సాక్షి, తిరువనంతపురం: గజల్ శ్రీనివాస్ గానం చేసిన రామాయణ, భారత, భాగవతాల తెలుగు ఆడియోలను జ్యోతిర్ మఠ్ శంకరాచార్య శ్రీ అవి ముక్తేశ్వరానంద సరస్వతి ఆవిష్కరించారు.
పోతన విరచిత భాగవతంలోని ముఖ్య 108 పద్యాలు, కవిత్రయం రచించిన ఆంధ్ర మహాభారతంలోని ముఖ్య 108 పద్యాలు, డా.ముకుంద శర్మ వ్రాసిన గేయ రామాయణాల ఆడియోలను ఉత్తరాఖండ్ జ్యోతిర్ మఠ్ శంకరాచార్య శ్రీ అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామీ తిరువనంతపురం (కేరళ) పద్మనాభ స్వామి వారి ఏకాంత దర్శన అనంతరం వేలాది మంది భక్తుల సమక్షంలో ఆవిష్కరించారు.
మన సనాతన ధర్మంలో అతి ముఖ్యమైన రామాయణ, భారత, భాగవతాల తెలుగు ఆడియోలను ఒకే రోజు ఆవిష్కరించడం అతి గొప్ప ధార్మిక కార్యక్రమం అని, వీటిని స్వరపరచి సందర్భ, తాత్పర్య సహితంగా అందరికీ అర్ధమయ్యేలా గానం చేసిన డా.గజల్ శ్రీనివాస్ అభినందనీయుడని శంకరాచార్య అన్నారు. ఆడియో తొలి ప్రతులను సి.ఎల్.రాజం దంపతులకు, మిజోరమ్ పూర్వ గవర్నర్ కుమ్మనం రాజ శేఖర్‌లకు స్వామి అందించారు.
Comments
Please login to add a commentAdd a comment