హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది దాదాపు 5–6 లక్షల మంది భారతీయ పర్యాటకులు తమ దేశాన్ని సందర్శించవచ్చని మలేషియా అంచనా వేస్తోంది. గత ఏడాది ఈ సంఖ్య సుమారు 3 లక్షలుగా నమోదైంది. శుక్రవారమిక్కడ నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్న సందర్భంగా టూరిజం మలేషియా సీనియర్ డిప్యుటీ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రమోషన్ (ఆసియా, ఆఫ్రికా) మొహమ్మద్ అమీరుల్ రిజాల్ అబ్దుల్ రహీం ఈ విషయాలు తెలిపారు.
కరోనాకు పూర్వం 2019లో భారత్ నుంచి 7.35 లక్షల పైచిలుకు టూరిస్టులు వచ్చారని, పరిస్థితులు మెరుగుపడుతుండటంతో వచ్చే ఏడాది తిరిగి ఆ స్థాయికి ఇది చేరవచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన వివరించారు. భారత్ నుంచి వచ్చే టూరిస్టుల్లో అత్యధిక శాతం మంది దక్షిణాది రాష్ట్రాల నుంచే ఉంటున్నారని ఆయన పేర్కొన్నారు. గతేడాది 70 లక్షల మంది పైగా విదేశీ టూరిస్టులు మలేషియాను సందర్శించగా ఈ ఏడాది ఇది 1.50 కోట్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. జనవరి 30న ప్రారంభమైన టూరిజం మలేషియా రోడ్‌షోలు వివిధ నగరాల్లో ఫిబ్రవరి 7 వరకు కొనసాగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment