pyramid structures
-
రోబో కంటికి అబ్బురపరచే పిరమిడ్ రహస్యాలు!
ఈజిప్టులోని గిజాలో గల గ్రేట్ పిరమిడ్ లోపల ఏముందో మనకు తెలియజేసేందుకు ఒక రోబోట్ దాని లోపలికి ప్రవేశించి పలు రహస్యాలను బయటపెట్టింది. మానవీయంగా సాధ్యమయ్యే దానికంటే ఈ రోబో ఇప్పుడు అనేక కొత్త ఆవిష్కరణలను మనముందుకు తీసుకుచ్చింది. ఒక ఆధునిక రోబో గ్రేట్ పిరమిడ్లోకి వెళ్లడం ద్వారా పురాతన నాగరికతపై నూతన విండోను సమర్థవంతంగా తెరిచింది. గ్రేట్ పిరమిడ్.. అంటే అతిపెద్ద ఈజిప్షియన్ పిరమిడ్. కైరో శివార్లలోని ఈ పిరమిడ్ ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజవంశంలోని నాలుగవ పాలకుడు ఫారో ఖుఫు సమాధి అని చెబుతుంటారు. ఈ పిరమిడ్ సుమారు 4,500 ఏళ్ల క్రితం నిర్మితమయ్యిందని చరిత్ర చెబుతోంది. ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటిగా పేరొందిన ఈపిరమిడ్ చాలా వరకు చెక్కుచెదరకుండా ఉంది. తాజాగా క్వీన్స్ ఛాంబర్‌కు చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు.. తమ తవ్వకాలతో గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా అన్వేషణ దిశగా ముందుకుసాగారు. తమ తవ్వకాల ద్వారా వారు పిరమిడ్లోకి 40-డిగ్రీల కోణంలో పైకి చేరుకోలేకపోయారు. దీంతో వారి అన్వేషణకు పెద్ద ఆటంకం ఏర్పడింది. అయితే లీడ్స్‌లోని రోబోటిక్స్ ప్రొఫెసర్ రాబ్ రిచర్డ్సన్, అతని బృందం 2010లో ఈ సవాలును స్వీకరించారు. హాంకాంగ్ దంతవైద్యుడు, పరిశోధకుడు డాక్టర్ ట్జే చుయెన్గ్ పిరమిడ్‌లోని షాఫ్ట్ను నావిగేట్ చేయడానికి. పిరమిడ్లోపలి పైభాగానికి చేరుకోవడానికి ఎవరైనా రోబోట్‌ను డిజైన్ చేస్తే బాగుంటుందని భావించాడు. ఎట్టకేలకు యూకేకి చెందిన శాస్త్రవేత్త దాదాపు ఐదు సంవత్సరాల కృషితో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి రోబోను రూపొందించారు. పరిశోధనల్లో పాల్గొన్న ప్రొఫెసర్ రిచర్డ్సన్ మాట్లాడుతూ పిరమిడ్ లోనికి ప్రవేశించే రోబో చాలా తేలికగా ఉండాలనే ఉద్దేశంతో దానిని ఐదు కిలోలకు తగ్గించామన్నారు. తరువాత పాసేజ్వే ద్వారా రోబోట్‌ను సున్నితంగా తరలించే వ్యవస్థను అభివృద్ధి చేశామన్నారు. ఈ రోబో పిరమిడ్ లోపలి భాగానికి ఏమాత్రం నష్టం కలిగించకుండా ప్రత్యేకమైన ఫుటేజ్‌లను అందించింది. పిరమిడ్ లోపలి గదికి సంబంధించిన ఫొటోలను అందించింది. ఈ రోబో కెమెరా ఒక విచిత్రమైన రాయికి సంబంధించిన ఫొటోనుపంపింది. అయితే పిరమిడ్‌లోని షాఫ్ట్ (స్థూపాకారం) ఉద్దేశం ఎవరికీ తెలియదు. ఇది గాలి కోసం ఏర్పాటు చేసిన బిలం కావచ్చని ప్రొఫెసర్ రిచర్డ్సన్ వివరించారు. ఈ స్థూపాకారంలో 50 మీటర్లు ముందుకుసాగాక ముగింపు దగ్గర తదుపరి యాక్సెస్‌ను నిరోధించడానికి ఒక రాయిని ఉంచారు. ఆ రాయి దేనిని అడ్డుకుంటుందో తమకు అర్థం కాలేదన్నారు. దీని ప్రయోజనం ఏమిటనేది మిస్టరీగా మిగిలిపోయిందని రిచర్డ్సన్ తెలిపారు. కాగా ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ విలియం వెస్ట్‌వే ఈ చారిత్రాత్మక ప్రాజెక్టపై ఒక సినిమా తీశారు. ఈ సినిమా పురాతన నాగరికతకు చెందిన అనేక అంశాలను వెలుగులోకి తెచ్చింది. రోబోటిక్ ఇంజనీరింగ్ సాయంతో పిరమిడ్‌లోని రహస్యాలు ఎలా వెల్లడయ్యాయో ఈ చిత్రం వెల్లడిస్తుందని వెస్ట్‌వే తెలిపారు. -
అద్భుతాన్ని కళ్ల ముందుంచారు
అద్భుతాన్ని వెలుగులోకి తెచ్చారు పురాతత్వశాస్త్రవేత్తలు. ఈజిప్ట్‌లో సుమారు 2000 ఏళ్ల క్రితం నాటి మమ్మీలను తవ్వి తీసారు. మమ్మీలకు పూసిన రసాయనాలను ఏంటన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. కైరో: సుమారు 15 మంది సభ్యులతో కూడిన పురాతత్వ శాస్త్రవేత్తల బృందం.. గత కొన్ని నెలలుగా సౌత్ కైరోలోని సఖ్కర నెక్రోపోలిస్ వద్ద ఈ తవ్వకాలు చేపట్టారు. సుమారు 30 మీటర్ల లోతులో మమ్మీలు లభ్యం కాగా, వాటిపై పరిశోధనలు ప్రారంభించారు. 664-404 బీసీ.. సైటే-పర్షియన్ కాలానికి చెందిన మమ్మీలుగా అంచనా వేస్తున్నారు. ఇప్పటిదాకా దొరికిన మమ్మీల్లో ఇవి చాలా ప్రత్యేకంమని శాస్త్రవేత్తల బృందం ప్రతినిధి రమదాన్ హుస్సేన్ చెబుతున్నారు. ‘ఇవి అద్భుతమే చెప్పాలి. ఇందులో ఓ మమ్మీకి వెండి ముసుగు, బంగారు పూతలు కూడా ఉంది. ఇప్పటిదాకా వెలుగులోకి వచ్చిన మమ్మీల్లో ఇది రెండోది. బహుశా అది చక్రవర్తి భార్యది అయి ఉండొచ్చు. కళేబరాలకు పూసిన రసాయనాల అవశేషాలు ఇంకా తాజాదనంతోనే ఉన్నాయి. వాటిని పరీక్షిస్తే మమ్మీల పరిశోధనల చరిత్రలో కొత్త అధ్యయనం లిఖించినట్లే..’ అని హుస్సేన్ వెల్లడించారు. -
వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ
డెరైక్ట్ సెల్లింగ్‌పై కేంద్రం మార్గదర్శకాలు న్యూఢిల్లీ: వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ దిశలో కేంద్రం సోమవారం కీలక చర్య తీసుకుంది. డెరైక్ట్ సెల్లింగ్‌కు సంబంధించి రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. డెరైక్ట్ సెల్లింగ్, మల్టీ-లెవిల్ మార్కెటింగ్ నియంత్రణ లక్ష్యంగా... పిరమిడ్ స్ట్రక్చర్స్, అలాగే మనీ సర్కులేషన్ స్కీమ్స్ నిషేధిస్తూ తాజా మార్గదర్శకాలు వెలువడ్డాయి. ఆహారం, వినిమయ వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఈ ‘‘డెరైక్ట్ సెల్లింగ్ గైడ్‌లైన్స్ 2016 ఫ్రేమ్‌వర్క్’ను విడుదల చేశారు. ఆమోదం నిమిత్తం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపినట్లు వెల్లడించారు. డెరైక్ట్ సెల్లింగ్‌ను విస్పష్టంగా ఈ మార్గదర్శకాల్లో నిర్వచించడం జరిగిందనీ, పిరమిడ్, మనీ సర్క్యులేషన్‌తో దీనికి గత వ్యత్యాసాన్ని మార్గదర్శకాలు స్పష్టం చేశాయని తెలిపారు. దీనివల్ల మోసాల విచారణలో అధికారులు మరింత పటిష్టంగా వ్యవహరించగలుగుతారని సంబంధిత వర్గాలు తెలిపాయి. డెరైక్ట్ సెల్లింగ్‌లో వస్తువుల మార్కెటింగ్, పంపిణీ, అమ్మకాలతో పాటు నెట్‌వర్క్‌లో భాగంగా సేవలూ వినియోగదారులకు అందుతాయని మార్గదర్శకాలు వివరించాయి. పరిశ్రమ వృద్ధికి తోడ్పాటు: ఐడీఎస్ఏ తాజా మార్గదర్శకాలు డెరైక్ట్ సెల్లింగ్ రంగం పటిష్ట వృద్ధికి దోహదపడతాయని సంబంధిత ప్రాతినిధ్య సంస్థ- ఐడీఎస్ఏ పేర్కొంది. వినియోగదారులు వాస్తవ, మోసపూరిత పథకాలను గుర్తించడానికి ఇవి వీలు కల్పిస్తాయని డీఎస్ఏ చైర్మన్ జితేంద్ర జగోటా తెలిపారు. ఫిక్కీ ఇటీవలి నివేదిక ప్రకారం డెరైక్ట్ సెల్లింగ్ రంగం ప్రస్తుత విలువ రూ.7,500 కోట్లు. ఐదేళ్ల క్రితం ఈ విలువ రూ.4,100 కోట్లు. 2025 నాటికి ఈ రంగం విలువ రూ.64,500 కోట్లకు పెరుగుతుందని అంచనా, తద్వారా 14.50 లక్షల మందికి ఈ రంగం ఉపాధి కల్పించనుంది.