ఈజిప్టులోని గిజాలో గల గ్రేట్ పిరమిడ్ లోపల ఏముందో మనకు తెలియజేసేందుకు ఒక రోబోట్ దాని లోపలికి ప్రవేశించి పలు రహస్యాలను బయటపెట్టింది. మానవీయంగా సాధ్యమయ్యే దానికంటే ఈ రోబో ఇప్పుడు అనేక కొత్త ఆవిష్కరణలను మనముందుకు తీసుకుచ్చింది.
ఒక ఆధునిక రోబో గ్రేట్ పిరమిడ్‌లోకి వెళ్లడం ద్వారా పురాతన నాగరికతపై నూతన విండోను సమర్థవంతంగా తెరిచింది. గ్రేట్ పిరమిడ్.. అంటే అతిపెద్ద ఈజిప్షియన్ పిరమిడ్. కైరో శివార్లలోని ఈ పిరమిడ్ ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజవంశంలోని నాలుగవ పాలకుడు ఫారో ఖుఫు సమాధి అని చెబుతుంటారు.
ఈ పిరమిడ్ సుమారు 4,500 ఏళ్ల క్రితం నిర్మితమయ్యిందని చరిత్ర చెబుతోంది. ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటిగా పేరొందిన ఈపిరమిడ్ చాలా వరకు చెక్కుచెదరకుండా ఉంది. తాజాగా క్వీన్స్ ఛాంబర్‌కు చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు.. తమ తవ్వకాలతో గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా అన్వేషణ దిశగా ముందుకుసాగారు.
తమ తవ్వకాల ద్వారా వారు పిరమిడ్‌లోకి 40-డిగ్రీల కోణంలో పైకి చేరుకోలేకపోయారు. దీంతో వారి అన్వేషణకు పెద్ద ఆటంకం ఏర్పడింది. అయితే లీడ్స్‌లోని రోబోటిక్స్ ప్రొఫెసర్ రాబ్ రిచర్డ్‌సన్, అతని బృందం 2010లో ఈ సవాలును స్వీకరించారు. హాంకాంగ్ దంతవైద్యుడు, పరిశోధకుడు డాక్టర్ ట్జే చుయెన్గ్ పిరమిడ్‌లోని షాఫ్ట్‌ను నావిగేట్ చేయడానికి. పిరమిడ్‌లోపలి పైభాగానికి చేరుకోవడానికి ఎవరైనా రోబోట్‌ను డిజైన్ చేస్తే బాగుంటుందని భావించాడు.
ఎట్టకేలకు యూకేకి చెందిన శాస్త్రవేత్త దాదాపు ఐదు సంవత్సరాల కృషితో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి రోబోను రూపొందించారు. పరిశోధనల్లో పాల్గొన్న ప్రొఫెసర్ రిచర్డ్‌సన్ మాట్లాడుతూ పిరమిడ్ లోనికి ప్రవేశించే రోబో చాలా తేలికగా ఉండాలనే ఉద్దేశంతో దానిని ఐదు కిలోలకు తగ్గించామన్నారు. తరువాత పాసేజ్‌వే ద్వారా రోబోట్‌ను సున్నితంగా తరలించే వ్యవస్థను అభివృద్ధి చేశామన్నారు.
ఈ రోబో పిరమిడ్ లోపలి భాగానికి ఏమాత్రం నష్టం కలిగించకుండా ప్రత్యేకమైన ఫుటేజ్‌లను అందించింది. పిరమిడ్ లోపలి గదికి సంబంధించిన ఫొటోలను అందించింది. ఈ రోబో కెమెరా ఒక విచిత్రమైన రాయికి సంబంధించిన ఫొటోనుపంపింది. అయితే పిరమిడ్‌లోని షాఫ్ట్ (స్థూపాకారం) ఉద్దేశం ఎవరికీ తెలియదు. ఇది గాలి కోసం ఏర్పాటు చేసిన బిలం కావచ్చని ప్రొఫెసర్ రిచర్డ్సన్ వివరించారు.
ఈ స్థూపాకారంలో 50 మీటర్లు ముందుకుసాగాక ముగింపు దగ్గర తదుపరి యాక్సెస్‌ను నిరోధించడానికి ఒక రాయిని ఉంచారు. ఆ రాయి దేనిని అడ్డుకుంటుందో తమకు అర్థం కాలేదన్నారు. దీని ప్రయోజనం ఏమిటనేది మిస్టరీగా మిగిలిపోయిందని రిచర్డ్సన్ తెలిపారు. కాగా ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ విలియం వెస్ట్‌వే ఈ చారిత్రాత్మక ప్రాజెక్టపై ఒక సినిమా తీశారు. ఈ సినిమా పురాతన నాగరికతకు చెందిన అనేక అంశాలను వెలుగులోకి తెచ్చింది. రోబోటిక్ ఇంజనీరింగ్ సాయంతో పిరమిడ్‌లోని రహస్యాలు ఎలా వెల్లడయ్యాయో ఈ చిత్రం వెల్లడిస్తుందని వెస్ట్‌వే తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment