అద్భుతాన్ని వెలుగులోకి తెచ్చారు పురాతత్వశాస్త్రవేత్తలు. ఈజిప్ట్‌లో సుమారు 2000 ఏళ్ల క్రితం నాటి మమ్మీలను తవ్వి తీసారు. మమ్మీలకు పూసిన రసాయనాలను ఏంటన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది.
కైరో: సుమారు 15 మంది సభ్యులతో కూడిన పురాతత్వ శాస్త్రవేత్తల బృందం.. గత కొన్ని నెలలుగా సౌత్ కైరోలోని సఖ్కర నెక్రోపోలిస్ వద్ద ఈ తవ్వకాలు చేపట్టారు. సుమారు 30 మీటర్ల లోతులో మమ్మీలు లభ్యం కాగా, వాటిపై పరిశోధనలు ప్రారంభించారు. 664-404 బీసీ.. సైటే-పర్షియన్ కాలానికి చెందిన మమ్మీలుగా అంచనా వేస్తున్నారు. ఇప్పటిదాకా దొరికిన మమ్మీల్లో ఇవి చాలా ప్రత్యేకంమని శాస్త్రవేత్తల బృందం ప్రతినిధి రమదాన్ హుస్సేన్ చెబుతున్నారు. ‘ఇవి అద్భుతమే చెప్పాలి. ఇందులో ఓ మమ్మీకి వెండి ముసుగు, బంగారు పూతలు కూడా ఉంది. ఇప్పటిదాకా వెలుగులోకి వచ్చిన మమ్మీల్లో ఇది రెండోది. బహుశా అది చక్రవర్తి భార్యది అయి ఉండొచ్చు. కళేబరాలకు పూసిన రసాయనాల అవశేషాలు ఇంకా తాజాదనంతోనే ఉన్నాయి. వాటిని పరీక్షిస్తే మమ్మీల పరిశోధనల చరిత్రలో కొత్త అధ్యయనం లిఖించినట్లే..’ అని హుస్సేన్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment