Ghazal Srinivas
-
రామాయణ, భారత, భాగవతాల తెలుగు ఆడియోలు ఆవిష్కరణ
సాక్షి, తిరువనంతపురం: గజల్ శ్రీనివాస్ గానం చేసిన రామాయణ, భారత, భాగవతాల తెలుగు ఆడియోలను జ్యోతిర్ మఠ్ శంకరాచార్య శ్రీ అవి ముక్తేశ్వరానంద సరస్వతి ఆవిష్కరించారు.పోతన విరచిత భాగవతంలోని ముఖ్య 108 పద్యాలు, కవిత్రయం రచించిన ఆంధ్ర మహాభారతంలోని ముఖ్య 108 పద్యాలు, డా.ముకుంద శర్మ వ్రాసిన గేయ రామాయణాల ఆడియోలను ఉత్తరాఖండ్ జ్యోతిర్ మఠ్ శంకరాచార్య శ్రీ అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామీ తిరువనంతపురం (కేరళ) పద్మనాభ స్వామి వారి ఏకాంత దర్శన అనంతరం వేలాది మంది భక్తుల సమక్షంలో ఆవిష్కరించారు.మన సనాతన ధర్మంలో అతి ముఖ్యమైన రామాయణ, భారత, భాగవతాల తెలుగు ఆడియోలను ఒకే రోజు ఆవిష్కరించడం అతి గొప్ప ధార్మిక కార్యక్రమం అని, వీటిని స్వరపరచి సందర్భ, తాత్పర్య సహితంగా అందరికీ అర్ధమయ్యేలా గానం చేసిన డా.గజల్ శ్రీనివాస్ అభినందనీయుడని శంకరాచార్య అన్నారు. ఆడియో తొలి ప్రతులను సి.ఎల్.రాజం దంపతులకు, మిజోరమ్ పూర్వ గవర్నర్ కుమ్మనం రాజ శేఖర్‌లకు స్వామి అందించారు. -
డా. గజల్ శ్రీనివాస్‌కు ‘సంత్ కబీర్ సూఫీ గాయక సత్కారం’
ఇండోర్: స్వర్గంగిణీ సంగీత సంస్థ, స్వరంగిణీ జన వికాస సమితి , మధ్యప్రదేశ్ ఆధ్వర్యంలో ఇండోర్‌లో అభినవ్ కళా సమాజ్ ఆడిటోరియం నందు నిర్వహించిన "సంత్ కబీర్ ఉత్సవ్ "లో ముమ్మారు గిన్నీస్ ప్రపంచ రికార్డుల గ్రహీత, ప్రఖ్యాత గజల్ గాయకుడు "మాస్ట్రో" డా.గజల్ శ్రీనివాస్ కు ముఖ్య అతిథి ఆకాశవాణి ,ఇండోర్ సంచాలకులు శ్రీ సంతోష్ అగ్నిహోత్రి ‘సంత్ కబీర్ సూఫీ గాయక సత్కారం' అందించారు. ఈ సభలో డా.గజల్ శ్రీనివాస్ ఆలపించిన కబీర్ దోహే & సూఫీ ఉర్దూ గజల్ గానం ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసిందని, వారాణసి కి చెందిన తానా బానా మ్యూజిక్ బ్యాండ్ కబీర్ సాహిత్య గానం శ్రోతలను ఆకట్టుకుందని నిర్వాహకులు గురు చరణ్ దాస్, శ్రీమతి అంజన్ సక్సేనా తెలిపారు. -
AP: జూలై 5న ‘గ్రంథాలయం కోసం పుస్తకంతో నడక’
మంగళగిరి(ఏపీ): అంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జూలై 5న ‘గ్రంథాలయం కోసం పుస్తకంతో నడక’ అనే కార్యక్రమాన్ని రాష్ట్రమంతా నిర్వహించాలని నిర్ణయించింది. అనేక సామాజిక, సాంస్కృతిక, సాహిత్య , సేవా, విద్యా , గ్రంథాలయ సంస్థల తోడ్పాటుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా అంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు కార్యాలయంలో ఆయనను కలసి కార్యక్రమానికి ఆహ్వానించారు. గ్రంధాలయాల డిజిటలైజషన్, ఆధునీకరణ, గ్రంధాల పఠనం పై మరింత అవగాహన కలిగించేందుకు విస్తృత ప్రచారం, అధ్యయనం చేయనున్నామని డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు. -
ఉన్నత విద్యాశాఖకు ఆంధ్ర సారస్వత పరిషత్ కృతజ్ఞతలు
సాక్షి, విజయవాడ: బిఏ ఓరియెంటల్ లాంగ్వేజ్(ఓల్) పూర్తి చేసిన వారికి బీఈడీలో ప్రవేశానికి అవకాశం కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నత విద్యామండలి తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్ అభినందించారు. బిఈడి సోషల్ స్టడీస్ మెథడాలజీలోకి ప్రవేశం కల్పించేందుకు అనుమతి, అర్హత ఉన్న అభ్యర్థులకు ఏపీఎడ్ సెట్ దరఖాస్తుల గడువును మే 15 వరకు పొడిగింపు, జూన్ మూడో వారంలో ఈ పరీక్ష నిర్వహణకు సన్నాహాలు పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్ర సారస్వత పరిషత్, ఓరియంటల్ విద్యార్థుల అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రా రెడ్డి , కమిషనర్ సురేష్ నాయర్, ఏపీఎడ్ సెట్ కన్వీనర్ సుధీర్‌రెడ్డిలకు పరిషత్ ధన్యవాదాలు తెలిపింది. చదవండి: ‘చిరు’ధాన్యాల సాగుకు పెద్ద ప్రోత్సాహం -
అంతర్జాతీయ స్థాయిలో బాలల కథ, కవితల పోటీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవం సందర్భంగా అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థినీ విద్యార్థులకు కథా, కవితల పోటీని నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 16 ఏళ్ల లోపు వయసున్న తెలుగు పిల్లలందరూ ఈ పోటీకి అర్హులని పేర్కొన్నారు. కథలు, కవితలు దేశభక్తి, భారత స్వాతంత్య్ర ఉద్యమం, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు, భారతదేశ ఘన చరిత్రపై ఉండాలని సూచించారు. స్వీయ రచనలు ఈ పోటీకి మాత్రమే రాసినవై ఉండాలని, వాట్సాప్, వెబ్‌సైట్స్, పత్రికల్లో మరెక్కడా ప్రచురించినవి ఉండకూడదని స్పష్టంచేశారు. కవితలు 20 పంక్తులకు మించి ఉండకూడదని, కథ చేతిరాత 3 పుటలకు మించి ఉండకూడదని, ప్రింటింగ్‌లో ఏ4 సైజులో మాత్రమే అంటే సింగిల్ సైడ్ పేజీలో కథ, చేతిరాత బాగాలేని వారు డి.టి.పి కానీ లేదా ఇతరులతో అందంగా రాయించి పంపాలన్నారు. అలాగే కథ, కవిత పిల్లల సొంతమని తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ హామీ పత్రాన్ని తప్పనిసరిగా జతచేయాలని పేర్కొన్నారు. విద్యార్థి పేరు, తరగతి, ఊరు, జిల్లా, రాష్ట్రం, దేశం, సెల్‌ఫోన్ నంబర్ ఉండాలని, పోస్ట్ ద్వారా గానీ మెయిల్ ద్వారా గానీ కథలు, కవితలను.. ఆవుల చక్రపాణి యాదవ్, తెలుగు, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఉర్దూ, గడియారం హాస్పిటల్ పక్కన కర్నూలు–518001 అనే చిరునామాకు ఆగస్టు 8 లోపు పంపాలన్నారు. మరిన్ని వివరాలకు 9963350973 ఫోన్నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు. ప్రథమ బహుమతి కింద రూ.5,000, ద్వితీయ బహుమతి రూ.3,000, తృతీయ బహుమతి రూ.2,000.. మూడు ప్రోత్సాహ బహుమతులు ఒక్కొక్కరికి రూ.వేయి చొప్పున అందిస్తామని గజల్ శ్రీనివాస్ ప్రకటించారు. -
గజల్ శ్రీనివాస్‌కు సత్కారం
చెన్నై,కొరుక్కుపేట: చెన్నై టి.నగర్‌లోని ప్రముఖ సేవా సంస్థ ఉంగలుక్కాగ చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యాలయానికి మార్యాద పూర్వకంగా విచ్చేసిన గజల్ శ్రీనివాస్‌కు ట్రస్ట్ వ్యవస్థాపకుడు డాక్టర్ సునీల్, ఆస్కా సంయుక్త కార్యదర్శి జేకే రెడ్డిలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా గజల్ శ్రీనివాస్‌ను దుశ్శాలువాలతో సత్కరించారు. అనంతరం గజల్ శ్రీనివాస్ ట్రస్ట్ కార్యాలయంలోని గ్యాలరీలను సందర్శించి ట్రస్ట్ సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. మన తెలుగు వాడైన డాక్టర్ సునిల్ చెన్నై మహానగరంలో చేస్తున్న సేవలు హర్షణీయమన్నారు. దేవుని దయతో దిగ్విజయంగా కొనసాగాలని ఆకాంక్షించారు. -
గజల్‌కు షరతులతో బెయిల్
-
గజల్ శ్రీనివాస్‌కు షరతులతో కూడిన బెయిల్
-
గజల్‌కు షరతులతో బెయిల్
సాక్షి, హైదరాబాద్ : లైంగిక వేధింపుల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న గజల్ శ్రీనివాస్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. రూ.10వేల నగదు, ఇద్దరు వ్యక్తుల పూచికత్తు సమర్పించడంతోపాటు వారంలో రెండు సార్లు నిందితుడు పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని కోర్టు పేర్కొంది. తీర్పు కాపీలు పరిశీలించిన పిదప చంచల్గూడా జైలు అధికారులు శ్రీనివాస్‌ను విడుదలచేసే అవకాశంఉంది. ఏ2 పార్వతికి కూడా : లైంగిక వేధింపులకు సంబంధించి గజల్ శ్రీనివాస్ సహాయకురాలు, ఏ-2 నిందితురాలిగా ఉన్న పార్వతికి కూడా కోర్టులో ఊరట లభించింది. పార్వతి పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను న్యాయమూర్తి అంగీకరించారు. దీంతో ఆమె అరెస్టు నుంచి తప్పించుకున్నట్లైంది. వీడియోలు లీక్!: ప్రముఖ కళాకారుడిగా వెలుగొందుతున్న గజల్ శ్రీనివాస్ చీకటి వ్యవహారాలు వెలుగులోకి రావడంతో జనవరి 2న ఆయనను పంజాగుట్ట పోలీసులు అరెస్టుచేశారు. ఆయనకే చెందిన ‘సేవ్ టెంపుల్స్’సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనేది శ్రీనివాస్‌పై ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారానికి సంబంధించి వీడియో, ఆడియో ఆధారాలను కూడా బాధితురాలు అందించడంతో గజల్ మెడకు ఉచ్చుబిగుసుకుంది. కాగా, పోలీసుల చేతుల్లోని గజల్ వీడియోలు కొన్ని లీక్ కావడం సంచలనంగా మారింది. -
నాంపల్లి కోర్టుకు గజల్ శ్రీనివాస్
-
నాంపల్లి కోర్టుకు గజల్ శ్రీనివాస్
సాక్షి, హైదరాబాద్: యువతిపై వేధింపులకు పాల్పడిన కేసులో ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్‌కు విధించిన జ్యుడీషియల్ రిమాండ్‌ను ఈనెల 25 వరకు న్యాయస్థానం పొడిగించింది. ఆయనను శుక్రవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. తనకు బెయిల్ ఇవ్వాలని మరోసారి ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈనెల 18న కోర్టు విచారణ జరపనుంది. అంతకుముందు ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేయడంతో మరోసారి అర్జీ పెట్టుకున్నారు. ‘సేవ్ టెంపుల్స్’ సంస్థలో పనిచేస్తున్న సహచర ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఈ నెల 2న గజల్ శ్రీనివాస్‌ను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన చంచల్‌గూడ జైలులో ఉన్నారు. పార్వతి ముందస్తు బెయిల్ పిటిషన్ కాగా, ఈ కేసులో రెండో నిందితురాలిగా ఉన్న ‘సేవ్ టెంపుల్స్’ ఉద్యోగిని పార్వతి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. గజల్ శ్రీనివాస్ అరెస్టైనప్పటి నుంచి ఆమె పరారీలో ఉన్నారు. గజల్ శ్రీనివాస్ వేధింపులకు సహకరించారని, చెప్పినట్లుగా వినాలని బాధితురాలిపై ఆమె ఒత్తిడి తీసుకువచ్చినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమెను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
‘గజల్‌ను సామాజికంగా బహిష్కరించాలి’
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ రాసలీలల వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. గజల్ రాసలీలలకు సంబంధించిన వీడియోలను బాధితురాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆయనపై తెలంగాణ, ఏపీ రాష్ట్రాల కళాసంస్థలు, కళాకారులు ధ్వజమెత్తారు. ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన గజల్ శ్రీనివాస్‌ను కఠినంగా శిక్షించి, అతడిని సామాజికంగా బహిష్కరించాలని తెలంగాణ, ఏపీ రాష్ట్రాల కళాసంస్థలు, కళాకారులు అన్నారు. శుక్రవారం హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో విలేకరుల సమావేశం ఆనందలహరి సాంస్కృతిక సంస్థ రాష్ట్ర కన్వీనర్ మల్లం రమేష మాట్లాడుతూ.. గజల్ శ్రీనివాస్ అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతూ కళారంగాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి కంటూ సాయన్న, చల్లా సరోజినీదేవి, సీనియర్ నటి ఆనందలక్ష్మి, రామడుగు వాసంతి, మోహన్‌కుమార్ గాంధీ, మిమిక్రి కళాకారులు రాంబాబు, జానపద నాయకులు బాలస్వామి, సాయబాబా పాల్గొన్నారు. -
గజల్ బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా
-
గజల్‌కు మద్దతుపై మాట మార్చిన మంత్రి
-
గజల్ కు మద్దతు.. మాట మార్చేశారు!
సాక్షి, తాడేపల్లిగూడెం : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న గజల్ గాయకుడు శ్రీనివాస్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేసిన ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాట మార్చారు. తీవ్ర విమర్శల నేపథ్యంలో ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గజల్ శ్రీనివాస్‌పై నిప్పులు చెరిగారు. చిన్ననాటి నుంచి బాగా తెలిసిన వ్యక్తి కావటంతో శ్రీనివాస్‌పై ఆరోపణలను ఖండించానని ఆయన తెలిపారు. అయితే మహిళల పట్ల అతని వికృత చర్యలు చాలా బాధించాయని మంత్రి చెప్పుకొచ్చారు. గజల్ అనే నాణానికి ఇంతకాలం ఒకవైపే చూశా కానీ, రెండోవైపు కోణం చాలా జుగుప్సాకరంగా ఉందంటూ మంత్రి వ్యాఖ్యానించడం విశేషం. కాగా, నిన్న ఇదే మాణిక్యాలరావు గజల్ చాలా మంచి వ్యక్తి అని.. అతనిపై కావాలనే కుట్ర చేశారంటూ మద్దతు వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో మీడియాపైనే ఆయన చిర్రుబుర్రులాడారు కూడా. -
గజల్ శ్రీనివాస్‌కు ఏపీ మంత్రి మద్ధతు
-
లైంగిక వేధింపుల కేసు: పార్వతి పరార్!
సాక్షి, హైదరాబాద్: గాయకుడు గజల్ శ్రీనివాస్ ఓ మహిళను లైంగిక వేధింపులకు గురిచేసిన కేసులో రెండో నిందితురాలిగా ఉన్న పార్వతి పరారీలో ఉంది. ఆమెకు నోటీసులు జారీ చేయడానికి పంజాగుట్ట పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులకు సహకరించిన పార్వతి.. శ్రీనివాస్ చెప్పినట్లుగా వినాలని బాధితురాలిపై ఒత్తిడి తీసుకువచ్చిందని ప్రధాన ఆరోపణ. మంగళవారం ఉదయం పోలీసులు శ్రీనివాస్‌ను అరెస్టు చేయగా.. ఆ రోజు సాయంత్రం వరకు కూడా పార్వతి సేవ్ టెంపుల్స్ సంస్థ కార్యాలయం వద్ద ఉంది. గజల్ శ్రీనివాస్ తనకు తండ్రిలాంటి వాడని, 20 ఏళ్లుగా తాను అక్కడే పనిచేస్తున్నా ఎలాంటి ఇబ్బందులు రాలేదని మీడియాకు చెప్పింది. బాధితురాలు ఎందుకు ఫిర్యాదు చేసిందో అర్థం కావడం లేదనీ పేర్కొంది. కానీ బాధితురాలు చేసిన స్టింగ్ ఆపరేషన్ వీడియోలు మంగళవారం సాయంత్రం బయటకు వచ్చాయి. అందులో పార్వతి, గజల్ శ్రీనివాస్‌ల రాసలీలలు స్పష్టంగా కనిపించాయి. ఆ తర్వాతి నుంచి పార్వతి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు పంజాగుట్ట పోలీసులు ప్రయత్నించినా ఆచూకీ దొరకలేదు. ఆమె సెల్‌ఫోన్ సైతం స్విచాఫ్ చేసి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో పార్వతి ఆచూకీ కోసం సేవ్ టెంపుల్స్ కార్యాలయం, ఆమె ఇల్లు, స్నేహితుల వద్ద ఆరా తీస్తున్నారు. కస్టడీపై నేడు నిర్ణయం విచారణ నిమిత్తం గజల్ శ్రీనివాస్‌ను తమ కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం వాదనలు ముగిశాయి. న్యాయస్థానం గురువారం తీర్పు వెలువరించనుంది. ఇక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన గజల్ శ్రీనివాస్‌పై సేవ్ టెంపుల్స్ సంస్థ వేటు వేసింది. ఆయనను బ్రాండ్ అంబాసిడర్‌గా తొలగించినట్లు సంస్థ అధ్యక్షుడు ప్రకాశ్‌రావు వెలగపూడి ఓ ప్రకటన విడుదల చేశారు. తమ సంస్థ కార్యాలయాలను దేవాలయాలుగా పరిగణిస్తామని, అక్కడ పనిచేసే మహిళల్ని తాము గౌరవంగా చూసుకుంటామని పేర్కొన్నారు. బాధితురాలి సాహసంపై సోషల్ మీడియాలో ప్రశంసలు గజల్ శ్రీనివాస్‌కున్న పెద్దమనిషి ముసుగు తొలగించడానికి, ఆయన నిజ స్వరూపం బయటపెట్టడానికి స్టింగ్ ఆపరేషన్ చేసిన బాధితురాలిపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. అంతటి సాహసం చేసిన ఆమెకు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలంటూ అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు. కాగా.. ‘సాక్షి’తో మాట్లాడిన బాధితురాలు.. తనకు ఎదురైన చేదు అనుభవాలు వివరించారు. వెంటనే స్పందించిన పోలీసులు తనకు ఎంతో ధైర్యం ఇచ్చారంటూ ధన్యవాదాలు తెలిపారు. -
గజల్ శ్రీనివాస్‌కు వత్తాసు పలికిన ఏపీ మంత్రి
సాక్షి, విజయవాడ: లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ గజల్ కళాకారుడు కేసిరాజు శ్రీనివాస్ అలియాస్ ‘గజల్’ శ్రీనివాస్‌కు ఏపీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు మద్ధతు తెలిపారు. గజల్ శ్రీనివాస్ పై కావాలని కుట్ర ప్రకారమే ఇలా చేశారని భావిస్తున్నట్లు చెప్పారు. విజయవాడలో బుధవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. పథకం ప్రకారం రికార్డ్ చేయకపోతే శ్రీనివాస్‌పై అలాంటి వీడియోలు బయటకు ఎలా వస్తాయన్నారు. గజల్ శ్రీనివాస్ దేశ వ్యాప్తంగా తిరిగి అద్బుతమైన గజల్స్ వినిపించిన వ్యక్తి అని, తనకు చిన్నప్పటి నుంచి శ్రీనివాస్ తెలుసునన్నారు. శ్రీనివాస్ ఏ తప్పు చేయలేదని మరోసారి మంత్రి మాణిక్యాల రావు అన్నారు. లైంగిక వేధింపుల వీడియోలతో అడ్డంగా దొరికిన నిందితుడికి గౌరవప్రద మంత్రి హోదాలో ఉన్న మాణిక్యాలరావు వత్తాసు పలకడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే పలు వీడియోలే సాక్ష్యాలుగా బాధితురాలు తనపై జరిగిన లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేయగా శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు మహిళల పట్ల గజల్ శ్రీనివాస్ ముసుగు వేసుకున్న ఒక క్రూరమృగం అన్నది వీడియోలతో నిర్ధారణ అయిందని బాధితురాలు ఆరోపిస్తున్నారు. గజల్ శ్రీనివాస్‌కు వత్తాసు పలికిన ఏపీ మంత్రి -
బ్రాండ్ అంబాసిడర్‌గా గజల్ తొలగింపు
-
’గజల్’ నుండి ఆడపిల్లల్ని కాపాడాలి
-
గజల్ శ్రీనివాస్‌కు మరో షాక్
సాక్షి, హైదరాబాద్ : లైంగిక వేధింపుల కేసులో అరెస్టై జైలు ఊచలు లెక్కపెడుతున్న ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్‌కు మరో షాక్ తగిలింది. ఆయనను సేవ్ టెంపుల్ బ్రాండ్ అంబాసిడర్ గా తొలగిస్తూ ఆ సంస్థ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా సేవ్ టెంపుల్ సంస్థ అధ్యక్షుడు వెలగపూడి ప్రకాశ్‌రావు మాట్లాడుతూ..మహిళలు అంటే తమకు చాలా గౌరవం అని, ఒక మహిళను గజల్ శ్రీనివాస్ వేధించడం షాక్‌కు గురి చేసిందన్నారు. అలాంటి వ్యక్తిని బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగించవద్దని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు వెలగపూడి ప్రకాశ్‌రావు తెలిపారు. తమ సంస్థ పేరు చెప్పుకొని ఎలాంటి అశ్లీల కార్యక్రమాలకు పాల్పడిన ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. గజల్ శ్రీనివాస్‌పై సస్పెన్షన్ వేటు వేసినట్లు ఆయన తెలిపారు. కాగా పంజగుట్ట పరిధిలోని సప్తగిరి బిల్డింగ్‌లో ఉన్న సేవ్ టెంపుల్ సంస్థలో వెబ్ రేడియో ఆలయవాణికి ఓ యువతి ఇన్చార్జ్గా విధులు నిర్వర్తిస్తోంది. వెలగపూడి ప్రకాశ్‌రావు నేతృత్వంలోని ఈ సంస్థ ప్రధాన కార్యాలయం మూడేళ్లుగా సప్తగిరి బిల్డింగ్‌లోని త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌లో నడుస్తోంది. ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న గజల్ శ్రీనివాస్ యువతిని లైంగికంగా వేధించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. -
శ్రీనివాస్ ముసుగులో ఉన్న క్రూర మృగం
-
లైంగిక వేధింపుల కేసులో ’గజల్’ అరెస్ట్
-
గతి తప్పిన ‘గజల్’
సాక్షి, హైదరాబాద్ ఆధ్యాత్మిక, దేశభక్తి, మహిళల భద్రత.. ఇలా ఎన్నో అంశాలపై గజల్స్ రాసి ఆలపిస్తున్న కేసిరాజు శ్రీనివాస్ అలియాస్ గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపుల కేసులో అరెస్టయ్యాడు. తాను బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తున్న సంస్థలోని ఉద్యోగినినే వేధించి అడ్డంగా బుక్కయ్యాడు. బాధితురాలు పక్కా సాక్ష్యాలతో పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయన బాగోతం బయటపడింది. ఈ కేసులో పార్వతి అనే మహిళను కూడా నిందితురాలిగా చేర్చినట్టు ఇన్స్పెక్టర్ ఎస్.రవీందర్ మంగళవారం వెల్లడించారు. నాంపల్లి కోర్టులో నిందితుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్, పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లు బుధవారానికి వాయిదా పడ్డాయి. దీంతో గజల్ శ్రీనివాస్‌కు జ్యుడీషియల్ రిమాండ్ విధించి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఆఫీసులో మసాజ్ చేయాలంటూ.. : పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్‌కు చెందిన బాధిత మహిళ బీకాం, బ్యూటీషియన్ కోర్సులు పూర్తి చేయడంతో పాటు ప్రవచనాలు, వేదాలు అధ్యయనం చేసింది. ఈమెకు 2014లో వివాహమైనా మూడు నెలలకే విడాకులు తీసుకుంది. గతేడాది జూన్ నుంచి పంజగుట్ట పరిధిలోని సప్తగిరి బిల్డింగ్‌లో ఉన్న సేవ్ టెంపుల్ సంస్థలో నెలకు రూ.13 వేల జీతానికి పని చేస్తోంది. ఆ సంస్థ నిర్వహించే వెబ్ రేడియో ఆలయవాణికి ఇన్చార్జ్గా విధులు నిర్వర్తిస్తోంది. వెలగపూడి ప్రకాశ్‌రావు నేతృత్వంలోని ఈ సంస్థ ప్రధాన కార్యాలయం మూడేళ్లుగా సప్తగిరి బిల్డింగ్‌లోని త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌లో నడుస్తోంది. ఈ సంస్థకు గజల్ శ్రీనివాస్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి బాధితురాలు ఈ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకే విధులు నిర్వర్తించాల్సి ఉంది. అయితే గజల్ శ్రీనివాస్ తరచూ ఆ కార్యాలయానికి వెళ్లి అర్ధరాత్రి వరకు గడిపేవాడు. బాధితురాలిని కూడా ఆ సమయం వరకు ఉండాల్సిందిగా ఒత్తిడి చేసేవాడు. ఇందుకు ఆమె గతంలోనే అనేకసార్లు సున్నితంగా తిరస్కరించింది. సేవ్ టెంపుల్ సంస్థలో బాధితురాలితో పాటు వీడియో ఎడిటర్, సహాయకుడు, పని మనిషి పార్వతి మాత్రమే ఉద్యోగులుగా ఉన్నారు. కార్యాలయానికి సంబంధించిన మూడు బెడ్రూమ్స్లో ఒకదాన్ని గజల్ శ్రీనివాస్ తన అనైతిక కార్యకలాపాలకు వినియోగించేవాడు. వేళకాని వేళల్లో పని మనిషి పార్వతితో కాళ్లు నొక్కించుకోవడం, మసాజ్ చేయించుకోవడంతోపాటు ఇతర అనైతిక కార్యకలాపాలకు పాల్పడేవాడు. బెదిరింపులు.. వేధింపులు పార్వతి మాదిరే తనకు ‘సహకరించాలంటూ’ శ్రీనివాస్ బాధితురాలిపై ఒత్తిడి చేసేవాడు. లేదంటే ఉద్యోగం నుంచి తీసేస్తానని, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతోపాటు మరెక్కడా ఉద్యోగం రాకుండా చేస్తానని బెదిరించేవాడు. పార్వతి సైతం గజల్ శ్రీనివాస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తూ బాధితురాలిపై అనేకసార్లు ఒత్తిడి తీసుకువచ్చింది. ‘‘నేను చేస్తున్నట్లే సార్‌కు చెయ్యి. అప్పుడే మంచి జీతంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పిస్తాడు. ఆయన చాలా పెద్దోడు. నాకు చేసినట్లే నీకు పెళ్లి కూడా చేస్తాడు’’ అని చెప్పేది. ఈ వేధింపులు తారస్థాయికి చేయడంతో అనేకసార్లు తిరస్కరించిన బాధితురాలు.. కొన్ని సందర్భాల్లో పార్వతితో కలిసి రెండుమూడు గంటల పాటు గజల్ శ్రీనివాస్ కాళ్లు నొక్కేది. దీంతో మరింత రెచ్చిపోయిన గజల్ శ్రీనివాస్ ఆ గదిలో నగ్నంగా/అర్ధనగ్నంగా ఉండి బాధితురాలిని పార్వతి ద్వారా పిలిపించేవాడు. ఆమెను బలవంతంగా ఆలింగనం చేసుకోవడం, చేతులతో అభ్యంతరకరంగా తడమటం చేసేవాడు. వీటిని భరించలేకపోయిన బాధితురాలు హెచ్చరిస్తే... బెదిరింపులకు దిగేవాడు. ఫోన్ ద్వారా, వాట్సాప్ చాటింగ్స్ ద్వారానూ హింసించేవాడు. బాధితురాలి స్టింగ్ ఆపరేషన్ గజల్ శ్రీనివాస్ వేధింపులు శృతిమించడంతో పోలీసులకు ఫిర్యాదు చేయాలని బాధితురాలు భావించింది. అయితే పలుకుబడి ఉన్న వ్యక్తి కావడం, కేవలం ఫిర్యాదు మాత్రమే చేస్తే ఎవరూ నమ్మరనే ఉద్దేశంతో స్వయంగా స్టింగ్ ఆపరేషన్ చేపట్టింది. సేవ్ టెంపుల్ కార్యాలయంలో శ్రీనివాస్ వినియోగిస్తున్న బెడ్రూమ్లో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసింది. ఇందులో గజల్ శ్రీనివాస్, పార్వతి రాసలీలలతోపాటు పార్వతితో కలిసి బాధితులురాలు శ్రీనివాస్ కాళ్లు నొక్కుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. వీటి ఆధారంగా గత శుక్రవారం (డిసెంబర్ 29) పంజగుట్ట పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. వీడియో రికార్డులతోపాటు వాయిస్ రికార్డులు, ఫొటోలు పోలీసులకు అందించింది. దీంతో ఐపీసీ 354, 354 (ఏ), 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు విషయం గోప్యంగా ఉంచి ప్రాథమిక దర్యాప్తు చేశారు. అన్ని ఆధారాలు సేకరించి మంగళవారం ఉదయం ఆనంద్‌నగర్ కాలనీలోని తన నివాసంలో గజల్ శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు. ఠాణాలో టేబుల్‌పై దరువేస్తూ.. గజల్ శ్రీనివాస్‌ను పోలీసుస్టేషన్‌కు తరలించి డాక్యుమెంటేషన్ పూర్తయ్యే వరకు దాదాపు రెండు గంటల పాటు ఠాణాలోని ఇంటర్వ్యూ రూమ్‌లో ఉంచారు. ఈ సమయంలోనూ ఎలాంటి పశ్చాత్తాప ఛాయలు లేని గజల్ శ్రీనివాస్ అక్కడి టేబుల్‌పై దరువేస్తూ కనిపించారు. ఈ దృశ్యాలను అక్కడున్న మీడియా ప్రతినిధులు రికార్డు చేశారు. అనంతరం గజల్ శ్రీనివాస్‌ను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానంలో శ్రీనివాస్ తరఫు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే గజల్ శ్రీనివాస్ పలుకుబడి ఉన్న వ్యక్తని, బెయిల్‌పై బయటకు వస్తే కేసులో ఫిర్యాదిగా ఉన్న బాధితురాలిని బెదిరించడం, సేవ్ టెంపుల్ సంస్థ కార్యాలయంలో ఉన్న సీసీకెమెరా ఫుటేజ్‌లతోపాటు ఇతర సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారంటూ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన్ను రెండు వారాల పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరారు. రెండు పిటిషన్లపై వాదనలను విన్న న్యాయస్థానం.. శ్రీనివాస్‌కు ఈ నెల 12 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. దీంతో పోలీసులు ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో పార్వతిని రెండో నిందితురాలిగా చేర్చామని, దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కేసును తీవ్రంగా పరిగణిస్తాం: ఏసీపీ విజయ్‌కుమార్ లైంగిక వేధింపుల కేసును తీవ్రంగా పరిగణిస్తామని పంజగుట్ట ఏసీపీ విజయ్‌కుమార్ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వారి కార్యాలయంలో కూడా విచారించి, వీడియోలు, ఆడియోలు, ఫోటోలు అన్ని ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఏ–1గా శ్రీనివాస్, ఏ–2గా పనిమనిషి పార్వతిని చేర్చినట్లు తెలిపారు. శ్రీనివాస్ గత రెండ్రోజులుగా నగరంలో లేడని, మంగళవారం ఉదయం వచ్చినట్టు తెలియగానే అరెస్టు చేసినట్లు తెలిపారు. వద్దన్నా ఫిజియోథెరపీ చేసింది ఆమెను (బాధితురాలు) నేను ఓ కుమార్తెలా చూసుకున్నా. గతంలో జరిగిన ఓ యాక్సిడెంట్లో నా చేతికి గాయమైంది. వైద్యుల సలహా మేరకు ఫిజియోథెరపీ చేయించుకుంటున్నా. ఆ రోజు ఫిజియోథెరపిస్ట్ రాలేదు. దీంతో తనకు అనుభవం ఉందని, తానే చేస్తానంటూ ఆమె ముందుకు వచ్చింది. నేను వద్దని వారించినా ఫిజియో«థెరపీ చేసింది. ఇప్పుడు ఇలా ఎందుకు ఫిర్యాదు చేసిందో అర్థం కావడం లేదు. – మీడియాతో గజల్ శ్రీనివాస్ పచ్చి మోసగాడు.. గజల్ శ్రీనివాస్ పెద్ద మనిషి ముసుగు వేసుకుని ఉన్న పచ్చి మోసగాడు. ఆయన లైంగిక వేధింపులను పలుమార్లు సంస్థ నిర్వాహకులతో పాటు ఆయన కుటుంబ సభ్యుల దృష్టికి కూడా తీసుకువెళ్లా. వారెవరూ పట్టించుకోకపోవడంతోనే పోలీసులకు ఫిర్యాదు చేశా. శ్రీనివాస్ కోరినట్లు ఉండాలంటూ పార్వతి నాపై అనేకసార్లు ఒత్తిడి చేసింది. ఆమె కూడా మంచిది కాదు. రెండు నెలలుగా నాపై వేధింపులు పెరిగాయి. – మీడియాతో బాధితురాలు -
నాలాగా మరో యువతి బాధపడకూడదనే
-
గజల్ శ్రీనివాస్ పచ్చి మోసగాడు..
సాక్షి, హైదరాబాద్ : పెద్దమనిషి ముసుగులో చెలామణి అవుతున్న గజల్ శ్రీనివాస్ పచ్చి మోసగాడు అని లైంగిక వేధింపులు ఎదుర్కొన్న యువతి ఆరోపించింది. లైంగిక వేధింపుల విషయాన్ని గజల్ శ్రీనివాస్ భార్య దృష్టికి కూడా తీసుకు వెళ్లినట్లు ఆమె తెలిపింది. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ..‘ వేధింపులపై గజల్ శ్రీనివాస్ కుటుంబసభ్యులు స్పందించలేదు. గత రెండు నెలలుగా వేధింపులు ఎక్కువ అయ్యాయి. వాటిని తట్టుకోలేకే సాక్ష్యాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశా. ఆయన వద్ద పనిచేసే చేసే పార్వతి మంచిది కాదు. ఆమె నన్ను ప్రలోభపెట్టేందుకు చాలా ప్రయత్నించింది. సార్ మాట వింటే మంచి లైఫ్ ఉంటుందని చెప్పుకొచ్చేది. నేను ఒక్కదాన్నే కాదు...ఆఫీస్‌లో చాలామంది వేధింపులకు గురయ్యారు. అంతేకాకుండా గజల్ శ్రీనివాస్ చాలా విచిత్రంగా ప్రవర్తించేవాడు. త్వరలో నేను గవర్నర్ అవుతా. నీకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పిస్తా. ఒకవేళ నా మాట వినకపోతే నీకు బయట ఎక్కడా జాబ్ దొరకకుండా చేస్తా అని బెదిరించేవాడు. చాలామంది అమ్మాయిలందరినీ అదే విధంగా బెదిరించేవాడు. గదిలోకి పిలిచి లైంగికంగా వేధించేవాడు. అయితే నాకులా మరో యువతి బాధపడకూడదనే ఉద్దేశ్యంతో ధైర్యంగా ముందుకు వచ్చాను. పోలీసులు కూడా నా ఫిర్యాదుకు స్పందించారు. అందుకే పక్కా సాక్ష్యాలను పోలీసులు అందించా. గజల్ శ్రీనివాస్‌కు జీవితాంతం జైల్లోనే ఉండాలి. అతడికి జైలు శిక్ష కూడా సరిపోదు. అలాంటి వాడిని తేలికగా వదలకూడదు. కఠినంగా శిక్షించాలి.’ అని డిమాండ్ చేసింది. వెలుగు చూస్తున్న ‘గజల్’ అకృత్యాలు గజల్ శ్రీనివాస్ అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మసాజ్ పేరుతో తన వద్ద పనిచేసే యువతులను వేధింపులకు గురి చేయడమే కాకుండా, తన మాట వినకపోతే సిబ్బందితో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేవాడని తెలుస్తోంది. యువతులతో మసాజ్ చేయించుకున్న దృశ్యాలు మీడియాకు చిక్కాయి. ఆ వీడియోల్లో గజల్ శ్రీనివాస్...అమ్మాయిలతో కలిసి ఉన్న దృశ్యాలు ఉండగా, గత కొన్నేళ్లుగా చాలామంది సిబ్బందితో అతడు ఇదే తరహాలో జల్సాలు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా తనవద్ద పనిచేసే యువతుల పేదరికాన్ని ఆసరా చేసుకుని గజల్ శ్రీనివాస్ ఈ అకృత్యాలకు పాల్పడుతుండేవాడని, అతడికి పనిమనిషి పార్వతి సహకరించేదని తెలుస్తోంది. మరోవైపు తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని గజల్ శ్రీనివాస్ అన్నారు. వేధింపుల కేసులో అరెస్ట్ అనంతరం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ..ఆమెను తన బిడ్డలా చూసుకున్నానని, ఎప్పుడూ అసభ్యంగా తాను ప్రవర్తించలేదని అన్నారు. అసలు ఆమె పట్ల తనకెలాంటి చెడు అభిప్రాయం లేదని గజల్ శ్రీనివాస్ అన్నారు. -
‘గజల్’ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్ : లైంగికి వేధింపులకు పాల్పడ్డి జైలు పాలైన గజల్ శ్రీనివాస్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఈ కేసుకు సంబంధించి నిందితులుగా గజల్ శ్రీనివాస్‌ను ఏ1గా, పనిమనిషి పార్వతిని ఏ2గా చేర్చారు. మహిళల పట్ల గజల్ శ్రీనివాస్ అసభ్యంగా ప్రవర్తించేవాడని, అభ్యంతరకరమైన ప్రాంతాల్లో మసాజ్ చేయాలని బెదరించేవాడని వేధింపులు ఎదుర్కొన్న యువతి పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి స్టింగ్ ఆపరేషన్ వీడియోలను బాధితురాలు పోలీసులకు అందచేసింది. గజల్ శ్రీనివాస్ తండ్రిలాంటివారు.. రేడియో జాకీని లైంగికంగా వేధించిన కేసులో ఏ2 ముద్దాయిగా ఉన్న పార్వతి మాట్లాడుతూ.. గజల్ శ్రీనివాస్ తనకు తండ్రి లాంటి వాడని తెలిపింది. ఆయన దగ్గర తాను చాలాకాలంగా పని చేస్తున్నానని, మహిళలను వేధించే వ్యక్తి కాదని చెప్పింది. ఆరోపణలు చేసిన ఆమె... తనకు తానుగా మసాజ్ చేస్తానని ముందుకొచ్చిందని పార్వతి ఆరోపిస్తోంది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఇంత స్థాయికి ఎదిగిన వ్యక్తి...ఓ అమ్మాయిని ఇబ్బంది పెట్టాడంటే నమ్మేలా లేదని శ్రీనివాస్ ఫ్యామిలి ఫ్రెండ్ జ్యోతిర్మయి అన్నారు. ఖైదీ నెంబర్ 1327 లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన గజల్ శ్రీనివాస్‌ను పంజాగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన మేజిస్ట్రేట్ గజల్ శ్రీనివాస్ కు ఈ నెల 12 వరకు రిమాండ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. జైలు అధికారులు... గజల్ శ్రీనివాస్‌కు 1327 నెంబర్ ను కేటాయించారు. మరోవైపు న్యాయమూర్తి రిమాండ్ ప్రకటించిన వెంటనే గజల్ శ్రీనివాస్ తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేశారు. దీనిపై కోర్టులో వాదోపవాదనలు జరిగిన అనంతరం బెయిల్ పిటిషన్ ను న్యాయమూర్తి రద్దు చేశారు. అలాగే గజల్ శ్రీనివాస్ ను రెండు వారాల కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటీషన పై విచారణ రేపటికి వాయిదా పడింది. -
గజల్ శ్రీనివాస్ తండ్రిలాంటివారు..
-
గజల్ శ్రీనివాస్ కు 10రోజులు రిమాండ్
-
చంచల్ గూడ జైలుకు గజల్ శ్రీనివాస్
సాక్షి, హైదరాబాద్ : లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన గజల్ శ్రీనివాస్‌కు నాంపల్లి కోర్టు ఈ నెల 12 వ తేదీ వరకూ జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. రేడియో జాకీ ఫిర్యాదుతో ఈ రోజు తెల్లవారుజామున అరెస్ట్ చేసిన గజల్ శ్రీనివాస్‌ను మంగళవారం మధ్యాహ్నం పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. కోర్టు రిమాండ్ అనంతరం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు. అలాగే గజల్ శ్రీనివాస్‌ను రెండు వారాలపాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు గజల్ శ్రీనివాస్ తరఫున ఆయన న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మరికాసేపట్లో బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరగనున్నాయి. సేవ్ టెంపుల్ పేరుతో అమ్మాయిలను వేధించినట్లు గజల్ శ్రీనివాస్‌పై ఆరోపణలు ఉన్నాయి. -
ఆ అమ్మాయే మసాజ్ చేస్తానంది : ‘గజల్’ శ్రీనివాస్
సాక్షి, హైదరాబాద్ : మహిళా రేడియో జాకీని లైంగికంగా వేధించిన కేసులో అరెస్టైన ‘గజల్’ శ్రీనివాస్ అలియాస్ కేసిరాజు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. యాక్సిడెంట్ గాయాలతో బాధపడుతున్న తనకు ఆ అమ్మాయే ఇష్టపూర్తిగా మసాజ్ చేసిందని, అయితే ఆమె పట్ల తనకు ఎలాంటి చెడు ఉద్దేశం లేదని చెప్పుకొచ్చారు. శ్రీనివాస్‌కే చెందిన ఆలయవాణి వెబ్ రేడియోలో జాకీగా పనిచేస్తున్న యువతి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు మంగళవారం చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆత్మసాక్షిగా చెబుతున్నాను : ‘‘ఆత్మసాక్షిగా చెబుతున్నాను. నేను మహిళల్ని గౌరవిస్తాను. ఆ అమ్మాయి మా సంస్థలోనే పనిచేస్తుంది. నామీద ఎందుకు ఫిర్యాదు చేసిందో అర్థం కావడంలేదు. కొద్ది రోజుల కిందట నాకు యాక్సిడెంట్ అయింది. అందువల్ల బాడీలో కొన్నిచోట్ల కాల్షియమ్ పేరుకుపోయింది. దాన్ని నియంత్రించడానికి రెగ్యులర్‌గా మసాజ్ చేయించుకుంటాను. ఒకరోజు ఫిజిషియన్ రాకపోయేసరికి ఆ అమ్మాయే ముందుకొచ్చి.. మసాజ్ చేస్తానంది. నేను వద్దన్నా వినకుండా మసాజ్ చేసింది. నాకు ఆమెపట్ల ఎలాంటి బ్యాడ్ ఇంటెన్ష్ లేదు..’ అని గజల్ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. పక్కాగా ఆధారాలు.. అందుకే అరెస్ట్ : సాధారణ ఫిర్యాదులకు భిన్నంగా నేరానికి సంబంధించిన పూర్తి ఆధారాలు లభించడంతోనే గజల్ శ్రీనివాస్‌కు నోటీసులు లాంటివి ఇవ్వకుండా నేరుగా అరెస్టు చేశామని పంజాగుట్ట ఏసీపీ విజయ్ కుమార్ తెలిపారు. ‘బాధితురాలు బయటి ఊరి నుంచి వచ్చి ఇక్కడ(హైదరాబాద్‌లో) ఓ హాస్టల్లో ఉంటూ గజల్ శ్రీనివాస్‌కు చెందిన రేడియోలో పనిచేస్తోంది. తాను లైంగిక, మానసిక వేధింపులకు గురయ్యానంటూ ఫిర్యాదు ఇవ్వడమేకాక.. సంబంధిత వీడియో, ఆడియో రికార్డులను కూడా బాధితురాలు అందించారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్లు 354, 354ఏ, 509ను అనుసరించి కేసులు నమోదుచేశామని చెప్పారు. ఇవాళ మధ్యాహ్నం గజల్ శ్రీనివాస్‌ను నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. (చదవండి : లైంగిక వేధింపులు ; ‘గజల్’ శ్రీనివాస్ అరెస్ట్) -
ఆత్మసాక్షిగా...నా తప్పేం లేదు..
-
లైంగిక వేధింపుల కేసులో గజల్ శ్రీనివాస్ అరెస్ట్
-
భారతీయ సంస్కృతిలో ఆలయాలది విశిష్ట చరిత్ర
గజల్ శ్రీనివాస్ ఘంటసాల : భారతీయ సంస్కృతిలో గ్రామ దేవత, దేవాలయాలకు విశిష్ట చరిత్ర ఉందని మాస్ట్రో గజల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఘంటసాలలో మంగళవారం ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన సాక్షితో మాట్లాడారు. ఘంటసాలలో శ్రీకోట ముత్యాలమ్మ తల్లి, భీమవరంలో మాఊళ్ల అమ్మవారు, కొల్లేరులో పెద్దింటి అమ్మవారు ఇలా పలు ప్రాచీన దేవాలయాలు ఉన్నాయన్నారు. ఆయా దేవతలే గ్రామాన్ని రక్షిస్తాయనే నమ్మకం ప్రజల్లో ఉండేదని చెప్పారు. నేడు ఆదాయం ఉన్న దేవాలయాలను ప్రభుత్వం తీసుకుని ఆదాయం లేని వాటిని ప్రజలకు వదిలేసిందని ఆరోపించారు. గ్రామ దేవతల ఆలయాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని, మరికొన్ని చారిత్రక ఆలయాలు శిథిలమై పోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామ దేవతల ఆలయాల సుందరీకరణ, పురాతన దేవాలయాల జీవోద్ధరణ చేయాల్సిన అవసరముందన్నారు. అర్చకులను ఆదుకోవాలి.. రాబోయే కృష్ణా పుష్కరాల సందర్భంగా కృష్ణా పరివాహక ప్రాంతంలో సుమారు 15 కోట్ల మంది భక్తులు స్నానమాచరించే అవకాశం ఉందని శ్రీనివాస్ తెలిపారు. ఈపుష్కరాలకు వచ్చే భక్తులు దేవాలయాలను సందర్శించుకునే విధంగా తగిన ఏర్పాట్లు, ప్రచారం పెద్ద ఎత్తున చేపట్టాల్సిన అవసరముందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వేలాది మంది అర్చకుల పరిస్థితి దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ప్రభుత్వం తెల్లరేషన్‌కార్డులు ఇచ్చి అందరికి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కార్డులు ఇప్పించాలని ముఖ్యమంత్రిని కోరారు. అలాగే ఆయాప్రాంతాల్లో ఉన్న బుర్రకథ, భక్తిసంగీతం అందించే కళాకారులతో పాటు వివిద కళాకారులను దేవదాయ, ధర్మదాయశాఖ దేవాలయాల్లో ఆస్థాన విధ్వాంసులుగా నియమించి వారికి సముచిత గౌరవం ఇవ్వాలని కోరారు. కృష్ణాష్టమిని గోపూజా దినోత్సవంగా ప్రకటించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎండోమెంట్ భూముల కౌలు చట్టాన్ని మార్చి దేవదాయ, ధర్మదాయశాఖ భూములను గోక్షేత్రాలుగా మార్చేందుకు చర్యలు తీసుకోవడం వలన ఎన్నో వట్టిపోయిన గోవులకు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. శ్రీకోట ముత్యాలమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న స్వాతిపత్రిక అధినేత వేమూరి బలరామ్, మరి కొందరు దాతలను అభినందించారు. ప్రతి ఒక్కరూ పురాతన దేవాలయాల జీవోద్ధరణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. -
ఇల్లు ఇల్లులాగా లేదు!
ఫన్ డాక్టర్ ఆదివారం సాయంత్రం. ఒక్కడినే ఇంట్లో. గజల్ శ్రీనివాస్ మధుర స్వరం... సీడీ ప్లేయర్ నుంచి అలలు అలలుగా గుండెను తాకుతోంది. ఎందుకో మధ్యాహ్నం భోజనాల వేళ నుంచి వెలితిగా, గుబులుగా ఉంది. నేను, నాన్న మాత్రమే ఉన్నాం. మా అమ్మాయి కావ్య డ్యూటీలో ఉంది. అబ్బాయి ఆదర్శ్‌ని తీసుకుని నా వైఫ్ భవాని, చెల్లెలి కొడుకు పెళ్లికి అమెరికా వెళ్లింది. ప్రతి ఆదివారం ఉదయం కుటుంబమంతా కలిసి భోజనం చేయాలని మా ఆవిడ ఆన. బాహుబలిలో శివగామి ఆన లాంటిదే. అంత పవర్ఫుల్. కాబోయే అల్లుడితో సహా అందరం గత రెండు నెలల నుంచి పాటించడానికి పాట్లు పడుతున్నాం. పిల్లలందరూ ఏవో వంకలు చెప్పి జంప్ చేయాలని చూస్తారు కాని, నేను తెగ బుద్ధిగా డైనింగ్ టేబుల్ దగ్గర హాజర్. ‘మనిద్దరం వయసు మీద పడుతున్నవాళ్లం. పిల్లలకు మనతో బోరులే వదిలేద్దాం. వాళ్ల మానాన వాళ్లని ఆదివారం పండుగ చేసుకోనీ’ అంటే మా ఆవిడ... ‘‘దీన్ని నాన్ నెగోషియబుల్ ఫ్యామిలీ బాండింగ్ అంటారు. ఈ కొంచెంసేపన్నా కలవకపోతే కుటుంబ బంధాలు, మానవ సంబంధాలు అంత రించుకుపోతాయి’’ అని ఉపదేశం చేసింది. అలా సండే లంచ్ బాండింగ్ - అంటే ఆదివార భోజనానురాగబంధం అలవాటై పోయి, ఈరోజెవరూ లేకపోయేసరికి వెలితిగా అనిపించిందన్నమాట. ‘ఆ! నీ కటింగులు, ఓవరాక్షన్లు మాకు తెలియనివా పితృదేవా, అమ్మ లేకపోతే చాన్స్ పే డ్యాన్స్ ఫక్కీలో తెగ రెచ్చిపోయి ఎంజాయ్ చేస్తా వుగా, ఈ వెలితి, గుబులు అని హరికథలు ఎందుకు’ అని నా పిల్లలిద్దరూ మూకుమ్మ డిగా అరుస్తున్నట్టు ఓ చిన్న ఫీలింగ్ అంత రాంతరాలలో. కాని, నిజంగా సత్తె ప్రమాణంగా మా లేడీస్ ఇంట్లో లేకపోతే ఏం తోచి చావదు. ఇదేదో బహు వచనంలా ఉందేమిటి చెప్మా అని ఆశ్చర్య పడమాకండి. ఏకవచనమే గౌరవంతో కలిపినప్పుడు అలా బహువచనంలా మారుతుందన్నమాట. మూడు ముళ్లు వేసి మూడు పదుల సంవత్సరాలైపోయాయి. ఫర్వాలేదు ఇంకా బాగానే ఉన్నాం. మా గురువుగారు కనపడ్డ వాళ్లని ‘‘ఆర్ యూ హ్యాపీ ఆర్ మ్యారీడ్’’ అని అడుగుతుండేవారు. ఆయన ఉద్దేశం అది కాని, ఇది కాని ఏదో ఒకటే సాధ్యమని. అలా పెళ్లి మీద బోలెడన్ని జోకులు, సూక్తులు. ఆస్కార్ వైల్డ్ అయితే పెళ్లి సూక్తులతో ఓ చిన్నపాటి పుస్తకమే రాసేశాడు. ఆయన వైవాహిక జీవితం గురించి పెద్ద తెలీదనుకోండి. ‘‘అంటే మీ ఇద్దరూ పాలు నీళ్లలా, దాసరి ఎపుడో రాసినట్టు - సైకిల్‌కి రెండు చక్రాల్లా కలిసి మెలిసి సొలసి అలసిపోయారా, అంత సీనుందని మీరంటే మేము నమ్మాలా’’ అని మీలోని భార్యలూ భర్తలూ నన్ను నిలదీస్తున్నారని తెలుసు నాకు. హిందీ సీరియల్స్లోలాగా ‘కర్వా చౌత్’ (ఏదో ఒక పండుగ ఉంటుంది, అదృష్టం అది తెలుగులో లేనట్టుంది) రోజున మా ఆవిడ చందమామను చూసి, ఆ తర్వాత నా ముఖారవిందం కాంచడం లాంటి పనులేవీ చేయదు. రోజూ ఉదయాన లేచి నా కాళ్లెక్కడున్నాయాని వెతికి దణ్నం పెట్టుకుని, మంగళసూత్రాలు కళ్లకద్దుకోవం కూడా చేయదు. పోనీ కనీసం ఏ ఏకాదశి నాడో, ద్వాదశి నాడో మొగుడి ఆరోగ్యం కోసం పస్తులన్నా ఉంటుందా అంటే అదీ లేదు. మరి మీ ఇద్దరి దాంపత్యంలో ఏముందని ఇలా ఆదివారం దొరింది కదాని సాక్షిలో రాసేసి, మా పెళ్లాలకి లేక మా మొగుళ్లకి ఆత్మ న్యూనతా భావాన్ని, అనురాగ రహిత యాంత్రిక దాంపత్య అభద్రతా భయాన్ని అంటగడుతున్నావ్ అని మళ్లీ మీరు ఆవేశపడుతున్నారని నాకు బాగా తెలుసు. వస్తున్నా, వస్తున్నా, అసలు పాయింట్‌కే వస్తున్నా. సినిమాల్లో, టీవీ సీరియల్స్‌లో చిత్రీకరించే ఉత్తమ భారత నారీమణి చేసే పనులు ఏ ఒక్కటీ చేయకపోయినా, దాసరిగారి దృష్టిలో మా ఆవిడ సైకిల్ చక్రం కాలేకపోయినా, విశ్వనాథ్‌గారి సృష్టిలో - జయప్రద బొట్టు చెరిగిపోతుందని కమల్‌హాసన్ వానకి చెయ్యి అడ్డం పెట్టినట్టు నేను పెట్టకపోయినా, మేమిద్దరం ఆది దంప తులం కాకపోయినా... ఆనంద దంప తులం అని మాత్రం కచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే తిట్టుకుని, కొట్టుకుని, సిగలు పట్టుకుని, ఏ రోజూ ప్రతీకార జ్వాలతో నిద్దరపోయినట్టు గుర్తు లేదు నాకు. అది చాలు మేము ఆనం దంగా ఉన్నామని నిరూపించడానికి. అలా అని మేమిద్దరం ఒకే రుచి, ఒకే అభిరుచి ఉన్న రెండు శరీరాలు, ఒకటే ఆత్మ టైపు కాదు. అసలు ఆ మాటకొస్తే, మా ఇద్దరి ఇష్టాలు, దృక్పథాలు ఎక్కడా కలవ్వు. బెడ్రూమ్లో ఫ్యాన్ స్పీడ్ దగ్గర్నుంచి మా విభేదాలు మొదలు. నాకు ఒకటో నంబరులో మలయ మారుతంలా కావాలి. ఆమెకి ఐదో నంబరులో చండ ప్రచండంగా కావాలి. ఆమె తక్కువ మాట్లాడుతుంది. ఆ రెండు మాటలు కూడా చించి చించి ఆలోచించి వాల్యూమ్ వన్‌లో వదులుతుంది. మన స్టైల్ వేరు. మనం ముందు మాట్లాడేస్తాం. అదీ వాల్యూమ్ ఫైవ్‌లో. తరువాత అవసరమైతే ఆలోచిస్తాం. ఆమెకు సంవత్సరానికి ఖర్చయ్యే మాటలు మనం ఒక్కరోజులో వాడేస్తాం. అందుకే తను ముద్దుగా నాకు ‘వెర్బల్ డయేరియా - కాన్స్టిపేషన్ ఆఫ్ థాట్’ అంటే ‘ఆలోచనా మలబద్దకం - మాటల విరేచనాలు’ అనే రోగాన్ని అంటగట్టింది. అయినా ఇలాంటి చిన్న రోగాల గురించి మనం భయపడతామా? మాటలు మానేస్తామా?! ఆమెకి ఇద్దరి కంటే ఎక్కువ ఉంటే గుంపు. మనకి కనీసం వంద మందైనా ఉంటేనే ఇంపు. ఆమెకి సినిమాలంటే కంపు. మనకి సినిమా లంటే సొంపు. ఇంత కంటే ఎక్కువ రైమ్‌లు వాడితే ఆమె నన్ను చంపు. ఇన్ని భేదాలు, విభేదాలు ఉన్నా మేమిద్దరం హ్యాపీగా ఎలా ఉన్నామా అని మా ఆనంద దాంపత్య రహస్యం మీరు కూడా తెలుసుకుని - ‘‘పచ్చని మన కాపురం పాలవెలుగై, మణి దీపాల వెలుగై కలకాలం నిలవాలి’’ అని డ్యూయెట్ పాడుకోవడానికి రెడీ అయిపోతున్నా రని తెలుసు నాకు. ఇంతకీ రహస్యం ఏమిటంటారు! ఏమీ లేదండీ బాబూ - అడ్జస్ట్ అయిపోవడమే. గివ్ అండ్ టేక్. అంటే కొంచెం ఇష్టపడు - కొంచెం కష్టపడు. అపుడపుడూ కొంచెం నష్టపడు - అవసరమైనపుడు. నేను ఎంత అడ్జస్ట్ అయ్యానో తెలీదు కానీ తను నాకోసం, నా ఆనందం కోసం బోల్డన్ని త్యాగాలు చేసింది. తనకి ఇష్టం లేకపోయినా, నా నిర్ణయాలకి తలొగ్గి ఈ పరుగులో నాకు తోడుగా నిలిచింది. పిల్లల పాలనా పోషణా తనే చూసుకుంది. తలకాయతో ఆలోచించి రేషనల్‌గా చేయాల్సిన పనుల స్థానంలో గుండె కాయతో స్పందించి ఎమోషనల్‌గా తీసుకున్న నిర్ణయాల ఫలితాల అలజడి నన్ను ముంచేస్తున్న పుడు తన మనోనిబ్బరం ఓ గొడుగై నిలిచింది. ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకింత సర్దుకుని, ఒకింత హత్తుకుని ప్రయాణం చేసే అలవాటు అంతరించిపోయింది ఈ రోజుల్లో. బలవంతంగా వ్యక్తిత్వాన్ని చంపుకుని, బానిస బతుకులు వెళ్లబుచ్చమని సలహా ఇవ్వడం లేదు నేను. ఆ మధ్య ఎవరో చెప్పారు. ఎంగేజ్మెంట్ పార్టీలో... కాబోయే మొగుడు లేకిగా మూడు కోడిగుడ్లు ఒకేసారి వడ్డించుకున్నాడని, ఓ అమ్మాయి - ‘ఈ మొగుడు క్యాన్సిల్’ అనేసి ఎగిరిపోయిందట. మరీ అతిగా లేదూ! గజల్ శ్రీనివాస్ పాట మనసును తడిమే స్తోంది, తడిపేస్తోంది. ‘‘ఇల్లు ఇపుడు ఇల్లులాగా లేనే లేదు. ఊరు నుంచి తను ఇంకా రానే లేదు - గమనించావో లేదో ఓ మనసా దాంపత్యం లాంటి మైత్రి లేనే లేదు.’’ - డా॥గురవారెడ్డి -
గజల్ శ్రీనివాస్, మాధవి లత 'అనుష్టానం'
హైదరబాద్ : తన వినులవిందైన గజల్ గానంతో శ్రోతలను సమ్మోహితుల్ని చేసి... గజల్‌నే ఇంటి పేరుగా మార్చుకున్న గాయకుడు గజల్ శ్రీనివాస్. గజల్ శ్రీనివాస్ హీరోగా అనుష్ఠానం చిత్రం తెరకెక్కుతుంది. సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల కానున్న ఆ చిత్రం షూటింగ్ శరవేగంతో జరుపుకుంటుంది. గజల్ శ్రీనివాస్ సరసన మాధవి లత నటిస్తున్నారు. భార్యాభర్తల మధ్య నెలకొన్న సున్నితమైన అంశాలే ఇతివృత్తంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. 1950లో ప్రముఖ కవి గుడిపాటి వెంకటాచలం రచించిన 'అనుష్టానం' కథ ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. ఈ చిత్రానికి కృష్ణ వాసా దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే అనుష్టానానికి స్వరాలు కూడా దర్శకుడు కృష్ణ అందిస్తున్నారు. -
నెల్లూరులో శాంతి యాత్రను ప్రారంభించిన మేకపాటి
నెల్లూరు: వందే గాంధీయం పేరుతో శాంతి యాత్రను నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆదివారం స్థానిక గాంధీ విగ్రహాం వద్ద ప్రారంభించారు. పల్లిపాడులోని గాంధీ ఆశ్రమం వరకు ఈ పాదయాత్ర సాగుతుంది. ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ నేతృత్వంలో పల్లెపాడు సబర్మతి గాంధీ ఆశ్రమం, నెల్లూరు రెడ్ క్రాస్ సొసైటీలు సంయుక్తంగా ఈ పాదయాత్రను ఏర్పాటు చేశాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎన్.శ్రీకాంత్, ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, సంజీవయ్య, జడ్పీ ఛైర్మన్ రాఘవేంద్రరెడ్డితోపాటు పలువురు నాయకులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సబర్మతి ఆశ్రమానికి విస్తృత ప్రచారం కల్పించే ఉద్దేశ్యముతో వందే గాంధీయం శాంతి యాత్రను ఏర్పాటు చేశారు. ఈ పాదయాత్ర కార్యక్రమంలో భారీగా విద్యార్థులు, నగర ప్రజలు పాల్గొన్నారు. -
పౌర్ణమి శోభ
జిల్లా అంతటా ఆదివారం కార్తీక పౌర్ణమి శోభ వెల్లివిరిసింది. శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆధ్యాత్మిక శోభతో అలరారాయి. భక్తులు నదీ, సముద్ర స్నానాలు చేసి మహాశివుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల వద్ద దీపారాధనలు, ప్రత్యేక దీపాలంకరణలు చేసి, నదిలో దీపాలు వదిలి పూజలు నిర్వర్తించారు. మంగినపూడి, హంసలదీవి, కృష్ణానదీ తీరప్రాంతాలు భక్తులతో నిండిపోయాయి. విజయవాడలో కృష్ణమ్మకు పంచహారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. పెనుగంచిప్రోలులో తిరుపతమ్మ దేవస్థానం ఆధ్వర్యంలో హారతులు ఇచ్చి పూజలు నిర్వర్తించారు. విజయవాడ, న్యూస్‌లైన్ : కృష్ణానదీ తీరం కార్తీక శోభతో వెల్లివిరిసింది. ఆదివారం తెల్లవారుజాము నుంచి పుణ్యస్నానాలకు, సాయంత్రం కృష్ణమ్మ మహా హారతులను తిలకించేందుకు వచ్చిన భక్తులతో దుర్గాఘాట్ కిటకిటలాడింది. పద్మావతి ఘాట్, సీతమ్మవారి పాదాలు, భవానీపురం పున్నమి ఘాట్ కూడా భక్తజనసంద్రమయ్యూయి. తెల్లవారుజామున రెండు గంటల నుంచి ప్రారంభమైన రద్దీ అంతకంతకు పెరిగింది. తెల్లవారేసరికి క్యూలైన్ రథం సెంటర్లోని బొడ్డుబొమ్మ సెంటర్‌కు చేరింది. ఘాట్లలో జల్లుస్నానాలకు ఏర్పాట్లు చేశారు. వైభవంగా పుణ్యనదీ హారతులు దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం దుర్గాఘాట్‌లో నిర్వహించిన పుణ్యనదీ హారతుల కార్యక్రమానికి భక్తులు అశేషంగా తరలివచ్చారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు సాయంత్రం 5 గంటల నుంచే వేచి ఉన్నారు. తొలుత దేవస్థానం తరఫున కృష్ణమ్మకు పట్టుచీర, పసుపు కుంకుమ, పూజా ద్రవ్యాలను ఆలయ వైదిక కమిటీ సభ్యుడు మల్లయ్య, స్మార్త పాఠశాల విద్యార్థులు దుర్గాఘాట్‌కు తీసుకొచ్చారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కోలాట నృత్యాలతో ఊరేగింపు వైభవంగా జరిగింది. అనంతరం కృష్ణమ్మకు ఈవో ప్రభాకర శ్రీనివాస్ దంపతులు పూజలు నిర్వహించారు. ఓంకార, కుంభ, సింహ, నక్షత్ర, నాగ హారతులు ఇచ్చారు. పుణ్యనదీ హారతుల విశిష్టతను పరిపూర్ణానంద స్వామి, మాతా శివచైతన్య వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకట రామారావు, గజల్ శ్రీనివాస్ తదితరులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ స్థానచార్య విష్ణుభట్ల శివప్రసాద్‌శర్మ, వైదిక కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. నదీ హారతుల అనంతరం మహిళలు పెద్ద ఎత్తున కృష్ణమ్మకు పూజలు నిర్వహించి కార్తీక దీపాలు వదిలారు. ఈ సందర్భంగా కనకదుర్గానగర్‌లో ఏర్పాటుచేసిన సాంస్కృత్రిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కిటకిటలాడిన దుర్గమ్మ సన్నిధి కార్తీక పౌర్ణమి, ఆదివారం కావడంతో ఇంద్రకీలాద్రి భక్తులతో పోటెత్తింది. కృష్ణానదిలో పుణ్యస్నానాల అనంతరం భక్తులు దుర్గామల్లేశ్వరస్వామిని దర్శించుకున్నారు. కాగా, కార్తీక వనసమారాధన నేపథ్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారికి సన్నిధికి చేరుకున్నారు. కనుల పండువగా పుణ్యనదీ హారతి పెనుగంచిప్రోలు : కార్తీక పౌర్ణమి, మనగుడి కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి స్థానిక మునేరులో పుణ్యనదీ హారతిని కనుల పండువగా నిర్వహించారు. ముందుగా గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి విగ్రహాలను పల్లకీపై ఊరేగించారు. అనంతరం మునేరులోకి తీసుకెళ్లి మండపంపై ప్రతిష్టిం చారు. అనంతరం మహిళలు లలితా సహస్రనామం, అర్చకులు గంగాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో ఎన్.విజయ్‌కుమార్ గంగమ్మ తల్లికి పసుపు, కుంకుమ, సారె సమర్పించారు. అమ్మవారికి పంచహారతులు, కర్పూర హారతులు, శాంతి హారతి ఇచ్చారు. భక్తులకు ఆలయం వారే అరటి దొప్పలు, ఒత్తులు అందించగా వేల సంఖ్యలో మహిళలు మునేరులో దీపహారతులు వదిలారు. ఆలయ ఈఈ వైకుంఠరావు, ఏఈవోలు సీహెచ్ ప్రసాదరావు, మేడా గోపాలరావు పాల్గొన్నారు. -
సభపై 7 కేసులు నమోదు
గజల్ శ్రీనివాస్‌ను లోపలికి అనుమతించటంపై ఫిర్యాదు దర్యాప్తు బాధ్యతలు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కు నిందితుల గుర్తింపునకు వీడియో ఫుటేజ్‌ల పరిశీలన సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎన్జీఓలు శనివారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించినృ ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు సంబంధించి స్థానిక సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో శని, ఆదివారాల్లో ఏడు కేసులు నమోదయ్యాయి. రెచ్చగొట్టేలా ప్రవర్తించటం, బెదిరించటం, తీవ్రంగా దాడి చేయటం, హత్యాయత్నం తదితర సెక్షన్ల కింద వీటిని నమోదు చేశారు. ఉద్యోగి కాని గజల్ శ్రీనివాస్‌ను సభకు అనుమతించటం, సభలో ఆయన ప్రసంగించడంపై అందిన ఫిర్యాదును జనరల్ డైరీలో నమోదు చేసిన పోలీసులు కేసు నమోదుపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. 7 కేసులను దర్యాప్తు నిమిత్తం హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) అధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)కు బదిలీ చేశారు. సభలో పాల్గొనేందుకు బషీర్‌బాగ్ చౌరస్తా వైపు నుంచి నిజాం కాలేజీ హాస్టల్ మీదుగా స్టేడియం ‘జీ’ గేట్ వద్దకు వచ్చిన ఓ వ్యక్తి చేష్టలు వివాదాస్పదమయ్యాయి. నినాదాలు చేస్తున్న హాస్టల్ విద్యార్థులను ఉద్దేశించి అతడు రెచ్చగొట్టే సంజ్ఞ చేయడంతో విద్యార్థులు భగ్గుమన్నారు. ఆ తరవాత ఒక్కసారిగా హాస్టల్ లోపల నుంచి రాళ్ల వర్షం కురిపించడంతో సభకు వెళ్తున్న పలువురు గాయపడ్డారు. దీనికి సంబంధించి అందిన ఫిర్యాదుతో వివాదాస్పదంగా సంజ్ఞలు చేసిన గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. సభ ప్రారంభమైన తరవాత వేదిక సమీపంలో ‘జై తెలంగాణ’ నినాదాలు చేసిన తమపై కొందరు దాడి చేశారంటూ ఏఆర్ కానిస్టేబుళ్లు కయ్యాడ శ్రీనివాస్, శ్రీశైలం ఇచ్చిన ఫిర్యాదులతో మరో రెండు కేసుల్ని నమోదు చేశారు. అంబేద్కర్ విగ్రహం చౌరస్తాలో ఆందోళన చేస్తున్న ఎమ్మార్పీఎస్ కార్యకర్తల అరెస్టు సందర్భంగా నిరసనకారులు ఓ పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. అసెంబ్లీ ఎదురుగా తెలంగాణ న్యాయవాదుల్ని అరెస్టు చేస్తున్నప్పుడు నాలుగు పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ రెండు ఘటనలకు సంబంధించి సైఫాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. తమపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఇచ్చిన ఫిర్యాదుతోపాటు సభకు వచ్చిన కొందరు తనపై దాడి చేశారంటూ ఓయూ జేఏసీ నేత కన్వీనర్ బాలరాజు యాదవ్ ఫిర్యాదు మేరకు మరో రెండు కేసులు రిజిస్టర్ చేశారు. ఈ ఏడు కేసుల్లో నిందితుల్ని గుర్తించడం కోసం స్టేడియం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియో టేపులను పరిశీలిస్తున్నారు. వీటిని విశ్లేషించిన తరువాత చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. గజల్ శ్రీనివాస్ సభలోకి ప్రవేశించిన తీరును కూడా వీడియో ఫుటేజ్‌ల ద్వారా గుర్తించాలని నిర్ణయించారు. కాగా సేవ్ ఆంధ్రప్రదేశ్ సభను ఎల్బీస్టేడియంలో నిర్వహించిన ఏపీఏన్జీవో నాయకులపై తెలంగాణ విద్యార్థి, ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు హైదరాబాద్‌లోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. సీమాంధ్రుల బస్సులపై దాడి ఘటనలో 13 మంది అరెస్ట్! ఇదిలా ఉండగా సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు హాజరై హైదరాబాద్ నుంచి తిరిగి వెళుతున్న సీమాంధ్రుల బస్సులపై దాడి ఘటనలో 13 మంది అనుమానితుల్ని అదుపులో తీసుకున్నట్టు తెలిసింది. ఈ ఘటనపై హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
మనోగళం: ఎప్పుడూ అంత ఆనందం కలగలేదు!
ఇతరుల్లో మీకు నచ్చేది/నచ్చనిది? నచ్చేది ప్లీజింగ్ పర్సనాలిటీ. నచ్చనిది అహంభావం. మీలో మీకు నచ్చేది? నాలోని ప్రేమతత్వం, మానవత్వం. నేను ప్రపంచాన్ని ప్రేమిస్తాను... మనస్ఫూర్తిగా! మీలో మీకు నచ్చనిది? కాస్త త్వరగా విసిగిపోతాను. కష్టపడి ఓ యాభై శాతం తగ్గించుకున్నాను. పూర్తిగా మారడానికి ట్రై చేస్తున్నాను. మీ ఊతపదం? నచ్చినవాళ్లందరినీ ‘బంగారం’ అంటుంటాను. మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి/ఎందుకు? మా అమ్మ. నిజమైన ఆత్మానందం ఎదుటివారికి సాయపడటంలోనే ఉంటుందని ఆవిడే చెప్పింది నాకు. ఎందుకిలా చేశానా అని మీరు బాధపడేది ఏదైనా ఉందా? లేదు. నేను వేసే ప్రతి అడుగూ భగవత్ప్రేరణతోనే పడుతుందని నమ్ముతాను. కాబట్టి చేసిన దానికి ఎప్పుడూ చింతించను. అత్యంత సంతోషపడిన సందర్భం? 2000వ సంవత్సరం, జూలై 30. నా కూతురు సంస్కృతి పుట్టిన రోజు. తనని నేను తొలిసారి చూసిన రోజు. నా జీవితంలో ఆ రోజు కలిగినంత ఆనందం మరెప్పుడూ కలగలేదు. అత్యంత బాధ కలిగించిన సందర్భం? సత్య సాయిబాబా మరణం. ఆ రోజు నేను పడిన బాధ వర్ణనాతీతం. ఆకలి విలువ తెలిసిన క్షణం? భారతీయ విద్యాభవన్‌లో పని చేస్తున్నప్పుడు ఓసారి (1986) నా ఫుడ్ కూపన్స్ అయిపోయాయి. మళ్లీ తీసుకోవాలంటే జీతం రావాలి. అంతవరకూ భోజనం పెట్టమని క్యాంటీన్ వాడిని అడగడానికి మనసు రాలేదు. దాంతో రెండు రోజుల పాటు నీళ్లు మాత్రమే తాగాను. అప్పుడు తెలిసింది ఆకలి బాధ ఎలా ఉంటుందో! ఎవరికైనా క్షమాపణ చెప్పాల్సి ఉందా? ఉంటే ఎవరికి? ఎవరినైనా బాధపెట్టానని గ్రహిస్తే వెంటనే క్షమాపణ చెప్పేస్తాను. ఒకవేళ గ్రహించలేకపోయి ఎవరికైనా చెప్పకుండా ఉంటే... ఈ ఇంటర్వ్యూ ద్వారా ఇప్పుడే చెప్పేస్తున్నాను. నన్ను క్షమించండి. మీ గురించి ఎవరికీ తెలియని ఓ విషయం? నేను పాటలు పాడతానని అందరికీ తెలుసు కదా! కానీ నేను డ్యాన్స్ కూడా చేస్తాను. ఇంట్లో నా చిట్టితల్లి సంస్కృతి, నేను పాటలు వింటూ డ్యాన్స్ చేస్తుంటాం! మిమ్మల్ని భయపెట్టే విషయం ఏమైనా ఉందా? మోసం అంటే భయం. మోసం చేసేవాళ్లంటే ఇంకా భయం. ఎలాంటి సమయాల్లో అబద్ధాలాడతారు? జీతం కోసం ఆడతాను తప్ప జీవితం కోసం ఆడను. వృత్తిపరంగా కొన్నిసార్లు చెప్పక తప్పదు. దానివల్ల ఎవరికీ నష్టం ఉండదు. కానీ వ్యక్తిగతంగా చెప్పే అబద్ధాలు అవతలివారికి హాని కలిగిస్తాయి. అందుకే అలాంటివి చెప్పను. ఎలాంటి వాటికి ఎక్కువ ఖర్చు పెడుతుంటారు? సేవా కార్యక్రమాలకు ఎక్కువ ఖర్చుపెడతాను. తర్వాత నా భార్య సురేఖ కోసం, నా కూతురి కోసం ఖర్చు పెడతాను. ఎప్పుడైనా ఏదైనా షాప్‌కి వెళ్తే వాళ్లిద్దరికీ పది, పదిహేను జతల బట్టలు ఒకేసారి కొనేస్తుంటాను! మీరు నమ్మే సిద్ధాంతం...? మనుషుల మెచ్చుకోలు కోసం కాకుండా భగవంతుని మెచ్చుకోలు కోసం బతకాలి. ఎప్పటికైనా చేసి తీరాలనుకునేది? ప్రపంచ శాంతి కోసం ఉద్యమించాలన్నది నేనేనాడో ఏర్పరచుకున్న లక్ష్యం. ఇన్నాళ్లూ అదే చేశాను. ఇప్పుడూ అదే చేస్తున్నాను. ఇక ముందు కూడా ఆ దిశగానే కృషి చేస్తాను. దేవుడు కనిపిస్తే ఏ వరం అడుగుతారు? అందరికీ సమదర్శన దృష్టి ఇవ్వమని అడుగుతాను. అది వచ్చిననాడు ఈ ప్రపంచమే మారిపోతుంది. నదికి సమదర్శన దృష్టి ఉంది. చెట్టుకు కూడా ఉంది. కానీ హార్దిక సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిపోయాక మనిషికి ‘సమదర్శన దృష్టి’ పోయి ‘తన దర్శన దృషి’్ట వచ్చింది. మీ జీవితంలో ఒకే ఒక్క రోజు మిగిలివుందని తెలిస్తే... ఆ రోజును ఎలా గడుపుతారు? నా భార్యాబిడ్డలతో కలిసి భగవంతుడిని ధ్యానం చేస్తూ గడిపేస్తాను. మరణానికి భయపడతారా? చావుకు భయపడుతూ... ప్రతిరోజూ చస్తూ బతకడం నాకు నచ్చదు. మరణం రాక తప్పదు. ఎప్పుడొస్తుందో తెలియని దానికోసం భయపడటం అనవసరం. అందరికీ ఎలా గుర్తుండిపోవాలనుకుంటారు? గజల్ శ్రీనివాస్ ఒక కారణంతో పుట్టాడు, దానికోసమే జీవించాడు అని అంతా అనుకోవాలి. మళ్లీ జన్మంటూ ఉంటే ఎలా పుట్టాలనుకుంటారు? మళ్లీ జన్మ అంటే ఈ జన్మకు సీక్వెల్ కదా! అందుకే నేను గజల్ శ్రీనివాస్ 2గా పుట్టాలని కోరుకుంటాను. - సమీర నేలపూడి -
సాంస్కృతిక పోరాటం చేస్తా: గజల్ శ్రీనివాస్
హైదరాబాద్ : తెలుగువాళ్లందరూ సమైక్యంగా ఉండాలని తాను సాంస్కృతిక పోరాటం చేస్తున్నానని ప్రముఖ గజల్ గాయకుడు శ్రీనివాస్ చెప్పారు. అంతకు ముందు సేవ్ ఆంధ్రప్రదేశ్ సభలో పాల్గొనేందుకు వచ్చిన శ్రీనివాస్‌ను అనుమతి లేదని పోలీసులు అడ్డగించారు. తాను వంగపండు ప్రసాద్ రావులు కళాకారులుగానే సభకు హాజరయ్యామని ఆయన తెలిపారు. కళాకారులను అనుమతించాలని ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు కోరడంతో పోలీసులు గజల్ శ్రీనివాస్, వంగపండు ప్రసాదరావులను అనుమతించారు. అనంతరం వారు తమ గీతాలతో సభికులను అలరించారు. కాగా గజల్ శ్రీనివాస్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.