25 మంది మరణించారు.. 6 నెలల బాలుడు బ్రతికాడు! | Egypt Building Collapse 6 Month Baby Found Alive | Sakshi
Sakshi News home page

బిల్డింగ్‌ కూలిన ఘటనలో క్షేమంగా 6 నెలల బాలుడు

Published Mon, Mar 29 2021 4:44 PM | Last Updated on Mon, Mar 29 2021 5:28 PM

Egypt Building Collapse 6 Month Baby Found Alive - Sakshi

ప్రమాద దృశ్యం

కైరో : ఈజిప్టులోని కైరోలో శనివారం అపార్ట్‌మెంట్‌ బిల్డింగ్‌ కూలిన ఘటనలో 25 మంది మృత్యువాత పడగా.. మరో 26 మంది గాయాలపాలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సంఘటనా ప్రదేశంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం శిథిలాల కిందనుంచి 6 నెలల బాలుడ్ని సహాయక సిబ్బంది ప్రాణాలతో వెలికి తీశారు. ఈ ఘటనలో బాలుడి తల్లి,తండ్రి, అక్క మృత్యువాత పడ్డారు. అతడి అన్న ఆచూకీ లభించలేదు. దీంతో సహాయక​సిబ్బంది అతడి కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు.

ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉంది. కాగా, బిల్డింగ్‌ కూలటానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. నాణ్యతలో లోపం కారణంగానే బిల్డింగ్‌ కూలిపోయినట్లు ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. దీనిపై దర్యాప్తు చేయటానికి ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. 

చదవండి, చదివించండి : ఒబామా కుటుంబంలో విషాదం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement