స్లోగా నడిపి బుక్కైపోయారు!
మెల్ బోర్న్:న్యూజిలాండ్ లో షికారు చేద్దామనుకున్న ఇద్దరు భారతీయ టూరిస్టులకు నిరాశే ఎదురైంది. ఇందుకు వారు చేసిందల్లా న్యూజిలాండ్ రోడ్డుపై నెమ్మదిగా వాహనం నడపడమే. 100 కి.మీ వేగంతో వెళ్లాల్సిన జోన్ లో 60 కి.మీ వేగంతో వెళ్తూ ఇద్దరు ఇండియన్ టూరిస్టులు బుక్కైపోయారు.
వివరాల్లోకి వెళితే.. న్యూజిలాండ్ ను సందర్శించేందుకు వచ్చిన ఇద్దరు భారతీయులు సౌత్ ఐస్ ల్యాండ్ లోని క్వీన్ స్టోన్ ప్రాంతంలో బుధవారం రెండు వాహనాలను అద్దెకు తీసుకున్నారు. దానిలో భాగంగానే ఆ వాహనాల్లో చక్కర్లు కొడుతూ ముందుకు సాగారు. అయితే వారు రోడ్డు మధ్యలో 60 కి.మీ వేగంతో వెళ్తూ మిగతా వాహనదారులకు విసుగుతెప్పించారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తును పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో జీపీఎస్ సిస్టమ్ ద్వారా క్వీన్ స్టోన్-వానాకా లమధ్య వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాటు వారి రెంటల్ కార్ కాంట్రాక్టులు కూడా పోలీసులు రద్దు చేశారు.