building collapse
-
భవనం కూలిన ఘటనలో ఇద్దరి మృతి
-
భద్రాచలంలో ఉద్రిక్తత.. కూలిన భవనం వద్ద ఆందోళన
సాక్షి, భద్రాచలం: భద్రాచలంలో ఐదు అంతస్తుల భవనం కూలిన ఘటన నేపథ్యంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిన్న మధ్యాహ్నం ప్రమాదం జరిగితే ఇంత వరకు శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసుకురాలేదని బాధిత కుటుంబ సభ్యుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దలకు ఒక న్యాయం.. సామాన్యులకు మరో న్యాయమా? అని ప్రశ్నిస్తున్నారు.భద్రాచలంలో ఐదు అంతస్తుల భవనం కూలిన ఘటనలో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. శిథిలాల కింద చిక్కుకొని కామేశ్వరరావు అనే వ్యక్తి చనిపోయాడు. బుధవారం అర్ధరాత్రి దాటాక సహాయ బృందాలు మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చాయి. భవనం శిథిలాల కింద మరో వ్యక్తి ఉపేందర్ ఉన్నారు. రెస్క్యూ సిబ్బంది ఇంకా సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సహాయక చర్యలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తాజాగా బాధితుల కుటుంబాల సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే నిన్న మధ్యాహ్నం ప్రమాదం జరిగితే ఇంత వరకు శిథిలాల కింద చిక్కుకున్న తమ వారిని బయటకు తీసుకురాలేదన్నారు. తమ వారు బతికున్నారా చచ్చిపోయారా అన్నది కూడా తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు బయటకు తీస్తారన్నది కూడా అధికారులు చెప్పడం లేదని మండిపడుతున్నారు. ఓ ఎమ్మెల్యే, మంత్రి కుటుంబ సభ్యులకు ఇలా జరిగితే ఇంతసేపు ఆగేవారా అని ప్రశ్నిస్తున్నారు. పెద్దలకు ఒక న్యాయం.. సామాన్యులకు ఒక న్యాయమా?. శిథిలాల కింద చిక్కుకున్న తమ నాన్న కావాలని రోడ్డుపై కూర్చొని.. ఓ వ్యక్తిని కన్నీరుపెట్టుకున్నారు. మరోవైపు.. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు.. శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక, కూలిన భవనం యజమాని శ్రీనివాసరావు, ఆయన కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.ఇదిలా ఉండగా.. బుధవారం మధ్యాహ్నం 2.40 గంటల సమయంలో భవనం ఉన్నట్లుండి ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో అందులో పనిచేసేందుకు వచ్చిన ఇద్దరు తాపీ కార్మికులు చిక్కుకుపోయారు. సమాచారం అందిన వెంటనే కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజ్ సంఘటన స్థలానికి వెళ్లి రెస్క్యూ సిబ్బందితో శిథిలాల తొలగింపు పనులు చేపట్టారు. శిథిలాలను తొలగించే యత్నంలో గ్రౌండ్ ఫ్లోర్ పిల్లర్లు, స్లాబ్ కూలాయి. దానిపై మిగిలిన అంతస్తుల స్లాబ్‌లు పేర్చినట్లు పడిపోయాయి. దీంతో అందులో ఉన్న ఓ వ్యక్తి సహాయం కోసం కేకలు వేయడంతో వైద్య బృందాలను రప్పించి పైపుల ద్వారా ఆక్సిజన్ పంపించారు. కూలిన స్లాబ్ కిందకు కుంగిపోకుండా జాకీలను ఉంచారు. -
కుప్పకూలిన బిల్డింగ్.. 12 గంటలుగా కొనసాగుతున్న సహాయక చర్యలు
చంఢీగడ్ : పంజాబ్ రాష్ట్రం మొహాలి జిల్లాలో మూడంతస్తుల భవనం కుప్పుకూలింది. సహాయక చర్యలు 12 గంటలకు నిర్విరామంగా కొనసాగుతున్నట్లు సహాయక బృందాలు వెల్లడించాయి. శనివారం సాయంత్రం మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల యువతి మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. మొహాలీ జిల్లాలో ఓ భవనంలో బేస్మెంట్ కోసం తవ్వకాలు జరుగుతుండగా.. పక్కనే ఉన్న మూడంతస్తుల భవనం కుప్పకూలింది. భవనం శిథిలాల కింద పది మంది వరకు చిక్కుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు.భవనం కూలిపోవడంపై సమాచారం అందుకున్న ఇండియన్ ఆర్మీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ (ఎన్డిఆర్ఎఫ్) బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న బాధితుల్ని సంరక్షించారు. అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాయి. ప్రస్తుతం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.మరోవైపు భవనం కూలిపోవడంపై సమాచారం అందుకున్న పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 105 కింద భవన యజమానులు, పర్వీందర్ సింగ్, గగన్‌దీప్ సింగ్‌లపై కేసు నమోదు చేశారు. భవనం కూలిపోవడంపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ విచారం వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.-Sohana Building Collapse Update- Rescue Operation Continues;District Admin Sets Up Control Room +91 172-2219506,Civil Hospital Mohali, Fortis, Max and Sohana Hospital put on alert pic.twitter.com/UjRsI4G0Zh— DC Mohali (@dcmohali) December 21, 2024 -
భవనం కుప్పకూలి ఐదుగురు మృతి.. డిప్యూటీ సీఎం సీరియస్
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరును భారీ వర్షాలు వణికించాయి. మంగళవారం కురుసిన కుండపోత వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా బెంగళూరులో నిర్మాణంలో ఉన్న ఓ బహుళ అంతస్తు భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు అయిదుగురు మృతి చెందారు.మరో ఏడుగురికి గాయాలయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 13 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో బీహార్‌కు చెందిన హర్మన్ (26), త్రిపాల్ (35), మహ్మద్ సాహిల్ (19), సత్యరాజు (25), శంకర్ ఉన్నారు.బెంగళూరు తూర్పు ప్రాంతంలోని హోరామావు అగరా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం మంగళవారం మధ్యాహ్నం కుప్పకూలిందదని, ప్రమాద సమయంలో భవనంలో దాదాపు 20 మంది ఉన్నారని అధికారులు వెల్లడించారు. నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా రాత్రి వరకు సహాయక చర్యలు ఆపేశారు. తిరిగి బుధవారం ఉదయం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. సహాయక చర్యల్లో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌తోపాటు డాగ్ స్క్వాడ్లను కూడా రంగంలోకి దించారు.A multi storey building collapsed with in seconds In Bengaluru. The building collapse killed one person with five people still missing. Fourteen workers have been rescued from the rubble at the construction site in Babusapalya. Building basement became weak due to continuous… pic.twitter.com/rM5dr5WVhf— V Chandramouli (@VChandramouli6) October 23, 2024భవనం కూలిన ప్రాంతాన్ని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సందర్శించారు. బెంగళూరులో నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఐదుగురు మృతి చెందడం బాధాకరమని అన్నారు. అయితే భవన నిర్మాణం చట్టవిరుద్ధమని, దాని యజమానిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. భవనానికి అనుమతి ఇవ్వలేదని అధికారులు చెప్రనిరు. అక్రమ నిర్మాణాలు చేపడుతున్న యజమాని, కాంట్రాక్టర్, దీనితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బెంగళూరు వ్యాప్తంగా అన్ని అక్రమ నిర్మాణాలను వెంటనే ఆపేసేలా తాము అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాంట్రాక్టర్, యజమాని, అధికారులు ప్రతి ఒక్కరిపై చట్ట ప్రకారం కేసు నమోదు చేస్తామని తెలిపారు.Rains and building collapse. This is in Anjanadri layout, near #HoramavuAgara 6 storey building under construction.. some workers are stuck inside sadly z pic.twitter.com/igamkHjA7L— HennurBlr (@HennurBlr) October 22, 2024 భవనం కూలిన ఘటనపై మాకు సమాచారం అందిన తర్వాత, అగ్నిమాపక యంత్రాలు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారని ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ ఠాకూర్ తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సమాచారం అందించామని, రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని చెప్పారు.. తమకు అందిన సమాచారం ప్రకారం ప్రమాద సమయంలో 21 మంది కూలీలు ఉన్నారని, రోజూ 26 మంది ఇక్కడ పనిచేస్తున్నారని తెలిపారు. 60/40 ప్లాట్‌లో ఇంత పెద్ద భవనాన్ని నిర్మించడం నేరమని, మూడుసార్లు నోటీసులు జారీ చేశామని చెప్పారు. మరోవైపు రికార్డు స్థాయిలో భారీ వర్షం కురవడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. దక్షిణ ప్రాంతం మొత్తం కూడా నీట మునిగింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. సహాయక చర్యలు చేపట్టారు. బెంగళూరు నగరానికి నేడు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సిటీలోని పాఠశాలలకు అధికారులు సెలవులు ప్రకటించారు.ఐటీ కంపెనీలు కూడా తమ ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయడానికి అనుమతించాలని సూచించారు. -
ఢిల్లీలో కూలిన రెండతస్తుల భవనం..
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఓ భవనం కుప్పకూలింది. కరోల్‌బాగ్‌లోని ప్రసాద్ నగర్ ప్రాంతంలో రెండంతస్తుల నివాస భవనంలోని ఓ భాగం బుధవారం కూలింది. దీంతో అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నారు.సమాచారం అందుకున్న ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది సంఘటనస్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ఐదు అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి.అయితే ఇటీవల దేశ రాజధానిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగానే భనం కుప్పకూలినట్లు అధికారులు వెల్లడించారు. గత నెలలో ఇలాంటి ఘటనే జరిగింది. ఢిల్లీలోని మోడల్ టౌన్లో భారీ వర్షాల కారణంగా పునర్నిర్మాణం కోసం కూల్చివేస్తున్న శిధిలమైన భవనం కూలిపోవడంతో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.Delhi | A house collapsed in Karol Bagh area. A total of 5 fire tenders rushed to the site. Some portion of the building collapsed and some persons are suspected to be trapped under the debris. Further details awaited: Delhi Fire Services(Source: Delhi Fire Services) pic.twitter.com/7NbRmqn2yN— ANI (@ANI) September 18, 2024 -
కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. నలుగురి మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బహుళ అంతస్తుల భవనం కుప్పకూలడంతో నలుగురు మృతిచెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. లక్నోలోని ట్రాన్స్‌పోర్టు నగర్లో శనివారం సాయంత్రం మూడంతస్తుల భవనం కుప్పకూలింది. భవనం కూలడంతో సమీపంలో పారక్ చేసి లారీ కూడా నుజ్జునుజ్జయింది.సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. అయితే శిథిలాల కింద మరికిందరు చిక్కుకొని ఉంటారి అధికారులు భావిస్తున్నారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బిల్డింగ్ కూలడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందికాగా బిల్డింగ్ కూలిన ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా సహాయక చర్యలు పూర్తి చేయాలని తెలిపారు.#WATCH | Lucknow building collapse | Rescue operations to evacuate the trapped people are underway. Fire Department and NDRF teams are at the spot. The evacuated people are being sent to the hospital.So far, 4 people have been evacuated in the incident. pic.twitter.com/gN3GWrAQ4X— ANI (@ANI) September 7, 2024 -
చూస్తుండగానే కుప్పకూలిన భవనం..
-
భారీ వర్షాలతో కూలిన బిల్డింగ్.. మహిళ మృతి
ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లపై ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో రహదారులపై విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. అంధేరి సబ్వే ఐదు అడుగుల మేర నీటితో నిండిపోవడంతో అధికారులు ఈ సబ్వేను మూసివేశారు.విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ముంబైలోని గ్రాంట్ రోడ్డులో ఓ బహుళ అంతస్తుల బిల్డింగ్‌లోని కొంతభాగం కూలిపోయింది. ఈ ఘటనలో 70 ఏళ్ల వృద్ధ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మరో నలుగురికి గాయాలయ్యాయి. గ్రాంట్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలోని స్లీటర్ రోడ్డులో నాలుగు అంతస్తుల రూబినిస్సా మంజిల్ భవనంలో శనివారం ఉదయం 11 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బిల్డింగ్ రెండు, మూడు అంతస్తుల్లోని బాల్కనీతోపాటు కొంత భాగం కూలిపోయింది.సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. అయితే భవనం కూలిపోయే సమయానికి అందులో 35 నుంచి 40 మంది చిక్కుకొని ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఇప్పటికీ బిల్డింగ్ ముందు కొంత భాగం ప్రమాదకరంగా వేలాడుతూనే ఉంది.ఈ ఘటనకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో శిథిలాల కింద ఇరుక్కుపోయిన వ్యక్తిని రక్షించేందుకు స్థానికులు కాంక్రీట్ స్లాబ్‌లను తొలగిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక గత మూడు రోజులుగా ముంబై, దాని పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడటం, బిల్డింగ్ శిథిలావస్థలో ఉండటమే ప్రమాదానికి కారణంగా అధికారులు భావిస్తున్నారు. Today, G+4 storey Rubinisa Manzil building came crashing down at 10.55 am. Around 35-40 people were in the building at the time of the collapse. Rescuers are looking for survivors trapped under the debris.1 woman feared dead, 3 injured. 😰#GrantRoad #Mumbai pic.twitter.com/XtGws2pizq— ѕυηιтαנα∂нαν (@01greenelephant) July 20, 2024 -
సూరత్‌లో కుప్పకూలిన ఆరు అంతస్తుల బిల్డింగ్.. 15 మందికి గాయాలు
గాంధీనగర్: గుజరాత్‌లోని సూరత్‌లో ఓ బహుళ అంతస్తుల భవనం కుప్పకూలింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో సచిన్ పాలి గ్రామంలో ఆరు అంతస్థుల భవనం కూలింది. ఈ ఘటనలో భవనంలోని పలువురు చిక్కుకున్నారు. దాదాపు పదిహేను మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపకశాఖ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బిల్డింగ్ కాంక్రీట్ బండల కింద ఎవరైనా చిక్కుకొని ఉండచ్చని గాలిస్తున్నారు. శిథిలాలు తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. భవనం శిథిలావస్థలో ఉందని, దానికి తోడు భారీ వర్షాలతో కూలిందని అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో బిల్డింగ్ కూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. #WATCH | Gujarat: A Four-floor building collapsed in Sachin area of Surat. Many people feared trapped. Police and fire department team at the spot. Rescue operations underway. pic.twitter.com/FIJJUGzbEQ— ANI (@ANI) July 6, 2024 -
భవనం కూలి ఇద్దరు మృతి.. మరొకని పరిస్థితి విషమం!
దేశ రాజధాని ఢిల్లీలో ప్రమాదం చోటు చేసుకుంది. ఒక పురాతన భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈశాన్య ఢిల్లీలోని వెల్కమ్ ప్రాంతంలోని కబీర్ నగర్లో బుధవారం అర్ధరాత్రి 2:16 గంటల సమయంలో నిర్మాణంలో ఉన్న పాత భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన భవనంలో మొదటి అంతస్తులో ఎవరూ నివసించడంలేదు. గ్రౌండ్ ఫ్లోర్లో జీన్స్ కటింగ్ పనులు జరుగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురు కూలీలను పోలీసులు బయటకు తీసుకువచ్చారు. వీరిలోని ఇద్దరు జీటీబీ ఆసుపత్రిలో మృతి చెందారు. ఒక కూలీ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. భవనం యజమాని షాహిద్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. షాహిద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసు అధికారులు తెలిపారు. #WATCH | Delhi: At around 2:16 am, a call was received regarding the collapse of a two-storey, old construction building in Kabir Nagar, Welcome. Two workers Arshad (30) and Tauhid (20) were declared dead at GTB Hospital while another worker Rehan (22) is critical and is being… pic.twitter.com/2Zjw6WmgMo — ANI (@ANI) March 21, 2024 -
Kolkata: కుప్పకూలిన ఐదంతస్తుల భవనం
క్రైమ్: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఘోరం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల భవనం ఒకటి కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. పది మందిని ఇప్పటిదాకా రక్షించగలిగారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయక్కడ. గార్డెన్ రీచ్ ఏరియాలోని ఓ కాలనీలో ఆదివారం అర్ధరాత్రి దాటాక నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల భవనం ఒకటి కుప్పకూలింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వాళ్లను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సోమవారం ఉదయం రంగంలోకి దిగిన 50 మంది సభ్యులతో కూడిన ఎన్డీఆర్ఎఫ్ ప్రస్తుతం అక్కడ సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. #UPDATE : 10 rescued, search underway for survivors as under-construction building collapses in Kolkata#Kolkata #GardenReach #BuildingCollapse #KolkataNews #India #WestBengal pic.twitter.com/LvpdkbC8Yj — upuknews (@upuknews1) March 18, 2024 Video Credits: upuknews #WestBengal | 10 Rescued As Under-Construction Building Collapses In Kolkata, Search On For Survivors#Kolkata #BuildingCollapse More Here: https://t.co/Tzpr6kK6Qe pic.twitter.com/NgJsWYSOf4 — NDTV (@ndtv) March 18, 2024 Video Credits: NDTV ఇదిలా ఉంటే.. నిబంధనలకు విరుద్ధంగా ఆ భవన నిర్మాణం సాగుతోందని.. కనీసం మూడు ఫీట్ల వెడల్పు కూడా లేని ఇరుకుగల్లీలో ఈ భవన నిర్మాణం జరుగుతోందని.. ప్రమాదం తర్వాత సహాయక చర్యలు కూడా చాలా ఆలస్యంగా మొదలయ్యాయని మీడియా ముందు స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం ఆ ఆరోపణలను ఖండించారు. -
Video: అకస్మాత్తుగా కూలిన అయిదు అంతస్తుల భవనం
అది అయిదు అంతస్తుల భవనం.. చుట్టు కొండల మధ్య ఒక్కటే బిల్డింగ్. శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఆ బహుళ అంతస్తుల భవనం కుప్పకూలింది. అందరూ చూస్తుండగానే పేకమేడల్లా నెలకొరిగింది. అయితే ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.. అసలు ఏం జరిగిందంటే.. హిమాచల్ ప్రదేశ్ రాజధాని షిమ్లాకు 26 కిలోమీటర్ల దూరంలో ధామి పట్టణంలోని మరహ్వాగ్ అనే గ్రామం ఉంది. అక్కడ రాజ్ కుమార్ అనే వ్యక్తికి అయిదు అంతస్తుల భవనం ఉంది. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో అతని ఇంటి చుట్టుపక్కల ఉన్న కొండచరియలు విరిగిపడ్డాయి. కొండ రాళ్లు ఈ బిల్డింగ్ గోడలను ఢీకొట్టాయి. ఈ క్రమంలో దానికి మరమ్మత్తులు చేశారు. అయినా కొన్ని రోజులుగా బిల్డింగ్‌లో కదలికలు రావడంతో అప్రమత్తమైన యజమాని.. బిల్డింగ్‌లోని నివాసితులను ఖాళీ చేయించి, మళ్లీ రిపేర్ చేయాలని భావించాడు. అధికారులను స్పందించగా బిల్డింగ్ ఎప్పుడైనా కూలిపోతుందని.. మరమ్మతులు చేయించిన ఫలితం ఉండదని చెప్పడంతో ఆ బిల్డింగ్‌ను అలాగే ఉంచేశాడు.. దీంతో కొన్ని రోజులకు బిల్డింగ్ బేస్మెంట్కు పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో బిల్డింగ్ అకస్మాత్తుగా కూలిపోయింది. అందులోని నివాసితులను అధికారులు ముందుగానే ఖాళీ చేయించారు. విద్యుత్ సరాఫరా కూడా నిలిపివేశారు. దీంతో ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదు. అయితే ధామి ప్రభుత్వ డిగ్రీ పాఠశాలకు వెళ్లే రహదారి దెబ్బతింది. ట్రాఫిక్‌కు సైతం అంతరాయం ఏర్పడింది. 15 సెకన్ల నిడివిగల ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (రూరల్) నిశాంత్.. ఇంటి పైన ఉన్న కొండ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టడం వల్లే భవనం కూలిపోయిందని తెలిపారు. చదవండి: భారత్‌లోకి మయన్మార్ సైనికులు.. భారత్ కీలక నిర్ణయం Breaking: Major landslide in Shimla, where a 5-story building collapsed, and cracks appeared in the adjoining area and buildings. No casualties reported till now. #Shimla #Himachal pic.twitter.com/hRVXPY45Km — Gagandeep Singh (@Gagan4344) January 20, 2024 -
Barabanki: కుప్పకూలిన మూడంతస్థుల భవనం
లక్నో: ఉత్తర ప్రదేశ్ బారబంకిలో ఘోర ప్రమాదం చోటు చేసకుంది. మూడంతస్థుల భవనం ఒకటి కుప్పకూలి.. ఇద్దరు మృతి చెందారు. చికిత్సలో శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండడం, క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది. ఆదివారం అర్ధరాత్రి దాటాక ఉన్నట్లుండి.. భవనం కుప్పకూలింది. సమాచారం అందుకున్న పోలీసులు.. సహాయక బృందాలతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. పన్నెండు మందిని శిథిలా నుంచి బయటకు తీశారు. వీళ్లలో ఇద్దరు ఆస్పత్రికి తరలించాక మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి అదనపు సమాచారం అందాల్సి ఉంది. #Barabanki फतेहपुर कस्बे में बीती रात 3 बजे के आसपास एक तीन मंजिला मकान अज्ञात कारणों से भर भराकर गिर गया जिसके नीचे कई लोगों के फंसे होने की सूचना पर पुलिस अधीक्षक सहित प्रशासनिक अधिकारी मौके पर पहुंचे, फायर ब्रिगेड और SDRF घायलों को निकाल रहा है, मिल रही जानकारी के अनुसार 10… pic.twitter.com/icqyhWJDyu — Barabanki News (@BBKNews) September 4, 2023 -
బ్రెజిల్లో పేకమేడలా కూలిన భవనం, 8 మంది మృతి
బ్రెసిలియా: బ్రెజిల్ ఈశాన్య రాష్ట్రమైన పెర్నాంబుకోలో ఓ నాలుగు అంతస్తుల భవనం పేకమేడను తలపిస్తూ క్షణాల వ్యవధిలో నేలకూలింది. భారీ శబ్దం చేస్తూ బిల్డింగ్ నేలకూలిన ఈ వీడియో చూస్తేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఈ సంఘటన తెల్లవారుజామున జరగడంతో అందులోని వారంతా నిద్రావస్థలో ఉండి ఉంటారని.. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అక్కడి అధికారులు తెలిపారు. మృతుల్లో 5 ఏళ్ళు, 8 ఏళ్ళు వయసున్న ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని వారు తెలిపారు. శిధిలాల కింద మరింతమంది చిక్కుకుని ఉండవచ్చని, సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని.. విపత్తు నిర్వహణ బృందాలు శరవేగంగా శిధిలాలను తొలగించి మిగిలినవారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు స్థానిక అధికారులు. ఇటీవల బ్రెజిల్లో జోరుగా కురిసిన వానలే ఈ ప్రమాదానికి కారణమై ఉంటుందని వారంటున్నారు. ఇది కూడా చదవండి: అంతటి బ్రిట్నీ స్పియర్స్ కు ఇంతటి ఘోర అవమానమా? 🔴 BRAZIL 🇧🇷| At least 3 residents killed and 15 trapped under the rubble after the collapse of a building in the Janga district, outskirts of the city of #Recife, State of Pernambuco (northeast). The heavy rains of last few days in the coastal city may have caused the accident. pic.twitter.com/DhDBNh6nfU — Nanana365 (@nananamedia365) July 8, 2023 -
విశాఖలో భవనం కూలి ముగ్గురు దుర్మరణం
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): విశాఖలో రెండంతస్తుల భవనం కూలిన ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలవగా.. మరో ఐదుగురు కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. నగరంలోని 29వ వార్డు పరిధి రామజోగిపేటలో 40 ఏళ్ల కిందట నిరి్మంచిన భవనం 4 రోజులుగా కురుస్తున్న వర్షానికి బుధవారం అర్ధరాత్రి కుప్పకూలిపోయింది. ఘటనలో భవనం గ్రౌండ్ ఫ్లోర్లో అద్దెకు ఉంటున్న బిహార్‌కు చెందిన రామ్‌విలాస్ (30) (అలియాస్ ఛోటు), మొదటి అంతస్తులో అద్దెకు ఉంటున్న సాకేటి దుర్గాప్రసాద్ (17), సాకేటి అంజలి (14) మృతి చెందారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్న విజయవాడ కృష్ణలంకకు చెందిన కొమ్మిశెట్టి శివశంకర్ (29), మొదటి అంతస్తులో అద్దెకు ఉంటున్న సాకేటి రామారావు (39), సాకేటి కల్యాణి, రెండో ఫ్లోర్లో అద్దెకు ఉంటున్న సన్నాపు కృష్ణ (30), పి.రోజారాణి గాయాలతో బయటపడ్డారు. 5 గంటల పాటు రాష్ట్ర విపత్తులు, ఫైర్ సర్వీస్ విభాగం, పోలీసులు శ్రమించి శిథిలాలోంచి మృతదేహాలను బయటకు తీశారు. క్షతగాత్రులను కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న కల్యాణి పరిస్థితి విషమంగా ఉంది. నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి ఘటన ప్రాంతానికి చేరుకుని ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
విశాఖలో కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం.. ముగ్గురు మృతి..
సాక్షి, విశాఖపట్నం: నగరంలోని పాత రామజోగిపేటలో ఘోర ప్రమాదం జరిగింది. మూడు అంతస్తుల భవనం కుప్పకూలి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. వారికి ఎమర్జెన్సీ వార్డులో అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. అయితే వారికి ఎటువంటి ప్రాణాప్రాయం లేదని కేజీహెచ్ సూపరింటెండెంట్ అశోక్ కుమార్ తెలిపారు. వారందరికీ మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నామన్నారు. తెల్లవారుజామున 2 గంటలకు ప్రమాదం జరగడంతో తమకేమీ గుర్తులేదని గాపడిన వారు అంటున్నారు. వారు ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోలేని పరిస్థితి నెలకొంది. ఆ భయంతో మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. -
టర్కీ భూకంపం.. పేకమేడలా కూలిన భవనాలు.. భయానక దృశ్యాలు..
టర్కీ, సిరియాలో సంభవించిన భారీ భూకంపం దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. భూకంపం ముందు ఓ వ్యక్తి తీసిన లైవ్ వీడియో వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది. ముందుగా మెరుపులు వచ్చి ఆ తర్వాత ప్రకంపనలు రావడంతో విద్యుత్ సరఫరా స్తంభించిపోయి అంతా చీకటిమయం అయింది. ఆ తర్వాత క్షణాల్లోనే భూప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. 🎥1 Scary footage of how the #earthquake struck #Turkey last night. 🎥2 A 6-story building in Urfa, Turkey falls over after earthquake As per estimate over 1700 buildings have been destroyed with over 800 deaths PM Modi extends condolences and offers help to all effected pic.twitter.com/B9CSpvRh2J — Megh Updates 🚨™ (@MeghUpdates) February 6, 2023 రెండో భూకంపం.. అతిపెద్ద భూకంపం సంభవించిన 12 గంటల్లోనే టర్కీ, సిరియాలో మరోసారి భూకంపం రావడం ఆందోళన కల్గిస్తోంది. మొదటిసారి భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 7.8గా నమోదు కాగా.. రెండోసారి భూకంపం వచ్చినప్పుడు తీవ్రత 7.6గా నమోదైంది. 1700మందికిపైగా మృతి.. టర్కీ చరిత్రలోనే అతిపెద్ద విపత్తుగా చెబుతున్న ఈ భూకంపంలో ఇప్పటివరకు 1498 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. శిథిలాలు తవ్వేకొద్ది మృతదేహాలు బయటపడుతుండటంతో మృతుల సంఖ్య ఇంకా భారీగా పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. అటు సిరియాలో 430 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు సిరియా ప్రభుత్వ నియంత్రణలో లేని ప్రాంతాల్లో 380 మంది చనిపోయారు. మొత్తంగా 2300 మందిపైగా మృత్యుఒడికి చేరారు. Turkey💔 #Turkey #amed #earthquake #Earthquake pic.twitter.com/qVwPXft9Hu — Ismail Rojbayani (@ismailrojbayani) February 6, 2023 ఈ వీడియోల్లో కన్పిస్తున్న దృశ్యాల్లో కొన్ని బహుళ అంతస్తుల భవనాలు కళ్లుముందే పేకమేడల్లా కూలిపోవడం హృదయాలను కలచివేస్తోంది. వందల మంది చనిపోయారు. వేల మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. తమను కాపాడమని ఆర్తనాదాలు పెడుతున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టి వారిని బయటకు తీస్తున్నారు. February 6, 2023 ....There are reports of several hundred dead. The Entire buildings collapsed in South #Turkey the epicenter of 7.8 magnitude earthquake in last hour,#Turkey #earthquake pic.twitter.com/pJtFoJlWfK — Naveed Awan (@Naveedawan78) February 6, 2023 భూకంపం ధాటికి వేలాది భవనాలు నేలమట్టం కావడంతో టర్కీ, సిరియాలో కొన్ని ప్రాంతాల్లో భయానక దృశ్యాలు కన్పిస్తున్నాయి. రోడ్లకు ఇరువైపులా కూలిపోయిన భవనాల శిథిలాలే దర్శనమిస్తున్నాయి. భూకంపం వల్ల ఇళ్లు కోల్పోయిన వేలాది మంది నిరాశ్రయులయ్యారు. తమకు కావల్సిన వారిని కోల్పోయి శోకసంద్రంలో మునిగిపోయారు. #Turkey #earthquake #Syria #Iraq #Turkey #Iran#earthquake #Turkey Prayers for Turkey 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/Eh6ny5qYut — vipin singh (@vipin_tika) February 6, 2023 టర్కీలో 2,818 భవనాలు నేలమట్టం.. 1939 తర్వాత దేశంలో ఇదే అతిపెద్ద విపత్తు అని, భూకంపంలో 2,818 భవనాలు నేలమట్టమయ్యాయని టర్కీ అధ్యక్షుడు రెకెప్ తయ్యిప్ ప్రకటించారు. ప్రపంచ దేశాలు టర్కీ, సిరియాకు సంఘీభావం ప్రకటించాయి. ఈ విపత్కర పరిస్థితిలో సాయం అందిస్తామనని చెప్పాయి. భారత్ కూడా తన వంతు సాయంగా టర్కీకి ఎన్డీఆర్ఎఫ్ సహాయక బృందాలు, వైద్య బృందాలతో పాటు సహాయ సామగ్రిని టర్కీకి పంపింది. In #Kahramanmaras the moment #earthquake rocking #Turkey recorded by security camera of a pharmacy. #deprem #PrayForTurkey pic.twitter.com/6oNPPQHEnY — JournoTurk (@journoturk) February 6, 2023 #earthquake in #Turkey and #Lebanon Ya Allah save everyone 7.8 GOD bless Everyone #Syria pic.twitter.com/UYOsZAbwLo — waqar haider (@whaiderr25) February 6, 2023 The impact of the massive #earthquake in the streets of Gaziantep, southern Turkey. Update- 1006 Killed & 5590 injured.#deprem #Idlib #Syria #DEPREMOLDU #TurkeyEarthquake #Turkey pic.twitter.com/n4ejuCz28l — Chaudhary Parvez (@ChaudharyParvez) February 6, 2023 చదవండి: అమెరికా వెళ్లాలనుకునేవారికి శుభవార్త.. వెయిటింగ్ అక్కర్లే 14 రోజుల్లోనే వీసా! -
సికింద్రాబాద్ డెక్కన్ మాల్ కూల్చివేతలో తప్పిన ప్రమాదం
సాక్షి,హైదరాబాద్: సికింద్రాబాద్ రాంగోపాల్‌పేటలో ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన డెక్కన్‌మాల్ బిల్డింగ్ కూల్చివేతలో పెను ప్రమాదం తప్పింది. కూల్చివేత పనులు కొనసాగుతుండగానే.. ఒక్కసారిగా ఆరు అంతస్తులు కుప్పకూలిపోయాయి. బిల్డింగ్ ముందు భాగం కూల్చివేత పూర్తి కాగా.. వెనక భాగం కూల్చివేత పనులు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే చుట్టుపక్కల ఇళ్ల వారిని ముందుగానే ఖాళీ చేయడంతో ప్రమాదం తప్పింది. కాగా అగ్ని ప్రమాదం జరిగిన డెక్కన్ మాల్ బిల్డింగ్ కూల్చివేత పనులు గత ఆరు రోజులుగా కొనసాగుతున్నాయి. గురువారం రాత్రి 11 గంటల నుంచి భారీ యంత్రాల సాయంతో కూల్చివేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈనెల 19న డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. నాలుగు రోజుల పాటు మంటల్లో భవనం ఉండటంతో.. అధిక వేడికి పగుళ్లు వచ్చాయి. ప్రమాద ఘటనలో గల్లంతైన ముగ్గురిలో ఒకరి అస్థిపంజరం లభించగా.. మిగతా ఇద్దరి ఆచూకీ లభించలేదు. వారం రోజులుగా వెతికినా ఇద్దరి అవశేషాలను అధికారులు గుర్తించలేకపోయారు.అయితే భవనాన్ని వెంటనే కూల్చేయాలని నిపుణుల బృందం హెచ్చరించింది. కూల్చేయకపోతే ప్రమాదమని, ఎప్పుడైనా కుప్పకూలిపోవచ్చని తెలిపింది. దీంతో వారిద్దరి ఆచూకీ లభించకపోయినా అధికారులు కేల్చివేత పనులు చేపట్టారు. స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భవనం కూల్చేయాలని అధికారులు ఆదేశించారు. మొత్తం 5 అంతస్తులతో పాటు సెల్లార్ కూడా కూల్చివేయాలని తెలిపారు. భవనం కూల్చివేసి శిథిలాలను వేరే ప్రాంతానికి తరలించడానికి రెండు, మూడు రోజుల సమయం పట్టే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. చదవండి: ఈటల ఇలాకాలో కేటీఆర్‌కు నిరసన సెగ.. చేనేత కార్మికుల నిలదీత -
Lucknow: కుప్పకూలిన నాలుగంతస్థుల బిల్డింగ్.. శిథిలాల కింద పదుల సంఖ్యలో..!
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో మంగళవారం సాయంత్రం ఘోరం జరిగింది. నాలుగు అంతస్థుల భవనం ఒకటి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో అరవై మంది దాకా శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. ఇప్పటికే మూడు మృతదేహాలను వెలికి తీశారు సహయక బృందాలు. వజీర్ హసన్‌గంజ్ రోడ్‌లోని ఓ నివాస సముదాయం మంగళవారం సాయంత్రం కుప్పకూలింది. ఒక్కసారిగా భవనం కూలిందని ప్రత్యక్ష సాక్ష్యులు చెప్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకోగానే.. పోలీసులు, సహాయక సిబ్బంది హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద పదుల సంఖ్యలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మంగళవారం ఉత్తరాఖండ్ కేంద్రంగా ఢిల్లీ, ఎన్సీఆర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి భారీగా కంపించిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేల్‌పై 5.8 తీవ్రతే అయినా.. ప్రకంపనలు మాత్రం భారీగా ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ప్రకటించింది. ఈ తరుణంలో ఈ ప్రకంపనలకు, ఈ పాత బిల్డింగ్ కూలిపోవడానికి సంబంధం ఉందా? అనే కోణంలో అధికారులు సమీక్షిస్తున్నారు. మరోవైపు సిలిండర్ పేలుడుతోనే భవనం కూలిందన్న చర్చా అక్కడ నడుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. వజీర్ హసన్‌గంజ్ రోడ్, హజ్రత్‌గంజ్ ప్రాంతమంతా పాత భవనాలకు నిలయం. ప్రస్తుతం కుప్పకూలిన భవనాన్ని అలయా అపార్ట్మెంట్స్ భవనంగా తెలుస్తోంది. సహాయక చర్యల నేపథ్యంలో అక్కడ హాహాకారాలు వినిపిస్తున్నాయి. నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. Building collapsed suddenly. 3 dead bodies have been found & sent to the hospital. NDRF, fire brigade personnel present at the spot, rescue operation underway: UP deputy CM Brajesh Pathak pic.twitter.com/iPGVLuIvYn — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 24, 2023 Uttar Pradesh | Several feared trapped as a residential building collapses on Wazir Hasanganj Road in Lucknow. Police present at the spot. pic.twitter.com/vwSOhH5Xic — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 24, 2023 #लखनऊ *️⃣भूकंप से गिरी बिल्डिंग *️⃣अलाया अपार्टमेंट की इमारत गिरी *️⃣कई लोगों के दबे होने की आशंका *️⃣मौके पर अफरा तफरी का माहौल *️⃣सूचना पर मौके पर पुलिस फोर्स *️⃣हजरतगंज के वजीर हसन रोड का मामला@lkopolice #LUCKNOW pic.twitter.com/94nnKrOI5M — JMD News (@jmdnewsflash) January 24, 2023 -
కూకట్‌పల్లిలో ఘోర ప్రమాదం.. భవనం శ్లాబ్ కూలీ పలువురికి గాయాలు
హైదరాబాద్: కూకట్‌పల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. బీజేపీ కార్యాలయం సమీపంలోని పాపారాయుడు విగ్రహం వద్ద నిర్మాణంలో భవనం నాలుగో అంతస్తు శ్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. శిథిలాల కింద ఇద్దరు కూలీలు చిక్కున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసుకేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. చదవండి: రేవంత్ మాపై పిర్యాదు చేయడం హాస్యాస్పదం: సుధీర్ రెడ్డి -
పేకమేడలా కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఉదయం ఓ భవనం పేకమేడలా కుప్పకూలిపోయింది. ఉత్తర ఢిల్లీలోని శాస్త్రీ నగర్లో నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసు, అగ్ని మాపక విభాగాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని అంబులెన్స్ సాయంతో స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదాన్ని గ్రహించి ముందుగానే భవనాన్ని ఖాళీ చేయించటం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. భవనాన్ని కూల్చాలని గతంలోనే నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. భవనం కూలిపోతున్న వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. #WATCH | A four-storey building collapsed in North Delhi's Shastri Nagar. There was no loss of life as the house was already empty. As soon as the information was received, vehicles of Delhi Police, Fire and Ambulance reached the spot. (Video Source: Local, confirmed by Police) pic.twitter.com/WLTdt8lvl8 — ANI (@ANI) December 5, 2022 ఇదీ చదవండి: బీజేపీతో టచ్‌లో 45మంది టీఎంసీ ఎమ్మెల్యేలు: కేంద్ర మంత్రి -
యూపీలో వర్షాలకు 10 మంది బలి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తమైంది. ఇళ్ల గోడలు కూలిన ఘటనలు, పిడుగుపాట్లతో 10 మంది చనిపోగా మరో 12 మంది గాయపడ్డారు. ఇటావా జిల్లా చంద్రపుర గ్రామంలో బుధవారం రాత్రి మూడు చోట్ల నివాసాల గోడలు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు సహా ఏడుగురు మృత్యువాతపడగా మరో ముగ్గురు గాయపడ్డారు. ఇటావాలో 24 గంటల వ్యవధిలో 140 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ విభాగం తెలిపింది. ఫిరోజాబాద్‌లో ఇళ్ల గోడలు కూలిన ఘటనల్లో ఒక చిన్నారి సహా ఇద్దరు చనిపోగా మరో 8 మంది గాయపడ్డారు. బలరాంపూర్ జిల్లా బర్గద్వా సయీఫ్ గ్రామంలో పిడుగుపాటుకు గురై ఒక బాలుడు చనిపోగా మరొకరు గాయపడ్డారు. అలీగఢ్ జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న కుంభవృష్టితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శనివారం వరకు అన్ని విద్యాసంస్థలను మూసివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. -
Video: ముంబైలో ఒక్కసారిగా కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం
సాక్షి, ముంబై : మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బోరివాలి ప్రాంతంలో శుక్రవారం నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. సాయిబాబా నగర్లో గీతాంజలి బిల్డింగ్ మధ్నాహ్నం 12.34 గంటల ప్రాంతంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా కూలిపోయింది. భవనం కూలుతున్న సమయంలో భారీ శబ్ధాలు రావడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. భవనం అకస్మాత్తుగా కూలుతున్న దృశ్యాలను స్థానికులు వీడియో తీశారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. అయితే ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎవరికి ఎలాంటి గాయాలు, ప్రాణనష్టం చోటుచేసుకోకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఇప్పటికే అందులోని నివాసితులను ఖాళీ చేయించినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకుపోయారో లేదో పరిశీలిస్తున్నారు. సహాయ చర్యల కోసం ఇప్పటికే ఎనిమిది ఫైర్ ఇంజన్లు, రెండు రెస్క్యూ వ్యాన్లు, మూడు అంబులెన్స్‌లు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. చదవండి: ఆ చిలుకలు ఇక చాలు.. జూకి ఇచ్చేస్తాం: అర్జున్, రంజన Video: 4-Storey Building Collapses In Mumbai https://t.co/KVrVh1c2uO pic.twitter.com/iyqH6hHZ4G — NDTV (@ndtv) August 19, 2022 -
Building Collapses: కుప్పకూలిన ఐదంతస్తుల భవనం
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది. పశ్చిమ బాంద్రాలో ఉన్న ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఆ ప్రాంత మంతా భయానకంగా మారిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు బెహ్రం నగర్ ప్రాంతానికి చేరుకుని సహయక చర్యలను ముమ్మరం చేశారు. బిల్డింగ్‌లో చాలా మంది చిక్కుకుని ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఆరుగురిని సురక్షితంగా బయటకు తీశారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకి తరలించారు. పోలీసులు, బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) అధికారులు కూడా సహయక చర్యలను చేపట్టారు. అధికారులు.. ముందు జాగ్రత్తగా ఆరు అంబులెన్స్‌లను, ఐదు ఫైరింజన్లను ఘటన స్థలం వద్ద ఏర్పాటు చేశారు. At least five persons are feared trapped after a 5-storey building collapsed in Behram Nagar locality of Bandra (East), Mumbai. Five fire engines, one rescue van, and 6 ambulances have been rushed to the site: BMC — ANI (@ANI) January 26, 2022 చదవండి: రిపబ్లిక్ డే రోజు జాతీయ జెండాకు ఘోర అవమానం.. -
చైనాలో భారీ పేలుడు: 16 మంది మృతి
బీజింగ్: చైనాలో గ్విఝౌ ప్రావిన్స్‌లో శుక్రవారం జరిగిన పేలుడులో 16 మంది చనిపోగా, మరో 10 మంది గాయపడ్డారు. చొంగ్కింగ్ మున్సిపాలిటీ వులాంగ్లోని ఓ క్యాంటీన్లో శుక్రవారం మధ్యాహ్నం గ్యాస్ లీౖకింది. అనంతరం భారీ విస్ఫోటం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 16 మంది చనిపోగా, 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. భవనం కుప్పకూలిపోవడంతో అందులో చిక్కుకుపోయిన 26 మందిని బయటకు తీశారు. ఘటనపై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. చదవండి: పాక్‌లో ఘోరం.. మంచు కింద 22 మంది సజీవ సమాధి -
కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ఐదుగురు మృతి
సాక్షి, అనంతపురం: కదిరిలో విషాదం చోటుచేసుకుంది. పాత చైర్మన్ వీధిలో నిర్మాణంలో ఉన్నమూడంతస్తుల భవనం.. పక్కనే ఉన్న మరో రెండస్తుల భవనం మీద పడింది. ఈ ఘటన జరిగినప్పుడు బిల్డింగ్‌లో 15 మంది ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో వెంటనే నలుగురు వ్యక్తులు బిల్డింగ్‌నుంచి సురక్షితంగా బయట పడ్డారు. ఇప్పటికి బిల్డింగ్‌లో చిక్కుకున్న కొందరు బాధితులతో.. ఫోన్లో మాట్లాడుతున్నారని స్థానికులు తెలిపారు. కాగా, ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మృతి చెందిన వారిలో ఇద్దరు చిన్నారులున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కుండపోత వర్షం కారణంగానే భవనం దెబ్బతిని.. ఈ ఘటన జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు జేసీబీలతో శిథిలాలను తొలగిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలను ముమ్మరం చేశారు. ఈ ప్రమాదంలో.. గాయపడిన వారికి ఎమ్మెల్యే డా . సిద్ధారెడ్డి స్వయంగా వైద్యం అందించారు. -
బెంగళూరులో కుప్పకూలిన మరో భవనం
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో మరో భవనం కూలిపోయింది. ఇక్కడి కస్తూరినగర డాక్టర్స్ లేఔట్లో మూడంతస్తుల భవనం పక్కకు ఒరిగిపోయింది. కొద్ది రోజుల క్రితమే భవనం కొద్ది కొద్దిగా ఒరుగుతుండటంతో అందులో నివాసం ఉంటుంన్న వారు ఖాళీ చేశారు. వారు ఖాళీ చేసిన కొద్ది రోజులకే భవనం గురువారం తెల్లవారుజామున ఒకవైపు పూర్తిగా కూలింది. భవనం పునాదులో లోపం ఉన్నట్లు భావిస్తున్నారు. బీఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. Bad times in #Bengaluru. Another building collapses. A three-storey building collapses in Kasturinagar. The incident took place this afternoon. It was in Doctors Layout in Kasturinagar. No casualties reported. This morning it was tilting. pic.twitter.com/oElxcYWDPp — Suraj Suresh (@Suraj_Suresh16) October 7, 2021 -
ఇలా ఖాళీ చేయగానే.. అలా కుప్పకూలింది
Lakkasandra Building Collapse: బెంగళూరులో ఈ ఉదయం ఘోర ప్రమాదం తప్పింది. లక్కసంద్రలో ఓ పాత భవనం నుంచి మనుషుల్ని ఖాళీ చేయించిన కొన్నిక్షణాలకే అది కుప్పకూలిపోయింది. మెట్రో పనుల కోసం కొందరు వర్కర్లు(వలస కూలీలు).. ఆ భవనంలో ఉంటున్నారు. అది పాత భవనం కావడం, కుప్పకూలే అవకాశం ఉందన్న అంచనాతో సోమవారం ఉదయం అధికారులు అక్కడికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఆ వర్కర్లను ఖాళీ చేయించారు. వాళ్లను ఖాళీ చేయించిన కాసేపటికే.. చూస్తుండగానే అది కూలిపోయింది. మూడంతస్తుల ఆ భవనం కూలిన ఘటనలో ఎవరికీ ఏం కాలేదని అధికారులు ధృవీకరించారు. #WATCH | Karnataka: A building collapsed in Bengaluru today, no casualties or injuries reported so far. Fire Department had evacuated the building before it collapsed. Officials rushed to the spot. Details awaited. pic.twitter.com/oWmUBsFm6E — ANI (@ANI) September 27, 2021 -
ఉత్తరాఖండ్ లో కూలిన బిల్డింగ్
-
కుప్పకూలిన భవనం.. అర్థరాత్రి ఆర్తనాదాలు
సాక్షి, చెన్నై: పంటలను సంతలో అమ్ముకునేందుకు వచ్చిన రైతులు ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. ఈరోడ్ జిల్లా అందియూరులోని రథం వీధిలో ప్రతి సోమవారం సంత జరుగుతుంది. రైతులు పంటలను అమ్ముకోవడానికి ఇక్కడికి వస్తారు. ఈ క్రమంలో బర్గూర్ అటవీ గ్రామ రైతులు ఏడుగురు ఆదివారం రాత్రి అందియూరు చేరుకున్నారు. ఓ ఎలక్ట్రిక్ దుకాణం వద్ద నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి పన్నెండున్నర గంటల సమయంలో ఆ భవనం కూలింది. స్థానికులు ఆందోళనతో పరుగులు తీశారు. శిథిలాల కింద మృతదేహాలు.... సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. చీకటి కావడంతో శిథిలాలు మీద పడటంతో మృతదేహాలను వెలికి తీయడం కష్టతరమైంది. ప్రొక్లయినర్ వాహనాలను రప్పించి సహాయక చర్యలు చేపట్టారు. బర్గూర్ తట్టకలైకు చెందిన సిద్ధన్(51), చిన్న సొంగాలల్తైకు చెందిన మామహాదేవన్ (48), చిన్న పయ్యన్ (27) మృతదేహాలను వెలికి తీశారు. తీవ్రంగా గాయపడిన రాజేష్(30), శివమూర్తి (45), మహేంద్రన్ (17)తో పాటు మరొకరిని అందిరయూరు ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఈరోడ్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమ్తితం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పాలకోసం తండ్రి.. మందులకోసం కొడుకు..ఇద్దరూ సేఫ్!
ముంబై : మనిషి జీవితంలో ఒకే సారి సంతోషం, బాధపడే సమయాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. ఆ టైంలో ఏం చేయాలో మనకు పాలుపోదు. ముంబైకి చెందిన రఫిఖీ షేక్ పరిస్థితి కూడా ఇప్పుడలాగే ఉంది. ముంబైలో అపార్ట్మెంట్ కూలిన ఘటనలో అతడు, అతడి కుమారుడు ప్రాణాలతో బయటపడ్డా.. సంతోషించలేని స్థితి.. ఎందుకంటే! ఇదే ఘటనలో అతడి కుటుంబసభ్యులు 9 మంది మృత్యువాతపడ్డారు. వివరాలు.. బుధవారం రాత్రి ముంబైలోని మలాద్‌లో రెండు అంతస్తుల అపార్టుమెంట్ భవనం రఫిఖీ ఇంటిపై కుప్ప కూలింది. ఈ ఘటనలో ఎనిమిది మంది పిల్లలతో సహా 11 మంది మృతి చెందగా.. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే, ఈ ఘటన జరిగే ఓ నిమిషం ముందు అతడు పాల ప్యాకేట్ తేవటానికి బయటకు వెళ్లాడు. ఆ కొద్దిసేపటికే ఘోరం జరిగిపోయింది. ఇంటికి తిరిగి వచ్చి చూసిన అతడి గుండె బద్ధలైంది. భార్యా, తమ్ముడు, మరదలు, మరో ఆరుగురు పిల్లలు మొత్తం తొమ్మిది మంది కుటుంబసభ్యులు చనిపోయి ఉండటంతో కన్నీరు మున్నీరుగా విలపించాడు. గుడ్డిలో మెల్లలాగా ఇక్కడ ఇంకో సంతోషకరమైన విషయం ఏంటంటే.. 16 ఏళ్ల అతడి కుమారుడు కూడా ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఏవో మందులు కొనటానికి అతడు బయటకు వెళ్లటంతో ప్రాణాలు దక్కాయి. దీనిపై రఫిఖీ మాట్లాడుతూ.. ‘‘ ఉదయం టీ చేయడానికి పాలకోసమని బయటకు వెళ్లాను. ఆ సమయంలోనే ప్రమాదం జరిగింది. ఆ బిల్డింగ్ పరిస్థితి బాగాలేదని నాకు తెలియదు. అంతా క్షణాల్లో జరిగిపోయింది.. నా ఫ్యామిలీ బయటకు వచ్చేంత సమయం కూడా దొరకలేదు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. -
ముంబైలో ఘోర ప్రమాదం.. 8 మంది పిల్లలతో సహా..
ముంబై: ముంబైలోని మలాడ్ మురికివాడ వద్ద రెండు అంతస్తుల అపార్టుమెంట్ భవనం మరో భవన నిర్మాణంపై కూలింది. ఈ ఘటనలో ఎనిమిది మంది పిల్లలతో సహా 11 మంది మృతి చెందగా.. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం రాత్రి 11.10 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు బీఎంసీ విపత్తు నిర్వహణ సెల్ పేర్కొంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న స్థానిక అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సబర్బన్ కండివాలిలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. ఇక శిథిలావస్థలో ఉన్న మరో మూడంతస్తుల భవన నిర్మాణం నుంచి ప్రజలను తరలిస్తున్నట్లు ముంబై సివిల్ బాడీ బీఎంసీ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై బీజేపీ అధికార ప్రతినిధి రామ్ కదమ్ మాట్లాడుతూ.. నిర్లక్ష్యం కారణంగా జరిగిన ఈ హత్యలో ప్రజలు మరణించారంటూ అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. (చదవండి: తిమింగలం వాంతి.. విలువ రూ.8 కోట్లు) -
South Korea: కూర్చున్నవారు కూర్చున్నట్లే శవాలుగా..
సియోల్: దక్షిణ కొరియాలోని గ్వాంగ్జు నగరంలో బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఐదంతస్తుల భవనాన్ని కూలి్చవేస్తుండగా శకలాలు ఓ బస్సుపై పడడంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో 9 మంది అక్కడికక్కడే కన్నుమూశారు. కూర్చున్నవారు కూర్చున్నట్లే శవాలుగా మారారు. 8 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 17 మంది ఉన్నారని అధికారులు చెప్పారు. కూలి్చవేస్తున్న ఐదంతస్తుల భవనం పక్క వీధిలోనే ఈ బస్సు నిలిచి ఉంది. భారీ కాంక్రీటు శకలాలు నేరుగా బస్సుపై పడిపోయాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. గాయపడిన వారిలో బస్సు డ్రైవర్ కూడా ఉన్నాడు. -
స్లాబ్ కూలి భవనానికి పెద్ద రంధ్రం: ఏడుగురు మృతి
ముంబై: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది. ఐదంతస్తుల భవనంలోని స్లాబ్ ఒక్కసారిగా గ్రౌండ్ ఫ్లోర్‌కు కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటన థానే జిల్లాలోని ఉల్హాస్‌నగర్‌లో శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఉల్హాస్‌నగర్‌లోని నెహ్రూ చౌక్ వద్ద ఉన్న సాయిసిద్ధి అపార్ట్మెంట్లోని ఐదో అంతస్తులో స్లాబ్ కుప్పకూలింది. సహాయ చర్యలు చేపడుతున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, స్థానికులు ఆ స్లాబ్ కూలి అది కిందపడి మిగతా అంతస్తుల్లోని కొన్ని ప్లాట్లు కూడా కుప్పకూలాయి. దీంతో అపార్ట్‌మెంట్‌కు పెద్ద రంధ్రం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే జాతీయ విపత్తు ప్రతిస్పందన (ఎన్డీఆర్ఎఫ్) బృందం స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టింది. భవనం శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించారు. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు మృతి చెందారని ఉల్లాస్‌నగర్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
25 మంది మరణించారు.. 6 నెలల బాలుడు బ్రతికాడు!
కైరో : ఈజిప్టులోని కైరోలో శనివారం అపార్ట్మెంట్ బిల్డింగ్ కూలిన ఘటనలో 25 మంది మృత్యువాత పడగా.. మరో 26 మంది గాయాలపాలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సంఘటనా ప్రదేశంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం శిథిలాల కిందనుంచి 6 నెలల బాలుడ్ని సహాయక సిబ్బంది ప్రాణాలతో వెలికి తీశారు. ఈ ఘటనలో బాలుడి తల్లి,తండ్రి, అక్క మృత్యువాత పడ్డారు. అతడి అన్న ఆచూకీ లభించలేదు. దీంతో సహాయకసిబ్బంది అతడి కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉంది. కాగా, బిల్డింగ్ కూలటానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. నాణ్యతలో లోపం కారణంగానే బిల్డింగ్ కూలిపోయినట్లు ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. దీనిపై దర్యాప్తు చేయటానికి ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. చదవండి, చదివించండి : ఒబామా కుటుంబంలో విషాదం -
క్యాపిటల్ బిల్డింగ్ విమానంతో కూల్చేస్తాం!
వాషింగ్టన్: అమెరికా దాడిలో మరణించిన ఇరాన్ సైనిక జనరల్ ఖాసీం సొలైమని మృతికి ప్రతీకారంగా అమెరికా క్యాపిటల్ బిల్డింగ్‌లోకి విమానం పంపి కూల్చేస్తామనే ఆడియో మెసేజ్ కలకలం సృష్టించింది. సోమవారం ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్ ఫ్రీక్వెన్సీల మధ్యలో ఈ మెసేజ్ వినిపించింది. దీంతో ఎఫ్‌బీఐ, ఎఫ్ఏఏలు రంగంలోకి దిగి విచారణ చేపట్టాయని సీబీఎస్ సంస్థ తెలిపింది. ‘బుధవారం మేము క్యాపిటల్ బిల్డింగ్‌లోకి విమానం పంపి ధ్వంసం చేస్తాం. సొలైమని మృతికి ప్రతీకారం తప్పదు’ అని ఎవరూ గుర్తుపట్టకుండా డిజిటైజ్డ్ వాయిస్‌తో ఈ మెసేజ్ రికార్డు చేశారు. బుధవారం ఈ బిల్డింగ్‌లో యూఎస్ కాంగ్రెస్ సమావేశమై బైడెన్ గెలుపును ధ్రువీకరించనుంది. 2020 జనవరి 3న సొలైమని మిస్సైల్ దాడిలో మరణించారు. ఇది జరిగిన సంవత్సరం తర్వాత సొలైమని మృతికి ప్రతీకారమంటూ మెసేజ్ వినిపించడం రక్షణ వర్గాల్లో కలకలం సృష్టించింది. సొలైమని మరణం ఇరాన్లో తీవ్ర భావావేశాలు రేకెత్తించింది. ఇందుకు ప్రతిగా ఇరాక్‌లో పలుమార్లు పలువురు యూఎస్ వ్యక్తులపై, ఎంబసీపై దాడులు జరిగాయి. ఇరాన్ కోర్టులు ట్రంప్ సహా పలువురు యూఎస్ అధికారులపై అరెస్టు వారెంటులు జారీ చేశాయి. -
గుజరాత్లో అగ్ని ప్రమాదం.. 12 మంది మృతి
అహ్మదాబాద్: కెమికల్ గోడౌన్లో పేలుడు సంభవించి భవనం కుప్పకూలిన ఘటనలో 12 మంది మరణించారు. ఈ దుర్ఘటన అహ్మదాబాద్ నగర శివారులో బుధవారం ఉదయం 11 గంటల సమయంలో జరిగింది. మరణించిన 9 మంది కూలీల్లో ముగ్గురు మహిళలు ఉన్నారని అధికారులు చెప్పారు. గాయపడిన మరో 9 మందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. కెమికల్స్ కారణంగా భారీ పేలుడు సంభవించడంతో భవనం కుప్పకూలి ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న వెంటనే సహాయక బలగాలు ఫైరింజన్లతో అక్కడికి చేరుకున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న 18 మందిని వెలికితీసి అంబులెన్సుల ద్వారా హుటాహుటిన ఆస్పత్రికి తరలించాయి. అయితే అందులో 12 మంది మరణించారని వైద్యులు తెలిపారు. శిథిలాల కింద అణువణువూ గాలిస్తున్నామని, ప్రమాదంపై విచారణ సాగిస్తున్నామని డీసీపీ అశోక్ మునియా చెప్పారు. కెమికల్ గోడౌన్‌లోని బాయిలర్ వల్ల పేలుడు జరిగి ఉండవచ్చని స్థానిక ఫ్యాక్టరీల యజమానులు అభిప్రాయపడుతున్నారు. పేలుడు తీవ్రత భారీగా ఉండటంతో గోడలు పగిలి స్లాబ్ కూలిందని గోడౌన్ పక్కన భవనాల్లో పనిచేస్తున్న కూలీలు చెప్పారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నట్లు చెప్పారు. బాధితులను ఆదుకోవడానికి అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారని ట్వీట్ చేశారు. -
వరద ఉధృతికి కొట్టుకుపోయిన భవనం
-
గుజరాత్లో విషాదం: ముగ్గురు మృతి
గాంధీనగర్: గుజరాత్లో విషాదం చోటు చేసుకుంది. రాష్టంలోని వడోదర జిల్లా బవమన్‌పురాలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం సోమవారం అర్ధరాత్రి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందకున్న స్థానిక పోలీసులు, రెస్కూ టీం ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాద స్థలిలో శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కళ్ల ముందే కూలిపోయింది
-
ప్రకృతి ఆ ఇంటి మీద పగబట్టిందేమో
భువనేశ్వర్ : ఇల్లు కట్టాలంటే పెద్ద ఖర్చుతో కూడుకున్న పని. ఈరోజుల్లో ఇళ్లు కట్టాలంటే మాత్రం స్థోమతకు మించిన పనిలా తయారైంది. మరీ అలాంటిది.. కష్టపడి కట్టుకున్న ఇళ్లు కళ్ల ముందే కూలిపోతే ఆ ఇంటి యజమాని బాధ వర్ణణాతీతం అని చెప్పొచ్చు. ఒడిశాలో గత కొన్ని రోజులగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల దాటికి వాగులు, వంగులు పొంగిపొర్లుతున్నాయి. తాజాగా భారీ వర్షాల వల్ల ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా మధుబన్‌లో రెండు అంతస్తుల భవనం ఇంటి యజమాని ముందే కుప్పకూలింది. అయితే ఇక్కడ ఆనందించాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రమాదంలో ఎవరు గాయపడలేదు. భవనం కూలే సమయంలో ఇంటి సభ్యులందరూ బయటకు వచ్చేశారు కాబట్టి సరిపోయింది లేదంటే ఎవరు బయట పడేవారు కాదు. భవనం కదులుతుందని తెలియగానే హుటాహుటిన అందులో నివసిస్తున్న వాళ్లంతా బయటకు వచ్చేశారు. పాపం.. విలువైన వస్తువులను బయటకు తెచ్చుకునేంత సమయం కూడా ప్రకృతి వారికి ఇవ్వలేకపోయింది. ఆశ్చర్యం ఏంటంటే.. భవనం కూలిన పక్కనే ఉన్న మరో రెండస్తుల భవనం నుంచి చిన్న పెచ్చుకూడా ఊడి కిందపడలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రకృతి ఆ ఇంటి మీద పగబట్టిందేమో అని కామెంట్లు పెడుతున్నారు. (చదవండి : అతని తిండిపై కన్నేసిన పక్షులు) -
భారీ వర్షాలకు భవనం కూలి ముగ్గురు మృతి
డెహ్రాడూన్: భారీ వర్షాలకు ఓ భవనం కూలి ముగ్గురు మృతచెందిన ఘటన ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ చుక్కువాలా ప్రాంతంలో బుధవారం చోటుచేసుకుంది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో 37 ఏళ్ల గర్భిణీ మహిళ కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. శిధిలాల కింద మరికొంత మంది చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఘటన స్థలిలో ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయక చర్యలను ముమ్మరం చేస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. భారీ వర్షాలకు రాష్ట్రంలోని ఇప్పటికే పలు ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. #UPDATE NDRF team rushed to building collapse site at Chhukhuwala, Dehradun & did search & rescue operation with local SDRF. 3 rescued alive and 3 dead bodies retrieved. Operation on: Satya Pradhan, Director General of NDRF (National Disaster Response Force). #Uttarakhand https://t.co/cM8AqvVYYX pic.twitter.com/u4VAMsRPnj — ANI (@ANI) July 15, 2020 -
వైరల్ : క్షణాల్లో కుప్పకూలిన బిల్డింగ్
-
వైరల్ : క్షణాల్లో కుప్పకూలిన బిల్డింగ్
కోల్‌కతా : అప్పటి వరకు దృఢంగా కనిపించిన ఆ మూడు అంతస్తుల భవనం క్షణాల్లో కనిపించకుండా పోయింది. రెప్పపాటు కాలంలో కుప్పకూలింది. నిబంధనలకు విరుద్ధంగా కాలువకు సమీపంలో నిర్మించడం వల్లే భనవం కూలిపోయిందని అధికారులు చెబుతున్నారు. భవనం నిర్మాణ దశలో ఉండడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్ జిల్లా నిశ్చితంపూర్ గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇటీవల వర్షాలు పోటెత్తడంతో కాలువలో పూడిక ఏర్పడింది. దాన్ని శుభ్రం చేస్తుంగా పక్కనే ఉన్న భవనం పునాది కదిలిపోయి ఒక్కసారిగా కుప్పకూలి కాలువలో పడిపోయింది. నిర్మాణ దశలో ఉండగానే కూలిపోవడంతో భారీ ప్రమాదం తప్పింది.నిజానికి ఈ భవనానికి కొన్ని రోజుల కిందలే పగుళ్లు ఏర్పాడ్డాయని, చెప్పినా పట్టించోలేదని స్థానికులు అంటున్నారు. ఈ ఘటనపై భవనం యజమాని స్పందించనప్పటికీ అధికారులు మాత్రం విచారణ ప్రారంభించారు. కాగా, క్షణాల్లో కుప్పకూలిన భవనం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
ఒక్కసారిగా కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పండగపూట విషాదం చోటుచేసుకుంది. నాలుగంతస్తుల భవనం కూప్పకూలడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం రాత్రి జరిగింది. వివరాలు.. ఢిల్లీలోని సీలంపుర్‌లో నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల్లో కూరుకుపోయిన రెండు మృతదేహాలను బయటకు తీశారు. ఇప్పటివరకు శిథిలాల కింద చిక్కుకుపోయిన ఆరుగురిని రక్షించగలిగామని ఫైర్ సిబ్బంది తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. నిర్మాణంలో ఉన్న సదరు భవనంలో కొంతమంది ఓ వేడుకలో పాల్గొన్న సమయంలో ఈ ఘటన జరిగిందని స్థానికులు చెప్పారు. #UPDATE Delhi: Four-storey building collapses in Seelampur, several feared trapped. Rescue operation underway. https://t.co/4BxnExaQ0C pic.twitter.com/zrCg9B4POl — ANI (@ANI) September 2, 2019 -
భవనం కుప్పకూలి ఇద్దరు మృతి
ముంబై: మహారాష్ట్రలోని భివాండి ప్రాంతంలో నాలుగు అంతస్థుల భవనం కూలి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడగా.. పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు సమాచారం. ఈ దారుణం శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. భివాండి ప్రాంతంలో నిర్మించిన ఈ అక్రమ కట్టడానికి పగుళ్లు రావడం గమనించిన మున్సిపల్ అధికారులు అందులో నివసిస్తున్న ప్రజలని ఖాళీ చేయాల్సిందిగా కోరారు. దాదాపు 22 కుటుంబాలను బిల్డింగ్ నుంచి తరలించారు. అయితే కొందరు తమ వస్తువులను తీసుకెళ్లడం కోసం తిరిగి బిల్డింగ్‌లో ప్రవేశించారు. ఆ సమయంలోనే ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మరి కొద్ది మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించింది. తీవ్రంగా గాయపడిన వ్యక్తులను కాపాడి ఆసుపత్రికి తరలించారు. -
కుప్పకూలిన భవనం: నలుగురి మృతి
గాంధీనగర్: భారీ వర్షాలతో ఓ భవనంలో విషాదం చోటుచేసుకుంది. మూడంతస్తుల బల్డింగ్ కుప్పకూలడంతో నలుగురు వ్యక్తులు ప్రాణాలను కోల్పోయారు. ఈ ఘటన గుజరాత్‌లోని ఖేడా జిల్లా ప్రగతి నగర్లో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మరికొంత మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు శిథిలాలను తొలగించి.. సహాయ చర్యలను చేపట్టారు. గతవారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భవనం ఒక్కసారిగా కూలిపోయిందని అధికారులు బెబుతున్నారు. మరోవైపు ఈ ఘటనలో గాయపడ్డ పలువురి పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా గుజరాత్ వ్యాప్తంగా భారీ వర్షాలకు కురుస్తున్న విషయం తెలిసిందే. నర్మదా నది పరీవాహక ప్రాంతంలో వరద ఉధృతంగా పెరగడంతో సర్థార్ సరోవర్ డ్యాం గేట్లను ఎత్తి.. నీటిని దిగువకు వదులుతున్నారు. -
నడిరోడ్డుపై అంకుల్ బిత్తిరి చర్య
నడిరోడ్డుపై తనకు ఎదురైన వింత అనుభవాన్ని, ఓ మధ్యవయస్కుడి బిత్తిరి చర్యను గరమ్ సంకత్ అనే మహిళా సోషల్ మీడియా వేదికగా ప్రపంచానికి తెలియజేసారు. గత రాత్రి ఎదురైన ఈ జుగుప్సాకరమైన అనుభవాన్ని వాట్సాప్ స్క్రీన్‌షాట్స్ ద్వారా ముంబైకి చెందిన ఆమె తన ట్విటర్ ఖాతాలో వివరించారు. ‘జనాలు, వాహనాలతో రద్దీగా ఉన్న రోడ్డుపై నడుచుకుంటూ నేను హస్టల్‌కు వెళ్తుండగా 50-60 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి నన్ను ఆపాడు. మొబైల్ ఉందా? అని అడుగుతూ.. డోంగ్రీలో కూలిన భవనానికి సంబంధించిన వార్త, అప్డేట్స్ చూపించవా? అని అడిగాడు. అతని కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారోనని చలించిపోయిన నేను.. దానికి సంబంధించిన వార్తను మొబైల్లో చూపించాను. కానీ అతను గూగుల్ రిజల్ట్ పేజీ ఓపెన్ చేయమని అడిగాడు. నిర్ఘాంతపోయిన నేను అతను చెప్పినట్టు చేసాను. వెంటనే ఈ మొబైల్లో ఏది సెర్చ్ చేసినా వస్తుందా? అని అడిగాడు. అవునని సమాధానమిచ్చాను. అయితే అతను గూగుల్వాయిస్ కమాండ్ ఉపయోగించాలని ప్రయత్నించగా అది పనిచేయలేదు. దాన్ని నేను అంతకుముందే డిసేబుల్ చేయడంతో అతని ప్రయత్నం సాధ్యం కాలేదు. అతని తీరుతో చాలా ఇబ్బందిగా ఫీలైన నేను.. నాకు పని ఉంది అంకుల్ త్వరగా వెళ్లాలని చెప్పాను. దానికి అతను ఒక్క నిమిషం అంటూ.. హెచ్డీ ఫోన్(పోర్న్) అంటూ నా ఫోన్ తీసుకునే ప్రయత్నం చేయగా.. నేను గట్టిగా పట్టుకున్నాను. అయినా అతను హెచ్డీ పోర్న్ అని టైప్ చేయడంతో నేను తీవ్ర ఆగ్రహానికి గురయ్యాను.’ అని చెప్పుకొచ్చారు. అమాయకుడని సాయం చేద్దామనుకుంటే అతను ఇలా ప్రవర్తించాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. I thought he's an old uncle and I should help? Maybe I'm too naive but what the actual fuck. pic.twitter.com/zUBROPjjMk — garam sankat (@2sanskaari) July 16, 2019 ముంబై డోంగ్రీ ప్రాంతంలోని కేసర్‌బాయి అనే పురాతన భవనం మంగళవారం కుప్పకూలి 14 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. -
అనారోగ్యం అతడి పాలిట వరమైంది
ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో డోంగ్రీ ప్రాంతంలోని తండేల్ వీధిలోని వందేళ్ల క్రితం నాటి నాలుగు అంతస్తుల కేసర్‌బాయి భవనం మంగళవారం ఉదయం కుప్ప కూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 13 మంది చనిపోయారు. మరో 40 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ప్రాంతానికి చెందిన దనిష్, ముస్తఫా అనే ఇద్దరు కుర్రాళ్ల గురించి స్థానికులు తెగ మాట్లాడుకుంటున్నారు. దనిష్ను అదృష్టానికి మారుపేరుగా చెప్పుకుంటుండగా.. ముస్తఫా ఆ ప్రాంతంలో లోకల్ హీరో అయ్యాడు. వివరాలు.. దనిష్ తన కుటుంబంతో కలిసి కేసర్‌బాయి భవనం పై అంతస్థులో నివసిస్తున్నాడు. అతని ఆరోగ్యం సరిగా లేకపోవడంతో రక్త పరీక్ష నిమిత్తం మంగళవారం ఉదయం ఆస్పత్రికి వెళ్లాడు. అతడు ఇంటి నుంచి వెళ్లిన కాసేపటికి భవనం కుప్పకూలింది. ఈ సంఘటనలో అతని కుటుంబ సభ్యులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అనారోగ్యమే దనిష్ ప్రాణాలు కాపాడింది అంటున్నారు స్థానికులు. లోకల్ హీరో ముస్తఫా.. ఇక ముస్తఫా విషయానికి వస్తే.. ఇతనికి, ప్రమాదం జరిగిన భవనానికి ఎలాంటి సంబంధం లేదు. కానీ ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే ముస్తఫా తన స్నేహితులను తీసుకుని ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాడు. అప్పటికి ఇంకా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకోలేదు. ఈ విషయం గురించి ముస్తఫా మాట్లాడుతూ.. ‘నేను ట్యూషన్లో ఉండగా ప్రమాదం గురించి తెలిసింది. వెంటనే నా స్నేహితులకు ఫోన్ చేసి ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకున్నాం. సహాయక బృందాలు రావడానికి సమయం పట్టేలా ఉండటంతో మేం రంగంలోకి దిగాం’ అన్నాడు ముస్తఫా. ‘శిథిలాల కింద ఉన్న వారిని కాపాడేందుకు మా వంతు ప్రయత్నం చేశాం. ఇంతలో ఆరు నెలల చిన్నారి శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలిసింది. ఏడుపు వినిపిస్తుంది.. కానీ ఎక్కడ నుంచో స్పష్టంగా తెలీలేదు. దాంతో ఓ పది నిమిషాల పాటు వెతగ్గా ఓ చోట చిన్నారి కనిపించింది. స్నేహితుల సాయంతో క్షేమంగా ఆ చిన్నారిని బయటకు తీసుకువచ్చాం. అలానే మరో చిన్న పిల్లాడిని కూడా కాపాడం. అయితే ఉత్త చేతులతో శిథిలాలు తొలగించడం అంత సులువేం కాదు. చాలా శ్రమ పడాల్సి వచ్చింది. కానీ ఓ ఇద్దరి ప్రాణాలు కాపాడమనే సంతృప్తి ముందు మేం పడిన కష్టమంతా మర్చిపోయాం’ అంటున్నాడు ముస్తఫా. (ప్రాథమిక వార్త: కూలిన బతుకులు) -
కూలిన బతుకులు
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తరచుగా పాత భవనాలు కూలిపోయే ముంబైలో మంగళవారం మధ్యాహ్నం కూడా అదే ప్రమాదం జరిగి, పదకొండు మంది మరణించారు. మరో 40 మందికిపైగా శిథిలాల కింద చిక్కుకున్నారు. వారిలో ఎంత మంది ప్రాణాలతో ఉంటారన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని అధికారులు తెలిపారు. డోంగ్రీ ప్రాంతంలోని ఇరుకుగా ఉండే తండేల్ వీధిలోని కేసర్‌బాయి భవనం వందేళ్ల క్రితం నాటిది. నాలుగు అంతస్తుల ఈ భవనం మంగళవారం దాదాపు 11.30 గంటల సమయంలో కుప్పకూలింది. ఇందులో 10 నుంచి 15 కుటుంబాలు నివసించేవి. చనిపోయిన వారిలో ఆరుగురు పురుషులు, నలుగురు మహిళలు, ఓ చిన్నారి ఉన్నట్లు జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) తెలిపింది. మరో ఎనిమిది మంది గాయపడ్డారని వెల్లడించింది. ఈ భవనం దాదాపు వందేళ్ల క్రితం నిర్మించినదనీ, అయితే దీనిని పునర్అభివృద్ధి చేసేందుకు నిర్ణయించినందు వల్ల అది పాడుబడిన భవనాల జాబితాలో లేదని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. ముంబై మేయర్ విశ్వనాథ్ మహాదేశ్వర్ మాట్లాడుతూ ఈ ఘటనపై విచారణ జరపాల్సిందిగా తాను బీఎంసీ కమిషనర్‌ను ఆదేశించానన్నారు. భవనంలోని వారికి ఆశ్రయం కల్పించడం కోసం ఇమామ్వాడ బాలికల నగరపాలక ఉన్నత పాఠశాలలో బీఎంసీ అధికారులు శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిథిలాలను తొలగించి, వాటి కింద ఇరుక్కున్న వారిని రక్షించే ప్రయత్నాలు మంగళవారం రాత్రి సమయానికి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా 10 నుంచి 12 కుటుంబాలు శిథిలాల కింద చిక్కుకునే ఉన్నాయని తాము భావిస్తున్నట్లు ముంబాదేవి ఎమ్మెల్యే అమిన్ పటేల్ చెప్పారు. శిథిలాల కింద నుంచి బాధితులను రక్షించి, క్షతగాత్రులను వైద్యశాలలకు తరలిస్తున్నారు. ఇరుకు వీధులతో సహాయక చర్యలకు ఇబ్బంది ఈ భవనం మహారాష్ట్ర గృహ, ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎంహెచ్ఏడీఏ)కు చెందినదని స్థానికులు చెబుతుండగా, ఎంహెచ్ఏడీఏ మరమ్మతుల విభాగం చీఫ్ వినోద్ ఘోసాల్కర్ ఆ భవనం తన సంస్థకు చెందినదికాదని అంటున్నారు. చట్టసభలో సభ్యుడైన భాయ్ జగ్తాప్ మాట్లాడుతూ భవనం పాడుబడినందున తక్షణమే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆ భవనంలో నివాసం ఉంటున్నవారు కోరినా అధికారులు పట్టించుకోలేదన్నారు. ముంబైలో ఇప్పటివరకు 500 భవనాలను పాడుబడినవిగా గుర్తించినా, కేవలం 68 భవనాల నుంచి ప్రజలను ఖాళీ చేయించామని బీఎంసీ అధికారి ఒకరు చెప్పారు. అగ్నిమాపక దళం, ముంబై పోలీసులు, బీఎంసీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరుకైన వీధులు ఉండటంతో అంబులెన్స్‌లు, శిథిలాలను తొలగించే యంత్రాలు అక్కడకు చేరుకోలేకపోయాయి. స్థానికులే మానవహారంగా ఏర్పడి తమ ఒట్టి చేతులతో శిథిల వ్యర్థాలను పక్కకు తీసేస్తున్నారు. ఇరుకు సందులతో సహాయక కార్యక్రమాలు ముందే నెమ్మదిగా సాగుతుండగా, ఘటనా స్థలానికి మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలు తదితరులు ఎక్కువ సంఖ్యలో చేరుకోవడంతో సహాయక చర్యలు మరింత ఆలస్యం అయ్యాయి. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు మిలింద్ దేవ్రా మాట్లాడుతూ ‘ముంబైలో వర్షాకాలం వచ్చిందంటే చాలు, ప్రతి ఏడాదీ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గోడలు కూలుతాయి, రోడ్లపై గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరిగి మనుషులు చనిపోతున్నారు. మ్యాన్‌హోళ్లలోకి ప్రమాదవశాత్తూ పడి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మళ్లీ మళ్లీ వస్తున్న ఈ సమస్యకు ముంబై ప్రజలు సమాధానం అడగాల్సిన సమయం ఇదే’ అని అన్నారు. ఈ నెల మొదట్లోనే ముంబైలో కురిసిన భారీ వర్షాలకు గోడలు కూలి 20 మందికిపైగా చనిపోయారు. ఈ ఏడాది మార్చిలోనే ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ రైల్వే స్టేషన్ బయట పాదచారుల వంతెన పాక్షికంగా కూలి ఐదుగురు చనిపోయారు. గతేడాది జూలైలోనూ అంధేరిలో గోఖలే వంతెన పాక్షికంగా కూలి ఇద్దరు మరణించారు. ముంబైలో వర్షా కాలంలో భవనాలు, వంతెనలు కూలడం మామూలైపోయింది. -
‘హిమాచల్’ మృతులు14
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య సోమవారానికి 14కు చేరింది. గాయపడిన వారి సంఖ్య 28కి చేరింది. మరణించిన వారిలో 13 మంది సైనికులు ఉన్నారు. వారితో పాటు మృతి చెందిన ఓ పౌరుడి మృతదేహాన్ని శిధిలాల నుంచి వెలికితీశారు. గాయపడిన 28 మందిలో 17 మంది ఆర్మీ సైనికులు కాగా మరో 11 మంది సాధారణ పౌరులు ఉన్నారు. వీరంతా నాలుగు అంతస్తుల రెస్టారెంట్లో ఉండగా ఆదివారం సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి భవనం కూలిపోయింది. సోమవారం సాయంత్రం నాలుగు గంటల వరకు సహాయక చర్యలు కొనసాగాయని జిల్లా అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు శివ్ కుమార్ తెలిపారు. భవనాన్ని నిబంధనలకు లోబడి నిర్మించకపోవడం వల్లే కూలిపోయిందని పోలీసులు గుర్తించారు. భవన యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతోపాటు విచారణకు ఆదేశించామని, నివేదిక వచ్చాక పరిశీలించాక తగు చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. ఆదివారం నుంచే హెలికాప్టర్ల ద్వారా ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో సహాయక చర్యలు ప్రారంభించారు. జిల్లా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ రోహిత్ రాథోర్‌ను ఈ ఘటన వివరాలు సేకరించేందుకు నియమించామని డిప్యూటీ కమిషనర్ కేసీ చమాన్ అన్నారు. మొదట అది భూకంపం అనుకున్నామని గాయపడిన ఓ సైనికుడు చెప్పారు. -
16 సెకన్లు.. 16 వేల టన్నులు
వాషింగ్టన్ : 16వేల టన్నుల బరువున్న 21 అంతస్థుల బిల్డింగ్‌ను కేవలం 16 సెకన్లలో నేలమట్టం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. వివరాలు.. అమెరికా పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బెత్లేహెం స్టీల్ కంపెనికి చెందిన ఈ 21 అంతస్థుల మార్టిన్ భవనాన్ని 1972లో ప్రారంభించారు. అయితే గత 12 ఏళ్లుగా ఈ బిల్డింగ్ నిరుపయోగంగా ఉంది. ఈ క్రమంలో కంపెనీ యాజమాన్యం బిల్డింగ్‌ను కూల్చివేయాలనుకుంది. అందుకు కోసం 219 కిలోగ్రాముల పేలుడు పదార్థాలను వినియోగించింది. ఈ క్రమంలో 16 వేల టన్నుల బరువున్న ఈ భవనాన్ని కేవలం 16 సెకన్లలో నేలమట్టం చేసింది. ఈ దృశ్యాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఈ సంఘటన గురించి చుట్టుపక్కల ప్రజలు.. ‘మేం భావించిన దాని కంటే చాలా పెద్ద శబ్దం వినిపించింది. మా కాళ్ల కింద భూమి కదిలిపోతుందేమో అనిపించింద’ని తెలిపారు. ప్రస్తుతం ఈ బిల్డింగ్ ఉన్న ప్రదేశంలో కొత్త భవనాన్ని నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు కంపెనీ యాజమాన్యం తెలిపింది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
భార్య కోసం 4 రోజులుగా శిథిలాల కిందే..
సాక్షి, బళ్లారి: ధార్వాడ నగరంలో నూతన బస్టాండు సమీపంలో నిర్మాణ దశలో ఉన్న ఐదంతస్తులు భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. నాలుగు రోజుల నుంచి కేంద్ర, రాష్ట్ర సహాయ సిబ్బంది రాత్రింబగళ్లు కష్టపడి పని చేస్తూ పలువురిని రక్షించినా 17 మంది విధిరాతకు తలవంచక తప్పలేదు. అయితే నాలుగు రోజుల నుంచి శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు శుక్ర వారం సహాయ బృందాలు గాలిస్తుండగా ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. శిధిలాల కింద చిక్కుకున్న సోమనగౌడ అనే వ్వక్తి మృత్యుంజయుడుగా బయటపడి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాకుండా మరో ముఖ్యమైన అంశం అక్కడ పలువురిని తీవ్రంగా కలిచివేసింది. దిలీప్, సంగీత అనే దంపతులు శిథిలాల కింద చిక్కుకుని నాలుగు రోజులుగా చావుబతుకుల మధ్య పోరాడుతున్నారు. భర్త దిలీప్‌ను రక్షించేందుకు సహాయక సిబ్బందికి అవకాశం ఉన్నప్పటికీ ఆయన చేయి అందించకపోవడంతో సహాయ సిబ్బందిని కూడా తీవ్ర ఆవేదనకు గురి చేసింది. సహాయక సిబ్బంది దిలీప్‌ను రక్షించాలని చేయి ఇవ్వాలని కోరగా, తన భార్య కాలు విరిగి తన ముందు చావుబతుకుల మధ్య ఉందని, తనను రక్షిస్తే ఇద్దరం బయటకు వస్తామని, లేకపోతే దేవుడు ఎలా రాసి ఉంటే అలాగే జరగని అని సమాధానం ఇస్తూ చేయి ఇవ్వకపోవడం పలువురిని కలిచివేయగా మరో వైపు భార్యభర్తల బంధం ఎంత గొప్పదో అని చర్చించుకోవడం కనిపించింది. -
పేలిన గ్యాస్ సిలిండర్లు.. 12 మందికి తీవ్ర గాయాలు
-
కూలిన మూడంతస్తుల భవనం..ఐదుగురు మృతి
-
విగతజీవిగా వాచ్‌మన్ భిక్షపతి..
కాజీపేట : భవానీనగర్‌లో భవనం కుంగిపోయిన ఘటనలో కనిపించకుండా పోయిన వాచ్‌మన్ భిక్షపతి.. భవనం శిథి లాల కింద విగతజీవిగా కనిపించాడు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బం ది 12 గంటలపాటు శ్రమించి మేడ భిక్షపతి మృతదేహాన్ని గురువారం తెల్లవారు జామున 3 గంటలకు బయటకు తీశారు. మంగళవారం రాత్రి భవానీనగర్‌లో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్థుల భవనం కుంగిపోగా వాచ్‌మన్‌గా భిక్షపతి శిథిలాల కింద చిక్కుకుపోయాడు. జిల్లా కలెక్టర్ అమ్రపాలి చొరవ మేరకు భూపాలపల్లి, హైదరాబాద్ నుంచి 40 మందితో కూడిన రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు భిక్షపతి కుటుంబ సభ్యులతో చర్చించి ఎక్కడ నిద్రిస్తాడో తెలుసుకుని అధికారుల పర్యవేక్షణలో భవ నం కూల్చివేత పనులను మొదలు పెట్టారు. 12 గంటలకుపైగా శ్రమించిన తరువాత భిక్షపతి మృతదేహం లభించడంతో అతి కష్టం మీద బయటకు తీశారు. తప్పించుకునే మార్గం లేకనే.. కుటుంబ సభ్యులకు తగు జాగ్రత్తలు చెప్పి భవనంలో పడుకోవడానికి భిక్షపతి వచ్చిన 10 నిమిషాల్లోనే భవనం కుప్పకూలిపోయిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మంగళవారం రాత్రి నుంచి భవనం శిథిలాల కింద కొన ఊపిరితో ఉండొచ్చనే నమ్మకంతో ఉన్న కుటుంబ సభ్యులు భిక్షపతి మృతదేహాన్ని చూడగానే గుండెలవిసేలా రోధించారు. మృతుడు తప్పించుకునే క్రమంలోనే పడుకున్న చోటు నుంచి వరండాలోకి పరుగెత్తుకు వచ్చి శిథిలాల కింద చిక్కుకుపోయినట్లుగా ఎన్డీఆర్ఎఫ్ సభ్యులు వివరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఆందోళన.. వాచ్‌మన్ భిక్షపతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం సాయంత్రం బంధు, మిత్రులు ఓ ప్రైవేట్ పాఠశాల నిర్వాహకుడి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. భవనం యజమానితో కలిసి భిక్షపతి కుటుంబానికి సహాయం దక్కకుండా చేయడానికి ప్రయత్నించడం ఎంత వ రకు సమంజసమంటూ నిలదీశారు. పాఠశాల బస్సు ఎదుట బైఠాయించి మృతుడి కుటుంబానికి పరిహారం ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. రూ.10లక్షల పరిహారం ఇప్పించాలంటూ పాఠశాల నిర్వాహకుడు నవీన్‌రెడ్డితో వాగ్వివాదానికి దిగారు. ఒక దశలో కట్టెలను తెచ్చి పాఠశాలలోనే భిక్షపతిని దహనం చేస్తామంటూ పేర్చడానికి ప్రయత్నిం చారు. దీంతో కొద్దిసేపటి వరకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొ న్నాయి. పరిస్థితి చెయ్యి దాటే పరిస్థితి తలెత్తడంతో.. సీఐ అజయ్, తహసీల్దార్ రవీందర్ జోక్యం చేసుకుని న్యాయం చేయడానికి ప్రయత్నిస్తామంటూ హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. స్థానిక కార్పొరేటర్లు, ఎమ్మార్పీస్ నాయకులు వాచ్‌మన్ కుటుంబ సభ్యుల పక్షాన భవన యజమాని బంధువులతో పరిహారంపై చర్చలు జరుపుతున్నారు. పరిహారం విషయం తేలే వరకు పోలీసులకు ఫిర్యాదు చేసేది లేదంటూ మృతుడి కుటుంబ సభ్యులు భీష్మించుకుని కూర్చున్నారు. -
చెన్నై: కూలిన నాలుగు అంతస్థుల భవనం
-
చందానగర్ హుడా కాలనీలో విషాదం
-
ఇండోర్‌లో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం
-
కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం
ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో శనివారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. సర్వతే బస్టాండ్ సమీపంలో మూడు అంతస్తుల భవనం కుప్పకూలి 10 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్టు అనుమానిస్తున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని ఆందోళన చెందుతున్నారు. కూలిపోయిన భవనంలో ఎంఎస్ పేరుతో లాడ్జి, హోటల్ నిర్వహిస్తున్నారు. భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో జనం పరుగులు తీశారు. శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక దళం అక్కడి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భారీ యంత్రాలతో శిథిలాలను తొలగిస్తున్నారు. స్థానికులు కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. ప్రమాదానికి గల కారణాలు వెల్లడి కాలేదు. స్పందించిన సీఎం ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. -
ఒక్కసారిగా కూలిన భవనం.. జనం పరుగులు
ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా ఓ భవనం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. శిథిలాల కింద మరి కొంతమంది చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. గాయపడిన వారిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో అక్కడి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో ఆ ప్రాంతంలో గందరగోళ పరిస్థితి నెలకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బెంగళూరులో కుప్పకూలిన భారీ భవనం
-
బెంగళూరులో కుప్పకూలిన భారీ భవనం
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో గురువారం పెను ప్రమాదం సంభవించింది. నిర్మాణంలో ఉన్న ఐదు అంతస్థుల భారీ భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సార్జాపూర్ రోడ్డులో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఏడుగురిని కాపాడినట్టు రాష్ట్ర అగ్నిమాపకదళం, హోంగార్డులు, సివిల్ డిఫెన్స్, ఎస్డీఆర్ఎఫ్ అధిపతి ఎంఎన్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు మూడు మృతదేహాలను వెలికితీసినట్టు చెప్పారు. శిథిలాల కింద ఇంకా కొంత మంది ఉండే అవకాశముందన్నారు. అగ్నిమాపక దళం, ఎన్డీఆర్ఎఫ్ సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. భారీ భవనం కుప్పకూలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. -
కుప్పకూలిన భవనం : నాలుగుకి చేరిన మృతులు
ఠాణే : ముంబైలో భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. శుక్రవారం భివాండిలో తహిర్ బిజ్నోర్ అనే భవనం కూలిపోయిన విషయం తెలిసిందే. భవనాన్ని నాలుగు అంతస్తుల్లో నిర్మించేందుకు అనుమతులు లేవని పోలీసులు తెలిపారు. భవన యజమానిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. మృతులను పర్విన్ ఖాన్(65), రుస్కర్ యాకుబ్ ఖాన్(18), అస్ఫక్ ముస్తాక్ ఖాన్(38), జైబున్నిసా రఫీక్ అన్సారీ(61)లుగా గుర్తించినట్లు తెలిపారు. ఈ ఘటనలోనే గాయపడిన తొమ్మిది మందిని నగరంలోని పలు ఆసుపత్రుల్లో చేర్పించినట్లు వివరించారు. ప్రస్తుతం వీరందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పారు. ఘటన జరిగిన వెంటనే స్పందించిన జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సహాయ సహకారాలను అందించినట్లు తెలిపారు. భవన యజమాని పరారీలో ఉన్నాడని, అతడిని పట్టుకునేందుకు టీంలు రంగంలోకి దిగాయని వివరించారు. -
ముంబైలో కూలిన భవనం, ఒకరు మృతి
ముంబయి : మహారాష్ట్ర ముంబయిలోని బీవండిలో శుక్రవారం ఉదయం ఓ మూడంతస్తుల భవనం హఠాత్తుగా కుప్పకూలింది. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. మరోవైపు పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇక ఢిల్లీలోని తైమూర్ నగర్లో ఓ భవనం కుప్పకూలింది. అయితే ఎవరికి గాయాలు కాలేదు. -
కుప్పకూలిన మూడంతస్తుల భవనం
-
ఈదురుగాలులకే.. క్షణాల్లో.. చూస్తుండగానే..
సాక్షి, విశాఖపట్నం: అది పురాతనమైన భవనం.. దాదాపు నాలుగు దశాబ్దాల కిందట అప్పటి నిర్మాణ పద్ధతిలో ఆ భవనాన్ని నిర్మించారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ భవనం పూర్తిగా నానిపోయి.. దెబ్బతిన్నది. మంగళవారం బలమైన ఈదురుగాలులు వీయడంతో చిగురుటాకులా వణికిపోయిన ఆ భవనం అందరూ చూస్తుండగానే.. క్షణాల్లో కుప్పకూలింది. నిలువునా కూలి నేలమట్టమైంది. చాలాకాలంగా ఆ భవనంలో ఎవరూ నివసించడం లేదు. దీంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం మండలం నాతవరంలో చోటుచేసుకుంది. బలమైన ఈదురుగాలులకు స్థానికులు చూస్తుండగానే క్షణాల్లో పురాతన భవనం కుప్పకూలింది. -
ఈదురుగాలులకే.. క్షణాల్లో.. చూస్తుండగానే..
-
జేఎన్టీయూలో కూలిన భవనం
హైదరాబాద్: నగరంలోని జేఎన్టీయూలో ఓ పాత భవనం నెలకూలింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఏం కాకపోవడంతో విద్యార్థులంతా ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి బాగా నానిని మెకానికల్ విభాగానికి చెందిన భవనం నేల మట్టమయింది. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. -
ముంబయిలో కుప్పకూలిన భవనం
-
ముంబయిలో విషాదం.. కుప్పకూలిన భవనం
ముంబయి: ఐదు అంతస్తుల భవనం కుప్పకూలడంతో ఏడుగురు వ్యక్తులు మృతిచెందగా, మరో్ 40 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన ముంబయి సబర్బన్ లోని ఘట్కోపర్లో మంగళవారం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న నలుగురు వ్యక్తులను ప్రాణాలతో బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భవనం కుప్పకూలిన ఘటనపై విచారణకు ముంబయి మునిసిపల్ కమిషనర్ అజయ్ మెహతా అధికారులను ఆదేశించారు. 15 రోజుల్లోగా నివేదిక అందజేయాలని సూచించారు. ఘట్కోపర్ లోని దామోదర్ పార్క్ ఏరియాలో అకస్మాత్తుగా భవనం కూలినట్లు తమకు సమాచారం అందిందని ఓ అధికారి పీఎస్ రహంగ్‌దాలే చెప్పారు. ఎనిమిది ఫైరింజన్లు, అంబులెన్స్ తో సిబ్బంది సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ తో పాటు బీఎంసీ అధికారులు సహయాక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అయితే భవనం కూలడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. రాత్రి 9 గంటల సమయంలోనూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
కుప్పకూలిన నారాయణ కాలేజీభవనం
-
విజయనగరంలో అక్రమణల తొలగింపు
-
ఈ పాప..భలే అదృష్టవంతురాలు
-
కుప్పకూలిన ఆరు అంతస్తుల భవనం
-
కుప్పకూలిన ఆరు అంతస్తుల భవనం
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ ఏరియాలో విషాదం చోటుచేసుకుంది. కాన్పూర్ జజ్మాలో నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు చనిపోగా, దాదాపు 30 మంది భవనం శిథిలాల్లో చిక్కుకుపోయి ఉండొచ్చునని అధికారులు భావిస్తున్నారు. భవనం కూలిపోతుండగా వచ్చిన పెద్ద శబ్ధంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్రిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. నలుగురు మృతిచెందినట్లు గుర్తించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భవనం కుప్పకూలిన ఘటనపై నిపుణుల బృందాన్ని ఏర్పాటుచేసి కారకులపై చర్యలు తీసుకుంటామని కాన్పూర్ డీఎం కౌశల్ రాజ్ తెలిపారు. -
భవనం కూలి ముగ్గురి మృతి
మేడ్చల్: శిథిలావస్థలో ఉన్న భవనం కూల్చివేస్తుండగా జరిగిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతిచెందారు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా కేంద్ర సమీపంలోని గుండ్ల పోచంపల్లిలో గురువారం చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ పాత ఇంటిని కూల్చి వేస్తున్న సమయంలో భవన శకలాలు మీదపడి అందులో పని చేస్తున్న ముగ్గురు కార్మికులు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో మృతిచెందినవారు ముత్యాలనాయుడు, బిక్షపతి, వెంకటేష్‌లుగా గుర్తించారు. గాయాలపాలైన వారిలో ఒకరు విఠల్ కాగా.. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆశలు సమాధి!
- భవన శిథిలాల కింద మొత్తం 11 మంది మృతి - ప్రాణాలతో బయటపడింది ఇద్దరే - నానక్‌రాంగూడలో 30 గంటలపాటు కొనసాగిన శిథిలాల తొలగింపు - మృతుల్లో 9 మంది విజయనగరం జిల్లా వాసులు - ఉస్మానియాలో పూర్తయిన పోస్టుమార్టం సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంలోని నానక్‌రాంగూడలో కుప్పకూలిన భవనం కింద ఎవరైనా బతికి ఉన్నారేమోనన్న ఆశలు శిథిలాల కిందే సమాధి అయ్యాయి! ప్రభుత్వం, ఎన్డీఆర్ఎఫ్తో సహా వివిధ ప్రభుత్వ విభాగాలు నిర్విరామంగా 30 గంటలపాటు శ్రమించి శిథిలాలు తొలగించేసరికి మొత్తం పదకొండు మంది మృతి చెందినట్టు తేలింది. శిథిలాల్లో ఇరుక్కుపోయిన వారిలో ఒక్కరు కొన ఊపిరితో ఉన్నా వారిని బతికించాలనే లక్ష్యంతో అత్యంత జాగ్రత్తగా శిథిలాల తొలగింపు పనులు చేశారు. అయినా శుక్రవారం ప్రాణాలతో బయట పడిన ఇద్దరు తప్ప ఇంకెవరూ మిగల్లేదు. అంతా విగతజీవులయ్యారు. శిథిలాలను తొలగించాక మొత్తం పదకొండు మంది మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. గురువారం రాత్రి 10 గంటలకు మొదలైన సహాయక చర్యలు శనివారం తెల్లవారు జామున 4 గంటల వరకు కొనసాగాయి. శుక్రవారం ఉదయం 5 గంటలకు దీపక్, అతని తల్లి రేఖను సురక్షితంగా వెలికి తీశారు. శనివారం తెల్లవారు జామున 3.15 గంటలకు చివరగా నెల్లి శంకర్రావు మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహాలకు ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతులు ఎక్కడివారు? మృతుల్లోని 11 మందిలో తొమ్మిది మంది విజయనగరం జిల్లా బలిజపేట మండలం చిలకలపల్లి గ్రామానికి చెందిన వారు. మరో ముగ్గురు అదే జిల్లా సుభద్రకు చెందిన వారు. మరొకరిని శ్రీకాకుళం జిల్లా హిర మండలం గొట్టా బ్యారేజీకి చెందిన కొత్తపల్లి దుర్గారావుగా గుర్తించారు. మరో వ్యక్తి శివను ఛత్తీస్‌గఢ్‌కు చెందినవాడిగా గుర్తించారు. ఈయన భార్య రేఖ, కొడుకు దీపక్ గాయాలతో కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులు వీరే.. కోమటిపల్లి వెంకటలక్ష్మీ(24), నేతేటిæ పైడమ్మ(46), నేతేటి నేటి సాంబయ్య(48), తేటి గౌరీశ్వరీ(14), కొత్తపల్లి దుర్గారావు(25), శివ, పిరిడి పొలినాయుడు(25), ఆయన భార్య పిరిడి నారాయణమ్మ(23), పిరిడి మోహన్(4), కోమటిపల్లి పోలినాయుడు(32), నెల్లి శంకర్ రావు(20). మంత్రుల పర్యవేక్షణ: శిథిలాల తొలగింపు, మృతదేహాల వెలికితీత ప్రక్రియను పర్యవేక్షించేందుకు మంత్రులు గంటల తరబడి ఘటనా స్థలంలోనే ఉండిపోయారు. మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం 10 గంటలకు ఘటనా స్థలానికి చేరుకొని శనివారం తెల్లవారు జామున 2.45 గంటలకు తిరిగి వెళ్లిపోయారు. దాదాపు 16 గంటలకు పైగా సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఆయనతో పాటు మంత్రి మహేందర్‌రెడ్డి, మేయర్ బొంతు రాంమోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్ధీన్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఉన్నారు. గురువారం రాత్రి డిప్యూటీ సీఎం మహుమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహ్మ రెడ్డి, మంత్రి పద్మారావులు దాదాపు 8 గంటల పాటు సహయక చర్యలను పర్యవేక్షించారు. మరో ఇద్దరి సస్పెన్షన్.. భవనం కూలిన ఘటనలో మరో ఇద్దరిని సస్పెండ్ చేశారు. సర్కిల్–11 టౌన్ ప్లానింగ్ విభాగంలో పని చేస్తున్న సెక్షన్ ఆఫీసర్ పి.మధుతోపాటు ఇదివరకు ఇక్కడ పనిచేసి, ప్రస్తుతం సర్కిల్లో 7లో పనిచేస్తున్న సెక్షన్ ఆఫీసర్ ఆర్.రాజేందర్‌ను జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి సస్పెండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ఏపీ సర్కార్ నష్టపరిహారం సాక్షి, అమరావతి: హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిన ఘటనలో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం శనివారం నష్టపరిహారం ప్రకటించింది. ఘటనలో మృతి చెందిన పెద్దలకు రూ.5 లక్షలు, పిల్లలకు రూ.2.5 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వనున్నట్లు ఏపీ సీఎం బాబు తెలిపారు. కొచ్చిలో సత్తూసింగ్ అరెస్టు! హైదరాబాద్: నానక్‌రాంగూడలో కుప్పకూలిన భవనం యాజమాని సత్యనారాయణసింగ్ అలియాస్ సత్తూసింగ్ను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు కొచ్చిలో అరెస్టు చేసినట్లు సమాచారం. అయ్యప్ప మాలధారణ వేసిన సత్తూసింగ్ కొద్దిరోజుల క్రితం శబరిమలై వెళ్లి తిరిగి వస్తున్నట్లు తెలుస్తోంది. భవనం కూలి 11 మంది మృతి చెందడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలోనే సైబరాబాద్ క్రైమ్స్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డిని విచారణ అధికారిగా నియమించింది. ఫోన్ కాల్స్ ఆ«ధారంగా సత్తూసింగ్ ఆచూకీ కనుగొన్న ఎస్వోటీ పోలీసులు.. శుక్రవారం అర్ధరాత్రి అతనిని కొచ్చిలో అరెస్టు చేసి విమానంలో నగరానికి తీసుకొచ్చినట్లు తెలిసింది. అతనిపై ఐపీసీ 304 పార్ట్–2, 304ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బాధ్యులైన వారందరిపై కేసులు భవనం కూలిన ఘటనలో బాధ్యులైన వారందరిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేసేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు. సత్తూసింగ్తో పాటు అతని కుటుంబ సభ్యులు, ఇంజనీర్, మేస్త్రీ, జీహెచ్ఎంసీ అధికారులపై కేసులు నమోదు చేయనున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే శనివారం జీహెచ్ఎంసీ సిబ్బంది, అధికారులను విచారించినట్లు విశ్వసనీయ సమాచారం. ‘సుమధుర’పై తర్జన భర్జన : కాగా, భవనం కూలడానికి సుమధుర కనస్ట్రక్షన్ కంపెనీ లోతైన సెల్లార్ తీయడం కూడా కారణం కావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో సుమధుర కనస్ట్రక్షన్పై కేసు నమోదు చేయాలా? వద్దా? అనే విషయంపై పోలీసులు సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. అయినప్పటికీ కేసు నమోదు చేయడంపై వారు తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. -
ఇంకా షాక్ లోనే ఆ బస్తీ..
రాయదుర్గం: నానక్‌రాంగూడలోని లోధిబస్తీ భవనం కుప్పకూలడంతో ఇక్కడివారు గురు, శుక్రవారాలు నిద్రలేని రాత్రులు గడిపారు. స్థానికంగానే మంత్రులు, ఎమ్మెల్యే, మేయర్, డిప్యూటీ మేయర్, స్థానిక కార్పొరేటర్, జీహెచ్ఎంసీ, వివిధ విభాగాల ఉన్నతాధికారులు, సిబ్బంది అక్కడే మకాం వేసి సహాయక చర్యలు చేపట్టారు. అక్కడ ఏం జరిగిందో.. ఎలా జరిగిందో ఊహించుకుటూ షాక్‌లో ఉండిపోయారు. తమతో కలిసున్న 11 మంది మృత్యువాత పడడం వారిని బాధిస్తోంది. అంత భవనం నేలమట్టం కావడంతో అందులో చిక్కుకున్నవారిని కాపాడాలనుకున్నా నిస్సహాయులమే అయ్యామని కన్నీటి పర్యంతమయ్యారు. కుడివైపు కూలి పడింటే ఘోరం జరిగేది.. భవనం ఒకేచోట కుప్పకూలింది కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఆ ఏడంతస్తుల భవనం కుడివైపు కూలిపోయింటే మాత్రం అక్కడ ఉన్న బీరేందర్‌సింగ్ ఇల్లు, ఆ పక్కనే చిన్నచిన్న ఇళ్లపై పడేది అప్పుడు మృతులు సంఖ్య ఇంకే పెరిగేదని ఇక్కడివారు చెబుతున్నారు. ఇక్కడివారు కాకపోయినా 11 మంది చనిపోవడం కలచివేస్తోందని, తమ బంధువులు కాకపోయినా స్నేహంగా ఉండేవారని, ఏడాదిగా తమతోనే మసలారని ఇక్కడివారు తెలిపారు. భోజనం చేసిన 10 నిమిషాలకే.. తాను కుప్పకూలిన భవనంలో ఉంటున్నవారి వద్దే భోజనం చేసేవాడినని పక్కనే ఉన్న సత్యనారాయణసింగ్ మరో భవనం వాచ్మెన్ టి.వెంకటేశ్వరరావు తెలిపాడు. గురువారం రాత్రి 8 గంటలకు వారింటిలో అందరితో కలిసి టీవీ చేస్తూ భోజనం తిన్నామన్నాడు. అన్నం తిని పది నిమిషాలు అక్కడే వారితో మాట్లాడి తన గదికి వెళ్లానని, పదినిమిషాల్లో పెద్ద శబ్దం వచ్చిందని సంఘటనను గుర్తు చేసుకున్నాడు. బయటకు వచ్చి చూడగా ఏడంతస్తుల భవనం కుప్పకూలి కనిపించిందన్నాడు. పశ్చిమ గోదావరిజిల్లా ఆచంట వేమవరం గ్రామం నుంచి వచ్చిన తాను.. ఇక్కడ వాచ్మెన్ గా పనిచేసే తమ బంధువు కోటేశ్వరరావు సొంతూరు వెళుతూ తనను అక్కడ వాచ్మెన్ గా ఉండమన్నాడని, భోజనం సాంబయ్య ఇంట్లో చేయాలని చెప్పి వెళ్లాడన్నాడు. గురువారం, శుక్రవారం అసలు నిద్రనే లేదని కన్నీట పర్యంతమయ్యాడు. – వెంకటేశ్వరరావు -
మరో ఇద్దరు అధికారులు సస్పెండ్
హైదరాబాద్: నానక్‌రాంగూడలో భవనం కూలిన ఘటనలో మరో ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటుపడింది. ఇద్దరు సెక్షన్ ఆఫిసర్లను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ.. జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు. అక్రమ కట్టడాలను అడ్డుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను వేటు వేసినట్లు తెలిపారు. ఇప్పటికే స్థానిక డిప్యూటీ కమిషనర్ మనోహర్, సహాయ సిటీ ప్లానర్ కృష్ణమోహన్‌ను విధుల నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఘటనలో మొత్తం నలుగురు అధికారులపై వేటు పడింది. -
మరో ఇద్దరు అధికారులపై వేటు
హైదరాబాద్: నానక్‌రామ్ గూడలో నిర్మాణంలో ఉన్న ఏడు అంతస్తుల భవనం కూలిన ఘటనలో మరో ఇద్దరు అధికారులపై వేటు పడింది. టౌన్ ప్లానింగ్ అధికారులు ఆర్ రాజేందర్, పీ మధులను జీహెచ్ఎంసీ కమిషనర్ సస్పెండ్ చేశారు. జేఎన్టీయూ ప్రొఫెసర్ రమణారావు ఈ ప్రమాదంపై జీహెచ్ఎంసీకి నివేదిక సమర్పించారు. అపార్ట్మెంట్ డిజైన్ సక్రమంగా లేదని, ఎక్కువ అంతస్తులు నిర్మించడం వల్లే ప్రమాదం జరిగిందని నివేదికలో పేర్కొన్నారు. పక్కపక్కనే భవనాలు నిర్మించడం కూడా ప్రమాదానికి కారణమని, శిథిలాలు తొలగించాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని రమణారావు చెప్పారు. గురువారం రాత్రి నానక్‌రామ్ గూడలో నిర్మాణంలో ఉన్న ఏడు అంతస్తుల భవనం కూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తం 11 మృతదేహాలను వెలికితీశారు. అదృష్టవశాత్తూ ఓ తల్లీ, ఆమె మూడేళ్ల కుమారుడు ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్దల కుటుంబాలకు 5 లక్షలు, పిల్లల కుటుంబాలకు 2.5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. -
మృత్యుఘోష..'అంతా ఏపీకి చెందినవారే'
-
మృత్యుఘోష
హైదరాబాద్: హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో పేకమేడలా కూలిపోయిన భవన శిథిలాల తొలగింపు ప్రక్రియ ముగిసింది. మొత్తం 11 మృతదేహాలను బయటకు తీశారు. అదృష్టవశాత్తూ ఓ తల్లీ, ఆమె మూడేళ్ల కుమారుడు ప్రాణాలతో బయటపడ్డారు. మంత్రులు, ఉన్నతాధికారులు అక్కడే ఉండి పర్యవేక్షించినా.. ఇరుకు రోడ్డు, విద్యుత్ తీగల కారణంగా సహాయక చర్యల్లో తీవ్ర జాప్యం జరిగింది. శనివారం తెల్లవారుజాము వరకు సహాయక చర్యలు కొనసాగాయి. ఈ ఘటన బాధితుల్లో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందినవారే. కొందరు శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు, మరికొందరు ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారు ఉన్నారు. నానక్‌రామ్‌గూడలో నిర్మాణంలో ఉన్న ఏడు అంతస్తుల భవనం గురువారం రాత్రి 9.10 గంటల సమయంలో కుప్పకూలిన విషయం తెలిసిందే. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, జీహెచ్ఎంసీ, పోలీసు సిబ్బంది గురువారం రాత్రి 10 గంటల నుంచే సహాయక చర్యలు చేపట్టారు. మూడు ప్రొక్లెయినర్లు, పదుల సంఖ్యలో సిబ్బందితో శిథిలాల తొలగింపు చేపట్టారు. శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రేఖ అనే మహిళ, ఆమె కుమారుడు దీపక్ (3)లను ప్రాణాలతో బయటికి తీశారు. తీవ్రంగా గాయపడిన వారిద్దరినీ వెంటనే కాంటి నెంటల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం శనివారం తెల్లవారుజాము వరకు మిగతా మృత దేహాలను వెలికితీశారు. (‘మృత్యుఘోష’కు సంబంధించిన ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) అంతా ఏపీకి చెందినవారే.. వెలికి తీసిన మృతదేహాలను కోమటిపల్లి వెంకటలక్ష్మి (28), తేనేటి గౌరిశ్రీ (14), తేనేటి పైడమ్మ (35), తేనేటి సాంబయ్య (38), కోమటి పల్లి పోలినాయుడు (30), ఎన్.శంకర్ (18), శ్రీకాకుళం జిల్లా హీరా మండలానికి చెందిన దుర్గారావు (22), ఛత్తీస్‌గఢ్‌కు చెందిన శివ (30)గా గుర్తించారు. వీరిలో దుర్గారావు, శివ మినహా మిగతా వారు ఏపీలోని విజయ నగరం జిల్లా చిలకలపల్లి వారే. ఇదే జిల్లా సుభద్ర ప్రాంతానికి చెందిన పిరిడి పోలినాయడు (30), పిరిడి నారాయణమ్మ (23), పిరిడి మోహన్ (3) ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన తల్లీ కొడుకులు రేఖ (25), దీపక్ (3) ప్రాణాలతో బయటపడ్డారు. చిలకలపల్లికి చెందిన వారిలో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందినవారుకాగా.. సుభద్ర గ్రామానికి చెందిన ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు. అది అక్రమ నిర్మాణమే నానక్‌రామ్‌గూడ గ్రామ కంఠంలో ఎలాంటి అనుమతులూ లేకుండానే జీ ప్లస్ ఆరు అంతస్తుల ఈ భవనం నిర్మించినట్లు తేలిం ది. భవన యజమాని తుల్జారాం సత్య నారాయణసింగ్ అలియాస్ సత్తూసింగ్ అధికార టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతుండడం వల్లే ఈ అక్రమ నిర్మాణం వైపు శేరిలింగంపల్లి టౌన్ ప్లానింగ్ అధికారులు కన్నెత్తి కూడా చూడలేదని సమా చారం. కింది స్థాయి సిబ్బంది అక్కడికి వెళ్లినా సత్తూసింగ్ భయపెట్టేవాడని స్థానికులు చెబు తున్నారు. కాగా భవనం కుప్పకూలిన అనంతరం సత్తూ సింగ్ పరారీలో ఉన్నట్లు తెలు స్తోంది. కొంత మంది స్థానికులు అతను శబ రిమల వెళ్లాడని చెబుతుండగా.. మరికొందరు హైదరాబాద్‌లోనే ఉండవచ్చని చెబుతున్నారు. శిథిలాల తొలగింపులో జాప్యం కూలిన భవనం శిథిలాలు తొలగింపులో తీవ్ర జాప్యం జరిగింది. ఇరుకైన రోడ్లు, విద్యుత్ తీగలు ఉండటంతో శిథిలాలను వేగంగా తొలగించడం, టిప్పర్లలో తరలించడం వంటివి ఆలస్యమయ్యాయి. దాంతో గంటల తరబడి సహాయక చర్యలు కొనసాగాయి. మృత్యుంజయులు ఆ తల్లీబిడ్డ సాక్షి, హైదరాబాద్: నానక్‌రామ్‌గూడలో ఏడంతస్తుల భవనం పేక మేడలా కుప్పకూలినా ఓ తల్లీకొడుకు మాత్రం మృత్యుంజయులుగా బయటపడ్డారు. అయితే కూలిన భవనానికి ఉత్తరం వైపున మరో భవనం ఉంది. ఆ భవనాన్ని ఆనుకొని శాంతాబాయికి చెందిన భవనం ఉంది. అక్కడ శిథిలాల్లో కొందరు ఉండే అవకాశముందని స్థానికులు అధికారులకు సూచించారు. దీంతో పక్కనున్న భవనాన్ని కొద్ది మేర కూల్చి, సమాంతరంగా గొయ్యి తవ్వారు. డాగ్‌స్క్వాడ్ కూడా అక్కడ ఎవరో ఉన్నట్లుగా సూచించింది. గురువారం అర్ధరాత్రి అనంతరం 2 గంటల సమయంలో మహిళ, చిన్నారి ఏడుపులు వినిపించడంతో.. ఎన్డీఆర్ఎఫ్ బృందం అప్రమత్తమైంది. చిన్నపాటి రంధ్రం చేయగా రేఖ (25) కనిపించింది. అక్కడే ముగ్గురం ఉన్నామని, తమను త్వరగా కాపాడాలని అర్థించింది. అధికారులు మరో మూడు గంటల పాటు శ్రమించి, మెల్లమెల్లగా శిథిలాలను తొలగించి ఆమెతోపాటు కుమారుడు దీపక్ (3)ను ప్రాణాలతో బయటకు తీశారు. అయితే రేఖ భర్త శివ (30) మాత్రం మృతిచెందాడు. అయితే రేఖ వెన్నెముక, కాలు, మోకాలికి తీవ్రగాయాలుకాగా.. దీపక్ ఎడమ కాలు విరగింది, తలకు గాయాలయ్యాయి. వారిని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఓవైపు భర్త మరణించడం, కుమారుడు తీవ్రగాయాలపాలై తనతోపాటు ఆస్పత్రిలో ఉండడంతో రేఖ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. మంత్రి కేటీఆర్‌తో బాధితుల వాగ్వాదం వెలికితీసిన మృతదేహాలను వెంటనే తరలిస్తున్నారని, చనిపోయిన వారు ఎవరో కూడా చూడనివ్వడం లేదని బాధిత కుటుంబాలకు చెందినవారు మంత్రి కె.తారకరామారావుతో వాగ్వాదానికి దిగారు. అయితే మృతదేహాలను తాత్కాలికంగా కాంటినెంటల్ ఆస్పత్రికి తరలిస్తున్నామని, అక్కడ బంధువులకు చూపించాకే పోస్టుమార్టంకు తరలిస్తామని చెప్పడంతో శాంతించారు. రాత్రంతా పర్యవేక్షించిన మంత్రులు: పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు అక్కడే ఉండి భవనం శిథిలాల తొలగింపును పర్యవేక్షించారు. గురువారం రాత్రే ఘటనా స్థలికి వచ్చిన ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని, పద్మారావు, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్య తదితరులు... తీవ్రమైన చలిలో రాత్రంతా అక్కడే ఉన్నారు. శుక్రవారం ఉదయం తల్లి, కొడుకు సురక్షితంగా బయటపడ్డ తరువాత మంత్రులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోవైపు శుక్రవారం ఉదయమే మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహేందర్‌రెడ్డిలు ఘటనా స్థలానికి చేరుకుని... రాత్రి వరకూ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. తరలివచ్చిన వివిధ పార్టీల నేతలు ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని, బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావులు పలువురు టీడీపీ నాయకులతో కలసి వచ్చి బాధిత కుటుంబాలను పరామర్శించారు. అనంతరం వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి బొత్స సత్యనారాయణ, ఆ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేందర్‌రెడ్డి, జీహెచ్ఎంసీ అధ్యక్షుడు సాయినాథ్‌రెడ్డి తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, బాధిత కుటుంబాలను పరామర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నేతలు షబ్బీర్‌అలీ, భిక్షపతియాదవ్, రవికుమార్‌యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి తదితరులు కూడా బాధితులను పరామర్శించినవారిలో ఉన్నారు. బతికుంటే బాగుండు దేవుడా.. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం చిల కలపల్లి గ్రామానికి చెందిన వారంతా కొన్నేళ్ల కింద ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చారు. గచ్చిబౌలి, కూకట్పల్లి, బోరబండ, ఎర్రగడ్డ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న నిర్మాణ పనుల్లో వారు కూలీలుగా పనిచేస్తున్నారు. నానక్‌రామ్‌గూడలో భవనం కూలి తమ గ్రామస్తులు చనిపోయారని తెలుసుకున్న వారంతా శుక్రవారం పెద్ద సంఖ్యలో ప్రమాద స్థలికి వచ్చారు. తమ వారు బతికుంటే బాగుండు దేవుడా అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. రూ.10 లక్షల పరిహారం మృతుల కుటుంబాలను ఆదుకుంటాం: కేటీఆర్ హైదరాబాద్: నానక్‌రామ్‌గూడలో భవనం కుప్పకూలిన ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.లక్ష నష్ట పరిహారం చెల్లిస్తామని మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం ఘటనా స్థలిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. డిప్యూటీ కమిషనర్ వి.వి.మనోహర్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ కృష్ణమోహన్‌లను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బాధ్యులను పట్టుకుంటామన్నారు. ఢిల్లీలో ఉన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని, పద్మారావు, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు ఘటనా స్థలంలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారని తెలిపారు. కూలిపోయిన భవనం పక్కనే ఉన్న రెండు భవనాలు కూడా కొంత వరకు దెబ్బతిన్నాయని.. వాటిని నిపుణులతో పరిశీలన చేయించి, ప్రమాదకరమని తేలితే కూల్చివేస్తామని కేటీఆర్ తెలిపారు. కూలిన ఘటనపై నివేదిక ఇవ్వండి: దత్తాత్రేయ హైదరాబాద్‌లోని నానక్‌రామ్ గూడలో భవనం కూలిన ఘటనపై నివేదిక ఇవ్వాలని కేంద్ర కార్మిక శాఖ ప్రధాన కమిషనర్ అనీల్‌కుమార్ నాయక్‌ను కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఆదేశించారు. ఘటనకు సంబంధించి జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్లతో ఫోన్లో మాట్లాడి అక్కడి పరిస్థితిని సమీ క్షించారు. ప్రమాదంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కార్మికులు మరణించడంతో ఆ రాష్ట్ర కార్మిక మంత్రి లాల్ రాజ్వాడే తో మాట్లాడి మృతుల బంధువులకు విషయం తెలియజేయాలని చెప్పారు. కూలిన ఘటనపై విచారణ జరపండి: సీపీఐ, సీపీఎం డిమాండ్ హైదరాబాద్ లోని నానక్‌రామ్‌గూడలో నిర్మా ణంలో ఉన్న ఏడంతస్తుల భవనం కూలిన ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ, సీపీఎం వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశాయి. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరాయి. బాధ్యులపై కఠిన చర్యలు ‘‘నానక్‌రామ్‌గూడ ఘటనలో బాధ్యులెం తటి వారైనా కఠిన చర్య లు తప్పవు. కూలీలు చనిపోవడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. భవన యజమాని సత్తూసిం గ్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు..’’ - రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి -
రాజధానిలో విషాదం
బతుకు మెరుగుపరుచుకుందామని, వెన్నాడుతున్న సమస్యలను విరగడ చేసుకుం దామని ఆశించి ఉన్న ఊరును వదిలి పొట్ట చేతబట్టుకుని వచ్చిన నిర్మాణ రంగ కూలీలను మృత్యువు కాటేసింది. హైదరాబాద్ నగరంలోని నానక్‌రాంగుడాలో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఉదంతంలో 16మంది అభాగ్యులు మరణించారని వార్తలొచ్చినా 24 గంటలు గడిచాక కూడా మృతులెం దరో నిర్ధారణ కాలేదు. శుక్రవారం రాత్రికి ఆరు మృతదేహాలను వెలికితీశారు. ఇద్దరు సజీవంగా బయటపడ్డారు. ఎక్కడో ఆంధ్రప్రదేశ్‌లో మూలకు విసిరేసిన ట్టుండే విజయనగరం జిల్లా నుంచి ఇంత దూరం వచ్చిన కూలీలకు ఏ విధమైన బతుకు భద్రతా లేదని ఈ ఉదంతం నిరూపించింది. కేవలం 170 గజాల స్థలంలో ఎలాంటి అనుమతీ లేకుండా ఏడంతస్తుల భవనం నిర్మాణమవుతుంటే ప్రభుత్వ శాఖలు, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్‌కు సంబంధించిన విభాగాలు కళ్లు మూసు కున్నాయి. పన్నులు వసూలు చేయడానికి, అధికారాలు చలాయించడానికి ఎక్కడ లేని ఉత్సాహమూ ప్రదర్శించే అధికారులు ఏడాది నుంచి ఈ తంతు నడుస్తున్నా ఏమీ పట్టనట్టు ఉండిపోయారు. వాస్తవానికి అనుమతులు తీసుకున్న నిర్మాణాల విషయంలో సైతం పర్యవేక్షణ ఉంటుంది. నిబంధనలకు అనుగుణంగానే అన్నీ సాగుతున్నాయా అన్న ఆరా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనిఖీలుంటాయి. కానీ నగరంలో గత కొంతకాలంగా చోటుచేసుకున్న ఉదంతాలను గమనిస్తే అవేమీ సక్రమంగా సాగటం లేదని అర్ధమవుతుంది. నిరుడు షేక్‌పేటలో నిర్మాణంలో ఉన్న ఒక భవనం ఒరిగింది. ఫిలింనగర్ సాంస్కృతిక కేంద్రం ఎదుట నిర్మిస్తున్న పోర్టికో కుప్పకూలి ఇద్దరు కూలీలు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఆ మరు సటి నెలలో జూబ్లీహిల్స్‌లో మరో మూడంతస్తుల భవనం కూలింది. ఆ నిర్మాణం నాణ్యత సరిగా లేదని అప్పట్లో అధికారులు చెప్పారు. మాదాపూర్‌లో మరో నిర్మాణం కూలడంతో పలువురు గాయపడ్డారు. కూకట్పల్లి కాలనీలో సైతం ఒక నిర్మాణం కూలి ముగ్గురు కార్మికులు చనిపోయారు. ఈ ఉదంతాలన్నిటా ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియదుగానీ... కఠినంగా వ్యవహరించి ఉంటే పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉండేది కాదని తేటతెల్లమవుతుంది. ఎక్కడో మారుమూల పల్లె టూరులో అయితే వేరు... కానీ రాజధాని నగరం నడిబొడ్డున ఎలాంటి అనుమ తులూ లేకుండా సుదీర్ఘకాలంగా పనులు సాగుతుంటే అధికారులెవరి దృష్టికీ రాలే దని నమ్మగలమా? ఆ నిర్మాణానికి చేర్చి ఆవాసాలున్నాయి. కానీ ఫలితం ఉంటుం దన్న విశ్వాసం లేకపోవడంవల్లే కావొచ్చు... ఎవరూ ఫిర్యాదు చేయడానికి సాహ సించలేదు. ఇలాంటి ఉదంతాలు సామాన్య పౌరులకు ప్రభుత్వ యంత్రాంగంపై ఉండే అపనమ్మకాన్ని చాటిచెబుతాయి. ఏ నిర్మాణమైనా ఉన్నట్టుండి కుప్పకూలి నట్టు కనిపిస్తుందిగానీ అందుకు సంబంధించిన జాడలు పగుళ్లు, బీటల రూపంలో జాగ్రత్తగా గమనిస్తే ముందే కనిపిస్తాయి. ఎప్పటికప్పుడు జరిగే తనిఖీల్లో ఇలాం టివి వెల్లడవుతాయి. నిర్మాణ రంగానికి సంబంధించి నిరంతరం జరిగే పరిశోధనలు ఎన్నో కొత్త అంశాలను వెలుగులోకి తెస్తున్నాయి. ముఖ్యంగా అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్, అమెరికన్ కాంక్రీట్ ఇనిస్టిట్యూట్ వంటివి ఈ పరిశోధనలకు అను గుణంగా తమ తమ బిల్డింగ్ కోడ్లను మార్చుకున్నాయి. బాంబు పేలుళ్ల వంటివి సంభవించినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు ఒక్కసారిగా భవనాలు కుప్ప కూలి పోకుండా చూడటానికి నిర్మాణానికి ఉపయోగించే స్టీల్‌కు సాగే గుణం ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. కాంక్రీట్ నాణ్యతకు సంబంధించి సైతం కొత్త ప్రమా ణాలు వచ్చాయి. కాంక్రీట్‌లో సూదివంటి స్టీల్ మైక్రో ఫైబర్లను కలిపే పద్ధ తిని ప్రవేశపెట్టారు. బాంబు పేలుళ్ల వంటి ఉదంతాల్లో వెనువెంటనే భవనాలకు ఏం కాకుండా ఇది ఉపయోగపడుతుందని చెబుతున్నారు. పౌరుల ప్రాణాలకు విలువ నిచ్చి, నష్టాన్ని కనిష్ట స్థాయిలో ఉంచడం కోసం ఈ మాదిరి పరిశోధనలు నిరంతరం సాగుతున్నాయి. మనదగ్గర కూడా పదిహేనేళ్లక్రితం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భవనాలు కుంగిన ఉదంతాలు చోటుచేసుకున్నప్పుడు ప్రభుత్వానికి హైకోర్టు విలువైన సూచనలు చేసింది. భవన నిర్మాణానికి సంబంధించిన నాణ్యతపై బిల్డర్ నుంచి మాత్రమే కాక ఆర్కిటెక్ట్, స్ట్రక్చరల్ డిజైనర్ తదితరుల నుంచి సైతం గట్టి హామీ తీసు కోవాలని తెలిపింది. అవి ఏమేరకు అమలవుతున్నాయో తెలియదు. ఇప్పుడిప్పుడు భూకంపాలను తట్టుకునే స్థాయిలో నిర్మాణాలు ఉండాలన్న నిబంధనలొస్తున్నాయి. అలాగే అనుకోని ఇబ్బందులు తలెత్తినప్పుడు అగ్నిమాపక సిబ్బంది చర్యలకు వీలుగా భవన నిర్మాణానికి చుట్టూ నిర్దిష్టమైన జాగా వదలాలని, అందులో నివాసం ఉండే వారు అక్కడినుంచి సులభంగా బయటపడటానికి వీలైన మార్గాలుండాలని నిర్దే శిస్తున్నారు. వీటన్నిటి సంగతలా ఉంచి... అసలు ఏ అనుమతులూ లేకుండానే అతి తక్కువ స్థలంలో భారీ భవనం నిర్మించడం అత్యంత దుర్మార్గం. ఇదంటే సొంతానికి నిర్మించుకుంటున్న భవనం కావొచ్చు. కానీ బిల్డర్ ఎవరైనా బహుళ అంతస్తుల నిర్మాణం చేపడుతున్నానని చెప్పి అందరివద్దా భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసి నాణ్యతా ప్రమాణాలను గాలికొదిలేస్తే లక్షలు పోసి సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకున్నవారి గతేమిటి? ఒకచోట డబ్బుకు కక్కుర్తిపడి చూసీ చూడనట్టు ఊరుకున్న అధికారి మరోచోట చిత్తశుద్ధితో వ్యవహరిస్తాడన్న గ్యారెంటీ ఏం లేదు. ఎన్నో నిబంధనలు అమల్లోకొచ్చిన వర్తమానంలో సైతం బిల్డర్ తమను మోసం చేశాడంటూ వస్తున్న ఫిర్యాదులు తక్కువేమీ కాదు. అక్రమ నిర్మా ణాల విషయంలో ఉపేక్ష, అధికారుల చేతివాటం, అడ్డగోలుగా అనుమతులీయడం దేశ మంతటా వ్యాధిలా పెరిగింది. ఏదైనా నిబంధన వచ్చిందంటే అది అమలు చేయ డానికి కాక... పైసలు దండుకోవడానికే ఉపయోగపడుతోంది. తాజా ఉదంతం ప్రభు త్వానికి గుణపాఠం కావాలి. బాధ్యులపై కఠిన చర్యలకు ఉపక్రమించాలి. బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించడంతోపాటు బాధ్యులుగా తేలినవారి నుంచి ఆ మొత్తాన్ని వసూలు చేయాలి. -
ఏపీ ప్రభుత్వం పని కల్పించకే వలసలు: బొత్స
హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పని కల్పించలేని దుస్థితిలో ఉండటం వల్లే ఉత్తర కోస్తా వలసజీవుల బతుకులు ఛిద్ర మయ్యాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బొత్స సత్యనారాయణ విమర్శించారు.నానక్‌రాం గూడలో కుప్పకూలిన ఏడంతస్థుల మేడను ఆయన శుక్రవారం పరిశీలించారు. విజయనగరం జిల్లాకు చెందిన బాధితులను ఆయన ఓదార్చారు. మృతుల కుటుంబాలకు రూ.30 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ‘‘తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ.10 లక్షల నష్ట పరిహారం ప్రకటించింది. ఏపీ అందుకు రెండింతలు ఇవ్వాల్సిన అవసరముంది’’ అన్నారు. ‘‘ఏపీ దుర్భర స్థితిలో ఉండడం వల్లే పని కోసం వెయ్యి కిలోమీటర్ల దూరం వరకు వలస వస్తున్నారు. దీనిపై ఏపీ సీఎం, మంత్రులు ఏం సమాధానం చెబుతార’’ని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి తరపున బాధిత కుటుంబాలకు బొత్స ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అంతకు ముందు ఆయన మంత్రి కేటీఆర్‌ను కలిసి ఘటన వివరాలను తెలుసుకున్నారు. బొత్స వెంట వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మహేందర్‌రెడ్డి, జీహెచ్ఎంసీ అధ్యక్షుడు సాయినాథ్‌రెడ్డి తదితరులున్నారు. -
మృత్యుఘోష
- నగరంలో భవనం కూలిన ఘటనలో ఆరు మృతదేహాలు వెలికితీత - శిథిలాల కింద మరో ఐదుగురు - మృత్యుంజయులుగా బయటపడ్డ తల్లి, బిడ్డ - శుక్రవారం అర్ధరాత్రి తర్వాతా కొనసాగుతున్న సహాయక చర్యలు - రాత్రంతా ఉండి పర్యవేక్షించిన మంత్రులు, ఉన్నతాధికారులు - తమ వారికోసం బంధువుల ఆక్రందనలు - పరారీలో భవన యజమాని సత్తూసింగ్ - మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.లక్ష పరిహారం: కేటీఆర్ - డిప్యూటీ కమిషనర్, టౌన్ ప్లానింగ్ ఏసీపీలపై సస్పెన్షన్ వేటు హైదరాబాద్: కాపాడండి.. కాపాడండి అంటూ ఆర్తనాదాలు.. తమవారు ప్రాణాలతో ఉన్నారో లేదోనన్న ఆవేదనతో బంధువుల రోదనలు.. ఎంత తీసినా తరగని శిథిలాలు.. భవనం శ్లాబ్‌ల మధ్య ముక్కలు ముక్కలుగా బయటపడిన మృతదేహాలు.. తీవ్ర ఉద్వేగం మధ్య సహాయక చర్యలు.. హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో పేకమేడలా కూలిపోయిన భవనం శ్మశానాన్ని తలపించింది. గురువారం రాత్రి నుంచి సహాయక చర్యలు జరుగుతుండగా.. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఆరు మృతదేహాలను వెలికితీశారు. మరో ఐదుగురు శిథిలాల కింద ఉన్నట్లు గుర్తించారు. అదృష్టవశాత్తూ ఓ తల్లీ, ఆమె మూడేళ్ల కుమారుడు ప్రాణాలతో బయటపడ్డారు. మంత్రులు, ఉన్నతాధికారులు అక్కడే ఉండి పర్యవేక్షించినా.. ఇరుకు రోడ్డు, విద్యుత్ తీగల కారణంగా సహాయక చర్యల్లో తీవ్ర జాప్యం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత కూడా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘటన బాధితుల్లో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందినవారే. కొందరు శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు, మరికొందరు ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారు ఉన్నారు. కొనసాగుతున్న సహాయక చర్యలు నానక్‌రామ్‌గూడలో నిర్మాణంలో ఉన్న ఏడు అంతస్తుల భవనం గురువారం రాత్రి 9.10 గంటల సమయంలో కుప్పకూలిన విషయం తెలిసిందే. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, జీహెచ్ఎంసీ, పోలీసు సిబ్బంది గురువారం రాత్రి 10 గంటల నుంచే సహాయక చర్యలు చేపట్టారు. మూడు ప్రొక్లెయినర్లు, పదుల సంఖ్యలో సిబ్బందితో శిథిలాల తొలగింపు చేపట్టారు. శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రేఖ అనే మహిళ, ఆమె కుమారుడు దీపక్ (3)లను ప్రాణాలతో బయటికి తీశారు. తీవ్రంగా గాయపడిన వారిద్దరినీ వెంటనే కాంటి నెంటల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం శుక్రవారం రాత్రి వరకు ఆరు మృత దేహాలను వెలికితీశారు. (‘మృత్యుఘోష’కు సంబంధించిన ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) అంతా ఏపీకి చెందినవారే.. వెలికి తీసిన మృతదేహాలను కోమటిపల్లి వెంకటలక్ష్మి (28), తేనేటి గౌరిశ్రీ (14), తేనేటి పైడమ్మ (35), తేనేటి సాంబయ్య (38), శ్రీకాకుళం జిల్లా హీరా మండలానికి చెందిన దుర్గారావు (22), ఛత్తీస్‌గఢ్‌కు చెందిన శివ (30)గా గుర్తించారు. వీరిలో దుర్గారావు, శివ మినహా మిగతా నలుగురూ ఏపీలోని విజయ నగరం జిల్లా చిలకలపల్లి వారే. ఇక శిథిలాల కింద ఆరుగురు చిక్కుకున్నట్లుగా భావిస్తు న్నారు. వారిలో చిలకలపల్లికే చెందిన కోమటి పల్లి పోలినాయుడు (30), ఎన్.శంకర్ (18), ఇదే జిల్లా సుభద్ర ప్రాంతానికి చెందిన పిరిడి పోలినాయడు (30), పిరిడి నారాయణమ్మ (23), పిరిడి మోహన్ (3) ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన తల్లీ కొడుకులు రేఖ (25), దీపక్ (3) ప్రాణాలతో బయటపడ్డారు. చిలకలపల్లికి చెందిన వారిలో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందినవారుకాగా.. సుభద్ర గ్రామానికి చెందిన ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు. అది అక్రమ నిర్మాణమే నానక్‌రామ్‌గూడ గ్రామ కంఠంలో ఎలాంటి అనుమతులూ లేకుండానే జీ ప్లస్ ఆరు అంతస్తుల ఈ భవనం నిర్మించినట్లు తేలిం ది. భవన యజమాని తుల్జారాం సత్య నారాయణసింగ్ అలియాస్ సత్తూసింగ్ అధి కార టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతుండడం వల్లే ఈ అక్రమ నిర్మాణం వైపు శేరిలింగంపల్లి టౌన్ ప్లానింగ్ అధికారులు కన్నెత్తి కూడా చూడలేదని సమా చారం. కింది స్థాయి సిబ్బంది అక్కడికి వెళ్లినా సత్తూసింగ్ భయపెట్టేవాడని స్థానికులు చెబు తున్నారు. కాగా భవనం కుప్పకూలిన అనం తరం సత్తూ సింగ్ పరారీలో ఉన్నట్లు తెలు స్తోంది. కొంత మంది స్థానికులు అతను శబ రిమల వెళ్లాడని చెబుతుండగా.. మరికొందరు హైదరాబాద్‌లోనే ఉండవచ్చని చెబుతున్నారు. శిథిలాల తొలగింపులో జాప్యం కూలిన భవనం శిథిలాలు తొలగింపులో తీవ్ర జాప్యం జరిగింది. ఇరుకైన రోడ్లు, విద్యుత్ తీగలు ఉండటంతో శిథిలాలను వేగంగా తొలగించడం, టిప్పర్లలో తరలించడం వంటివి ఆలస్యమయ్యాయి. దాంతో గంటల తరబడి సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. భవనం కుప్పకూలిన దాదాపు 8 గంటల తర్వాత ఇద్దరిని ప్రాణాలతో రక్షించగా.. మరో నాలుగు గంటల తర్వాత నాలుగు మృతదేహలను 12 గంటలకు వెలికితీశారు. మంత్రి కేటీఆర్‌తో బాధితుల వాగ్వాదం వెలికితీసిన మృతదేహాలను వెంటనే తరలిస్తున్నారని, చనిపోయిన వారు ఎవరో కూడా చూడనివ్వడం లేదని బాధిత కుటుంబాలకు చెందినవారు మంత్రి కె.తారకరామారావుతో వాగ్వాదానికి దిగారు. అయితే మృతదేహాలను తాత్కాలికంగా కాంటినెంటల్ ఆస్పత్రికి తరలిస్తున్నామని, అక్కడ బంధువులకు చూపించాకే పోస్టుమార్టంకు తరలిస్తామని చెప్పడంతో శాంతించారు. రాత్రంతా పర్యవేక్షించిన మంత్రులు: పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు అక్కడే ఉండి భవనం శిథిలాల తొలగింపును పర్యవేక్షించారు. గురువారం రాత్రే ఘటనా స్థలికి వచ్చిన ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని, పద్మారావు, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్య తదితరులు... తీవ్రమైన చలిలో రాత్రంతా అక్కడే ఉన్నారు. శుక్రవారం ఉదయం తల్లి, కొడుకు సురక్షితంగా బయటపడ్డ తరువాత మంత్రులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోవైపు శుక్రవారం ఉదయమే మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహేందర్‌రెడ్డిలు ఘటనా స్థలానికి చేరుకుని... రాత్రి వరకూ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. తరలివచ్చిన వివిధ పార్టీల నేతలు ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని, బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావులు పలువురు టీడీపీ నాయకులతో కలసి వచ్చి బాధిత కుటుంబాలను పరామర్శించారు. అనంతరం వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి బొత్స సత్యనారాయణ, ఆ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేందర్‌రెడ్డి, జీహెచ్ఎంసీ అధ్యక్షుడు సాయినాథ్‌రెడ్డి తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, బాధిత కుటుంబాలను పరామర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నేతలు షబ్బీర్‌అలీ, భిక్షపతియాదవ్, రవికుమార్‌యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి తదితరులు కూడా బాధితులను పరామర్శించినవారిలో ఉన్నారు. బతికుంటే బాగుండు దేవుడా.. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం చిల కలపల్లి గ్రామానికి చెందిన వారంతా కొన్నేళ్ల కింద ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చారు. గచ్చిబౌలి, కూకట్పల్లి, బోరబండ, ఎర్రగడ్డ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న నిర్మాణ పనుల్లో వారు కూలీలుగా పనిచేస్తున్నారు. నానక్‌రామ్‌గూడలో భవనం కూలి తమ గ్రామస్తులు చనిపోయారని తెలుసుకున్న వారంతా శుక్రవారం పెద్ద సంఖ్యలో ప్రమాద స్థలికి వచ్చారు. తమ వారు బతికుంటే బాగుండు దేవుడా అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. రూ.10 లక్షల పరిహారం మృతుల కుటుంబాలను ఆదుకుంటాం: కేటీఆర్ హైదరాబాద్: నానక్‌రామ్‌గూడలో భవనం కుప్పకూలిన ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.లక్ష నష్ట పరిహారం చెల్లిస్తామని మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం ఘటనా స్థలిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. డిప్యూటీ కమిషనర్ వి.వి.మనోహర్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ కృష్ణమోహన్‌లను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బాధ్యులను పట్టుకుంటామన్నారు. ఢిల్లీలో ఉన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని, పద్మారావు, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు ఘటనా స్థలంలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారని తెలిపారు. కూలిపోయిన భవనం పక్కనే ఉన్న రెండు భవనాలు కూడా కొంత వరకు దెబ్బతిన్నాయని.. వాటిని నిపుణులతో పరిశీలన చేయించి, ప్రమాదకరమని తేలితే కూల్చివేస్తామని కేటీఆర్ తెలిపారు. కూలిన ఘటనపై నివేదిక ఇవ్వండి: దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని నానక్‌రామ్ గూడలో భవనం కూలిన ఘటనపై నివేదిక ఇవ్వాలని కేంద్ర కార్మిక శాఖ ప్రధాన కమిషనర్ అనీల్‌కుమార్ నాయక్‌ను కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఆదేశించారు. ఘటనకు సంబంధించి జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్లతో ఫోన్లో మాట్లాడి అక్కడి పరిస్థితిని సమీ క్షించారు. ప్రమాదంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కార్మికులు మరణించడంతో ఆ రాష్ట్ర కార్మిక మంత్రి లాల్ రాజ్వాడే తో మాట్లాడి మృతుల బంధువులకు విష యం తెలియజేయాలని చెప్పారు. కూలిన ఘటనపై విచారణ జరపండి: సీపీఐ, సీపీఎం డిమాండ్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ లోని నానక్‌రామ్‌గూడలో నిర్మా ణంలో ఉన్న ఏడంతస్తుల భవనం కూలిన ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ, సీపీఎం వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశాయి. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరాయి. బాధ్యులపై కఠిన చర్యలు ‘‘నానక్‌రామ్‌గూడ ఘటనలో బాధ్యులెం తటి వారైనా కఠిన చర్య లు తప్పవు. కూలీలు చనిపోవడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. భవన యజమాని సత్తూసిం గ్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు..’’ - రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి స్పందించకపోవడం వల్లే.. ‘‘ప్రభుత్వం సరైన సమయంలో స్పందించకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగింది. మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ కొనసాగుతున్న తరుణంలోనే అధికారులు అక్రమ నిర్మాణాలకు ఊతమివ్వడం గమ నార్హం. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి..’ - భిక్షపతియాదవ్,శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే రాత్రి ఫోన్ చేశా.. ‘‘మా ఆడపడుచు వెంకటలక్ష్మి గురువారం రాత్రి 8.30 గంటలకు నాకు ఫోన్ చేసింది. జ్వరంగా ఉందని ఆస్పత్రికి వెళ్లేందుకు డబ్బులు కావాలని అడిగింది. ఉదయమే డబ్బులు ఇస్తానని చెప్పాను. 9 గంటల తరువాత మళ్లీ ఫోన్ చేస్తే ఎవరూ ఎత్తలేదు. టీవీల్లో చూస్తే.. మావాళ్లు ఉండే ఇల్లే కూలిపోయిందని తెలిసింది..’’ - లక్ష్మి, సిద్దిఖీనగర్ -
మంత్రి పదవికి కేటీఆర్ రాజీనామా చేయాలి
హైదరాబాద్: నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నామని ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే ప్రభుత్వం ప్రచారాలకే పరిమితమైందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. నానక్ రాంగూడలో నిన్న రాత్రి కుప్పకూలిన భవనాన్ని శుక్రవారం షబ్బీర్ అలీతో కలిసి పరిశీలించిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నానక్‌రాంగూడ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ.. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నానక్‌రామ్‌గూడలో ఏడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య ఐదుకు చేరుకుంది. -
మంత్రి కుటుంబసభ్యులైనా అరెస్టు చేస్తాం: కేటీఆర్
నానక్‌రాంగూడ ప్రాంతంలో కుప్పకూలిన భవన యజమాని ఒక మంత్రికి దగ్గర అన్నట్లుగా కొన్ని కథనాలు వచ్చాయని.. ఈ ఘటనలో నిందితులు స్వయానా మంత్రి కుటుంబ సభ్యులైనా కూడా వదిలేది లేదని, అరెస్టు చేసి తీరుతామని తెలంగాణ మునిసిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. భవనం కూలిన స్థలానికి వచ్చి సహాయ పనులను పర్యవేక్షించిన ఆయన.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, క్షతగాత్రులకు 1 లక్ష చొప్పున పరిహారాన్ని ప్రభుత్వం తరఫున ఇవ్వనున్నట్లు తెలిపారు. స్థానిక డిప్యూటీ కమిషనర్‌ను, ఏసీపీని తక్షణం విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నామని, వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్‌కు సూచించామని అన్నారు. తాను సాయంత్రం వరకు ఇక్కడే ఉండి సహాయ చర్యలు పర్యవేక్షిస్తానన్నారు. ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా, బిల్డర్ల దురాశ కారణంగా ఇలా జరుగుతోందని, కనీస విద్యార్హతలు లేకపోయినా ఎవరైనా కూడా బిల్డర్లుగా అయిపోవచ్చని ఆయన అన్నారు. దురాశ కారణంగా చిన్న స్థలంలోనే ఇంత పెద్ద భవనం కట్టారని, అందులోనూ నాణ్యత లేకపోవడంతో అది కుప్పకూలిందని చెప్పారు. భవన యజమాని ప్రస్తుతం పరారీలో ఉన్నారని, సెల్ స్విచాఫ్ చేసి ఉందంటున్నారని, మరికొందరు శబరిమల వెళ్లారంటున్నారని.. ఎలాగైనా ఆయనను అరెస్టు చేసి తీరుతామని స్పష్టం చేశారు. సత్యనారాయణ సింగ్ కుటుంబసభ్యులలో ఒకరిని అదుపులోకి తీసుకున్నాని చెప్పారు. టౌన్ ప్లానింగ్ సిబ్బంది ముందే నిర్మాణాలను అడ్డుకుని ఉంటే ప్రమాదం సంభవించేది కాదని అన్నారు. ఫిల్మ్ నగర్ క్లబ్‌ను తిరిగి తెరవడానికి కూడా తాము అనుమతి ఇవ్వలేదని, వాళ్లు కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నారని.. జీహెచ్ఎంసీ వైపు నుంచి ఎవరినీ ఉపేక్షించలేదని స్పష్టం చేశారు. నానక్‌రాంగూడ అనేది గ్రామపంచాయతీ అని, పైగా ఈ స్థలం గ్రామకంఠని.. ఇలాంటి నిర్మాణాలను నియంత్రించాలంటే ప్రభుత్వం, జీహెచ్ఎంసీ మరింత క్రియాశీలంగా వ్యవహరించాలని చెప్పారు. ఈ ఘటన జరగకముందే, మొన్నటినుంచి హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఒక డ్రైవ్ నడుస్తోందని, అధికారులు మొత్తం 12 బృందాలుగా ఏర్పడి అక్రమ నిర్మాణాలు, లే అవుట్లను కూల్చివేసే చర్యలు మొదలయ్యాయని తెలిపారు. ఇన్ని చర్యలు తీసుకుంటున్నా ఇంకా ఇలా జరగడం దురదృష్టకరం, బాధాకరమని, ప్రభుత్వం పక్షాన పూర్తి పునరావాస చర్యలు తీసుకుంటాం, పరిహారం ఇస్తామని అన్నారు. ప్రజలు కూడా దీనికి సహకరించాలని కోరారు. -
కుప్ప కూలిన బిల్డింగ్: మహిళ మృతి
-
బెంగళూరులో కుప్పకూలిన భవనం
- ముగ్గురు మృతి, ఆరుగురికి గాయాలు - నాసిరకం నిర్మాణ సామగ్రి వాడటం వల్లే! సాక్షి, బెంగళూరు/ కేఆర్ పురం: కర్ణాటక రాజధాని బెంగళూరులో నిర్మాణంలో ఉన్న ఒక భవనం కుప్పకూలి ముగ్గురు మరణించారు. మహదేవపుర నియోజకవర్గం బెలందూరు గేట్ వద్ద 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ+3 రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వినయ్‌కుమార్ దేంగుల, మరో ఐదుగురు బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) నుంచి అనుమతి పొందారు. నగరానికి చెందిన ఆర్కే అసోసియేట్స్‌కు నిర్మాణబాధ్యతలు అప్పగించారు. నిర్మా ణం చివరి దశలో ఉన్న ఈ భవనం బుధవారం సాయంత్రం ఎడమ వైపునకు కూలి పోయింది. దీంతో శిథిలాలు పడి పక్కనే మరోభవనంలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్న ఒడిశా యువకుడు అశోక్‌కుమార్ (25) ఘటనాస్థలంలోనే మరణించగా మరో 10 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రాత్రి ఎనిమిది గంటలకు శిథిలాల కింద మరొక మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. శిథిలాల కింద ఉన్న వారిలో ఏడుగురిని రక్షించి.. స్థానిక సక్రా ఆసుపత్రికి తరలిం చగా అక్కడ చికిత్స పొందుతూ రాంబాబు(18) అనే యువ కుడు మృతి చెందా డు. నిర్మాణంలో నాసిరకం సిమెంటు, ఇటుకలు, ఇసుక వాడటమే ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన బెంగళూరు నగరాభివృద్ధి శాఖ మంత్రి కేజే జార్జ్ బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. గాయపడిన వారికి ప్రభుత్వ ఖర్చుతో ఉత్తమ చికిత్స అందిస్తామని తెలిపారు. భవన యాజమాన్య హక్కులు కలిగిన డీ వినయ్‌కుమార్‌తో సహా ఆరుగురిపైన, ఆర్కే అసోసియేట్స్‌కు చెందిన ఇంజనీర్లపైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నట్లు బీబీఎంపీ క మిషనర్ మంజునాథ్ ప్రసాద్ తెలిపారు. -
పాతబస్తీలో కూలిన పెంకుటిల్లు
-
పాతబస్తీలో కూలిన పెంకుటిల్లు
హైదరాబాద్: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరంలో పురాతన భవనాలు ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయి. పాతబస్తీ మాదన్నపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని రెయిన్ బజార్లో సుమారు 80 ఏళ్ల పురాతన పెంకుటిల్లు గురువారం మధ్యాహ్నం కూలింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవండంతో పెను ప్రమాదం తప్పింది. భారీగా కురుస్తన్న వర్షాలకు బాగా నాని కూలి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. -
కుప్పకూలిన భవనం : పలువురికి గాయాలు.
-
కుప్పకూలిన భవనం : పలువురికి గాయాలు
హైదరాబాద్ : నగరంలో వరుస భవన ప్రమాదాలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఒక వైపు నగరంలో భారీ వర్షాలకు పురాతన భవనాలు, గోడలు కూలడంతో పలువురు మృతిచెందడంతో పాటు నిర్మాణంలో ఉన్న భవనాలు పీకమెడల్లా కుప్పకూలుతున్నాయి. జూబ్లీహిల్స్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌కు చెందిన భవనం కూలిన దుర్ఘటన మరువక ముందే మరోసారి అదే ప్రాంతంలో మరో భవనం కుప్పకూలింది. ఈ ఘటన జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 33లో శనివారం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడే పని చేస్తున్న 8 మంది కూలీలకు గాయాలయ్యాయి. రెండో అంతస్తు శ్లాబ్ నిర్మిస్తుండగా ప్రమాదం సంభవించింది. ఇది గుర్తించిన పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. భవన నిర్మాణంలో లోపాల కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. -
కుప్పకూలిన భవనం : పలువురికి గాయాలు
-
ఛత్తర్‌పూర్‌లో కూలిన భవనం: ఇద్దరు మృతి
-
కుప్పకూలిన భవనం : నలుగురికి గాయాలు
-
కుప్పకూలిన భవనం : నలుగురికి గాయాలు
హైదరాబాద్: మాదాపూర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక కాకతీయ హిల్స్‌లో నిర్మాణంలో ఉన్న నూతన భవనం పిల్లర్ ఒక్కసారిగా కుప్పకూలింది. అదే సమయంలో అక్కడ పని చేస్తున్న నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి కల కారణాలతో పాటు క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది. -
దేశవ్యాప్తంగా వర్ష విలయం...
-
దేశవ్యాప్తంగా వర్ష విలయం
* ముంబైలో భవనం కూలి 9 మంది దుర్మరణం * ముంబైలో నెలరోజుల్లో 925 మి.మి. వర్షపాతం ముంబై: దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆదివారం కూడా భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముంబైతో పాటు చుట్టుపక్కల జిల్లాలైన థానే, పాల్ఘర్ జిల్లాల పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. సామాన్య జన జీవనం అస్తవ్యస్తమైంది. ముంబై శివారులోని భివండీలో భారీ వర్షాలకు భవంతి కుప్పకూలి 9 మంది మరణించగా, 22 మంది గాయపడ్డారు. మృతుల్లో నలుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ రెండతస్తుల భవంతిలో ఏడెనిమిది కుటుంబాలు నివసిస్తున్నాయని, ఉదయం 9.30 గంటలకు భవనం కూలిపోయిందని భివండీ తహసీల్దార్ వైశాలి లాంబేట్ తెలిపారు. థానేలో ఘోడ్‌బందర్ రోడ్డులో మురుగు కాల్వ పొంగడంతో 12 మంది చిక్కుకుపోయారు. విపత్తు నిర్వహణ సిబ్బంది వారిని రక్షించారు. థానేలో ఆదివారం సాయంత్రం వరకూ 175 మి.మి. వర్షపాతం నమోదైందని విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. ముంబైలో జూలై నెల సరాసరి వర్షపాతం 799.7 మి.మీ.లు కాగా, ఈసారి 925.6 మి.మీ.లు నమోదైంది. నాసిక్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షపాతం నమోదైంది. 24 గంటల వ్యవధిలో నాసిక్‌లో 158.4 మి.మీ. వర్షం కురిసింది. సోమవారం కూడా ముంబైలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బిహార్, అస్సాంలో మారని వరద దుస్థితి బిహార్, అస్సాంలో వరద ఉధృతి కొనసాగుతోంది. బిహార్‌లో 12 జిల్లాలో మొత్తం 27.5 లక్షల మంది వరద బారిన పడ్డారు. 8 లక్షలకు పైగా ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అస్సాంలోని 28 జిల్లాల్లో 37 లక్షల మంది వరద ముంపులో చిక్కుకున్నారు. ఇంతవరకూ 31 మంది మరణించారు. నేమాటిఘాట్, గోల్పారా, ధుబ్రి పట్టణాల సమీపంలో బ్రహ్మపుత్ర నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. ఒడిశాలో పిడుగుపాటుకు మృతి చెందిన వారి సంఖ్య ఆదివారానికి 41కి చేరింది. బంగాళాఖాతంలో అల్పపీడనంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు గాలులు వీయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఆదివారం కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. గంగ, శారదా నదులు పలుచోట్ల ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగలో భారీ వర్షాలకు కొండచరియలు పడడంతో ఐదుగురు యాత్రికులు గాయపడ్డారు. చార్ధామ్ యాత్ర మా ర్గంతో పాటు పలు రోడ్లు మూతబడ్డాయి. -
శిథిలాల కింద ఆరుగురు సమాధి
-
కడపలో భవనం కూలి ఐదుగురు మృతి
-
కూలిన భవనం: ఐదుగురు మృతి
-
కూలిన భవనం: ఐదుగురు మృతి
మైదుకూరు : వైఎస్ఆర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు పాత భవనం కూలి ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు. మైదుకూరు మండలం ఉచ్చలవరం గ్రామానికి చెందిన అప్పన్నపల్లి చిన్న గురప్ప కుటుంబం ఇంట్లో నిద్రిస్తుండగా మంగళవారం వేకువజామున ఇల్లు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ సంఘటనలో చిన్నగురప్పతో పాటు ఆయన భార్య పెంచలమ్మ, కుమార్తె లలితతో పాటు యశ్వంత్, నవనీత్ అనే చిన్నారులు మృత్యువాతపడ్డారు. హరిత అనే మహిళతోపాటు మరో చిన్నారి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నానిన పాత భవనం ఒక్కసారిగా కూలిపోయింది. చిన్నగురప్ప కుటుంబంలోని ఐదుగురు మృత్యువాతపడడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. భవనం కూలిన విషయం గమనించిన స్థానికులు శిథిలాలను తొలగించి గాయపడిన ఇద్దరిని ఆస్పత్రిలో చేర్చారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
భవంతి కూలిపోయి ఘోర ప్రమాదం
-
ఫిల్మ్‌నగర్ ఘటనపై కేటీఆర్ గరంగరం
హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్ ఫిల్మ్‌నగర్‌లో ఓ అక్రమ నిర్మాణం కుప్పకూలిన ఘటనపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారి పై సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్, ఇంజినీర్, కాంట్రాక్టర్ పై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్(ఎఫ్ఎన్సీసీ)లో అనుమతి లేకుండా నిర్మిస్తున్న పోర్టికో పిల్లర్లతోపాటు ఆదివారం ఒక్కసారిగా పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు మృత్యువాతపడగా.. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. స్వల్ప వ్యవధిలో బీమ్స్, శ్లాబ్ వేయడం, పిల్లర్లు నాసిరకంగా ఉండటమే ఈ దుర్ఘటనకు కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించిన విషయం తెలిసిందే. -
భవంతి కూలిపోయి ఘోర ప్రమాదం
∙ఫిలింనగర్‌క్లబ్ ఘటనలో ఇద్దరు మృతి ∙మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరం సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ కాంట్రాక్టర్ వద్ద పనిలో చేరిన 18 మంది కూలీలు అంతా పొరుగు రాష్ట్రాలకు చెందిన వాళ్లే. కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఏపీ రాష్ట్రాల నుంచి నగరానికి వలస వచ్చారు. మియాపూర్, ఖైరతాబాద్ చింతల్‌బస్తీల్లో అద్దెకుంటున్నారు. ఎప్పటిలాగే శనివారం ఉదయం 8.30 గంటలకు ఫిలింనగర్ క్లబ్ పోర్టికో నిర్మాణ పనుల్లో చేరారు. శనివారం రాత్రి ఇంటికి చేరకుండా పనుల్లో మునిగిపోయారు.పోర్టికో పని పూర్తయితే ఇంటికి వెళ్లిపోవచ్చుననుకున్నారు. కొందరు కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌లోని సొంత ఊళ్లకు వెళ్లాలనుకున్నారు. కానీ క్షణాల్లో ప్రమాదం జరిగింది. అంతా పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ఒక్కసారిగా పోర్టికో పిల్లర్లు కూలిపోయాయి. దాంతో శ్లాబ్ నేలమట్టమైంది. శ్లాబ్‌పైనే పని చేస్తున్న 10 మంది కూలీల్లో రాయచూరుకు చెందిన మాన్‌శేష్ అలియాస్ ఆనంద్(38), కోల్‌కతాకు చెందిన అనిసూర్ షేక్(40) అక్కడిక్కడే మృతి చెందారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన శ్రీనివాస్(29), కర్ణాటకకు చెందిన శివ(31) తీవ్రం గా గాయపడ్డారు. శ్రీనివాస్‌కు దవడ ఎముకలు విరిగాయి. శివకు తలకు బలమైన గాయాలయ్యాయి. స్వల్పంగా గాయపడ్డ కర్ణాటకకు చెందిన మల్లేశం,సీతారాం, బీరప్ప,పశ్చిమబెంగాల్‌కు చెందిన అజిత్ బిశ్వాస్,సాహెబ్‌మండల్, ప్రకా శం జిల్లాకు చెందిన కోటేశ్వర్రావుకు చికిత్స చేసి ఇంటికి పంపించారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్, శివలను అపోలో ఆస్పత్రికి తరలించి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు. శివకు తల పగలడంతో పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
ఫిల్మ్ నగర్ ప్రమాదంపై సి కళ్యాణ్ స్పందన
-
ఫిల్మ్ నగర్ ప్రమాదంపై సి కళ్యాణ్ స్పందన
హైదరాబాద్: ఫిల్మ్‌నగర్ కల్చరల్ క్లబ్లో నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఇద్దరు కూలీలు మృతి చెందిన ఘటనపై నిర్మాత సి. కళ్యాణ్ స్పందించారు. అసలు కల్చరల్ క్లబ్లో నిర్మిస్తున్నది భవనం కాదని, అది కేవలం పోర్టికో అని ఆయన వెల్లడించారు. ప్రమాదానికి క్లబ్ సభ్యులంతా బాధ్యత వహిస్తారని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ప్రమాదస్థలిని జీహెచ్ఎంసీ క్లూస్ టీం పరిశీలించింది. నిర్మాణంలో ఉపయోగించిన కాంక్రీట్, ఇసుకను సేకరించింది. బిల్డింగ్ కూలిన ప్రాంతాన్ని కేంద్రమంత్రి దత్తాత్రేయ పరిశీలించారు. కార్మిక శాఖ ద్వారా బాధితులను ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రమాదంపై ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. నగరంలో విపత్తులు ఎదురైతే ఎదుర్కోవడానికి సరైన సిబ్బంది లేరని, ఈ విషయంపై గతంలోనే ప్రభుత్వానికి లేఖ రాశామని ఆయన తెలిపారు. పేద కూలీలను ఆదుకోవాని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క కోరారు. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఫిలింనగర్లో కూలిన భవనం
-
కూలిన భవనం: నలుగురి మృతి
కోల్‌కతా : పశ్చిమ బెంగాలు డార్జిలింగ్‌లో శనివారం ఓ భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, మున్సిపల్ అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని... సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద నుంచి నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. ఈ ఘటనలో పలువురు గల్లంతైనట్లు సమాచారం. శిథిలాల కింద మరింత మంది ఉండవచ్చని అధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అందులోభాగంగా సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. -
ఏడుగురు సజీవ సమాధి
- ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో విషాదం - భవనం పునాది తీస్తుండగా కూలిన మట్టిపెళ్లలు, గోడ - వేసవి సెలవుల్లో ఉపాధి కోసం వచ్చిన విద్యార్థులు, యువకుల మృత్యువాత.. - నాలుగు మృతదేహాల వెలికితీత మట్టిపెళ్లల కింద మరో ముగ్గురు? - కొన ఊపిరితో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఒకరు - అధికార పార్టీనేత చుక్కపల్లి రమేశ్ నిర్వాకంతో ప్రమాదం - ఆగ్రహంతో మంత్రి రావెల కారుపై బాధితుల బంధువుల దాడి సాక్షి, గుంటూరు: వారు పదో తరగతి, డిగ్రీ చదువుతున్న విద్యార్థులు, యువకులే. అంతా నిరుపేద కుటుంబాలకు చెందినవారే. వేసవి సెలవులో కావడంతో నాలుగు రూకలు సంపాదించుకోవడం కోసం భవన నిర్మాణ పనుల్లోకి దిగారు. అధికార పార్టీకి చెందిన డెవలపర్ నిర్లక్ష్యం వల్ల ఏడుగురు సజీవ సమాధి అయ్యారు. హృదయ విదారకరమైన ఈ సంఘటన గుంటూరులో శనివారం చోటుచేసుకుంది. డెవలపర్ ధనదాహం ఏడుగురి ప్రాణాలను బలితీసుకుందని బాధితుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరులోని లక్ష్మీపురం ప్రధాన రహదారిలో జరుగుతున్న నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో భవన పునాదుల కింద ఏడుగురు సజీవ సమాధి అయ్యారు. గుంటూరులోని డాక్టర్ సుబ్బారావుకు చెందిన స్థలంలో వాణిజ్య సముదాయం నిర్మించేందుకు అధికార టీడీపీ నేతలు చుక్కపల్లి రమేశ్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నారు. గత మూడు నెలలుగా నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడుకు చెందిన యువకులు, విద్యార్థులు వేసవి సెలవులు కావడంతో నగరానికి చెందిన రాము అనే కాంట్రాక్టర్ ద్వారా పనుల్లోకి వచ్చారు. శనివారం సెల్లార్ నిర్మాణం పనులను తాము చేయలేమని, చుట్టూ పది అడుగుల స్థలం వదలకుండా సెల్లార్ నిర్మాణం చేపట్టారని, అదేవిధంగా రక్షణగా ఫెన్సింగ్ నిర్మాణం చేయలేదంటూ వారు పనులు నిలిపివేశారు. దీంతో పనులు త్వరగా పూర్తి కావాలని, డబ్బు ఎక్కువ ఇస్తామని బిల్డర్ ఆశ చూపడంతోపాటు ఒత్తిడి చేశారు. దీంతో చేసేది లేక 30 అడుగుల లోతులో కాంక్రీట్ దిమ్మెలను నిర్మించేందుకు కూలీలు సన్నద్ధమయ్యారు. ఈ సమయంలో ప్రశాంత్ అనే కార్మికుడిపై తొలుత మట్టిపెళ్లలు విరిగి పడగా, మిగతా వారు అతడిని రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే భారీగా మట్టిపెళ్లలు, పక్కనే ఉన్న గోడ కూలడంతో మిగిలిన వారు సైతం అందులో చిక్కుకుపోయారు. పోలీసులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాల నుంచి మొదట తురకా శేషుబాబు(21) మృతదేహం బయటపడింది. తర్వాత బయటపడిన వాసిమల్ల మరియదాసు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అనంతరం బూసి సలోమన్(21), బత్తుల సునీల్(19)తోపాటు మరో యువకుడి మృతదేహం బయటపడ్డాయి. శిథిలాల కింద ఇంకా ముగ్గురు ఉన్నట్లు తెలుస్తోంది. వారు చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఎప్పుడో జరిగితే ఇప్పుడొస్తారా? ప్రమాదం గురించి తెలియగానే బాధితుల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. తొలుత వీరిని పోలీసులు, చుక్కపల్లి రమేశ్ అనుచరులు లోపలికి అనుమతించలేదు. దీంతో వారు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ప్రమాదానికి గురైన వారు ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పెదగొట్టిపాడు గ్రామస్తులు కావడంతో మంత్రి రావెల కిషోర్‌బాబు వారిని పరామర్శించేందుకు సంఘటనా స్థలానికి వచ్చారు. ఎప్పుడో ప్రమాదం జరిగితే ఇప్పుడా వచ్చేది అంటూ బాధితుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కారుపై దాడికి దిగారు. అడ్డుకున్న పోలీసులతో ఘర్షణకు దిగారు. దీంతో చేసేది లేక మంత్రి రావెల కారు దిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మట్టి శిథిలాల కింద మరణించిన మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరి రూ.5.20 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ప్రకటించారు. శనివారం రాత్రి 11 గంటల తరువాత కూడా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మృతదేహాలను బయటకు తీసుకెళ్లేందుకు యత్నించగా, బంధువులు, ప్రజాసంఘాల నాయకులు అడ్డుకుని ధర్నాకు దిగారు. దీంతో సంఘటనా స్థలంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. స్పీకర్ కోడెల శివప్రసాదరావు వైఎస్సార్ సీపీ నేత రావి వెంకటరమణ తదితరులుబాధితుల కుటుంబ సభ్యులున పరామర్శించారు. ప్రమాదంపై విచారణ జరిపిస్తామని, కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని కోడెల చెప్పారు. సిటీప్లానర్ పై దాడి: ఘటనాస్థలికి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్.నాగలక్ష్మీ, సిటీ ప్లానర్ ధనుంజయరెడ్డి, ఇతర అధికారులు చేరుకోగా.. వారిపై మృతుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల బంధువులు దాడి చేయడంతో సిటీప్లానర్ ధనుంజయరెడ్డికి గాయాలయ్యాయి. -
హా! చూస్తుండగానే.. కుప్పకూలింది!!
అది రెండు అంతస్తుల భవనం. నిన్నమొన్నటిదాక దానిని హోటల్‌గా వినియోగించారు. కానీ, తాజాగా కూలగొట్టాలని నిర్ణయించినట్టు కనిపిస్తుంది. కొంతమేరకు కూలగొట్టారు కూడా. జేసీబీ పక్కనే ఉంది. కొంతమంది జనం ఆ భవనం సమీపంలో తచ్చాడుతూనే ఉన్నారు. ఇంతలో ఎవరూ ఊహించనివిధంగా ఈ రెండంతస్తుల బంగ్లా కూలికుప్పలైంది. క్షణాల్లో భవనం నేలకూలి శిథిలాల కుప్పగా మారింది. అనూహ్యరీతిలో రెప్పపాటులో భవనం కూలి.. దుమ్ము రేగింది. ఇలా కూలుతుందని దానికి చేరువగా ఉన్నవారు అనుకొని ఉండరు. ఒక్కసారి పెళపెళరావాలు చేస్తూ అది కూలడంతో అక్కడున్న వారు భయంతో కేకలు పెడుతూ పరిగెత్తారు. జాగ్రత్తగా ఉండటం వల్ల అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో మంగళవారం ఈ ఘటన జరిగింది. రెండతస్తుల ఓ హోటల్ భవనం చూస్తుండగానే నాటకీయరీతిలో కూలి శిథిలాలుగా మారింది. ఈ వీడియో ఆన్లైన్లో ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నది. -
ముంబైలో భవనం కూలి ఆరుగురు మృతి
ముంబై: నగరంలో ఓ మూడంతస్తుల భవనం కూలి ఆరుగురు దుర్మరణం చెందారు. కమతిపూర ప్రాంతంలోని గ్రాంట్ రోడ్డులో శనివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. శిథిలాల కింద పలువురు చిక్కుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇద్దరిని చికిత్స నిమిత్తం జేజే, నాయర్ ఆసుపత్రులకు తరలించినట్లు బీఎంసీ డిజాస్టర్ కంట్రోల్ రూమ్ అధికారులు తెలిపారు. రక్షణ చర్యల కోసం ఎనిమిది ఫైర్ ఇంజన్లతో పాటు మూడు అంబులెన్సులను రంగంలోకి దింపినట్లు అధికారులు తెలిపారు. -
కూలిన భవనం : 17 మంది మృతి
బీజింగ్ : మధ్య చైనా హినాన్ ప్రావిన్స్‌లో రెండంతస్తుల భవనం కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో 17 మంది మరణించారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మున్సిపల్, అగ్నిమాపక, పోలీసు ఉన్నతాధికారులు... సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. శిథిలాల కింద చిక్కుకుని ఉన్న దాదాపు 40 మంది పనివారిని రక్షించారు. ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 1990 నాటి భవనానికి మరమత్తులు చేస్తుండగా ఒక్కసారిగా కూలిందని ఉన్నతాధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని వారు చెప్పారు. ఈ ప్రమాదం శుక్రవారం జరిగింది. -
కుప్పకూలిన హాస్టల్ భవనం : విద్యార్థులు సురక్షితం
కాకినాడ : కాకినాడ నగరం సాంబమూర్తినగర్లోని ప్రభుత్వ బధిరుల పాఠశాలలోని హాస్టల్ భవనం కుప్పకూలింది. అయితే భవనంలోని 46 మంది విద్యార్థులు సురక్షితంగా ఉన్నారు. విద్యార్థులు స్నానాలు చేస్తున్న సమయంలో భవనం కూలడంలో పెద్ద ప్రమాదం తప్పింది. హాస్టల్ భవనం ఆదివారం ఉదయం 6.00 గంటల సమయంలో కూలిందని స్థానికులు చెబుతున్నారు. కాగా ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. -
థానేలో భవనం కూలి ఆరుగురు మృతి
-
థానేలో భవనం కూలి 11మంది మృతి
థానే: మహారాష్ట్రలో మూడు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో 11మంది మృతిచెందగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి. థానే జిల్లాలోని బీ క్యాబిన్ ప్రాంతంలోని నౌపాడలో మూడు అంతస్తుల భవనం మంగళవారం తెల్లవారుజామున 2.45 సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్స్, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిధిలాల్లో చిక్కుకున్న 15మందిని ఇప్పటివరకు రక్షించినట్టు తెలిసింది. గత మంళవారం థానే జిల్లాలోని థాకూర్లిలో 'మాతృఛాయ' పేరుతో గల రెండు అంతస్తుల భవనం కూలిన సంఘటనలో ఆరుగురు మృతిచెందిని విషయం తెలిసిందే. శిథిలావస్థకు చేరుకున్న భవనాలు, ఇటీవల కురిసిన భారీవర్షాల ప్రభావం వల్లే కూలిపోయాయని నిపుణులు చెబుతున్నారు. -
శిథిలాల కింద చిక్కుకున్న యువతి
న్యూఢిల్లీ: ఢిల్లీలో నాలుగు అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 5కు పెరిగింది. వీరిలో నలుగురు మహిళలు ఉన్నారు. ఈ శిథిలాల కింద ఓ యువతి, యజమాని చిక్కుకుపోయారు. శనివారం రాత్రి పశ్చిమ విష్ణు గార్డెన్ ఏరియాలో భవనం కుప్పకూలింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి కొంత మందిని రక్షించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాగా శిథిలాల కింద మరికొంతమంది ఉంటారని భావిస్తున్నట్టు పశ్చిమ ఢిల్లీ డీసీపీ పుష్పేంద్ర కుమార్ చెప్పారు. ప్రమాద స్థలానికి వెళ్లే మార్గం ఇరుకుగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. -
చైనాలో కుప్పకూలిన భారీ భవనం
బీజింగ్: చైనా ఓ భారీ భవన సముదాయం కూలిపోయి 21 మంది ఆచూకీ తెలియడం లేదు. వారంతా శిథిలాల కింద ప్రాణాలతో ఉన్నారా లేరా అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదు. గిజౌ ప్రావిన్స్ రాజధాని ప్రాంతమైన గియాంగ్లో ఓ తొమ్మిది అంతస్తుల భవనం బుధవారం ఉదయం 11.30గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. మొత్తం 114 మంది ఇందులో నివాసం ఉంటుండగా వారిలో 21 మంది జాడ తెలియడంలేదని ప్రభుత్వాధికారులు తెలిపారు. భారీ వర్షం కురుస్తున్న కారణంగానే భవనం కూలిపోయిందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇదిలా ఉండగా, ఈ భవనం గ్రౌండ్ ప్లోర్లో ఉంటున్న వ్యక్తిని సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. -
కూలీన భవనం : ఆరుగురు మృతి
ఇస్లామాబాద్: సౌదీ అరేబియాలో నిర్మాణంలో ఉన్న భవనం మంగళవారం కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు పాకిస్థానీయులు మరణించారు. ఈ మేరకు పాకిస్థాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ బుధవారం వెల్లడించింది. సౌదీలోని బురైద ప్రాంతంలో అల్ ఖాసిం యూనివర్శిటీ ప్రాంగణంలో భవనం నిర్మిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపింది. అయితే మృతదేహాలను స్వదేశం తీసుకువచ్చేందుకు సౌదీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. -
ఢిల్లీలో కుప్పకూలిన భవనం
-
కూలిన భవనం
నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలడంతో ఐదుగురు బలయ్యారు. మరో 16 మంది గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు ఒడిశా వాసులు, ఒకరు ఉత్తరప్రదేశ్ వాసి. తిరువారూర్ జిల్లా నన్నిలం సమీపంలోని నాగకుడిలో ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘటన ఆ జిల్లా యంత్రాంగాన్ని ఉరకలు తీయించింది. సాక్షి, చెన్నై: నెలకుడిలో వంద ఎకరాల విస్తీర్ణంలో సెంట్రల్ వర్సిటీ ఏర్పాటు చేసి ఉన్నారు. ఇదే స్థలంలో కేంద్రీయ విద్యాలయం సైతం ఉన్నది. ఇక్కడే ఉద్యోగుల కోసం క్వార్టర్స్ నిర్మాణ పనులు సాగుతున్నాయి. నాలుగు అంతస్తుల భవనం రూపంలో ఈ క్వార్టర్స్‌ను నిర్మిస్తున్నారు. ఓ వైపు పనులు ముగింపు దశకు చేరగా, మరో వైపు పనులు సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆదివారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో నాలుగో అంతస్తులో కాంక్రిట్ వేయడం కోసం సెంట్రింగ్ పనులు జరుగుతున్నాయి. సుమారు నలభై మంది కార్మికులు విధుల్లో ఉన్నట్టు సమాచారం. కార్మికులు తమ పనుల్లో నిమగ్నమై ఉండగా, ఉన్నట్టుండి మూడో అంతస్తు సీలింగ్‌కు వేసి ఉన్న కాంక్రిట్ ఉన్నట్టుండి కుప్ప కూలింది. నాలుగో అంతస్తులో సెంట్రింగ్ పనుల్లో ఉన్న కార్మికులు , మూడో అంతస్తు, రెండో అంతస్తుల్లో పనుల్లో ఉన్న కార్మికులు ఆ శిథిలాల్లో చిక్కుకున్నారు. పేక మేడలా రెండు, మూడు అంతస్తుల కూలడాన్ని చూసిన అక్కడి వారు భయాందోళనలతో పరుగులు తీశారు. ఇక్కడి వాళ్ల కేకల్ని విన్న పరిసర వాసులు రక్షించేందుకు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఐదుగురు బలి : సమాచారం అందుకున్న తిరువారూర్ జిల్లా కలెక్టర్ మదివానన్, ఆర్డీవో ముత్తు మీనాక్షి, ఎస్పీ జయచంద్రన్, తహశీల్దార్ అంభికాపతి తమ తమ సిబ్బందిని అప్రమత్తం చేశారు. అగ్నిమాపక శాఖ అధికారి రామమూర్తి నేతృత్వంలో రెస్యూ టీం ఆగమేఘాలపై సంఘటన స్థలానికి చేరుకుంది. నన్నిలం, కుడైవాసల్, నాగపట్నం, తిరువారూర్లల నుంచి వచ్చిన నలభై మందికి పైగా రెస్యూ టీం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యల్లో మునిగింది. ఆ పరిసరాల్లో తీవ్ర ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొనడంతో పోలీసు బలగాలు మొహరించాయి. పదుల సంఖ్యలో అంబులెన్స్‌లను సిద్ధం చేశారు. ఆరు గంటల పాటుగా శ్రమించిన రెస్యూ టీం 10 మందిని ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా రక్షించారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న 16 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరు మార్గ మధ్యలో మరణించగా, ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సంఘటన స్థలంలో రెండు మృత దేహాలు బయట పడ్డాయి. ఇక్కడ పనిచేస్తున్న కార్మికుల్లో అత్యధిక శాతం మంది ఒడిశ్సా, ఉత్తరప్రదేశ్ వాసులు కావడంతో వారి ఆచూకీ గుర్తించడం పోలీసులకు తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. ఎట్టకేలకు మృతుల్లో ఇద్దరు ఒడిశ్సాకు చెందిన కిట్టు(26), సమీర్‌కుమార్(26)గా గుర్తించారు. మిగిలిన వారిలో ఒకరు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రాం సుబాష్, మరోకరు మైలాడుతురైకు చెందిన చిన్నస్వామిగా గుర్తించారు. ఓ మృతదేహాన్ని గుర్తించాల్సి ఉంది. కిట్టు, చిన్న స్వామిలు సంఘటన స్థలంలోనే మరణించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరువారూర్ మెడికల్ కళాశాల ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ వారిలో శీర్గాలికి చెందిన శ్రీరాం, దినేష్, మైలాడుతురైకు చెందిన రంగస్వామి, కరుప్పన్,మణి, ఒడిశ్సాకు చెందిన అఖిలేష్ యాదవ్, రాజేష్, ముత్తయ్య శెట్టి, అమల్, అసూర్యన్, మనోజ్ ఉన్నారు. వీరిలో కొందర్ని మెరుైగె న చికిత్స నిమిత్తం తంజావూరు ఆసుపత్రికి తరలించారు. విచారణకు ఆదేశం : సమాచారం అందుకున్న తిరువారూర్ జిల్లా కలెక్టర్ మదివానన్, ఆర్డీవో ముత్తు మీనాక్షి, ఎస్పీ జయచంద్రన్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మూడో అంతస్తుకు మూడు రోజుల క్రితమే కాంక్రిట్ వేసినట్టు, అంతలోపే నాలుగో అంతస్తుల్లో కాంక్రిట్ వేయడానికి సెంట్రింగ్ పనులు చేపట్టడం ఈ ప్రమాదానికి కారణంగా గుర్తించారు. మూడో అంతస్తుకు వేసిన కాంక్రిట్ తేమ ఆరక ముందే, దాని మీద బరువు పెరగడంతో భవనం కూలినట్టు, ఆ శిథిలాల ప్రభావం రెండో అంతస్తు మీద కూడా పడ్డట్టు భావిస్తున్నారు. అదే సమయంలో, అక్కడికి వచ్చిన రాజశేఖర్ అనే వ్యక్తి నిర్మాణపనులపై తీవ్ర ఆరోపణలు చేశాడు. ఈ భవన నిర్మాణాలకు ఉపయోగించే నీటిలో సామర్థ్యం లేదని, నిరుపయోగ నీటిని ఉపయోగించ బట్టే తేమ ఆరడానికి సమయం పడుతున్నదని, ఇక్కడ సాగుతున్న నిర్మాణాలకు ఆ నీటి రూపంలో ముప్పు తప్పదని హెచ్చరించడంతో కలకలం బయలు దేరింది. ఆ వ్యక్తి ఆరోపణల్ని పరిగణలోకి తీసుకున్న అధికారులు అందుకు తగ్గ విచారణను వేగవంతం చేశారు. అయితే, ప్రమాదం జరిగి కొన్ని గంటలైనా కేంద్ర ప్రజా పనుల శాఖ అధికారులు ఏ ఒక్కరూ అటు వైపుగా రాక పోవడం విమర్శలకు దారి తీస్తున్నది. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ మది వానన్ ప్రస్తావిస్తూ, విచారణకు ఆదేశించామని, నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయన్నారు. -
భవనం కుప్పకూలి... పలువురి మృతి
-
కుప్పకూలిన భవనం: 19 మంది మృతి
కైరో: ఈజిప్టు రాజధాని కైరోలోని మటారియా జిల్లాలో ఎనిమిది అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 19 మంది మరణించారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ ప్రమాదంపై సమాచారం అందగానే హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని చెప్పారు. మృతులు, క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఈ భవనం కుప్పకూలడంపై ప్రాధమిక విచారణ పూర్తి అయిందని తెలిపారు. ప్రభుత్వం అనుమతి లేకుండా భవన యజమాని ఆరు అంతస్తులపై మరో రెండు అంతస్తులను నిర్మించాడని పేర్కొన్నారు. రెండవ అంతస్తులో భవనం లోపల పునర్ నిర్మాణ పనులు చేపట్టడం కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని ఉన్నతాధికారులు తెలిపారు. భవన యజమానిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ప్రమాదం మంగళవారం చోటు చేసుకుంది. -
పుణేలో కూలిన ఏడంతస్థుల భవనం
పుణే : మహారాష్ట్ర పుణేలో ఓ ఏడంతస్తుల భవనం కూలింది. శివారు ప్రాంతమైన అమ్బేగాన్ ప్రాంతంలో తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఈ భవనం కుప్పకూలింది. పురాతన భవనంలో ఎనిమిది కుటుంబాలు నివాసం ఉంటున్నాయని పోలీసులు తెలిపారు. శిథిలాల్లో నలుగురు చిక్కుకున్నట్లుగా సమాచారం. వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కూలిన భవనం
వర్షాలతో పురాతన భవనాల్లో నివాసం ఉంటున్న వాళ్లు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి. అర్ధరాత్రి చెన్నైలో ఓ పాత భవనం కుప్ప కూలడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. అదృష్ట వశాత్తు ఈ ప్రమాదం నుంచి 14 మంది ప్రాణాలతో బయటపడ్డారు. మదురైలో మరో ఇల్లు కూలడంతో ఓ బాలుడు మరణించగా, నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. సాక్షి, చెన్నై: రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ వర్షాలు ప్రజల్లో భయాన్ని రేకెత్తిస్తున్నాయి. పాత, పురాతన భవనాల్లో నివాసం ఉంటున్న వాళ్లల్లో ఆందోళన మొదలైంది. కీల్పాకం మిల్లర్స్ రోడ్డులో రెండు అంతస్తులతో కూడిన పాత భవనం ఉంది. పదిహేను ఏళ్ల క్రితం పై అంతస్తులు కల్యాణ మండపంగా ఉండేది. కింది భాగం దుకాణాలు ఉన్నాయి. ఈ భవనం స్థానిక ఫైనాన్షియర ఉత్తమ సేన్‌కు చెందినది. ఈ భవనం కింది భాగంలో దుకాణాలకు వెనుక ఉన్న ఇంట్లో ఉత్తమ సేన్ నివాసం ఉంటున్నారు. ఆయనతో పాటుగా భార్య చంద్ర, కుమార్తె మేనక, బంధువు కమలాబాయ్ ఉంటున్నారు. ఒకటి, రెండు అంతస్తులు ఇది వరకు నివాస ప్రాంతంగా మార్చినా, అక్కడక్కడ పై పెచ్చులు ఊడటంతో వాటిని ప్రస్తుతం ఖాళీగానే ఉంచారు. ఈ పరిస్థితుల్లో సోమవారం అర్ధరాత్రి ఉన్నట్టుండి పైనున్న ఒకటి, రెండు అంతస్తులు కుప్ప కూలాయి. ఈ హఠాత్పరిణామంతో కింద ఉన్న ఇంట్లోని ఉత్తమ సేన్ కుటుంబీకులు భయాందోలన తో బయటకు పరుగులు తీశారు. ఈ భవన శిథిలాలలు పక్కనే ఉన్న సురేష్ ఇంటి మీద పడ్డాయి. ఆ ఇంట్లోని సురేష్ భార్య ద్రాక్షాయిని, తల్లి త్రిపుర సుందరి, పిల్లలు కిషన్ కుమార్, ప్రత్యూష, సురేష్ సోదరుడు మురేగషన్, ఆయన భార్య దేవయాని భయాందోళనతో బయటకు ఉరకలు తీశారు. భూకంపం వచ్చినట్లుగా, పిడుగు పడ్డట్టుగా వచ్చిన శబ్దంతో ఆ పరిసరవాసులు మరింత ఆందోళనలో పడ్డారు. ఆ భవనం కింది భాగంలో దుకాణాల్లో నిద్రిస్తున్న మరో ముగ్గురు ఈ శబ్దంతో పరుగులు తీశారు. సహాయక చర్యలు : సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్ని వేగవంతం చేశారు. భవన శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా? అన్న ఆందోళనలో పడ్డారు. అయితే, అందరూ బయటకు వచ్చేసినట్టుగా ఉత్తమ సేన్ చెప్పడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అదృష్టవశాత్తు ఒకటి రెండు అంతస్తులు కుప్ప కూలినా, కింది భాగంలోని దుకాణాలు, ఇంటి మీద ప్రభావం చూపక పోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అరుుతే దుకాణాలకు సమీపంలోని ఆపి ఉన్న ఓ కారు, ఓ రిక్షా ధ్వంసమయ్యూరుు. మంత్రి పరామర్శ: మంగళవారం ఉదయాన్నే సమాచారం అందుకున్న మంత్రి గోకుల ఇందిర సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుల్ని పరామర్శించారు. అయితే, సురేష్ ఇంటి మీద శిథిలాలు అధికంగా ఉండడంతో ఎవర్నీ ఆ ఇంట్లోకి అనుమతించ లేదు. దీంతో అరుబాక్కంలోని తమ బంధువుల ఇంటికి ఆ కుటుంబం మకాం మార్చాల్సి వచ్చింది. పురాతన భవనానికి మరమ్మతులు చేయాల్సి ఉందని, అయితే, కుటుంబంలోని పరిస్థితుల కారణంగా అలాగే వదలి పెట్టామని ఉత్తమ సేన్ చెప్పారు. మదురైలో: మదురైలో ఓ ఇల్లు కుప్పకూలడంతో బాలుడు మరణించాడు. మరో ముగ్గురు గాయపడ్డారు. మదురై వాడి పట్టి అమ్మాకోట్టైకు చెందిన బాల సుబ్రమణ్యం, తమిళ్ సెల్వి దంపతులకు అజిత్, సంధ్య, సత్య పిల్లలు ఉన్నారు. ఇటీవల అనారోగ్యం తో బాల సుబ్రమణ్యం మరణించాడు. పిల్లల తో తమిళ్ సెల్వి కాలం గడుపుతున్నారు. అర్ధరాత్రి వర్షం కుండపోతగా కురవడంతో ఆ ఇల్లు పైకప్పు కుప్పకూలింది. వర్షం కారణం గా సహాయక చర్యల్లో ఆటంకం ఏర్పడింది. శిథిలాలకింద చిక్కుకున్న వాళ్లను అతికష్టం గా రక్షించారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న తమిళ్ సెల్వి, సత్య, సంధ్యలను ప్రాణాలతో రక్షించారు. అయితే, అజిత్ మీద శిథిలాలు పెద్ద ఎత్తున పడటంతో సంఘటనా స్థలంలోనే మరణించాడు. గాయపడ్డ ముగ్గురినీ చికిత్స నిమిత్తం మదురై ఆసుపత్రికి, అజిత్ మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. -
కుప్ప కూలిన భవనం: 8 మంది మృతి
ప్యారిస్: ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఆ ఘటనలో ఎనిమిది మంది మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను నగరంలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని ఫ్రెంచ్ ఎమర్జన్సీ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. శిథిలాల కింద చిక్కుకున్న రెండు మృతదేహాలను నిన్న సాయంత్రం వెలికితీసినట్లు చెప్పారు. ఆ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఫ్రెంచ్ హోంశాఖ మంత్రి బెర్నార్డ్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. -
పరిహారం.. పరిహాసం!
తమిళనాడు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం సొమ్ము వచ్చేసింది. మీరంతా జిల్లా కేంద్రానికి వచ్చేయండి.. చెక్కులు ఇచ్చేస్తాం.. ఈ నెల 16న జిల్లా అధికార యంత్రాంగం తరఫున హడావుడిగా పిలుపు,.. అదే విషయమై పత్రికా ప్రకటనలు జారీ.. ఈ నెల 17న.. మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్ చేతుల మీదుగా బాధితుల తరఫున వచ్చిన వారికి చెక్కుల పంపిణీ.. ఇదంతా జరిగింది.. ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి బాధితుల పరామర్శకు వచ్చిన రోజే.. ఆయన వెళ్లే సమయానికి బాధితులు ఇళ్ల వద్ద ఉండకుండా చేయాలన్న దురుద్దేశంతోనే అధికార టీడీపీ నేతలు అధికార యంత్రాంగం ద్వారా హడావుడిగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని అప్పట్లోనే విమర్శలు గుప్పుమన్నాయి. ఇప్పుడు జరిగింది చూస్తే.. ఆ విమర్శలు.. టీడీపీ కుట్రలు నిజ మేనని తేటతెల్లమవుతోంది. హడావుడిగా ఇచ్చిన ఆ చెక్కులు చెల్లని చిత్తు కాగితాల్లా తిరిగివచ్చాయి. కొత్తూరు: బాధితులను పరామర్శించడాన్ని.. నష్టపరిహారం పంపిణీని సైతం అధికార టీడీపీ రాజకీయం చేస్తోందనడానికి చెన్నై బాధితులకు హడావుడిగా ఇచ్చిన చెక్కులు చెల్లని ఉదంతం నిదర్శనంగా నిలుస్తోంది. గత నెల చెన్నైలో బహుళ అంతస్తుల భవనం కూలినదుర్ఘటనలో మృతి చెందిన జిల్లాకు చెందిన 14 మంది కుటుంబ సభ్యులకు తమిళనాడు ప్రభుత్వం రూ.2 లక్షలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ నెల 17న జిల్లా కేంద్రానికి బాధిత కుటుంబీకులను ప్రత్యేకంగా రప్పించి మంత్రి అచ్చెన్నాయుడు చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ సంతకంతో ఉన్న చెక్కులను అదరాబాదరాగా అందజేశారు. ఇందులో భాగంగా కొత్తూరు మండలానికి చెందిన అమలాపురం రమేష్, రాజేష్‌ల తరఫున వారి తండ్రి అమలాపురం సూర్యారావుకు రెండు చెక్కులు, కిమిడి సుబ్బయ్య భార్య కిమిడి శశిమ్మ పేరిట ఒక చెక్కు అందజేశారు. ఈ చెక్కులను సూర్యారావు స్థానిక ఏపీజీవీబీలో ఉన్న తన ఖాతాలో వేశారు. కలెక్షన్ కోసం వాటిని కొత్తూరు ఎస్బీఐకి పంపగా చెక్కులో పేర్కొన్న ఖాతా(నెం. 11152302687)లో నగదు లేకపోవడంతో ఆ చెక్కులు వెనక్కి వచ్చాయి. శనివారం బ్యాంకుకు వెళ్లిన సూర్యారావుకు ఏపీజీవీబీ మేనేజర్ వినోద్ ఈ విషయం చెప్పి చెక్కులను తిరిగి ఇచ్చేశారు. కాగా కిమిడి శశిమ్మ తన చెక్కును స్థానిక ఎస్బీఐలో జమ చేయగా, అది కూడా చెల్లకుండా పోయింది. చెక్కులో సూచించిన ఖాతాలో బ్యాలెన్స్ లేనందున చెక్కు ఇంకా మారలేదని ఎస్బీఐ మేనేజర్ ప్రకాశరావు తెలిపారు. ఖాతాలో డబ్బులు వేసిన వంటనే శశిమ్మ ఖాతాకు చెక్కు మొత్తాన్ని జమ చేస్తామని చెప్పారు. కాగా చెక్కులు చెల్లకపోవడంతో లబోదిబోమన్న సూర్యారావు వాటిని తీసుకెళ్లి తాహశీల్దార్‌కు చూపించారు. వెంటనే ఆయన కలక్టరేట్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. సోమవారం నాటికి అకౌంట్లో డబ్బులు వేస్తారని.. అ రోజు చెక్కులు తీసుకొని బ్యాంకుకు వెళ్లాలని కలెక్టరేట్ అధికారులు సూచించినట్లు తహశీల్దార్ పీవీ శ్యామ్‌సుందరావు తెలిపారు. కాగా పాలకొండ తదితర ప్రాంతాల్లోని బాధితులకు ఇదే అనుభవం ఎదురైనట్లు సమాచారం. వికటించిన పన్నాగం ప్రతిపక్ష నేత పర్యటనను విఫలం చేయాలన్న దురుద్దేశంతో అధికార పార్టీ పన్నిన పన్నాగం.. ఖాతాలో నిధులు ఉన్నాయో లేవో కూడా తెలుసుకోకుండా హడావుడిగా చెక్కులు రూపొందించి ఇవ్వడం వల్లే ఈ చిక్కులు వచ్చాయి. అధికార పార్టీ రాజకీయాల కారణంగా బాధితులు అనవసరంగా ఇబ్బందులకు గురవుతున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్ జిల్లాకు వస్తున్నారని ముందే తెలిసినా.. టీడీపీ నాయకులు జగన్ పరామర్శించే సమయానికి బాధితులు ఇంటి వద్ద లేకుండా చేసేందుకు జిల్లా యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అకౌంట్లో డబ్బులు లేకపోయినా చెక్కులు బ్యాంకు నిబంధనలకు నీళ్లొదిలారు. తీరా ఇప్పుడు చెక్కులు బౌన్స్ కావడంతో తీరిగ్గా సోమవారం నిధులు జమ అవుతాయి.. అప్పుడు వెళ్లి తీసుకోండని చెబుతున్నారంటేనే.. అప్పుడు చేసిందంతా ఆర్భాటమేనని.. బాధితులను పావులుగా చేసుకొని ఆడిన రాజకీయ నాటకమేనని వేరే చెప్పాలా!.. -
శిథిలాల కింద మరో నాలుగు మృతదేహాల వెలికితీత
చెన్నై: చెన్నైలో 11 అంతస్తుల భవనం కూలిన సంఘటనలో శిథిలాల కింద మరో నాలుగు మృతదేహాలను వెలికితీశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 22 కు చేరుకుంది. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. చెన్నైలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయిన సంగతి తెలిసిందే. బాధితుల్లో ఎక్కువ మంది తెలుగువారు ఉన్నారు. సంఘటన స్థలాన్ని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, జయలలిత, కాంగ్రెస్ నాయకులు చిరంజీవి, బొత్స సత్యనారాయణ, రామచంద్రయ్య తదితరులు పరిశీలించారు. -
చెన్నై బాధితులను పరామర్శించిన చిరు, బొత్స
చెన్నై: చెన్నైలో 11 అంతస్తుల భవనం కూలిన ప్రదేశాన్ని కాంగ్రెస్ నాయకులు చిరంజీవి, బొత్స సత్యనారాయణ, సి.రామచంద్రయ్య పరిశీలించారు. ఇలాంటి మానవ తప్పిదాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలకు పది లక్షల రూపాయిల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమండ్ చేశారు. నిర్మాణంలో ఉన్న భవనం కూలడంతో 16 మంది మరణించగా, చాలా మంది శిథిలాల కింద చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. బాధితుల్లో ఎక్కువమంది తెలుగువారే. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందినవారు. సంఘటన స్థలాన్ని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, జయలలిత పరిశీలించారు. -
చెన్నై బాధితులకు చంద్రబాబు పరామర్శ
-
చెన్నై బాధితులకు చంద్రబాబు పరామర్శ
హైదరాబాద్: చెన్నైలో 11 అంతస్తుల భవనం కూలిన ప్రదేశాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం పరిశీలించారు. అక్కడ బాధితులను పరామర్శించి అన్ని విధాలా ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఉదయం నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ప్రధాని నరేంద్ర మోడీతో కలసి పీఎస్ఎల్వీ సీ 23 ఉపగ్రహ ప్రయోగం వీక్షించిన చంద్రబాబు అనంతరం చెన్నైకు వెళ్లారు. చెన్నై దుర్ఘటనలో ఇప్పటి వరకు 17 మంది మరణించగా, మరికొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నారు. బాధితుల్లో ఎక్కువగా తెలుగువారు, అందులోనూ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. శిథిలాల కింద ఉన్న వారిలో కొంతమందిని రక్షించగా, మిగిలనవారి కోసం సహాయక చర్యలు చేపడుతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. -
చెన్నై దుర్ఘటనలో ఏడుగురి మృతి.. శిథిలాల్లో 190 మంది
చెన్నై: చెన్నై ఘోర ప్రమాద సంఘటనలో ఏడుగురు మరణించగా, మరో 190 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. మాన్‌గాడులో నిర్మాణంలో ఉన్న11 అంతస్తుల భవనం కుప్ప కూలిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. శిథిలాల నుంచి ఏడు మృతదేహాలను వెలికితీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాలలో చిక్కుకున్న కూలీలు అందరూ తెలుగువారే. సాధారణంగా ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగువారే కూలీలుగా పని చేస్తుంటారు. వర్షం కురవడంతో భవనం పది అడుగుల లోపలకు కూరుకుపోయింది. భవనం కింద భూమి బలంగా లేనట్లు చెబుతున్నారు. 11 అంతస్తులు నిర్మించేందుకు అనుమతిలేకుండా ఈ భవనం నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. -
ఆరుకు చేరిన ముంబై మృతుల సంఖ్య
ముంబై : ముంబై శాంతాక్రాజ్ శివారులోని వకోలాలో ఏడంతస్థుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. శుక్రవారం ఉదయం భారీ భవనం కూలిపోవడంతో శిధిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కూలిన ఆ భవనంలో ఎవరు నివసించడం లేదని బృహన్ ముంబై మున్సిపల్ అధికారులు వెల్లడించారు.అయితే కుప్పకూలిన భవనం మురికవాడ పక్కన ఉందని శిథిలాల కింద కొంత మంది చిక్కుకున్నారు. ఆ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే బృహన్ ముంబై మున్సిపల్ అధికారులు, అగ్నిమాపక శాఖ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బృహన్ మున్సిపల్ కార్పోరేష్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. -
ముంబైలో కుప్పకూలిన ఏడంతస్థుల భవనం
ముంబై శాంతాక్రాజ్ శివారులోని వకోలాలో ఏడంతస్థుల భవనం శుక్రవారం ఉదయం కుప్పకూలింది. అయితే ఆ భవనంలో ఎవరు నివసించడం లేదని బృహన్ ముంబై మున్సిపల్ అధికారులు వెల్లడించారు.అయితే కుప్పకూలిన భవనం మురికవాడ పక్కన ఉందని శిథిలాల కింద కొంత మంది చిక్కుకుని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఆ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే బృహన్ ముంబై మున్సిపల్ అధికారులు, అగ్నిమాపక శాఖ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బృహన్ మున్సిపల్ కార్పోరేష్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆ ఘటనపై మరింత సమాచారం అందవలసి ఉంది. -
న్యూయార్క్ లో పేలుళ్లు
-
బెంగళూరులో కూలిన పూరాతన భవనం
-
ఘటనా స్థలాన్ని సందర్శించిన YSRCP బృందం
-
పాత భవనంపైనే నిర్మాణం
-
గోడ కూలి ఇద్దరు మహిళల సహా ఓ చిన్నారి మృతి
హైదరాబాద్ : హైదరాబాద్‌లో భారీ వర్షాలు ముగ్గురిని బలిగొంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఓ భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా ఓ చిన్నారి దుర్మరణం చెందారు. మసబ్ ట్యాంక్ విజయనగరం కాలనీలో ఈ దుర్ఘటన జరిగింది. స్థానికులు ఇప్పటి వరకూ రెండు మృతదేహాలను వెలికి తీశారు. మరో మృతదేహం కోసం గాలిస్తున్నారు. మృతులు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన పార్వతి, లక్ష్మి, జనార్థన్ గా గుర్తించారు. ఈ ఘటనలో గాయపడిన మరో ఇద్దరిని చికిత్స నిమిత్తరం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. జీహెచ్ఎంసీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని శిథిలాలను వెలికి తీసే ప్రయత్నాల్లో ఉన్నారు. కాగా రెండు నెలల క్రితం మౌలాలీలోని అల్వాల్ లో కూడా భవనం ప్రహరీ గోడ కూలి పక్కనే నివాసం ఉంటున్న రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. -
గో్డ కూలి ఇద్దరు మహిళల సహా ఓ చిన్నారి మృతి
-
శిథిల భవనాలపై మరో సర్వే
ముంబై: ఇటీవల మజ్గావ్ భవన దుర్ఘటన వల్ల భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరిగిన నేపథ్యంలో శిథిలస్థితిలో ఉన్న భవనాలపై మరోసారి సర్వే కోసం నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని బీఎంసీ నిర్ణయించింది. బీఎంసీ కార్యనిర్వాహక ఇంజనీర్లు, ప్లానింగ్ నిపుణులతో కూడిన ఈ బృందం సీ1, సీ2 విభాగాలలోని భవనాలను మరోసారి తనిఖీ చేస్తుంది. సీ1 విభాగంలో 95 భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని ఇది వరకే గుర్తించారు. వీటిని కూల్చేయాలనే ప్రతిపాదనలూ ఉన్నాయి. సీ2లోనూ 11 భవనాలు కూలి పోయే స్థితిలో ఉన్నాయి. సీ2ఏ విభాగంలోని 40 భవనాలకు అత్యవసర మరమ్మతులు అవసరమని నిర్ధారించారు. సీ1లోని 95 భవనాల్లో 54 భవనాలను బీఎంసీ ఇది వరకే ఖాళీ చేయిం చింది. ఈ మూడు విభాగాల్లోని ఇంకా ఏవైనా భవనాలను ప్రమాదకరంగా ఉన్నదీ లేనిదీ నిర్ధారించడానికే తాజాగా సర్వే నిర్వహిస్తున్నామని అదనపు మున్సిపల్ కమిషనర్ ఎస్వీఆర్ శ్రీని వాస్ అన్నారు. -
బీఎంసీ అధికారులకు బేడీలు
సాక్షి, ముంబై: డాక్‌యార్డ్ ప్రాంతంలో గత శుక్రవారం భవనం కూలిన ఘటనకు బాధ్యులుగా అనుమానిస్తున్న ముగ్గురు బీఎంసీ అధికారులను స్థానిక శివ్డీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ ఘటనకు ప్రధాన కారకుడైన అశోక్ జైన్ అనే డెకొరేటర్ను ఇదివరకే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇదే కేసులో ఏడుగురు బీఎంసీ అధికారులను ఆదివారం రాత్రి సస్పెండ్ చేయగా 11 మంది పాత్రపై దర్యాప్తుకు బీఎంసీ కమిషనర్ సీతారాం కుంటే ఆదేశించారు. మంగళవారం అరెస్టయిన ముగ్గురు అధికారులపై ఆదివారమే సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు బీఎంసీ ఉన్నతాధికారులు రాజీవ్ జలోటా, మోహన్ అడ్తానితో ద్వీసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. ప్రాథమిక విచారణలో దోషులుగా తేలడంతో డి.సి.చవాన్-డిప్యూటీ సూపరింటెండెంట్ (మార్కెటింగ్ శాఖ). రాహుల్ జాదవ్-అసిస్టెంట్ ఇంజినీర్ (మార్కెటింగ్ శాఖ), ఇన్స్పెక్టర్ (మార్కెటింగ్ శాఖ) జమాల్ కాజీని శివ్డీ పోలీసులు అరెస్టు చేశారు. మిగతావారిపై విచారణ జరుగుతోంది. ఇందులో ఎంతమంది దోషులుగా తేలుతారో, ఎంతమందిని అరెస్టు చేయాల్సి వస్తుందో త్వరలో వెల్లడవుతుందని కుంటే అన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు మొత్తం 61 మంది మృతి చెందారు. ఇందులో ఇద్దరు పిల్లలు ఉండగా 28 మంది మహిళలున్నారు. మొత్తం 38 మంది గాయపడగా ఇందులో 30 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాదాపు 99 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఇంకా ఆరు మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. మొత్తం 48 గంటల తరువాత భవన శిథిలాలను తొలగించారు. ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ 21 కుటుంబాలకు పునరావాసం కల్పించడం పెనుసవాలుగా మారింది. మాడా శరణార్థి శిబిరాలన్నీ కిక్కిరిసి ఉండడంతో వీరికి ఎక్కడ బస కల్పించాలో తెలియని పరిస్థితి నెలకొంది. డాక్టర్ల సస్పెన్షన్ డాక్‌యార్డ్‌లో భవనం కూలడంతో గాయపడ్డవారికి వైద్యపరీక్షలు నిర్వహించడానికి డబ్బులు వసూలుచేసిన ముగ్గురు నాయర్ ఆస్పత్రి వైద్యులపై సెస్పెండ్ వేటు పడింది. మరో 11 మంది వైద్యులపాత్రపైనా విచారణ జరుగుతోంది. ఇందులో దోషులుగా తేలితే వీరిని కూడా సస్పెండ్ చేయనున్నారు. డాక్‌యార్డ్ దుర్ఘటనలో 61 మంది మరణించగా అనేక మంది గాయపడ్డారు. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులందరికీ ఉచితంగా వైద్యం అందజేయాలని మేయర్ సునీల్ ప్రభు ఆదేశించారు. అయినప్పటికీ నాయర్ ఆస్పత్రిలోని బాధితుల నుంచి రక్తపరీక్షలు నిర్వహించేందుకు డబ్బులు వసూలు చేశారు. ఈ విషయాన్ని శ్వేతాకాంబ్లే అనే బాధితురాలు బయటపెట్టడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ముగ్గురు డాక్టర్లు దోషులుగా తేలడంతో సస్పెండ్ చేశారు. -
రెండో ‘మహా’దుర్ఘటన
సాక్షి, ముంబై: మాజ్‌గావ్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం కూలిన భవన ప్రమాద మృతుల సంఖ్య 54కు చేరుకుంది. 31 మంది గాయపడ్డారని బీఎంసీ విపత్తు నియంత్రణ అధికారులు శనివారం సాయంత్రం ప్రకటించారు. ఈ భవనంలో నివసిస్తున్న సకాల్ మరాఠీ దినపత్రిక జర్నలిస్ట్ యోగేశ్ పవార్, అతడి తంఢ్రి అనంత్ పవార్ కూడా మరణించారని తెలిపారు. శుక్రవారం రోజు 13 మంది మృతదేహాలను వెలికితీసిన బీఎంసీ సిబ్బంది శనివారం మరో 37 మృతదేహాలను గుర్తించారు. ఈ ఏడాదిలో జరిగిన రెండో పెద్ద భవన ప్రమాదం ఇదేనని తెలిపారు. ‘ఇంతకుముందు ముంబ్రా లక్కీ కాంపౌండ్‌లో ఏప్రిల్‌లో జరిగిన భవన ప్రమాదంలో 75 మంది మరణించారు. జూన్‌లో మహీమ్‌లో జరిగిన దుర్ఘటనలో పది మంది, ముంబ్రాలో పది మంది, దహిసర్‌లో ఏడుగురు, భివండీలో ముగ్గురు మృతి చెందార’ని వివరించారు. అయితే సహాయక చర్యల్లో ఇప్పటివరకు గాయపడని 20 మందిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగామని చెప్పారు. వీరిలో అనిశ్ కదమ్ (10), దీప్తేశ్ కదమ్ (16), హబీబ్ షేక్ (22), తక్వీర్ షేక్ (22), హరూన్ షేక్ (24), అజయ్ చెంద్వంకర్ (40) ఉన్నారని తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా ఈ పనులు పూర్తి చేసేందుకు శ్రమిస్తున్నామన్నారు. క్షతగాత్రులు జేజే ఆస్పత్రి, నాయర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వివరించారు. సహాయక చర్యల్లో అగ్నిమాపక అధికారి డీఎస్ పాటిల్ గాయపడ్డారని తెలిపారు. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ కుటుంబాలకు సమీపంలో ప్రత్యామ్నాయ వసతి కల్పించేందుకు చొరవ తీసుకుంటున్నామన్నారు. కాగా, దక్షిణ ముంబైలోని డాక్‌యార్డ్ సమీపంలో ఉన్న మున్సిపల్ ఉద్యోగుల సిబ్బంది క్వార్టర్స్‌కు చెందిన ఈ భవనం 33 ఏళ్ల క్రితం కట్టిందని సీఎం కార్యాలయం శనివారం విడుదల చేసిన ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. 21 కుటుంబాలు నివసించే ఈ భవనం శుక్రవారం ఉదయం 5.45 గంటల ప్రాంతంలో ఆకస్మాత్తుగా కూలిపోయిందని బీఎంసీ అధికారి ఒకరు తెలిపారు. ఆ సమయంలో అందులో ఉండేవారు మంచి నిద్రలో ఉన్నారన్నారు. దీంతో ప్రాణనష్టం పెరిగిందని వివరించారు. 28 ఫ్లాట్లు ఉన్న ఈ భవనంలో ఏడు ఫ్లాట్లలో ఉండేందుకు వీలు లేదని, గ్రౌండ్ ఫ్లోర్ గిడ్డంగి తీవ్ర శిథిలావస్థకు చేరుకుందని కొన్నేళ్లక్రితం ప్రకటించిందన్నారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న మేయర్ కాగా, శనివారం నాటి సహాయక చర్యలను నగర మేయర్ సునీల్ ప్రభూ, ఉన్నత బీఎంసీ అధికారులు, అగ్నిమాపక సిబ్బందితో కలిసి పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.రెండు లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు. క్షతగాత్రులకు మున్సిపల్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యమందిస్తామని చెప్పారు. అంతకుముందు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సీనియర్ అధికారులతో సమావేశమై సహాయక చర్యలను త్వరితగతిన చేపట్టేలా చొరవతీసుకోవాలని ఆదేశించారు. భవనం కూలిన ప్రాంతాన్ని శుక్రవారం రాత్రి సందర్శించి బాధితులను ఓదార్చారు. ఈ ప్రమాదానికి కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఒక్కో మృతుని కుటుంబానికి రాష్ట్ర సర్కార్ తరఫున రూ.లక్ష నష్టపరిహారాన్ని ప్రకటించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. రెండు కమిటీల నియామకం.. ఈ భవన దుర్ఘటనపై విచారించేందుకు రెండు కమిటీలను బీఎంసీ నియమించింది. నగరంలో ఎన్ని భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి, ప్రమాదకర స్థాయిలో ఉన్న వాటి వివరాలను కూడా ఈ కమిటీ సేకరిస్తుందని సంబంధిత అధికారి తెలిపారు. శిథిలావస్థకు చేరుకున్న భవనాలపై మళ్లీ సర్వే నిర్వహించడం, సాంకేతిక కారణాలు వెతకడం కోసం కార్పొరేషన్‌కు చెందిన ఇంజినీరింగ్ సేవా, ప్రణాళిక విభాగం డెరైక్టర్ లక్ష్మణ్ వట్కర్ అధ్యక్షతన ఒక కమిటీ, డిప్యూటీ కమిషనర్ రమేష్ పవార్ అధ్యక్షతన మరో కమిటీ పనిచేస్తుందన్నారు. కాగా, భవన గ్రౌండ్ ఫ్లోర్లో కొన్ని మార్పులు చేసిన మమామియాన్ డెకొరేటర్పై బీఎంసీ కేసు నమోదు చేసింది. మరమ్మతుల్లో జాప్యమే కారణం... మరమ్మతుల్లో జాప్యం జరగడమే భవనం కూలడానికి మరో కారణమని తెలిసింది. స్ట్రక్చర్ సరిగా లేకపోవడం వల్ల ఈ ఐదంతస్తుల భవనం నేలకూలిందని ప్రాథమిక దర్యాప్తులో అధికారులు తెలిపారు. ఇదిలాఉండగా 1980లో నిర్మించిన ఈ భవనం శిథిలావస్థకు చేరుకున్న జాబితాలో లేదని తెలిసింది. వాస్తవానికి బిల్డింగ్‌కు మరమ్మతు అవసరం ఉండటంతో బీఎంసీ సీ-2లో దీనిని పొందుపర్చారు. మరమ్మతుల కోసం కార్పొరేషన్ బడ్జెట్ నుంచి ఆర్థిక సహాయం కూడా అందించింది. భవ నం స్ట్రక్చర్ ఆడిట్ చేశారు. ఆ మేరకు మరమ్మతు ప్లానింగ్ కూడా చేసుకున్నారు. కానీ పనులు ప్రారంభించడంలో కార్పొరేషన్ నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. మరమ్మతు పనుల్లో జాప్యం జరగకపోతే దుర్ఘటన జరిగేది కాదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ యజమాని అరెస్టు బీఎంసీ నుంచి అనుమతి తీసుకోకుండానే గ్రౌండ్‌ఫ్లోర్‌లో మార్పులు చేసిన మమామియా డెకొరేటర్స్ యజమాని అశోక్ మెహతాను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ మార్పుల వల్లనే భవనం కూలిందని బీఎంసీ డిప్యూటీ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీఎంసీ నుంచి భవనాన్ని లీజుకు తీసుకున్నాడని, అయితే భవన మరమ్మతుల గురించి అనుమతి తీసుకోలేదని ఆయన అందులో పేర్కొన్నారు. మెహతాతో పాటు అతని అనుచరులపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. -
బీఎంసీ భవనం కూలిన ఘటనలో 25కు చేరిన మృతుల సంఖ్య
బృహన్ముంబై కార్పొరేషన్ క్వార్టర్స్ భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 25కు పెరిగింది. ఈ దుర్ఘటనలో మరో 32 మంది గాయపడ్డారు. శిథిలాల కింద కనీసం మరో 12 మంది వరకు చిక్కుకుపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోందని బీఎంసీ విపత్తు నివారణ విభాగం తెలిపింది. ఇప్పటివరకు ఎలాంటి గాయాలు లేకుండానే 20 మందిని కాపాడినట్లు తెలిపారు. శిథిలాల కింద తమకు తెలిసి 12 మందే ఉన్నా, తెలియకుండా మరింత మంది ఉండే అవకాశం ఉన్నందువల్ల యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపడుతున్నట్లు బీఎంసీ అధికారులు తెలిపారు. దాదాపు 50 ఏళ్ల క్రితం కట్టిన ఈ భవనం శుక్రవారం ఉదయం కుప్పకూలిన విషయం తెలిసిందే, శనివారం ఉదయానికి కూడా ఇంకా సహాయ చర్యలు పూర్తి కాలేదు. దుర్ఘటన జరిగే సమయానికి అందులో ఉండేవాళ్లంతా గాఢనిద్రలో ఉండటం వల్లే మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి కొన్నేళ్ల క్రితమే ఈ భవనం బాగా పాడైందని నివేదిక వచ్చింది. ముంబై మేయర్ సునీల్ ప్రభు సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. క్షతగాత్రులందరికీ ఉచిత చికిత్స అందిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ కూడా సంఘటన స్థలాన్ని శుక్రవారం సందర్శించారు. ఆయన మృతుల కుటుంబాలకు లక్షరూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. -
ముంబైలో కుప్పకూలిన కార్పొరేషన్ భవనం.. ఒకరి మృతి
దక్షిణ ముంబైలో బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఒకరు మరణించగా ఆరుగురు గాయపడ్డారు. నాలుగు అంతస్థులున్న ఈ భవనం శుక్రవారం ఉదయమే కూలిందని, సుమారు 50 మంది అందులో చిక్కుకుని ఉంటారని అధికారులు చెబుతున్నారు. వీరంతా శిథిలాలలో ఉండొచ్చని భావిస్తున్నారు. వారిని కాపాడేందుకు సహాయ చర్యలు మొదలయ్యాయి. దక్షిణ ముంబైలోని డాక్ యార్డు సమీపంలో ఉన్న ఈ భవనం ఉద్యోగుల నివాస భవనంగా ఉంది. దీన్ని సుమారు 50 ఏళ్ల క్రితం కట్టారు. శుక్రవారం తెల్లవారుజామున 5.45 గంటల సమయంలో అది కుప్పకూలింది. ఆ సమయానికి ఇళ్లలో ఉన్న చాలామంది గాఢ నిద్రలో ఉన్నారు. కొన్నేళ్ల క్రితం బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ నిపుణులు దీన్ని పరిశీలించి అత్యవసరంగా దీనికి మరమ్మతులు చేయాలని, కొన్ని కుటుంబాలను ఇక్కడినుంచి తరలించాలని తెలిపారు. నాలుగు అంతస్థులలో కలిపి 28 ఫ్లాట్లు ఉన్నాయని, వీటిలో 22 ఫ్లాట్లలో కుటుంబాలు నివసిస్తున్నాయని, దాంతోపాటు గ్రౌండు ఫ్లోర్లో ఒక గోడౌన్ కూడా ఉందని తెలిపారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు ముంబై మేయర్ సురేష్ ప్రభు తెలిపారు. -
ముంబ్రాలో కుప్పకూలుతున్న భవనాలు
సాక్షి, ముంబై: ఠాణే జిల్లా ముంబ్రా ప్రాంత వాసులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఎక్కడ ఏ భవనం కూలిపోతుందోనని క్షణక్షణం బిక్కుబిక్కుమంటున్నారు. దీనికి కారణం.. అక్కడి భవనాలు పేకమేడల్లా కూలిపోతుండటమే.. చూస్తూండగానే కళ్లముందే అవి కుప్పకూలిపోతుండటంతో ఏమీ చేయలేక చేష్ఠలుడిగి చూస్తూ ఉండిపోతున్నారు. ఈ ఏడాది ఇక్కడ భవనాలు కుప్పకూలిన సంఘటనల్లో సుమారు 90 మంది దుర్మరణం పాలవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని చెప్పవచ్చు. ఎప్పుడు తాము శిథిలాల మధ్య చిక్కుకుపోతామోనని స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. కుప్పకూలుతున్న భవనాల్లో ఎక్కువ భాగం అక్రమ నిర్మాణాలే. సాధారణంగా వర్షాకాలంలో భారీవర్షాలకు నగరాల్లోని శిథిలావస్థలో ఉన్న భవనాలు నాని, కుప్పకూలే అవకాశాలుంటాయి. కాని ముంబ్రాలో ఇటీవల కట్టిన భవనాలు సైతం కుప్పకూలిపోతుండటంతో ప్రజలు అవాక్కవుతున్నారు. నిర్మాణాల్లో నాణ్యతలోపం తమ ప్రాణాలను హరిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భవన నిర్మాణాల్లో నిబంధనలను గాలికొదిలేసి, ఇష్టానుసారం కట్టడాలను పూర్తిచేస్తుండటంతో అవి అనతికాలంలోనే కూలిపోతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభానికి ముందే ఏప్రిల్ నాలుగవ తేదీన ఠాణే ముంబ్రా శిల్ఫాటా వద్ద అక్రమంగా నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం కుప్పకూలింది. శిల్ఫాటా లక్కి కాంపౌండ్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో 72 మంది మరణించగా అనేక మంది గాయపడ్డ విషయం విదితమే. ఈ సంఘటన అనంతరం ముంబై, ఠాణేలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అక్రమకట్టడాలు, శిథిలావస్థకు చేరిన భవనాల్లో నివసించేవారి భద్రత అంశం తెరపైకి వచ్చింది. దీనిపై ముఖ్యమంత్రితోపాటు రాష్ట్ర యంత్రాంగమంతా తీవ్రంగా స్పందించారు. అక్రమ భవనాలతోపాటు శిథిలావస్థకు చేరిన భవనాలను ఖాళీ చేయించాలని నిర్ణయం తీసుకున్నాయి. దీంతోపాటు వర్షాకాలంలో మరింత ఆస్తి ప్రాణనష్టం జరగకుండా ముందుజాగ్రత్తగా స్ట్రక్చర్ అడిట్తోపాటు ఇతర చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావించింది. అయితే ఇప్పటికీ ఎలాంటి ముందుజాగ్రత్త చర్యలు చేపట్టలేదు. మరోవైపు శిథిలావస్థకు చేరిన భవనాలు, అక్రమ కట్టడాలు నేలకూలుతూనే ఉన్నాయి. ఏప్రిల్ నెలలో భవనం కూలిన సంఘటనను మరిచిపోకముందే జూన్ 21వ తేదీ తెల్లవారు జామున మరోసారి ముంబ్రా రైల్వేస్టేషన్ సమీపంలోని స్మృతి భవనం నేలకూలింది. ఈ సంఘటనలో పది మంది మృతి చెందారు. ఈ సంఘటన అనంతరం గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు శనివారం తెల్లవారుజామున ముంబ్రా రైల్వే సమీపంలోని బానోపార్క్ కుప్పకూలిపోయి ఒకరు మృతి చెందారు. భవనం కూలడానికి కొద్ది సమయం ముందు అక్కడ ప్రకంపనలు రావడం, భవనం ప్లాస్టింగ్ ఊడిపడటంతో అందులో ఉంటున్నవారు ప్రమాదాన్ని పసిగట్టి కట్టుబట్టలతో బయటకు పరుగులు దీసి ప్రాణాలు దక్కించుకున్నారు. ఏమాత్రం ఆలస్యమైనా భారీ ప్రాణనష్టం జరిగి ఉండేదేనని వారు వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి స్థానికంగా అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరముందని స్థానికులు అంటుతున్నారు. -
గుజరాత్లో కూలిన జంట భవనాలు
సాక్షి, ముంబై/వడోదరా: గుజరాత్లో మూడంతస్తుల జంట భవనాలు కుప్పకూలిపోయాయి. వదోదరా నగరంలో అట్లాదారా ప్రాంతంలోనున్న మాధవ్‌నగర్‌లో బుధవారం వేకువ జామున 4.30 గంటలకు ఈ ప్రమాదం సంభవించింది. 11మంది దుర్మరణం చెందారు. మరో 40 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృం దాల సాయంతో స్థానిక యంత్రాంగం ముమ్మరంగా సహాయక చర్యలు సాగిస్తోంది. శిథిలాల్లో చిక్కుకున్న 8 మందిని సురక్షితంగా బయటకు తీసినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఆరునెలల శిశువు, పదమూడేళ్ల బాలు డు ఉన్నట్లు సర్ సాయాజీరావు జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దేవేశ్వర్ పాండే చెప్పారు. జంట భవనాలు వేకువ జామున కుప్పకూలాయని, అప్పటికి అందరూ గాఢనిద్రలో ఉండటంతో ఎవరూ తప్పించుకోలేకపోయారని వదోదరా అగ్నిమాపక అధికారులు చెప్పారు. -
వడొదరలో కుప్పకూలిన భవనం: ముగ్గురు మృతి
గుజరాత్ రాష్ట్రంలోని వడొదర నగరంలో అట్లాండర ప్రాంతంలో ఈ రోజు తెల్లవారుజామున మూడంతస్థుల భవనం కుప్పకూలిన ఘటనలో ముగ్గురు మరణించారని నగర పోలీసు కమిషనర్ బుధవారం ఇక్కడ వెల్లడించారు. ఆ ఘటనలో మరణించిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఆ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను నగరంలోని ఎస్ఎస్జీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. గాయపడిన వారు కూడా అధిక సంఖ్యలో ఉంటారని తెలిపారు. కాగా శిథిలాల కింద చిక్కుకున్నవారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు చెప్పారు. ఆ దుర్ఘటన సమాచారం తెలుసుకున్న వెంటనే వడొదర మేయర్, మున్సిపల్ కమిషనర్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను వారు దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. 13 నుంచి 14 కుటుంబాలు కుప్పకూలిన భవనంలో నివాసం ఉంటున్నారని చెప్పారు. శిథిలాలను తొలగిస్తే గాని మరణించిన, గాయపడిన వారి సంఖ్య స్పష్టంగా తెలుస్తుందని మేయర్ ఓ ప్రకటన తెలిపారు. అట్లాండర గ్రామం కొద్ది సంవత్సరాల క్రితమే వడొదర నగరంలో విలీనం చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ దుర్ఘటనకు గల కారణాలను అన్వేషిస్తామని మేయర్ ఈ సందర్భంగా చెప్పారు.