invention
-
రామాయణ, భారత, భాగవతాల తెలుగు ఆడియోలు ఆవిష్కరణ
సాక్షి, తిరువనంతపురం: గజల్ శ్రీనివాస్ గానం చేసిన రామాయణ, భారత, భాగవతాల తెలుగు ఆడియోలను జ్యోతిర్ మఠ్ శంకరాచార్య శ్రీ అవి ముక్తేశ్వరానంద సరస్వతి ఆవిష్కరించారు.పోతన విరచిత భాగవతంలోని ముఖ్య 108 పద్యాలు, కవిత్రయం రచించిన ఆంధ్ర మహాభారతంలోని ముఖ్య 108 పద్యాలు, డా.ముకుంద శర్మ వ్రాసిన గేయ రామాయణాల ఆడియోలను ఉత్తరాఖండ్ జ్యోతిర్ మఠ్ శంకరాచార్య శ్రీ అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామీ తిరువనంతపురం (కేరళ) పద్మనాభ స్వామి వారి ఏకాంత దర్శన అనంతరం వేలాది మంది భక్తుల సమక్షంలో ఆవిష్కరించారు.మన సనాతన ధర్మంలో అతి ముఖ్యమైన రామాయణ, భారత, భాగవతాల తెలుగు ఆడియోలను ఒకే రోజు ఆవిష్కరించడం అతి గొప్ప ధార్మిక కార్యక్రమం అని, వీటిని స్వరపరచి సందర్భ, తాత్పర్య సహితంగా అందరికీ అర్ధమయ్యేలా గానం చేసిన డా.గజల్ శ్రీనివాస్ అభినందనీయుడని శంకరాచార్య అన్నారు. ఆడియో తొలి ప్రతులను సి.ఎల్.రాజం దంపతులకు, మిజోరమ్ పూర్వ గవర్నర్ కుమ్మనం రాజ శేఖర్‌లకు స్వామి అందించారు. -
ప్రపంచం వాడుతున్న జర్మన్ ఆవిష్కరణలు
మార్పు నిత్యం. అదే సత్యం. శాస్త్ర, సాంకేతిక రంగంలో ఇది కొట్టొచ్చినట్టూ కనిపిస్తుంది. జర్మనీలోని రాజకీయ సామాజిక పరిస్థితులు విషయం కాసేపు పక్కనపెడితే.. చరిత్రలో కొత్త ఆవిష్కరణలు చేయడంలో మాత్రం ఆ దేశం చొరవ చూపినట్లు తెలుస్తుంది. మొబైల్లో వాడే సిమ్‌కార్డు, మోటార్‌సైకిల్, న్యూస్‌పేపర్, ఎయిర్‌బ్యాగ్, టెలిస్కోప్..వంటి దాదాపు ప్రపంచం ఉపయోగించే ప్రధానం ఆవిష్కరణలు జర్మనీ దేశానికి చెందిన పరిశోధకులు కనిపెట్టినవని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అందులో కొన్ని ఆవిష్కరణలు కింది తెలుపబడ్డాయి. కెప్లర్ గ్రహాల చలన నియమాలు ఆధునిక బైనరీ సంఖ్యా వ్యవస్థ ఫారెన్‌హీట్ స్కేల్ ఇంటర్నల్ కంబర్షన్ ఇంజిన్ కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ +, - గుర్తులు ప్రింటెడ్ సర్య్కూట్ బోర్డ్ అల్జీమర్స్ వ్యాధి ఎలక్ట్రిక్ లోకోమోటివ్ డీజిల్ లోకోమోటివ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ క్రోమాటోగ్రఫీ ఎనిగ్మా యంత్రం ఎలక్ట్రిక్ ఎలివేటర్ కాంక్రీటు పంపు "√" చిహ్నం ప్రిగ్నెన్సీ టెస్ట్ వాక్యూమ్ పంపు గైరో కంపాస్ స్పీడో మీటర్ స్ట్రాటో ఆవరణం కిండర్ గార్టెన్ గమ్మీ బేర్ బాక్టీరియాలజీ టాకోమీటర్ హిమోగ్లోబిన్ పాస్ఫరస్(భాస్వరం) కణ విభజన మైక్రోఫోన్ వార్తాపత్రిక హాంబర్గర్ ఆటోమొబైల్ మోటార్ సైకిల్ ఓమ్స్ నియమం అతినీలలోహిత కిరణాలు జిర్కోనియం టెలిస్కోప్ ఎగ్ స్లైసర్ వాల్ ప్లగ్ సిమ్ కార్డు నెప్ట్యూన్ యురేనియం ఇయర్‌ప్లగ్ ఆక్సిజన్ యురేనస్ ఆస్పిరిన్ హెరాయిన్ ఎయిర్ బ్యాగ్ జీన్స్ ఎంపీ3 ప్లేయర్ ఇదీ చదవండి: ‘ఇష్టంలేని పని ఇంకెన్నాళ్లు.. వెంటనే రాజీనామా చేయండి’ -
రోబో కంటికి అబ్బురపరచే పిరమిడ్ రహస్యాలు!
ఈజిప్టులోని గిజాలో గల గ్రేట్ పిరమిడ్ లోపల ఏముందో మనకు తెలియజేసేందుకు ఒక రోబోట్ దాని లోపలికి ప్రవేశించి పలు రహస్యాలను బయటపెట్టింది. మానవీయంగా సాధ్యమయ్యే దానికంటే ఈ రోబో ఇప్పుడు అనేక కొత్త ఆవిష్కరణలను మనముందుకు తీసుకుచ్చింది. ఒక ఆధునిక రోబో గ్రేట్ పిరమిడ్లోకి వెళ్లడం ద్వారా పురాతన నాగరికతపై నూతన విండోను సమర్థవంతంగా తెరిచింది. గ్రేట్ పిరమిడ్.. అంటే అతిపెద్ద ఈజిప్షియన్ పిరమిడ్. కైరో శివార్లలోని ఈ పిరమిడ్ ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజవంశంలోని నాలుగవ పాలకుడు ఫారో ఖుఫు సమాధి అని చెబుతుంటారు. ఈ పిరమిడ్ సుమారు 4,500 ఏళ్ల క్రితం నిర్మితమయ్యిందని చరిత్ర చెబుతోంది. ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటిగా పేరొందిన ఈపిరమిడ్ చాలా వరకు చెక్కుచెదరకుండా ఉంది. తాజాగా క్వీన్స్ ఛాంబర్‌కు చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు.. తమ తవ్వకాలతో గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా అన్వేషణ దిశగా ముందుకుసాగారు. తమ తవ్వకాల ద్వారా వారు పిరమిడ్లోకి 40-డిగ్రీల కోణంలో పైకి చేరుకోలేకపోయారు. దీంతో వారి అన్వేషణకు పెద్ద ఆటంకం ఏర్పడింది. అయితే లీడ్స్‌లోని రోబోటిక్స్ ప్రొఫెసర్ రాబ్ రిచర్డ్సన్, అతని బృందం 2010లో ఈ సవాలును స్వీకరించారు. హాంకాంగ్ దంతవైద్యుడు, పరిశోధకుడు డాక్టర్ ట్జే చుయెన్గ్ పిరమిడ్‌లోని షాఫ్ట్ను నావిగేట్ చేయడానికి. పిరమిడ్లోపలి పైభాగానికి చేరుకోవడానికి ఎవరైనా రోబోట్‌ను డిజైన్ చేస్తే బాగుంటుందని భావించాడు. ఎట్టకేలకు యూకేకి చెందిన శాస్త్రవేత్త దాదాపు ఐదు సంవత్సరాల కృషితో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి రోబోను రూపొందించారు. పరిశోధనల్లో పాల్గొన్న ప్రొఫెసర్ రిచర్డ్సన్ మాట్లాడుతూ పిరమిడ్ లోనికి ప్రవేశించే రోబో చాలా తేలికగా ఉండాలనే ఉద్దేశంతో దానిని ఐదు కిలోలకు తగ్గించామన్నారు. తరువాత పాసేజ్వే ద్వారా రోబోట్‌ను సున్నితంగా తరలించే వ్యవస్థను అభివృద్ధి చేశామన్నారు. ఈ రోబో పిరమిడ్ లోపలి భాగానికి ఏమాత్రం నష్టం కలిగించకుండా ప్రత్యేకమైన ఫుటేజ్‌లను అందించింది. పిరమిడ్ లోపలి గదికి సంబంధించిన ఫొటోలను అందించింది. ఈ రోబో కెమెరా ఒక విచిత్రమైన రాయికి సంబంధించిన ఫొటోనుపంపింది. అయితే పిరమిడ్‌లోని షాఫ్ట్ (స్థూపాకారం) ఉద్దేశం ఎవరికీ తెలియదు. ఇది గాలి కోసం ఏర్పాటు చేసిన బిలం కావచ్చని ప్రొఫెసర్ రిచర్డ్సన్ వివరించారు. ఈ స్థూపాకారంలో 50 మీటర్లు ముందుకుసాగాక ముగింపు దగ్గర తదుపరి యాక్సెస్‌ను నిరోధించడానికి ఒక రాయిని ఉంచారు. ఆ రాయి దేనిని అడ్డుకుంటుందో తమకు అర్థం కాలేదన్నారు. దీని ప్రయోజనం ఏమిటనేది మిస్టరీగా మిగిలిపోయిందని రిచర్డ్సన్ తెలిపారు. కాగా ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ విలియం వెస్ట్‌వే ఈ చారిత్రాత్మక ప్రాజెక్టపై ఒక సినిమా తీశారు. ఈ సినిమా పురాతన నాగరికతకు చెందిన అనేక అంశాలను వెలుగులోకి తెచ్చింది. రోబోటిక్ ఇంజనీరింగ్ సాయంతో పిరమిడ్‌లోని రహస్యాలు ఎలా వెల్లడయ్యాయో ఈ చిత్రం వెల్లడిస్తుందని వెస్ట్‌వే తెలిపారు. -
అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం ఆవిష్కరణ
తెలుగు సినిమా గర్వించే లెజెండరీ సీనియర్ నటులు, దివంగత పద్మశ్రీ డా.అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆదివారం ఆయన 101వ జయంతి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని అల్లు బిజినెస్ పార్క్‌లో అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని హీరో అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అల్లు రామలింగయ్య కుమారుడు, నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ–‘‘వెయ్యి సినిమాలకుపైగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన గొప్ప నటులు నాన్నగారు. తనదైన నటనతో యాభై ఏళ్లపాటు ప్రేక్షకుల్ని అలరించిన ఆయన తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖ, హీరో అల్లు శిరీష్‌తో పాటు అల్లు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
గుర్రాలకు బ్రాండెడ్ షూ.. ధర తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండరు
గుర్రాలకు నాడాలు ఉంటాయి కదా! మరి స్నీకర్స్ ఏమిటి అనుకుంటున్నారా? విడ్డూరంగా అనిపించినా, గుర్రాలకూ స్నీకర్స్ అందుబాటులోకి వచ్చేశాయి. దౌడుతీసే గుర్రాలకు నాడాలు బిగించడమే మనకు తెలుసు. ఈ నాడాలు బిగించడం కొంత హింసాత్మకమైన ప్రక్రియ. స్నీకర్స్ వల్ల గుర్రాలకు నాడాల బెడద ఇకపై ఉండదంటున్నారు ప్రముఖ షూ సర్జన్, స్నీకర్స్ కాస్ట్యూమ్ స్పెషలిస్ట్ మార్కస్ ఫ్లాయిడ్. ప్రముఖ అంతర్జాతీయ బ్రాండెడ్ స్నీకర్స్‌ను పోలి ఉండే స్నీకర్స్‌ను ఆయన గుర్రాల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ‘హార్స్ కిక్స్’ పేరుతో ఆన్లైన్ స్టోర్ ప్రారంభించి, దాని ద్వారా వీటిని ఆయన విక్రయిస్తున్నారు. ‘ఎస్పీఎల్వై–350’, ‘న్యూ బ్యాలెన్స్–650’ పేరిట గుర్రాల కోసం ఇటీవల రెండు అందమైన మోడల్స్‌లో కొత్త తరహా స్నీకర్స్‌ను కూడా విడుదల చేశారు. గుర్రాల పాదాల సైజుకు అనుగుణంగా వీటిని ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకోవచ్చు. వీటి ప్రారంభ ధర లక్ష రూపాయల నుంచి ఉంటుంది. ప్రస్తుతం వీటిలో కొద్ది మోడల్స్ మాత్రమే ఉన్నాయి. త్వరలోనే మరిన్ని డిజైన్స్, మోడల్స్‌తో పాటు లెగ్జింగ్టన్, కెంచూరీలలో ప్రత్యేక స్టోర్స్‌ను కూడా ప్రారంభించనున్నట్లు మార్కస్ తెలిపారు. (చదవండి: జస్ట్ "పిట్టబొమ్మ" అనుకునేరు..ఇది చేసే పని చూస్తే అవాక్కవ్వాల్సిందే!) -
సంగీతం..సంస్కారానికి ఆవిష్కారం
సంగీతం మనసును, మెదడును ఒకేసారి కదిలిస్తుంది. సంగీతంవల్ల మనసులో మెదడు, మెదడులో మనసు ఒకేసారి మెదులుతూ ఉంటాయి. మనిషిలోంచి మనిషిని బయటకులాగి తనలోకి తీసుకుంటుంది సంగీతం. జీవనావసరాలకు అతీతంగా మనిషిని మనిషిని చేస్తుంది సంగీతం. ‘భూమి సారం నీరు, నీటి సారం మొక్క , మొక్క సారం మనిషి , మనిషి సారం మాట, మాట సారం సంకీర్తన లేదా సంగీతం‘ అని ఛాందోగ్యోపనిషత్తు చెప్పింది. సంగీతం అన్నిటికన్నా గొప్పది అని ఉపనిషత్ కాలం నుంచీ నేలపై నెలకొన్న సత్యం. మనిషికన్నా సంగీతం గొప్పది కాబట్టే మనిషికి సంగీతం మేలు చెయ్యగలిగేది అయింది. ‘ఆశతో బతికే వ్యక్తి సంగీతంతో నాట్యం చేస్తాడు’ అని ఒక ఇంగ్లిష్ సామెత తెలియజెబుతోంది‘. ‘తనలో సంగీతం లేని వ్యక్తి, మధురమైన శబ్దాలతో కలిసిపోని వ్యక్తి అననురాగానికి, కపటోపాయానికి, దోపిడికి తగిన వాడు అవుతాడు‘ అని ఇంగ్లిష్ కవి షేక్స్పియర్ ఒకచోట చెబుతాడు. అన్నింటికన్నా సంగీతం మనిషికి ఉన్నతమైన తోడు. సంగీతాన్ని వింటున్నప్పుడు మనల్ని మనం ఒకసారి చూసుకుంటే మనకు మనం కనిపించం! ఇంతకన్నా మనకు జరిగే మంచి మరొకటి ఉంటుందా? సంగీతం వింటున్నంత సేపూ మనం మెరుగైన స్థితిలో ఉంటాం. మన నుంచి మనం కోలుకోవడానికి సంగీతం కావాలి. సంగీతం మనల్ని ఎప్పుడూ మోసం చెయ్యదు! బంధువులవల్లా, స్నేహితుల వల్లా, సమాజంవల్లా మనం మోసపోతూ ఉంటాం. కానీ సంగీతంవల్ల మనం మోసపోవడం లేదు. కొన్ని రచనలు మనల్ని పాడుచెయ్యచ్చు. కొన్ని వాక్యాలు మనల్ని తప్పుడు దారి పట్టించచ్చు. కానీ సంగీతం మనల్ని పాడుచెయ్యదు. సంగీతం మనల్ని తప్పుడువాళ్లను చెయ్యదు. కొన్ని సందర్భాల్లో సాహిత్యం కొందరికి చెడుపు చేసింది. కానీ సంగీతం ఎప్పుడూ ఎవరికీ ఏ చెడుపూ చెయ్యదు. సంగీతం సలహాలు ఇవ్వదు. సంగీతం సూచనలు చెయ్యదు. సలహాలు, సూచనలు లేకుండా సంగీతం మనతో చెలిమి చేస్తుంది. సంగీతం మనదైపోతుంది. సంగీతాన్ని వింటున్నప్పుడు మైమరిచిపోయి తనకు తెలియకుండా మనిషి నిజంగా బతుకుతాడు. సంగీతం వల్ల మనిషి బుద్ధికి అతీతంగా సిద్ధుడు అవుతాడు. మనుగడలో భాగంగా మనం మనల్ని కోల్పోతూ ఉంటాం. సంగీతం వింటూ ఉండడంవల్ల మనల్ని మనం మళ్లీ మళ్లీ పొందచ్చు. వయసు రీత్యా ఎదిగాక పసితనం పోయిందని మరణించేంత వరకూ మనం మాటిమాటికీ బాధపడుతూ ఉంటాం. సంగీతాన్ని వింటున్నప్పుడు తెలివి, ప్రతిభ, పాండిత్యాలు లేని స్థితిలోకి వెళ్లిపోయి మనం మనంగా కాకుండా పసితనంతో ఉంటాం. ప్రతిమనిషికీ తెలుసు తాను కొంత మేరకు దుర్మార్గుణ్ణే అని. సంగీతాన్ని వింటున్నంతసేపూ తననుంచీ, తన మార్గం నుంచీ మనిషి బయటకు వచ్చేస్తాడు కాబట్టి సంగీతం కాసేపైనా మనిషిని మంచిలో ఉంచుతుంది. సంగీతం విన్నంతసేపూ అనడమో, ఏదో చెయ్యడమో ఉండవు కాబట్టి మనవల్ల అవకతవకలు, అన్యాయం, అకృత్యాలు జరగవు. శబ్దానికి సంస్కారం సంప్రాప్తిస్తే సంగీతం అవుతుంది. సంగీతం ఒక సంస్కారానికి ఆవిష్కారం. మనకూ, మన జీవనాలకూ కూడా సంస్కారం ఉండాలి. వీలైనంతగా సంగీతానికి చేరువ అవుదాం. సంగీతంలో మైమరిచిపోతూ ఉందాం. సంగీతంలో మైమరచిపోతూ ఉండడం మనం మళ్లీ, మళ్లీ పుడుతూ ఉండడం అవుతుంది. రండి, సంగీతం వల్ల మనం మళ్లీ మళ్లీ పుడుతూ ఉందాం. అద్భుతమైన అభివ్యక్తి సంగీతం; ఆస్వాదించాల్సిన ఆనందం సంగీతం. కృష్ణుడు తన పిల్లనగ్రోవి సంగీతంలో తాను ఆనందం పొందుతూ తన్మయుడు అవుతూ ఉండేవాడు. సంగీతం కృష్ణతత్త్వంలో ఒక అంశం. కృష్ణుణ్ణి సంపూర్ణ అవతారంగా చెబుతారు. ఆ సంపూర్ణ అవతారంలో సంగీతం ఒక అంశం. అంటే సంపూర్ణత్వానికి సంగీతం ముఖ్యం అని గ్రహించాలి. – రోచిష్మాన్ -
జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసిన మంత్రి పువ్వాడ.. కారణం ఇదే..
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 28న ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్ బండ్‌పై ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసి ప్రారంభ ఏర్పాట్లపై చర్చించారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. ఎన్టీ రామారావు శత జయంతి సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో కలిసి మే 28న తెలుగు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఆవిష్కరణ చేయనున్నారు. మే 28న శ్రీకృష్ణుని అవతారంలో ఎన్టీఆర్ పర్యాటకులను ఆకర్షించనున్నారు. ఇప్పటికే విగ్రహం తయారు పూర్తయి, విగ్రహ తరలింపునకు రంగం సిద్ధమైంది. మే 28న పండుగ వాతావరణంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భారీ విగ్రహ ఆవిష్కరణను చేయనున్నారు. బేస్‌మెంట్‌తో కలిపి 54 అడుగులు ఎత్తు ఉండే ఈ విగ్రహంలో తల భాగం ఐదు అడుగులు, కాళ్ల భాగం ఐదు అడుగులు ఇంకా మొత్తం శరీర భాగం ఎత్తు మాత్రమే 45 అడుగులుగా ఉండనుంది. చదవండి: యాంకర్ ఉదయభాను నూతన గృహప్రవేశం.. ఎలా ఉందో చూశారా? (ఫొటోలు) ఎటు చూసినా 36 అడుగుల పొడవు వెడల్పులతో వెయ్యి అడుగుల విస్తీర్ణం ఉండే బేస్మెంట్ పైన ఈ విగ్రహాన్ని అమర్చనున్నారు. రూ.2.3 కోట్ల వ్యయం కానున్న ఈ విగ్రహం ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులను పొందడంలో రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చొరవ చూపారు. అవసరమయ్యే నిధులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, తానా సభ్యులతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ఎన్నారైలు సహకరిస్తున్నారు. చదవండి: ఢిల్లీలో వ్యాపారం..హైదరాబాద్‌లో ఆస్తులు -
విద్యుత్ షాక్ మరణాలను ఆపే సెన్సార్
మామునూరు: ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఈఈఈ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు పంట పొలాల్లో విద్యుత్ ప్రమాదాలను గుర్తించే సెన్సార్‌ను కనుగొని నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. విద్యుదాఘాతంతో పంటపొలాలు, వ్యవసాయ బావుల వద్ద రైతుల మరణాలను ఆపేందుకు సెన్సార్‌ను ఆవిష్కరించారు. ప్రివెన్షన్ ఆఫ్ ఎలెక్ట్రోడ్యూషన్ ఫర్ సేఫ్టీ ఆఫ్ ప్రెమెక్స్ అనే ప్రాజెక్ట్‌ను ఆధ్యాపకులు డాక్టర్ సదానందం, టి.వేణుగోపాల్ పర్యవేక్షణలో విద్యార్థులు ఎం.శృతి, పి.మేఘన, ఎండి సమీర్, ఎస్.అనురాగ్, జి.మధుకర్ రూపొందించారు. సహజంగా వ్యవసాయ బావులు, పంట పొలాల వద్ద విద్యుత్ వైర్లు తెగిపడడంతో విద్యుదాఘాతానికి గురై రైతులు ప్రాణాలను పోగొట్టుకుంటుంటారు. విద్యుదాఘాతం సంభవించే అవకాశం ఉందని రైతును అలర్ట్ చేసే యంత్ర పరికరాలు అందుబాటులో లేవు. దీంతో విద్యార్థులు తమ పరిశోధన ద్వారా ప్రమాద సమయంలో అలర్ట్ చేసే సెన్సార్ పరికరాన్ని కనుగొన్నారు. శుక్రవారం సాయంత్రం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యంత్ర పని విధానాన్ని విద్యార్థులు వెల్లడించారు. ’’ప్రాసెసర్ ద్వారా సెన్సార్ స్విచ్ పరికరాలను ఒకదానికొకటి అనుసంధానం చేస్తారు. దీంతో తెగిపడిన విద్యుత్ వైర్ల వద్దకు రైతు వస్తుంటే సెన్సార్ స్విచ్ ఒత్తిడితో ఈ యంత్రంలో అమర్చిన కెమెరా ఫొటోలు తీసి వాటిని దానంతట అదే మెమరీ కార్డులో రికార్డు చేస్తుంది. తద్వారా రైతును అప్రమత్తత చేయడమే కాకుండా బజర్ సౌండ్ ఇస్తుంది’’అని వివరించారు. ఒకవేళ రైతు ముందుకు వస్తే విద్యుత్ సరఫరా నేరుగా నిలిపివేయబడుతుందని చెప్పారు. పేటెంట్ హక్కు కోసం దరఖాస్తు చేసినట్లు విద్యార్థులు తెలిపారు. -
చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, విజయవాడ: ఈ నెల 7న విజయవాడలో ‘జయహో బీసీ.. వెనుకబడిన కులాలే వెన్నెముక’ పేరుతో మహాసభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, మార్గాని భరత్, ఎమ్మెల్యే అదీప్‌రాజ్, ఎమ్మెల్సీలు కృష్ణమూర్తి, సునీత, రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. పదవుల్లో బీసీలకు ఎప్పుడూ లేనంత ప్రాధాన్యత దక్కిందన్నారు. ఈ మహాసభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశం అనంతరం జోనల్ సమావేశాలు జరుగుతాయని, బీసీ నేతలంతా హాజరవుతారని ఆయన తెలిపారు. ‘‘చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు. తన జీవితంలో మళ్లీ సీఎం అవ్వలేడు. ఆయన కేవలం తన కులం, తన కుటుంబం, తన మనుషుల కోసమే పనిచేశాడు. మూడు సార్లు సీఎం చేసిన ప్రజలను మోసం చేశాడు. 25 ఏళ్లు వైఎస్ జగన్ సీఎంగా ఉంటారు. పేదల కోసం సీఎం జగన్ పనిచేస్తున్నారు. లోకేష్ అవలక్షణాలున్న వ్యక్తి. అలాంటి లోకేష్ పాదయాత్ర కాదు.. పొర్లు దండాలు యాత్ర చేసిన ప్రజలు నమ్మరు. లోకేష్, చంద్రబాబులకు వచ్చే ఎన్నికల తర్వాత రాజకీయ భవిష్యత్ ఉండదు. 2024 తర్వాత టీడీపీ కూడా ఉండదు’’ అంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. బీసీలను తలెత్తుకుని తిరిగేలా చేశారు: మంత్రి వేణుగోపాలకృష్ణ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, బీసీలను దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆదరించని విధంగా సీఎం జగన్ ఆదరించారన్నారు. బీసీలు తలెత్తుకుని తిరిగేలా చేశారన్నారు. ‘‘బీసీ రిజర్వేషన్లు కోసం ప్రైవేట్ బిల్లు పెట్టింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ప్రతి బీసీ ఇంటికి సంక్షేమాన్ని సీఎం జగన్ చేర్చారు. జయహో బీసీ సభను చరిత్రలో ఎన్నడు జరగని విధంగా నిర్వహిస్తాం’’ అని మంత్రి అన్నారు. చదవండి: సోమిరెడ్డి తిప్పలు.. వారందరికీ టికెట్ లేదన్న నారా లోకేష్ -
పదవుల్లో బీసీలకు ఎప్పుడూ లేనంత ప్రాధాన్యత దక్కింది
-
చేపా చేపా.. వాకింగ్‌కు వస్తావా?
చాలా మందికి కుక్కలో, పిల్లులో, ఇతర పెంపుడు జంతువులో ఉంటాయి.. అప్పుడప్పుడూ వాటిని తీసుకుని అలా వాకింగ్‌కు వెళ్లొస్తుంటారు కూడా. మరి చేపలను పెంచుకునేవారి పరిస్థితి ఏమిటి? వాటిని ఎలా తీసుకెళ్లడం?.. తైవాన్‌కు చెందిన హువాంగ్ జెర్రీ అనే యూట్యూబర్‌కు ఇలాంటి సందేహమే వచ్చింది. అనుకున్నదే తడవుగా తాను పెంచుకుంటున్న గోల్డ్ ఫిష్‌లతో బయటికి వెళ్లే మార్గమేమిటా అని ఆలోచించాడు. ఇదిగో ఈ చిత్రంలో కనిపిస్తున్న ‘వాకర్ ఫిష్ ట్యాంక్’ను తయారు చేసేశాడు. ఇదేదో అల్లాటప్పా ‘వాకర్ ఫిష్‌ట్యాంక్’ కాదు.. మంచి దృఢంగా ఉండే ఆక్రిలిక్ ఫైబర్ గాజు, గట్టి ఉక్కు మెటీరియల్‌తో రూపొందించాడు. చేపలకు ఆహారం వేసేందుకు ఏర్పాటు చేశాడు. ట్యాంకులోని నీటిని ఎప్పటికప్పుడు శుద్ధి చేసే చిన్నపాటి ఫిల్టర్‌ను.. నీటిలో ఆక్సిజన్ సరిగా ఉండేందుకు.. గాలిని పంపే ఎయిర్‌పంప్‌ను అమర్చాడు. ఇవి నడిచేందుకు ఓ బ్యాటరీని అనుసంధానించాడు. ఇంకేం.. నీళ్లు మార్చాల్సిన అవసరం లేకుండానే.. ఎక్కడికైనా, ఎంతసేపైనా ‘ఫిష్’తో వాకింగ్‌కు వెళ్లొచ్చన్నమాట. హువాంగ్ ఇలా తన చేపలతో వాకింగ్‌కు వెళితే.. జనమంతా కళ్లప్పగించి చిత్రంగా చూశారట. ఇటీవల యూట్యూబ్‌లో ఈ వీడియో వైరల్‌గా మారింది. తినేందుకు వాడేస్తున్నారట.. ఇంతకుముందు జపాన్‌కు చెందిన ఎంఏ కార్పొరేషన్స్ చేసిన ‘పోర్టబుల్ ఫిష్ ట్యాంక్’ ఇది. ఎక్కడికైనా అలా చేతిలో పట్టుకుని వెళ్లిపోయేలా దీనిని రూపొందించారు. ట్యాంక్‌లోని నీళ్లలో ఆక్సిజన్ స్థాయిని ఎప్పటికప్పుడు పరిశీలించే ఏర్పాటూ ఉంది. అయితే దీన్ని చేపలు పెంచుకునేవారితోపాటు.. చేపలు, పీతలు వంటివి ఫ్రెష్‌గా తినాలనుకునేవారు వాటిని తెచ్చిపెట్టుకునేందుకు ఈ ట్యాంక్‌ను వాడేస్తున్నారట. -
హైబ్రీడ్ సైకిల్.. కేవలం ఆరు రూపాయలతో!
అనంతపురం: మేథో శక్తి ఒకరి సొత్తు కాదని నిరూపించాడు అనంతపురానికి చెందిన యువకుడు. సాధించాలనే తపన.. నూతన ఆవిష్కరణల పట్ల ఉన్న జిజ్ఞాస అతన్ని ప్రత్యేకమైన వ్యక్తిగా ఈ ప్రపంచానికి పరిచయం చేస్తున్నాయి. పర్యావరణానికి హాని కలగని ఉత్పత్తులతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అతనే.. అనంతపురం నగర శివారులోని చంద్రబాబు కొట్టాలకు చెందిన బాబా ఫకృద్దీన్. కుటుంబ ఆర్థిక పరిస్థితులు సక్రమంగా లేక 9వ తరగతితో చదువు మానేసి.. వాహనాల మరమ్మతుతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన బాబా ఫకృద్దీన్.. తాను చేస్తున్న ప్రతి పనీ వినూత్నంగా ఉండాలని భావించేవారు. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్‌తో పాటు తొలిసారిగా రివర్స్ గేర్‌తో నడిచే త్రిచక్ర వాహనాన్ని రూపొందించి అందరి ప్రశంసలూ అందుకున్నారు. అంతటితో ఆగకుండా యువతను ఉర్రూతలూగించేలా హైబ్రీడ్ సైకిల్‌కు రూపకల్పన చేశారు. హల్క్ బైసైకిల్.. రూ.56 వేల ఖర్చుతో బాబా ఫకృద్దీన్ రూపొందించిన హైబ్రీడ్ సైకిల్ నేడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సైకిల్‌కు ఏర్పాటు చేసిన 72 ఓల్టుల బ్యాటరీని రెండు నుంచి మూడు గంటల పాటు చార్జింగ్ పెట్టడం ద్వారా 3 నుంచి 4 యూనిట్ల విద్యుత్ వినియోగమవుతుంది. ఈ లెక్కన రూ.6తో 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. రూ.18,600తో కొనుగోలు చేసిన సైకిల్‌కు రూ.29 వేలు విలువైన 72 ఓల్టుల బ్యాటరీని అమర్చారు. ఎల్ఈడీ సెన్సార్, సౌండ్ హారన్, చార్జింగ్ రీడింగ్, బ్యాటరీ బ్యాక్‌ఆప్ డిస్ప్లేతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. 40 కిలోల బరువున్న ఈ సైకిల్‌పై 120 కిలోల బరువున్న వ్యక్తి సైతం 50 కిలోమీటర్ల వేగంతో రయ్యిమంటూ దూసుకెళ్లవచ్చు. సైకిల్‌కున్న భారీ టైర్ల (26X4) వల్ల కొండ గుట్టలను సునాయాసంగా ఎక్కి దిగవచ్చు. మరిన్ని ఆవిష్కరణలు చేయాలనుంది నా ప్రతి ఆవిష్కరణ వెనుక ఒకరి వ్యధభరితమైన జీవితం ఉంది. వారి కోసం ఏదో చేయాలనే తపనే నూతన ఆవిష్కరణలకు కారణమవుతోంది. త్రిచక్ర వాహనాన్ని పార్కింగ్ ప్లేస్‌లో వెనక్కు తీసుకునేందుకు దివ్యాంగులు పడుతున్న ఇబ్బందులు గమనించి రివర్స్ గేర్ సదుపాయం ఉన్న వాహనాన్ని రూపొందించాను. ప్రస్తుతం నేను తయారు చేసిన సైకిల్‌ను చూసిన చాలా మంది ముచ్చటపడి హల్క్ బైక్ అని పేరు పెట్టారు. తగిన ప్రోత్సాహమిస్తే మరిన్ని ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని ఉంది. – బాబా ఫకృద్దీన్, అనంతపురం -
ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్... ఇప్పుడేమో..
నేహా బగోరియా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒకప్పుడు. ఇప్పుడామె పర్యావరణ పరిరక్షణ బాధ్యతలను తలకెత్తుకున్న ఓ సంస్కర్త. నిజమే... కార్యకర్త బాధ్యత సమస్య పట్ల సమాజానికి అవగాహన కల్పించడం తో పూర్తవుతుంది. సంస్కర్త మీద సమస్యకు పరిష్కారాన్ని సూచించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఆమె నీటి సంరక్షణ కోసం ఓ వినూత్నమైన పరిష్కారమార్గాన్ని చూపించింది. ఆలోచన మంచిదే వెస్టర్న్ టాయిలెట్‌ను ఒకసారి ఫ్లష్ చేస్తే, టాయిలెట్‌ను శుభ్రం చేయడానికి ఐదు నుంచి ఆరు లీటర్ల నీరు విడుదలవుతుంది. నేహ రూపొందించిన సాధనం ఉపయోగిస్తే ఒక్క చుక్క నీరు కూడా అవసరం ఉండదు. రోజంతా వాడినా సరే టాయిలెట్ల నుంచి దుర్వాసన రాదు. ఈ సాధనం పేరు ఎకో ట్రాప్లిన్. ఇది సెన్సర్ ఆధారంగా పని చేస్తుంది. సెన్సర్ యాక్టివేట్ అవగానే, ఎకో ట్రాప్లిన్ సాధనంలో నింపిన రసాయన ద్రవం విడుదలవుతుంది. టాయిలెట్ దుర్వాసనను ఈ రసాయన ద్రవం తుడిచి పెట్టినట్లే తీసుకుపోతుంది. టాయిలెట్ వాడటం ఆగిపోగానే ఈ ద్రవం విడుదల కూడా ఆగిపోతుంది. బాల్యంలో ఓ సంఘటన ముంబయిలో పెరిగిన నేహ సొంతూరు రాజస్థాన్ రాష్ట్రం, బీవార్ సమీపంలోని ఓ కుగ్రామం. నేహ తాత, నానమ్మ అక్కడే ఉండేవారు. ఆమె చిన్నప్పుడు నానమ్మ, తాతయ్యల దగ్గరకు వెళ్లినప్పుడు అక్కడి విచిత్రమైన జీవనశైలి ఆమెను ఆశ్చర్యపరిచింది. నీటి వృథాను అరికట్టడానికి తనకు తెలిసిన, అప్పటికి తన ఊహకు తట్టిన ఉపాయాలన్నింటినీ అక్కడి వాళ్లకు వివరించింది. నీటి వినియోగం అవసరతను, దుర్వినియోగం అయితే ఎదురయ్యే కష్టాలను తెలియచెప్పింది. సెలవుల తర్వాత నేహ తిరిగి ముంబయి వచ్చేసింది. చదువుల్లో పడి నీటి సంరక్షణ ఆలోచన పక్కన పెట్టింది. నచ్చని ఉద్యోగం కాలం గడిచింది. నేహ చదువు పూర్తయింది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరింది. నాలుగేళ్లపాటు ఉద్యోగం చేసిన తర్వాత ఆమెలో అంతర్యానం మొదలైంది. ‘జీవితం అంటే ఇది కాదు’ అనిపించసాగింది. అప్పుడు ఆమె దృష్టి కంప్యూటర్ మీద నుంచి సమాజం మీదకు మళ్లింది. ఈ సారి ఆమెకు గమనింపులో ఒక్కోచోట అవసరానికి మించిన నీటి వాడకం, ఒక్కో చోట కనీస అవసరాలకు కూడా నీరు లభించకపోవడం వంటి వైరుధ్యాలు కూడా అర్థమయ్యాయి. నీరు సమృద్ధిగా వాడే వాళ్ల దగ్గరకు వెళ్లి ‘నీటి వనరును పరిమితంగా వాడండి’ అని ఎంత చెప్పినా ప్రయోజనం ఉండదని కూడా అనుకుందామె. వేదికలెక్కి ఉపన్యాసాలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్ మీద పోస్టులతో సమస్య తీవ్రతను పదిమందికి తెలియచేయడం వరకే సాధ్యం, మరి పరిష్కారం కోసం ఏమి చేయాలి? ఏదో ఒకటి చేయాలనే ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన రూపమే ఈ ఎకో ట్రాప్లిన్ సాధనం. నేహా తన ఆవిష్కరణతో 2013లో ‘టాపు సస్టెయినబుల్ సొల్యూషన్స్’ పేరుతో ‘ఎకో ట్రాప్లిన్’ సాధనాల తయారీ కంపెనీ స్థాపించింది. నేహ తొలిదశలో ఎనిమిది వందల సాధనాలను తయారు చేసింది. వాటన్నింటినీ ప్రయోగాత్మకంగా ఉపయోగించి పరీక్షించింది. అవన్నీ విజయవంతంగా పని చేస్తున్నాయి. ఒక మంచి ఆలోచన ఒక కొత్త ఆవిష్కరణకు కారకం అవుతుందని నేహ నిరూపించింది. చదవండి: Weight Loss: అవిసె గింజలు, అరటి, రాజ్మా.... ఇవి తిన్నారంటే... -
రెక్కలు లేని ఫ్యాన్.. అంతేనా అదిరిపోయే మరో స్పెషాలిటీ కూడా..
రెక్కల్లేని మొండి ఫ్యాను చక్కనిదెలా అవుతుందనేగా మీ డౌటు? ఇది చూడచక్కనిది అవునో, కాదో ఈ ఫొటో చూసి మీరే తేల్చుకోవాలి గానీ, దీని పనితీరు మాత్రం చక్కగానే ఉంటుంది. పనులు చేసుకునే డెస్క్ మీద, లేదా ఏదైనా టేబుల్ మీద సులువుగా ఇమిడిపోయే ఈ ఫ్యాన్ భేషుగ్గా మనం కోరుకున్న రీతిలో గాలి వీస్తుంది. వాతావరణం వేడిగా ఉంటే, చల్లనిగాలులు వీస్తుంది, వాతావరణం చల్లగా ఉంటే వెచ్చనిగాలులు వీస్తుంది. దాదాపుగా ఎయిర్‌కండిషనర్ మాదిరిగా పనిచేస్తుంది ఈ రెక్కల్లేని ఫ్యాను. దీనిని కెనడాలోని టొరంటో యూనివర్సిటీ రీసెర్చ్ అసిస్టెంట్ సోయంగ్ ఏన్ రూపొందించారు. ‘ఫ్లోడెస్క్ ఫ్యాన్’ పేరిట తయారు చేసిన ఈ ఫ్యాన్ గది వాతావరణానికి అనువుగా గాలులు వీచడమే కాదు, గాలిలోని దుమ్ము ధూళికణాలను పీల్చేసుకుని, స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. -
అరచేతిలో బుల్లిపెట్టె
ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్న మహిళ చేతిలో పాతకాలం నాటి రోటరీ డయల్‌తో కనిపిస్తున్న పరికరం అచ్చంగా మొబైల్ ఫోన్. ఇది పూర్తిగా పనిచేస్తుంది కూడా. జస్టీన్ హాప్ట్ అనే ఈ మహిళ స్పేస్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. స్మార్ట్ ఫోన్లంటే ఈమెకు మాచెడ్డ చిరాకు. ల్యాండ్‌ఫోన్‌ను ఎక్కడికంటే అక్కడకు తీసుకుపోయే వీలు లేదు. మొబైల్‌ఫోన్ వాడటం తప్పనిసరి. స్మార్ట్ఫోన్ల బెడద తప్పించుకోవడానికి ఈమె తన బుర్రకు పదును పెట్టి ఉపాయాన్ని ఆలోచించింది. బుర్రలో బల్బు వెలగడమే తరువాయి. ఈ ఎక్స్ట్రా స్మార్ట్‌ఫోన్‌కు రూపకల్పన చేసింది. పాతకాలం నాటి రోటరీ డయల్‌తో, అంగుళం మందం, మూడంగుళాల వెడల్పు ఉండేలా సరికొత్త మొబైల్‌ఫోన్‌ను తయారు చేసింది. దీని తయారీ కోసం టెలికం పరికరాలను తయారు చేసే సంస్థల నుంచి విడి భాగాలను తెప్పించుకుంది. ఇందులో ఆమె ‘ఏటీ అండ్ టీ’ కంపెనీకి చెందిన ప్రీ పెయిడ్ సిమ్‌కార్డును వాడుతోంది. ఈ ఫోన్ కూడా పాతకాలం నాటి ల్యాండ్‌ఫోన్ మాదిరిగా మాటలాడుకోవడానికి మాత్రమే పనికొస్తుంది. స్మార్ట్ఫోన్లలో చిరాకుపెట్టే ఎస్ఎంఎస్, ఎంఎంఎస్‌లు, వాట్సాప్ వంటి యాప్‌ల పప్పులేవీ ఇందులో ఉడకవు. భలే ఉంది కదూ! దీని తయారీ కోసం ఆమె తెప్పించుకున్న పరికరాల విలువ 130 డాలర్లు (సుమారు రూ.9,600). దీని ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగానే ఇలాంటిది తమకూ కావాలని చాలామంది కోరారు. దీంతో ఆమె ఇలాంటి ఫోన్ తయారీకి కావలసిన పరికరాల కిట్‌ను, తయారీ పద్ధతి నోట్‌ను ఆన్లైన్లో 170 డాలర్లకు (దాదాపు రూ.12,500) విక్రయిస్తోంది. ఈ ధరకు మార్కెట్లో ఏకంగా స్మార్ట్‌ఫోన్ దొరుకుతుందిగా అనుకుంటున్నారా? అలాగే అనుకోండి. ఇలాంటిది మీ దగ్గర ఉంటే బాగుంటుందనుకుంటున్నారా? అలాగైతే ఆన్లైన్లో జస్టీన్ హోప్ట్కు ఆర్డర్ చేయండి. -
వినూత్న రేస్ కారు ఆవిష్కరణ
చేబ్రోలు: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజ్ఞాన్ వర్శిటీ మెకానికల్ విభాగం ఆధ్వర్యంలో వినూత్న రేస్ కారును ఆవిష్కరించారు. మెకానికల్ విభాగాధిపతి రామకృష్ణ మాట్లాడుతూ తమ విద్యార్థులు రూ. 94 వేల ఖర్చుతో వినూత్న రేస్ కారును తయారు చేశారన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కారును రూపొందించినట్లు తెలిపారు. సిబ్బంది అల్లంనేని శారద, ఆయా విభాగాల అధిపతులు, డీన్లు, విద్యార్థులు పాల్గొన్నారు.