Egypt
-
దయ్యాల కోసం అద్దె చెల్లించడమా..!
అక్కడ దయ్యాలు, భూతాలు ఉన్నాయంటే ఆ వైపు కూడా వెళ్లరు చాలామంది. అలాంటిది ఓ వ్యక్తి కేవలం దయ్యాల కోసమే అద్దె చెల్లించాడు. ఈజిప్టులోని కైరో వెలుపల అతి పురాతనమైన మూడు పిరమిడ్లు ఉన్నాయి. వీటిని ఈజిప్ట్ ప్రభుత్వం అద్దెకిస్తోంది. వాటిల్లో ఒకటి, అతిపెద్దది, గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా. అక్కడ దాదాపు మూడువేలకు పైగా దయ్యాలు, భూతాలు ఉన్నాయని చాలామంది అంటుంటారు. ఇప్పుడు ఆ దయ్యాలను చూడటానికే ప్రముఖ యూట్యూబర్ జేమ్స్ డొనాల్డ్సన్ (మిస్టర్ బీస్ట్), వాటిని వంద గంటలకు అద్దెకు తీసుకున్నాడు. ‘బియాండ్ ది రికార్డ్స్’ పేరుతో భయంకర ప్రదేశాల్లోకి వెళ్లి, అక్కడ జరిగే విచిత్రమైన సంఘటనల వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు. ఇప్పుడు తన భారీ అన్వేషణ కోసం ఈజిప్ట్‌లోని ఈ పిరమిడ్లను ఎంచుకున్నాడు.మరో వింత..ఈ విమానంలో ప్రయాణించాల్సిన పనిలేదు.. ‘ఈ వంద గంటల్లో స్నేహితులతో కలసి అక్కడ ఉండే అన్ని గదులు, సమాధులను చూసి, అక్కడే నిద్రించాలన్నది నా ప్లాన్. ఇందుకోసం, అవసరమైన అన్ని వస్తువులతో పాటు, పారానార్మల్ యాక్టివిటీ డివైజ్, ఇతర పరికరాలను తీసుకెళ్తున్నా’ అని చెప్పాడు. కొంతమంది ఇది సాధ్యం కాదని కొట్టి పారేస్తుంటే, తను మాత్రం త్వరలోనే వీడియోతో సమాధానం చెబుతానంటున్నాడు. భూమి నుంచి దూరంగా వెళ్లకుండా విమానంలో స్పెండ్ చేయడం గురించి విన్నారా..?. ఆ ఆలోచనే వెరైటీగా ఉంది కదూ..!. అలాంటి కోరిక ఉంటే వెంటనే ఉత్తర అమెరికాలో అలాస్కాకి వచ్చేయండి. శీతాకాలపు మంచు అందాల తోపాటు విమానంలో గడిపే అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరి అదేంటో తెలుసుకుందామా..!ఆ వీడియోలో 1950ల నాటి విమానం(Airplane) వింటేజ్ డీసీ-6 విమానం విలక్షణమైన విమానహౌస్(Airplane House)గా రూపాంతరం చెందింది. ఇది ఒకప్పుడూ మారుమూల అలాస్కా(Alaska) గ్రామాలకు ఇంధనం, సామాగ్రిని సరఫరా చేసేది. ఇందులో రెండు బెడ్ రూమ్‌లు, ఒక బాత్రూమ్తో కూడిన వెకేషనల్ రెంటల్ హౌస్‌గా మార్చారు. చుట్టూ మంచుతో కప్పబడి ఉండే ప్రకృతి దృశ్యం మధ్యలో ప్రత్యేకమైన విమాన ఇల్లులో అందమైన అనుభూతి.ఇలా సర్వీస్ అయిపోయిన విమానాలను అందమైన టూరిస్ట్ రెంటల్ హౌస్‌లుగా తీర్చిదిద్ది పర్యాటకాన్ని ప్రోత్సహించొచ్చు అనే ఐడియా బాగుంది కదూ..!. చూడటానికి ఇది ప్రయాణించకుండానే విమానంలో గడిపే ఓ గొప్ప అనుభూతిని పర్యాటకులకు అందిస్తోంది. చెప్పాలంటే భూమి నుంచి దూరంగా వెళ్లకుండానే విమానంలో గడిపే ఫీలింగ్ ఇది. (చదవండి: మంచు దుప్పటిలో విలక్షణమైన ఇల్లు..ఒక్క రాత్రికి ఎంతో తెలుసా...!) -
ఎర్ర సముద్రంలో బోటు ప్రమాదం..16 మంది గల్లంతు
కైరో:ఎర్ర సముద్రంలో టూరిస్టు బోటు ప్రమాదశాత్తు మునిగిపోయింది. ఈజిప్టు తీరానికి దగ్గరలో జరిగిన ఈ ఘటనలో 16 మంది గల్లంతయ్యారు. మునిగిపోయినపుడు బోటులో మొత్తం 44 మంది ఉన్నారు. వీరిలో 31 మంది టూరిస్టులు కాగా 13 మంది సిబ్బంది.ప్రమాదం నుంచి 28 మందిని కాపాడినట్లు రెడ్సీ గవర్నరేట్ వెల్లడించింది.వీరంతా స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలిపింది.సముద్రంలో బోటును ఒక్కసారిగా అల వచ్చి బలంగా ఢీకొట్టడంతో బోటు మునిగినపోయినట్లు అధికారులు వెల్లడించారు.అల బలంగా తాకినపుడు కొంత మంది ప్యాసింజర్లు వారి క్యాబిన్లలో ఉండడం వల్ల తప్పించుకోలేకపోయారని తెలిపారు. గల్లంతైన వారి కోసం ముమ్మర గాలింపు జరుగుతోందని చెప్పారు. -
యుద్ధం ఆపేస్తేనే ఒప్పందం
జెరూసలేం: గాజా స్ట్రిప్‌లో యుద్ధం ముగిసే వరకు ఇజ్రాయెల్‌తో బందీల మార్పిడి ఒప్పందం ఉండదని హమాస్ స్పష్టం చేసింది. యుద్ధం ముగియకుండా, ఖైదీల మార్పిడి జరగదని హమాస్ తాత్కాలిక చీఫ్ ఖలీల్ అల్ హయా బుధవారం పేర్కొన్నారు. దురాక్రమణకు ముగింపు పలకకుండా బందీలను ఎందుకు వదిలేస్తామని ఆయన ప్రశ్నించారు. యుద్ధం మధ్యలో ఉండగా తమ వద్ద ఉన్న బలాన్ని మతి స్థిమితం లేని వ్యక్తి కూడా వదులుకోడని వ్యాఖ్యానించారు. సంప్రతింపులను పునరుద్ధరించడానికి కొన్ని దేశాలు, మధ్యవర్తులతో చర్చలు జరుగుతున్నాయని, తాము ఆ ప్రయత్నాలను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. యుద్ధం ఆపడానికి ఆక్రమించినవారు నిబద్ధతతో ఉన్నారా? లేదా అనేది ముఖ్యమని హయా చెప్పారు. చర్చలను బలహీనపరిచే వ్యక్తి నెతన్యాహు అని రుజువవుతోందన్నారు. మరోవైపు బేషరతుగా శాశ్వత కాల్పుల విరమణకు పిలుపునిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని అమెరికా బుధవారం వీటో చేసింది. కాల్పుల విరమణలో భాగంగా ఇజ్రాయెల్ బందీలను తక్షణమే విడుదల చేయాలని స్పష్టంగా కోరే తీర్మానానికి మాత్రమే అమెరికా మద్దతు ఇస్తుందని ఐరాసలో అమెరికా రాయబారి స్పష్టంచేశారు. ఒప్పందానికి ఇరుపక్షాలు సుముఖత చూపకపోతే మధ్యవర్తిత్వ ప్రయత్నాలను నిలిపివేస్తామని హమాస్, ఇజ్రాయెల్‌కు తెలియజేశామని కాల్పుల విరమణ మధ్యవర్తి అయిన ఖతార్ ప్రకటించింది. దోహాలోని హమాస్ రాజకీయ కార్యాలయాన్ని శాశ్వతంగా మూసివేయలేదని ఖతార్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మజీద్ అల్ అన్సారీ నవంబర్ 19న ప్రకటించారు. గాజా యుద్ధాన్ని ముగించడానికి మధ్యవర్తిత్వ ప్రయత్నాలను సులభతరం చేయడానికి హమాస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు అల్ అన్సారీ చెప్పారు. అయితే హమాస్‌ను బహిష్కరించాలని ఖతార్‌ను అమెరికా కోరిందని, దోహా ఈ సందేశాన్ని హమాస్‌కు చేరవేసిందని వార్తలు వచ్చాయి. ఈజిప్టు ప్రతిపాదనను స్వాగతించిన హమాస్ గాజా స్ట్రిప్‌ను నడపడానికి అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ప్రత్యర్థి ఫతా ఉద్యమంతో కలిసి ఒక పరిపాలనా కమిటీని ఏర్పాటు చేయాలని ఈజిప్టు చేసిన ప్రతిపాదనను హమాస్ స్వాగతించింది. యుద్ధం ముగిశాక గాజాను ఈ కమిటీ నడిపించి, సమస్యలను పరిష్కరిస్తుందని హయా చెప్పారు. అయితే ఒప్పందం ఇంకా ఖరారు కాలేదన్నారు. యుద్ధం తరువాత గాజాను పాలించడంలో హమాస్ పాత్రను ఇజ్రాయెల్ తిరస్కరించింది. -
పిరమిడ్‌పై పక్షుల వేట
వీధి శునకాలు ఆహారం కోసం ఊరంతా తిరుగుతాయి. కానీ ఒక వీధికుక్క ఏకంగా ఈజిప్ట్ పిరమిడ్నే ఎక్కేసింది. మార్షల్ మోషెర్ అనే అమెరికా పారా గ్లైడర్ ఈ ఉదంతాన్ని తన మొబైల్ కెమెరాలో బంధించాడు. ఆయన ఇటీవల తోటి పారాగ్లైడర్లతో కలిసి ప్రపంచ ప్రఖ్యాత గిజా పిరమిడ్ల మీదుగా సూర్యోదయ అందాలను చూసేందుకు బయల్దేరాడు. వినీలాకాశంలో చక్కర్లు కొడుతుండగా ఖఫ్రే పిరమిడ్ శిఖరంపై ఒక జీవి కనిపించింది. తొలుత దాన్ని పర్వత ప్రాంతాల్లో తిరిగే బుల్లి సింహంగా భావించారు. కానీ మొబైల్ కెమెరాను జూమ్ చేసి చూస్తే సాధారణ వీధి కుక్క అని అర్థమైంది. ప్రపంచంలోనే రెండో అత్యంత ఎత్తయిన పిరమిడ్‌పై అదేం చేస్తోందబ్బా అని పరిశీలిసతఏ, పిరమిడ్ శిఖరాగ్రంపై వాలే పిట్టలను పట్టుకునేందుకు పరుగులు పెడుతూ కని్పంచింది. వీధి కుక్కులు ఇలా 130 మీటర్లకు పై చిలుకు ఎత్తుకు ఎక్కిరావడం అరుదు. దారి తప్పి వచి్చందేమో, కిందకు ఎలా వెళ్లాలో తెలీక పైనే తచ్చాడుతోందేమో అని వారు భావించారు. మర్నాడు దాన్ని కిందకు దించాలని నిర్ణయించుకున్నారు. అది పిరమిడ్‌పై తిరుగుతున్న వీడియోను మోషెర్ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేస్తే రాత్రికి రాత్రే కోట్ల మంది చూశారు. తీరా మర్నాడు వెళ్లి చూస్తే కుక్క పిరమిడ్‌పై లేదు! ఒక శునకం పిరమిడ్ పై నుంచి తాపీగా కిందకు దిగొస్తున్న వీడియోను మరో సాహస యాత్రికుడు తర్వాతి రోజే నెట్లో షేర్చేశాడు. దాంతో అదే ఇదని నిర్ధారణకు వచ్చారు. ఈ వీడియో చూసిన కొందరు ఈజిప్షియన్లు మాత్రం శునకాన్ని ఏదో అతీంద్రీయ శక్తి పైకి తీసుకెళ్లిందని కామెంట్లు చేశారు. ఈజిప్ట్ పురాణాల ప్రకారం ఆ ప్రాంతంలో అనూబిస్ అనే దైవం ఉండేది. మనిషి శరీరం, నక్క ముఖంతో ఉండే ఆ దేవున్ని శుభాలకు ప్రతిరూపంగా భావిస్తారు. – కైరో -
ఈజిప్టులో రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి
కైరో: ఈజిప్టులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యూనివర్సిటీ విద్యార్థులతో వెళ్తున్న ఒక బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 12 మంది మృతిచెందారు. 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఐన్ సోఖ్నా హైవేపై ఈ ఘటన జరిగిందని ఈజిప్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.బస్సులో సూయజ్‌లోని గలాలా యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు ఉన్నారు. ఈ బస్సు ఐన్ సోఖ్నా హైవే మీదుగా వెళుతుండగా ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి 28 అంబులెన్స్‌లు చేరుకుని, సహాయక చర్యలు చేపట్టాయని ప్రభుత్వం తెలిపింది. క్షతగాత్రులకు సూయజ్ మెడికల్ కాంప్లెక్స్‌లో చికిత్స అందిస్తున్నారు.ఈజిప్టులో ప్రతి ఏటా వేలాది మంది రోడ్డు ప్రమాదాలలో మృతి చెందుతున్నారు. దేశంలో రవాణా భద్రత రికార్డు అధ్వాన్నంగా ఉంది. అతివేగం, అధ్వాన్నమైన రోడ్లు, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం కారణంగా దేశంలో అధికంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.ఇది కూడా చదవండి: రాజధానిలో నేటి నుంచి ‘గ్రాప్-1’ అమలు -
రైలు ప్రమాదం.. ఒకరు మృతి
కైరో: ఈజిప్ట్‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ప్యాసింజర్ రైలును వెనుక నుంచి మరో రైలు ఇంజన్ బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడు మృతిచెందాడు. 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. రైల్వే అధికారులు గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.ఈ ప్యాసింజర్ రైలు కైరోకు వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన రైలు ఇంజిన్ ఢీకొనడంతో పెద్ద శబ్ధం వచ్చింది. దీంతో ప్యాసింజర్ రైలులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన అనంతరం రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.ఉత్తరాఫ్రికా దేశమైన ఈజిప్టులో నెల రోజుల వ్యవధిలో ఇది రెండో రైలు ప్రమాదం. కైరోకు దక్షిణాన 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న మినాయా ప్రావిన్స్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించిందని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: దుర్గా నిమజ్జనంలో హింస.. ఒకరు మృతి -
Paris Olympics 2024: అమ్మతనం ఆటకు అడ్డు కాలేదు
గర్భిణి స్త్రీలు ప్రతి విషయంలో ఆచితూచి ఉండాలి. అయితే కొన్ని సందర్భాలు సవాళ్లు విసురుతాయి. దేశం కోసం నిలబడమంటాయి. పారిస్‌లో జరుగుతున్న ఒలింపిక్స్‌లో ఇద్దరు మహిళలు గర్భంతో పోటీల్లో నిలిచి ఆశ్చర్యపరిచారు. ఈజిప్ట్ ఫెన్సర్ నదా హఫెజ్ ఆరునెలల గర్భంతో, అజర్బైజాన్ ఆర్చర్ యయలాగుల్ రమజనోవా ఐదున్నర నెలల గర్భంతో ప్రత్యర్థులతో పోరాడారు. గెలుపు ఓటముల కంటే కూడా వాళ్లు పాల్గొనడమే పెద్ద గెలుపు. వీరు మాత్రమే కాదు, గర్భిణులుగా బరిలోకి దిగిన అథ్లెట్స్ గత ఒలింపిక్స్ లోనూ ఎంతోమంది ఉన్నారు.పదహారవ రౌండ్లో ఓటమి తరువాత తాను ఏడు నెలల గర్భిణిని అని ప్రకటించింది ఈజిప్ట్ ఫెన్సింగ్ క్రీడాకారిణి నదా హఫీజ్. ఆమె ప్రకటన సంచలనం కలిగించింది. నిజానికి గర్భిణిగా ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టిన క్రీడాకారులు, ఒలింపిక్స్‌లోకి అడుగు పెట్టిన తరువాత గర్భిణి అని తెలుసుకున్న వారు ఎంతోమంది ఉన్నారు....ఎలినార్ బర్కర్: టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్నప్పుడు బ్రిటిష్ సైకిలింగ్ స్టార్ ఎలినార్ బర్కర్ మూడు నెలల గర్భిణి. ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ గెలుచుకున్న ఎలినార్ ఆ తరువాతే తాను గర్భిణిని అనే విషయం ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. ‘రేసుకు కొద్దిరోజుల ముందు టోక్యోలో నేను గర్భవతినని తెలుసుకున్నాను. ఇది నేను ఊహించని విషయం. ఆ సమయంలో ఒత్తిడికి గురయ్యాను’ ఆరోజును గుర్తు చేసుకుంటుంది ఎలినార్. ఎలినార్ బార్కర్ ఎండోమెట్రియోసిస్‌తో బాధపడుతుండేది. దీని వల్ల గర్భిణులకు సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉండడం ఆమె ఒత్తిడికి కారణం. కొద్దిరోజుల్లో ఆట, మరో వైపు కొండంత ఒత్తిడి. టీమ్ డాక్టర్, సైకియాట్రిస్ట్‌ను సంప్రదించి సలహాలు తీసుకుంది. ధైర్యం తెచ్చుకుంది. మెడల్ గెలుచుకుంది.ఆంకీ వాన్ గ్రన్సె్వన్: డచ్ డ్రెస్సేజ్ ఛాంపియన్ ఆంకీ వాన్ గ్రన్సె్వన్ అయిదు నెలల గర్భిణిగా ఒలింపిక్స్ బరిలోకి దిగి స్వర్ణ పతకం సాధించింది.క్రిస్టీ మూర్: అయిదు నెలల గర్భిణిగా 2010 ఒలింపిక్స్ బరిలోకి అడుగు పెట్టింది కెనడియన్ కర్లర్ క్రిస్టీ మూర్. కాస్త వెనక్కి వెళితే...ఒకరోజు కర్లింగ్ టీమ్ నుంచి క్రిస్టీకి ఫోన్ కాల్ వచ్చింది. ‘ఐయామ్ ప్రెగ్నెంట్’ అని చెప్పింది క్రిస్టీ. ‘ఆడడం మీకు కష్టమవుతుందా’ అవతలి గొంతు.ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. ఆ సమయంలో తన టీమ్మెట్ ఒకరు.... ‘నువ్వు ప్రెగ్నెంట్ మాత్రమే. చనిపోలేదు’ అన్నది. దీని అర్థం ‘నీలో పోరాడే సత్తా’ ఉంది అని. దీంతో మరో ఆలోచన చేయకుండా ఒలింపిక్ బరిలోకి దిగింది క్రిస్టీ మూర్.‘ఒలింపిక్స్‌లో పాల్గొనడం, మాతృత్వం... రెండూ అపురూపమే. పెద్ద సవాలు అని తెలిసినా ముందుకు వెళ్లాను’ ఆ రోజులను గుర్తు చేసుకుంటుంది క్రిస్టీ మూర్.మరి కొందరి విషయానికి వస్తే....అమెరికన్ ఐస్–హాకీ ప్లేయర్ లీసా బ్రౌన్ మిల్లర్ 1998 వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొంది, అక్కడికి వెళ్లాకే తాను ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసింది. అమెరికన్ సాఫ్ట్‌బాల్ ప్లేయర్ మిషల్ గ్రెంజర్ మూడు నెలల గర్భిణిగా 1996 ఒలింపిక్స్‌లోకి అడుగు పెట్టింది. జర్మన్ ఆర్చర్ కర్నోలియ ఏడు నెలల గర్భిణిగా 2004 ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టింది... ఈ జాబితా ఇంకా ఉంది. వీరిలో స్వర్ణాలు గెలుచుకున్నవారు ఉన్నారు. గెలవకపోయినా సత్తా చాటిన వారు ఉన్నారు.‘వీడు కడుపులో ఉన్నప్పుడే నాతో పాటు ఒలింపిక్స్ ఆడాడు’ అని తమ బిడ్డల గురించి గర్వంగా చెబుతుంటారు ఆ అథ్లెట్ తల్లులు.ఆ సమయంలో...రక్తస్రావంలాంటి సమస్యలు ఉన్నప్పుడు తప్ప సాధారణంగా తేలికపాటి వ్యాయామాలను గర్భిణి అథ్లెట్లకు సూచిస్తాం. ప్రెగ్నెన్సీ మొదటి మూడు నెలల్లో రొటీన్ ఎక్సర్సైజ్లు చేసినా ఫరవాలేదు. ఎక్కువగా చేయడానికి ప్రయత్నించవద్దు. మితంగా చేస్తే చాలు అని చెబుతుంటాం. బ్యాడ్మింటన్, టెన్నిస్‌లాంటి ఆటలు ఆడాలనుకునేవారికి మాత్రం సాధ్యమైనంత వరకు వద్దనే చెబుతాం.– డా. ఆశా దలాల్, సర్ హెచ్ఎన్ రిలయన్స్ హాస్పిటల్స్ ఉమెన్ సెంటర్ డైరెక్టర్ -
ప్యారిస్ ఒలింపిక్స్‌లో ఓ అద్భుతం ఫెన్సర్ ‘నడా హఫేజ్’
ప్రపంచంలోని అత్యుత్తమ క్రీడాకారులు పోటీ పడే విశ్వ క్రీడా వేదిక ప్యారిస్ ఒలింపిక్స్‌లో అద్భుతం చోటు చేసుకుంది. ఏ రంగంలోనైనా రాణించాలంటే మహిళలు మరింత కష్టపడాలి. అయితే తాము అనుకున్నది సాధించే క్రమంలో మహిళలు ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా భరిస్తారు. ఈ మాటలను అక్షరాలా నిజం చేశారు. ఈజిప్ట్ ఫెన్సర్ నడా హఫేజ్. ఆమె ఏడు నెలల గర్భంతో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగారు. ఒలింపిక్ చరిత్రలో ఏడు నెలల గర్భిణి పోటీలో నిలవడం, అదీ టాప్ టెన్‌లో నిలవడం విశేషంగా నిలిచింది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా స్వయంగా హఫేజ్ వివరించారు. జీవితం, క్రీడలు ప్రయాణం ఎంత శ్రమతో కూడుకున్నదో వివరించింది. ‘నేను లిటిల్ ఒలింపియన్‌ను మోస్తున్నాను. శారీరకంగా, మానసికంగా ఎదురవుతున్న సవాళ్లలో మా ఇద్దరికీ సమాన వాటా ఉంది. జీవితం, ఆటను బ్యాలెన్స్ చేసేందుకు పోరాడాల్సి వస్తోంది’ అంటూ తొలి రౌండ్ గెలిచిన తర్వాత 26 ఏండ్ల హఫేజ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Nada Hafez (@nada_hafez)పోడియంపై మీకు ఇద్దరు ఆటగాళ్ళుగా కనిపిస్తున్నారు, వారు నిజానికి ఇక్కడ ముగ్గురున్నారు. అది నేను, నా పోటీదారు, నా చిన్న పాప! శారీరక, మానసిక శ్రమ సవాళ్లలో నాతోపాటు, ఆ చిన్నిపాపాయికి కూడా వాటా ఉంది. అంతేకాదు తన ఈ ప్రయాణంలో తన భర్త సహకారం కూడా ఏంతో ఉందని, తన ఫ్యామిలీ తనపై నమ్మకాన్ని ఉంచడం తన అదృష్టమని కూడా తెలిపింది. అలాగే ప్రపంచ 10వ ర్యాంకర్ ఎలిజబెత్ టార్టకోవ్స్కీపై ఓపెనింగ్‌లో ఎలా విజయం సాధించిందో వివరించింది. టార్టకోవ్స్కీతో జరిగిన మహిళల వ్యక్తిగత ఫెన్సింగ్‌లో హఫీజ్ 15-13తేడాతో తన మొదటి బౌట్‌ను గెలుచుకుంది, అయితే పారిస్ గేమ్స్‌లో 16వ రౌండ్లో దక్షిణ కొరియాకు చెందిన జియోన్ హయోంగ్ చేతిలో ఓడిపోయింది. గతంలో ఈజిప్ట్ తరపున 2016 , 2020 ఒలింపిక్స్‌లో సాబ్రే క్రీడలో పోటీ పడింది. -
Olympics 2024: ఏడు నెలల గర్భంతో బరిలోకి.. ఫెన్సర్ పోస్ట్ వైరల్
‘‘పోడియం వద్ద ఇద్దరు ప్లేయర్లు మాత్రమే మీకు కనిపిస్తున్నారు. నిజానికి అక్కడ ముగ్గురం ఉన్నాము. నేను.. నా ప్రత్యర్థి.. ఇంకా ఈ ప్రపంచంలోకి రాని నా చిన్నారి బేబి కూడా! ఇక్కడి దాకా సాగిన మా ప్రయాణంలో నేను, నా కడుపులోని బిడ్డ శారీరకంగా, మానసికంగా ఎన్నో కఠిన సవాళ్లు ఎదుర్కొన్నాం.సాధారణంగానే... గర్భవతి అయిన వాళ్లు భావోద్వేగాల డోలికల్లో తేలియాడుతూ ఉంటారు. ఒక్కోసారి క్లిష్టపరిస్థితులు ఎదురవుతాయి. అయితే, ఇలాంటి సమయంలోనూ ఏమాత్రం తొణకకుండా.. ఇష్టమైన క్రీడలో ముందుకు సాగడం అంత తేలికేమీ కాదు. అయినా.. నా కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కినందుకు సంతోషంగానే ఉంది.రౌండ్ ఆఫ్ 16లో చోటు సంపాదించినందుకు గర్వపడుతూ నేను పోస్టు పెడుతున్నా. నేను ఇక్కడిదాకా వచ్చేందుకు నాకు మద్దతుగా నిలిచి.. నాపై నమ్మకం ఉంచిన వ్యక్తిని భర్తగా కలిగి ఉన్న అదృష్టవంతురాలిని. నా కుటుంబం కూడా నాకు ఎల్లవేళలా అండగా నిలిచింది.ఈ ఒలింపిక్స్ నా కెరీర్లో ప్రత్యేకమైనవి. మూడుసార్లు ఒలింపియన్‌ను.. ఈసారి లిటిల్ ఒలింపియన్‌ను కడుపులో మోస్తూ ఇక్కడి దాకా వచ్చాను’’ అంటూ ఈజిప్టు ఫెన్సర్ నదా హఫీజ్ ఉద్వేగానికి లోనైంది. ఏడు నెలల గర్భంతో ప్యారిస్ ఒలింపిక్స్-2024లో పోటీపడినట్లు తెలిపింది.కాబోయే తల్లిగా విశ్వ క్రీడల్లో పాల్గొనడం తనకు సరికొత్త అనుభూతిని ఇచ్చిందని నదా పేర్కొంది. రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించే క్రమంలో తన మనసులో చెలరేగిన ఉద్వేగాలను మాటల్లో వర్ణించలేనని.. ప్యారిస్ నుంచి ఇక సంతోషంగానే నిష్క్రమిస్తానని నదా తెలిపింది.కాగా నదా హఫీజ్ 2016 రియో ఒలింపిక్స్, టోక్యో ఒలింపిక్స్‌లో ఈజిప్టు తరఫున ఫెన్సింగ్‌లో పోటీపడింది. అయితే, ఒక్కసారి కూడా పతకం గెలవలేకపోయింది. తాజాగా ప్యారిస్ ఒలింపిక్స్‌లో తన తొలి మ్యాచ్‌లో వరల్డ్‌నంబర్ 10 ఎలిజబెత్ టార్టకోవ్స్కీతో తో తలపడ్డ నదా హఫీజ్.. 15- 13తో జయకేతనం ఎగురవేసింది. అయితే, రౌండ్ ఆఫ్ 16లో మాత్రం దక్షిణ కొరియాకు చెందిన జియోన్ హాయంగ్ చేతిలో 15-7తో ఓడిపోయింది. తద్వారా మహిళల వ్యక్తిగత ఫెన్సింగ్ విభాగంలో నదా హఫీజ్ ప్రయాణానికి అంతటితో తెరపడింది.ఫెన్సింగ్ అంటే ఏమిటి?సంప్రదాయ క్రీడ కత్తిసాము ఆధునిక రూపం ఇది. ఇద్దరు అథ్లెట్లు పరస్పరం తలపడుతూ తమను తాము రక్షించుకుంటూ.. ఎదుటివారిని టార్గెట్ చేస్తూ పాయింట్లు స్కోరు చేస్తారు. ఇందులో మూడు రకాలు ఉన్నాయి. ఫాయిల్, ఇపీ, సాబెర్. ఏథెన్స్ 1896 ఒలింపిక్స్ నుంచి ఫెన్సింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. గత టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ నుంచి భవానీదేవీ పోటీపడింది. View this post on Instagram A post shared by Nada Hafez (@nada_hafez) -
Israel-Hamas war: కాల్పుల విరమణకు హమాస్ ఓకే!
జెరూసలెం: ఈజిప్టు– ఖతార్ ప్రతిపాదించిన యుద్ధ విరమణ ప్రతిపాదనను తాము ఆమోదించామని హమాస్ సోమవారం ప్రకటించింది. గాజాలో ఏడు నెలలుగా హమాస్– ఇజ్రాయెల్‌ల మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తమ అగ్రనేత ఇస్మాయిల్ హనియే కాల్పుల విరమణకు తాము అంగీకరిస్తున్నామనే విషయాన్ని ఖతారు ప్రధాని, ఈజిప్టు ఇంటలిజెన్స్ మినిస్టర్లకు తెలియజేశారని హమాస్ ఒక ప్రకటనలో తెలిపింది. పూర్తి యుద్ధ విరమణ, గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి మళ్లడం లాంటివి ఈ శాంతి ప్రతిపాదనలో ఉన్నాయో, లేదోననే విషయంపై స్పష్టత లేదు. లక్ష మంది పాలస్తీనియన్లు రఫా నగరం నుంచి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ హకుం జారీచేసిన కొద్ది గంటల్లోనే హమాస్ ప్రకటన వెలువడటం గమనార్హం. హమాస్ నుంచి ఈ ప్రకటన వెలువడగానే రఫాలోని శిబిరాల్లో తలదాచుకుంటున్న పాలస్తీనియన్లు ఆనందోత్సాహాన్ని వెలిబుచ్చారు. రఫాపై ఇజ్రాయెల్ దాడి ముప్పు తప్పినట్లేనని వారు భావిస్తున్నారు. అయితే హమాస్ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. -
ఇజ్రాయెల్ కొత్త ప్లాన్.. ఈజిప్ట్ స్ట్రాంగ్ వార్నింగ్
దక్షిణ గాజాలోని కీలకమైన రఫా నగరంలో దాడులు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ తెలిపింది. ఆ దిశగా తమ సైన్యం హమాస్ బలగాలను అంతం చేయటమే లక్ష్యంగా ముందుకు కదులుతోందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. అంతర్జాతీయంగా గాజాలో మానవత సాయం అందించాలని ఎంత ఒత్తిడి తీసుకువచ్చినా ఇజ్రాయెల్ మాత్రం పట్టువిడవకుండా తమ సైన్యాన్ని కీలకమైన రఫా నగరంలో దాడుల కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు ఏ సమయంలో దాడులను ఉధృతం చేస్తారనే కచ్చితమైన సమాచారాన్ని మాత్రం ఇజ్రాయెల్ ఇంకా వెల్లడించలేదు.సుమారు 40,000 మిలిటరీ టెంట్లలను ఇజ్రాయెల్ సైన్యం సిద్ధం చేసుకుంది. ఒక్కో టెంట్లో సుమారు 10 నుంచి 12 మంది సైనికులు ఉంటారని ఓ ఆర్మీ ఉన్నతాధికారి తెలిపారు. ఈ టెంట్లను రఫా నగరానికి సుమారు ఐదు కిలో మీటర్ల దూరంలో ఏర్పాటు చేసినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రఫా నగరం ఈజిప్టు సరిహద్దును ఆనుకొని ఉంది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య చెలరేగిన యుద్ధ ప్రారంభం నుంచి గాజా వదిలి వెళ్లిన మిలియన్ పాలస్తీనియన్ల అక్కడ ఆశ్రయం పొందుతున్నారు.మరోవైపు.. రఫా నగరంపై దాడి విషయంలో ఈజిప్ట్ ఇజ్రాయెల్‌ను తీవ్రంగా హెచ్చరించింది. రఫా నగరంలో ఎటువంటి దాడులు చేసి.. అక్కడి పౌరుల పరిస్థితులు, ప్రాతీయ శాంతి, భద్రతకు దాడుల ద్వారా భంగం కలిగిస్తే.. ఇజ్రాయెల్ విపత్కర పరిణామాలు ఎదుర్కొవల్సి వస్తుందని ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్‌సీసీ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈజిప్ట్ హెచ్చరికలను సైతం పక్కన పెట్టిన ఇజ్రాయెల్ రఫాలో దాడులు కొనసాగుతాయని, తమ సైన్యం కూడా ముందుకు కదులుతోందని పేర్కొంది. అమెరికా, ఈజిప్ట్, ఖతార్ దేశాలు రాఫా నగరంపై దాడిని నివారించడానికి కాల్పుల విరమణ పొడగింపునకు మధ్యవర్తిత్వం వహించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇక.. ఇప్పటివరకు ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడుల్లో దాదాపు 34 వేల మంది పాలస్తీనా ప్రజలు మృతి చెందారు. -
పుస్తక హననం
నేను గనక కాలంలో వెనక్కి వెళ్లగలిగితే, అలెగ్జాండ్రియా లైబ్రరీని దర్శిస్తానంటాడు ఖగోళ శాస్త్రవేత్త కార్ల్ సాగన్ . ఈజిప్టులోని అలెగ్జాండ్రియా లైబ్రరీకి ప్రపంచంలోనే అత్యంత గొప్ప గ్రంథాలయం అని పేరు. వేలాది గ్రీకు, హీబ్రూ, మెసొపొటేమియన్ సాహిత్య స్క్రోల్స్, ప్రాచీన ఈజిప్టుకు చెందిన కళోపకరణాలు ఇక్కడ ఉండేవి. ఎరాటోస్తనీస్, ఆర్కిమెడీస్, యూక్లిడ్ వంటి గ్రీకు శాస్త్రజ్ఞులు దీన్ని సందర్శించారు. రెండు వేల ఏళ్ల కిందట ఇది వైభవోపేతంగా వర్ధిల్లిందనీ, దీన్ని క్రీ.పూ. 48–47 ప్రాంతంలో సీజర్ తగలబెట్టేశాడనీ చెబుతుంటారు. అయితే, తగలబడిందని నిర్ధారించడానికి చారిత్రక ఆధారాలు లేవనీ, మానవ జాతి పోగేసుకున్న సమస్త వివేకసారం మట్టి పాలైందని అనుకోవడంలో ఉన్న ఉద్వేగంలోంచి ఈ కథ పుట్టివుంటుందనీ చెబుతాడు బ్రిటిష్ లైబ్రేరియన్, రచయిత రిచర్డ్ ఓవెండెన్ . ఇప్పటి ‘పుస్తకం’ ఉనికిలో లేని ఆ కాలంలో నునుపు చేసిన చెట్ల బెరడుల రోల్స్ కాలక్రమంలో నశించడమే ఈ కథగా మారివుంటుందని మరో కథ. ఏమైనా, సమస్త విజ్ఞానం ఒక చోట రాశిగా పోగయ్యే గ్రంథాలయం అనే భావనను ఊహించడమే మానవ నాగరికత సాధించిన విజయం. ఆ గ్రంథాలయాలనే నేలమట్టం చేయడం ద్వారా శత్రువు మీద పైచేయి సాధించే ప్రయత్నం చేయడం... అదే నాగరిక మానవుడి అనాగరికతకు తార్కాణం. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం మొదలైనప్పటినుంచీ జరుగుతున్న ప్రాణనష్టం గురించి మీడియా మాట్లాడుతూనే ఉంది. కానీ గాజాలో కనీసం పదమూడు గ్రంథాలయాలకు ఇజ్రాయెల్ వల్ల నష్టం వాటిల్లింది. ఇందులో కొన్ని పూర్తిగా నాశనం కాగా, కొన్ని దారుణంగా దెబ్బతినడమో, అందులో ఉన్నవి దోచుకెళ్లడమో జరిగింది. నూటా యాభై ఏళ్ల గాజా చరిత్ర రికార్డులున్న సెంట్రల్ ఆర్కైవ్స్ ఆఫ్ గాజా, పాలస్తీనాలోని అరుదైన పుస్తకాల కలెక్షన్ కలిగివున్న గ్రేట్ ఒమారి మాస్క్, వేలాది పుస్తకాలకు నెలవైన డయానా తమారీ సబ్బాగ్ లైబ్రరీతో పాటు, గాజా యూనివర్సిటీ లైబ్రరీ, అల్–ఇస్రా యూనివర్సిటీ లైబ్రరీ కూడా దెబ్బతిన్నవాటిల్లో ఉన్నాయి. ‘‘ఆర్కైవ్ మీద ఆధిపత్యం లేకపోతే రాజకీయ అధికారం లేదు’’ అంటాడు ఫ్రెంచ్ విమర్శకుడు జాక్వెస్ డెరిడా. అందుకే గ్రంథాలయాలను దొంగదెబ్బ కొట్టడం అనేది చరిత్ర పొడవునా జరుగుతూనే ఉంది. ప్రపంచానికే జ్ఞానకాంతిగా వెలుగొందింది భారత్‌లోని నలందా విశ్వవిద్యాలయం. 5వ శతాబ్దంలో గుప్తులకాలంలో ఇది నిర్మితమైంది. రత్నదధి, రత్నసాగర, రత్నరంజక పేరుతో మూడు తొమ్మిదంతస్థుల భవనాలుండేవి. ఖగోళం, జ్యోతిషం, గణితం, రాజకీయం, ఆయుర్వేదం, వైద్యం, కళలు, సాహిత్యం, వ్యాకరణం, తర్కం సంబంధిత అంశాలన్నింటికీ నెలవు ఇది. జైన తీర్థంకరుడు మహావీరుడు 14 వర్షాకాలాలు ఇక్కడ గడిపాడట! క్రీ.శ.1193లో భక్తియార్ ఖిల్జీ దీన్ని తగలబెట్టించాడు. దేశంలో బౌద్ధ ప్రాభవం క్షీణించడానికి ఇదీ ఓ కారణమని చెబుతారు. ‘‘గ్రంథాలయాల ద్వారా సమాజం తన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంది. కొన్నిసార్లు గ్రంథాలయాలను సాంస్కృతిక హనన పథకంలో భాగంగా ఉద్దేశపూర్వకంగా నాశనం చేశారు. ఎన్నో ప్రజా, ప్రైవేటు లైబ్రరీలు మూర్ఖ దురాక్రమణదారుల వల్ల నాశనం అయ్యాయి’’ అంటారు పాత్రికేయుడు జానీ డైమండ్. బీజింగ్‌లో ఎనిమిదో శతాబ్దంలో నెలకొల్పిన హాన్లిన్ లైబ్రరీ ఒక విజ్ఞాన భాండాగారం. ఇందులో ఒక ముఖ్యమైన సోర్సు మింగ్ వంశపు చక్రవర్తి ఝూ డీ 1403లో ‘జాంగ్లే దాదియన్ ’ పేరుతో సిద్ధం చేయించిన ఎన్ సైక్లోపీడియా. వ్యవసాయం, నాటకం, భూగర్భశాస్త్రం, వైద్యం, కళ, చరిత్ర, సాహిత్యం లాంటి వాటితో కూడిన 22,000 విభాగాలు అందులో ఉన్నాయి. 1900వ సంవత్సరంలో మంటల్లో లైబ్రరీ తగలబడినప్పుడు ఆ ఎన్ సైక్లోపీడియా కూడా మసైపోయింది. వలసవాదులు, తిరుగుబాటుదారుల రూపంలో ఉన్న బ్రిటిష్ వాళ్లు, చైనీయులు దీనికి కారణం మీరంటే మీరేనని పరస్పరం నిందించుకున్నారు. అమెరికా జాతీయ గ్రంథాలయాన్ని 1814లో బ్రిటిష్‌వాళ్లు నాశనం చేశారు. అప్పటికి దాన్ని నెలకొల్పి నాలుగేళ్లే అయింది. సెనేటర్ల ఉపయోగార్థం 3000 వాల్యూములు అందులో ఉన్నాయి. అయినప్పటికీ ఆ దెబ్బ తమ జాతి ఆత్మను గాయపరిచిందంటాడు అమెరికా చరిత్రకారుడు రాబర్ట్ డార్న్‌టన్ . అదే బ్రిటనీయులు 2003లో ఇరాక్ జాతీయ గ్రంథాలయాన్ని నాశనం చేశారు. పనామ్ పెన్ ్హ నగరంలోని జాతీయ గ్రంథాలయాన్ని 1967లో సర్వనాశనం చేయడం ద్వారా కంబోడియా నాగరికత మొత్తాన్నీ ‘ఖ్మేర్ రూజ్’ తుడిచిపెట్టింది. దేశ చరిత్రను మళ్లీ ‘ఇయర్ జీరో’ నుంచి మొదలుపెట్టించాలన్న మూర్ఖత్వంలో భాగంగా కమ్యూనిస్టు నాయకుడు పోల్ పాట్ సైన్యం నరమేధానికీ, సాంస్కృతిక హననానికీ పాల్పడింది. సుమారు లక్ష పుస్తకాలున్న, అప్పటికి యాభై ఏళ్ల పాతదైన శ్రీలంకలోని జాఫ్నా పబ్లిక్ లైబ్రరీని 1981లో సింహళ మూక కూడా అలాగే తగలబెట్టింది. ఒక గ్రంథాలయం ధ్వంసమైతే మనం ఏం కోల్పోయామో కూడా మనకు తెలియకపోవడం అతి పెద్ద విషాదం. ఒక గ్రంథాలయాన్ని నిర్మూలించడమంటే ఒక దేశ, ఒక జాతి సాంస్కృతిక వారసత్వాన్ని పూర్తిగా తుడిచిపెట్టడం; గతపు ఘనతను పూర్తిగా నేలమట్టం గావించడం; అన్నీ కోల్పోయినా మళ్లీ మొదలెట్టగలిగే శక్తియుక్తులను నిర్వీర్యం చేయడం; చెప్పాలంటే ఇంకేమీ లేకుండా చేయడం, సున్నా దగ్గరికి తెచ్చి నిలబెట్టడం! అయినా గోడలు కూలితేనే, పుస్తకాలు కాలితేనే గ్రంథాలయం నాశనం కావడమా? వాటిపట్ల నిర్లక్ష్యం వహించడం మాత్రం నెమ్మదిగా నాశనం చేయడం కాదా? -
ఈజిప్ట్ అమ్మాయి నోట మన దేశభక్తి గీతం..మోదీ ప్రశంసల జల్లు!
గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశమంతటా అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుకల్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన ఈజిప్ట్‌లోని కైరో భారత రాయబార కార్యాలయంలో చోటు చేసుకుంది. ఓ విదేశీయురాలి నోట మన దేశభక్తి గీతం పలకడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అందుకు సంబందించిన వీడియోని కైరోలోని భారత రాయబార కార్యాలయం నెట్టింట షేర్ చేసింది. ఆ వీడియోలో ఈ జిప్ట్కి చెందిన కరీమాన్ అనే అమ్మాయి దేశభక్తి గీతం "దేశ్ రంగీలా" పాటను ఎంతో చక్కగా ఆలపించింది. ఈ వీడియోని చూసి ప్రధాని నరేంద్ర మోదీ ఆమె ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది. ఈ ప్రయత్నానికి ఆమెను అభినందిస్తున్నాను. ఆమెకు అద్భుతమైన భవిష్యత్తు ఉందంటూ ప్రశంసించారు. కాగా, 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కరీమాన్ పాడిన పాట ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అక్కడి రాయబార కార్యాలయంలో కరీమాన్ గానం అటు భారతీయులను, ఈజిప్షియన్లను ఎంతగానో ఆకట్టుకోవడం విశేషం. A young Egyptian girl Kariman presented a patriotic song "Desh Rangeela" during 75th #RepublicDay celebrations at 'India House'. Her melodious singing and correct intonation impressed the large gathering of Indians and Egyptians. @MEAIndia @IndianDiplomacy @MinOfCultureGoI pic.twitter.com/7mQiZY4Q77 — India in Egypt (@indembcairo) January 28, 2024 (చదవండి: నెట్టింట అందమైన అమ్మాయి ఫోటో రియలా? ఏఐ మాయా?) -
Israel-Hamas war: అల్–షిఫా నుంచి 31 మంది శిశువుల తరలింపు
ఖాన్ యూనిస్: అల్–షిఫా ఆసుపత్రిలోని హృదయ విదారక దృశ్యాలు ప్రపంచాన్ని కదిలించాయి. ఇజ్రాయెల్ నిర్బంధంలో ఉన్న ఆ ఆసుపత్రిలో శిశువుల దీన స్థితిని చూసి ప్రజలు చలించిపోయారు. వారి ప్రాణాలు కాపాడాలని ఇజ్రాయెల్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఇజ్రాయెల్ సానుకూలంగా స్పందించింది. శిశువుల తరలింపునకు అంగీకరించింది. నెలలు నిండకుండా పుట్టిన 31 మంది శిశువులను అల్–షిఫా హాస్పిటల్ నుంచి దక్షిణ గాజాలోని మరో ఆసుపత్రికి తరలించారు. వారిని పొరుగు దేశమైన ఈజిప్టుకు చేర్చి, మెరుగైన చికిత్స అందించనున్నట్లు గాజా ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. ఇంకా చాలామంది రోగులు, క్షతగాత్రులు, సామాన్య జనం ఇంకా అల్–షిఫా ఆసుపత్రిలోనే ఉన్నారు. ఇజ్రాయెల్ సైన్యం వారిని బయటకు వెళ్లనివ్వడం లేదు. ఇక్కడ ప్రాణాధార ఔషధాలు, ఆహారం, నీరు, విద్యుత్ లేకబాధితులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అత్యవసర చికిత్స అవసరమైన శిశువులను అల్–షిఫా నుంచి అంబులెన్స్‌ల్లో దక్షిణ గాజాలోని రఫా హాస్పిటల్‌కు తరలిస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ చెప్పారు. జబాలియా శరణార్థి శిబిరంపై క్షిపణుల వర్షం గాజాపై ఇజ్రాయెల్ సైన్యం భూతల, వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. అల్–షిఫా ఆసుపత్రిని పూర్తిగా దిగ్బంధించింది. సాధారణ జనావాసాలతోపాటు పాఠశాలలు, శరణార్థి శిబిరాలపైనా క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఉత్తర గాజాలోని జబాలియా శరణార్థి శిబిరంపై శనివారం అర్ధరాత్రి నుంచి దాడులు కొనసాగించింది. పదుల సంఖ్యలో జనం మరణించినట్లు తెలుస్తోంది. ఉత్తర గాజా నుంచి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం పదేపదే హెచ్చరిస్తోంది. హమాస్ మిలిటెంట్ల స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు కొనసాగిస్తున్నామని, సాధారణ ప్రజలకు నష్టం వాటిల్లకూడదన్నదే తమ ఉద్దేశమని వెల్లడించింది. ఉత్తర గాజాలో ప్రస్తుతం తమ దళాలు చాలా క్రియాశీలకంగా పని చేస్తున్నాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో గాజాలో ఇప్పటిదాకా 12,000 మందికిపైగా మృతిచెందారు. మరో 2,700 మంది శిథిలాల కింద గల్లంతయ్యారు. బందీల విడుదలకు యత్నాలు గాజాలో హమాస్ చెరలో దాదాపు 240 మంది బందీలుగా ఉన్నారు. వారిలో ఇప్పటిదాకా నలుగురి బందీలను మిలిటెంట్లు విడుదల చేశారు. మరో ఇద్దరు బందీల మృతదేహాలు ఇటీవల్ అల్–షిఫా ఆసుపత్రి సమీపంలో లభ్యమయ్యాయి. మిగిలిన బందీల విడుదలకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఈ విషయంలో ఇజ్రాయెల్, అమెరికాతోపాటు పర్షియన్ గల్ఫ్ దేశమైన ఖతార్ చొరవ తీసుకుంటున్నాయి. ఖతార్ ప్రతినిధులు హమాస్ నేతలతో చర్చలు జరుపుతున్నారు. బందీలను క్షేమంగా విడుదల చేయాలని కోరుతున్నాయి. -
ఈజిప్టులో పలు వాహనాలు ఢీకొని... 32 మంది మృతి
కైరో: ఈజిప్టులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 32 మంది మృత్యువాతపడ్డారు. కైరో–అలెగ్జిండ్రియా ప్రధాన రహదారిపై బెహీరా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మొదటగా ప్రయాణికులతో వెళ్తున్న బస్సు రోడ్డు పక్కన నిలిపి ఉంచిన వాహనాన్ని ఢీకొట్టింది. ఆ వెనుకే వస్తున్న కార్లు ఒకదానినొకటి ఢీకొట్టి, మంటలు చెలరేగాయి. మొత్తం 29 వాహనాలు ప్రమాదంలో చిక్కుకోగా బస్సు సహా ఆరు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనలో 32 మంది వరకు చనిపోగా మరో 63 మంది గాయపడ్డారు. దట్టంగా కురుస్తున్న మంచు కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారులు అంటున్నారు. -
మనవాళ్ళకి ఎందుకంత ఆందోళన?
ప్రస్తుతం ఇజ్రాయెల్– పాలస్తీనియన్ల మధ్య నెలకొన్న ఘర్షణాత్మక వాతావరణం స్వయం ప్రకటిత మేధావులమని చెప్పుకునే మనదేశంలోని కొందరికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, సోషల్ మీడియాలో ఒకటే గోల! హమాస్ చర్యలను ప్రామాణీకరిస్తూ సంఘీభావ ర్యాలీలు తీయడం, హమాస్ దాడుల తరహాలో భారతదేశంలో కూడా దాడులు చేయాలంటూ దేశ సమగ్రతకు సవాలు విసిరే విధంగా వీడియోల పోస్టింగులు!! భారతదేశం భద్రతను దృష్టిలో ఉంచుకున్న భారత ప్రభుత్వం హమాస్ తీవ్రవాద చర్యలను నిర్ద్వంద్వంగా ఖండించింది. అదే సమయంలో ఇజ్రాయెల్‌కు తన సంఘీభావాన్ని కూడా ప్రకటించింది. ఈ ఘర్షణల్లో ఇరువైపులా బలి అవుతున్న సామాన్య ప్రజల మృత్యు ఘోషకు తీవ్ర సంతాపం కూడా తెలియజేసింది. శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్న పాలస్తీనా ప్రజలకు మానవతా సహాయాన్ని కూడా అందిస్తోంది. మన దేశాన్ని పట్టి పీడిస్తున్న జిహాదీ ఉగ్రవాదాన్నీ, రక్షణ పరంగా ఇజ్రాయెల్‌కు మనకు ఉండే ఒప్పందాలను దృష్టిలో ఉంచుకొని, మన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశ హితాన్ని కోరే వాళ్ళందరూ స్వాగతించారు. కానీ కొందరు వ్యతి రేకిస్తున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ హమాస్ చర్యలను సమర్థిస్తోంది. దీని వెనుక ఈ దేశంలోని ముస్లింలను సంతుష్టీకరించే ప్రయోజనం ఉంది. ఇక అసలు విషయానికి వస్తే 1948కు ముందు ఇజ్రాయెల్ అనే పేరుతో ఒక భూ భాగమే లేదనేది అక్షర సత్యం. 1947 ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు ప్రపంచ పటంలో లేవు అనేది కూడా సత్యమే కదా? వాటి మునుగడను భారతదేశం కాదంటుందా? ఇజ్రాయెల్ మను గడను ప్రశ్నించే వారికి ఈ సమాధానం సరిపోదా? పెట్టుబడిదారీ పశ్చిమ దేశాలు మధ్య ఆసియాలో తమ రాజకీయ అవసరాల కోసమే ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, లెబనాన్ దేశాల మధ్యలో ఇజ్రాయెల్ ను సృష్టించాయి. ‘జెరూసలేం’ ప్రాంతం తమ ఆధ్యాత్మిక, మత, సాంస్కృతిక భావాలకు కేంద్రం అని రెండువేల ఏళ్లుగా యూదు జాతీయులు చెప్పుకొంటు న్నారు. యూదులపై దయతో పశ్చిమ దేశాలు వారికి ఒక భూభాగాన్ని కేటాయించాయని చెప్తే సత్య దూరమవుతుంది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో పశ్చిమ దేశాలు 60 లక్షల మంది యూదులను నిర్దాక్షిణ్యంగా, అమానుషంగా మట్టుబెట్టాయనేది చరిత్ర చెప్పే చెరపలేని సాక్ష్యం. ఇక పాలస్తీనా ఒక స్వతంత్ర భూభా గమనీ, దానిని దురహంకార పూరితమైన ఇజ్రాయెల్ దేశం ఆక్రమించిందనీ మన దేశంలోని చారిత్రిక పరిజ్ఞానం లేని కొంతమంది మూర్ఖపు వాదనలు చేస్తూ, దేశ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారు. ప్రస్తుతం పాలస్తీనా భూభాగాలుగా చెప్పుకొనే గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాలు 1967 వరకు వరుసగా ఈజిప్టు, జోర్డాన్ దేశాలలో భాగాలు. జోర్డాన్ నదికి పడమర వైపున ఉండే ప్రాంతాన్ని వెస్ట్ బ్యాంక్ అని పిలుస్తున్నారనేది గమనార్హం. ఇస్లాం మతస్థులకు ‘జెరూసలేం’ పవిత్ర స్థలం కూడా. అందుకే ఇజ్రాయెల్ ఏర్పాటును ముస్లిం దేశాలన్నీ వ్యతిరేకించాయి. ఇక క్రైస్తవులకు ‘జెరూసలేం’, ‘బెత్లె హేము’ పవిత్ర స్థలాలు. క్రైస్తవుల ప్రాబల్యం నిలుపుకోవాలంటే అక్కడ పశ్చిమ దేశాలకు తమకు అనుకూలమైన దేశం ఒకటి ఉండాలి. ఇజ్రాయెల్ ఏర్పాటు వెనుక ఉన్న సూత్రం ఇదే! అరబ్ – ఇజ్రాయెల్ ఐదు యుద్ధాల్లో ముస్లిం దేశాలను ఇజ్రాయెల్ మట్టి కరిపించడం వెనక దాగి ఉన్న రహస్యం కూడా ఇదే! పశ్చిమ దేశాలన్నీ కూడా ఇజ్రాయెలీలకు ఇతోధిక సహాయ సహకారాలు అందిస్తున్నాయనేది వాస్తవం. ఇక హమాస్ చర్యలు పాలస్తీనియన్ల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను హరించి వేస్తాయనేది కాదనలేని సత్యం. గాజా స్ట్రిప్‌లోని ఇంటర్నల్ బంకర్లను ధ్వంసం చేసేంతవరకూ ఇజ్రాయెల్ ఆగదు. ఇదే జరిగితే అనేకమంది సామాన్య ప్రజలు బలి అవుతారు. అంతర్జాతీయ సమాజం ఈ విషయంపై దృష్టిని సారించి, హమాస్ తీవ్రవాదుల చెరలో బందీ లుగా ఉన్న యూదులను విడిపించే ఏర్పాట్లు చేయాలి. అదే విధంగా ఇజ్రాయెల్ దుందు డుకు చర్యలకు అడ్డుకట్ట కూడా వేయాలి. - వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులు -
మీరు ఆ ప్రాంతాన్ని తక్షణమే వీడండి.: ఇజ్రాయెల్ మరోసారి హెచ్చరికలు
జెరూసలేం: ఉత్తర గాజాపై మరోసారి భూతల దాడికి ఇజ్రాయెల్ సిద్ధమైనట్లే కనిపిస్తోంది. ఇప్పటికే ఉత్తర గాజా, దక్షిణ గాజాలపై వైమానికి దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్.. దాన్ని మరింత ఉధృతం చేసేందుకు సమాయత్తమైంది. ఉత్తర గాజాలో ఉన్న వాళ్లంతా తక్షణమే ఆ ప్రాంతాన్ని వీడి వెళ్లాల్సిందేనని హెచ్చరించింది ఇజ్రాయెల్, . ఒకవేళ ఎవరైనా ఉత్తర గాజాను వీడి దక్షిణ గాజాకు వెళ్లకుంటే వారిని ఉగ్రవాదులుగానే పరిగణిస్తామని సంకేతాలు పంపింది ఇజ్రాయెల్. హమాస్‌ను అంతంమొందించాలనే లక్ష్యంతో ఉన్న ఇజ్రాయెల్.. వారికి స్థావరంగా ఉన్న ఉత్తర గాజాపై ఫోకస్ పెట్టింది. ఒకవైపు దక్షిణా గాజాపై కూడా దాడులు చేస్తూనే, ఉత్తర గాజాను వీడి దక్షిణ గాజాకు వెళ్లాలని ఇజ్రాయెల్ సూచించడానికి కారణాలు మాత్రం అంతుపట్టడంలేదు. కొన్ని రోజుల క్రితం ఉత్తర గాజాను ఖాళీ చేసి తక్షణం దక్షిణాదికి వెళ్లాల్సిందిగా 11 లక్షల మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ హెచ్చరించిన తర్వాత అతి ప్రమాదకరమైన 20 కిలోమీటర్లకుపైగా ప్రయాణించి వారంతా దక్షిణ గాజాకు చేరుకున్నారు. ఇంతా చేసినా రోజుల వ్యవధిలోనే దక్షిణ గాజాపైనా ఇజ్రాయెల్ తీవ్ర దాడులకు తెగబడడటంతో పాలస్తీనియన్ల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. మళ్లీ ఇప్పుడు ఉత్తర గాజాలో ఎవరైనా ఉన్నట్లైతే వెంటనే దక్షిణ గాజాకు తక్షణమే వెళ్లాలని వార్నింగ్ ఇచ్చింది. చదవండి: ఇద్దరు అమెరికన్లను విడుదల చేసిన హమాస్.. త్వరలోని మరికొంతమంది! ‘క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి -
గాజాకు స్వల్ప ఊరట.. అమెరికా మాటతో వెనక్కి తగ్గిన ఇజ్రాయెల్
జెరూసలేం: గాజాపై ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేసింది. ఇక, ఇజ్రాయెల్ దాడులతో దక్షిణ గాజా గజగజలాడుతోంది. ఉత్తర గాజాను ఖాళీ చేసి తక్షణం దక్షిణాదికి వెళ్లాల్సిందిగా 11 లక్షల మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ హెచ్చరించింది. దీంతో, అతి ప్రమాదకరమైన 20 కిలోమీటర్లకుపైగా ప్రయాణించి వారంతా దక్షిణ గాజాకు చేరుకున్నారు. ఇంతా చేసినా రోజుల వ్యవధిలోనే దక్షిణ గాజాపైనా ఇజ్రాయెల్ తీవ్ర దాడులకు తెగబడడటంతో పాలస్తీనియన్ల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. మరోవైపు.. ఐరాస, అంతర్జాతీయ సంస్థల వారం రోజుల పై చిలుకు ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. గాజాకు సహాయ సామగ్రి అందించేందుకు ఇజ్రాయెల్ అంగీకరించింది. యుద్ధం మొదలైన రెండు వారాల తర్వాత గాజా ‘తలుపులు’ తెరుచుకున్నాయి. ఆహారం, నీరు, ఇంధన కొరతతో అల్లాడుతున్న పాలస్తీనా ప్రజల కోసం.. రఫా బార్డర్ పాయింట్‌ను ఈజిప్టు ఓపెన్ చేసింది. దీంతో నిత్యావసరాలు, మందులతో కూడిన మానవతా సాయంతో వచ్చిన ట్రక్కులు బోర్డర్ దాటాయి. పలు ట్రక్కులు గాజాలోకి ఎంటర్ అవుతున్న వీడియోలను ఈజిప్ట్ ప్రభుత్వం టీవీ ప్రసారం చేసింది. కానీ, 20 ట్రక్కులను మాత్రమే అనుమతించారు. 20 trucks when the Gaza Strip usually receives several hundred per day isn’t something you should be applauding UN officials say at least 100 trucks a day are required Israel has denied the entrance of fuel & restricted all aid stay in the south You should be condemning this — ℅ Her Gourdliness ♙ (@MichelleSuiter) October 22, 2023 ఇక, గాజాకు సంబంధించి ఇజ్రాయెల్ అధీనంలో లేని ఏకైక దారి రఫా మాత్రమే. ఈజిప్టు సరిహద్దుల్లో ఉన్న ఈ రూట్ నుంచి ట్రక్కులు వచ్చేందుకు తొలుత ఇజ్రాయెల్ అంగీకరించలేదు. దీంతో కొన్ని రోజులుగా మానవతా సాయాన్ని తీసుకొస్తున్న కార్గో విమానాలు, ట్రక్కులు.. రఫా బార్డర్ వద్దే ఆగిపోయాయి. అమెరికా విజ్ఞప్తి నేపథ్యంలో ట్రక్కులు వచ్చేందుకు ఇజ్రాయెల్ ఓకే చెప్పింది. గాజా ప్రజలకు సాయం పంపిణీకి సంబంధించి రఫా బార్డర్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ పరిశీలించారు. ‘ఇవి కేవలం ట్రక్కులు మాత్రమే కాదు.. గాజా ప్రజల లైఫ్‌లైన్. గాజాలోని ఎంతో మంది ప్రజల చావు – బతుకుల మధ్య వ్యత్యాసమే ఆ ట్రక్కులు’ అని ఆయన చెప్పారు. Gaza Receives First Aid Trucks Since Hamas Attack as Egypt Border Opens Briefly 🙏 pic.twitter.com/QA8fBJsaSm — 3 STOCKS A DAY (@3Stocksaday) October 21, 2023 ట్రక్కుల్లోని సామగ్రిని చిన్న చిన్న మోటార్లపై తరలిస్తున్నారు. వందలాది ట్రక్కు లు సహాయ సామగ్రితో వారం రోజులకుపైగా ఈజిప్టు సరిహద్దుల వద్ద వేచి చూస్తున్నాయి. తినేందుకు, తాగేందుకు దిక్కులేక 23 లక్షల మంది గాజావాసులు అల్లాడుతున్నారు. ఉప్పు నీరు తాగి ప్రాణాలు నిలబెట్టుకుంటున్నారు! గాజాలో పరిస్థితి ఘోర మానవీయ విపత్తు దిశగా సాగుతోందని ఐరాస ఆహార పథకం ఆందోళన వెలిబుచ్చింది. -
ఈజిప్ట్ గ్రీన్‌సిగ్నల్ .. గాజాకి అందనున్న మానవతా సాయం
గాజా ప్రాంతమంతా ఇజ్రాయెల్ దాడులతో ధ్వంసమైంది. వందల మంది ప్రాణాలు కోల్పోగా.. ఆవాసాలు కోల్పోయి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న వాళ్లు లక్షల్లోనే ఉన్నారు. ఆకలితో అలమటిస్తూ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మానవతా సాయం అందించేందుకు ఈజిప్ట్ అంగీకరించింది. ఇజ్రాయెల్‌కి తాజా పర్యటనలో గాజాకి రూ. 832 కోట్ల సాయం ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. అయితే, ఈ సాయం గాజాలోకి ప్రవేశించాలంటే గాజా-ఈజిప్ట్ సరిహద్దులోని రఫా క్రాసింగ్ దాటాల్సి ఉంటుంది. ఇప్పటికే మానవతా సాయం కింద సామగ్రితో కూడిన వందలాది ట్రక్కులు రఫా సరిహద్దు వద్ద బారులుతీరి ఉన్నాయి. కానీ, భద్రతా కారణాలను చూపిస్తూ ఈజిప్ట్ ఈ మార్గాన్ని మూసివేసింది. గాజా ప్రజలు తమ దేశంలోకి ప్రవేశించి స్థిరపడే అవకాశముందని, అలాగే ఉగ్రవాదులు తమ దేశంలోకి చొరబడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీంతో బైడెన్.. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసి Abdel Fattah El Sisi తో చర్చించి రఫా బార్డర్ క్రాసింగ్ తెరిపించేందుకు ఒప్పించారు. అయితే గాజాకు సాయం చేయడానికి మార్గం సుగమమైనప్పటికీ.. అది పరిమితంగానే ఉంటుందని ఈజిప్ట్ చెబుతోంది. పైగా హమాస్ దాడుల్లో రోడ్లు దెబ్బ తినడంతో.. వాటి పునరుద్ధరణకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అదే సమయంలో మరిన్ని దాడులు జరగవచ్చనే ఆందోళనను వ్యక్తం చేసింది. దీంతో శుక్రవారం నుంచి సాయం అందించేందుకు అనుమతిస్తామని ఈజిప్ట్ తెలిపింది. ఇదే విషయంపై జో బైడెన్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఈజిప్ట్ అధ్యక్షుడితో మాట్లాడాను. రఫా బార్డర్ తెరిచి మానవతా సాయం కింద ఇచ్చే సామగ్రితో కూడిన దాదాపు 20 ట్రక్కులను గాజాలోకి పంపించడానికి ఒప్పుకొన్నారు’’అని తెలిపారు. మరోవైపు అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌజ్ ప్రకటన ప్రకారం.. ‘‘గాజాకు మానవతా సాయం చేయడం కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసితో చర్చలు జరిపారు. ఐక్యరాజ్యసమితి అభ్యర్థన మేరకు ఇరు దేశాలు గాజాకు సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. అమెరికా, ఈజిప్ట్ దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతానికి ఇరుదేశాల అధినేతలు కట్టుబడి ఉన్నారు’’ అని పేర్కొంది. క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి -
బైడెన్ ఇజ్రాయెల్ పర్యటన.. షాకిచ్చిన మూడు దేశాలు
అమ్మాన్: గాజాపై ఇజ్రాయెల్ సేనలు విరుచుకుపడుతున్నాయి. సెంట్రల్ గాజాలోని అల్ అహ్లీ సిటీ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ జరిపిన భారీ వైమానిక దాడిలో ఏకంగా 600 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. మరోవైపు.. యుద్ధ ప్రభావిత ప్రాంతమైన ఇజ్రాయెల్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం పర్యటించనున్నారు. #WATCH | Joint Base Andrews, Maryland: US President Joe Biden departs for Israel. (Source: Reuters) pic.twitter.com/lp2A0PHErf — ANI (@ANI) October 17, 2023 గాజాకు మానవతా సాయంపై ప్రధాని నెతన్యాహుతో బైడెన్ చర్చలు జరుపనున్నారు. గాజాకు సాయం అందించేందుకు ఓ ప్రణాళికను రూపొదించేందుకు ఇజ్రాయెల్, అమెరికా మధ్య అంగీకారం కుదిరినట్లు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వెల్లడించారు. ఇదిలా ఉండగా.. జో బైడెన్‌కు జోర్డాన్, ఈజిప్ట్, పాలస్తీనా దేశాలు షాక్ ఇచ్చాయి. ఇజ్రాయెల్ పర్యటనకు వస్తున్న బైడెన్‌తో తాము భేటీ అయ్యేది లేదని వెల్లడించాయి. అయితే, గాజా యుద్ధాన్ని ఆపే లక్ష్యంతో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి, పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌లతో తమ దేశ రాజధాని అమ్మాన్ వేదికగా బుధవారం సదస్సును నిర్వహించాలని జోర్డాన్ భావించింది. ఈ సమావేశానికి హాజరవుతానని బైడెన్ కూడా ప్రకటించారు. ఈ క్రమంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. Arab Leaders' Meeting With Biden Cancelled Over Gaza Hospital Attack Jordan's Foreign Minister Ayman Safadi announced that Biden's summit in Amman scheduled to take place on Wednesday with Jordan's King Abdullah, Egypt's President Abdel Fattah El-Sissi and Palestinian Authority pic.twitter.com/Y0oob96eDd — BBC NEWS RSVK (@Raavivamsi49218) October 18, 2023 మంగళవారం అర్ధరాత్రి గాజాలోని అల్ అహ్లీ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో వందలాది మంది రోగులు చనిపోవడంతో.. జోర్డాన్‌లో ఆందోళనలు మిన్నంటాయి. జోర్డాన్ రాజధాని అమ్మాన్లో అమెరికాకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఇలాంటి సమయంలో ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వెళితే తమ ఉనికికే ముప్పు వస్తుందని భావించిన జోర్డాన్ రాజు అబ్దుల్లా ఈ సమావేశాన్ని రద్దు చేశారు. ఈ సమాచారాన్ని అమెరికా కూడా ధ్రువీకరించింది. ఇక, జోర్డాన్ విదేశాంగ మంత్రి అయ్మన్ సఫాది కూడా దీనిపై ప్రకటన విడుదల చేశారు. మరోవైపు టర్కీలోని నాటో కార్యాలయం దగ్గర కూడా నిరసనలు వెల్లువెత్తాయి. గాజాకు సాయం అందించాలని ప్రజలు టర్కీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. Jordanian protesters raise their shoes in the capital Amman, refusing to accept US President Joe Biden. pic.twitter.com/cOwsgHbzrh — Iran Observer (@IranObserver0) October 17, 2023 People are now attacking the US embassy in Lebanon. Thanks Joe Biden. pic.twitter.com/VwvDUbGG1E — Gunther Eagleman™ (@GuntherEagleman) October 17, 2023 -
బెలుగా భలేగా.. సరుకు రవాణాలో ప్రపంచంలోనే అతిపెద్ద విమానం
శంషాబాద్: సరుకు రవాణాలో ప్రపంచంలోనే అతిపెద్దదైన బెలుగా విమానం మరోసారి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. వియత్నాం నుంచి ఈజిప్ట్ వెళ్తున్న ఈ విమానంలో ఇంధనం నింపడంతో పాటు పైలట్ల విశ్రాంతి కోసం సోమవారం అర్ధరాత్రి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశారు. తిరిగి బుధవారం రాత్రి ఇక్కడి నుంచి ఈజిప్ట్‌కి బయలుదేరింది. గతేడాది డిసెంబర్ 4 రాత్రి దుబాయ్ నుంచి భారీ సరుకుతో థాయ్‌లాండ్‌లోని పటాయా వెళుతూ ఇంధనం, విశ్రాంతి కోసం బెలుగా శంషాబాద్‌లో ల్యాండ్ అయింది. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద సరుకు రవాణా విమానాల్లో ఈ ఎయిర్‌బస్ బెలుగా విమానం(ఏ300–600 సూపర్ ట్రాన్స్పోర్టర్) ఒకటి. విమాన ఆకారం ఉబ్బెత్తు తలతో ఉండే బెలుగా రకం తిమింగలాలను పోలి ఉండటంతో ఆ పేరుతో ఖ్యాతిగాంచింది. రష్యన్ భాషలో బెలుగా అంటే తెల్లని అని అర్థం. ప్రపంచంలో ఇవి ఐదు మాత్రమే ఉన్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద కార్గో.. బెలుగా విమానం పొడవు 56.15 మీటర్లు, ఎత్తు 17.24 మీటర్లు, బరువు మోసుకెళ్లే సామర్థ్యం 47 వేల కేజీలు, బెలుగా విమానాల తయారీలో యూకే, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ ఏరోస్పేస్ కంపెనీలు పాలుపంచుకున్నాయి. కాగా, అతి పెద్ద కార్గో విమానాల్లో ఒకటైన అంటోనోవ్ ఏఎస్–225 మ్రియా కూడా ఇంధనం, విశ్రాంతి కోసం 2016, మే 13న శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. అయితే రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో మ్రియా విమానం ధ్వంసమైంది. మ్రియా అంటే రష్యన్ భాషలో కల అని అర్థం. ప్రస్తుతం మ్రియా లేకపోవడంతో కార్గోలో బెలుగానే అతిపెద్ద విమానంగా గుర్తిస్తున్నారు. -
కలసి సాగుదాం... ప్రగతి బాట!
సారూప్యం, సాన్నిహిత్యం రెండూ ఉన్న దేశాల మధ్య స్నేహగీతాలాపన సహజమే. చిరకాలం తర్వాత ఇరు ప్రభుత్వాల పెద్దలు మరోసారి పల్లవి అందుకున్నారంటే సంబంధాల పునరుద్ధరణతో పాటు బంధం మళ్ళీ బలపడుతోందని అర్థం. గత వారాంతంలో ఈజిప్టులో భారత ప్రధాని మోదీ జరిపిన పర్యటన అందుకు సాక్ష్యం. ఉభయ దేశాలూ తమ ద్వైపాక్షిక బంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకోవడం విశేషమే. ఆ మేరకు ‘చరిత్రాత్మక’ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈజిప్టులో ప్రాథమిక వసతుల కల్పనలో, ముఖ్యంగా సూయజ్ కాలువ అథారిటీలో భారత పెట్టుబడులు సహా ఆర్థిక సహకారం పెంపుపై ఇరుపక్షాలూ చర్చించాయి. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణలో ఒప్పందాలపై చేవ్రాలు చేశాయి. వెరసి, ఆఫ్రికా, పశ్చిమాసియాలలో భాగమైన జన సంఖ్యాక అరబ్బు దేశం ఈ ప్రాంతంలో భారత్‌కు కీలక భాగస్వామి కానుంది. ప్రతిగా దాని అవసరాలు తీర్చేందుకు భారత్ ముందుకు రావడంతో ఈ పర్యటన ఫలాలు ఉభయ తారకమే! భారత ప్రధాని తాజా ఈజిప్ట్ పర్యటన అదాటునో, ఆలోచనా రహితంగానో జరిగింది కాదు. దాదాపు ఏడాది పైచిలుకుగా ఎన్నో లెక్కలతో చేపట్టిన వరుస చర్యల్లో ఇది ఒక భాగమనాలి. ద్వైపాక్షిక బంధాలున్నా అవి ఆశించినంతగా సత్తా చాటని వేళ గడచిన ఏడాది కాలంలో మన రక్షణ, విదేశాంగ మంత్రులు కైరో చుట్టివచ్చారు. ఈ ఏటి గణతంత్ర దినోత్సవ కవాతుకు ఈజిప్ట్ అధ్యక్షుడు భారత ప్రభుత్వ ముఖ్యఅతిథిగా ఢిల్లీకి విచ్చేశారు. దానికి కొనసాగింపు ఇప్పుడు మన ప్రధాని పర్యటన. గమనిస్తే– ఈజిప్టులో భారత ప్రధాని ఆఖరుసారిగా పర్యటించింది 1997లో. ఆ తర్వాత ఈ పాతికేళ్ళలో ప్రపంచం చాలా మారింది. ప్రచ్ఛన్న యుద్ధం కాలం నుంచి భౌగోళిక రాజకీయాలు కీలకంగా మారిన రోజులకు వచ్చాం. ఈ సమయంలో ఢిల్లీ, కైరోల భాగస్వామ్యం ఉభయులకూ లాభదాయకం. ప్రపంచంలో అయిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్, భారీస్థాయిలో అప్పుల్లో ఉన్న ఈజిప్టుకు ఎంతో అవసరమైన భాగస్వామి. మరోపక్క వాణిజ్యానికీ, భౌగోళికంగానూ కీలకమైన సూయజ్ కాలువను శాసించే ఈజిప్టుతో బంధం భారత్‌కూ లాభదాయకం. క్రీస్తుపూర్వం నుంచే అతి ప్రాచీన నాగరకతల మధ్య ముడిపడిన బంధమిది. అప్పట్లోనే భారత ద్వీపకల్పానికి ఈజిప్టు ఓడలు వస్తే, ఈజిప్టు మమ్మీలను చుట్టడానికి వాడిన వస్త్రం, ఆ వస్త్రానికి అద్దిన నీలిమందు భారతదేశానివి అన్నది చరిత్ర. గడచిన శతాబ్దకాలంలోనూ మన మైత్రి బలమైనది. వలస పాలన అనంతరం స్వాతంత్య్రం వచ్చిన మూడు రోజులకే ఈజిప్టుతో దౌత్య సంబంధాలు పెట్టుకున్న చరిత మనది. ఇక్కడ ప్రధాని నెహ్రూ, అక్కడ అధ్యక్షుడు నాజర్లతో మన స్నేహలత మరింత అల్లుకుంది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అటు అమెరికా, ఇటు రష్యా కూటములు దేనిలోనూ చేరకుండా మనగలగవచ్చంటూ 1961లో అలీనోద్యమాన్ని నిర్మించి, మూడోప్రపంచ దేశాల్లో ఉత్సాహం ప్రోది చేసిన భారత, ఈజిప్టుల సామీప్యమూ గమనార్హం. ఈ చిరకాల స్నేహం ఇప్పుడు ద్వైపాక్షిక బంధం నుంచి బలమైన భాగస్వామ్యంగా కాంతులీనడం సంతోషదాయకం. ప్రధాని మోదీ, ఈజిప్టు అధ్యక్షుడి మధ్య ఆంతరంగిక ముఖాముఖి సంభాషణ, మోదీకి ఈజిప్టు అత్యున్నత పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ది నైల్’ బహూకరణ, అంతర్జాతీయంగానూ మీద పడుతున్న మైనారిటీల ప్రతికూల ముద్రను చెరుపుకొనేలా 11వ శతాబ్దం నాటి చారిత్రక అల్ హకీం మసీదుకు మోదీ వెళ్ళడం, ప్రపంచపు ఏడు వింతల్లో ఒకటైన గాజా పిరమిడ్ల సందర్శన, ఈజిప్టు – పాలస్తీనాల్లో ఉంటూ మొదటి ప్రపంచ యుద్ధంలో పోరాడి కన్నుమూసిన భారతీయ సైనికుల స్మారకం వద్ద నివాళులు అర్పించడం... అలా ఈ పర్యటనలో ఆకర్షణీయ అంశాలు అనేకం. కొన్ని కైరోతో స్నేహం పంచేవి. గుజరాతీ దావూదీ బోహ్రాలు పునరుద్ధరించిన మసీదు సందర్శన లాంటి మరికొన్ని సొంతగడ్డపై మోదీకి ఓట్లు పెంచేవి. మొత్తానికి అధినేతలిరువురూ ప్రతిదీ ఉపయోగించుకున్నారు. నిజానికి, ఈ ఏటి జీ–20 సదస్సుకు మనం 9 దేశాలను అతిథులుగా ఆహ్వానించగా, అందులో ఈజిప్ట్ ఒకటి. కానీ, మేలో శ్రీనగర్‌లో జరిగిన పర్యాటక అధికారుల సమావేశానికి కైరో దూరంగా ఉంది. ఫలితంగా పొరపొచ్చాలుంటే, అవన్నీ తాజా బంధాల పునరుద్ధరణతో సమసిపోతాయి. రక్షణ, ఆర్థిక సహకారం, విద్యా – వైజ్ఞానిక ఆదాన ప్రదానాలు, సాంస్కృతిక సంబంధాలనే నాలుగు స్తంభాలపై నిర్మించాల్సిన భాగస్వామ్యమిది. ఈజిప్టులోని భారతీయుల సంఖ్య 5 వేల లోపే కావచ్చు. అయితేనేం, మన హిందీ సినిమాలంటే కళ్ళింత చేసుకొని చూసే ఈజిప్ట్ వాసులు, వారి ఈజిప్షియన్ సంగీతాన్ని స్వరాల్లో జొప్పించే భారతీయ సంగీత దర్శకుల బంధం అవిస్మరణీయం. ఈజిప్టుకు ఆరో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి భారత్. కరోనా, ఉక్రెయిన్‌లో యుద్ధంతో ఆర్థిక వ్యవస్థ తలకిందులై, వసతుల పెంపులో కైరో నిదానించింది. ఇప్పుడిది మనకు సదవకాశం. సూయజ్ కాలువ ఆర్థిక మండలిని ఆసరాగా చేసుకుంటే ఆఫ్రికా, పశ్చిమాసియా, ఐరోపా విపణు లకు చేరాలన్న భారత ప్రయత్నాలూ నెరవేరతాయి. చమురు, సహజవాయువు, రసాయన ఎరువుల్ని కైరో నుంచి దిగుమతి చేసుకుంటున్న మనం, గత జూన్‌లో తీవ్రకొరతలో పడ్డ ఆ దేశానికి గోధుమలు పంపినట్టే ఇకపైనా అవసరంలో అండగా నిలవాలి. భౌగోళిక రాజకీయాల్లో ‘దక్షిణ ప్రపంచ’ దేశాలవాణిగా మారాలన్న మన ఆకాంక్ష నెరవేరాలంటే, ప్రస్తుతం చైనా ఆర్థిక ప్రభావంలో ఉన్న ఈజిప్టును కలుపుకొని నడవడమే తెలివైన పని. తాజా పర్యటన అందుకు ఉత్ప్రేరకం. -
విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశం చేరుకున్న ప్రధాని
న్యూఢిల్లీ: ఆరు రోజులపాటు అమెరికా,ఈజిప్ట్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. ప్రధాని మోదీ పర్యటనలో భాగంగా అమెరికా, ఈజిప్ట్‌లో చారిత్రక ఒప్పందాలు చేసుకున్నారు. ఈనెల 20న అమెరికా పర్యటన వెళ్లిన ప్రధాని మోదీ.. ఈ నెల 21వ తేదీన ఐరాసలో ప్రపంచ యోగా దినోత్సవం పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో చర్చలు జరిపిన ప్రధాని మోదీ.. రక్షణ, అంతరిక్ష, వాణిజ్య రంగాల్లో ఒప్పందాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే అమెరికా కాంగ్రెస్‌లో చారిత్రాత్మక ప్రసంగం చేశారు మోదీ. అమెరికా నుంచి ఈజిప్ట్ పర్యటనకు తొలిసారి వెళ్లారు. ఆర్డర్ ఆఫ్ ద నైల్ పురస్కారంతో మోదీని ఈజిప్ట్ అధ్యక్షుడు సత్కరించారు. -
PM Modi Egypt Tour: ఇండియా హీరో మోదీ
కైరో: ‘ఇండియా హీరో నరేంద్ర మోదీ’ అంటూ ఈజిప్టులో నివసిస్తున్న ప్రవాస భారతీయులు భారత ప్రధానిపై ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో మోదీ చరిత్రాత్మక ప్రసంగం అద్భుతంగా ఉందంటూ కొనియాడారు. మోదీ నాయకత్వంలో ఇండియా అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ అమెరికాలో నాలుగు రోజుల అధికారిక పర్యటన ముగించుకొని శనివారం ఈజిప్టులో అడుగుపెట్టారు. గత 26 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఈజిప్టులో పర్యటిస్తుండడంఇదే మొదటిసారి. రాజధాని కైరోలో మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆదివారం ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రిట్జ్ కార్ల్టన్ హోటల్లో ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఇండియా హీరో(కథానాయకుడు) మీరేనంటూ వారు ప్రశంసించగా మోదీ ప్రతిస్పందించారు. అందరికీ హీరో ఇండియా అని బదులిచ్చారు. ప్రజలంతా కష్టపడి పనిచేస్తున్నారని, అందుకే మన దేశం అభివృద్ధి సాధిస్తోందని అన్నారు. దేశ ప్రగతిలో ప్రవాస భారతీయుల కృషి ఎంతో ఉందని చెప్పారు. దేశ విజయంలో వారికి సైతం వాటా దక్కుతుందన్నారు. అనంతరం దావూదీ బోహ్రా వర్గం ముస్లింలతో నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గుజరాత్‌లోని దావూదీ బోహ్రా ముస్లింలతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈజిప్టులో ప్రవాస భారతీయులు తనకు ఘన స్వాగతం పలికారని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. వారి ఆప్యాయత తన హృదయాన్ని కదిలించిందని పేర్కొన్నారు. ఈజిప్టువాసులు సైతం భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి తనకు స్వాగతం పలికారని వెల్లడించారు. భారత్–ఈజిప్టు దేశాలు సంప్రదాయాలను సైతం పంచుకుంటున్నాయని వివరించారు. అల్–హకీం మసీదు, గ్రేట్ పిరమిడ్ల సందర్శన ఈజిప్టులో 11వ శతాబ్దం నాటి చరిత్రాత్మక అల్–హకీం మసీదును ప్రధాని మోదీ సందర్శించారు. ఈజిప్టులో మొదటి ప్రపంచ యుద్ధంలో భారతీయ సైనికులు చేసిన ప్రాణత్యాగాలకు గుర్తుగా నిర్మించిన హెలియోపోలిస్ కామన్వెల్త్ వార్ మెమోరియల్‌ను సందర్శించి, ఘనంగా నివాళులరి్పంచారు. ఇక్కడి సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. ఈజిప్టులో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో 3,799 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. ప్రపంచ అద్భుతాల్లో ఒకటైన గిజా గ్రేట్ పిరమిడ్లను మోదీ సందర్శించారు. కైరో నగర శివార్లలో గిజా నెక్రోపోలిస్ అనే ప్రాంతంలో ఈ పిరిమిడ్లు ఉన్నాయి. ‘‘కైరో అల్–హకీం మసీదును సందర్శించడం ఆనందంగా ఉంది. ఈజిప్టు ఘనమైన వారసత్వానికి, సంస్కృతికి ఈ మసీదు దర్పణం పడుతోంది’’ అని మోదీ ట్వీట్ చేశారు. అవగాహనా ఒప్పందాలపై సంతకాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకొనే దిశగా భారత్, ఈజిప్టు మరో అడుగు వేశాయి. భారత ప్రధాని మోదీ, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్–సీసీ ఆదివారం చర్చలు జరిపారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. ఇరువురు నేతలు నాలుగు అవగాహనా ఒప్పందాల(ఎంఓయూ)పై సంతకాలు చేశారని భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా చెప్పారు. ఇందులో వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించిన ఒప్పందం ఉందన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు, ప్రాచీన, పురావస్తు కట్టడాల పరిరక్షణ, ‘కాంపిటీషన్ లా’కు సంబంధించిన మరో మూడు ఒప్పందాలపై సంతకాలు చేశారని తెలిపారు. మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ద నైలు’ ప్రదానం ఈజిప్టు అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ద నైలు’ను ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్–సీసీ ఆదివారం భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. ఈజిప్టు సహా ఇప్పటిదాకా 13 దేశాలు తమ అత్యున్నత పౌర పురస్కారాలతో మోదీని సత్కరించాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, పాలస్తీనా, అఫ్గానిస్తాన్, సౌదీ అరేబియా, మాల్దీవ్స్, రష్యా, బహ్రెయిన్, పపువా న్యూగినియా, ఫిజీ, రిపబ్లిక్ ఆఫ్ పాలౌ, భూటాన్ తదితర దేశాల నుంచి ఆయన ఈ పురస్కారాలు స్వీకరించారు. తనకు ఆర్డర్ ఆఫ్ ద నైలు పురస్కారం ప్రదానం చేసిన ఈజిప్టు ప్రభుత్వానికి, ప్రజలకు మోదీ ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్ పట్ల ఈజిప్టు ప్రజల ఆప్యాయత అనురాగాలకు ఇదొక నిదర్శనమని పేర్కొన్నారు. -
వెయ్యి ఏళ్ల నాటి మసీదు సందర్శించిన మోదీ.. ప్రత్యేకత ఏంటంటే..
ఈజిప్టు: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈజిప్టు పర్యటనలో భాగంగా రెండో రోజున 11వ శతాబ్దానికి చెందిన చారిత్రాత్మక అల్-హకీమ్ మసీదును సందర్శించారు. ఈజిప్టులో ప్రఖ్యాతి గాంచిన ఈ అల్-హకీమ్ మసీదు 11వ శతాబ్దంలో నిర్మించారు. 1000 ఏళ్ల నాటి ఈ మసీదుకు ఈజిప్టులో చారిత్రాత్మకంగానూ, సాంస్కృతికంగానూ ఎంతో ప్రత్యేకత ఉంది. ఇది భారత్, ఈజిప్టు రెండు దేశాల సంస్కృతి, సాంప్రదాయాలకు నిలువెత్తు రూపమని చెబుతూ ఉంటారు. భారత సంతతికి చెందిన దావూదీ బోహ్రా సంఘం వారు దీనిని పునరుద్ధరించారు. ఈ సంఘం వారు బీజేపీ ఓటు బ్యాంకును ప్రభావితం చేయగలరని చెబుతూ ఉంటారు. ప్రధాని మసీదు సందర్శన సందర్బంగా దావూదీ బోహ్రా సంఘంలోని సభ్యుడు శుజావుద్దీన్ షబ్బీర్ తంబావాలా మాట్లాడుతూ.. ఈరోజు నిజంగా చారిత్రాత్మకమైనది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడికి రావడం.. మాతోనూ, మా సంఘంతోనూ మాట్లాడటం.. మమ్మల్ని వారి కుటుంబసభ్యుల్లా భావించి మా యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం హీలియోపోలీస్ యుద్ధ స్మశానవాటికను సందర్శించి మొదటి ప్రపంచ యుద్ధంలో ఈజిప్టు, పాలస్తీనా తరపున యుద్ధం చేసి మరణించిన సుమారు 4000 మంది భారత సైనికులకు నివాళులర్పించారు. ఇది కూడా చదవండి: వాళ్ళే అసలైన హీరోలు.. వీళ్లంతా పిరికిపందలు -
'ఆర్డర్ ఆఫ్ నైల్'.. ప్రధాని మోదీకి దక్కిన అరుదైన గౌరవం..
అమెరికాలో పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ ఈజిప్టులో రెండు రోజుల పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే.. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ఈజిప్టు అత్యున్నత పురస్కారమైన 'ఆర్డర్ ఆఫ్ ది నైల్'ను మోదీ అందుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడైన అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసి చేతుల మీదుగా ప్రధాని మోదీకి అందించారు. ఈజిప్టులోని 11వ శతాబ్దపు చరిత్రాత్మక అల్-హకీమ్ మసీదు, కైరోలోని హెలియోపోలిస్ కామన్వెల్త్ వార్ స్మారకాన్ని మోదీ ఈ రోజు సందర్శించారు. సుమారు 1000 ఏళ్ల నాటి మసీదు గోడలపై చెక్కిన శాసనాలను ప్రధాని తిలకించారు. 13,560 మీటర్లలో విస్తరించిన మసీదును భారత్‌లోని దావూదీ బోహ్రా కమ్యునిటీలు 1970లో పునరుద్ధరించారు. అప్పటి నుంచి వారే దాని పర్యవేక్షణ బాధ్యతలను చేపడుతున్నారు. గుజరాత్లో ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్న బోహ్రా తెగలతో ప్రధాని మోదీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఈజిప్టులోని భారత రాయబారి అజిత్ గుప్తే ఈ సందర్భంగా తెలిపారు. మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన భారత సైనికులకు హెలియోపోలిస్ కామన్వెల్త్ వార్ స్మారకం వద్ద ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ఈజిప్టు, పాలస్తీనాలో పోరాట సమయంలో మరణించిన 4000 మంది భారత సైనికులకు గుర్తుగా ఈ స్మారకాన్ని నిర్మించారు. ఈజిప్టు పర్యటనలో ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షునితో ప్రత్యేక చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతంపై సమావేశం నిర్వహించారు. ఇదీ చదవండి: ఈజిప్టుకు చేరుకున్న ప్రధాని మోదీ -
ఈజిప్టుకు చేరుకున్న ప్రధాని మోదీ
కైరో: అమెరికాలో పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ శనివారం ఈజిప్టులో రెండు రోజుల పర్యటనకు గాను కైరో చేరుకున్నారు. కైరో విమానాశ్రయంలో మోదీకి ఈజిప్టు ప్రధానమంత్రి మొస్తాఫా మద్బౌలీ ఆలింగనంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం మోదీ సైనిక దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఆయనకు బస ఏర్పాటు చేసిన హోటల్ వద్ద..భారత సంతతి ప్రజలు త్రివర్ణ పతాకాలు చేబూని, మోదీ..మోదీ.. వందేమాతరం అంటూ నినాదాలు చేశారు. చీర ధరించిన ఈజిప్టు మహిళ ఒకరు హిందీ సినిమా షోలే లోని ‘యే దోస్తీ హమ్ నహీ ఛోడేంగే’పాట పాడుతూ మోదీకి స్వాగతం పలికారు. ఆ గీతం వినగానే ఆశ్చర్యానికి లోనైన మోదీ ఆమెను ప్రశంసించారు. తనకు హిందీ పెద్దగా తెలియదని, భారత్‌కు ఎప్పుడూ వెళ్లలేదని ఆమె చెప్పారు. మీరు ఈజిప్షియన్ అయినా అచ్చు భారతీయ మహిళ మాదిరిగానే ఉన్నారని మోదీ ప్రశంసించారు. కాగా, భారత ప్రధాని ఒకరు ఈజిప్టులో పర్యటించడం 26 ఏళ్లలో ఇదే ప్రథమం. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకునేందుకు ఇరు దేశాలు ఆసక్తితో ఎదురు చూస్తున్న వేళ జరుగుతున్న ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఆదివారం మోదీ ఈజిప్టు అధ్యక్షుడు ఎల్‌సిసితో భేటీ అవుతారు. ప్రధాని మద్బౌలీ కేబినెట్ సభ్యులతో మోదీ రౌండ్‌టేబుల్ సమావేశం ఉంటుంది. ఈజిప్టు గ్రాండ్ ముఫ్తి డాక్టర్ షౌకి ఇబ్రహీం అబ్దెల్ కరీం అల్లాం సహా పలువురు ప్రముఖులతో ప్రధాని చర్చలు జరుపుతారు. ఆదివారం ప్రధాని మోదీ కైరోలోని చారిత్రక అల్–హకీం మసీదును సందర్శిస్తారని ఈజిప్టులో భారత్ రాయబారి అజిత్ గుప్తె తెలిపారు. భారత్‌లోని దావూది బోహ్రా తెగ ముస్లింలు ఈజిప్టుకు చెందిన వారే. 11వ శతాబ్దంలో ఈజిప్టును పాలించిన ఫతిమిద్ వంశస్తులు అల్ హకీం మసీదును నిర్మించారు. బోహ్రా ముస్లింలు, ఈజిప్టు ప్రభుత్వంతో కలిసి చేపట్టిన మసీదు పునరుద్ధరణ పనులు ఇటీవలే పూర్తయ్యాయి. -
ఈజిప్టులో మోదీ తొలి అడుగు
వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రయాత్మక మూడు రోజుల అమెరికా పర్యటనను ముగించుకుని అటునుంచి అటే ఈజిప్టు పర్యటనకు పయనమయ్యారు. 1997 తర్వాత ఈజిప్టులో భారత్ ప్రధాని పర్యటించడం ఇదే మొదటిసారి. భారత ప్రధాని అమెరికా బయలుదేరే ముందే ఈజిప్ట్ పర్యటననుద్దేశించి మాకు అత్యంత సన్నిహితమైన దేశం ఈజిప్టు సందర్శించడం చాలా సంతోషంగా ఉందన్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రత్యేకతను సంతరించుకుంది. ఈజిప్టులో మొదటిసారి.. భారత్ నుంచి బయలుదేరే ముందే ప్రధాని మాట్లాడుతూ.. మాకు అత్యంత సన్నిహితమైన మిత్ర దేశం ఈజిప్టులో మొట్టమొదటిసారి పర్యటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. జనవరిలో ఈజిప్టు అధ్యక్షుడు సిసికి మా దేశంలో ఆతిధ్యమివ్వడం మా భాగ్యం. భారత్ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగా విచ్చేసిన నెలల వ్యవధిలోనే నేను ఈజిప్టులో పర్యటింస్తుండడం బలపడుతున్న ఈ రెండు దేశాల స్నేహబంధానికి ప్రతీకని ఆయన వర్ణించారు. ఈజిప్టు ప్రెసిడెంట్ భారత దేశానికి వచ్చినప్పుడే ఈ వ్యూహాత్మక భాగస్వామ్యానికి బీజం పడిందన్నారు. పర్యటనలో.. జూన్ 24 నుంచి ప్రారంభమవనున్న ప్రధాని ఈజిప్టు పర్యటనలో ఆ దేశాధ్యక్షుడు సిసితో రెండు దేశాల మధ్య బహుళ భాగస్వామ్యాల గురించి, ఉమ్మడిగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఆచరించాల్సిన ప్రణాళికల గురించి చర్చించనున్నారు. తర్వాత ఆ దేశ ప్రభుత్వ పెద్దలతోనూ, అక్కడి ప్రముఖులతోనూ, ప్రవాస భారత సంఘాలతోనూ సమావేశం కానున్నారు. అనంతరం కైరోలోని హీలియోపోలీస్ కామన్వెల్త్ యుద్ధ స్మశానవాటికను సందర్శించి మొదటి ప్రపంచ యుద్ధంలో ఈజిప్టు-పాలస్తీనా తరపున వీరోచితంగా పోరాడి అసువులుబాసిన సుమారు 4000 మంది భారతీయ సైనికులకు నివాళులర్పిస్తారు. పర్యటనలో భాగంగా చారిత్రాత్మక అల్-హకీమ్ మసీదును కూడా సందర్శించనున్నారు భారత ప్రధాని. #WATCH | After concluding his maiden State Visit to the United States, Prime Minister Narendra Modi departs for Cairo, Egypt. pic.twitter.com/7JoFaoELke — ANI (@ANI) June 24, 2023 ఇది కూడా చదవండి: భారత ప్రధానికి అమెరికా అధ్యక్షుడి అపురూప కానుక -
ఐరాసలో యోగా వైట్‌హౌస్‌లో విందు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా, ఈజిప్టు దేశాల పర్యటన షెడ్యూల్‌ను శుక్రవారం విదేశాంగ శాఖ విడుదల చేసింది. జూన్ 20 నుంచి 25 వరకు ప్రధాని అమెరికా, ఈజిప్టులలో పర్యటిస్తారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగే యోగా కార్యక్రమానికి నేతృత్వం వహిస్తారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళుతున్నారు. ఈ సారి పర్యటనలో యూఎన్‌లో జరిగే యోగా డేలో ప్రధాని పాల్గొనడం విశేషం. ప్రతీ రోజూ యోగా చేయడం వల్ల కలిగే ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ప్రపంచంలో అవగాహన పెరగాలని మోదీ ప్రధాని పదవి చేపట్టాక చేసిన ప్రయత్నాలతో యూఎన్ 2014లో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. ఇప్పుడు తొమ్మిదేళ్లయ్యాక యూఎన్‌లో జరిగే కార్యక్రమానికి నేతృత్వం వహిస్తూ ఉండడంపై ప్రధాని మోదీ ఉద్విగ్నంగా స్పందించారు. యోగా మరింతగా ప్రజాదరణ పొందాలని ఒక ట్వీట్లో ఆశాభావం వ్యక్తం చేశారు. పర్యాటన ఇలా..! ► ప్రధాని మోదీ అమెరికా పర్యటన న్యూయార్క్ నుంచి మొదలవుతుంది. జూన్ 21న యూఎన్ ప్రధాన కార్యాలయంలో ఉదయం 8 నుంచి 9 గంటలవరకు జరిగే యోగా సెషన్లో ప్రధాని పాల్గొంటారు. భారత్ యూఎన్‌కు బహుమతిగా ఇచ్చిన మహాత్మా గాంధీ విగ్రహం ఎదుటే ఈ యోగా కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో యూఎన్ ప్రతినిధులు, వివిధ దేశాల రాయబారులు యోగా గొప్పదనాన్ని ప్రపంచానికి చాటుతారు. ► న్యూయార్క్ నుంచి వాషింగ్టన్కు వెళతారు. జూన్ 22న అధ్యక్షుడు బైడెన్‌తో అత్యున్నత స్థాయి చర్చలు జరుపుతారు. ► అమెరికా ప్రతినిధుల సభ, సెనేట్ స్పీకర్ల ఆహ్వానం మేరకు కాంగ్రెస్ ఉభయ సభలనుద్దేశించి మోదీ ప్రసంగిస్తారు ► అదే రోజు రాత్రి ప్రధాని గౌరవార్థం బైడెన్ దంపతులు శ్వేత సౌధంలో అధికారిక విందు ఇస్తారు. ► జూన్ 23న ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ ప్రధానికి ఆతిథ్యమిస్తారు. అదే రోజు ప్రధాని పారిశ్రామికవేత్తలతో, కార్పొరేట్ సంస్థల సీఈవోలతో సమావేశమవుతారు. ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారు. ► జూన్ 24న ఈజిప్టుకి బయల్దేరి వెళతారు. అక్కడ రెండు రోజులు పర్యటిస్తారు. మన గణతంత్ర ఉత్సవాలకు హాజరైన ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్ సిసి ఆహ్వానం మేరకు అక్కడ పర్యటించనున్నారు. -
ఆ నరమాంస భక్షకిని భద్రపరుస్తారట!
కైరో: మమ్మీఫైయింగ్ ద్వారా ఈజిప్ట్ ఫారో చక్రవర్తులను, రాణులను భద్రపర్చడం.. వాటిని పిరమిడ్ల కింద మమ్మీలుగా బయటకు తీస్తుండడం తెలిసిందే కదా. ఈజిప్ట్‌లో, ప్రపంచంలోని పలు దేశాల మ్యూజియంలో మమ్మీలను చూడడం షరామామూలే కావొచ్చు. అయితే ఇప్పుడు అక్కడ ఒక కిల్లర్ షార్క్‌ను మమ్మీఫైయింగ్ చేసి ప్రదర్శన కోసం ఉంచనున్నారు. ఈజిప్ట్ నగరం హుర్ఘదా ఎర్ర సముద్ర పరిధిలో ఉన్న ఓ రిసార్ట్ తాజాగా జరిగిన ఘోరం గురించి తెలిసే ఉంటుంది. 23 ఏళ్ల రష్యన్ యువకుడిని అతని తండ్రి సమక్షంలోనే దాడి చేసి.. చంపి తినేసింది ఓ షార్క్(టైగర్ షార్క్). సెకండ్ల వ్యవధిలో జరిగిన ఈ ఘటన ఆ తండ్రితో సహా అక్కడున్నవాళ్లందరినీ షాక్‌కు గురి చేసింది. ఆ టైంలో తనను రక్షించమంటూ ఆ వ్యక్తి కేకలు వేయడం గమనించొచ్చు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది కూడా. అయితే.. ఆ తర్వాత ఆ షార్క్‌ను చంపేశారు కూడా. అది పక్కా కమర్షియల్ రిసార్ట్. ఎప్పుడూ బోట్లు సంచరిస్తూనే ఉంటాయి. అలాంటి చోట ఈ ఘటన జరగడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. కళ్లు మూసి తెరిచేలోపే ఘోరం జరగడం.. నీళ్లలోకి లాక్కెళ్లి మరీ 20 సెకండ్లలోనే అతన్ని చంపి మింగేయడం లాంటి దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఇక మృతుడి శరీర భాగాలను జాలర్లు నీటి నుంచి సేకరించగా.. మరికొన్ని భాగాలు షార్క్ పొట్టలో దొరికాయి. ఇదిలా ఉంటే.. ఆ టైగర్షార్క ప్రవర్తన గురించి పరిశోధకుల్లో ఆసక్తి నెలకొంది. అంత వేగంగా అది దాడి చేసి చంపినందుకు నరమాంసభక్షకిగా అభివర్ణిస్తున్నారు వాళ్లు. అంతేకాదు దానిని పరిశీలించేందుకు ఇప్పుడొక అవకాశం దొరికిందని.. అందుకే దానిని భద్రపర్చాలని నిర్ణయించుకున్నట్లు మెరైన్ సైన్సెస్ ఇనిస్టిట్యూట్, రెడ్సీ రిజర్వ్స్ వాళ్లు చెబుతున్నారు. సోమవారం నుంచి ఆ షార్క్ బాడీకి ఎంబామింగ్ చేయడం ప్రారంభించారు. ఆ ప్రక్రియ పూర్తికాగానే.. ఆ షార్క్‌ను ఇనిస్టిట్యూట్‌లోని మ్యూజియంలో భద్రపరుస్తారట. దాని ప్రవర్తనకు అధ్యయనం చేసేందుకు దానిని భద్రపరుస్తున్నామని, తర్వాతి తరాలకు ఆ కిల్లర్ షార్క్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు దొరికిన భాగాలకు అంత్యక్రియలు నిర్వహించిన ఆ తండ్రి.. పుట్టెడు దుఖంతో ఆ అస్తికలను తీసుకుని రష్యాకు వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. ఇదీ చదవండి: శవపేటిక నుంచి సౌండ్ రావడంతో.. -
నడిసంద్రంలో పర్యాటకుల పడవకు మంటలు..డాల్ఫిన్స్ కోసం వెళితే..
ఈజిప్టు: ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న పర్యాటకుల పడవకు అగ్ని ప్రమాదం జరిగింది. పడవలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. ఈజిప్టు, ఎల్ఫిన్‌స్టోన్ రీఫ్‌కు దగ్గరలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. మొత్తం పడవలో 29 మంది ప్రయాణిస్తున్నారు. అందులో 15 మంది బ్రిటీష్ పర్యాటకులు, 14 మంది సిబ్బంది ఉన్నారు. అయితే..సొర చేపలు, డాల్ఫిన్స్ ఉండే అందమైన ప్రదేశానికి పడవ బయలుదేరింది. ఎల్ఫిన్‌స్టోన్ రీఫ్‌కు చేరగానే ప్రమాదం జరిగింది. పడవలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బోట్ల సహాయంతో సిబ్బంది పర్యాటకులను రక్షించే ప్రయత్నం చేశారు. కానీ ముగ్గురు ప్రయాణికులు గల్లంతైనట్లు తెలిపారు. حريق مركب سفاري بطول ٤٠ متر اسمها hurricane في جنوب البحر الأحمر و بالتحديد منطقة Elphinstone و انقاذ معظم السياح فيما عدا ٣ لا يزالوا مفقودين و يعتقد ان جنسيتهم انجليز، نتمني السلامه للجميع و ربنا ينجي المفقودين. المصدر: شهود عيان pic.twitter.com/hRg1YlzNb7 — RedSea_Anglers ⚓ 🚢 🇪🇬🇱🇧🇬🇷 (@HanySadekk) June 11, 2023 షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గల్లంతైనవారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: బల్బులు మార్చితే చాలు.. కోట్ల జీతం మీదే..! -
అసలు క్లియోపాత్రా ఏ కలర్? నెట్‌ఫ్లిక్స్‌తో ఎందుకీ రచ్చ!
స్ట్రీమింగ్ సర్వీస్ నెట్‌ఫ్లిక్స్‌కి మరో వివాదపు సెగ తగిలింది. నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన డాక్యుమెంటరీ సిరీస్ ‘ఆఫ్రికన్ క్వీన్స్: క్వీన్ క్లియోపాత్ర’ ట్రైలర్ ద్వారానే రచ్చ రేపింది. చరిత్రలో ఉన్న బ్లాక్ క్వీన్స్‌ను హైలెట్ చేస్తూ నిర్మించిన ఈ సిరీస్‌లో క్లియోపాత్ర మీద తీసిన పోర్షన్ ట్రైలర్‌పై ఈజిప్ట్ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు కారణం.. క్లియోపాత్రా పాత్ర కోసం ఓ బ్లాక్ ఆర్టిస్ట్‌ను ఎంచుకోవడం!. క్వీన్ క్లియో పాత్రా దేహం నలుపు రంగు కాదని.. ఆమె ఛామన ఛాయ రంగులో ఉండేదని ప్రముఖ ఆర్కియాలజిస్ట్ జాహి హవాస్ నెట్‌ఫ్లిక్స్ క్వీన్ క్లియోపాత్రాపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమెది యూరోపియన్ మూలాలని చెప్తున్నారాయన. క్లియోపాత్రా గ్రీకుకు చెందిన వ్యక్తి. మాసిడోనియా రాజులు, రాణులతో ఆమెకు దగ్గరి పోలికలు ఉన్నాయి అని పేర్కొన్నారు. మరోవైపు క్లియోపాత్ర రంగును నలుపుగా చూపించడం ద్వారా.. ఆమె ఈజిప్ట్ గుర్తింపును తుడిచేసే ప్రయత్నం జరుగుతోందంటూ మహమొద్ అల్ సెమారీ అనే లాయర్ ఈజిప్ట్ అటార్నీ జనరల్‌కు ఓ విజ్ఞప్తి సమర్పించాడు. ఈజిప్ట్‌లో నెట్‌ఫ్లిక్స్‌ను బ్లాక్ చేయడం ద్వారా ఆ వివాదాస్పద సిరీస్ ప్రసారం కాకుండా చూడాలంటూ కోరారాయన. అయితే.. ఇది అనవసర వివాదమంటోంది ఈ సిరీస్ నిర్మాణంలో భాగం పంచుకున్న జడా పింకెట్ స్మిత్(విల్‌స్మిత్ భార్య). ఇది కేవలం బ్లాక్ క్వీన్స్ గురించి, వాళ్ల గొప్పదనం గురించి చెప్పడమేగానీ ఇతర ఉద్దేశం లేదని ఆమె ఆంటోంది. అయినప్పటికీ.. ఈజిప్ట్ మాత్రం నెట్‌ఫ్లిక్స్‌పై ఆగ్రహంతో ఊగిపోతోంది. బ్యాన్ నెట్‌ఫ్లిక్స్ ట్రెండ్‌ను నడిపిస్తోంది అక్కడి సోషల్ మీడియా. హిస్టరీ ఐకాన్.. క్లియోపాత్రా గ్రేట్ ఫిగర్స్ ఆఫ్ హిస్టరీలో ఒకరిగా పేరుంది క్లియోపాత్రాVII ఫిలోపేటర్కి. ముందున్న ఆరుగురు క్లియోపాత్రాల్లో ఎవరికీ లేని ప్రత్యేకతలున్నాయి కాబట్టే ఈమె గురించి ఇంత చర్చ. రాజకీయ వ్యూహాలు రచించడంలో క్లియోపాత్రాVII సిద్ధహస్తురాలని, కొన్ని సార్లు ఆమె ఎత్తులకు చక్రవర్తులే చిత్తయిపోయేవారని చరిత్ర చెబుతుంది. అంతేకాదు.. గొప్ప అందగత్తె అయినప్పటికీ శారీరక సుఖం కోసం ఆమె ఎంతదాకా అయినా వెళ్తుందనే ప్రచారమూ ఒకటి ఉంది. 👉 క్రీస్తు పూర్వం 48లో ఆమె ఈజిప్ట్‌ను మహారాణిగా పాలించారు. ఆమె ఈజిప్టులోని అలెగ్జాండ్రియలో క్రీస్తు పూర్వం 69లో జన్మించారు. టాలమీ వంశస్థురాలైన క్లియోపాత్రా.. పాలనలోనే కాదు పలు రంగాల్లోనూ నేర్పరి. బహుభాషా కోవిదురాలు. గొప్ప రచయిత. కాస్మోటిక్స్, హెయిర్ కేర్ మీద ఆమె ఓ పుస్తకం కూడా రాశారట. 👉 క్లియోపాత్రా అధికారం కోసం.. సోదరి బైరినైస్, తండ్రి 12వ టాలెమీ మరణాంతరం రాజైన సోదరుడు 13వ టాలెమీ (ఆచారం ప్రకారం.. ఇతన్నే వివాహం చేసుకుని ఈజిప్ట్‌కు రాణి అయ్యింది) పథకం ప్రకారం అడ్డు తొలగించుకుంది. ఆపై ఇరవై ఏళ్లపాటు ఈజిప్ట్‌ను పాలించింది క్లియోపాత్రా. 👉 రోమ్ చక్రవర్తి జూలియస్ సీజర్, అతని కుడిభుజం మార్కస్ ఆంటోనియస్లతో క్లియోపాత్రా రొమాంటిక్ రిలేషన్షిప్ నడిపింది. 👉 క్లియోపాత్రాతో జూలియస్ సీజర్ బంధాన్ని రోమన్ సైన్యాధికారులు తట్టుకోలేకపోయారు. తిరుగుబాటు చేశారు. ఆ పరిణామంతో మనస్తానం చెంది.. కత్తితో పొడుచుకుని క్లియోపాత్రా ఒడిలోనే చనిపోయాడని ఓ కథనం, శత్రువుల చేతిలోనే మరణించాడని మరో కథనం ప్రచారంలో ఉంది. 👉 క్లియోపాత్రా ఒకానొక సమయంలో నిరాదరణకు గురవడంతో తీవ్ర మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. పాముతో తన వక్షోజాలకు కాటు వేయించుకుని మరీ ప్రాణం విడిచింది. ఆమెతోపాటు ఆమె చెలికత్తెలు కూడా అదే విధంగా చనిపోయారు. అయితే.. ఇది ఒక వర్షన్. ఆమెకు ఎవరో విషం ఇచ్చి చంపారు. ఇది రెండో వర్షన్. దీంతో.. క్లియోపాత్రా మరణం చరిత్రలో మిస్టరీగానే మిగిలిపోయింది. 👉 టాలోమీ రాజవంశం.. మొదటి శతాబ్దం BCలో రోమన్ ఆక్రమణతో ముగిసింది. 👉 క్లియోపాత్రాకు మొత్తం 4 మంది సంతానమని ఈజిప్ట్ చరిత్ర పుస్తకాలు చెబుతుంటాయి. కానీ వారిలో ఒక్కరు మాత్రమే బతికారట. ఆమె క్లియోపాత్రా సెలిన్. 👉 క్లియోపాత్రా నల్లజాతి మూలాలున్న వ్యక్తేనని ఆఫ్రోసెంటిస్ట్ స్కాలర్స్ ప్రతిపాదించారు. కానీ, చాలామంది మేధావులు మాత్రం ఆమె అందగత్తె కాబట్టే చక్రవర్తులు వెర్రెత్తిపోయారని చెబుతూ ఆ వాదనను కొట్టేశారు. కొసమెరుపు.. క్లియోపాత్రాను ఆఫ్రికన్ సంతతి వ్యక్తిగా చూపించిన ఈ డాక్యుమెంటరీలో బ్రిటిష్ నటి అడెలె జేమ్స్ లీడ్రోల్లో నటించింది. :::సాక్షి వెబ్ ప్రత్యేకం -
రెండు వేల గొర్రె తలలను ప్రసాదంగా ఉంచారట!
కుక్కలు, మేకలు, ఆవులు, గజెల్స్, ముంగిసలు మమ్మీలుగా ఉండటం గురించి వినలేదు కదా!. కానీ అమెరికా పురావస్తు శాస్త్రజ్ఞులు ఈజిప్టులో వాటిని కూడా మమ్మీలుగా ఉంచినట్లు గుర్తించారు. జంతువుల మమ్మీలను అమెరికా పురావస్తు బృందం దక్షిన ఈజిప్టులోని అబిడోస్ నుంచి వెలికితీసింది. అక్కడ దేవాలయాల వద్ద జంతువుల మమ్మీల సమాధులకు ప్రసిద్ధి. కీ.పూ 1304 నుంచి 1237 వరకు దాదాపు ఏడు దశాబ్దాల పాటు ఫారో రామ్సేస్2 అనే రాజు ఈజిప్టుని పాలించాడట. దీంతో ఆయన మరణాంతరం ఆయనకో దేవాలయాన్ని కట్టారు. అయితే ఆయన మరణించిన వెయ్యేళ్లకు గుర్తుగా ఆయన ఆరాధనలో గొర్రె తలలను అర్పించేవారట. అంటే వేల గొర్రెలను శిరచ్ఛేదనం చేసి ఆయనకు నైవేద్యంగా పెట్టేవారని పురావస్తు శాఖ సుప్రీం కౌన్సిల్ మోస్తఫా వాజిరి తెలిపారు. క్రీ.పూర్వం 2374 నుంచి214 మధ్య కాలం రామ్సెస్ 2 ఆలయానికి సంబంధించిన కార్యకలాపాలు, నిర్మాణాలు గురించి తెలుస్తాయని వెల్లడించారు. అంతేగాదు ఈ ప్రదేశంలో మమ్మీగా చేయబడిన జంతు అవశేషాల తోపాటు దాదాపు 4 వేల ఏళ్లక్రితం నాటి ఐదు మీటర్ల మందం గోడలతో కూడిన ప్యాలెస్ అవశేషాలను కూడా కనుగొన్నారు. అక్కడ అనేక విగ్రహాలు, పురాతన చెట్ల అవశేషాలు, తోలు బట్టలు, బూట్లను గుర్తించారు. కైరో నదికి దక్షిణంగా నైలు నిదిపై దాదాపు 270 మైళ్ల దూరంలో ఈ అబిడోస్ ఉంది. ఇక్కడ సేటీ 1 వాటి శవపేటికల ఆలయాలకు ప్రసిద్ధి చెందింది. కైరోలో ఎప్పుడూ ఇలాంటి కొత్తకొత్త ఆవిష్కరణలు వెలుగులోకి వస్తుండటం విశేషం. దాదాపు 105 మిలియన్ల మంది నివాసం ఉండే ఈజిప్టు ఆర్థిక సంక్షోబంలో చిక్కుకుంది. అంతేగాదు అక్కడ సుమారు 10 శాతం జీపీడీ పర్యాటకంపైనే ఆధారపడి ఉంది. పైగా ఇది సుమారు రెండు మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. అయితే కైరో కరోనా మహమ్మారికి ముందు సుమారు 13 మిలియనల మందిని లక్ష్యంగా చేసుకుంటే 2028 నాటికి సుమారు 30 మిలియన్ల మంది టార్గెట్‌గా పెట్టుకుని పర్యాటకాన్ని పునరుద్ధరించాలని భావిస్తోంది. (చదవండి: ఎదురెదురుగా రెండు విమానాలు.. త్రుటిలో తప్పిన ప్రమాదం) -
తీవ్ర విషాదం.. పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు
ఇటీవలే గ్రీస్ దేశంలో జరిగిన రైలు ప్రమాదంలో దాదాపు 50కిపైగా మందికి మృతిచెందిన ఘటన మరువక ముందే మరో విషాదం నెలకొంది. ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పిన ప్రమాద ఘటనలో ఇద్దరు మృతిచెందగా మరో 16 మంది గాయపడ్డారు. ఈ ఘటన ఈజిప్టు దేశంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఈజిప్టులోని కైరో నగరంలో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. కాగా, నైలు డెల్టాలోని మెనోఫ్ నగరానికి వెళ్లే మార్గంలో కల్యుబ్ నగరంలోని స్టేషన్ మీదుగా ప్రయాణిస్తుండగా ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పినట్లు అధికారులు గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరకుని గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక, ఈ రైలు ప్రమాదంపై అధికారులు విచారణ ప్రారంభించినట్టు వెల్లడించారు. AFP: Two people were killed and several others injured Tuesday in a #train_accident north of #Cairo, #Egypt's #health_ministry said. A ministry statement said there were "two dead in the train accident at #Qalyub, while the injured are in a stable condition." pic.twitter.com/ILBz8R0xs4 — Usama Farag (@VOAFarag) March 7, 2023 -
Turkey–Syria Earthquakes: ఎందుకీ భూ ప్రకోపం?
టర్కీ, సిరియాలో శక్తివంతమైన భూకంపం ధాటికి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ భవనాలు నేటమట్టమయ్యాయి. 456 కిలోమీటర్ల దూరంలోని సైప్రస్, 874 కిలోమీటర్ల దూరంలో ఉన్న లెబనాన్, 1,381 కిలోమీటర్ల దూరంలోని ఇజ్రాయెల్, 1,411 కిలోమీటర్ల దూరంలోని ఈజిప్ట్‌లో సైతం భూప్రకంపనలు నమోదయ్యాయి. దక్షిణ–మధ్య టర్కీలోని గాజియాన్‌టెప్ సిటీకి 33 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూ ఉపరితలం నుంచి 18 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు మొదలైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. టర్కీలో గత 100 ఏళ్లలో ఇదే అత్యంత శక్తివంతమైన భూకంపమని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 95 శాతం భూభాగం భూకంప ప్రభావితమే భౌగోళికంగా ‘అనటోలియన్ టెక్టానిక్ ప్లేట్’ ప్రాంతంలో ఉన్న టర్కీలో భూప్రకంపనలు సర్వసాధారణంగా మారాయి. 2020లో 33,000 భూకంపాలు నమోదయ్యాయి. వీటిలో 332 భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేల్‌పై దాదాపు 4.0గా రికార్డయ్యింది. భూమి పై పొరను టెక్టానిక్‌గా వ్యవహరిస్తారు. ఇందులో 15 భారీ టెక్టానిక్ ప్లేట్లు (రాతి పొరలు) ఉంటాయి. రెండు పొరల సరిహద్దుల నడుమ ఖాళీ ప్రదేశం ఉంటుంది. కొన్నిచోట్ల ప్లేట్ల మధ్య పగుళ్లు ఉంటాయి. భూ అంతర్భాగంలో సర్దుబాట్ల వల్ల రెండు టెక్టానిక్ ప్లేట్లు బలంగా ఢీకొన్నప్పుడు భారీ భూకంపం సంభవిస్తుందని బ్రిటిష్ ఆర్కియాలాజికల్ సర్వే వెల్లడించింది. యూరేసియన్, ఆఫ్రికన్ ప్లేట్ల చీలిక భాగంలో టర్కీ భూభాగం ఉంది. యూరేసియన్, అనటొలియన్ టెక్టానిక్ ప్లేట్ల నడుమ నార్త్ అనటొలియన్ ఫాల్ట్(ఎన్‌ఏఎఫ్) లైన్ అనే చీలిక ఉంది. రెండు ప్లేట్లు ఢీకొనడంతో ఇక్కడే భూకంపం ప్రారంభమైనట్లు భావిస్తున్నారు. ఎన్‌ఏఎఫ్ చీలిక దక్షిణ ఇస్తాంబుల్ నుంచి ఈశాన్య టర్కీ దాకా విస్తరించి ఉన్నట్లు గుర్తించారు. 1999, 2011లోనూ ఈ ప్రాంతం నుంచే భూకంపాలు విస్తరించినట్లు పరిశోధకులు వెల్లడించారు. 1999 నాటి భూకంపంలో 18,000 మంది, 2011 నాటి భూకంపంలో 500 మందికిపైగా జనం మృతిచెందారు. టర్కీలో ఏకంగా 95 శాతం భూభాగం భూకంప ప్రభావిత ప్రాంతమే కావడం గమనార్హం. పెద్ద నగరాలైన ఇస్తాంబుల్, ఇజ్‌మీర్‌తోపాటు ఈస్ట్ అనటోలియా కూడా భూకంపం ముప్పును ఎదుర్కొంటున్నాయి. 3 రోజుల క్రితమే చెప్పేశాడు తాజా భూకంపంపై ముందే చెప్పిన ఫ్రాంక్ త్వరలో భారత్‌కూ రావచ్చని హెచ్చరికలు అమ్‌స్టర్‌డ్యామ్: టర్కీ, సిరియాలో వేలాది మందిని బలితీసుకున్న భూకంపం గురించి నెదర్లాండ్స్‌కు చెందిన ఫ్రాంక్ హూగర్‌గీట్స్ అనే పరిశోధకుడు ముందే హెచ్చరించారు. దక్షిణ మధ్య టర్కీ, జోర్డాన్, సిరియా, లెబనాన్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించనుందని, ఇది రిక్టర్ స్కేల్‌పై 7.5గా నమోదవుతుందని ఈ నెల 3న ఆయన ట్వీట్ చేశారు. ఆయన జోస్యం నిజమేనని మూడు రోజుల తర్వాత తేలింది. మొదటి భూకంపం తర్వాత కొన్ని గంటలు గడిచాక రెండో భూకంపం సంభవిస్తుందంటూ తన సంస్థ చేసిన ట్వీట్‌ను ఆయన షేర్ చేశారు. అది కూడా నిజమేనని తేటతెల్లమయ్యింది. త్వరలో భారత్‌తో పాటు పాకిస్తాన్, అఫ్గానిస్తాన్లకు కూడా భూకంపం రావచ్చని హెచ్చరిస్తున్నారు. హూగర్బీట్స్ ‘సోలార్ సిస్టమ్ జియోమెట్రీ సర్వే’ అనే సంస్థలో పరిశోధకుడిగా పనిచేస్తున్నారు. ఈ సంస్థ భూకంపాలపై అధ్యయనం చేస్తోంది. అయితే, హూగర్బీట్స్ నకిలీ సైంటిస్టు అని పలువురు ట్విట్టర్లో విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా, తాను చెప్పింది వాస్తవరూపం దాల్చడం పట్ల హూగర్బీట్స్ విచారం వ్యక్తం చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Delhi: మన ఘన శక్తి.. మహిళా యోధులే సారథులు
న్యూఢిల్లీ: ఆత్మనిర్భరత స్ఫూర్తితో పరిపుష్టమైన సైనిక శక్తిని ప్రదర్శిస్తూ.. నారీశక్తిని చాటుతూ.. వైవిధ్యమైన, సుసంపన్నమైన దేశ సాంస్కృతిక వారసత్వాన్ని కళ్లకు కడుతూ 74వ గణతంత్ర వేడుకలు మువ్వన్నెల జెండాల రెపరెపలతో ఘనంగా జరిగాయి. రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ నిర్వహించిన వేడుకల్లో దేశ విదేశీ ప్రముఖులు, కేంద్ర మంత్రులు, త్రివిధ దళాల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్–సీసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలుత జాతీయ యుద్ధ స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అమర జవాన్లకు ఘనంగా నివాళులరి్పంచారు. అనంతరం సంప్రదాయం ప్రకారం కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ గీతాలాపన తర్వాత సైనికులు లాంఛనంగా 21 గన్ సెల్యూట్ సమర్పించారు. రక్షణ రంగంలో స్వావలంబనకు సూచికగా పాతకాలపు విదేశీ 25–పౌండర్‌గన్స్ స్థానంలో ఈసారి స్వదేశీ 105–ఎంఎం ఇండియన్ ఫీల్డ్ గన్స్ పేల్చడం విశేషం. అబ్బురపర్చిన విన్యాసాలు కర్తవ్యపథ్‌లో రిపబ్లిక్ డే పరేడ్ కన్నుల పండువగా సాగింది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర శాఖల శకటాలు ఆకట్టుకున్నాయి. సైనికుల విన్యాసాలు అబ్బురపర్చాయి. మన ఆయుధ పాటవాన్ని, సైనిక శక్తిని తిలకించిన ఆహూతుల హృదయాలు గర్వంతో ఉప్పొంగాయి. మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ, డోగ్రా రెజిమెంట్, పంజాబ్ రెజిమెంట్, మరఠా లైట్ ఇన్ఫాంట్రీ, బిహార్ రెజిమెంట్, గూర్ఖా బ్రిగేడ్ తదితర సేనలు మార్చ్ఫాస్ట్ నిర్వహించాయి. దేశీయంగా తయారు చేసిన ఆయుధాలు, రక్షణ సామగ్రిని పరేడ్‌లో ప్రదర్శించారు. అర్జున్, నాగ్ మిస్సైల్ సిస్టమ్, కె–9 వజ్ర యుద్ధ ట్యాంకులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నావికాదళం నుంచి 9 మంది అగి్నవీరులు తొలిసారిగా పరేడ్‌లో పాల్గొన్నారు. వీరిలో ముగ్గురు యువతులున్నారు. వైమానిక విన్యాసాల్లో ఆధునిక మిగ్–29, ఎస్‌యూ–30 ఎంకేఐ, రఫేల్ ఫైటర్లు, సి–130 సూపర్ హెర్క్యులస్ యుద్ధ విమానాలతోపాటు సి–17 గ్లోబ్ గ్లోబ్‌మాస్టర్ రవాణా విమానాలు పాల్గొన్నాయి. నావికా దళానికి చెందిన ఐఎల్–38 యుద్ధ విమానం సైతం తొలిసారిగా పాలుపంచుకుంది. దట్టమైన పొగమంచు వల్ల యుద్ధ విమానాల విన్యాసాలను ప్రజలు పూర్తిస్థాయిలో ఆస్వాదించలేకపోయారు. 800 మీటర్ల ఎత్తులో ఎగురుతున్న విమానాలను కూడా కళ్లు చిట్లించుకొని చూడాల్సి వచి్చంది. వాటిని ఫోన్లలో చిత్రీకరించేందుకు ప్రయాస పడ్డారు. 25–పౌండర్ శతఘ్నులకు సెలవు రిపబ్లిక్ డే వేడుకల్లో 21 గన్ సెల్యూట్లో భాగంగా 25–పౌండర్ గన్స్ పేల్చడం దశాబ్దాలుగా సంప్రదాయంగా కొనసాగుతోంది. ఇకపై వీటికి శాశ్వతంగా సెలవు ఇచ్చేసినట్టే. ఈసారి దేశీయంగా తయారు చేసిన 105–ఎంఎం ఇండియన్ ఫీల్డ్ గన్స్ పేల్చారు. ఈ వందనంలో మొత్తం ఏడు శతఘ్నులు పాల్గొన్నాయి. ఒక్కొక్కటి మూడుసార్లు పేల్చారు. రిపబ్లిక్ డే వేడుకల్లో స్వదేశీ శతఘ్నులతో వందనం సమరి్పంచడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. 2281 ఫీల్డ్ రెజిమెంట్‌కు చెందిన 25–పౌండర్ గన్స్ 1940 దశకం నాటివి. ఇవి యునైటెడ్ కింగ్డమ్లో తయారయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధంలోనూ పాల్గొన్నాయి. 21 గన్ సెల్యూట్‌కు పట్టే సమయం 52 సెకండ్లు. మహిళా యోధులే సారథులు నారీశక్తిని ప్రతిబింబిస్తూ ‘ఆకాశ్’ ఆయుధ వ్యవస్థను లెఫ్టినెంట్ చేతన్ శర్మ నాయకత్వంలో ప్రదర్శించారు. 144 మంది జవాన్లు, నలుగురు అధికారులతో కూడిన భారత వైమానిక దళం(ఐఏఎఫ్) బృందానికి స్క్వాడ్రన్ లీడర్ సింధూరెడ్డి నేతృత్వం వహించారు. సెంట్రల్ రిజర్వ్ పోలీసు దళం(సీఆర్పీఎఫ్) నుంచి పూర్తిగా మహిళా సైనికులతో కూడిన బృందం పరేడ్‌లో పాల్గొంది. ఈ బృందానికి అసిస్టెంట్ కమాండెంట్‌పూనమ్ గుప్తా సారథ్యం వహించారు. ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా ఆర్మ్డ్ పోలీసు బెటాలియన్‌గా ఈ బృందానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాగే ఢిల్లీ మహిళా పోలీసుల పైప్ బ్యాండ్ కూడా మొదటిసారిగా గణతంత్ర పరేడ్‌లో భాగస్వామిగా మారింది. ‘ఢిల్లీ పోలీసు సాంగ్’ను వారు ఆలపించారు. పరేడ్ సైడ్‌లైట్స్ ►రాజ్‌పథ్ పేరును కర్తవ్యపథ్గా మార్చిన తర్వాత ఇవే తొలి గణతంత్ర వేడుకలు. ►ఈసారి ‘నారీశక్తి’ థీమ్‌తో వేడుకలు జరిగాయి. ►ఈజిప్ట్ సైనిక దళాలు, బ్యాండ్ తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొన్నాయి. ►ప్రధాని మోదీ ధరించిన రంగుల తలపాగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ►ముగ్గురు పరమవీర చక్ర గ్రహీతలు, ముగ్గురు అశోక చక్ర అవార్డు గ్రహీతలు పరేడ్‌లో పాల్గొన్నారు. ►బీఎస్ఎఫ్కు చెందిన ఒంటెల దళాన్ని తొలిసారిగా మహిళా సైనికులు నడిపించారు. ►మొత్తం 23 శకటాలను ప్రదర్శించారు. 17 రాష్ట్రాలవి కాగా 6 కేంద్ర శాఖలవి. ►ఢిల్లీ సెంట్రల్ విస్టా, కర్తవ్యపథ్, నూతన పార్లమెంట్ భవన నిర్మాణంలో పాల్గొన్న ‘శ్రమయోగీల’తోపాటు పాలు, కూరగాయలు విక్రయించుకొనేవారిని, చిరు వ్యాపారులను గణతంత్ర వేడుకలకు ప్రత్యేకంగా ఆహ్వానించడం విశేషం. ► 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్) శకటంపై చిరుధాన్యాలను ప్రదర్శించారు. కనువిందుగా అలంకరించిన ఈ శకటం అందరి దృష్టిని ఆకర్షించింది. -
ఈజిప్ట్‌తో బంధం బలోపేతం
న్యూఢిల్లీ: ఈజిప్టుతో ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్ నిర్ణయించింది. గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్ సిసి (68)తో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం సమావేశమయ్యారు. రక్షణ, భద్రత, వర్తకం రంగాలతో పాటు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో కూడా పరస్పరం మరింతగా సహకరించుకోవాలని నేతలు నిర్ణయించారు. ముఖ్యంగా సీమాంతర ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. 700 కోట్ల డాలర్లున్న ద్వైపాక్షిక వర్తకాన్ని ఐదేళ్లలో 1,200 కోట్ల డాలర్లకు పెంచాలని నిర్ణయించారు. ఆహార, ఇంధన, ఎరువులు తదితర రంగాలపై రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం తదితరాలు చర్చకు వచ్చాయి. ఐటీ, సైబర్ సెక్యూరిటీ, యువత, సమాచార, సాంస్కృతిక రంగాలకు సంబంధించి ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఐదు ఒప్పందాలు కుదిరాయి. ‘‘ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక బంధం స్థాయికి పెంపొందించుకోవాలని భేటీలో నిర్ణయించాం. ఇరు దేశాల వ్యూహాత్మక సహకారం ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో శాంతికి, ప్రగతికి బాటలు పరుస్తుంది’’ అని మోదీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచమంతటా ఉగ్రవాదం పెచ్చరిల్లుతుండటంపై ఇరు దేశాలూ ఆందోళనతో ఉన్నాయి. ఇది మానవాళి భద్రతకు అతి పెద్ద సమస్యగా మారిందన్న వాస్తవాన్ని అంగీకరిస్తున్నాయి. ఉగ్రవాద భావజాల వ్యాప్తికి సైబర్ స్పేస్ దుర్వినియోగం చేస్తున్న తీరుకు అడ్డుకట్ట వేసేందుకు చేతులు కలపాలని నిర్ణయించాం’’ అన్నారు. కరోనా, యుద్ధంతో దెబ్బ తిన్న ఆహార, ఫార్మా సరఫరాలను బలోపేతం చేయడంపై చర్చించామన్నారు. చర్చలు అత్యంత ఫలప్రదంగా సాగినట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వట్రా తెలిపారు. ఇదే తొలిసారి గణతంత్ర ఉత్సవాలకు ఈజిప్టు అధ్యక్షున్ని ఆహ్వానించడం ఇదే తొలిసారి. ఈజిప్టు సైనిక బృందం కూడా గణతంత్ర పరేడ్‌లో పాల్గొంటోంది. మూడో ఇండియా–ఆఫ్రికా ఫోరం శిఖరాగ్రంలో పాల్గొనేందుకు సిసి 2015లో తొలిసారి భారత్‌లో పర్యటించారు. తర్వాత ఏడాదికే మరోసారి పర్యటించారు. యువతే అతిపెద్ద లబ్ధిదారులు అభివృద్ధి చెందిన భారతదేశంలో యువతే అతిపెద్ద లబ్ధిదారులుగా మారబోతున్నారని ప్రధానినరేంద్ర మోదీ చెప్పారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే అతిపెద్ద బాధ్యత సైతం వారిపైనే ఉందన్నారు. గణతంత్ర పరేడ్‌లో పాల్గొననున్న ఎన్సీసీ కేడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘‘అమృతకాలంలో దేశ ఆకాంక్షలు, కలలకు యువత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నేటితరానికి ఎన్నెన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. భారతదేశం సాధిస్తున్న ఘనతల్లోనే ప్రపంచం తన భవిష్యత్తును వెతుక్కుంటోంది. జాతి లక్ష్యాలు, ఆకాంక్షలతో యువతను ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ అనుసంధానిస్తున్నాయి. యువత మాట్లాడడం ప్రత్యేకమైన అనుభూతినిస్తోంది. భారత్ సారథ్యం వహిస్తున్న జి–20 కూటమి గురించి పాఠశాలలు, కళాశాలల్లో చర్చించుకోవాలి’’ అని సూచించారు. స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనాలని యువతను కోరారు. -
COP27: కార్యాచరణకు దిగాల్సిన సమయమిదే
ఈజిప్టులో జరిగిన ‘కాప్ 27’ సమావేశాలు వాడిగా వేడిగా జరిగాయి. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు రెండుగా విడిపోయాయి. ‘పేమెంట్ ఓవర్‌డ్యూ’ ఈసారి హాట్ టాపిక్! వాతావరణ కాలుష్యానికి కారణమైన ధనిక దేశాలు అందుకు తగ్గ పరిహారం చెల్లించడం ఇప్పటికే ఆలస్యమైందన్న భావన ఈ పేమెంట్ ఓవర్‌డ్యూ. అయితే ఈ దేశాలు తాము అంగీకరించిన విషయాల్లోనూ వెనకడుగు వేస్తుండటంతో వాతావరణ మార్పులపై జరుగుతున్న చర్చల్లో పురోగతి ఉండటం లేదు. అభివృద్ధి చెందిన దేశాలు తమ కాలుష్య తప్పిదాలకు బాధ్యత వహించి పరిష్కార మార్గాలకు నేతృత్వం వహించే విధానాలు రావాలి. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి స్పష్టం చేసినట్టు, కార్యాచరణకు దిగాల్సిన సమయమిదే! ఈజిప్టులోని షర్మ్ అల్–షేఖ్లో నవంబరు ఆరున మొదలైన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (కాప్) 27వ సమావేశాలు ముగిశాయి. ఐక్యరాజ్య సమితి సంస్థ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైౖమేట్ ఛేంజెస్ (యూఎన్ఎఫ్సీసీసీ) ఆధ్వర్యంలో నడిచిన ఈ సమావేశాల్లో తీవ్ర చర్చోపచర్చలు, వాదోప వాదాలు జరిగి, ఒక్కరోజు పొడిగింపు తరువాత నవంబరు 20వ తేదీ తెల్లవారుజామున ముగిశాయి. వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనేదెలా అన్న అంశంపై ఏటా జరిగే ‘కాప్’ సమావేశాల్లో ఈసారి ‘పేమెంట్ ఓవర్‌డ్యూ’ అంశంపై తీవ్రస్థాయి ప్రతిష్టంభన ఏర్ప డింది. వాతావరణ కాలుష్యానికి కారణమైన ధనిక దేశాలు అందుకు తగ్గ పరిహారం చెల్లించడం ఇప్పటికే ఆలస్యమైందన్న భావనను సంక్షి ప్తంగా పేమెంట్ ఓవర్‌డ్యూ అని పిలుస్తున్నారు. ఈ అంశంపై అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు రెండుగా విడిపోయాయి. నవంబరు 18నే ముగియాల్సిన చర్చలు ఇరు వర్గాల విమర్శలు, ప్రతి విమర్శలతో రోజంతా కొనసాగాయి. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటో నియో గుటెరస్ కలుగచేసుకుని, కార్యాచరణకు దిగాల్సిన సమయ మిదేనని స్పష్టం చేయాల్సి వచ్చింది. ‘‘కాప్27 సమావేశాలు నవం బరు 18నే ముగియాల్సి ఉండింది. అయితే చర్చలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ఒక రోజుపాటు పొడిగించారు’’ అని భారత పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. వాతావరణ మార్పులపై ఏళ్లుగా జరుగుతున్న చర్చలు తరచూ ఆయా దేశాలు, వర్గాల మధ్య కలహాలు, జగడాలతో అర్ధంతరంగా ముగుస్తున్నాయి. ఈ దేశాలు, వర్గాలు సంకుచితమైన భావాలతో... ఇతరులపై పైచేయి సాధించేందుకు ఈ సమావేశాలు వేదికలుగా మారిపోయాయి. ‘‘వాతావరణంలోని గ్రీన్హౌస్ వాయువుల మోతాదు పెరిగిపోకుండా స్థిరీకరించాల్సి ఉంది’’ అన్న యూఎన్ ఎఫ్‌సీసీసీ ఆర్టికల్ 2 లక్ష్యాన్ని 30 ఏళ్లయినా అందుకోలేకపోవడం ఇందుకు ప్రత్యక్ష తార్కాణమని చెప్పాలి. ఈ ఏడాది జూన్ రెండున స్టాక్‌హోమ్+ 50 సమావేశాల్లోనూ ఐరాస ప్రధాన కార్యదర్శి ప్రపంచ వాతావరణ అత్యయిక పరిస్థితిపై మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ‘‘మూప్పేట ముప్పు ఎదుర్కొంటూ ఉన్నాం. ఏటికేడాదీ ప్రజ లను చంపేయడమే కాకుండా... నిరాశ్రయులను చేస్తున్న వాతావరణ అత్యవసర పరిస్థితి ఉంది. ఇప్పటికిప్పుడు మనం మన తీరుతెన్నులు మార్చుకోవాలి. ప్రకృతిపై చేస్తున్న మతిలేని ఆత్మహత్యా సదృశమైన పోరును ఆపాలి’’ అని ఆంటోనియో గుటెరస్ విస్పష్టంగా పేర్కొ న్నారు. ఈ హెచ్చరికలు 1992లో యూఎన్ఎఫ్సీసీసీ... రియో సద స్సులో ఆమోదించిన తీర్మానాన్ని ధ్రువీకరించాయని చెప్పాలి. ‘‘ప్రపం చంలో ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి... ఎక్కువ కాలం కొనసాగేది కాదు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా ప్రకృతిని జయించాలన్న మానవ కాంక్ష మన మనగడనే ప్రశ్నార్థకం చేసే స్థితికి తీసుకొచ్చింది’’ అన్నది ఆ రియో సదస్సు తీర్మానం. ‘ఎన్విజనింగ్ అవర్ ఎన్విరాన్ మెంటల్ ఫ్యూచర్’ పేరుతో 2002లో వెలువడ్డ ఓ పుస్తకంలోనూ ‘‘పర్యావరణ విధ్వంసానికి సంబంధించిన హెచ్చరికలు వెలువడు తున్న ఈ తరుణంలో మన భవిష్యత్తును కాపాడుకునేందుకు తీసు కోవాల్సిన చర్యలకు తగినంత సమయం లేదన్నది గుర్తించాలి’’ అని చెప్పడం ఇక్కడ ప్రస్తావనార్హం. యూఎన్ఎఫ్సీసీసీలో దాదాపు 198 దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. వాతావరణ మార్పులన్నవి మానవాళికి అత్యంత ఆందోళ నకారి అని అంగీకరిస్తూ అందరితోనూ తొలినాళ్లలోనే ఒక ఒప్పందం చేసింది ఈ సంస్థ. 1997 నాటి క్యోటో ప్రోటోకాల్, 2015 నాటి ప్యారిస్ ఒప్పందాల ద్వారా యూఎన్ఎఫ్సీసీసీ వాతావరణ మార్పు లను ఎదుర్కొనేందుకు మూడు చట్టపరమైన ఆయుధాలు కలిగి ఉంది. రియో సదస్సు జరిగి ముప్ఫై ఏళ్లయిన సందర్భం ఇది. 2050 నాటికి భూమి సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ పెరగకుండా చూసుకోవాలన్న శాస్త్రీయ లక్ష్యాన్ని సాధించేందుకు ఇదే అవకాశం. ఎందుకంటే... ఈ ఏడాది ఏప్రిల్‌లో ‘ద ఇంటర్ గవర్న మెంటల్ ప్యానెల్ ఆన్ క్లైౖమేట్ ఛేంజ్’ విడుదల చేసిన ఆరవ అంచనా నివేదిక కూడా... గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు పెరిగిపోతున్నాయని హెచ్చరించింది. గత నెలలోనే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్‌కు చెందిన ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ కూడా ప్యారిస్ ఒప్పందం అమలులో వెనుకబడుతున్నామనీ, లక్ష్యాన్ని అందుకు నేందుకు నమ్మ దగ్గ మార్గమేదీ లేని నేపథ్యంలో వాతావరణ పెను విపత్తును నివారిం చేందుకు అత్యవసరంగా ఓ విస్తృతమైన మార్పు అనివార్యం అవు తుందనీ స్పష్టం చేసింది. వాతావరణ మార్పుల సమస్య అనేది ఇప్పుడు కేవలం ఒక ఆందోళనకరమైన అంశం మాత్రం కాదు. ప్రపంచం మొత్తాన్ని పీడించగలదని అందరూ గుర్తించాలి. అయితే అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటివరకూ చేసిన కాలుష్య తప్పిదాలకు బాధ్యత వహించి పరిష్కార మార్గాలకు నేతృత్వం వహించేలా విధానాలు లేకుండా పోయాయి. భూమ్మీద అత్యధిక కర్బన ఉద్గారాలకు కారణమైన అమెరికా వాతావరణ మార్పులపై పోరు విషయంలో కప్పదాట్లు వేయడం, 2019లో ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలగడం, ఆ తరువాత 2021లో మళ్లీ చేరుతున్నట్లు ప్రకటించడం అభివృద్ధి చెందిన దేశాల తీరుకు తార్కాణంగా నిలుస్తోంది. అంతేకాకుండా... వాతా వరణ మార్పులపై జరిగిన ఒప్పందాల్లోని డొల్లతనాన్ని ఎత్తి చూపు తుంది కూడా. అంతర్జాతీయ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ ఒడిదుడుకులకు గురయ్యేందుకు యూఎన్ఎఫ్సీసీసీ తన ప్రధాన సిద్ధాంతం నుంచి కొంత పక్కదారి పట్టడమే కారణమని అనిపిస్తుంది. వాతావరణ మార్పుల సమస్య అందరిదైనా... బాధ్యతలు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయని చెప్పే సిద్ధాంతం మాత్రమే కాకుండా... క్యోటో ప్రోటో కాల్లోని కొన్ని కీలకాంశాల్లో సడలింపులు, ప్యారిస్ ఒప్పందంలోనూ బాధ్యతల విషయంలో ఆయా దేశాలు తమకు తగ్గ నిర్ణయం తీసు కుంటాయని చెప్పడం... వెరసి వాతావరణ మార్పులపై మనిషి పోరు నిర్వీర్యం అని చెప్పక తప్పదు. అభివృద్ధి చెందిన దేశాలు తాము అంగీకరించిన ప్రతి విషయంలోనూ వెనకడుగు వేయడం వాతావరణ మార్పులపై జరుగుతున్న చర్చల్లో పెద్దగా పురోగతి లేకపోయేందుకు కారణమని చెప్పాలి. అభివృద్ధి చెందిన దేశాలు తాము అంగీకరించిన అంశాల నుంచి వెనక్కు వెళ్లడం... వాతావరణ మార్పులు, దాని దుష్ప్రభావాలను ఎదుర్కొనే విషయంలో ధనిక దేశాలు నేతృత్వం వహించాలని యూఎన్ఎఫ్సీసీసీ చేసిన ప్రకటనను వెక్కిరించేదిగా ఉంది. అభివృద్ధి చెందిన దేశాల తీరు యూఎన్ఎఫ్సీసీసీ లక్ష్యాలకు పూర్తిగా భిన్నమన్నది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. యూఎన్ ఎఫ్‌సీసీసీ నిబంధనల ప్రకారం... అభివృద్ధి చెందిన దేశాలు నేతృత్వం వహించేందుకూ; అవసరమైన అంశాల్లో తామిచ్చిన హామీల అమలు జరుగుతున్నదా లేదా అన్నది సమీక్షించేందుకూ తగిన ఏర్పాట్లు చేయాలి. అయితే ఇవేవీ జరగడం లేదు. ఈజిప్టులో ఇటీవల ముగిసిన కాప్ 27 సమావేశాల సారాంశమూ ఇందుకు భిన్నంగా ఏమీ లేదని చెప్పాలి. అభివృద్ధి చెందిన దేశాలు తగిన చర్యలు తీసుకోకపోతే ప్యారిస్ ఒప్పందం ప్రకారం జాతీయంగా నిర్దే శించుకున్న కంట్రిబ్యూషన్స్ వల్ల తమకేమీ ప్రయోజనం ఉండబోదని అభివృద్ధి చెందుతున్న దేశాలూ త్వరలో గుర్తిస్తాయి. ఈ విషయాల న్నింటినీ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఇప్పటికైనా గుర్తించాలి. ఇప్పటివరకూ వాతావరణ మార్పులపై చర్చలను నిర్వహించడానికి మాత్రమే పరిమితమైన జనరల్ అసెంబ్లీ సమస్య మరింత తీవ్రమైనది అన్న విషయాన్ని అర్థం చేసుకునేలా చేయాలి. యూన్ఎఫ్సీసీసీతో పాటు ప్యారిస్ ఒప్పందం అమలుకు, భవిష్యత్తు కార్యాచరణకు తగిన తీర్మానాలు చేయాలి. భరత్ హెచ్. దేశాయి, వ్యాసకర్త ప్రొఫెసర్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా, జేఎన్‌యూ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
‘పరిహార నిధి’కి సై
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఈజిప్ట్‌లో ని షెర్మ్–ఎల్–షేక్ నగరంలో నిర్వహించిన భాగస్వామ్య పక్షాల సదస్సు(కాప్–27) ముగిసింది. వాతావరణ మార్పుల వల్ల విధ్వంసానికి గురైన, నష్టపోయిన దేశాలకు పరిహారం చెల్లించేందుకు ఒక నిధిని ఏర్పాటు చేయాలని కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఒప్పందం కుదిరింది. శిలాజ ఇంధనాల వినియోగాన్ని ప్రపంచ దేశాలన్నీ దశలవారీగా తగ్గించుకోవాలంటూ భారత్ ఇచ్చిన పిలుపునకు సానుకూల స్పందన లభించింది. వాతావరణ మార్పులు, తద్వారా సంభవించే విపత్తుల వల్ల నష్టపోయిన దేశాలను ఆదుకోవడానికి నిధిని ఏర్పాటు చేస్తూ ఒప్పందానికి రావడం చరిత్రాత్మకమని భారత్ అభివర్ణించింది. ఇలాంటి ఒప్పందం కోసమే ప్రపంచం చాలా ఏళ్లుగా ఎదురు చూస్తోందని గుర్తుచేసింది. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం కాప్–27 సదస్సు శుక్రవారమే ముగిసిపోవాలి. కానీ, కర్బన ఉద్గారాలను తగ్గించుకోవడంతోపాటు ‘లాస్ అండ్ డ్యామేజీ ఫండ్’పై చర్చించాలని, ఒప్పందం కుదుర్చుకోవాలని పలు దేశాల ప్రతినిధులు పట్టుబట్టడంతో ఒక రోజు ఆలస్యంగా ముగిసింది. కాప్–27 అధ్యక్షుడు సమీ షౌక్రీ ముగింపు ఉపన్యాసం చేశారు. తలవంచిన బడా దేశాలు పరిహార నిధి కోసం భారత్‌తో సహా పలు అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. బడా దేశాల నిర్వాకం వల్ల తాము బలవుతున్నామని వాపోతున్నాయి. కర్బన ఉద్గారాలు, వాతావరణ మార్పులు విషయంలో సంపన్న దేశాలదే ప్రధాన పాత్ర. పరిహార నిధి ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను అమెరికా సహా పలు సంపన్న దేశాలు తొలుత వ్యతిరేకించాయి. ప్రపంచంలో ఎక్కడ విపత్తులు చోటుచేసుకున్నా చట్టప్రకారం తామే పరిహారం చెల్లించాల్సి వస్తుందన్న ఆందోళనే ఇందుకు కారణం. కానీ, చైనా సహా ఇతర చిన్నదేశాలు, ద్వీప దేశాలు గట్టిగా గొంతెత్తడంతో బడా దేశాలు తలవంచక తప్పలేదు. పరిహార నిధిపై ఒప్పందం కుదరకుండా తాము కాప్–27 నుంచి వెళ్లిపోయే ప్రసక్తే లేదని పేద దేశాలు తేల్చిచెప్పడం గమనార్హం. పునరుత్పాదక ఇంధన వనరులపై దృష్టి చమురు, గ్యాస్ సహా శిలాజ ఇంధనాల వినియోగాన్ని దశల వారీగా తగ్గించుకోవాలన్న భారత్ సూచన పట్ల కాప్–27లో అమెరికా, యూరోపియన్ యూనియన్(ఈయూ) తదితర దేశాలు అంగీకారం తెలపడం కీలక పరిణామం అని చెప్పొచ్చు. అయితే, దీనిపై ఇంకా తుది ఒప్పందం కుదరలేదు. పర్యావరణ విపత్తులు పెచ్చరిల్లుతుండడంతో సమీప భవిష్యత్తులోనే ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పునరుత్పాక ఇంధన వనరులపై ప్రపంచ దేశాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కాప్–27లో నిపుణులు సూచించారు. బొగ్గు వాడకాన్ని నిలిపివేస్తూ స్వల్ప ఉద్గారాల ఇంధన వ్యవస్థలను వేగంగా అభివృద్ధి చేసుకోవాలని ‘షెర్మ్–ఎల్–షేక్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్’ పిలుపునిచ్చింది. వ్యవసాయం, ఆహార భద్రత విషయంలో క్లైమేట్ యాక్షన్‌పై కార్యాచరణకు శ్రీకారం చుట్టాలని భారత పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ సూచించారు. కాప్–27లో ఆయన మాట్లాడారు. కర్బన ఉద్గారాలను తగ్గించే బాధ్యతను కేవలం సన్న, చిన్నకారు రైతులపైనే మోపకూడదని చెప్పారు. కాప్–27 నిర్ణయాలు, ఒప్పందాలపై ఆఫ్రికా నిపుణుడు మొహమ్మద్ అడోవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. -
COP 27: కాప్ 27లో కాక!
షెర్మెల్ షేక్ (ఈజిప్ట్): ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ పర్యావరణ సదస్సు కాప్ 27 దేశాల మధ్య ఉద్రిక్తతలకు వేదికగా మారింది. విషయం వాడివేడి చర్చల స్థాయిని దాటి ఏకంగా గొడవల దాకా వెళ్లింది. పలు కీలకాంశాలపై ఏకాభిప్రాయం మృగ్యమైంది. దాంతో శుక్రవారం ముగియాల్సిన ఈ 12 రోజుల సదస్సు శనివారమూ కొనసాగింది. అయినా పలు విషయాలపై పీటముడి కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఆతిథ్య దేశం ఈజిప్ట్ రూపొందించిన సంప్రదింపుల పత్రం పూర్తిగా నిస్సారమంటూ చాలా దేశాలు పెదవి విరిచాయి. అందులోని పలు అంశాలపై తీవ్ర అసంతృప్తి, అభ్యంతరాలు వెలిబుచ్చాయి. ఇలాగైతే గ్లోబల్ వార్మింగ్‌ను 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యమేనంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. ‘1.5 డిగ్రీల లక్ష్యం’తో పాటు యూరోపియన్ యూనియన్ తాజాగా చేసిన చాలా ప్రతిపాదనలను సదరు పత్రంలో బుట్టదాఖలు చేయడంపై యూరప్ దేశాలు గుర్రుగా ఉన్నాయి. ఒక దశలో అవి వాకౌట్ చేస్తామని ముక్త కంఠంతో హెచ్చరించే దాకా వెళ్లింది! ఇలాగైతే పత్రంపై యూరప్ దేశాలేవీ సంతకం చేయబోవని ఈయూ కుండబద్దలు కొట్టింది. వాతావరణ మార్పుల వల్ల సముద్ర మట్టాలు ప్రమాదకరంగా పెరిగిపోతే భారీగా ముంపు తదితర ముప్పును ఎదుర్కోవాల్సి వచ్చే ద్వీప దేశాల భద్రతను పత్రంలో అసలే పట్టించుకోలేదన్నది మరో అభ్యంతరం. మరోవైపు ఈజిప్ట్ ఈ ఆరోపణలన్నింటినీ ఖండించమే గాక ఆయా దేశాలపై ప్రత్యారోపణలకు దిగుతోంది. ఈ నేపథ్యంలో సదస్సుకు హాజరైన 40 వేల పై చిలుకు ప్రతినిధుల్లో చాలామంది వెనుదిరుగుతుండటంతో ప్రాంగణమంతా బోసిపోయి కన్పిస్తోంది. మరోవైపు, విచ్చలవిడి పోకడలతో పర్యావరణ విపత్తులకు ప్రధాన కారకులైన సంపన్న దేశాలు వాటివల్ల తీవ్రంగా నష్టపోయిన పేద, వర్ధమాన దేశాలను ఆదుకునేందుకు భారీ పరిహార నిధి ఏర్పాటు చేయాలంటూ భారత్ సహా పలు దేశాలు చేసిన డిమాండ్‌పైనా చివరిదాకా ప్రతిష్టంభనే కొనసాగింది. ఎట్టకేలకు నిధి ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడినట్టు మధ్యవర్తులు శనివారం సాయంత్రం ప్రకటించారు. అయితే దానిపైనా ఏకాభిప్రాయం ఇంకా కుదరాల్సే ఉంది! ఇందుకోసం ఏటా ఏకంగా 100 బిలియన్ డాలర్లు వెచ్చస్తామంటూ 2009లో చేసిన వాగ్దానాన్ని సంపన్న దేశాలు ఇప్పటికీ నిలుపుకోకపోవడం గమనార్హం. మరోవైపు, ‘‘శిలాజ ఇంధనాల వాడకాన్ని వీలైనంత త్వరలో పూర్తిగా నిలిపేయాలన్నది గత సదస్సులోనే చేసిన ఏకగ్రీవ తీర్మానం. కానీ ఇప్పటికీ వాటి వాడకం పెరిగిపోతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. నిజానికి శిలాజ ఇంధన పరిశ్రమే సదస్సులో ప్రతి చర్చాంశాన్నీ తన కనుసన్నల్లో నియంత్రిస్తోంది’’ అంటూ వర్ధమాన దేశాలు ఆరోపణలు దుమ్మెత్తి పోస్తున్నాయి. -
ఈజిప్ట్‌లో రెన్యూ పవర్ హైడ్రోజన్ ప్లాంట్
న్యూఢిల్లీ: ఈజిప్ట్‌లో రెన్యూ పవర్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టనుంది. సూయిజ్ కెనాల్ ఎకనమిక్ జోన్లో 8 బిలియన్ డాలర్ల (రూ.64 వేల కోట్లు) పెట్టుబడులతో హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించి ఈజిప్ట్ ప్రభుత్వంతో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ పీఎల్సీ (రెన్యూ) అనుబంధ కంపెనీ ‘రెన్యూ పవర్ ప్రైవేటు లిమిటెడ్’ ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా ఏటా 2,20,000 టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ ఏడాది జూలైలోనే ఈజిప్ట్‌తో అవగాహన ఒప్పందం చేసుకోగా, ఇప్పుడు కార్యాచరణ ఒప్పందంపై సంతకాలు చేసినట్టు పేర్కొంది. దశలవారీగా ఈ ప్రాజెక్టు ఉత్పత్తిని ఆరంభిస్తుందంటూ, మొదటి దశలో 20,000 టన్నుల గ్రీన్ హైడ్రోజన్, డెరివేటివ్‌లను ఉత్పత్తి చేయనున్నట్టు తెలిపింది. కార్యాచరణ ఒప్పందం కింద, ప్రాజెక్టు, క్షేత్రస్థాయి అధ్యయనం నిర్వహించి, వచ్చే 12–16 నెలల్లో తుది నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రకటించింది. ఈ ప్రాజెక్టుకు స్థానిక డెవలపర్‌గా ఎల్స్వెడీ ఎలక్ట్రిక్ ఎస్‌ఏఈ పనిచేయనుంది. -
కాలువలోకి దూసుకెళ్లిన మినీబస్సు.. 22 మంది దుర్మరణం
కైరో: ఈజిప్టు ఉత్తర డకాలియా ప్రావిన్స్ అగ పట్ణణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై ప్రయాణిస్తున్న ఓ మినీబస్సు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన ఈ దుర్ఘటనలో 22 మంది దుర్మరణం చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మొత్తం 18 అంబులెన్సులను పంపి బాధితులను రెండు ఆస్పత్రులకు తరలించినట్లు చెప్పారు. ప్రమాద సమయంలో బస్సులో 46 మంది ప్రయాణికులున్నారు. వీరిలో విద్యార్థులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల కుటుంబాలకు లక్ష ఈజిప్ట్ పౌండ్లను పరిహారంగా ప్రకటించింది ప్రభుత్వం. ఈజిప్ట్‌లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. రహదారులు సరిగ్గా లేకపోవడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో ఏటా వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 2021లోనే 7,000 మందికిపైగా వివిధ ప్రమాదాల్లో చనిపోయారు. గత నెలలో కూడా మినీబస్సు, లారీ ఢీకొన్న ఘటనలో 10 మంది దుర్మరణం చెందారు. -
'ఆ సామర్థ్యాలున్నాయని 78శాతం మంది యూత్ నమ్ముతున్నారు'
ఈజిప్ట్ వేదికగా జరుగుతున్న వాతావరణ సదస్సు ‘కాప్– 27’తో భూతాపం, పర్యావరణంలో జరుగుతున్న మార్పులు, అడవుల పరిరక్షణ... మొదలైన విషయాలపై నాలుగు మాటలు గట్టిగానే వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్ ముఖచిత్రమైన యువతలో వాటి పట్ల ఆసక్తి ఏ మేరకు ఉంది? అనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. గత కాలం సంగతి ఎలా ఉన్నా... ఈతరం మాత్రం పర్యావరణానికి సంబంధించిన విషయాలపై ఆసక్తి ప్రదర్శించడం, అవగాహన పెంచుకోవడం మాత్రమే కాదు ‘గ్రీన్కాలర్ జాబ్’ చేయడానికి ప్రాధాన్యత ఇస్తోంది... సోషల్‌మీడియా విస్తృతి వల్ల వాతావరణ సంక్షోభం గురించిన అవగాహన, చర్చ అనేవి అంతర్జాతీయ సదస్సులు, జర్నల్స్‌కు మాత్రమే పరిమితం కావడం లేదు. క్షేత్రస్థాయిలో పర్యావరణ సంక్షోభంపై మాటాముచ్చట పెరుగుతోంది. ఈ క్రమంలో యువతరంలో కొంతమంది పర్యావరణహిత ఉపాధి అవకాశాలపై అధిక ఆసక్తి చూపుతున్నారు. ముంబైకి చెందిన దిశా సద్నాని పర్యావరణ ప్రేమికురాలు. రెగ్యులర్ జాబ్ కాకుండా పర్యావరణ పరిరక్షణలో భాగం అయ్యే ఉద్యోగం చేయాలనేది దిశ కల. ప్రస్తుతం ఒక కార్పోరెట్ సంస్థలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న దిశ నీటి నుంచి పారిశుధ్యం వరకు రకరకాల ప్రాజెక్ట్‌లలో పనిచేస్తోంది. పంజాబ్‌లోని లుథియానాకు చెందిన 25 సంవత్సరాల శౌర్య శర్మ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్. క్లైమెట్ కన్సల్టెన్సీకి సంబంధించిన ఉద్యోగం చేయాలనేది శర్మ కల. అయితే‘పేరు గొప్ప ఊరు దిబ్బ’లాంటి ఉద్యోగాలు, నాలుగు గోడల మధ్య ఉపన్యాసాలకే పరిమితం అయ్యే ఉద్యోగాలు చేయడం అతడికి ఇష్టం లేదు. ఊరూవాడా తిరగాలి. ప్రజలతో కలిసి పనిచేయాలి. పర్యావరణ పరిరక్షణలో నిర్మాణాత్మక అడుగు వేయాలనేది అతడి కల. బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇంటర్నెట్–బేస్డ్ మార్కెట్ రీసెర్చ్ అండ్ డాటా ఎనలటిక్స్ సంస్థ ‘యూ గోవ్’ పర్యావరణ స్పృహకు సంబంధించిన అంశాలపై 18–35 ఏళ్ల వయసు ఉన్న వారిపై యూకే, యూఎస్, ఇండియా, పాకిస్థాన్, ఘనా... మొదలైన దేశాల్లో ఒక అధ్యయనం నిర్వహించింది. పర్యావరణ సంక్షోభానికి సంబంధించిన పరిష్కారాలు వెదికే శక్తిసామర్థ్యాలు తమ తరానికి ఉన్నాయని యూత్‌లో 78 శాతం మంది నమ్ముతున్నారు. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే ‘గ్రీన్ జాబ్’ చేయడానికి 74 శాతం మంది ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ రంగంలో పనిచేస్తున్న యువత సంఖ్య తక్కువగా ఉంది. భవిష్యత్ మాత్రం ఆశాజనకంగా ఉంది. కంపెనీల విషయానికి వస్తే... ఒకరిని ఉద్యోగంలోకి తీసుకోవడానికి కేవలం పర్యావరణ ప్రేమ మాత్రమే ప్రమాణంగా తీసుకోవడం లేదు. సాంకేతిక సామర్థ్యానికీ పెద్దపీట వేస్తున్నాయి. సస్టెయినబిలిటీ మేనేజర్, సేఫ్టీ మేనేజర్, వాటర్ రిసోర్సెస్ ఇంజనీర్ అనేవి మన దేశంలో టాప్–3 గ్రీన్‌జాబ్స్. సాఫ్ట్వేర్, ఐటీ సర్వీసులు, మాన్యుఫాక్చరింగ్, ఎడ్యుకేషన్ రంగాలు ‘గ్రీన్ టాలెంట్’కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. మాన్యుఫ్యాక్చరింగ్, ట్రాన్స్‌పోర్టేషన్ కంపెనీలు సస్టెయినబిలిటీ ఎనాలసిస్ట్, వాటర్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్, సోలార్ డిజైనర్స్. అర్బన్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ ఆఫీసర్స్, ఎన్విరాన్మెంట్ డాటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్... మొదలైన నిపుణులకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. పునరుత్పాదకశక్తి, ఆరోగ్యం–భద్రత, సౌరశక్తి, పర్యావరణ సమతుల్యతను కాపాడడానికి సహజ వనరుల క్షీణతను నివారించడం... మొదలైనవి ‘గ్రీన్ స్కిల్స్’కు ముఖ్యకేంద్రాలుగా ఉన్నాయి. మన దేశంలోని అగ్రశ్రేణి కళాశాలలు, యూనివర్శిటీలు పర్యావరణానికి సంబంధించిన ప్రత్యేక కోర్సులు ప్రవేశ పెట్టాయి. వాటిలో కొన్ని... గ్రీన్ ఎకానమీ ఫర్ బిజినెస్, ఎన్విరాన్మెంటల్ లా, క్లైమెట్ చేంజ్, క్లైమెట్ సైన్స్ అండ్ పాలసీ, గ్రీన్ ఎకనామీ, గ్రీన్ ఇన్నోవేషన్ ఫ్రమ్ నాలెడ్జ్ టు యాక్షన్, వేస్ట్ మేనేజ్మెంట్. యువతరం సంప్రదాయ ఉద్యోగాలకు భిన్నంగా కొత్తరకం ఉద్యోగాలపై ఆసక్తి ప్రదర్శించడం విశేషం అయితే ‘గ్రీన్ జాబ్’లు చేయాలనుకోవడం స్వాగతించ తగిన పరిణామం. ఇది చాలదు... ఇంకా పర్యావరణహిత ఉద్యోగాలలో కదలిక మొదలైంది. అయితే అది ఇంకా విస్తృతం కావాలి. పర్యావరణ స్పృహ అనేది జీవన విధానంగా మారాలి. క్లైమెట్ స్ట్రాటజీపై యువతరం దృష్టి పెట్టాలి. తమవైన పరిష్కార మార్గాల గురించి ఆలోచించాలి. వాతావరణానికి సంబంధించి ప్రస్తుత సంక్షోభ పరిస్థితులలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి కంపెనీ స్పెషల్ క్లైమెట్ యాక్షన్ టీమ్‌లను ఏర్పాటు చేసుకోవాలి. వాటిలో యువతరం క్రియాశీల పాత్ర పోషించాలి. – షీతల్ పర్మార్, పర్యావరణ అంశాల బోధకురాలు, అహ్మదాబాద్ -
పాపం మీది.. పరిహారమివ్వండి.. పేద దేశాల డిమాండ్
షెర్మ్–ఎల్–షేక్: భూతాపం, ప్రకృతి విపత్తులు, ఉత్పాతాలు.. వీటికి శిలాజ ఇంధనాలను విచ్చలవిడిగా వినియోగించడం, పర్యావరణాన్ని నాశనం చేయడమే కారణం. ఈ పాపం సంపన్న, అభివృద్ధి చెందిన దేశాలదేనని పేద దేశాలు ఘోషిస్తున్నాయి. శిలాజ ఇంధనాలను అధికంగా ఉపయోగించే దేశాల కారణంగా తాము బాధితులుగా మారాల్సి వస్తోందని వాపోతున్నాయి. బడా దేశాలు, కార్పొరేట్ సంస్థలు నష్ట పరిహారం చెల్లించాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. ఈజిప్ట్‌లోని షెర్మ్–ఎల్–షేక్‌లో జరుగుతున్న కాప్–27లో పలుదేశాల నాయకులు ఈ డిమాండ్‌కు మద్దతుగా గళం విప్పుతున్నారు. విపత్తుల్లో నష్టపోతున్న పేద దేశాలకు న్యాయం చేయాలని మలావీ దేశాధ్యక్షుడు లాజరస్ చక్‌వెరియా అన్నారు. శిలాజ ఇంధన కంపెనీలు నిత్యం 3 బిలియన్ డాలర్ల లాభాలు ఆర్జిస్తున్నాయని ఆంటిగ్వా బార్బుడా ప్రధానమంత్రి గాస్టన్ బ్రౌనీ చెప్పారు. అందులో కొంత సొమ్మును పేద దేశాలకు పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూగోళాన్ని మండించి, సొమ్ము చేసుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంధన కంపెనీలు తమ లాభాల నుంచి గ్లోబల్ కార్బన్ ట్యాక్స్ చెల్లించాలన్నారు. మానవ నాగరికతను బలిపెట్టి లాభాలు పిండుకోవడం సరైంది కాదన్నారు. నష్టపరిహారం కోసం అవసరమైతే అంతర్జాతీయ కోర్టులను ఆశ్రయిస్తామని తేల్చిచెప్పారు. పెద్ద దేశాల నేతలు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు ప్రతిఏటా కాప్‌కు సదస్సుకు హాజరై, ఘనంగా ప్రకటనలు ఇచ్చి వెళ్లిపోతున్నారని తప్పు ఆచరణలో ఏమీ చేయడం లేదని గాస్టన్ బ్రౌనీ ఆరోపించారు. వాతావరణ లక్ష్యాలను సాధించాలంటే చిన్న దేశాలపై విధించిన చట్టవిరుద్ధమైన ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలని జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ మాంగాగ్వే పేర్కొన్నారు. మడ అడవుల సంరక్షణలో సహకరిస్తాం మడ అడవుల పునరుద్ధరణలో భారత్ నైపుణ్యం సాధించిందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ చెప్పారు. పర్యావరణానికి అత్యంత కీలకమైన మడ అడవుల సంరక్షణ కోసం గత ఐదు దశాబ్దాలుగా కార్యాచరణ కొనసాగిస్తోందని అన్నారు. ఈ విషయంలో ఇతర దేశాలకు సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. కాప్–27 సందర్భంగా యూఏఈ, ఇండోనేషియా ఆధ్వర్యంలో మాంగ్రూవ్ అలయెన్స్ ఫర్ క్లైమేట్(ఎంఏసీ)ని ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా మడ అడవుల పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడం, కాపాడుకోవడం ఈ కూటమి లక్ష్యం. ఈ సందర్భంగా భూపేంద్ర మాట్లాడారు. ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని సాధించడానికి మడ అడవుల సంరక్షణ అత్యంత కీలకమని సూచించారు. కర్బన ఉద్గారాల నిర్మూలన ఇలాంటి అడవులతో సాధ్యమవుతుందన్నారు. అండమాన్, సుందర్బన్స్, గుజరాత్ తీర ప్రాంతంలో మడ అడువుల విస్తీర్ణం పెరిగిందని వెల్లడించారు. చదవండి: షాకింగ్ రిపోర్ట్: కరోనాను మించిన వైరస్ తయారీలో పాక్-చైనా! -
‘ప్రపంచ దేశాలన్నీ సహకరించుకోకపోతే వినాశనమే’
షెర్మ్–ఎల్–షేక్: ప్రపంచ దేశాలన్నీ పరస్పరం సహకరించుకోకపోతే వినాశనం తప్పదని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ హెచ్చరించారు. నరక కూపం దిశగా ప్రపంచ పయనం సాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ మార్పులను నియంత్రించకపోతే ఊహించని ఉత్పాతాలు తప్పవని పేర్కొన్నారు. కాలుష్య ఉద్గారాల విషయంలో అతిపెద్ద దేశాలైన చైనా, అమెరికా ఇకనైనా కళ్లు తెరవాలని, రాబోయే దుష్పరిణామాలను నివారించడానికి కలిసికట్టుగా పనిచేయాలని హితవు పలికారు. ఈజిప్ట్‌లోని షెర్మ్–ఎల్–షేక్‌లో సోమవారం కాప్–27 సదస్సులో వివిధ దేశాల నేతలు, ప్రతినిధులను ఉద్దేశించి గుటేరస్ ప్రసంగించారు. భూతాపం ఆందోళనకర స్థాయిలో పెరుగుతోందని చెప్పారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వాతావరణంలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయని, కరువులు, వరదలు మానవాళికి పెనుసవాళ్లు విసురుతున్నాయని గుర్తుచేశారు. కర్బన ఉద్గారాలను తగ్గించుకొనేలా ధనిక, పేద దేశాలు ఒక కొత్త ఒప్పందం కుదుర్చుకోవాలని చెప్పారు. ధనిక దేశాలు 2030 నాటికి, ఇతర దేశాలకు 2040 నాటికి బొగ్గు వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలని గుటేరస్ కోరారు. మనకున్న సమయం పరిమితం వాతావరణ మార్పులకు ఫుల్స్టాప్ పెట్టాల్సిన సమయం వచ్చిందని ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్–సిసీ ఉద్ఘాటించారు. మనం జోక్యం చేసుకోకపోతే వాతావరణ మార్పులు ఎప్పటికీ ఆగవని అన్నారు. సమయం పరిమితంగానే ఉందని, ప్రతి సెకెన్ కాలాన్ని వాడుకోవాలని సూచించారు. యుద్ధాన్ని ఆపాలని రష్యా, ఉక్రెయిన్‌కు విజ్ఞప్తి చేశారు. వాతావరణ మార్పుల వల్ల నష్టపోతున్న పేద దేశాలకు ధనిక దేశాలకు ఆర్థిక సాయం అందజేసి ఆదుకోవాలని నైజీరియా పర్యావరణశాఖ మంత్రి మొహమ్మద్ అబ్దుల్లాహీ కోరారు. ఇందుకోసం క్లైమేట్ ఫండ్ ఏర్పాటు చేయాలన్నారు. -
COP27: 2015–2022.. ఎనిమిదేళ్లు అత్యంత వేడి
న్యూఢిల్లీ: పారిశ్రామిక విప్లవం (1850–1900) కంటే ముందునాటి సగటు ఉష్ణోగ్రత కంటే 2022లో అంతర్జాతీయంగా ఉష్ణోగ్రత 1.15 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉండనుందని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) వెల్లడించింది. ఫలితంగా 2015 నుంచి 2022 దాకా.. ఎనిమిదేళ్లు ‘అత్యంత వేడి’ సంవత్సరాలుగా రికార్డుకెక్కుతాయని తెలియజేసింది. ఈజిప్ట్‌లో జరుగుతున్న కాప్–27 సదస్సు సందర్భంగా ఆదివారం ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. 1993 నుంచి ఇప్పటిదాకా సముద్ర నీటి మట్టం రేటు రెండింతలు పెరిగిందని వెల్లడించింది. 2022 సంవత్సరం ఐదు లేదా ఆరో అత్యంత వేడి సంవత్సరంగా రికార్డులో చేరుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ వివరించింది. -
COP27: భూమాత రక్షణకు భుజం కలిపి...
షెర్మ్–ఎల్–షేక్(ఈజిప్ట్): ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న వాతావరణ మార్పులు, ఉక్రెయిన్–రష్యా యుద్ధం, ఆకాశాన్నంటుతున్న ద్రవ్యోల్బణం, ఆహారం, ఇంధన కొరత వంటి ప్రతికూల పరిణామాల నడుమ భాగస్వామ్యపక్షాల సదస్సు (కాప్–27) ఆదివారం ప్రారంభమయ్యింది. ఈజిప్ట్‌లోని ఎర్ర సముద్ర తీరప్రాంత నగరం షెర్మ్–ఎల్–షేక్ ఇందుకు వేదికగా మారింది. ప్రపంచదేశాల నుంచి వందలాది మంది ప్రతినిధులు హాజరయ్యారు. వాతావరణ మార్పులు, దుష్పరిణామాలు, నియంత్రణ చర్యలు, గత ఒప్పందాల అమలు తీరుపై రెండు రోజులపాటు విస్తృతంగా చర్చించనున్నారు. కాప్–27లో భాగంగా ఈ నెల 7, 8న జరిగే సమావేశాలకు పలు దేశాల అధినేతలు హాజరుకానున్నారు. వాతావరణ మార్పుల నియంత్రణే లక్ష్యంగా గతంలో కాప్ సదస్సులు జరిగాయి. అయితే, ఆశించిన లక్ష్యాలేవీ నెరవేరలేదు. అగ్రదేశాల సహాయ నిరాకరణే ఇందుకు కారణం. తాజా సదస్సులో ఏం తేలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. తరానికి ఒకసారి వచ్చే అవకాశం వాతావరణ మార్పులు భూగోళంపై సమస్త జీవజాలానికి విసురుతున్న పెను సవాళ్లపై ఐక్యరాజ్యసమితికి చెందిన ‘ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్’ చైర్మన్ హోయిసంగ్ లీ ఆందోళన వ్యక్తం చేశారు. కాప్–27లో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. భూతాపాన్ని ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు సన్నద్ధం కావాలని, హరితగృహ(గ్రీన్ హౌజ్) వాయువుల ఉద్గారాన్ని తక్షణమే తగ్గించుకోవాలని పిలునిచ్చారు. మన జీవితాలను, మన భూగ్రహాన్ని కాపాడుకొనేందుకు తరానికి ఒకసారి వచ్చే అవకాశం ఇదేనని చెప్పారు. ఇంకెన్ని హెచ్చరికలు కావాలి? గత ఏడాది గ్లాస్గోలో జరిగిన కాప్ సదస్సులో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడంలో ప్రపంచదేశాలు చెప్పుకోదగ్గ పురోగతి సాధించాయని కాప్–26 అధ్యక్షుడు, బ్రిటిష్ రాజకీయవేత్త అలోక్ శర్మ తెలిపారు. కర్బన ఉద్గారాల నియంత్రణపై మరిన్ని లక్ష్యాలను ఏర్పర్చుకోవడం, 2015 పారిస్ ఒప్పందంలోని నిబంధనలను ఖరారు చేయడం, బొగ్గు వినియోగాన్ని దశలవారీగా తగ్గించుకోవడం వంటివి ఈ లక్ష్యాల్లో ఉన్నాయని తెలిపారు. ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీలకు (2.7 ఫారన్‌హీట్) పరిమితం చేయాలన్న ఆశయాన్ని కొనసాగించాలని కోరారు. పారిస్ ఒప్పందంలో ఇదే అత్యంత కీలక లక్ష్యమని గుర్తుచేశారు. ఉష్ణోగ్రత పెరుగుదలను కచ్చితంగా నియంత్రించాలని, దీన్ని పారిశ్రామిక విప్లపం నాటికంటే ముందున్న ఉష్ణోగ్రతకు తీసుకురావాలన్నారు. అయితే, ఈ దిశగా సాగుతున్న ప్రయత్నాలకు కొన్ని బడా దేశాలు తూట్లు పొడుస్తున్నాయని అలోక్ శర్మ తీవ్రంగా ఆక్షేపించారు. ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ దండయాత్ర వల్ల అంతర్జాతీయంగా సంక్షోభాలు పుట్టుకొచ్చాయని గుర్తుచేశారు. పలు దేశాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయని వాపోయారు. ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ అంశాలపై దృష్టి పెట్టేలా సామర్థ్యం పెంచుకోవాలన్నారు. మాటలు కట్టిబెట్టి కార్యాచరణలోకి దిగాలన్నారు. ప్రపంచ దేశాల అధినేతలకు ప్రపంచ నుంచి ఇంకా ఎన్ని మేల్కొల్పులు, హెచ్చరికలు అవసరం? అని అలోక్ శర్మ ప్రశ్నించారు. సదస్సులో యూఎన్ క్లైమేట్ చీఫ్ సైమన్ స్టియిల్ మాట్లాడారు. పారిస్ ఒప్పందంలోని లక్ష్యాలను సాధించడానికి అన్ని ప్రయత్నాలు సాగిస్తున్నామని ఆతిథ్య దేశమైన ఈజిప్ట్ విదేశాంగ మంత్రి సమేహ్ షౌక్రీ చెప్పారు. కాప్–27 అధ్యక్షుడిగా షౌక్రీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక ప్రతిజ్ఞల దశ నుంచి క్షేత్రస్థాయిలో కార్యాచరణ దిశగా ముందుకెళ్లాలని ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్–సిస్సీ పిలుపునిచ్చారు. జిన్‌పింగ్, నరేంద్ర మోదీ లేకుండానా? కాప్–27 సదస్సులో 120కి పైగా దేశాల నేతలు, ప్రతినిధులు పాల్గొంటారని ఈజిప్ట్ ప్రభుత్వం ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరు కానున్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతారా? లేదా? అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. కర్బన ఉద్గారాల విషయంలో పెద్ద దేశాలైన చైనా, భారత్ అధినేతలు లేకుండా కాప్–27 సదస్సులో కుదిరే ఒప్పందాలపై నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, కాప్ సదస్సు వేదిక వద్ద నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన మానవ హక్కుల సంస్థల ప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారు. నిరసనలకు దిగిన వారిని అరెస్టు చేశారని న్యూయార్క్‌కు చెందిన ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ ఆరోపించింది. నిరసనకారులపై ఆంక్షలు ఎత్తివేయాలని కోరింది. -
Egypt COP27: పర్యావరణ ప్రతినలు... లక్ష్యానికి ఆమడ దూరం
భూమి నానాటికీ వేడుక్కుతోంది. ఒకవైపు తీవ్ర కరువు. మరోవైపు పలు దేశాల్లో కనీవినీ ఎరగని వరదలు సృష్టిస్తున్న పెను బీభత్సం. ఇలాంటి ఉత్పతాలన్నింటికీ కారణం పర్యావరణ మార్పులు. ఇది రానురానూ తీవ్ర రూపు దాలుస్తూ మానవాళిని వణికిస్తోంది. ఎవరేం చెప్పినా, దేశాలు ఎన్ని చేసినా సమస్య నానాటికీ ముదురుతోందే తప్ప పరిస్థితిలో మెరుగుదల మాత్రం కన్పించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణం నానాటికీ విషతుల్యంగా మారుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ పర్యావరణానికి ముప్పు పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో పర్యావరణ మార్పులపై సదస్సు (కాప్–27) ఆదివారం ఈజిప్టులో మొదలవుతోంది. 12 రోజుల పాటు జరిగే ఈ సదస్సులోనైనా పర్యావరణాన్ని కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకునే దిశగా గట్టి ముందడుగు పడుతుందేమో చూడాలి... కాగితాల్లోనే ఒప్పందాలు గతేడాది స్కాట్లండ్‌లోని గ్లాస్గోలో జరిగిన కాప్–26లో దేశాలన్నీ మేధోమథనం చేసి గట్టి తీర్మానాలతో పర్యావరణ ఒప్పందమైతే ఆమోదించాయి. దీన్నో పెద్ద సానుకూల చర్యగా ప్రపంచమంతా కొనియాడింది. ఎందుకంటే శిలాజ ఇంధనాల వల్ల పర్యావరణానికి కలుగుతున్న తీవ్ర హానిని అంతర్జాతీయంగా తొలిసారిగా అధికారికంగా గుర్తించింది గ్లాస్గో సదస్సులోనే. వాటి వాడకాన్ని వీలైనంతగా తగ్గిస్తూ క్రమంగా పూర్తిగా నిలిపేయాలని దేశాలన్నింటికీ సదస్సు పిలుపునిచ్చింది. కానీ ఏడాది గడిచినా ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధనాల వాడకం నానాటికీ పెరుగుతోందే తప్ప తగ్గకపోవడం శోచనీయం. పులిమీద పుట్రలా యుద్ధం... రష్యా–ఉక్రెయిన్ యుద్ధం దెబ్బకు పరిస్థితి మరింతగా దిగజారింది. రష్యా నుంచి సహజవాయు సరఫరాలు భారీగా తగ్గిపోవడంతో యూరప్ సహా పలు దేశాలు మరో దారి లేక శిలాజ ఇంధనాల వాడకాన్ని పెంచేశాయి. అందులోనూ అత్యంత కాలుష్యకారకమైన బొగ్గు వాడకం విపరీతంగా పెరిగిపోతున్న వైనం కలవరపెడుతోంది. 2022లో బొగ్గు వాడకం 2013లో నమోదైన ఆల్‌టైం రికార్డును చేరడం ఖాయమని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) జోస్యం చెబుతోంది. ఒక్క యూరోపియన్ యూనియన్లోనే బొగ్గు డిమాండ్ కనీసం 6.5 శాతం పెరుగుతుందని అంచనా. మొత్తమ్మీద 2030 కల్లా అంతర్జాతీయ బొగ్గు వినియోగం 2021తోపోలిస్తే 8.7 శాతానికి మించి తగ్గకపోవచ్చంటున్నారు. ఈ లెక్కన 2050 నాటికి శిలాజ ఇంధనాల వాడకాన్ని పూర్తిగా నిలిపేయాలన్న లక్ష్యం చేరడం అసాధ్యమే. అది జరగాలంటే 2030 నాటికి బొగ్గు వాడకం ఏకంగా 35 శాతం తగ్గాల్సి ఉంటుంది! గతేడాది సదస్సులో వర్ధమాన దేశాలన్నింటినీ బొగ్గు తదితర శిలాజ ఇంధనాలకు గుడ్‌బై చెప్పాలని కోరిన సంపన్న దేశాలే ఇప్పుడు ఆ దేశాలను మించి వాటిని వాడుతుండటం విషాదం. ఈ ధోరణికి వెంటనే అడ్డుకట్ట పడకుంటే 2100 నాటికి భూగోళం ఏకంగా మరో 2.6 డిగ్రీల మేరకు వేడెక్కుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూతాపోన్నతిని 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలన్న గ్లాస్గో ఒప్పందం అమలుకు సదస్సు ఏ చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తికరం. భద్రతా వలయంలో రిసార్టు పర్యావరణ కార్యకర్తల నిరసనల భయాల నడుమ సీఓపీ27కు వేదిక కానున్న సినాయ్ ద్వీపకల్పంలోని షర్మెల్ షేక్‌లోని రిసార్టు వద్ద ఈజిప్టు ప్రభుత్వం అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. కోరల్ రీఫ్‌లు, అత్యంత అందమైన సముద్ర తీరాలకు ఈ రిసార్టు నిలయం. స్థానికంగా టూరిజంలో పనిచేసే వాళ్లలో చాలామందిని తాత్కాలికంగా ఇళ్లకు పంపారు. మిగతా వారికి ప్రత్యేకమైన గుర్తింపు కార్డులిచ్చారు. సెలవులు గడిపేందుకు వస్తున్న టూరిస్టులను కూడా అడ్డుకుంటున్నారు. గతేడాది గ్లాస్గోలో సదస్సు జరిగిన వీధిలోకి ఏకంగా లక్షలమంది దూసుకొచ్చి నిరసనలకు దిగారు. కాప్ సదస్సు 1995 నుంచి ఏటా జరుగుతోంది. ఆర్థిక, సాంకేతిక సాయాలకు పట్టుబట్టనున్న భారత్ వాతావరణ మార్పులు, తద్వారా వస్తున్న విపత్తులను అరికట్టేందుకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక సాయాన్ని సంపన్న దేశాలు భారీగా పెంచాలని సదస్సులో భారత్ డిమాండ్ చేసే అవకాశం కన్పిస్తోంది. మన ప్రతినిధి బృందానికి కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ నేతృత్వం వహిస్తారు. మొత్తం 198 దేశాలు సదస్సులో పాల్గొంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో పాటు 100 మందికి పైగా దేశాధినేతలు హాజరవనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనడంపై స్పష్టత లేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ISSF World Championships: స్వప్నిల్ గురికి ‘పారిస్’ బెర్త్ ఖరారు
ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్ ద్వారా భారత్‌కు మరో ఒలింపిక్ బెర్త్ ఖరారైంది. ఈజిప్ట్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో శనివారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలె నాలుగో స్థానంలో నిలిచి 2024 పారిస్ ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్నాడు. ఓవరాల్‌గా ఇప్పటివరకు షూటింగ్లో భారత్‌కు మూడు ఒలింపిక్ బెర్త్‌లు లభించాయి. ట్రాప్ ఈవెంట్లో భౌనీష్ మెందిరత్త, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో రుద్రాం„Š పాటిల్ పారిస్ విశ్వ క్రీడలకు అర్హత సాధించారు. -
వాహ్ ఏం టెక్నాలజీ గురూ.. ఈజిప్ట్ మమ్మీలకు ప్రాణం పోస్తే..
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రపంచం వేగంగా మారుతోంది. గతంలో ఏళ్ల తరబడి చేసే పనులు కూడా ప్రస్తుతం నెలల్లో, రోజుల్లో ముగించేస్తున్నాం. ఎన్నో అసాధ్యం అనుకున్న వాటిని కూడా సుసాధ్యం చేస్తున్నాం. సింపుల్‌గా చెప్పాలంటే ప్రస్తుత కంప్యూటర్ యుగంలో ఇంపాజిబుల్ అనేది లేదని మానవుడు అంటున్నాడు. ఈ మాటలనే నిజం అనిపించేలా ఓ వీడియో నెట్టింట హల్ చేస్తోంది. అందులో వేల సంవత్సరాల క్రితం చనిపోయిన వారికి రూపం వస్తే ఎలా ఉంటుందో చూపించింది. ఇంతకీ అది ఎలా సాధ్యమైందని అనుకుంటున్నారా? అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే! ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ)అనేది ఎక్కువగా వినపడుతున్న పేరు. మానవుని మేధస్సుకి మిషీన్ వేగం తోడైతే ఊహించని ఫలితాలు వస్తాయినడంలో సందేహం లేదు. సరిగ్గా ఏఐ వాడుకుని కూడా అలాంటి ఫలితాలే వస్తాయి. అందుకు ఉదాహరణగా ఈ వీడియో చెప్పవచ్చు. అందులో ఏముందంటే.. హాలీవుడ్ మూవీ ‘మమ్మీ’ చూడని వాళ్లు లేదా ఈజిఫ్ట్ మమ్మీల గురించి తెలియని వాళ్లు ఉండరు. ఈజిఫ్ట్ మనకు ఎప్పటికీ మిస్టరీయే. వేల సంవత్సరాల రాజుల శవాల్ని భద్రపరిచి పిరమిడ్స్ కట్టిన విధానం ప్రపంచాన్ని ఆశ్చర్చంలో ముంచేత్తిన సంగతి తెలిసిందే. తాజాగా ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ఆ మమ్మీల ముఖ చిత్రాలు ఎలా ఉంటాయనే ఓ వీడియో ట్విటర్లో తిరుగుతోంది. ఈ వీడియోను వాలా అఫ్షర్ అనే యూజర్ ట్విట్టర్లో షేర్ చేశారు. దీన్ని చూసిన నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. . This is how AI was used to recreate the faces of Egyptian monarchy pic.twitter.com/wPJaTEknKK — Vala Afshar (@ValaAfshar) October 17, 2022 చదవండి: జియో డబుల్ ఫెస్టివల్ బొనాంజా: ఆ ప్లాన్లతో రీచార్జ్, ఈ బెనిఫిట్స్ అన్నీ మీకే! -
భారత జట్టుకు కాంస్యం
కైరో (ఈజిప్ట్): ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో రెండు పతకాలు లభించాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో ఇలవేనిల్, మెహులీ ఘోష్, మేఘన సజ్జనార్‌లతో కూడిన భారత జట్టు కాంస్యం సాధించింది. కాంస్య పతక మ్యాచ్‌లో భారత్ 17–11తో జర్మనీపై గెలిచింది. జూనియర్ పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో సమీర్ రజతం గెలిచాడు. ఫైనల్లో సమీర్ 23–25తో వాంగ్ షివెన్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. -
సరుకు కలెక్ట్ చేస్తుండగా.. హఠాత్తుగా మునిగిపోయిన ఓడ: వీడియో వైరల్
టర్కీలో ఓ భారీ ఓడ సరుకు అన్లోడ్ చేస్తుండగా..మునిగిపోయింది. ఈ హఠాత్పరిణామానికి సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. వివరాల్లోకెళ్తే.. ఈజిప్ట్‌కి చెందిన సీ ఈగిల్ అనే కార్గో ఓడ ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ఘటన టర్కీలోని ఇస్కెండరమ్ పోర్ట్‌లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదం సంభవించినప్పుడూ సిబ్బంది కంటైనర్ల లోడ్‌ని దింపుతోంది. ఇంతలో ఓడ ముందుకు కదిలి ఆ తర్వాత ఒక్కసారిగా బోల్తాపడింది. దీంతో లోడ్‌ను కలెక్ట్ చేస్తున్న సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ఈ మేరకు టర్కీ రవాణా, మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖ ట్విట్టర్లో... ఈ ఓడ ప్రమాదం కారణగా సుమారు 24 కంటైనర్లు మునిగిపోయాయని తెలిపింది. అలాగే కొద్ది మోతాదులో చమురు కూడా లీక్ అయినట్లు వెల్లడించింది. అదృష్టవశాత్తు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొంది. ఈ ఓడ గత కొంతకాలంగా స్థిరత్వానికి(బ్యాలెన్సింగ్) సంబంధించిన విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించింది. ఈ ఓడ సెప్టెంబర్ 17న టర్కీలోని ఇస్కెండరమ్ పోర్ట్‌కి చేరుకుందని, అప్పుడే ఈ ప్రమాదం సంభవించిందని పేర్కొంది. ఈ ఓడను 1984 నిర్మించారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి గల కారణాలను టర్కీలోని పోర్ట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఓడను వెలికితీసే ఆపరేషన్ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. అంతేగాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. SEA EAGLE isimli konteyner gemisinden denize düşen 24 konteynerin tamamı denizden çıkarılmış olup, dalgıç marifetiyle batık bölgesinde gerekli kontroller yapılarak deniz yüzeyinin temizlenmesine müteakip batıkla ilgili çalışmalara devam edilecektir. pic.twitter.com/RV19PsH7PZ — DENİZCİLİK GENEL MÜDÜRLÜĞÜ (@denizcilikgm) September 18, 2022 Sinking moment of the Sea Eagle in İskenderun... pic.twitter.com/mgg3VtKIMl — focuSEA (@focuseatv) September 19, 2022 (చదవండి: భూమిని ఢీ కొట్టిన జెట్ విమానం...మంటల్లో సైతం ఎగిరి...: వీడియో వైరల్) -
కాబోయే భార్య ఎగ్జామ్ ఫెయిల్ అయ్యిందని ఏకంగా స్కూల్‌నే తగలెట్టేశాడు
కోపంతో ఆవేశంగా తీసుకునే నిర్ణయాలు చాలా అనర్థాన్ని సృష్టిస్తాయి. ఆ కోపం వారినే కాదు తనతో ఉన్నవారిని కూడా కష్టాలపాల్జేస్తుంది. అచ్చం అలానే ఇక్కడోక వ్యక్తి తన కాబోయే భార్య ఎగ్జామ్ పెయిలైందన్న కోపంతో చేసిన పని కొంతమంది విద్యార్థుల భవితవ్యాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేసింది. వివారాల్లోకెళ్తే...ఈజిప్టులోని 21 ఏళ్ల యువకుడు తన కాబోయే భార్య చదువుతున్న స్కూల్‌కి నిప్పుపెట్టాడు. తన కాబోయే భార్య ఎగ్జామ్‌లో ఫెయిలైందన్న కోపంతో ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఈ మేరకు ఈజిప్టులోని ఘర్బియా గవర్నరేట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఈజిప్టు రాజధాని కైరోకు ఉత్తరాన ఉన్న మెనోఫియా ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. ఈ అగ్నిప్రమాదంలో ఎవరూ గాయపడలేదని చెప్పారు. సదరు నిందితుడు విచారణలో చెప్పిన విషయాలు విని పోలీసుల ఒక్కసారిగా షాక్ అయ్యారు. తన కాబోయే భార్య ఎగ్జామ్ ఫెయిలవ్వడంతో ఆమె మరో ఏడాది చదువుకోవాల్సి ఉంటుందని చెప్పాడు. అందువల్ల తమ పెళ్లి వాయిదా పడుతుందన్న కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టానని చెప్పుకొచ్చాడు. ఐతే సమయానికి అగ్నిమాపక సిబ్బంది వచ్చి త్వరితగతిన మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పారు. ఈ అగ్ని ప్రమాదంలో ప్రిన్స్‌పాల్ కార్యాలయం, అడ్మినిస్ట్రేటివ్ భవనం దారుణంగా దెబ్బతాన్నాయని పోలీసులు చెప్పారు. అంతేగాక ఆ స్కూల్లోని కొంతమంది విద్యార్థుల రికార్డులు నాశనమయ్యాయని తెలిపారు. ఐతే అతను ఈ దారుణానికి ఒడిగట్టినప్పుడు చూసిన స్థానికులు అతని గురించి పూర్తి సమాచారం అందించారని చెప్పారు. ప్రస్తుతం పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడమే కాకుండా కోర్టు ఎదుట హాజరుపర్చనున్నట్లు పేర్కొన్నారు. (చదవండి: Lying Down Championship: అలా తిని పడుకుంటే.. డబ్బులొస్తాయ్!) -
ఘోర ప్రమాదం.. 41 మంది సజీవ దహనం!
కైరో: ఈజిప్టు రాజధాని కైరోలోని ఓ చర్చిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని 41 మంది సజీవ దహనం అయ్యారు. ఇంబాబా ఏరియాలోని అబు సీఫెన్ చర్చిలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చర్చిలో ఒక్కసారిగా మంటలు చోటు చేసుకున్నాయి. ఈ మంటల్లో చిక్కుకుని 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ప్రమాదం సంభవించినట్లు పోలీసులు పాథమిక నిర్థారణకు వచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన వారిని 30 అంబులెన్స్‌ల్లో ఆస్పత్రులకు తరలించినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. గాయపడిన వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఘటనలో మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. -
మన ‘తేజస్’పై 6 దేశాల ఆసక్తి..రక్షణ శాఖ సహాయ మంత్రి వెల్లడి
న్యూఢిల్లీ: హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) తయారు చేసిన తేజస్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, అర్జెంటీనా, ఈజిప్ట్ అసక్తి చూపిస్తున్నాయని రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ చెప్పారు. తేజస్‌ను త్వరలో మలేషియా కొనుగోలు చేయనుందని తెలిపారు. 2019 ఫిబ్రవరిలో రాయల్ మలేషియన్ ఎయిర్‌ఫోర్స్ నుంచి ప్రాథమిక టెండర్‌ను హెచ్ఏఎల్ స్వీకరించిందని అన్నారు. ట్విన్–సీటర్ వేరియంట్ తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను కొనాలని మలేషియా నిర్ణయించుకుందని వెల్లడించారు. కాలంచెల్లిన రష్యన్ మిగ్–29 ఫైటర్ విమానాల స్థానంలో తేజస్‌ను ప్రవేశపెట్టాలని భావిస్తోందని పేర్కొన్నారు. శుక్రవారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు అజయ్ భట్ సమాధానమిచ్చారు. స్టీల్త్ ఫైటర్ జెట్ల తయారీపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు వివరించారు. ‘అటనామస్ ఫ్లైయింగ్ వింగ్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్’ను డీఆర్డీఓ విజయవంతంగా పరీక్షించిందని, దీనిపై ఇంతకంటే ఎక్కువ సమాచారం బహిర్గతం చేయలేమని చెప్పారు. భారత వైమానిక దళ(ఐఏఎఫ్) అవసరాల కోసం రూ.48,000 కోట్లతో 83 తేలికపాటి తేజస్ యుద్దవిమానాల కొనుగోలు కోసం రక్షణ శాఖ గత ఏడాది ఫిబ్రవరిలో హెచ్ఏఎల్తో ఒప్పందం కుదుర్చుకుంది. -
ఆ ప్రేమోన్మాది మరణశిక్ష టీవీల్లో లైవ్ ప్రసారం!
ప్రేమ, పెళ్లికి నిరాకరించడంతో ప్రేమోన్మాదులు.. పాశవికంగా దాడులకు పాల్పడుతున్నట్లు ఘటనలు చూస్తుంటాం. కానీ, చట్ట ప్రకారం కఠిన శిక్షలు లేకపోవడం, ఇలాంటివి పెరిగిపోవడానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. యువతుల జీవితాలను చిదిమేయాలని ప్రయత్నించే వాళ్లకు గుణపాఠం చెప్పాలని, భావితరాలకు గట్టి సందేశం ఇవ్వాలని ఈజిప్ట్ కోర్టు ఒకటి నిర్ణయించుకుంది. ఉత్తర ఈజిప్ట్‌లోని మాన్సోరా యూనివర్సిటీలో చదువుతున్న మోహమద్ అడెల్.. తనతో పాటు చదువుకునే నయెరా అష్రాఫ్‌ను కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించాడనే కోపంలోనే అతను ఆ ఘాతుకానికి పాల్పడ్డాడు. జూన్ నెలలోనే ఈ ఘటన జరగ్గా. జూన్ 28వ తేదీన అతనికి మరణశిక్ష విధించింది మాన్సోరా కోర్టు. అయితే.. అతని మరణ శిక్షను ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ ఈజిప్ట్ పార్లమెంట్‌కు ఓ లేఖ కూడా రాసింది. పూర్తిగా ఉరి తీయడం వీలు లేకున్నా.. కనీసం అతని ఉరి ఏర్పాట్లనైనా ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆ లేఖలో కోర్టు పేర్కొంది. ఆ దుర్మార్గుడు ఆమెను అతికిరాతకంగా చంపాడు. అందుకే దేశం మొత్తం అతని శిక్షను చూడాలి. ఈ శిక్ష ద్వారా ఇలాంటి ఘటనలకు పాల్పడాలనుకునేవాళ్లు వణికిపోవాలి. దేశంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదంటే.. చట్టసభ అందుకు అనుమతించాలి’ అని లేఖలో పేర్కొన్నారు. తీర్పు కిందటి నెలనే ఇచ్చినప్పటికీ.. జులై 24న తీర్పు కాపీ బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ నిర్ణయం ఈజిప్ట్ గ్రాండ్ ముఫ్తీ డాక్టర్ షాకీ అలం చేతిలో ఉంది. అయితే న్యాయపరంగా పోరాడేందుకు అడెల్కు ఇంకా అవకాశం ఉంది. రెండు నెలల పాటు క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసుకునేందుకు హక్కు ఉందని అతని తరపు న్యాయవాది చెప్తున్నారు. ఇప్పటికే శిక్ష విధించి నెలరోజులు పూర్తైంది. ఇంకా నెలరోజులే మిగిలి ఉండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. నయెరా అష్రాఫ్ మరణం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆమెను ఘోరాతి ఘోరంగా చంపిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతంలో.. ఇలాగే ఓ శిక్షను ప్రజలు చూసేలా ప్రసారం చేశారు అక్క్డడి అధికారులు. 1998లో రాజధాని కైరోలో ఓ మహిళను, ఆమె ఇద్దరు పిల్లలను దారుణంగా చంపిన ముగ్గురు నిందితులను.. ఉరి తీసే కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేశారు అక్కడి టీవీ ఛానెళ్లలో. The killing of Egyptian student Nayera Ashraf has been met with condemnation and ignited a debate about violence against women. The suspect is a man who reportedly harassed her for months before the killing. Read more: https://t.co/nLFZHE2vqC pic.twitter.com/RXraAtTpH0 — Al Jazeera English (@AJEnglish) June 23, 2022 -
షాకింగ్: సిగరెట్ వల్లే ఆ ఘోర విమాన ప్రమాదం!
EgyptAir Flight 804 Mishap Details: ఆరేళ్ల కిందట జరిగిన ఓ విమాన ప్రమాదం గురించి దిగ్భ్రాంతి కలిగించే విషయం ఒకటి తెలిసింది. అనేక అనుమానాల నడుమ దాదాపుగా చిక్కుముడి వీడింది. మొత్తం 66 మంది ప్రయాణికులతో 37వేల అడుగులో వెళ్తూ.. సముద్రంలో కూలిన ఈజిప్ట్ ఎయిర్ విమాన ప్రమాదానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈజిప్ట్ విమాన ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన ఫ్రెంచ్ ఏవియేషన్ నిపుణులు.. ప్రమాదానికి ఒక సిగరెట్ కారణమని తేల్చారు. పైలట్ సిగరెట్ అంటించడం వల్ల కాక్‌పిట్‌లో మంటలు చెలరేగాయని, ఫలితంగా విమానం కుప్పకూలిందని నిర్ధారించారు. దర్యాప్తునకు సంబంధించి 134 పేజీల నివేదికను పారిస్‌లోని అప్పీల్ కోర్టులో గత నెల సమర్పించారు. ఇందుకు సంబంధించిన వివరాలతో ‘న్యూయార్క్ పోస్ట్’ తాజాగా ఓ కథనాన్ని ప్రచురించడంతో ఈ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. తొలుత ఈ విమాన ప్రమాదాన్ని ఉగ్రవాద దాడిగా ఈజిప్ట్ ప్రకటించింది. కానీ, ఏ ఉగ్రసంస్థ కూడా దానిని తామే చేసినట్లు నిర్ధారించలేదు. ఈ తరుణంలో విమానంలోని లోపమే కారణమని ఇంతకాలం అనుకున్నారు. అయితే.. ఆ విమానం 2003 నుంచే సర్వీసుల్లోకి అడుగుపెట్టింది. అంటే కేవలం 13 ఏళ్ల సర్వీసు మాత్రమే పూర్తి చేసుకుంది. సాధారణంగా ఆ విమానం లైఫ్ 30 నుంచి 40 ఏళ్ల ఉంటుంది. ఈ నేపథ్యంలో అనుమానాలు.. విస్తృతస్థాయి దర్యాప్తు వైపు అడుగులు వేయించాయి. కాక్‌పిట్‌లో పైలట్ సిగరెట్ వెలిగించగానే అత్యవసర మాస్క్ నుంచి ఆక్సిజన్ లీకై కాక్‌పిట్‌లో మంటలు చెలరేగాయి. ఫలితంగా విమానం కుప్పకూలిందని దర్యాప్తు అధికారులు నివేదికలో పేర్కొన్నారు. కాక్‌పిట్‌లో మంటలు అంటుకున్న సమయంలో సిబ్బంది భయంతో అరుస్తున్న శబ్దాలు మాస్క్‌కు ఉన్న మైక్రోఫోన్లో రికార్డయ్యాయి. ఇక పైలెట్ సిగరెట్ పొగ పీల్చినట్లు రికార్డయిన శబ్దాల గురించి ఇటాలియన్ పత్రిక కార్రియర్ డెల్లా సెరా కూడా ఓ కథనం ప్రచురించింది. ప్రమాదానికి గురైన ఈజిప్ట్ ఎయిర్ విమానయాన సంస్థకు చెందిన ఎయిర్‌బస్-ఎ320, 2016 మే 19న తేదీన పారిస్ నుంచి ఈజిప్ట్ రాజధాని కైరోకు బయలుదేరింది. గ్రీక్ ద్వీపాలకు 130 నాటికల్ మైళ్ల దూరలో రాడార్ నుంచి విమానం అదృశ్యమైంది. ఆ తర్వాత కాసేపటికే క్రెటె ద్వీపం సమీపంలో తూర్పు మధ్యధరా సముద్రంలో కూలిపోయింది. ఆ సమయంలో విమానంలో 40 మంది ఈజిఫ్ట్ పౌరులు, 15 మంది ఫ్రెంచ్ పౌరులు సిబ్బంది సహా మొత్తం 66 మంది ఉండగా, అంతా ప్రాణాలు కోల్పోయారు. చదవండి: పాక్-అఫ్గన్.. డామిట్ కథ అడ్డం తిరిగింది! -
జయహో భారత్..!!
-
ఉక్రెయిన్ వార్.. ఈజిప్టులో తిండికి కటకట.. భారత్‌వైపు చూపు!
ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన దాడి ప్రపంచ దేశాలను కమ్మేస్తోంది. యుద్ధంతో సంబంధం లేకపోయినా అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలు దెబ్బతినడం, సప్లై చైన్ ఇక్కట్లలో పడటంతో పలు దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇందులో మిడిల్ ఈస్ట్‌కి చెందిన ఈజిప్టు కూడా చేరింది. 80 శాతం దిగుమతులే ఈజిప్షియన్ల ప్రధాన ఆహారం గోధుమలు. తమ దేశంలో వినియోగించే గోదుమల్లో దాదాపు 80 శాతాన్ని ఈజిప్టు దిగుమతి చేసుకుంటోంది. దీని కోసం ఇంత కాలం ఉక్రెయిన్, రష్యా దేశాలపై ఎక్కువగా ఈజిప్టు ఆధారపడింది. అయితే 2021 నవంబరు నుంచి ఉక్రెయిన్ , రష్యాల మధ్య ఉద్రిక్తలు నెలకొని ఉండటంతో గోదుమల దిగుమతి తగ్గిపోయింది. దీని ఎఫెక్ట్ 2022 ఆరంభంలోనే కనిపించింది. పెరిగిన ధరలు ఫిబ్రవరి నెల గణాంకాలను పరిశీలిస్తే గతేడాదితో పోల్చితే ఆహార ధాన్యాల ధరలను 4.6 శాతం పెరిగాయి. ఇక ఫిబ్రవరిలో ఆహార ధాన్యాలకు సంబంధించి ద్రవ్యోల్బణం 7.2 శాతంగా నమోదు అవగా జనవరిలో అది 6.3 శాతంగా ఉంది. దీంతో ఫిబ్రవరిలోనే ఈజిప్ట్ మార్కెట్లో బ్రెడ్ ధర ఏకంగా 25 శాతం పెరిగింది. తొలగని అనిశ్చితి ఫిబ్రవరిలో ఉక్రెయిన్, రష్యాల మధ్య మొదలైన యుద్ధం నెలరోజులు గడిచినా కొలిక్కి రాలేదు. ఇంకా ఎంత కాలం యుద్ధం కొనసాగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఒకవేళ యుద్ధం ముగిసినా రష్యా, ఉక్రెయిన్లలో తిండి గింజలను గతంలోలా ఎగుమతి చేస్తారో లేదో తెలియదు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై ఈజిప్టు దృష్టి పెట్టింది. భారత్ సాయం ప్రపంచంలో గోదుమలు అధికంగా పండించే దేశాలలో భారత్ ఒకటి. దీంతో తమ ఆహార ధాన్యాల అవసరాల కోసం ఇండియాపై ఆధారపడక తప్పని పరిస్థితి ఈజిప్టుకు నెలకొంది. దీంతో ఇటీవల దుబాయ్‌లో జరిగిన సమావేశంలో మన కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్‌తో ఈజిప్టు ప్లానింగ్ శాఖ మంత్రి హలా ఎల్సైడ్ చర్చించారు. మొదలైన కసరత్తు తమ దేశ అవసరాలకు సరిపడే విధంగా కోటి 20 లక్షల టన్నుల గోదుమలు ఎగుమతి చేయాలంటూ ఈజిప్టు భారత్‌ని కోరింది. భారీ ఎత్తున జరిగే గోదుమల వాణిజ్యానికి తగ్గట్టుగా లాజిస్టిక్స్, సప్లై చెయిన్ వంటి కీలక అంశాలపై ఇరువైపులా అధికారులు కసరత్తు చేస్తున్నారు. చదవండి: ఉక్రెయిన్ - రష్యా యుద్ధం, భారత్ ఎకానమీపై భారీ ఎఫెక్ట్..ఎంతలా ఉందంటే! -
2 వేల ఏళ్లనాటి మమ్మీ కడుపులోని పిండాన్ని గుర్తించిన సైంటిస్టులు!!
Foetus Found In The Abdomen Of An Egyptian Mummy: ఇంతవరకు ఈ జిప్షియన్ మమ్మీలపై శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు చేశారు. ఇటీవలే మమ్మీలను తాకుకుండానే సరికొత్త సాంకేతికత కూడిన మమ్మఫికేషన్ సాయంతో పరిశోధించడం గురించి విన్నాం. ఆ సాంకేతిక సాయంతో 20 ఏళ్ల నాట్టి ఈజిప్షియన్ మమ్మి కడుపులో భద్రంగా ఉన్న పిండాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. అసలు విషయంలోకెళ్తే...20 వేల ఏళ్లనాటి ఈజిప్షియన్ మమ్మీ పొత్తికడుపులో పిండాన్ని గుర్తించారు. ఈ మేరకు వార్సా విశ్వవిద్యాలయ పరిశోధకులు ఆ పిండం పై పరిశోధనుల చేశారు. సీటీ ఎక్స్ రే స్కాన్ సాయంతో పుట్టబోయే బిడ్డ అవశేషల ఉనికిని వెల్లడించారు. అంతేకాదు దీన్ని మమ్మీ పిండాన్ని కలిగి ఉన్న తొలి ఎంబాల్డ్ నమూనాగా విశ్వస్తారని చెప్పారు. అయితే 20 ఏళ్ల వయసులో చనిపోయిన ఈ మమ్మీని 'మిస్టిరియస్ లేడీ' అని పిలుస్తారు. అయితే ఆ మహిళ ప్రసవంలో చనిపోలేదని పరిశోధకులు తెలిపారు. అంతేకాదు ఆ మహిళ మరణానికి గల కారణాలు గురించి తెలియలేదని చెప్పారు. పైగా ఆ మమ్మీ సమాధి శిధిలమైపోయిందని తెలిపారు. అయితే ఆ మహిళ గర్భం దాల్చిన 26 నుంచి 30 వారాల పిండంగా నిర్ధారించారు. కానీ మమ్మీలను రసాయన పదార్థాలను పూసి ఉంచడం వల్ల ఆ మమ్మీ కడుపులోని పిండంలోని ఎముకలు నిర్విర్యం అయిపోయాయని చెప్పారు. అయితే ఆ పిండం పై ఉన్న మృదు కణజాలంతో ఆ పిండాకృతిని గుర్తించడం కష్టతరమవుతుందని తెలిపారు. ఈ క్రమంలో శాస్త్రవేత్తలు మమ్మీఫికేషన్ ప్రక్రియలో మమ్మీ శరీరంలోని అంతర్గత భాగాలను తొలగించే క్రమంలో వారు ఎందుకు పిండాన్ని పొత్తికడుపులోనే వదిలేశారు అనే దాని వీద శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. -
టీచర్ కొంపముంచిన వైరల్ వీడియో.. షాకిచ్చిన భర్త.. ఉద్యోగం కూడా పాయె
సోషల్ మీడియాలో యుగంలో వీడియోలు, ఫోటోలతో జీవితాలు తారుమారైన సంఘటనలెన్నో చూశాం. తాజాగా ఒక వీడియోతో ఓ టీచర్ భవితవ్యం అస్తవ్యస్తమైంది. తన జీవితానికి ఆధారమైన టీచర్ ఉద్యోగం పోగా.. మరోవైపు కట్టుకున్న భర్త విడాకులు ఇచ్చి షాక్‌కు గురిచేశాడు. అసలు ఏం జరిగిందోనని ఆలోచిస్తున్నారా? వివరాల్లోకి వెళ్తే.. ఈజిప్ట్‌కు చెందిన అయా యూసఫ్ అనే టీచర్ తన సహోద్యోగులతో కలిసి నైలు నదిపై పడవలో విహారయాత్రకు వెళ్లింది. విహారయాత్రలో సరదాగా తన సహచరులతో కలిసి బెల్లీ డ్యాన్స్ చేసింది. అయితే బెల్లీ కాస్త.. ఆమె పాలిట శాపంలా మారింది. అయా యూసఫ్ బెల్లీ డ్యాన్స్ చేస్తుండగా.. ఆమె సహోద్యోగి ఆ దృశ్యాలను వీడియో తీశాడు. తర్వాత ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. దీంతో ఒక్కసారిగా ఆమె డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఆమె బెల్లీ డ్యాన్స్ వీడియో పాఠశాల అధికారుల కంట పడటంతో.. వారు కూడా సీరియస్ అయ్యారు. ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ షాక్ నుంచి తేరుకొకుండానే.. ఆమె భర్త కూడా మరో ఊహించని షాక్ ఇచ్చాడు. బెల్లీ డ్యాన్స్ చేయడంపై తీవ్రమైన అభ్యంతరం వ్యక్తంచేస్తూ విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఈ పరిణామాలతో అయా యూసఫ్ తీవ్ర మనోవేదనకు గురైంది. సహోద్యోగి తన అనుమతి లేకుండా డాన్స్ వీడియో చిత్రీకరించాడని ఆమె ఆరోపించింది. నైలు నది విహార యాత్రలో పది నిమిషాల ప్రయాణం తన జీవితాన్నే అగమ్యగోచరమైందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె బహిరంగంగా డ్యాన్స్ చేయడంపై కొంతమంది నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. టీచర్ వ్యవహారంలో పాఠశాల అధికారులు తీసుకున్న నిర్ణయంపై మరికొంతమంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు తిరిగి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మహిళ అనుమతి లేకుండా ఆమె వీడియో చిత్రీకరించి.. డ్యాన్స్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బాధిత టీచర్ డిమాండ్ చేస్తున్నారు. ఇక తాను బహిరంగ ప్రదేశాల్లో డ్యాన్స్ చేయలేని అయా యూసఫ్ వివరణ ఇచ్చుకుంది. -
రెండు వేల ఏళ్లనాటి సమాధుల్లో... బంగారపు నాలుక!!
ఇంతవరకు ఈజిప్టులో పిరమిడ్ రూపంలో మమ్మీలుగా పిలిచే సమాధులు ఉన్నాయని మనం విన్నాం. అంతేగాక ఆ సమాధులు రాజ వంశానికి చెందిన వారివి అని, పైగా వారు వాడిన వస్తువులు అన్నింటిని ఆ సమాధిలో భద్రపరిచేవారని విన్నాం. కానీ ఈజిప్టులో ఇంకా కొన్ని సమాధులపై పురావస్తు శాఖ తవ్వకాలు జరుపుతూ....పరిశోధనలు చేస్తూనే ఉంది. అయితే ఆ క్రమంలోనే ఈజిప్టు పురావస్తు శాఖ ప్రస్తుతం ఒక రాజవంశానికి చెందిన రెండు సమాధులు పక్కపక్కనే ఉన్నట్లు గుర్తించడమే కాక బంగారపు అవశేషాలు ఉన్నట్లు గుర్తించింది. (చదవండి: వామ్మో! ఆ దేశం కేవలం పూల వ్యాపారంతోనే.... రూ.180 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందటా!!) అసలు విషయంలోకెళ్లితే....కైరోలోని పర్యాటక పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖ ఈజిప్టులోని మిన్యా గవర్నరేట్‌లో రెండు వేల ఏళ్ల క్రితం నాటి సైటే రాజవంశానికి చెందిన రెండు సమాధులు పక్కపక్కనే ఉన్నట్లు గుర్తించినట్లు ప్రకటించింది. పైగా ఈ సమాధులను స్పానిష్ పురావస్తు మిషన్ ద్వారా కనుగొన్నట్లు తెలిపింది. అంతేకాదు బార్సిలోనా విశ్వవిద్యాలయం నుండి వచ్చిన మిషన్ సమాధులలో ఒకదానిలో బంగారు నాలుకలతో ఉన్న ఇద్దరు అపరిచిత వ్యక్తుల అవశేషాలను కనుగొన్నట్లు సుప్రీమ్ కౌన్సిల్ ఆఫ్ యాంటిక్విటీస్ సెక్రటరీ జనరల్ మోస్తఫా వాజిరి వెల్లడించారు. పైగా సమాధి లోపల ఒక మహిళ ఆకారంలో కవర్‌తో కూడిన సున్నపురాయి శవపేటికను గుర్తించినట్లు చెప్పారు. అయితే సమాధి యొక్క ప్రాథమిక అధ్యయనాల్లో ఇది గతంలో పురాతన కాలంలో తెరివడబడినట్లు వాజీరి పేర్కొన్నాడు. ఈ క్రమంలో రెండోవ సమాధి మాత్రం త్రవ్వకాల సమయంలో మిషన్ సాయంతో దానిని మొదటిసారిగా తెరిచినట్లు చెప్పుకొచ్చారు. ఈ మేరకు కానోపిక్ కుండలను కలిగి ఉన్న రెండు శవపేటికలతో పాటు, మానవ ముఖంతో ఉన్న సున్నపురాయి శవపేటిక ఏ మాత్రం చెక్కు చెదరకుండా మంచి స్థితిలో రెండవ సమాధిలో ఉన్నట్లు మిషన్ త్రవ్వకాలను పర్యవేక్షించే హసన్ అమెర్ చెప్పారు. అయితే ఒక కుండలో ఫైయన్స్‌తో చేసిన సుమారు 402 ఉషబ్తి బొమ్మలు, చిన్న తాయెత్తులు, ఆకుపచ్చ పూసలు ఉన్నాయని హసన్ చెప్పారు. ఈ మేరకు హసన్ ఇటీవల కాలంలో ఈజిప్టులో ఫారోనిక్ సమాధులు, విగ్రహాలు, శవపేటికలు, మమ్మీలతో సహా అనేక పురావస్తు ఆవిష్కరణలు జరిగాయని అన్నారు. (చదవండి: దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తొలి మరుగుజ్జు వ్యక్తి మనోడే!) -
తవ్వకాల్లో బయటపడ్డ 4500 ఏళ్ల నాటి సూర్యదేవాలయం.. ఎక్కడంటే?
సుమారు 4500 ఏళ్ల క్రితం నాటి సూర్య దేవాలయాన్ని బయట పడింది. ఈ విషయన్ని ఈజిప్ట్ పురావస్తుశాఖ అధికారులు ధృవీకరించారు. 4,500 సంవత్సరాల క్రితం 25వ శతాబ్దం బీసీఈ మధ్యకాలం నాటి పురాతన సూర్య దేవాలయమని అధికారులు విశ్వసిస్తున్నారు. కాగా ఈజిప్ట్‌ను ఒకప్పుడు ఫారోహ్ అనే రాజులు పాలించేవారు. వాళ్ల హయాంలోనే ఈజిప్ట్‌లో మొత్తం ఆరు దేవాలయాలను నిర్మించారు. దీనిపై పురావస్తుశాఖ అధికారి మాట్లాడుతూ.. కనిపించకుండా పోయిన ఆరు ఫారో సూర్య దేవాలయంలో ఇది ఒకటని, తాము తవ్వి తీస్తున్నామని చెప్పడానికి బలమైన రుజువు తమకు దొరికిందని పేర్కొన్నారు. నివేదిక ప్రకారం, అబూ ఘురాబ్‌లోని మరొక ఆలయంలో ఖననం చేయబడిన అవశేషాలను ఆ బృందం కనుగొంది. పురావస్తుశాఖ అధికారులు జరిపిన పరిశోధనలో ఇది మూడవ సూర్య దేవాలయమని, గత 50 సంవత్సరాలలో ఇదే మొదటిదని తెలిపారు. ఫారోలు సజీవంగా ఉన్నప్పుడే ఆరు సూర్య దేవాలయాలను నిర్మించారని, ఇప్పటి వరకు ఆరు దేవాలయాలలో రెండు మాత్రమే కనుగొన్నారు. సూర్య దేవాలయం అవశేషాల క్రింద త్రవ్వినప్పుడు మట్టి ఇటుకలతో చేసిన పాత స్థావరంతో పాటు మరొక భవనం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 1898 లో ఒకసారి సూర్యదేవాలయాన్ని అధికారులు కనిపెట్టగా.. తాజాగా రెండో సూర్యదేవాలయాన్ని గుర్తించారు. చదవండి: నిప్పుతో చెలగాటలొద్దు! బైడెన్‌కు వార్నింగ్ ఇచ్చిన జిన్‌పింగ్.. -
సౌదీ అరేబియా, ఈజిప్టులలో ఐఐటీ, ఢిల్లీ క్యాంపస్‌లు
దేశంలోనే ప్రతిష్టాత్మకమైన సాంకేతిక విద్యా సంస్థలుగా పేరొందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు సరిహద్దులు చెరిపేసేందుకు రెడీ అవుతున్నాయి. విదేశాల్లో క్యాంపస్‌లు ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఆ రెండు దేశాలతో మొదలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, న్యూఢిల్లీ విదేశాల్లో క్యాంపస్‌లు ఏర్పాటు చేయనుంది. ఈజిప్టు, సౌదీ అరేబియాలలో క్యాంపస్‌లను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆ దేశ ప్రభుత్వాలతో దౌత్య పరమైన చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు కొలిక్కి వస్తే త్వరలోనే ఆ రెండు దేశాల్లో ఐఐటీ క్యాంపస్‌లు అందుబాటులోకి రానున్నాయి. బాధ్యతలు ఇలా విదేశాల్లో నెలకొల్పే ఇంజనీరింగ్ క్యాంపస్‌లు పూర్తిగా ఆయా దేశాలకు చెందిన ప్రభుత్వాలు అందించే నిధులతోనే రన్ అవుతాయి. అయితే అఫిలియేషన్, సిలబస్, జాయినింగ్ తదితర విషయాల్లో ఐఐటీ ఢిల్లీ బాధ్యత తీసుకుంటుంది. ప్రస్తుతం ఉన్న జేఈఈ కాకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో మరో ప్రవేశ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఇందులో ప్రవేశం పొందే విద్యార్థులు మొదటి ఏడాది ఢిల్లీ క్యాంపస్‌లో చదివిన తర్వాత రెండో ఏడాది ఆయా దేశాల్లో ఉన్న క్యాంపస్‌లలో కోర్సును పూర్తి చేయాల్సి ఉంది. కొత్త పేరుతో మన దేశంలో ఇంజనీరింగ్ డిగ్రీ నాలుగేళ్ల కోర్సుగా ఉంది. బీఈ లేదా బిటెక్ పేరుతో పట్టాలు ఇస్తున్నారు. విదేశీ క్యాంపస్‌లో అందించే కోర్సు బీఈ/బీటెక్ కాకుండా మరో కొత్త పేరు పెట్టే యోచనలో ఉన్నారు. గతంలో మారిషస్‌లో క్యాంపస్ తెరిచేందుకు ప్రయత్నాలు కొనసాగినా చివరి నిమిషంలో విరమించుకున్నారు. విదేశాల్లో ఐఐటీ క్యాంపస్‌లకు సంబంధించిన సమాచారం ఓ జాతీయ మీడియాలో వచ్చింది. ఎన్నారైలకు లాభం యూరప్, అమెరికాలను మినహాయిస్తే మిగిలిన దేశాల్లో విద్యాప్రమాణాలు ఉన్నత స్థాయిలో లేవు. ఈజిప్టు, సౌదీ అరేబియాలలో క్యాంపస్‌లు అందుబాటులోకి వస్తే ఆయా దేశాల్లో ఉన్న విద్యార్థులతో పాటు ఎన్నారైలకు కూడా ఉపయుక్తంగా ఉంటుంది. ఇండియాలో ప్రీమియం ఇన్‌స్టిట్యూట్స్‌గా పేరున్న ఐఐటీలకు గ్లోబల్ గుర్తింపు తెచ్చే లక్ష్యంతో ఈ విదేశీ క్యాంపస్ ఐడియాను తెర మీదకు తెచ్చారు. చదవండి:ఆగేదేలే! అమెరికా టూ ఇండియా.. నాన్‌స్టాప్ ఫ్లైట్ సర్వీసులు.. -
లైవ్ టెలికాస్టింగ్‌లో ఫోన్ చోరీ! కట్ చేస్తే..
కైరో: ఇటీవల కాలంలో సోషల్ మీడియా క్రేజ్ పెరిగిపోవడంతో లైవ్ ఈవెంట్లు కూడా వీటిద్వారానే ప్రసారం కావడంతో వార్తాప్రపంచం అనేది ప్రజలకు మరింత చేరువైంది.. ఇది కాలక్రమంలో టెక్నాలజీ పరంగా వచ్చిన మార్పుగానే చెప్పవచ్చు. ఎక్కువ న్యూస్ టెలికాస్ట్ చేయాలన్న ఉద్దేశంతో చాలా సరికొత్త ఈవెంట్స్‌తో ప్రేక్షకుల్ని అలరిస్తున్న సంగతి తెలిసిందే. అందలో భాగంగా ఈజిప్ట్‌లోని ఒక న్యూస్ చానల్ ఒక సరికొత్త కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం చేస్తుంటే ఒక విచిత్రం చోటు చేసుకుంది. (చదవండి: అందుకే ఇంగ్లండ్ నుంచి వస్తున్నారు) అసలేం జరింగిందంటే....ఈ జిప్ట్‌లోని యూమ్ 7 న్యూస్ చానల్ రియల్ టైమ్ ఈవెంట్ అనే సరికొత్త కార్యక్రమంతో ప్రేక్షకులకు మరింత చేరవ కావడానికీ ప్రయత్నిస్తోంది. ఆ తరుణంలో కొన్ని భయంకరమైనవి, ఆసక్తి కలిగించే రియల్‌టైం ఈవెంట్లను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. అయితే ఇటీవల ఈజిప్ట్‌లో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రియల్‌టైం ఈవెంట్లో భాగంగా భూకంపం తర్వాత ప్రజల పరిస్థితి ఎలా ఉంది అనే న్యూస్‌ని ఫోన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నప్పుడు అనూహ్యంగా ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఆ రోజు న్యూస్ చానల్ ఆ కార్యక్రమానికి సంబంధించిన ప్రత్యక్షప్రసారంలో న్యూస్‌ని జర్నలిస్ట్ మహమూద్ రాఘేబ్ నివేదిస్తుండగా బైక్‌పై వచ్చిన దొంగ అతని ఫోన్ కొట్టేశాడు. ఫోన్‌ను కొట్టేసిందే తడువు బైక్‌పై వేగంగా జారుకుంటాడు. ఆ ఫోన్‌ను చేతిలోనే ఉంచుకుని సిగరెట్ కాలుస్తూ బైక్‌ను దర్జాగా డ్రైవ్ చేసుకుంటూ ముందుకు వెళ్లిపోతాడు. కాగా, ఆ ఫోన్ కెమెరా రోలింగ్లోనే ఉందని విషయం దొంగ గ్రహించకపోవడంతో అది ప్రత్యక్ష ప్రసారంలోనే రికార్డు అయ్యింది. తనను ఎవరైనా ఫాలో చేస్తున్నారా అనే అనుమానంతో మధ్యమధ్యలో వెనక్కి చూసుకుంటూ ఉండటం లైవ్ చూసేవారికి నవ్వులు తెప్పించింది. ‘నీ వెనకాల ఎవరూ రావడం లేదు.. కానీ ప్రపంచం మొత్తం నీ దొంగతనం చూస్తుంది’ అని నెటిజన్లు చమత్కరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియోలో వైరల్ అవ్వడంతో ప్రజలు ఆ దొంగను పట్టుకోవటానికి కూడా ప్రయత్నించారు. ఆ తర్వాత పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అయితే ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లిన ప్రతిసారి ఆ విషయం నన్ను బాధిస్తోంది) -
ఏకంగా మొబైల్ ఫోన్ మింగేశాడు.. 6 నెలల తర్వాత ఏమైందో తెలుసా?
సాధారణంగా చిన్నపిల్లలు పాకుతూ నాణేలను, చిన్న చిన్న వస్తువులను మింగడం తెలిసిన విషయమే. అయితే ఇటీవల కాలంలో కొంతమంది మరీ వింత వింతగా ఏది పడితే అది తినేస్తున్నారు. ఇసుక, మట్టి, వెంట్రుకలు, రాళ్లను కరకరా నమిలేస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఏకంగా మొబైల్ ఫోన్ మింగేసాడు. ఈ విచిత్ర సంఘటన ఈజిప్ట్ దేశంలో చోటుచేసుకుంది. తీవ్రమైన కడుపు నొప్పితో ఓ వ్యక్తి ఇటీవల ఆసుపత్రిలో చేరాడు. అయితే వైద్యులు అతని కడుపుని ఎక్క్‌రే తీసి చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.పేషెండ్ కడుపులో మొబైల్ ఫోన్ కనిపించడంతో వైద్యులకు మైండ్ బ్లాంక్ అయ్యింది. చదవండి: వైరల్: అభివృద్ధి అన్నందుకు యువకుడి చెంప చెల్లుమనిపించిన ఎమ్మెల్యే కాగా ఆరు నెలల క్రితం అతను పొరపాటున ఫోన్‌ను మింగిన్నట్లు వైద్యులకు తెలిసింది. అయితే కడపులో నుంచి ఫోన్ సహజంగా బయటకు వస్తుందని ఆ యువకుడు భావించాడు కానీ అది జరగలేదు. మొబైల్ కడుపులో ఇరుక్కొని ఆహారం జీర్ణం కాకుండా అడ్డుకుంది. దీంతో తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఈజిప్టులోని అస్వాన్ నగరంలోని ఆసుపత్రిలో అతనికి ఆపరేషన్ చేసి మొబైల్‌ను బయటకు తీశారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. మింగేసిన ఫోన్ మూడు భాగాలుగా విడిపోగా.. బ్యాటరీ అతని కడుపులో పేలిపోతుందని వైద్యులు కంగారు పడ్డారు. కానీ చివరికి ఆపరేషన్ సక్సెస్ అయి సురక్షితంగా బయటపట్టాడు. చదవండి: వైరల్: ఒక్క క్షణం ఆలస్యమైతే ఆ గర్భిణీ పరిస్థితి ఏమయ్యేదో ! -
ఎవర్‌గివెన్ కన్నా పెద్ద నౌక!.. సూయజ్ దారి ఇస్తుందా?
ప్రపంచ వాణిజ్య సముద్ర మార్గం సూయజ్ కెనాల్లోకి ప్రపంచంలోనే అతి పెద్దదైన భారీ ఓడ ప్రవేశించబోతోంది. ఈ ఏడాది మార్చిలో సూయజ్ కెనాల్లో నిలిచిపోయిన ఎవర్ గివెన్ నౌకను మించిన ఓడ ఇది. ఎవర్ గివెన్ నౌక ఆరు రోజుల పాటు సూయజ్ కెనాల్లో ఇసుకలో కూరుకుపోయి, నిలిచిపోవడంతో ఈ మార్గంలో ప్రయాణించే వందలాది నౌకలు సముద్రంలో నిలిచిపోయాయి. ఆ తర్వాత నౌక కింద ఇసుకను తవ్వి, అతి కష్టంమీద దానిని మళ్లీ సముద్ర మార్గంలోకి మళ్లించగలిగారు. ఈ నౌక నిలిచిపోయిన కారణంగా సముద్ర వాణిజ్యానికి తీవ్ర నష్టం కలిగింది. ఇప్పుడు వస్తున్న ఎవర్ ఏస్ నౌక అంతకంటే పెద్దది. ఎక్కువ కంటెయినర్లను మోసుకొని వస్తోంది. చదవండి: సూయజ్ కాలువ.. ఎవర్ గీవెన్ నౌక.. ఇప్పుడెక్కడుందో తెలుసా? ప్రస్తుతం ఇది బ్రిటన్‌లోని సఫోల్క్‌లో ఉన్న ఫ్లెగ్జిస్టోవ్ నౌకాశ్రయంలో ఉంది. బుధవారం దాని ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. భారీ కంటెయినర్ల లోడ్‌తో రాటర్‌డామ్‌కు చేరుకొనేందుకు ఎవర్ గివెన్ వెళ్లిన మార్గంలోనే సూయజ్ కెనాల్ గుండా వెళ్లనుంది. దీంతో అందరిలోనూ ఉత్సుకత నెలకొంది. ఎవర్ గివెన్కంటే పెద్దదైన ఈ నౌక సూయజ్ కెనాల్‌ను దాటేంతవరకు ఉత్కంఠ తప్పదని వాణిజ్యవర్గాలు అంటున్నాయి. తైవాన్‌కు చెందిన షిప్పింగ్ కంపెనీ ఎవర్ గ్రీన్ మెరైన్‌కు చెందిన ఈ నౌక ఎవర్గ్రీన్ ఎ క్లాస్‌లో కొత్త తరానికి చెందినది. ఎవర్ గివెన్‌కు 20,124 కార్గో యూనిట్లను మోసుకెళ్లే సామర్ధ్యం ఉండగా.. ఎవర్ ఏస్ ఏకంగా 23,992 కంటెయినర్లను మోసుకెళ్లగలదు. ఇవే కాదు ఈ రెండింటి మధ్య ఇంకా చాలా తేడాలున్నాయి. రెండింటి పొడవు ఒకటే. వెడల్పు, లోతులో, సామర్ధ్యంలో ఎవర్ ఏస్ ఎక్కువ. – సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్ -
ఫ్రాన్స్‌కు షాకిచ్చిన మెక్సికో.. డ్రాతో గట్టెక్కిన స్పెయిన్
టోక్యో: ఒలింపిక్స్ పోటీలు అధికారికంగా ప్రారంభం కావడానికి ముందే ఫుట్‌బాల్ లీగ్ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. గ్రూప్-సిలో భాగంగా గురువారం స్పెయిన్-ఈజిప్ట్‌ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రా(0-0) కాగా, గ్రూప్-ఏలో భాగంగా మెక్సికో-ఫ్రాన్స్‌ల మధ్య జరిగిన మరో మ్యాచ్‌లో మెక్సికో.. బలమైన ఫ్రెంచ్ జట్టుకు షాకిచ్చింది. ఫ్రాన్స్‌పై మెక్సికో 4-1 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ సెకండాఫ్‌లో అలెక్సిస్ వెగా, సెబాస్టియన్ కార్డోవా, యూరియల్ ఆంటునా, ఎరిక్ అగిర్లు తలో గోల్ చేయడంతో మెక్సికో ఫ్రాన్స్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. మరోవైపు యూరో కప్ 2020 సెమీ ఫైనలిస్ట్ స్పెయిన్ జట్టుకు తొలి మ్యాచ్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఈజిప్ట్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇద్దరు ఆటగాళ్లు గాయపడంతో ఆ జట్టు పేలవ ప్రదర్శనతో అతికష్టం మీద డ్రాతో గట్టెక్కింది. కాగా, స్పెయిన్ జట్టు చివరిసారిగా 1992 ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించింది. ఇక గ్రూప్ బిలో న్యూజిలాండ్-దక్షిణ కొరియా మధ్య జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు చెందిన క్రిస్ వుడ్ గోల్ వేయడంతో ఆ జట్టు 1-0తో విజయం సాధించింది. ఇక తదుపరి మ్యాచ్‌లో ఆతిథ్య జపాన్ జట్టు దక్షిణాఫ్రికాను ఢీకొనాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ఈ మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టోక్యోకు బయలుదేరే ముందు దక్షిణాఫ్రికా జట్టులోని కొందరు కరోనా బారిన పడ్డారు. వారి బృందం టోక్యోకు చేరుకోగానే ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. -
100 రోజుల పైగా డ్రామా.. ఎట్టకేలకు కదిలిన ఎవర్ గివెన్ నౌక
suez canal vs ever given ship settled: ఎవర్ గివెన్ షిప్ గుర్తుందా? అదేనండి మార్చి నెలలో సరకు సూయాజ్ కాలువలో వెళ్తూ టైం బాలేక అక్కడే అడ్డంగా ఇరుక్కుపోయింది కదా. ఇక అప్పటి నుంచి ఆ షిప్, దాని యాజమాన్యానికి నష్టాలు, కష్టాలు కంటిన్యు అవుతూనే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం షిప్ యాజమాన్యానికి వీటి నుంచి ఊరట లభించింది. సూయాజ్‌లో ఇరుక్కుపోయిన ఆ భారీ నౌక కదిలించడం కోసం కెనాల్ యంత్రాంగం వారం రోజులు అష్టకష్టాలు పడి చివరకు దాన్ని మళ్లీ కదిలేలా చేశారు. హమ్మయ్యా కదిలింది కదా! అనుకుంటే ఇక్కడే అసలు చిక్కు వచ్చింది. అది వారం రోజులు బ్లాక్ కావడంతో ఇతర షిప్‌లు రాకకు అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో కెనాల్ అథారిటీ రవాణా ఫీజును కోల్పోవడం వల్ల తీవ్ర నష్టాన్ని చూశారు. అలానే షిప్ కదిలికకు చేసిన ఖర్చును కలిపి మొదట 916 మిలియన్ డాలర్లను పరిహారాన్ని డిమాండ్ చేసినప్పటికీ తర్వాత 550 మిలియన్ డాలర్లను చెల్లించాలన్నారు. ఈ నేపథ్యంలో నష్టం పరిహారం ఇచ్చిన తర్వాతే నౌకను వదులుతామని ఈజిప్ట్ దానిని తన ఆధీనంలోకి తీసుకుంది. ఇక తాజాగా ఎవర్ గివెన్ నౌక యజమాని జపాన్‌కు చెందిన షూయీ కిసెన్ కైషా లిమిటెడ్ సంస్థ బుధవారం సూయాజ్ కాలువ యాజమాన్యంతో ఓ ఒప్పందానికి వచ్చింది. దీంతో వంద రోజులకుపైగా నడిచిన డ్రామాకు తెరపడింది. దీనిపై కోర్టులో కేసు కూడా దాఖలైంది. అయితే ఈ ఒప్పందం తర్వాత కోర్టు ఆ కేసు కొట్టేసింది. ఈ సెటిల్మెంట్తో ఎవర్ గివెన్ నౌక మధ్యధరా సముద్రం వైపు కదిలింది. -
వెనక్కి తగ్గని ఇజ్రాయెల్, హమాస్
గాజా సిటీ: ఇజ్రాయెల్, పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్ మధ్య ఉద్రిక్తతలు యథాతథంగా కొనసాగుతున్నాయి. గురువారం ఇరు వర్గాలు భీకరస్థాయిలో ఘర్షణకు దిగాయి. రాకెట్లతో నిప్పుల వర్షం కురిపించుకున్నాయి. మరోవైపు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఈజిప్టు రంగంలోకి దిగింది. ఉద్రిక్తతలను చల్లార్చి, సాధారణ స్థితిని నెలకొల్పడమే లక్ష్యంగా ఈజిప్టు మధ్యవర్తులు ఇజ్రాయెల్, హమాస్ ప్రతినిధులతో సంప్రదింపులు ప్రారంభించారు. ఒకవైపు చర్చలు సాగుతుండడగానే రాకెట్లతో దాడులు కొనసాగడం గమనార్హం. హమాస్ భారీ స్థాయిలో రాకెట్లతో ఇజ్రాయెల్ భూభాగంపై విరుచుకుపడింది. కొన్ని రాకెట్లు ముఖ్యనగరం టెల్ అవీవ్ దాకా దూసుకురావడం గమనార్హం. ఇజ్రాయెల్ సైన్యం సైతం ధీటుగా బదులిచ్చింది. గాజాపై తన అస్త్రాలను ఎక్కుపెట్టింది. ఇంకోవైపు గాజాలో అరబ్, యూదు ప్రజలు వీధుల్లో బాహాబాహీకి దిగారు. 13 మంది హమాస్ తీవ్రవాదులు హతం! గాజాలో హమాస్ తీవ్రవాదులు తలదాచుకుంటున్నట్లు భావిస్తున్న మూడు బహుళ అంతస్తుల భవనాలను ఇజ్రాయెల్ దళాలు ధ్వంసం చేశాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 83 మంది పాలస్తీనా పౌరులు మరణించారని, వీరిలో 17 మంది చిన్నారులు ఉన్నారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. తమ సభ్యులు 13 మంది అమరులైనట్లు హమాస్ తెలిపింది. హమాస్ దాడుల్లో ఏడుగురు ఇజ్రాయెల్ వాసులు ప్రాణాలు కోల్పోయారు. ‘ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్, దిమోనా, జెరూసలేం నగరాలపై బాంబులు వేయడం మాకు మంచి నీళ్లు తాగడం కంటే సులభం’ అని హమాస్ మిలటరీ విభాగం ప్రతినిధి ఒకరు ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఇజ్రాయెల్ అణు రియాక్టర్ దిమోనా సిటీలో ఉంది. హమాస్ తమ దేశంపై 1,200 రాకెట్లు ప్రయోగించగా, ఐరన్ డోమ్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్‌తో 90 శాతం రాకెట్లను నిర్వీర్యం చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. -
షాకింగ్: పురుషుడనుకుంటే.. గర్భవతని తెలిసింది
వార్సా: ఇన్నాళ్లు తాము పురుషుడిగా భావించిన ఓ ఈజిప్ట్ మమ్మీ గురించి ఆశ్చర్యకరమైన అంశాలు తెలిసి.. పురావస్తు శాస్త్రవేత్తలు షాక్ అయ్యారు. వారిని అంత ఆశ్చర్యానికి గురి చేసిన ఆ విషయం ఏంటంటే.. దాదాపు శతాబ్దానికి పైగా తాము పురుషుడిగా భావిస్తున్న మమ్మీ మహిళదని.. అందునా గర్భవతి అని తెలిసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ఆ వివరాలు.. 19వ శతాబ్దంలో పోలాండ్లోని నాసెంట్ యూనివర్శిటీ ఆఫ్ వార్సా పురాతన వస్తువులను సేకరించడం ప్రారంభించింది. ఆ సమయంలో పూజారిదిగా భావిస్తున్న ఓ మమ్మీని ఇక్కడకు తీసుకువచ్చారు. దాదాపు శతాబ్దానికి పైగా ఆ మమ్మీని హోర్-దేహుతి అనే పురాతన ఈజిప్టు పూజారికి చెందినదని భావించారు శాస్త్రవేత్తలు. ఈ క్రమంలో వార్సా మమ్మీ ప్రాజెక్ట్‌లోని శాస్త్రవేత్త మార్జెనా ఓజారెక్-స్జిల్కే నేషనల్ మ్యూజియంలో ఉన్న మమ్మీకి గురువారం సీటీ స్కాన్ నిర్వహిస్తుండగా ఓ అంశం ఆమెను ఆశ్యర్యానికి గురి చేసింది. ఈ సందర్భంగా ఓజారెక్-స్జిల్కే మాట్లాడుతూ.. ‘‘నేను సదరు మమ్మీ జననేంద్రియాలను పరిశీలిస్తుండగా.. లోపల నాకు చిన్న పాదం లాంటి ఆకారం కనిపించింది. దీని గురించి స్పష్టత కోసం శాస్త్రవేత్త అయిన నా భర్తను పిలిచి.. నేను గమనించని విషయం తనకు తెలిపాను. ఆయన దాన్ని పరిశీలనగా చూసి.. ‘‘అవును నీకు కనిపించింది పాదమే. ఈ మమ్మీ గర్భవతి. తన కడుపులో బిడ్డ ఉంది. ఆ పిండం వయసు 26-28 వారాల మధ్య ఉంటుంది’’ అని తెలిపారు’’ అన్నారు ఓజారెక్. ‘‘‘‘ఇన్నాళ్లు మనం పురుషుడుగా భావిస్తున్న ఈ మమ్మీ మహిళ. తన వయసు 28 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుంది’’ అని నా భర్త తెలిపారు. ఆయన చెప్పిన విషయం నన్ను షాక్‌కు గురి చేసింది. ఎందుకంటే దాదాపు 100 ఏళ్లకు పైగా సదరు మమ్మీని పురుషుడిగా భావిస్తున్నాం. తను ఇప్పుడు మహిళ అని.. అందునా గర్భవతి అని తెలిసి చాలా షాకయ్యాం’’ అన్నారు ఓజారెక్. ఓజారెక్ మాట్లాడుతూ.. ‘‘సదరు మహిళ మృతికి కారణం సరిగా తెలియలేయడం లేదు. కాకపోతే గర్భం వల్లనే ఆమె మరణించి ఉంటుందని భావిస్తున్నాం. ఈ కాలంలో అయితే మన దగ్గర ఆధునిక వైద్యం అందుబాటులో ఉంది. గర్భవతిగా ఉన్నప్పుడు ఏ సమస్యనైనా ముందుగా తెలుసుకునే వాళ్లం. కానీ అప్పట్లో అలా కాదు. పైగా మూఢనమ్మకాలు ప్రబలంగా ఉండేవి. ఇక ఈ మమ్మీ స్త్రీ అని.. అందునా గర్భవతి అని తెలిసిన నాటి నుంచి అనేక ప్రశ్నలు తలెత్తున్నాయి. పురాతన ఈజిప్టు సమాజంలో మహిళల జీవిన విధానం ఎలా ఉండేది.. ఈజిప్టు మతాచారాల ప్రకారం పిల్లలను ఎలా చూసేవారు.. గర్భంలోని పిండానికి కూడా పునర్జన్మ, ఆత్మ వంటివి వర్తిస్తాయని భావించేవారా వంటి తదితర విషయాల గురించి అధ్యాయనం చేయాల్సి ఉంది’’ అని ఓజారెక్ తెలిపారు. చదవండి: 3 వేల ఏళ్ల తర్వాత బయటపడిన ‘బంగారు నగరం’ -
ఈజిఫ్టులో ఘోర రైలు ప్రమాదం: 11 మంది మృతి
కైరో: ఈజిఫ్టులో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు ఈజిఫ్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉత్తర కైరోలోని బన్హాలో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పడంతో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు వంద మందికి పైగా గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని రక్షించడానికి అంబులెన్స్‌లు, వైద్య సిబ్బందిని తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్యాసింజర్ రైలులో ఉన్న ప్రయాణిలకు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగులు తీశారు. రైలు దేశ రాజధాని కైరో నుంచి మన్సౌరాకు వెళుతున్న సమయంలో నాలుగు బోగీలు హఠాత్తుగా పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటపై ఆ దేశ అధ్యక్షుడు అబ్దుల్ ఫట్టా అల్ సిసి విచారం వ్యక్తంచేశారు. రైలు ప్రమాద ఘటనపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అయితే రైలు పట్టాలకు తప్పడానికి గల కారణం మాత్రం ఇంకా తెలియరాలేదు. రైలు డ్రైవర్, ఇతర రైలు సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: అమెరికాలో మళ్లీ కాల్పులు -
ఈజిప్టులో ఘోర ప్రమాదం.. 20 మంది మృతి
కైరో: ఈజిప్టులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా పడిన ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ఘటన కైరో నుండి 320 కిలోమీటర్ల దూరంలో దక్షిణ ఈజిప్టు అసియుట్ దక్షిణ ప్రావిన్స్‌లోని రహదారిపై చోటు చేసుకుంది. అస్సియట్ గవర్నర్ ఎస్సామ్ సాద్ ప్రకటన ప్రకారం రాజధాని కైరో నుంచి అసియుట్‌కు వెళ్తున్న బస్సు, ట్రక్కును ఓవర్టేక్ చేస్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. రెండు వాహనాలు దగ్ధం కావడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు. కాగా దేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి ఏడాది వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. దేశ అధికారిక గణాంకాల ప్రకారం ఈజిప్టులో 2019 లో సుమారు 10,000 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇటీవలి సంవత్సరంలో 3,480 మందికి పైగా మరణించారు. 2018 లో 8,480 కారు ప్రమాదాలు జరగ్గా, 3,080 మందికి పైగా మరణించారు. -
ఈజిప్టులో ఘోర ప్రమాదం.. 20 మంది మృతి
-
సూయజ్ లో చిక్కుకున్న రాకాసి నౌకకు తప్పని కష్టాలు
సూయజ్ కాల్వలో ఒక వారం పాటు చిక్కుకున్నరాకాసి నౌక ‘ఎవర్ గివెన్’పై ఈజిప్ట్ ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. గత నెలలో సూయజ్ కాల్వలో నౌక చిక్కుకోవడంతో వాణిజ్య పరంగా భారీ నష్టం వచ్చిందని అక్కడి ప్రభుత్వం తెలిపింది. దీంతో బిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ పరిహారంపై ఈజిప్ట్ ప్రభుత్వ అధికారులతో ఎవర్ గివెన్ యాజమాన్యం చర్చిస్తోంది. ఈజిప్టు అధికారులు ఎవర్ గివెన్ నౌక సూయజ్ కాలువకు అడ్డంగా వారం పాటు నిలిచిపోవడంతో తమకు నష్టాలు వచ్చాయని, ఒక బిలియన్ డాలర్ల నష్ట పరిహారం చెల్లించేవరకూ దానిని వదిలేది లేదని చెబుతున్నారు. భారీ కార్గో షిప్ ప్రస్తుతం సూయజ్ కెనాల్ హోల్డింగ్ సరస్సులో ఉంది. ఇక్కడ అధికారులు, ఓడ నిర్వాహకులు దర్యాప్తు కొనసాగుతున్నారని చెప్పారు. భారీ నౌక యజమానులతో ఆర్థిక పరిష్కారం కోసం అధికారులు చర్చలు జరుపుతున్నారని సూయజ్ కెనాల్ చీఫ్ గతంలో చెప్పారు. లెఫ్టినెంట్ జనరల్ ఒసామా రాబీ అసోసియేటెడ్ ప్రెస్‌తో మాట్లాడుతూ.. రాకాసి నౌక ఎవర్ గివెన్ జపనీస్ యజమాని షోయి కిసెన్ కైషా లిమిటెడ్‌తో చర్చలు త్వరగా ముగుస్తాయని తాను ఆశిస్తున్నానని చెప్పారు. కాలువ నిర్వహణతో పరిష్కరించుకోవడం కంటే కేసును కోర్టు ముందు తీసుకురావడం సంస్థకు ఎక్కువ హానికరం అని ఆయన అభిప్రాయపడ్డారు. గత వారం సూయజ్ కెనాల్ అథారిటీ 1 బిలియన్ డాలర్లకు పైగా నష్టపరిహారాన్ని ఆశిస్తున్నట్లు కాలువ చీఫ్ చెప్పారు, నష్టాల సమస్య చట్టపరమైన వివాదంగా మారితే ఓడను కాలువ నుండి బయటకు వెళ్ళడానికి అనుమతించదని హెచ్చరించారు. పరిహారం చెల్లించడానికి ఎవరు బాధ్యత వహిస్తారో అతను అప్పుడు పేర్కొనలేదు. చదవండి: డేంజర్ జోన్లో వాట్సప్ యూజర్లు! -
3 వేల ఏళ్ల తర్వాత బయటపడిన ‘బంగారు నగరం’
కైరో: ఈజిప్ట్‌లో పురాతత్వవేత్త శాస్త్రవేత్తల బృందం చరిత్రకు సాక్ష్యంగా నిలిచే అత్యంత పురాతన పట్టణాన్ని గుర్తించారు. 3 వేల సంవత్సరాల క్రితం నాటి ‘లాస్ట్ గోల్డెన్ సిటీ’ అనే పేరుగల నగరాన్ని శాస్త్రవేత్తల బృందం ఈజిప్టుకు దక్షిణాన గల లక్సోర్లో గుర్తించింది. ఈజిప్ట్‌లో గతంలో బయటపడిన టుటన్ఖమాన్ సమాధి తర్వాత ఈ పట్టణం అత్యంత ప్రాముఖ్యత కలిగినది అని శాస్త్రవేత్తలు తెలిపారు. ‘లాస్ట్ సిటీ’గా పిలివబడుతన్న ఈ పట్టణం పేరు ఏతెన్. 1391 నుంచి 1353 బీసీ మధ్యకాలంలో పురాతన ఈజిప్ట్‌ని పాలించిన 18 వ రాజవంశానికి చెందిన తొమ్మిదవ రాజు కింగ్ అమెన్హోటెప్ III ఈ నగరాన్ని నిర్మించినట్లు చరిత్ర వెల్లడిస్తుందని శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. లక్సోర్ పశ్చిమ ఒడ్డున నిర్మించిన ఈ నగరం ఆ యుగంలో అతిపెద్ద పరిపాలనా, పారిశ్రామిక కేంద్రంగా విలసిల్లినట్లు చరిత్ర వెల్లడిస్తుంది. "ఈ లాస్ట్ సిటీ ఆవిష్కరణ.. టుటన్ఖమాన్ సమాధి తరువాత రెండవ అతి ముఖ్యమైన పురావస్తు ఆవిష్కరణ" అని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో ఈజిప్టు ప్రొఫెసర్, ఈ మిషన్ సభ్యుడు అయిన బెట్సీ బ్రయాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆవిష్కరణ సామ్రాజ్యం సంపన్న స్థితిలో ఉన్నప్పుడు పురాతన ఈజిప్షియన్ల జీవితానికి సంబంధించిన అరుదైన సమాచారాన్ని ఇస్తుంది" అన్నారు బెట్సీ. పురాతన ఈజిప్టును పాలించిన రాజవంశాల గురించి దేశవ్యాప్తంగా సాగుతున్న అధ్యయనంలో ఇటీవల కాలంలో కనుగొన్న పురావస్తు పరిశోధనల శ్రేణిలో ‘‘లాస్ట్ సిటీ’’ ఆవిష్కరణ తాజాది. కరోనా వైరస్ మహమ్మారి, ఇస్లామిస్ట్ మిలిటెంట్ దాడులు, రాజకీయ అస్థిరత వల్ల గత కొద్ది కాలంగా తీవ్ర ఒడిదుడుకులకు గురైన ఈజిప్ట్ పర్యాటక రంగానికి ఇటువంటి ఆవిష్కరణలు పూర్వ వైభవాన్ని తీసుకువస్తాయని.. పర్యాటకులను ఆకర్షిస్తాయని ఈజిప్ట్ ప్రభుత్వం భావిస్తోంది. ఇక గతంలో చాలా విదేశీ బృందాలు ఈ నగరం కోసం పరిశోధించాయని.. కానీ వారు ఎవరు దీన్నీ గుర్తించలేకపోయారని బెట్సీ తెలిపాడు. ఈ నగరం అమెన్హోటెప్ III కాలం నుంచి ఆయన కుమారుడు, టుటింఖ్మాన్ తండ్రి అమెన్హోటెప్ IV వరకు ఉన్నత స్థితిలో ఉన్నదని చరిత్ర వెల్లడిస్తోంది. నగరం వీధులు ఇళ్ళతో చుట్టుముట్టబడి ఉన్నాయని శాస్త్రవేత్తల బృందంలో సభ్యుడైన హవాస్ తెలిపాడు. ఈ నగరంలో కొన్ని గోడలు దాదాపు 10 అడుగుల ఎత్తులో ఉన్నాయి. కింగ్ అమేన్హోటెప్ III ముద్రలను కలిగి ఉన్న వైన్ నాణాలు, ఉంగరాలు, స్కార్బ్‌లు, కుండలు, మట్టి ఇటుకలపై దొరికిన చిత్రలిపి శాసనాల ద్వారా పురావస్తు బృందం ఈ నగరం వర్థిల్లిన కాలాన్ని గుర్తించింది. నగరం దక్షిణ భాగంలో, పురావస్తు శాస్త్రవేత్తలు ఆహారాన్ని నిల్వ చేయడానికి కుండలు, ఓవెన్లు ఉన్న బేకరీతో పాటు పెద్ద వంటగదిని కనుగొన్నారు. ఒక ప్రవేశ ద్వారం మాత్రమే ఉన్న జిగ్‌జాగ్ గోడతో కంచె వేయబడిన పరిపాలనా, నివాస జిల్లాను వారు కనుగొన్నారు. ఇది భద్రత కల్పించడానికి ఉద్దేశించినదిగా భావిస్తున్నారు. మూడవ ప్రాంతంలో ఒక వర్క్‌షాప్ ఉంది. ఆలయం, సమాధులతో పాటు తాయెత్తులు, ఆభరణాలను తయారు చేయడానికి ఉపయోగించే కాస్టింగ్ అచ్చులను బృందం కనుగొంది. "తవ్విన ప్రాంతాలన్నిటిలో, స్పిన్నింగ్, నేత వంటి పారిశ్రామిక కార్యకలాపాలలో ఉపయోగించే అనేక సాధనాలను మా బృందం గుర్తించింది’’ అని శాస్త్రవేత్తల బృందం తెలిపింది. నగరంలోని ఇతర ప్రాంతాల్లో ఒక గదిలో రెండు ఆవులు లేదా ఎద్దుల సమాధులు కనుగొన్నారు. మరొక ప్రాంతంలో ఒక వ్యక్తి అవశేషాలు గుర్తించారు. నగరానికి ఉత్తరాన ఒక పెద్ద స్మశానవాటిక, అలాగే రాతి నుంచి కత్తిరించిన సమాధుల సమూహం బయటపడినట్లు వెల్లడించారు. చదవండి: మనుషుల్ని తిన్నారు.. పందుల్ని వదిలేశారు వామ్మో.. మమ్మీల జులుస్.. ఎంత భయంకరంగా ఉందో! -
ఆ నౌక నేను నడపలేదు.. నాపై నిందలు వేస్తున్నారు!
పిడుగు ఆకాశంలోంచి ఊడిపడుతుంది. బడబాగ్ని నిప్పుకణంలోంచి జ్వలిస్తుంది. ప్రకంపన పుడమి నుంచి ఉద్భవిస్తుంది. సుడిగుండం సముద్రంలో జనిస్తుంది. కానీ.. మహిళపై నింద ఎక్కడి నుంచి ఊడి పడి, ఎలా జ్వలించి, ప్రకంపించి, సుడిగుండమై ఆమె జీవితాన్ని అల్లకల్లోలం చేస్తుందో చెప్పలేం. ప్రస్తుతం మర్వా ఎల్సెల్హదార్ అనే నేవీ కెప్టెన్ అలాంటి ఒక నింద నుంచి బయటపడే ప్రయత్నంలోనే ఉంది. మర్వా ఎల్సెల్హదార్ ఈజిప్టు నేవీలోని మెరైన్ విభాగంలో తొలి మహిళా కెప్టెన్. 29 ఏళ్ల యువతి. ఐదేళ్ల క్రితమే ఆమె నేవీలో చేరింది. ఇటీవల అక్కడి ‘అరబ్ న్యూస్’లో ఆమె గురించి పెద్ద కథనం వచ్చింది. తెల్ల యూనిఫామ్‌లో ఉన్న మర్వా చక్కటి ఫొటో ఒకటి పెట్టి ఈజిప్టు మెరైన్‌లో తొలి కెప్టెన్‌గా ఆమె సక్సెస్ స్టోరీ రాసింది ఆ పత్రిక. మెరైన్‌లో చేరిన ఐదేళ్ల తర్వాత ఆమెపై ఈ తాజా స్టోరీ రాయడానికి ‘అరబ్ న్యూస్’ చెప్పిన కారణం ఆలోచింపజేసే విధంగా ఉంది. ‘ఒక మహిళా మెరైన్ కెప్టెన్ అవడం గొప్పే. అంతకన్నా గొప్ప.. ఆ మహిళ మెరైన్ కెప్టెన్‌గా కొనసాగడం!’ అనే వాక్యంతో ఆ వార్తా కథనం ముగిసింది. నిజమే. మర్వా మెరైన్‌లో చేరిన తొలిరోజు నుంచీ ప్రతికూల పరిస్థితులను నెగ్గుకుంటూ వస్తోంది. 2015 వరకు ఈజిప్టు నేవీ మెరైన్‌లో మహిళా కెప్టెన్ ఒక్కరూ లేరు. పూర్తిగా పురుష ప్రపంచం అది. ఆ ప్రపంచంలోకి ధైర్యం చేసి వెళ్లింది మర్వా. అరబ్ న్యూస్‌లో మొన్న మార్చి 22న వచ్చిన ఆమె సక్సెస్ స్టోరీ కొన్ని గంటల్లోనే ట్విట్టర్లో, ఫేస్బుక్లో అనేకసార్లు షేర్ అయింది. అయితే రెండు రోజుల తర్వాత అదే ఫొటోతో ఇంటర్నెట్లో ఆమెను నిందిస్తూ ఒక వార్త వైరల్ అయింది! ఆ వార్త మర్వా చేతిలోని ఫోన్ వరకు చేరింది. మధ్యలోని ఆ కొద్ది గంటల్లోనే ఏం జరిగింది? సూయజ్ కెనాన్‌లో మార్చి 23న ‘ఎవర్ గివెన్’ అనే నౌక ‘బ్లాక్’ అయింది. కాలువకు రెండు వైపులా వాహనాల రవాణా స్తంభించిపోయింది. ఆరు రోజులు కష్టపడి నౌకను మళ్లీ దారిలో పెట్టగలిగారు. అయితే ఈ రెండు వారాల్లో తనపై వైరల్ అవుతూ వచ్చిన నిందను ‘క్లియర్’ చేసుకోడానికి నానా అవస్థలు పడుతోంది మర్వా. ఇక ఆమెపై పడిన నింద ఏమిటంటే.. ఎవర్ గివెన్‌ను ఆమే నడుపుతున్నారని, ఆమె సరిగా నడపలేకపోవడం వల్లనే ఆ నౌక.. కెనాల్లో అడ్డం తిరిగి, ప్రపంచ వాణిజ్య రంగానికి లక్షల కోట్ల ఆర్థిక నష్టాన్ని తెచ్చిపెట్టిందనీ! ఇది మామూలు నింద కాదు. ఒక దేశం మాత్రమే తట్టుకోగల నింద. వ్యక్తులు భరించలేరు. తన గురించి అలాంటి అబద్ధపు వార్త ఒకటి వైరల్ అవుతున్నట్లు తెలియగానే మర్వా మొదట ఖిన్నురాలైంది. ఏమిటి ఆ నౌకకు, తనకు సంబంధం! తను నేవీలో కెప్టెనే తప్ప, సరకులను చేరవేర్చే ఓడకు కెప్టెన్ కాదు. ఎక్కడి నుంచి ఎక్కడికి కలిపారు! ఆలోచించిన కొద్దీ మర్వా మళ్లీ మళ్లీ నివ్వెరపోతోంది. పురుషాధిక్య ప్రపంచంలో ఇలాంటి నివ్వెరపాట్లు ప్రతి మహిళకూ అనుభవంలోనికి వచ్చేవేనని ఆమెకు తెలియంది కాదు. ఒక మహిళపై వచ్చిన నిందను నమ్మేవారు నమ్ముతారు. కానీ, పుట్టించేవాళ్లు ఎలా పుట్టిస్తారు?! ‘‘నాకొకటి అనిపిస్తోంది. అలవాటు లేని రంగంలోనైనా అరుదైన విజయం సాధించిన మహిళలకు ఇలాంటివి తప్పవు. నాకూ అలాగే జరిగి ఉండొచ్చు’’ అంటోంది మర్వా. సముద్రంపై ఒక మహిళ ఉద్యోగం చేస్తోందంటే ఆమెను వీలైనంత త్వరగా ‘ఒడ్డుకు చేర్చేందుకు’ అక్కడి ప్రతికూలతలు అనుక్షణం అలల్లా నెట్టేస్తుంటాయి. ‘ఇంటర్నేషనల్ మారీటైమ్ ఆర్గనైజేషన్’ నివేదిక ప్రకారం ప్రపంచం మొత్తం మీద కేవలం 2 శాతం మంది మహిళలు మాత్రమే సముద్ర ఉద్యోగాలు చేస్తున్నారు. మర్వాకు సముద్రం అంటే ఇష్టం. ఆ ఇష్టాన్ని చూసి ఆమె సోదరుడు ఆమె పేరును ఎ.ఎ.ఎస్.టి.ఎం.టి. (అరబ్ అకాడమీ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ మ్యారిటైమ్ ట్రాన్స్పోర్ట్)లో నమోదు చేయించాడు. అరబ్ లీగ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రాంతీయ విశ్వవిద్యాలయం అది. ఈజిప్టులోని అలెగ్జాండ్రి యా నగరంలో ఉంది. అయితే పురుష అభ్యర్థులకే ఆ యూనివర్సిటీలో ప్రవేశం. మహిళలెందుకు చేరకూడదు అని మర్వా న్యాయపోరాటం చేసింది. ఆ పోరాటంతో స్త్రీలకూ తొలిసారి నేవీ మెరైన్‌లో ప్రవేశం లభించింది. పట్టు పట్టి చేరాక, నిలదొక్కుకోడానికి మర్వాకు మళ్లీ ఒక పోరాటం చేయడం అవసరమైంది! అదొక పురుష ప్రపంచం. అంతా తనకన్నా వయసులో పెద్దవాళ్లు. మహిళవు, నీకెందుకు ఇవన్నీ అన్నట్లే ఉండేది వారి చూపు, మాట. ట్రైనింగ్ పూర్తయ్యే సరికి మర్వాకు సప్త సముద్రాలలో మనకలేసి వచ్చినంత పనైంది. ‘‘నా మానసిక స్థితిని స్థిరంగా ఉంచుకునేందుకు నేను చాలా కష్టపడవలసి వచ్చేది’’ అని మర్వా ఈ మధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బహిర్గతం చేసింది. కోర్సులో పట్టభద్రురాలయ్యాక మర్వా ఫస్ట్ మేట్ (ఫస్ట్ ఆఫీసర్) ర్యాంకుకు చేరుకుంది. ‘ఐదా 4’ శిక్షణ నౌకకు కెప్టెన్ అయింది! సూయజ్ కాలువను 2015లో ఆధునీకరించాక అందులో ప్రయాణించిన తొలి నౌక ‘ఐదా’ నే. అప్పుడే మర్వా.. సూయజ్ కెనాల్‌పై అతి చిన్న వయసులో నౌకను నడిపిన ఈజిప్టు మహిళగా గుర్తింపు పొందింది. ఆ గుర్తింపును దెబ్బతీసేలా ఇప్పుడు ఏ మూల నుంచో ఆమెపై నింద వచ్చి పడింది! ‘ఎవర్ గివెన్’ నౌకను నడిపి, కెనాల్ బ్లాక్ అవడానికి కారణం అయిందని!! అయితే అది నిలబడే నింద కాదని, సోషల్ మీడియా వికృత కల్పననేని వెనువెంటనే తేలిపోయింది. ఇటీవల సూయజ్ కెనాల్లో ఇరుక్కుపోయిన ‘ఎవర్’ నౌక; (కాలువలో అడ్డుగా, విడిగా) ఎవర్ గివెన్ నౌక ఆ రోజు సూయజ కెనాల్లో బ్లాక్ అయిన సమయానికి మర్వా అక్కడికి కొన్ని వందల మైళ్ల దూరంలోని అలెగ్జాండ్రియాలో ఐదా 4 నౌకలో ఫస్ట్ మేట్‌గా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈజిప్టు సముద్ర భద్రతా సంస్థకు చెందినా ఐదా ఆ రోజు ఎర్ర సముద్రంలోని లైట్ హౌస్‌కు అవసరమైన సామగ్రిని తీసుకువెళుతోంది. అందులో కెప్టెన్‌గా ఉన్న మర్వా ఫొటోను ఎవర్ గివెన్‌కు కెప్టెన్‌గా ఉన్నట్లుగా మార్పులు చేసి నెట్లో కొందరు తప్పుడు ప్రచారం చేశారు. ఆ ప్రచారాన్ని ఈజిప్టు నేవీనే స్వయంగా ఖడించడంతో మర్వా కాస్త ఊపిరి పీల్చుకుంది. సోషల్ మీడియాలో కూడా అధిక శాతం మర్వాకు మద్దతుగా నిలబడ్డారు. అయినా మర్వా గురించి ఈజిప్టు నేవీలో గానీ, ఈజిప్టులో గానీ తెలియనివారు లేరు. ధైర్యంగల అమ్మాయి. 2017 మహిళా దినోత్సవం సందర్భంగా నాటి అధ్యక్షుడు అబెల్ ఫతా ఆమెను సత్కరించారు కూడా. వచ్చే నెలలో మర్వా కెప్టెన్ ర్యాంకుకు చివరి పరీక్ష పూర్తవుతుంది. అప్పుడామె రాబోయే యవతరానికి శిక్షణ నిచ్చే కెప్టెన్ కూడా అవుతారు. ‘‘మనం ఒక ఉద్యోగాన్ని ఇష్టపడి చేస్తున్నప్పుడు మన మీద వచ్చే విమర్శలు మన పై, మన పనిపై ఏమాత్రం ప్రతికూల ప్రభావం చూపలేవు’’ అంటోంది మర్వా. l -
వామ్మో.. మమ్మీల జులుస్.. ఎంత భయంకరంగా ఉందో!
ఇరవై రెండు మంది రాజులు, రాణులు ఒకే దారిలో ఒకే వరుసలో ఒకరి వెనుక ఒకరు రథంపై ఊరేగింపుగా వెళుతుంటే కేవలం అదొక ఉత్సవంగా మాత్రమే ఉండదు. కన్నుల పండుగైన మహోత్సవంలా ఉంటుంది. ఈజిప్టు రాజధాని కైరోలోని ప్రజలు వీధులలో బారులు తీరి ఈరోజు (శనివారం) అటువంటి మహోత్సవాన్నే (జులుస్)వీక్షించబోతున్నారు. ఆశ్చర్యంగా.. అబ్బురంగా.. భయం భయంగా!! ఆశ్చర్యమూ, అబ్బురమూ ఎందుకో చెప్పనక్కర్లేదు. భయం మాత్రం.. ఆ రాజులు, రాణులు ‘మమ్మీలు’ అయినందుకు! భయం అంటే భయం అని కాదు. థ్రిల్లింగ్‌గా అనుకోండి. నైట్రోజన్ నింపిన పెట్టెల్లో ఉంచి తరలిస్తున్నారు. మమ్మీలను మ్యూజియంలో చూడ్డం ఆసక్తిగానే ఉంటుంది. ఏళ్ల నాటి చక్రవర్తి లేదా మహారాణ .. చనిపోయినా కూడా చెక్కు చెదరకుండా ఒక అద్దాల పెట్టె లోపలి నుంచి వెల్లకిలా పడుకుని కనిపిస్తున్నప్పుడు కనురెప్ప వేయకుండా నిలబడి తదేకంగా చూస్తూ వేల ఏళ్ల కాలంలోకి ప్రయాణించవచ్చు. అవే మమ్మీలు మనం రోజూ వెళ్లొచ్చే రహదారిలో రథంపైన ఒక బారుగా కదులుతూ కనిపిస్తుంటే వేల ఏళ్ల నాటి ఆ కాలమే ఇప్పుడు మన కళ్ల ముందు ప్రయాణిస్తున్నట్లుగా ఉంటుంది. ఇవాళ కైరోలో స్థానికులకు అలాంటి అపూర్వమైన సందర్భం అనుభవంలోకి రాబోతోంది. పద్దెనిమిది మంది మహారాజులు, నలుగురు మహారాణులు ఒకరి వెంట ఒకరు సెంట్రల్ కైరోలోని ‘ఈజిప్షియన్ మ్యూజియం’ నుంచి బయల్దేరి అక్కడి సమీపంలోనే ఉన్న ‘నేషనల్ మ్యూజియం ఆఫ్ ఈజిప్షియన్’లో ‘కొలువు తీరుతారు’. ఈ నెల 18 నుంచి ఈ మమ్మీలన్నీ ఆ కొత్త ప్రదేశంలో తమ యథా‘పూర్వ’స్థితికి కొనసాగింపు గా సందర్శకుల వీక్షణ కోసం ఎదురు చూస్తుంటాయి. ‘మ్యూజియంలో ఉన్నవాటిని ఎప్పుడైనా వెళ్లి చూడవచ్చు. మ్యూజియంలోంచి రోడ్డు మీదకు వచ్చిన మమ్మీలను చూడ్డానికే త్వరపడాలి. మళ్లీ అవకాశం ఎప్పటికో గానీ రాదు’ అని ఈజిప్టు పురావస్తు శాఖ చాటింపు వేయిస్తోంది. బహుశా ఈ రోజు కనీసం 40 నిముషాల పాటు కైరో ప్రధాన రహదారి స్తంభించిపోవచ్చు. ఇంతవరకు మమ్మీలు ఉన్న ‘ఈజిప్షియన్ మ్యూజియం’ నుంచి ఇప్పుడు తరలబోతున్న ‘నేషనల్ మ్యూజియం ఆఫ్ ఈజిప్షియన్ సివిలైజేషన్’కి మధ్య దూరం 8 కి.మీ. సాధారణ ప్రయాణ దూరం 13 నిముషాలు. పదమూడు నిముషాల ప్రయాణానికి మమ్మీలకు నలభై నిముషాలు పట్టబోతోందంటే.. మమ్మీలు ఎంత నెమ్మదిగా, ఎంత పదిలంగా, ఎంత కదిలీ కదలనట్లుగా బట్వాడా అవబోతున్నాయో చూడండి. మమ్మీల రథయాత్ర (అవును. అలంకరించిన రథాల మీదనే గాజు పెట్టెలలోని మమ్మీలను అమర్చి, చుట్టూ ‘పొత్తిగిలి’ ఏర్పాటు చేసి ప్రాణం పోకుండా వాటిని తీసుకెళతారు). ఆల్రెడీ ప్రాణం పోయిన వాటికి మళ్లీ ప్రాణం పోవడం ఏమిటి? ఇది పురావస్తు ప్రేమికుల భాష. ప్రాణం పోయాక కూడా మమ్మీలు వేల ఏళ్లపాటు భద్రంగా ఉన్నాయంటే ప్రాణంతో ఉన్నట్లుగా వారు భావిస్తారు. కదలికల వల్ల కాళ్లో, వేళ్లో, కళ్లో కాస్త చెదిరినా వాటి ప్రాణం పోయినట్లే. మళ్లీ వాటిని అతికించడానికి ఓ పెద్ద సర్జరీనే అవసరం అవుతుంది. సర్జరీ చేసినట్లు కనిపిస్తే అప్పుడది అతికించినట్లే అవుతుంది తప్ప అమరిక అవదు. అందుకే అంత జాగ్రత్త. ఈ మహా ఊరేగింపునకు ఈజిప్టు ప్రభుత్వం ‘ఫారోస్ గోల్డెన్ పరేyŠ ’ అనే పేరు పెట్టింది. ప్రాచీన ఈజిప్టు పాలకుల్ని ఫారోలు అంటారు. అందుకే పరేడ్‌కు ఆ పేరు. ఈ పరేడ్ ఒక క్రమబద్ధమైన విధానంలో జరుగుతుంది. ముందు వయసులో పెద్దవారు, తర్వాత వారికన్నా చిన్నవారు. ఇదీ మమ్మీల రాజులు, మమ్మీ రాణుల వరుస. మమ్మీలను ఉంచిన రథాల అలంకరణ పూర్తిగా ఈజిప్టు సంప్రదాయ శైలిలో ఉంటుంది. అలంకరణ రథానికే తప్ప మమ్మీల గాజు పెట్టెలకు కాదు. మమ్మీలు ఇప్పుడున్న మ్యూజియం శతాబ్దం క్రితం నాటిది. తరలబోతున్న మ్యూజియం ఇటీవలి కాలం నాటిది. 2017 లో ప్రారంభం అయింది. మమ్మీలను ఆ కొత్త మ్యూజియంలో దించాక వాటిని కాస్త ఎత్తున, ఆధునీకరించిన కుదుళ్లలో వీక్షలకు మరింత చక్కగా కనిపించేలా అమర్చుతారు. మిగతా పరిరక్షణ విధానమంతా మామూలే. సమతుల ఉష్ణోగ్రతల వద్ద మమ్మీలను ఉంచడం ప్రధానం. అందుకోసం కొత్త మ్యూజియంలో మెరుగైన ఏర్పాట్లు ఉన్నాయి. మ్యూజియంలో అవసరం లేదు కానీ.. రథయాత్రలోనే మమ్మీలకు గట్టి ‘స్థిర’ భద్రతలు ఉండాలి. ప్రయాణ మార్గంలో ఎగుడు దిగుళ్లను ఇప్పటికే చదును చేసి ఉంచారు. ఒక్కో మమ్మీని పెట్టిన పెట్టె పసిడివర్ణంలోని ఒక్కో రథంలో ఉంటుంది. ఆ రథంపై ఆ మమ్మీ పేరు, ఏ రాజ్యానికి పాలకుడు / పాలకురాలు అనే వివరాలు ఉంటాయి. అందరి కన్నా ముందు వరసలో రెండవ సీకెనార్ తావో చక్రవర్తి రథం ఉంటుంది. క్రీ.పూ. 1560–1555 కాలం నాటి పాలకుడు ఆయన. ‘ధైర్యవంతుడు’ అని పేరు. ఆయన వెనుకే తొమ్మిదవ రామ్సీస్ మమ్మీ రథం కదులుతుంది. క్రీ.పూ. 12వ శతాబ్దం చక్రవర్తి రామ్సీస్. ఆ వెనుక రెండవ రామ్సీస్ చక్రవర్తి, ఆ వెనుక మహా రాణి హాట్షిప్సట్. అతి శక్తిమంతురాలిగా ఆమె ప్రసిద్ధి. ఆ వెనుక ఒకరొకరుగా వయసుల వారీగానే కాకుండా చారిత్రక ప్రాధాన్యాన్ని బట్టి కూడా మెల్లిగా ‘కదులుతారు’. వాళ్ల కాలమాన ప్రకారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ రథయానం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సాగుతుంది. ఊరేగింపులో చక్కటి వాద్య ధ్వనులు ఉంటాయి. ఈజిప్టు కళాకారుల నృత్యాలు ఉంటాయి. ఈ తతంగం అంతా లైవ్‌లో టీవీలో ప్రసారం అవుతుంది. దొరికిన చోటు కైరోలోని చరిత్రాత్మక ప్రాంతమైన ‘తహ్రీర్ స్క్వేర్’ లో ఉన్న ‘ఈజిప్షియన్ మ్యూజియం’లో గత వందేళ్లుగా ఈ 22 రెండు మమ్మీలు ఉన్నాయి. 1881 నుంచి, ఈజిప్టులో నైలు నదికి తూర్పుఒడ్డున ఉన్న లక్సర్ నగరంలో జరుగుతూ వస్తున్న పురావస్తు అన్వేషణల్లో బయట పడిన ఈ మూడు వేల ఏళ్ల నాటి ఈ మమ్మీలను ఈజిప్షియన్ మ్యూజియంకి చేర్చాక, 1950 లలో ఒక చిన్న అద్దాల గదిలోకి మార్చి, సందర్శకుల వీక్షణ కోసం ఒక దాని పక్కన ఒకటిగా పెట్టి, వాటిపై ఆ మమ్మీలు ఎవరివో వివరాలు రాసి ఉంచారు. డెబ్బై ఏళ్ల తర్వాత ఇప్పుడు తొలిసారి వీటిని నేషనల్ మ్యూజియంలోకి మార్చడం కోసం నైట్రోజన్ నింపిన పెట్టెల్లో ఉంచి తరలిస్తున్నారు. -
ఓడా.. ఓడా.. ఎందుకాగావు?
సూయెజ్: ఈజిప్టులోని ప్రఖ్యాత సూయెజ్ కాలువలో ఎవర్‌గివెన్ నౌక అడ్డం తిరగడం, దీంతో ప్రపంచ వాణిజ్యానికి దాదాపు వారం పాటు విఘాతం కలగడంపై విచారణ షురూ అయింది. వారం ప్రయత్నాల అనంతరం నౌకా ప్రతిష్ఠంభన ముగిసి తిరిగి నౌకల పయనం ఆరంభమవడంతో ఇప్పుడందరి దృష్టి అసలేం జరిగిందనే అంశంపైకి మరలింది. ఈజిప్టు ప్రభుత్వం, బీమా సంస్థలు, నౌకా సంస్థలతో పాటు పలువురు ఈ అంశంపై వివరాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కాలవ గట్ల ఆధునీకరణ, నౌకల రిపేరు వ్యయాలు, నౌకల కార్గో షిప్మెంట్ ఇన్సూ్యరెన్సుల్లాంటి పలు అంశాలు చర్చకురానున్నాయి. ఎవెర్గివెన్ నౌక ఓనర్ జపనీస్ కంపెనీ కాగా, దాన్ని నిర్వహిస్తున్నది తైవాన్ కంపెనీ, బయలుదేరింది పనామా నుంచి కాగా ప్రస్తుతం ఈజిప్టులో ఉంది, నౌకా సిబ్బంది భారతీయులు. దీంతో ఈ నౌక విషయం పలు దేశాలతో ముడిపడిఉందని షిప్పింగ్ నిపుణుడు జాన్కోనార్డ్ అభిప్రాయపడ్డారు. రోజుల తరబడి చిక్కుకుపోవడంతో నౌకకు భారీగానే డ్యామేజి జరిగి ఉంటుందంటున్నారు. సమగ్ర విచారణ కావాలి ప్రతిష్ఠంభనపై జరిగే విచారణలో పాల్గొంటామని నౌక సొంతదారైన జపాన్ కంపెనీ షోయి కిసెన్ కైషా తెలిపింది. అయితే విచారణ సమయంలో ఏ విషయాలు బహిర్గతం చేయరాదంటూ ఈ విషయంపై బహిరంగ ప్రకటనకు నిరాకరించింది. నౌక ఎందుకు నిలిచిపోయింది, నౌకకు ఏమి అడ్డం తగిలింది, నౌకకు రిపేర్లు ఎక్కడ చేయిస్తారు, ప్రమాద సమయంలో నౌకా వేగం ఎంత తదితర అంశాలనేవీ చెప్పలేమని పేర్కొంది. మరోవైపు నౌక కారణంగా జరిగిన రోజూవారీ నావిక నష్టాలు(పర్డే మారిటైమ్ లాస్) బిలియన్ డాలర్లలో ఉంటాయని, ఇవన్నీ క్రమంగా దావాల రూపంలో బయటకు వస్తాయని నిపుణులు భావిస్తున్నారు. నౌకకు 300 కోట్ల డాలర్ల మేర బీమా ఉంది, కానీ ఈ బీమా సంస్థలేవీ బడా బీమా సంస్థలు కావు. ప్రస్తుతానికి నౌకా చిక్కుదలను విడిపించేందుకు అయిన ఖర్చులను కెనాల్ అథార్టీకి ఎవెర్ గివెన్ ఓనర్ చెల్లిస్తుందని అంతర్జాతీయ లీగల్ సంస్థ క్లైడ్ అండ్ కో తెలిపింది. నౌకపై కెనాల్ అథార్టీ పెనాల్టీ విధించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ విషయంలో పూర్తి స్థాయి విచారణ జరపాలని కంపెనీ కోరుతోంది. కెనాల్‌లోని నౌకా ట్రాఫిక్ క్లియరయ్యేందుకు మరో పదిరోజులు పట్టవచ్చని అంచనా. నౌక అడ్డం తిరగడంతో పలు నౌకలు సూయజ్ కెనాల్ మార్గం బదులు కేప్ ఆఫ్ గుడ్‌హోప్ మీదుగా ప్రయాణం చేయాల్సి వచ్చింది. చదవండి: ‘ఎవర్ గివెన్’ ఎట్టకేలకు కదిలింది -
‘ఎవర్ గివెన్’ ఎట్టకేలకు కదిలింది
సూయెజ్(ఈజిప్ట్): సూయెజ్ కాలువలో కూరుకుపోయిన అత్యంత భారీ కంటెయినర్ ఓడ ‘ఎవర్ గివెన్’ ఎట్టకేలకు కదిలింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దాదాపు వారం క్రితం ఈ ఓడ.. అంతర్జాతీయ సరుకు రవాణాలో కీలకమైన సూయెజ్ కాలువలో అడ్డం తిరిగి చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. దాంతో సూయెజ్ కాలువలో సరుకు రవాణా ఒక్కసారిగా ఆగిపోయింది. వారం రోజులుగా అంతర్జాతీయ సరుకు రవాణా నిలిచిపోయి, వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో ఆ భారీ రవాణా నౌకను కదిలించేందుకు అంతర్జాతీయ నిపుణులు గత వారం రోజులుగా చేస్తున్న కృషి సోమవారానికి ఫలించింది. వాతావరణ పరిస్థితులు, పోటెత్తిన అలలు కొంతవరకు వారికి సహకరించాయి. కూరుకుపోయిన నౌక భాగాన్ని కదిలించేందుకు ఒకవైపు డ్రెడ్జింగ్ చేస్తూ, మరోవైపు 10 టగ్ బోట్లతో వెనక్కు లాగుతూ నిపుణులు ప్రయత్నించారు. అలాగే, నౌక చుట్టూ 18 మీటర్ల లోతు వరకు 27 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తొలగించారు. అనంతరం, కెనాల్ ఉత్తర, దక్షిణ తీరాలకు మధ్యనున్న వెడల్పైన ‘గ్రేట్ బిట్టర్ లేక్’ వద్దకు 2.2 లక్షల టన్నుల బరువైన ఆ నౌకను తీసుకు రాగలిగారు. అక్కడ ఆ నౌకను క్షుణ్నంగా పరిశీలిస్తారు. నౌక సాంకేతిక సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. నౌక కదులుతున్న దృశ్యాలను ఉపగ్రహ ఛాయాచిత్రాలతో ‘మెరైన్‌ట్రాఫిక్.కామ్’ వెబ్సైట్లో పొందుపర్చారు. ఈ విధానం సఫలం కానట్లైతే, నౌకలోని దాదాపు 20 వేల కంటెయినర్లను వేరే షిప్‌లోకి మార్చి, అనంతరం, బరువు తగ్గిన ఈ నౌకను కదిలించాల్సి వచ్చేది. ఇసుక, బురదలో కూరుకుపోయిన ‘ఎవర్ గివెన్’ నౌకను తిరిగి కదిలించి, ప్రధాన మార్గంలోకి తీసుకువచ్చే బాధ్యతను ‘బొస్కాలిస్’ అనే నౌకా నిర్వహణ, మరమ్మత్తుల సంస్థకు అప్పగించారు. ఆ పని పూర్తికాగానే ‘మా పని పూర్తి చేశాం. సూయెజ్ కెనాల్ అథారిటీస్‌తో కలిసి మా నిపుణులు ఎవర్‌గివెన్‌ను జలాల్లోకి తీసుకురాగలిగారు. ఈ కాలువ ద్వారా రవాణా మళ్లీ ప్రారంభమయ్యేందుకు మార్గం సుగమమయింది’ అని ఆ సంస్థ సీఈఓ పీటర్ ప్రకటించారు. కాలువ మార్గానికి అడ్డంగా గత మంగళవారం జపాన్‌కు చెందిన సరకు రవాణా నౌక ‘ఎవర్ గివెన్’ చిక్కుకుపోవడంతో వారం రోజులుగా అంతర్జాతీయ రవాణా నిలిచింది. దాంతో రోజుకు దాదాపు 900 కోట్ల డాలర్ల నష్టం వాటిల్లింది. సూయెజ్ కాలువ మార్గంలో వారం రోజుల పాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడిన నేపథ్యంలో.. ఎవర్ గివెన్ నౌకను కదిల్చినప్పటికీ.. ఈ కాలువ గుండా సాధారణ స్థాయిలో నౌకల రవాణా జరిగేందుకు మరికొంత సమయం పట్టే అవకాశముంది. ఇప్పటికే దాదాపు 367 నౌకలు ఇరువైపులా నిలిచిపోయాయి. ఇవన్నీ క్లియర్ అయ్యేందుకు 10 రోజులు పడుతుందని రిఫినిటివ్ అనే సంస్థ అంచనా వేసింది. పలు నౌకలు ప్రత్యామ్నాయ, సుదూర మార్గమైన ‘కేప్ ఆఫ్ గుడ్‌హోప్’ ద్వారా వెళ్తున్నాయి. అంతర్జాతీయ సరకురవాణా వాణిజ్యంలో 10% సూయెజ్ కాలువ ద్వారా జరుగుతుంది. క్రూడాయిల్ రవాణాలో ఈ మార్గం వాటా దాదాపు 7%. గత సంవత్సరం ఈ మార్గం గుండా 19 వేలకు పైగా నౌకలు వెళ్లాయి. -
25 మంది మరణించారు.. 6 నెలల బాలుడు బ్రతికాడు!
కైరో : ఈజిప్టులోని కైరోలో శనివారం అపార్ట్మెంట్ బిల్డింగ్ కూలిన ఘటనలో 25 మంది మృత్యువాత పడగా.. మరో 26 మంది గాయాలపాలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సంఘటనా ప్రదేశంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం శిథిలాల కిందనుంచి 6 నెలల బాలుడ్ని సహాయక సిబ్బంది ప్రాణాలతో వెలికి తీశారు. ఈ ఘటనలో బాలుడి తల్లి,తండ్రి, అక్క మృత్యువాత పడ్డారు. అతడి అన్న ఆచూకీ లభించలేదు. దీంతో సహాయకసిబ్బంది అతడి కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉంది. కాగా, బిల్డింగ్ కూలటానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. నాణ్యతలో లోపం కారణంగానే బిల్డింగ్ కూలిపోయినట్లు ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. దీనిపై దర్యాప్తు చేయటానికి ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. చదవండి, చదివించండి : ఒబామా కుటుంబంలో విషాదం -
సూయజ్‌కు ఎందుకంత ప్రాధాన్యం, మీకీ విషయాలు తెలుసా?
సూయజ్ కెనాల్లో ఒక్క భారీ నౌక చిక్కుకుపోతే ప్రపంచమంతటా సంచలనంగా మారింది. ఇది జరిగి ఆరేడు రోజులే.. ఒకప్పుడైతే కొన్ని నౌకలు ఏకంగా ఎనిమిదేళ్లపాటు అక్కడ చిక్కుకుపోయాయి.. ఆ విషయం మీకు తెలుసా? 1967 జూన్‌లో 14 కార్గో నౌకలు సూయజ్ కాల్వలో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా పొరుగు దేశాలైన ఇజ్రాయెల్, ఈజిప్టు మధ్య యుద్ధం మొదలైంది. యుద్ధం జరిగింది కొన్ని రోజులే.. కానీ కాల్వ మూసేయడంతో నౌకలు మాత్రం ఎనిమిదేళ్లు అక్కడే చిక్కుకుపోయాయి. ఇంతకీ జగడమెందుకు? సూయజ్ కెనాల్.. కేవలం సరుకు రవాణాకే కాదు.. సుమారు శతాబ్దం పాటు ప్రపంచ రాజకీయాల్లో ఆధిపత్యానికీ కేంద్రంగా నిలిచింది. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, డచ్ వంటి యూరప్ దేశాలు వ్యాపారం పేరిట ఆసియా దేశాలను ఆక్రమించినప్పటి సమయం అది. ఆ దేశాల వారు ఆఫ్రికా ఖండం చుట్టూ తిరిగి దక్షిణాసియా దేశాలకు చేరాల్సి వచ్చేది. ఈ ప్రయాణానికి చాలా సమయం పట్టేది. ఖర్చు ఎక్కువగా అయ్యేది. ఆ క్రమంలోనే మధ్యధరా సముద్రం నుంచి హిందూ మహా సముద్రానికి మార్గం కలిపేందుకు.. 1859లో ఈజిప్ట్ మీదుగా 193 కిలోమీటర్ల పొడవునా భారీ కాల్వ తవ్వడం మొదలుపెట్టారు. దీనికోసం ఫ్రాన్స్ ఎక్కువగా ఖర్చుపెట్టింది, బ్రిటన్ కూడా జత కలిసింది. 1869 నుంచి నౌకలు వెళ్లడం మొదలైంది. అప్పటి నుంచీ సూయజ్ కాల్వ మీద ఫ్రాన్స్, బ్రిటన్ల పెత్తనం కొనసాగింది. 1956లో ఈజిప్ట్ అధ్యక్షుడు నాజర్ సూయజ్ కాల్వను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆ టైంలోనే ఈజిప్ట్‌పై ఆంక్షలు, పొరుగు దేశాలతో యుద్ధాలు వంటివి జరిగాయి. (చదవండి: సూయజ్ కెనాల్లో అడ్డం తిరిగిన భారీ నౌక.. గంటకు 3వేల కోట్ల నష్టం) కాల్వలో పడవలు ముంచి.. యుద్ధం తర్వాతి ఉద్రిక్తతలు ఎఫెక్ట్ సూయజ్ కెనాల్‌పై పడింది. కాల్వను మూసేయాలని ఈజిప్ట్ నిర్ణయించింది. కొన్ని పడవలను ముంచేసి, మట్టి, ఇసుక వంటివి వేసి అక్కడక్కడా కాల్వలో అడ్డంకులు కల్పించారు. దాంతో అప్పటికే ప్రయాణిస్తున్న నౌకలన్నీ కాల్వ మధ్యలో చిక్కుకుపోయాయి. గాలుల వల్ల పక్కనే ఉన్న ఎడారి నుంచి వచ్చిన ఇసుక, దుమ్ముతో నౌకలు నిండిపోయాయి. దీనినే ‘ది యెల్లో ఫ్లీట్ (పసుపు దళం)’గా పిలుస్తారు. మళ్లీ యుద్ధంతోనే తెరుచుకుని.. యుద్ధంతో మూతపడిన సూయజ్ కాల్వ తిరిగి తెరుచుకోవడానికి కూడా మరో యుద్ధమే కారణమైంది. 1973లో ఈజిప్ట్, ఇజ్రాయెల్ మధ్య మరోసారి యుద్ధం జరిగి.. రెండు దేశాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో పడిపోయాయి. ఆ దెబ్బతో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ పరిస్థితే 1975లో కెనాల్‌ను తిరిగి ఓపెన్ చేయడానికి మార్గం సుగమం చేసింది. ఏడు వేల కిలోమీటర్లు తిరిగిపోవాలి ప్రపంచంలో 70 శాతానికిపైగా జనాభా ఉన్న యూరప్, ఆసియా దేశాల మధ్య వాణిజ్యానికి సూయజ్ కాల్వ ఎంతో కీలకం. మొత్తం ప్రపంచ వాణిజ్యంలో 15 శాతం వరకు ఈ కాల్వ మీదుగానే జరుగుతుంది. ఈ కాల్వ లేకుంటే ఆసియా, యూరప్ ఖండాల మధ్య ప్రయాణించే నౌకలు.. మొత్తంగా ఆఫ్రికా ఖండం చుట్టూ వేల కిలోమీటర్లు అదనంగా తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఆ మార్గాన్ని ‘కేప్ ఆఫ్ గుడ్ హోప్’ రూట్ అంటారు. మన ముంబై నుంచి లండన్‌కు సూయజ్ కాల్వ మీదుగా వెళితే 11,600 కిలోమీటర్ల దూరం వస్తుంది. వాతావరణం, ఇతర అంశాల పరంగా ఇది భద్రమైన మార్గం. అదే కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా వెళితే ఏకంగా 19,800 కిలోమీటర్లకుపైగా ప్రయాణించాల్సి ఉంటుంది. అంతేకాదు ఆ మార్గంలో తుపానులు, ఇతర సమస్యలు ఎన్నో ఉంటాయి. నౌకలకు ప్రమాదకరం కూడా. అందుకే సూయజ్ కాల్వకు ఇంత ప్రాధాన్యత. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
రెండు రైళ్ల ఢీ.. 32మంది మృతి..
కైరో : రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొట్టుకున్న ఘటనలో 32 మంది మృత్యువాతపడగా 66 మంది తీవ్రగాయాలపాలయ్యారు. ఈ సంఘటన ఈజిప్టులోని సోహగ్ ప్రావిన్స్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. రెండు రైళ్లు ఢీకొట్టుకున్న వేగానికి చాలా కోచ్‌లు చెల్లాచెదురయ్యాయి. దీంతో చాలా మంది ప్రయాణికులు అందులో ఇరుక్కుపోయారు. దఫల్ అల్ సవమ్, తాహ్త సిటీ మధ్య ఈ ఘోరం జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుని సహాయక చర్యలు చేపట్టారు. కోచ్‌ల మధ్య ఇరుక్కుపోయిన వారిని బయటకు తీయటానికి చుట్టు పక్కలి గ్రామాల జనం కూడా సహాయపడుతున్నారు. ఇప్పటికే 49 అంబులెన్స్‌లు క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించటంలో సహాయపడుతున్నాయి. మొరగ, తాహ్త, సోహగ్ హాస్పిటల్లలో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈజిప్టు రైల్వే శాఖ పని తీరు బాగాలేకపోవటంత కారణంగానే తరచుగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. 2017 సంవత్సరంలో అత్యధికంగా దాదాపు 1,793 ప్రమాదాలు జరిగాయి. 2017 ఆగస్టులో అలెగ్జాండ్రియా సిటీ వద్ద రెండు రైళ్లు ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో 36 మంది మరణించగా.. 123 మంది గాయపడ్డారు. చదవండి, చదివించండి : స్టీవ్ జాబ్స్ ఉద్యోగ దరఖాస్తు వేలం.. ఎంతో తెలుసా? -
రోజుకి వెయ్యి కోట్ల డాలర్ల నష్టం
ఇస్మాలియా(ఈజిప్ట్): అంతర్జాతీయ వాణిజ్య రంగంలో కీలక పాత్ర పోషించే ఈజిప్టులోని సూయజ్ కాలువలో అత్యంత భారీ సరకురవాణా నౌక చిక్కుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 180కిపైగా చమురు, సరకు రవాణా నౌకలు ఎటూ వెళ్లలేక ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దీంతో రోజుకి దాదాపుగా వెయ్యి కోట్ల డాలర్లు నష్టం వస్తున్నట్టుగా అంచనా. ఆసియా, యూరప్ దేశాల మధ్య సరుకు రవాణా చేసే పనామాకు చెందిన ఎవర్ గివెన్ అనే భారీ నౌక సూయజ్ కాలువ మార్గంలో అడ్డంగా ఇరుక్కుంది. 2 లక్షల మెట్రిక్ టన్నుల బరువు ఉండే ఈ నౌకని ముందుకి కదల్చడం సాంకేతిక నిపుణులకు సవాల్‌గా మారింది. కాగా, ఈ నౌకలో మొత్తం 25 మంది సిబ్బంది క్షేమంగా ఉన్నారని, వీరంతా భారతీయులేనని నౌక యజమాని చెప్పారు. నౌక ఎలా చిక్కుకుంది ? సూయజ్ కాలువ మానవ నిర్మితం కావడంతో అక్కడక్కడా మార్గాలు చాలా ఇరుగ్గా ఉంటాయి. చైనా నుంచి నెదర్లాండ్స్‌కు వెళుతున్న ఈ భారీ నౌక మంగళవారం ఇరుకు మార్గం దగ్గరకు వచ్చేసరికి ఆ ప్రాంతంలో తుపాను వాతావరణం నెలకొని ఉంది. బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఆ రాకాసి గాలుల ధాటికి తీర ప్రాంతంలో ఇసుక కాల్వలో చేరి మేటలు వేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ముందున్న మార్గం కనిపించకపోవడంతో సిబ్బంది నౌకపై నియంత్రణ కోల్పోయారు. దీంతో ఆ నౌక ఇసుక మేటల్లో అడ్డంగా కూరుకుపోయింది. ఎంత భారీ నౌక ?..: ఈ నౌక ఈఫిల్ టవర్ కంటే పొడవైనది. మూడు ఫుట్‌బాల్ గ్రౌండ్ల కంటే పెద్దది. ఈ నౌకలో మొత్తం పన్నెండు అంతస్తులు ఉన్నాయి. ఈ నౌక ఇంచుమించుగా 1300 అడుగుల పొడవు, 193 అడుగుల వెడల్పు ఉంటుంది. నౌకని బయటపడేయడం ఎలా ? నౌకను మళ్లీ కదల్చడం అంత సులభంగా జరిగేది కాదని నావికారంగ నిపుణులు చెబుతున్నారు. నౌక చుట్టూ పేరుకుపోయిన ఇసుక బురదను తొలగించడానికి డ్రెడ్జింగ్ పరికరాలతో గత రెండు రోజులుగా యత్నిస్తున్నారు. నౌక అడుగున ఉన్న బురద వదులైతే నౌకని నిలువుగా తిప్పడానికి కుదురుతుందని ఆ నౌక మేనేజర్ బెర్న్‌హర్డ్ చెబుతున్నారు. అయితే దీనికి ఎంత సమయం పడుతుందో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. ఒకట్రెండు రోజుల్లోనే నౌకని ముందుకు కదలేలా చేయవచ్చునని, లేదంటే వారాలైన పట్టవచ్చునని ఈ సహాయ కార్యక్రమంలో పాల్గొంటున్న డచ్ కంపెనీ బోస్కలిస్ సీఈవో పీటర్ బెర్డోవ్స్కి తెలిపారు. కాలువలో భారీగా కెరటాలు వస్తే నౌక ముందుకు కదిలే అవకాశం ఉందని, ఆ స్థాయిలో కెరటాలు రావాలంటే ఆది, సోమవారాల వరకు వేచి చూడాలని సాల్వేజ్ మాస్టర్ నిక్ సోలెన్ చెప్పారు. ఎందుకింత ఆందోళన ? 120 మైళ్లున్న సూయజ్ కాలువను 1869లో నిర్మించారు. ఉత్తరాన మధ్యధరా సముద్రాన్ని, దక్షిణాన ఉన్న ఎర్ర సముద్రాన్ని ఇది కలుపుతుంది. ఆసియా, యూరప్ దేశాల మధ్య సరకు రవాణా జరగాలన్నా, అరబ్ దేశాల నుంచి చమురు యూరప్ దేశాలకు , అక్కడ్నుంచి అమెరికాకు వెళ్లాలంటే ఈ కాలువే ఆధారం. అంతర్జాతీయ వాణిజ్యంలో 12% ఈ కాలువ ద్వారా జరుగుతుంది. ప్రపంచంలోని వాణిజ్య నౌకల్లో 30% ఈ కాలువ మీదుగా ప్రయాణిస్తాయి. కరోనా సంక్షోభం ప్రపంచ దేశాలను కుదిపేసినప్పటికీ 2020లో 19వేల నౌకలు ఈ మార్గం వెంబడి ప్రయాణించాయి. అంటే సగటున రోజుకి 52 నౌకలు రాకపోకలు సాగించాయి. 1.17 బిలియన్ టన్నుల సరకు రవాణా జరిగింది. ఇప్పుడు భారీ నౌక కాలువలో అడ్డంగా ఇరుక్కుపోవడంతో కాల్వకి రెండు వైపుల నుంచి రాకపోకలు నిలిచిపోయినట్టుగా ఈజిప్టు అధికారులు వెల్లడించారు. రవాణా స్తంభించడంతో యూరప్ దేశాల్లో వాణిజ్యంపై ప్రభావం పడింది. చమురు ధరలు భగ్గుమన్నాయి. బారెల్‌కు 5శాతం పెరిగిపోయాయి. కాలువ మార్గంలో అడ్డంగానిలిచిన ఎవర్ గివెన్ -
సూయజ్‌కు అడ్డంగా నౌక.. గంటకు రూ.3వేల కోట్ల నష్టం
‘హోల్డింగ్ అప్ ఏ ట్రైన్’.. అని హెన్రీ కథ ఒకటి ఉంది. అందులో కథానాయకుడు గన్ పాయింట్ లో ట్రైన్ రాబరీ చేస్తుంటే.. బోగీల్లో ఉన్న పురుష ప్రయాణికులు గజగజ వణికి పోతుంటారు. మహిళా ప్రయాణికులు మాత్రం భయమన్నదే లేకుండా.. ‘రైలు దోపిడీ ఇలాగుంటుందా..’ అన్నట్లు కళ్లు టపటపలాడిస్తూ కుతూహలంగా చూస్తుంటారు! మంగళవారం ఉదయం సూయజ్ కెనాల్ లో ఓ భారీ షిప్పు.. కడుపు లో బిడ్డ అడ్డం తిరిగినట్లుగా.. అడ్డంగా నిలిచి పోగానే అటు ఇటు ట్రాఫిక్ జామ్ అయింది. వెనుక షిప్ లలో ఉన్న మగాళ్ల బీపీ పెరిగిపోతోంది. వాళ్లలో ఉన్న జూలియాన్ అనే ఆవిడ మాత్రం ‘ఇట్స్ ఫన్నీ’ అని చిరునవ్వులు చిందిస్తూ తను ఉన్న షిప్ లోంచి, ఆగిపోయిన ఆ భారీ షిప్ ఫొటో తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అయితే మన స్టోరీ జూలియా పై కాదు. పురుషుల బీపీ మీదా కాదు. సూయజ్ కెనాల్లో ట్రాఫిక్ జామ్ క్లియర్ అయిందా? అసలు అలా ఎలా ఆ షిప్పు ఇరుక్కుపోయింది? సూయజ్ కెనాల్‌కు ఇలాంటి సమస్య ఇదే మొదటిసారా? సూయజ్ లో రోజుకు ఎన్ని షిప్ లు ప్రయాణిస్తాయి? ఆ కెనాల్‌ను ఎందుకు నిర్మించారు? ఎవరు నిర్మించారు? సూయజ్ పై హటాత్తుగా ఇన్ని ప్రశ్నలు రేకెత్తించి, ఇంత ఆసక్తిని కలుగజేసిన జూలియాన్కు ధన్యవాదాలు తెలువుకుంటూ ‘సూయజ్ కాలవ’లో కాసేపు ప్రయాణిద్దాం. కొన్ని జలమార్గాల్లోనే భారీ ఓడలు వెళ్లగలవు. అందుకే పనామా కాలువ నుంచి వెళ్లలేని అల్ట్రా లార్జ్ కంటెయినర్ షిప్.. ‘ఎవర్ గివెన్’ చైనా నుంచి నెదర్లాండ్స్ వెళ్లేందుకు సూయెజ్ కాలువ ను ఎన్నుకుంది. అయితే ఊహించని విధంగా పెను గాలులు వీచడంతో మంగళవారం ఉదయం ఎవర్ గివెన్ నౌక ఒక్కసారిగా కెనాల్‌పై అడ్డంగా తిరిగి, ఉన్నచోటే ఉండిపోయింది. బుధవారం సాయంత్రం వరకు కూడా నౌకను తిరిగి యథాస్థితికి తెచ్చి కాలువపై ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మార్గానికి రెండువైపులా ఎక్కడి ఓడలు అక్కడే ఆగిపోయాయి! ‘ఎవర్ గివెన్’ తైవాన్‌లో తయారై, పనామాలో రిజిస్టర్ అయిన నౌక. అందులో వందలాదిగా కంటెయినర్లు ఉండిపోయాయి. సూయజ్ కాలువపై రవాణా మొత్తం స్తంభించిపోయింది. ఇక ప్రపంచ వాణిజ్యంలో ప్రతి ఏటా సుమారు 12 శాతం ఈ కాలువ ద్వారానే వ్యాపారం జరుగుతుంది. అంతేకాకుండా 8 శాతం సహజ వాయువు ఈ కాలువ ద్వారా వివిధ దేశాలకు రవాణా జరగుతోంది. ప్రతిరోజూ పది లక్షల బ్యారెల్స్ ఆయిల్ సరఫరా అవుతోంది. ప్రస్తుతం షిప్ చిక్కుకున్న కారణంగా గంటకు సుమారు 3వేల కోట్ల నష్టం జరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. 400 మీటర్ల పొడవు, 59 మీటర్ల వెడల్పు ఉన్న ఈ అతి భారీ నౌక సూయజ్ నగర సమీపంలో సూయజ్ కాలువ ముఖద్వారానికి దక్షిణం వైపు నుంచి ఉత్తరానికి 6 కి.మీ. దూరంలో చిక్కుకుపోయింది. ఈ అనూహ్య ఘటనకు సంబంధించి ప్రపంచానికి అందిన తొలి ఫొటో.. జూలియన్ కోనా అనే మహిళ తీసి షేర్ చేసిన ఫొటో. ఎవర్ గివెన్ నౌక వెనక ఉన్న మేరస్క్ డెన్వర్ అనే ఓడలో ఆమె ప్రయాణిస్తున్నారు. తమ ముందున్న నౌక అలా విడ్డూరంగా కాలువకు అడ్డం తిరిగి ఆగిపోవడం ఆమెకు ఫన్నీగా అనిపించి ఫొటో తీసి ఇన్‌స్టాలో పెట్టుకున్నారట. గతంలో ఇలాంటివి జరగలేదని కాదు. జరిగినా ఐదారు గంటల్లో రద్దీని తొలగించ గలిగారు. ఈ సారి 36 గంటలు దాటుతున్నా ఎవర్ గివెన్‌ను కదిలించేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. టగ్ బోట్లు, డిగ్గర్ నిర్విరామంగా పని చేస్తున్నాయి. ఆ నౌకను దారిలో పెట్టడానికి బహుశా కొన్ని రోజులు పట్టవచ్చని ఈజిప్టులోని కెనాల్ నిర్వాహకులు ఇప్పటికే ఒక ఆందోళన సంకేతాన్ని విడుదల చేశారు కూడా! రెండు లక్షల 20 వేల టన్నుల బరువైన ఎవర్ గివెన్‌ను కదలిస్తే తప్ప ప్రస్తుతం ఆ మార్గంలో ఆగిపోయి ఉన్న సౌదీ, రష్యన్, ఒమన్, యు.ఎస్. ఇంధన ట్యాంకర్ ఓడలు ముందుకు కదలడానికి వీల్లేని పరిస్థితి. రోజూ కనీసం 50 నౌకలు ప్రయాణించే ఈ మార్గంలో ప్రస్తుతం చిన్న పెద్ద కలిపి వందకు పైగా నౌకలు నిలిచిపోయాయి. జూలియన్ కోలన్కు ఈ ఘటన ఫన్నీగా అనిపించినట్లే.. ట్విటిజెన్‌లు కొందరు ఫన్నీగా కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ‘‘మున్ముందు టగ్ బోట్లు, డిగ్గర్లలో అనుభవం కలిగిన వారికి ఉద్యోగావకాశాలు ఎక్కువ కావచ్చు. అందుకని ఫైనాన్స్ కోర్సులు బోర్ కొట్టేసిన విద్యార్థులు ఈ కోర్సులు చేయడం మంచిది’’ అని జే జాకబ్స్ అనే అతడు ట్వీట్ చేశారు. ‘షిప్ కేప్టన్లూ.. దయచేసి మీరు త్రీ పాయింట్ టర్న్‌లను (ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, మళ్లీ ఫార్వర్డ్) మరింతగా ప్రాక్టీస్ చేయండి’ అని జిమ్ ఆర్మిటేజ్ అనే ఆయన ట్వీట్ చేశారు. సమస్యే సానుకూలతల్ని చూపిస్తుంది. అదే సానుకూలత రాగల కొద్ది గంటల్లో సూయజ్‌లోని ఈ తాత్కాలిక అడ్డును తొలగించి, ఎప్పటిలా సందడిగా మార్చవచ్చు. సూయజ్ కాలువ (కృత్రిమ జలమార్గం) ఎక్కడ ఉంది? : ఈజిప్టులో కాలువ పొడవు : 193 కి.మీ. కాలువ లోతు : 78 అడుగులు కాలువ వెడల్పు : నీళ్ల అడుగున 21 మీటర్లు.; ఉపరితలంపై 60 నుంచి 90 అడుగులు) ఎక్కడి నుంచి ఎక్కడికి? : మధ్యదరాసముద్రం నుంచి ఎర్ర సముద్రం వరకు. కట్టింది ఎక్కడ? : సూయెజ్ భూసంధిపై (జలాల మధ్య భూమార్గం) బయల్దేరే రేవు: పోర్ట్ సయెద్ (మధ్యధరా తీరం వెంబడి ఈశాన్య ఈజిప్టు) చేరుకునే రేవు: పోర్ట్ ట్యూఫిక్ (ఎర్ర సముద్రపు పాయను ఆనుకుని ఈశాన్య ఈజిప్టు) నిర్మాణం మొదలైంది : 1859 నిర్మాణం పూర్తయింది : 1869 కెనాల్ ఉపయోగం : ఆసియా ఐరోపాల మధ్య షిప్పింగ్‌కి దగ్గరి దారి. కెనాల్ లేకుంటే? : షిప్పింగ్‌కి ఆఫ్రికా మీదుగా 7 వేల కి.మీ. దూరం చుట్టూ తిరగవలసి వచ్చేది. నౌక ప్రయాణ సమయం : వేగాన్ని బట్టి 11 నుంచి 16 గంటలు నౌక ప్రయాణ వేగం : గంటలకు 15 కి.మీ. (8 నాటికల్ కి.మీ.). చదవండి: సూయజ్ కాలువ బంద్.. ఇంధన ధరలు పెరుగుతాయా! -
వెలుగులోకి వేల ఏళ్ల నాటి బీర్ ఫ్యాక్టరీ
కైరో : ఈజిప్ట్‌లోని పురావస్తు శాఖకు చెందిన ఓ ప్రముఖ ప్రదేశంలో అత్యంత పురాతన బీర్ ఫ్యాక్టరీ ఒకటి బయటపడింది. అమెరికా-ఈజిప్ట్ పురావస్తు శాఖ శాస్త్రవేత్తలు సంయుక్తంగా చేపట్టిన పరిశోధనలో ఈ ఫ్యాక్టరీ వెలుగుచూసింది. తాజాగా ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు అధికారులు. దేశ రాజధాని కైరోకు 450 కిలోమీటర్ల దూరంలో ఎబిడాస్‌లో.. నైలు నదికి పశ్చిమంగా ఉన్న ఓ శ్మశాన వాటికలో ఈ ఫ్యాక్టరీని కనుగొన్నారు. ఆ బీర్ ఫ్యాక్టరీ నర్మర్ చక్రవర్తి కాలానికి చెందిన గుర్తించారు. ఫ్యాక్టరీలో మొత్తం 8 యూనిట్లు.. ఒక్కో యూనిట్ ఇరవై మీటర్లు పొడవుతో, 2.5 మీటర్ల వెడల్పుతో ఉన్నాయి. ( షాకింగ్.. అంకుల్ అస్థిపంజరాన్నే గిటార్‌గా చేసి..) బీర్ ఫ్యాక్టరీ కుండలు ఒక్కో యూనిట్లో దాదాపు 40 కుండలు రెండు వరుసలుగా ఏర్పాటు చేయబడ్డాయి. ఆ కుండలలో బీర్ తయారు చేయటానికి అవసరమైన పదార్థాలను వేసి, మరిగించేవారు. రాజ కార్యక్రమాల కోసం బీరును ఉపయోగించేవారు. కాగా, బీరు ఫ్యాక్టరీ ఉనికిని మొట్టమొదటిసారిగా 1900లలో బ్రిటీష్ పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కానీ, ఫ్యాక్టరీ ఎక్కడ ఉందన్న సంగతి చెప్పలేకపోయారు. -
2వేల ఏళ్ల నాటి మమ్మీ: నోట్లో బంగారు నాలుక
కైరో: ఈజిప్టులో జరుపుతున్న పురావస్తు తవ్వకాల్లో 2వేల ఏళ్ల నాటి మమ్మి బయటపడింది. ఈజిప్టులో మమ్మీలు బయటపడటం సహజమే కదా ఇందులో వింతేముంది అనుకుంటున్నారా. కానీ ఈసారి బయటపడిన మమ్మీ బంగారు నాలుకతో ఉంది. అది చూసి అధికారులు అవాక్కయ్యారు. దీంతో మమ్మీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి. వివరాలు.. ఈజిప్టులోని తపోరిస్ మగ్నా ప్రాంతంలో పురావస్తు పర్యాటక శాఖ అధికారులు తవ్వకాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఓ మమ్మీ బయటపడింది. అయితే దాని నోటిలో బంగారు నాలుక ఉండటంతో శాస్త్రవేత్తలు దానిపై పరిశోధన జరపగా ఇది 2వేల ఏళ్ల నాటిదిగా తేలింది. అయితే ఈ వ్యక్తి చనిపోయినప్పుడు అతడిని మమ్మీగా మార్చేందుకు ఈ బంగారు నాలుకను నోటీ మీద ఉంచి ఉంటారని, కాలక్రమేణా అది నోట్లోకి జారి ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే ‘ఈజిప్టులో మరణం తర్వాత వారు ఖచ్చితంగా మళ్లీ పుడతారని అక్కడి వారి నమ్మకం. బహుశా ఆ నమ్మకంతోనే మరో జన్మలో కూడా ఈ వ్యక్తి మాట్లాడాలనే ఉద్దేశంతో బంగారు నాలుకను పెట్టడం అక్కడి సంప్రాదాయమని’ అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. -
ఈ శవపేటికలు చరిత్రను తిరగరాస్తాయి..!
కైరో: ఈజిప్టు అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది పిరమిడ్లు, మమ్మీలు. పురాతత్వ శాస్త్రవేత్తలు ఇక్కడ నిత్యం పరిశోధనలు జరుపుతూనే ఉంటారు. తాజాగా ఈజిప్టులోని సక్కారా ప్రాంతంలో ఆర్కియాలజిస్టులు 3000 సంవత్సరాల క్రితం నాటి చెక్క, రాతి శవపేటికలను గుర్తించారు. ఇది ఇప్పటి వరకు మనకు తెలిసిన చరిత్రను తిరగరాసే గొప్ప, అద్భుతమైన ఆవిష్కరణ అంటున్నారు ఆర్కియాలజిస్టులు. సక్కారా అనేది పురాతన ఈజిప్టు రాజధాని మెంఫిన్‌లో భాగం. దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఇక్కడ డజనుకు పైగా పిరమిడ్లు, పురాతన మఠాలు, జంతువుల ఖనన ప్రదేశాలు ఉన్నాయి. ప్రసిద్ధ ఈజిప్టు పురావస్తు శాస్త్రవేత్త జాహి హవాస్ నేతృత్వంలోని పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఈ అద్భుతాన్ని గుర్తించింది. ఈజిప్టు పాత సామ్రాజ్యం(ఓల్డ్ కింగ్డమ్) ఆరవ రాజవంశానికి చెందిన మొదటి ఫారో.. కింగ్ టెటి పిరమిడ్ సమీపంలో పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఈ ఆవిష్కరణలని గుర్తించింది. 'చరిత్రను తిరిగరాస్తుంది' న్యూ కింగ్డమ్ (క్రీస్తుపూర్వం 16 వ శతాబ్దం నుంచి క్రీస్తుపూర్వం 11వ శతాబ్దం)నాటి 50 కి పైగా చెక్క శవపెటికలు భూమికి 40 అడుగుల లోతులో ఈ శ్మశానవాటికలో బయపటడినట్లు హవాస్ న్యూస్ ఏజెన్సీకి ఏఎఫ్పీకి వెల్లడించారు. "ఈ ఆవిష్కరణ సక్కారా చరిత్రను.. మరి ముఖ్యంగా 3,000 సంవత్సరాల క్రితం ప్రారంభమైన న్యూ కింగ్డమ్ చరిత్రను తిరిగరాస్తుంది" అన్నారు. (చదవండి: ప్రైవేట్ ఫొటోషూట్.. మోడల్ అరెస్టు!) ఇంకా ఏమి కనుగొన్నారు తన బృందం శవపేటికలతో పాటు మొత్తం 22 బాణాలను కనుగొన్నట్లు హవాస్ వెల్లడించారు. వాటిలో ఒకదాని మీద "సైనికుడు, పక్కనే విశ్రాంతి తీసుకున్నట్లుగా ఉన్న అతని యుద్ధ గొడ్డలి ఉంది" అన్నారు. వీటితో పాటు ఒక రాతి శవపేటికను కూడా గుర్తించామని హవాస్ వెల్లడించారు. అలాగే చనిపోయినవారి పుస్తకంలోని(బుక్ ఆఫ్ ది డెడ్) 17 వ అధ్యాయాన్ని కలిగి ఉన్న ఐదు మీటర్ల పొడవున్న పురాతన పత్రం, ఆ కాలంలో ఉపయోగించిన మాస్క్‌లు, చెక్క పడవలు, పురాతన ఈజిప్షియన్లు ఆడటానికి ఉపయోగించే ఆట వస్తువులు వంటివి లభ్యమయ్యాయి అని తెలిపారు. ఇదే ప్రధాన ఆవిష్కరణ ఎందుకు ఈజిప్ట్ పర్యాటక, పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖ శనివారం సక్కారాలో గుర్తించిన "ప్రధాన ఆవిష్కరణలు" గురించి ప్రకటించింది. ‘‘ఇది చాలా అరుదైన, క్రొత్త ఆవిష్కరణ. ఎందుకంటే మేము కనుగొన్న చాలా కళాఖండాలు న్యూ కింగ్డమ్(క్రొత్త రాజ్యం)కి చెందినవి. అయితే ప్రస్తుతం సక్కారాలో గుర్తించినవి మాత్రం సాధారణంగా క్రీ.పూ 500 కాలానికి చెందినవి’’ అని తెలిపింది. ఇక్కడ ఇటీవలి సంవత్సరాలలో అనేక తవ్వకాలు జరిగాయి. (చదవండి: 2,500 ఏళ్ల తర్వాత 'మమ్మీ'ని బయటకు తీశారు!) బయటపడిన పురాతన ఆలయం ఇక ఇక్కడ జరిపిన తవ్వకాల్లో హవస్ ఒక పురాతన ఆలయం కూడా బయటపడింది. ఇది "కింగ్ టెటి భార్య క్వీన్ నిరిట్ యొక్క అంత్యక్రియల ఆలయం" అని పురాతన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పురాతన ఈజిప్టులో నిర్మించిన మొట్టమొదటి నిర్మాణాల్లో ఒకటి అయిన జొజర్ స్టెప్ పిరమిడ్ సక్కరా ప్రాంతంలోనే ఉంది. -
ప్రేమ వివాహం: ఆమెకు 81, అతనికి 35
లండన్ : ప్రేమకు భాషా, వయసు, సరిహద్దులతో సంబంధంలేదంటారు. ఎప్పుడు ఎవరు ఏ వయసులో ప్రేమలో పడతారో ఊహించడం చాలా కష్టతరమైన విషయం. కొందరికి యుక్త వయసులో ప్రేమ చిగురిస్తే మరికొందరికి లేటు వయసులో ప్రేమ పుడుతుంది. మనిషి అన్నాక జీవితంలో ఒక్కసారైనా ప్రేమరుచి చూడాల్సిందేనని చెబుతుంటారు కొందరు. అయితే బ్రిటన్‌లో ఓ మహిళ ఏకంగా 81 ఏళ్ల వయసులో ప్రేమ వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఓ జాతీయ మీడియా తెలిపిన కథనం ప్రకారం.. యునైటెడ్ కింగ్డమ్ (యూకే)కు చెందిన ఐరిష్ జోనిస్ (81) అనే వృద్ధురాలు ఈజిప్ట్‌కు చెందిన మహమ్మద్ అహ్మద్ ఇబ్రహీం (35) అనే వ్యక్తితో తొలుత పరిచయం ఏర్పడింది. రెండేళ్ల క్రితం ఈజిప్ట్ పర్యటనకు వెళ్లిన జోనిస్‌కు ఇబ్రహీంకు మధ్య ఏర్పడిన పరిచయం కొంత కాలంలోనే ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే లేటు వయసులోనూ రెండు మూడుసార్లు ప్రియుడ్ని కలవడానికి ఈజిప్ట్ వెళ్లారు. అయితే అక్కడి వాతావరణం ఆమెకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది. వేడి వాతావరణంతో పాటు విపరీతమైన ట్రాఫిక్, ఆహారపు అలవాట్లు జోనిస్‌ను చాలా ఇబ్బందులకు గురిచేశాయి. దీంతో విసుగుచెందిన ఆమె ఇబ్రహీంతో యూకేలోనే సెటిల్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే తనకంటే వయసులో 45 ఏళ్లు చిన్నవాడైన ప్రియుడిని వివాహం చేసుకున్నారు. అయితే అప్పటికే జోనిస్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారి వయసు 50 ఏళ్లకు పైబడే. కానీ ప్రేమ తల్లి వివాహానికి వారు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అవికాస్తా వైరల్ అయ్యాయి. లేటు వయసులో ఘాటు ప్రేమ అంటూ కొందరు కామెంట్ చేయగా.. ముసలిభార్య యంగ్ భర్త అంటూ మరికొందరు కామెంట్స్ చేశారు. పెళ్లి వయసుకు అడ్డు అదుపు లేనక్కర్లేదా అంటూ మరికొందరూ ఘాటుగా స్పందించారు. దీనిపై జోనిస్ మాట్లాడుతూ.. ‘నా మనసుకి నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇద్దరి మధ్య 45 ఏళ్లు తేడా ఉన్నా నాకేమీ అభ్యంతరం లేదు. 50 ఏళ్ల కిందటే నాభర్తతో విడాకులు తీసుకున్నాను. నా కుమారులు కూడా పెళ్లికి ఎలాంటి అభ్యంతరం తెలపలేదు’ అని సంతోషం వ్యక్తం చేశారు. అయితే అయితే వీరి వివాహం వస్తున్న కామెంట్స్ ఆశ్చర్యకరంగా అనిపిస్తున్నాయి. యూకేలో స్థిరపడాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఇబ్రహీంకు ఎంతకీ వీసా దొరకడంలేదు. అనేక ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే అక్కడి మహిళను వివాహం చేసుకుంటే అక్కడే స్థిరపడొచ్చని ఓ మిత్రుడి సలహాను ఆచరించి జోనిస్‌ను వివాహం చేసుకున్నారని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం వీరిద్దరు వివాహం చేసుకుని లండన్‌లో సెటిల్ అయ్యారు. -
పాములతో బాడీ మసాజ్.. గుండె ధైర్యం ఉంటేనే!
కైరో: అలసటతో నీరసించిపోయిన శరీరాన్ని ఉత్తేజితం చేసుకునేందుకు చాలా మంది స్పాలను ఆశ్రయిస్తారన్న విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే వివిధ రకాల తైలాలతో మర్ధనా చేస్తూ కస్టమర్లకు ఉపశమనం కలిగించేలా స్పా నిర్వాహకులు సరికొత్త టెక్నిక్‌లు ఉపయోగిస్తుంటారు. అయితే ఈజిప్టులోని కైరోలో గల ఓ స్పా సెంటర్ మాత్రం పాములతో బాడీ మసాజ్ చేస్తూ వినూత్నంగా నిలిచింది. ఈ ప్రక్రియ ద్వారా శారీరకంగానూ, మానసికంగానూ ఉల్లాసంగా ఉండవచ్చంటున్నారు నిర్వాహకులు. తమ స్పాలో కొండచిలువలు సహా వివిధ రకాల విష రహిత పాములను ఉపయోగిస్తూ కస్టమర్లకు సరికొత్త అనుభవాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయం గురించి స్పా యజమాని సఫ్వాట్ సెడికి రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. ‘స్నేక్ మసాజ్’తో కండరాలు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చని, దీనితో రక్తప్రసరణ కూడా మెరుగు అవుతుందని పేర్కొన్నారు. ‘‘శారీరకంగా, మానసికంగా ఉల్లాసం అందించడమే ఈ మసాజ్ ముఖ్యోద్దేశం. రక్త ప్రసరణ మెరుగుపరచడం ద్వారా శరీరాన్ని ఉత్తేజితం అవుతుంది. ఎండార్ఫిన్ల విడుదలతో మానసిక సంతోషం కలుగుతుంది. తద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది’’ అని చెప్పుకొచ్చారు. ఇక సదరు స్పాను సందర్శించిన ఓ కస్టమర్.. ‘‘నా శరీరంపై పాములను వేయగానే తొలుత కాస్త భయం వేసింది. కానీ నెమ్మదిగా భయం, టెన్షన్ మాయమయ్యాయి. చాలా రిలాక్సింగ్‌గా అనిపించింది. నా వీపు మీద పాములు పాకుతూ ఉంటే ఏదో తెలియని ఉత్సాహం’’ అంటూ తన అనుభవాన్ని చెప్పుకొచ్చాడు. ఇక స్నేక్ మసాజ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొంతమంది నెటిజన్లు ఇందుకు సానుకూలంగా స్పందించగా.. చాలా మంది.. ‘‘అమ్మ బాబోయ్.. పాములు మీద పాకితే ఇంకేమైనా ఉందా. భయంతో గుండె ఆగిపోయినా ఆగిపోతుంది’’ అంటూ భయం వ్యక్తం చేస్తున్నారు. -
ఇక్కడితో ఆగిపోవడం లేదు
యూఎస్‌లో యాష్లీ జూడ్. ఇండియాలో తనుశ్రీ దత్తా. ఈజిప్టులో నదీన్ అష్రాఫ్! ముగ్గురూ ‘మీటూ’ ఫైటర్స్. ముగ్గుర్లో చిన్న.. నదీన్. పద్దెనిమిదేళ్లకే ఉద్యమజ్వాల. ఇరవై రెండేళ్లకిప్పుడు.. మీటూ మహోజ్వల స్ఫూర్తి. ఇక్కడితో.. ఆగిపోవడం లేదంటోంది. మహిళల్ని సమైక్యం చేస్తానంటోంది. నాలుగేళ్ల క్రితం నదీన్ అష్రాఫ్ వయసు పద్దెనిమిదేళ్లు. అప్పటికి ఏడేళ్ల క్రితం ఆమె వయసు పదకొండేళ్లు. ఈ రెండు వయసులలో ఒకటి ఆమెను ఇప్పటికీ పీడకలలా వెంటాడుతున్నది. ఇంకోటి.. అలాంటి పీడకల ఏ అమ్మాయిని వెంటాడుతున్నా ఆ అమ్మాయి వైపు నిలిచి తనే ఆ పీడకల వెంటబడి తరిమికొట్టేందుకు నదీన్‌ను ఒక శక్తిగా మలచినది. మరి తన పీడకల మాట ఏమిటి?! ఆ పిశాచి దొరకలేదు. ఆ పిశాచి ముఖం గుర్తు లేదు. నదీన్కు పదకొండేళ్ల వయసులో వెనుక నుంచి వచ్చి ఆమె వెనుక భాగాన్ని అరిచేత్తో కొట్టి మాయమైపోయాడు. ఏం జరిగిందీ ఆ చిన్నారికి అర్థం కాలేదు. తననెందుకు తెలియనివారొకరు తాకడం?! అంతవరకే ఆలోచన. నదీన్ పెద్దదవుతోంది. ఇలాంటి పిశాచాలు ఉంటాయని అర్థయ్యే వయసుకు వచ్చింది. చిన్నతనంలో తనకు జరిగిందీ ‘అలాంటిదే’ అని రోషంతో ఉడికిపోయింది. ఏ అమ్మాయికి అలా జరిగిందని విన్నా తనకు జరిగిందే ఆమె గుర్తుకు వస్తోంది. అతడెవరో తెలియదు కనుక తనేం చేయలేదు. ఇప్పుడైతే ఒకటి కచ్చితంగా చేయగలదు. లైంగిక వికృతాలకు, లైంగిక హింసకు, దౌర్జన్యానికి, దాడికి పాల్పడిన వారిని వేటాడి కలుగుల్లోకి లాగి బాధితులకు న్యాయం జరిపించడం! ఆమెకు ఈ ఆలోచన కలిగించింది ‘మీటూ’ మూవ్మెంట్. నాలుగేళ్ల క్రితం 2017లో అమెరికాలో మొదలైన ఆ ఉద్యమజ్వాల పద్దెనిమిదేళ్ల నదీన్ కు మీటూ బాధితుల తరఫున నిలిచి పోరాడేలా స్ఫూర్తిచ్చింది. అమెరికాలో ఎలాగైతే హాలీవుడ్ నటి యాష్లీ జూడ్ ‘మీటూ’కు ఊపిరులు ఊదిందో ఈజిప్టులో అలా నదీన్ మీటూ ఒత్తిని వెలిగించింది. అందుకే 2020లో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వందమంది శక్తిమంతమైన మహిళల బి.బి.సి. జాబితాలో నదీన్ ఒకరయ్యారు. ఆ గుర్తింపు కూడా నదీన్కు మీటూ ఉద్యమకారిణిగా లభించినదే. ∙∙ యూఎస్‌లో మీటూ మొదలయ్యే సమయానికి నదీన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘అసాల్ట్ పోలీస్’ అనే పేజ్ని నడుపుతూ ఉంది. హాలీవుడ్లో హార్వీ వైన్స్టీన్లా ఈజిప్టులో అహ్మద్ బస్సమ్ జికీ అనే వ్యక్తి అనేక మంది మహిళల్ని లైంగికంగా వేధించిన కేసుల్లో ప్రధాన నిందితుడు. యాభై మందికి పైగా మహిళలు అతడి వల్ల తాము పడిన లైంగిక హింసను ‘అసాల్ట్ పోలీస్’లో షేర్ చేసుకున్నారు. ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా నదీన్ అనుకోకుండా ప్రారంభించింది. ఆమె అంతకుముందు ఫేస్బుక్లో చురుగ్గా ఉండేది. నదీన్ ఓ రోజు రాత్రి పొద్దుపోయాక అహ్మద్ బస్సమ్ జికీ లైంగిక అకృత్యాలపై ఒక పోస్ట్ చదువుతుంటే అకస్మాత్తుగా అది అదృశ్యం పోయింది. అతడి ఘోరాలపై అప్పటికే రగిలిపోతున్న నదీన్ అప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను ప్రారంభించి, అతడి గురించి ఆరా తీసింది. కొద్ది గంటల్లోనే కనీసం యాభై మంది బాధితులు అతడు తమనెలా మోసం చేసిందీ, లైంగికంగా ఎలా హింసించిందీ నదీన్తో పంచుకున్నారు. అలా ఈజిప్టులో మీటూకు నదీన్ ఇన్స్టాగ్రామ్ నుంచి తొలి అడుగు పడింది. అదే సమయంలో ఈజిప్టు ప్రభుత్వం మీటూకు ఊతం ఇచ్చేలా లైంగిక నేరాల నిరోధక చట్టాన్ని అమల్లోకి తేవడంతో యూఎస్‌లో వైన్‌స్టీన్ అరెస్ట్ అయినట్లే ఈజిప్టులో అహ్మద్ కూడా అరెస్ట్ అయ్యాడు. మీటూ ఉద్యమకారిణిగా నదీన్ గుర్తింపు పొందారు. నదీన్ ఉండేది ఈజిప్టు రాజధాని కైరోలో. ఫిలాసఫీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఆమె తల్లి పౌష్టికాహార వైద్య నిపుణురాలు. తండ్రికి సొంత సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. కూతురి మీటూ ఉద్యమ సారథ్యానికి ఇద్దరూ చోదకశక్తుల్లా పనిచేస్తున్నారు. నిజంగా ఇది గొప్ప సంగతి. అందుకే.. ‘‘లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా కీలకమైన ఉద్యమ పాత్రను పోషిస్తూ సమాజంలో మార్పు తెచ్చేందుకు నదీన్ కృషి చేస్తోంది’ అని బి.బి.సి. ఇచ్చిన ప్రశంసకు నదీన్ తల్లిదండ్రులూ పాత్రులే. ‘‘నేనిక్కడితో ఆగిపోవడం లేదు’’ అని మంగళవారం ‘ఈజిప్షియన్ స్ట్రీట్స్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు నదీన్ అష్రాఫ్. లైంగిక హింసకు, వేధింపులకు గురవుతున్న మహిళలకు మద్దతుగా నిలబడి, వారికి న్యాయపరమైన సహకారం కూడా ఉచితంగా అందే ఏర్పాటు చేస్తున్న నదీన్ ఆన్లైన్ వేదికగా మహిళలందరినీ బాధితుల తరఫున సమైక్య పరిచే ప్రణాళిక ను సిద్ధం చేసుకుంటున్నారు. తనుశ్రీ దత్తా, యాష్లీ జూడ్ -
ప్రైవేట్ ఫొటోషూట్.. మోడల్ అరెస్టు!
కైరో: పురావస్తు శాఖ నిబంధనలు ఉల్లంఘించిన ఫొటోగ్రాఫర్, మోడల్‌ను ఈజిప్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్కియాలజీ జోన్లో ప్రైవేట్ ఫొటోషూట్ నిర్వహించినందుకు వారిని అరెస్టు చేశారు. మోడల్- డాన్సర్ సల్మా అల్-షిమీ 4700 వందల ఏళ్లనాటి చరిత్ర గల జోసర్ పిరమిడ్ ప్రాంగణంలో ఈజిప్షియన్ల పూర్వకాలం నాటి వస్త్రధారణను తలపించేలా దుస్తులు ధరించి ఫొటోలు దిగారు. వారం రోజుల కిత్రం తన ఇన్‌స్టా అకౌంట్లో వీటిని షేర్ చేశారు. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో తొలుత ఫొటోగ్రాఫర్‌ను, ఆ తర్వాత షిమీని కూడా అరెస్టు చేసినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. (చదవండి: 2,500 ఏళ్ల తరువాత 'మమ్మీ'ని బయటకు తీశారు) ఈజిప్షియన్ల సంప్రదాయాలను అగౌరవపరిచినందుకు వీరిపై ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. కాగా ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ‘‘ఆర్కియాలజీ జోన్లో ఫొటోలు తీసుకోవడంపై నిజంగానే నిషేధం ఉందా? లేదా ఉద్దేశపూర్వకంగానే అరెస్టు చేశారా’’అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కాగా అసభ్యతను వ్యాప్తి చేస్తున్నారంటూ సోషల్ మీడియా ఇన్ల్ఫూయర్స్పై ఈజిప్టు ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తున్న విషయం తెలిసిందే. చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తోంది. (చదవండి: టిక్‌టాక్: కటకటాల వెనక్కు బెల్లీ డ్యాన్సర్) View this post on Instagram A post shared by Salma Elshimy (@salma.elshimy.officiall) -
ఘాటెక్కిన ఉల్లి.. కిలో @110
సాక్షి, చెన్నై: మార్కెట్లో ఉల్లి మళ్లీ కన్నీళ్లు పెట్టిస్తోంది. దిగుమతి తగ్గడంతో అమాంతంగా రేటు పెరిగింది. మంగళవారం కిలో ఉల్లి రూ.110 పలికింది. ఈ ధర మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు వ్యాపారులు పేర్కొంటున్నారు. రాష్ట్రానికి ఎక్కువగా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఉల్లి దిగుమతి అవుతుంది. అతిపెద్ద సైజు కల్గిన ఉల్లిపై రెండు రాష్ట్రాల నుంచి, చిన్న సైజు రకం ఆంధ్రా నుంచి ఇక్కడికి సరఫరా అవుతుంటాయి. కొద్ది రోజులుగా వర్షాలు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రా, తెలంగాణలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుండడంతో ఉల్లి సరఫరా ఆగింది. దిగుమతి ఆగడంతో మంగళవారం ఉల్లి ఘాటెక్కింది. మున్ముందు ధర అమాంతంగా పెరుగుతూ కన్నీళ్లు పెట్టించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. చెన్నైలో అతి పెద్ద మార్కెట్‌గా ఉన్న కోయంబేడుకు రోజుకు 150 లారీలు రావాల్సి ఉండగా తాజాగా 50 లారీలు మాత్రమే వచ్చాయి. దీంతో ధర అమాంతంగా పెరిగింది. కిలో రూ.100కు పై మాటే.. రాష్ట్రంలో ఉల్లి కొన్ని చోట్ల రూ.100, రూ.110 అంటూ ధర పలికింది. ఉల్లి ఘాటు మరింతగా పెరగనున్న నేపథ్యంలో పాలకులు స్పందించారు. ప్రభుత్వ తోట పచ్చదనం దుకాణాల ద్వారా ఉల్లిని తక్కువ ధరకు అందించేందుకు సిద్ధమయ్యారు. అలాగే డిమాండ్‌కు తగ్గ ఉల్లిని దిగుమతి చేయించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా ప్రజల్ని ఉల్లి ఘాటు నుంచి గట్టెక్కించేందుకు ‘తోట, పచ్చదనం, వినియోగదారుల దుకాణం’ల ద్వారా కిలో రూ.45కు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకున్నామని సహకార మంత్రి సెల్లూరు కే రాజు తెలిపారు. అలాగే పెరుగుతున్న ఉల్లి ధరను పరిగణించి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఉల్లి కొనుగోలు చేసి, ప్రజలకు తమ పరిధిలోని దుకాణాల ద్వారా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలి పారు. ఎవరైనా టోకు వర్తకులు ఉల్లి నిల్వ ఉంచుకుని ఉంటే, చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం ఈజిప్టు ఉల్లి 27 టన్నులు కోయంబేడుకు వచ్చి చేరడం కాస్త ఊరట. -
2,500 ఏళ్ల తర్వాత 'మమ్మీ'ని బయటకు తీశారు!
కైరో: ఈజిప్టు చరిత్రను చూస్తే మమ్మీలు గుర్తుకు రాక మానవు. ఏళ్ల నాటి మమ్మీలను వెలికి తీసి వాటి చరిత్రను తవ్వి తీయడంలో అక్కడి సైంటిస్టులు కూడా ఎంతో ఆసక్తి చూపుతుంటారు. అయితే పురావస్తు శాస్త్రవేత్తలు ఈ సంవత్సరం ఆరంభంలో సక్కారా ప్రాంతంలో 59 మమ్మీలను వెలికి తీశారు. సక్కారా అనేది ఈజిప్టులో విస్తారమైన, పురాతన శ్మశానవాటిక. ఇక్కడ వెలికి తీసిన మమ్మీలు దాదాపు 2,500 ఏళ్ల క్రితానికి చెందినవిగా గుర్తించారు. శనివారం రోజున అందుకు సంబంధించిన ఓ శవపేటికను ఈజిప్టు పురావస్తు శాస్త్రవేత్తలు తెరిచారు. బయటకు తీసిన శవపేటికలు, అందులోని మమ్మీలు కూడా చెక్కుచెదరకుండా ఉండటాన్ని గుర్తించారు. ఇవి ఈజిప్టు సమాజంలోని పూజారులు, ఇతర గొప్ప వ్యక్తులువిగా గుర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఈజిప్ట్ పర్యాటక, పురావస్తు మంత్రిత్వ శాఖ తన ఖాతాలో పోస్ట్‌లో చేయగా.. ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈజిప్టులోని న్యూజిలాండ్ రాయబారి గ్రెగ్ లూయిస్ కూడా శనివారం ట్విటర్లో అన్‌సీలింగ్ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో శవపేటికలో మమ్మీ వస్త్రంతో చుట్టబడి, ఏమాత్రం పాడవకుండా ఉంది. ఈజిప్టు పురావస్తు శాఖ షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటిదాకా 9 మిలియన్ల మంది వీక్షించారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు అనేక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 2020 సంవత్సరంలో ఒక మిలీనియా పాత శవపేటికను తెరవడం ఉత్తమమైన చర్య కాకపోవచ్చు అంటూ ఓ నెటిజన్ చమత్కరించారు. నేషనల్ జియోగ్రాఫిక్ ప్రకారం, పాప్ సంస్కృతిలోని జానపద కథల్లో మమ్మీలను తెరవడం ద్వారా మరణాలకు, శాపాలకు దారితీస్తుందనే అపోహ కూడా ఉంది. (ఒక ఫొటో ఎంపీకి నిద్ర లేకుండా చేస్తోంది!) The mummy tomb, which has been sealed for 2500 years, has been opened for the first time. pic.twitter.com/KWGT95girv — Psychedelic Art (@VisuallySt) October 5, 2020 కాగా.. ఈజిప్టు పర్యాటక, పురాతన మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం మొదట 13 శవపేటికలతో మూడు బావులు సక్కారాలో కనుగొనబడ్డాయి. ఆ తర్వాత మరో 14 శవపేటికలు బయటపడ్డాయి. అలా ఈ రోజు వరకు మొత్తం 59 శవపేటికలను వెలికితీశారు. అయితే వీటిని గిజాలోని కొత్త గ్రాండ్ ఈజిప్టియన్ మ్యూజియానికి తరలించి ప్రదర్శన కోసం ఉంచనున్నారు. -
అసభ్య వీడియోలు: బెల్లీ డ్యాన్సర్‌కు జైలు శిక్ష
కైరో: టిక్‌టాక్‌తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో అసభ్య వీడియోలు పోస్ట్ చేస్తున్న బెల్లీ డ్యాన్సర్‌కు ఈజిప్ట్ కోర్టు జైలు శిక్ష విధించింది. ఆమె పోస్టులు సంబంధ బాంధవ్యాలకు మచ్చ తెచ్చే విధంగా ఉన్నాయంటూ మండిపడింది. దీంతో 3 లక్షల పౌండ్ల జరిమానాతోపాటు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈజిప్షియన్ బెల్లీ డ్యాన్సర్ సామా ఎల్ మాస్రీ సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు, అసభ్యకర వీడియోలు పోస్టు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను ఏప్రిల్‌లో అరెస్టు చేశారు. (టిక్‌టాక్‌కు చెక్ పెట్టే ఇండియన్ యాప్) ఆమె సోషల్ మీడియా అకౌంట్లపైనా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో శనివారం విచారణ చేపట్టిన కోర్టు.. సాంప్రదాయ విధానాలను ఉల్లంఘిస్తూ, విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించే విధంగా ఆమె పోస్టులు ఉంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు ప్రతిఫలంగా మూడేళ్ల జైలు శిక్షతో పాటు మూడు లక్షల పౌండ్ల జరిమానా విధించింది. అయితే ఎవరో తన సమాచారాన్ని దొంగిలించి, కావాలనే తన అకౌంట్ల నుంచి పోస్ట్ చేస్తున్నారని ఆమె వాపోయింది. దీనిపై కోర్టుకెళతానని, న్యాయం జరిగేవరకు పోరాడుతానని తెలిపింది. కాగా అసభ్య వీడియోలు పోస్ట్ చేసే ఇతర టిక్‌టాక్ అకౌంట్లపైనా చర్యలు తప్పవని ఈజిప్ట్ అధికారులు హెచ్చరించారు. (‘జులై 10 నుంచి థియేటర్లు ఓపెన్?’) -
సెట్లో యాంకర్‌పై కోతి దాడి.. పరుగో పరుగు
-
సెట్లో యాంకర్‌పై కోతి దాడి.. పరుగో పరుగు
అప్పటి వరకు కోతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని సరదాగా ముద్దు చేసిన యాంకర్ ఒక్కసారిగా కోతిని నెట్టేసి సెట్లో నుంచి బయటకు పరుగులు తీసింది. ఈ సరదా ఘటన ఈజిప్టులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లోబ్నా అసల్ అనే మహిళ జర్నలిస్ట్ తన సహ జర్నలిస్ట్‌లతో కలిసి టెలివిజన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంది. వీరు ఇంటర్యూ చేస్తున్న ఈజిప్టు నటుడు తనతో ఓ కోతిని వెంట తీసుకొచ్చాడు. కోతిపై ముచ్చటపడ్డ యాంకర్ దానిని తన పక్కన కూర్చోబెట్టుకుని ఆడించింది. (ఫోన్లో గేమ్ ఆడిన కప్ప; చివర్లో మాత్రం) యాంకర్‌తో కోతి కాసేపు బాగానే ఉంది. అయితే ఇంటర్వ్యూ మధ్యలో అనూహ్యంగా కోతి యాంకర్‌పై తిరగబడింది. ఆమెపై దూకి కాళ్లు గోకడం ప్రారంభించింది. కోతి దాడి చేయంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచిన యాంకర్ దాన్ని అదుపు చేసేందుకు ప్రయత్నించింది. అయినప్పటికీ ఏమాత్రం తగ్గకపోవడంతో కోతి నుంచి రక్షించుకోడానికి దాన్ని నెట్టేసి సెట్ నుంచి పరుగులు తీసింది. చివరికి ఓ వ్యక్తి వచ్చి కోతిని తీసుకున్నాడు. మూడు రోజుల క్రితం యూట్యూబ్‌లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇప్పటి వరకు దీనిని 50 వేల మంది వరకు వీక్షించారు. (వైరల్: జలకాలాటల్లో ఏమీ హాయిలే..) -
మశూచీ.. చైనా నుంచే?
సాక్షి, హైదరాబాద్: కరోనా అనగానే టక్కున మదిలో మెదిలేది చైనాలోని వూహాన్ నగరం.. ప్రపంచ వ్యాప్తంగా రెండున్నర లక్షల మంది మృతికి కారణమైన వైరస్ ఇక్కడి నుంచే బయలుదేరింది. దాని పుట్టుకలో చైనా చెప్తున్న మాటలను ప్రపంచం పచ్చి అబద్ధాలుగా కొట్టిపడేస్తోంది. గతంలో సార్స్ కూడా చైనా నుంచే మొదలై ప్రపంచ దేశాలని ఆందోళనకు గురి చేసింది. వూహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ బయటకు వచ్చిందని అమెరికా గట్టిగా చెప్తుండగా, ఇతర ప్రధాన దేశాలు దాన్ని ఖండించటం లేదు. ప్రపంచం మొత్తాన్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిన ఈ వైరస్ ఎలా వెలుగుచూసిందో విచారణ జరగాలనే దేశాల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో.. అసలు చైనా భూభాగాన్ని వేదికగా చేసుకుని వైరస్లు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది. ఈ క్రమంలో.. తొలి అంటువ్యాధి మశూచి విషయంపై చాలా మంది దృష్టి పడింది. ఈ వైరస్‌ను వేగంగా ప్రపంచానికి చైనానే అంటించిందన్న ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. 3100 సంవత్సరాలకు క్రితమే.. మశూచి పేరు వింటే ఇప్పటికీ ప్రపంచం గజగజ వణుకుతుంది. చరిత్రలో అంతటి తీవ్ర ప్రభావాన్ని చూపిన మరో అంటువ్యాధి లేదు. 20వ శతాబ్దంలో ఏకంగా 50 కోట్ల మందిని ఈ వ్యాధి పొట్టనపెట్టుకుంది. మరి దీని పుట్టుక ఎప్పుడో తెలుసా.. ఇతమిత్థంగా ఆధారాలు లేనప్పటికీ దాదాపు 3100 సంవత్సరాల క్రితమే దీనికి మనుగడ ఉన్నట్టు తేలింది. అంతకు కొన్ని శతాబ్దాల క్రితం నుంచే ఆ వ్యాధి ఉందన్న అభిప్రాయాలున్నా.. ఆధారాలు లేవు. కానీ, క్రీ.పూ.1122లో చైనాలో దీనికి సంబంధించిన లిఖితపూర్వక ఆధారాలు వెలుగు చూశాయి. అప్పటికే చైనాలో ఈ వ్యాధి బలంగా ప్రబలి ఉంది. వెరసి మశూచి చైనాలోనే పుట్టిందనే భావన చరిత్రకారుల్లో వ్యక్తమైంది. అయితే, ఇది చైనాలో పుట్టలేదని, ఈజిప్టులో పుట్టి అక్కడి నుంచి చైనాకు చేరిందన్న చరిత్రకారులూ ఉన్నారు. ఎక్కువమంది చైనాకు ఇది బయటి నుంచే వచ్చిందని చెప్పారు. కానీ, అప్పటికే చైనాలో నాగరికత బాగా విలసిల్లుతూ జనాభా పెరుగుతున్నక్రమం కావటంతో, చైనాలో దీని బారిన పడ్డవారి సంఖ్య విపరీతంగా ఉందనేది కొందరు చరిత్రకారుల మాట. అప్పటికే చైనా వర్తకవాణిజ్యాలను ఇతర దేశాలకు విస్తరించటం ప్రారంభించింది. ఈ క్రమంలో చైనా నుంచి ప్రస్తుతం జపాన్, కొరియా, కంబోడియా తదితర ప్రాంతాలకు, తర్వాత భారత్‌కు విస్తరించినట్టు చెబుతారు. ఆ సమయంలో జపాన్‌లో ఒక్కసారిగా వ్యాధి ప్రబలి మూడింట ఒక వంతు జననష్టం జరిగిందని చెబుతారు. ఈజిప్టు మమ్మీ మొహానికి మచ్చలు.. ఈజిప్టులో ఉన్న మమ్మీ సంస్కృతి మశూచి విషయంలో కొన్ని అనుమానాలు రేకెత్తించింది. క్రీ.పూ.1156లో చనిపోయిన ఓ మధ్య వయస్కుడైన వ్యక్తి శవాన్ని మమ్మీగా మార్చారు. కొన్నేళ్ల క్రితం ఈ మమ్మీపై పరిశోధనలు జరిపి మొహం భాగంలో మచ్చలున్నట్టు గుర్తించారు. అవి మశూచి మచ్చలే అయి ఉంటాయని అంచనాకొచ్చారు. కానీ కచ్చితంగా నిర్ధారించలేదు. దీంతో ఈజిప్టు నుంచే చైనాకు మశూచీ పాకిందని చెబుతారు. కానీ, ప్రపంచానికి వేగంగా ప్రబలేలా చైనానే కారణమైందని చెబుతారు. చైనాతో వాణిజ్య సంబంధాలున్న దేశాలన్నింటికి మశూచి వేగంగా సోకింది. విస్తృతంగా ప్రబలింది. అప్పట్లో వ్యాధి సోకిన ప్రతి 10 మందిలో ముగ్గురు చనిపోయేవారు. 20 శతాబ్దంలో బ్రిటన్‌లో ప్రతి సంవత్సరం 5 లక్షల మంది, భారత్‌లో ప్రతి సంవత్సరం 2 లక్షల మంది, జర్మనీలో 50 వేల మంది.. ఇలా చనిపోయేవారు. 1796లో బ్రిటిష్ వైద్యుడు ఎడ్వర్డ్ జెన్నర్ టీకాను కనిపెట్టిన తర్వాత కేసుల సంఖ్య కొంత తగ్గుతూ వచ్చింది. అయితే తొలుత ఆ వ్యాక్సిన్‌ను ప్రపంచం యావత్తు వ్యతిరేకించటంతో కొంతమందే వాడారు. చివరకు 1967లో ప్రపంచ ఆరోగ్య సంస్థ జోక్యం చేసుకోవటంతో వ్యాక్సిన్ విస్తృతంగా వాడి ప్రపంచం మశూచీని జయించింది. 1980లో ఇక మశూచీ క్రిమి అంతరించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. చిట్ట చివరి మశూచి కేసు.. ప్రపంచంలో చిట్ట చివరి మశూచి (వరియోలా మైనర్ వైరస్)కేసు 1975లో బంగ్లాదేశ్‌లో నమోదైంది. రహీమా బాను అనే మూడేళ్ల బాలిక మశూచీ బారిన పడి కోలుకుంది. చిట్ట చివరి మశూచి మృతి 1978లో చోటుచేసుకుంది. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ మెడికల్ మైక్రోబయోలజీ డిపార్ట్మెంట్ ఉద్యోగి జెనత్ పార్కర్ మశూచి బారిన పడి మృతి చెందింది. చరకసంహితలో ప్రస్తావన.. వ్యాధులు, వైద్యానికి సంబంధించి చరకసంహితలో ఎన్నో విషయాలు వేల ఏళ్ల క్రితమే నమోదై ఉన్నాయి. క్రీ.పూ.3వ శతాబ్దంలోనే ఇందులో మశూచి ప్రస్తావన ఉంది. మసురిక అంటూ పేర్కొన్న విషయం మశూచికి సంబంధించిందనే అంటారు. మన దేశానికి తూర్పు భాగం నుంచి ఈ వ్యాధి ప్రబలి ప్రవేశించిందని ఆ పుస్తకంలో ఉందని చరిత్రకారులు విశ్లేషిస్తారు. వెరసి చైనా నుంచే ఈ వ్యాధి ప్రబలిందని చాలామంది బలంగా నమ్ముతారు. -
హోస్నీ ముబారక్ కన్నుమూత
కైరో: ఈజిప్టు మాజీ అధ్యక్షుడు, సుమారు 30 ఏళ్లపాటు మధ్యప్రాచ్యంలో శాంతి, సుస్థిరతలకు ప్రతీకగా చెప్పుకునే నేత హోస్నీ ముబారక్ (91) మంగళవారం మరణించారు. ఆయన ఆరోగ్య సమస్యల కారణంగా మరణించినట్లు ఈజిప్టు టెలివిజన్ ప్రకటించింది. అధ్యక్షుడిగా ఉన్నంత కాలం అమెరికాకు సన్నిహితుడిగా మెలిగారు. అయితే 2011లో ఈజిప్టు యువత సుమారు 18 రోజుల పాటు కైరోలోని సెంట్రల్ తహ్రీర్ స్క్వేర్‌లో జరిపిన ఆందోళనల కారణంగా మిలటరీ వర్గాలు హోస్నీ ముబారక్‌తో బలవంతంగా రాజీనామా చేయించాయి. ఈజిప్ట్ చరిత్రలోనే మొదటిసారి ఒక అధ్యక్షుడిని పదవీచ్యుతుడిని చేయడమే కాకుండా జైల్లో పెట్టడం ముబారక్ విషయంలోనే జరిగింది. అరబ్ స్పింగ్ ఆందోళన సమయంలో 900 మంది ఆందోళనకారుల మరణాలను నిలువరించడంలో విఫలమయ్యారన్న ఆరోపణలపై న్యాయస్థానాలు 2012 జూన్‌లో ముబారక్‌ను దోషిగా నిర్ధారించి యావజ్జీవ జైలుశిక్ష విధించాయి. అయితే ఈజిప్టు ఉన్నత న్యాయస్థానం 2014లో వీరిద్దరినీ నిర్దోషులుగా విడుదల చేసింది. -
ఈజిప్టులో బస్ ప్రమాదం, భారతీయులకు గాయాలు
కైరో: ఈజిప్టులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐన్ సోఖ్నా సమీపంలో 16 మంది భారత పర్యాటకులు బస్సు ప్రమాదానికి గురయ్యారని కైరోలోని భారత రాయబార కార్యాలయం శనివారం తెలిపింది. ఈజిప్టులోని ఓ ఆన్లైన్ పత్రిక తెలిపిన వివరాల ప్రకారం.. పర్యాటకులతో వెళుతున్న బస్సును ట్రక్కు ఢీకొట్టగా అనూహ్యంగా వేనకాలే వస్తున్న మరో బస్సును ట్రక్కు ఢీకొట్టింది. పలువురు గాయపడగా, ఆరుగురు మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఓ భారతీయుడు, ఇద్దరు మలేషియా దేశస్తులు, ముగ్గురు ఈజిప్టుకు చెందిన వారున్నారు. క్షతగాత్రులను సూయోజ్, కైరో ఆసుపత్రులలో చేర్పించారని అధికారులు తెలిపారు. ఎంబసీ అధికారులు... సంఘటనను పర్యవేక్షిస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. పర్యాటకుల సమాచారం కొరకు రెండు హెల్ప్‌లైన్ నంబర్లను ఇచ్చారు. హెల్ప్‌లైన్ నంబర్లు + 20-1211299905, +201283487779 అందుబాటులో ఉన్నాయని భారత రాయబార కార్యాలయం, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేరిట ట్వీట్ చేశారు. -
ఈజిప్ట్ టూ విజయవాడ
విజయవాడ: బయటి విపణిలో ఉల్లిపాయల ధరలు దిగిరావడం లేదు. దేశమంతా ఈ సమస్య నెలకొని ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా రైతుబజార్లలో కిలో రూ.25కు అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని డిమాండ్‌కు తగిన విధంగా ఉల్లిపాయలు అందరికీ అందించేందుకు ఈజిప్టు దేశం నుంచి ఉల్లిపాయలను దిగుమతి చేస్తోంది. సదరు ఉల్లిపాయలు విజయవాడ స్వరాజ్య మైదానానికి దిగుమతి అయ్యాయి. కృష్ణా జిల్లాలో సరఫరా చేసేందుకు 1120 బస్తాలను సంసిద్ధం చేసింది. చూడటానికి కొంచెం పెద్ద సైజులో ఉన్నా రుచికేం ఢోకా ఉండదని చెబుతున్నారు. -
విజయవాడలో ఈజిప్టు ఉల్లిపాయలు
సాక్షి, కృష్ణా: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉల్లిపాయల కొరత తీర్చడానికి ఈజిప్టు నుంచి దిగుమతి చేసుకోవాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. తొలి విడతలో జిల్లాకు 27 టన్నుల ఈజిప్టు ఉల్లి పాయలను కేటాయించారు. మంగళవారం విజయవాడలోని రైతు బజారుల్లో 15 టన్నుల ఉల్లిపాయలు విక్రయం జరిగింది. గుడివాడ, మచిలీపట్నం రైతు బజారుల్లో ఉల్లిపాయలు అందుబాటులో ఉన్నాయని మార్కెటింగ్ శాఖ అధికారలు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలోనూ కిలో రూ.25 చొప్పున ఉల్లిపాయలు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. -
ఇక ఈజిప్టు ఉల్లి!
సాక్షి, అమరావతి బ్యూరో: కొన్నాళ్లుగా ఊరిస్తున్న ఈజిప్టు ఉల్లి జిల్లాకు వచ్చేస్తోంది. ఈ మేరకు ఈజిప్టు నుంచి ఉల్లిపాయలతో బయలుదేరిన తొలి నౌక ఇప్పటికే ముంబైకి చేరింది. అక్కడ శనివారం రాత్రి ఉల్లిపాయలు లోడు చేసుకున్న లారీలు రాష్ట్రానికి బయలుదేరాయి. ఇవి సోమవారం నాటికి విజయవాడ చేరుకుంటాయని మార్కెటింగ్ శాఖ అధికారులుభావిస్తున్నారు. మంగళవారం నుంచి విక్రయాలు ప్రభుత్వం ఉల్లి కొరతను తీర్చడానికి ఈజిప్టు నుంచి దిగుమతి చేసుకోవాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ఉల్లిపాయలు ఈజిప్టు నుంచి ముంబై పోర్టుకు నౌకలో వస్తాయి. అక్కడ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు లారీల్లో తరలిస్తారు. జిల్లాకు తొలి విడతలో 25 టన్నుల ఈజిప్టు ఉల్లిని కేటాయించారు. నగరానికి రాగానే మంగళవారం నుంచి వీటిని రాయితీపై పంపిణీ చేయనున్నారు. కొన్నాళ్లుగా కర్నూలు, తాడేపల్లిగూడెం, హైదరాబాద్‌ల నుంచి దిగుమతి చేసుకుంటుండగా.. కొద్దిరోజుల క్రితం అవి కూడా నిలిచిపోయాయి. ప్రస్తుతం జిల్లాకు మహారాష్ట్రలోని సోలాపూర్, నాసిక్ ప్రాంతాల నుంచి రోజుకు 60–70 టన్నుల ఉల్లిపాయలు వస్తున్నాయి. ఉల్లి ధరలు ఆకాశన్నంటిన నేపథ్యంలో ప్రభుత్వం నవంబర్ 17 నుంచి రైతు బజార్లు, మార్కెట్ యార్డుల్లో రాయితీతో కిలో పాయలు రూ.25కే విక్రయిస్తోంది. తాజాగా ఈజిప్టు ఉల్లి కూడా అందుబాటులోకి రానుండడంతో వినియోగదారులకు ఉల్లిపాయల కొరత చాలా వరకు తీరనుంది. రాయితీ ఉల్లి అందుబా టులోకి తెచ్చినప్పట్నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 1,100 టన్నుల ఉల్లిని వినియోగదారులకు సరఫరా చేశామని మార్కెటింగ్ శాఖ డెప్యూటీ డైరెక్టర్ దివాకరరావు చెప్పారు. మూడు రోజుల్లో రెండో నౌక.. రెండుమూడు రోజుల్లోనే మరో నౌక ఈజిప్టు నుంచి ఉల్లిపాయలతో ముంబైకి రానుంది. ఆ నౌక కూడా వస్తే మరిన్ని ఈజిప్టు ఉల్లిపాయలు రాష్ట్రానికి, జిల్లాకూ వస్తాయి. -
రాష్ట్రానికి ఈజిప్టు ఉల్లి
సాక్షి, అమరావతి: ఉల్లి కొరతను అధిగమించేందుకు రాష్ట్రానికి ఈజిప్టు ఉల్లిపాయలు దిగుమతి కానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌తోపాటు పశ్చిమబెంగాల్, ఒడిశా, కేరళ, సిక్కిం రాష్ట్రాల్లో ఉల్లి కొరత తీవ్రంగా ఉంది. కొనుగోలుదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాలకు నాఫెడ్ (నేషనల్ అగ్రికల్చరల్ కో–ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్) ద్వారా ఉల్లిని సరఫరా చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. ఈజిప్టు నుంచి 6,090 మెట్రిక్ టన్నుల ఉల్లి కొనుగోలుకు ఆర్డరు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. తొలిదశలో 2,265 మెట్రిక్ టన్నులను రాష్ట్రాలకు సరఫరా చేయనుంది. కాగా, రాష్ట్రానికి 1000 మెట్రిక్ టన్నుల ఉల్లిని సరఫరా చేయాలని కోరుతూ రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంగళవారం నాఫెడ్‌కు లేఖ రాసింది. సముద్ర మార్గంలో ఈ ఉల్లిపాయలు దిగుమతి కానుండటంతో డిసెంబర్ 10 తర్వాత రాష్ట్ర కొనుగోలుదారులకు అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా రైతుల నుంచి సర్కారు కిలో రూ.55 నుంచి రూ.60లకు కొనుగోలు చేసి రైతుబజార్ల ద్వారా రాయితీపై కిలో రూ.25లకు విక్రయిస్తోంది. ఇలా రోజుకు 150 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలను మార్కెటింగ్ శాఖ కొనుగోలు చేస్తోంది. దీనివల్ల ప్రభుత్వంపై రోజుకు రూ.40 లక్షల భారం పడుతోంది. ధరల స్థిరీకరణ నిధితో మార్కెటింగ్ శాఖ ఈ కొనుగోళ్లను చేపడుతోంది. -
ఈజిప్టు నుంచి 6వేల టన్నుల ఉల్లి
న్యూఢిల్లీ: దేశీయంగా ఉన్న కొరత, పెరుగుతున్న ధరను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈజిప్టు నుంచి 6వేల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకోనుంది. దీనిని కిలో రూ.52–60 స్థాయిలో రాష్ట్రాలకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. సుమారు 1.2 లక్షల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకోవాలని గత వారం కేబినెట్ సమావేశం నిర్ణయించింది. ‘ఈజిప్టు నుంచి మొదటి విడతగా 6,090 టన్నుల ఉల్లి కొనుగోలు చేయాలని నిర్ణయించాం. కావాలనుకున్న రాష్ట్రాలు డిసెంబర్ మొదటి వారం నుంచి ఈ స్టాకును తీసుకెళ్లవచ్చునన్నారు. -
మోసపోయి.. జైలుకు చేరువై
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళం రూరల్ మండలం గూడేం పంచాయతీ చంద్రయ్యపేటకు చెందిన బగ్గు రమణ అనే యువకుడికి ఈజిప్టులో ఉరిశిక్ష పడిందన్న వార్త కలకలం రేపింది. ఈ వార్త తెలిసినప్పటి నుంచి రమణ తల్లిదండ్రులు, స్థానికులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఉపాధి కోసం వెళ్లిన బిడ్డకు పట్టిన గతి చూసి తల్లడిల్లిపోతున్నారు. సీమెన్ అవుతానని చెప్పి వెళ్లిన కుమారుడి గురించి ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని రోదిస్తున్నారు. మూడేళ్లుగా రమణ అక్కడ జైలు జీవితం గడుపుతున్నా ఇంటికి తెలీకపోవడం విచారకరం పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చంద్రయ్యపేటకు చెందిన బగ్గు రమణ ఇంటర్ ఫెయిల్ అయ్యాడు. తాపీ పని చేసుకుంటూ బతికేవాడు. తెలిసిన వారంతా విదేశాలకు ఉద్యోగాలకు వెళ్తుండడంతో కపిలవాయి శ్రీహర్ష అనే దళారీని 2016 ఆగస్టులో ఈయన సంప్రదించారు. దళారీకి సుమారు రూ.4లక్షలు ముట్టచెప్పగా ఓ ఫారెన్ షిప్‌ను ఎక్కించేశాడు. వాస్తవానికి ఆ దళారీ రమణకు సీమెన్ ఉద్యోగం అని చెప్పాడు. కానీ ఆ ఉద్యోగానికి సంబంధించి సీడీసీ(కంటిన్యూ డిశ్చార్జ్ సర్టిఫికెట్) ఇవ్వకుండా, శిక్షణ లేకుండానే ఊరూపేరూ లేని మరో సీడీసీ ఇప్పించి ఇరాన్ దేశానికి చెందిన సీలైట్కో కంపెనీకు చెందిన అబ్ధాన్ ఫిర్దోష్ షిప్‌ను సెప్టెంబర్ 7, 2016న ఎక్కించేశాడు. నిజానికి ఈ షిప్ డ్రగ్స్ సప్లై చేస్తూ ఇరాన్ నుంచి ఈజిప్టుకు వెళ్తుంటుంది. మాదక ద్రవ్యాల రవాణాపై ఈ దేశాలు చాలా కఠినంగా ఉంటాయి. మూడు నెలలు ఆ షిప్‌లోనే రమణ పనిచేశాడు. ఆ తర్వాత 2016 డిసెంబర్లో షిప్‌ను ఈజిప్టు కోస్టుగార్డులు పట్టుకున్నారు. అందులోనే ఉన్న రమణను కూడా అరెస్టు చేశారు. మూడేళ్లుగా రమణ జైలు జీవితం గడుపుతున్నాడు. రెండు మూడు నెలలకోసారి కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడేవాడు. అయితే జైలు జీవితం అనుభవిస్తున్నట్లుగా ఎవరికీ చెప్పకపోవడం గమనార్హం. పరారైన దళారీ.. రమణకు ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసినకపిలవాయి శ్రీహర్షవర్మ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈయన మాయమాటలు నమ్మి సీమెన్ ఉద్యోగం కోసం వెళ్లిన విశాఖకు చెందిన ఓ వ్యక్తి కొన్నేళ్ల కిందట మృతి చెందినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈయన విజయవాడలో ఉన్నప్పటికీ ఆధార్, వాహన రిజిస్ట్రేషన్లు అన్నీ విశాఖపట్నం కేంద్రంగా చూపిస్తున్నట్లు సమాచారం. ఈ దళాదీ నెలకొల్పిన ఎస్కేడీ మెరైన సంస్థ కొన్ని నెలల కిందటే మూతబడింది. ఎంతో మంది యువకుల వద్ద సీమెన్ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి రూ.లక్షల కొద్దీ దండుకుని బోర్డు తిప్పేశారు. ఎంపీ కిషన్‌రెడ్డికి వినతి పత్రం అందిస్తున్న రమణ బంధువులు బావమరిది ద్వారా బయటపడింది.. రమణ జైల్లోనే ఉన్నా.. రెండు మూడు నెలలకు ఓ సారి ఫోన్లో మాట్లాడుతూ ఉండడంతో ఎవరికీ అనుమానం రాలేదు. అయితే 2018 ఏప్రిల్‌లో రమణ చెల్లెలికి వివాహం నిశ్చయమైంది. ఈ శుభకార్యానికి రమణ రాలేదు. దీంతో ఆయన బావమరిది జయరాం దీనిపై ఆరా తీశారు. అప్పటికే జైల్లో ఉన్న రమణ ఇంటికి, స్నేహితులకు ఫోన్ చేయడం మానేశాడు. దీంతో రమణ కనిపించడం లేదని 2019 జూన్‌లో శ్రీకాకుళం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో జయరాం ఫిర్యాదు చేశారు. జూలై 29న ఎస్పీ, కలెక్టర్‌కు గ్రీవెన్స్‌సెల్‌లోనూ ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 17న ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ(ఎన్ఆర్ఐ) నుంచి జయరాంకు అసలు సందేశం అందింది. మాదక ద్రవ్యాల కేసులో బగ్గు రమణ ఈజిప్టులో అరెస్టయ్యారన్నది ఆ సందేశం సారాంశం. ఈ సంకటం నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తుండగానే రమణకు ఉరిశిక్ష పడినట్లు తెలియడం కుటుంబ సభ్యులను కలిచివేస్తోంది. దీనిపై పై కోర్టుకు అప్పీల్ చేస్తున్నారు. జనవరిలో భవితవ్యం తేలనున్నట్లు సమాచారం. ఇదీ కుటుంబ నేపథ్యం చంద్రయ్యపేట గ్రామానికి చెందిన అప్పన్న, సత్యవతిలకు ముగ్గురు సంతానం. అందులో బగ్గు రమణ పెద్ద కుమారుడు. రెండో కుమారుడు ఆనంద్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఒక చెల్లెలు ఉంది. గార మండలం అంబటివానిపేటకు చెందిన వ్యక్తితో 2018లో వివాహం జరిగింది. వీరిది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం. గ్రామంలో చిన్నా చితకా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అప్పట్లో చెల్లెలు వివాహానికి వస్తానని, కొంత మేరకు నగదు పంపిస్తామని చెప్పాడే తప్ప జైలు జీవితం అనుభవిస్తున్నట్లు ఎవ్వరికీ తెలియకపోవడం బాధకరమైన విషయమే. ఒక్కసారిగా రమణకు ఉరిశిక్ష పడినట్లు తెలియడంతో కుటుంబ సభ్యులే కాకుండా గ్రామస్తులంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. -
మూడో రౌండ్లో జోష్నా
కైరో (ఈజిప్ట్): ప్రపంచ మహిళల స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత నంబర్‌వన్ క్రీడాకారిణి జోష్నా చినప్ప మూడో రౌండ్‌కు చేరింది. హో జె లాక్ (హాంకాంగ్)తో శనివారం జరిగిన రెండో రౌండ్లో 12వ సీడ్ జోష్నా 11–5, 11–4తో రెండు గేమ్‌లను గెలిచి, మూడో గేమ్‌లో 3–0తో ఆధిక్యంలో ఉన్న దశలో ఆమె ప్రత్యర్థి గాయం కారణంగా వైదొలిగింది. -
ప్రాచీన పిరమిడ్ సందర్శనకు అనుమతి
కైరో : కొన్ని దశాబ్దాల తర్వాత ఈజిప్టులో అత్యంత ప్రాచీనకాలానికి చెందిన పిరమిడ్ సందర్శనకై పర్యాటకులకు అనుమతి ఇచ్చారు. దీని పేరు బెంట్ పిరమిడ్. ఇది ఈజిప్టు రాజధాని కైరోకు దక్షిణాన 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. క్రీస్తుపూర్వం 4600 సంవత్సరాల క్రితం దీన్ని ఈజిప్టు నాల్గవ రాజవంశానికి చెందిన కింగ్ స్నెఫేరు కోసం నిర్మించారు. ఈ బెంట్ పిరమిడ్‌ను తెరవడంతో పిరమిడ్ నిర్మాణాలపై పరిశోధనలకు మరింత ఊతం ఇవ్వనుందని పురావస్తు శాస్రవేత్తలు అభిప్రాయపడ్డారు. 101 మీటర్ల ఎత్తుతో అసాధారణంగా ఉన్న ఈ పిరమిడ్ తర్వాత కాలంలో పిరమిడ్ల నిర్మాణానికి అత్యున్నత దశగా పేర్కొనే ప్రఖ్యాత గిజా పిరమిడ్ కట్టడానికి మార్గదర్శి అని తెలిపారు. ఇది తొలిదశలో నిర్మించిన పిరమిడ్లకు, తర్వాత తరంలోని పిరమిడ్లకు మధ్య వారధిలా నిలిచిందని పేర్కొన్నారు. బెంట్ పిరమిడ్‌లో 79 మీటర్లు ఉండే ఇరుకైన సొరంగమార్గం గుండా ప్రధాన చాంబర్‌కు చేరుకోవచ్చు. ఈజిప్టు పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖా మంత్రి ఖలీద్ మాట్లాడుతూ 1965లో దీన్ని మూసివేశామని, బెంట్పిరమిడ్ తో పాటు అల్కాడాగ్మటిక్ అనే మరో పిరమిడ్‌లో కూడా సందర్శకులకు అనుమతి ఇచ్చామన్నారు. బెంట్పిరమిడ్, పిరమిడ్ల నిర్మాణానికి ఒక ప్రత్యేక ఉదాహరణగా నిలుస్తుందని తెలిపారు. అలాగే సమీప ప్రాంతాన్ని అధ్యయనం చేస్తున్న పురావస్తు శాస్త్రవేత్తలు సుమారు 4,000 సంవత్సరాల నాటి పురాతన అవశేషాలను కనుగొన్నారు. ‘రాయి, బంకమట్టి మరియు చెక్క నిర్మాణాలతో కూడిన మమ్మీపై భాగాలు దొరికాయని, అలాగే కొన్ని మమ్మీలు కనుగొన్నామని ’ పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. -
కోర్టు హాల్లో మోర్సీ మృతి
కైరో: ఈజిప్టు పదవీచ్యుత అధ్యక్షుడు మొహమ్మద్ మోర్సీ (67) కోర్టు హాల్లో కుప్పకూలి అక్కడికక్కడే మరణించినట్లు ప్రభుత్వ టీవీ ప్రకటించింది. గూఢచర్యం అభియోగాలు ఎదుర్కొంటున్న మోర్సీ సోమవారం కోర్టుకు హాజరైనప్పుడు ఈ ఘటన జరిగింది. ఆయన భౌతికకాయాన్ని ఆస్పత్రికి తరలించినట్లు టీవీ తెలిపింది. ఈజిప్టును దీర్ఘకాలం పాలించిన హోస్నీ ముబారక్ పదవీచ్యుతుడైన తర్వాత 2012లో జరిగిన ఎన్నికల్లో ఈజిప్టులోని అతిపెద్ద ఇస్లామిస్టు గ్రూపు, ప్రస్తుతం నిషేధానికి గురైన ముస్లిం బ్రదర్‌హుడ్‌కు చెందిన మోర్సీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. -
ఈజిప్టులో ఉగ్రదాడి : 10 మంది మృతి
కైరో : ఈజిప్టులోని సినాయీ పెనిన్సులాలో ఓ చెక్ పోస్ట్‌పై బుధవారం ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. రంజాన్ పర్వదినం సందర్భంగా అల్ అరీష్ నగరంలో ముస్లింలు ప్రార్థనలు జరుపుతున్న నేపథ్యంలో మరోవైపు ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. మృతి చెందిన వారిలో ఇద్దరు అధికారులు, ఎనిమిది మంది ఆర్మీ అధికారులు ఉన్నారు. చెక్ పాయింట్ వద్ద దాడి అనంతరం ఆయుధాలు ఉన్న ఓ వాహనాన్ని తీసుకొని ఉగ్రవాదులు తప్పించుకుపారిపోవాలని ప్రయత్నించారు. అయితే, వెంటనే ఓ యుద్ధ విమానంలో వారిని వెంటాడిన భద్రతా బలగాలు ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చాయి. -
‘ఆఫ్రిదికి, సలాహ్‌కు ఉన్న తేడా ఇదే’
‘ అవును.. ఇంట్లో మనిద్దరం ఒకేలా ఉంటామని నాకు తెలుసు. అయితే నాకిది ఎంతో కొత్తగా అనిపిస్తుంది’ అంటూ ఈజిప్టు ఫుట్‌బాల్ ఆటగాడు మహ్మద్ సలాహ్ ఇన్‌స్ట్రాగామ్‌లో షేర్ చేసిన ఫొటో అభిమానుల హృదయాలు దోచుకుంటోంది. ఇప్పటికే 30 లక్షలకు పైగా లైకులు సాధించిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్, సలాహ్ల మధ్య పోలిక తెస్తూ ఆఫ్రిదిని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ విషయమేమిటంటే.. ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆదివారం లివర్‌పూల్, మాంచెస్టర్ సిటీ జట్ల మధ్య ఫుల్బాల్ మ్యాచ్ జరిగింది. అయితే మ్యాచ్ అనంతరం మైదానంలోకి పరిగెత్తుకొచ్చిన సలాహ్ కూతురు మక్కా.. తండ్రి లాగే తాను కూడా గోల్ కొట్టేందుకు ప్రయత్నించి విజయవంతమైంది. దీంతో మైదానంలో కేరింతలు కొడుతున్న కూతురిని దగ్గరికి తీసుకున్న సలాహ్.. ఆమెను ఆత్మీయంగా హత్తుకున్నాడు. ఈ ఆనందంలో ప్రీమియర్ లీగ్ గోల్డెన్ బూట్ అవార్డు అందుకున్న అనంతరం కూతురితో కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కాగా సామాజిక కట్టుబాట్లను దృష్టిలో ఉంచుకుని తన కూతుళ్లు అన్షా, అజ్వా, అస్మారా, అక్షకు ఇండోర్ గేమ్స్ మాత్రమే ఆడడానికి అనుమతిస్తానని క్రికెటర్ ఆఫ్రిది పేర్కొన్న సంగతి తెలిసిందే. ఎంత ఎదిగినా ఇస్లాం నియమాలను గౌరవిస్తానని తన కూతుళ్లను ఔట్‌డోర్ గేమ్స్ ఆడనిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. ఈ క్రమంలో సలాహ్, ఆఫ్రిదిల మధ్య పోలిక తెచ్చిన ఓ నెటిజన్.. ‘ కూతుళ్లను, వారి ప్రతిభను కంట్రోల్ చేయాలనుకునే ఆఫ్రిది లాంటి తండ్రుల్లాగే.. తన చిన్నారి కూతురిని స్వేచ్ఛగా ఆడుకోనిస్తూ.. వారి ఆనందం చూసి ఉప్పొంగిపోయే సలాహ్ వంటి తండ్రులు కూడా ఉంటారు అంటూ ఆఫ్రిదిని ట్రోల్ చేసింది. ఆమె ట్వీట్‌కు మద్దతు తెలిపిన నెటిజన్లు.. ఆఫ్రిదికి, సలాహ్‌కు ఉన్న తేడా ఇది’ అంటూ ఆఫ్రిదిని విమర్శిస్తున్నారు. చదవండి : నా కూతుళ్లకు ఆ పర్మిషన్ లేదు : మాజీ క్రికెటర్ View this post on Instagram “Yes, I know we have one at home. This is a new one” A post shared by Mohamed Salah (@mosalah) on May 12, 2019 at 1:02pm PDT -
ఈజిప్టులో బయటపడ్డ 50 మమ్మీలు
కైరో : మమ్మీలకు నిలయమైన ఈజిప్టులో తాజా గా మరో 50 మమ్మీలు బయటపడ్డాయి. ఈజిప్టులోని తూర్పు మల్లావిలో టు నా ఎల్ గెబల్ ప్రాంతంలో ఓ భారీ సమాధిని గుర్తించారు. దాదాపు తొమ్మిది మీటర్ల లోతైన గదులున్న ఈ సమాధిలో మొత్తం 50 మమ్మీలను గుర్తించారు. వాటిలో చిన్నపిల్లల శరీరాలను భద్రపర్చిన మమ్మీ లు 12 ఉన్నాయని పురాతత్వశాస్త్రవేత్తలు తెలిపారు. రోమన్ లేదా బైజాన్టియన్ కాలం నాటి మమ్మీలుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 50 మమ్మీల్లో 40 పూర్తిగా వెలికితీశామని, వాటిపై పరిశోధనలు కొనసాగుతున్నాయని ఈజిప్టు పురావస్తు విభాగం సుప్రీం కౌన్సిల్ సెక్రటరీ జనరల్ ముస్తఫా వజీరీ తెలిపారు. ఈ మమ్మీలను చాలా వరకు కుండల్లో భద్రపర్చారని, కొన్ని మమ్మీలపై నాటి భాషలో రాసిన విశేషాలు ఉన్నాయని, ఈజిప్షియన్ కాలంలో ఈ భాష సాధారణ ప్రజానికంలో వినియోగంలో ఉండేదని చెప్పారు. మిన్యా విశ్వవిద్యాలయం నేతృత్వంలో చేపట్టిన ఈ సంయుక్త కార్యక్రమంలో తొలిసారి ఈ మమ్మీలను కనుగొన్నారు. -
40 మంది ముష్కరుల కాల్చివేత
గిజా: ప్రపంచ ప్రఖ్యాత గిజా పిరమిడ్ వద్ద బాంబు పేల్చి ముగ్గురు విదేశీయులను బలి తీసుకున్న ఉగ్ర మూకలపై ఈజిప్టు సైన్యం విరుచుకుపడింది. గిజాతోపాటు సినాయ్ ద్వీపకల్పంలోని ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు జరిపి 40 మందిని కాల్చి చంపింది. శుక్రవారం గిజాలో పర్యాటకుల బస్సుపై ఉగ్ర వాదులు జరిపిన బాంబు దాడిలో ముగ్గురు వియత్నాం దేశస్తులతోపాటు ఒక ఈజిప్టు గైడ్ చనిపోగా మరో 10 మంది పర్యాటకులు గాయపడ్డారు. ప్రభుత్వ కీలక ఆర్థిక వనరులు, విదేశీ పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు మరిన్ని దాడులకు సిద్ధమవుతున్నారన్న సమాచారంతో సైన్యం అప్రమత్తమైంది. విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం వేకువజామున గిజాలోని రెండు ప్రాంతాలతోపాటు సినాయ్ ప్రావిన్స్‌లో ఉగ్ర స్థావరాలపై బలగాలు ఒక్కసారిగా దాడులు జరిపాయి. ఈ దాడుల్లో మొత్తం 40 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీర్ఘకాలంపాటు ఈజిప్టును పాలించిన హోస్నీ ముబారక్ 2011లో వైదొలిగాక దేశంలో తీవ్ర అస్థిరత నెలకొంది. దేశంలో సుస్థిర పరిస్థితులు ఇప్పుడిప్పుడే నెలకొంటున్న తరుణంలో జరిగిన తాజా ఉగ్ర దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. -
పిరమిడ్‌పై పిచ్చి పని.. చిక్కుల్లో జంట!
కైరో : పిరమిడ్‌పై ఓ జంట చేసిన పిచ్చి పని వారిని చిక్కుల్లో పడేసింది. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన ఈజిప్ట్ పిరమిడ్స్‌ను చూసేందుకు నిత్యం వేల సంఖ్యలో పర్యాటకులు తరలి వస్తుంటారు. అయితే డెన్మార్క్‌కు చెందిన ఓ జంట మాత్రం భిన్నంగా ఆలోచించి... చిక్కుల్లో ఇరుక్కుంది. పిరమిడ్ ఎక్కడమే కాకుండా దానిపై నగ్నంగా పోజ్‌లు ఇచ్చింది. అంతటితో ఆగకుండా వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి కాస్త వైరల్ కావడంతో ఇప్పుడు కష్టోల్లో పడింది. వాస్తవానికి పిరమిడ్స్‌ను చూడటానికి మాత్రమే పర్యాటకులను అనుమతి ఇస్తారు. వాటిని ఎక్కడం నిషేధం. అయితే డెన్మార్క్ చెందిన ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ హావిద్ తన ప్రియురాలితో కలిసి నిబంధనలకు విరుద్దంగా రాత్రి సమయంలో గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజాను ఎక్కారు. అక్కడ నగ్నంగా ఫొటోలు దిగారు. అనంతరం శృంగారం చేసుకుంటూ షూట్ చేశారు. మూడు నిమిషాల పాటు రికార్డు చేసిన ఈ వీడియోను యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. టైటిల్ కూడా ఈజిప్ట్ పిరమిడ్స్‌పై శృంగారం చేశామంటూ పెట్టడంతో ఆ వీడియో తెగ వైరల్ అయ్యింది. ఈ విషయాన్ని గుర్తించిన ఈజిప్ట్ ప్రభుత్వం డానిష్ జంటపై దర్యాప్తునకు ఆదేశించింది. -
భారత మహిళల జట్టుకు షాక్
బటూమి (జార్జియా): చెస్ ఒలింపియాడ్‌లో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత మహిళల జట్టుకు ఊహించని రీతిలో తొలి పరాజయం ఎదురైంది. హంగేరి జట్టుతో మంగళవారం జరిగిన ఎనిమిదో రౌండ్ మ్యాచ్‌లో భారత్ 1–3 తేడాతో ఓడిపోయింది. తాజా ఓటమితో మరో మూడు రౌండ్లు మిగిలి ఉన్న ఈ టోర్నీలో భారత బృందం పతకం నెగ్గే అవకాశాలు సన్నగిల్లాయి. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి 50 ఎత్తుల్లో తన్ త్రాంగ్ హోంగ్ చేతిలో ఓడిపోగా... గారా అనీటాతో జరిగిన గేమ్‌ను ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 41 ఎత్తుల్లో; జూలియానా తెర్బెతో జరిగిన గేమ్‌ను ఇషా కరవాడే 41 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించారు. అయితే మరో గేమ్‌లో తానియా సచ్దేవ్ 56 ఎత్తుల్లో గారా టికియా చేతిలో ఓడిపోవడంతో భారత పరాజయం ఖాయమైంది. ఎనిమిదో రౌండ్ తర్వాత భారత మహిళల జట్టు 11 పాయింట్లతో 15వ స్థానంలో ఉంది. పురుషుల జట్టు విజయం... మరోవైపు భారత పురుషుల జట్టు ఆరో విజయం నమోదు చేసింది. చెక్ రిపబ్లిక్‌తో జరిగిన ఎనిమిదో రౌండ్లో భారత్ 2.5–1.5తో గెలిచింది. విశ్వనాథన్ ఆనంద్–డేవిడ్ నవారా గేమ్ 30 ఎత్తుల్లో; విదిత్–విక్టర్ లాజ్నికా గేమ్ 66 ఎత్తుల్లో; ఆధిబన్–జిబినెక్ గేమ్ 17 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగియగా... శశికిరణ్ 36 ఎత్తుల్లో జిరీ స్టోసెక్‌ను ఓడించి భారత్‌ను గెలిపించాడు. ఎనిమిదో రౌండ్ తర్వాత భారత్ 13 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. 15 పాయింట్లతో అమెరికా తొలి స్థానంలో, 14 పాయింట్లతో పోలాండ్ రెండో స్థానంలో ఉన్నాయి. -
ఎర్ర సముద్రం
‘మూసా మమ్మల్ని తీసుకొచ్చి ఈ సముద్రం పక్కన నిలబెట్టావేమిటి? ఈజిప్టులోని ఖననవాటికలు సరిపోలేదా?’ అని అస్మదీయులు నిష్టూరంగా పలుకుతున్న ఆ ఘడియలో దైవ సహాయం అందింది! నేటికి వేల సంవత్సరాల క్రితం ఇస్రాయీల్ అనే జాతి ప్రజలు శతాబ్దుల తరబడి ఈజిప్టులో కడు దుర్భరమైన, అవమానకరమయిన జీవితం గడపాల్సి వచ్చింది. ఫిరౌన్ అనే రాజు పీడనకు గురవ్వాల్సి వచ్చింది. ఫిరౌన్ తనకు తాను ‘నేనే దేవుడిని’ అని విర్రవీగేవాడు. తన రాజ్యంలోని అప్పుడే పుట్టిన మగబిడ్డల్ని చంపేసేవాడు. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో దేవుడు వారి మధ్యన మహనీయ మూసా (అలైహిస్సలామ్)ను ప్రభవింపజేశాడు. అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉన్న ఆ కాలంలో సత్యాన్ని సమర్థించడానికి ఇస్రాయీల్ ప్రజలు మూసా (అలై)ను దేవుని ప్రవక్తగా అంగీకరించారు. ఆయన ద్వారానే ఆ జాతి వారు ఫిరౌనీయుల చెరనుండి విముక్తి పొందారు. ఇలా ఉండగా, ఒకానొక రాత్రివేళ రాజ్యంలోని అన్ని ప్రాంతాల నుండి ప్రజలు బయలుదేరి దైవప్రవక్త మూసా (అలైహిస్సలామ్)తో కలిసి వేరే ఎర్రసముద్రం వైపునకు సాగిపోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఈ పయన బృందం ఎర్రసముద్రం తీరానికి చేరుకుంటూ ఉన్న సమయంలోనే ఫిరౌన్ చక్రవర్తి ఒక భారీ సేనా వాహినిని తీసుకుని వాళ్లను వెంబడిస్తూ వచ్చాడు! ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారయ్యింది పరిస్థితి. మూసా ప్రవక్త అనుయాయులు ఫిరౌన్ సేనల చేతికి చిక్కుకుపోయేలానే ఉన్నారు. వెనుక శత్రు సేనలు, ముందేమో ఎర్ర సముద్రం. దిక్కుతోచని పరిస్థితి. ‘‘మూసా మమ్మల్ని తీసుకొచ్చి ఈ సముద్రం పక్కన నిలబెట్టావేమిటి? ఈజిప్టులోని ఖననవాటికలు సరిపోలేదా?’ అని అస్మదీయులు నిష్టూరంగా పలుకుతున్న ఆ ఘడియలో దైవ సహాయం అందింది. ‘‘మూసా నీ చేతికర్రతో సముద్రంపై కొట్టు’’ అని దైవాదేశమయింది. అల్లాహ్ వాణిని అనుసరించి మూసా ప్రవక్త, సముద్రంపై తన చేతికర్రతో కొట్టాడు. అంతే! సముద్రం రెండు ముక్కలుగా చీలిపోయింది. వాటిలోని ప్రతి భాగం ఓ పర్వతంలా వుంది. ఆ రెండు నీటి గుట్టల మధ్యన ఒక సందు, నీరు ఏ మాత్రం లేని ఓ పొడి దారి ఏర్పడింది. ఆ దారి గుండా మూసా అనుయాయులు సాగిపోవడం గమనించిన ఫిరౌన్ తన సైనికులతో సహా వారిని వెంబడించాడు. మూసా అనుయాయులు సముద్రం దాటే సమయానికి ఫిరౌన్ సేనలు ఆ దారి మధ్యన ఉన్నాయి. దైవాదేశానుసారం అప్పటివరకు ప్రహరీ గోడల్లా నిశ్చలంగా నిలిచి ఉన్న ఆ రెండు నీటి భాగాలు పరస్పరం కలిసిపోయాయి. ఫిరౌన్ తన సేనల సమేతంగా సాగర గర్భంలో కలిసిపోయాడు. దైవప్రవక్త మూసా (అలై) ఇస్రాయీల్ సంతతి వారిని తీసుకుని సీనాయ్ ద్వీపకల్పంలో ప్రవేశించారు. ఈ విధంగా ప్రవక్త మూసా (అలై) ఇస్రాయీల్ జాతిని ఫిరౌన్ చెరనుంచి విడిపించారు. అందుకే ముస్లిములు ముహమ్మద్ ప్రవక్త (సఅసం) సంప్రదాయం ప్రకారం మొహర్రం నెల 10వ తేదీన యౌమే ఆషూరాగా జరుపుకుంటారు. ఆషూరా రోజున ఉపవాసం పాటిస్తారు. – ముహమ్మద్ ముజాహిద్ -
గాలితో నడిచే కారు.. గంటకు 40 కి.మీల వేగం
గాలితో నడిచే కారు... గంటకు నలభై కి.మీలతో వేగంతో వెళ్లగలుగుతుంది. అదీ కూడా ఏమాత్రం నిర్వహణ ఖర్చు లేకుండానే... ఇదేదో బావుందే... రోజు రోజుకు పెరుగుతున్న పెట్రో ఉత్పత్తుల ధరల నేపథ్యంలో మన నగర రోడ్లపై నడిపేందుకు సరిగ్గా సరిపోతుంది. ఎక్కడ దొరుకుతుంది అని అనుకుంటున్నారా ? ఈజిప్ట్‌లోని హెల్వన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ విద్యార్థుల బృందం తమ ‘గ్రాడ్యువేషన్ ప్రాజెక్టు’ కోసం ఆక్సిజన్ కంప్రెస్డ్ ఇంథనంతో నడిచే కారును తయారు చేసింది. దాని కోసం వారు ఖర్చు చేసింది కేవలం 18 వేల ఈజిప్ట్ పౌండ్లు ($1,008.40 డాలర్లు) మాత్రమే. సాధారణంగా ‘గో కార్టింగ్’ రేసులో ఉపయోగించే కారును పోలిన విధంగా రూపొందించిన ఈ కారులో ఓ వ్యక్తి మాత్రమే (ప్రోటో టైపు వన్ పర్సన్ వెహికిల్) ప్రయాణించగలరు. ఈ కారు కేవలం గాలితోనే నడవడం వల్ల దీని వల్ల కాలుష్యం సమస్య తలెత్తే అవకాశమే లేదు. తమ కారు గంటకు 40 కి.మీ వేగంతో నడుస్తుందని, మళ్లీ ‘ఆక్సిజన్ ఇంథనం’ నింపుకునేలోగా 30 కి.మీ ప్రయాణించగలుగుతుందని ఆ విద్యార్థులు చెబుతున్నారు. గాలిని కాంప్రెస్ చేసి ఇంథనంగా ఉపయోగించడం వల్ల కారు నిర్వహణ ఖర్చు అసలు ఉండదు. పెట్రోల్ లేదా డీజిల్ ఉపయోగించని కారణంగా ఈ ఇంథనాన్ని చల్లబరచాల్సిన (కూలింగ్) చేయాల్సిన అవసరం కూడా ఉండదని ఈ కారు డిheజైన్‌లో సహకరించిన విద్యార్థి మహ్మద్ యాసిర్ చెబుతున్నారు. ప్రస్తుతం గంటకు 40 కి.మీ ఉన్న ఈ వాహన వేగాన్ని వంద కి.మీ కు పెంచగలుగుతామని, మళ్లీ ఇంథనంగా గాలిని నింపుకునే లోగా 100 కి.మీ ల వరకు ప్రయాణించేలా చేయగలమనే విశ్వాసాన్ని ఈ విద్యార్థులు వ్యక్తంచేస్తున్నారు. ఇప్పుడు తాము రూపొందించిన కారును పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేసేందుకు అవసరమైన నిధుల సమీకరణలో ఈ బృందం నిమగ్నమైంది. -
ఆ ద్రావం తాగితే అతీత శక్తులు..!!
సాక్షి, వెబ్ డెస్క్ : 2018 ఈ ఏడాదిలో ఇప్పటికే చాలా రకాల వింతలు జరిగాయి. మరీ ముఖ్యంగా వంటల విషయంలో. ఎలాంటి పానీయం తీసుకోకుండా టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడిని తినడం నుంచి లిక్విడ్ డిటర్జెంట్‌ను గడగడా తాగేయడం లాంటి వీడియోలు నెట్టింట్లో సంచలన సృష్టించాయి. తాజాగా 17 వేల మందికి కలిగిన సరికొత్త కోరిక గురించి తెలిస్తే షాక్‌కు గురవుతారు. ఈజిప్టులోని అలెగ్జాండ్రియా నగరం కింద భూమి లోపల 16 అడుగుల లోతులో నల్లరాతి శవకోష్టిక లభ్యమైన సంగతి తెలిసిందే. దాదాపు 2000 ఏళ్ల క్రితం శవకోష్టికను భూస్థాపితం చేశారు. శాపానికి గురవుతామా? అనే భయాల మధ్య ఈజిప్టు పురాతత్వ కౌన్సిల్ చీఫ్ ఆదేశాల మేరకు ఇటీవల ఆ శవకోష్టికను తెరిచారు. అందులో ముగ్గురు వ్యక్తుల మమ్మీలు బయల్పడ్డాయి. అయితే, ఆ మూడు మమ్మీలు ఎరుపు రంగులో ఉన్న ఓ ప్రత్యేక ద్రావంలో మునిగి ఉన్నాయి. మమ్మీలను బయటకు తీసిన పరిశోధకులు అవి రోమన్ రాజ కుటుంబానికి చెందినవి కావని తేల్చారు. ఈ సంఘటనను కళ్లప్పగించుకుని చూసిన కొందరు ఇప్పుడు ఆ ఎరుపు రంగు ద్రావాన్ని తాగేందుకు తమను అనుమతించాలని కోరుతున్నారు. ఈ మేరకు ఛేంజ్.ఆర్గ్ అనే ఓ వెబ్సైట్ పిటిషన్‌ను సైతం దాఖలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 17 వేల మందికి పైగా శవ కోష్టికలో ఉన్న ద్రావాన్ని తాగడానికి ఇష్టపడుతున్నారని, వారికి అవకాశం ఇవ్వాలనేది సదరు పిటిషన్ సారాంశం. శాపగ్రస్తమైన నల్లరాతి శవకోష్టికలోని ఆ ద్రావాన్ని తాగితే అతీత శక్తులు సంక్రమిస్తాయని, ఆ తర్వాత చనిపోతామని వారందరూ విశ్వసిస్తున్నారని పిటిషనర్ మెక్కెన్డ్రిక్ పేర్కొన్నారు. మరణించే హక్కును గురించి ప్రస్తావిస్తూ సదరు ద్రావాన్ని తాగేందుకు వారికి అనుమతి ఇవ్వాలని ఆయన పిటిషన్లో కోరారు. అయితే, ఈజిప్టు పురాతత్వ శాఖ మాత్రం వేల మంది ప్రజలు శవకోష్టికలోని ద్రావాన్ని తాగేందుకు ఆసక్తి కనబరచడంపై ఆందోళన వ్యక్తం చేసింది. సదరు ద్రావం ఒట్టి మురికి నీరు మాత్రమేనని పేర్కొంది. ఎముకలు, ఇతర శరీర భాగాల నుంచి ఆ ద్రవం తయారైందని తెలిపింది. దానికి ఎలాంటి అతీత శక్తులు లేవని కొట్టిపారేసింది. దీనిపై అరిజోనా స్టేట్ యూనివర్శిటీలోని బయోడిజైన్ ఇనిస్టిట్యూట్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న రోల్ఫ్ హాల్డెన్ మాట్లాడుతూ.. కుళ్లిపోతున్న శరీరాలను నుంచి ఆ ద్రవం తయారైవుంటుందని చెప్పారు. వేల సంవత్సరాలుగా అలానే ఉన్న ఆ ద్రవంలో అతి భయంకరమైన బ్యాక్టీరియా, వైరస్లు ఉంటాయని హెచ్చరించారు. పొరబాటున ఆ ద్రవాన్ని తాగితే విపత్కర పరిస్థితిని ఎదుర్కొక తప్పదని పేర్కొన్నారు. శవ కోష్టికను తెరిచారు.. శాపం తగిలిందా..? -
శవ కోష్టికను తెరిచారు.. శాపం తగిలిందా..?
అలెగ్జాండ్రియా : చారిత్రక ఈజిప్టు పోర్టు నగరం అలెగ్జాండ్రియా కింద 16 అడుగుల లోతులో భద్రపర్చిన 2000 సంవత్సరాల నాటి నల్లరాతి శవకోష్టికను శాస్త్రవేత్తలు తెరిచారు. దాదాపు 10 అడుగుల పొడవు, 30 టన్నుల బరువున్న కోష్టిక నుంచి మూడు మమ్మీల పుర్రెలు బయటపడ్డాయి. పుర్రెలతో పాటు కోష్టికలోని ఎరుపు రంగు పదార్థం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ పదార్థం వల్ల మృతదేహాలు అతి వేగంగా కుళ్లిపోయి ఉంటాయని పరిశోధకులు భావిస్తున్నారు. శవ కోష్టికను తెరిస్తే శాపానికి గురవుతామనే నమ్మకం నరనరాల్లో జీర్ణించుకుని పోయిన వేళ ఈజిప్టు పురాతత్వ సుప్రీమ్ కౌన్సిల్ ముస్తఫా వాజిరీ దాన్ని తెరవాలని ఆదేశించి సంచలనం రేపారు. ఆయన ఆదేశాల మేరకు కొద్ది రోజుల క్రితం కోష్టికను తెరవగా మూడు పుర్రెలు, ఎరుపు రంగు పదార్థం బయల్పడ్డాయి. దీనిపై మాట్లాడిన వాజిరీ కోష్టికను తెరిచామని, ఎలాంటి శాపానికి గురి కాలేదని వ్యాఖ్యానించారు. ప్రత్యేకమైన నల్లరాతి కోష్టికలో మృతదేహాలను భద్రపర్చడంతో అవి రోమన్ రాజ కుటుంబానికి చెందినవని తొలుత భావించారు. పైగా కోష్టికపై కింగ్ అలెగ్జాండర్ పేరు ఉండటం మరింత ఆసక్తిని రేకెత్తించింది. అయితే, బయల్పడిన మూడు మమ్మీలు రోమన్ రాజ కుటుంబానికి చెందిన వ్యక్తులవి కావని పరిశోధకులు తేల్చారు. రాజ కుటుంబీకుల సమాధులు ఇంకా భారీగా ఉంటాయని వారు పేర్కొన్నారు. అలెగ్జాండర్ సమాధి దీనికి ఎన్నో రెట్లు పెద్దగా ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. -
అద్భుతాన్ని కళ్ల ముందుంచారు
అద్భుతాన్ని వెలుగులోకి తెచ్చారు పురాతత్వశాస్త్రవేత్తలు. ఈజిప్ట్‌లో సుమారు 2000 ఏళ్ల క్రితం నాటి మమ్మీలను తవ్వి తీసారు. మమ్మీలకు పూసిన రసాయనాలను ఏంటన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. కైరో: సుమారు 15 మంది సభ్యులతో కూడిన పురాతత్వ శాస్త్రవేత్తల బృందం.. గత కొన్ని నెలలుగా సౌత్ కైరోలోని సఖ్కర నెక్రోపోలిస్ వద్ద ఈ తవ్వకాలు చేపట్టారు. సుమారు 30 మీటర్ల లోతులో మమ్మీలు లభ్యం కాగా, వాటిపై పరిశోధనలు ప్రారంభించారు. 664-404 బీసీ.. సైటే-పర్షియన్ కాలానికి చెందిన మమ్మీలుగా అంచనా వేస్తున్నారు. ఇప్పటిదాకా దొరికిన మమ్మీల్లో ఇవి చాలా ప్రత్యేకంమని శాస్త్రవేత్తల బృందం ప్రతినిధి రమదాన్ హుస్సేన్ చెబుతున్నారు. ‘ఇవి అద్భుతమే చెప్పాలి. ఇందులో ఓ మమ్మీకి వెండి ముసుగు, బంగారు పూతలు కూడా ఉంది. ఇప్పటిదాకా వెలుగులోకి వచ్చిన మమ్మీల్లో ఇది రెండోది. బహుశా అది చక్రవర్తి భార్యది అయి ఉండొచ్చు. కళేబరాలకు పూసిన రసాయనాల అవశేషాలు ఇంకా తాజాదనంతోనే ఉన్నాయి. వాటిని పరీక్షిస్తే మమ్మీల పరిశోధనల చరిత్రలో కొత్త అధ్యయనం లిఖించినట్లే..’ అని హుస్సేన్ వెల్లడించారు. -
4,500 ఏళ్ల కిందటి గృహాలు
వాషింగ్టన్: ఈజిప్టులోని గిజా పిరమిడ్ సమీపంలో శాస్త్రవేత్తలు రెండు పురాతన గృహాలను గుర్తించారు. అవి దాదాపు 4,500 సంవత్సరాల కిందటివని తేల్చారు. పిరమిడ్ నిర్మాణానికి పనిచేసిన సిబ్బందికి, సైన్యానికి ఆహార సరఫరాను పర్యవేక్షించే అధికారుల నివాసాలని అమెరికాకు చెందిన ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక భవనంలో నివసించే అధికారులు జంతు మాంసానికి సంబంధించిన బాధ్యతలు చూసుకునేవారని, మరో భవనంలో ‘వాదాత్’లుగా పిలిచే సంస్థల అధిపతులు (సన్యాసులు) నివసించేవారని చెప్పారు. ఈజిప్షియన్ల చరిత్రలో ‘వాదాత్’కు ప్రత్యేక స్థానముందని, వాటి అధిపతులుగా పనిచేసేవారు ప్రభుత్వ ఉన్నత హోదా ర్యాంకును కలిగి ఉండేవారని ప్రముఖ పరిశోధకుడు మార్క్ లెహ్నర్ తెలిపారు. పిరమిడ్ల నిర్మాణానికి సంబంధించిన వ్యవహారాలను కూడా వీరు పర్యవేక్షించినట్లు తమ పరిశోధనలో తేలిందని చెప్పారు. -
1982 తర్వాత తొలి‘సారీ’
మాస్కో: ఫిఫా ప్రపంచకప్ అందరి సరదాను తీరుస్తుందంటారు. అనుకోని జట్లు అద్బుత విజయాలతో దూసుకపోతుంటే.. ఫేవరేట్‌గా బరిలోకి దిగిన జట్లు చతికిలపడుతుంటాయి. సాకర్ సమరంలో ఒక ఘట్టం(గ్రూప్ దశ) పూర్తయింది. ఇక ప్రతీ మ్యాచ్ అన్ని జట్లకు చావోరేవో. చిన్నచితకా జట్లు, ఆగ్రశ్రేణి జట్లను మట్టి కరిపించి ఇంటికి పంపించిన ఈ మెగా టోర్నీలో ఆఫ్రికా అభిమానుల కోరిక మాత్రం తీరకుండా అలాగే మిగిలి ఉంది. తమ ఖండపు జట్టు కనీసం సెమీస్‌కు చేరాలనుకున్న ఆఫ్రికన్ అభిమానుల ఆశలు ఈసారి కూడా ఆవిరయ్యాయి. రష్యాలో జరుగుతున్న ఈ ప్రపంచకప్‌లో ఏ ఆఫ్రికా జట్టు రౌండ్16కు చేరలేకపోయింది. 1982 తర్వాత ఆఫ్రికా ఖండపు జట్టు నాకౌట్‌కు చేరకపోవడం ఇదే తొలిసారి. రష్యాలో జరుగుతున్న ఈ మెగా టోర్నీకి ఈసారి అత్యధికంగా ఐదు ఆఫ్రికా జట్లు(నైజీరియా, మొరాకో, ట్యూనీషియా, ఈజిప్ట్, సెనెగల్) అర్హత సాధించాయి. అయితే ఈ దఫా విశ్వసమరంలో ఆఫ్రికా జట్లకు అదృష్టం కలిసి రాలేదు. గ్రూప్ హెచ్లో జపాన్, సెనెగల్ జట్లకు సమాన పాయింట్లు లభించినా ఫెయిర్ ప్లే కింద జపాన్(ఆసియా నుంచి ఏకైక జట్టు) రౌండ్ 16లోకి అడుగుపెట్టగా.. సెనెగల్ టోర్నీ నుంచి నిష్ర్కమించింది. దీంతో ఒక్క జట్టైనా నాకౌట్‌కు చేరుతుందనుకున్న ఆఫ్రికా అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. 28 సంవత్సరాల తర్వాత ప్రపంచకప్‌కు అర్హత సాధించిన ఈజిప్ట్ తీవ్రంగా నిరాశ పరిచింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమి చవిచూసింది. మొరాకో కూడా 20 సంవత్సరాల తర్వాత సాకర్‌లోకి అడుగుపెట్టి రెండు ఓటములు, ఒక డ్రాతో టోర్నీ నుంచి నిష్ర్కమించింది. ఆఫ్రికన్ అభిమానులు, క్రీడా పండితులు ఎంతో నమ్మకం పెట్టుకున్న నైజీరియా ఒక్క విజయం రెండు ఓటములతో టోర్నీ నుంచి వైదలొగింది. ట్యూనీషియా కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఆఫ్రికా దేశాలు ఫిఫా ప్రపంచకప్ నుంచి నిష్ర్కమించి అభిమానులను తీవ్ర నిరుత్సాహపరిచాయి. సెమీఫైనల్ చేరాలనుకున్న ఆఫ్రికన్ అభిమానుల కల రష్యాలో కుదరలేదు.. కనీసం ఖతార్‌లోనైనా సాధ్యపడుతుందో చూడాలి. -
ఈజిప్ట్‌పై రష్యా భారీ విజయం
-
రఫ్ఫాడించిన రష్యా
ఆతిథ్య దేశం హోదాలో రష్యా జట్టు మరోసారి అద్భుత ఆటతీరుతో అదరగొట్టింది. వరుసగా రెండో విజయం సాధించి ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో నాకౌట్ దశకు అర్హత పొందిన తొలి జట్టుగా గుర్తింపు సాధించింది. 32 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ 1986 తర్వాత రష్యా ఈ మెగా ఈవెంట్లో నాకౌట్ బెర్త్ దక్కించుకుంది. సెయింట్ పీటర్స్బర్గ్: తొలి మ్యాచ్‌లో తాము సాధించిన భారీ విజయం గాలివాటమేమీ కాదని రష్యా ఫుట్‌బాల్ జట్టు నిరూపించింది. ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో రష్యా 3–1తో ఈజిప్ట్‌ను చిత్తుగా ఓడించి ఈ టోర్నీలో వరుసగా రెండో విజయం నమోదు చేసింది. 6 పాయింట్లతో నాకౌట్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఈజిప్ట్ కెప్టెన్ అహ్మద్ ఫతీ 47వ నిమిషంలో ‘సెల్ఫ్ గోల్’ చేయడంతో రష్యా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత 59వ నిమిషంలో చెరిషెవ్, 62వ నిమిషంలో డిజుబా ఒక్కో గోల్ చేయడంతో రష్యా 3–0తో ముందంజ వేసింది. 73వ నిమిషంలో ఈజిప్ట్‌కు సలా ఏకైక గోల్ అందించాడు. పోటాపోటీ... ప్రపంచకప్‌లో బరిలోకి దిగే ముందు తాము ఆడిన చివరి ఏడు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం కూడా సాధించకపోవడంతో రష్యా జట్టు సత్తాపై అందరికీ సందేహం కలిగింది. అయితే తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియాపై 5–0తో నెగ్గిన రష్యా... అదే జోరును రెండో మ్యాచ్‌లోనూ కనబరిచింది. ఉరుగ్వేతో జరిగిన తొలి మ్యాచ్‌కు దూరమైన ఈజిప్ట్ స్టార్ ప్లేయర్ సలా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగినా అంతగా ప్రభావం చూపలేకపోయాడు. తమకు లభించిన పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచి అభిమానులకు ఊరట కలిగించాడు. తొలి మ్యాచ్ మాదిరిగానే ఈ మ్యాచ్‌లోనూ రష్యా ఆటగాళ్లు దూకుడు ప్రదర్శిం చారు. అవకాశం దొరికినపుడల్లా ఈజిప్ట్ గోల్‌పోస్ట్‌పై దాడులు నిర్వహించారు. అయితే ఫినిషింగ్ సరిగ్గా లేకపోవడం, ఈజిప్ట్ రక్షణ శ్రేణి కూడా అప్రమత్తంగా ఉండటంతో గోల్ నమోదు కాలేదు. ఏకపక్షం... రెండో అర్ధభాగంలోనూ రష్యా దూకుడు తగ్గించలేదు. ఫలితంగా ఆట మొదలైన రెండు నిమిషాలకు వారి ఖాతాలో గోల్ చేరింది. రొమాన్ జోబ్నిన్ కొట్టిన షాట్ గురి తప్పింది. దీంతో గోల్‌పోస్ట్ ముందున్న మరో రష్యా ప్లేయర్ డిజుబాకు బంతి అందకూడదనే ఉద్దేశంతో ఈజిప్ట్ ఆటగాడు ఫతీ ప్రయత్నించగా బంతి అతని కాలికి తగిలి గోల్‌పోస్ట్‌లోకి వెళ్లి సెల్ఫ్‌గోల్ అయింది. ఆ తర్వాత మూడు నిమిషాల వ్యవధిలో రష్యా రెండు గోల్స్ సాధించింది. 59వ నిమిషంలో సమెదోవ్ అందించిన పాస్‌ను ‘డి’ ఏరియాలో అందుకున్న మారియో ఫెర్నాండెజ్ క్రాస్ షాట్ కొట్టాడు. అతని షాట్‌ను గోల్ పోస్ట్ ముందున్న చెరిషెవ్ లక్ష్యంవైపు పంపించడంతో రష్యా ఖాతాలో రెండో గోల్ చేరింది. మూడు నిమిషాల తర్వాత కుటెపోవ్ కొట్టిన షాట్‌ను ‘డి’ ఏరియా పైభాగంలో అందుకున్న డిజుబా బంతిని నియంత్రించి బలమైన షాట్‌తో ఈజిప్ట్ గోల్‌కీపర్ ను బోల్తా కొట్టించాడు. 73వ నిమిషంలో ఈజిప్ట్ ప్లేయర్ సలాను ‘డి’ ఏరియాలో రష్యా ఆటగాడు మొరటుగా అడ్డుకోవడంతో వీడియో అసిస్టెంట్ రిఫరీ సహాయంతో వారికి పెనాల్టీ కిక్ లభించింది. దీనిని సలా ఎలాంటి పొరపాటు చేయకుండా లక్ష్యానికి చేర్చాడు. చివర్లో ఈజిప్ట్ కాస్త పోరాడినా రష్యా రక్షణ పంక్తిని ఛేదించలేకపోయింది. ఆతిథ్య దేశం హోదాలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనే అత్యధికంగా 8 గోల్స్ చేసి 1934లో ఇటలీ పేరిట ఉన్న రికార్డును రష్యా సమం చేసింది. ఇప్పటివరకు ఈ ప్రపంచకప్‌లో నమోదైన సెల్ఫ్ గోల్స్ సంఖ్య. 1998 ప్రపంచకప్‌లో అత్యధికంగా ఆరు సెల్ఫ్ గోల్స్ వచ్చాయి. ప్రపంచకప్‌లో ఈజిప్ట్ తరఫున గోల్ చేసిన మూడో ప్లేయర్‌గా సలా నిలిచాడు. గతంలో అబ్దుల్ రెహమాన్ ఫావ్జి (1934లో రెండు), మగ్దీ అబిద్ అల్ ఘనీ ((1990లో ఒకటి) ఈ ఘనత సాధించారు. -
ఉరుగ్వే... ఉత్కంఠను అధిగమించి
కఠినమైన పోటీని ఎదుర్కొన్నా, చివరి వరకు పైచేయి కాకున్నా, ఎదురుదాడి చేయలేకపోయినా, బంతిపై నియంత్రణతో, మ్యాచ్‌పై పట్టు నిలబెట్టుకొని ఉరుగ్వే గెలిచింది. ప్రపంచ కప్ వేటను నిదానంగా ప్రారంభిస్తుందని పేరున్న ఆ జట్టు... దానికి తగ్గట్లే భారీ తేడా ఏమీ లేకుండానే నెగ్గింది. కీలక ఆటగాడైన మొహమ్మద్ సలా గైర్హాజరీలో ఈజిప్ట్‌కు పోరాడామన్న సంతృప్తి మాత్రమే మిగిలింది. ఎకతెరినాబర్గ్: అద్భుతం అనదగ్గ ప్రదర్శనలు లేకుండా సాదాసీదాగా సాగిన మ్యాచ్‌లో ఈజిప్ట్‌పై ఉరుగ్వేదే పైచేయి అయింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా శుక్రవారం ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆ జట్టు 1–0తో గెలిచింది. 89వ నిమిషంలో ఉరుగ్వే డిఫెండర్ జిమినెజ్ కొట్టిన ఏకైక గోల్ రెండు జట్ల మధ్య తేడా చూపింది. ఉరుగ్వేకు ప్రపంచ కప్ తొలి పోరులో నెగ్గడం 48 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. ఆధిపత్యం కోసం పోటాపోటీగా, మిడ్ ఫీల్డ్ సమరంలా సాగిన మ్యాచ్‌లో గోల్ కోసం ఇరు జట్లు శ్రమించాల్సి వచ్చింది. దాడి మొదలు పెట్టింది ఉరుగ్వేనే అయినా, ఈజిప్ట్ కూడా దీటుగా నిలిచింది. తొలి అరగంటలో డిఫెన్స్‌తో పాటు ప్రత్యర్థి ప్రధాన ఆటగాళ్లు లక్ష్యంగా ప్రతి దాడులు చేసింది. మొదటి గోల్ అవకాశం మాత్రం ఉరుగ్వే స్టార్ సురెజ్కే వచ్చింది. కానీ, తక్కువ ఎత్తులో వచ్చిన క్రాస్‌ను అతడు సద్వినియోగం చేయలేకపోయాడు. ఒకింత ఒత్తిడితో ప్రారంభమైన రెండో భాగంలో ఉరుగ్వేకు కొంత మొగ్గు కనిపించగా ఈజిప్ట్‌కు ఆటగాళ్ల గాయాలు అనుకోని దెబ్బగా మారాయి. దాడుల తీవ్రత పెంచేందుకు ఆ జట్టు కోచ్ పలు మార్పులు చేయాల్సి వచ్చింది. అయితే, సలా లేని లోటు స్పష్టంగా కనిపిస్తూ అవేవీ గోల్‌ను చేర లేదు. ఈజిప్ట్ డిఫెన్స్‌ను గుక్క తిప్పుకోకుండా చేసిన సురెజ్, ఎడిన్సన్ కవానీలు అవకాశాలను చేజార్చడంతో మ్యాచ్ చివరకు డ్రా అయ్యేలా కనిపించింది. అయితే 89వ నిమిషంలో జిమినెజ్ మాయ చేశాడు. డిగో గొడిన్ ద్వారా కుడివైపు నుంచి దూసుకొచ్చిన ఫ్రీ కిక్‌ను ఒడుపుగా గోల్ పోస్ట్‌లోకి పంపి ఉరుగ్వే తరఫున ఖాతా తెరిచాడు. ఎప్పటిలానే రక్షణాత్మక ఆటకు ప్రాధాన్యమిచ్చిన ఈజిప్ట్‌కు ఒక్క కార్నర్ కిక్ కూడా లభించకపోవడం, సలా గైర్హాజరీలో స్ట్రయికర్ మార్వన్ ఒంటరిగా మిగిలిపోవడం దెబ్బతీసింది. -
ఈజిప్ట్‌పై ఉరుగ్వే విజయం
-
ఉత్కంఠ పోరులో ఉరుగ్వే విజయం
సాకర్ ప్రపంచకప్‌లో భాగంగా సెంట్రల్ స్టేడియంలో జరిగిన రసవత్తర పోరులో ఈజిప్ట్‌పై ఉరుగ్వే విజయం సాధించింది. మ్యాచ్ అసాంతం నువ్వా నేనా అన్నట్టు జరిగిన పోరులో చివరకు విజయం ఉరుగ్వేను వరించింది. 89వ నిమిషం వరకు ఒక్క గోల్ నమోదు కాని ఈ మ్యాచ్‌లో శాంచెజ్ ఇచ్చిన ఫ్రీ కిక్‌తో జోస్ గిమెనెజ్ గోల్ కొట్టి ఉరుగ్వే శిబిరంలో ఆనందం నింపాడు. దీంతో ఉరుగ్వే 1-0తో ఈజిప్ట్‌పై విజయం సాధించింది. మరో రెండు నిమిషాల్లో ఆట ముగిసి షూటౌట్‌కు వెళ్లే సమయంలో ఉరుగ్వేకు ఫ్రీ కిక్ రూపంలో అదృష్టం వరించింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఉరుగ్వే ఆటగాళ్లు శాంచెజ్ అందించిన బంతిని జోస్ గిమెనెజ్ రైట్సైడ్లో తలతో ముచ్చటైన రీతిలో బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపాడు. నేటి మ్యాచ్‌లో ఈజిప్ట్ 12 అనవసర తప్పిదాలు చేయగా, ఉరుగ్వే 4 తప్పిదాలు చేసింది. గోల్ కోసం ఉరుగ్వే ఆరు సార్లు ప్రయత్నించగా ఈజిప్ట్ గోల్ కీపర్ మహ్మద్ ఎల్-షెనవి వాటిని అడ్డుకున్నాడు. ఈజిప్ట్ ఆటగాళ్లు సామ్ మోర్సీ, అహ్మద్ హీగజీలకు రిఫరీలు ఎల్లో కార్డ్ చూపారు. -
ఆ రెండో జట్టు ‘ఏ’దో!
ఉరుగ్వే... ఎప్పుడో 1950లో చివరిసారిగా విజేతగా నిలిచింది. రష్యా... ఆతిథ్య హోదాతో అర్హత పొందింది. ఈజిప్ట్... రెండుసార్లు వైదొలగి, రెండుసార్లు గ్రూప్ దశతోనే సరిపెట్టుకుంది. సౌదీ అరేబియా... నాలుగుసార్లు పాల్గొని ఒక్కసారి గ్రూప్ స్టేజ్ దాటగలిగింది. ఫిఫా ప్రపంచకప్ గ్రూప్ ‘ఎ’ పరిస్థితిది. ఈ లెక్కను బట్టి చూస్తే రెండుసార్లు విజేత ఉరుగ్వేనే అత్యుత్తమంగా కనిపిస్తోంది. సొంతగడ్డ సానుకూలతతో రష్యా సంచనాలు సృష్టిస్తే తప్ప, నాకౌట్ చేరే రెండో జట్టుగా అంతోఇంతో ఈజిప్ట్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. – సాక్షి క్రీడా విభాగం రష్యా... అంతా అనుకూలిస్తేనే... ప్రపంచకప్ ఆతిథ్య హక్కుల కోసం తొలిసారిగా 2008లో బిడ్ వేసినప్పుడు రష్యా అద్భుత ఫామ్‌లో ఉంది. ఆ ఏడాది యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో సెమీస్‌కు చేరింది. దీని ప్రకారమైతే ఆ జట్టు ఇప్పటికి ఎంతో ఎదిగి ఉండాలి. సొంతగడ్డపై జరుగనున్న పోటీల్లో ఓ బలమైన జట్టుగా వార్తల్లో నిలవాలి. కానీ, ఎదుగూబొదుగు లేని ప్రదర్శనతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. ఈ పదేళ్లలో పాల్గొన్న ఏ పోటీలోనూ గ్రూప్ దశ దాటలేకపోయింది. మైదానంలో ప్రదర్శన ఇలా ఉంటే... మైదానం బయట ఆటగాళ్లు, కోచ్‌కు పడటం లేదు. దీనికితోడు ఆకతాయి ‘హూలిగన్ల’ బెడద ఒకటి. 2016 యూరో చాంపియన్ షిప్లో వారి ప్రవర్తన రష్యా ప్రతిష్ఠను బాగా దెబ్బతీయడమే కాక టోర్నీ నుంచి వెళ్లగొట్టేంతవరకు వచ్చింది. ఇన్ని అడ్డంకుల మధ్య ఎలా రాణిస్తుందో చూడాలి. కీలకం: ఇగోర్ అకిన్‌ఫీవ్. ప్రతిభావంతుడైన గోల్‌కీపర్. జట్టు కెప్టెన్. అయితే, పెద్ద టోర్నీల్లో నిరాశ పరుస్తుంటాడు. కోచ్: స్టానిస్లావ్ చెర్చేవ్. ఖరీదైన విదేశీ కోచ్‌లు ఫాబియో కాపెల్లో (ఇటలీ), గూస్ హిడింక్ (నెదర్లాండ్స్)లతో లాభం లేదని స్వదేశీ, మాజీ గోల్ కీపర్ అయిన చెర్చేవ్ను ఎంచుకున్నారు. కఠినంగా వ్యవహరిస్తూ రక్షణాత్మక ఆట పద్ధతులను అవలం బిస్తాడని పేరుంది. విభేదాల నేపథ్యంలో ఆటగాళ్లతో సమన్వయం ఎలా చేసుకుంటాడో చూడాలి. ప్రపంచ ర్యాంక్: 66 చరిత్ర: ఇప్పటివరకు 10 సార్లు క్వాలిఫై అయింది. 1958–70 మధ్య నాలుగుసార్లు క్వార్టర్స్ చేరింది. 1966లో సెమీస్ వరకు వెళ్లగలిగింది. గత ప్రపంచకప్‌లో 24వ స్థానంలో నిలిచింది. ఇదే అతి చెత్త ప్రదర్శన. ఉరుగ్వే... సీనియర్లు, యువరక్తం ఒకదేశంగా మనకు ఈ పేరు పెద్దగా పరిచయం లేకున్నా... ఫుట్‌బాల్‌లో మాత్రం మంచి రికార్డే ఉంది. క్వాలిఫయింగ్ పోటీల్లో దక్షిణ అమెరికా ఖండంలో బ్రెజిల్ తర్వాత ఈ జట్టే మెరుగైన ప్రదర్శన చేసింది. డిఫెండర్ డిగో గోడిన్, స్ట్రయికర్లు ఎడిన్సన్ కవాని, లూయీస్ సురెజ్ల వంటి సీనియర్ల ప్రభ తగ్గుతున్న సమయంలో... యువ మిడ్ ఫీల్డర్లు ఫెడ్రికో వాల్వెర్డె, నహిటన్ నాందెజ్ బాధ్యతలు తీసుకొని ప్రపంచకప్ బెర్తు అందించారు. గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచే అవకాశాలున్నాయి. ఒకవేళ ఇప్పుడు కాకున్నా, 2022 నాటికి కప్ అందుకోగలమన్న ఆత్మవిశ్వాసంతో ఉంది. కీలకం: కవాని. క్వాలిఫయింగ్ పోటీల్లో 18 మ్యా చ్ల్లో 10 గోల్స్‌తో టాపర్‌గా నిలిచాడు. సురెజ్ కంటే ఇతడిపైనే ఎక్కువ అంచనాలున్నాయి. కోచ్: ఆస్కార్ తబ్రెజ్. 2006 నుంచి బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కోచ్‌గా ఇది నాలుగో ప్రపంచకప్. వరుసగా మూడోది. 70 ఏళ్ల ఆస్కార్... రెండేళ్ల క్రితం తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. చక్రాల కుర్చీ నుంచే కోచింగ్‌ను పర్యవేక్షించాడు. ప్రపంచ ర్యాంక్: 17 చరిత్ర: 1930, 1950లలో విజేత. 12 సార్లు క్వాలిఫై అయింది. 2006లో అర్హత సాధించకున్నా... 2010లో 4వ స్థానంలో నిలిచింది. 2014లో 12వ స్థానంతో సరిపెట్టుకుంది. సౌదీ... ఒక్క గెలుపైనా గొప్పే పుష్కర కాలం తర్వాత అర్హత సాధించిన సౌదీ అరేబియా.. ప్రపంచకప్ సన్నాహాలు మాత్రం ఏమంత సాఫీగా లేవు. సాకర్‌లో ఎంతో కీలకమైన వ్యక్తి కోచ్. 9 నెలల్లోనే సౌదీ జట్టుకు మూడో కోచ్ వచ్చాడు. ప్రపంచకప్ డ్రాకు కొద్దిగా ముందు బవుజాను తప్పించారు. ఆ ప్రభావం ప్రాక్టీస్ మ్యాచ్‌లపై పడింది. అంతకుముందు సెప్టెంబరు వరకు కోచ్‌గా ఉన్న మార్విక్ జట్టు క్వాలిఫై అయ్యేలా తీర్చిదిద్దాడు. తాజాగా ఆంటోనియో పిజ్జిని కోచ్‌గా తీసుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఒక్క విజయం సాధించినా అది సంచలనమే. కీలకం: అల్ సాల్వి. 30 ఏళ్ల ఈ స్ట్రయికర్ అర్హత పోటీల్లో 16 గోల్స్‌తో కీలక పాత్ర పోషించాడు. కోచ్: జువాన్ ఆంటోనియో పిజ్జి. జట్టుకు పూర్తిగా కొత్త. పరిస్థితులు, ఆటగాళ్లను అర్థం చేసుకుంటూ ఇతడు ఏమేరకు నడిపిస్తాడో చూడాలి. ప్రపంచ ర్యాంక్: 67 చరిత్ర: 1994 నుంచి 2006 వరకు వరుసగా క్వాలిఫై అయింది. తొలిసారి 12వ స్థానంలో నిలిచి ఆశ్చర్యపర్చినా, తర్వాత మూడు ప్రయత్నాల్లో గ్రూప్ దశ దాటలేదు. ఈజిప్ట్... రెండో బెర్తుతోనైనా ఏడుసార్లు ఆఫ్రికా చాంపియన్. 2012–15 మధ్య ఆఫ్రికా నేషన్స్ కప్‌లో రాజ్యమేలింది. ఓ దశలో అదే కప్‌లో నిరాశాజనక ప్రదర్శన కనబర్చింది. అయితే ఇప్పుడు జట్టు కొత్తదనంతో కనిపిస్తోంది. ఈ ఏడాది ఫైనల్ చేరింది. అదే ఊపులో 28 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ బెర్తు కొట్టేసింది. ఉరుగ్వే కొరుకుడుపడకున్నా, రష్యా, సౌదీలను ఓడించగలిగితే గ్రూప్ నుంచి రెండో స్థానంతో నాకౌట్‌కు వెళ్తుంది. కీలకం: మొహహ్మద్ సలా. ఆరు అర్హత మ్యాచ్‌ల్లో ఐదు గోల్స్ కొట్టాడు. జట్టులో ఏకైక స్టార్. కోచ్: హెక్టర్ కుపెర్. అర్జెంటీనా మాజీ ఆటగాడు. రక్షణాత్మక ఆటకు ప్రాధాన్యమిస్తాడు. తర్వాత దాడుల గురించి ఆలోచిస్తాడు. ఇది మూస పద్ధతి అని విమర్శలు వచ్చినా అవే జట్టును ఇక్కడవరకు తీసుకొచ్చాయి. ప్రపంచ ర్యాంక్: 46 చరిత్ర: 1934లోనే అర్హత సాధించింది. 1938లో ఓసారి, 1958–66 మధ్య మూడుసార్లు వైదొలగింది. 1990లో పునరాగమనం చేసినా గ్రూప్ దశ అధిగమించలేదు. -
టుటన్ఖమున్ సమాధిలో రహస్యగది లేదు!
కైరో : 3000 ఏళ్ల క్రితం ఈజిప్టును పాలించిన ‘బాల రాజు’ టుటన్ఖమున్ సమాధి గుట్టు వీడింది. 19 ఏళ్ల వయసులోనే మరణించిన ఈ ఫారో పాలకుడి సమాధిలో అద్భుతమైన కళాఖండాలు, బంగారు ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలు బయటపడడంతో యావత్ ప్రపంచం దృష్టి సమాధిపై పడింది. సరిగ్గా ఇదే సమయంలో అందులో రహస్య గదులున్నాయన్న ప్రచారం కూడా జరిగింది. దీనికి స్థానిక అధికారులు కూడా ఉన్నాయన్నట్లుగానే సంకేతాలు పంపారు. అయితే సమాధిలో అటువంటి గదులేవీ లేవని తాజా పరిశోధనలో తేలింది. అది రహస్య గది కాదని, టుటన్ఖమున్ తల్లి రాణి నెఫ్రిటిటీదని చెబుతున్నారు. 2015లో ఇంగ్లిష్ ఆర్కియాలజిస్టు సమాధిపై సమగ్ర పరిశోధనలు జరిపి, ఆయా ప్రదేశాల చిత్రాలను స్కాన్ చేసి, ఓ పరిశోధన పత్రాన్ని విడుదల చేశారు. దాని ప్రకారం 3వేల ఏళ్ల క్రితం తన భర్త మరణం తర్వాత ఈజిప్టును నెఫ్రిటిటీ రాణి పాలించి, మంచి పాలకురాలిగా పేరుగాంచింది. అయితే చరిత్రలో ఎక్కడా ఆమె మరణం, సమాధి గురించి లేదని, తమ పరిశోధనలో మాత్రం ఈ సమాధిలోనే రాణి మృతదేహాన్ని, ఆమెకు సంబంధించిన ఆభరణాలను పెట్టారని పరిశోధన బృందానికి నేతృత్వం వహించిన ఫ్రాన్సెస్కో పోర్సెల్లీ తెలిపారు. -
నాసా ఫొటో.. మార్స్‌పై ఏలియన్స్..??
సాక్షి, వెబ్‌డెస్క్ : ఈ మధ్య కాలంలో గ్రహాంతరవాసుల గురించి ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి వ్యక్తం అవుతోంది. ఇలాంటి తరుణంలో నాసా మార్స్ రోవర్ అంగారకుడిపై తీసిన ఫొటో సర్వత్రా చర్చకు దారి తీసింది. ఈజిప్టులోని మహిళా యోధురాలి విగ్రహం తల ఆకారంలో కనిపిస్తున్న ఓ రాయి చిత్రమది. దీంతో ఏలియన్స్ ఇప్పటికే భూమిపై సంచరించడం ప్రారంభించాయనే వాదన మొదలైంది. భూమిపై ఎన్నో ఆవిష్కరణలు జరగాల్సిన ప్రదేశాల్లో ఈజిప్టు ముఖ్యమైనది. అక్కడ ఉన్న పిరమిడ్ల వంటి చరిత్రక ఆధారాలతో ఏలియన్స్‌పై ఎన్నో చిత్రాలూ వచ్చాయి. ప్రస్తుతం నాసా పోస్టు చేసిన చిత్రం ఈ మేరకు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. -
షవర్మ.. విడాకులా ఖర్మ!
సాధారణంగా విడాకులు తీసుకోవాలంటే ఎన్నో కారణాలు ఉంటాయి. కాకపోతే ఇటీవల మరీ చిన్న చిన్న కారణాలకే భార్యాభర్తలు కోర్టులకెక్కుతున్నారు. ఈ మధ్య ఈజిప్టులో ఓ వింత విడాకుల కేసు కోర్టు ముందుకొచ్చింది. అది కూడా భర్త నుంచి విడాకులు కావాలంటూ నవవధువు పెట్టిన కేసు.. వారిద్దరికీ పెళ్లయి సరిగ్గా 40 రోజులే అవుతోంది. మరి కొత్తగా పెళ్లయిన ఆ అమ్మాయికి ఏమంత కష్టం వచ్చిందో అనుకుంటున్నారా.. అసలు కారణం తెలిస్తే షాకవాల్సిందే.. జనానిరీ అనే మహిళకు అహ్మద్ అనే టీచర్‌తో పెళ్లయింది. ఓరోజు తనకు షవర్మ కొనివ్వాలని తన భర్తను అడిగింది. అయితే అతడు అందుకు నిరాకరించాడట. షవర్మ అంటే అదేదో బ్రహ్మ పదార్థం కాదు రొట్టెల మధ్య చికెన్ కర్రీని మడిచి కాస్త వేడి చేసి ఇస్తారు అంతే. దీనికే విడాకులు తీసుకోవడమేంటని కోర్టులో జడ్జి కూడా ఆశ్చర్యపోయాడట. పెళ్లయిన మొదటి రోజే తనకు బయటికి వెళ్లడం.. షాపింగ్ చేయడం అంటే అస్సలు నచ్చదని అహ్మద్ చెప్పాడట. ఎందుకంటే డబ్బులు వృథా చేయడం ఇష్టం లేదని తేల్చి చెప్పాడట. అయితే జనానిరీ దీన్ని మొదట్లో అంతగా పట్టించుకోలేదట. అయితే రోజులు గడిచే కొద్దీ పరిస్థితి దారుణంగా మారుతోందట. ఎంత డబ్బు వస్తున్నా కూడా పిసినారితనం తలనొప్పిగా మారిందని జడ్జికి తన గోడు వెళ్లబోసుకుంది. ఆఖరికి ఆహార పదార్థాల విషయంలో కూడా పిసినారిగా ప్రవర్తించేవాడట. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెబితే మారుతాడులే అని సర్దిచెప్పారట. అయినా ఫలితం లేకపోవడంతో విడాకులు కోరింది. -
అబ్బురపడేలా భలేగా క్యాచ్ పట్టారు..
కైరో : ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడో అంతస్తు. దానికింద ఓ బ్యాంకు.. ఆ బ్యాంకు ముందు ముగ్గురు పోలీసులు. వారు ఏదో చర్చించుకుంటుండగా రోడ్డుపై వెళుతున్న కొంతమంది పైకి చూసి అయ్యయ్యో అంటున్నారు. దాంతో ఏం జరిగిందా అనుకుంటూ పోలీసులు కూడా పైకి చూశారు. ఇంకేముంది వారు షాకయ్యారు. ఎందుకంటే మూడో అంతస్తులో ఓ ఐదేళ్ల బాలుడు వేలాడుతున్నాడు. తన ఇంటి బాల్కనీలో నుంచి జారిన పిల్లాడు కాస్త మూడో అంతస్తుపై వేలాడుతున్నాడు. ఎలాగైనా అతడిని కాపాడాలని పోలీసులు తాపత్రయపడ్డారు. ఓ దుప్పటి లాంటి తెప్పించి కింద ముగ్గురు పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేశారు. అది చాలదన్నట్లు మరో పోలీసు వేరే వస్తువు తీసుకొచ్చేందుకు వెళ్లగా అనూహ్యంగా బాలుడు జారిపోయాడు. దీంతో అప్పటికే అప్రమత్తంగా ఉన్న ఓ పోలీసు బంతిని క్యాచ్ పట్టినట్లుగా బాలుడిని పట్టుకున్నాడు. దీంతో చిన్నగాయం కూడా అవకుండానే బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన ఫుటేజీని విడుదల చేయగా అది ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ఈ ఘటన ఈజిప్టులో చోటు చేసుకుంది. -
ఈ ఫొటోలు మీరు కచ్చితంగా చూడాల్సిందే..
కైరో : కొన్ని ఫొటోలు ఎన్నిసార్లు చూసినా పదే పదే చూడాలనిపిస్తుంది. కొన్ని ఆశ్చర్యాన్ని మరికొన్ని హాస్యాన్ని పుట్టిస్తాయి. చూడగానే పెదాలపై నవ్వును తెప్పిస్తాయి. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న వారికి కూడా ఆ ఫొటోలు చూపించాలనిపిస్తుంది.. అందుబాటులో లేకుంటే సోషల్ మీడియాలో దూరి ఫ్రెండ్స్‌కు షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు ఆన్లైన్లో అలాంటి ఫొటోలే అమితంగా ఆకర్షిస్తున్నాయి. అవి ఏమిటంటే ప్రపంచంలోనే ఎత్తయిన వ్యక్తి, ప్రపంచంలో కెల్లా పొట్టి మహిళ కలిసి దిగిన ఫొటోలు. ఇటీవల ఈజిప్టు పర్యటనకు వెళ్లిన వారు పిరమిడ్తోపాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫొటోలకు పోజిచ్చారు. సుల్తాన్ కోసెన్ (35) అనే వ్యక్తి ఎనిమది అడుగుల ఒక అంగుళం ఎత్తుతో గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాధించుకోగా జ్యోతి ఆంగే (24) అనే మహిళ కేవలం రెండు అడుగుల ఎత్తుండి గిన్నిస్ లో నిలిచిపోయింది. వీరిద్దరికి 2011లో ఈ రికార్డులో స్థానం దక్కింది. ఇప్పుడు వారిద్దరు కలిసి దిగిన ఫొటోలు చూపరులను కట్టిపడేస్తున్నాయి.. మీరు కూడా ఓ లుక్కేయండి మరీ! -
ప్రార్థనలు చేస్తున్న క్రైస్తవులపై దాడి
కైరో : వందల మంది ఇస్లామిక్ మత ఛాందసవాదులు ఈజిప్టులోని ఓ చర్చిలోకి దూసుకెళ్లి ప్రార్థనలు నిర్వహిస్తున్న క్రైస్తవులపై దాడి చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఈజిప్టు రాజధాని కైరో చేరువలో గల గీజాలో గత శుక్రవారం చోటు చేసుకుంది. కాప్టిక్ చర్చిని కూల్చివేయాలంటూ నినాదాలతో అక్కడికి చేరుకున్న ముస్లింలు చర్చిలో ఉన్న పవిత్ర వస్తువులను ధ్వంసం చేశారు. అప్రమత్తమైన చర్చి భద్రతా సిబ్బంది ఛాందసవాదుల గుంపును చెల్లాచెదురు చేశారు. అనంతరం గాయపడిన క్రైస్తవులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈజిప్టులో ఇస్లాం మత ప్రభావం ఎక్కువ. అక్కడి జనాభాలో క్రైస్తవులు కేవలం 10 శాతం మాత్రమే. క్రైస్తవులు చర్చిలు నిర్మించుకునేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతి లేదు. 2016లో చర్చిలు నిర్మించుకునేందుకు ప్రభుత్వం చట్టాన్ని తీసుకువచ్చింది. అయినా కూడా చర్చిల నిర్మాణానికి వచ్చే అర్జీలను అక్కడి అధికారులు తిరస్కరిస్తున్నారు. ఇస్లాం మత ఛాందసవాదులు ఆందోళనలు చేస్తారనే భయమే ఇందుకు కారణం. దీంతో క్రైస్తవులు ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రార్ధనా మందిరాలను నిర్మించుకుంటున్నారు. వీటిపై దాడులు చేస్తున్న ఇస్లాం మత ఛాందసవాదులు వాటిని కూల్చేందుకు కూడా యత్నిస్తున్నారు. 2016 డిసెంబర్ నుంచి ఇలా జరిగిన కల్లోలాల్లో 100 మందికి పైగా క్రైస్తవులు ప్రాణాలు కోల్పోయారు. కాప్టిక్ చర్చిపై దాడులు జరగడం ఇది తొలిసారేమీ కాదు. గతంలో పలుమార్లు ముస్లింలు ఈ చర్చిని కూల్చివేసేందుకు ప్రయత్నించారు. -
సమాధుల వయసు 3500 ఏళ్లు
-
ఆ.. సమాధుల వయసు 3500 ఏళ్లు
లగ్జర్ సిటీ (ఈజిఫ్ట్) : ఈజిఫ్ట్‌లోని లగ్జర్ సిటిలో అత్యంత పురాతనమైన రెండు సమాధులను పురావస్తు శాస్త్రవేత్తలు శనివారం గుర్తించారు. ఈజిఫ్ట్‌ను పాలించిన ఫారో రాజుల్లో 18వ రాజవశాంనికి చెందినవారివిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. రెండు సమాధుల్లో ఒకదానికి 5 ప్రధాన ద్వారాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. రెండు సమాధులు దీర్ఘచతురస్రాకారంలో ఉన్నట్లు వారు చెప్పారు. సమాధుల్లోపల పెద్ద హాల్, అందులో రెండు అంత్యక్రియల కోసం నిర్వహించే వస్తువులు, మట్టి పాత్రలు ఉన్నాయి. అందులోనే రెండు మమ్మీలతో పాటు బంగారు ఆభరణాలను కూడా అధికారులు గుర్తించారు. ఈ సమాధుల వయసు సుమారు 3,500 ఏళ్లు ఉంటాయని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
మసీదులో 235 మంది ఊచకోత
ఈజిప్ట్‌లో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. బాంబులు, తుపాకులతో విరుచుకుపడి నెత్తుటేర్లు పారించారు. మసీదులో శుక్రవారం ప్రార్థనల్లో పాల్గొన్న అమాయకులపై గుళ్ల వర్షం కురిపించి 235 మంది నిండు ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా తీసేశారు. ముందు మసీదులో బాంబు పేల్చి, అనంతరం భయంతో పారిపోతున్న వారిపై నలువైపుల నుంచి విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఇస్లామిక్ దేశం ఈజిప్ట్‌లోని సమస్యాత్మక ఉత్తర సినాయ్ ప్రాంతంలోని అల్–అరిష్ పట్టణంలో ఉన్న అల్–రౌదా మసీదులో ఈ ఘోరం చోటు చేసుకుంది. సాధారణంగా ఐఎస్ ఉగ్రసంస్థ ద్రోహులుగా పరిగణించే సూఫీలు ఈ మసీదులో ప్రార్థనలు జరుపుతారని స్థానికులు తెలిపారు. కైరో: ఈజిప్ట్‌లో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. అల్ అరిష్ పట్టణంలోని మసీదులో శుక్రవారం మధ్యాహ్నం పవిత్ర ప్రార్థనలు చేసుకుంటున్న సూఫీ ముస్లింలపై ఉగ్రవాదులు బాంబులు, భారీ ఆయుధాలతో దాడి చేశారు. ఆ దేశం గతంలో ఎన్నడూ చూడని రీతిలో దాదాపు 235 మందిని పొట్టనబెట్టుకున్నారు. మరో 109 మందిని గాయపరిచారు. ఈ దారుణ ఘటనతో మసీదు ప్రాంగణమంతా చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు, క్షతగాత్రులు, రక్తపు ధారలతో భీతావహంగా మారింది. నాలుగు వాహనాల్లో వచ్చిన ఉగ్రవాదులు తొలుత మసీదులోని చిన్నారుల సంరక్షణ కేంద్రం వద్ద బాంబు పేల్చారనీ, ఆ తర్వాత అక్కడి నుంచి పరుగులు తీస్తున్న ప్రజలపై బుల్లెట్ల వర్షం కురిపించారని ఈజిప్ట్ అధికార వార్తా సంస్థ ‘మెనా’ వెల్లడించింది. ఇది ఉగ్రదాడేనని ఈజిప్ట్ ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. గాయపడిన వారిని వైద్యశాలలకు తరలించేందుకు 50కిపైగా అంబులెన్సులు ఘటనాస్థలం వద్దకు చేరుకున్నాయి. సూఫీలే లక్ష్యంగా.. సూఫిజం మద్దతుదారులు, ఈజిప్ట్ భద్రతాదళాలను సమర్థిస్తున్నవారు లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రసంస్థ కూడా సూఫీలను ఇస్లాం ద్రోహులుగా భావిస్తుంది. అయితే, ఈ దాడికి ఇంతవరకూ ఏ ఉగ్రవాద సంస్థా బాధ్యతను ప్రకటించుకోలేదు. దాడి చేసిన ఉగ్రవాదులు ఏమయ్యారన్న దానిపై కూడా సమాచారం లేదు. అయితే దాడి జరిగిన తీరును బట్టి ఇది ఐఎస్ ఉగ్రసంస్థ పని అయ్యుండొచ్చని భావిస్తున్నారు. అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్–సిసీ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి దాడి తీవ్రత, ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. ఈజిప్ట్ ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించింది. మాజీ అధ్యక్షుడు హోస్ని ముబారక్‌ను పదవి నుంచి దింపివేసిన తర్వాత 2011 జనవరి నుంచి ఉత్తర సినాయ్ ప్రాంతంలో ఉగ్రవాదుల దాడులు పెరిగాయి. ఇస్లాంవాది అయిన మరో మాజీ అధ్యక్షుడు మహ్మద్ మోర్సీ 2013లో పదవి కోల్పోయాక ఈ ప్రాంతంలోని పోలీసులు, సైన్యం లక్ష్యంగా ఉగ్రవాదులు మరింత పేట్రేగిపోయారు. అప్పటి నుంచి ఇప్పటికి 700 మందికిపైగా భద్రతా సిబ్బంది ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది తొలి నుంచీ ఈజిప్ట్‌లో ఉగ్రదాడులు ఎక్కడోచోట జరుగుతూనే ఉన్నాయి. మే 26న క్రైస్తవులను ఎక్కించుకుని వెళ్తున్న ఓ బస్సుపై జరిగిన దాడిలో 28 మంది మరణించారు. ఏప్రిల్ 9న కూడా అలెగ్జాండ్రియా, టాంట నగరాల్లోని చర్చిల వద్ద జరిగిన రెండు ఆత్మాహుతి దాడుల్లో 46 మంది చనిపోయారు. పిరికిపందల చర్య: ట్రంప్ దాడిలో మృతి చెందిన వారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతాపం తెలిపారు. దాడిని పిరికిపందల చర్యగా అభివర్ణించిన ట్రంప్ ‘ప్రపంచం ఉగ్రవాదాన్ని ఇక భరించలేదు. మనం మన సైన్యాలతోనే వారిని ఓడించాలి’ అంటూ ట్వీట్ చేశారు. ‘ఉగ్ర’ పోరుకు మా మద్దతు: మోదీ దాడిపై ప్రధాని మోదీ స్పందిస్తూ ‘ఈ ఆటవిక ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రాణాలు కోల్పోయిన అమాయకులకు దేశం తరఫున సంతాపం తెలియజేస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో ప్రపంచ దేశాలకు భారత్ మద్దతుగా ఉంటుందని ఆయన భరోసానిచ్చారు. ఈజిప్టులో భారత రాయబారి సంజయ్ భట్టాచార్య కూడా దాడిని ఖండించారు. ప్రతీకారం తీర్చుకుంటాం: సిసీ ఉగ్రవాదులపై తమ ‘క్రూర సైన్యం’ ద్వారా తగిన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటామని ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్–సిసీ శపథం చేశారు. ఇలాంటి దాడుల వల్ల ఉగ్రవాదంపై పోరాటంలో తమ బలం మరింత పెరుగుతుందని ఆయన అన్నారు. -
సంచలనం: ఆదేశానికి రాజుగా భారతీయుడు
భారతీయులు ఎక్కడ ఉన్నా సంచలనాలకు మారుపేరుగా నిలుస్తుంటారు. తాజాగా మరో 24ఏళ్ల భారతీయ యువ వ్యాపారవేత్త మరో సంచలన ప్రకటన చేశాడు. రెండు దేశాల మధ్య వివాదాస్పదంగా ఉన్న భూభాగానికి రాజుగా ప్రకటించుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే ఈజిప్టు, సుడాన్ దేశాల సరిహద్దులో వివాదాస్పంగా ఉన్న బిర్‌తావిల్ ప్రాంతానికి స్వయం ప్రకటిత రాజుగా ప్రకటించుకున్నాడు ఓ భారతీయుడు. ఈజిప్టు, సుడాన్‌ల మధ్య 2060 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న కొంత భూభాగం ఉంది. ఆప్రాంతం తమది కాదంటే తమది కాదంటూ రెండు దేశాలు పరస్పరం వాదించుకుంటున్నాయి. అది ఉగ్రవాదులు సంచరించే ప్రాంతం కావడంతో రెండు దేశాలు ఆప్రదేశంపై వెనక్కి తగ్గాయి. ఇండోర్‌కు చెందిన యువ పారిశ్రామిక వేత్త సుయాష్ దీక్షిత్ కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించి బిర్‌తావిల్‌కు రాజుగా ప్రకటించుకున్నాడు. ఆప్రాంతానికి 'కింగ్డమ్ ఆఫ్ దీక్షిత్' అని పేరుకూడా పెట్టకున్నాడు. అంతేకాదు దేశంగా ప్రకటించుకున్న సందర్భంగా అక్కడ ఓ విత్తనం నాటి నీరు కూడా పోశాడు. ఇక నుంచి ఈ ప్రాంతానికి రాజును నేనేనంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అంతేకాకుండా తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా ఆదేశానికి అధ్యక్షుడిగా తన తండ్రి పేరు ప్రకటించాడు. హ్యాపీ బర్త్‌డే పప్పా అంటూ తన వాల్‌పై రాసుకున్నాడు. అనంతరం కింగ్డమ్ ఆఫ్ దీక్షిత్‌ను దేశంగా పరిగణించాలంటూ ఐక్యరాజ్యసమితికి ఆన్లైన్లో ఓదరఖాస్తు కూడా పెట్టుకున్నాడు. ఇప్పటి వరకూ తనకు 800 మంది మద్దతు పలికారని పేర్కొన్నాడు. కింగ్డమ్ ఆఫ్ దీక్షిత్ వివరాలు దేశం పేరు: కింగ్డమ్ ఆఫ్ దీక్షిత్ జెండా: పైన చిత్రంలో ఉంది ప్రస్తుత జనాభా: 1 రాజధాని: సుయాష్‌పూర్ పాలకుడు: సుయాష్ రాజు ఏర్పాటు తేది: నవంబర్ 5, 2017 జాతీయ జంతువు: బల్లి -
గిజా పిరమిడ్ రహస్యం ఇదే..!
-
ఉగ్ర’ కాల్పుల్లో 55 మంది పోలీసుల మృతి
కైరో: ఈజిప్టులో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య శుక్రవారం రాత్రి జరిగిన కాల్పుల్లో 55 మంది పోలీసులు మరణించారు. కైరోకు 135 కిలోమీటర్ల దూరంలో ఎల్–వాహత్ ఎడారిలో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారం రావడంతో భద్రతా దళాలు అక్కడకు చేరుకున్నాయి. ఇరు వర్గాలకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో పోలీసు అధికారులు, సైనికులు సహా 55 మంది మరణించారు. ఉగ్రవాదులు 15 మంది మరణించారు. అయితే వారు ఏ ఉగ్ర సంస్థకు చెందినవారనేది తెలియరాలేదు. కాగా, 2013లో అధ్యక్షుడిగా ఉన్న ఇస్లాం మతవాది మొహమ్మద్ మోర్సీని పదవి నుంచి దింపేసిన తర్వాత ఈజిప్టులో పోలీసులు, భద్రతా దళాలపై ఉగ్రవాదుల దాడులు పెరిగిపోయాయి. అప్పటి నుంచి వందలాది మంది పోలీసులు, ఆర్మీ సిబ్బంది దాడుల్లో మృతి చెందారు. మరోవైపు ఆర్మీ కూడా సినాయ్ ప్రావిన్సులో ఉగ్రవాదుల కోసం తరచూ గాలిస్తూ, అనుమానితులను అరెస్టు చేయడంతోపాటు ముష్కరుల ఇళ్లను కూల్చివేసింది. సినాయ్‌లోని కొన్ని ఇళ్ల నుంచి గిజాకు సొరంగ మార్గాలను కూడా ఆర్మీ గుర్తించింది. -
భారీ ఉగ్రకుట్ర భగ్నం
ఈజిప్టులో 10 మంది ఉగ్రవాదుల కాల్చివేత కైరో : ఈజిప్టులో భద్రతా బలగాలు భారీ ఉగ్ర కుట్నను భగ్నం చేశాయి. సెంట్రల్ కైరో సమీపంలోని అర్ద్ ఎల్లేవా జిల్లాలో ఓ అపార్ట్మెంట్లో దాక్కుని ఉన్న 10 మంది ఉగ్రవాదులను ఆదివారం మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల ఎదురుకాల్పుల్లో ముగ్గురు అధికారులు సహా ఐదుగురు భద్రతా సిబ్బంది గాయపడినట్లు ఓ ఉన్నతాధికారి మీడియాకు తెలిపారు. ఉగ్రవాదులు దేశంలో పలుచోట్ల దాడులకు ప్రణాళిక రచిస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి పక్కా సమాచారం అందిందన్నారు. దీంతో ఉగ్రవాదులు నక్కిన భవంతిని భద్రతా బలగాలు చుట్టుముట్టాయని వెల్లడించారు. వీరి కదలికల్ని గమనించిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారని తెలిపారు. భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో దాదాపు 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారని వెల్లడించారు. ఈ ఉగ్రవాదులందరూ నిషేధిత ముస్లిం బ్రదర్హుడ్ సంస్థ నుంచి వేరయిన వారిగా అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. సంఘటనాస్థలం నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 2013లో అధ్యక్షుడు మొహమ్మద్ మోర్సీ ప్రభుత్వాన్ని సైన్యం రద్దుచేసిన అనంతరం ఈజిప్టులో ఆర్మీ, పోలీసులపై ఉగ్ర దాడులు భారీగా పెరిగాయి. -
ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం
-
ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం
కైరో: ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు లోకల్ రైళ్లు ఢీకొన్న ఘటనలో దాదాపు 36 మంది ప్రాణాలు కోల్పోగా, 120 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈజిప్టు ఉత్తరతీరంలోని అలెగ్జాండ్రియాలో శుక్రవారం ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. ఎదురెదురుగా వచ్చిన రెండు లోకల్ రైళ్లు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే సాంకేతిక కారణాల వల్ల రాజధాని కైరో నుంచి వస్తున్న రైలు ఆగి ఉండగా మరో రైలు వచ్చి ఢీకొట్టిందని రవాణాశాఖ పేర్కొంది. విచారణకు ఆదేశించినట్లు ఆశాఖ మంత్రి తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరగనుందని సమాచారం. మౌమెన్ యూసఫ్ అనే ప్రయాణికుడు మాట్లాడుతూ.. క్షణాల్లో రైళ్లు ఢీకొనడం జరిగిపోయింది. కళ్లు తెరచి చూసే సరికి కిందపడిపోయి ఉన్నాను. అంబులెన్స్‌లు గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలిస్తున్నాయి. ఘటనా స్థలం భయానక వాతావరణాన్ని తలపించిందని వివరించాడు. -
50మంది పోలీసులకు జైలు శిక్ష
కైరో(ఈజిప్టు): సాధారణంగా ఎవరైనా తప్పుచేస్తే పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తారు. కోర్టు వారికి శిక్ష విధిస్తుంది. ఈజిప్టులో మాత్రం, తప్పు చేస్తే జైలులో పెట్టాల్సిన పోలీసులే జైలుపాలయ్యారు. తమ సెలవు దినాలను తగ్గించారని నిరసనకు దిగారు. అధికారులను బండ బూతులు తిట్టారు. చివరకు కటకటాలపాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. నిబంధనలకు విరుద్ధంగా సమ్మెకు దిగిన 50 మంది పోలీసులకు ఈజిప్టులోని ఓ న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. సెలవు దినాల తగ్గింపుపై 50 మంది దిగువ తరగతి పోలీసు సిబ్బంది జనవరిలో సమ్మెకు దిగారు. దీంతోపాటు వీరు ఉన్నతాధికారులపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ అంశాలను సీరియస్‌గా తీసుకున్న దక్షిణ సినాయ్ ప్రొవిన్షియల్ కోర్టు వీరందరికీ మూడేళ్ల జైలుశిక్షతోపాటు 330 డాలర్ల చొప్పున జరిమానా కూడా విధిస్తూ తీర్పు వెలువరించారని ప్రభుత్వ అల్-అహ్రాం వెబ్సైట్ వెల్లడించింది. -
40 మంది తీవ్రవాదులు హతం
కైరో(ఈజిప్టు): సినాయి ప్రావిన్స్ ఉత్తరప్రాంతంలో సైన్యం జరిపిన దాడుల్లో 40 మంది తీవ్రవాదులు చనిపోయారని ఈజిప్టు సైన్యం ప్రకటించింది. అల్-అరిష్, షేఖ్ జ్వాయెద్, రఫాహ్ పట్టణాల్లో ఉన్న తీవ్రవాదుల స్థావరాలపై గత వారం రోజులుగా సైనిక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా 52 స్థావరాల్లో ఉన్న 40మందిని మట్టుబెట్టి, ఐదుగురు తీవ్రవాదులను పట్టుకున్నారు. పెద్ద మొత్తంలో మందులు, 25 వాహనాలతో పాటు, నాలుగు బైక్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు నాలుగు కారు బాంబులను, భారీగా పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేశామని సైనిక వర్గాలు తెలిపాయి. 2011లో అధ్యక్షుడు ముబారక్‌ను పదవీచ్యుతుడిని చేసినప్పటి నుంచి సినాయి ద్వీపకల్పంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. -
మమ్మీ శాపం నిజమా?
బంగారు నిధిని కనిపెట్టాం దాన్ని తవ్వాలంటే నరబలి ఇవ్వాలి. లేదంటే ఆ నిధి మనల్ని శపిస్తుందన్న కారణంతో జరిగే ఆకృత్యాలను మనం అప్పుడప్పుడు వింటూనే ఉన్నాం. గుప్తనిధి, సమాధుల్లో అతీంద్రియ శక్తులు ఉంటాయని వాటిని తవ్వితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుందని చాలామంది విశ్వసిస్తుంటారు. ఈజిప్టులో ఎన్నో ఏళ్లుగా ఉన్న సమాధిని తవ్విన వ్యక్తులు వివిధ కారణాలతో ఆకస్మాత్తుగా మరణించారు. మరి వారి మరణానికి కారణాలేంటి...? నిజంగా సమాధిలోని శక్తి వారిని చంపిందా లేక మరేదైనా కారణాలతో చనిపోయారా అన్న విషయాలను ఈ రోజు తెలుసుకుందాం...! ఈజిప్టువాసులకు పునర్జన్మ, మరణం అనంతరం జీవితంపై అంతులేని విశ్వాసం. అందుకే, వ్యక్తి మరణించినా.. వారు తిరిగి లేస్తారని భావించేవారు. అందుకే, వారి శరీరాలు పాడవకుండా జాగ్రత్తగా ఖననం చేసేవారు. చనిపోయిన వ్యక్తికి తిరిగి ప్రాణమొస్తే.. అతనికి ఉపయోగపడేలా.. కావాల్సిన పాత్రలు, వస్తువులను సమాధిలో ఉంచేవారు. చనిపోయింది రాజులైతే.. వారికి తోడుగా పనివాళ్లని కూడా బతికుండగానే.. మమ్మీలుగా మార్చేవారు. అలాంటిది ఏకంగా ఈజిప్టు రాజు ట్యుట్ అంక్ మూన్ అనే రాజు మరణించాడు. వారి ఆచారాల ప్రకారం అతినికిష్టమైన వస్తువులు, కళాఖండాలు బంగారంతో పొదిగిన ఆభరణాలు అతనితోపాటే సమాధిలో పెట్టారు. అంతేకాదు సమాధిలో ఆయన తినడానికి వీలుగా బంగారు, వెండితో చేసిన పాత్రలను కూడా ఉంచారు. టూట్స్ సమాధిలో ఎన్నో విలువైన వస్తువులు ఉన్నాయని అక్కడి ప్రజలందరికి తెలిసినప్పటికీ దాన్ని ఎవరూ తెరిచేందుకు సాహసించేవారు కాదు. ఎందుకంటే ఆ సమాధిని తెరిస్తే తాము శాపానికి గురై అకాలమరణం చెందుతామని వారి విశ్వాసం. స్థానికులు వారించినా 1923లో బ్రిటిష్ ఆర్కియాలజికల్ సంస్థకు చెందిన లార్డ్ కార్నర్వాన్, హవర్డ్కార్టర్లు టూట్స్ సమాధి తెరిచేందుకు సిద్ధమయ్యారు. ఇందుకుగాను జార్జ్ హెబర్ట్ నిధులు సమకూర్చారు. సమాధి తెరిస్తే శాపానికి గురౌతారని స్థానికులు ఎంత వారించినప్పటికీ వారి ప్రయత్నాన్ని మాత్రం విరమించుకోలేదు. ఇలాంటి మూఢవిశ్వాసాలను తామేమాత్రం లెక్కచేయమన్నారు. కార్నర్వాన్ ఆధ్వర్యంలో సమాధిని తెరిచారు. అయితే సమాధిని తెరిచిన నెలరోజులకు ఒకరోజు ఉదయం కార్నర్వాన్ గడ్డం గీసుకుంటుండగా అతని చెంపపై దోమ కుట్టింది. అది ఇన్ఫెక్షన్గా మారడంతో ఆసుపత్రికి వెళ్లాడు. ఆయన ఎన్ని ఆసుపత్రులు తిరిగినా, ఎన్ని మందులు వాడినప్పటికీ ఇన్ఫెక్షన్ తగ్గలేదు. చివరికి ఆయన శరీరంలోని రక్తం కుళ్లిపోయి కార్నర్వాన్ మరణించాడు. ఇలా ఆ సమాధి తెరిచినప్పుడు ఉన్న వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరు మరణించడం మొదలైంది. ఒకరు ఆత్మహత్య చేసుకుంటే మరొకరు అనారోగ్య కారణాలతోగానీ మరేదైనా కారణాలతోగానీ మరణించారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు మరణిస్తుంటే ఆ సమాధిని తెరవడం వల్లనే శాపానికి గురై మరణించారని ప్రచారం మొదలైంది. స్థానికంగా ఉన్న మీడియా కూడా సమాధిలో ఉన్న శక్తే వీరిని శపించిందని కథనాలు రాసింది. కార్నర్ మరణం ఒక్కటే కాదు ఆ సమాధిలో ఉన్న ప్రతిఒక్కరూ మరణిస్తారనుకున్నారు స్థానికులు. సమాధి తెరిచేందుకు సహకరించిన వ్యక్తులు ఆకస్మాత్తుగా మరణిస్తుండటంతో ఈ పుకార్లు మరింత షికారు చేసాయి. ఏది నిజం? ఇలా ఒకరితర్వాత ఒకటిగా చోటు చేసుకుంటున్న ఆకస్మిక మరణాలకు కారణాలేంటని శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలుపెట్టారు. నిజంగా సమాధిలో ఉన్న శక్తి శపించడం మూలాన వారు మరణించారా? లేదా మరేదైనా కారణాలతో మరణించారా అని అధ్యయనం సాగించారు. దానికి వారు కొన్ని కారణాలను ఉదహరించారు. సమాధిని ఇతరులెవరూ తెరవకుండా ఉండేందుకు ఆ శవపేటికల గోడలకు గుర్తు తెలియని విషాన్ని పూసి ఉంటారన్నది కొందరు విశ్లేషించారు. లేదా వేల ఏళ్లుగా సమాధి గోడలపై ఉన్న ప్రమాదకర బ్యాక్టీరియా వారి చేతుల ద్వారా శరీరంలోకి వెళ్లి అనారోగ్యం బారిన పడిఉంటారని మరికొందరు వివరించారు. అంతేకాదు.. అక్కడున్న వ్యక్తులకు ఇదివరకు వివిధ అనారోగ్య సమస్యలున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. కానీ, పుకారుకు వేగమెక్కువ కాబట్టి.. జనాలు శాపాన్నే ఎక్కువగా నమ్మారు. అయితే, సమాధిని తెరిచిన తర్వాత తొలిసారి అందులోకి దిగిన హవార్డ్ కార్టర్ మాత్రం పది సంవత్సరాలకు పైగా జీవించడం విశేషం.– సాక్షి స్కూల్ ఎడిషన్ -
ఈజిప్టు పిరమిడ్ల వద్ద ...
అలెగ్జాండ్రియా నుంచి ఇస్మైలియా దాకా పలు నగరాల్లో యోగా డేను నిర్వహిస్తున్నట్లు భారత రాయబారి సంజయ్ భట్టాచార్య తెలిపారు. పిరమిడ్లు, కైరోలోని తాహ్రిర్ స్క్వేర్ వద్ద ‘ఫ్లాష్ మాబ్’ (అకస్మాత్తుగా కొందరు యువతీయువకులు గుమిగూడి కాసేపు నృత్యం చేసి... అంతేవేగంగా వెళ్లిపోతారు. జనం దృష్టిని ఆకర్షించడానికి ఈ ఫ్లాష్‌మాబ్‌లు నిర్వహిస్తుంటారు)కు భారత రాయబార కార్యాలయం ప్లాన్ చేసింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌లోని రబిన్ స్క్వేర్ వద్ద వేలాదిగా జనం యోగా డేలో పాల్గొననున్నారు. అయ్యంగార్, అస్థాన, త్రి యోగా, విన్యాస యోగా, ఆక్రో యోగాలలో తరగతులు నిర్వహించనున్నారు. యోగా, ఆయుర్వేదంపై అవగాహన పెంచడానికి సమాచార కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. -
ఖతార్‌కు దిమ్మతిరిగే షాక్
గల్ఫ్ అరబ్ దేశాలతో పూర్తిగా సంబంధాలు కట్ రియాద్: ఖతార్‌కు సహచర అరబ్ దేశాలు దిమ్మతిరిగే షాక్‌నిచ్చాయి. ఖతార్ ఉగ్రవాదాన్ని, అతివాదాన్ని ప్రోత్సహిస్తున్నదంటూ సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఈజిప్ట్, బ్రహెయిన్ ఆ దేశంతో సంబంధాలను పూర్తిగా తెగదెంపులు చేసుకున్నాయి. దౌత్యసంబంధాలతోపాటు భూ, గగనతల, సముద్ర సంబంధాలను సైతం కట్ చేసుకుంటున్నట్టు తేల్చిచెప్పాయి. ఖతార్ ఉగ్రవాదాన్ని, అతివాదానికి మద్దతుగా నిలుస్తున్నదని సౌదీ ఆరోపిస్తుండగా.. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నదని బ్రహెయిన్ మండిపడుతోంది. ఉగ్రవాదం నుంచి తమ రాజ్యాన్ని కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సౌదీ తెలిపింది. రానున్న 48 గంటల్లో దోహాలోని తమ దౌత్యకార్యాలయాన్ని ఉపసంహరించుకుంటామని, అదే గడువులోగా తమ దేశంలో ఉన్న ఖతార్ దౌత్యవేత్తలు దేశాన్ని విడిచి వెళ్లాలని హుకుం జారీచేసింది. తమ దేశంలోని ఖతార్ పౌరులు కూడా రెండువారాల్లోగా దేశాన్ని విడిచివెళ్లాలని ఆదేశించింది. -
ఈజిప్టు మారణకాండ మా పనే: ఐసిస్
కైరో: ఇటీవల ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ లో ఆత్మాహుతి దాడికి పాల్పడి 22 మంది అమాయకుల్ని బలిగొన్న ఐసిస్ ఉగ్రవాదులు.. తాజాగా శుక్రవారం ఈజిప్టులోని ఓ బస్సుపై విరుచుకుపడి 26 మంది క్రైస్తవులను అమానవీయంగా పాశవికంగా హత్యచేశారు. ఈజిస్టు మారణహోమానికి కూడా తమదే బాధ్యతని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ శనివారం వెల్లడించింది. ప్రస్తుతం మృతుల సంఖ్య 29కి పెరిగిందని ఈజిప్టు అధికారులు తెలిపారు. శుక్రవారం ఈజిప్టు కాప్టిక్ క్రైస్తవులు ప్రయాణిస్తున్న ఓ బస్సుపై సైనిక దుస్తులు ధరించిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డ విషయం తెలిసిందే. మిన్య నగరం సమీపంలో జరిగిన ఈ మారణకాండలో 26 మంది క్రైస్తవులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా మంది గాయపడ్డారు. -
24 మంది క్రైస్తవుల కాల్చివేత