Nampally
-
చర్లపల్లి తరహాలో మరిన్ని స్టేషన్లు..
సాక్షి, హైదరాబాద్: ఆధునిక రైళ్లను పట్టాలెక్కిస్తున్న రైల్వే శాఖ ఇప్పుడు రైల్వే స్టేషన్లకు ఆధునిక రూపు కల్పిం చేందుకు భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. హైదరాబాద్‌లో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపై ఉన్న భారాన్ని తగ్గించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో నగర శివారులోని చర్లపల్లి స్టేషన్‌కు ఆధునిక భవనాన్ని నిర్మించిన తరహాలో.. రాష్ట్రంలోని ముఖ్య స్టేషన్లను సమూలంగా మార్చనుంది. రాష్ట్రంలో 40 స్టేషన్లకు కొత్త ఆధునిక భవనాలను నిర్మించేందుకు రూ.2,737 కోట్లను మంజూరు చేసింది. అమృత్ భారత్ స్టేషన్లుగా వీటిని గుర్తించిన రైల్వే శాఖ ఈమేరకు ఇటీవల నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం దేశంలోనే పెద్ద స్టేషన్లలో ఒకటైన సికింద్రాబాద్ లాంటి స్టేషన్లలో కూడా సరైన వసతులు లేవు.వాటిని ఆధునీకరించకపోవటం, క్రమంగా రద్దీ విపరీతంగా పెరిగిపోవటంతో ప్రయాణికులు చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఒకేసారి నాలుగైదు ముఖ్య రైళ్లు వచ్చిన సమయంలో, వాటిల్లోంచి ఎక్కి దిగే ప్రయాణికులతో పరిసరాలు కిక్కిరిసిపోయి సకాలంలో రైళ్ల వద్దకు చేరుకోలేక అవి వెళ్లిపోతున్న సందర్భాలు నిత్యకృత్యంగా మారాయి. సికింద్రాబాద్ స్టేషన్లో ఫుట్ఓవర్ బ్రిడ్జిపై ఆ సమయంలో ప్రయాణికులు ఎక్కడివారక్కడ నిలిచిపోయేంత రద్దీ ఉంటోంది. చూస్తుండగానే రైళ్లు వెళ్లిపోయి ప్రయాణికులు ఉసూరుమంటున్నారు. ఇక టికెట్ల జారీ, నిరీక్షణ సమయం, వీల్ చైర్లు, టాయిలెట్లు, ప్లాట్‌ఫామ్స్ మారే సమయం.. ఇలా అన్నీ ఇబ్బందులే.పెద్ద స్టేషన్లోనే పరిస్థితి ఇలా ఉంటే, చిన్నవాటిల్లో సమస్యలు మరింత తీవ్రంగా ఉంటున్నాయి. వీటన్నింటినీ పరిష్కరించటంతోపాటు కొత్త వసతులు కల్పిం చటమే ఈ పథకం ఉద్దేశం. సాధారణ మరమ్మతులు కాకుండా, విమానాశ్రయ తరహాలో ఆకృతి ఇస్తూ ఆధునిక రూపు కల్పించాలన్నది ప్రధాని మోదీ ఆదేశం. విశాలమైన పార్కింగ్ ప్రాంతం, హైలెవల్ ప్లాట్‌ఫామ్స్, ఆధునిక వెయిటింగ్ హాల్స్, అవసరమైన చోట్ల ఎస్కలేటర్లు, వేగంగా టికెట్లు జారీ అయ్యేలా కౌంటర్లు, సరికొత్త అనౌన్స్మెంట్ వ్యవస్థ, సోలార్ విద్యుత్ ఏర్పాట్లు, విశాలమైన పార్కింగ్ లాట్స్, విశాలమైన అప్రోచ్ రోడ్లు, భద్రతా స్కానింగ్ సెంటర్లు, ఆకర్షణీయమైన భవనం.. ఇలా అన్ని వసతులతో ఇవి ఆకట్టుకుంటాయి.14 స్టేషన్లకు ఆధునిక హంగులుఅమృత్భారత్లో చోటు దక్కించుకున్న స్టేషన్లలో 14 హైదరాబాద్‌కు చెందినవే కావటం విశేషం. అమృత్‌భారత్‌లో భాగమైనప్పటికీ, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, చర్లపల్లి స్టేషన్లను భారీ ప్రాజెక్టుల కోటాలో ఉంచారు. వీటికి భారీ నిధులు కేటాయించారు. రూ.430 కోట్లతో మినీ ఎయిర్‌పోర్టు తరహాలో రూపుదిద్దుకున్న చర్లపల్లి టెర్మినల్‌ను ఇటీవలే ప్రధాని మోదీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తు తం వేగంగా పనులు జరుపుకొంటున్న సికింద్రాబాద్, ఇటీవలే పనులు మొదలైన నాంపల్లి, త్వరలో పనులు ప్రారంభించుకోనున్న కాచిగూడ స్టేషన్లకు భారీగా నిధులు కేటాయించారు.ఇప్పటికే రూ.700 కోట్లతో సికింద్రాబాద్ స్టేషన్‌కు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో భారీ భవనాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మరో ఏడాదిన్నరలో ఇది పూర్తి కానుంది. ఈ ఏడాది డిసెంబరు నాటికి కొత్త భవనం అందుబాటులోకి రావాల్సి ఉన్నా, సకాలంలో పనులు పూర్తయ్యేలా లేవు. దీంతో వచ్చే ఏడాది జూలై నాటికి సిద్ధమవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీని పనులు కొలిక్కి వస్తున్న తరుణంలో, నగరంలో మరో ముఖ్య స్టేషన్ అయిన నాంపల్లి (హైదరాబాద్) స్టేషన్ భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. పాత క్వార్టర్ భవనాలు, చుట్టూ గోడలు కూల్చి వేశారు. ప్రధాన నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. ఈ స్టేషన్ భవనానికి రూ.327.27 కోట్లు కేటాయించారు.కొత్త రూపు సంతరించుకోనున్న స్టేషన్లు ఇవే.. చర్లపల్లితోపాటు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి, హఫీజ్‌పేట, హైటెక్‌సిటీ, ఉప్పుగూడ, మలక్‌పేట, మల్కాజిగిరి, బేగంపేట, మేడ్చల్, యాకుత్‌పురా, ఉందానగర్, ఆదిలాబాద్, భద్రాచలం రోడ్, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, కాజీపేట జంక్షన్, ఖమ్మం, మధిర, మహబూబ్‌నగర్, నిజామాబాద్, రామగుండం, తాండూరు, జహీరాబాద్, యాదాద్రి, బాసర, గద్వాల, జడ్చర్ల, మంచిర్యాల, మెదక్, మిర్యాలగూడ, నల్లగొండ, పెద్దపల్లి, షాద్‌నగర్, వికారాబాద్, వరంగల్, జోగుళాంబ. -
నాగార్జున పరువునష్టం కేసు.. మంత్రి కొండా సురేఖ గైర్హాజరు!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబంపై మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర మనోవేదనకు గురి చేశాయని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు మంత్రికి నోటీసులు జారీ చేసింది. ఈనెల 12న వ్యక్తిగతంగా హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.అయితే ఇవాళ విచారణకు మంత్రి కొండా సురేఖ హాజరు కాలేదు. పలు కార్యక్రమాల కారణంగా విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు ఆమె తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో మరింత గడువు కావాలని న్యాయమూర్తిని కోరారు. దీంతో న్యాయస్థానం ఈ నెల 19కి విచారణను వాయిదా వేసింది. అసలేంటి వివాదం..గతంలో మంత్రి కొండా సురేఖ నాగార్జున ఫ్యామిలీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మాజీ మంత్రి కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో నాగార్జున ఫ్యామిలీపై కామెంట్స్ చేసింది. దీంతో తమ పరువుకు భంగం కలిగేలా మంత్రి మాట్లాడారని నాగార్జున కోర్టును ఆశ్రయించారు. ఆయన పరువు నష్టం కేసు దాఖలు చేయగా.. న్యాయస్థానం విచారణకు అనుమతించింది. -
Nampally: పెట్రోల్ బంక్‌లో అగ్నిప్రమాదం
-
నాంపల్లిలో కారు బీభత్సం..
సాక్షి, హైదరాబాద్: నాంపల్లిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అధిక వేగంలో ఉన్న కారు అదుపు తప్పి.. జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. అనంతరం, మద్యం తాగి కారు నడిపిన వ్యక్తిని స్థానికులు చితకబాదారు.వివరాల ప్రకారం..నాంపల్లిలోని రెడ్‌హిల్స్ నీలోఫర్ కేఫ్ వద్ద గురువారం తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. ఓ వ్యక్తి మద్యం తాగి కారు నడపడంలో అదుపు తప్పి జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. అనంతరం, మద్యం మత్తులో కారు నడిపిన వ్యక్తిని స్థానికులు చితకబాదారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
HYD: ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్‌తో కేటీఆర్ సందడి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఇరానీ చాయ్‌కి ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. అయితే ఇరానీ చాయ్‌ను తాజాగా నాంపల్లిలోనిఓ కేఫ్‌లో రుచిచూశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఉస్మానియా బిస్కెట్‌తో ఇరాన్ చాయ్‌ని ఎంజాయ్ చేశారు. జనంతో ముచ్చట్లు పెడుతూ అభిమానులతో సెల్ఫీలకు పోజులిచ్చారు. కొండా సురేఖపై దాఖలుచేసిన పరువునష్టం దావాలో కేటీఆర్ బుధవారం నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో తన వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం బీఆర్ఎస్ నేతలతో కలిసి నాంపల్లిలోని ఏక్‌మినార్ మసీదు వద్దనున్న ఓ ఇరానీ కేఫ్‌లో చాయ్ తాగారు. ఉస్మానియా బిస్కెట్‌ను ఆస్వాదించారు. కేఫ్‌కు వచ్చిన వారితో ముచ్చటించారు. వారితో సెల్ఫీలు దిగారు. తర్వాత పక్కనే ఉన్న బట్టల దుకాణ యజమాని ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లి వారితో ముచ్చటించారు.No Hyderabadi will ever miss a chance to have a sip of our favourite Irani chai & Osmania biscuit 😊I did the same @ Nampalli yesterday pic.twitter.com/qGawPhxAOz— KTR (@KTRBRS) October 24, 2024Iske peene se tabiyat mei ravani aaeBRS Leader KTR Enjoys Irani Chai aT Nampally Restaurant pic.twitter.com/jVfS6Hq3mH— Shakeel Yasar Ullah (@yasarullah) October 23, 2024 -
కేటీఆర్ 30 నిమిషాల స్టేట్ మెంట్.. కొండా సురేఖకు చురకలు..
-
నాంపల్లి కోర్టులో.. పరువు - ప్రతిష్ఠ
-
కేటీఆర్ పరువునష్టం పిటిషన్.. విచారణ 18వ తేదీకి వాయిదా
హైదరాబాద్, సాక్షి: మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువునష్టం పిటిషన్‌పై ఇవాళ (సోమవారం) నాంపల్లి ప్రత్యేక కోర్టు విచారణ చేట్టింది. ఈ పిటిషన్‌పై విచారణ చేట్టిన కోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఈ నెల 18న పిటిషనర్ కేటీఆర్‌తో పాటు.. నలుగురు సాక్షుల స్టేట్మెంట్ రికార్డు చేస్తామని కోర్టు వెల్లడించింది. మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేటీర్ పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే. 23 రకాల ఆధారాలను కేటీఆర్ తరఫు లాయర్లు కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమా, దాసోజు శ్రవణ్‌లను పటిషన్ సాక్షులుగా చేర్చారు. మంత్రి కొండా సురేఖ తన పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. -
కేటీఆర్ పరువు నష్టం దావాపై విచారణ ప్రారంభం
-
కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా
సాక్షి,హైదరాబాద్: నాంపల్లి కోర్టులో మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై ఇవాళ (గురువారం) నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కేటీఆర్ తరఫు న్యాయవాది వినతించారు.బాల్క సుమన్, తుల ఉమ, సత్యవతి రాథోడ్, దాసోజు శ్రవణ్‌ను సాక్షులుగా కేటీఆర్ చేర్చారు. కొండా సురేఖ మాట్లాడిన ఆడియో, వీడియో టేపులను కేటీఆర్ న్యాయవాదులు కోర్టుకు సమర్పించారు. 23 రకాల ఆధారాలను అందజేశారు. తదుపరి విచారణ ఈ నెల 14కు కోర్టు వాయిదా వేసింది. కాగా, ఇప్పటికే మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని హీరో అక్కినేని నాగార్జున పిటిషన్ దాఖలు చేయగా, ఆమెకు కోర్టు నోటీసులు జారీ చేసింది. కొద్దిరోజుల క్రితం అక్కినేని నాగార్జున కుటుంబం మీద ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి.ఈ క్రమంలో మంత్రి తమ కుటుంబంపై అమర్యాద పూర్వక వ్యాఖ్యలు చేశారని నాగార్జున కోర్టును ఆశ్రయించి పరువు నష్టం దావా వేశారు. రాజకీయ లబ్ధి కోసమే మంత్రి కొండా సురేఖ తమ కుటుంబంపై తప్పుడు వ్యాఖ్యలు చేశారని సినీ నటుడు నాగార్జున నాంపల్లి కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే, తాజాగా స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 23న జరగనుంది. -
కొండా సురేఖ వివాదం.. నాగార్జున పిటీషన్‌పై విచారణ వాయిదా
టాలీవుడ్ ప్రముఖ నటుడు నాగార్జున కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయని నాంపల్లి న్యాయస్థానంలో పరువు నష్టం దావా కేసును నాగార్జున వేశారు. అయితే, నేడు జరగాల్సిన విచారణ వాయిదా పడింది. న్యాయమూర్తి సెలవులో ఉండటంతో సోమవారం విచారణ జరుగుతుందని కోర్టు తెలిపింది.ఇదీ చదవండి: మమ్మల్ని బలిపశువులను చేసింది: అఖిల్తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో కొండ సురేఖ ఈ వ్యాఖ్యలే చేశారు. అక్కినేని నాగార్జున కుటుంబం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలను లేవనెత్తుతూ.. సినీనటి సమంత విడాకులు, రకుల్ ప్రీత్‌సింగ్ పెళ్లి వంటి అంశాలపై ఆమె వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో పెద్ద దుమారమే రేగింది. అధారాలు లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చూస్లూ ఊరుకోమంటూ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు రియాక్ట్ అయ్యారు. -
27 ఏళ్లు శ్రమించి.. 195 దేశాలు చుట్టేసి..
ప్రపంచంలోని అన్ని దేశాలను సందర్శించడమే అతడి లక్ష్యం.. ఆ దిశగా ఎంతో కష్టపడ్డారు. సుమారు 27 ఏళ్లు ఎంతో శ్రమకోర్చి అన్ని దేశాలను సందర్శించి అరుదైన ఘనత సాధించారు. ప్రస్తుతం 195 దేశాల సందర్శన పూర్తి చేసుకుని తెలుగుగడ్డపై బుధవారం అడుగుపెట్టారు. ఈ అరుదైన ఘనత సాధించిన వ్యక్తి మన తెలుగువాడు కావడం విశేషం.ప్రపంచాన్నే చుట్టేసిన 43 ఏళ్ల వయస్సు కలిగిన రవిప్రభు స్వస్థలం విశాఖపట్నం. ఆయన హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో చదువుకున్నాడు. పొలిటికల్ సైన్స్‌లో పట్టభద్రుడైన రవిప్రభు విద్యార్థి దశలోనే 1996లో అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. వివాహం చేసుకొని ఉద్యోగం చేసుకుంటూనే విదేశాలను సందర్శించడం ప్రారంభించారు. భూటాన్ దేశాన్ని సందర్శించడంతో ప్రారంభమైన ఆయన యాత్ర వెనుజులతో ముగిసింది. ప్రపంచంలోని దేశాలను సందర్శిస్తూనే 2020లో ఒక యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించారు. మొత్తం సందర్శన విశేషాలను యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తూ వచ్చారు.అన్ని దేశాలను చుట్టేసి వచ్చిన ఆయన రెడ్‌హిల్స్‌లోని ఫెడరేషన్ హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 600 మందికి పైగా అంతరిక్షంలోకి వెళ్లారు. 6,600 మంది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ప్రపంచంలోని 850 కోట్ల మందిలో 280 మంది మాత్రమే ప్రతి దేశాన్ని సందర్శించారని అన్నారు. ఈ అరుదైన ఘనత సాధించిన 280 మందిలో తనకు స్థానం లభించడం సంతోషంగా ఉందని తెలిపారు. 27 ఏళ్లు కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నట్లు ఆయన వివరించారు. ఈ ప్రయాణాల కోసం రూ.25 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినట్లు చెప్పారు. -
'హైదరాబాద్ కోహినూర్': ఆమెలా మరెవ్వరూ చనిపోకూడదని..!
కోహినూర్ వజ్రాన్ని మన దేశం నుంచి బ్రిటిష్ వాళ్లు పట్టుకుపోయారని కథకథలుగా విన్నాం. కానీ మన హైదరాబాద్ కోహినూర్‌గా పిలిచుకునే మన నిజాం మహారాణి గురించి వినిలేదు కదా..!. ఆ రోజుల్లోనే ష్యాషన్‌కి ఐకాన్‌గా ఉండేది. ఆమె అందానికి తగ్గట్టు గొప్ప గొప్పదాతృత్వ సేవలకు కూడా పేరుగాంచింది. మన హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి నిర్మించడానికి కారణమే ఆమె. ఎవరీమె..? ఎలా మన హైదబాద్ నిజాం కుటుంబానికి కోడలయ్యింది తదితరాలు గురించి చూద్దాం.!మార్చి 3, 1924న టర్కీ పార్లమెంట్ ఖలిఫాను రద్దు చేసింది. ఖలీఫా అంటే వారసత్వం. దీని కారణంగా 101వ ఖలీఫా అబ్దుల్మెసిడి II కుటుంబం సామ్రాజ్యం నుంచి బహిష్కిరించబడింది. దీంతో వారిలో చాలామంది ఫ్రెంచ్ నగరాల్లో స్థిరపడ్డారు. వారిలో ఒట్టోమన్ సామ్రాజ్యానికి చెందిన నీలూఫర్ హన్‌సుల్తాన్ కూడా ఒకరు. ఆమె తండ్రి మరణంతో తల్లి అడిలే సుల్తాన్‌తో కలిసి ఫ్రాన్స్‌లో ఉండేవారు. అయితే హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ చిన్నకుమారుడు మోజమ్ తన అన్నయ్యతో కలిసి ఫ్రాన్స్‌కి వచ్చాడు. మోజమ్ అన్నయ ఆజం జా నీలూఫర్ బంధువైన డుర్రూషెహ్వార్ సుల్తాన్‌ను వివాహం చేసుకోవాల్సి ఉంది. ఇక అతడి తమ్ముడు మోజామ్ ఒట్టోమన్ యువరాణి మహ్పేకర్ హన్‌సుల్తాన్‌తో పెళ్లి నిశ్చయం అయ్యింది. అయితే మోజామ్ నిలూఫర్‌ని చూసి ఆమె అందానికి మంత్రముగ్దుడై వెంటనే తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుని మరీ నీలోఫర్‌ను పెళ్లిచేసుకున్నాడు. ఆమెను వివాహం అనంతరం నీలూఫర్ ఖానుమ్ సుల్తాన్ బేగం సాహిబా అని పిలిచేవారు. అలా నీలోఫర్ నిజాంకి చెందిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కోడలు అయ్యింది. ఆమె నిజాం కోటలో ఆధునికత యుగానికి నాంది పలికింది. నిజాంను పాపా అని సంభోదించగలిగేది కూడా నీలూఫర్‌నే. అతడి కుమార్తెలు సైతం అతడిని సర్కార్ అని పిలిచేవారు. ఇక నీలోఫర్ తన బంధువు డుర్రోషెహ్వార్‌తో కలిసి మహిళల విముక్తి కోసం పనిచేసింది. మహిళలను ముసుగులు తొలిగించి స్వతంత్రంగా బతికేలా ప్రోత్సహించేవారు. ఇక నీలూఫర్ అందచందాలకు భర్త దాసోహం అన్నట్లుగా ఉండేవాడు. అందులోనూ ఆమె ఫ్యాషన్ శైలి ఎవ్వరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. ఆమె ధరించే చీరలు, ఆభరణలు నిజాం పాలనలో మంచి ట్రెండ్ సెట్ చేసేవి. అప్పట్లోనే ఆమె చీరలను ముంబైకి చెందిన డిజైనర్ మాధవదాస్ డిజైన్ చేసేవారు. ఆమె ఒట్టోమన్ మూలాలు నిజామీ సంస్కృతితో అందంగా కలిసిపోయాయి. అంతేగాదు ఆమె చీరలు ఎంతో ప్రజాధరణ పొందేవి. అవి ఇప్పటికీ న్యూయార్క్‌లోని ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాజీలో ప్రదర్శనగా ఉన్నాయి. అంతేగాదు ఆమె ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళల్లో ఒకరిగా పేరుగాంచింది. పైగా ఆమెను ముద్దుగా 'హైదరాబాద్ కోహినూర్' అని పిలుచుకునేవారు కూడా. ఇక ఆమె బంధువు డుర్రూషెహ్వార్ ఒక కొడుకుకి జన్మనివ్వగా, నీలూఫర్ గర్భం దాల్చలేకపోయింది. అందుకోసం యూరప్‌లోని నిపుణులెందరినో కలిసింది. ఆ టైంలో వైద్య సదుపాయాలు బాగా కొరతగా ఉండేవి. దీని కారణంగానే ఆమె పనిమనిషి ప్రసవ సమయంలో మరణించింది. ఇది ఆమెను బాగా కుంగదీయడమే గాక మహిళల కోసం ఆస్పత్రిని నిర్మించేందుకు దారితీసింది. తన పనిమినిషిలా ఎంతమంది రఫాత్‌లు మరణిస్తారంటూ ప్రసూతి ఆస్పత్రిని నిర్మించింది. అదే నేడు నాంపల్లిలో ఉన్న నీలోఫర్ ఆస్పత్రి. ఈ ఆస్పత్రి చరిత్ర గురించి నిజాం కుటుంబ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నజాఫ్ అలీఖాన్ చెబుతుంటారు.కాగా, నీలూఫర్ గర్భందాల్చకపోవడంతో ఆమె భర్త రెండోవ వివాహం చేసుకున్నాడు. దీంతో ఆమె తన తల్లితో జీవించడానికి తిరిగి ఫ్రాన్స్ వెళ్లిపోయింది. ఆ తర్వాత నాలుగేళ్లకు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నుంచి ఆమె సామాజికి సేవలో ఎక్కువ సమయం గడుపుతుండేది. అలా 1963లో పారిస్‌లోని దౌత్యవేత్త, వ్యాపారవేత్త ఎడ్వర్డ్ జూలియాస్ పోప్‌ను వివాహం చేసుకుంది. ఇక శేషజీవితాన్ని పారిస్‌లోనే గడుపుతూ.. 1989లో మరణించింది. (చదవండి: దేశీ గర్ల్ టు గ్లోబల్ ఐకాన్: మహిళా సాధికారతకు అసలైన నిర్వచనం ఆమె!) -
ఇద్దరు అరెస్ట్.. మరో ఇద్దరు పరారీ
-
హైదరాబాద్ నాంపల్లి పోలీసుల కాల్పుల కలకలం
-
హైదరాబాద్‌లో మరోసారి కాల్పుల కలకలం
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లో పోలీసుల కాల్పుల ఘటనలు మరువకముందే నగరంలో మరో చోట పోలీసు కాల్పుల కలకలం రేగింది. నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో పోలీసులపై ఒక వ్యక్తి గొడ్డలితో దాడికి యత్నించాడు. మరో వ్యక్తి రాళ్లతో దాడి చేశాడు.దీంతో తప్పించుకునే యత్నంలో పోలీస్ డెకాయ్ టీమ్ కాల్పులు జరిపింది. పోలీసుల కాల్పుల్లో ఇద్దరికి గాయాలు కాగా, మరో ఇద్దరు దుండగులు పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కాగా, గత నెలలో సికింద్రాబాద్‌లోని సిటీలైట్ హోటల్ వద్ద యాంటీ స్నాచింగ్ టీమ్ పోలీసులు.. పారిపోతున్న స్నాచర్ల బైక్ టైర్‌ను కాల్చాలని ప్రయత్నించగా.. ఆ తూటా బైక్ వెనుక కూర్చున్న నేరగాడి కాలులోకి దూసుకుపోయింది. తప్పించుకున్న ఇద్దరు స్నాచర్లను పోలీసులు పట్టుకున్నారు.మరో ఘటనలో గత కొన్ని రోజులుగా వరుసగా దొంగతనాలు చేస్తూ చెలరేగిపోతున్న చైన్స్నాచర్లపై సైదాబాద్ పోలీసులు కాల్పులు జరిపారు. సైదాబాద్‌లో అమీర్ గ్యాంగ్ చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు వారిని పట్టుకునేందుకు వెంబడించగా.. గ్యాంగ్ పోలీసులపై ఎదురుదాడికి దిగారు. దీంతో పోలీసులు తమ వద్ద ఉన్న తుపాకులతో ఫైరింగ్ చేశారు. రెండు రౌండ్లు కాల్పులు జరపగా భయపడిన అమీర్ పోలీసులకు లొంగిపోయాడు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు చుక్కెదురు
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న ఏసీపీ ప్రణీత్ రావు, అడిషనల్ ఎస్పీ భుజంగ రావు, తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లు కొట్టేసింది నాంపల్లి కోర్టు. పోలీసుల వాదనలతో న్యాయ స్థానం ఏకీభవించింది.ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న ఏసీపీ ప్రణీత్ రావు, అడిషనల్ ఎస్పీ భుజంగ రావు, తిరుపతన్నలు బెయిల్ కావాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సమయంలో కేసులో పోలీసులు ఎటువంటి ఛార్జీషీట్ దాఖలు చేయలేదని తమ వాదనల్ని వినిపించారు.అయితే పిటిషన్లు దాఖలు చేసినట్లు చెప్పారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి ఛార్జ్‌షీట్‌లో మూడు కీలకమైన డాక్యుమెంట్లను జత చేసినట్లు తెలిపారు. ఈ కేసులో మరో కీలక నిందితుడైన ప్రభాకర్ రావు విదేశాల్లో ఉన్నారని, ఆయన్ని అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. ఫోన్ ట్యాంపింగ్‌పై మరికొంతమందిని విచారించాల్సి ఉందని, ఈ తరుణంలో వీరికి బెయిల్ ఇస్తే సాక్ష్యాల్ని రూపుమాపడమే కాకుండా..సాక్ష్యుల్ని బెదిరించే అవకాశం ఉందని వాదించారు. పోలీస్ శాఖలో కీలక పదవుల్లో ఉన్నారని, కేసులో మిగిలిన నిందితులు అరెస్ట్ చేసే వరకు బెయిల్ ఇవ్వకూడదని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. పోలీసుల వాదనల్ని ఏకీభవించిన కోర్టు నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది నాంపల్లి కోర్టు. -
Fish Prasadam 2024 : చేప ప్రసాదం కోసం పోటెత్తిన జనాలు (ఫొటోలు)
-
నాంపల్లి : చేప ప్రసాదం పంపిణీ.. భారీగా తరలి వచ్చిన జనం (ఫొటోలు)
-
Phone Tapping: రాధాకిషన్ రావు రిమాండ్ పొడిగింపు
-
నుమాయిష్ 2024 ప్రారంభం.. మాస్క్ కంపల్సరీ!
హైదరాబాద్, సాక్షి: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నుమాయిష్ సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం, శ్రీధర్‌బాబు(నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు కూడా) పాల్గొన్నారు. ఈసారి కూడా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు నుమాయిష్ 2024 జరగనుంది. నుమాయిష్ కోసం ఈసారి 2,400 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇక తెలంగాణలో కరోనా కేసులు కలవర పెడుతున్నాయి. నుమాయిష్‌కు పెద్ద ఎత్తున సందర్శకులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో.. మాస్కులు కచ్చితంగా ధరించి రావాలంటూ సందర్శకులను కోరుతున్నారు నిర్వాహకులు. ఈసారి నుమాయిష్ నేపథ్యంలో నగరంలో 45 రోజుల పాటు ఆ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. మరోవైపు సర్వీసులను ఎక్కువ సమయం నడిపేందుకు హైదరాబాద్ మెట్రో సిద్ధమైంది. ఇక మహాలక్ష్మి పథకం ఉచిత ప్రయాణాల నేపథ్యంలోనూ నాంపల్లి రూట్లో బస్సులకు ప్రయాణికుల తాకిడి పెరిగే అవకాశం కనిపిస్తోంది. నుమాయిష్‌కు టికెట్ ధరలు గతంలో మాదిరే ఉండనున్నాయి. గతేడాది 10 రూపాయలు పెంచి నుమాయిష్ టికెట్ ధర రూ.40గా నిర్ణయించారు. ఇప్పుడు కూడా టికెట్ ధర రూ.40 లుగా కొనసాగించనున్నారు. నుమాయిష్ సాధారణ రోజులలో సాయంత్రం 4 నుంచి రాత్రి 10.30 వరకు కొనసాగుతోంది. వీకెండ్స్,సెలవు దినాల్లో మాత్రం సాయంత్రం 4 నుండి రాత్రి 11 గంటల వరకు నుమాయిష్ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. ఈ సంవత్సరం నుమాయిష్ సందర్శన వేళలను నిర్వాహకులు పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నుమాయిష్ ను సందర్శించేందుకు మహిళలు, పిల్లలకు ప్రత్యేకంగా ఒక్కో రోజు కేటాయించనున్నారు. జనవరి 9న 'లేడీస్ డే' పేరుతో మహిళలను, 31న 'చిల్డ్రన్ స్పెషల్' పేరుతో పిల్లలను నుమాయిష్ ను సందర్శించేందుకు అవకాశం కల్పిస్తామని నిర్వహకులు తెలిపారు. నుమాయిష్ నిర్వహణ ద్వారా ప్రతీ ఏడాది సుమారు రెండు వేల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించడంతోపాటు సుమారు 30 వేల మంది విద్యార్థులకు విద్యావకాశం కల్పిస్తోంది నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ. -
జనవరి 1 నుంచి నుమాయిష్
హైదరాబాద్: అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయి)కు సమయం ఆసన్నమైంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జనవరి 1న 83వ నుమాయిష్ ప్రారంభానికి ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల ఉత్పత్తులతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలు ఉత్పత్తులు, ప్రభుత్వాల స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 15వ తేదీ వరకు 46 రోజుల పాటు కొనసాగనుంది. ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ సుమారు 2,400 స్టాళ్లు కొలువుదీరనున్నాయి. ఒకేచోట అన్ని వస్తువులు.. ఎగ్జిబిషన్లో అన్ని రకాల వస్తువులు ఒకేచోట లభ్యమవుతాయి. నగరంలో దొరకని పలు రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. దుస్తులు, బెడ్ïÙట్లు, కిచెన్వేర్ , మహిళల కోసం పలు విధాల వంట సామగ్రి, వివిధ రకాల దుప్పట్లు, బెడ్షీట్లు, కశీ్మరీ డ్రై ఫ్రూట్స్‌తో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు, వివిధ రకాల కొత్త తరహా ఫరి్నచర్స్, పలు విధాల ఉపయోగపడే పలు రకాల సామగ్రి అందుబాటులో ఉంటాయి. టికెట్ ధర రూ.40.. ఎగ్జిబిషన్‌ను సుమారు 22 లక్షల మంది సందర్శింనున్నట్లు అంచనా. ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ఎగ్జిబిషన్ సొసైటీ సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేస్తోంది. ఎగ్జిబిషన్‌కు వచ్చే గోషామహల్, అజంతా గేట్, గాంధీభవన్, గేట్ల వద్ద మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేసి సందర్శకులను లోపలికి అనుమతిస్తారు. టికెట్ ధర రూ.40. వినోదాత్మకమైన పలు విభాగాలు అందుబాటులో ఉంటాయి. సందర్శకులకు కనువిందు చేస్తాం.. ఎగ్జిబిషన్‌కు వచ్చే సందర్శకులకు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాం. క్రీడా పోటీలు, వినోదాత్మక కార్యక్రమాలు చేపడతాం. సందర్శకుల కోసం ఆహ్లాదకర వాతావరణంలో ఏర్పాట్లు చేస్తాం. – ఏనుగుల రాజేందర్ కుమార్, ఎగ్జిబిషన్ సొసైటీ కోశాధికారి తెలంగాణ విద్యావ్యాప్తికి కృషి ఎగ్జిబిషన్ నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యారంగ వ్యాప్తికి కృషి చేస్తున్నాం. ముఖ్యంగా మహిళా కళాశాలలు, పాలిటెక్నిక్, ఫార్మసీ, ఇంజినీరింగ్, డిగ్రీ, ఐటీఐ కళాశాలలను స్థాపించి విద్యా వ్యాప్తికి నిరంతరం పాటుపడుతున్నాం. – బి.హన్మంతరావు, ఎగ్జిబిషన్ కార్యదర్శి 33 సబ్ కమిటీల ద్వారా ఏర్పాట్లు.. 33 సబ్ కమిటీల ద్వారా ఎగ్జిబిషన్‌ను విజయవంతంగా కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఎగ్జిబిషన్ లోపల, బయట సందర్శకులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎగ్జిబిషన్ సబ్ కమిటీల ప్రతినిధులు తగిన చర్యలు తీసుకుంటారు. – వనం సత్యేందర్, ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు -
మాజీ మంత్రుల కార్యాలయాల్లో ద్రస్తాల చోరీ!
సాక్షి, హైదరాబాద్, నాంపల్లి (హైదరాబాద్): మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్‌పై నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. మాసబ్‌ట్యాంక్‌లోని పశు సంవర్థకశాఖ కార్యాలయంలోనికి అక్రమంగా ప్రవేశించిన కల్యాణ్ బీరువాలో ఉన్న ద్రస్తాలను కారులో తరలించుకునిపోయారు. వాచ్‌మన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు చేశారు. నాంపల్లి ఇన్స్పెక్టర్ అభిలాష్ తెలిపిన వివరాల ప్రకారం... మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ శుక్రవారం మాసబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలోనికి అక్రమంగా ప్రవేశించారు. అక్కడి సిబ్బంది సహాయంతో బీరువాలో ఉన్న ఫైళ్లను చింపేశారు. అంతటితో ఆగకుండా చించివేసిన ఫైళ్లను తన కారులో తరలించుకుని పోయారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సైతం పనిచేయకుండా చేశారు. దీంతో వాచ్మెన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కళ్యాణ్‌పై కేసు నమోదు చేసినట్లు వివరించారు. అతడికి సహకరించిన కంప్యూటర్ ఆపరేటర్స్ ఎలిజ మోహన్, అటెండర్లు వెంకటేశ్, ప్రశాంత్‌లపైనా కేసులు నమోదు చేశామని చెప్పారు. ఎస్సీఈఆర్టీ కార్యాలయంలోనూ... హైదరాబాద్ ఎల్బీ స్టేడియం ఎదురుగా ఉన్న రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) కార్యాలయం నుంచి గుర్తు తెలియని వ్యక్తులు అధికారిక ద్రస్తాలు ఎత్తుకెళ్లినట్టు ప్రచా రం జరుగుతోంది. ఇక్కడే మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి కార్యాలయం ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. మాజీ మంత్రి కార్యాలయం నుంచి ఒక ఆటోలో కొంతమంది ఫైళ్లు తీసుకెళ్తున్నట్టు తమకు సమాచారం వచ్చిందని అబిడ్స్ పోలీసులు తెలిపారు. కార్యాలయం వాచ్మెన్ వెల్లడించిన ప్రకారం కొన్ని బస్తాల్లో కాగితాలు, ఫైళ్లు తీసుకెళ్ళినట్టు పోలీసులు చెబుతున్నారు. అందులో ఏమున్నాయనేది విచారణ జరిపితే తెలుస్తుందని, అన్ని కోణాల్లో వివరాలు సేకరిస్తున్నామని అన్నారు. వాస్తవానికి రెండో శనివారం కావడంతో ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉంటుంది. గేట్ కూడా మూసివేస్తారు. కానీ ఆగంతకులు లోనికెలా వచ్చారు? తాళం ఎలా తీశారు అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ ఘటన సెలవు రోజున... అదీ రాత్రి సమయంలో జరగడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఫైళ్లు తీసుకెళ్లిన వ్యక్తి ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా అనుమానిస్తున్నారు. కార్యాలయంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. తీసుకెళ్లారని భావిస్తున్న ద్రస్తాలు ఏ శాఖకు సంబంధించినవి? వాటి ప్రాధాన్యం ఏమిటనేది తేలాల్సి ఉంది. ఎస్సీఈఆర్టీ కార్యాలయం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదీనంలో ఉంటుంది. దీనిపై పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేనను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. -
ఉత్తర ద్వారం తెరిచిన ‘బీజేపీ’.. మార్పు కలిసొచ్చేనా?
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ఫలితాల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల కార్యాలయాల్లో ఆసక్తికరమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గురువారం రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరగగా, అదే రోజు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో తూర్పు వైపు ఉన్న ప్రధాన ద్వారాన్ని మూసేసి గతంలో ఉపయోగించిన ఉత్తరం వైపు తలుపును తెరిచారు. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఇదే మార్గంలో రాకపోకలు సాగిస్తే పార్టీకి అనుకూలంగా మంచి ఫలితాలు రావొచ్చునని నాయకులు అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగానే వాస్తు మార్పు చేసి, ఉత్తరం వైపు ద్వారాన్ని ఉపయోగించాలని నిర్ణయించినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం పార్టీ కార్యాలయాన్ని నిర్మించాక తూర్పువైపు ప్రధాన ద్వారాన్నే చాలా కాలం ఉపయోగించారు. గతంలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక కొన్ని వాస్తుపరమైన మార్పులు చేశారు. ఇందులో భాగంగా తూర్పువైపు ద్వారం మూసేసి, ఉత్తరం వైపు తలుపులు తెరిచి రాకపోకలకు ఉపయోగించారు. మళ్లీ ఇప్పుడు ఎన్నికల పోలింగ్, ఫలితాలు వెలువడే సందర్భంగా వాస్తుపరంగా ఉత్తర ద్వారాన్ని ఉపయోగిస్తుండడం గమనార్హం. పార్టీ పోటీచేస్తున్న నియోజకవర్గాల్లో గురువారం పోలింగ్ సరళిని బట్టి చూస్తే సానుకూల పరిణామాలే కనిపించాయని, గతం కంటే ఎక్కువ ఓటింగ్శాతమే నమోదు అవుతుందనే ధీమా పార్టీ వర్గాల్లో వ్యక్తమౌతోంది. మరి నిజంగానే ప్రధాన ద్వారం మార్పు అనేది పార్టీ అధిక సీట్లను గెలిపిస్తుందా అనేది తేలాలంటే ఫలితాలు వెలువడే దాకా వేచి చూడాల్సిందే మరి. -
బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ కలిసే పనిచేస్తాయి: రాహుల్ గాంధీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు చివరి రోజు ప్రచారంలో కాంగ్రెస్ నేతలు స్పీడ్ పెంచారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. నాంపల్లిలో కాంగ్రెస్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు. నాంపల్లి సభలో రాహుల్ మాట్లాడుతూ.. ‘ప్రేమను పంచాలనే లక్ష్యంతో భారత్ జోడో యాత్ర చేశాను. బీజేపీ విభజన రాజకీయాలు చేసింది. మన దేశ సంస్కృతి ఇది కాదు. నాపై దేశవ్యాప్తంగా కేసులు పెట్టారు. నాపై పరువు నష్టం కేసు కూడా వేశారు. నా లోక్‌సభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు. నాపై 24 కేసులు ఉన్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఒవైసీపై ఎన్ని కేసులు ఉన్నాయి. కాంగ్రెస్ నేతలపై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు ఉంటాయి. ఒవైసీపై ఎందుకు ఉండవు. కాంగ్రెస్, బీజేపీ పోటీచేసే రాష్ట్రాల్లో.. మా ఓట్లు చీల్చేందుకు ఎంఐఎం వస్తుంది. బీజేపీ ఇచ్చిన లిస్ట్‌తో తమ అభ్యర్థులను ఎంఐఎం ప్రకటిస్తుంది. బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ మూడు పార్టీలు కలిసి పనిచేస్తాయి. నేను మోదీతో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. కేంద్రంలో మోదీని ఓడించాలంటే.. తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించాలి. హైదరాబాద్‌లో మెట్రో, ఎయిర్‌పోర్టు నిర్మించింది కాంగ్రెస్ హయాంలోనే. బైబై కేసీఆర్ అని చెప్పే సమయం వచ్చింది’ అని కామెంట్స్ చేశారు.