కోర్టు ఆవరణలో గజల్ శ్రీనివాస్ (ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్ : లైంగిక వేధింపుల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న గజల్ శ్రీనివాస్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. రూ.10వేల నగదు, ఇద్దరు వ్యక్తుల పూచికత్తు సమర్పించడంతోపాటు వారంలో రెండు సార్లు నిందితుడు పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని కోర్టు పేర్కొంది. తీర్పు కాపీలు పరిశీలించిన పిదప చంచల్‌గూడా జైలు అధికారులు శ్రీనివాస్‌ను విడుదలచేసే అవకాశంఉంది.
ఏ2 పార్వతికి కూడా : లైంగిక వేధింపులకు సంబంధించి గజల్ శ్రీనివాస్ సహాయకురాలు, ఏ-2 నిందితురాలిగా ఉన్న పార్వతికి కూడా కోర్టులో ఊరట లభించింది. పార్వతి పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను న్యాయమూర్తి అంగీకరించారు. దీంతో ఆమె అరెస్టు నుంచి తప్పించుకున్నట్లైంది.
వీడియోలు లీక్!: ప్రముఖ కళాకారుడిగా వెలుగొందుతున్న గజల్ శ్రీనివాస్ చీకటి వ్యవహారాలు వెలుగులోకి రావడంతో జనవరి 2న ఆయనను పంజాగుట్ట పోలీసులు అరెస్టుచేశారు. ఆయనకే చెందిన ‘సేవ్ టెంపుల్స్’సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనేది శ్రీనివాస్‌పై ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారానికి సంబంధించి వీడియో, ఆడియో ఆధారాలను కూడా బాధితురాలు అందించడంతో గజల్ మెడకు ఉచ్చుబిగుసుకుంది. కాగా, పోలీసుల చేతుల్లోని గజల్ వీడియోలు కొన్ని లీక్ కావడం సంచలనంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment