
ముంబై: ముంబైలోని మలాడ్ మురికివాడ వద్ద రెండు అంతస్తుల అపార్టుమెంట్ భవనం మరో భవన నిర్మాణంపై కూలింది. ఈ ఘటనలో ఎనిమిది మంది పిల్లలతో సహా 11 మంది మృతి చెందగా.. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం రాత్రి 11.10 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు బీఎంసీ విపత్తు నిర్వహణ సెల్ పేర్కొంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న స్థానిక అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను సబర్బన్ కండివాలిలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. ఇక శిథిలావస్థలో ఉన్న మరో మూడంతస్తుల భవన నిర్మాణం నుంచి ప్రజలను తరలిస్తున్నట్లు ముంబై సివిల్ బాడీ బీఎంసీ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై బీజేపీ అధికార ప్రతినిధి రామ్ కదమ్ మాట్లాడుతూ.. నిర్లక్ష్యం కారణంగా జరిగిన ఈ హత్యలో ప్రజలు మరణించారంటూ అధికార పార్టీపై విరుచుకుపడ్డారు.
(చదవండి: తిమింగలం వాంతి.. విలువ రూ.8 కోట్లు)