ఈజిప్టులో బస్‌ ప్రమాదం, భారతీయులకు గాయాలు | 16 Indian Tourists injured In Bus Accident In Egypt | Sakshi
Sakshi News home page

ఈజిప్టులో ప్రమాదం, 16మంది భారతీయులకు గాయాలు

Published Sun, Dec 29 2019 8:26 AM | Last Updated on Sun, Dec 29 2019 9:53 AM

16 Indian Tourists injured In Bus Accident In Egypt - Sakshi

కైరో: ఈజిప్టులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐన్ సోఖ్నా సమీపంలో 16 మంది భారత పర్యాటకులు  బస్సు ప్రమాదానికి గురయ్యారని కైరోలోని భారత రాయబార కార్యాలయం శనివారం తెలిపింది. ఈజిప్టులోని ఓ ఆన్‌లైన్‌ పత్రిక తెలిపిన వివరాల ప్రకారం.. పర్యాటకులతో వెళుతున్న బస్సును ట్రక్కు ఢీకొట్టగా అనూహ్యంగా వేనకాలే వస్తున్న మరో బస్సును ట్రక్కు ఢీకొట్టింది. పలువురు గాయపడగా, ఆరుగురు మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఓ భారతీయుడు, ఇద్దరు మలేషియా దేశస్తులు, ముగ్గురు ఈజిప్టుకు చెందిన వారున్నారు. 

క్షతగాత్రులను సూయోజ్, కైరో ఆసుపత్రులలో చేర్పించారని అధికారులు తెలిపారు. ఎంబసీ అధికారులు... సంఘటనను పర్యవేక్షిస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. పర్యాటకుల సమాచారం కొరకు రెండు హెల్ప్‌లైన్ నంబర్లను ఇచ్చారు. హెల్ప్‌లైన్ నంబర్లు + 20-1211299905, +201283487779 అందుబాటులో ఉన్నాయని భారత రాయబార కార్యాలయం, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేరిట ట్వీట్‌ చేశారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement