
ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా ఓ భవనం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. శిథిలాల కింద మరి కొంతమంది చిక్కుకున్నట్లు భావిస్తున్నారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. గాయపడిన వారిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో అక్కడి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో ఆ ప్రాంతంలో గందరగోళ పరిస్థితి నెలకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment