మాలే: మాల్దీవుల ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలినట్టు తెలుస్తోంది. మాల్దీవుల మంత్రులు, నేతలు.. భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన కారణంగా భారతీయులు.. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాగా, మాల్దీవుల పర్యాటకం కోసం వెళ్లే భారతీయులు సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఈ విషయాన్ని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి.
వివరాల ప్రకారం.. భారత్‌తో దౌత్యపరమైన వివాదానికి తెరలేపిన మాల్దీవులకు మరోసారి షాక్ తగిలింది. భారత్ నుంచి మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గింది. మాల్దీవుల పర్యాటక ర్యాంకింగ్‌లో మన దేశ స్థానం గణనీయంగా పడిపోయింది. ఈ విషయాన్ని ప్రభుత్వ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి.
గతేడాది డిసెంబరు 31 వరకు భారత్ నుంచి 2,09,198 మంది పర్యాటకులు మాల్దీవులను సందర్శించారు. దీంతో, మాల్దీవుల పర్యాటక మార్కెట్‌లో 11 శాతం వాటాతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. రష్యా రెండో స్థానంలో.. చైనా మూడో స్థానంలో కొనసాగాయి. నాలుగో స్థానంలో బ్రిటన్ నిలిచింది. ఈ ఏడాది ప్రారంభంలో లక్షద్వీప్‌ను ప్రధాని మోదీ సందర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పర్యాటకులు లక్షద్వీప్‌లో పర్యటించాలని కోరారు.
ఇక, ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన నేపథ్యంలో మాల్దీవుల మంత్రులు భారత్ ఆతిథ్యంపై అక్కసు వెళ్లగక్కారు. దీంతో, ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతీసే స్థాయికి చేరింది. గత మూడు వారాలుగా మాల్దీవుల పర్యాటక జాబితాను పరిశీలిస్తే.. అప్పటివరకు అగ్రస్థానంలో కొనసాగిన భారత్ కొంతకాలంలోనే ఐదో స్థానానికి పడిపోయింది. 13,989 మంది మాత్రమే మాల్దీవులను సందర్శించారు. 18,561 మంది పర్యాటకులతో రష్యా మొదటి స్థానంలో నిలిచింది. 18,111 మంది పర్యాటకులతో ఇటలీ రెండో స్థానానికి ఎగబాకింది. చైనా 16,529.. బ్రిటన్ 14,588 మంది పర్యాటకులతో మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment