![Hyderabad judge, two lawyers held for taking Rs 7.5 lakh bribe - Sakshi](/styles/webp/s3/article_images/2018/04/20/court.jpg.webp?itok=lSrOSD7V)
సాక్షి, హైదరాబాద్: బెయిల్ డీల్స్ వ్యవహారంలో న్యాయాధికారి రాధాకృష్ణమూర్తికి మధ్యవర్తులుగా వ్యవహరించిన న్యాయవాదులు శ్రీనివాసరావు, సతీశ్‌కుమార్‌లను ఐదు రోజులపాటు పోలీసు కస్టడీకి ఇస్తూ నాంపల్లి కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 23 వరకు వారు పోలీసు కస్టడీలో ఉంటారు. పూర్తి వివరాలను రాబట్టేందుకు వారిద్దరిని తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ డీల్స్ వ్యవహారంలో రాధాకృష్ణమూర్తిని ఏసీబీ అధికారులు ఇటీవల హైకోర్టు అనుమతితో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment