నగరంలోని జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని ట్యాంకర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం జీడిమెట్లలో చోటుచేసుకుంది. వివరాలు...గండి మైసమ్మ ఆలయం నుంచి సుధీర్ (30) చింతల్ వైపు బైక్‌పై వస్తుండగా మలుపు వద్ద జారిపడటంతో వెనక నుంచి వస్తున్న ట్యాంకర్ అతని పై నుంచి వెళ్లింది. దీంతో సుధీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు చింతల్ ప్రాంతవాసిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
పోలీస్ స్టేషన్ ఎదుట మృతుడి బంధువుల ఆందోళన
కోట : పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా మృతి చెందడంపై నెల్లూరు జిల్లా కోట మండలం గూడలి గ్రామస్తులు ఆదివారం ఆందోళనకు దిగారు. వివరాలు... గూడలి గ్రామానికి చెందిన గంటా జనార్దన్(40)ను బస్ డ్రైవర్‌పై దాడి చేసిన ఘటనలో పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. అయితే, జనార్దన్ పోలీస్ స్టేషన్లోనే మృతి చెందాడు. పోలీసులు చిత్రహింసలు పెట్టడం వల్లే అతడు మరణించాడని బంధువులు, గ్రామస్తులు ఆదివారం ఉదయం కోట పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. డీఎస్పీ వచ్చి తమకు సమాధానం చెప్పాలంటూ రోడ్డుపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. -
దాహంతో వ్యక్తి మృతి
నడిగూడెం : నాటుసారా తాగి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నడిగూడెం మండలం సిరిపురం గ్రామంలో శుక్రవారం జరిగింది. వివరాలు.. సిరిపురం గ్రామానికి చెందిన జంపాల బిక్షం(45) కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, శుక్రవారం ఉదయం నుంచి నాటు సారా తాగుతుండటంతో దాహం వేసింది. ఈ క్రమంలో అతనికి అందుబాటులో నీళ్లు లేకపోవడంతో మృతి చెందాడు. దీంతో గ్రామంలోని కొందరు వ్యక్తులు నాటుసారా విక్రయాలను నిలిపివేయాలని ఆందోళనకు దిగారు. కాగా, మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. -
చనిపోయిన వ్యక్తికి ట్రీట్మెంట్
హైదరాబాద్: చనిపోయిన వ్యక్తికి వైద్యం చేస్తున్నట్టు నటించి రోగి బంధువుల నుంచి లక్షలు వసూలు చేసిన డాక్టర్లు... ఈ మాటలు వింటుంటే ఏదో సినిమాలో చూసినట్లు గుర్తోస్తోంది కదూ.. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమాలో వ్యక్తి మరణించాడని ధ్రువీకరణ అయిన తర్వాత కూడా అతనికి వైద్యం చేసి మృతుడి కుటుంబం నుంచి రూ.3 లక్షలు వసూలు చేస్తారు వైద్యులు. అచ్చం ఇలాంటి సంఘటనే ఎల్బీనగర్ పరిధిలోని ఓజోన్ ఆస్పత్రిలో గురువారం చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన రాజశేఖర్(35) లారీడ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మూడు రోజుల కిందట గచ్చిబౌలి ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అతనికి తీవ్రగాయాలయ్యాయి. అప్పటినుంచి ఓజోన్ ఆస్పత్రిలోని అత్యవసర చికిత్స విభాగంలో చికిత్స పొందుతున్నాడు. కుటుంబ సభ్యులను ఐసీయూ లోకి అనుమతించకపోవడంతో అతని పరిస్థితి ఎలా ఉందో ఎవరికి తెలియరాలేదు. గురువారం సాయంత్రం డబ్బులు చెల్లించాల్సిందిగా ఆస్పత్రి సిబ్బంది ఒత్తిడి పెంచడంతో కుటుంబసభ్యులు రాజశేఖర్ ను చూపించాల్సిందిగా గట్టిగా కోరడంతో అతడు మృతిచెందాడని తెలిసింది. చనిపోయిన వ్యక్తికి ట్రీట్మెంటు చేస్తున్నట్టు నటించి రూ.లక్షలు వసూలు చేస్తున్నారని కుటుంబసభ్యులు ఆరోపించారు. విషయం బయటకు పొక్కడంతో కుటుంబ సభ్యులతో పాటు బీజేపీ కార్యకర్తలు ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. వైద్యుల ధోరణిని నిరసిస్తూ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులతో ధర్నా విరమింప చేయడానికి యత్నిస్తున్నారు. పూర్తివివరాలు ఇంకా తెలియరాలేదు. -
చనిపోయిన వ్యక్తికి ట్రీట్మెంట్
-
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
రెంజల్: ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం బూర్గమ్ గ్రామంలో గురువారం జరిగింది. పాడ్దె సంతోష్(44) అనే వ్యక్తి గురువారం సాయంత్రం బూర్గమ్ గ్రామ శివారు నుంచి నడుచుకుంటూ వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
ఆత్మన్యూనతా భావంతో వ్యక్తి ఆత్మహత్య
అనంతపురం రూరల్: అనంతపురం రూరల్ పరిధిలోని ఏ నారాయణపురానికి చెందిన వై వెంకటేశ్(28) అనారోగ్యం, మానసిక వేదనతో బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబకలహాల కారణంగా కొద్దికాలం కిందట భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. దీనికి తోడు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తనకు ఎవరూలేరని ఆత్మన్యూనత భావంతో దిగులు చెందిన వెంకటేశ్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణం పొందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కొండ మీద నుంచి జారిపడి వ్యక్తి మతి
తాడేపల్లి: మద్యం మత్తులో తూగుతూ నడుస్తున్న వ్యక్తి ప్రమాదవశాత్తూ కొండమీద నుంచి జారిపడి వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. మంగళగిరి మండాలానికి చెందిన గోపి(20) కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిసున్నాడు. గోపి బుధవారం మామయ్య నివాసముంటున్న తాడేపల్లిలోని డలాస్‌నగర్‌కు వచ్చాడు. అల్లుడు వచ్చాడనే సంతోషంలో ఇద్దరు కలిసి మద్యం సేవించారు. ఆ మత్తులో తూగుతూ నడుస్తున్న గోపి ప్రమాద వశాత్తు కొండ మీదనుంచి జారిపడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య ప్రయాణిస్తున్న బస్సు ఢీకొని భర్త మృతి
►రెండు బైక్‌లు ఢీ: రోడ్డుపై పడిపోయిన వ్యక్తి... ►ఆయన పైనుంచి బస్సు వెళ్లడంతో దుర్మరణం ►తండ్రి మృతి...కూతుళ్లకు తీవ్రగాయాలు ఇబ్రహీంపట్నం : ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఓ వ్యక్తి రోడ్డుపై పడిపోయాడు. అతడి పైనుంచి బస్సు వెళ్లడంతో దుర్మరణం చెందాడు. ప్రమాదంలో తండ్రి దుర్మరణం చెందగా, కుమార్తెలిద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన సోమవారం రాత్రి 7:30 గంటల సమయంలో ఇబ్రహీంపట్నం మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కందుకూరు మండలం ఉట్లపల్లి గ్రామానికి చెందిన బుర్ర జగన్(35) సోమవారం రాత్రి తన కుమార్తెలు స్వీటీ(11), క్రేజీ(3)లతో కలిసి బైక్(29 బీజీ 5802)పై యాచారం వస్తున్నాడు. ఆయన భార్య వెనుక నుంచి బస్సులో వస్తోంది. మంచాల మండలం లోయపల్లికి మల్లేష్ ఎదురుగా వస్తున్నాడు. ఈక్రమంలో ఖానాపూర్ స్టేజీ సమీపంలో వీరి రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో బైక్‌పైనుంచి రోడ్డుపై పడిపోయిన జగన్ పైకి లేచేందుకు యత్నిస్తున్నాడు. అంతలోనే ఇబ్రహీంపట్నం నుంచి యాచారం వైపు వెళ్తుతున్న ఆర్టీసీ బస్సు(ఏపీ29జడ్2589) ఆయన పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన స్వీటీ, క్రేజీ, మల్లేష్‌లను 108 అంబులెన్స్‌లో హైదరాబాద్ తరలించారు. కాగా ప్రమాదానికి కారణమైన బస్సులోనే జగన్ భార్య కూడా ప్రయాణిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కాళ్ల నొప్పులని వెళ్తే కాటికి పంపారు
ఏలూరు (వన్ టౌన్) : కాళ్లు నొప్పులుగా ఉన్నాయని వైద్యం కోసం వస్తే ఆసుపత్రి వైద్యుడి నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుందని ఆరోపిస్తూ మృతుడి బంధువుల ఆందోళనలతో ఏలూరు జిల్లా ఆసుపత్రి ప్రాంగణం శనివారం దద్దరిల్లింది. మృతుడి బంధువులు డాక్టర్ వల్లూరి హేమసుందర్ పై చేయి చేసుకోవడంతో పాటు ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు రాణీనగర్‌కు చెందిన గురువెల్లి దుర్గారావు(23) తాపీపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి దేవిశ్రీతో మూడు నెలలు క్రితం వివాహమైంది. వినాయక చవితి నిమజ్జనోత్సవాల్లో పాల్గొనడంతో నడుంపట్టిందని, కాళ్లు గుంజుతున్నాయని చెప్పడంతో బంధువులు శనివారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. అయితే వైద్యులు సరైన వైద్యం అందించకపోవడంతో ఆసుపత్రిలో చేర్చిన గంట అనంతరం దుర్గారావు మృతిచెందినట్టు అతడి బంధువులు తెలిపారు వైద్యుడిపై దాడి వైద్యుడు వల్లూరి హేమసుందర్ నిర్లక్ష్యం వల్లే దుర్గారావు మృతిచెందాడని అతడి బంధువులు ఒక్కసారిగా డాక్టర్‌పై దాడికి దిగి చితకబాదారు. అనంతరం ఆసుపత్రిలోని అత్యవసర సేవల విభాగం అద్దాలు ధ్వంసం చేసి భీభత్సం సృష్టించారు. ఓ రోడ్డు ప్రమాదం విషయమై అక్కడికి వచ్చిన పోలీసులు వెంటనే అప్రమత్తమై పరిస్థితి చేయిదాటకుండా జాగ్రత్త పడ్డారు. వారి సమాచారంతో డీఎస్పీ కె.సత్తిబాబు, సీఐలు, ఎస్సై అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. దుర్గారావు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలిస్తుండగా మళ్లీ ఒక్కసారిగా బంధువులు చుట్టుముట్టి తరలించడానికి వీల్లేదంటూ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో ఆందోళనకారులను గేటు బయటకు చెదరగొట్టి ఆసుపత్రి ప్రాంగణం అన్ని వైపులా పోలీసు బలగాలను మోహరించారు. ఆందోళనకారుల డిమాండ్ మేరకు వైద్యుడిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తామని కేసు నమోదు చేస్తామని చెప్పినా వినలేదు. చివరకు పోలీసుల రక్షణ మధ్య మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఆసుపత్రి ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బాధితుల ఫిర్యాదు మేరకు డాక్టర్ హేమసుందర్, నర్సు పద్మజలపై కేసు నమోదు చేసినట్టు టూటౌన్ సీఐ వై.సత్యకిషోర్ తెలిపారు. దుర్గారావు మృతదేహానికి ఇద్దరు వైద్యులు ఎ.హరికృష్ణ, పి.హిమబిందుల బృందం పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కన్నీరుమున్నీరైన దుర్గారావు కుటుంబ సభ్యులు వైద్యులు సకాలంలో స్పందించి ఉంటే తన భర్త తనకు దక్కేవాడని దుర్గారావు భార్య గుండెలవిసెలా విలపించింది. తమ కుటుంబానికి ఆధారమైన దుర్గారావును పొట్టనబెట్టుకున్న వైద్యుడిపై చర్య తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేశారు. -
రోడ్డు ప్రమాదంలో విశాఖ వాసి దుర్మరణం
తణుకు క్రైం, న్యూస్‌లైన్ : రోడ్డు ప్రమాదంలో బస్సు అటెండెంట్ దుర్మరణం చెందిన ఘటన తణుకు జాతీయ రహదారిపై జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం తెల్లవారు జాము న 4.30 గంటల సమయంలో చెనై్న నుంచి వైజాగ్ వెళ్తున్న విశాఖపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ ఇంద్ర బస్సు తణుకు జాతీయ రహదారిపై ఉన్న టోల్గేట్ వద్ద ముందు ఉన్న వాహనాలకు 50 మీటర్ల దూరంలో ఆగింది. బస్సు అటెండెంట్ గానుగుల గంగాధరరావు(45) బస్సు ఆగిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకుని వస్తానని డ్రైవర్‌కు చెప్పి కిందకు దిగాడు. బస్సుకు ముందు ఉన్న లారీకి మధ్యలోంచి వెళ్తుండగా అదే సమయంలో వెనుక నుంచి సిమెంట్ లోడుతో వేగంగా వచ్చిన లారీ బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు ఉన్న లారీని ఢీకొంది. ఈ క్రమంలో గంగాధరరావు లారీ, బస్సుకు మధ్య నలిగిపోరుు అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనలో బస్సు వెనుక భాగం ధ్వంసమైంది. అదృష్టవశాత్తూ బస్సులో ఉన్న 12 మంది ప్రయూణికులు ఎటువంటి గాయూలు లేకుండా బయటపడ్డారు. సిమెంట్ లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చే రుకుని శవ పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని తణుకు ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. డ్యూటీకి వెళ్లొదన్నా వినలేదు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయ్.. ఇక బస్సు ఎక్కొద్దంటే ఈనెల జీతం తీసుకుని మానేస్తానని చెప్పిన భర్త అంతలోనే దూరమైపోయాడని భార్య సరోజిని కన్నీటి పర్యంతమైంది. ఈరోజు డ్యూటీకి వెళ్లొద్దని చెప్పినా తప్పదని వెళ్లాడని.. బస్సు దిగకుండా ఉన్నా తన భర్త దక్కేవాడని ఆమె రోదించిన తీరు చూపరులను కలచి వేసింది. ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే గంగాధరరావు విశాఖపట్నంలోని అల్లిపురం ప్రాంతానికి చెందినవాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అతను పనిచేసే కంపెనీలో పని లేకపోవడంతో 4 నెలలుగా విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లే ఆర్టీసీ ఇంద్ర బస్సులో అటెండెంట్‌గా పనిచేస్తున్నాడు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
మంగళగిరి రూరల్, న్యూస్‌లైన్ : పట్టణంలోని తెనాలి జంక్షన్ హెచ్‌పీ పెట్రోల్ బంకు ఎదుట మంగళవారం రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్‌ను కారు ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం గుండగొలను గ్రామానికి చెందిన సీహెచ్ నాగరాజు(48) కారులో గుంటూరు నుంచి విజయవాడ వైపు వెళుతున్నాడు. మార్గం మధ్యలో హెచ్‌పీ పెట్రోల్ బంకు ఎదుట రోడ్డు పక్కన నిలిపి ఉన్న ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టాడు. దీంతో తలకు తీవ్ర గాయమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న 108 వాహన సిబ్బంది క్షతగాత్రుడిని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుం డగా మార్గంమధ్యలో మృతి చెందాడు. ప్రమాదంలో దెబ్బతిన్న కారును పట్టణ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
క్షణక్షణం.. భయం భయం
జిల్లాలో శనివారం రోడ్లు రక్తసిక్తమయ్యాయి. అతివేగం.. మంచుతెర రూపంలో మృత్యువు వెంటాడింది. కావలి సమీపంలో ఓ బొలెరో వాగులో బోల్తాపడింది. ఇద్దరు మృత్యువాతపడగా, ఆరుగురు గాయాలతో బయటపడ్డారు. మర్రిపాడు సమీపంలో రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొంది. 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. జలదంకి సమీపంలో బైకును ట్రాక్టర్ ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందాడు. నెల్లూరులో రోడ్డు దాటుతున్న ఆటో డ్రైవర్‌ను కారు ఢీకొనడంతో మృతి చెందాడు. ఏ క్షణానికి ఏ దుర్వార్త వినాల్సి వస్తుందో..ఎప్పుడు ఏవైపు నుంచి దొంగలు తెగబడతారో.. రోడ్డు ప్రమాద రూపంలో మృత్యు వు ఎప్పుడు ఎవరిని, ఎంతమందిని కబళిస్తోందో..ఇలా క్షణక్షణం..భయం భయంగా 2013లో సింహపురి ప్రజలు గడిపారు. క్షణికావేశం, అల్పసంపాదన, వివాహేతర సంబంధాలు, మద్యంమత్తు, అనుమానాలు, పాతకక్షలు..ఇలా కారణమేదైతేనేం ఇప్పటి వరకు 85 ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. బిడ్డలను కనురెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులే వారిపై దారుణాలకు తెగబడ్డారు. ఈజీమనీకి అలవాటు పడిన పలువురు చైన్ స్నాచింగ్‌లతో చెలరేగిపోయారు. వీలుకాని చోట ప్రాణాలు తీసేం దుకు కూడా వెనుకాడలేదు. మొత్తం మీద ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు నిఘా వ్యవస్థ వైఫల్యంతో జిల్లాలో పలు దారుణాలు చోటుచేసుకున్నాయి. గతేడాదితో పోలిస్తే నేరాల సంఖ్య గణనీయంగా పెరిగింది. - న్యూస్‌లైన్, నెల్లూరు(క్రైమ్) ఎల్లలుదాటిన ఎర్రచందనం జిల్లాలోని వెలుగొండ అడవుల్లో అరుదుగా లభించే ఎర్రచందనం ఈ ఏడాది భారీగా ఎల్లలు దాటింది. అడపాదడపా పోలీసులు, అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నా దొరకని దుంగలే ఎక్కువ. గతంలో ఎన్నడూ లేనివిధంగా తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు, కూలీలు జిల్లాలోకి ప్రవేశించారు. వీరిలో సుమారు 120 మందిని వరకు అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో పట్టుబడిన సుమారు 250 మందిని నెల్లూరు జైలుకు తరలించారు. మహిళలపై దారుణాలు మహిళలపై జరిగిన దారుణాలకు సంబంధించి జిల్లాలో ఈ ఏడాది 800 కేసుల వరకు నమోదయ్యాయి. వీటిలో వరకట్న హత్యలు ఏడు, ఆత్మహత్యలు 33, వేధింపులు 129, హత్యలు 35, వరకట్న వేధింపులు 187, కిడ్నాప్ కేసులు 55 ఉన్నాయి. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే భక్షకులయ్యారు. అక్రమాలకు పాల్పడుతూ కొంద రు, దొంగలకు సహకరించి మరికొందరు, మద్యం మత్తులో జోగుతూ ఇంకొందరు పోలీసుశాఖ ప్రతిష్టను మంటగలిపారు. లంచం తీసుకుంటూ ఓజిలి ఎస్సై కలికి జనార్దన్‌రెడ్డి ఏసీబీకి పట్టుబడ్డారు. కార్మికశాఖ అధికారులతో అనుచితంగా వ్యవహరించడానే ఆరోపణపై గూడూరు రూరల్ సీఐ వేమారెడ్డిపై ఉన్నతాధికారులు కేసు నమోదురు. అకారణంగా ఓ వ్యక్తిని కొట్టాడని ఆత్మకూరు ఎస్సైపై కేసు నమోదైంది. ఓ యువతిని లైంగికంగా వేధించడంతో కావలిలో ఎక్సైజ్ కానిస్టేబుల్ బ్రహ్మానందకుమార్ పోలీసు రికార్డుల్లోకి ఎక్కారు. కలువాయిలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. దొంగలకు సహకరించారని బిట్రగుంట పోలీసుస్టేషన్లో హెడ్‌కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లను విధులనుంచి తొలగించారు. జాతీయరహదారిపై వసూళ్లకు పాల్పడుతున్నారంటూ గూడూరు సబ్‌డివిజన్ పరిధిలో నలుగురు సిబ్బందిని, పేకాటాడుతూ దొరికిన వారిని కూడా విధులనుంచి తొలగించారు. ఏఆర్ డీఎస్పీ శివారెడ్డి వేధిస్తున్నాడని ఆయన భార్య విజయశ్రీ ఫిర్యాదు చేయడం పోలీసుశాఖలో చర్చనీయాంశంగా మారింది. దిగజారిన మానవీయ విలువలు ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతున్నా అదే స్థాయిలో మాన వ సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఈ ఏడాదిలో జిల్లాలో చోటుచేసుకున్న పలు సంఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఏప్రిల్ 26న నెల్లూరులోని మైపాడుగేటు శ్రీనివాసనగర్‌లో దుద్దుగుంట రాధను భర్తే హత్య చేశాడు. జూన్ 5న నెల్లూరు రామ్మూర్తినగర్లోని పినాకిని అపార్టుమెంట్లో శివప్రసాద్‌ను భార్య, అత్తే దారుణంగా హత్య చేశారు. జూన్ 10న పడారుపల్లి ఆటోనగర్ కాలనీలో సులోచన హత్యకు గురైంది. ఈ కేసులో ఆమె సోదరుడే నేరారోపణ ఎదుర్కొంటున్నాడు. జూలై 3న నెల్లూరు జాకీర్‌హుస్సేన్‌నగర్‌లో ఇల్లు ఖాళీ చేయమన్నందుకు సుప్రజ అనే మహిళను ఉమాదేవి చంపేసింది. ఆగస్టు 30న కోవూరు మండలం వేగూరులో సంపూర్ణమ్మ భర్త చేతిలో హత్యకు గురైంది. సెప్టెంబర్ 2న ఆత్మకూరులో తల్లి అడివెమ్మను కుమారుడే హతమార్చాడు. సెప్టెంబర్ 4న నెల్లూరు వెంకటేశ్వరపురంలో సుధాకర్‌ను భార్య సావిత్రి హత్యచేసింది. అక్టోబర్ 3న కావలిలో చిన్నారి ఐశ్వర్యను ఆమె తల్లే అంతమొందించింది. పొదలకూరులో కూతురినే నిర్బంధించి లైంగికదాడి చేసిన తండ్రి ఉదంతం, జలదంకి మండలంలో పద్మ అనే మహిళను భర్త హతమార్చడం, సూళ్లూరుపేటలో కుటుంబసభ్యులే ఇంటి యజమానికి హత్య చేసిన సంఘటన లు నవంబర్‌లో చోటుచేసుకున్నాయి. డిసెంబర్ 10న నెల్లూరులో ఆస్తి కోసం తోడబుట్టిన సోదరి కుటుంబాన్నే అంతమొందించేందుకు ఓ మహిళ ప్రయత్నించింది. డిసెంబర్ 14న నెల్లూరు రూరల్ మండలం మాదరాజుగూడూరులో తండ్రి కమతం నరసయ్యను కుమారుడు హత్య చేశాడు. అదే రోజు సంగం మండలం జెండాదిబ్బలో హారికను భర్త హరికృష్ణ చంపేశాడు. సంచలన హత్యలు జిల్లాలో ఈ ఏడాది చోటుచేసుకున్న పలు హత్యాఘటనలు ప్రజలను ఉలిక్కిపాటుకు గురిచేశాయి. వాటిలో కొన్ని ప్రధాన ఘటనలు ఇవి. జనవరి 31న బుచ్చిరెడ్డిపాళెంనకు చెందిన అంధ విద్యార్థి శశాంక్‌ను కొందరు దుండగులు నగదు కోసం కిడ్నాప్ చేసి, హతమార్చి నెల్లూరు మూలాపేటలో పోలీసుక్వార్టర్స్ సమీపంలోని బావిలో పడేశారు. ఫిబ్రవరి 9వ తేదీ అర్ధరాత్రి దుత్తలూరు మండలం సోమలరేగడలో ఇంటి యజమానే కుటుంబంలోని నలుగురిని హతమార్చాడు. ఫిబ్రవరి 12న నెల్లూరులోని హరనాథపురంలో ముగ్గురు యువకులు నగదు కోసం తల్లీకూతురిని దారుణంగా చంపేశారు. ఏప్రిల్ 10న జలదంకి మండలం జమ్మలపాళెంకు చెందిన కొండారెడ్డి కోర్టుకు హాజరయ్యేందుకు కావలికి బైక్‌పై బయలుదేరగా బుడమగుంట వద్ద ప్రత్యర్థులు వేటకొడవళ్లతో నరికి హతమార్చారు. జూలై 4న మాజీ మావోయిస్టు నేత గంటి ప్రసాదంను నెల్లూరులోని అరవింద్‌నగర్‌లో పట్టపగలే కాల్చిచంపారు. సెప్టెంబర్ 11న తడ మండలం బోడిలింగాలపాడులో దంపతులను పక్కింటి వ్యక్తే దారుణంగా చంపేశాడు. అక్టోబర్ 13న వెంకటాచలం మండలం కాకుటూరులోని చింతాలమ్మ ఆలయ వాచ్‌మన్ సుబ్బరామయ్యను గుర్తుతెలియని వ్యక్తులు కిరాతకంగా చంపారు. ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు 28 మందికి గాయాలు మర్రిపాడు/ఆత్మకూరు/ఆత్మకూరురూరల్, న్యూస్‌లైన్ : ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటన మండలంలోని నెల్లూరు-ముంబాయి రహదారిపై మరియవరం సమీ పం వద్ద శనివారం జరిగింది. ఈ ప్రమాదంలో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరియవరం సమీపంలో ఓ లారీ పంక్చర్ అయి రోడ్డు పై ఆగి ఉంది. ఉదయం మంచు తీవ్రత కారణంగా రోడ్డు సక్రమంగా కనిపించకపోవడంతో చాబోలు నుంచి ఆత్మకూరుకు వస్తున్న ఉదయగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి లారీని వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ షంషీద్తో పాటు ప్రయాణికులు సులోచనమ్మ, సుభాన్, వెంగమ్మ, అబ్దుల్లా, ర మణయ్య, సంజీవరాజు, వెంకట రమణయ్య, కొండమ్మ, సునీత, శ్రీనివాసులు తదితరులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆత్మకూరు, ఉదయగిరి 108 వాహనాల సిబ్బం ది ఆత్మకూరుకు తరలించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్, సులోచనమ్మతో పాటు మరో ఐదుగురిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించినట్లు ఆత్మకూరు వైద్యాధికారి మాల్యాద్రి తెలిపారు. ప్రమాద విషయం తెలుసుకున్న మర్రిపాడు ఎస్సై రవినాయక్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులకు ఆర్టీసీ ఆదరణ కరువు బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుల ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రి వద్ద బాధితులకు ఆత్మకూరు డిపోకి చెందిన సిబ్బంది, అధికారుల ఆదరణ క రువైంది. ఎక్కడైనా ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగితే సమీప డిపోకి చెందిన మేనేజరు లేదా కిందిస్థాయి అధికారి సంఘటన స్థలాన్ని పరిశీ లించి బాధితులకు మెరుగైన వైద్య సేవలకు అవసరమైన సదుపాయాలు సమకూర్చాలి. అయితే శనివారం ఆసుపత్రి వద్ద బాధితులను పట్టించున్న ఆర్టీసీ అధికారులు కరువయ్యారు. ఆత్మకూరు ఆర్టీసీ డీఎం సెలవులో ఉన్నారు. దీంతో సమీపంలోని ఉదయగిరి డిపో మేనేజర్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆయన అందుబాటులో లేరు కాబట్టి మేనేజర్ కిందిస్థాయి అధికారి ఎస్టీఐ అన్నీ బాధ్యతలు చూసుకోవాలి. అయితే ఎస్టీఐ డిపో ప్రధాన కేంద్రంలో ఉం డరు. పొరుగూరు నుంచి ఆయన రాకపోకలు సాగిస్తుంటారు. ప్రమాదం ఎప్పుడో తెల్లవారుజామున జరిగినా ఉదయం 10 గంటల వరకు ఆయన ఆసుపత్రి వద్ద కనిపించలేదు. క్షతగాత్రులను స్వగ్రామాలకు పంపించే ఏర్పాట్లు చేయలేదు. కొంతమందిని నెల్లూరుకు తరలించారు. పోలీసులు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది మా త్రమే అంబులెన్స్‌లకు ఫోన్లు చేసి పిలిపించారు. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్య వైఖరి విమర్శలకు దారి తీసింది. మోటార్ సైకిల్‌ను ఢీకొన్న ట్రాక్టర్ యువకుడి మృతి జలదంకి, న్యూస్‌లైన్ : మోటార్‌సైకిల్‌ను ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో మండలంలోని కొత్తపాళెంకు చెందిన గునుపాటి రమేష్‌రెడ్డి (22) అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో కొత్తపాళెం కావలి కాలువ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కొత్తపాళెంకు చెందిన గునుపాటి రామచంద్రారెడ్డి రాత్రి 9.30 గంటలకు కావలి నుంచి గుడ్లదొన ఆర్టీసీ బస్సులో కొత్తపాళెంకు వచ్చాడు. అయితే బస్సులో కొన్ని వస్తువులు మరిచిపోయాడు. దీంతో కుమారుడు రమేష్‌రెడ్డిని బస్సు వద్దకు వెళ్లి వస్తువులు తీసుకు రావాల్సిందిగా మోటార్ సైకిల్‌పై పంపించాడు. రమేష్‌రెడ్డి గుడ్లదొనకు వెళుతుండగా గుడ్లదొన నుంచి కట్టెల లోడుతో డోర్లు తెరుచుకుని ట్రాక్టర్ వస్తుంది. కావలి కాలువ సమీపంలో బైక్‌పై వెళుతు న్న రమేష్‌రెడ్డిని ట్రాక్టర్ ఢీ కొంది. ట్రాక్టర్‌కు ఒక లైటు మాత్రమే ఉండటంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. రమేష్‌రెడ్డి మృతదేహాన్ని కొత్తపాళెంకు తరలించారు. దీనిపై జలదంకి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ట్రాక్టర్ కలిగిరి మండలం గుడ్లదొనకు చెందినదిగా తెలుస్తుంది. ట్రాక్టర్‌ను గ్రామస్తులు స్వాధీనం చేసుకున్నారు. పొట్టు బస్తాల మాటున ఎర్రచందనం రవాణా ప్రమాదంతో వెలుగులోకి గూడూరు, న్యూస్‌లైన్: పొట్టు బస్తాల మాటున ఎర్రచందనం దుంగలను రవాణా చేస్తున్న విషయం రోడ్డు ప్రమాదంతో వెలుగులోకి వచ్చింది. దుంగలతో వెళుతున్న మినీలారీ ఓ బైక్‌ను ఢీకొనడంతో అక్రమ రవాణా గుట్టు రట్టయింది. చిల్లకూరుకు చెందిన గుడి రామిరెడ్డి శుక్రవారం అర్ధరాత్రి బైక్‌పై జాతీయరహదారిపై వెళుతుండగా పోటుపాళెం కూడలిలో ఓ మినీలారీ ఢీకొంది. రామిరెడ్డి కిందపడిపోవడంతో ఆందోళనకు గురైన డ్రైవర్ మినీలారీని అక్కడే వదిలేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న గూడూరు రూరల్ పోలీసు లు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా మినీలారీలో 23 ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. వీటి విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని లెక్కగట్టారు. మినీలారీకి నంబర్‌ప్లేటు లేకపోపోగా తాత్కాలికంగా ఓ నంబర్‌ను స్టిక్కర్లా వేసుకున్నారు. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గాయపడిన రామిరెడ్డిని చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పంజా విసిరిన ఏసీబీ అక్రమార్కుల గుండెల్లో ఏసీబీ అధికారులు రైళ్లు పరిగెత్తించారు. ఏసీబీ నెల్లూరు డీఎస్పీ జె.భాస్కర్‌రావు ఆధ్వర్యంలో పలు ఆకస్మిక దాడులు జరిగాయి. కార్పొరేషన్, వైద్యఆరోగ్యశాఖ, ఆర్టీఏ కార్యాలయాలతో పాటు భీములవారిపాళెంలోని ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టుపై పలుమార్లు దాడులు చేసి అక్రమార్కులకు ముచ్చెమటలు పట్టించారు. లంచాలు తీసుకుంటున్న పలు శాఖల అధికారులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని జైలుకు పంపారు. మద్యం సిండికేట్ వ్యవహారంలో 45 మంది పోలీసు, ఎక్సైజ్ అధికారులపై శాఖాపరమైన విచారణకు నివేదికను ప్రభుత్వానికి పంపారు. అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణతో విశ్రాంత డీఎంహెచ్ఓ మాశిలామణితో పాటు మరో 10మంది వైద్యాధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఫిబ్రవరిలో జిల్లా ఖజానా కార్యాలయంలో ఎస్టీఓ శేషయ్య, ఏటీఓ మోహన్‌రావు, డ్రైవర్ థామస్, మార్చిలో పరిశ్రమల శాఖ కార్యాలయంలో సూపరింటెం డెంట్ సుబ్బారావు, అటెండర్ రత్తయ్య, ఏప్రిల్‌లో నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో బిల్డింగ్ ఇన్స్పెక్టర్ తోరాటి మధుసూదన్‌ప్రసాద్, సత్తారు బాబురావు, తాళ్లపాక శ్రీని వాసులురెడ్డి, ఆగస్టులో ఓజిలి ఎస్సై కలికి జనార్దన్‌రెడ్డి, అటవీశాఖకు సంబంధించిన ఏపీఎఫ్డీసీ డివిజనల్ మేనేజర్ గనీబాషా లంచ ం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సంఘటనలు సంచలనం సృష్టించాయి. ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్:తీవ్ర అనారోగ్యంతో మనస్థాపానికి గురైన ఓ వృద్ధుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నెల్లూరులోని బారాషహీద్ దర్గా ఆవరణలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేర కు.. తోటపల్లిగూడూరు మండలం కొత్తపాళెంకు చెందిన ఎస్కే ఖాసింసాహెబ్(65) బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భార్య చనిపోవడంతో కుమార్తె మస్తానమ్మను పెంచేందుకు గంగపట్నంకు చెందిన మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఓ కుమారుడు పుట్టిన తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి. కుమారుడితో ఆమె వెళ్లిపోవడంతో కుమార్తెతో కలిసి ఖాసింసాహెబ్ పదేళ్ల కిందట గంగవరానికి చేరుకున్నాడు. గ్రామంలోని శివాలయం వద్ద ఉంటూ బేలుదారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన మద్యానికి బానిస కావడంతో అనారోగ్యానికి గురయ్యాడు. వైద్యులకు చూపించినా ఫలితం కరువవడంతో మనస్థాపానికి గురై చెట్టుకు పంచెతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు అతని సెల్‌ఫోనులోని నంబర్ల ఆధారంగా కుమార్తె మస్తానమ్మతో పాటు ఒకటోనగర పోలీసులకు సమాచారమందించారు. ఒకటో నగర ఎస్సై వేమయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుమార్తె మస్తానమ్మకు అప్పగించారు. చెలరేగిన దొంగలు ఈ ఏడాదిలో దొంగల హస్తలాఘవానికి అడ్డే లే కుండా పోయిం ది. రాత్రి, పగలు అనే తేడా లేకుం డా చెలరేగిపోయి అందిన కాడికి దోచుకెళ్లారు. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ. 10 కోట్ల సొత్తు దొంగల పాలయిం ది. ఐదు డెకాయిటీలు, 40 దోపిడీలు, తొమ్మిది మర్డర్ ఫర్గెయిన్, 2,593 చోరీ కేసులు నమోదయ్యాయి. సుమారు రూ.6 కోట్ల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకుని పలువురిని జైలుకు పంపారు. చైన్ స్నాచర్లు చెలరేగిపోయారు. కొందరు దుండగులు ఇళ్లలోకి దూరి ప్రాణాలు తీసేందుకు కూడా వెనకాడ లేదు. కొందరైతే పోలీసుల ముసుగులోనే స్వైరవిహారం చేశారు. బంగారు గొలుసు చోరీ గూడూరు టౌన్, న్యూస్‌లైన్:నడిచి వెళుతున్న మహిళ మెడలోని బంగారు గొలుసును బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు లాక్కెళ్లినట్లు శనివారం ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసుల కథనం మేరకు.. పెల్లేటివారివీధికి చెందిన వెంకటేశ్వర్లు, వెంకటలక్ష్మి శుక్రవారం రాత్రి నెల్లూరుకు వచ్చి గూడూరుకు వచ్చారు. పెల్లేటివారి వీధికి నడిచివెళుతుండా ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి ఆమె మెడలోని ఏడు సవర్ల బంగారు గొలుసును లాక్కెళ్లారు. గొలుసు విలువ రూ.2 లక్షలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వాకాడు ఐటీఐ ప్రిన్సిపల్ సస్పెన్షన్ -మరో ముగ్గురు కూడా... వాకాడు, న్యూస్‌లైన్: విద్యార్థులను పాస్ చేయిస్తానని వారి నుంచి పెద్ద ఎత్తు న డబ్బు వసూళ్లు చేసిన వాకాడ ఐటీఐ ప్రిన్సిపల్ కరిముల్లాతో పాటు ఉపశిక్షణాధికారి శైలజ, కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు రవి, కిరణ్‌ను శనివారం సస్పెండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఉపాధికల్పనశాఖ అధికారులు ఆదేశాలిచ్చారు. గత అక్టోబర్‌లో ప్రిన్సిపల్, ఉపశిక్షణాధికారి, కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు విద్యార్థుల నుంచి దాదాపు రూ.2.80 లక్షలు వసూళ్లు చేశారు. ఈ విషయమై విద్యార్థులు నెల్లూరు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఏసీబీ అధికారుల దాడిలో ప్రిన్సిపల్‌తో పాటు మరో ముగ్గురు పట్టుబడ్డారు. వీరి నుంచి ఏసీబీ అధికారులు రూ.2.80 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వీరు నిందితులని తేలడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏసీబీకి చిక్కిన వారికి చార్జిమెమోలు బీవీపాళెం(తడ), న్యూస్‌లైన్: ఇటీవల కాలంలో రెండు సార్లు ఏసీబీ నిర్వహించిన దాడుల్లో అక్రమాలకు పాల్పడుతూ పట్టుబడిన వివిధ శాఖల ఉద్యోగుల నుంచి వివరణ కోరుతూ చార్జిమెమోలు జారీచేసినట్లు భీములవారిపాళెం ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టు పరిపాలనాధికారి మల్లికార్జునరావు శనివారం తెలిపారు. రెండు సందర్భాల్లో ఒకే బ్యాచ్‌కు చెందిన ఉద్యోగులు ఉండటంతో సమస్యను తీవ్రంగా పరిగణించి మెమోలు జారీ చేశామని చెప్పారు. ఎక్సైజ్ శాఖలో ఐదుగురికి, రవాణా శాఖలో నలుగురికి, వాణిజ్యపన్నుల శాఖలోని వివిధ విభాగాలకు చెందిన 13 మందికి మెమోలు జారీ అయ్యాయన్నారు. వాటికి వారం రోజుల్లోగా రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. వారిచ్చిన సమాధాన పత్రాలను ఆయా శాఖల ఉన్నతాధికారులకు పంపి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఎలక్ట్రికల్ వస్తువుల ఆటో సీజ్ సీఎస్టీ అడ్వాన్స్ వేబిల్లు లేకుండా చెన్నై నుంచి తడలోని పరిశ్రమలకు ఎలక్ట్రికల్ వస్తువులతో వస్తూ, చెక్‌పోస్టు వద్ద ఆగకుండా వెళ్లిన ఓ ట్రక్కు ఆటోను వెంబడించి పట్టుకున్నట్లు ఏఓ తెలిపారు. ఈ ఆటోలో రూ.3, 21, 339 విలువైన విద్యుత్ వైర్లు, బల్బులు, స్విచ్‌లు తదితర విద్యుత్ వస్తువులు ఉన్నాయన్నారు. హైదరాబాదుకు చెందిన కాంట్రాక్టర్ పేరున మీదున్న సరుకును తరలిస్తున్న ఈ ఆటోపై కేసు నమోదు చేసి గూడూరు సీటీఓ కార్యాలయానికి అప్పగించినట్టు ఏఓ చెప్పారు. -
ఆటో ఢీకొని వ్యక్తి దుర్మరణం
ఉప్పలపాడు (కామవరపుకోట), న్యూస్‌లైన్ : ఎరువుల కోసం వచ్చిన వ్యక్తి ఇంటికి వెళ్తుండగా ఆటో రూపంలో మృత్యువు కబళించింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం... టి.నరసాపురం మండలం సాయంపాలెంకు చెందిన సూరం దేవరాజు(33), బట్రు నాగరాజు అనే వ్యక్తితో కలిసి సోమవారం రాత్రి మోటార్ సైకిల్‌పై ఎరువుల నిమిత్తం కామవరపుకోట వచ్చాడు. పని ముగించుకుని ఇద్దరూ సాయంపాలెం వెళ్తుండగా ఉప్పలపాడు వద్ద ఎదురుగా వచ్చిన ట్రక్కు ఆటో బలంగా ఢీకొనడంతో దేవరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన నాగరాజును, స్వల్ప గాయాలైన ఆటో డ్రైవర్‌ను 108 వాహనంలో జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతునికి భార్య నాగమణి, కుమార్తె అనూష ఉన్నారు. భార్య ప్రస్తుతం గర్భిణి. ఈ దుర్ఘటనపై తడికలపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.