Indian tourists
-
వీసా లేకున్నా 60 రోజుల అనుమతి
న్యూఢిల్లీ: భారతీయ పర్యాటకులను ఆకర్షించే నిమిత్తం థాయిలాండ్ ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. వీసాలేకున్నా థాయిలాండ్‌లో గరిష్టంగా 60 రోజులపాటు ఉండేందుకు అనుమతి మంజూరుచేసింది. పర్యాటకం, చిన్నపాటి వ్యాపారాల నిమిత్తం థాయిలాండ్‌ను సందర్శించే భారతీయులకు ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుందని థాయిలాండ్ పేర్కొంది. ఇందుకోసం 2025 జనవరి ఒకటో తేదీ నుంచి భారత్‌లో ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (ఈటీఏ)(ఈ–వీసా) విధానం అమల్లోకి తెస్తామని పేర్కొంది. థాయిలాండ్యేతర జాతీయులు https:// www. thaievisa. go. th వెబ్సైట్లో సంబంధిత దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని థాయిలాండ్ ఎంబసీ బుధవారం ప్రకటించింది. ఆఫ్‌లైన్ మోడ్‌లోనూ దరఖాస్తులను స్వీకరిస్తామని ఢిల్లీలోని థాయిలాండ్ రాయబార కార్యాలయం పేర్కొంది. ఈ విషయంలో ఎంబసీ, కాన్సులేట్ జనరల్స్ నుంచి పూర్తి సహయసహకారాలు అందుతాయని వెల్లడించింది. దరఖాస్తు ఒకవేళ తిరస్కరణకు గురైనా వీసా దరఖాస్తు ఫీజు అనేది తిరిగి ఇవ్వరు. వీసా ఫీజు చెల్లించిన 14 రోజుల్లోపు ఈ–వీసా దరఖాస్తు పరిశీలన ప్రక్రియ మొత్తం పూర్తిచేస్తారు. సాధారణ వీసా కోసం డిసెంబర్ 16లోపు దరఖాస్తు చేసుకోవాలి. దౌత్య, అధికారిక వీసా కోసం డిసెంబర్ 24లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈటీఏలో పలు ప్రయోజనాలున్నాయి. ఒకసారి ఈ–వీసా తీసుకుంటే గరిష్టంగా 60 రోజులపాటు అక్కడే ఉండొచ్చు. అత్యయిక, అవసరమైన సందర్భాల్లో సందర్శకులు మరో 30 రోజులు అక్కడే ఉండొచ్చు. ఈటీఏ అనుమతులు సాధించిన ప్రయాణికులు చెక్పాయిట్ల వద్ద ఇమిగ్రేషన్ అధికారుల తనిఖీ తదితర సోదా తంతు అత్యంత వేగంగా పూర్తవుతుంది. ఈటీఏపై క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు పూర్తి వివరాలు అక్కడే అధికారులకు త్వరగా అందుబాటులోకి వచ్చి ప్రయాణికుడికీ సమయం చాలా కలసి వస్తుంది. వీసా మినహాయింపు పొందిన విదేశీయులు తమ దేశంలో ఎన్నాళ్ల నుంచి సక్రమంగా, అక్రమంగా ఉంటున్నారనే వివరాలు ఎప్పటికప్పుడు థాయ్ ప్రభుత్వానికి అందుతాయి. గడువు దాటి అక్కడే ఉంటే రోజుల లెక్కన జరిమానా విధిస్తారు. -
Japan eVisa: జపాన్ టూర్ ఇక ఈజీ!
జపాన్ను సందర్శించాలనుకునే భారతీయులు ఇకపై తమ పాస్‌పోర్ట్‌లపై భౌతిక వీసా స్టిక్కర్లను పొందాల్సిన అవసరం లేదు. ఏప్రిల్ 1 నుండి, జపాన్ భారతీయ పర్యాటకుల కోసం ఈ-వీసాల జారీని ప్రారంభించింది. పర్యాటకులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఈ జపాన్ ఈ-వీసా ప్రోగ్రామ్.. వీఎఫ్ఎస్ గ్లోబల్ ద్వారా నిర్వహిస్తున్న జపాన్ వీసా దరఖాస్తు కేంద్రాల ద్వారా ఎలక్ట్రానిక్ పద్ధతిలో వీసాలకు దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఈ వీసా ప్రోగ్రామ్ ప్రత్యేకంగా పర్యాటక ప్రయోజనాల కోసం సింగిల్-ఎంట్రీ స్వల్పకాలిక వీసాను అందిస్తుంది. జపాన్‌లో గరిష్టంగా 90 రోజుల పాటు ఉండేందుకు వీలు కల్పిస్తుంది. భారతదేశంలో నివసిస్తున్న భారతీయ పౌరులు, విదేశీ పౌరులు ఈ ఈ-వీసాకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వీసా కేంద్రానికి వెళ్లాల్సిన పనిలేదు కొత్త విధానం ప్రకారం.. పర్యాటకులు తమ దరఖాస్తులను మునుపటి ప్రక్రియ మాదిరిగానే వీఎఫ్ఎస్ గ్లోబల్ నిర్వహించే వీసా దరఖాస్తు కేంద్రాలకు సమర్పించాలి. అయితే తమ పాస్‌పోర్ట్‌లకు సాంప్రదాయ వీసా స్టిక్కర్‌ను అతికించుకునేందుకు వీసా కేంద్రానికి వెళ్లాల్సిన పని లేదు. విజయవంతమైన దరఖాస్తుదారులకు నేరుగా వారి ఫోన్‌కే ఎలక్ట్రానిక్ వీసా వస్తుంది. ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత తమ ఫోన్లలో "వీసా జారీ నోటీసు"ని చూపించాలి. ఈ దశకు ఇంటర్నెట్ యాక్సెస్ అవసరమని గమనించడం ముఖ్యం. డిజిటల్ వీసా జారీ నోటీసు కాకుండా పీడీఎఫ్, ఫోటో, స్క్రీన్‌షాట్ లేదా ప్రింటెడ్ కాపీలను అనుతించరు. 🚨 Japan begins issuing e-visas for Indian tourists, offering a 90 day stay for tourism purposes. 🇯🇵🇮🇳 pic.twitter.com/rhwml8dvF3 — Indian Tech & Infra (@IndianTechGuide) April 3, 2024 -
'వీసా లేకుండా ఎంట్రీ' - ఇరాన్ నాలుగు షరతులు ఇవే..
ప్రపంచంలోని కొన్ని దేశాలకు వెళ్లాలంటే వీసా తప్పనిసరి, మరికొన్ని దేశాలు వీసా లేకుండా.. షరతులతో అనుమతి కల్పిస్తాయి. ఈ జాబితాలో ఇప్పుడు ఇరాన్ చేరింది. ఇరాన్ వెళ్లాలనుకునే భారతీయులకు ఇది పెద్ద శుభవార్త. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతీయులకు వీసా మినహాయింపు కల్పించిన దేశాల వరుసలో ఇరాన్ చేరింది. దీంతో వీసా అవసరం లేకుండా 15 రోజులు ఇరాన్ దేశంలో పర్యటించడానికి ఢిల్లీలోని ఇరాన్ రాయభారి కార్యాలయం ఇటీవలే ప్రకటించింది. భారతదేశానికి మాత్రమే కాకుండా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇండోనేషియా, జపాన్, సింగపూర్, మలేషియాతో సహా 32 ఇతర దేశాల కోసం వీసా-ఫ్రీ ప్రోగ్రామ్‌ను ఆమోదించింది. ఇరాన్ దేశంలో పర్యాటక రంగాన్ని బాగా అభివృద్ధి చేయడానికి వీసా ఫ్రీ ప్రోగ్రామ్ ప్రారంభించినట్లు ఇరాన్ పర్యాటక మంత్రి 'ఇజ్జతుల్లా జర్గామి' (Ezzatollah Zarghami) వెల్లడించారు. దీని ద్వారా ప్రపంచంలోని చాలా దేశాల సందర్శకులు ఇరాన్ సందర్శిస్తారని, తద్వారా దేశ ఆర్ధిక వ్యవస్థ కూడా ఆశాజనకంగా ఉంటుందని తెలిపారు. వీసా లేకుండా ఇరాన్ వెళ్లాలనుకునే వారికి షరతులు సాధారణ పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్న వ్యక్తులు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వీసా లేకుండా ఇరాన్‌లోకి ప్రవేశించడానికి అనుమతిస్తారు. వీరు కేవలం 15 రోజులు మాత్రమే ఇరాన్ దేశంలో పర్యటించడానికి అర్హులు. వీసా ఫ్రీ అనేది కేవలం పర్యాటక ప్రయోజనాల కోసం ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌లోకి ప్రవేశించే వ్యక్తులకు మాత్రమే ప్రత్యేకంగా వర్తిస్తుంది. భారతీయులు 15 రోజుల కంటే ఎక్కువ కాలం ఇరాన్ దేశంలో పర్యటించాలనుకుంటే.. తప్పకుండా భారతదేశంలోని ఇరాన్ రాయబార కార్యాలయం నుంచి ప్రత్యేక వీసాలు పొందాల్సి ఉంటుంది. ఎయిర్ బోర్డర్ ఎంట్రీ అనేది వైమానిక సరిహద్దు ద్వారా దేశంలోకి ప్రవేశించే భారతీయ పౌరులకు ప్రత్యేకంగా ఇదీ చదవండి: ఇప్పుడే నేర్చుకోండి.. లేకుంటే ఉద్యోగాలు పోతాయ్ - నిర్మలా సీతారామన్ -
భారత్ ఎఫెక్ట్.. మాల్దీవుల ప్రభుత్వానికి మరో షాక్!
మాలే: మాల్దీవుల ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలినట్టు తెలుస్తోంది. మాల్దీవుల మంత్రులు, నేతలు.. భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన కారణంగా భారతీయులు.. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాగా, మాల్దీవుల పర్యాటకం కోసం వెళ్లే భారతీయులు సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఈ విషయాన్ని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. వివరాల ప్రకారం.. భారత్‌తో దౌత్యపరమైన వివాదానికి తెరలేపిన మాల్దీవులకు మరోసారి షాక్ తగిలింది. భారత్ నుంచి మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గింది. మాల్దీవుల పర్యాటక ర్యాంకింగ్‌లో మన దేశ స్థానం గణనీయంగా పడిపోయింది. ఈ విషయాన్ని ప్రభుత్వ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. గతేడాది డిసెంబరు 31 వరకు భారత్ నుంచి 2,09,198 మంది పర్యాటకులు మాల్దీవులను సందర్శించారు. దీంతో, మాల్దీవుల పర్యాటక మార్కెట్లో 11 శాతం వాటాతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. రష్యా రెండో స్థానంలో.. చైనా మూడో స్థానంలో కొనసాగాయి. నాలుగో స్థానంలో బ్రిటన్ నిలిచింది. ఈ ఏడాది ప్రారంభంలో లక్షద్వీప్‌ను ప్రధాని మోదీ సందర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పర్యాటకులు లక్షద్వీప్‌లో పర్యటించాలని కోరారు. ఇక, ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన నేపథ్యంలో మాల్దీవుల మంత్రులు భారత్ ఆతిథ్యంపై అక్కసు వెళ్లగక్కారు. దీంతో, ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతీసే స్థాయికి చేరింది. గత మూడు వారాలుగా మాల్దీవుల పర్యాటక జాబితాను పరిశీలిస్తే.. అప్పటివరకు అగ్రస్థానంలో కొనసాగిన భారత్ కొంతకాలంలోనే ఐదో స్థానానికి పడిపోయింది. 13,989 మంది మాత్రమే మాల్దీవులను సందర్శించారు. 18,561 మంది పర్యాటకులతో రష్యా మొదటి స్థానంలో నిలిచింది. 18,111 మంది పర్యాటకులతో ఇటలీ రెండో స్థానానికి ఎగబాకింది. చైనా 16,529.. బ్రిటన్ 14,588 మంది పర్యాటకులతో మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. -
మోదీ ఎఫెక్ట్.. మాల్దీవులకు కోలుకోలేని ఎదురుదెబ్బ!
#Maldives.. మాలె/న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రుల అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వాటిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ, సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. కేంద్రం కూడా వాటిపై తీవ్ర అభ్యంతరం వెలిబుచి్చంది. మంత్రుల వ్యాఖ్యలకు నిరసనగా వేలాది మంది భారత పర్యాటకులు మాల్దీవులకు ప్లాన్ చేసుకున్న హాలిడే ట్రిప్పులను రద్దు చేసుకుంటున్నారు. ఆ దేశ పర్యాటకానికి మన టూరిస్టులే ఆయువుపట్టు. పైగా భారత్‌తో వ్యూహత్మక బంధం మాల్దీవులకు అత్యంత కీలకం. దాంతో ఈ వివాదంపై ఆ దేశం హుటాహుటిన స్పందించింది. భారత ప్రభుత్వ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసినట్లు ఆదివారం ప్రకటించింది. వారి వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగతమని, వాటితో ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టతనిచ్చింది. ‘‘భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రజాస్వామ్యయుతంగా, బాధ్యతాయుతంగా ఉండాలే తప్ప, విద్వేషాన్ని, ప్రతికూల ప్రభావాన్ని కలిగించేలా ఉండొద్దు. అంతర్జాతీయ భాగస్వామ్య దేశాలతో సంబంధాలను దెబ్బతీయొద్దు’’ అని పేర్కొంది. మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసేవారిపై కఠిన చర్యలకు వెనుకాడబోమని స్పష్టం చేసింది. సస్పెండైన మంత్రులు మరియం షియునా, అబ్దుల్లా మజూం మజీద్, మల్షా షరీఫ్ అని తెలుస్తోంది. అసలేమైంది...? ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియో, ఫొటోలు షేర్ చేశారు. అవి ఆన్లైన్లో వైరల్‌గా మారాయి. పలువురు నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు కూడా! దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్‌గా, తోలు»ొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. మంత్రులు మజీద్, మల్షా కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేశారు. పర్యాటకంలో మాల్దీవులతో లక్షద్వీప్ ఏ మాత్రమూ సరితూగదంటూ ఎద్దేవా చేశారు. ‘‘భారత్‌లో హోటల్ గదులు అసహ్యంగా ఉంటాయి. మా దేశంతో లక్షద్వీప్‌కు పోలికేమిటి?’’ అంటూ మాల్దీవుల ఎంపీ జహీద్ రమీజ్ కూడా నోరు పారేసుకున్నారు. ఈ వ్యాఖ్యలపై మాల్దీవుల్లోని భారత హైకమిషన్ కార్యాలయం అధికారులు నిరసన తెలిపారు. దుమారం నేపథ్యంలోవారి వ్యాఖ్యలను ‘ఎక్స్’ నుంచి తొలగించారు. మంత్రుల వ్యాఖ్యలను మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ తీవ్రంగా ఖండించారు. ‘‘భారత్ మనకు కీలక మిత్రదేశం. మాల్దీవుల భద్రత, అభివృద్ధిలో చాలా కీలకం. అలాంటి దేశాధినేతను ఉద్దేశించి నీచమైన భాష వాడటం తగదు’’ అన్నారు. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని కొత్త అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుకు హితవు పలికారు. ఇంతగా నిరసనలు వ్యక్తమవుతున్నా మరియం మాత్రం ఆన్లైన్ వేదికలపై అక్కసు వెళ్లగక్కడం ఆపలేదు. దాతో పలువురు భారత నెటిజన్లు ‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’ అంటూ పిలుపునిస్తున్నారు! సెలబ్రిటీల ఖండన మాల్దీవుల మంత్రుల నోటి దురుసును క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, జాన్ అబ్రహం, శ్రద్ధా కపూర్ తదితరులు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. వారి విద్వేష వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయని అక్షయ్ అన్నారు. ‘‘మాల్దీవులకు ఏటా భారీగా పర్యాటకులను పంపే భారత్‌పై అలా మాట్లాడటం దారుణం. పొరుగువారితో స్నేహంగా మెలగాలనే అనుకుంటాం కానీ ఇలాంటి ద్వేషాన్ని మనమెందుకు సహించాలి? నేనెన్నోసార్లు మాల్దీవుల్లో పర్యటించా. ప్రతిసారీ ఆ దేశాన్ని ప్రశంసించా. కానీ మన ఆత్మగౌరవమే ఫస్ట్. ఇకపై మన దీవుల్లో పర్యటిస్తూ మన పర్యాటకానికి దన్నుగా నిలుద్దాం’’ అని పిలుపునిచ్చారు. లక్షద్వీప్‌లో అందమైన, పరిశుభ్రమైన బీచుల్లో ప్రధాని మోదీని చూడటం ఎంతో బాగుంది. మన దేశంలోనే ఇంత అద్భుతమైన బీచ్లుండటం గర్వకారణం’’ అని సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు. ‘‘అతిథి దేవోభవ సందేశంతో భారత్ ఇచ్చే అద్భుతమైన ఆతిథ్యం, విస్తారమైన మన సముద్ర తీరాలను చూడాలే తప్ప వరి్ణంచలేం. ఇందుకోసం లక్షద్వీప్‌కు వెళ్లాల్సిందే’’ అంటూ జాన్ అబ్రహం బీచ్ ఫొటోలను షేర్ చేశారు. సుందరమైన లక్షద్వీప్ బీచ్‌ల అందాలను చూసేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు నటి శ్రద్ధా కపూర్ తెలిపారు. సచిన్ కూడా ఇటీవలి లక్షద్వీప్ పర్యటన సందర్భంగా అక్కడ తాను క్రికెట్ ఆడిన వీడియో, బీచ్ ఫొటోలను షేర్ చేశారు. -
ఫ్రాన్స్‌లోకి అడుగు పెట్టిన ‘యూపీఐ’.. ఈఫిల్ టవర్ నుంచే చెల్లింపులు
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ మేటి ఆవిష్కరణ అయిన ‘యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్’ (యూపీఐ) ఫ్రాన్స్‌లోకి ప్రవేశించింది. భారత పర్యాటకులు ఈఫిల్ టవర్ నుంచి యూపీఐ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ప్రకటించారు. ‘‘భారతీయులు యూపీఐ సాధనం వినియోగించే విధంగా ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదిరింది. ఇది ఈఫిల్ టవర్ నుంచే ప్రారంభమవుతుంది. ఇప్పుడు భారత పర్యాటకులు ఈఫిల్ టవర్ నుంచే యూపీఐ ద్వారా రూపాయిల్లో చెల్లింపులు చేసుకోవచ్చు’’అని ప్రధాని తెలిపారు. యూపీఐ విషయంలో భారత్ సాధించిన మరో ఘనతగా దీన్ని చెప్పుకోవాలి. ఇప్పటికే భారత్–సింగపూర్ మధ్య యూపీఐ ద్వారా సీమాంతర చెల్లింపులకు ఒప్పందం కుదరడం గమనార్హం. అంతేకాదు యూఏఈ, భూటాన్, నేపాల్ సైతం యూపీఐ చెల్లింపుల వ్యవస్థాను అనుమతించాయి. యూఎస్, ఐరోపా దేశాలు, పశి్చమాసియా దేశాలతోనూ యూపీఐ సాధనం విషయమై భారత్ చర్చలు నిర్వహిస్తోంది. యూపీఐ వినియోగం ఇప్పటి వరకు భారత్‌లోనే ఉండగా, అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నట్టు ఎన్పీసీఐ సీఈవో రితేష్ శుక్లా తెలిపారు. యూపీఐని అభివృద్ధి చేసింది ఎన్పీసీఐ అని తెలిసిందే. ఎలా పనిచేస్తుంది? ఫ్రాన్స్‌కు చెందిన చెల్లింపుల పరిష్కారాలను అందించే లైరా నెట్వర్క్స్తో ఎన్పీసీఐ 2022లోనే ఒప్పందం చేసుకుంది. దీంతో ఫ్రాన్స్‌ను సందర్శించే భారత విద్యార్థులు, పర్యాటకులతోపాటు ఎన్ఆర్ఐలు ఇక నుంచి లైరా నెట్వర్క్ ఆధారిత అన్ని చెల్లింపుల టెరి్మనళ్ల వద్ద యూపీఐతో చెల్లింపులు చేసుకోవడం సాధ్యపడుతుంది. అంతర్జాతీయ టెలిఫోన్ నంబర్లను ఇందుకు వినియోగించుకోవచ్చు. భారత్‌లో బ్యాంక్ ఖాతా, దానితో అనుసంధానించిన యూపీఐ ఐడీ ఉండాలి. అలాగే ఫోన్లో భీమ్ లేదా యూపీఐ ఆధారితే ఏదో ఒక అప్లికేషన్ ఉంటే దాని ద్వారా లావాదేవీలు చేసుకోవచ్చు. దీంతో కరెన్సీ మారక ఖర్చులు గణనీయంగా ఆదా అవుతాయి. రెండు దేశాల మధ్య రెమిటెన్స్ ఖర్చులు సైతం తగ్గుతాయి. రోజుకు 100 కోట్ల లావాదేవీలు యూపీఐ ఇప్పుడు అంతర్జాతీయంగా విస్తరిస్తుండడంతో రానున్న రోజుల్లో చెల్లింపుల లావాదేవీల సంఖ్య గణనీయంగా పెరగనుంది. అంతేకాదు సీమాంతర చెల్లింపులు మరింత వేగంగా, సులభంగా చేసుకోవడం సాధ్యపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జూన్ నాటికి రోజువారీ లావాదేవీల సంఖ్య 9.33 కోట్లుగా ఉంది. 2025 నాటికి రోజువారీ బిలియన్ లావాదేవీలకు (100 కోట్లు) చేరుకుంటామని శుక్లా విశ్వాసం వ్యక్తం చేశారు. నేడు యూకే, నేపాల్, భూటాన్, సింగపూర్, ఆ్రస్టేలియా, ఒమన్, ఫ్రాన్స్‌లో యూపీఐ లావాదేవీలకు అవకాశం ఏర్పడినట్టు చెప్పారు. భారత్ 13 దేశాలతో అవగాహన ఒప్పందం చేసుకుందని, అవన్నీ తమ దేశంలో డిజిటల్ చెల్లింపులకు యూపీఐని వినియోగించుకోవాలని అనుకుంటున్నట్టు కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ ఈ ఏడాది ఫిబ్రవరి 13న ప్రకటించడం గమనార్హం. -
ఈసారి 6 లక్షల టూరిస్టులు టార్గెట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది దాదాపు 5–6 లక్షల మంది భారతీయ పర్యాటకులు తమ దేశాన్ని సందర్శించవచ్చని మలేషియా అంచనా వేస్తోంది. గత ఏడాది ఈ సంఖ్య సుమారు 3 లక్షలుగా నమోదైంది. శుక్రవారమిక్కడ నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్న సందర్భంగా టూరిజం మలేషియా సీనియర్ డిప్యుటీ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రమోషన్ (ఆసియా, ఆఫ్రికా) మొహమ్మద్ అమీరుల్ రిజాల్ అబ్దుల్ రహీం ఈ విషయాలు తెలిపారు. కరోనాకు పూర్వం 2019లో భారత్ నుంచి 7.35 లక్షల పైచిలుకు టూరిస్టులు వచ్చారని, పరిస్థితులు మెరుగుపడుతుండటంతో వచ్చే ఏడాది తిరిగి ఆ స్థాయికి ఇది చేరవచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన వివరించారు. భారత్ నుంచి వచ్చే టూరిస్టుల్లో అత్యధిక శాతం మంది దక్షిణాది రాష్ట్రాల నుంచే ఉంటున్నారని ఆయన పేర్కొన్నారు. గతేడాది 70 లక్షల మంది పైగా విదేశీ టూరిస్టులు మలేషియాను సందర్శించగా ఈ ఏడాది ఇది 1.50 కోట్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. జనవరి 30న ప్రారంభమైన టూరిజం మలేషియా రోడ్‌షోలు వివిధ నగరాల్లో ఫిబ్రవరి 7 వరకు కొనసాగనున్నాయి. -
ఇండియాకు మాల్దీవులు షాక్.. అయోమయంలో బీటౌన్ లవ్‌బర్డ్స్
భారత్‌లో కరోనా వైరస్ రెండో దశ తీవ్రంగా విరుచుకుపడుతోంది. రోజూ మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో జర్మనీ, ఇటలీ, ఇరాన్, సింగపూర్, నెదర్లాండ్ , బంగ్లాదేశ్ వంటి దేశాలు ఇప్పటికే భారత ప్రయాణికులపై ఆంక్షలు విధించాయి. భారత్ నుంచి వచ్చే విమానాలు రద్దు చేశాయి. తాజాగా ఈ జాబితాలోకి మాల్దీవులు చేరింది. భారత్ నుంచి మాల్దీవులకు వచ్చే అన్ని విమానలను నిలిపివేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఈ మేరకు మాల్దీవులు పర్యాటక మంత్రిత్వశాఖ ట్విటర్ ద్వారా అధికారికంగా వెల్లడించింది. With effect from 27 April @HPA_mv suspends tourists travelling from #India to #Maldives from staying at tourist facilities in inhabited islands. We thank you for the support in our endeavour to make tourism safest possible with minimum inconvenience. — Ministry of Tourism (@MoTmv) April 25, 2021 ఆ ఆంక్షలు ఏప్రిల్ 27 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. భారత పర్యాటకులెవరూ మాల్దీవుల్లోని హోటళ్లు, రిసార్ట్లు, గెస్ట్ హౌజ్‌ల్లో బస చేయవద్దని నిషేధం విధించింది. తమ పర్యాటక రంగాన్ని సురక్షితంగా ఉంచడానికి చేస్తున్న ఈ ప్రయాత్నానికి మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ట్వీట్లో పేర్కొంది. అయితే బీటౌన్ తారలు, జాన్వీ కపూర్, దిశా పటాని, టైగర్ ష్రాఫ్‌తోపాటు మరికొంత మంది ఇటీవల వెకేషన్‌కు మాల్దీవులకు వెళ్లొచ్చారు. రణబీర్ కపూర్, అలియా భట్ కూడా కోవిడ్ -19 నుంచి కోలుకున్న వెంటనే మాల్దీవులు చుట్టొచ్చారు. అక్కడ దిగిన ఫోటోలను సైతం సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేశారు. మాల్దీవుల ప్రకటన అనంతరం బాలీవుడ్ సెలబ్రిటీలపై నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. ఫన్నీ మీమ్స్‌తో నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు. ఓ వైపు దేశమంతా కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రం తమ వినోదాల కోసం హాలీడే ట్రిప్పుల పేరుతో ఎంజాయ్ చేస్తున్నారని విరుచుకుపడుతున్నారు. దేశం తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే ట్రిప్పులు కవాల్సి వచ్చిందా అని విమర్శిస్తున్నారు. ఇండియా టూరిస్టులను మాల్దీవులు బ్యాన్ చేయడం మంచిపని అయ్యిందంటూ సంబరపడుతున్నారు. చదవండి: ‘తిండి లేక అల్లాడుతుంటే.. డబ్బులు నీళ్లలా ఖర్చుపెడుతున్నారు’ కరోనా బాధితులకే కరువైందంటే.. చేపలకు ఆక్సిజన్! With effect from 27 April @HPA_mv suspends tourists travelling from #India to #Maldives from staying at tourist facilities in inhabited islands. We thank you for the support in our endeavour to make tourism safest possible with minimum inconvenience. — Ministry of Tourism (@MoTmv) April 25, 2021 Maldives restricts entry of tourists from India Bollywood celebs rn: pic.twitter.com/Pa5ZU83lRu — Mawa_Jalebi 🦄 (@HighnPositive) April 26, 2021 Bollywood celebrities rushing for the Maldives while watching people in India die... #CovidIndia pic.twitter.com/KUFrVUixm1 — Delhi Decoded (@DelhiDecoded) April 26, 2021 Bollywood celebrities planning for tourism in Maldives Le Maldive's government suspends tourists from India :) pic.twitter.com/HYsTufAY2S — Anant (@Bihariladka_) April 26, 2021 View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) -
తగ్గిన భారతీయ పర్యాటకుల ప్రయాణ దూరం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ భయంతో భారతీయ పర్యాటకుల సగటు ప్రయాణ దూరం తగ్గింది. ఈ ఏడాది జూన్–ఆగస్ట్ మధ్యకాలంలో దేశీయ పర్యాటకుల సగటు ప్రయాణ దూరం 780 కిలో మీటర్లుగా నమోదైంది. గతేడాది ఇదే కాలంలో వారు ప్రయాణించిన 1,786 కిలో మీట్లరతో పోలిస్తే ఇది 56శాతం తక్కువ. ఈ విషయాన్ని డిజిటల్ సర్వే కంపెనీ బుకింగ్‌డామ్ సర్వే తెలిపింది. కరోనా ప్రేరేపిత లాక్‌డౌన్‌తో ప్రజలు ఇళ్లల్లో నిర్భందం కావడం ఇందుకు కారణమని పేర్కొంది. ప్రపంచ పర్యాటకుల సగటు ప్రయాణ దూరం 63 శాతంతో పోలిస్తే ఇది స్వల్పమని సర్వే చెప్పుకొచ్చింది. ఇదివరకులా తాము కోరుకున్న సుదూర ప్రాంతాల సందర్శన చేయలేకపోయినప్పటికీ తమ పరిసర ప్రాంతాల్లోనే ఉండే అద్భుతమైన స్థలాలను కనుగొనే చక్కటి అవకాశం లభించినట్లుగా పర్యాటకులు భావిస్తున్నారని సర్వేలో వెలుగు చూసింది. వసతి విషయానికొస్తే భారతీయ పర్యాటకుల ఎంపికలో మోటళ్లు, విల్లాలు హోటళ్లు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయని సర్వే వివరించింది. హైదరాబాద్, జైపూర్ లాంటి ప్రాచీన నాగరికత కలిగిన నగరాల సందర్శనకు పర్యాటకులు ఇప్పటికీ ఆసక్తి చూపుతున్నారని, అయితే ఇంటికి దగ్గరలో ఉన్న ప్రాంతాల సందర్శనకే వారు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు సర్వే తెలిపింది. కోవిడ్–19 పరిస్థితుల నేపథ్యంలో మా ప్రణాళికలు, ప్రాధాన్యతలు మారినప్పటికీ.., పర్యాటకుల ఆసక్తి మాకు భరోసాను ఇస్తుందని బుకింగ్‌డాట్ కంట్రీ మేనేజర్ రితు మల్హోత్ర తెలిపారు. -
విహారయాత్రలో విషాదం
ఖాట్మండ్ : విహారయాత్ర వారి జీవితాలనే బలితీసుకుంది. నేపాల్ సందర్శనకు వెళ్లిన 8 మంది భారతీయులు అక్కడి హోటల్ రూమ్‌లో విగత జీవులుగా కనిపించారు. వారిని ఎయిర్ అంబులెన్స్‌లో ఖాట్మండ్‌లోని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. మృతుల్లో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన 15 మంది హాలిడే కోసం నేపాల్ వెళ్లారు. అక్కడ ఎవరెస్ట్ పనోరమ హోటల్లో 4 రూమ్‌లను బుక్ చేసుకున్నారు. వారిలో ఎనిమిది మంది ఒక రూమ్‌లో.. మిగిలినవారు ఇతర రూమ్‌ల్లో ఉన్నారు. ఒక రూమ్‌లో ఉన్న 8 మంది గదిలో వెచ్చదనం కోసం గ్యాస్ హీటర్‌ను ఆన్ చేశారు. అయితే అది సరిగా పనిచేయకపోవడంతో గ్యాస్ లీకైంది. దీంతో ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారడంతో వారు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరణించినవారిలో ప్రవీణ్ కృష్ణన్ నాయర్, అతని భార్య శరణ్య వారి ముగ్గురు పిల్లలు శ్రీభద్ర, అర్చన, అభి నాయర్, ప్రవీణ్ స్నేహితుడు రెంజిత్ కుమార్, అతని భార్య ఇందు, వారి కుమారుడు వైష్ణవ్ ఉన్నారు. అయితే కుమార్, ఇందుల మరో కుమారుడు మాధవ్ వేరే రూమ్‌లో పడుకోవడంతో.. అతనికి ప్రాణప్రాయం తప్పినట్టుగా సమాచారం. కాగా, ప్రవీణ్ దుబాయ్‌లో ఉద్యోగం చేస్తుండగా.. శరణ్య మాత్రం కొచ్చిలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కేరళ సీఎం పినరయి విజయన్ విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌తో మాట్లాడారు. మృతదేహాల తరలింపుతోపాటు, మిగిలిన పర్యాటకులకు సాయం అందించాల్సిందిగా కోరారు. -
చైనాకు వెళ్లకండి..
ఢిల్లీ: చైనాలో ప్రమాదకర ‘నావల్ కరొనా’ వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో చైనా వెళ్లే భారతీయులకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అంతేగాక చైనా నుంచి తిరిగివస్తున్న యాత్రికులను కేంద్ర ఆరోగ్య శాఖ థర్మల్ స్కానర్లతో పరీక్షిస్తోంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల విమానాశ్రయాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. చైనాలో ఈ వైరస్ 41 మందికి సోకగా, ఒకరు మృతి చెందారని ఆదేశం ఈ నెల 11న ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ లేనప్పటికీ చైనాలో ఒకరి నుంచి ఒకరికి దగ్గు, తుమ్ముల ద్వారా కూడా ఈ వ్యాధి సోకుతోందని గుర్తించారు. దీంతో అలర్ట్ అయిన కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)తో కలసి నియంత్రణ కోసం కృషి చేస్తోందని ఆ శాఖ ప్రధాన కార్యదర్శి ప్రీతి సుడాన్ చెప్పారు. ఇవీ జాగ్రత్తలు.. ఈ వైరస్ గురించి ఎక్కువగా తెలియకపోయినప్పటికీ కొన్ని జాగ్రత్తలను కేంద్రం సూచిస్తోంది. పొలాలకు, జంతుశాలలకు, జంతువధ స్థానాలకు వెళ్లవద్దని తెలిపింది. మాంసానికి దూరంగా ఉండాలని, ఒకవేళ తినాల్సి వస్తే బాగా ఉడికించిన మాంసాన్ని తీసుకోవాల్సిందిగా సూచించింది. -
ఈజిప్టులో బస్ ప్రమాదం, భారతీయులకు గాయాలు
కైరో: ఈజిప్టులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐన్ సోఖ్నా సమీపంలో 16 మంది భారత పర్యాటకులు బస్సు ప్రమాదానికి గురయ్యారని కైరోలోని భారత రాయబార కార్యాలయం శనివారం తెలిపింది. ఈజిప్టులోని ఓ ఆన్లైన్ పత్రిక తెలిపిన వివరాల ప్రకారం.. పర్యాటకులతో వెళుతున్న బస్సును ట్రక్కు ఢీకొట్టగా అనూహ్యంగా వేనకాలే వస్తున్న మరో బస్సును ట్రక్కు ఢీకొట్టింది. పలువురు గాయపడగా, ఆరుగురు మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఓ భారతీయుడు, ఇద్దరు మలేషియా దేశస్తులు, ముగ్గురు ఈజిప్టుకు చెందిన వారున్నారు. క్షతగాత్రులను సూయోజ్, కైరో ఆసుపత్రులలో చేర్పించారని అధికారులు తెలిపారు. ఎంబసీ అధికారులు... సంఘటనను పర్యవేక్షిస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. పర్యాటకుల సమాచారం కొరకు రెండు హెల్ప్‌లైన్ నంబర్లను ఇచ్చారు. హెల్ప్‌లైన్ నంబర్లు + 20-1211299905, +201283487779 అందుబాటులో ఉన్నాయని భారత రాయబార కార్యాలయం, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేరిట ట్వీట్ చేశారు. -
థాయ్ చూపు భారత్ వైపు!
బ్యాంకాక్ : అమెరికా - చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధ ప్రభావం థాయ్‌లాండ్ పర్యాటకంపై పడింది. ఆ దేశాన్ని సందర్శించే పర్యాటకుల్లో ఎక్కువమంది చైనీయులే కావడం ఇందుకు కారణం. ఇప్పటివరకు థాయ్‌కి వచ్చే పర్యాటకుల్లో నాలుగింట ఒకవంతుపైనే చైనీయులు ఉండేవారు. గణాంకాల ప్రకారం 2018లో 22 లక్షలుగా ఉన్న చైనా పర్యాటకుల సంఖ్య ఈ ఏడాది అందులో ఐదోవంతుకు పడిపోయింది. అయితే గత ఐదారునెలల్లో ఈ సంఖ్య బాగా పడిపోయిందని అక్కడి హోటళ్ల యజమానులు చెబుతున్నారు. పట్టాయా లాంటి ప్రఖ్యాతి గాంచిన ప్రాంతాల్లోనూ పర్యాటకులు లేక హోటళ్లు, రెస్టారెంట్లలో ధరలను సగానికి తగ్గించామని వారు వెల్లడించారు. దీనికి కారణం చైనా కరెన్సీ యువాన్ కంటే థాయ్ కరెన్సీ బాట్ ఈ ఏడాది దాదాపు 10 శాతం పెరగడమని భావిస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది పట్టాయాలో జరిగిన బోటు ప్రమాదంలో 47 మంది చైనీయులు మరణించారు. ఈ ప్రభావం వారిమీద ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. థాయ్ జీడీపీలో పర్యాటకం 18 శాతం వాటా కలిగి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రభావం ఉపాధి అవకాశాలపై కూడా ఉంటుందని థాయ్ ప్రభుత్వ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, థాయ్ ప్రభుత్వం మరో మూడు వేల గదులను అందుబాటులోకి తెస్తోంది. దీనిపై పర్యాటక పరిశ్రమ పెదవి విరుస్తోంది. అసలే ఉన్న వాటికి గిరాకీ లేక ఇబ్బంది పడుతుంటే కొత్త నిర్మాణాలెందుకని థాయ్ హోటల్స్ సంఘం ఉపాధ్యక్షుడు కాంగ్‌సాక్ ఖూపోంగ్‌సకోన్ ప్రశ్నించారు. దీనికంటే పర్యాటకులను ఆకర్షించే విధానాలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో అక్కడి పర్యాటక పరిశ్రమ భారతీయ టూరిస్టులపై ఆశలు పెంచుకుంటోంది. మధ్యతరగతి ఆదాయంలో పెరుగుదల, ప్రత్యక్ష విమానాల రాకపోకలు, వీసా ఆన్ అరైవల్ వంటి సదుపాయాలు ఇందుకు దోహదపడతాయని వారు ఆశిస్తున్నారు. కాగా, థాయ్ కరెన్సీ ఒక బాట్ విలువ భారత రూపాయికి రూ. 2.35 పైసలతో సమానం. థాయ్ టూరిజం అథారిటీ చైర్మన్ యుతసక్ సుపసోన్ ఈ పరిణామంపై స్పందిస్తూ త్వరలో పరిస్థితిలో మార్పు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
‘ఇది ఏమైనా మీ ఇంటి హాలా, పెరడా’
‘వెన్ యూ ఆర్ ఇన్ రోమ్.. బీ ఏ రోమన్’(రోమ్ వెళ్తే రోమన్ లానే ప్రవర్తించు) అనేది సామెత. అంటే మనం ఏ ప్రాంతానికి వెళ్తున్నామో.. అక్కడి ఆచార వ్యవహారాలను గౌరవిస్తూ.. మర్యాదగా నడుచుకోవాలని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. ఇలాంటి విషయాల్లో భారతీయులు మరింత మెరుగవ్వాల్సిన అవసరం ఉందంటున్నారు బాలీవుడ్ టెలివిజన్ నటుడు సిద్ధాంత్ కార్ణిక్. ఈ మధ్యే ఆయన భూటాన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రశాంతతను భంగపరుస్తున్న భారతీయ పర్యాటకులను ఉద్దేశిస్తూ.. ఫేస్బుక్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో సిద్ధాంత్ కొందరు భారత పర్యాటకులను చూపిస్తూ.. ‘వారంతా ఎంత బిగ్గరగా అరుస్తూ మాట్లాడుతున్నారో చూడండి. ఏదో వారి ఇంటి పెరట్లోనో.. హాల్లోనో ఉన్నట్లు భావిస్తూ.. బిగ్గరగా మాట్లాడుతూ.. ఇక్కడి ప్రశాంతతను భంగపరుస్తున్నారు. మనం పర్యటన నిమిత్తం ఇక్కడికి వచ్చాం. అంటే ఇప్పుడు ఈ దేశంలో మనం మన దేశ రాయబారులుగా భావించబడతాం. అలాంటప్పుడు ఇక్కడి ఆచార వ్యవహరాలను గౌరవిస్తూ.. వారి ప్రశాంతతకు భంగం కలగకుండా ప్రవర్తించడం మన విధి. భూటాన్‌లో ఏ ప్రదేశానికి వెళ్లినా అక్కడ చాలా మంది భారత పర్యాటకులు కనిపిస్తున్నారు. ఇది చాలా మంచి విషయం. కానీ మన పాత అలవాట్లను ఇక్కడకు తీసుకురావడం మంచిది కాదు. ఇక్కడి ప్రశాంతతను, శుభ్రతను భంగం చేసే హక్కు మనకు లేద’ని తెలిపారు. ఈ వీడియో పట్ల నెటిజన్లు సానుకూలంగా స్పదించారు. ‘భూటాన్ చాలా శుభ్రమైన, ప్రశాంతమైన ప్రదేశం. ఇలాంటి అవగాహన వీడియో రూపొందించినందుకు ధన్యవాదాలు. కొందరిలోనైనా ఈ వీడియో మార్పు తెస్తుంది. మీ ప్రయత్నాన్ని అభినందిస్తున్నాం’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
లక్ష్య సాధనకు పర్యాటకశాఖ ప్రణాళికలు
సాక్షి, విశాఖపట్నం: పర్యాటకుల స్వర్గధామంగా వెలుగొందుతున్న విశాఖకు టూరిస్టుల తాకిడిని మరింతగా పెంచడానికి పర్యాటకశాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రస్తుతం విశాఖకు వస్తున్న పర్యాటకుల సంఖ్యను మూడేళ్లలో రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో పథకాలు సిద్ధం చేస్తోంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో 2.5 కోట్ల మంది పర్యాటకులు విశాఖ జిల్లాలోని వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. ఈ సంఖ్యను 2022 నాటికి 4.95 కోట్లకు పెంచడానికి పర్యాటక శాఖ చర్యలు చేపడుతోంది. ఇందుకోసం మౌలిక సదుపాయాలను పెంచనుంది. ఇందులో భాగంగా దేశ, విదేశాల నుంచి వచ్చే టూరిస్టులకు అదనంగా 5 వేల గదులను పర్యాటక శాఖ సమకూర్చనుంది. మౌలిక సదుపాయాల కల్పనతోపాటు ఆయా ప్రాంతా లకు వెళ్లేందుకు వీలుగా రోడ్లను పర్యాటక శాఖ ఇతర శాఖల చేయూతతో అభివృద్ధి చేయనుంది. కొత్త పర్యాటక ప్రాంతాలను వెలుగులోకి తేనుంది. ముఖ్యంగా సాహస క్రీడలను ప్రోత్సహించే కార్యక్రమం రూపుదిద్దుకుంది. ఇందులో భాగంగా పారామోటార్ రైడింగ్, స్కూబా డైవింగ్, ట్రెక్కింగ్, వాటర్ స్పోర్ట్స్ వంటి వాటిపై ఆసక్తి పెరిగేలా ఏర్పాట్లను విస్తృతం చేస్తున్నారు. పలు పర్యాటక ప్రదేశాల్లో ఇప్పటికీ మరుగుదొడ్లు, స్నానపు గదులు, మంచినీటి సదుపాయాలు లేవు. దీంతో ఆయా ప్రాంతాలకు వెళ్లడానికి పర్యాటకులు అంతగా ఆసక్తి చూపడం లేదు. వీటిని దృష్టిలో ఉంచుకుని అక్కడ కనీస సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వీటితో పాటు విశాఖను ఆకర్షించడానికి ఈవెంట్లను కూడా నిర్వహించాలని యోచిస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నట్టు ఊదరగొట్టింది. విశాఖ ఉత్సవ్, భీమిలి ఉత్సవ్, యాటింగ్ ఫెస్టివల్, సౌండ్స్ ఆన్ సాండ్స్ వంటి వాటి కార్యక్రమాలు మొదలు కావడానికి కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని వెచ్చించడం మినహా ఆ కార్యక్రమాలు ఆశించిన ప్రయోజనం నెరవేద వెచ్చించి నిర్వహించినా నిధుల దుర్వినియోగమే తప్ప ఆశించినంతగా పర్యాటకులను ఆకట్టుకోలేకపోయింది. బొర్రా గుహలు గత ఏడాది విశాఖ ఉత్సవ్‌కు రూ.3.5 కోట్లు, అరకు బెలూన్ ఫెస్టివల్‌కు రూ.4 కోట్లు, యాటింగ్ ఫెస్టివల్‌కు రూ.4 కోట్లు, విశాఖ–అరకు మధ్య ట్రయిన్ స్టోరీకి రూ.5 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. అయితే వీటిలో విశాఖ ఉత్సవ్, అరకు బెలూన్ ఫెస్టివల్‌ను మాత్రమే నిర్వహిం చారు. మిగిలిన యాటింగ్ ఫెస్టివల్, ట్రయిన్ స్టోరీలు రద్దయ్యాయి. రూ.4 కోట్లు వెచ్చించిన అరకు బెలూన్ ఫెస్టివల్ ఆదరణ లేక అభాసు పాలయింది. ఇలా జనాదరణ లేని ఈవెంట్లకు కోట్లాది రూపాయలు చెల్లించి మంచినీళ్లలా ఖర్చు చేసింది. కోట్లు వెచ్చించి నిర్వహించే ఫెస్టివల్స్, ఈవెంట్లను సద్వినియోగం చేసి ఉంటే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగి ఉండేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిర్దేశించుకున్న పర్యాటకుల సంఖ్య లక్ష్యం ఇలా.. 2020 2021 2022 3,73,95,337 4,30,04,639 4,94,55,334 గత మూడేళ్లలో విశాఖకు వచ్చిన పర్యాటకుల సంఖ్య ఇలా... 2017 2018 2019 2,13,92,728 2,50,13,607 1,22,14,292 విశాఖ తీరంలో (మే వరకు) విదేశీ పర్యాటకులు 2017 2018 2019 92,958 95,759 41,753 -
క్షేమంగా తిరిగి వచ్చిన జగిత్యాలవాసులు
కోరుట్ల/మెట్పల్లి: శ్రీలంకలోని కొలంబోలో ఆదివారం జరిగిన ఉగ్రదాడి నుంచి జగిత్యాల జిల్లాకు చెందిన మెట్పల్లి, కోరుట్ల పట్టణాలకు చెందిన పలువురు త్రుటిలో తప్పించుకుని క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. మెట్‌పల్లికి చెందిన ఏలేటి నరేందర్‌రెడ్డి, అల్లాడి శ్రీనివాస్, కోరుట్లకు చెందిన బాశెట్టి కిషన్ దంపతులు సహా మొత్తం 14 మంది వారం క్రితం శ్రీలంక పర్యటనకు వెళ్లారు. అక్కడ వివిధ ప్రాంతాలను సందర్శించిన అనంతరం వారు ఈనెల 19న కొలంబో నగరానికి చేరుకుని నార్లేమెరీన్ అనే హోటల్లో బసచేశారు. ఆదివారం ఉదయం 7 గంటలకు వీరంతా స్వదేశానికి బయలుదేరగా, 8 గంటల ప్రాంతంలో వారు బస చేసిన హోటల్ పక్కన ఉన్న మరో హోటల్లో ఉగ్రదాడి జరిగింది. దాడి జరగడానికి గంట ముందు అక్కడి నుంచి బయలుదేరి క్షేమంగా ఇళ్లకు చేరుకున్నారు. సాయంత్రం ఇక్కడికి చేరుకున్న తర్వాత దాడి విషయం తెలుసుకున్న వారు ఉద్వేగానికి లోనయ్యారు. పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తున్న శ్రీలంకలో ఉగ్రవాదులు దాడి చేసి అమాయకుల ప్రాణాలను బలి తీసుతీకోవడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ‘అనంత’వాసులకు గాయాలు సాక్షి ప్రతినిధి, అనంతపురం: శ్రీలంకలో బాంబుపేలుళ్ల ఘటనలో అనంతపురం వాసులు ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. టీడీపీ నేత, ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ యజమాని అమిలినేని సురేంద్రబాబు, ఆయన స్నేహితుడు భక్తవత్సలం గాయపడగా, సురేంద్ర మరో స్నేహితుడు రాజగోపాల్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. వీరు ముగ్గురూ వ్యక్తిగత పనిమీద కొలంబో వెళ్లి షాంగ్రీ లా హోట్‌లో బసచేశారు. హోటల్లోని రెస్టారెంట్లో అల్పాహారం తింటుండగా ఒక్కసారిగా పెద్దపేలుడుతో రెస్టారెంట్ అద్దాలు ధ్వంసమై సురేంద్ర ముఖంపై పడడంతో స్వల్పగాయాలయ్యాయి. అలాగే భక్తవత్సలం కాలికి గాయాలయ్యాయి. వీరిని హోటల్ యాజమాన్యం ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం వీరు ముగ్గురూ క్షేమంగా ఉన్నట్లు సమాచారం అందించారు. -
భారతీయులకు ఇష్టమైన టూరిస్ట్ ప్లేస్ ఏదో తెలుసా!
న్యూఢిల్లీ: భారతీయులు ఎక్కువ మంది విహార యాత్రకు వెళ్లాలనుకునే ప్రదేశం న్యూయార్క్ సిటీ. ఇటీవల జరిపిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడయింది. వరుసగా రెండో ఏడాదీ న్యూయార్క్ నగరమే తొలి స్థానంలో నిలిచిందని ఆ సంస్థ తెలిపింది. న్యూయార్క్ తర్వాత వరుసగా దుబాయి, లండన్ నగరాలు ఉన్నాయని పేర్కొంది. వీటితో పాటు ఇటీవలి కాలంలో అమ్‌స్టర్‌డామ్, ఎథెన్స్, మాలి లాంటి నగరాల్లో పర్యటించేందుకూ భారతీయ యాత్రికులు ఇష్టపడుతున్నట్లు వెల్లడయింది. ఈ సర్వే గుర్తించిన మరిన్ని ఆసక్తికర విషయాలివీ... ఎక్కువ మంది భారతీయులు తమ యాత్రలను శుక్రవారం నాడు మొదలయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే పుణే, జైపూర్ వాసుల కంటే అహ్మదాబాద్, ముంబై, హైదరాబాద్ నగరాల పర్యాటకులు సగటున ఎక్కువ రోజులు యాత్ర చేస్తున్నారు. అహ్మదాబాద్ ప్రాంతం వాసులు 11 రోజుల ట్రిప్ లకు వెళ్తుండగా.. హైదరాబాద్, ముంబై వాసులు సగటున 8 రోజులపాటు యాత్రల్లో గడుపుతున్నారు. కోల్‌కతా వాసులు నెల రోజులు ముందే తమ టూర్ప్లాన్ చేసుకుంటూ దేశంలోనే మిగతా ప్రాంతాల వారి కంటే అడ్వాన్సుగా ఉంటున్నారని కాయక్ కంట్రీ మేనేజర్(ఇండియా) అభిజిత్ మిశ్రా తెలిపారు. -
భారతీయులకు హాంకాంగ్ షాక్!
ప్రస్తుతం పర్యాటకులు ఎక్కువగా తిరిగే కాలం. భారతీయులు ఎక్కువగా వెళ్లే దేశాలు.. థాయ్‌లాండ్, హాంకాంగ్. కానీ, సరిగ్గా ఇలాంటి సమయంలోనే భారతీయ పర్యాటకులకు హాంకాంగ్ షాకిచ్చింది. ఒకవైపు థాయ్‌లాండ్ మూడు నెలల పాటు వీసా ఫీజులను సగానికి తగ్గించగా, హాంకాంగ్ మాత్రం మనోళ్లకు వీసా ఆన్ ఎరైవల్ సదుపాయాన్ని రద్దుచేసింది. 2016 డిసెంబర్ 1 నుంచి 2017 ఫిబ్రవరి 28 వరకు టూరిస్టు వీసా మీద వచ్చేవారికి వీసా ఆన్ ఎరైవల్ ఫీజును 2000 థాయ్ బాత్‌ల నుంచి వెయ్యి థాయ్ బాత్‌లకు తగ్గిస్తున్నట్లు రాయల్ థాయ్ కాన్సులేట్ జనరల్ ఓప్రకటనలో తెలిపింది. ఒక థాయ్ బాత్ విలువ రూ. 1.90 మాత్రమే. దాంతో వీసా ఫీజుగా సుమారు రూ. 2వేలు చెల్లిస్తే సరిపోతుంది. అదే భారతీయులకు మాత్రం మరింత వెసులుబాటు కల్పించింది. థాయ్‌లాండ్‌కు వెళ్లడానికి ముందే వీసా తీసుకుంటే కేవలం రూ. 335 వీఎఫ్ఎస్ ఫీజు చెల్లిస్తే సరిపోతుందని చెప్పింది. అయితే హాంకాంగ్ మాత్రం.. హాంకాంగ్‌కు రావడానికి ముందే ప్రీ ఎరైవల్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది. ఇదంతా ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే ఫలితం వెంటనే కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అయితే దౌత్యవేత్తలు, అధికారిక పాస్‌పోర్టులు కలిగినవాళ్లకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. అలాగే తరచు ఈ ఛానల్ సర్వీసు ద్వారా హాంకాంగ్‌కు వెళ్లేవారిని కూడా దీన్నుంచి మినహాయించారు. కొంతమంది భారతీయులు వీసా ఆన్ ఎరైవల్ సదుపాయాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. -
ఇంటర్నెట్, నైట్ లైఫ్, న్యూడిటీ..!
సముద్ర తీరంలో తీరొక్క రీతిలో ఎంజాయ్ చేస్తారు జనం. అప్పుడు మొబైల్ గిబైల్ పక్కనపెట్టి ఆనందంలో మునిగితేలుతారు. అయితే భారతీయులు మాత్రం అలా ఎంజాయ్ మెంట్ లో పూర్తిగా మునిగిపోవడానికి ఇష్టపడట్లేదు. ఆ..ఆనందాన్ని నలుగురితో షేర్ చేసుకోవాలనుకుంటారు. అందుకే బీచ్ టూర్లలో సైతం ఇంటర్నెట్ ను వదిలిపెట్టట్లేదు. నైట్ లైఫ్, న్యూడిటీ కూడా భారతీయ పర్యాటకుల ప్రాధాన్యతల్లో ముఖ్యమైనవి. ప్రఖ్యాత ట్రావెల్ పోర్టల్ ఎక్స్ పీడియా తాజాగా 12 వేల మందితో నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 24 దేశాల్లో పర్యాటకులను పరిశీలించి, ప్రశ్నలు వేసి రూపొందించిన ఎక్స్ పీడియా ఈ రిపోర్టు తయారు చేసినట్లు చెబుతోంది. దాని ప్రకారం తీర ప్రాంతాలకు టూర్లకు వెళ్లేవారిలో థాయిలాండ్ వాసుల(82 శాతం) తర్వాతి స్థానం భారతీయులదే. ఇండియన్ టూరిస్టులలో 81 శాతం మంది బీచ్ లలో గడిపేందుకు ఇష్టపడుతున్నారట. వారిలో 39 శాతం మంది నైట్ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేయగలిగే ప్రాంతాలను ఎంచుకుంటామనగా, బీచ్ లలో న్యూడిటీని ఎంజాయ్ చేస్తామని 24 శాతం మంది చెప్పుకొచ్చారు. ప్రతీ నలుగురు ఇండియన్ టూరిస్టుల్లో ఒకరు హాలీడేస్ లో కూడా ఆఫీస్ ఈ మెయిల్స్ కు సమాధానాలివ్వడం, 24 గంటలూ ట్యాబ్ ను క్యారీ చేయడం వంటివి తప్పనిసరిగా భావిస్తారట. అలానే ప్రతి 10 మందిలో నలుగురు బీచ్ లలో కూడా వైఫై అందుబాటులో ఉండాలని, తద్వారా ఎప్పటికప్పుడు స్టేటస్ పోస్ట్ చేసుకునే వీలుంటుందని కోరుకుంటున్నారట. భలే ఉందికదూ.. భారతీయ టూరిస్టుల వ్యవహారం! -
చలో ఫారిన్ టూర్!
♦ అన్ని వర్గాల్లోనూ పెరుగుతున్న భారతీయ టూరిస్టులు ♦ కొందరికి ఖర్చు లెక్కలేదు; పొదుపుతో మరికొందరు ♦ ఏటా 1.8 కోట్ల మంది టూరిజానికి; 2020 నాటికి ఈ సంఖ్య 5 కోట్లకు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్తగా పెళ్లైన జంట. హనీమూన్‌కు భారత్ నుంచి ఆస్ట్రేలియా వెళ్లారు. సిడ్నీ, మెల్బోర్న్ వంటి నగరాలతో పాటు క్వీన్స్‌లాండ్‌లోని గ్రేట్ బారియర్ రీఫ్ వంటివన్నీ చుట్టేశారు. ఇంతకీ ఆ టూర్‌కు సదరు జంట ఖర్చుపెట్టిందెంతో తెలుసా? అక్షరాలా యాభై లక్షలు. మరో జంటను తీసుకుంటే... వారి ఆదాయం తక్కువ. కానీ వారూ కేరళలోని మున్నార్ వంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్లొచ్చారు. పొదుపుగా... రైల్లో వెళ్లి అక్కడ చక్కగా వారం రోజులుండి వచ్చారు. ఖర్చు రూ.50వేలు మించలేదు. ఈ రెండు ఉదాహరణలూ చూశాక అనిపించేదొక్కటే. భారతీయులు పర్యటనలకు ఎంతైనా ఖర్చు పెడుతున్నారని మొదటి సంఘటన చెబితే... పర్యటనలకు వెళ్లే ఆర్థిక స్థోమత నిజంగా లేనప్పటికీ కొంచెం కొంచెం పొదుపు చేసుకుని కూడా వెళుతున్నారని తెలుస్తుంది. మొత్తమ్మీద ఈ రెండు సంఘటనలూ చెప్పేదొక్కటే. దేశంలో ఇపుడు పర్యటనలకు వెళ్లేవారి సంఖ్య పెరిగింది. ఒకప్పుడు విదేశాలకు విహార యాత్రలంటే నెలల ముందు నుంచి ప్రణాళిక వేసుకోవాల్సి వచ్చేది. దీంతో వెళ్లేవారు కూడా తక్కువే ఉండేవారు. ఇపుడంతా ఇన్స్టంట్. ఏదైనా కంపెనీ ఆఫర్ ఇచ్చినా, లేదా ప్రసార మాధ్యమాల్లో ఆకట్టుకునే ప్రకటన చూసినా వెంటనే క్రెడిట్ కార్డు స్వైప్ చేయటమో, బ్యాంకుల్ని సంప్రదించటమో చేస్తున్నారు. బ్యాంకులు కూడా ముందు పర్యటనకు వెళ్లి వచ్చేసి... ఆ తరువాత సదరు మొత్తాన్ని తీరిగ్గా ఈఎంఐలలో కట్టే ఆఫర్లు అందిస్తున్నాయి. ఎంబసీ స్థాయిలో వీసా ప్రక్రియ గనక మరింత సరళతరమైతే విదేశీ టూర్లు ఇంకా పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. సేద తీరాల్సిందే...! విదేశీ టూర్లు ఒకప్పుడు సంపన్నులకే పరిమితమయ్యేవి. ఇప్పుడు మధ్యతరగతి వారూ ఆసక్తి కనబరుస్తున్నారు. ‘‘ఆదాయాలు పెరగటంతో పాటు టూర్ ప్యాకేజీలు కూడా అందుబాటు ధరల్లోకి వచ్చాయి. కంపెనీలు సైతం అన్ని వర్గాల వారినీ దృష్టిలో పెట్టుకుని ప్యాకేజీలు తయారు చేస్తున్నాయి. అందుకే విదేశీ ప్రయాణాలు పెరుగుతున్నాయి’’ అని ట్రావెల్ కంపెనీ థామస్ కుక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జతిందర్ పాల్ సింగ్ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. వివిధ దేశాల్లోని దర్శనీయ ప్రాంతాలను సినిమాల్లో, ఇంటర్నెట్లో చూసి ఇట్టే ఆకర్షితులవుతున్నారని, ఒత్తిడి నుంచి కాసింత ఉపశమనం కోసం విహార యాత్రలు, సాహస యాత్రలు, షాపింగ్‌కు దేశాలను దాటుతున్నారని ఆయన చెప్పారు. మరో కొత్త పోకడను చూస్తే... గతంలో ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు వెళ్లి... అక్కడ బాగా ప్రాచుర్యం ఉన్న ప్రాంతాలనే చూసేవారు. ఇప్పుడైతే ఆ ప్రదేశానికి సమీపంలో ఉన్న ఇతర ప్రాంతాలనూ చుట్టేసి వస్తున్నారు. అపార్ట్మెంట్, విల్లా, ఫామ్ హౌజ్ అద్దెకు తీసుకోవడం, గ్రామంలో బస చేయడం వంటివి పెరుగుతున్నాయి. సముద్ర ప్రయాణం చేస్తూ క్రూయిజర్‌లో సేద తీరటమూ ఈ మధ్య పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. భారతీయుల కోసం.. భారత్ నుంచి విదేశాలకు వెళుతున్న వారిలో అత్యధికులు స్విట్జర్లాండ్, సింగపూర్, థాయ్‌లాండ్, లండన్, యూఎస్లనే ఎంచుకుంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఐదే టాప్-5 డెస్టినేషన్స్‌గా నిలుస్తున్నాయి కూడా. ఇక దుబాయి, సీషెల్స్, తూర్పు యూరప్, స్కాండినేవియా, వియత్నాం, కంబోడియా, చైనా, బాలి, మెక్సికో, కెనడా తదితర ప్రాంతాలకు ఇప్పుడిప్పుడే టూర్లు పెరుగుతున్నాయి. భారతీయులను ఆకట్టుకోవడానికి దుబాయిలో ప్రపంచంలోనే తొలి బాలీవుడ్ థీమ్ పార్క్ ఏర్పాటవుతోంది. అక్టోబరులో ఇది ప్రారంభం కానుంది. విహార యాత్రల కోసం భారత్ నుంచి ఏటా 1.8 కోట్ల మంది విదేశాలకు వెళ్తుండగా... 2020 నాటికి ఈ సంఖ్య 5 కోట్లకు చేరుకుంటుందన్న అంచనాలున్నాయి. వ్యవస్థీకృత సంస్థల ద్వారా 25 శాతం మంది టూర్లను ఎంచుకుంటుండగా మిగిలిన వారు స్థానిక ఆపరేటర్లను సంప్రదించటం, కొందరు ఇంటర్నెట్ సాయంతో సొంతగా టూర్లను ఎంచుకోవటం వంటివి చేస్తున్నారు. కొందరు విమాన టిక్కెట్లు తీసుకుని... తాము చేరాలనుకున్న దేశం చేరాక... అక్కడే స్థానిక టూర్ ఆపరేటర్‌ను ఎంచుకుంటున్నారు. కస్టమర్ల సంఖ్య పరంగా ఢిల్లీ, ముంబై, కోల్‌కత, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లు టాప్ సిటీస్‌గా నిలుస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ‘‘ఈ-వీసా, వీసా ఆన్ అరైవల్ వంటివి యాత్రికులు పెరిగేందుకు దోహదం చేస్తున్నాయి. కాకపోతే వీసా చార్జీలు మరింత తగ్గాల్సి ఉంది. కొన్ని దేశాల వీసాల కోసం ఎంబసీల చుట్టూ తిరిగే ఓపిక లేక చాలా మంది ప్రయాణాలకు దూరంగా ఉంటున్నారు. ఎంబసీ స్థాయిలో వీసా ప్రక్రియ మరింత సరళతరమైతే విదేశాలకు వెళ్లే వారి సంఖ్య అధికమవుతుంది’’ అని ఓ ట్రావెల్ కంపెనీ అధిపతి అభిప్రాయపడ్డారు. వాయిదాల్లో చలో.. దేశంలోని టూర్ కంపెనీల్లో అగ్రస్థానంలో ఉన్న థామస్ కుక్ ద్వారా ఏటా లక్ష మంది విహార యాత్రలకు విదేశాలు చుట్టివస్తున్నట్లు జతిందర్ పాల్ సింగ్ చెప్పారు. ‘‘మేం నాలుగు కేటగిరీల్లో ప్యాకేజీలందిస్తున్నాం. అల్ట్రా లగ్జరీ విభాగంలో 3 శాతం మంది, ప్రీమియం 25 శాతం, వాల్యూ 35 శాతం, మిగిలినవారు బడ్జెట్ విభాగంలో వెళుతున్నారు’’ అని ఆయన చెప్పారు. ప్యాకేజీనిబట్టి ఒక జంటకు యూరప్ ట్రిప్‌కు వరుసగా రూ.4 లక్షలు, రూ.2.5 లక్షలు, రూ.1.5 లక్షలు, రూ.79 వేలు ఖర్చు అవుతుందని తెలియజేశారు. తాము వాయిదాల్లోనూ ప్యాకేజీలు అందిస్తున్నామని, దీనికి బాగా డిమాండ్ ఉందని తెలియజేశారు. -
'మీరు రాళ్లతో కొడితే మేము ఫుల్ మీల్స్‌తో కొడతాం'
'మీరు రాళ్లతో కొడితే మేము పూలతో కొడతాం, ఫుల్ మీల్స్‌తో కొడతాం' అంటున్నారు భారత ప్రజలతో సత్సంబంధాలు కోరుకుంటున్న పాకిస్తాన్ ప్రజలు. భారత్‌లోని హిందూ మతఛాందసవాదులనుద్దేశించి ఈ మాటలు అనడమేకాదు, పాకిస్తాన్లో 'డంకిన్ డోనట్స్' 26 ఫ్రాంచైజ్‌లు కలిగిన ఓ వ్యాపారవేత్త భారత పర్యాటకుల కోసం ఉచిత భోజన స్కీమ్‌ను అమలు చేస్తున్నారు. స్వల్పకాల పర్యటన కోసం పాకిస్తాన్‌కు వచ్చే భారతీయులకు ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్ బ్రాంచిల్లో అక్టోబర్ 17 వ తేదీ నుంచి ఈ ఉచిత భోజన స్కీమ్‌ను అమలు చేస్తుండగా నేటి వరకు దాదాపు 2,500 మంది భారతీయులు భోజనం చేసి తమ సౌభ్రాతృత్వాన్ని చాటి చెప్పారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశంలో హిందూ మతఛాందసవాసులు పేట్రేగిపోతున్న విషయం తెలిసిందే. బెదిరింపులకు భయపడి ప్రముఖ పాకిస్తానీ గజల్ సింగర్ గులాం అలీ తాను ముంబైలో నిర్వహించాల్సిన కచేరీని కూడా రద్దుచేసుకున్నారు. భారత్ గడ్డపై పాకిస్తాన్ క్రికెట్ జట్టును ఆడనీయమని హెచ్చరికలు చేయడమే కాకుండా ముంబైలోని బీసీసీఐ కార్యాలయంపై సోమవారం శివసేన కార్యకర్తలు దాడులకు కూడా తెగబడడంతో పాకిస్తాన్ క్రికెట్ అంపైర్ , కామెంటేటర్లు భారత్-దక్షిణాఫ్రికా వన్ డే సిరీస్ నుంచి తప్పుకున్న విషయమూ తెల్సిందే. పాక్ క్రికెట్ అంపైర్ అలెన్ డర్ , కామేంటేటర్లు వాసిం అక్రమ్, షోహబ్ అక్తర్ లు పాకిస్తాన్ కు వెళ్లిపోతున్నట్టు ప్రకటించారు. ఇంతకూ భారత పర్యాటకులకు ఉచిత భోజన సదుపాయం కల్పించాలనే ఆలోచన పాక్ వ్యాపారవేత్త ఇక్బాల్ లతీఫ్ కు ఎందుకొచ్చిందంటే... ఇనాయత్ అలీ అనే పాకిస్తానీ జాతీయుడు, తన కుటుంబసభ్యులతో అక్టోబర్ 16వ తేదీన ముంబైలోని బెండీ బజార్‌కు వచ్చారు. హోటల్ గది కోసం దాదాపు 40 హోటళ్లు తిరిగారు. ఏ హోటల్ కూడా ఆయన్ని, ఆయన కుటుంబసభ్యులను బస చేసేందుకు అనుమతించలేదు. భారత్‌ను సందర్శించే విదేశీయులు, ముఖ్యంగా పాకిస్తానీయులు 'ఫారమ్-సి' పత్రం కలిగి ఉండాలి. అది లేదన్న కారణంగా ఇనాయత్ అలీ కుటుంబాన్ని హోటల్లోకి అనుమతించలేదు. ఫలితంగా ఆయన కుటుంబం ఒక రాత్రి పోలీసు స్టేషేన్కు సమీపంలోని ఫుట్‌పాత్‌పై, మరో రాత్రి రైల్వేస్టేషన్ సమీపంలోని ఫుట్‌పాత్‌పై పడుకోవాల్సి వచ్చింది. హోటళ్లు అనుమతించని విషయాన్ని అక్టోబర్ 16వ తేదీనే పాకిస్తానీ టీవీ ఛానళ్లు ప్రముఖంగా ప్రసారం చేయడంతో పాక్ వ్యాపారి లతీఫ్ కు ఉచిత భోజన స్కీమ్ స్ఫురించింది. వెంటనే తన ఫ్రాంచైజీ హోటళ్ల ముందు ఉచిత భోజనం అంటూ ఇరువైపులా భారత్, పాకిస్తాన్ జాతీయ జెండాల చిహ్నాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఉచిత భోజనానికి ఆశించినంత స్పందన లేకున్నా తన వ్యాపారం మాత్రం 30శాతం అభివృద్ధి చెందిందని, భారత ప్రజలతో సత్సంబంధాల కోసం తాను తీసుకున్న ఈ చిరు చర్యను ఎంతోమంది కస్టమర్లు అభినందిస్తున్నారని, సరిహద్దు నుంచి ఓ పాకిస్తాన్ సైనికుడు కూడా ఫోన్ చేసి మరీ తనను అభినందించారని లతీఫ్ తెలిపారు. అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ఆక్కడ తన హోటల్ ను సందర్శించి అల్పాహార విందును స్వీకరించారని, ఇదే హోటల్లో ఇప్పుడు భారతీయులకు వడ్డించడాన్ని తాను ఎంతో గౌరవంగా, గొప్పగా ఫీలవుతున్నానని లతీఫ్ వ్యాఖ్యానించారు. ఇరువైపులా కొన్ని మతఛాందసవాద శక్తులు మినహా ఇరుదేశాల ప్రజలు శాంతియుత సత్సంబంధాలనే కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. సంకుచిత స్వభావాన్ని వీడాలని, ప్రేమను పంచి ఫలితాన్ని చూడాల్సిందిగా శివసేనను తాను కోరుకుంటున్నానని ఆయన అన్నారు. పాకిస్తాన్ సోదరుల కోసం భారత హోటళ్లు కూడా ఇలాంటి స్కీమ్ ను ఏర్పాటు చేస్తే స్పందన మాట అటుంచి వ్యాపారం మాత్రం పెరిగిపోతుందని లతీఫ్ చిట్కా సూచించారు. -
స్లోగా నడిపి బుక్కైపోయారు!
మెల్ బోర్న్:న్యూజిలాండ్ లో షికారు చేద్దామనుకున్న ఇద్దరు భారతీయ టూరిస్టులకు నిరాశే ఎదురైంది. ఇందుకు వారు చేసిందల్లా న్యూజిలాండ్ రోడ్డుపై నెమ్మదిగా వాహనం నడపడమే. 100 కి.మీ వేగంతో వెళ్లాల్సిన జోన్ లో 60 కి.మీ వేగంతో వెళ్తూ ఇద్దరు ఇండియన్ టూరిస్టులు బుక్కైపోయారు. వివరాల్లోకి వెళితే.. న్యూజిలాండ్ ను సందర్శించేందుకు వచ్చిన ఇద్దరు భారతీయులు సౌత్ ఐస్ ల్యాండ్ లోని క్వీన్ స్టోన్ ప్రాంతంలో బుధవారం రెండు వాహనాలను అద్దెకు తీసుకున్నారు. దానిలో భాగంగానే ఆ వాహనాల్లో చక్కర్లు కొడుతూ ముందుకు సాగారు. అయితే వారు రోడ్డు మధ్యలో 60 కి.మీ వేగంతో వెళ్తూ మిగతా వాహనదారులకు విసుగుతెప్పించారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తును పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో జీపీఎస్ సిస్టమ్ ద్వారా క్వీన్ స్టోన్-వానాకా లమధ్య వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాటు వారి రెంటల్ కార్ కాంట్రాక్టులు కూడా పోలీసులు రద్దు చేశారు. -
నేపాల్‌లో ఘోర బస్సు ప్రమాదం
18 మంది భారతీయ యాత్రికుల దుర్మరణం కఠ్మాండు: ఓ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం సుమారు 18 మంది ప్రయాణికుల ప్రాణాలను హరించడమే కాకుండా మరో 53 మంది ప్రయాణికులు తీవ్రగాయాల పాలయ్యేలా చేసింది. బస్సు నడుపుతున్న డ్రైవర్ తన సెల్ ఫోన్ నుంచి ఫోన్ చేసేందుకు యత్నిస్తున్న సమయంలో బస్సు అదుపుతప్పి సమీపంలోని నదిలోకి దూసుకుపోయింది. ఈ ఘోర దుర్ఘటన నేపాల్‌లోని ప్యూథాన్ జిల్లాలో సోమవారం రాత్రి జరిగింది. మృతి చెందిన ప్రయాణికులు అందరూ భారత్‌కు చెందిన వారే. నేపాల్‌లోని పవిత్ర స్వర్గద్వార్‌ను దర్శించుకున్న యాత్రికులు తిరుగు ప్రయాణంలో ఈ బస్సు ఎక్కారు. డ్రైవర్ సెల్ ఫోన్‌ను వినియోగించేందుకు యత్నించిన సమయంలో బస్సు అదుపుతప్పి దాదాపు 100 మీటర్ల మేర దొర్లుకుంటూ మాది ఖోలా నదిలో పడిపోయింది. బస్సులోని 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురు ఆస్పత్రిలో మృతి చెందారు. చనిపోయిన భారత పౌరుల్లో ఎక్కువ మంది యూపీ వాసులని అధికారులు తెలిపారు. -
ఇజ్రాయెల్ మాజీ ప్రధాని షరాన్ మృతి
జెరూసలెం: ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఏరియెల్ షరాన్ (85) శనివారం టెల్ హషోమర్లోని ఆస్పత్రిలో మృతి చెందారు. అస్వస్థతతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో మరణించారు. 2001లో ప్రధాని అయిన షరాన్, 2006లో అస్వస్థతకు లోనై, కోమాలోకి చేరుకునేంత వరకు పదవిలో ఉన్నారు. 2003లో ఆయన భారత పర్యటనకు వచ్చారు. భారత్‌లో పర్యటించిన తొలి ఇజ్రాయెల్ ప్రధాని ఆయనే. -
భారతీయ పర్యాటకులకు మలేషియా వీసా సులభతరం
కౌలాలంపూర్: మలేషియా ప్రభుత్వం భారతీయ, చైనీయుల వీసాలపై ఆంక్షలను సడలించింది. 2014 సంవత్సరంలో మలేషియా పర్యటనకు వెళ్లే భారత పర్యాటకులు సహా చైనీయులు సందర్శించేందుకు వీలుగా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అహ్మద్ జహిద్ హమీది పేర్కొన్నారు. వీసా ఆన్ ఆరైవల్ (వీఓఎ) అనే విధానం ద్వారా భారతీయులకూ, చైనీయులకూ మలేషియా ప్రభుత్వం ఈ వెసులుబాటును కల్పిస్తోంది. ప్రస్తుతం పాస్ ఫోర్ట్ కలిగివున్న భారతీయులు, చైనీయులు తమ పర్యటనకు ముందు వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. 2010లో మలేషియా ప్రభుత్వం పర్యాటకుల కోసం ప్రత్యేకంగా భారతీయులుకూ, చైనీయులతోపాటు ఎనిమిది దేశాలకూ వీఒఎ అనే విధానం ద్వారా ఈ అవకాశాన్ని కల్పించింది. దీంతో వేలాదిమందికిపైగా పర్యాటకులు మలేషియాను సందర్శించి ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నట్టు వెల్లడించింది. ఈ విఒఎ సౌకర్యాన్ని 2006లో ప్రవేశపెట్టారు. కాగా, ఇమ్మిగ్రేషన్ విభాగం రిపోర్ట్ ప్రకారం.. భారతీయులు 39,000 మంది, చైనీయులు 6,000 మంది పౌరులు మలేషియాకు సందర్శించినట్టు పేర్కొంది.