Champions Trophy 2025: న్యూజిలాండ్‌పై టీమిండియా ఘన విజయం | Champions Trophy 2025 India Vs New Zealand Match Live Score Updates, Highlights And Viral Videos | Sakshi
Sakshi News home page

Champions Trophy 2025: న్యూజిలాండ్‌పై టీమిండియా ఘన విజయం

Published Sun, Mar 2 2025 4:10 PM | Last Updated on Sun, Mar 2 2025 9:49 PM

Champions Trophy 2025: India Vs New Zealand Live Updates And Highlights

న్యూజిలాండ్‌పై టీమిండియా ఘన విజయం
న్యూజిలాండ్‌పై టీమిండియా 44 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన న్యూజిలాండ్‌ 45.3 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. వరుణ్‌ చక్రవర్తి ఐదు వికెట్లు తీసి న్యూజిలాండ్‌ పతనాన్ని శాశించాడు. 

కేన్‌ విలియమ్సన్‌ (81) న్యూజిలాండ్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. విలియమ్సన్‌కు మిగతా కివీస్‌ బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. భారత బౌలర్లలో వరుణ్‌తో పాటు కుల్దీప్‌ (2), హార్దిక్‌ పాండ్యా (1), అక్షర్‌ పటేల్‌ (1), రవీంద్ర జడేజా (1) వికెట్లు తీశారు.

అంతకుముందు భారత్‌.. శ్రేయస్‌ అయ్యర్‌ (79), అక్షర్‌ పటేల్‌ (42), హార్దిక్‌ పాండ్యా (45) రాణించడంతో ఓ మోస్తరు స్కోర్‌ చేసింది. న్యూజిలాండ్‌ బౌలర్లలో జేమీసన్‌ ఐదు, విలియమ్‌ రూర్కీ, మిచెల్‌ సాంట్నర్‌, రచిన్‌ రవీంద్ర తలో వికెట్‌ తీశారు. మార్చి 4న జరిగే తొలి సెమీఫైనల్లో భారత్‌.. ఆస్ట్రేలయాతో తలపడనుంది. మార్చి 5న జరిగే రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్‌.. సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది. 

ఐదు వికెట్లు తీసిన వరుణ్‌ చక్రవర్తి
వరుణ్‌ చక్రవర్తి తన రెండో వన్డేలోనే ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. మ్యాట్‌ హెన్రీ (2) వికెట్‌ ఈ మ్యాచ్‌లో వరుణ్‌కు ఐదవది. విరాట్‌ కోహ్లి క్యాచ్‌ పట్టడంతో హెన్రీ ఔటయ్యాడు.

సాంట్నర్‌ క్లీన్‌ బౌల్ట్‌.. వరుణ్‌ ఖాతాలో నాలుగో వికెట్‌
న్యూజిలాండ్‌ ఓటమి దాదాపుగా ఖరారైపోయింది. వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో న్యూజిలాండ్‌ చివరి ఆశాకిరణం మిచెల్‌ సాంట్నర్‌ (28) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 

డేంజర్‌ మ్యాన్‌ విలియమ్సన్‌ ఔట్‌
169 పరుగుల వద్ద న్యూజిలాండ్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. డేంజర్‌ మ్యాన్‌ కేన్‌ విలియమ్సన్‌ (81) ఔటయ్యాడు. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో విలియమ్సన్‌ స్టంపౌటయ్యాడు. 

ఆరో వికెట్‌ కోల్పోయిన న్యూజిలాండ్‌.. బ్రేస్‌వెల్‌ ఔట్‌.. వరుణ్‌ ఖాతాలో మూడో వికెట్‌
159 పరుగుల వద్ద న్యూజిలాండ్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో బ్రేస్‌వెల్‌ (2) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 

డేంజర్‌ మ్యాన్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ ఔట్‌
వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో సిక్సర్‌ బాదిన మరుసటి బంతిరే డేంజర్‌ బ్యాటర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ ఔటయ్యాడు. ఫిలిప్స్‌ను వరుణ్‌ ఎల్బీడబ్ల్యూ చేశాడు. 35.4 ఓవర్ల అనంతరం భారత్‌ స్కోర్‌ 151/5గా ఉంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ గెలవాలంటే 86 బంతుల్లో 99 పరుగులు చేయాలి. 

నాలుగో వికెట్‌ కోల్పోయిన న్యూజిలాండ్‌
133 పరుగుల వద్ద (32.2 ఓవర్లు) న్యూజిలాండ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. జడేజా కీలకమైన టామ్‌ లాథమ్‌ (14) వికెట్‌ తీశాడు. లాథమ్‌ జడేజా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ గెలవాలంటే మరో 117 పరుగులు చేయాలి.  

హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న విలియమ్సన్‌
జడేజా బౌలింగ్‌లో బౌండరీతో కేన్‌ విలియమ్సన్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేన్‌కు వన్డేల్లో ఇది 47వ హాఫ్‌ సెంచరీ. కేన్‌ తన హాఫ్‌ సెంచరీలో 5 బౌండరీలు బాదాడు. 

మ్యాజిక్‌ చేసిన కుల్దీప్‌.. మూడో వికెట్‌ కోల్పోయిన న్యూజిలాండ్‌
93 పరుగుల వద్ద న్యూజిలాండ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. కుల్దీప్‌ యాదవ్‌ మ్యాజిక్‌ డెలివరీతో డారిల్‌ మిచెల్‌ను (17) ఎల్బీడబ్ల్యూ చేశాడు. 26 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్‌ స్కోర్‌ 104/3గా ఉంది. కేన్‌ విలియమ్సన్‌ 45, టామ్‌ లాథమ్‌ 5 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ గెలవాంటే ఇంకా 146 పరుగులు చేయాలి. 

విల్‌ యంగ్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేసిన వరుణ్‌ చక్రవర్తి
49 పరుగుల వద్ద (13.3 ఓవర్లు) న్యూజిలాండ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో విల్‌ యంగ్‌ (22) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. కేన్‌ విలియమ్సన్‌కు (19) జతగా డారిల్‌ మిచెల్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. 

అక్షర్‌ పటేల్‌ సూపర్‌ క్యాచ్‌.. తొలి వికెట్‌ కోల్పోయిన న్యూజిలాండ్‌
250 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్‌ 17 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో అక్షర్‌ పటేల్‌ సూపర్‌ క్యాచ్‌ పట్టడంతో రచిన్‌ రవీంద్ర (6) ఔటయ్యాడు. విల్‌ యంగ్‌కు (10) జతగా కేన్‌ విలియమ్సన్‌ క్రీజ్‌లోకి వచ్చాడు.

రాణించిన శ్రేయస్‌ అయ్యర్‌.. న్యూజిలాండ్‌ టార్గెట్‌ ఎంతంటే..?
దుబాయ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. శ్రేయస్‌ అయ్యర్‌ (79), అక్షర్‌ పటేల్‌ (42), హార్దిక్‌ పాండ్యా (45) రాణించడంతో భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత టాప్‌-3 బ్యాటర్లు విఫలమయ్యారు. రోహిత్‌ శర్మ 15, శుభ్‌మన్‌ గిల్‌ 2, విరాట్‌ కోహ్లి 11 పరుగులు చేశారు. 

అక్షర్‌ పటేల్‌ ఔటయ్యాక కేఎల్‌ రాహుల్‌ (23) శ్రేయస్‌తో కలిసి కాసేపు నిలకడగా ఆడాడు.ఆఖర్లో రవీంద్ర జడేజా 16, షమీ 5 పరుగులకు ఔటయ్యారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ ఐదు వికెట్లతో మెరిశాడు. జేమీసన్‌, విలియమ్‌ రూర్కీ, మిచెల్‌ సాంట్నర్‌, రచిన్‌ రవీంద్ర తలో వికెట్‌ తీశారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఫీల్డర్లు మైదానంలో పాదరసంలా కదిలారు. పలు అద్భుతమైన క్యాచ్‌లు పట్టారు. గ్లెన్‌ ఫిలిప్స్‌ (కోహ్లి), కేన్‌ విలియమ్సన్‌ (జడేజా) పట్టిన క్యాచ్‌లు మ్యాచ్‌ మొత్తానికే హైలైట్‌గా నిలిచాయి.

ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన భారత్‌
246 పరుగుల వద్ద భారత్‌ ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. మ్యాట్‌ హెన్రీ బౌలింగ్‌లో రచిన్‌ రవీంద్రకు క్యాచ్‌ ఇచ్చి హార్దిక్‌ పాండ్యా (45) ఔటయ్యాడు. చివరి ఓవర్‌లో హార్దిక్‌ సింగిల్స్‌ తీయకుండా ఓవరాక్షన్‌ చేశాడు. 

ఏడో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
223 పరుగుల వద్ద టీమిండియా ఏడో వికెట్‌ కోల్పోయింది. మ్యాట్‌ హెన్రీ బౌలింగ్‌లో కేన్‌ విలియమ్సన్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో రవీంద్ర జడేజా (16) ఔటయ్యాడు. 

ఆరో వికెట్‌ కోల్పోయిన భారత్‌
182 పరుగుల వద్ద (39.1 ఓవర్లు) భారత్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. మిచెల్‌ సాంట్నర్‌ బౌలింగ్‌లో కేఎల్‌ రాహుల్‌ (23) ఔటయ్యాడు. హార్దిక్‌ పాండ్యాకు (3) జతగా రవీంద్ర జడేజా క్రీజ్‌లోకి వచ్చాడు. 

ఐదో వికెట్‌ కోల్పోయిన భారత్‌.. శ్రేయస్‌ ఔట్‌
172 పరుగుల వద్ద (36.2 ఓవర్లు) టీమిండియా ఐదో వికెట్‌ కోల్పోయింది. 98 బంతుల్లో 78 పరుగులు చేసిన శ్రేయస్‌ అయ్యర్‌ విలియమ్‌ ఓరూర్కీ బౌలింగ్‌లో విల్‌ యంగ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. కేఎల్‌ రాహుల్‌కు (17) జతగా హార్దిక్‌ పాండ్యా క్రీజ్‌లోకి వచ్చాడు. 

నాలుగో వికెట్‌ కోల్పోయిన భారత్‌
128 పరుగుల వద్ద భారత్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. క్రీజ్‌లో కుదురుకున్న అక్షర్‌ పటేల్‌ 42 పరుగుల వద్ద ఔటయ్యాడు. రచిన్‌ రవీంద్ర బౌలింగ్‌లో లీడింగ్‌ ఎడ్జ్‌ తీసుకోవడంతో అక్షర్‌ ఔటయ్యాడు. కేన్‌ విలియమ్సన్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టుకుని అక్షర్‌ను పెవిలియన్‌కు పంపాడు. శ్రేయస్‌కు (51) జతగా కేఎల్‌ రాహుల్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. 

హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న శ్రేయస్‌
టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన శ్రేయస్‌ అద్భుతమైన హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో శ్రేయస్‌ 75 బంతుల్లో 4 బౌండరీల సాయంతో హాఫ్‌ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో శ్రేయస్‌కు ఇది అత్యంత నిదానమైన (బంతుల పరంగా) హాఫ్‌ సెంచరీ. 29 ఓవర్ల అనంతరం భారత్‌ స్కోర్‌ 127/3గా ఉంది. శ్రేయస్‌ 51, అక్షర్‌ పటేల్‌ 42 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025లో భాగంగా ఇవాళ (మార్చి 2) భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు తలపడుతున్నాయి. దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. కివీస్‌ పేసర్లు చెలరేగడంతో 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (17) మరోసారి మంచి ఆరంభం లభించినప్పటికీ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. శుభ్‌మన్‌ గిల్‌ (2) ఈ టోర్నీలో తొలిసారి సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌కు ఔటయ్యాడు. గత మ్యాచ్‌ సెంచరీ హీరో విరాట్‌ కోహ్లి 11 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు.

కష్టాల్లో ఉన్న భారత్‌ను శ్రేయస్‌ అయ్యర్‌ (35 నాటౌట్‌), అక్షర్‌ పటేల్‌ (23 నాటౌట్‌) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు ఇప్పటికే 60 పరుగులు జోడించారు. 23 ఓవర్ల అనంతరం భారత్‌ స్కోర్‌ 3 వికెట్ల నష్టానికి 90 పరుగులుగా ఉంది. కివీస్‌ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ 2, జేమీసన్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. 

కాగా, గ్రూప్‌-ఏలో భారత్‌, న్యూజిలాండ్‌ ఇదివరకే సెమీస్‌కు చేరడంతో ఈ మ్యాచ్‌ నామమాత్రంగా జరుగుతుంది. గ్రూప్‌-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీస్‌కు చేరాయి.

తుది జట్లు..

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్‌), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి

న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్‌), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్‌), మాట్ హెన్రీ, కైల్ జామీసన్, విలియం ఒరూర్కే

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement